Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
డాన్ శీను {completed}
Good update
[+] 1 user Likes Paty@123's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Chala baga rastunaru andi.. excellent nerration
[+] 1 user Likes Nani666's post
Like Reply
సినిమా చూస్తున్నట్టు ఉంది. శీను మహేష్ బాబు లా రన్నింగ్ చేస్తున్నాడా? మీరు చెప్తుంటే నాకు మహేష్ బాబు రన్నింగ్ చేస్తున్నట్టే అనిపించింది.
[+] 3 users Like Kushulu2018's post
Like Reply
Super update
[+] 1 user Likes Rupaspaul's post
Like Reply
Wonderful update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Annoo update eppudey jara pettaradhuu
[+] 3 users Like Bullet bullet's post
Like Reply
Nice Update  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
హాస్పిటల్లో గంటన్నరసేపు వేచిచూసిన తరవాత డాక్టర్ వచ్చి మరేం పరవాలేదు ఇప్పటికైతే ఓకే కాని రోజులు దెగ్గర పడ్డాయని కనికకి ఎక్కువ సమయం లేదని చెప్పాడు.

శీనుకి డాక్టర్స్ తో మాట్లాడే అవకాశం రాలేదు, అంతా తన కుటుంబ సభ్యులే చూసుకున్నారు వాళ్ళ హడావిడీ.. కనిక ముందు వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూసి జగ్గు నవ్వగానే శీనుకి కూడా నవ్వొచ్చి నవ్వాడు.. స్ట్రెచర్ మీద పడుకుని శీనునే చూస్తున్నందువల్ల తనకి నవ్వొచ్చి నవ్వింది, అక్కడ పక్కనే ఉన్న దీపాలి కూడా నవ్వింది.

అందరూ సాయంత్రం లోగా పెళ్లి అయిపోవాలని పట్టు పట్టారు, ఇంటికి వచ్చాక కనికని రెస్ట్ తీసుకొమ్మని చెప్పి అంతా స్వయంగా పెళ్లి పనులు చేస్తుంటే ఒక పక్క ఆనంద పడుతూనే ఇంకో పక్క డబ్బు మీద ఉన్నంత ప్రేమ తన మీద కూడా కొంచెం ఉండుంటే ఎంత బాగుండు అనుకుంది. దీపాలి అమ్మ కూడా దీపాలిని అందరి పిల్లల కంటే ఎక్కువగా బాగా చూసుకొమ్మని పదే పదే చెప్పింది అయినా దీపాలి అవన్నీ పట్టించుకోలేదు, తన అక్కతో ప్రేమగా గడిపింది తన అవసరం ఎంత వరకు ఉందో అంత దెగ్గరగా, కనికని ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకుంది.

మధ్యానానికి రింగులు తోడిగించి ఎంగేజ్మెంట్ జరిపించి సాయంత్రానికి అందరి సమక్షంలో ప్రెస్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మధ్యన కనికకి శీనుకి పెళ్లి జరిపించారు. ఎంత హడావిడి చేసినా ఎంత గోలగా ఉన్నా కనిక మాత్రం శీనుని గమనిస్తూనే ఉంది. తాళి కట్టే ముందు శీను చెయ్యి వణకడం దిక్కులు చూడటం.. ఒక్కసారి కూడా కనిక కళ్ళలోకి చూడకపోవటం అన్నీ..

పెళ్లి తతంగం అయిపోయాక అందరినీ త్వరగానే పంపించేశారు. కనిక తన రూంలో చాలా సేపు వంటరిగా కూర్చుంది. దీపాలి మాట్లాడదామని వెళ్లినా తనని కూడా పంపించేసింది. రాత్రి ఏమి తినలేదు అస్సలు బైటికే రాలేదు.. అందరూ పడుకున్నాక శీను ఇక ఆగలేక మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు కానీ పైన కనిక లేకపోవడంతో కిందకి వస్తుంటే జగ్గు కనిపించాడు.

జగ్గు : ఏంటి

శీను : ఊరికే గాలి కోసం వచ్చాను

జగ్గు : ఇవ్వాళ గాలి రాలేదా

శీను ఏం మాట్లాడకుండా కిందకి వెళ్లి పడుకున్నాడు.. చల్లగాలి వీస్తుంటే జగ్గు కొంతసేపు పైనే కూర్చుని గేమ్స్ ఆడుకుంటుంటే కొంతసేపటికి కనిక వచ్చింది. జగ్గుని చూసి కొంచెం భయపడింది.

జగ్గు : ఏంటి గాలి కోసం వచ్చావా

కనిక : అవును

జగ్గు : గాలి లేదు అని చెయ్యి ఊపాడు

కనిక : నేను వెళుతున్నా అని వేగంగా పారిపోయింది.

అటు శీను ఇటు కనిక ఈ రాత్రి ఇద్దరు పడుకోలేదు, మేలుకునే ఉన్నారు కానీ ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చినట్టు మొహం పెట్టి కళ్ళు మూసుకున్నారు. జగ్గుకి కూడా నిద్రపట్టలేదు.. అన్న గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడు.

తెల్లారి ఎవరో శీనుని లేపితే మెలుకువ వచ్చింది. చూస్తే కనిక వాళ్ళ బాబాయి.. తనతోపాటు హాల్లోకి వెళ్ళాడు. కనికతో పాటు అందరూ రెడీ అయ్యి ఉన్నారు, నలుగురు లాయర్లతో పాటు తహసీల్దారు ఇంకొంత మంది పెద్ద వాళ్ళ మధ్య ఆస్తి మొత్తం కనికకి అప్పజెపుతూ సంతకాలు చేసి చివరికి కనిక సంతకాలు, సాక్ష్యంగా శీను సంతకం ఇంకొంత మందివి తీసుకుని ఆస్తి కాయితాలు అన్నీ కనికకి అప్పచెప్పి అందరూ విందు భోజనాలు చేసి వెళ్లిపోయారు.. అంతా అయిపోయేవరకు సాయంత్రం అయ్యింది.. వాళ్ళు వెళ్ళిపోయిన గంటకే కనిక కుటుంబీకులు ఏర్పాటు చేసిన లాయరు వచ్చాడు.

కనిక ఒప్పుకుని లాయరుతో అంతా మాట్లాడి అన్ని డాకుమెంట్స్ చదివింది కానీ అందులో కనికకి మాట ఇచ్చినట్టు వంద కోట్లు తనకి వచ్చేలా ఏ అగ్రిమెంట్ లేకపోవడంతో ఆ విషయం ప్రస్తావించింది దానికి తన మావయ్య వాళ్ళు ముందు ఎవరి ఆస్తి వాళ్ళకి వస్తే తల ఇరవై కోట్లు ఇస్తామన్నారు అందుకు కనిక ఒప్పుకోకపోగా కొంత కోప్పడి నమ్మకమైన మాటలు మాట్లాడి చివరికి బలవంతంగా ఒప్పించారు.. కనిక సంతకం పెట్టే ముందు ఒకసారి శీను వంక చూసింది. శీను కనిక వంకే చూస్తున్నాడు కానీ ఏమి మాట్లాడలేదు ఒక్క క్షణం చూసి ఇక శీను తనకి ఏ సాయం చెయ్యడని కళ్ళు మూసుకుని సంతకం పెట్టేసింది ఆ వెంటనే శీను సంతకం కూడా అడిగారు.. శీను ఏం మాటాడకుండా సంతకం పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

కనిక ఏడుస్తూ అక్కడి నుంచి తన రూంకి వెళ్ళిపోయింది.. దీపాలి తన వెనక వెళుతుంటే వాళ్ళ అమ్మ పిలిచింది.

దీపాలి అమ్మ : పిచ్చిదానా.. ఆస్తి మన చేతికి వచ్చేసింది.. ఇక నువ్వు దానికి సేవలు చెయ్యడం ఆపు

దీపాలి ఒకసారి తన అమ్మని నీచంగా చూసి కనిక వెనకాల వెళ్ళిపోయింది. జగ్గు బైటికి వచ్చి కారు దెగ్గర నిలుచున్న తన అన్నయ్య దెగ్గరికి వెళ్లి నిలుచున్నాడు.

జగ్గు : ఇక వెళ్ళిపోదామా

శీను : హ్మ్మ్.. మన పని అయిపోయిందిగా ఇక సర్దు.. వెళ్ళిపోదాం

జగ్గు : వెళుతున్నా అని గట్టిగా అంటూ ఒకసారి తన అన్నయ్య మొహం వంక చూసాడు.

శీను : త్వరగా కానీ వెళ్ళిపోదాం.. అని ఫోన్ తీసాడు ఎవరికో ఫోన్ చెయ్యడానికి.

చీకటి పడింది.. కనిక శీను గురించి అడిగేసరికి దీపాలి వాళ్ళ రూంలోకి వచ్చి చూసేసరికి జగ్గు బ్యాగ్లో సర్దడం చూసి అడిగింది.

జగ్గు : వి ఆర్ గోయింగ్ మేడం.. బ్యాక్ టు అవర్ లైవ్స్.. కరెక్ట్ గానే మాట్లాడానా.. థాంక్స్ నాకు ఇంగ్లీష్ నేర్పించినందుకు

దీపాలి : అదేంటి వెళ్లిపోతున్నారా

జగ్గు : అవును.. మేము వచ్చిన పని కూడా అయిపోయింది కదా

దీపాలి : మరి బావా ?

జగ్గు : నాతోనే అన్నయ్యా.. అన్నయ్యతో పాటే నేనూ

దీపాలి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి కనికకి విషయం చేరవేసింది. కనిక ఊ కొట్టి ఇంకొక వైపుకి తిరిగి పడుకుంది..

దీపాలి : ఏంటక్కా

కనిక : వెళ్ళిపోనివ్వు.. వాళ్ళ జీవితాలని ఎందుకు కదిలించడం.. అనవసరంగా.. అని ఆపేసింది.

దీపాలి : అది కాదు..

కనిక : కొంచెం సేపు పడుకుంటా.. వాళ్ళకి మనవాళ్ళు ఇచ్చేది కాకుండా ఇంకొంత నువ్వు ఇచ్చి పంపించు, నేను నీ అకౌంట్ కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాను.

దీపాలి : సరే అని ఒక నిట్టూర్పు విడిచి లేచి బైటికి వెళ్ళింది.

కనిక ఆలోచిస్తూ పడుకుంది.. ఏడుపు వచ్చేసరికి ఇటు వైపు తిరగగానే మెడలో ఉన్న తాళి ఎగిరి కళ్ళ ముందు పడింది. ఒకసారి దాన్ని గట్టిగా పట్టుకుని రూంలో ఉండబుద్ది కాక లేచి పైకి వెళ్ళింది.. అక్కడ గోడకి ఆనుకుని శీను కూర్చోవడం చూసి ఆగిపోయింది.

సాయంత్రం జగ్గుతో మాట్లాడినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కనిక పైకి వస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చున్న శీనుకి కనిక కనిపించగానే లేచి నిలుచున్నాడు.

కనిక : వెళ్లిపోతున్నావటగా

శీను : హ్మ్మ్..

కనిక ఏమి మాట్లాడలేక అలానే నిలుచుండిపోయింది. శీను కూడా అంతే

కనిక : ఇంకొక పని చేసి పెడతావా

శీను : ఏంటి ?

కనిక చిన్నగా శీను ముందుకు వెళ్లి నాలుగు ఇంచుల దూరంలో నిలుచుని నేరుగా శీను కళ్ళలోకి చూస్తూ : నా అకౌంట్లో కొంత డబ్బుంది అది మొత్తం నీకే ఇస్తాను ఇదిగో నా తాళి ఇది కూడా తీసుకో ఇంకొంత బంగారం కూడా ఉంది.. ఇంకా సరిపోకపోతే ఇదిగో నా శరీరం నన్ను ఏమైనా చేసుకో అని కన్నీళ్లు పెట్టుకుంది.

శీనుకి కనిక నోటి నుంచి ఇంకొక్క మాట వచ్చినా తన కంట్లో నుంచి కన్నీటి చుక్క కారేదే.. కానీ కారనివ్వలేదు..

శీను : చెప్పు ఏం చెయ్యాలి

కనిక వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని, శీను కాళ్లు పట్టుకుని ఏడ్చేసింది.. నన్ను కూడా నీతో తీసుకుపో నాకు నీ ఒళ్ళో పడుకుని చచ్చిపోవాలనుంది.. నేను బ్రతికే ఈ కొన్ని రోజులు నన్ను నీతో ఉంచుకో ఆ తరవాత నన్ను ఎక్కడో అక్కడ పాతి పెట్టేయి.. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్  అని గట్టిగా ఏడ్చేసింది.. శీను వంగి రెండు చేతులతో కనిక భుజం పట్టుకుని లేపి తన కళ్ళలోకి చూస్తూ కనిక కన్నీళ్లు తుడిచాడు..  వెంటనే గట్టిగా కనికని కౌగిలించుకున్నాడు.. కనిక వీపు మీద శీను కన్నీళ్లు పడ్డాయో ఏమో కనిక ఇంకా గట్టిగా శీనుని చుట్టేసింది.

శీను : నేను వెళ్ళాలి

కనిక శీనుని వదిలి ఏడుస్తూ చూసింది

శీను : ఏడవకు నీ కోసం నేను మళ్ళీ వస్తాను.. ఒక్క నాలుగు రోజులు అంతే.. నాకున్న ప్రతీ ఒక్క పరిచయాలని, నాకున్న పేరుని,  నాకు సంబంధించిన ప్రతీ ఒక్కదాన్ని అన్నిటిని తెంచుకుని డాన్ శీనులో డాన్ తీసేసి నీ భర్తగా ఉట్టి శీనుగా వస్తాను.

ఆ పేరు వినగానే కనిక భయంతో మూడు అడుగులు వెనక్కి వేసింది.. శీను దెగ్గరికి వెళ్లి కనికని కౌగిలించుకుని తన భుజం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు.

కనిక : ప్రపంచాన్ని, ఎన్నో దేశాల పుల్లసులని భయపెడుతున్న డాన్ శీను నువ్వేనా

శీను : కాదు.. నా పేరు శీను.. హస్బెండ్ ఆఫ్ కనిక అని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు.

కనిక : నువ్వెవ్వరైనా నాకు అనవసరం.. ఐ లవ్ యు..

శీను : లవ్ యు.. ఇక వెళ్ళనా

కనిక : మళ్ళీ కచ్చితంగా వస్తావుగా.. నన్ను మాయ చేసి వెళ్లట్లేదుగా

శీను : హహ లేదు.. కావాలంటే తాకట్టుగా నా తమ్ముణ్ణి నీకు తోడుగా పెట్టి వెళుతున్నాను సరేనా అని నవ్వాడు

కనిక : నాకు నీ తమ్ముడంటే భయం

శీను : వాడు నిన్ను భయపెట్టాడు కాబట్టి నీకా భయం.. నేను వెళ్లొచ్చాక నా తమ్ముడంటే భయమని చెప్పు చూద్దాం లేదు నువ్వు చెప్పవు.. వాడే నీ ధైర్యం అవుతాడు

కనిక : ఉమ్మ్.. అని గట్టిగా కౌగిలించుకుంది..

శీను : ఇక వెళ్ళిరానా

కనిక : ఉమ్మ్... అని శీను కౌగిలి నుంచి విడిపడింది.

శీను : పని మీద బైటికి వెళుతున్నా ఎదురు వచ్చి ఒక ముద్దు ఇస్తే మంచి జరుగుతుందట.. చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది అని నవ్వుతూ చూసాడు.. కనిక నాలుగు అడుగులు వెనక్కి వేసి కళ్ళు తుడుచుకుని నవ్వుతూ ముందుకు వచ్చి శీను మొహాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిరా అని నుదిటి మీద ఆ వెంటనే బుగ్గ మీద ముద్దు పెట్టింది.. శీను కనిక గడ్డం పట్టుకుని ప్రేమగా పెదాల మీద ముద్దు పెట్టుకుందామని దెగ్గరికి వెళ్లి మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని ఆగిపోయాడు.. కానీ కనిక చుప్ మని ముద్దు పెట్టి.. చూడు నాకేం కాలేదు.. అని చేతులు చాచింది.. అంతే అల్లుకుపోయాడు ఫెన్సింగ్ కి తీగలు అల్లుకున్నట్టు గట్టిగా గాలి కూడా దూరనంతగా మళ్ళీ మళ్ళీ దొరకనట్టుగా.. ఇక ఆ పెదాలైతే ఫెవికిక్ వేసినట్టు.. ఎంతగా అంటే కనిక పెదాలని వదిలేప్పుడు ఇద్దరి పెదాలకి అంటుకున్న మందపు ఎంగిలి తీగలే సాక్ష్యం. వస్తాను అని మరొక్కసారి బుగ్గని ముద్దాడి కిందకి వెళ్ళాడు.. కనిక అయితే ఎగిరి గంతేసింది.. సంతోషంతో పిచ్చిది అయిపోయింది.. తను చనిపోతుందన్న ధ్యాసే లేదు ఆ మొహంలో.. ఎప్పుడు తన నోటి నుంచి వచ్చే ఏడుపు గొట్టు పాటలు కాకుండా మొదటి సారి ఆనందంతో సరికొత్త సరిగమలతో ప్రేమ పాటలు పాడుతూ గాలికి తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది.

శీను కిందకి వెళ్ళగానే జగ్గు బ్యాగ్ తో రెడీగా ఉన్నాడు.. శీను రాగానే ఫోన్ జీన్స్ లో పెడుతూ లేచి బ్యాగ్ అందుకున్నాడు.

జగ్గు : వెళదామా

శీను : డబ్బులు ఇచ్చారా

జగ్గు : ఏంటా రెండు లక్షల కోసమా.. హహ.. ఊరుకో అన్నయ్యా.. పదా వెళదాం

శీను : వెళదాం కాదు వెళుతున్నాను

జగ్గు : ఏంటి.. అయినా ఒక్కడివి.. నేను లేకుండా ఎక్కడికి

శీను : మీ వదిన్ని కాపాడ్డానికి..

జగ్గు : వదినా.. అంటే అన్నయ్యా... నిజంగానా.. మొత్తానికి నా కోరిక నెరవేరుతుంది ఎస్ ఎస్.. ఎస్.

శీను : అవును.. ఇక నుంచి డాన్ శీను లేడు.. నువ్వన్నట్టుగానే అన్ని ఆపేస్తున్నాం.. మన బేస్ క్లోజ్ చేసేయి.. మొత్తం ఏరేజ్ చేసేయి.. ఎవ్వరికి చెప్పనవసరం లేదు.. మన దెగ్గరా ఇన్ కమింగ్ కట్ అయితే చాలు ఆటోమేటిక్ గా అందరికి అర్ధం అయిపోతుంది.. బాబాయిని కూడా కట్ చెయ్యి.. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు అప్పుడు చెప్పొచ్చు.. మనం అన్ని పనులు ఆపేసామని..

జగ్గు : ఆయనకి తెలియదు కదా ఎలాగో మనం ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అని

శీను : (నవ్వుతూ) తెలీదులే కానీ.. అన్ని పనులు ఆపేసాం అని చెప్పు ఆయన కూడా సంతోషిస్తాడు.. మళ్ళీ మనల్ని కలవకుండా తన లైఫ్ సెట్ చేసేయి..

జగ్గు : నేనిక్కడ ఉండి ఏం చెయ్యను

శీను : అదేంట్రా మీ వదిన ఒక్కటే ఉంటే ఇక్కడా.. నువ్వు ఆడుకోవడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు.. నువ్వేం చెయ్యాలో మళ్ళీ నీకు నేను చెప్పాలా.. ఫోన్లో గేమ్స్ ఆడింది చాల్లే ఇక..

జగ్గు : హహ

శీను : జగ్గు.. కనిక మన ఇద్దరికీ ఒక మంచి తోడు అవుతుంది, తనలో నాకు మన అమ్మే కనిపించింది అదే నన్ను తన వైపు చూసేలా చేసింది.. జాగ్రత్త

జగ్గు : నువ్వు ఎప్పుడైతే వదిన అన్నావో ఆ క్షణమే మన లెక్కలు మన జీవితాలు మారిపోయాయి.. నువ్వెళ్ళి నీ పని చూసుకో, ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను.. అలానే ఇంకోటి

శీను : ఏంటి

జగ్గు : కొంచెం పర్మిషన్ ఇస్తే ఆ దీపాలిని లైన్లో పెట్టుకుంటా

శీను : నన్ను కాదు పొయ్యి మీ వదిన్ని అడుక్కోపో

జగ్గు : చాలా భయపెట్టేసాను వదిన్ని.. ఛ అని తల కొట్టుకున్నాడు.

శీను : సరే బై.. వెళ్ళాలి.. పనులున్నాయి..

జగ్గు : బాయి.. బాయి.. దీపాలి.. కమింగ్ బేబీ.. అని బ్యాగ్ తీసి మంచం మీద విసిరేసాడు..

శీను పాలస్ నుంచి బైటికి వచ్చి నడుచుకుంటూ బైటికి వెళుతుంటే కనిక తన కనుచూపు మెరకు శీను కనిపించినంత సేపు చూసి.. చిన్నగా జల్లు పడుతుంటే కిందకి వెళ్ళిపోయింది..

వర్షంలో నడుచుకుంటూ రోడ్డు ఎక్కి ముందుకు వెళుతూ ఒక ఫోన్ చేసాడు.

లొకేషన్ : ముంబై

డెన్ చుట్టు మనుషులు గన్స్ తో నిలబడి కాపలా కాస్తున్నారు.. లోపల ముంబై హోమ్ మినిస్టర్ మరియు సీయం ఇద్దరు చేతులు కట్టుకుని నిలుచున్నారు.. అందరూ ఎదురు చూసేది.. ముంబై డాన్ సికిందర్ గురించే

కారు సౌండ్ అవ్వడంతో అందరూ అలర్ట్ అయ్యారు.. అందరూ మెయిన్ డోర్ వైపు చూస్తుంటే ముందు నలుగురు  AK-47 తో మధ్యలో సికిందర్ సూట్ లో గాగుల్స్ తీస్తూ లోపలికి వచ్చాడు తన వెనక ఇంకో పదిమంది వచ్చారు అందరి చేతుల్లో గన్స్ ఉన్నాయి.. వేగవంతమైన వాకింగ్ స్టైల్ తో వెళ్లి కూర్చున్నాడు.. సీయంకి హోమ్ మినిస్టర్ కి కుర్చీలు కూడా వెయ్యలేదు.. వాళ్ళు ఏదో బతిమిలాడుకుంటున్నారు కాని సికిందర్ వినడం లేదు.. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో చూసాడు.. ఆశ్చర్యంగా లేచి నిలుచుని డాన్ శీను ఆనుకుని మాట్లాడుతున్న వాళ్ళని ఆపేసి అందరినీ బైటికి వెళ్లిపొమ్మన్నాడు..

సికిందర్ : భాయ్.. సలాం వాలేకుం

శీను : వా అలేకుం స్ సలాం.. సికిందర్

సికిందర్ : భాయ్ మీరు చెప్పిన పని మీదె ఉన్నాను.. అడ్రస్ దొరికింది.. ముంబై అన్ని హాస్పిటల్స్ లో వెతికించాను.. మీరు పంపించిన శాంపిల్స్ తో ఒకరి హార్ట్ మ్యాచ్ అవుతుంది.. అమ్మాయిది.. కాళ్లు చేతులు పని చెయ్యవు.. బాడీ చచ్చుపడిపోయింది.. మీరు ఉ అంటే చాలు మా వాళ్ళు తనని లేపేసి మీకు గుండె పంపిస్తాను.

శీను : లేదు ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను

సికిందర్ : భాయ్ మీరు ముంబై వస్తున్నారా.. మిమ్మల్ని ఒక్కసారి చూడొచ్చా.. నాకున్న ఒకే ఒక్క కోరిక భాయ్.. మిమ్మల్ని చూడాలి

శీను : సికిందర్ భాయ్ కి బతకాలని లేనట్టుంది

సికిందర్ : క్షమించండి.. ఇదంతా మీరు పెట్టిన భిక్ష

శీను : నేను రావట్లేదు.. నా మనిషి ఒకడు వస్తున్నాడు.. వాడికి ఏ ఇబ్బంది కలగకూడదు.. మూడు రోజులు ముంబైలో ఉంటాడు.. పని అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాడు..

సికిందర్ : అలాగే భాయ్.. నేను చూసుకుంటాను.. మీరేం వర్రీ అవొద్దు..

శీను : సరే అయితే

సికిందర్ : ఖుదా హఫీజ్

శీను : ఖుదా హఫీజ్ అని ఫోన్ పెట్టేసి.. వర్షంలో తడుస్తూనే వెనక వస్తున్న ఆటోని ఆపి ఎక్కి అక్కడనుంచి నేరుగా ముంబై వరకు క్యాబ్ బుక్ చేసుకుని కారు ఎక్కి పడుకున్నాడు.

లొకేషన్ : మిలిటరీ బేస్

హలో హలో అరుణ్ హియర్

సర్పాల్ సింగ్ : అరుణ్ వినిపిస్తుంది

అరుణ్ : సర్ చాలా సంవత్సరాల తర్వాత డాన్ శీను గురించి చిన్న ఆచూకీ తెలిసింది సర్

సర్పాల్ సింగ్ : అలాగా.. ఎక్కడున్నాడో ఎలా తెలిసింది

అరుణ్ : సర్ సర్.. మరీ అంత దూరం వెళ్ళకండి.. ముంబైకి డాన్ శీను మనిషి ఒకడు ఏదో పని మీద వస్తున్నాడని తెలిసింది.. ఎలా వస్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడో ఇంకా డీటెయిల్స్ ఏమి తెలీలేదు.. కానీ డాన్ శీనుకి సంబంధించిన చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో అని మీకు ఇన్ఫర్మ్ చేస్తున్నాను.

సర్పాల్ సింగ్ : ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను బై అని పెట్టేసి వెంటనే ఇండియా హై ఆఫీషియల్స్ తో పాటు ఫారెన్ మిలిటరీ వాళ్ళతో కూడా ఎమర్జెన్సీ మీటింగ్ ఆరెంజ్ చేసాడు.. రష్యా జపాన్ అమెరికాతో పాటు ఇంకో ఏడు దేశాలు మేము సాయం చేస్తాం అంటే మేము సాయం చేస్తాం అని కోరారు.. అందరూ మాట్లాడుకుని.. ఈ సారి డాన్ శీనుని ఎలా అయినా పట్టుకోవాలని.. అన్ని దేశాల నుంచి టాప్ ఏజెంట్స్ ని దించి ఒక సెపరేట్ బేస్ క్రియేట్ చేసి డాన్ శీనుని పట్టుకోవాలని ప్లాన్ రెడీ చెయ్యడానికి నిర్ణయించి సర్పాల్ సింగ్ ఆ పనిలో పడ్డాడు.
Like Reply
Beautiful update
[+] 1 user Likes Shabjaila 123's post
Like Reply
అదిరింది... కాదు కాదు... అదరహో......
[+] 1 user Likes Shabjaila 123's post
Like Reply
Super bagundi really great
[+] 1 user Likes narendhra89's post
Like Reply
(24-12-2022, 11:26 PM)Takulsajal Wrote: హాస్పిటల్లో గంటన్నరసేపు వేచిచూసిన తరవాత డాక్టర్ వచ్చి మరేం పరవాలేదు ఇప్పటికైతే ఓకే కాని రోజులు దెగ్గర పడ్డాయని కనికకి ఎక్కువ సమయం లేదని చెప్పాడు.
Very nice story, Takulsajal garu!!! Emotional scenes and Action/crime!!!Looks like Kanika is going to get a new heart and get health..Let us see how you take forward this thriller.
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
Nice super update 
Motaniki esari meru champatame kadu chache vallani batikistunaru Tongue Tongue
[+] 3 users Like K.R.kishore's post
Like Reply
Super update
[+] 1 user Likes Veerab151's post
Like Reply
అప్డేట్ మామూలుగా లేదు బ్రో....సూపర్ అంతే......ముంబై డాన్ సికిందర్ భాయ్ అనగానే మొగలిరేకులు సీరియల్ గుర్తొచ్చింది బ్రో.... Lotpot ....చూస్తుంటే శీను ని పట్టుకోవటానికి పెద్ద సెట్టింగే వేస్తున్నారు....చూద్దాం మరి శీను వాళ్ళకి ఎలా మస్కా కొడతాడో.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 4 users Like Thorlove's post
Like Reply
Wow excellent మూవీ చూపిస్తున్నారు సార్ చాలా చాలా బాగుంది సార్ సూపర్
[+] 2 users Like y.rama1980's post
Like Reply
Simply Superb.. Asalu next level story writer meeru.. After Vikram.. The DON is Back...
[+] 3 users Like Dalesteyn's post
Like Reply
మా పాటకులను మీ కథలతో నవ్వించారు....
ఏడిపించారు... ఎన్నో emotions కి గురి చేశారు
Real life లో అనుభవించే బాధలు కష్టాలు...
సుఖ దుఃఖాలు కొంత సమయం మరిపించారు.


డాన్ శీను officer's కి దొరుకుతాడా దొరకడ దొరికితే
తరవాత హీరో పరిస్థితి ఏమిటి ప్రతి కథలో ప్రతి సినిమాలో అందరూ కోరుకున్నట్టే నేను కూడా హీరో ఎవరికి దొరక్కుండా ఈ కష్టం నుండి గట్టెక్కాలని కోరుకుంటున్నాను.


 మంచి అప్డేట్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ 
[+] 6 users Like SS.REDDY's post
Like Reply
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply




Users browsing this thread: 16 Guest(s)