06-11-2022, 07:50 PM
Nice broo keka undi story
Adultery సుధా రాణి ( COMPLETED )
|
07-11-2022, 02:53 AM
(This post was last modified: 07-11-2022, 10:55 PM by kamal kishan. Edited 1 time in total. Edited 1 time in total.)
పాఠక దేవుళ్ళందరికి,
ఈ కధని 2వ సారి కూడా చదవమని నా మనవి, నా ఉద్దేశం తప్పులు వెతకమని కాదు. మనసులో ఒక అనుభూతిగా మిగిలి పోతుందని.
07-11-2022, 07:20 AM
Super emotive update.
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
07-11-2022, 02:18 PM
07-11-2022, 11:05 PM
(07-11-2022, 02:18 PM)Ravi9kumar Wrote: ఈ కథని 2వ సారి కూడా చదవమని ఎవరికి చెపుతున్నారు కమల్ గారు? అయ్యో, ఎంత మాట, కథలో లీనమయిపోతున్నాను. దాంతో ఉత్సకత పరుగులు పెట్టిస్తోంది. అలా పరుగులు పెట్టి చదువుతూ వెళ్తుంటే కథలో ట్విస్ట్ తెలిసిపోతోంది. హమ్మయ్య అనుకున్నా ఈ పరుగులతో కధని కధాబలాన్ని మిస్ అవుతున్నాను. అందుకే మళ్ళీ మళ్ళీ చదవమని చెప్పడం, అంతే నండి.
08-11-2022, 03:38 PM
10-11-2022, 11:14 AM
ఇప్పటిదాకా కామెంట్ చేసిన అందరికీ ధన్యవాదాలు
10-11-2022, 11:17 AM
(This post was last modified: 17-11-2022, 08:41 PM by Ravi9kumar. Edited 1 time in total. Edited 1 time in total.)
****
Update 29
Previous Update 28 : https://xossipy.com/thread-48064-post-50...pid5015322
ప్రియ , తన చేత్తో నాకు ఇడ్లీ తినిపించిన తరువాత తను నాతో మాట్లాడుతూ “ఇప్పుడు హాయిగా నిద్రపో రవి , రేపు నేను వచ్చేటప్పుడు నీ రేపోర్ట్స్ తీసుకొని వస్తాను. ఇక నేను ఇంటికి వెళ్తున్నాను , ఏమైన అవసరం అయితే నాకు ఫోన్ చేయించు”అని ఒక పేపర్ లో తన మొబైలు నెంబర్ రాసి నాకు ఇచ్చి తను తన ఇంటికి వెళ్ళిపోయింది.
ఈ కొద్ది పరిచయంలోనే తను తన ఇంటికి వెళ్తూ ఉంటే నా జీవితంలో నుంచి వెళ్లిపోతున్నట్టు నా మనసుకు అనిపించింది, తను కనిపించే వరకు తననే చూస్తూ ఉన్నాను . ప్రియ పరిచయం అయి ఒక్క రోజు కూడా కాలేదు అప్పుడే తన మీద ఓ మంచి అభిప్రాయం ఏర్పడింది. అలాగే ప్రియ మీద ఒక చిన్నపాటి అభిమానం కూడా వచ్చింది. ఇంతవరకూ నా మీద ఒక అమ్మాయి ఇలా అధికారం చూపించింది లేదు . నాతో ఇంత చనువుగా ఉన్నది కూడా లేదు. బహుశా అందుకే తన ని మళ్ళీ చూడాలని అనిపిస్తూ ఉంది . అలా చూడాలని అనిపించడం మంచికో కాదో నాకు తెలియదు కానీ , ‘ఉదయం ఎప్పుడు అవుతుందా’ అని చాలా ఆశగా ఉంది. ఏది ఏమైన మొదటిసారిగా నా జీవితంలో నాకంటూ ఒకరు ఉన్నారు, అని ప్రియ గురించి బలంగా నా మనసు చెప్పింది . ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోవలని అనుకున్నాను. ఇందాక ప్రియ తన చేత్తో నాకు కడుపునిండా ఇడ్లీ తినిపించడం వలన ఆకలి పోయి హాయిగా నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు ఉదయం నిద్రలేచాను, వాష్ రూమ్ కి వెళ్ళి నా పనులు పూర్తిచేసుకున్నా , అయితే నా దగ్గర పళ్ళు తోముకోడానికి బ్రష్ లేదు , దానికి తోడు అప్పటి వరకు హాస్పిటల్ వాళ్ళ వేసిన బట్టలే వేసుకొని ఉన్నాను. అవి తీసేసి నా బట్టలు మార్చుకుందాం అని అనుకుంటే నా బట్టల బ్యాగ్ నా వార్డ్ లో ఎక్కడా కనిపించలేదు, ఆ బ్యాగ్ లోనే నా టూత్ బ్రష్ కూడా ఉంది. ఇక చేసేది ఏమి లేక తిరిగి నా బెడ్ దగ్గరకి వచ్చి బెడ్ మీద కూర్చొని ఉన్నాను. కొద్ది సేపటికి ప్రియ నేను ఉండే వార్డ్ లోకి వస్తూ తనతో పాటు ఒక చేతిలో క్యారియర్ , మరొక చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని నా దగ్గరకి వస్తూ ఉంది. ఆ బ్యాగ్ నా బ్యాగ్ ఏమో అని చూశాను కానీ అది కాదు. నేను తనని చూడడం తను చూసిన ప్రియ ఓ అందమైన నవ్వు నవ్వుతూ నా దగ్గరకి వచ్చి నా మంచం పక్కన కుర్చీలో కూర్చుంటూ నాతో “త్వరగా లేచి ఫ్రెష్ అయినట్టున్నావ్ గా రవి” “హా ఫ్రెష్ అయ్యా కానీ..” “హుం కానీ ఏంటి” “నన్ను కార్ గుద్దినప్పుడు నాతో పాటు నా బ్యాగ్ కూడా ఉనింది, ఆ బ్యాగ్ ఇప్పుడు కనిపించడం లేదు” “అరే ! అప్పుడు నీ బ్యాగ్ ఉందా , నేను ఆ బ్యాగ్ ని చూడలేదు ; ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏమైన ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయా” “హా , నా ఒరిజినల్ study సర్టిఫికేట్స్ , మార్క్స్ లిస్ట్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి .. ఇంకా నా టూత్ బ్రష్ కూడా” “ఏంటి టూత్ బ్రష్ ఆ .... అదేంటి రవి సర్టిఫికేట్స్ అంటే ఇంపార్టెంట్ కానీ టూత్ బ్రష్ ఉంది అని అంటున్నావ్ ఏంటి !” “అది కూడా ఇంపార్టెంట్ ప్రియ , నా బ్రష్ లేకనే ఇంకా పళ్ళు తోముకోలేదు” “అందుకే నీకోసం ఒక కొత్త టూత్ బ్రష్ , పేస్ట్ కూడా తెచ్చా ... వాటితో పాటు ఒక జత బట్టలు కూడా తెచ్చాను” “బట్టలు కూడానా ... అయ్యో ఎందుకు ప్రియ , ఖర్చు కదా” “ఆరోజు నువ్వు వేసుకున్న బట్టలకి రక్తం మరకలు అయ్యాయి అవి వేసుకోవడం మంచింది కాదు , అందుకే కొత్తవి తెచ్చాను. ఏ నీకోసం నేను బట్టలు కొనకూడదా ?” “కొనకూడదు అని కాదు ప్రియ , నా బ్యాగ్ లో కొన్ని జతల బట్టలు ఉన్నాయి. ఆ బ్యాగ్ ఉండి ఉంటే చాలా బాగున్ను . పైగా నా సర్టిఫికేట్స్ కూడా అందులోనే ఉన్నాయి. అవి పోయాయి అంటే చాలా కష్టం కదా” “నీ సర్టిఫికేట్స్ గురించి ఎక్కువగా ఆలోచించకు రవి , నాకు తెలిసి సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో నీ బ్యాగ్ ఉండే అవకాశం ఉంది. నువ్వు డిస్చార్జి అయ్యాక ఒక సారి వెళ్ళి చూద్దాం సరేనా” “నాకు చాలా సాయం చేస్తున్నావ్ ప్రియ , నీ ఋణం కచ్చితంగా తీర్చుకుంటా” “ఋణం అని నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా రవి , నేనేదో నిన్ను నా మనిషి అని అనుకోని నీకు అన్నీ చేస్తూ ఉంటే.. నువ్వు ఇలా అనడం ఏమన్నా బాగుందా చెప్పు” “ఏమని చెప్పాలో అర్ధం కావడం లేదు ప్రియ , నేను నీకు పరిచయం అయి నాతో మాట్లాడి ఒక్కరోజు మాత్రమే అయింది. అప్పుడే నన్ను నీ మనిషి అని అనుకుంటున్నావు ... వారికి ఏమీ సంబందం లేని వాళ్ళని ఇంత కేర్ గా చూసుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు ఉన్నరూ ప్రియ. నీ మనసు చాల గొప్పది. నిజం చెపుతున్నా , ఇంతవరకు నా జీవితంలో నా మీద ఇంతగా కేర్ తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు , ఇలా నువ్వు నాతో చాలా చనువుగా ఉంటుంటే చాల వింతగా కొత్తగా ఉంది ... నా కోసం చాలా చేస్తున్నావ్ అందుకే నీ ఋణం తప్పక తీర్చుకుంటా అని అంటున్నా” “అబ్బో ఏమో అనుకున్నా రవి , నువ్వు మాటకారివే , నన్ను ఎక్కువ చేసి మాట్లాడుతున్నావే” “నిజం చెపుతున్నా ప్రియ అంతకు మించి ఇంకేమీ చెప్పలేదు” “హుం సరే బాబు సరే నీ మాటలు చాలా బాగున్నాయి . నువ్వు అనుకున్నట్టు తప్పకుండా నా రుణం తీర్చుకుందూలే , ఇక నేను తెచ్చిన బ్రష్ తొ నువ్వు పళ్ళు త్వముకుంటే ఇద్దరం కలిసి టిఫిన్ తినేద్దాం” “నువ్వు టిఫిన్ తినలేదా , అరే ఉండు వెళ్ళి బ్రష్ చేసుకుంటా”అని చెప్పి తను తెచ్చిన పేస్ట్ అండ్ బ్రష్ తీసుకొని వాష్ రూమ్ కి వెళ్ళి పళ్ళు తోముకొని వచ్చాను. ఆ తరువాత ప్రియ తెచ్చిన టిఫిన్ ఇద్దరం కలిసి తినేసాము. ఆ తరువాత ప్రియ నాతో మాట్లాడుతూ “ఒకటి తెలుసా రవి , విడదీయలేని కొన్ని బందాలు ఇలా పరిచయం లేని వాళ్ళ మద్య అనుకోకుండా మొదలవుతాయి అని ఎక్కడో విన్నాను , అది నిజమయ్యేలా ఉంది నా విషయంలో” “నీ విషయంలోనా ? ఏమంటున్నావ్ ప్రియ నాకు అర్ధం కాలేదు” “ఇందాక నువ్వు ఎలాంటి సంబాదం లేని వాళ్ళకి ఇంతగా కేర్ ఎవరు తీసుకుంటారు అని నాగురించి నాతో అన్నావుగా , అది గుర్తొచ్చి చెప్పాను. నీకు నాకు మద్య ఇదివరకూ ఎలాంటి పరిచయం లేదు , మన మద్య ఎలాంటి సంబందం లేదు, కదా . మన లాంటి వాళ్ళ గురించే అలా చెప్పారెమో అని అనిపించింది అందుకే ఆ మాట చెప్పాను” “అంటే ?” “ఏమీ లేదు ఎలాంటి మన మద్య విడదదీయలేని బందం ఒకటి మొదలైతే అవకాశం ఏమైన ఉందేమో అని అనుకుంటున్నా” “మన మద్య ఇప్పటికి ఒక బందం ఏర్పడింది కదా” “హా ! ఏ బందం ?” “అదే ఋణ బందం , నేను తీర్చుకోవాల్సిన ఋణం ఉందిగా” “అబ్బా ఏంది బాబు నువ్వు ఇక ఆ ఋణం గురించి చెప్పడం ఆపు .... నేను వెళ్ళి నీ రేపోర్ట్స్ తీసుకొని వస్తా” అని చెప్పి వెళ్లబోతు ఉంటే నేను “నీకు డ్యూటి ఉందిగా ప్రియ , ఈ టైమ్ లో నా రేపోర్ట్స్ కోసం శ్రమ పడడం ఎందుకు చెప్పు” “హలో మాస్టారు , నేనేమీ పరాయి వాళ్ళ కోసం వెళ్ళడం లేదు , నీకోసం వెళ్తున్నా . ఇంకా చెప్పాలంటే నేను ఈరోజు ఆఫ్ తీసుకున్నా. సో ఈరోజు డ్యూటి లేదు . కాబట్టి నాకు ఎలాంటి శ్రమ లేదు, అందులోనూ నీకోసం చేసే పనిలో శ్రమ ఉందని నేను అనుకోను” అని చెప్పి రేపోర్ట్స్ తీసుకురాడానికి వెళ్ళింది. ప్రియ మాటలు ప్రవర్తన చాలా వింతగా అనిపించింది , ఇందాక ప్రియ చెప్పినట్టు నిజంగా మా మద్య బందం ఏర్పడేలా ఉంది ... అది ఇందాక నేను చెప్పిన ఋణం బందం కాదుకానీ , ఇంకేదో బలమైన విడదీయలేని బందం మా మద్య ఏర్పడుతూ ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది అని నాలో నేను అనుకుంటూ అక్కడే కూర్చొని ఉన్నాను. కొద్దిసేపటికి ప్రియ నా రేపోర్ట్స్ తీసుకొని వచ్చింది . ఆ వెంటనే నన్ను చూసిన డాక్టర్ కూడా వచ్చి నా రేపోర్ట్స్ అన్నీ చూసి నాకు ఎలాంటి సమస్య లేదు అని , నన్ను ఈ మద్యానమే డిస్చార్జి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. డిస్చార్జికి కావలసిన ఫోమ్స్ అన్నీ ప్రియనే దగ్గరఉండి చూసుకుంటూ ఉంది. ఈ లోపల ప్రియ నాతో తను తెచ్చిన బట్టలు వేసుకోమని చెప్పడంతో , ప్రియ తెచ్చిన బట్టలు వాష్ రూమ్ లో మార్చుకొని వచ్చాను. దాంతో పాటు నేను విజయవాడ కి వచ్చే రోజు 500 రూపాయల్ని నాతో పాటు తెచ్చుకున్నాను. బస్ చార్జి పోను 300 మిగిలాయి. అవి ఆరోజు నేను వేసుకున్న షర్ట్ లో పెట్టుకున్నాను. ఆ 300 నా చేతికి ప్రియ ఇచ్చి నాతో ‘నీ వివరాలు ఏమైన తెలుస్తాయేమో అని నా షర్ట్ వెతికితే ఈ 300 రూపాయలు మాత్రమే దొరికాయి ఇంకేమీ దొరకలేదు’అని ఆ 300 నాకు ఇచ్చింది. నా దగ్గర మిగిలిన ఆస్తి ఆ 300 రూపాయలు మాత్రమే. వాటిని బద్రంగా , ప్రియ తెచ్చిన నా కొత్త షర్ట్ జోబిలో పెట్టుకున్నాను. మద్యానం లోపల నన్ను హాస్పిటల్ నుంచి డిస్చార్జి చేశారు. ఇక నేను ఆ హాస్పిటల్ పార్కింగ్ area లో ప్రియ స్కూటీ పక్కన ప్రియతో పాటు నిల్చొని తనకి గుడ్ బాయ్ చెప్పాలని అనుకోని తనతో “చాలా థాంక్స్ ప్రియ , ఇక నేను సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్ళి ; అక్కడ నా బ్యాగ్ ఉందో లేదో కనుక్కుంటాను” అని చెప్పాను. నా మాటలు విన్నాక ప్రియ “అదేంటి నీ కోసం జాబ్ చూస్తా అని నేను చెప్పానుగా” “అవును ప్రియ అంతవరకు ఎక్కడైన ఉంటాను , ఎలాగో నీ నెంబర్ ఇచ్చావుగా రెండు రోజుల తరువాత ఫోన్ చేస్తా” అని అంటే ప్రియ “అంతవరకు ఎక్కడ ఉంటావు , నీకు ఎవరూ లేరు అని అన్నావుగా” “ఇక్కడ ఎవరూ లేరు ప్రియ , అంతవరకు ఇక్కడే ఎక్కడైన ఫ్లాట్ ఫామ్ మీద ఉంటాలే”అని అన్నాను. నేను అలా అనడంతో ప్రియ కోపం తెచ్చుకొని నాతో “ఎం మాట్లాడుతున్నావ్ రవి ఫ్లాట్ ఫామ్ మీద ఉండడం ఏమిటి ? నికేమైన పిచ్చా” “అయ్యో అది నాకేమీ కొత్త కాదు , ఇదివరకే చెప్పానుగా ప్రియ నా జీవితం అదే అని. నా గురించి ఏమీ ఆలోచించకు ఇక నువ్వు ఇంటికి వెళ్ళు” “నాతో పాటు నువ్వు కూడా రా . నాతో పాటు నా ఇంట్లోనే ఉండు” అని చెప్పింది . తను అలా చెపుతూ ఉంటే నేను “వద్దు ప్రియ , ఇంతవరకు నువ్వు చేసిన సాయం చాలు మీ ఇంటికి అని అంటే అస్సలు బాగుండదు” “ఒకసారి సాయం అని అంటావు ఇంకోసారి రుణం అని అంటావు ? ఏంటి రవి ఎం మాట్లాడుతున్నావ్ , ఇంకోసారి ఇలా అన్నవో బాగుండదు చెపుతున్నా ....” అని మళ్ళీ కోపంగా అనింది. తన కోపాన్ని చూస్తూ నెమ్మదిగా తనతో “అది కాదు ప్రియ నేను మి ఇంటికి వస్తే మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెపుతావు” “ప్రస్తుతానికి నేను మా వాళ్ళతో ఉండడం లేదు , జాబ్ మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. మా వాళ్ళకి ఏమీ తెలియదు లే నువ్వు ఇక నాతో పాటు రా” “ఒక్క దానివే ఉంటున్నా అని అంటున్నావ్ , నా గురించి ఏమీ తెలియకుండా నన్ను నితో పాటు నీ ఇంట్లో ఉండమని అంటున్నావే ; నేను నితో ఉంటున్నా అని మీ వాళ్ళకి తెలిస్తే , మీ వాళ్ళు నిన్ను తప్పుగా అనుకుంటారు ప్రియ వద్దు , అసలు నేను మంచోడిని కాదో నీకు తెలియదుగా” “హుం నేను మరి అంత అమాయకురాలిని అనుకున్నావా రవి , ఒక ఒంటరి అమ్మాయి తనతో పాటు ఉండమని పిలుస్తుంటే , సరే అని చెప్పకుండా నా వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారు అని ఆలోచిస్తున్నావే ఇదొక్కటి చాలదా నువ్వు మంచోడివే చెప్పడానికి. అయినా నా మనసు నాకు ఎప్పుడో చెప్పింది నువ్వు మంచోడివి అని.... ఇంకేమీ ఆలోచించకుండా నాతో పాటు రా వచ్చి స్కూటీ ఎక్కు” అని అనింది. అప్పుడు నేను “లేదు , నేను రాను ప్రియ. అసలు నీతో పాటు నేను నీ ఇంటికి రాడానికి నువ్వు నాకు ఏమవుతావు , నీకు నాకు ఏమిటి సంబందం ? ... ఏమి లేదుగా . అలాంటప్పుడు నేను నీతో రావలసిన అవసరం లేదు నువ్వు వెళ్లిపో” అని అన్నాను . నేను అలా అనడమే ఆలస్యం తను ఆ స్కూటీ మీదనుంచి దిగి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ నాతో “ఏరా ఏమన్నావ్ ‘నీకు నాకు ఎలాంటి సంబందం లేదా’ అవును, అది నీ దృస్టిలో ... ఈ హాస్పిటల్ లో జాబ్ చేస్తూ ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇచ్చాను. వాళ్ళ మీద ఎప్పుడూ ఎలాంటి ఫీలింగ్స్ రాలేదు . కానీ , నీ విషయంలో మాత్రం అలా జరగలేదు , మొదట్లో నువ్వు ఎవరో తెలుసుకోవాలని నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళుతెరుస్తావా ఎదురుచూస్తూ ఉండేదాన్ని. అలా ప్రతీ రోజూ మూడు పూటలా వచ్చి నిన్ను చూస్తూ ఉన్నా . ఈ నాలుగు రోజులు నా పని నిన్ను చూడడమే అయింది . అనుకోకుండా ఒక రోజు నిన్ను చూడకుండా ఇంటికి వెళ్లిపోయాను. ఆ రోజు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండాలని అనిపించలేదు తెలిసా రవి . దానికి కారణం ఆ రోజు నిన్ను చూడలేదు. నిన్ను చూడకుండా ఉండలేను అని నీకోసం తిరిగి హాస్పిటల్ కి వచ్చి నిన్ను చూశాక నా మనసు కుదుట పడింది. అప్పుడు ఆ క్షణం ఏమీ కానీ నీకోసం అన్నం కూడా తినకుండా ఎందుకు వచ్చానో తెలియక ఏడ్చేంత పనైంది . ఆ విషయం గురించి బాగా ఆలోచిస్తే అప్పుడు తెలిసింది , నాకు నువ్వు అలవాటు అయ్యావని . కానీ అదే రోజు మరో విషయం నన్ను ఆందోళనకు గురిచేసిన ఒక విషయం ; నువ్వు కళ్ళు తెరిచిన తరువాత నీ వాళ్ళ దగ్గరకి వెళ్లిపోతూ నా నుంచి దూరం అయిపోతావేమో అని చాలా బయపడ్డాను. ఎప్పుడైతే నువ్వు కళ్ళు తెరిచి నీకు ఎవరూ లేరని నువ్వు చెప్పిన తరువాత , నిజంగా చెపుతున్నా రవి ; ఆ క్షణం నీకు అన్నీ నేనే అవ్వాలని ఆశ పడ్డాను , నీ జీవితంలో మొదటి స్థానం నేను అవ్వాలని కోరుకున్నా . అనుకోకుండా నిన్ను చూడడం అలవాటుగా మారిన నాకు నీ మీద ఇష్టం మొదలైంది , ఆ ఇష్టం ప్రేమగా మారింది అని గ్రహించా. అవును నువ్వంటే నాకు ఇష్టం , ప్రేమ . నీతో నా జీవితం పంచుకోవాలని ఆశ పడ్డాను. అందుకే నువ్వెక్కడ నానుంచి దూరంగా వెళ్లిపోతావేమో అని నాతో పాటు నేను ఉండే ఇంటికి రమ్మంటున్నా” అని నాకు తన మనసు లోని మాటలు చెపుతూనే నా మీద తనకి ఉన్న ప్రేమని చెప్పేసింది. ప్రియ తన ప్రేమని చెప్పిన తరువాత నాలో మౌనంగ రాజ్యమేలింది. కొద్ది సేపటికి ప్రియ తో మాట్లాడుతూ “ఎంచెప్పాలో అర్ధం కావడంలేదు ప్రియ , నీ మాటలలో ఉన్న నిజాయితీ నీ కళ్ళలో నా మీద ఉన్న ప్రేమ నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నువ్వు చాలా మంచి దానివి , ఎలాంటి కల్మషం లేని దానివి , , నేను నీకు సరిపోనేమి అని నాకు అనిపిస్తుంది ప్రియ. నీ జీవితంలోకి నాకన్నా ఎక్కువ స్థాయిలో ఉండే అబ్బాయి వస్తే చాలా మంచింది ”అని చెప్పాను. ఆ వెంటనే ప్రియ నాతో “ఏంటి ! నువ్వు కాకుండా నా జీవితంలోకి ఇంకో అబ్బాయా , అవసరం లేదు నాకు నువ్వే కావాలి. అసలు ఇదంతా కాదు రవి ... సూటిగా ఒకటి అడుగుతా నిజం చెప్పు ; నన్ను వదులుకోవడం నీకు ఇష్టమేనా రవి ? అసలు నా గిరించి నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు చెప్పు,” అని నాతో చెప్పి నా సమాదానం కోసం ఎదురుచూస్తూ ఉంది. ప్రియ అలా అడుగుతూ ఉంటే తనకి అబద్దం చెప్పాలని అనిపించలేదు ,అందుకే మొదటిసారి ప్రియని చూసినప్పుడు నాకు కలిగిన ఆ ఫీలింగ్ తనకి చెప్పాలని నిర్ణయించుకొని తనతో “నా జీవితంలో ఎవ్వరూ నామీద ఎలాంటి శ్రద్ద చూపించలేదు ఎందుకంటే నాకంటూ ఎవ్వరూ లేరు . ఏమీ కానీ నాకోసం టిఫిన్ తెచ్చి నేను వద్దూ అని అంటున్నా కూడా నా మీద నువ్వు అధికారం చూపిస్తూ , నాతో చనువుగా ఉంటూ నీ చేతులతో టిఫిన్ తినిపిస్తూ ఉంటే నా జీవితంలోకి నాకంటూ ఒక అమ్మాయిగా నువ్వు వచ్చావేమో అని ఆశ పడ్డాను. అదే సమయంలో ఆశించని నీకోసం ఏమైన ఆశ పడుతున్నానేమో అని సంకోచించాను. నిన్న రాత్రి నా దగ్గరనుంచి నువ్వు వెళ్లిపోతూ ఉంటే నా జీవితంలోనుంచి వెళ్లిపోతున్నావేమో చాలా బాద వేసింది , మళ్ళీ వెంటనే నిన్ను చూడాలని ఆశ మొదలైంది . కానీ , అలా చూడడం మంచిందో కాదో తెలియక ఆగిపోయా. అప్పుడే నాకు మొదటిసారిగా నా జీవితంలో నాకంటూ ఒకరు ఉన్నారు, అని నువ్వే అని బలంగా నా మనసు చెప్పింది ప్రియ. మళ్ళీ ఉదయం నువ్వు కనిపించగానే నా సొంత మనిషి నన్ను చూడడానికి వస్తున్నట్టు అనిపించింది. ఇలా నీ గురించి నేను ఆలోచినందం ఆశ పడడం తప్పో ఒప్పో నాకు తెలియదు , ఇదంతా నీ దగ్గర దాయాలని నాకు అనిపించలేదు . అందుకే నా మనసులో అనుకున్నవి అన్నీ నీకు చెప్పేసాను” అని చెప్పాను. నా మాటలు విన్నాక ప్రియ చాలా సంతోషాపడుతూ నాతో “ఇంకేమీ మాట్లాడకు రవి , నా మీద నీకు ఉన్న అభిప్రాయం ఏమిటో నాకు పూర్తిగా అర్ధం అయింది. ఇక ఏమీ ఆలోచించకుండా నాతో పాటు నేను ఉంటున్న ఇంటికి రా. లేదంటే నా మీద ఒట్టే” అని చెప్పి తన స్కూటీ ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేసింది. తను ‘ఒట్టు’అని అన్నాక ఏమీ మాట్లాడలేక పోయాను ఇక ఏమీ చేయలేక , తన స్కూటీ ఎక్కాను. నేను ఎక్కడమే ఆలస్యం వెంటనే స్కూటీ ని ముందుకు పోనిచ్చి నేరుగా ఒక ఇంటి ముందు ఆపింది. కథ ఇంకా కొనసాగుతుంది ......
Next Update 30: https://xossipy.com/thread-48064-post-50...pid5029719
10-11-2022, 11:41 AM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html |
« Next Oldest | Next Newest »
|