Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(20-10-2022, 09:08 PM)Iron man 0206 Wrote: Update adhiripoyindhi bro naku okka doubt vachindhi musaladhi ani akshitha andhi so naku telisi thanu manasa valla mother ayi undali enika chanipokunda Vikramaditya kodukulani ellago thana vaipuki thipukundhi lets see my guess is right or wrong

hmm... intresting..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(20-10-2022, 09:24 PM)kummun Wrote: ప్రేమించిన దాని కడుపున నమ్మకద్రోహులు, వెన్నుపోటుదారులు పుడితే.... ద్రోహం చేసిన దాని కడుపున వంశోద్దారకులు పుట్టారా??? Angel

ఆరున్నొక్క రాగంతో అందుకోండీ పాట....
"నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతి రయ్యో…..."

hahaha
[+] 2 users Like Pallaki's post
Like Reply
(20-10-2022, 09:48 PM)shivamv.gfx Wrote: Boss ... urgent ga Nee Stories annintiki Copy rights regd. cheyinchu...  mind blowing.. pichekkipotundi.. Daily office nundi ragane xossippy open chesi nee update kosam chustanu.. anthaga edict ayipoyanu nee stories ki..

thankk you very much andi
edho time pass ki rasthunnanu
copy rights chesukunentha scene ledhu lendi
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(20-10-2022, 10:51 PM)Manoj1 Wrote: Super  update , ji ante musaldhe ante anuradha ne na viktram adhitya wife kadhu kadha , naku thane anipisthundhe ,

Vikram adhitya sontha pillalne patinchukoledhu anne e prathekaram emo chala twust lu unnaye aboo
Mee update regular ga evande

alaa anipinchindhaa
anuradha andharini guddigaa namme character
vikramadhithya ni preminchadanike konchemtime pattindhi
kaani she is good bro
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(20-10-2022, 10:51 PM)Sreenadh sri Wrote: Naku telisi vikramadithya inka brathike untadu athaniki rendu sarlu chanipoi brathike avakasham undi okasari chanipoyadu malli chanipoina brathakagaladu so i think mana hero is alive emantaru thakul garu

olammo olammo

kaani aa chance use chesukunnattu gurthe
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(21-10-2022, 03:17 AM)Chutki Wrote: దీనమ్మ అవును బ్రో
తెగ నాయకుడు అప్పట్లో విక్రమాదిత్య చేసిన సహాయానికి
కప్ లో ఏదో రసం ఇచ్చి తాగమంటాడు
తెగని పరిపాలించే వాళ్ళకి మాత్రమే ఇచ్చే ఆ రసాన్ని విక్రమాదిత్య కి కూడా ఇస్తాడు.
అది తాగితే రెండు సార్లు చనిపోవచ్చు అని చెప్తాడు.

అంటే ఇప్పుడు విక్రమాదిత్య బతికే ఉన్నాడా
దేవుడా
Takulsajal గారు మీ రైటింగ్స్ మహిమ...
Kcpd kramp ఇంకా ఎన్ని ఉంటే అన్ని
ఒక సెక్స్ స్టోరీస్ వెబ్ సైట్ లో
నాన్ ఎరోటిక్ కధ రాసి మమ్మల్ని ఇంత ఇన్వొల్వె అయ్యేలా చేస్తున్నారంటేనే తెలుస్తుంది.
You are very talented bro...

Waiting waiting waiting with a lot of exitement

wow wow wow 
vammo nenu em rasano malli okasari chadhuvukovali

thanks bro..
[+] 2 users Like Pallaki's post
Like Reply
(21-10-2022, 08:41 PM)Praveenraju Wrote: Bro waiting for your update❤❤❤❤

em rayaledhandi inkaa

repu emaina raasthe post chesthaanu .
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(29-03-2022, 04:52 PM)siva_reddy32 Wrote: హాయ్

చాలా బాగా రాస్తున్నారు  స్టోరీ,  కంటిన్యూ చేయండి , అయిపోయేంత వరకు  వదలవద్దు ప్లీజ్  

శివ

nenu ee comment e chudaledhu
inkaa chala manchi manchi comments unnai

anni chadhuvuthunnaa
sorry siva gaaru appatlo kotthalo chusukoledhu

chala vatiki like kuda kottaledhu nenu
kadha rasukuntu comment chadhuvukuntu vellipoyaa

ika rating sangathi dhevuderugu
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(21-10-2022, 09:29 PM)Takulsajal Wrote: olammo olammo

kaani aa chance use chesukunnattu gurthe

Rendu sarlu chanipoi brathakavachu ani annaruga so okasari chanipoyadu rendo sari chanipoleduga
[+] 1 user Likes Sreenadh sri's post
Like Reply
అందరు వాసు, చిన్నా గురించే ఆలోచిస్తున్నారు.... మన ప్రియ శత్రువు కథలో హీరోగా ఒక దేవుడు ఉన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా .... ఈ ద్వీపం లో ఫైట్ తర్వాత మన సుబ్బు నలుగురిని బండి మీద వేసుకొని మన రుద్ర దగ్గరకి వెళ్తారు అక్కడ చనిపోయిన వాళ్ళు బతుకుతారు.... మరి రుద్ర వరకు చేరుకోవటానికి ఈ కథ ఎటువంటి ప్రయాణం చేయాలో ఏమో మన టక్కుల సాజలకే తెలియాలి.... కానీ ఈ కథ చేయబోయే ప్రయాణం మాత్రం మనల్ని వెరెక్కించేస్తుంది అని మాత్రం తెలుసు
[+] 4 users Like sunny_s's post
Like Reply
(21-10-2022, 09:22 PM)Takulsajal Wrote: haha
thankyou
inthakamundhu alaane raase vadini
kaani ippudu nidhanamgaane rasthunnanu lendi
already vikramadhithya story ni re edit chesthunnanu
katte kotte episodes ni kudaa
andhariki nachelaa malli konchem edit chesi rasthunnanu
already S1 3 episodes edit chesaanu.

btw thanks

ఆయ్యా!

మీ స్టోరీని మళ్ళీ ఇంకోసారి అందరితో చదివించాలని ఫిక్స్ అయ్యారన్నమాట, కానియ్యండి. ఏం చేస్తాం, స్టోరీ బాగుంది మళ్ళీ మళ్ళీ చదువుతాం.

ఏ మాటకి ఆ మాట కానీ, మీ కథలు మాత్రం అద్భుతాలు. లోకేష్ కనకారాజ్ తీసినట్లు మీ కథలని కూడా ఏదో ఒక సినిమా యూనివర్స్ గా తీస్తారేమో.
[+] 2 users Like aarya's post
Like Reply
సూపర్ గా ఉంది కొంచెం fast గా update ఇవ్వండి.
ఈ స్టోరీ కోసం చాలా ఎక్కువ గా ఎదురు చూస్తున్నాను
[+] 2 users Like LaxmiYallala07's post
Like Reply
Super story update yeppudu isthunnav bro
[+] 1 user Likes Zixer's post
Like Reply
S3E4

శశి బైటికి వెళ్ళిపోగానే అక్షిత విక్రమ్ ఒళ్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే ఆదిత్య లేచి జోబులోనుంచి ఆకులు తీసాడు.

మానస : ఏంటవి ?

ఆదిత్య : మద్ది చెట్టు ఆకులు, ఇందాక వస్తున్నప్పుడు చెట్లు కనిపించాయి ఎవ్వరు చూడకుండా దొరికినన్ని తెంపి జేబులో వేసుకున్నాను.

అను : బావా నువ్వు చాలా గ్రేట్ రా, అలంటి ఓ సిట్యుయేషన్లో కూడా నీ బుర్ర భలే పని చేసింది.

మానస : ఈ ఆకులు ఏం చేస్తాయి 

ఆదిత్య : ఈ ఆకుల పసరు ఇంజ్యూరిస్ చాలా వేగంగా నయం అవడానికి పని చేస్తాయి.

విక్రమ్ : (అంటే నేను ఎస్కేప్ ప్లాన్స్ కోసం వెతుకుతుంటే, ఆదిత్య ఇంకో దారిలో ఆలోచించాడు. ఆవేశపరుడేమో అనుకున్నాను చాలా బాగా ఆలోచించాడు) ఆదిత్య.. (అనగానే ఆదిత్య తల ఎత్తి విక్రమ్ ని చూసాడు) నిజంగా నువ్వు చాలా గొప్ప డాక్టర్ వి.

ఆదిత్య : అంతొద్దులే.. దా పసరు పిండాలి అని ఆకులు నలుపుతూ వేళ్లతోనే ఆకులు చించి నెమ్ము వచ్చేలా నలిపి.. అటు ఇటు చూసి ఇక్కడ ఎవరిదేగ్గర ఐన కర్చీఫ్ ఉందా అని అడిగాడు, సలీమా తన కర్చీఫ్ ఇచ్చింది.. అను తనని బోళ్లా పడుకోబెట్టి టీ షర్ట్ తీసెయ్యి అని చెపుతూనే నలిపిన ఆకులలో తన ఉమ్ము కలిపి కర్చీఫ్ లో వేసి ముడి తిప్పుతూ విక్రమ్ ని చూసి ఆ చివర పట్టుకో అనగానే విక్రమ్ ఆ చివర పట్టుకున్నాడు. అక్షిత వీపు మధ్యలోకి వచ్చేలా విక్రమ్ అటు వైపు ఆదిత్య ఇటువైపు పట్టుకుని తిప్పుతూ గట్టిగా లాగుతుంటే ఒక్కో చుక్కా అక్షిత వీపు మీద పడుతుంది. అను వాటిని అక్షిత దెబ్బల మీద పులుముతుంది.. ఇద్దరు వీలైనంత పిండి కర్చీఫ్ ని అనుకి ఇస్తే వరస దెబ్బలు తగిలిన చోట పెట్టి మల్లి టీ షర్ట్ వేసింది.. ఆదిత్య లేచి అక్కడ రక్తపు మడుగులో ఉన్న చిన్న పిల్లాడి మెడలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి అనుకి ఇచ్చాడు.. స్పూన్ మాత్రమే ప్రతీ రెండు నిమిషాలకి ఓసారి తాపు.

విక్రమ్ : మీరెవరు 

పద్మ : అన్నయ్య నేను పద్మని, మా అయన పేరు వాసు మీరు నన్ను కాపాడారు, మీరే నాకు ఆపరేషన్ చేసిందని మా బావ చెప్పాడు. అని ఆదిత్యని చూసింది.

అను : పద్మా నువ్వెంటి ఇక్కడా 

పద్మ : ఆ రోజు మిమ్మల్ని ఎత్తుకొచ్చింది, నా బావ చంపింది వీళ్ళ మనుషులనే 

ఆదిత్య : అవును వాడెక్కడా

పద్మ : ఏమో

విక్రమ్ : ఇక్కడికి వస్తాడా ఏంటి ?

ఆదిత్య : దణ్ణంరా బాబు వాడికి, వాడు వచ్చాడంటే ఇక్కడ అస్సలు ఎవరిని ఎవరు చంపుకుంటారో, వాడు వీళ్ళని వదిలేసి మన మీద పడితే మన గతేమి కాను.. అబ్బబ్బ ఆ రోజు చుక్కలు చూపించాడు.

విక్రమ్ : తప్పదురా, భరించాలి 

ఆదిత్య : మీ బావ ఇంట్లో కూడా ఇంతేనా 

పద్మ : లేదు మంచి కామెడీ పీస్, మా బావ ఎక్కడుంటే అక్కడ అన్ని నవ్వులే, భరించలేని కోపం వస్తేనే కంట్రోల్ తప్పుతాడు.

మానస : అంటే సుబ్బు లాగా 

ఆదిత్య : ఏంటి సుబ్బు గాడికి అంత కోపమా 

మానస : మొన్న చూసాంగా, అవును ఈ అమ్మాయి సుభాష్ అని సుబ్బు అని మాట్లాడింది, వీడు వాడు ఒక్కడేనా 

విక్రమ్ : డ్రైవర్ అందిగా వాడేనేమో.. పద్మ తన పేరేంటి ?

పద్మ : అక్షిత 

మానస : అరవింద్ చెప్పింది కూడా తన పేరే. ఇప్పుడు వీళ్లంతా కలిసి సుబ్బు గాడి కోసం వెతుకుతున్నారన్నమాట. బాగుంది కారులో ఉంటె వాడెప్పుడు దొరకాలి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, భయంగా ఉంది చంపేస్తారా?

ఆదిత్య : చూద్దాం, పోతే ఇంకా హ్యాపీ.. మీ గోల తప్పుద్ది 

అను : పోరా 

ఆదిత్య : అస్సలు సుబ్బు గాడు హైలైట్ ఇక్కడ, ఏ స్కోప్ లేకుండా కధతో సంబంధం లేకుండా, వాడికి ఏమి తెలియకపోయినా హీరో అయిపోతున్నాడు. అందరూ కలిసి వాడి మీద పడితే ఎలా ఉంటుందో ఆలోచించు. మొన్న వాడి మొహం మీద నుంచి గొడ్డలి వెళుతుంటే వాడి ఎక్సప్రెషన్ చూడాలి.


ఇంతలో విక్రమ్ తన అమ్మ కావ్యతో సైగలతో మాట్లాడుతుంటే చూసారు అందరూ. 

విక్రమ్ : అమ్మా ఏమైనా చెపుతావా లేదా 

కావ్య : కళ్ళ నిండా నీళ్లతో, చెపుతాను అని పక్కనే ఉన్న అను అమ్మ సరితని ప్రేమగా చూసి తన బుగ్గ నిమురుతూ ఇంకో చెయ్యి ఆదిత్య తండ్రి రాజు భుజం మీద వేసి విక్రమ్ తో మాట్లాడుతుంది.

సరిత : ఏమంటుంది?

మానస : మీరు తన చెల్లెలు, తమ్ముడు అని చెపుతుంది. ఇన్నేళ్లు మీరు ఎవరో తెలిసినా ఇలాంటి ఒక రోజు రాకూడదనే మిమ్మల్ని కలవకుండా దూరం నుంచి చూసుకునేదట. ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉందంటుంది.

విక్రమ్ : ఎందుకు మ్మా 

కావ్య : ........................

మానస : మా నాన్న చెప్పాడు 

విక్రమ్ : ఎవరు 

కావ్య : ..........................

మానస : విక్రమాదిత్య. మా నాన్న, నేను వీళ్ళని కలిసే రోజు వస్తే అది ప్రమాదమే అని చెప్పాడట.

విక్రమ్ : ఏం జరిగిందో చెప్పమ్మా

గతం నెమరు వేసుకుంటూ విక్రమ్ తో చెపుతుంటే మానస అందరికి అర్ధం అయ్యేలా చెపుతుంది.

కావ్య : నేను తెగ ప్రజల దెగ్గర ఉన్న ఆఖరి రోజు అది, ఆరోజు అమ్మా నాన్న వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. రాజు సరితల పిండాలు సరిగ్గా ఎదగక పోయేసరికి వాళ్ళకి ఎదుగుదల చాలా మెల్లగా ఉండేది. ఇద్దరు ఆడుకోడం తినడం తప్పితే వేరే ఆలోచన ఉండేది కాదు. ఆ రోజు మా నాన్న వచ్చాడు. చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుని ఆలోచిస్తుంటే ఎప్పుడొచ్చాడో నా పక్కనే కూర్చున్నాడు.

విక్రమాదిత్య : తల్లీ..

కావ్య : డాడీ.. వచ్చేసావా (అని గట్టిగా ఒళ్ళోకి వాలిపోయి వాటేసుకుంది)

విక్రమాదిత్య : అమ్మ కూడా వచ్చింది, అదిగో కింద.

అనురాధ : హాయి.. నాన్నా

కావ్య : డాడీ దించు. అని చెట్టు దిగి వెళ్లి అమ్మని వాటేసుకున్నాను. అమ్మా పొద్దుననుంచి చూస్తున్నాను ఇప్పుడా రావడం. ఎంత బాధేసిందో తెలుసా

అనురాధ : చూడు విక్రమ్, ఎందుకిలా చేస్తున్నావ్. మనతో తీసుకెళ్ళిపోదాం ప్లీజ్.

విక్రమాదిత్య : నువ్వెళ్ళి నీ కొడుకు ఎక్కడున్నాడో చూసుకోపో

కావ్య : శశి అన్నయ్య ఎప్పుడు వేట అంటాడు, అందరితో కొట్లాటలే. మొన్న పెద్దయ్య తిట్టాడు కూడా

విక్రమాదిత్య : కావ్య.. మనం అలా వెళదామా. నీతో మాట్లాడాలి.

కావ్య : పద డాడీ అని సైగ చేస్తూ ఆయన చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాను.

విక్రమాదిత్య : ఇక నుంచి నిన్ను చూడటానికి నేను రాను తల్లి.

కావ్య : (కళ్ళు తడి అయిపోయాయి) ఎందుకు నేను ఏమైనా తప్పు చేసానా, ప్లీజ్ డాడీ అలా మాట్లాడకు. అని అనగానే నన్ను ఎత్తుకున్నాడు.

విక్రమాదిత్య : లేదు తల్లి, నేను ఏం చేసినా మీకోసమే కదా నా మాట వినవా

కావ్య : కానీ డాడీ

విక్రమాదిత్య : తమ్ముడిని చెల్లిని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాను, నువ్వు మాత్రం ఒక్క దానివే ఉండాలి. హాస్టల్లో వేస్తాను. ఇక నిన్ను కలవడానికి ఎవ్వరు రారు.

కావ్య : అలా మాట్లాడకు, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను.

విక్రమాదిత్య : నా బుజ్జి తల్లి కదా, అవసరం వచ్చిందిరా నా మాటలు జ్ఞాపకం పెట్టుకో నన్ను కానీ నాకు సంబంధించిన వాళ్ళు ఈ తెగ వాళ్ళు కావచ్చు అమ్మ కావచ్చు నానమ్మ కావచ్చు ఆఖరికి నీ తమ్ముళ్లని కూడా కలవడానికి వీలు లేదు. తమ్ముడు చెల్లి ఎక్కడున్నారో నీకు తెలుస్తుంది. కానీ కలవద్దు. నువ్వు ఎవరిని కలిసినా ప్రమాదమే జరుగుతుంది అది గుర్తు పెట్టుకో.

కావ్య : నేను కలిస్తే వాళ్ళకి ఎందుకు ప్రమాదం.

విక్రమాదిత్య : వాళ్ళకి కాదు నీకు నీ తమ్ముడు చెల్లెలికి. నువ్వు ఎవరిని కలిసినా నాకు కూడా ప్రమాదమే. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నేను అమ్మా కనీసం బతికి ఉంటాం తల్లి.

కావ్య : లేదు వెళ్ళిపోతాను. అని మౌనంగానే ఏడ్చేసాను.

విక్రమాదిత్య : గుర్తుంచుకో వీళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్లి వదిలేస్తున్నాను. నీగురించి ఎవ్వరికి తెలియనివ్వకు ఎవ్వరికి చెప్పొద్దు సరేనా. నా మీద ఒట్టు వేయి.

కావ్య : ఒట్టు

ఆ రోజంతా అమ్మా నాన్నా నాతోనే ఉన్నారు రాజుని సరితని ఎవరికో అప్పగించారు. నన్ను అమ్మా నాన్న ఇద్దరు దూరంగా తీసుకొచ్చి అనాధ ఆశ్రమంలో చేర్చారు. అమ్మ భుజం మీద చెయ్యి వేసి నాన్న మాట్లాడుతుంటే విన్నాను.

అనురాధ : మనకే ఎందుకు ఇలా జరుగుతుంది.

విక్రమాదిత్య : లేదు ఇదంతా నా వల్ల జరుగుతుంది. ఒక్క సారి గుర్తుతెచ్చుకో నేను నీ లైఫ్ లోకి రాకముందు నీకు అవమానాలు మాత్రమే ఉండేవి కానీ నువ్వు చాలా సంతోషంగానే ఉండేదానివి నేను వచ్చాకే మీ అమ్మా నాన్న నుంచి నీ కుటుంబం నుంచి దూరం అయిపోయావు. నా చేతులతోనే మీ వాళ్ళని చంపేసాను. నాతో పాటు ముడిపడి ఉన్న ఎవరి జీవితాలు అయినా సరే, అయితే చచ్చిపోయారు మిగిలిన వాళ్ళకి బాధలు తప్పించి ఏమి మిగలలేదు. అమ్మ, నువ్వు, మానస, రాజు, రవి, పూజ, సునిల్ గారు, మీ వాళ్ళు నా వాళ్ళు నా చేతులతో ఎంత మందిని పొట్టనబెట్టుకున్నానో నాకే తెలుసు. వీళ్ళనైనా ప్రశాంతంగా వీటన్నిటికీ దూరంగా బతకనీ

అనురాధ : రాజు సరిత సరే కానీ కావ్య ఎలా, తనకి మాటలు కూడా రావు. ఒక్కటే ఎలా చిన్న పిల్ల

విక్రమాదిత్య : అది నా కూతురు, కొన్ని కష్టాలు తప్పవు కానీ మనతో ఉండి వచ్చే బాధల కంటే అవే నయం. కొత్త జీవితంలో ఎన్నో ఆనందాలు చూస్తుంది. భయపడకు నాకు నమ్మకముంది.

అనురాధ : ఇప్పుడు ఏమయిందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు.

విక్రమాదిత్య : ఎప్పుడో తీసుకున్నాను, కానీ ఇంత త్వరగా ఆ పరిస్థితి వస్తుందని ఊహించలేదు, ఎక్కడో తేడా కొడుతుంది అను.. కొడుకులు మానస్, శశి ఇద్దరి ప్రవర్తనలో మార్పులు. నాకు తెలీకుండా ఏదో జరుగుతుంది. అందుకే ఇదంతా.. నాకు పని ఉంది నువ్వు కావ్యని వదిలేసి ఇంటికి వెళ్ళిపో నేను మళ్ళీ కలుస్తాను.

ఆ తరువాత అమ్మ నేను ఇద్దరం కలిసి ఫ్లైట్ లో హైదరాబాద్ తీసుకొచ్చింది, ఎవరితోనో మాట్లాడి నన్ను చూసి గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.

కావ్య : మమ్మీ

అనురాధ : హ్మ్..

కావ్య : ఏడవకు, నువ్వేడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది.

అనురాధ : ఏడవట్లేదు తల్లి, నేను బానే ఉన్నాను. నువ్వు మాత్రం జాగ్రత్త. బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి మంచి ఫ్రెండ్స్ ని సంపాదించుకోవాలి.

కావ్య : నన్ను మర్చిపోవుగా

అనురాధ : లేదు తల్లి.. డాడీ చెప్పినట్టు ప్రొబ్లెమ్స్ అన్ని తీరిపోగానే నేనే వచ్చి నా దెగ్గరికి తీసుకెళతాను. సరేనా

కావ్య : వెళ్ళిపోతున్నావా

అనురాధ : ఏడవద్దు నాన్నా

కావ్య : నువ్వే ఏడుస్తున్నావ్ అని కళ్ళు తుడిచాను. ఒక్కసారి డాడీతో మాట్లాడించు.

అనురాధ వెంటనే ఫోన్ చేసింది.

అనురాధ : నువ్వు ఇందుకే రాలేదు కదా

విక్రమాదిత్య : దాని ముందుకు ఏడవకు, ప్లీజ్..

అనురాధ : ఇదిగో మాట్లాడు.

కావ్య : డాడీ అమ్మ ఏడుస్తుంది, నేను హ్యాపీగానే ఉంటాను. ప్రాబ్లెమ్స్ తీరాక వస్తావు కదా.. చెప్పు డాడీ వస్తావు కదా

అనురాధ : నేను చెప్తున్నా కద బంగారం.. కచ్చితంగా నీకోసం వస్తాను. నీకింకో సీక్రెట్ చెప్పనా.. ఒక వేళ నీకోసం నేను రాలేదనుకో.. నీ కోసం ఒక స్పెషల్ పర్సన్ వస్తుంది.

కావ్య : ఎవరు?

అనురాధ : చెప్పుకో చూద్దాం

కావ్య : అబ్బా చెప్పు మమ్మీ

అనురాధ : నీ దెగ్గరికి మీ అక్క వస్తుంది.

కావ్య : అక్కా ఎవరు?

అనురాధ : ఇదిగో తనే అని ఫోన్ తీసి ఫోటో చూపించింది.

కావ్య : ఓ.. ఎవరు తను

అనురాధ : తను పుట్టిన తరువాతే నువ్వు పుట్టావు. నీ సొంత అక్క

కావ్య : పేరేంటి

అనురాధ : రక్ష

కావ్య : నిజంగా నాకోసం వస్తుందా

అనురాధ : కచ్చితంగా, నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాబ్లెమ్ లో ఉన్నా వచ్చి నిన్ను తనతో పాటు తీసుకెళుతుంది. ఆపద వచ్చిందంటే చాలు మీ ముందు ఉంటుంది. నిన్నే కాదు తమ్ముడిని చెల్లిని కూడా కాపాడుతుంది.

కావ్య : అవునా

అనురాధ : అవును తల్లి.. ఎంత మందిని అయినా కొట్టగలదు.. ఎలాంటి ప్రాబ్లెమ్ అయినా సాల్వ్ చేస్తుంది.

కావ్య : మరీ ఇప్పుడు డాడీకి వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యమని చెప్పలేదా

అనురాధ : అంటే ఇప్పుడు చిన్నా పిల్ల కదా.. కానీ రేపు పెద్దయ్యాక చూడు నేను చెప్పింది నువ్వే నమ్ముతావు

కావ్య : నా దెగ్గరికి ఎప్పుడు వస్తుంది.

అనురాధ : అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా నీ ముందుకు వస్తుంది. నీ ముందు నిలబడుతుంది. టైం అవుతుంది బంగారం లోపలికి వెళతావా

కావ్య : ఎందుకో ఏడుపు వస్తుంది మమ్మీ అనగానే అనురాధ గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది.

అనురాధ : ఇదిగో ఈ మేడం ఉంది కదా నీకు మా గురించి చెప్తుంది అలానే తమ్ముడు చెల్లి ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్ని చెప్తుంది సరేనా

సంధ్య : సరే బై మమ్మీ, ఫోన్ తీసుకుని బై డాడీ ఐ లవ్ యు అని ఫోన్ అనురాధకి ఇచ్చేసి మేడం చెయ్యి పట్టుకుని లోపలికి నడిచాను అదే నేను అమ్మని చివరిగా చూసింది. నాకోసం ఎవ్వరు రాలేదు నేను ఎవ్వరి కోసం వెతకలేదు. ఆ తరువాత నా చదువులో పడిపోయాను మూగదాన్ని అవడం వల్ల అందరికంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మీ నాన్న పరిచయం అవడం కొత్త ఆనందాలు, నువ్వు పుట్టాక ఇక అస్సలు గతం గురించి ఆలోచన కూడా చెయ్యలేదు. ఎప్పుడైనా రాజుని సరితని చూడాలనిపిస్తే నువ్వు లేనప్పుడు అలా వెళ్లి చూసి వచ్చేదాన్ని.

మెలుకువ వచ్చిన అక్షిత ఇదంతా మౌనంగా వింటూ కళ్ళు తుడుచుకుంది.

________________________________________________________

అంబులెన్సుని బెంగుళూరు నుంచి కేరళ హైవే మీదకి ఎక్కించాడు సుబ్బు. ఆవేరేజ్ స్పీడ్ లో బాగానే వెళుతున్నాడు.

సుబ్బు : పోయి పోయి బెంగుళూరే రావాలా నేను, శత్రువులంతా ఇక్కడే ఉన్నారట. అయినా ఇంత అందంగా సుకుమారంగా ఉంది. ఈ అమ్మాయికి ఇంత మంది శత్రువులున్నారా.. తనని చూసాను.. రక్ష గారు కేరళ ఎలా ఉంటుందో చూద్దామా, ఆటే వెళుతున్నాం. ఎలాగో తిరగడమే పని కాబట్టి నేను టూర్ ప్లాన్ చేస్తా.. నేను చెప్తూ ఉంటాను మీరు వినండి. వినపడుతుందా వినపడుతుందిలే.. మా అమ్మ చనిపోయాక కూడా నేను తనతో మాట్లాడాను తెలుసా.. మనిషి పోయాక ఆత్మ అప్పుడే పోదట అందుకే మా అమ్మతో మాట్లాడాను.. మీరు కోమాలోనే కదా ఉంది.. మీ ఆత్మ మీ బాడీలో ఉందా లేక ఇక్కడే పక్క సీట్లో కూర్చున్నారా లేదా బాడీలోనే ఉన్నారా.. సరే ఏదైతే ఏంటి.

ఇవ్వాళ మీకు నాకు, flames రాసాను.. L  వచ్చింది అంటే అర్ధం తెలుసా.. మీరు నేను లవర్స్ అని.. అయినా మీరు అక్షిత తాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను ఎంత ఏడిపించిందో తెలుసా.. ఆమ్మో ఆమ్మో కంత్రి మీ అక్షిత. నన్ను లవర్ అని మూడేళ్లు బానిసలాగా వాడుకుంది.. ముందే చెప్పింది లెండి లవ్ కాదు.. ఫ్రెండ్ అయితే ఓకే అని కానీ నేనే మూడేళ్ళ టైం ఉంది కదా అని ఓకే చెప్పా.. అయినా పడలేదు ఆ మహాతల్లి. కొంచెం మీరైనా పడండి నా లైఫ్ సెట్ అయిపోతుంది. ముందు ఆకలేస్తుంది ఏమైనా తిందాం అని రక్ష తో మాట్లాడుతూనే దోస బండి దెగ్గర ఆపి తినేసాను.

ఫోన్ మోగింది.. చూస్తే ఏదో అన్నోన్ నెంబర్

సుబ్బు : హలో

చిన్నా : రేయి ఎవడ్రా నువ్వు నా కార్డు ఇష్టం వచ్చినట్టు గీకుతున్నావ్, నా పేరు మీద కార్ కూడా కొన్నారు. ఇది అక్షితకి ఇచ్చిన కార్డు.. నీ నెంబర్ ఇచ్చింది.. ట్రాక్ చేస్తే.. ఇండియా మొత్తం తిరుగుతూనే ఉన్నావ్. హైదరాబాద్ నుంచి బెంగుళూరు పోయావ్ మళ్ళీ నేరుగా పోకుండా తిరుపతి పొయ్యవ్ అక్కడనుంచి శివామోగ్గ అక్కడ నుంచి మంగళూరు పొయ్యి బెంగుళూరు సెంటర్ పొయ్యవ్ మళ్ళీ వెనక్కి వచ్చి మైసూరు పోయావ్ ఇప్పుడు కోయంబత్తురు వెళ్లి రోడ్ మీద దోస తింటూ కుర్చున్నావ్.

సుబ్బు : ఇంత కరెక్టుగా చెపుతున్నావ్ ఎవరు భయ్యా నువ్వు

చిన్నా : చిరంజీవి

సుబ్బు : భయ్యా నువ్వా, అక్షిత హస్బెండ్ మీరే కదా

చిన్నా : హస్బెండా.. ఆ.. నేనే

సుబ్బు : తనే ఇచ్చింది ఆ బ్లాక్ కలర్ కారు సంగతి నాకు తెలీదు భయ్యో.. దాని ఫ్రంట్ సస్పెన్షన్ పోడానికి నాకు అస్సలు సంబంధం లేదు.

చిన్నా : అక్షిత ఎక్కడుంది

సుబ్బు : ఏమో నాకు తెలీదు, తన ఫ్రెండ్ ని సేఫ్ గా ఉంచమంది ఎవరో ఫాలో అవుతారు ఆగకుండా తిరుగుతూ ఉండమని చెప్పింది. నాకు తెలియక నేను బెంగుళూరుకే తీసుకొచ్చా ఇక్కడుంటే ప్రమాదమని వెళ్లిపొమ్మంది అందుకే అక్కడ నుంచి తిరుగుతూ కేరళ వచ్చాను.

చిన్నా : నువ్వు మళ్ళీ తప్పు చేసావు, నీకా విషయం తెలుసా

సుబ్బు : ఏమైంది?

చిన్నా : అక్షిత కేరళ లోనే ఉంది, చివరిసారిగా నాకు ఇక్కడి నుంచే ఫోన్ వచ్చింది.

సుబ్బు : (హాహా) అలాగ, సరే భయ్యా ఇందాకటి నుంచి ఒకటే సౌండ్, గోల గోలగా ఏదో ఫ్యాక్టరీలో ఉన్నట్టు ఏంటది?

చిన్నా : ఫోన్ తీసి ఒకసారి పైకి చూడు.

సుబ్బు తల ఎత్తి చూసాడు గాల్లో హెలికాప్టర్ ఒకటి సుబ్బు చూస్తుండగానే రోడ్ మీదే ల్యాండ్ అయ్యింది, చిన్నా అందులోనుంచి దిగి నడుచుకుంటూ వచ్చాడు. హెలికాప్టర్ మళ్ళీ వెళ్ళిపోయింది. చిన్నా టీ షర్ట్ లో నడిచి వస్తుంటే ఆ హైట్ ఆ కండలు ఆ పర్సనాలిటీ చూసేసరికి వార్ సినిమాలో హృతిక్ రోషన్ గుర్తు వచ్చాడు కానీ ఈయన మరీ అంత లేడులే కానీ బాగున్నాడు.

చిన్నా : ఏంటి అలా చూస్తున్నావ్

సుబ్బు : నువ్వు ఏజెంటా భయ్యా

చిన్నా : ఎందుకలా అడిగావు

సుబ్బు : ఏం లేదు అలా అనిపించింది అంతే.

చిన్నా : వెళదామా

సుబ్బు : దోస బాగుంది ఇంకోటి తిని వెళదాం. నీక్కూడా చెప్పనా మొహమాట పడకు భయ్యా డబ్బులు నీవేగా

చిన్నా నవ్వుతూ సుబ్బుని చూసాడు.
Like Reply
Super bro k....keepitup
[+] 1 user Likes Zixer's post
Like Reply
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
Super bro mari vasu emi ayadu and lavanya emi chesthundhi
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
అప్డేట్ స్టార్టింగ్ లో మొత్తం ఎమోషనల్ గా అనిపించినా.....సబ్బు రాగానే ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేసింది.... అలా వుంటది మరి సబ్బు అంటే.... చిన్నా కూడా వచ్చాడు....ఇంకా వాసు ఎక్కడ ఉన్నాడో.... అయినా వీళ్ళందరూ వాళ్ళని ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి.....
ఇంకా ఆ ముసల్ది ఎవరో తెలియాల్సి వుంది.....
అప్డేట్ కి ధన్యవాదాలు  Namaskar
[+] 4 users Like Thorlove's post
Like Reply
Super update bro ❤❤ waiting fir another updates
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Super update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply




Users browsing this thread: 20 Guest(s)