Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సుబ్బిగాడు ≠ World Famous Lover
మానస : వాడు ఫోన్ ఎత్తట్లేదు 

విక్రమ్ : అయినా రెండు రోజులన్నాడు కదా పోదాంలే చిన్నగా 

మానస : జోకులుగా ఉందా నీకు, ఆదిత్య తన ఫ్రెండ్ అరవింద్ ఉన్నాడు కదా తనకి కాల్ చెయ్యి.

ఆదిత్య : రింగ్ అవుతుంది ఇదిగో..

అరవింద్ : హలో..

మానస : అరవింద్ నేను మానస, ఎం జరుగుతుంది అక్కడా సుబ్బు పనేనా 

అరవింద్ : సుబ్బునే 

మానస : ఎక్కడున్నాడు

అరవింద్ : నా ఇంట్లోనే ఉన్నాడు, ఎల్లుండి ప్రోగ్రాంకి రెడీ అవుతున్నాడు.

మానస : ఏంటి మా నాన్నని చంపుతుంటే నీకు అది ప్రోగ్రాంలా ఉందా అనగానే ఇటు విక్రమ్ తో పాటు ఆదిత్య కూడా నవ్వాడు.. మానస కోపంగా చూసి మేము వస్తున్నాం వాడిని అక్కడే ఉండమని చెప్పు.. అని ఫోన్ పెట్టేసింది.

నలుగురు హైదరాబాద్ బైలుదేరారు గంటన్నరలో చేరుకొని నేరుగా అరవింద్ ఇంటికి వెళ్లారు. ఇల్లు చూస్తూనే ఒక్కొక్కళ్ళకి కళ్ళు తిరిగినంత పని అయ్యింది.

అను : ఇది ఇల్లా ఏదైనా పాలస్సా ఎంత పెద్దది వావ్

మానస : మా నాన్న చెపితే ఏమో అనుకున్నాను కానీ ఈ అరవింద్ దెగ్గర చాలా డబ్బులున్నట్టున్నాయి, ఇంత పెద్ద ఇల్లా

విక్రమ్ : పోనీ మీ నాన్న సంబంధం తెచ్చాడు కదా అప్పుడే ఒప్పుకోవాల్సింది.

అను : మాడిపోయిన వాసన బాగా వస్తుందే 

మానస : కదా అస్సలు ఎవరినైనా ఇంత పొగిడితే చాలు.. ఎంత కోపమో..

విక్రమ్ : నోరు మూసుకుని పదా 

అరవింద్ ఎదురు వచ్చి అందరిని లోపలికి తీసుకెళ్లాడు అప్పటికే చీకటి పడింది. అందరూ లోపలికి వెళ్లి కూర్చున్నారు.

మానస : సుబ్బు ఎక్కడా

అరవింద్ : మీరు వస్తున్నారని తెలిసి వెళ్ళిపోయాడు.

మానస : (లేచి నిలబడి) మరి ఇప్పుడు ఎలాగా 

అరవింద్ : మరేం పరవాలేదు మీ నాన్నని ఎప్పుడు చంపుతాడో నాకు తెలుసు 

మానస : ఎప్పుడు

అరవింద్ : రేపు క్రికెట్ గ్రౌండ్ లో మీ నాన్న ఫ్రెండ్లీ పొలిటిషన్స్ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళుతున్నాడు అక్కడ గ్రౌండ్లోనే .. రేపు పదింటికి.

మానస : వెపన్స్ ఆ....!

అరవింద్ : లేదనుకుంటా కార్ ఎక్కించేస్తాడేమో 

ఆదిత్య పుసుక్కున నవ్వాడు, అది చూసి విక్రమ్ కూడా నవ్వాడు..అరవింద్ కూడా నవ్వబోతుంటే మానస అందరిని కోపంగా చూసింది.

విక్రమ్ లేచి నిల్చొని : అరవింద్ రేపు మన సుబ్బు కార్ తో గుద్ది చంపుతాడా లేక ఆపి కార్ దిగి చంపుతాడా..  అంటే కార్ తో గుద్దితే బతికే అవకాశాలు ఉంటాయేమో చూసుకోమని నా మాటగా సుబ్బుకి చెప్పు.

అరవింద్ : నేనూ అదే చెప్పా బాంబు పెట్టి పేల్చేద్దాం లేకపోతే సుపారీ ఇద్దాం అని నా మాట వింటేగా అని నోరు జారీ తరువాత ఎం వాగాడో తెలుసుకుని మానసని చూసాడు.

విక్రమ్ ఆదిత్య నవ్వుతుంటే పక్కనే ఉన్న దిండు తీసి వాళ్ళ మీదకి విసిరింది.. కోపంగా

మానస : అయన ఒకప్పుడు చెడ్డవాడే కానీ ఆదిత్య దెబ్బకి అన్ని వదిలేసాడు, నా పెళ్లి అయ్యాక ఇంట్లోనే ఉంటున్నాడట. ఆయన మారిపోయాడంటే నమ్మరే 

అరవింద్ : సుబ్బు గాడు అమ్మాయిల వెనకపడటం ఆపేసాను అనటం  మీ నాన్న మంచివాడు అనటం ఈ రెండు జీర్ణించుకోలేని విషయాలు.

మానస : ఇప్పుడు మా నాన్నని కాపాడతారా లేదా 

అరవింద్ : అవసరం లేదు వాడు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు 

మానస : ఎవ్వరికి 

అరవింద్ : శరణ్యకి, దమ్ముంటే కాపాడుకొమ్మని ఛాలెంజ్ చేసాడు.

ఆదిత్య : సుబ్బు గాడికి ఇంత ధైర్యమా.. అబ్బో.. అయితే చూడాస్లిందే

మానస : శరణ్య అంటే తన మరదలే కదా.. తను...

అరవింద్ : IPS శరణ్య మీ నాన్నతో చేతులు కలిపి వాడిని పట్టించింది.. తను కూడా తప్పుడు మార్గాల్లోనే వెళుతుంది. రేపు సుబ్బు ఎం చేస్తాడో ఏంటో చూడాలి.. ఏం ప్రసాదు 

ప్రసాద్ : అవును సర్ 

మానస : సొంత బావనే ట్రాప్ చేసిందా, డబ్బు కోసం ఏమైనా చేస్తారా

అరవింద్ : ఈ నైట్ ఇక్కడే పడుకోండి పొద్దున్నే వెళ్లి ఆ మ్యాచ్ చూద్దురు మల్లయ్య ఏర్పాట్లు చూడు.. మీలో ఎవరైనా మందు వేస్తారా ఉంటె వచ్చేయండి. అనగానే ఆదిత్య లెచాడు.

అనురాధ : ఒరేయి మందు అంటే చాలు హుషారు వచ్చేస్తుంది.. కూర్చో

ఆదిత్య : ప్లీజ్ బంగారం.. ఈ ఒక్క రోజే 

అరవింద్ : అన్ని ఇంపోర్టెడ్ మా ఫ్రెండ్ దుబాయ్ నుంచి పంపించాడు ఎప్పటినుంచో టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఉండడం వల్ల అక్కషన్ కుదిరింది.. మీరు కావాలనుకున్నా మళ్ళీ ఇక్కడెక్కడా దొరకదు అనగానే విక్రమ్ కూడా లేచి నిలబడ్డాడు 

మానస : విక్రమ్ ఏంటిది.. కూర్చో.. పరువు తీయ్యకు

విక్రమ్ : ఊరోళ్లం కదా.. ఎప్పుడైనా కొంచెం అంతే.. ఇంపోర్టెడ్ అంట మళ్ళి మళ్ళి మనం కొనుక్కోలేం ఒక్కసారి అలా వెళ్ళి ట్రై చేసి ఇలా వచ్చేస్తాను బంగారం.. ప్లీజ్ ప్లీజ్..

ఆదిత్య : అయినా అరవింద్ పరాయివాడా మన సుబ్బు ఫ్రెండ్ అంటే మన ఫ్రెండ్ పిలిచినప్పుడు వెళ్లకపోతే పెద్దింటివాళ్ళు ఫీల్ అవుతారు.. ఎం అరవింద్.

అరవింద్ నవ్వుతు : అవును.. మీరు కూడా రండి చిన్న బార్ రూమ్ ఉంది. ఆ పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి.

అను : బైట ఒకటి ఉంది కదా 

అరవింద్ : అది బైటిది.. ఇది ఇంట్లోది లేడీస్ కోసం మాత్రమే.. మీకు ఏ డిస్టర్బన్స్ ఉండదు.. ఏమైనా కావాలంటే ప్రియా ఉంది తను చూసుకుంటుంది.. ప్రియా ప్రియా 

ప్రియా : అన్నయ 

అరవింద్ : మేడం వాళ్ళని చూసుకో మేము అలా వెళ్లి వస్తాం.. ముందు ఏమైనా తినండి ఆ తరువాత ఎంజాయి చెయ్యండి.. ప్రసాద్ రావోయి నీకు సెపెరేట్ గా చెప్పాలా 

ప్రసాద్ : సర్ నేను మీతో 

అరవింద్ : గ్లాస్ లేవదా ఏంటి.. అని నవ్వాడు.. ప్రసాద్ కూడా వాళ్ళతో పాటే లోపలికి వెళ్ళాడు.


>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

తెల్లారే మానస అందరినీ లేపింది.. తన నాన్నకి ఫోన్ చేద్దామని ఫోన్ తీసి మళ్ళీ ఆలోచిస్తూ కూర్చుంది. విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి చూడటంతో మళ్ళీ ఫోన్ చేసింది.

మానస : హలో నాన్నా

శివరాం : ఇన్ని రోజులకి గాని నన్ను క్షమించలేక పోయావా, తప్పులన్నీ ఒప్పుకున్నానుగా

మానస : వాడు మీ కోసం వస్తున్నాడు.

శివరాం : తెలుసు, తప్పు నాదే తన అమ్మని తిట్టాను.. ఏడ్చాడు కానీ ఇంత సీరియస్ గా తీసుకుంటాడు అనుకోలేదు.. క్షమాపణలు చెపుతాను.

మానస : వాడు అస్సలు మమ్మల్ని కలవలేదు, కలవడు కూడా జాగ్రత్త. నేను వస్తున్నాను.

శివరాం : లేదు వద్దు నిన్నేమైనా చేస్తాద్లాడేమో

మానస : ఆ భయం అక్కర్లేదు, కానీ నాన్న నువ్వు నిజంగానే మారిపోయావా.. నిన్ను చులకనగా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది, ఈ సారి తేడా వస్తే ఆదిత్య నుంచి నేను నిన్ను కాపాడలేను.

శివరాం : లేదమ్మా నేను మారిపోయాను, నాకు పని ఇచ్చే వాళ్ళ ఫోన్ కూడా ఎత్తడం లేదు.. అన్ని మానేసి ఇంట్లోనే ఉంటున్నాను.

మానస : మీరు గ్రౌండ్ కి వెళ్ళకండి

శివరాం : లేదు వెళతాను, ఒక వేళ ఆ అబ్బాయి అవకాశం ఇస్తే ఆ అబ్బాయికి క్షమాపణలు చెపుతాను.. నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసాడు.

అందరూ గ్రౌండ్ కి వెళ్లారు శివరాం మ్యాచ్ లో పాల్గొనడానికి అందరితో పాటు గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు, చీఫ్ గెస్ట్ గా, IAS శృతి వచ్చింది. అప్పటికే శరణ్య చుట్టు వెహికల్స్ తో బందొబస్తుతో రెడీగా ఉంది, ఇంకో వైపు విక్రమ్ అలెర్ట్ గా ఉన్నాడు, ఆదిత్య మాత్రం తడిగుడ్డ ఏసుకుని చైర్ లో కూర్చుని పడుకున్నాడు.

విక్రమ్ : రేయి ఇప్పుడు పడుకున్నావేంటి

ఆదిత్య : నా వల్ల కాదు, సుబ్బు గాడు కామెడీ చేస్తాడు అని తెలుసు, కానీ వాడు సీరియస్ అయితే ఎలా ఆలోచిస్తాడో మనకేం తెలుసు, అంతగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడంటే వాడి జీవితంలో ఎంత కోల్పోయి ఉంటాడు, ఎన్నెన్ని చూసి ఉంటాడు.. మాములుగా అయితే బూతులు తిడితే తిరిగి తిట్టొ లేక కొట్టొ వదిలేస్తారు కానీ వాళ్ళ అమ్మని అనగానే ఒక మనిషిని చంపేంత కోపం వచ్చిందంటే వాడి సర్వసం వాడి ఎమోషన్ వాళ్ళ అమ్మే అయ్యుండాలి.. సారీ నేను వాడికి అడ్డు రాను... నా సలహా నువ్వు కూడా మెలకుండా కూర్చో.. అనగానే అప్పుడే అటు వచ్చిన మానస, అరవింద్ ఇద్దరు ఆ మాటలు విన్నారు.

విక్రమ్ : మానస అదేం లేదు..

మానస : ఆదిత్య నిజమే చెప్పాడేమో... అని కళ్ళలో నీళ్లు తెచ్చుకుంది.

ఇంతలో అరవింద్ మాట్లాడగానే అందరూ తన వైపు చూసారు.

అరవింద్ : అవును, నేను వాడిని కలిసింది వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాకే.. మొదట్లో ఎప్పుడు ఒంటరిగా కూర్చునేవాడు నాలుగేళ్లు పట్టింది నాతో కాకుండా వాడు వేరే వాళ్ళతో మాట్లాడడానికి.. మొదట్లో ఎప్పుడు వాళ్ళ అమ్మనే గుర్తు చేసుకుంటూ ఉండేవాడు ఆ తరువాత మాత్రం అన్నిటికి నవ్వే వాడు. ఏమైందిరా అంటే హాస్పిటల్లో వాళ్ళ అమ్మ చివరి నిమిషంలో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని మాట తీసుకుందట.. మర్చిపోయా.. ఇన్నేళ్లు మా అమ్మ లేదన్న బాధలో అని చెప్పి ఆప్పటి నుంచి వాడికి ఆనందం వేసినా బాధ ఒచ్చినా ఏమైనా ఒక్కడే ఒంటరిగా కూర్చుని తన పర్సులో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ కూర్చుంటాడు. అందుకే సుబ్బు అస్సలు ఎవ్వరి మాట వినట్లేదు ఆవేశంలో ఉన్నవాడైతే కొంత సేపటికి తగ్గిపోయి ఆగిపోతాడు కానీ వీడు అలా కాదు.


ఇంతలో ఆదిత్య కంటికి ఒక చిన్న పిల్లవాడు అన్ని కార్ల వెనుక ఏదో బూచక్రం ఆకారంలో ఉండే దాన్ని ప్రతీ కారుకి తగిలిస్తుండడం చూసి అటు వైపు పరిగెత్తాడు, అందరూ ఆదిత్య వైపు చూసేసరికి ఆదిత్య ఆ పిల్లవాడి చొక్కా గట్టిగా పట్టుకుని వాడి చేతిలో ఉన్న దాన్ని లాక్కున్నాడు అది మాగ్నెట్ లాఉంది మధ్యలో చిన్న లైట్.. అందరూ ఆదిత్య వైపు వెళ్లారు.

ఒక్క నిమిషానికి శరణ్య కూడా గుంపుగా ఉండడం గమనించి అటు వైపు వెళ్ళింది, ఈలోగా ఒక పెద్ద విజిల్ వినిపించే సరికి అందరూ అటువైపు చూసారు గ్రౌండ్ ఫెన్సింగ్ బైట ఒక నల్లటి కారు ముందు పెద్దగా రాడ్లతో బంపర్, చూస్తే అందులో సుబ్బు ఇంకా విజిల్ వేస్తూనే ఉన్నాడు. ఆదిత్య  సుబ్బుని చూస్తూనే పట్టుకున్న పిల్లాడిని వదిలేసాడు, వాడు పారిపోగానే సుబ్బు విజిల్ ఆపేసి చేతిలోకి రిమోట్ తీసుకున్నాడు, అది చుసిన ఆదిత్యకి అర్ధం అయ్యి వెంటనే చేతిలో ఉన్న దాన్ని పక్కకి విసిరేసాడు అది ఆఖరి కారు కిందకి వెళ్లి పడింది. మానస సుబ్బునే చూస్తుంటే సుబ్బు రిమోట్ నొక్కేసాడు. అంతే.. అక్కడున్న ప్రతీ ఒక్క కారుకి కరెంటు షాక్ కొట్టినట్టు అద్దాలు పేలిపోయి సౌండ్స్ వచ్చాయి. వెంటనే సుబ్బు కారు నుంచి పెద్ద సౌండ్..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
సుబ్బు కారు వేగంగా దూసుకుంటూ సెక్యూరిటీని గుద్దేసి లోపలికి వచ్చింది, గట్టిగా హారన్ కొట్టాడు అందరూ భయంతో పారిపోతుంటే కూర్చున్న కుర్చీలనుంచి ఒక పది మంది మనుషుల వరకు గుద్దుకుంటూ ముందుకు వెళ్ళాడు. అందరూ పారిపోయారు కానీ శివరాం మాత్రం ఒక్కడే గ్రౌండ్ లో నిల్చొని ఉన్నాడు. సుబ్బు శివరాంని చూసి ఇంకా స్పీడ్ పెంచాడు, ఇంతలో విక్రమ్ ఒక పెద్ద బొంగు తీసుకుని కారు మీదకి విసిరాడు. సుబ్బు కనీసం దాన్ని పట్టించుకోకుండా డ్రిఫ్ట్ చేస్తూ ఐదో గేరు నుంచి ఒకేసారి మూడో గేర్లోకి మార్చి గట్టిగా ఆక్సిలరేటర్ మీద తొక్కి పట్టాడు.. ముందు రెండు టైర్లు గాల్లోకి లేచి ముందుకు దూకి ఇంకా వేగంగా పెద్ద శబ్దం చేస్తూ శివరాం ముందుకు వెళ్ళింది..

అరవింద్ : సుబ్బు...

అను అయోమయంగా చూస్తుండగానే..

స్టేజి మీద నుంచి శృతి లేచి నిలబడి చూస్తుంది

శరణ్య ఇంకా షాక్ లోనే ఉంది

ఇంకొక్క సెకండ్ అనగా శివరాం ముందు మానస అడ్డంగా నిలబడి భయంతో కళ్ళు మూసుకుంది..

విక్రమ్ : మాన.... స్....ఆ.. అ..

సుబ్బు వెంటనే హ్యాండ్ బ్రేక్ గట్టిగా పైకి లాగి, స్టీరింగ్ మొత్తం పక్కకి తిప్పేసి అక్కడే ఉన్న ఒకటిన్నర అడుగు బండ మీదకి పోనించాడు కింద కాలు మొత్తం బలంగా బ్రేక్ మీద తొక్కుతూ.. చూస్తుండగానే సుబ్బు కారు మానస, శివరాం మీదుగా గాల్లోనే ఒక పల్టీ కొట్టి నేల మీద ల్యాండ్ అయ్యి ఆగిపోయింది.. సుబ్బు వెంటనే తేరుకుని కారులోనుంచి బైటికి వచ్చి మానసని ఒక్క నెట్టు నెట్టి శివరాం మీదకి దూకి దవడ మీదే పిడిగుద్దులు గుద్దడం మొదలు పెట్టాడు.. సుబ్బు మొహం మీద గుద్దుతుంటే శివరాం చిన్నగా కింద పడిపోతుంటే అప్పటికే అక్కడికి చేరుకున్న ఆదిత్య విక్రమ్ ఇద్దరు కలిసి సుబ్బుని పక్కకి లాగాడు.. సుబ్బు వెంటనే ఆదిత్య మొహం మీద గుద్దుతుంటే ఆదిత్య మూడు గుద్దులని ఓర్చుకుని నాలుగో గుద్దు తప్పించుకుని మొహం మీద ఒక్కటి పీకాడు.. సుబ్బు కింద పడి లేచి చూసేసరికి అప్పటికే సెక్యూరిటీ ఆఫీసర్లు రౌండ్ అప్ చెయ్యడంతో సుబ్బు ఒక్క ఉదుటున వెళ్లి కార్ ఎక్కాడు. ఇంతలో శరణ్య షూట్ చెయ్యబోతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ గాల్లో నుంచి ఒక పుల్ల ఎగురుకుంటూ వచ్చి శరణ్య మెడ మీద గుచ్చుకుంది, శరణ్య స్పృహ తప్పి పోవడంతో అందరూ చూసారు.. ఆ వెంటనే ఇంకో నలుగురు పడిపోగానే అందరూ హడావిడిలో ఉండగా సుబ్బు కార్ అక్కడనుంచి దంచి కొట్టాడు.

అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా విక్రమ్ శరణ్య దెగ్గరికి వెళ్లి తన మెడ మీద ఉన్న పుల్లని గమనిస్తుంటే సెక్యూరిటీ ఆఫీసర్లు చుట్టు ముట్టారు ఈ సారి శృతి అరెస్ట్ చేయించింది అందరినీ.. ఈ సారి ఏం జరగలేదు.

అనురాధ వెంటనే ఫోన్ తీసింది : హలో వాసు అన్నయ్య..

గుంపులో ఎవ్వరికి తెలీకుండా సుబ్బు తప్పించుకోడానికి హెల్ప్ చేసిన ఆ నలుగురు అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. వాసు సాయంతో శృతిని పరిచయం చేసుకుని అక్కడి నుంచి ఇక నేరుగా సంధ్య దెగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుని మానస తన అమ్మా నాన్నని కలిసి అక్కడనుంచి అరవింద్ ని కలిశారు. చీకటి పడింది.

మానస : వాడు రాలేదా

అరవింద్ : ఇంకా లేదు, కానీ వస్తాడు.

మానస : ఆ శరణ్య, ఎలా ఉంది.

అరవింద్ : బానే ఉంది.

మానస : మేము వెళుతున్నాం.. వాడు వస్తే నేను క్షమించానని చెప్పు.. వాడికి నీతో పాటు మేము కూడా ఉన్నామని మర్చిపోవద్దని చెప్పు. అని అక్కడ నుంచి బండి ఎక్కి వెళ్ళిపోయింది.

మానస వాళ్ళు వెళ్ళిపోగానే సుబ్బు అరవింద్ ఇంట్లోకి అడుగుపెడుతూ, మానస కి సారీ అని మెసేజ్ పెట్టాడు. తిరిగి మానస నుంచి మెసేజ్ వచ్చింది చూసి చదివాడు.. సారీ ఫర్ ఎవరీథింగ్.. యువర్ లవ్లీ సిస్టర్.. టేక్ కేర్ అని చదువుకుంటూ లోపలికి వెళ్ళాడు.

అరవింద్ : రేయి ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు.

సుబ్బు : చూసే వచ్చాను, నేను కూడా బైలుదేరుతున్నా నీకు చెప్పి వెళదామని వచ్చాను.

అరవింద్ : ఎక్కడికి

సుబ్బు : ఎక్కడికైనా దూరంగా, నాకు పరిచయం లేని వాళ్ళు నా మొహం తెలిసిన వాళ్ళకి దూరంగా కొన్ని రోజులు ఎటైనా వెళ్ళొస్తాను.

అరవింద్ : మరి శరణ్య

సుబ్బు : శరణ్య లేదు అరణ్య లేదు.. ఇక నా కళ్ళకి నచ్చిన వాళ్ళని కాకుండా మనసుకి నచ్చిన వాళ్ళని వెతుకుతాను.. వెళుతున్నా 

అరవింద్ : డబ్బులు..

సుబ్బు : ఉన్నాయి..

అరవింద్ : జాగ్రత్త అని కౌగిలించుకున్నాడు.

సుబ్బు అక్కడనుంచి బైటికి వచ్చి సందు మలుపు తిరగగానే సుబ్బు మెడ మీద ఒకడు గట్టిగా గొట్టంతో ఊదగానే అందులోనుంచి ఒక పుల్ల వచ్చి సుబ్బు మెడ మీద గుచ్చుకుని సుబ్బు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే సుబ్బుని భుజానికి ఎత్తుకుని చీకటిలో కలిసిపోయారు.


అందులో ఒకడు ఎవరికో ఫోన్ చేసాడు.

""అక్కా మనకి కావాల్సిన వాడు దొరికాడు"

అక్షిత : త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేయండి.. టైం లేదు వాళ్ళు వచ్చేస్తున్నారు..

"అలాగే"

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>


పొద్దు పొద్దునే ఐదు గంటల సమయం.. శివరాం ఇంట్లోకి పది మంది చడిచప్పుడు లేకుండా లోపలికి వెళ్లారు.. పడుకున్న శివరాం దెగ్గరికి వెళ్లి తన పీక మీద కత్తి పెట్టారు.. చిన్నగా కొయ్యగానే శివరాం కళ్ళు తెరిచాడు.

శివరాం : రాబర్ట్..  ప్లీజ్ వదిలేయి.. నేను మీ గురించి ఎవ్వరికి చెప్పలేదు.. నా టైం బాలేక.. ఈ పనులు వదిలేసాను.

రాబర్ట్ : సారీ.. శివరాం.. నిన్ను చంపక పోతే నన్ను చంపేస్తారు.. కావాలంటే నీకొక ఫేవర్ చేస్తాను.. నీ భార్యకి ఏమి తెలియకుండా నొప్పి లేకుండా చంపేస్తాను.. రేయి కానివ్వండ్రా.. అనగానే ఒకడు మంచం దెగ్గరికి వెళ్లి ప్రశాంతంగా పడుకున్న మానస అమ్మ పీక మీద కత్తి పెట్టి ఒక్క వేటు వేసాడు.. శివరాం ఇంకెవరైనా ఉన్నారా ఇంట్లో..

శివరాం : లేరు.. అన్నాడు ఏడుస్తూనే

రాబర్ట్ : రేయి చెక్ చెయ్యండి.. బై శివరాం.. ఆ మర్చిపోయాను ఇన్ని రోజులు మన బాస్ పేరు చెప్పమని అడిగే వాడివి కదా.. మన బాస్ పేరు మానస్... అని తన మీద పెట్టిన కత్తితో శివరాం పీక కోసేసాడు.


రాబర్ట్ మనుషులు ఇల్లంతా వెతికి చివరి రూంలోకి వెళ్లి అక్కడనుంచి బైటికి వస్తుంటే డౌట్ వచ్చి లైట్ వేసాడు.. అక్కడే కింద కూర్చుని ఏడుస్తూ నాని అరవకుండా నోటి మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది పని మనిషి రమ

"బాస్.."

రాబర్ట్ : అరెరే..

రమ : అయ్యా పనోళ్ళం వదిలేయ్యండయ్యా

రాబర్ట్ : సారీ అని మనిషికి సైగ చెయ్యగానే.. ఒకడు రమ వెనక్కి వెళ్లి గొంతు కోసేసాడు.. నానీ ఏడుస్తుంటే చూసి దెగ్గరికి రమ్మన్నాడు.. నీ పేరేంటి?

నాని : నానీ..

రాబర్ట్ : చేతిలో ఈ ipad ఎవరిది..

నాని : నాదే మా అక్క కొనిచ్చింది.

రాబర్ట్ : ఏది చూపించు.. నువ్వు మీ అక్కని చూపిస్తే మీ అమ్మని బతికిస్తా

నానీ ఏడుస్తూనే తన అమ్మ రమని చూస్తూ ipad ఓపెన్ చేసి మానస పెళ్లి ఫోటో చూపించాడు.

రాబర్ట్ : ఇతను ఎవరు?

నాని : మా బావ విక్రమ్.. తను మా అక్క మానస అనగానే నాని గొంతు కోసేసి కింద పారేసి.. ఫోన్ లో ipad లో ఉన్న విక్రమ్ ఫోటో తీసుకుని బైటికి నడిచాడు.. రాబర్ట్ మనుషులు కిచెన్ లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేసి ఒవెన్ ఆన్ చేసి ఓపెన్ చేసి పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు.. ఐదు నిమిషాల్లో ఇల్లు మొత్తం బూడిద అయిపోయింది.

సమాప్తం
❤️❤️❤️
❤️
Like Reply
ఇంతటితో ఈ కధ కూడా ఇక్కడితో ముగిస్తున్నాను
ఇక సాక్ష్యం అయిపోగానే
విక్రమ్ సీజన్ మొదలు పెడతాను
[+] 9 users Like Pallaki's post
Like Reply
(17-10-2022, 12:08 AM)Takulsajal Wrote: సుబ్బు కారు వేగంగా దూసుకుంటూ సెక్యూరిటీని గుద్దేసి లోపలికి వచ్చింది, గట్టిగా హారన్ కొట్టాడు అందరూ భయంతో పారిపోతుంటే కూర్చున్న కుర్చీలనుంచి ఒక పది మంది మనుషుల వరకు గుద్దుకుంటూ ముందుకు వెళ్ళాడు. అందరూ 
Ayyo..Manasa's whole family was killed..didn't expect this..
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
Namaskar
yourock
clps
thanks
వా..............వ్ సుబ్బు!!!!!!!!!!!!!!!!


చాలా తెలివైన సుబ్బు గుండెల్లో తన భాదనంతా దాచుకొని పైకి తమాషా చేస్తు గడిపేసున్నాడు. Sad
చిన్నప్పుడే తల్లి తన కళ్ళ ముందే రక్త మడుగులో (అని నాకు గుర్తు) కాదు హాస్పెటల్లో అని ఇప్పుడే తెలుసుకున్నా.
రెండు భాగాలు చదివి కమెంట్ పెట్టా ఈ చివరి భాగం ఇప్పుడే చదివా.
తల్లిని ఎవరైనా ఎమన్నా అంటే ఇంతకు ముందు కూడా భాద పడ్డట్టు గుర్తు
అలాంటి తల్లి సెంటిమెంట్ వున్న సుబ్బుని శివరాం గాడు అమ్మని లంజ అన్నాడు
అది చాలు సుబ్బుకి కక్ష పెంచుకోవడనికి. devil2
పిచ్చి మానస శివరాం మారి పోయాడనుకొంటుంది.
మారలేదు.
భయపడ్డాడంతే. 
Mast Mast Mast
Heart
[+] 5 users Like RAANAA's post
Like Reply
Wah takulsajal garu stories universe motham oka chotiki vasthunnai
[+] 3 users Like Venky248's post
Like Reply
Bro nice update but Subbu flash back emi chepaledhu
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
nice closure...
[+] 1 user Likes vg786's post
Like Reply
Nice update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Superb ending
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Very distrubing update for killing Nani

But in your way you are trying to elevate the cruelty of villains


Nice
[+] 2 users Like Athadu's post
Like Reply
What ending broo super
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Superb update ji keka we are waiting
[+] 1 user Likes Manoj1's post
Like Reply
సూపర్ గురు చివరిలో నానిని చంపటం చాలా బాధనిపించింది.
[+] 2 users Like Kushulu2018's post
Like Reply
Chinna pilladni champadam enty bro ,Akshita Subbu Ni kidnap cheyadqm ento , Robert gadu evaru ,shivaram chanipoyina vishayam manasa ki telusa
[+] 3 users Like Sudharsangandodi's post
Like Reply
ఎంటి బ్రో... ఇలా చేశారు....అప్డేట్ అంత మంచి ఫన్నీ గా, ఎమోషనల్ గా వెళ్ళింది,బాగుంది అనుకునెలోపే...చివర్లో అన్ని చావులు ఎంటి బ్రో....feeling sad...... అసలు సబ్బు కి అక్షిత కి ఎంటి సంబంధం....చూడాలి....
అప్డేట్ కి ధన్యవాదాలు Namaskar
[+] 4 users Like Thorlove's post
Like Reply
Last lo malli lepesaru asusual you rock....
[+] 2 users Like Saikarthik's post
Like Reply
A very good update,tragic ending and maybe retribution for killing the boy will come soon
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 2 users Like twinciteeguy's post
Like Reply
Nice ending
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply




Users browsing this thread: 109 Guest(s)