14-09-2022, 10:22 PM
(This post was last modified: 14-09-2022, 10:24 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
Thankyou All
సుబ్బిగాడు ≠ World Famous Lover
|
14-09-2022, 10:22 PM
(This post was last modified: 14-09-2022, 10:24 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
Thankyou All
14-09-2022, 10:24 PM
అలా టాక్సీ నడుపుతున్న నాకు ఒక రోజు మావయ్య ఫోన్ చేసాడు, అదీ శరణ్య కోసం.
జగన్ : హలో సుబ్బు : ఆ మావయ్య జగన్ : శరణ్య ips ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంది అక్కడ జాయిన్ చేద్దామనుకుంటున్నాను, హాస్టల్లో ఉండనంటుంది.. నీకు ఇబ్బంది లేకపోతే అక్కడ ఉంటుంది. సుబ్బు : పర్లేదు మావయ్య, కానీ నేను టైంకి ఇంటికి రాలేను ఒక్కోరోజు అస్సలు ఇంటికే రాను, తను ఒక్కటే ఉండాల్సి వస్తుంది, పర్లేదు అనుకుంటే వచ్చేయమను. జగన్ : సరే చెపుతాను, నువ్వు ఎలా ఉన్నావ్ ఎంత సంపాదిస్తున్నావ్? సుబ్బు : పర్లేదు మావయ్య, బేరాలు బానే ఉన్నాయి చేసుకున్నంత పని ఉంది మన ఓపిక బట్టి.. జగన్ : అప్పుడప్పుడు వచ్చి వెళుతు ఉండు. సుబ్బు : హా.. అలాగే. జగన్ : సరే అయితే. తాతయ్య పోయిన దెగ్గర నుంచి శరణ్యతొ ఒక్కసారి కూడా మాట్లాడలేదు, సరేలే రాని ఎలాగో తనకీ నాకు పడదు.. మనము ఉండము చూద్దాం అనుకున్నాను. పదిరోజులు గాడిచాయో లేదో మావయ్య వచ్చి శరణ్యని వదిలిపెట్టి నాకు ఫోన్ చేసి చెప్పాడు, రాత్రి రూంకి వెళ్లే వరకి శరణ్య పడుకుని ఉంది. లైట్ వేసాను. లేచి కూర్చుంది. సుబ్బు : తిన్నావా ఏమైనా? శరణ్య : హా తినేసా సుబ్బు : బిర్యానీ తెచ్చా ఆకలిగా ఉంటే తిను అంటుండగానే లేచి ప్లేట్ తెచ్చుకుని కూర్చుంది.. దీనికి తిండి పిచ్చి ఇంకా పోలేదు అని నవ్వుకున్నాను, ఇద్దరం తినేసి పడుకున్నాం. నేను కింద చాప వేసుకున్నాను. తెల్లారి లేచేసరికి మావయ్య ఇంకో మంచం కావాల్సిన సామాను, శరణ్యకి పుస్తకాలు పంపించాడు. తనకి చెప్పేసి బైట పడ్డాను.. రోజులు గడుస్తున్నాయి శరణ్య నాతో అంత ఎక్కువగా మాట్లాడేది కాదు నేనూ అంతే దూరంగానే ఉండేవాడిని కానీ తన అవసరాలు తెలుసుకోడానికైనా మాట్లాడాల్సి వచ్చేది. శరణ్య : పది అవుతుంది నన్ను ఇన్స్టిట్యూట్ దెగ్గర డ్రాప్ చేసి వెళ్ళు. సుబ్బు : ఇంకేమైనా కావాలా, ఇంట్లోకి నీకు? శరణ్య : నా సంగతి చూసుకోడానికి మా నాన్న ఉన్నాడులే నువ్వంత ఫీల్ అవ్వకు. దీనమ్మ బలుపు దీనికి, అయినా నాకెందుకు దాని గొడవేదో అది చూసుకుంటదిలే అనుకుని శరణ్యని డ్రాప్ చేసాను. శరణ్య : ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తావా సుబ్బు : మీ అయ్యకి ఫోన్ చెయ్యి. కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది, మనమేమన్న తక్కువా నేను అంతే పొగరుగా వచ్చేసాను.. రాత్రికి ఇంటికి వచ్చి చూస్తే శరణ్య ఇంట్లో లేదు, ఫోన్ చేసాను ఎత్తలేదు మళ్ళీ చేసా కట్ చేసింది. సరేలే అని పడుకున్నాను. తొమ్మిదైనా ఇంటికి రాలేదు మావయ్యకి ఫోన్ చేసాను. జగన్ : చెప్పరా సుబ్బు : అదీ శరణ్య.. జగన్ : ఫ్రెండ్ ది బర్తడే అంటే వెళ్లిందట, దార్లో ఉన్నా అంది, నీకు చెప్పలేదా? సుబ్బు : లేదు. జగన్ : నేను దానితో మాట్లాడతాను లేరా సుబ్బు : నేను వెళ్ళాలి. జగన్ : సరే బై ఫోన్ పెట్టేసి పడుకున్నాను, రాత్రి ఒంటి గంటకి ఎప్పుడో వచ్చింది నన్ను చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. కోపం వచ్చింది కానీ తన కళ్ళు చూడగానే ఎందుకో ఏం మాట్లాడలేకపోయాను.. లైట్ ఆపేసి పడుకున్నాను. తెల్లారి లేచి ఇన్స్టిట్యూట్ దెగ్గర వదిలాను.. కార్ దిగి డోర్ వేసి వెళ్ళిపోతుండగా పిలిచాను. సుబ్బు : శరణ్య శరణ్య : హా ఏంటి? సుబ్బు : ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోన్ చెయ్యి పిక్ చేసుకుంటాను, ఎటైనా వెళ్ళాలన్నా కూడా నాకు చెప్పు నేను వస్తాను. శరణ్య : (ఎగాదిగా చూసి) సరే సుబ్బు : ఒకసారి తన కళ్ళు చూసి మొహం తిప్పుకుని అక్కడ నుంచి బైటికి వచ్చేసి పర్సు తీసి చూసాను.. నా మొహంలోకి మళ్ళీ నవ్వు వచ్చేసింది. ఇంతలో బేరం వచ్చిందని ఫోన్ వస్తే వెళ్లిపోయాను. మళ్ళీ సాయంత్రమే శరణ్య నుంచి ఫోన్ వచ్చింది. శరణ్య : వస్తావా సుబ్బు : పది నిముషాలు, వచ్చేస్తున్నా అని పెట్టేసి వెళ్లి మెట్ల మీద కూర్చున్న శరణ్యని పిలిచాను వచ్చి వెనకాల కూర్చుంది, వెనకాల సరిగ్గా కనపడట్లేదని అద్దం అడ్జస్ట్ చేస్తున్నాను. శరణ్య : ఏంటి నాకు సైట్ కొడదామనా, నీ.. సుబ్బు : నీకంత సీన్ లేదు, నీ బాడీలో నాకు నీ కళ్ళు తప్ప ఇంకేమి నచ్చవు.. నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకోవడం ఆపేసి కొంచెం నేల మీదకిరా శరణ్య : పోరా.. అయినా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావో నేను నీతో ఉంటున్నా, అయినా నా కళ్ళు నచ్చాయన్నావ్.. నా కళ్ళు బాగుంటాయని నాకు తెలుసు నువ్వు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుబ్బు : అవునవును నీ ఒంట్లో ఉన్న పొగరు కొవ్వు అహంకారం అన్ని ఆ కళ్ళలో కనిపిస్తాయి అందుకే అవంటే నాకు ఇష్టం.. పడుకున్నప్పుడు పెన్నుతొ రెండు కళ్ళు పొడిచిపారదొబ్బుతా పీడా వదిలిపోద్ది. నేను ఆటోలో పోతా అంది కోపంగా... క్లచ్ సడన్ గా వదిలాను, దెబ్బకి దాని మొహం ముందర సీటుకి కొట్టుకుంది. శరణ్య : రేయ్ పంది నిన్ను.. పోవే దున్నా.. అని తిట్టుకుంటూ ఇంటికి వచ్చేసాం. అరవింద్ ఫోన్ చేసాడు.. చెప్పరా అరవింద్ : సినిమా కి వెళదాం, ఫ్రీయేనా సుబ్బు : ఇప్పుడే వచ్చా ఫ్రెష్ అయ్యాక ఫోన్ చేస్తా శరణ్య : ఎక్కడికి సుబ్బు : నువ్వు మొన్న నాకు చెప్పి వెళ్ళావా................. (బాత్రూం లోకి వెళుతూ) సినిమాకి శరణ్య : నేనూ వస్తా సుబ్బు : అవసరం లేదు, నేను నా ఫ్రెండ్స్ తొ వెళుతున్నా శరణ్య : అబ్బో ఫ్రెండ్స్.. ఉన్నది ఒక్కడు.. మళ్ళీ.. బిల్డప్పులు. సుబ్బు : అవసరం లేదు. శరణ్య : అయితే నేను సెపెరేట్ గా వెళతాను. సుబ్బు : ఎక్కడైనా సావు.. అంటూ అరవింద్ కి రావట్లేదాని మెసేజ్ పెట్టి స్నానానికి వెళ్లి రెడీ అయ్యి కార్ కీస్ అందుకున్నాను.. నన్నే గుడ్లప్పగించి చూస్తుంది గుడ్లగూబలా.. ఇక పదా అలా చూడకు దయ్యం మొహందానా శరణ్య : ఆగు పది నిమిషాలు స్నానం చేసి వస్తా సుబ్బు : అలాగే బానిస, వెళ్లిరా శరణ్య : వచ్చేదాకా వెయిట్ చెయ్యి డ్రైవర్ ర్ర్ ర్ ర్ ర్.. అని లేచి వెళ్ళింది. నవ్వుకున్నాను, పది నిమిషాలకి రెడీ అయ్యి వచ్చింది.. వెళదామా అంటూ..(నా ముందుకు వచ్చి ) హలో.. బాబు.. మిస్టర్.. అని చిటికె వేసింది.. సుబ్బు : ఆ.. పదా వెళదాం. శరణ్య : ఏంటి చిన్నప్పటి నుంచి లేనిది కొత్తగా నా కళ్ళలోకి చూస్తున్నావ్, నన్ను చూసి ఆగిపోతున్నావ్.. ఏంటి కథ సుబ్బు : నీ కళ్ళు.. శరణ్య : ఆ.. నా కళ్ళు? సుబ్బు : పదా వెళదాం.. అని కార్ తీసాను. శరణ్య : అవును ఏంటి నా కళ్ళు, చిన్నప్పటి నుంచి చూస్తున్నావ్ కదా? సుబ్బు : నీతో నేనెప్పుడు మాట్లాడాను, నీతో ఎప్పుడు ఉన్నాను అస్సలు నీకు నాకు పడేదే కాదు.. నీతో సరిగ్గా మాట్లాడింది నిన్ను చూసింది నువ్వు ఇక్కడికి వచ్చాకే.. అప్పుడప్పుడు నిన్ను నువ్వు వేసే ఎర్రి వేషాలు తలుచుకుని నవ్వుకుంటాను తెలుసా జోకర్... శరణ్య : అరెరే నేను కూడా నిన్ను ఇలాగే పిలుచుకుంటాను తెలుసా బఫున్. ఇద్దరం వెళ్లి సినిమా చూసాము కానీ తను వేసుకున్న గౌను, అంత పెద్ద సౌండులో కూడా తను అటు ఇటు కదిలినప్పుడు ఆ గాజుల శబ్దం నాకు వినిపిస్తూనే ఉన్నాయి.. నేను ఎంత మంది అమ్మాయిలని గెలికానో నాకే గుర్తులేదు.. ఎంత మందితో మాట్లాడానొ ఎంతో మందిని ఫ్లర్ట్ చేసాను.. కానీ శరణ్యతొ వ్యవహారం అలా లేదు. శరణ్య : హలో.. డ్రైవర్.. ఎక్కడున్నాయి తమరి ఆలోచనలు, ఇంటర్వెల్ కూడా వచ్చింది వెళ్లి ఏమైనా తెస్తే తిందాం. సుబ్బు : వెళ్తున్నా బకాసురి.. అని లేచి వెళ్లి పొపకార్న్, కూల్ డ్రింక్ తెచ్చిస్తే ఒక్కటే కూర్చుని మొత్తం తినింది. శరణ్య : అలా చూడకపోతే నీకు కూడా తెచ్చుకోవచ్చుగా సుబ్బు : దాన్ని ఎక్సట్రా లార్జ్ పొపకార్న్ అంటారు, దాన్ని ఇద్దరు సినిమా ఎంజాయ్ చేస్తూ తింటే క్లైమాక్స్ వరకు వస్తుంది, కానీ నీ చేతిలో సినిమా మొదలవ్వకముందే సగం అయిపోయింది. శరణ్య : రేపు ఊరికి వెళ్ళాక అమ్మమ్మతొ దిష్టి తీయించుకోవాలి.. అని ఆఖరున మిగిలిన నాలుగు పొపకార్న్ తీసుకుని తల చుట్టు చుట్టుకుని తు తు అని ఊసి సీట్ కింద పారేసింది. నేనింకేం మాట్లాడలేదు దాని వేషాలు చూసి నవ్వాలో కొప్పడాలో తెలీక మెలకుండా సినిమా చూసి ఇంటికి వచ్చేసి పడుకున్నాం.. శరణ్య స్నానానికి వెళ్ళగానే గబగబా లేచి కత్తితొ దుప్పటికి చిన్న రంద్రం చేసి ముసుగు నిండా కప్పుకుని ఆ రంద్రం లోనుంచి చూస్తున్నా.. పది నిమిషాలకి శరణ్య వచ్చి తల తుడుచుకుంటూ నన్ను చూసి పడుకున్నాననుకుని టవల్ లూస్ చేసి షార్ట్ వేసుకుని బుక్స్ తీసి చదువుతూ కూర్చుంది. శరణ్య : రేయి.. బొక్క లోనుంచి చూసావంటే బొక్కలు విరుగుతాయి పడుకో.
14-09-2022, 10:53 PM
పరిగెత్తి పాలు తాగాల్సిన అవసరం ఏముంది బ్రో....
నిలబడి ప్రశాంతంగా నీళ్ళు తాగుదాం.... తొందర కూడదు మష్టారూ....
14-09-2022, 11:10 PM
శరణ్య కి మామూలుగా లేదు బలుపు, ఎలా దిగుతుందో చూడాలి,
సూపర్ అప్డేట్ బ్రో
14-09-2022, 11:32 PM
అన్నా ఏమ్ జరుగుతోంది ఏదో జరుగతోందని అర్థం అవుతుంది కానీ అదేంటో అర్తమవట్ల
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
15-09-2022, 12:56 AM
శరణ్య సుబ్బు ని తెలిసి తెలియనట్టు నటిస్తూ ప్రేమిస్తుంది అని తెలుస్తుంది.వాడికి తిడుతుంది అని బాధ తప్ప వాడికి మామూలుగానే ఇష్టం కదా....
15-09-2022, 06:40 AM
Super update
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
15-09-2022, 07:17 AM
Nice update bro konchem peddha update ivvu bro
|
« Next Oldest | Next Newest »
|