Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సుబ్బిగాడు ≠ World Famous Lover
#21
Nice update bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
సుబ్బిగాడి పలకరింపులు


టెంటు ముందు శరణ్య వాళ్ళని చూస్తూనే చిన్నగా నవ్వుతూ ఫోన్ తీసుకుని ఫోన్ చేసాడు అరవింద్...రేయి నేను బైటే ఉన్నా దానికి సుబ్బిగాడు విసుగ్గా ఒక అరగంట ఆగి రమ్మన్నానా అప్పుడే ఎందుకు ఊడిపడ్డావ్ అన్నాడు.. అంతే ఉక్రోశంగా ఎంతసేపని ఎండలో నిల్చొనూ, ఇక నా వల్ల కాదు.. ససేమిరా అంటూ మొండికేసాడు అరవిందు. సుబ్బిగాడు తప్పక వస్తున్నా ఉండు అని బైటికి వచ్చి ఓరకన్నుతో శరణ్యని గమనిస్తూనే అరవిందుని లోపలికి పిలుచుకుని తన గదిలోకి తీసుకుపోయి రెడీ అవ్వమని చెప్పి ఇంట్లో వాళ్ళని పలకరిద్దామని బైటికి వచ్చాడు.

ముందుగా తాతయ్యని కలుద్దామని వెళుతుండగా మావయ్య ఎదురు పడ్డాడు. ఈయన పేరు జగన్, రైస్ మిల్లు నడుపుతాడు. ఊర్లో డబ్బులు వడ్డీకి కూడా తిప్పుతుంటాడు.. ఈయనకి మన సుబ్బిగాడికి కొంచెం మాటలు తక్కువేలేండి.

ఏరా ఎక్కడికి అంత హడావిడిగా ఏదో పని మొత్తం నువ్వే చేస్తున్నట్టు, అంతా నువ్వే చక్కబెడుతున్నట్టు అంత బిల్డప్ ఎందుకురా? అని కొంచెం వెటకారంగా కొంచెం కోపంగా అడిగాడు. దానికి మన సుబ్బిగాడు కోపాన్ని అణుచుకుంటూ నిన్ను దెబ్బ కొట్టే సమయం రాకపోదు అప్పుడు చెప్తా నీ సంగతి అని మనుసులో అనుకుంటూనే బైటికి మాత్రం ఇవేవి పట్టనట్టు తాతయ్య ఎక్కడ మావయ్య అని అడిగాడు.

తనని పట్టించుకోకుండా సుబ్బిగాడు అలా మాట్లాడేసరికి ఆయనకి ఒళ్ళు మండి ఆ ఉన్నాడులే.. ఇంకెన్ని రోజులురా ఇలాగా తాతయ్య తకతయ్య అంటూ, ఎన్ని రోజులు ఆ ముసలోడి మీద పడి తింటావ్.. కొంచెం మేలుకోరా నాయనా.. ఆ డిగ్రీ ఏదో అయిపోయిందిగా ఏదైనా పని ఇప్పించామంటావా చెప్పు అంతేకానీ ఇలా సోంబేరిలా తిరక్క.. ఎవడైనా నీ అల్లుడు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పలేక తల తిప్పుకుంటున్నా.. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది ఇదే.. అని గ్రైండర్ లో పట్టడానికి అల్లం చాటతొ వెళుతున్న తన భార్య సుధారాణిని చూస్తూ అన్నాడు.

సుధారాణి వెళుతు వెళుతూ సుబ్బిగాడిని చూసి బాగున్నావా అల్లుడు అని పలకరిస్తూనే మొగుణ్ణి చూసి కోపంగా ఇక్కడ ఈ వెధవ సోది పెట్టే బదులు వచ్చి సాయం చేయొచ్చుగా అని విసుగు నటిస్తూ వెళ్ళిపోయింది. పైకి అలా అల్లుడిని వెనకేసుకొచ్చింది కానీ సుధారాణికి మన సుబ్బిగాడి మీద అంత ప్రేమేమి లేదు అలాగని ద్వేషం కూడా లేదు అలా పలకరింపుల వరకు బానే ఉంటుంది.

జగన్  తెరుకుని అల్లుడి ముందు తక్కువ కాకూడదని వెంటనే మాట అందుకున్నాడు.. పోరా నీకు మళ్ళీ ఇంట్లో సపోర్టు, పొ ఆ పనేదో అందుకోపొ.. అని మన సుబ్బిగాడిని ఈరోజుకి వదిలేసాడు.

సుబ్బిగాడు హమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్లి అమ్మమ్మని పలకరించాడు, తన పేరు జానకమ్మ ఇంటిని చక్కబెట్టడంలో దిట్ట, జుట్టు నెరిసినా రంగు వేసుకుని తనకింకా అంత వయసు అవ్వలేదని అద్దంలో చూసుకుని సంబర పడే టైపు.

సుబ్బిగాడు లోపలికి వెళుతూనే అమ్మమ్మా... తాతయ్య ఎక్కడా కనిపించడంలేదు అని మాట్లాడుతూ అక్కడ గ్రైండర్ లో పడుతున్న పచ్చడిని వేలితో ఒకసారి నాకి బాగుంది బాగుంది అనుకున్నాడు.

జానకమ్మ  మనవడిని పాలకరిస్తూ ఏరా వచ్చావా, ఎంతసేపైంది వచ్చి ఇంద ఈ తీయ్యన్నం తిను అంటూ తన చేతిలో ఉన్న ప్లేట్ సుబ్బిగాడికి అందించింది. సుబ్బిగాడు ఒక స్పూన్ తిని అమ్మమ్మ నా ఫ్రెండు కూడా ఊరు చూస్తానంటే తీసుకొచ్చాను రూంలో ఉన్నాడే ఇద్దరికి కలిపి పంపించవూ.. ఇంతకీ తాతయ్య ఎక్కడా అని అడిగాడు దానికి జానకమ్మ సమాధానం చెపుతూ.. ఊరి పెద్ద మనుషులని సాయంత్రపు కేక్ కటింగ్ కి పిలవడానికి వెళ్ళాడు వచ్చేస్తాడులే.. ఇదిగో నీకు నీ ఫ్రెండుకి వెళ్లి తినండి ముందు అని రెండు ప్లేట్లు సుబ్బిగాడి చేతిలో పెట్టింది.

సుబ్బిగాడు ప్లేట్లు తీసుకుని రూంలోకి వెళ్లి అరవిందు చేతిలో పెట్టాడు దానికి అరవిందు ఇక్కడ రూంలో ఎందుకు లేరా పదా బైట టెంటు కింద కూర్చుని తిందాం పదా అన్నాడు.. దానికి సుబ్బిగాడు.. నేను రాను బైట ఒక పిశాచి ఉంది దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు మంట..

ఎవర్రోయి అని తింటూనే అడిగాడు ఎడమ కనుబొమ్మ ఎగరేస్తూ.. నేను సెప్పలే శరణ్య అని నా మరదలు, దాన్ని దాని అబ్బని చూస్తే నాకు ఎక్కడలేని మంట.. గటగటా వాగేసాడు సుబ్బిగాడు. ఎవరు ఆ పింకు రంగు వోణిలో ఉన్న అమ్మాయా అని అడిగాడు.. అవును కొంపదీసి నువ్వేమైనా మనసు పడ్డావా ఏంటి అంత కచ్చితంగా చెప్తున్నావ్..

ఇంతలో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న హారిక తన బావ అయిన సుబ్బిగాడిని పలకరిద్దామని లోపలికి వచ్చింది. రా హారిక హ్యాపీ భారత్ డే అంటూ పలకరించాడు.. బావా నాతో ఎప్పుడూ ఎగతాళే నీకు అని నవ్వుతూ అరవింద్ ని చూసి నమస్కారం చేసింది ఇప్పుడే పదో తరగతి దాటి ఇంటర్లోకి అడుగుపెట్టిన హారిక.

అరవింద్ హారిక చేసిన నమస్కారానికి ప్రతినమస్కారం చేసి బర్తడే విషెస్ చెప్పాడు.. హారిక సుబ్బిగాడిని చూసి బావా నాకోసం గిఫ్ట్ ఏం తెచ్చావ్ అని అడిగింది.. అస్సలే చికాకులో ఉన్న సుబ్బిగాడికి మళ్ళీ తన మావయ్య కుటుంబం నుంచి ఇంకో నచ్చని ప్రశ్న ఎదురయ్యేసరికి కిందెక్కడో కాలి.. ఇడిచిన బట్టలు తెచ్చానే ఉతికి పెట్టు అదే నీ గిఫ్ట్ అన్నాడు కోపంగా, హారిక వెనకనుంచి వచ్చి సుబ్బిగాడు చూడకముందే గట్టిగా వీపు మీద ఒకటి చరిచి బైటికి పరిగెత్తింది.. అబ్బా అని వీపు పట్టుకున్నాడు సుబ్బిగాడు సుర్రుమన్నట్టుంది పాపం.

దానికి అరవింద్ నవ్వాడు, సుబ్బిగాడు కోపంగా వీపు రుద్దుకుంటూ శరణ్య విషయం ఎత్తాడు మళ్ళీ.. దానికి అరవింద్.. ఛీ..ఛీ.. అయినా నేను పెళ్లిచేసుకోను నా ఆస్తిని అప్పనంగా ఇంకో అమ్మాయితొ పంచుకునే ఉద్దేశాలే లేవు నాకు, అనిపించింది అడిగాను.. నిజాయతీగా జవాబిచ్చాడు అరవిందు.

ఊరికే అన్నాలే అరవిందూ.. అని దీర్గం తీసాడు సుబ్బిగాడు.. దానికి కోపంగా అది అరవిందూ, మందు లంగా బొందు కాదు.. వింద్.. అరవింద్.. అంటూ తన పేరుకు తగ్గట్టే సగం వదిలిపెట్టాడు అరవిందు.. కాదు కాదు అరవింద్.

సరే పదా అలా బైట తిరిగి వద్ధాము, ఆ తరువాత తాతయ్యని కలిసి వచ్చిన పని చూద్దాము.. అని అడుగులు బైటికి వేసాడు సుబ్బిగాడు తన వెనుకే అరవింద్.
Like Reply
#23
Superb start
[+] 2 users Like Sachin@10's post
Like Reply
#24
Nice update
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#25
Nice one
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#26
Nice update bro... happy to see you start new story ....
[+] 1 user Likes prash426's post
Like Reply
#27
Nice super update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
#28
Nice update bro
[+] 1 user Likes Prasad cm's post
Like Reply
#29
Very good update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#30
Nice andi..
[+] 1 user Likes Nani666's post
Like Reply
#31
Nice update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#32
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#33
Nice update
Like Reply
#34
Comedy ga start chesina ado melika pedatarule..vuhinchalem mee kathanam...
[+] 2 users Like James Bond 007's post
Like Reply
#35
Nice update bro
Like Reply
#36
Good nice
[+] 1 user Likes narendhra89's post
Like Reply
#37
Update please
[+] 1 user Likes Lovely@'s post
Like Reply
#38
Ji update please
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#39
THANKYOU ALL ❤️
Like Reply
#40
KFC కామాక్షి

అరవింద్ : ఎక్కడికిరా?

సుబ్బి : రావొయి, ఎందుకంత ఆత్రం.. పదా అలా బాయి దెగ్గర కూర్చుందాం అని ముందుకు వెళ్లి కూర్చున్నాడు, ఆ వెనుకే అరవింద్ కూడా వెళ్లి కూర్చున్నాడు.

అరవింద్ : అయినా నాకు అర్ధం కాక ఇప్పుడు నీకెందుకురా అన్ని డబ్బులు?

సుబ్బి : నీకేరా ఎన్నైనా చెప్తావ్ డబ్బులున్నోడివి, అయినా నిన్నని ఏం లాభం కష్టాలన్నీ ఈ ప్రేమికుల చుట్టే తిరుగుతూ ఉంటాయి ఎందుకో అర్ధంకాదు.

సుబ్బిగాడి వంకర మాటలు విని అనుమానంగా కొంపదీసి మళ్ళీ ప్రేమలో పడ్డవా ఏంటి అని అడిగేసాడు అరవింద్.. అవునురా మొన్న నాలుగు రోజుల క్రితమే జరిగిపోయింది నా KFC కామాక్షి తొ..

అరవింద్ : ఎవరా అమాయకురాలు, పాపం పొయ్యి పొయ్యి నీ కంట పడింది..

సుబ్బి : నేను రెంటు కి ఉండే రూం నుంచి ఒక కిలోమీటర్ దూరం అంతే KFC లో పనిచేస్తుంది పిల్ల.. ఏమాటకామాట చికెన్ చెయ్యడంలో ఆ పిల్ల తరువాతే ఏదైనా..

అరవింద్ : KFC లో చికెన్ చెయ్యడమేంట్రా, ఫ్రయర్ లో వేస్తే అదే అవుతుంది దానికి మళ్ళీ ఎదవ ఎలివేషన్లు ఇవ్వకు.

సుబ్బి : నీకేం తెలుసురా ఆ మహిమ.. బర్గర్ చెయ్యాలాంటే చికెన్ పాట్టి, మెయినైస్ అన్ని పెట్టాలి, అలాగే వింగ్స్ ఇవన్నీ బోలెడు ఉంటాయి నీకేం తెలుసోయి పనోళ్ల కష్టాలు ఇటు కాలు తీసి అటు పెట్టాలన్నా నీకు పనిమనుషులు ఉన్నోడివి.. KFC కామాక్షి అంటే తెలీనోడు లేడు ఆ వీధిలో అంత ఫేమస్.

అరవింద్ : సరే సరే నువ్వు KFC కామాక్షి కాకపోతే డామినోస్ దుర్గని లవ్ చేస్కో నాకెందుకు, ఇప్పుడు మీ తాత తోటి అంత అవసరమేంటని?

సుబ్బి : నా కామాక్షికి ఎప్పటి నుంచో సొంతగా తనే వ్యాపారం పెట్టుకోవాలని కోరికట దానికోసం కొంత డబ్బు అవసరం, ఎవరో ఎందుకు అదేదో నేనే పెట్టుబడి పెడితే ఎంచక్కా ఇద్దరం కలిసి ఆడుతు పాడుతూ చికెన్ ఎంచుకోవచ్చు అని ఆలోచిస్తున్నా.. పేరు కూడా డిసైడ్ చేసేసా కొంత డబ్బు ఉంటే చాలు.

అరవింద్ : ఏం పేరు?

సుబ్బి : సుబ్బిగాడి నూనెలో కామాక్షి చికెన్.. ఎలా ఉంది..

అరవింద్ : నీలాగే ఉంది.

సుబ్బి : థాంక్స్ రా..

అరవింద్ చుట్టూ చూస్తూ సుబ్బిగాడు చెప్పే సొల్లంతా వింటున్నాడు కానీ ఇందాకటి నుంచి ఒకటి కొట్టేస్తుంది అది ఏంటంటే డబ్బులు తనని అడగకుండా ఇంత దూరం వాళ్ళ తాతయ్య కోసం వచ్చాడేంటా అని, మళ్ళీ అడిగితే గెలికి మరి తన్నించుకున్నట్టు ఉంటుందని చాలా సేపు మౌనంగానే ఉన్నాడు కానీ తన వల్ల కాక చివరికి అడిగేసాడు.

సుబ్బి : ఆదా.. ఎలాగో పాకెట్ మనీ రావాలి, అలాగే ఇది కూడా వర్కౌట్ చేద్దామని వచ్చా అంతే, నీకైతే మళ్ళీ కట్టాలి కదా.

అవును అదే అనుకున్నా అని మనుసులో అనుకుని బైటికి మాత్రం ఓ చిన్న నవ్వు నవ్వాడు. ఇద్దరు ఊరు చూసి ఇంటికి వెళుతూ గుమ్మం ముందు తాతయ్య చెప్పులు చూసి సుబ్బిగాడు ఆనందంగా  లోపలికి వెళ్ళాడు.

ఆయన పేరు రాజయ్య అంతగా పూర్వ ఆస్తులు ఏమి లేవు నలుగురి సంతానంలో రెండో వాడు, ఉన్న ఆస్తులని తెలివిగా పెంచుకున్నాడు, ఈయన కున్న ఒకే ఒక్క బాధ మన సుబ్బిగాడే.. వీడు ఒకింటి వాడు అయితే ఇక తనకీ ఏ బాధ్యతలు ఉండవని ఆయన ఫీలింగ్.

సుబ్బిగాడు లోపలికి వెళ్లేసరికి అరవింద్ కి ఏం తోచక బైటే టెంట్ కింద కూర్చుండిపోయాడు, అది చూసిన శరణ్య అండ్ గ్యాంగ్ వెళ్లి అరవింద్ చుట్టూ చేరేసరికి అయోమయంగా చూసాడు.

శరణ్య : హాయ్, నేను శరణ్య.. మీ ఫ్రెండ్ శుభాష్..

అరవింద్ : నాకు తెలుసు.

శరణ్య : ఓహ్ ఓకే.. వీళ్ళు మా ఫ్రెండ్స్ మిమ్మల్ని పరిచయం చెయ్యమని అడిగితే తీసుకొచ్చాను.

అరవింద్ : అలాగా (అన్నాడు, లోపల మాత్రం భయం భయంగానే ఉంది)

"మీ ఫ్రెండ్ గురించి చెప్పండి, బాగా కామెడీ చేస్తాడట కదా"

అరవింద్ : అవును, ఏం?

"ఊరికే చెప్పండి బోర్ కొడుతుంది, కొంచెం సేపు టైమ్ పాస్ అవుద్ది"

అరవింద్ : వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు నవ్వుతూ నవ్వుస్తూనే ఉంటాడు, బాధల్లో ఉన్నా అవమానల్లో ఉన్నా అందులో నవ్వుని మాత్రమే తీసుకుంటాడు, వాడు చేసే ప్రతీ పనిలో ఫన్ వెతుక్కుంటాడు, ఒక రోజు చెప్పాను ఒక అమ్మాయిని లవ్ చెయ్యరా అందులో కూడా ఫన్ ఉంటుంది, నీకొక తోడు దొరుకుతుంది అని.. అదే నేను చేసిన పెద్ద తప్పు, అప్పటి నుంచి అమ్మాయిల మీద యుద్ధం ప్రకటించాడు వాళ్లలో కొంచెం పాజిటివ్ కనిపించినా చాలు వాళ్ల వెనకాలే వెళ్ళిపోతాడు..

"తన లవ్ స్టోరీస్ గురించి చెప్పండి"

అరవింద్ : అయితే మీకు మొదటగా బఠానీల భారతి గురించి చెప్పాలి.

శరణ్య : హహ

ఇంతలో లోపల నుంచి పెద్దాయన అరుపు విని అందరూ లోపలికి వెళుతుంటే అరవింద్ కూడా లోపలికి వెళ్ళాడు తన వెనకాలే శరణ్య కూడా  వెళ్ళింది. అక్కడ లోపల సుబ్బిగాడు కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు, ఏమైంది అంటూనే రాజయ్యని చూసాడు.


రాజయ్య : ఏం కాలా.. వాడు డబ్బు అడిగాడు, ఇవ్వాల్టి నుంచి నేను ఇవ్వను ఉద్యోగం చూసుకోమన్నాను. అంతే..

అరవింద్ : దానికే కళ్ళు తిరిగి పడిపోయాడా?

రాజయ్య : ఆ! అలాగే నా తమ్ముడి మనవడికి వచ్చిన సంబంధం మాట్లాడుతూ ఈ ఫోటో చూపించాను, అంతే గిర్రున పడ్డాడు.

అరవింద్ ఆ ఫోటోని చూసి గట్టిగా నవ్వాడు, అది శరణ్య గమనించింది.. సుబ్బిగాడి మొహం మీద నీళ్లు చల్లేసరికి లేచి అందరినీ చూసి మౌనంగా బైటికి వెళ్ళిపోయాడు.

బైటికి వచ్చాక శరణ్య అడిగింది.

శరణ్య : ఏమైంది.. ఇందాక నువ్వు నవ్వావు..

అరవింద్ : ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని పోయిన గురువారం నుంచి మీ బావ ప్రేమిస్తున్నాడు, ఈ గురువారంతొ ఎండ్ కార్డ్ పడేసరికి కళ్ళు తిరిగి పడిపోయాడు. పాపం వాడికే ఎందుకు జరుగుతాయో అర్ధం కాదు..

శరణ్య నవ్వేసరికి అరవింద్ కూడా నవ్వాడు.. ఇదంతా మన సుబ్బిగాడు గమనించాడు.. కోపంగా పళ్ళు నూరుముకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు..
Like Reply




Users browsing this thread: 29 Guest(s)