23-08-2022, 04:04 PM
సుబ్బిగాడు
ఈడు WORLD FAMOUS LOVER కాదు
సుబ్బిగాడు ≠ World Famous Lover
|
23-08-2022, 06:30 PM
(This post was last modified: 23-08-2022, 06:33 PM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
సుబ్బిగాడి పరిచయం
రామాపురం, అక్కడున్న ఇరవై మూడు గ్రామాల్లో ఇదే అతి పెద్ద పల్లెటూరు. బస్సు స్టాండు దిగి బైటికి వచ్చి ఎడమవైపు తిరిగి నేరుగా ఒక కిలోమీటర్ నడిస్తే ఇళ్ళు మొదలవుతాయి అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఊరి మధ్యలో అంగడి. అంగడి నుంచి కుడి వైపు రోడ్డులో రెండవ వీధి నాలుగో ఇంటి ముందు పెద్ద టెంటు వేసి ఉంది. ఆ ఇంటి గేట్ ముందు చిన్న బ్యానర్ హారిక పుట్టిన రోజు వేడుక అని ఒక చిన్న పాపా ఫోటో. అది చూస్తూనే లోపలి అడుగు వేసాడు ఒక కుర్రాడు. ఆ ఐదు అడుగుల మగాడిని చూసి అక్కడ టెంటు కింద కుర్చీలలో కూర్చున్న అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉండగా పింకు రంగు లంగా వోణీలో ఒంటి మీద మరి ఎక్కువా తక్కువా లేకుండా ఉన్న నగలతో మెరిసిపోతూ ఒక చేతికి వాచీ ఇంకో చేతినిండా మాచింగ్ గాజులు వేసుకుని, మరీ పొడుగు పొట్టి కాకుండా సరైన హైట్లో ఉన్న ఒక అమ్మాయి ప్లేట్ నిండా కూల్ డ్రింకుల గ్లాసులతో తన ఫ్రెండ్స్ కి అందిస్తూ మధ్యలో ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు ఇందాక బ్యానర్ మీద చుసిన హారిక లేదు తన అక్క, పేరు శరణ్య. పేరుకి తగ్గట్టే చాల మంచిది కానీ డబ్బులు ఉన్నాయన్న పొగరు, ఆ అందానికి తగ్గ టెక్కు ఆమె సొంతం అందరూ ఎవరి గురించో మాట్లాడుకునేసరికి తల తిప్పి ఆ కుర్రాడిని చూసి పుసుక్కున నవ్వింది. ఆ గుంపులో కూర్చున్న ఒక అమ్మాయి ఎందుకే అలా నవ్వావు అని అడిగింది. శరణ్య : మీరు వాడికి ఇస్తున్న బిల్డప్ చూసి ఎవరో అనుకున్నా... వాడని తెలిసి నవ్వొచ్చింది. ఎవరు అతను.. చాలా సింపుల్గా ఉన్నాడు? శరణ్య : సరే ఎలాగో నాకు బోర్ కొడుతుంది, ఆ గ్రీకు వీరుడి గురించి మీకు కూడా చెప్తాను. అంటే.. శరణ్య : గ్రీకువీరుడు అంటే ఇంకేదో అనుకునేరు.. మనోడు అదో టైపులే.. ఏ టైపు? శరణ్య : ప్రతీ వారం ఒక కొత్త అమ్మాయిని ప్రేమిస్తాడు. అదెలాగా? శరణ్య : అదంతే వాడిని ఆ పిల్ల వదిలేస్తుంది.. లేదా ఇంకేదైనా జరుగుతుంది.. నష్ట జాతకుడు అంటారు కదా దానికి మనోడు అమ్మ మొగుడి లాంటోడు.. నాకు తెలిసినంత వరకు ఒక ఇరవై మంది అమ్మాయిలకి వీడి వల్లే పెళ్ళిళ్లు అయిపోయాయి. అయ్యో పాపం. శరణ్య : అంత లేదు, ఇప్పుడు చూడు మిమ్మల్ని చూసి ఒక వెకిలి నవ్వు నవ్వి నన్ను చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు.. శరణ్య చెప్పినట్టుగానే అమ్మాయిల వంక వీరుడిలా ఒక నవ్వు నవ్వి మధ్యలో ఉన్న శరణ్య వైపు చూసి సీరియస్ గా బ్యాగ్ తో లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరే అతను అంత కచ్చితంగా నువ్వు చెప్పిందే జరిగింది. శరణ్య : వాడు నా అత్త కొడుకు పేరు సుభాష్.. ది సుబ్బిగాడు.. మంచి ఫన్నీ కాండిడేట్ మీకు బాగా టైంపాస్ అవుద్దని వాణ్ని పిలిపించాను.. ఓహ్.. మీ బావా? శరణ్య : అలా పిలవకు నాకు వాడంటే అస్సలు పడదు.. వాడి వేషాలు చూసి నవ్వుకుంటాను అంతే నా లోకంలో వాడొక జోకర్. ఇంట్రెస్టింగ్.. తన గురించి చెప్పు... శరణ్య : మీకు ఇందాక పరిచయం చేసాను కదా మా నాయనమ్మ తాతయ్య వాళ్ళకి ఇద్దరు.. మా అత్తయ్య నాన్న.. మా అత్తయ్య ఒక అనాధని ప్రేమించి పెళ్లి చూసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఆ తరువాత ఇద్దరు ఆక్సిడెంట్ లో చనిపోగా వీడు మాత్రమే మిగిలాడు తాతయ్య వీడిని ఇంట్లోకి తీసుకొచ్చి పెంచారు అంతే వీడి కథ పుట్టినప్పటి నుంచి హాస్టల్లో ఆ తరువాత సిటీలో రూం తీసుకుని ఉంటున్నాడు మనలాగే డిగ్రీ అయిపోయింది.. మా తాతయ్య ఇచ్చిన పాకెట్ మనీతొ జీవితం గడిపేస్తున్నాడు.. అలాగా.. శరణ్య : వీడికి అక్కడ సిటీలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు.. పేరు అరవింద్ బాగా బలిసినోడు.. వీడిని వాడు ఎందుకు భరిస్తున్నాడో వాడికి ఆ దేవుడికే తెలియాలి.. అంతే వాడి గురించి... ఎక్కడ అమ్మాయి కనపడితే అక్కడ వాలిపోవడం, ట్రై చెయ్యడం వారంలో ఫెయిల్ అవ్వడం తరువాత ఇంకో అమ్మాయిని వెతుక్కోవడం ఇదే వాడి రొటీన్.. ఇంకేమైనా కావాలా వాడి గురించి..? నీకు తనకీ ఎందుకు పడదు..? శరణ్య : పడదు అంటే పడదు అంతే.. ఎప్పుడూ ఏదో ఒక తింగరి పని చేసి నవ్వుల పాలు అవ్వడం వాడి హాబీ.. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అక్కడ ఏదో ఒక పెంట అవుద్ది.. వచ్చాడుగా చూద్దురు లేండి.. ఇంతలో ఇంకొకడు అడుగు పెట్టాడు అక్కడ.. శరణ్య వాడిని చూపిస్తూ.. శరణ్య : అదిగో వాడే అరవింద్.. సుబ్బిగాడి ఫ్రెండు.. భలే ఉన్నాడే.. శరణ్య : డబ్బులుంటే అందరూ బానే ఉంటారు.. ఇంతకీ మన సుబ్బిగాడేడి పదండి లోపల ఏం వెలగబెడుతున్నాడో చూద్దాం.
23-08-2022, 07:02 PM
Very intresting theme
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
23-08-2022, 08:44 PM
చూస్తుంటే ఇది ఫన్నీ స్టోరీ లాగా వుంది.....
All the best for new story bro......
23-08-2022, 09:43 PM
23-08-2022, 09:43 PM
23-08-2022, 09:44 PM
23-08-2022, 09:44 PM
23-08-2022, 09:45 PM
23-08-2022, 09:45 PM
23-08-2022, 09:45 PM
23-08-2022, 09:48 PM
Superb start funny ? ? ?
23-08-2022, 10:39 PM
న్యూ స్టోరీ. All the best.
23-08-2022, 10:46 PM
Nice super start
|
« Next Oldest | Next Newest »
|