27-08-2021, 12:20 PM
super bro
Thriller రాజతంత్రం
|
27-08-2021, 01:10 PM
27-08-2021, 01:12 PM
MIND BLOWIDNG UPDATES EVERY TIME............HATS UP
27-08-2021, 09:58 PM
28-08-2021, 08:56 PM
30-08-2021, 05:05 PM
సారీ ఫ్రెండ్స్ లాంగ్ weekend రావడం వల్ల పైగా శ్రావణ మాసం అని మా అమ్మ కీ భక్తి ఎక్కువ అయ్యి ఇంట్లో పూజలు, relatives ఇంట్లో పూజలు attend అయ్యి మా లడ్డు గాడికి పుట్టు వెంట్రుకలు తీయడానికి మేనమామ నీ నేను ఉండాలి కదా ప్రోగ్రామ్స్ అని అలా సెట్ చేశారు పైగా second dose వేయించుకోవడం వల్ల కొంచెం రెండు రోజుల నుంచి light fever ఉండి updates కుదరలేదు అందుకే రేపు కానీ ఎల్లుండి కానీ update తో వస్తా late అయ్యినందుకు క్షమించండి.
30-08-2021, 09:52 PM
31-08-2021, 09:50 AM
సోఫియా తనని రిసీవ్ చేసుకోడానికి రావడం కంటే తను సంధ్య కోసం తెచ్చిన చీర సోఫియా వేసుకోవడం ఇంకా shocking గా ఉంది సిద్ధార్థ కీ దాంతో పాటు సోఫియా తో ఇన్ని రోజుల చనువు ఉన్న కూడా తన అందం ఎప్పుడు సిద్ధార్థ నీ డిస్టర్బ్ చేయలేదు కానీ ఎందుకో ఆ చీర సంధ్య కంటే సోఫియా కే బాగా కుదిరింది, దాంతో సిద్ధార్థ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అందుకే సోఫియా వైపు eye to eye కాంటాక్ట్ చేయలేక ఉన్నాడు "welcome to Pakistan PM sir" అని bouquet ఇచ్చింది సోఫియా దాంతో "Thank you సోఫి అని చెప్పి మళ్ళీ తల కొట్టుకొని బేగం సా" అన్నాడు సిద్ధార్థ దానికి అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే బేగం అని భర్తలు మాత్రమే అనాలి అని చెప్పాడు వినోద్ దాంతో సిద్ధార్థ "సారీ మిస్ తహసిల్" అని అన్నాడు దాంతో సోఫియా నవ్వి పర్లేదు సోఫి అని పిలువు అని చెప్పింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి కార్ లో హోటల్ కి బయలుదేరారు సోఫియా అలా తన పక్కన ఉంటే మొదటి సారి సిద్ధార్థ చాలా ఇబ్బంది గా ఫీల్ అయ్యాడు అప్పుడు తన భుజం మీద చేయి వేసి అలాగే తల ఆనించి పడుకున్న సంధ్య మెల్లగా "ఏంటి నీ ఫ్రెండ్ నాకంటే అందం గా ఉందా" అని అడిగింది సంధ్య దానికి సిద్ధార్థ "నా దృష్టిలో ఎప్పటికీ నువ్వే అందగత్తెవి" అని అన్నాడు అది విన్న సోఫియా థాంక్స్ సిద్ధ్ అనింది దాంతో సంధ్య ప్రతిబింబం మాయం అయ్యింది దాంతో సిద్ధార్థ తన మెదడు నీ క్లియర్ చేసుకోడానికి పెషావర్ సిటీ అందాలు చూస్తూ ఉంటే అలా వెనకు రోడ్డు పక్కన ఉన్న భవంతులతో పాటు తన ఆలోచనలు కూడా గతంలోకీ వెనకు వెళ్లాయి.
(Vancross library) సిద్ధార్థ, సోఫియా ఇద్దరు తమ ప్రాజెక్టు పని మీద లైబ్రరీ లోకి వెళ్లారు అక్కడ వాళ్లు ఇండియా పాకిస్తాన్ partition మీద research చేస్తూ పైగా ఇద్దరికి తెలిసిన విషయాలను డిస్కస్ చేస్తూ ప్రపంచ దృష్టిలో శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాలు తమ దౌత్య సంబంధాలు కలిగి ఎలా ఒకరి అభివృద్ధి కీ మరొకరు సహాయం గా ఉంటారు అనే దాని పైన ప్రొజెక్ట్ పనిలో ఉన్నారు, అప్పుడే సిద్ధార్థ కీ తెలిసింది ఏంటి అంటే బెలూచిస్థాన్ లో ఆయిల్ అండ్ గ్యాస్ మైన్స్ ఉన్నాయి కానీ వాటిని బయటకు తెచ్చే technology పాకిస్తాన్ దెగ్గర అంతగా లేదు పైగా గుజరాత్ లోని ఆయిల్ ఇండస్ట్రీస్ లో జపాన్ నుంచి కొన్న టెక్నాలజీ ఇండియా లో ఉంది దాంతో ఈ టెక్నాలజీ నీ పాకిస్తాన్ కీ లీజు కీ ఇస్తే వాళ్ల నుంచి వచ్చే ఆయిల్ లో 48 వేల cartels ఇండియా కీ ప్రతి సంవత్సరం రెంట్ ఇంటరెస్ట్ గా పాకిస్తాన్ సప్లయ్ చేస్తే ఇండియా కీ దుబాయ్ నుంచి ప్రతి సంవత్సరం వచ్చే 72 cartels పెట్రోలియం అండ్ ఆయిల్ import చార్జీలు తాగుతాయి దాంతో పెట్రోలు ఒకటే import చేసుకోవడం వల్ల బడ్జెట్ కలిసి వస్తుంది అని తన ఐడియా ఇచ్చాడు దాంతో సోఫియా చాలా సేపు ఆలోచించి సిద్ధార్థ చెప్పింది నిజమే ఇలా చేస్తే పాకిస్తాన్ కీ export బిజినెస్ పెరుగుది దాంతో కొంచెం బడ్జెట్ friendly అవుతుంది అని సిద్ధార్థ ఇచ్చిన ఐడియా నీ తమ ప్రాజెక్టు లో ఎక్కించింది ఇలా వాళ్లు ప్రాజెక్టు లో బిజీగా ఉంటే ఇలియాజ్ వచ్చి సోఫియా కీ ఫోన్ ఇచ్చాడు అప్పుడు సోఫియా ఫోన్ తీసుకోని చూస్తే తన తండ్రి దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది. దాంతో సోఫియా ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్లింది అప్పుడు పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా "ఏంటి బెటీ ఆ సిద్ధార్థ తో కలిసి తిరుగుతున్నావు అంట ఈ విషయం కనుక కేబినెట్ లో తెలిస్తే నా పరువు ఏమీ అవుతుందో తెలుసా నిన్ను నేను అక్కడికి పంపింది మన గవర్నమెంట్ లోనే నీకంటే తెలివైన politician ఉండకూడదు అనే ఆశ తో నువ్వు ఇలా శత్రు దేశం వాళ్లతో కలిసి తిరిగి రాత్రి పూట అల్లరి పనులు చేయడానికి కాదు" అని కొంచెం కోపం గానే అరిచాడు దానికి సోఫియా, ఇలియాజ్ వైపు చూసి "అబ్బు నేను ఎమైన పిచ్చి దాని అనుకున్నావా నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా పాకిస్తాన్ అమెరికా కీ అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలీ అని అందుకు మొదటి ఎత్తు ఇండియా మనం మన శత్రు దేశం తో ఎంత diplomacy తో ఉంటే మిగిలిన దేశాలకు మన దేశంలో ఉండే ఔన్నత్యం తెలుస్తుంది మనకు మంచి పేరు వస్తుంది పైగా నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే నాకూ సర్టిఫికేట్ వచ్చేది కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ అయ్యే వరకు ఓపిక పట్టు" అని తన తెలివి తో ఆ సమస్య నుంచి తెలివిగా బయట పడింది సోఫియా కూతురు తెలివి చూసిన యూసఫ్ దాని వెనుక కారణం తెలుసుకోలేక పోయాడు ఆ తర్వాత ఫోన్ ఇలియాజ్ కీ విసిరేసి వాడిని దగ్గరికి రమ్మని చెప్పి లాగి వాడి చెంప మీద కొట్టింది "నీ లిమిట్స్ లో ఉండు ఇంకోసారి నా విషయం లో వేలు పెడితే తలకాయ నరుకుతా" అని warning ఇచ్చింది దాంతో ఒక్క ఆడపిల్ల తనను కొట్టడం అవమానం గా భావించాడు ఇలియాజ్. సోఫియా తిరిగి వచ్చి లైబ్రరీ లో టేబుల్ దగ్గరికి వెళ్లితే అక్కడ సిద్ధార్థ లేడు అప్పుడే అక్కడికి సంధ్య అక్కడికి వచ్చింది సోఫియా వైపు పలకరింపు గా చూసి వెళ్లింది అప్పుడే ఏదో బుక్ తీసుకొని వచ్చాడు సిద్ధార్థ సంధ్య నీ చూడగానే బుక్ పక్కన పడేసి సంధ్య వెనుక వెళ్లాడు అది చూసిన సంధ్య ఏంటి అని సైగ చేసింది "I love you" అని చెప్పింది దానికి సంధ్య నవ్వి "చూడండి సార్ మీరు రేపు ఒక దేశం కీ కాబోయే నాయకులు నేను ఏదో middle class అమ్మాయిని ప్లీజ్ నా వెంట పడటం మానేసి ప్లీజ్ నీ చదువు మీద దృష్టి పెట్టు" అని చెప్పింది లోపల ఇష్టం ఉన్న కూడా పైకి కోపం నటిస్తూ చెప్పింది సంధ్య దాంతో సిద్ధార్థ తన పర్స్ లో ఉన్న తన తల్లి ఫోటో తీసి సంధ్య చేతిలో పెట్టి "నేను ఇప్పటి వరకు ప్రేమించిన ఓకే ఒక వ్యక్తి మా అమ్మ నాకూ ఊహ తెలిసే లోపే తను నన్ను వదిలి వెళ్లింది ఆ తర్వాత తన జ్ఞాపకాలు అన్ని నిన్ను చూసిన తర్వాతే నాలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి ఆ జ్ఞాపకాలు నాలో సజీవంగా ఉండాలంటే నాకూ నువ్వు కావాలి ఈ ఫోటో నీ దెగ్గర ఉంచుకో రేపు కాలేజీ లో ఉన్న polo మ్యాచ్ లో నేను గెలిస్తే అప్పుడు నువ్వు ఈ ఫోటో మీద నీ నిర్ణయం రాసి ఇవ్వు ఏదైనా నేను accept చేయడానికి రెడీ" అన్నాడు దానికి సంధ్య "సిద్ధార్థ్ పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పటి వరకు ఆ ఆట లో ఒక ఇండియన్ గెలవలేదు పైగా అవతలి వైపు ఉన్న టీం కూడా చిన్నది కాదు డెనిస్,అడానిస్ ఇద్దరు చాలా rough and cruel riders వాళ్ళని దాటి ఇప్పటి వరకు ఒకరు కూడా గోల్స్ వేయలేదు" అని చెప్పింది దానికి సిద్ధార్థ "then this is for my country not just only for love" అని ఛాలెంజ్ చేసి వెళ్లాడు అప్పుడే సంధ్య ఏదో చెప్పాలి అని చూస్తే తనకు ఒక మెసేజ్ వచ్చింది "when will be the feast" అని వచ్చింది దానికి సంధ్య, సిద్ధార్థ వైపు చూసింది తను వెళ్లిపోగానే "Feast will be arranged in two days" అని reply ఇచ్చింది కానీ తనకి భయం గా ఉంది సిద్ధార్థ కీ polo game లో ఏమీ అవుతుందో అని.
31-08-2021, 11:10 AM
challa baaga raasaru
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
31-08-2021, 12:12 PM
31-08-2021, 12:12 PM
31-08-2021, 12:12 PM
31-08-2021, 02:28 PM
31-08-2021, 02:28 PM
|
« Next Oldest | Next Newest »
|