Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనం చదివిన పుస్తకాలు - మనం రాసే సమీక్షలు
#1
మనం చదివిన పుస్తకాలు - మనం రాసే మీక్షలు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
[Image: images?q=tbn%3AANd9GcQ0ym1EJQvOMiAkX3RWb...PqsEcuacXb]

ఏడు తరాలు
---------------------
ఏడు తరాలు... ఇది ఒక బానిసల కథ. అమెరికాకు ఆఫ్రికానుండి బలవంతంగా రప్పించబడిన అమెరికాలోని ఆఫ్రికా బానిసల కథ. అగ్రరాజ్యమైన అమెరికాలో చీకటి కోణం, నల్లవాళ్లపై తెల్లవాళ్ళ ఆకృత్యాలు ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అప్పటిదాకా నా అనే వాళ్ళతో సొంత ఊరి జనం మధ్య సంతోషంగా ఉన్న జీవితాలు ఒక్కసారిగా తలకిందులైతే? వీళ్ళందరికీ దూరంగా, భవిష్యత్తు అంటే ఏంటో తెలీక, దొరలకు కండలు కరిగేలా స్వేదాన్ని చిందించిన దానికి ప్రతిఫలంగా చర్మం ఊడిపోయేలా కొరడా దెబ్బలు తింటూ, గతాన్ని గుర్తు చేసుకోలేక - భవిష్యత్తును ఊహించలేక నాగరిక సమాజంలో ఒక జాతి మరో జాతిపై ముసుగులో చేసిన దమనకాండకు అక్షరరూపం ఈ "ఏడుతరాలు" నవల! ఇదొక వాస్తవిక చరిత్ర!!

స్వేచ్ఛనుండి సంకెళ్లకు, సంకెళ్లనుండి స్వేచ్ఛా వాయువుల్లోకి వెళ్లిన ఆఫ్రికా నిగ్గర్ల (నిగ్గర్లు అంటే బానిసలు) చరిత్ర ఈ ఏడు తరాలు. బానిసలపై జాలి, దయ, కరుణ, మానవత్వం లాంటివేమీ లేకుండా అగ్రరాజ్యం అమెరికా జరిపిన ఆకృత్యాలు చదువుతుంటే నరాల్లోని రక్తం ఉడికి పోతుంది, కన్నీళ్ల సముద్రంలో కనుగుడ్లు తేలియాడుతాయి.

క్రీస్తుశకం 1750 లో ఆఫ్రికా ఖండంలో గాంబియా అనే దేశంలో మొదలవుతుంది ఈ కథ. కల్లా కపటం తెలియని , స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు అడ్డులేని జాఫురు అనే గ్రామంలో ఉమురా-బింటో దంపతులకు కుంటా పుట్టడంతో కథ ప్రారంభం అవుతుంది. అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో, నానమ్మ చెప్పే కథలతో, తోటి పిల్లలతో వాళ్ళ సంప్రదాయాల ప్రకారం పెరుగుతూ ఉంటాడు. పొలం పనులు చేస్తూ, సాయంత్రాలు చదువుకుంటూ ఉంటాడు. కఠినమైన గ్రామ సంప్రదాయ పురుష శిక్షణ తీసుకొని ఇంటికి తిరిగొచ్చి తన వైవాహిక జీవితం గురించి కలలు కంటూ ఉంటాడు.

ఒకానొక దురదృష్ట సమయంలో తెల్లవాళ్ళ కంటబడి వేట కుక్కలతో, మారణాయుధాలతో వేటాడి బందీగా చిక్కుతాడు. చిన్నప్పుడు తన తండ్రి చెప్పిన "తెల్లవాళ్లు మన చుట్టూ ప్రక్కల ఉన్నప్పుడు కోడిమాంసం వాసన వస్తుంది" అన్నవిషయంలో ఏమరపాటుగా ఉన్నందుకు చింతిస్తాడు. అలా తెల్లవాళ్ళకు చిక్కి, స్పృహ కోల్పోయి కళ్ళు తెరిచేప్పటికీ ఓడలో వివస్త్రై బందీగా ఉంటాడు. శరీరమంతా గాయాలై ఎర్రగా పుండ్లు పట్టి ఉంటుంది. కాళ్ళు చేతులు కట్టి పడేసి ఉంటాయి. ఆ ఇరుకు ఓడలో తన తోటి బందీలతో భోజనాలు, మలమూత్రాలు ఒకేచోట చేస్తూ కొన్నివారాల పాటు సముద్రయానం చేసి అమెరికా చేరుతాడు. రచయిత వర్ణించిన ఓడ ప్రయాణం చదువుతుంటే అందులో ప్రయాణించడం కన్నా చావడం అతి ఉత్తమమని అనిపించకమానదు. విసర్జించిన మలమూత్రాలు బందీల చుట్టూ అట్టలు అట్టలుగా పేరుకున్న చోటే నిద్రాహారాలతో ప్రయాణమంటే ఎంత జుగుప్సాకారంగా ఉంటుందో చదువుతున్న మనకే కడుపులోని ప్రేగులు నోట్లోకి వచ్చేస్తాయా అని అనిపిస్తుంది . ఒకవేళ బానిస నోరుతెరిచాడో కొరడాతో చర్మం చెమడాలు చెమడాలు కింద వొలిచేవారు. దారిలోనే గాల్లో కలిసిపోయిన ప్రాణాలను సముద్రంలోకి పడేస్తారు. బ్రతికిన వాళ్ళతో ఎలాగోలా తీరానికి చేరుకున్న కుంటాను సంతలో పశువులను కొన్నట్లు ఒక తెల్లదొర వేలంలో కొంటాడు.

నిగ్గరుగా బ్రతుకుతున్న కుంటా చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. దొంగచాటుగా వాటిని పాటిస్తూ అవకాశం చిక్కినప్పుడల్లా పారిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. దొరికిన ప్రతిసారి చావుదెబ్బలు తిన్నా విశ్వ ప్రయత్నాలను మాత్రం ఆపడు. ఒకసారి ఇలానే పారిపోయి దొరకనప్పుడు శిక్షించదలచిన తెల్లవాడు నీ పురుషాగము, కాలి పాదాల్లో ఏదోటి కోరుకో అని అడిగితే తన వంశం తనతోనే అంతమవడం ఇష్టంలేక తన రెండు చేతుల్ని అడ్డు పెట్టుకోడంతో.. చర్మం నుండి, నరాల నుండి, కండలనుండి, ఎముకలనుండి ఒక్కవేటుతో కుడికాలు పాదం తెగి ఎగిరి అవతల పడుతుంది. ఇక విధిలేని పరిస్థితుల్లో అక్కడే నిగ్గరుగా బానిస బతుకు బతుకుతూ తనతోటి మరో నిగ్గరు స్త్రీ భెల్ ని పెళ్లిచేసుకుంటాడు .

కొన్నాళ్లకే వీరికి పుటిన పాపకి కిజ్జీ అని పేరు పెట్టి ఆఫ్రికా సాంప్రదాయాల ప్రకారం పెంచుతాడు. చిన్నప్పటి నుండి తన కథనంతా కిజ్జీ కి చెప్పి నీ ముందుతరాలకు కూడా ఇలానే చెప్పమని కోరతాడు. తవాత కిజ్జీ తన బాధలు, తన తండ్రి బాధలు తన సంతానానికి చెబుతూ రాబోయే తరాలకు కూడా ఇలానే చెప్పాలని చెబుతుంది. ఇక్కడ కిజ్జి కూడా అమ్మా నాన్నలకు దూరమై వేరే దొరదగ్గరకి బానిసగా బ్రతకడానికి అమ్మబడుతుంది. అలా కుంటా కథ తరతారలకు చెప్పబడుతూ ఏడవ తరం వాడైనా రచయిత అలెక్స్ హైలీ కి చేరుతుంది. ఇక్కడినుంచి రచయిత దేశదేశాలు తిరిగి, ఎన్నో గ్రంధాలు, ప్రభుత్వ రికార్డులు పరిశీలించి కుంటా స్వగ్రామమైన జాఫురుకు చేరుకుంటాడు. కందెన నలుపు శరీరం గల తన పూర్వీకులను చూసి తన శరీర వర్ణాన్ని పోల్చుకొని చుస్తే తన వర్ణ సంకరత్వానికి కుమిలిపోతాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది.

తెల్లవాళ్లు నల్లవాళ్ళ స్వేదంతో పంటలు విరగ పండించి లాభాలు ఆర్జించారు! తమ లైంగిక వాంఛను తీర్చుకోవడం కోసం అనేకమంది నల్లవాళ్ళ మహిళలపై ఘోరమైన హత్యాచారాలు చేశారు!! వాళ్లకు పుట్టిన పిల్లలు తమ వారసులని తెలిసికూడా వాళ్ళతో ఊడిగం చేయించారు!! స్వేచ్ఛ కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న సమయంలో లేనిపోని ఆంక్షలను వారిపై రుద్ది, తెల్లవాళ్ళ అనుకూల చట్టాలను తయారు చేసి ఎక్కడికక్కడ వాటిని అణచివేయసాగారు!!!

నాగరికులమని, అభివృద్ధి చెందిన వారమని చెప్పుకొనే అమెరికన్లలో అత్యంత పాశవికమైన చీకటి కోణాన్ని ఈ నవల మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. బానిసలుగా ఆఫ్రికన్లు బ్రతికిన బ్రతుకు, తెల్లవాళ్లు పెట్టిన చిత్రహింసలు, చేసిన హత్యాచారాలు హృదయవిదారకంగా ఉంటాయి. స్వేచ్చావాయువుల్లోనుండి బలవంతంగా బానిస బతుకులోకి ఈర్చబడిన కుంటా మళ్ళీ స్వేచ్చావాయువుల్లోకి వెళ్ళడానికి పడిన తపనని... చదివేకొద్దీ వచ్చే కన్నీళ్లు చుస్తే ఆకాశానికి చిల్లులు పడ్డాయా అని అనిపించకమానదు! ముఖ్యంగా కుంటా ఆఫ్రికాకు దూరమైనా తన భాషా, సంస్కృతీ సాంప్రాదాయాలను, మతాన్ని విడిచిపెట్టడు. తన వంశ చరిత్ర రాబోయే తరాలకు కూడా తెలియాలని తాపత్రులపడుతుంటాడు.

రూట్స్' పేరుతో 1976 లో ప్రచురితమైన ఈ రచన మూడు దశాబ్దాల క్రితం ఏడు తరాలు పేరుతో సహవాసి గారు తెలుగులోకి అనువదించారు.

Download it from following Link

Download

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#3
[Image: images?q=tbn%3AANd9GcT3_qRP3_icFB7Vh0Oy2...zb6CKzMwYR]
ఓల్గా నుంచి గంగకు…



విస్తృత ప్రాతిపదికమీద రచనల్ని మౌలికంగా రెండు విధాలుగా విభజించి చూడవచ్చు. మొదటి రకం కల్పితాలు. రెండవ రకం వాస్తవాలు. ఈ రెండు కలగలసిన రచనలే ఎక్కువ. చారిత్రక రచనల విషయానికి వస్తే ఖచ్చితత్వం పాటించాల్సిన రచనలు
దురదృష్టవశాత్తూ కల్పితాలుగా, కల్లబొల్లి కథనాలుగా పాలక పక్ష బాకాలుగా లభిస్తున్న సందర్భాలే ఎక్కువ. అయితే అలాంటి దౌర్బాగ్యం నుండి విముక్తి కలిగించి మానవ సమాజ పరిణామ క్రమాన్ని ఖచ్చితంగా మన ముందుకు తెచ్చిన పుస్తకం ‘ఓల్గా నుంచి గంగకు’.
రాతి యుగానికి పూర్వం నుంచి మానవుని జీవితం ఎలా సాగుతూ వస్తోందో.. దొరికిన చారిత్రక సాక్ష్యాధారాలను ఆలంబనగా చేసుకుని సాధారణ పాఠకులకు అర్థమయ్యే రీతిలో ఆసక్తి కలిగించే విధంగా మానవ చరిత్రను చెప్పే మహత్తర ప్రక్రియ ఇది.
రాహుల్‌ సాంకృత్యాయన్‌!!! అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయిత. బహుభాషా పండితుడు. గొప్ప చరిత్ర కారుడు. స్వాతంత్య్ర సమరయోధుడిగా సుదీర్ఘకాలం కారాగారంలో గడిపిన త్యాగశీలి. ఆయన స్వయంగా అనేక ప్రదేశాలు తిరిగి పరిశోధించి మానవ సమాజ క్రమాన్ని ఒక అద్భుత చరిత్రగా మలచి మన ముందుకు తెచ్చిన పుస్తకం… ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న ”ఓల్గా నుంచి గంగకు”. ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు.
మనిషి ఎప్పుడూ నిలకడగా లేడు. సమాజం కూడా అందుకు అనుగుణంగా మారుతూనే వచ్చింది. ఆ క్రమంలోనే నాయకత్వం మార్పు జరిగింది. లింగ వివక్ష తెరమీదకు వచ్చింది. గుంపుకు నాయకత్వం వహించిన ఆదిమ మహిళ నుండి నేటి ఆధునిక మహిళవరకు సమాజంలో వచ్చిన మార్పులు ఏమిటి?? మాతృస్వామ్య వ్యవస్థ పితృస్వామ్య భావజాలానికి జారిపోయిన క్రమం ఎలాంటిది? ఈ ప్రశ్నలకు సమాధానమే ”ఓల్గా నుంచి గంగకు”.
క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల కాలం నుంచి క్రీస్తు శకం 1942 వరకు జరిగిన కాలంలో ఇండో యూరోపియన్‌ జాతి మానవ వికాసాన్ని ఆసక్తికరమైన 20 కథలుగా మలిచారు రాహుల్‌. ఓల్గా తీరపు మంచు ఎడారి నేపధ్యంగా సాగే తొలి కథ ‘నిశి’తో మొదలుపెట్టి పాట్నాలోని గంగా తీరంలో సాగే ”సుమేరుడి” కథ వరకు సాగే ‘ఓల్గా నుంచి గంగ వరకు’లో అన్ని కథలు ఊపిరి బిగపట్టి చదివించేవే.
తొలి కథలో ఆర్యుల సంస్కృతి కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు రాహుల్‌. స్త్రీ కుటుంబ పెద్దగా ఉండడం, ఆమె సారధ్యంలో కుటుంబం యావత్తూ వేటకు వెళ్ళడం, ఆమె తనకు నచ్చిన పురుషుడితో (సోదరుడు, కుమారుడు లేక చుట్టూ ఉన్నవారు) కూడి సంతానాన్ని వృద్ధి చేయడంతో మొదలు పెట్టి, కుటుంబంలో వచ్చిన చీలికలు, సమూహాలు, వాటి మధ్యన ఆధిపత్యపు పోరు, జీవికను వెతుక్కుంటూ సమూ హాలు చేసే మజిలీలు, నెమ్మది నెమ్మదిగా సంస్కృతిలో మార్పులు వచ్చి పురుషుడు కుటుంబ పెద్ద అవ్వడం, వివాహ వ్యవస్థ, స్త్రీ స్థానం తగ్గుతూ పోవడం… ఇవన్నీ మొదటి ఆరు కథల్లో చిత్రించ బడ్డాయి.
ఆర్యులకి, అనార్యులకి మధ్య యుద్ధం జరిగిన క్రమం… ఆ క్రమంలోనే రాజుని తమ చెప్పుచేతల్లో పెట్టుకునే పురోహిత వర్గం బలపడడం, వేదాలు అందుకు చేసిన దోహదం తరువాతి కథల్లో విశదంగా చెప్పబడుతుంది. సమాజంలో అసమానతలకి మతం ఎలా కారణమయ్యిందో చాలా బలంగా చెప్తారు రాహుల్‌. రాజు-పురోహితుడు-మతం ఈ మూడూ కలిసి సమాజాన్ని ప్రభావితం చేసిన తీరు ఉదాహరణలతో చూపిస్తారు రచయిత.
బౌద్ధ స్థాపన, విస్తరణ, దేశం మీద జరిగిన దండయాత్రలు, అలాగే ఇస్లాం స్థాపన, విస్తరణ, కంపెనీ పాలనలో భారతదేశం, అప్పటి క్రైస్తవ ప్రభావం… ఇవన్నీ కళ్ళకి కట్టినట్లు వర్ణింపబడతాయి.
ఆ తర్వాతి కథల్లో ఈస్టిండియా కంపెనీల కాలంలో జమీందారీలను ఏర్పరచడం, అందువల్ల రైతులకు ఎదురైన ఇబ్బందులు, సామంత రాజుల బలహీనతల్ని ఆంగ్లేయులు సొమ్ము చేసుకోవడం, సిపాయిల తిరుగుబాటు, గాంథీజీ మొదలుపెట్టిన ఉద్యమం, ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించే వర్గం అభిప్రాయాలు… ఇంతవరకు కథలను తీసుకువచ్చి, చివరకు సామ్యవాదం మాత్రమే సమ సమాజాన్ని తీసుకు రాగలదన్న అభిప్రాయంతో ఈ పుస్తకాన్ని ముగించారు రాహుల్‌ సాంకృత్యాయన్‌.
ఒక్కొక్క కథ ఒక్కొక్క యుగం నాటి ఆచార వ్యవహారాలను, అలవాట్లను చిత్రిస్తుంది. సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని కథ నడిపించడం కష్టం కాకపోవచ్చు. కానీ వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పటి జీవనశైలి, మనుషుల భావాలు, భావోద్వేగాలు, అలవాట్లు చిత్రించడం చాలా కష్టమైన పని. కానీ రచయిత రాహుల్‌ సాంకృత్యాయన్‌ ఆ పని చాలా గొప్పగా చేశారు. అందుకుగాను ఆయన చేసిన పరిశోధన అంతా ఇంతా కాదు. బౌద్ధ భిక్షువుల జీవనశైలిని అక్షర బద్ధం చేయడానికి ఆయన దారి కూడా సరిగా లేని కొండల్లో నడుస్తూ, టిబెట్‌, కాశ్మీర్‌, లడఖ్‌, కార్గిల్‌ ప్రాంతాల్లో తిరిగి అక్కడ లభ్యమైన పుస్తకాలను కంచర గాడిదలమీద తరలించుకు వచ్చారట. అవి అధ్యయనం చేయడానికి ఆయన టిబెటిన్‌ భాషను నేర్చుకున్నారు. ప్రపంచంలో యాత్రలను చేయడానికి మించిన గొప్ప పని లేదంటారాయన. యాత్రలంటూ జరగకపోతే మనిషి నాగరికతలో ఇంత పరిణామం జరిగి ఉండేది కాదనీ, సమాజం పశు స్థాయి నుండి మానవ సమాజంగా ఇలా మారి ఉండేది కాదనీ.. అంటారు రాహుల్‌ సాంకృత్యాయన్‌.

Download. It from below link

Download

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
#4
సోదరా రాజు..
నీ నూతన నామధేయం కాస్త పొడవుగా వుండటంతో పాత పేరుతోనే సంబోధిస్తున్నాను. ఏమనుకోకు...
నా ఈ దారంలో పుస్తకాలనూ, వాటికి సంబంధించిన సమీక్షలను జతచేర్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఐతే... బయటవారు వ్రాసిన సమీక్షలు కాకుండా... ఇక్కడ ఆయా పుస్తకాలను చదివిన పాఠకులు తమ అభిప్రాయాన్ని తమ స్వంత మాటల్లో తెలియజేయాలన్న కోరికతో ఈ దారాన్ని ప్రారంభించాను.
కావలిస్తే... సేకరించిన సమీక్షని కూడా ఇక్కడ పోస్టు చెయ్యవచ్చును. ఐతే, ఆ సమీక్ష వ్రాసిన సదరు వ్్యక్తి పేరుని జతచేస్తే బావుంటుంది... 
ఐనా తప్పు నాదే... దారాన్ని ప్రారంభించాక మొదటి పోస్టులో ఇదంతా చెప్దామని వ్రాశానుగానీ, అది డిలీట్ అయిపోయింది. అప్పటికి నిద్ర ఆవహించి బద్ధకించేశాను.
ఇప్పుడు మీకు పై పుస్తకాలను చదివిన తర్వాత కలిగిన అభిప్రాయాన్ని మీ మాటల్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

స్వస్తి
వికటకవి ౦౨

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#5
మిత్రమా కవీ...
పై రెండు పుస్తకాలూ నేను చదివాను కానీ వాటిపై సమీక్ష రాసే శక్తి నాకు లేదు.. అందుకే కాపీ పేస్ట్ చేసాను...  మంచి పుస్తకాలకు సంబంధించి అందరికీ తెలియజేయాలని నా ఉద్దేశ్యం .. 
మీరు చెప్పినట్టు సమీక్ష రాసిన వారి పేరు ఇకనుంచి రాస్తాను..

 

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#6
మంచి ప్రయత్నం కవి గారూ.. దీని వల్ల మంచి పుస్తకాల గురించి అందరికీ తెలుస్తుంది... మంచి సమీక్ష చదివితే ఆ పుస్తకం చదవాలని కోరిక పుడుతుంది... పాత xossip సైట్ లో నేను ఇటువంటి దారాన్నే తెరిచాను...

అందరూ తాము చదివిన పుస్తకాల గురించి ఇక్కడ పంచుకుంటే బాగుంటుంది
Like Reply
#7
(22-03-2019, 07:16 PM)Lakshmi Wrote: మంచి ప్రయత్నం కవి గారూ.. దీని వల్ల మంచి పుస్తకాల గురించి అందరికీ తెలుస్తుంది... మంచి సమీక్ష చదివితే ఆ పుస్తకం చదవాలని కోరిక పుడుతుంది... పాత xossip సైట్ లో నేను ఇటువంటి దారాన్నే తెరిచాను...

అందరూ తాము చదివిన పుస్తకాల గురించి ఇక్కడ పంచుకుంటే బాగుంటుంది

good Idea.

నిజం నిజం సమీక్ష వల్లే ఆ పుస్తకానికి ఇమేజ్ పెరుగుతుంది. 
మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు.

castaway అన్న మూవీ చూడండి.
దానిలో ఒంటరి దీవిలో తోడు-నీడ ఒక కొబ్బరి బొండం.
Like Reply
#8
తప్పుచేద్దాం రండి.. సమీక్ష

[Image: a62bbc5b-a46b-49e6-8d1a-04c18d2f4994.jpg]



యండమూరి వీరేంద్రనాథ్ రచనల్లో 'బెస్ట్' ఏదీ అంటే చెప్పటం చాలా కష్టం... ఏవైనా రెండే ఎంచుకోమంటే నేను మొదటగా[b] "తప్పుచేద్దాం రండి"
తర్వాత  "అంతర్ముఖం" ఎంచుకుంటాను...

"తప్పు చేద్దాం రండి" అద్భుతమైన రచన...
యండమూరి ముందు నవలలు రాసాడు... తర్వాత "విజయానికి అయిదు మెట్లు" రాయడం ద్వారా వ్యక్తిత్వ వికాస రచనల్లో అడుగు పెట్టాడు...

"తప్పు చేద్దాం రండి" ఈ రెండు కోవల్లోకీ వస్తుంది...
ఒక వైపు ఉత్కంఠ భరితంగా ఒక కథను చెబుతూనే అందులోని పాత్రల ద్వారా వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెబుతాడు రచయిత... మొదటిసారి చదివినప్పుడు కలిపి చదివినా రెండో సారి చదివేప్పుడు కథ ని గానీ , వ్యక్తిత్వ వికాసం అంశాలు గానీ ఏదో ఒక్కటే చదువుకునే వీలుగా రెండింటినీ రెండు రంగుల్లో ముద్రించారు...

కథ విషయానికి వస్తే ఒక సామాన్యుడు దేవుడి అవసరం లేకుండా ఎవరైనా జీవించ వచ్చని దేవుడితోనే ఛాలెంజ్ చేస్తాడు...  తనకు దేవుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడతాడు... తన ప్రతినిధిగా ఒక సామాన్యురాలిని ఎంచుకొని తాను రాసిన పుస్తకాన్ని ఆమెకు ఇస్తాడు...  
ప్రియుడి చేతిలో మోసపోయిన  అమాయక పేద అనాధ అయిన ఆ అమ్మాయి అతని ప్రభావంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతుంది...

దేవుడు కూడా తన ప్రతినిధిగా  ఒక పరమ భక్తుణ్ణి ఎంచుకుంటాడు... అతని జీవితమంతా  ఎన్ని బాధలు ఎదురైనా దేవుని మీద విశ్వాసం సడలదు..

చివర్లో దేవుణ్ణి ఛాలెంజ్ చేసిన వ్యక్తి, దేవుడు  తమ ప్రతినిధులు సాక్షులు గా చేసుకొని తమ తమ వాదనలు వినిపిస్తారు... ఎవరి వాదన నెగ్గుతుంది అనేది  వేరేవిషయం కానీ పుస్తకం చదువుతున్నంతసేపు మనం ఇంకో లోకంలో ఉంటాం...

పుస్తకంలో ఎన్నో ఉదాహరణలు, చిన్న కథలు ఆసక్తిగా ఉంటాయి...  " మంత్రి కొడుకు- బిచ్చకత్తె" కథ ఈ పుస్తకానికే హైలెట్...

ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం "తప్పుచేద్దాం రండి"

- లక్ష్మి
[/b]
[+] 2 users Like Lakshmi's post
Like Reply
#9
Nenu Kooda Chana pustakalu chadivinanu,kaani naaku sammekshalu raase antha sakthi ledu. Nenu chadivina manchi pustakaalu, 'Oka yogi atma katha' by Sri Paramahamsa Yoganand, ee pusthakamu dadapu 7 sarlu kante ekkuva chadivinanu. Prastutamu eepustakamu naavadda ledu marala dorakute chaduvutaanu, eppudu chadivina kothaga untundi. Ee pustakaalu dadapu 700 pages untundi vela Kooda Rs 200.00 lopaley untundi veelayithe konni chadavandi, idi andaru chadavandi. Migatavi pustakaalu gurinchi taruvatha raastanu.
Like Reply
#10
లక్ష్మిగారూ... మీ సమీక్ష చాలా చక్కగా "కట్టె-కొట్టె-తెచ్చె" అనే విధంగా లేకుండా... విపులంగా, ఆ 'తప్పుచేద్దాం రండీ' అనే విధంగా వుంది ;) :D . మీ సమీక్ష చదివాక నాకు మళ్ళా ఆ పుస్తకాన్ని చదవాలని అనిపిస్తోంది. ధన్యవాదాలు.


ఇలాగే అందరూ ముందుకొచ్చి తాము చదివిన పుస్తకాలను గురించి ఎంతో కొంత సంక్షిప్తంగా అయినా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

యండమూరి వీరేంద్రనాథ్
తప్పు చేద్దాం రండి..!
[Image: 363927.jpg]


యువక్ గారూ... ఈ దారం ముఖ్య ఉద్దేశం పుస్తకాలు చదవాలని ఆసక్తి వున్నవారందరికీ ఏదో కొంచెం మార్గదర్శకత్వం కల్పించటం. మామూలుగా ఒక పుస్తకాన్ని చదివినప్పుడు వారికది నచ్చవచ్చు, నచ్చకపోనూ వచ్చు. కొన్నిసార్లు అందుకుగల కారణం ఇదీ అని వారు చెప్పలేకపోవచ్చు. ఒకవేళ నచ్చిందా లేదా అన్నది చెప్పగలిగితే మాత్రం వాళ్ళకి ఇది ఓ వేదికగా ఉపయోగపడుతుంది. అలాగే చదవాలి అనుకునేవారికి ఆ పుస్తకం ఎలా వుంటుందో తెలియదు. ఒకవేళ చదివాక నచ్చకపోతే అనవసరంగా చదివానే అనిపిస్తుంది. అలాంటప్పుడు ముందుగా ఈ పుస్తకం గురించి తెలిసుంటే బాగున్ను  కదా అని అనిపిస్తుంది. (ఇది నా స్వంత అనుభవం. అల్పజీవి పుస్తకం చదివాక నాకు ఇలాగే అనిపించింది. ఆ పుస్తకం గురించి త్వరలో సమీక్షని వ్రాస్తాను.) అందుకే నాలాంటి వాళ్ళకోసం ఈ దారాన్ని తెరిచాను. 
సమీక్ష అనగానే ఏదో పేద్ద పదంలా అనిపించి దాన్ని మోసే శక్తి నాకు లేదు అని అనిపిస్తుందిగానీ సరదాగా మీ స్నేహితుడు ఫలానా సినిమా చూడొచ్చా అని అడిగినప్పుదు మనం చెప్తాం చూడండి... వద్దంటున్నా సినిమా కథ, డైలాగులు, అప్పుడప్పుడు సస్పెన్సు కూడా రెవేల్ చేసేస్తాం అత్యుత్సాహంలో... అది సినిమా చూడాలి అనేవాళ్ళకి (పాజిటివ్/నెగటివ్) ఏదో ఒక ఐడియాని ఇస్తుంది... అలానే ఇక్కడా మిత్రులతో పంచుకోండి. సదరు పుస్తకం గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది వాళ్ళకి... ఒకరు పంచుకున్నరని మరొకరు అదే పుస్తకం పైన ఏమీ చెప్పకూడదు అనే ఆంక్షలు ఏమి లేవిక్కడ. ఏవరి నెరేషన్ స్టైల్ వాళ్ళది. కనుక ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. అలాగని పైన చెప్పిన విధంగా కథల్లోని సస్పెన్సులు బయటపెట్టకండి. చదివే మూడు, ఇంట్రెస్టు రెండూ రివ్వున ఎగిరిపోతాయి.
వీలైనంతవరకూ అందరూ తెలుగులోనే సమీక్షలను వ్రాయటానికి ప్రయత్నించండి. అది ఆంగ్ల పుస్తకమయినా అయినాసరే!
ఇక మీరు చెప్పిన 'ఒక యోగి - ఆత్మకథ పుస్తకం' గురించి వెతికాను యువక్ గారూ. ఈ క్రింది సైట్ లో దొరికింది.

ఇదిగోండీ ఆ లింక్ 

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#11
యద్దనపూడి సులోచనా రాని గారి రచనల్లో నాకు బాగా నచ్చినవి...

మీనా, సెక్రెటరీ, జీవన తరంగాలు, ప్రియసఖి....

చడవని వాళ్ళు చదవండి
Like Reply
#12
అలాగే మీరు చదివిన పుస్తకాల్లో మీకు బాగా నచ్చిన వాటి గురించి నాలుగు మాటలు రాయండి... కుదరకపోతే పేర్లయినా చెప్పండి... మీగతా వారికి ఉపయోగ పడతాయి...
Like Reply
#13
చలం - అమీనా [Chalam - Ameena]


అంతర్జాలంలో నాకు లభించిన అత్యద్భుతమైన నిష్పక్షపాత సమీక్ష ఇది. దీన్ని విప్లవ్ కే వ్రాసారు. అమీనా పుస్తకాన్ని చదవాలనే కాంక్షని నాలో కలిగించిన ఈ సమీక్షని ఇక్కడ అందరితో పంచుకోవాలని కాపి చేసి పోస్టు చేస్తున్నాను.



Quote:చలం గురించి కానీ, అతని ( ఆయన / గారు అని నేను అనను.  సమీక్షించేటప్పుడు కోర్టులో జడ్జీ అంత నిష్పాక్షికంగా వ్యవహరించాలి కనుక, మర్యాద మొదలెడితే విమర్శ నిఖార్సుగా రాదు కనుక)  రచనాశైలి గురించీకానీ, philosophy గురించైనా ఇవ్వాళ నేను రాయడం అంటే ఒకట్రెండు జీవితకాలాల లేటుగా జరుగుతున్న వ్యవహారం. కానీ నేను చదివిన అతని రచనలు కొన్నిటిని గూర్చి సమీక్షలూ, విమర్శలూ గట్రా చదువుదామని మూడునాలుగు సంవత్సరాలుగా గూగుల్‍లో చూస్తున్నా ఎప్పుడూ ఏవీ కనపడలేదు. కొంచెంలో కొంచెం మైదానం గురించైతే వాడివేడి discussions, arguments జరిగాయ్ తప్పితే. నాకు అర్థం అయినంతలో, అర్థం చేసుకుంటూ చెబుతున్న అర్థాలే ఈ సమీక్షలనీ,
విభేదించేవారు బాహాటంగా తిట్టిచ్చని confess చేస్తూ…మొదటగా ” అమీనా” గురించి:


ఒక్కమాటలో కథ గురించి చెప్పాలీ అంటే, “పన్నెండూపదమూడేళ్ళా బాలికపట్ల ఆకర్షితుడై ఆ అమ్మాయి కోసం తపించిన ఒక మగవాడి కథ” ఇలా ఇంత క్లుప్తంగా చూస్తే, ఇదేదీ అనైతిక సంబంధం గురించి, అసాంఘిక అక్రమ వ్యవహారమనీ, tale of perversion in lust అనీ, pedophilic themes అనీ…ఎన్నో రకాలైన వెగటు భావాలు తోస్తాయి. సరిగ్గా, ప్రపంచ ప్రసిద్ధిపొందిన “LOLITA” నవల కూడా ఇదేలాంటి కథాంశంతో అప్పట్లో (1950s) సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈనాటికీ ఆ నవల గురించి మంచిగానూ చెప్పొచ్చు, చెడుగానూ చూడొచ్చు అని interpretations  జరుగుతూనే ఉన్నాయి. కానీ, సాంస్కృతికంగా అంతగా బరితెగించని, పరాయి దేశస్థుల పాలనలో ఉన్న మన దేశంలో దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితమే అదేలాంటి నవల వచ్చి ఉంటే మనం దాన్నిగురించి అట్టే analyze  చేసుకోకపోవడం చాలా విచారకరం.
కథా వస్తువు నేను పైన చెప్పిన ఒక వాక్యంలో ఉన్నదే అయినప్పటికీ, ఆ కథను వ్రాసిన తీరు, పాత్రలను సన్నివేశాలను మలచిన తీరు చూస్తే ఈ నవల చాలా వరకూ abstractగానే ఉంటుంది. కొన్ని పాత్రలకు అసలు పేర్లు ఉండవు, వారి ముఖాలూ, పర్సనాల్టీల గురించి అట్టే వర్ణనలు లేవు. అసలు కథ జరిగే ప్రదేశం గురించైనా విపులంగా చెప్పలేదు.  కొన్ని పాత్రల పేర్లు తక్కిన చలం రచనల్లో లాగానే మారుపేర్లు రహస్యాలు. నిజానికి అయినా అబద్ధానికి అయినా భావం ఉంటుందే కానీ రూపం ఉండదు అన్నట్లేమో, కథ చెప్పడంలో రూపాలగురించి వివరాలు చెప్పకపోవడం వలన భావం మాత్రమే ఆవిష్కరింపబడి భరించలేనంత impact  కలిగిస్తుంది.


కథ detailed synopsis: (Read at your own Risk)
ఎందుకో ఏమిటో కానీ, కథానాయకుడు ( అది చలమో లేక మరొకరో తెలీదు) ఒక ఊర్లో, తన స్నేహితులతో ఉంటాడు. అతని narrationలో సాగే కథలో, అతనితో పాటు ఉన్న స్నేహితులు రకరకాలవాళ్ళు. కొందరు వస్తుంటారు. కొందరు వెళ్తుంటారు. 1970s లో ప్రాచుర్యం పొందిన హిప్పీల్లా అనిపిస్తుంది వాళ్ళ జీవనశైలి, ఇవ్వాళ 2000s దాటిన మన మనస్తత్వంతో చూస్తే. కాకపోతే హిప్పీలు తిరుగుతూ ఉంటారు. వీరు ఒకచోట ఉండిపోతారు. వీరి స్నేహితుల్లో కొందరికి ప్రేమ సమస్యలు ఉంటాయి. అది అక్రమమో సక్రమమో తెలియని, తేల్చుకోలేనట్టివి. కథానాయకుడికీ చాలామంది స్త్రీ-స్నేహితులు. వాళ్ళల్లో అతనికి కొందరంటే ఇష్టం ఉంది, ఇంకొందరంటే ఇష్టం పోయింది. దాదాపు ఇలా polyamorousగా “దినానికి ఇరవైనాలుగు గంటలూ చాలని ” రోజుల్లో , “మొండిగోడల” ఇంట్లో బ్రతికేస్తున్న అతనికి ఒకరోజు , ఊరిచివర పాకలో ఉండే ''ల ( చలం భాష ప్రకారం అయితే తురకల… ఇవ్వాల్టికంటే ఆరోజుల్లోనే ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషెన్ ఎక్కువేమో ) అమ్మాయి పరిచయమౌతుంది. ఇతను అన్నా, ఇతని life style నచ్చిన ఆ అమీనా అతనితో వచ్చేస్తాను అంటుంది. అన్నం లేక చాపలు కాల్చుకు తినే ఆ అమ్మాయిని , అన్నం చేసుకునే ఓపికా , ఆసక్తీ లేక హోటలు అన్నం తెచ్చుకుని తినే తమ జీవనశైలిలోకి ఆహ్వానిస్తాడు కథానాయకుడు. ఆ అమ్మాయి మాట , తీరూ మాత్రమే కాదు పాట కూడా నచ్చుతుంది అందరికీ. అమీనా పాట వినాలనీ , ముఖం చూడాలనీ సరే అంటారు అందరూ.సేవకురాలిగా అతని దగ్గర
ఉండిపోతుంది. అది డబ్బు , జీతం కోసం చేసే ఉద్యోగంలా చేసే సేవ కాకపోగాట, ప్రేమతో చేసే సపర్యలలా ఉంటాయి.  అతనికోసం “జీవం” , విమల, శ్యామల, సుబ్బులు ఇలా ఎందరో స్త్రీలు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళందరూ అతనికి ఇష్టమే కానీ , అతనిలో ఏదో అసంతృప్తి. ప్రేమ చాలదన్నట్లు , ఇంకా కావాలన్నట్లు. ఆ వచ్చే స్త్రీలు ఇతడిలో ఏదో ఆశిస్తూ ఉంటారు లేదా ఇతనే వారి నుంచి ఏదో ఆశిస్తూ ఉంటాడు. కానీ ఏదీ ఆశించకుండా అమీనాను మాత్రం చూస్తే చాలు , ఆ అమ్మాయి పక్కన ఉండి కనిపిస్తూ వినిపిస్తూ ఉంటే చాలన్నట్లు ఉంటాడు. ఎంత ప్రవిత్రంగా ఉండజూసినా శరీరంలో రేగే కోర్కెలు , మనసులో ,ఎగసే వికారాలు. అవన్నిటినీ ఇంకే స్త్రీ పైనో చూపించదలుస్తాడు కానీ , అమీనా దగ్గర మాత్రం పసివాడిలానో , తండ్రిలానో మాత్రమే ఉండబుద్ధేస్తుంది.  వయస్సుకూ,genderకూ అంటని ,అసలు ఇదీ అని చెప్పలేని “relationship”లో అతను రగిలిపోతుంటే అసలు అతనికీ మిగతావారికీ ఉన్న సంబంధం ఏమిటో define చెయ్యమనీ నిరంతరం పోరుతూ, చూఛాయగా తనూ ఒక నిర్వచనాన్ని కోరుకుంటున్నట్లు తెలియజేస్తుంటుంది అమీనా. అలా నిర్వచించ ఇష్టపడని అతని నుండి ఆమె దూరమౌతుంటే ఆమె కోసం అర్రులు చాస్తూ , అసహాయంగా మిగిలిపోతాడు అతను.
ఇది , చదివితే తెలిసే కథ. అరటిపండు వొలిచి నోటికందినట్లు అర్థమయ్యే కథ. కానీ చలం రచనాశిల్పంలో  దాగి ఉన్న కథ మరొకటి ఉంటుంది. ఈ అమీనాలో ఆ, hidden story ఏమిటంటే : its a story of man’s (or human’s) relationship with “change”. మార్పు అంటే ఇష్టపడని మనిషి , మార్పు లేనిదే జీవితం లేదనే సత్యం తెలిసీ ఆ మార్పుకు దూరంగా ఉండాలని వెర్రిగా యత్నించీ చుట్టూ ప్రపంచం అంతా మారిపోతుంటే తనొక్కడూ మారిపోకుండా ఉండిపోవడమూ మార్పే అవుతుందని తెలుసుకోలేక అనాధగా ,అభాగ్యుడిగా మిగిలిపోవడం themetic elementలా అనిపిస్తుంది. ప్రపంచాన్ని ఒక ఆడదానిగా చూపించినట్లు తీసుకుంటే, ఈ కథ:
ఆడదాన్ని ప్రేమించకుండా ఉండలేని ఒక మగవాడు , ఒకరి కంటె ఎక్కువ మంది ఆడవారే తనకు దగ్గరవుతున్నా వారు తన నుంచి “ఏదో” ఆశించడం గ్రహించగానే ఆ బంధంలోని unconditionality నశించడంతో ఆ ఆడదాన్ని ద్వేషిస్తూనే ప్రేమిస్తూ ప్రేమిస్తూనే ద్వేషిస్తూ , అసలు ఇదంతా స్త్రీ బుద్ధి అని స్త్రీ జాతినే ద్వేషించకుండా ప్రేమించలేని పరిస్థితుల్లో ఉండగా.
ఇంకా స్త్రీ కాని/ స్త్రీ అయ్యే పరిణామంలో ఉన్న ఒక అమ్మాయి అతనికి తారసపడుతుంది.
ఆమె స్త్రీగా వికసించేలోగా ఆమె పట్ల ఆకర్షుతుడయ్యే అతను. అతని ఆకర్షణ, ప్రేమ నిలబడేలోపలే స్త్రీ గా మారిపోయే ఆమె. గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారే  moulting-stageలో ఉన్నప్పుడు, ఎటూ కానీ ఆ జీవిని ప్రేమిస్తే.. ఆ ప్రేమ ఎంత క్షణికం. అసహ్యంగా కనిపించినా ఇష్టపడిన పాత రూపు ఉండదు , అందమైన కొత్త రూపు నచ్చదు.
ఇదీ క్లుప్తంగా కథ.  గొంగళిపురుగు సీతాకోకచిలుక పోలిక , నా సొంత analogy అయినప్పటికీ , చలం వర్ణనల్లో ఆయన ఉద్దేశ్యం అదే అని బలంగా అనిపించింది. మొదటి సారి అమీనాకు ఆకర్షుతుడవ్వడం , ఆమె అతనికి గుర్తుకురావడమూ… బురదలో , దుమ్ముకొట్టుకుపోయి, మురికిగా ఉన్న పిల్లగా కనిపిస్తుంది. అప్పుడే ఆమె అతనికి నచ్చుతుంది. కానీ ఆమె అతడిని విడిచి పోయేప్పుడు మాత్రం, అతని దగ్గరే తీసుకున్న డబ్బుతో కొనుక్కున రెండు గజాల కొత్త పరికిణీ. అది చాలటం లేదు అని complain చేస్తూ పోతుంది..ఒక అందమైన ఆడపిల్లలా. అతడి దగ్గరే పీడించి తీసుకున్న డబ్బుతో అలా మారిపోవడం అంటే, ఆ మార్పుకు అతనే కారణం అని చెప్పజూడడం కావొచ్చు.
ఏది ఏమైనా ఇలా ఆలోచించిజూస్తే , 1928లో చలం ఈ రచన చేసేందుకు మూడు సంవత్సరాల క్రితమే జెర్మ రచయిత Franz Kafka అద్భుత సృష్టి అయిన THE METAMORPHOSIS చలం అంత త్వరగా ( అంటే మూడు సంవత్సరాలలో ఆ కథ జెర్మన్ నుండు తర్జుమా అయి మన దేశానికీ వచ్చి ఉంటే )చదివి , అందులోని ” మార్పు
కలుగజేసే భయాన్ని ” poeticగా , శృంగారభరితంగా ఆలోచించి అమీనా రచించాడా అనిపిస్తుంది. కాకపోయి ఉండొచ్చు కూడా , గొప్ప మనుష్యులు గొప్ప ఆలోచనలు
ఏకకాలంలో చేయడం చరిత్రలో నిరంతం జరిగేదే. విచిత్రం ఏమిటంటే లోలితా వ్రాసిన నొబొకోవ్ కూడా మెటామార్ఫొసిస్‍ను క్షుణ్ణంగా analyze చేసినవాడే.


ఇక అమీనాలోని వాక్యాలూ , అందమైన పోలికలూ:

అబద్ధాలు చెప్పేవారిని ఎత్తిపొడుస్తూ, “వాళ్ళు పది గజాలు తమ మధ్య కొలుచుకు కూర్చున్నారు ,ఆరుగజాల పొడుగు ఎటూ లేని గదిలో “

ఒక స్త్రీలోని selfishnessను వివరిస్తూ : “నేనేమైపోతాను ” అనేదే ఆమె ప్రశ్న. “నేనున్నాను” అంటాను, ఆ మాటే పట్టట్లేదు . అనాల్సిన మనిషి అనట్లేదనే బాధే కానీ అనేవాడిని నా గురించి ఆలోచించదే.

“స్త్రీ జనం మీద ఒళ్ళు మండుతోంది” అనేంత స్త్రీ ద్వేషంతో పీడింపబడే సమయాల్లో ప్రేయసిని అతను వర్ణించడం : “నా రతీదేవి , నా కాళి నన్నే బలి కోరుతోంది”

“అమీనా నువ్వూ స్త్రీవేనా ? ” “బలి కోరుతున్న విధి వెయ్యినాల్కలలో ఒకదానివి”

“girls girls everywhere, not a lip to kiss “(బహుశా ఈ వాక్యం ఈ ఆంగ్ల కవితలో ప్రాచుర్యం పొందిన water water everywhere ..ప్రయోగానికి అనుసరణ కావొచ్చేమో ) , ఇలాంటి ఒంటరితనపు , ప్రేమరహిత నిముషాల్లో రగిలిపోతున్నప్పుడు , “దౌర్జన్యం చేస్తే ” (bang) అనే ఆలోచన కలగడం , 
కానీ మంచీ చెడులను బేరీజు వేసుకుంటూ, అసహాయంగా మిగిలిపోతూ”విరహం మనసులోకి జెర్రులను పిలుస్తోంది” అనుకున్నా “హృదయాలు అంధకార సొరం మార్గాలు..తేళ్ళు, జెర్రులు, బొద్దింకలు, బురద, మధ్యమధ్య మిణుగురు పురుగులు, తవ్వగా తవ్వగా దొరికే మణుల పొడి” అంటూ మంచితనాన్ని నిలబెట్టుకోవడం , అలాంటి సమయాల్లో ఒక వేశ్య అతడిని కవ్వించిజూసి, తానున్నాని సూచిస్తూ దగ్గిన సందర్భాన్ని చెప్పిన పద్ధతి :
“దగ్గు ఆడదగ్గు రమ్మని దగ్గు డబ్బు కావాలని అడిగే దగ్గు ఆకలి.ఆశ. అవసరం.
నా ఆకలి-నా ఆస్తి – నా జాతి – నువ్వు – నీ జేబులోని పర్సు.
వెడితే.
నా నూన్యత , నా బాధ , నా అగ్రహం
స్త్రీ జాతి మీద క్రౌర్యం – ఈమె మీద చూపితే – ?
అసహ్యించి , చించి , నలిపి”

ఇక ప్రకృతిని వివరిస్తూ.. ”  ఏటి పొడవునా రక్తం కారే సాయంత్రాలు”

“మిణుగురుపురుగుల గొడుగు కింద..” లాంటి వాక్యాలు ఆ జీవితంలోని romanticismను అసూయపడేంతగా వర్ణిస్తే ,
“వెర్రి అమీనా పిల్ల చూపుల అమీనా ,పిచ్చి అమీనా, తిరక అమీనా, చింకిరి అమీనా ” అయినా ఆ అమ్మాయి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే
“ఎన్ని ఆల్టర్నేటివ్స్ యోచించుకున్నా , జీవితం మనిషిని ఆశ్చర్యపరచగల కార్ద్ ను చూపించి నవ్వుకుంటూనే ఉంటుంది” అంటూ క్రూరమైన విధిని తల్చుకుని భయపడుతూ ,
“”ప్రేమలోకంలో దిక్కుమాలిన బిచ్చగాళ్ళం
దెబ్బతిన్న గుడ్డివాళ్ళం- అనాధలం- అంధకారులం –
ప్రేమని నిరసించే నేను
ప్రేమను ఆశించే అమీనా” కనిపించకపోయిన క్షణం అతను వెర్రిగా వెదికివచ్చి
ఆమెను చూసుకోకుండా తన ఇంటి గుమ్మంముందే చీకట్లో తొక్కేసినపుడు , ఆ బాధలోనూ ఆ అమ్మాయి అతని కాళ్ళను కౌగిలించుకోవడం , “కన్నీళ్ళు – ఎక్కిళ్ళు
వేళ్ళు – ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళ వేళ్ళు – వేళ్ళ మధ్య వేళ్ళు – పెదమల మధ్య
జుట్టు – రెప్పల మధ్య నీళ్ళు” ఇలా కలయిక-ఎడబాటుల్లో కరిగిపోతూ అతని బాధ

“గట్లు లేని స్వేచ్ఛ మహా భార”మని విచిలుతుడవడం …ఆ “ఎదగని నౌకరు కన్య”
కు,  పరుల దృష్టిలో”ఆ తెలివిగల అందమైన పిల్ల” ఇక రాదు అనిపించినపుడు అతనిలో కలిగే మొదటి ఆలోచన “టీ ఎట్లా త్రాగను ” అవడం , ఇచ్చేవారూ,
పెట్టేవారూ ఎందరున్నా ఆ అమీనా లేనిదే రుచించదన్నట్లు, రెండు రూపాయలిస్తే రెండు గజాల పరికిణీనే వచ్చింది , వొంటికి చాలట్లేదు అంటూ ఎదిగిపోతున్నానని చెబుతూ ఆ అమ్మాయి వెళ్ళిపోవడం…. అన్ని సన్నివేశాలూ దృశ్యకావ్యాలూ , హృదయాంతరాలను కదిలించేవీ, తూట్లు పొడిచేవీ , కన్నీళ్ళతో నింపేవీను.

కథాంశం నచ్చనివారయినా ఈ రచనాశిల్పం కోసం చదవవలసిన నవల. చెప్పడం ద్వారా ఎంత తెలియజేయొచ్చో , చెప్పకపోవడం ద్వారా పాఠకుల మనస్సులో ఎన్నో ఊహలను
రేకెత్తించి ఆ ఊహలన్నిటినీ కొద్ది వాక్యాలలో తన ఊహతోనే కట్టించుకుని తన వెంటే లాక్కుపోవడం రచయితగా చలం ఈ అమీనాలో అద్భుతంగా చేసిన విన్యాసం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#14
(07-04-2019, 12:22 PM)Vikatakavi02 Wrote: చలం - అమీనా [Chalam - Ameena]


అంతర్జాలంలో నాకు లభించిన అత్యద్భుతమైన నిష్పక్షపాత సమీక్ష ఇది. దీన్ని విప్లవ్ కే వ్రాసారు. అమీనా పుస్తకాన్ని చదవాలనే కాంక్షని నాలో కలిగించిన ఈ సమీక్షని ఇక్కడ అందరితో పంచుకోవాలని కాపి చేసి పోస్టు చేస్తున్నాను.





ఆరెంజ్ సినిమా గుర్తొచ్చింది సమీక్ష చదువుతుంటే... 

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#15
చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. Great.

చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు.

నాకిష్టమైన పుస్తకాలు.

మల్లాది - జయం
యండమూరి - స్టూవర్ట్‌పురం పోలిస్టేషన్, తులసి దళం, తులసి
PVRK ప్రసాద్ - సర్వసంభవాం, అసలేం జరిగిందంటే!
సత్యం శంకరమంచి - అమరావతి కథలు
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
[+] 1 user Likes Kavyaraja's post
Like Reply
#16
(20-03-2019, 10:35 AM)Rajkumar1 Wrote: ఏడు తరాలు
---------------------
ఏడు తరాలు... ఇది ఒక బానిసల కథ. 

Thanks for review. ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర పుస్తకశాలలో చాలాసార్లు చూసాను. కాని ఇంత వ్యథాభరిత గాథ అని తెలియదు.
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like Reply
#17
[Image: Vamsi-BBP.jpg]

కోనసీమ కొబ్బరిబొండం నీళ్ళు ఎంత తీయగా ఉంటాయో తెలుసా?
పెళ్ళిలో వడ్డించే తాపేశ్వరం కాజా ఎంత తీయగా ఉంటదో తెలుసా?
శోభనంగదిలో ఆత్రేయపురం పూతరేకు సోకు ఎంత సొగసుగా ఉంటదో తెలుసా?
ఎండాకాలంలో ఈతకొడుతుంటే గోదారి నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయో తెలుసా?
పిల్లకాల్వలో వదిలిన కాయితం పడవ సుళ్ళు తిరుగుతూ ఎన్ని పంట మళ్ళు దాటేసిందో తెలుసా?
మనవాళ్ళ ఎటకారాలకు నవ్వుకొంటూ పున్నమి వెన్నెల్లో సముద్రంలో కలిసిపోయే మన గోదారి తల్లి మొగమెంత బావుంటుందో తెలుసా?
మనదైన యాసని తనదైన శైలిలో రాసే మన వంశీ కథలు అంత బావుంటాయి. తెలుసా? ఆయ్!

స్వాతి వారపత్రిక 3-5-2019 (నుండి) మీదుగా మన వంశీ కథా ప్రవాహం
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like Reply
#18
ఈమాట గురించి
[Image: hive1b.png]

ఈమాట పాఠక లోకానికి స్వాగతం!
సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు, ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక, ఈమాట. లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే ఈమాట లక్ష్యం. 1998 దీపావళి నాడు విడుదలైన మొదటి సంచిక నుంచి ఇప్పటిదాకా...
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like Reply
#19
ఆనాటి మధురగీతాలు
https://www.facebook.com/groups/678796328907486/
|| सततं वाग्भूषणं भूषणम् ||
http://eemaata.com/em/
Like Reply
#20
మైలవరం నుంచి అమెరికా దాకా
పోరాటమే ఊపిరిగా ఎదిగిన ఒక పేద యువతి ఆత్మకథ

...ఐనా, నేను ఓడిపోలేదు!
[Image: IMG-20190602-222714.jpg]
సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకట్లు ముసురుకుంటున్నాయి. పిల్లలకి పాలు కూడా పట్టలేని నిస్సహాయత, నైరాశ్యం నన్ను పూర్తిగా ఆవరించాయి. పసిపిల్లలిద్దర్నీ ఆ పొలాల్లో బోరు బావిలో పడేస్తున్నా, నేనూ దూకేస్తున్నా...
~~~~~~
మూడడుగుల పొడుగు, రెండున్నర అడుగుల ఎత్తు వున్న ఆల్సేషియన్ కుక్క ఆ చీకటి రాత్రిలో కాలి నడకన రూమ్ కి వెళ్తున్న నన్ను అడ్డగించింది. "భౌ" అంటూ ఒక్కసారిగా ఎగిరి రెండు కాళ్ళూ నా భుజమ్మీద పెట్టి నమిలి మింగేసేలా నాలుక బయటపెట్టి నన్ను వాసన చూస్తోంది. చెమటలు పట్టేశాయి. నా పిల్లలు, అమ్మ నాన్న అందరూ గుర్తొచ్చారు. "ఈ రాత్రిలో ఈ కుక్క చేతిలో చచ్చిపోయాను. బ్రతికి బయటపడితే ఇంక అమెరికాలో వుండను. ఇంటికి వెళ్ళిపోతాను దేవుడా" అంటూ ఏడ్చేసాను...
~~~~~~
రిక్రూటర్గా పనిచేయమన్నారు. ఒక రూమ్, ఒక ఫోన్ ఇచ్చారు. ఫోన్లో కాల్ చేయడం ఆరంభించిన మొదటిరోజునే అర్థమైపోయింది. నాకు ఇంగ్లీషు మాట్లాడటం రాదు. అమెరికన్ ఇంగ్లీషు యాస అసలు అర్థంకాదు. ఈ ఉద్యోగం నేనేం చేస్తాను? చేయలేకపోతే, పెట్రోలు బంకులో గ్యాస్ ఫిల్లింగ్ చేయాలా? బేబీ సిట్టింగ్ చేయాలా... ఎంతకాలం? పిల్లలు, కుటుంబం గుర్తొచ్చారు. అమెరికా వచ్చి తప్పుచేశానా? ఓడిపోయానా? నాలో అంతర్మథనం మొదలైంది...
~~~~~~
2008లో అమెరికాని ఆర్థిక సంక్షోభం భయంకరంగా కుదిపేసింది. అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు మూతపడిపోయాయి. చాలామంది భారతీయులు మన దేశానికి తిరిగి వచ్చేశారు. నేనేం చేయాలి? నా కం పెనీ భవిష్యత్ ఏమిటి? అమెరికాకి తీసుకువచ్చిన నా పిల్లల భవిష్యత్ ఏమిటి? తప్పుచేశానా? జీవితంలో ఓడిపోయానా?...
(పుస్తకం చివరి పేజీ నుంచి గ్రహించినది)

.
.
.
లేదు... 
ఐనా, ఆమె ఓడిపోలేదు.

ఒక సామాన్య పేద యువతి... ధీర వనితగా మారి అసమాన్య దృక్పథంతో తనతో పాటుగా వందలమందికి ఉపాధినీ, జీవితాన్నీ, మనోబలాన్నీ అందించింది.

శారీరికంగా సత్తువ లేకపోయినా దృఢచిత్తంతో చావునుండి బ్రతుకు బాట పట్టి తను చదువుకున్న పదోతరగతితో, తనకలవాటైన 'మొండి'తనంతో ముందుకు సాగిపోయిన... కాదు, దూసుకుపోయిన 'జ్యోతి రెడ్డి' తన ఆత్మకథలో మనకు చెప్పిన జీవిత పాఠాలు ఎన్నో... ఎన్నెన్నో...
ఒక 'అనాథ'గా 'బాలాసదన్'లో జీవన ప్రస్థానాన్ని ప్రారంభించిన జ్యోతి, అమెరికాలో మ్యాన్ పవర్ బిజినెస్ ని స్థాపించి నడిపించిన తీరు ఆమెలోని పోరాట పటిమను, అలుపెరుగని సంకల్పాన్ని, నిరంతరం నేర్చుకునే తత్వాన్నీ తెలియజేస్తాయి.

నేడు మార్కెట్లో లభించే ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాల కన్నా ఒక మెట్టు పైనే వుంటుంది ఈ పుస్తకం అనటంలో అతిశయోక్తి ఏమీలేదు. ఎందుకంటే, ఇందులో అడుగడుగునా కనపడేది... జీవితం!

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పక చదవవలసిన పుస్తకం ఇది.

>>> DOWNLOAD <<<

ఈ పుస్తకాన్ని గురించి తెలియజేసిన లక్ష్మిగారికీ, పుస్తకం లింక్ ని అందజేసిన సోదరుడు రాజుకి నా కృతజ్ఞతలు.
ఈ పుస్తకాన్ని చదవటం ద్వారా నేను తెలుసుకున్నదేమిటంటే... ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని వదిలేసి పారిపోవటం కన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి... తప్పించుకునేందుకు సాకులు వెదకకుండా పరిష్కారానికి మరో మార్గాన్ని వెదకాలి అని.
నేను కూడా ఇదే ఆచరిస్తాను ఇప్పట్నుంచీ...

జై జ్యోతి

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: 3 Guest(s)