11-01-2021, 07:37 PM
సూపర్ బ్రదర్
Thriller త్రిపుర
|
11-01-2021, 08:23 PM
very good begining
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
11-01-2021, 08:28 PM
11-01-2021, 08:28 PM
12-01-2021, 08:09 AM
నారాయణ కమల్ గురించి చెప్పింది విని షాక్ అయ్యాడు రాకేష్ "ఏంది అబ్బ నువ్వు చెప్పింది ఈ కమల్ గాడు నీ చెయ్యి నరికనాడా" అని ఆశ్చర్యంగా అడిగాడు దానికి నారాయణ అవును అని తల ఆడించాడు.
( ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన) తారకేశ తల నరికిన తరువాత బాబా ఖాన్ నీ నరకబోతుంటే ఆకాశ్ నారాయణ మీదకి కత్తితో దాడి చేశాడు దాంతో నారాయణ తన కార్ ఎక్కి పారిపోయాడు అడవి దారిలో పారిపోయాడు కానీ లేపాక్షి బార్డర్ లోకి తన కార్ రాగానే కమల్ బైక్ మీద ఎదురుగా వచ్చి బాంబులు వేశాడు దాంతో నారాయణ కీ సెక్యూరిటీ గా ఉన్న జీప్ లు గాలిలో ఎగిరాయి నారాయణ కార్ కూడా ఆ విధ్వంసం లో ఎగిరి పడింది బాంబ్ వల్ల ఎవ్వరూ మిగలేదు నారాయణ బయట పడ్డాడు అప్పటికే కమల్ జీప్ చాటున కత్తి తో దాడి చేయడానికి సిద్ధంగా ఉండి నారాయణ మీదకు దుక్కాడు కానీ నారాయణ కమల్ గొంతు, చెయ్యి పట్టుకుని లేపి "నా కొండెగా నా తోడ అంత కండ లేదు పాంట్ ఏసుకునే వయస్సు రాలేదు నను సంపేదానికి వచ్చీనావు రా" అని గొంతు నులిమి చంపబోతుంటే తన రెండో చెయ్యి మోచేతి తో నారాయణ తల మీద బలంగా గుద్ది కింద పడేశాడు ఆ తర్వాత వాడి భుజం మీద కాలు పెట్టి కత్తి తో మెడ నరకకుండా "నువ్వు ఇప్పుడే చావకుడదు నీ పతనం చూసి నువ్వే చావాలి ఇంక నుంచి మా బాబా జోలికి వస్తే నీ మెడ నే నరుకుతా పో పోయి నిక్కర్ వేసుకున్నే ఒక పోటేగాడు నాకూ ప్రాణ భిక్షం పెట్టాడు అని చెప్పుకో" అని ఆవేశం తో నారాయణ కుడి చేయి నరికి వెళ్లిపోయాడు కమల్. ఇది అంత విన్న రాకేష్ ఆవేశములో కమల్ మీదకు పోతుంటే నారాయణ ఆపి "కండ బలం ఉన్నోడిని బుద్ధి బలం తో గెలవోచ్చు, బుద్ధి బలం ఉన్నోడిని బలహీనత మీద గెలవోచ్చు, కానీ వాడికి బుద్ధి బలం, కండ బలం రెండు ఉన్నాయి గెలవడం చాలా కష్టం అదును చూసి సింహం నీ వేటాడినట్టు వేటాడాలి" అని చెప్పి తన కొడుకును తీసుకోని వెళ్లాడు నారాయణ. కలెక్టర్ ఆఫీసు నుంచి బయటకు రాగానే బాబా ఖాన్ కమల్ నీ దగ్గరికి తీసుకోని "నువ్వు ఒక్కడివి చాలురా నా సామ్రాజ్యం సుఖంగా ఉంటుంది అన్న ధైర్యం తో బ్రతకోచ్చు సరే కానీ రాత్రికి పిల్లోలు క్లబ్ కాడికి వస్తారు వాళ్లకు ఏమీ కావాలో చూసుకో" అని చెప్పాడు బాబా ఖాన్ దానికి కమల్ కూడా సరే బాబా అని చెప్పి కార్ ఎక్కించి పంపించి తన కార్ లో తిరిగి బెంగళూరు వెళ్లాడు అప్పటికే అక్బరుద్దీన్, అలీఖాన్ ఇద్దరు క్లబ్ లోకి వచ్చి మందు వాసన, సిగరెట్ పొగతో క్లబ్ లోని గెస్ట్ హౌస్ నీ నింపేశారు వాళ్లకు వంట చేసి పెట్టే ఒక అమ్మాయి మందులోకి ఐటమ్స్ తెచ్చింది అప్పటికే డ్రగ్స్ మత్తులో మునిగి పోయిన అలీ ఆ అమ్మాయిని చూశాడు ( అలీ కీ అమ్మాయిలు మీద మోజు ఎక్కువ) ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని మీదకు లాగాడు తను వాడిని కొట్టి విడిపించుకొని బయటకు పరిగెత్తుతూ ఉంది అప్పుడు కమల్ ఆ అమ్మాయిని కొట్టి తీసుకోని వచ్చి అలీ పక్కన పడేశాడు అప్పుడు వెళుతున్న కమల్ నీ అక్బర్ చిటికె వేసి పిలిచి "మందు పోయి గ్లాస్ లో నువ్వు ఈ క్లబ్ కీ ఓనర్ ఏమో కానీ ఈ క్లబ్ మా అబ్బు ది అయిన నువ్వు నాకూ ఇష్టం మా తప్పులు అని బయటకు రానివ్వకుండా చూస్తావు ఆ పిల్ల పని పిల్ల కాబట్టి దాని వాడి పక్కలో పండబెట్టావు అదే నువ్వు మనసు పడ్డ పిల్ల అయితే ఇలాగే పంపుతావా" అని చెప్పి నవ్వాడు అక్బర్, దానికి కమల్ "నేను మనసు పడ్డ అమ్మాయి మీద చెయ్యి వేస్తే ఎగిరేది వాడి చెయ్యి మాత్రమే కాదు తల కూడా అక్బర్" అని చెప్పి వెళ్లిపోయాడు. ఇది అంతా చూసిన క్లబ్ వాచ్ మెన్ తను ప్రేమించిన పిల్లను తన ముందే పాడు చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తన మీద తనకు అసహ్యం వేసింది దాంతో ఆ వంట పిల్లను తీసుకోని సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్లాడు కంప్లయింట్ ఇవ్వడానికి అప్పుడే కమల్ వచ్చాడు స్టేషన్ కీ కమల్ నీ చూసి ఇద్దరు కంగారు పడ్డారు "మీ వంట గ్యాస్ పేలి మీ అమ్మ, నాన్న చచ్చారు" అని ఆ వంట పిల్లను వాచ్ మెన్ నీ క్లబ్ కీ తీసుకోని పోయాడు కానీ చూస్తే ఆ అమ్మాయి అమ్మ నాన్న ఇద్దరు బాగానే ఉన్నారు కానీ ఆ మంట లో వాచ్ మెన్ అమ్మ తగలబడిపోయింది, అది చూసి వాడు పిచ్చోడు అయ్యాడు ఇది అంత తన కార్ లో నుంచి చూస్తున్న బాబా ఖాన్ కమల్ నీ రమ్మని సైగ చేశాడు "మరి ఆ పిల్ల సంగతి ఏంటి" అని అడిగాడు దానికి కమల్ "బాబా ఆ పిల్ల నోరు మూసుకుని ఉండాలి అంటే ఆ పిల్ల నీ అలీ కీ ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లో పడేస్తే జీవితం లో నోరు తెరవదు" అని చెప్పాడు అది విని అలీ "నేను ఆ కూలి దాని చేసుకొను" అని అన్నాడు దానికి బాబా ఖాన్ వాడిని కొట్టి "కమల్ చెప్పింది మాత్రం చెయ్యి" అని చెప్పి వెళ్లిపోయాడు కానీ అక్బర్ కీ, అలీ కీ చిన్నప్పటి నుంచి వాళ్ల ముగ్గురికి ఇచ్చిన హోదా ప్రేమ తమ తండ్రి తమకు ఇవ్వలేదు అని వాళ్ల ముగ్గురి మీద మంట ఇప్పుడు ఈ సంఘటన తో ఆ మంట కీ నూనె పోసినట్టు అయ్యింది.
12-01-2021, 08:10 AM
(This post was last modified: 12-01-2021, 11:45 AM by Vickyking02. Edited 1 time in total. Edited 1 time in total.)
@@@@#
12-01-2021, 11:43 AM
12-01-2021, 02:29 PM
12-01-2021, 03:02 PM
super twist
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
12-01-2021, 03:34 PM
13-01-2021, 08:17 AM
కమల్ చెప్పినట్లు అలీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత కమల్ అలీ దగ్గరికి వచ్చి "రేయ్ పెళ్లి పేరు వరకే అది మళ్లీ నోరు ఎత్తకుండా అది పేరుకు మాత్రమే నీ పెళ్లాం కానీ నీ ఇంటి పనిమనిషి కిందే లేక నీ పాత పద్ధతి ప్రకారం నువ్వు ఉండొచ్చు" అని చెప్పాడు కానీ అలీ మాత్రం కోపం లోపల దాచుకుంటా ఉన్నాడు, ఆ కోపం తో తన భార్యను జుట్టు పట్టుకుని ఇంట్లోకి లాకుని వెళ్లి కిచెన్ లో పడేసి "ఒక రోజు నా పక్కలో పడుకుంటే నా ఇంట్లోకి వచ్చావ్ కానీ నా పెళ్లాం మాత్రం కావు ఈ వంట గది నీ చోటు ఈడనే వండు చచ్చేదాకా ఇక్కడే పడి ఉండు ముండా" అని కాలు తో కొట్టి వెళ్లిపోయాడు ఆ అమ్మాయి లేచి కళ్లు తుడుచుకొని తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఆవేశం లో ఉన్న అలీ నీ అక్బర్ ఒక బీర్ ఇచ్చి కూల్ చేశాడు "రేయ్ అది లేబర్ దీ దాంతో మనకు పనిలా దాని తెచ్చి ఇంట్లో పెట్టినాడు చూడు ఆ ముసలి నాయాల్ని వాడు నెత్తిన పెట్టుకుని చూసుకునే ఆ అన్నదమ్ములకు దెబ్బ వేయాలి దానికి టైమ్ ఉంది" అని చెప్పాడు.
మరుసటి రోజు ఉదయం కమల్ క్లబ్ కీ కొంతమంది అమ్మాయిలు వచ్చి stallion లో ఉన్న గుర్రాలు చూస్తూ వాటితో ఫొటోలు దిగుతు ఉంటే అక్కడ పని చేస్తున్న ఒక కుర్రాడు వచ్చి ఏమీ కావాలి అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయిల లీడర్ అయిన కీర్తన ముందుకు వచ్చి "మేము హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి ఎవరిని కలవాలి" అని అడిగింది దానికి ఆ కుర్రాడు "మా సార్ వస్తారు జాగింగ్ చేస్తున్నారు" అని చెప్పాడు "జాగింగ్ అంటే పార్క్ నుంచి రావాలి లేట్ ఏమో కదా అయిన పది గంటలకు జాగింగ్ ఏంటి" అని అడిగింది దానికి వాడు నవ్వి గుర్రాలు పరిగెత్తుతూ ఉన్న ట్రాక్ వైపు చూపించాడు ఆ గుర్రాల మధ్య బాగా కండలు తిరిగిన ఒక బారి శరీరం ఉన్న 25 సంవత్సరాల కుర్రాడు రేసుగుర్రాల మధ్య ఇంకో రేసుగుర్రం లాగా పరిగెత్తుతూ ఉన్నాడు, వాడిని చూడగానే కీర్తన మొహం మీద ఉన్న కురులు ఆటోమేటిక్ గా గాలిలోకి లేచ్చాయ్ అప్పుడు పక్కన ఉన్న తన ఫ్రెండ్ "యార్రి ఈ హుడుగా హీ మ్యాన్ అప్ప తరే ఇదారే" (ఎవడే వీడు హీ మ్యాన్ కీ అమ్మ మొగుడు లా ఉన్నాడు) అని కన్నడ లో అనింది జాగింగ్ అయిపోయి షర్ట్ వేసుకుని వచ్చాడు కమల్ అలా కమల్ నీ నేరుగా చూసిన కీర్తన డైరెక్ట్ గా I love you అని చెప్పింది దానికి అందరూ షాక్ అయ్యారు కానీ కమల్ నవ్వుతూ తన అన్న విద్యుత్ నుంచి ఫోన్ వస్తే వెళ్లాడు కానీ కీర్తన మాత్రం కమల్ వెళుతున్న కార్ నీ చూస్తూ ఉంది. ఆ రోజు సాయంత్రం బాబా ఖాన్ అందరికీ అలీ పెళ్లి అయినందున పార్టీ ఇస్తున్నారు దానికి చాలా పెద్ద పెద్ద విఐపి లు వచ్చారు వాళ్లతో పాటు కమల్ అన్నలు ఆకాశ్, విద్యుత్ కూడా వాళ్ల ఫ్యామిలీ తో వచ్చారు ఆకాశ్ భార్య తన డెలివరీ సమయంలో చనిపోయింది ఉన్న ఒక్క కొడుకును విద్యుత్ దెగ్గర ఉంచి చదివిస్తున్నాడు, విద్యుత్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తనతో పాటు తెలివిగా బ్రిటన్ లో తన కంపెనీ పనులు సాగించడానికి బ్రిటన్ లో చాలా పలుకుబడి ఉన్న ఒక భారతీయ బిజినెస్ మ్యాన్ కూతురుని చేసుకున్నాడు, అందుకే మూడు నెలల పాటు ఇండియా లో మూడు నెలల పాటు బ్రిటన్ లో ఉంటాడు తన భర్త కు రెండో పెళ్లి అయ్యింది అని విద్యుత్ భార్య రాధా కు తెలియదు కానీ బ్రిటన్ లో ఉన్న తన రెండో భార్య నిత్య కీ రాధా గురించి తెలుసు. ఇలా పార్టీ సాగుతూ ఉంటే మైనింగ్ మినిస్టర్ తన కూతురు సంధ్య తో పాటు ఫంక్షన్ కి వచ్చాడు పేరుకు మినిస్టర్ కూతురు అయిన ఒక కాలేజ్ లో టీచర్ గా పని చేస్తోంది తనని చూసి గుర్తు పట్టిన ఆకాశ్ కొడుకు వెళ్లి పలకరించాడు అప్పుడే వాళ్ల దగ్గరికి వచ్చిన ఆకాశ్ తన కొడుకును భోజనం చేయడానికి తీసుకోని వెళ్లుతుంటే సంధ్య తనని గుర్తు పట్టి "మీరు ఆకాశ్ కదా అప్పుడప్పుడు మీరు మా ఇంటికి వస్తుంటారు చూశాను మిమ్మల్ని చిన్న మీ కొడుకా" అని అడిగింది దానికి ఆకాశ్ "అవును మేడమ్ నేను ఎలాగో పెద్ద చదువుకోలా పైగా నాయన పోయినాక ఇంక బాబా కాడనే పెరిగిన తమ్ములని చదివించిన పైగా ఈడు నా లేక కాకుండా వాళ్ల చిన్నాయానల లేక అవ్వాలి అని చదివిస్తాన్నా" అని చెప్పాడు "మీ అబ్బాయి చాలా మంచోడు తెలివైనవాడు నాకూ బాగ ఇష్టం వీడు అంటే" అని చెప్పింది సంధ్య అలా వాళ్ల మధ్య స్నేహం కుదిరింది. ఆ తర్వాత కమల్ డ్రింక్ తాగుతూ ఉంటే బాబా ఖాన్ వచ్చి "ఏమిరా మీ అన్నలు కుటుంబం తో సహా వస్తే నువ్వు మాత్రం లింగు లింగు అని ఒక్కడివే వచ్చినావు పెళ్లి చేసుకున్నేదిలా" అని అడిగాడు దానికి కమల్ నవ్వి "మనవి గ్యారంటీ లేని బతుకులు బాబా పెళ్లి చేసుకుని ఏమీ చేసుకోవాలా" అని అన్నాడు దానికి బాబా "అవును పొద్దున ఎవరో అమ్మి నిన్ను ప్రేమిస్తున్న అనింది అంట చెప్పు నచ్చితే ఈ ఇంటికి చిన్న కోడల్ని చేసేదాం" అని నవ్వుతూ అడిగాడు దానికి కమల్ "హమ్ నీ దాక వచ్చిందా అది ఎవరో తిక్కది ఏదో సినిమా లో హీరో నీ చూసి నను వాడిలా ఊహించుకోని చెప్పింది ఆశ గా ఉంటే నువ్వు చేసుకో పెళ్లి" అని అన్నాడు. అలా పార్టీ జరుగుతున్న సమయంలో జిల్లాకు వచ్చిన కొత్త ఎస్పి సరాసరి బాబా ఖాన్ ఇంట్లోకి వచ్చి అక్బరుద్దీన్ నీ షర్ట్ పట్టుకుని కొట్టుకుంటూ అరెస్ట్ చేసి తీసుకోని వెళ్లుతుంటే బాబా ఖాన్ అడ్డుగా నిలబడి ఏమీ జరిగింది అని అడిగాడు అప్పుడు ఎస్పి "మీ అబ్బాయి తన అనుచరుడుని నిన్న రాత్రి తాగిన మైకం లో చంపేసాడు అందుకే అరెస్ట్" అని చెప్పి అక్బర్ నీ తీసుకోని వెళ్లుతు కిచెన్ కిటికీ నుండి చూస్తున్న అలీ భార్య వైపు చూసి తల ఆడించి అక్బర్ నీ తీసుకోని వెళ్లాడు.
13-01-2021, 09:44 AM
(This post was last modified: 13-01-2021, 09:44 AM by twinciteeguy. Edited 2 times in total. Edited 2 times in total.)
chala baavundi
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
13-01-2021, 11:05 AM
13-01-2021, 11:05 AM
13-01-2021, 11:05 AM
|
« Next Oldest | Next Newest »
|