Thread Rating:
  • 13 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance "అతి"మధురం
#21
sjper
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
9.ఊపిరాపకే....

షాక్ లో వుండిపోయిన అభి.....ముందు చిటెకేస్తూ...."ఓయ్...ఏమైందండి అభిమన్యు గారు...ఊహల్లో కి వెళ్ళారు...?"అడిగింది రియా

తనది ఊహ అని తెలిసిన మరుక్షణమే....ఒకింత నిరుత్సాహానికి గురయ్యాడు అభి.....

సరే పద....అని తను లేవడానికి సహాయం చేసి...తనని పట్టుకుని తనతో పాటు నడవసాగాడు....అలా తనతో పాటు అడుగులేస్తూ మనసులో మాత్రం ఈ అడుగులు తనతో పాటు జీవితాంతం కలసి నడవాలి అని ఆ దేవుడ్ని కోరుకున్నాడు.....

"ఏంటండి మళ్ళీ మీ ఆలోచనలు మన ఊరి దాటి పక్క ఊరి వెళ్ళినట్టున్నాయి ఏం థింక్ చేస్తున్నారేంటి.....?"అని రియా అడగడం తో.....ఏం లేదు అన్నట్టు తలూపాడు అభి.......

కొంచెం దూరం నడిచాక....."అభిమన్యు గారు......మిమ్మల్నొకటి అడగొచ్చా....?"అంది రియా

"దేవుడా.......రియా నన్ను అభి అని పిలిచేలా చెయ్యి..."అని మనసులో అనుకోసాగాడు అభి....

"అలానే పిలుస్తాను లేండి...ప్రస్తుతానికి నేనడిగిన దానికి సమాధానం ఐతే చెప్పండి...."అంది రియా

"ఏం పిలవడం...?"అర్థం కానట్టు ముఖం పెట్టి అడిగాడు అభి....

"మీరు చెప్పకపోయినా మీ ముఖం చూస్తే నే అర్థం అవుతుంది...మీరు నేను అభిమన్యు అన్నప్పుడల్లా ఎంత ఇబ్బంది గా ఫీల్ అవుతున్నారో....."అంది రియా

"హా మరి అర్థమయినప్పుడు.......పిలవకుండా వుండొచ్చు కదా....రియా....ఇంతకు ముందులా వుండొచ్చు కదా రియా...?"అడిగాడు అభి

"అది మాత్రం అడగకండి...."అంది రియా ముందుకు చూస్తూ ....

"అది స్సరే గానీ...ఏదొ అడగాలన్నావ్...?అడుగు...."అన్నాడు అభి......

"ఇప్పుడు కాదు లే రాత్రికి వస్తావ్ గా అప్పుడు అడుగుతాను..."ఆంది రియా

"రాత్రికా...నేనొస్తానా...ఎక్కడికి...?"అర్థమయ్యినా అర్థం కానట్టు అడిగాడు అభి....

"ఆహా....నీకేమి అర్థం కాలేదా....?నిజం చెప్పు...?"అడిగింది రియా

"లేదు...నిజంగా..."తన పిలుపు మీరు నుంచి నువ్వు కి మారింది అన్న ఆనందం లో ఉషారుగా చెప్పాడు అభి....

"సరే సరే.....నువ్వు వస్తే నీకుంటది అప్పుడు చెబుతా నీ పని..."వెక్కిరిస్తూ అంది రియా

"ఓహ్....అర్థమయ్యింది...నిన్ను చూడ్డానికి వస్తాను అనే గా నువ్వు అంది....?సారీ నేను నిజంగా మర్చిపోయాను....ఇప్పుడు గుర్తొచ్చింది..."అన్నాడు అభి

"చా....నువ్వు నీ కవరింగ్ లూ...చాలు చాల్లే నువ్వేమి రానక్కర్లేదు........పొద్దున్నే నిన్ను నేను లేపనక్కర్లేదు.....ఎక్స్ ట్రా గా నీకు నేను హగ్ లూ ఇవ్వనక్కర్లేదు...."అంది రియా

"అవును అడగడమే మర్చిపోయాను....ఆ రోజు నువ్వు నాకు హగ్ ఎందుకిచ్చావ్...?"దొరికిందే ఛాంస్ అన్నట్టు అడిగాడు అభి......

"అది....అది...హా....నీ బైక్ వచ్చేసింది...పద..."అని టాపిక్ డైవర్ట్ చేసింది రియా.....

ఆ రోజు రాత్రి.......ఎప్పటి లాగా అభి రియా కోసం వచ్చాడు.......ఎప్పుడు నిద్రపోయే రియా ఈ సారి మేల్కొని అభి కోసం వెయిట్ చేయసాగింది.......

"ఏంటి రియా....సాయంత్రం ఏదో అడుగుతానన్నావు....అడుగు..."అడిగాడు అభి

జండు బాం చూపిస్తూ......నా కాలు బాలేదు కదా...ఇది రాస్తేవేమో అడుగుదామని పిలిచా లే...అంది రియా

"ఇటివ్వు..."అని తన చేతిలోని బాం తీసుకోబోతుంటె....చెయ్యి వెనక్కి లాగేస్తూ.."ఏయ్ మెంటల్...నీకేమైనా పిచ్చా...నిజంగానే రాస్తావా...?ఏం అక్కర్లేదు.......నీకో విషయం చెబుదామని పిలిచాను అంతే...."అంది రియా

ఏంటన్నట్టు చూసాడు....అభి...

"సారీ ఫర్ బీయింగ్ రాష్ విత్ యూ నాకు ఇష్టం లేకుండా నువ్వా కాలేజ్ పెట్టెసరికి చాలా కోపం వచ్చేసింది...అందుకే తిట్టెసాను.....ఇంక థ్యాంక్యూ సో మచ్ నన్ను దగ్గరుండి చదివిచ్చినందుకు......నువ్వు లేపొతే....ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ డిఫెరెంట్ స్టోరి......ఐ యాం సారి వంస్ ఎగైన్.....సరే ఇక నువ్వెళ్లు...నాకన్నా నువ్వెక్కువ అలసి పోయుంటావ్ కదా...?"అంది రియా

తనకి వెళ్ళాలని లేకున్నా రియా చెప్పడంతో ఇక తప్పక లేచి బయటకి నడస్తున్న అభి ని వెనక నుంచి గట్టిగా చుట్టెసింది రియా....ఒక్క నిమిషం అభి కి ఏమీ అర్థం కాలేదు......ఇంతలో రియా కన్నీళ్లు అతని షర్ట్ నీ తాకడంతో.....మరుక్షణం వెనక్కి తిరిగి వున్న అభి కాస్తా ముందుకి తిరిగి.....తన చేతులతో రియా ముఖాన్ని పట్టుకున్నాడు.....

"ఏయ్ రియా....ఏమైంది నీకు...ఎందుకేడుస్తున్నావ్....?"అడిగాడు అభి కంగారుగా
ఆ మాట తో ఇంకా తన ఏడుపు ఎక్కువయ్యింది.....ఇక వెంటనే అభి రియా తన గుండెలకి హత్తుకుని...తన తల మీద చెయ్యి వేసి "రియా...ఏడ్వకు....ఐ యాం దేర్ ఫర్ యూ......"అని తన తల ప్రేమగా నిమిరాడు.....ఆ మాటతో రియా ఇంకా గట్టిగా అభి ని చుట్టెసింది...ఇక లాభం లేదని....రియా కి కొంచెం దూరం జరగబోయాడు...కానీ రియా వినే పరిస్థితి లో లేదు...అంతకంతకూ తన దుఖం పరిగిపోతూనే వుంది.....

తన నడుము చుట్టూ చేతులు వేస్తూ...."రియా ఏమైందో చెబితేనే కదా నాక్కూడా తెలిసేది.....చెప్ప్...ప్లీస్"అన్నాడు అభి అభ్యర్థనగా.....

అంత ఏడుపు ఆపేసిన రియా తల ఎత్తి అభి కళ్లలోకి చూస్తూ అతని పెదవులపై తన పెదాలతో యుద్ధం మొదలెట్టింది......

ఏం చేస్తుందో అర్థం చేస్కునే సరికి అభి కి ఊపిరి ఆడట్లేదు......అప్పటికే తను ముద్దు మొదలుపెట్టి 2 నిమిషాలు కావొస్తుంది.......

ఇంతలో చిన్న బ్రేక్ లాంటిది ఇచ్చిన రియా....మళ్ళీ అభి ని ముద్దుపెట్టుకోవడం స్టార్ట్ చేసింది....తన బాధనంతా ఒక్క ముద్దు లో చెప్పేసి........ఒ 5 నిమిషాల తర్వాత...అభి ని వదిలేసింది........

తన వైపే చూస్తున్న అభి ని చూసి..."ఐ యాం సారి..."అని ఇంకో మాటకి తావివ్వకుండా వెళ్ళి పడుకుంది రియా.....రూం బయటకి నడుస్తూ.....జరిగింది నిజమా ...కలా....అర్థం చేస్కోలేక........ఒక ట్రాంస్ లో ఇంటికి చేరి నిద్రపోయాడు అభి...

ఆ మరుసటి రోజు నుంచి......కధ మళ్ళి మొదటికి వచ్చింది...కాదు కాదు....చాలా భయంకరంగా తయారయ్యింది....అభి కి కంటి మీద కునుకు లేకుండా చేసింది........!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#23
10.వ్యధ+వేదన=?

రియా ఆ ముందు రాత్రి ఇచ్చిన తీపి గుర్తును తలచకుంటూ తనెందుకు అంత బాధ పడుతుందో ఆలోచిస్తూ తన రాక కోసం వాళ్లింటికి ఎదురుగా నిల్చున్న అభి ని చూసిన రియా వాళ్లమ్మ....

"అభి నువ్వింకా కాలేజ్ కి వెళ్ళలేదా...?"అడిగింది ఆవిడ

"అంటె రియా వెళ్ళిపోయిందా ఆంటి...?"అడిగాడు అభి...

"హా ఏదో ఇంపార్టెంట్ క్లాస్ అంట...వుదయాన్నే వెళ్ళిపోయింది.....నీకు చెప్పలేదా...?"అడిగిందావిడ

"హా...చెప్పింది నేనే మర్చిపోయాను...బై ఆంటి...!"అని అక్కడ నుంచి వచ్చేశాడు అభి...

అభి కాలేజ్ కి వెళ్ళెసరికి రియా ఎవరో అబ్బాయి తో మాట్లాడుతూ కనిపించింది......ఫస్ట్ బాధపడ్డా...వినయ్ విషయం గుర్తొచ్చి సమాధానపడ్డాడు అభి....ఆ రోజు సాయంత్రం తను చూస్తుండగానే ఫ్రెండ్ స్కూటి పై ఇంటికి వెళ్ళిపోయింది రియా.....

ఇలా వారం పాటు జరిగింది...ఏదో వర్క్ టెంషన్ లో వుందిలే అనుకుని అభి కూడా పెద్దగా పట్టించుకోలేదు......ఇంతలో ఎగ్జాంస్ .....సెమిస్టర్ అయిపోయింది...కానీ రియా వరస మారలేదు.........

ఈ మధ్యలో అభి ఎంత ట్రై చేసినా రియా అస్సలు ఛాంస్ ఇవ్వకపోయేసరికి ఎగ్జాంస్ అయిపోయాక అడుగుదాం అని ఆగిపోయాడు అభి....

ఎగ్జాంస్ అయిపోయిమ సాయంత్రం అభి రియా వాళ్లింటికి వెళ్ళాడు.........

"రా అభి...ఎగ్జాంస్ ఎలా రాశావ్...?"అడిగింది రియా వాళ్లమ్మ

"హా పర్లెదాంటి...రియా ఎక్కడ....?"అడిగాడు అభి....

"రియా....వాళ్ళ మావయ్య వాళ్లింటికెళ్ళింది...నీకు చెప్పమంది నేనే మర్చిపోయాను......"చెప్పిందావిడ

"ఆంటీ.....మీకు-వాళ్ళకి పడదు కదా....మరి కొత్తగా ఇదేంటి...?"అనుమానాన్ని వ్యక్తపరిచాడు అభి....

"ఈ మధ్యే మళ్ళీ రాకపోకలు మొదలయ్యాయి లే అభి...."అని ఆవిడ చెప్పెసరికి..."సరే ఆంటి....ఇక వుంటాను..."అని లేచాడు అభి.....

"ఆంటీ వాళ్లది ఏ వూరు....."అడిగాడు అభి...

"వైజాగ్ "చెప్పిందావిడ....

తన ఫోన్ లో వైజాగ్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడా అని సర్చ్ చేస్తున్న అభి కి ఇంతలో కాల్ వచ్చింది........

********

వెళ్ళిన 2 రోజులకే వచ్చేసింది రియా ఇంటికి.....ఇంటికి రావడం తోనే...."అమ్మా.....!అని వాళ్ళమ్మని గట్టిగా కౌగిలించుకుంది......"

"ఏంటే...ఎప్పుడూ లేనిది ఇంత పేమ పొంగుకొచ్చింది నా పైన...?"అడిగింది వాళ్ళమ్మ

"ఏం లేదు లే నేను వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను...."అని వెళ్ళిపోయింది...రియా

రియా కిందకి వచ్చాక...వాళ్ళమ్మ రియా తో...."నువ్వు ఆ రోజు వైజాగ్ వెళ్ళిన అరగంట కి అభి వచ్చాడే....."అంది వాళ్ళమ్మ

"అవునా.....నేనక్కడికి వేళ్ళానో కనుకున్నాడా...?"అడిగింది రియా ఆత్రంగా....

"హా అడిగాడు...చెప్పాను కూడా...."అంది వాళ్ళమ్మ

"అవునా....సరే నేను ఉష ఆంటీ వాళ్ళింటికి వెళ్ళొస్తాను..."అని లేచింది రియా

"అభి లేడే....2 డేస్ నుంచి కనిపించట్లేదు...."అని వాళ్ళమ్మ చెప్పేలోపే.....గేటు దాటేసింది రియా

అభి వాళ్ళింట్లోకి వెళ్తూనే "ఆంటీ..." అని అభి వాళ్లమ్మని చుట్టెసింది రియా

"పోవే....వైజాగ్ పోవడం తెల్సుగానీ మాట మాత్రమైనా చెప్పాలని కూడా లేదు......"అంది ఉష

"అయ్యొ ఆంటీ....ఏంటి మిస్ అయ్యారా ఏంటి...?"అంది రియా

"మరి అవ్వరా....?"అంది ఆవిడ

"అవునా...పోనీ ఒక పని చెయ్యండి........మీ అబ్బాయి కి నన్నిచ్చి పెళ్ళి చెయ్యండి...అప్పుడు ఎంచక్కా అత్తయ్య గారూ అత్తయ గారూ అంటూ మీ వెనకాలే తిరుగుతాను...."అని అనేసి అభి రూం వైపు వెళ్ళబోతుండగా.....

"నీ మొగుడు లేడమ్మా....."అనేసింది ఆవిడ....

"అవునా....మా ఆయన్ని ఎక్కడికి పంపించావ్...?"అంది రియా

"నేనక్కడికి పంపించలేదు తల్లీ వాడే...ఇల్లు దాతి బయటకి కదలని వాడు ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళాడు ఇంకో వారం దాకా రాడు...."అని చెప్పింది ఉష

"అవునా...సర్లే అందాకా...వాడి రూం లో ల్యాపీ వుందిగా దానితో కాలక్షేపం చేస్తా..."అని అభి రూం కి వెళ్ళింది రియా

లోపలికి అడుగుపెట్టి...తన బెడ్ పై వున్న ల్యాపి ని తీసింది.......ఓపెన్ చేసి.....చూస్తే అభి ఐడి కి పాస్ వర్డ్ అడుగుతుంది.......పాస్ వర్డ్ ఏం పెట్టుంటబ్బా...అని ఆలోచిస్తూ...టైప్ చేయసాగింది...సరిగ్గా ఫస్ట్ ఎట్మంట్ లోనే ఓపెన్ అయ్యి వాల్ పేపర్ గా రియా ఫోటో ప్రత్యక్షమయ్యింది......కళ్లలోంచి నీళ్ళు....తనకి తెలియకుండానే వచ్చేసాయి......ఇంతకి ఆ పాస్ వర్డ్ ఏంటో తెలియదు కదా.....????? I LOVE YOU RIYA........

తన ఫైల్స్ సర్చ్ చేస్తుండగా....డైరి అనే ఫోల్డర్ లో ఏవో వాయిస్ ఫైల్స్ కనిపించాయి.......

వెంటనే అభి లాస్ట్ రికార్డ్ చేసిన ఫైల్ ఓపెన్ చేసి వినసాగింది రియా

"మోసం...కుట్ర....ఇన్నాళ్ళు...ఫ్రెండ్ అయినా .....లవర్ అయినా...భార్య అయినా ....నువ్వే అనుకుని బతికాను కదే.......కానీ ఇంత మోసం ఎలా చెయ్యాలని పించింది.......ఒక్కసారి వేరే వాడి ప్రపోసల్ కి ఒకే చెప్పేటప్పుడైనా ఇన్నేళ్ళ నా పిచ్చి ప్రేమ గుర్తుకు రాలేదా......?ఎందుకే ఇంతలా మోసం చేశావ్.....నువ్వే ప్రాణం లా బతికిన నాకు ఇదేనా నువ్వు నాకిచ్చే బహుమతి......?ఐ హేట్ యూ రియా.......ఐ రియల్లీ హేట్ యూ........"

అంతకు మించి ఒక్క పదం కూడా వినలేకపోయింది రియా.......ఏడుస్తూ......బయటకి వచ్చేసింది.....

తనకి ఎదురయ్యాడు అభి.......రియా ని చూడగానే ఆనందం తన కళ్ళలో కన్నీళ్ళు ఎందుకో అర్థం కాలేదు........

వెంటనే తన వెంట పరిగెత్తాడు అభి.......

"రియా...రియా...ఏమైంది ఎందుకేడుస్తున్నావ్.......?"అడిగాడు అభి.....

కోపంగా ఒక్క చూపు చూసి వెళ్ళిపోయీంది రియా

అభి కి ఏమీ అర్థం కాలేదు........తన రూం కెళ్ళి చూసిన అభి కి విషయం అర్థమయి పోయింది.........

6 నెలల తర్వాత.......

ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది రియా........"అభి తో మాట్లాడాలి......."అని నిశ్చయించుకుని అలా లేచింది....ఇంతలో తనకి తన ఫ్రెండ్ రాజి నుంచి కాల్ వచ్చింది.....

"డార్లింగ్ ఇవాళ నైట్ సెకండ్ షోకి మూవి కి వెళ్దాం......సరేనా...?"అడిగింది రాజి

"ఇవాళ నైట్ అదీ 2 షో...లేదే...నువ్విచ్చని ఙనోపదేశం క్లాస్ లతో ఇవాళ అభి తో మాట్లాడాలి అని అనుకుంటున్నా అది కూడా చిన్న ఎడ్వెంచర్ చేసి....ఇవాళ వద్దే రేపు చూద్దాం..."అంది రియా

"ఏంటి...నిజంగానా...?నిజంగా అభి తో మాట్లాడుతున్నావా...వెరీ గుడ్ కానీ..."అని ఆగింది రాజి

"కానీ ఏంటె....?"అనుమానంగా అడిగింది రియా

"చాలా మంచి పని చెయ్యబోతున్నావ్....కానీ అమావాస్య పూట చెయ్యడం అవసరమా....?పైగా నువ్వు అభి తో మాట్లాడెస్తే రేపటి నుంచి ఎలాగో మాతో మాట్లాడరు తమరు...సొ ఇవాళ మాతో పాటు రావే మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమొ..."అంది అభ్యర్దనగా రాజి

"పెట్టావ్ గా ఫిట్టింగూ రాక చస్తనా.....వస్తాను లే...."అని అభయమిచ్చేసింది రియా

ఆ రోజు రాత్రి.....సినిమా ముగించుకుని.....అందరూ అటోలో బయల్దేరారు.....చివరగా రియా-రాజి మాత్రమే మిగిలారు...రాజీ వాళ్ళింటి దగ్గర దిగేస్తూ "డార్లింగ్ జాగ్రత్త...ఒకే నా నన్ను రమ్మంటావా కూడా...?"అడిగింది

"వద్దులేవే టైం 2:20 అవుతుంది...నాకేమి పర్లేదు...నువ్వెళ్ళు..."అని అక్కడి నుంచి బయల్దేరింది రియా

ఇంకో రెండు మలుపులు దాటితే వాళ్ళిళ్ళు వస్తుందనగా......వేరే రూట్ వైపు ఆటో ని మరల్చాడు డ్రైవర్......

"ఏయ్....మా ఇల్లు అటు....ఇటు తీసుకొస్తున్నావేంటి....?"అడిగింది రియా

"నాకు తెల్సు మ్యాడం...."అని వెనక్కి తిరిగి అదో రకంగా నవ్వడతను........అతని నవ్వు చూసిన రియా కి పై ప్రాణాలు పైనే పోయాయి........!!!!!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#24
11.ప్రేమ చిగురించెనా....?

ఆటో డ్రైవర్ నవ్వు చూసిన రియా పై ప్రాణాలు పైనే పోయాయి....

ఇక లాభం లేదని...అటో కదులుతుండగానే అటో లో నుంచి దూకేసింది.......వెంటనే ఆటో కొంచెం దూరం లో వెళ్ళి ఆగింది....వెను వెంటనే ఆటో డ్రైవర్ ఆటో లో నుంచి దూకి వడి వడి గా రియా వైపు రాసాగాడు.....

కిందపడిన రియా ....లేచి పరుగు అందుకుంది.....ముందు రియా వెనక అతను....అలా పరిగెడుతూ పరిగెడుతూ ఎదురుగా అడ్డొచ్చిన వ్యక్తి ని గుద్దేసి....అలా కిందపడిందో లేదో అక్కడికి వచ్చేశాడు ఆటో అతను.......

రియా దగ్గరికి వస్తూ..."మా అమ్మాయే సార్....."అని రియా ని పైకి లేపబోతుండగా అతని చేతిని పట్టుకున్నాడు ఎదురుగా వున్న వ్యక్తి.....అర్థం కానట్తు ఆశ్చర్యపోయి చూశాడు ఆటో డ్రైవర్...

ఆ వ్యక్తి ఆటో డ్రైవర్ ని చితక బాది...చివరగా రియా కి తన చేతిని అందించాడు........అతని చెయ్యి అందుకుని పైకి లేచిన రియా చంద్రుని వెలుగులో అతని ముఖం చూసి......ఏడుస్తూ అభి ని చుట్టేసింది...అభి కూడా అంతే గట్టిగా తనని అల్లుకుపోయాడు.......

ఒక పది నిమిషాల వరకు ఒకర్ని విడవాలని మరొకరికి ఆలోచనే రాలేదు........

"ఐ యాం సారి రియా.....నువ్వు వైజాగ్ వెళ్ళిన రోజు నేను కూడా నీ వెనకాలే వైజాగ్ వద్దామనుకున్నాను కానీ అప్పుడే నువ్వు ఒక అబ్బాయి కలిసి వున్న పిక్స్ నా ఫ్రెండ్ నాకు వాట్స్ అప్ చేశాడు....అందులో అతను నీ చెయ్యి పట్టుకుని ఏదో అభ్యర్థిస్తున్నట్టు వుంది.....నేనూ ఆ పిక్స్ నమ్మకూడదు అనే అనుకున్నాను కానీ అంతకు ముందు నిన్ను తనతో చూడడం నువ్వు నన్ను ఎవౌడ్ చేయడంతో ఏదో ఫ్రస్టెషన్ లో నిజమని నమ్మేసి....ఫ్రెండ్స్ తో ట్రిప్ కెళ్ళాను అలా అయినా నా నుంచి నీ ఆలోచనలోంచి దూరంగా వుండొచ్చు అని...కానీ 2 రోజులు కూడా వుండలేక తిరిగి వచ్చేశాను...ఈ మధ్య లోనే తెల్సింది ఆ అబ్బాయి నీ ఫ్రెండ్ రాజీ లవర్ అని.....వాళ్లిద్దరికి ఏదో ప్రాబలం వస్తే నిన్ను సహాయం అడిగాడు అని.......అది తెల్సి నా మీద నాకే చాలా కోపం వచ్చింది.......నిన్ను క్షమించమని అడగడానికి కూడ ముఖం చెల్లలేదు.....అందుకే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నా లో లోపల బాధపడ్డానే కానీ నీ ముందుకొచ్చే ధైర్యం చేయలేదు....ప్లీస్ నన్ను క్షమించు....."అని చెప్పాడు అభి.

"అభి....ఐ యాం సారీ నేను కూడా నీతో చాలా రాష్ గా వున్నాను...."అని చెప్పింది రియా

అలా వాళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారు........అంటే మామూలుగా మాట్లాడుకోవడం వరకే....రియా కి ఎప్పుడూ అభి పై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు.......అలా ఇంకో సంవత్సన్నర గడిచింది.....రియా ఇప్పుడు 3 ఇయర్...అభి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు......

ఒకరోజు.......తలుపు బళ్ళున తెరుచుకోవడం తో తల ఎత్తి చూశాడు అభి....ఎదురుగా రియా.....కోపంతో ఊగిపోతుంది....

"హే రియా....ఏమయ్యింది?అలా వున్నావ్?"అడిగాడు అభి

"నువ్వు అమెరికా కి ఎందుకు వెళ్ళట్లేదు....?"అడిగింది రియా

"నాకు ఇంట్రెస్ట్ లేదు....."జవాబిచ్చాడు అభి

"ఇంట్రెస్ట్ లేదా....అబద్ధం చెప్పకు అభి...నువ్వెందుకు వెళ్లనంటున్నావో నాకు రీసన్ తెల్సు.....స్టాప్ బిహేవింగ్ లైక్ ఏ చైల్డ్.....!సరేనా నాకు తెల్సు నీకు ఎం.ఎస్ చెయ్యడం అంటే చాలా ఇష్టం అని.....సో నువ్వు అమెరికా కి వెళ్తున్నావ్ ఎండ్ దట్స్ ఫైనల్..."చెప్పింది రియా

"నీకు రీసన్ తెల్సున్నావ్ కాబట్టి చెబుతున్నా రియా....నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లను...యండ్ దిస్ ఈస్ ఫైనల్..."చెప్పాడు అభి......

అభి చెయ్యి లాక్కొని.....తన తల మీద ఒట్టు వెయ్యించుకుంటూ..."నువ్వెళ్లకపోతే నా మీద ఒట్టె ఇంకేమి మాట్లాడకు......"అని అంది రియా

"సరే.....నా కండీషన్ కి నువ్వు ఒప్పుకుంటానంటే...నేను వెళ్తాను....సరేనా...?"అన్నాడు అభి

"హా సరే ఒప్పుకుంటున్నా......."అంది రియా

సరే రా...అని తన చెయ్యి పట్టుకుని హాల్లో కి తీసుకెళ్తుండగా....."ఇంతకీ కండీషన్ ఏంటి...?"అంది రియా.....హల్లొకి రాగానే....రియా వాళ్ల అమ్మా నాన్నలని కూడా పిలిపించి......అందర్నీ కూర్చోబెట్టి......

"నేను-రియా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం.........నేను ముందు ఎగేజ్మెంట్ చేసుకొని అమెరికా వెళ్తాను.....తిరిగి వచ్చాక మా పెళ్ళి చెయ్యండి......."అని చెప్పి వాళ్ళ అంగీకారం కోసం ఆగాడు అభి.......

అందరూ హ్యాపీ గా ఫీలయ్యారు ఒక్క రియా తప్ప........కండీషన్ అంటే ఏంటొ అనుకుంది కానీ ఇలా లాక్ చేస్తాడనుకోలేదు..........

ఆ రోజు నుంచి మళ్లీ రియా అభి తో ముందులా వుండలేకపోయింది.........

అలా రెండేళ్ళు గడిచాయి......అభి అమెరికా నుంచి తిరిగి వస్తుండడం తో రియా ఇలా మధ్యలోనే పారిపోయి వచ్చేసింది........

******

"అది అండి విజయ్ గారు.,....నా అతి ప్రేమ స్టోరి........"అని చెప్పడం ముగించి మంచినీళ్ళు గటగటా తాగింది రియా

"వావ్ గ్రేట్ లవ్ స్టోరి "అన్నాడు విజయ్

"ఓహో అవునా...సర్లేండి..."అంది రియా

"అవునూ మీకు అభి అంటే ఎందుకు ఇష్టం లేదండి........?"అడిగాడు విజయ్

"ఇష్టమే ప్రేమ లేదంతే..."అంది రియా

"అదే ఎందుకు........?"అన్నాడు విజయ్

టైం........4:30 అవుతుండగా....రియా ఏదో చెప్పే లోపల.......అభి(టార్చర్) నుంచి కాల్ వచ్చింది.........ఈ సారి రియా కట్ చెయ్యలేదు......ఒక్క రింగ్ కే ఫోన్ ఎత్తింది.......

"నేనంటే ప్రేమ అనుకున్నాను రియా కానీ అది లేదని ఈ రోజే తెల్సింది......నీ మనసులో నా పై నింపుకున్న ద్వేషాన్ని చూస్తుంటే...నా పై నాకే జాలి వేస్తుంది.......కాదు కాదు కోపం వస్తుంది......నీ వల్లే నన్ను నేను ప్రేమించాను రియా కానీ నీ వల్లే ఈ రోజు నన్ను నేను అస్యహించుకుంటున్నా....నా ప్రేమకు బానే వెలకట్టావ్ రియా......థ్యాంక్యూ సో మచ్......థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ కన్ సర్న్..........ఐ హేట్ యూ రియా.......బట్ ఐ లవ్ యూ.......!"అని ఫోన్ కట్ చేశాడు అభి.......

"ఏంటి...ఏం చేశావ్ రియా అభి అలా మాట్లాడుతున్నాడు...?"అడిగాడు విజయ్.......

"బహుశా తనకి నా డైరి దొరికి వుండొచ్చు........."అంది రియా

"సరే రియా తనంతలా ప్రేమిస్తుంటే ఒక్కసారి కూడా నీకు ప్రేమించాలనిపించలేదా...?"అడిగాడు విజయ్

"లేదు....అని చెప్పను కానీ కరెక్ట్ గా అనిపించేసరికి నా సోల్ మేట్ నాకు ఎదురయ్యాడు"అంది రియా

"వాట్ ?"షాక్ లో వుండిపోయాడు విజయ్

"హా చూస్తావా నా సోల్ మేట్ ని.........?"అని సెల్ ఓపెన్ చేసింది......తన గ్యాలరీ లో వున్న పిక్ ని చూపించింది........!!!!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#25
12.ఇది నిజమేనా?!

గ్యాలరీ లోని ఫోటోని చూస్తూనే షాక్ గురయ్యాడు విజయ్.......

మరి షాక్ అవ్వడా...ఆ పిక్ ఎవరిదో కాదు...విజయ్ దే........."రియా.......?ఏంటిది....తమాషా గా వుందా...?"అడిగాడు విజయ్

"లేదు......విజయ్ ఇది నిజమే.....నేను మీ ఆఫీస్ కి ఇంటర్వూ కి వచ్చినప్పుడే నిన్ను చూసి లవ్ చేశాను.........ఆ తర్వాత నిన్ను ఫాలో కూడా అయ్యాను....నా ప్రేమ జస్ట్ అట్రాక్షన్ కాదని నాకప్పుడే తెల్సింది....ఐ రియల్లీ లవ్ యూ...."అని రియా అలా విజయ్ కి ప్రపోస్ చేసింది...ఇలా బస్ బస్టాండ్ లో ఆగింది........

రియా కి ఏమి సమాధానం చెప్పాలో తెలియక లేచి తన బ్యాగ్ తీసుకుని బస్ దిగేశాడు విజయ్.....విజయ్ వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది రియా......

*****

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే........

విజయ్ బీటెక్ లో వుండగానే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు......అది ఒక 3 మంథ్స్ లోనే బాగా పాపులర్ అయ్యింది.....ఈ లోపల తనకి అమెరికా లో ఎం.ఎస్ చదివే ఛాంస్ రావడం తో బిజినెస్ వాళ్ళ నాన్నగారికి అప్పగించి తను అమెరికా వెళ్ళిపోయాడు.......ఆ తర్వాత వచ్చాక.....తన బిజినెస్ కాక వాళ్ల నాన్న బిజినెస్ చూస్కుంటుండగా......వాళ్ల నాన్న చెప్పారు....తన బిజినెస్ ఏ కంటిన్యూ చేయమని...కానీ విజయ్ కి ఇంట్రెస్ట్ లేక వాళ్ళ నాన్న గారి బిజినెస్ లో ఒక బ్రాంచ్ ని చూసుకుంటున్నాడు.......

ఇలా ఒక సంవత్సరం గడిచింది........

ఎప్పటి లాగే ఆరోజు కూడా......ఆఫీస్ కి వచ్చాడు విజయ్......మనసంతా ఏదోలా వుంది......సో వర్క్ ని ఇంస్పెక్షన్ చేస్తూ అలా తిరుగుతుండగా.......ఎవరివో మాటలు వినిపించి అటు వైపు తిరిగి చూశాడు.....

5 ఫీట్ 4 ఇంచెస్ వున్న అమ్మాయి.......కాటుక దిద్దిన కళ్ల తో......ముక్కు కు చిన్న ముక్కెర తో.....ముఖం మీద చిరునవ్వు తో రిసెప్షనిస్ట్ ని తిడుతుంది........ఏదొ పేపర్ చూపిస్తూ..........

ముఖం మీద చిరునవ్వుతో కూడా కోప్పడొచ్చు అని విజయ్ కి అప్పుడే అర్థమయ్యింది......ఆమెని అలానే చూస్తుండిపోయిన విజయ్.......ఆమె బయటకి నడిచిన మరుక్షణం రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి...ఏంటి సంగతి అని అడిగారు......

వాళ్ల కంపెని లో వేరే బ్రాంచ్ కి ఎంప్లాయిస్ కావాలి అని వచ్చిన అడ్వర్టైజ్ మెంట్ చూసి తను ఇక్కడికి వచ్చిందని...అడ్రెస్ ఇది కాదని చెప్పి పంపించానని చెప్పింది రిసెప్షనిస్ట్........

"ఇంతకి తను.....ఏ బ్రాంచ్ కి వచ్చింది......?"అడిగాడు విజయ్.......రిసెప్షనిస్ట్ చెప్పిన సమాధానం తో తను మళ్ళీ తన బిజినెస్ కి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని......హడావిడిగా తన పాత ఆఫీస్ కి వెళ్లాడు......విజయ్ వెళ్ళెసరికి తను రిసల్ట్ కోసం వెయిట్ చేస్తుంది........

వడివడిగా మ్యానేజర్ రూం కి వెళ్ళిన విజయ్....

"మేనజర్ గారు ఆ అమ్మాయి సెలక్ట్ అయ్యిందా...?"అని అడిగాడు విజయ్ ఆ అమ్మాయి ని చూపిస్తూ

"హా అయ్యింది సార్...."చెప్పాడాయన....

ఇక విజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి........

అలా తను ఇంకో నెల రోజుల్లో జాయిన అవుతుంది అని తెల్సుకుని.....ఆ కంపెని కి మారిపోయాడు విజయ్....

కానీ ఆ అమ్మాయి రెండు రోజుల్లో జాయిన్ అవుతుంది అనగా విజయ్ కి అర్జెంట్ మీటింగ్ వుండి వేరే వూరు రావడం తిరుగు ప్రయాణం లో కార్త పాడవ్వడం తో తను బస్ ఎక్కడం అక్కడ్ తను మొదటి చూపులోనే ప్రేమించిన రియా తన పక్కనే కూర్చోవడం....తన పాస్ట్ చెప్పడం........చివరికి విజయ్ ఏ తన సోల్ మేట్ అనడం అన్నీ జరిగిపోయాయి.........

*******

తన కార్ లో వెళ్తున్న విజయ్ కి ఏమీ అర్థం కాలేదు.....రియా తనని ప్రేమించడం ఏంటి......?రియా ని అంతగా ప్రేమించిన ఆ అభి ఎవరు......?అసలు తనెలా వున్నాడొ.....!!!!!అని ఆలోచిస్తూ ఇంటికి చేరాడు విజయ్*****

ఇంటికి చేరిన అభి తన రూం లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు........తన రూం లోనే వున్న ఒక సీక్రెట్ రూం లోకి వెళ్ళాడు......ఎటు చూసినా గోడల నిండా రియా ఫోటోలే........వాటినే చూస్తూ........అలానే కూలబడిపోయాడు అభి.........

ఎంత ఏడ్చినా మనసులోని బాధ తగ్గట్లేదు......

"నే చేసిన తప్పేంటి......ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించడమా...?అసలు నా నేరమేంటి....నువ్వు లేని నన్ను ఊహించుకోలేకపోవడమా....?ఉరిశిక్ష పడ్ద ఖైది ని కూడా ఆఖరి కోరిక తీర్చే ఉరితీస్తారే........అలాంటిది నిన్ను ప్రేమించిన నాకు నువ్విచ్చిన బహుమానం ఇదేనా?????నీతో కలిసి బతకాలి అని ఎన్నేళ్ళ నుంచి కలలు కన్నాను......?ఆ కలల్లొనే ఇన్నేళ్ళు బతికాను......ఏ నువ్వంటే నాకు పిచ్చి అని నీక్కూడా తెల్సు గా...ఒక్క మాట నువ్వంటే నాకిష్టం లేదని చెప్పాల్సింది,....వినకపోతే కొట్టాల్సింది......అలా కాకుండా....ఇలా నానుంచి దూరం గా ఎందుకు వెళ్ళిపోయావ్.........కనీసం నీ ముఖం చూసే అర్హత కూడా నాకు లేదా రియా.........?ఎందుకు రియా....?బతకడానికి ఆశ వి నువ్వై నిలిచి చివరికి నాకు బతుకే లేకుండా చేసావ్.........నేనింక ఎవరి కోసం బతకాలి.....?ఎందుకోసం బతకాలి అని అక్కడున్న కత్తి ని చేతిలోకి తీసుకున్నాడు..........చివరి సారిగా రియా ఫోటో వైపు చూశాడు...........!!!!!!

****

"ఈ విక్రాంత్ ఏంటి ఫోన్ ఎత్తడు.......?"అప్పటికే పది సార్లు కాల్ చేసి విసుగొచ్చిన విజయ్ మనసులో అనుకోసాగాడు........

ఇలా కాదని వాళ్ల అమ్మ కి కాల్ చేసాడు విజయ్

"హలో ఆంటీ...విక్కి కి కాల్ చేస్తుంటే ఎత్తట్లేదు కాస్త ఇస్తారా....?"అని విజయ్ అడగడం తో....."హా సరే ..."అని విక్కి రూం కి వెళ్ళిన ఆవిడ గావు కేక తో విజయ్ కంగారు పడ్డాడు......

"హలో ఆంటీ ఏమయ్యింది....?"అని అరిచాడు

ఇంతలో విక్కి ఫోన్ తీసుకుని......."ఏం కాలేదు లే రా....అమ్మ నా అవతారం చూసి అరిచింది..."అన్నాడు విక్కి

"ఓహ్ అబ్బాయ్ ఎప్పుడొస్తున్నావ్...నీ రాక కై నా కంపెనీ భర్త కోసం ఎదురు చూస్తున్న భార్య లా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది........"అన్నాడు విజయ్

"వచ్చేస్తున్నా.......నాక్కూడా ఇక్కడ ఏమీ బాలేదులే......"అన్నాడు విక్కి

**********

తన ఫోన్ లోని పిక్ చూస్తూ "ఐ లవ్ యూ సో మచ్......."అంది రియా!!!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#26
13.వెల్ కం

ఆఫీసులో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు విజయ్......."రియా...కి ఇది ఫస్ట్ రోజు...చక చకా చెప్పిన పనులన్నీ చేస్కుపోతుంది...అఫీసులో సీనియర్స్ కాక తన ఏజ్ వాళ్లంతా అప్పుడే తనకి ఫ్రెండ్స్ అయిపోయారు......ఎందుకవ్వరు...?తన ప్రవర్తన అలాంటిది........

ఆ రోజు కి పని ముగించుకుని......విక్రాంత్ వస్తుండటం తో రైల్వే స్టేషన్ కి బయల్దేరాడు విజయ్......కార్ పంపిస్తాను అన్నా కూడా విక్రాంత్ ట్రైన్ లోనే వస్తానడడం తో ఇలా తనని పిక్ చేస్కోడానికి రైల్వేస్టేషన్ కి వెళ్తున్నాడు.....దారిలో రియా నడుస్తూ కనిపించింది....తన పక్కగా కార్ ఆపి....

"రియా...ఏంటి నడుస్తున్నావ్...?"అడిగాడు విజయ్

"అది....ఆటో దొరకలేదు సార్..."అంది రియా

"సార్ ఆ....నిన్న మామూలు గానే మాట్లాడావ్ గా ఇవాళ ఏమయ్యింది...?"అనుమానంగా అడిగాడు విజయ్

"సారీ సార్...మీరు బాస్ అని తెలియక ఏదేదో వాగేశాను...క్షమించండి..."అంది రియా

"క్షమాపనలు తర్వాత...ముందు కార్ ఎక్కు నేను డ్రాప్ చేస్తాను...."అని అనడం తో..."పర్లేదు సార్..."అంది రియా

"చాలు చాల్లే...నీ మొహమాటం....ఎక్కు..."అనేసరికి ఇక తప్పక కార్ ఎక్కింది రియా

"అవును నువ్వెక్కడికి వెళ్లాలి..."డ్రైవ్ చేస్తూ అడిగాడు విజయ్...చెప్పింది రియా

"ఓహ్ అవునా...నా ఫ్రెండ్ వూరి నుంచి వస్తున్నాడు దారిలో రైల్వే స్టేషన్ లో పిక్ చేసుకుని...ఆ తర్వాత నిన్ను డ్రాప్ చేస్తాను నీకేం పర్లేదు గా ?"అడిగాడు విజయ్

"హా పర్లేదు..."అంది రియా

రైల్వే స్టేషన్ లో........

ట్రైన్ రావడం తోనే విక్రాంత్ వున్న బోగి వైపు పరిగెత్తాడు విజయ్.......విక్కి కూడా విజయ్ కోసం చూస్తూ ట్రైన్ కొంచెం స్లో అవ్వగానే విజయ్ ని చూసి అమితానందం తో కౌగిలించుకున్నాడు........

అక్కడున్న వాళ్లంతా వీళ్ళను వింతంగా చూశారు.......

విజయ్ విక్కి లగేజ్ తీసుకుని మాట్లాడుతూ ఎంట్రంస్ దాకా వచ్చేశాక గుర్తొచ్చింది అతనికి రియా విషయం....

"ఇంతకి తనేది?"అన్నాడు ఒక్కసారిగా విజయ్

"తనెవరు....?"అడిగాడు విక్కి

ఇంతలో రియా ని చూసిన విజయ్..."దేర్ షీ ఈస్ "అని అనడంతో విజయ్ చూసిన వైపు చూసిన విక్కి రియా ని చూసి షాక్ అయ్యాడు........

విక్కి ని చూసిన రియా కళ్ల లోంచి నీళ్లు....అది విక్రాంత్ ఇంకా విజయ్ ఇద్దరూ చూశారు...కానీ విజయ్ మాత్రం ఒక అడుగు ముందుకేసి......"ఏమయ్యింది రియా...?"అడిగాడు తనని

"కంట్లో ఏదో పడింది విజయ్..."ఒక్కసారిగా సార్ నుంచి విజయ్ కి పిలుపు మార్చింది రియా

విక్కి-విజయ్ ముందు కూర్చున్నారు.....రియా వెనక కూర్చుంది.....

"విజయ్ ఇక్కడే అపేయ్యి..."అనేస్రైకి కార్ ఆపాడు విజయ్...

"ఓహో ఇదే నా మీ హాస్టలా....ఒకే టేక్ కేర్ రియా....బై..."అని చెప్పేసి కార్ ముందుకు పోనిచ్చాడు విజయ్.....

"విక్కి రేపటి నుంచి ఆఫీస్ కి వస్తున్నావ్ గా...?"అడిగాడు విజయ్

ఏదో ఆలోచిస్తూ సమాధానం చెప్పలేదు విక్కి..."రేయ్ నిన్నేరా...?ఎక్కడున్నావ్...?'అని విజయ్ మరొక్కసారి అడిగేసరికి..."హా వస్తా లే రా...టైర్డ్ గా వుంది నోర్మూస్కుని ఇంటికి పోనివ్వు ముందు..."అనేసరికి 10 నిమిషాల్లో ఇంటి ముందు వున్నాడు విజయ్

విక్కి కి రూం చూపించి తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి నిద్రపోయాడు........

మధ్య రాత్రి లో ఎందుకో మెలకువ వచ్చి......తన రూం లో వాటర్ అయిపోవడం తో కిచెన్ లోకి వెళ్తూ తెరచి వున్న విక్కి రూం వైపు చూశాడు విజయ్....

రూం లో విక్కి లేడు వాష్ రూం కి ఏమైనా వెళ్ళాడెమో అని చెక్ చేస్తే అక్కడ కూడా లేడు....ఇల్లంతా వెతికినా కూడా విక్కి కనిపించకపోయేసరికి తన రూం లో వున్న మొబైల్ కోసం వెళ్ళాడు......

ఫోన్ చేస్తే విక్కి ఎత్తట్లేదు......"ఏమయిపోయాడు వీడు...."అని బయటకి వచ్చి వాచ్ మెన్ ని అడిగేసరికి ...అతను ఇంట్లోంచి ఎవరూ వెళ్లలేదు అని చెప్పాడు........
ఇంతలో విజయ్ ఫోన్ రింగ్ అయ్యింది...

ఫోన్ ఎత్తుతూనే...."రేయ్ ఎదవ ఎక్కిడికి వెళ్ళావ్....?"అన్నాడు విజయ్

"అది నిద్రపట్టకపోతేనూ....బయటకి వచ్చాను...వచ్చేస్తాను లే నువ్వు మరీ సి ఐ డి లా ఎంక్వయిరీ లు చెయ్యకు....అన్నట్టు ఆ వాచ్ మెన్ నేను బయటకి వెళ్లడం చూడలేదు......సో నువ్వు అనవసరంగా అనుమానాలు పెట్టుకోకు...నేను వచ్చేస్తాను...నువ్వేల్లి బొజ్జొ..."అని రెండొ మాట కి తావివ్వకుండా ఫోన్ పెట్టేశాడు విక్కి

"సర్లే..."అని మనసులో అనుకుని తన రూం కెళ్ళి పడుకున్నాడు విజయ్....

మరుసటి వుదయం.....సమయం 6:00 గంటలు....

జాగింగ్ కోసం హాస్టల్ నుంచి బయటకి వచ్చింది రియా....

అలా పక్కనున్న పార్క్ లోకి వెళ్ళి....ఒక 5 రౌండ్లు వేసిన పిమ్మట......అలసిపోయి రొప్పుతుంది....

ఎదురుగా ఒక చెయ్యి బాటిల్ తో ప్రత్యక్షమయ్యింది.....

ఎవరా అది అన్నట్టు చూసింది రియా....ఎదురుగా బాటిల్ పట్టుకుని నిల్చున్నాడు విక్రాంత్....

తన ముఖం చూడ్డం తోనే పక్కకి వెళ్తున్న రియా చెయ్యి పట్టుకుని ఆపాడు విక్రాంత్.....జాగింగ్ చేసి అలసి పోయినట్టున్నారు రియా గారు....నీళ్ళు తాగండి...అన్నాడు విక్రాంత్

తల అడ్దంగా వూపి...చెయ్యి విదిలించికోబుతుండగా రియా చేతి పై పట్టు బిగించాడు విక్రాంత్
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#27
14.టార్చర్

"చెయ్యి వదులూ....."అంది కోపంగా రియా....

ఇంకా గట్టిగా పట్టుకున్నాడు విక్రాంత్....."చెయ్యి వదులు అభి...."అని గట్టిగా అరిచేసరికి...."ఓహ్ నా పేరు కూడా గుర్తుందా నీకు...నా పేరు తో పాటు....నా వల్ల కష్టంగా అలవాటైన జాగింగ్ గుర్తుంది.....నన్ను రాత్రంతా నీ హాస్టల్ బాల్కని లోంచి చూడాలని గుర్తుంది...నేను ఇన్ని రోజుల తర్వాత కనిపించిన వెంటనే ఏడ్వాలనీ గుర్తుంది........నేను నీ ముందుకొస్తే అరవాలని నా నుంచి పారిపోవాలని కూడా గుర్తుంది కానీ నా ప్రేమ మాత్రం నీకు గుర్తులేదు కదా...?బాగుంది రియా....చాలా బాగుంది.....బై...."అని మరో మాట కి తావివ్వకుండా అక్కడ నుంచి వచ్చేశాడు అభి అలియాస్ విక్రాంత్ అభిమన్యు....

అభి వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది రియా.....

ఆ రోజు ఆఫీసులో......

వర్క్ చేసి కొన్ని సిగ్నేచర్స్ కోసం విజయ్ దగ్గరికి వెళ్ళింది రియా.....

"హో మిస్ రియా....సిగ్నేచర్ డిపార్ట్మెంట్ నాది కాదు మన ఆఫీస్ కి కొత్తగా వచ్చారు కదా విక్రాంత్...తనది...."అని విజయ్ చెప్పేసరికి ఇబ్బంది గా విక్రాంత్ అభిమన్యు క్యాబిన్ వైపు కదిలింది రియా

"మే ఐ కం ఇన్ సార్..."అంది రియా

"హా..."అని అన్నాడు విక్కి

(నోట్:ఇక నుంచి అభి కి బదులు విక్కి అని రాస్తాను.....ఎందుకంటే అతని పేరు విక్రాంత్ అభిమన్యు కనుక పూర్తి పేరు రాయడం కష్టం కాబట్టి...దయచేసి గుర్తించగలరు)

లోపలికి వచ్చిన రియా ని చూస్తూ...."ఏంటి...?"అన్నాడు సీరియస్ గా....

"అది సార్......ఈ పేపర్స్ మీద మీ సిగ్నేచర్స్ కావాలి..."అంది రియా పేపర్స్ ఇస్తూ...వాటిని చూడనైనా చూడకుండా......రియా ముఖాన విసిరి కొట్టాడు విక్కి....

"మాడిఫికెషంస్ చేసుకుని రా...."అన్నాడు విక్కి...

కిందపడిన పేపర్ లు ఏరుకోని చెదరని చిరునవ్వు తో క్యాబిన్ లోంచి బయటకి వచ్చింది రియా.....ఒక గంట గదిచాక మళ్ళీ విక్కి రూం కి వెళ్ళింది......"సార్....మీ సైన్ "అంది రియా

"ఏంటి ఈ గంట బాగా టైం పాస్ చేశావా...?"అడిగాడు విక్కి

మౌనంగా వుంది రియా......ఆ పేపర్ లు చేతులోకి తీసుకుని....ఈ సెకండ్ పేపర్ లో వున్న కంటెంట్ మార్చు..........నేను నీకో మెయిల్ చేస్తాను...దాన్ని చదివి ఇంకో రిపోర్ట్ చేసుకుని రా......మెయిల్ లో వున్న కంటెంట్ ఎగ్జాట్ గా దింపావనుకో నాకు తెల్సిపోతుంది...మళ్ళీ నీకు వర్క్ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసి....మొత్తం అయిపోయాక నా దగ్గరికి తీసుకురా సరేనా...?అని పేపర్స్ తిరిగిచ్చాడు విక్కి

"సరే...సార్..."అని తలూపి వెళ్ళిపోయింది రియా....

ఆ రాత్రి విక్కి తన రూం లోంచి బయటకి వస్తు రియా క్యూబికల్ వైపు చూశాడు తను కనిపించలేదు.......మైండ్ లో తనని ఎలా ఇబ్బంది పెట్టాలో ఆలోచించి పెట్టుకున్నాడు ఆల్రెడీ

మరుసటి వుదయం.......

ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్ల గంట ఆలశ్యం గా వెళ్ళింది రియా....తను ఆఫీస్ కి వెళ్ళేసరికి ఎవరో తన సీట్ లో కూర్చుని వర్క్ చేస్కుంటూ కనిపించారు........

వెంటనే అతని వద్దకు వెళ్ళింది రియా

"హే....దిస్ ఈస్ మై సీట్..."అంది రియా

"gm ordered me to do my work from here n he asked u to come to his cabin once"అని అతను చెప్పేసరికి ఉడుకుతున్న రక్తం తో విక్కి రూం తలుపు గట్టిగా తోసి.......

"అసలే ఏమనుకుంటున్నారు మీరు...నా ప్లెస్ అతనికి ఎందుకు ఇచ్చారు..."అని అరిచింది రియా

"యూ ఆర్ డిస్ మిస్డ్ మిస్ రియా కృష్ణ" అన్నాడు విక్కి

"బట్ వై....?"అంది రియా

"you have been late to office so obviously u r dismissed"జవాబిచ్చాడు విక్కి

"this is ridiculous"అంది రియా"This is unethical"అంది రియా

"so you r teaching wht is ethical....ho gud....am not in that now you may leave"అని ధీటుగా సమాధానమిచ్చాడు విక్కి

"నువ్వు కావాలనే నా పై పగ తీర్చుకుంటున్నావ్ కదా...?"అడిగింది రియా

"హా అవును....ఏంటి...?"అన్నాడు విక్కి

ఆ మాట జీర్ణించుకోలేని రియా......."నేను నీ నుంచి దూరమవ్వడానికి రీసన్...."అని అనబోయి ఆగిపోయి....ఊహ నుంచి బయటకి వచ్చింది....తనిప్పుడు విక్కి క్యాబిన్ బయట వుంది........

"ఓ మై గాడ్ ...అస్సలు ఇలా మాట్లాడకూడదు రా నాయనోయ్...."అనుకుని "మే ఐ కమిన్ సార్"అని లేని గౌరవం గొంతులో పలుకుతూ అడిగింది రియా

"హా యూ మే..."అన్నాడు విక్కి....అప్పటికే 5 నిమిషాల నుంచి తన క్యాబిన్ బయటే నిల్చున్న తన రాక కోసం ఎదురు చూస్తూ

"సార్..నా సీట్లో వేరే వాళ్ళు కూర్చున్నారు...రీసన్ అడిగితే మిమ్మల్ని కలవమన్నారు....ఎందుకో తెల్సుకోవచ్చా...?"అడిగింది రియా వినయంగా

"హా....మీరు మీకిచ్చిన వర్క్ కంప్లీట్ చెయ్యలేదు......యండ్ ఇవాళ వన్ అవర్ 10 మినిట్స్ లేట్ గా వచ్చారు...సో అందుకే....."అన్నాడు విక్కి

"సార్ మరి నేనక్కడ కూర్చోవాలో చెబుతారా...?"అంది రియా

"హా ....మీ ఇరెగ్యులారిటీ కి పనిష్మెంట్ గా రూం నెంబర్ 6 లో కూర్చోండి.....నో యూ మే లీవ్..."అన్నాడు విక్కి....

"వామ్మొ ఏం ఫిట్టింగ్ పెడతాడో "అనుకుని....ఆ రూం లోకి వెళ్ళింది రియా

అదో బూత్ బంగళ లా వుంది.......చచ్చాను రా భగవంతుడా అనుకుంది రియా....!

"సరే చేసేదేముంది....ఇక తప్పదు లే" అని అక్కడే కూర్చుని తన వర్క్ చేస్కోసాగింది రియా....ఇంతలో అక్కడికి వచ్చిన విజయ్ తనని చూశాడు....

ఏవో ఫైల్స్ తో కుస్తీ పడుతుంది తను......ఎంత ముద్దుగా వుందో.....తనని అలా చూస్తుండగానే....ర్యాక్ లో నుంచి ఫైల్స్ తియ్యబోయ్ అన్నిటినీ హ్యాండిల్ చెయ్యలేక వాటి తో సహా కింద పడింది రియా...

సహాయం చేద్దామని వెళ్ళబోయ్ కూడా రియా ని చూసి ఆగిపోయాడు విజయ్.....

కిందపడిన రియా......ముందు చేసిన పని తనని ఎవరూ చూడలేదు కదా అని అటూ ఇటూ చూడడం...ఎవరూ చూడలేదనుకుని..."హమ్మయ్య...."అనుకుంది...అతి కష్టం మీద లేచిన రియా....తిరిగి తన పని చేస్కోసాగింది....

మధ్యాహ్నం.....

క్యాంటీన్ లో...

"ఏంటి రియా మార్నింగ్ నుంచి కనిపించనే లేదు....?"అడిగాడు వంశి....

"అది నాకోసం స్పెషల్ గా క్యాబిన్ వేసారు లే....."అని నాలుక కరుచుకుంది రియా ఎదురుగా వచ్చిన విజయ్-విక్కి ని చూసి

"విజయ్ సార్ మీరేంటిక్కడ....?"అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు......రియా మాత్రం "చచ్చాను రా భగవంతుడా...."అనుకుంది.....విక్కి మాత్రం రియా వైపే కోపంగా చూస్తున్నాడు.......

"ఏం లేదు...విక్రాంత్ క్యాంటిన్ లో తిందాము అంటె ఇలా వచ్చాము..యూ గాయ్స్ క్యారీ ఆన్...."అని విజయ్ చెప్పి విక్కి తో పాటు ముందుకి నడిచాడు,.....

వరుణ్:రియా...నీ మోచేతి కి ఏమయ్యింది...?

"ఏమయ్యింది...?"అని అటూ ఇటూ చూస్కుంది రియా....మోచేతికి చిన్న గాయమై లైట్ గా రక్తం వస్తుంది....

"ఇట్స్ బ్లీడింగ్"అంది వినయ

ఆ మాట వినడం తోనే వెనక్కి తిరిగాడు విజయ్....ఈ లోపు రియా దగ్గరకొచ్చిన విక్కి తన చెయ్యి పట్టుకుని "ఫస్ట్ ఎయిడ్..."అని అరవడంతో అలర్టయిన విద్య...వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి విక్కి కి అందించింది......అది తీసుకున్న విక్కి కట్టు కట్టి....ఏ ఎక్స్ ప్రెషనూ లేకుండా మళ్ళీ విజయ్ వద్దకు వచ్చి..."పదరా...వెళ్దాం..."అని వెళ్ళిపోయాడు.......

"వావ్...ఎంత కేరింగో..........హీ ఈస్ సో కూల్..."అంది వినయ

"చాలాపు..."అన్నాడు వంశి

"నీకు కుళ్ళురా....కుళ్ళు...."అంది వినయ

"నాకు కుళ్ళెంటమ్మా....?అయినా అందులో కేరింగ్ ఏముంది.....మనమైనా చేసే వాళ్ళమే కదా ఫస్ట్ ఎయిడ్.....ఇందులో ఏమంత వింత వుందని...."అడిగాడు వరుణ్

"నీకు అర్థం కాదులే...."అని తేల్చేసింది విద్య
అందరూ ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పారే గానీ రియా కట్టు కడుతున్నప్పుడు విక్కి కళ్ళలో నీళ్ళు తిరగడం....విక్కి వెళ్ళాక వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రియా కళ్ళలోని నీటి చెమ్మ ఎవరూ గుర్తించలేదు.........!!?

***
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#28
15.అదేంటో...!

"విక్కి నీకో విషయం చెప్పాలిరా....ఏమనుకోవుగా?"అడిగాడు విజయ్

"బాబోయ్....మీరు మీకు సీనియర్ అండి మీరేమైనా చెప్పొచ్చు మేమేం అనుకుంటాం..."అన్నాడు నవ్వుతూ విక్కి

"అది...రియా ని తన క్యూబికల్ లోనే వుండనివ్వురా....పాపం అక్కడ చాలా అవస్థ పడుతుంది చూశావ్ గా తన్ చేతికి దెబ్బ కూడా తగిలింది..."అన్నాడు విజయ్

"ఈ విషయం ఐతే నాతో మాట్లాడొద్దు...."అని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు విక్కి.....

మధ్యాహ్నం రౌండ్ స్టార్ట్ అయ్యింది......

"ఏదో తీక్షణంగా ఆలోచిస్తుంది రియా....."అలా ఆలోచిస్తున్న రియా ని అటు వైపు గా వెళ్తున్న విక్కి చూసి...."ఈ సారి.....ఎవర్ని బాధ పెట్టడానికి స్కెచ్ వేస్తున్నారు మేడం...?"అడిగాడు తన దగ్గరికి వచ్చిన విక్కి

గాయపడ్డట్టు ఒక లుక్కించ్చింది రియా.....

"ఓహో చేసేదీ మీరే.,.....చూసేదీ మీరేనా....?అన్నీ మీరే చేసేస్తే....ఇక నేనేం చేయాలి...?"చేతులు కట్టుకుంటూ అడిగాడు విక్కి

"చెయ్యాల్సింది చేసారు గా...?ఇక్కడి కి నన్ను షిఫ్ట్ చేసి...."సీట్లోంచి లేస్తూ చెప్పింది రియా

"మీరు చేసిన దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ మేడం....అప్పుడే మర్చిపోయారా...?"అడిగాడు విక్కి

"సార్.,...మీ పర్సనల్ విషయాలు ఆఫీస్ లో మాట్లాడొద్దు.....మీకు నాకు ఏమైనా వుంటె....బయట చూస్కోవాలి కానీ ఇలా చెయ్యడం ఏమీ బాలేదు......మనుషులుంటారా ఇక్కడ అస్సలు...."అంది రియా

"డోంట్ యూ డేర్ టూ స్పీక్ ఎబౌట్ మై డెసిషంస్...నువ్వు తప్పు చేశావ్....దానికి నేను శిక్ష వేశాను......నీ మీద గ్రడ్జ్ తో చేయ్యడానికి నాదేమి నీలా చీప్ మెంటాలిటి కాదు......"అన్నాడు కోపంగా

"సార్...యూ ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్..."అంది రియా అతని మాటకి....

"ఐ విల్ సీ యూ ఇన్ ద ఈవినింగ్...."అని అక్కడ నుంచి కదిలాడు విక్కి

సాయంత్రం....7:30

తన పని ముగించుకుని...ఆఫీస్ బయటకి వచ్చిన రియా ని పక్కకి లాగాడు విక్కి

"ఇందాకా ఏదో వాగావ్ కదా ఏది ఇప్పుడు వాగు "అన్నాడు విక్కి రియా చెయ్యి మీద పట్టు బిగిస్తూ

"నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు..."అంది వెళ్ళబోతూ....కానీ విక్కి గట్టిగా లాగేసరికి.....గోడకి అతుక్కుంది రియా...తను ఎటూ పోకుండా....తన చేతులని అడ్డుపెట్టి..."యూ హావ్ టూ టాక్ డ్యామిట్..."ఆల్మోస్ట్ అరిచాడు విక్కి

"నా బిహేవియర్ ని చీప్ అన్నవాళ్ళంతా మాట్లేడేంత స్థాయికి నేను ఇంకా దిగజారలేదు..."అతని ముఖం చూడకుండా జవాబిచ్చింది రియా

"అబ్బో స్థాయి.....నువ్వు మాట్లాడుతున్నావా దాని గురించి....?"హేళనగా నవ్వాడు విక్కి

ఒక సీరియస్ లుక్కించింది రియా

"తప్పు చేసి ఆ చూపేంటే...?"కోపంగా అన్నాడు విక్కి

"మర్యాద ఇచ్చి మాట్లాడు అభిమన్యు..."అంది రియా

"నేను మాట్లాడాను....నేను నా పెళ్లంతో ఇలానే మాట్లాడతాను "అన్నాడు విక్కి

"ఎవరు నీకు పెళ్ళాం....నువ్వు వదిలించుకోవాలనే కదా ఇంత దూరం వచ్చాను...మళ్ళి దాపరించావ్ శని లాగా..."అంది రియా

"నువ్వు అవునన్నా-కాదన్నా నువ్వే నా పెళ్ళాం......దానికి సాక్ష్యం నీ చేతికి వున్న ఆ వుంగరం.....నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయిపోయినట్టె....."అన్నాడు విక్కి

"ఏ కాలం లో వున్నావ్....నిశ్చితార్థం జరిగిన అన్ని జంటలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయా....?"అంది వెటకారంగా రియా

"అవ్వాల్సిన అవసరం లేదు....కానీ నీకు నేను అంతగా ఇష్టం లేకపోతే....నేను తొడిగిన వుంగరం నువ్వెందుకు వుంచుకున్నావ్ తీసి పడయొచ్చు గా...."అన్నాడు విక్కి

వెంటనే తన చేతికి వున్న వుంగరం తీసి విక్కి చేతిలో పెట్టి...ముందుకు నడిచిన రియా....చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్న విక్కి...."ఇది తీసిచ్చావ్ సరే....మరి ఆరోజు నీకు-నాకు మధ్య జరిగింది నీ మనసులోంచి ఇంత తేలికగా తీసేస్తావా....?నా మీద ఏ ఫీలింగ్ లేకుండా.....నాతో అలా...?"అని చెబుతుండగా.....

"విక్కి..."అన్న విజయ్ గొంతుకి ఇద్దరూ ఎలర్ట్ అయ్యారు.......!!!

***
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#29
16.మాట రాని మౌనమిది....

"విక్కి...విక్కి..."అని పిలుస్తూ వస్తున్నాడు విజయ్ ...

వెంటనే రియా ని వదిలేసి ముందుకు కదిలాడు విక్కి.....ఎదురుగా వస్తున్న విక్కి ని చూసిన విజయ్...."ఇక్కడేం చేస్తున్నావ్ రా....?"అని అడగడం తో ..."ఏం లేదు....పద "అని విజయ్ తో పాటు ముందుకి నడిచాడు....

కాని విజయ్ కళ్ళు ఎవరి కోసమో వెతకడం చూసిన విక్కి..."ఎవరి కోసం వెతుకుతున్నావ్....?"

"అది.....తను.....అదే రియా....పాపం సిటీ కి కొత్త కదా.....అందుకే తన కోసం చూస్తున్నాను..."అని విజయ్ చెప్పడం తోనే మారు మాట్లాడకుండా ముందుకు నడిచి కార్ డొర్ ఓపెన్ చేసి......విజయ్ కోసం చూడకుండా ముందుకు పోనిచ్చాడు కార్ ని....

విజయ్ చేష్టలుడిగి చూస్తుండిపోయాడు....

ఇంతలో అక్కడికి వచ్చిన రియా...."గుడ్ ఈవినింగ్ సార్..."అంది

షాక్ లో వున్న విజయ్ ఏం మాట్లాడలేదు...."సార్...ఎనీథింగ్ రాంగ్...?"అని అడగడం తో ఈ లోకం లోకి వచ్చిన విజయ్...."నథింగ్ రియా....నువ్వింకా వెళ్లలేదా...?"అడిగాడు...

"వెళ్తే మీ ముందెలా వుంటాను సార్..."అంది రియా

"అబ్బా నువ్వా సార్ అనడం ఆపు రియా...."అన్నాడు విజయ్....

"వామ్మొ ఇంకేమైనా వుందా విక్రాంత్ సార్ విన్నారంటే నాకు మళ్ళీ పనిష్మంట్ ఇస్తారు.....వూప్స్....మీరు ఆయన ఫ్రెండ్ కదా...?ప్లీస్ ఆయనకి చెప్పకండి...మీకు పుణ్యం వుంటుంది...."అంది వేడుకోలుగా రియా

"పుణ్యాలు పాపాలు నాకెందుకు లేమ్మా....కొన్ని క్వశ్చింస్ అడుగుతాను సూటిగా చెప్పు సుత్తి లేకుండా....సరేనా...?"అడిగాడు విజయ్

"అయ్యొ నేను స్ప్రైట్ తాగనండి...."అంది రియా

"ఇదే ఇదే వద్దు అనేది.....ఐ రియల్లీ వాంట్ సం థింగ్స్ టు బి సార్ట్ ఇట్ అవుట్....."అని ముందుకి నడిచాడు....విజయ్....అతని వెంటె నడిచింది రియా....అలా ఇద్దరూ నడుచుకుంటూ ఇద్దరూ వెళ్తున్నారు.....కోపం తగ్గిన విక్కి విజయ్ కోసం వీధి చివర వెయిట్ చేస్తూ వున్నాడు.....ఎంత సేపటికి విజయ్ రాకపోవడం తో అతనెప్పుడు వస్తాడా అని రేర్ వ్యూ మిర్రర్ లో చూస్తున్న విక్కి రోడ్డు పై మాట్లాడుకుంటూ వస్తున్న వాళ్ళిద్దరినీ చూసి...కోపాన్ని అనుచుకోలేక అక్కడ నుంచి బయట పడ్డాడు....

"విజయ్ చెప్పు.....ఏం మాట్లాడవేంటి...?"అడిగింది రియా

"ఏంటి ఏమన్నావ్...?"అడిగాడు విజయ్

"అదే ఏదో మాట్లాడాలి అన్నావ్ గా మాట్లాడు అంటున్నా..."అంది రియా

"అది కాదు దానికి ముందు..."అడిగాడు విజయ్

"అది....నీ పేరు పిల్చాను...విజయ్ అని...నువ్వె గా పేరు పెట్టి పిలవమన్నావ్...?"అంది అర్థం కాని రియా

"లేదు....సడన్ గా నువ్వలా పిలిచేసరికి కొత్తగా అనిపించింది లే...కాని అడగేస్తున్నా..."అన్నాడు విజయ్

"అడగండి మహాప్రభు" అంది రియా

"ఆ రోజు నువ్వు బస్ లో చెప్పిందంతా నిజమేనా?"అడిగాడు విజయ్

"హా నిజమే...అభి నన్ను లవ్ చేయడం...నాకు అలాంటి వుద్దేశం లేకపోవడం..."అంది రియా

"అది కాదు...."అన్నాడు ఒక్కసారిగా

"మరి ఏంటి...?"అంది రియా నవ్వు దాచుకుంటూ

"రియా...ఎలా చెప్పాలి నీకు....?యూ సెడ్ దట్ యూ లవ్ మి....ఈస్ ఇట్ ట్రూ...?"అన్నాడు విజయ్ ఐస్ ని బ్రేక్ చేస్తూ

"హిం....."అంది రియా

"అంటె ఎంటి...?"అన్నాడు టెంషన్ తట్టుకోలేక

"ఆ రోజు మిమ్మల్ని ఆఫీస్ లో చూసి లవ్ చేశాను...కాని నాకప్పుడు తెలీదు మీరు ఈ కంపెని ఓనర్ అని....ఐ థాట్ యు వర్ ఏ ఎంప్లాయ్.....బట్ ఐ వాస్ రాంగ్...సో "అంది రియా

ఆమె మాటలు తట్టుకోలేని విజయ్...కొంచెం సీరియస్ గా"ఆ రోజు నువ్వు చెప్పింది నిజమా కాదా...?"అడిగాడు విజయ్

"విజయ్ చెయ్యి పట్టుకున్న రియా....."వాట్ ఐ హ్యావ్ సెడ్ యూ ఈస్ ట్రూ ఐ లవ్ యూ....యండ్ ఐ స్టిల్ డూ....కాపోతే.....ఐ యాం నాట్ రైట్ ఫర్ యూ అని అనిపించింది....ఎందుకంటే ఆ రోజు నేను నీకు ప్రపోస్ చేశాక నువ్వు నాకు కనిపించకుండా వెళ్ళిపోయావ్...సొ ఐ హ్యావ్ డిసైడెడ్....సొ ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేస్తే బెటర్ విజయ్...ఐ విల్ బి యూ యువర్ ఎంప్లాయి....యండ్ యూ ఆర్ మై బాస్....నా హాస్టల్ వచ్చేసింది...సీ యూ గుడ్ నైట్"అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది రియా.....ఆ రాత్రి.......

విజయ్ ఆలోచనలన్ని రియా మాటల్లోనే ఆగిపోయాయి.....ఆ రోజు నేను వచ్చేసి తప్పు చేశానా...?అని....అక్కడ రియా ఏమొ విక్కి అన్న మాటనే గుర్తుతెచ్చుకోని కుమిలి పోసాగింది....ఇక్కడ విక్కి తన రూం లో కూర్చుని అంత క్రితం వాళ్ళిద్దరు చనువుగా మెలిగిన సంఘటననే గుర్తు తెచ్చుకోగా.......అక్కడున్న గ్లాస్ ని కోపంగా చేత్తోనే పగలగొట్టాడు....ముగ్గిరిలోనూ అలజడి....!!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#30
సూపర్
Like Reply
#31
17.నీకెందుకు...?

గ్లాస్ పగిలిన శబ్దం తో పక్క రూం లో వున్న విజయ్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి....విక్కి చెయ్యి రక్తమోడుతుంది...

"ఏంటి రా ఇది....?"అని అక్కడికి వచ్చిన విజయ్....వెంటనే తన రూం కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకురావడానికి వెళ్ళాడు...ఇంతలో......"నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నువు లేని బ్రతుకంటే బ్రతికేది ఎందుకని..."అంటూ ఫోన్ మోగడం తో.....వెంటనే చూసిన విక్కి కి స్క్రీన్ పై రియా ఫోటొ కనిపిస్తూ వైఫీ(wify(wife)) అని వచ్చింది....

అంతే ఇంటి నుంచి బయటకి నడుస్తూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ....ఫోన్ లిఫ్ట్ చేశాడు.....

"ఆభి...ఆర్ యూ ఆల్రైట్...?"అంది రియా

"హూ ఈస్ దిస్...?"అన్నాడు విక్కి

"దిస్ ఈస్ రియా.....నీకు ఎలా వుంది...?"అడిగింది రియా

"నువ్వు చేసిన ఫేవర్ కి ఆనందం తో వుబ్బి తబ్బిబ్బు అవుతున్నా...నీకు కూడా అదే కావాలిగా"అడిగాడు విక్కి

"అది కాదు అభి.....నువ్వు బానే వున్నావ్ గా ఫిజికల్లి.....నీకేమి కాలేదు గా...?"అడిగింది రియా

"మనసుని ఎలానో చంపేసావ్...ఇక శరీరం గురించి నీకెందుకు చెప్పు...?"అడిగాడు విక్కి

"ష్......అభి....ప్లీస్ డోంట్ టాక్ లైక్ దట్...ఒక్కసారి ఇంటి నుంచి బయటకి రాగలవా..నీతో మాట్లాడాలి..."అని అడిగింది రియా

"మీ హాస్టల్ బయటే వున్నాను...రా వచ్చి మాట్లాడు..."అని విక్కి చెప్పేసరికి పరుగున బయటకొచ్చిన రియా కి విక్కి చేతినుంచి రక్తం కారుతూ కనిపించింది.....

రావడం తోనే...."అభి..."అని అతని చేతిని తన చేతిలోకి తీసుకోబోతుండగా చేతిని వెనక్కి విదిలించాడు విక్కి

"అభి....పిచ్చా నీకు..చిన్నపిల్లాడిలా చెయ్యకు...."అని తన చున్ని చింపి కట్టు కట్టింది రియా.....

"లిసన్ అభి...నువ్వంటే నాకిష్టమే....కానీ ప్రేమ కాదు...చిన్నప్పటి నుంచి చూస్తున్న నీపై నాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు.....అదీ కాక నీ కేరింగ్ అభి....ఐ రియల్లి కాంట్ బేర్ ఇట్......చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది.,....అందుకే నేను నీ నుంచి దూరం అయ్యాను...ఇదంతా నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావని చెప్పట్లేదు....నా వల్ల నీకేమి ప్రాబలం కాకూడదని చెబుతున్నా....నీకిది వినడానికి కష్టం గా వున్నా....నేను నా పార్ట్ నర్ ఎలా వుండాలి అని కోరుకున్నాను అచ్చం అలానే నాకు కనిపించారు...యండ్ ఐ రియల్లీ లవ్ హిం.....యండ్ ఇంకో విషయం తను ఎవరో కాదు హీ ఈస్ విజయ్...."అని ముగించింది రియా

ఒక్కసారిగా షాక్ ,బాధ ఒకేసారి విక్కి పై విక్కి మనసు పై దాడి చేసి....అప్పటి దాకా ఎక్కడొ దాగి వున్న హోప్ ని పటాపంచలు చేశాయి.....ఈ క్షణమే చనిపోతే ఎంత బాగుటుందో అని అనిపించేలా చేశాయి.......

ఏ ప్రళయమో వచ్చి తన ప్రాణాన్ని హరించివేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది......

అంత ఇంక రియా చెప్పే మాటలేవి చెవులకి వినపడలేదు.......అలానే రోడ్డు పై తిరుగుతూ వుదయాన్నే ఇల్లు చేరాడు...అతను ఇంటికి చేరేసరికి.....విక్కి వాళ్ళ అమ్మా-నాన్న వచ్చి వున్నారు.....విక్కి కూడా వారిని చూసి కూడా చూడనట్టు....ముందుకు కదిలి....స్పృహ తప్పి కిందపడ్డాడు......

ఒక వారం తర్వాత.....

ఎన్నడూ లేని ఉత్సాహం తో అఫీస్ లోనికి అడుగుపెట్టాడు విక్రాంత్ అభిమన్యు....అందరూ అతన్ని విష్ చేస్తున్నారు.........అందరికి చిరునవ్వు తో సమాధానమిచ్చి.....చివరగా మిగిలి వున్న క్యూబికల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఖాళీ చెయిర్ అతన్ని వెక్కిరించింది.......

అయినా అదేమి పట్టించుకోకుండా....తన పనిలో తాను మునిగిపోయిన విక్కి దగ్గరికి లంచ్ బ్రేక్ లొ వచ్చాడు విజయ్

"హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ రా...?"అడిగాడు విజయ్

"బెటర్..."అని చిరునవ్వు తో సమాధానమిచ్చిన విక్కి ని చూసిన విజయ్...గొంతు సవరించుకుంటూ..."నీకో విషయం చెప్పాలి....."అని మొదలుపెట్టి.....విక్కి ఎటెంషన్ కోసం వెయిట్ చేయసాగాడు....

"హా చెప్పు...."అన్నాడు విక్కి విజయ్ ముఖం చూస్తూ

"ఐ యాం ఇన్ లవ్ విత్ సం వన్.....తనకి ఇవాళ ప్రపోస్ చేద్దామనుకుంటున్నాను...."అని ఆగాడు విజయ్
"కంటిన్యూ..."అన్నాడు విక్కి ఎక్స్ ప్రెషన్ మార్చకుండా

"ఎవరని అడగవా...?"అడిగాడు విజయ్

"చెప్పు...లేటెందుకు..."అన్నడు విక్కి

"షి ఈస్ రియా....తనని చూడగానే నేను లవ్ చేశాను...ఈ కంపెని కి మారింది కూడా తను ఇక్కడ జాయిన్ అయ్యింది అనే.,....ఒకరోజు ఒక పని మీద వాళ్ల వూరు వెళ్ళి వస్తుంటె....తనది నా పక్క సీటే..అప్పుడే తను తన పాస్ట్ గురించి చెప్పింది...ఒక అబ్బాయి తనని సింసియర్ గా లవ్ చేశాడు....కాని తనకి ఆ అబ్బాయి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు....కాని నేను ఒక అబ్బాయి ని కదా ఆ అబ్బాయి లవ్ కి కనెక్ట్ అయ్యాను...ఇం తలో తను నాకు ప్రపోస్ చేసేసరికి ఏం చెప్పాలో అర్థం కాక ఆ టైం లో తప్పించుకున్నాను...కానీ ఇప్పిడిప్పుడె అర్థం అవుతుంది...ఇందులో తన తప్పేముంది....అని....తనంటే నాకెలాగో ఇష్టం....సో ఇవాళ చెప్పేస్తాను..."అని చెప్పి విక్కి రెస్పాంస్ కోసం చూశాడు విజయ్

"చెప్పు...రా దానిలో ఏముంది...?"సింపుల్ గా ఆ మ్యాటర్ ని తేల్చేశాడు విక్కి....

"నువ్వు నాతో పాటు వస్తావ్ గా...?సపోర్ట్ కి...?"అడిగాడు విజయ్

"ఒకే...వస్తాను.."అని చెప్పాడు విక్కి

ఆ సాయంత్రం......

విజయ్ ఏదో మాట్లాడాలి రా అనడం తో......ఆ ప్లేస్ కి వచ్చి వెయిట్ చేస్తుంది రియా....ఇంతలో విజయ్ కార్ రానే వచ్చింది....విజయ్ కార్ దిగి రియా వైపు రాసాగాడు.....విక్కి కార్ లోనే వుండిపోయాడు

"రియా.....నిన్ను చూసిన మొదటి క్షణం లోనే నేను నీతో ప్రేమ లో పడిపోయాను.....నువ్వంటే నాకు చాలా ఇష్టం...మరి అంత ఇష్టం పెట్టుకుని నువ్వు ప్రపోస్ చేసినప్పుడు నేనేందుకు యాక్సెప్ట్ చెయ్యలేదు అనే డౌట్ నీకు రావొచ్చు...ఆ రోజు నువ్వు నాకు అభి గురించి చెప్పినప్పుడు.....నువ్వు చేసింది రాంగ్ అనిపించిండీ...ఎంతైనా నేనూ ఒక అబ్బాయినే కదా అలానే ఆలోచించాను....కాని మొన్న నీతో మాట్లాడినప్పుడే నా తప్పేంటొ నాకు తెల్సి వచ్చింది.,.....ఐ డోంట్ వాంట్ యూ మిస్ యూ రియా....ఐ లవ్ యూ..."అని చెప్పి ఆమె సమాధానం కోసం చూశాడు.....

ఏదో చెబుదామనుకుని కార్ వైపు చూసిన రియా..."మీతో పాటు ఎవరైనా వచ్చారా...?"అని అడిగింది

"హా విక్కి...."అన్నాడు విజయ్

"విజయ్...."అని స్టార్ట్ చేస్తుండగా ఇంతలో కార్ దిగి తమ వైపు వస్తున్న విక్కి కనిపించాడు.....

విజయ్ చేయి పట్టుకున్న రియా....తన మనసులో మాట చెప్పెసింది...."ఐ లవ్ యూ టూ..."అని...ఆ మాట వినడంతోనే ముందుకు వెయ్యాల్సిన అడుగుని వెనక్కి వేశాడు విక్రాంత్ అభిమన్యు
[+] 3 users Like అన్నెపు's post
Like Reply
#32
నైస్ అప్డేట్స్ రైటర్ గారు..!!!


చాల చాల బాగున్నాయ్ అప్డేట్స్. ఒక్క సరిగా మైండ్ బ్లాక్ అయ్యింది రియా డెసిషన్ కి.
తాను అభి ని లవ్ చేయనప్పుడు ఎందుకు లిప్ కిస్ ఇచ్చింది, అభిని చాల సార్లు ప్రేమతోనే హాగ్ చేసుకుంది అని అనిపించింది. 

ఇప్పుడు విజయ్ ని లవ్ చేస్తుంది అని అంటున్నారు, విజయ్ కూడా అభి ది నిజమైన ప్రేమ అని నమ్మాడు. మరి రియాని ప్రేమించినది అభి(విక్కీ) అని విజయ్ కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో.

రియా కూడా విక్కీ కి చిన్న దెబ్బ తగిలిన తల్లిడిల్లిపోతుంది, విక్కీ ఎదురుగా ఉంటే కన్నీరు కరుస్తుంది అని చెబుతున్నారు. విక్కీ ఫ్యూచర్ బాగుండాలి అని ఆరాటం కూడా పడుతుంది.రియా ప్రేమించటం లేదు అని ఎలా నమ్మమంటారు. ఏంటో అర్ధం కావటం లేదు.

ఈ ట్రయాంగల్ ప్రేమ ఎలా ముగుస్తుందో చూడాలి.
కొంపతీసి రియా చనిపోదు కదా?
 
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply
#33
Mee visleshanatmaaka vivarana baagundi vicky master garru
Like Reply
#34
18.ఎవాయిడ్

వెంటనే కార్ లోకి వెళ్ళి కూర్చున్నాడు విక్కి....ఆనందం పట్టలేని విజయ్...రియా ని గట్టిగా హత్తుకోని......ఆ శుభవార్త ని విక్కి కి చెప్పడానికి పరుగుతీశాడు....

"రియా మనం రేపు కలుద్దాం..."అని పనిలో పనిగా చెప్పేశాడు,..

కార్ ఎక్కుతూనే.....విక్కి.......అని విక్కి ని గట్టిగా చుట్టేశాడు......."ఐ యాం సో హ్యాపి రా......ఫైనల్లీ తను ఒప్పుకుంది....."అని చిన్నపిల్లాడిలా ఆనంద పడిపోయడు.....విక్కి కూడా విజయ్ ఆనందం తో శృతి కలిపాడు......

మరుసటి రోజు

సాయంత్రం 5:00

ప్లేస్ ఎయిర్ పోర్ట్

"ఐ యాం సారీ రియా...నాక్కూడా నీతో టైం స్పెండ్ చెయ్యాలనే వుంది...కాని ఇలా ఎమర్జంసీ వస్తుంది అనుకోలేదు.......ఐ విల్ మిస్ యూ వెరీ బ్యాడ్లీ..."అని చెప్పి వీడ్కోలు పలికాడు విజయ్....

విజయ్ ఏదో ప్రాజక్ట్ పని మీద ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చింది......

ఆ మరుసటి రోజు

"మిష్టర్ వరుణ్...కెన్ యూ బ్రింగ్ ద ప్రాజెక్ట్ ఫైల్...."అని అడగడం తో ఫైల్ తీసుకెళ్తున్న వరుణ్ కి అర్జెంట్ గా రమ్మని ఫోన్ రావడం తో.....అక్కడె వున్న రియా కి ఆ ఫైల్ అప్పగించి......తను వెళ్ళిపోయాడు వరుణ్

"మే ఐ కం ఇన్ సార్...?"ఫైల్ పట్టుకుని వచ్చిన రియా అడగడం తో...."కం ఇన్..."అని విక్కి చెప్పేసరికి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది రియా

తనెందుకాలా నడుస్తుందో అర్థం కాని విక్కి తన కాలి వైపు చూశాడు...ఫ్రాక్చర్ అయ్యి కనిపించింది....ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని అలజడి....రెండు రోజుల నుంచి గమనించలేదు తనని...అంటె....వారం తర్వాత తను ఆఫీస్ కి వచ్చినప్పుడు రియా ఆఫీస్ కి ఎందుకు రాలేదు విక్కి కి వెంటనే అర్థమయ్యీంది......మనసంతా ఏదొ గిల్టి ఫీలింగ్ తో నిండిపోయిన మరుక్షణం...తను మరొకరి సొంతం అనే ఆలోచన మనసును గునపంతో గుచ్చినంత గట్టిగా ఙపకం వచ్చేసరికి....కన్ సర్న్ ప్లేస్ లో కోపమొచ్చి యాడ్ అయ్యింది.....

"వరుణ్ అంటే మీరా...?"అడిగాడు విక్కి సీరియస్ గా ముఖం పెడుతూ

"అంటే...అభి అది...."అని నాలుక కరుచుకుంది రియా

"ఇట్స్ సార్ ఫర్ యూ మిస్ రియా...."ఆల్మోస్ట్ అరిచాడు విక్కి

"ఐ యాం సారీ సార్.....అతనికి ఏదో అర్జెంట్ పని పడి నన్ను ఈ ఫైల్ ఇవ్వమన్నారు......."అంది రియా

"వాట్ ఎవర్.......జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్..."అని విక్కి అరిచేసరికి రియా అక్కడ నుంచి కదిలి వెళ్ళబోతుండగా....."మరి ఫైల్ ఎవరిస్తారు...మీ బదులు ఇంకొకరు తీసుకు వస్తారా....?"అని అరిచేసరికి వెనుదిరిగి ఫైల్ టేబుల్ మీద పెట్టి క్యాబిన్ బయటకి వచ్చింది....

ఆ సాయంత్రం...

"అభి నా మీద చాలా కోపంగా వున్నాడు....ఇది ఒకందుకు మంచిదే లే ఇలా అయినా తన బాధ నాకు తప్పుతుంది..."అని అనుకుంటుండగా....తన ఫోన్ మోగింది.....విజయ్ నుంచి కావడం తో క్షణం ఆలోచించకుండా....ఎత్తిన రియా...."హలో...సార్ "అంది...అవతల రెస్పాంస్ వచ్చేలోపు...ఎలర్ట్ అయ్యి....ఓ సారీ విజయ్...అలవాటు లో పొరపాటు అని సరిచేసింది......

"రియా.....ఐ రియల్లి మిస్ యూ..."విజయ్ చెప్పాడు....

"ఐ మిస్డ్ యూ టూ...."అంది రియా.....అలా వాళ్లిద్దరూ మాట్లాడుతుండగా వినకూడదని తెల్సినా వినకుండా వుండలేకపోయాడు విక్కి.....రియా చాలా హ్యాపీ గా వుంది.....తను నేను లేకుండా నిజం గా హ్యాపీ గా వుండగలదా...?నా ప్రేమ తనని అంతలా సఫొకేట్ చేసిందా....?నా కేరింగ్ కరెక్ట్ కాదా...?అయినా కరెక్ట్ అయితే.....ఇప్పుడు నా ప్లేస్ లో విజయ్ ఎందుకు వుంటాడు లే....?తను నన్ను ఎప్పటికి ప్రేమించదు అనే నిజం ఆల్రేడి జీర్ణించుకోగలిగాను కానీ.....తను వేరొకరి సొంతం అంటే ఎందుకు నా వల్ల అవ్వటం లేదు....?"అని ఆలోచిస్తూ.....రియా ఫోన్ పెట్టేసిన వెంటనే.....తనకి కాల్ చేసి డాక్యుమెంట్ మెయిల్ చెయ్యమన్నాడు.....
అది విన్న రియా...."సహజంగా ఐతే ఫైల్ తీసుకు రమ్మని చెప్పాలి కాని మెయిల్ చెయ్యమన్నాడు అంటే నా ముఖం చూడడం కూడా తనకి ఇష్టం లేదన్నమాట....ఒక్కసారిగా ఎంత మారిపోయాడు......నా కోసం ఐ.ఐ.టి లో సీట్ వదులుకున్న అభి ఏనా.....?నన్ను చూడకుండా వుండలేడని అమెరికా ప్రయాణం మానుకోవాలనుకున్న అభి ఏనా తను....?ఒక్కోసారి మనం ఎంత వద్దనుకున్నా ఒకరు మనల్ని ఎవాయిడ్ చేస్తే ఆ బాధ వర్ణాతీతం....నాక్కుడా ఇదే గా కావాల్సింది...అనుకుని మెయిల్ ఫార్వాడ్ చేసింది.....ఒక పది నిమిషాలకి తన ఫోన్ రింగ్ అయ్యింది....విక్కి తనని తన క్యాబిన్ కి పిలిచాడు "ఏమైవుంటుంది ?"అనుకుంటూ భయం భయం గా లోపలికి అడుగు పెట్టింది రియా

"so this the way you are working well done.....మిమ్మల్ని నమ్ముకుంటే కంపెనీ ని అమ్ముకోవాల్సిందే అని ఈ రోజు బాగా అర్థమయ్యింది నాకు...పొద్దున్న నుంచి దీని మీదే కూర్చున్నారు....cant you just make it perfect?forget it...you are good for nothing...మిమ్మల్ని హైర్ చేసిన వాళ్లని అనాలి....వర్క్ చేయడం రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తోముకోవాలి.....అంతే గానీ మా ప్రాణాలు ఎందుకు తీస్తారమ్మా....?పైగా తమరిని ఒక్కమాట అనడానికి వీల్లేదు.....మీకు మళ్ళీ సిఫార్సులు....."అని అరిచేశాడు విక్కి

కళ్లలో నుంచి కన్నీళ్లు ఏరులై ప్రవహిస్తుండగా....అలానే నిల్చుండిపోయింది రియా

"ఇంకా నా ముఖం ఏం చూస్తావ్....జస్ట్ గెట్ లాస్ట్...."అని గట్టిగా అరిచేసరికి ఏడుస్తూ తన క్యూబికల్ కి వచ్చి కూర్చున్న రియా అసలు తను ఏం తప్పు చేశానా అని చూసింది రాంగ్ మెయిల్ సెంట్ చేయడం వల్ల తనకీ పరిస్థితి వచ్చిందని అర్థమయ్యి.....అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చింది......

ఆ నైట్ తన క్యాబిన్ నుంచి బయటకి వచ్చిన విక్కి...ఆఫీసులో ఇంకా ఎవరో వర్క్ చేస్తున్నారనిపించి చూడ్డానికి వెళ్ళాడు......రియా వర్క్ చేస్కుంటూ కనిపించింది.......తన కళ్ళు ఏడ్చి ఎర్రగా వున్నాయి......తనని చూస్తేనే తెలుస్తుంది తను చాలా నీరసంగా వుందని.....వెళ్ళిపొమ్మని చెబుదామని ముందడుగు వేసి మళ్ళి నాకెందుకు అని తన దారిన తను వెళ్ళిపోయాడు....

10 గంటల సమయం....

వర్షం మొదలైంది అప్పుడే.....వాచ్ మెన్ కి కాల్ చేసిన విక్కి

"ఆఫీస్ లో అందరూ వెళ్ళిపోయారా?"

అతనిచ్చిన సమాధానానికి విక్రాంత్ భృకుటి ముడి పడింది.....
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#35
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!


విక్కీ రియా వేరేవాళ్ళ సొంతం అని నిజంగా జీర్ణించుకోలేక పోతున్నాడు. 
మరి రియా ఎలా ఫీల్ అవుతుందో మరి, నిజంగా తనకి విక్కీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లెవా అనేది మీ తరువాత అప్డేట్స్ లో తెలుస్తాయి.

ఇంతకీ చివర్లో వాచ్మాన్ ఎం చెప్పాడు ?విక్కీ రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. 

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply
#36
ni e story
Like Reply
#37
అప్డేట్ బాగుంది
Like Reply
#38
19.స్వీట్ నథింగ్

"ఏంటి.....?ఇంకా ఒకరున్నారా....?"అన్నాడు విక్కి....

"హా అవును సార్ కొత్తగా వచ్చిన మేడం..."అని వాచ్ మెన్ బదులిచ్చేసరికి ఇక లాభం లేదనుకుని కార్ తీసి ఆఫీస్కి పోనిచ్చాడు విక్కి.....

లోపలికి వెళ్ళిన విక్కి కి అక్కడెవరూ కనిపించలేదు....."రియా ఎక్కడ?" అని వెతుకుతుండగా.....తన టేబుల్ మీద తల వాల్చి నిద్రపోతుంది రియా......

తన కంప్యూటర్ స్క్రీన్ ఆన్ లోనే వుంది.....దట్ మీంస్ తను ఇంతకు ముందే పడుకోని వుంటుంది.....అని అనుకోని అసలు తన వర్క్ ఏం చేసిందా అని చూశాడు.....ఆ వేళ సాయంత్రం తనని తిట్టడానికి కారణమైన డాక్యుమెంట్ వుంది....సాధారణంగా అయితే అదేమి పెద్ద పని కాదు అందుకు నైట్ వుండాల్సిన పని లేదు కానీ తనెందుకు వుంది అని ఆ డాక్యుమెంట్ మొత్తం చదవసాగాడు.....చదవడం కంప్లీట్ చేసిన విక్కి కళ్లలో నీటి చెమ్మ.....టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసింది తను ......అప్ టూ డేట్ గా అన్నీ కంప్లీట్ చేసింది.,......అదంతా చూసిన విక్కి కి అనవసరంగా తన మీద కోప్పడ్డనేమో అని అనిపించి ఒక సారి తన తల నిమిరాడు......

తను లేపుదామా అన్న ఆలోచన వచ్చినా దాన్ని విరమించుకోని తన సిస్టం షట్ డౌన్ చేసి తనని భుజాల తో మోసి తనని కార్లోకి చేర్చాడు....చిత్రంగా రియా మధ్యలో లేవలేదు... బహుశా అలసట వల్లనేమో....

అలా తనని చూస్తూ తన మనసులో ముద్రించుకున్న ఙపకాల పొరల్లోకి తొంగి చూశాడు......

***

గతం

"అమ్మా....నేను మూవీకి వెళతాను...ప్లీస్..."అభి లోపలికి వెళ్ళెసరికి వాళ్ళమ్మని బతిమాలుతుంది రియా

"ఎవరొస్తారు...?"అడిగింది వాళ్లమ్మ

"పింక్ అదే ప్రియాంక ఇక నేను..."చెప్పింది రియా

"ప్రియాంక వైజాగ్ వెళ్లింది అని నువ్వేగా చెప్పావ్ నిన్న..."అడిగింది వాళ్లమ్మ

"ఆ ప్రియాంక వేరు తిను వేరు...."కవర్ చెయ్యబోయింది రియా

"నోర్మూస్కో...ఎక్కడికి పంపను నిన్ను..."అని రియా వాళ్లమ్మ చెప్తుండగా....అభి చూసిన రియా అతని దగ్గరికి వచ్చి...చేతిలో చెయ్యేసి......వాళ్లమ్మ దగ్గరికి లాక్కెళ్లి...నేను-అభి వెళతాం ఇప్పుడు ఒకే నా అంది

"అభి ఐతే ఒకే...."అని వాళ్లమ్మ డిక్లరేషన్ ఇవ్వడం తో....ఆ సాయంత్రం ఇద్దరూ సినిమా చూసి వస్తున్నారు.....సినిమా హాల్ ఇంటికి దగ్గరే అవ్వడం తో ఇద్దరూ నడుస్తూ వస్తున్నారు....

"అభి నిన్నోటి అడగనా?"అడిగింది రియా

"ఆడుగు...."అన్నాడు అభి

"నీకెప్పుడూ ఎవరినీ కిస్ చేయాలి అనిపించలేదా....?"అభి ని చూస్తూ అడిగింది రియా

"ఏంటే తింగరి ఏం వాగుతున్నావ్...?"అడిగాడు అభి

"ఈ మూవి లో ఆ సీన్ లు ఎక్కువున్నాయి కదా సో అడిగాను కానీ నువ్వు ఆంసర్ చెప్పు...నీకు అనిపించిందా...?"అడిగింది రియా

"హా అనిపించింది..."అన్నాడు అభి

"ఏంటి నీక్కుడా నా..?"ఆస్చర్యపోయింది రియా

"ఏ నేను మనిషి ని కాదా నాకు ఫిలింగ్స్ వుండవా...అవును నీక్కుడా అన్నావ్...నీకు అనిపించిందా.....?"అడిగాడు అభి

"అబ్బే....ఛా...ఛా...అలాంటిదేమీ లేదు..."అని ముందుకు నడిచింది రియా

సడన్ గా హోరున గాలి వీచడం మొదలైంది.....దానికి తోడు వురుములూ మెరుపులూ ......జనరల్ గా హీరోయింస్ కి ఉరుములంటే భయం వుంటుంది...కానీ ఇక్కడ రివర్స్.....అభి కి చిన్నప్పటి నుంచి అవంటె ఎందుకో భయం......ఒక ఉరుము ఉరమగానే......రియా ని గట్టిగా చుట్టెసాడు.....ఇంతలో చిరు చినుకులు మొదలయ్యాయి.......అభి రియా ని కౌగిలించుకున్నప్పుడు...రియా తల సరిగ్గా అతని గుండెను తాకింది.......అభి గుండె సడి రియా కి సుస్పష్టంగా వినిపిస్తుంది.....పైగా వాన.......అసలే రొమాంటిక్ గా వున్న మూడ్ ని మరింత రొమాంటిక్ చేసింది......మెల్లిగా రియా హార్ట్ బీట్ కూడా పెరిగి తనకే వినిపించసాగింది.....తల ఎత్తి అభి ని చూసింది......అభి రియా ని చూశాడు....ఆ ఒక్క క్షణం లో ఇద్దరికి ఏదో అర్థమయ్యి......వారిద్దరి పెదవులు క్షణ కాలం పాటు కలుసుకుని తిరిగి విడిపోయాయి...తెలియని స్థితిలో ఏదో తెలియని అనుభూతి ఇద్దరిన్ని ముంచెత్తిన మరుక్షణం...రియా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది......

****

ప్రస్తుతం....

కార్ రియా వాళ్ళ హాస్టల్ వద్దకి వచ్చింది......వచ్చి పది నిమిషాలవుతున్నా ఏం చెయ్యాలో విక్కి కి పాలు పోవట్లేదు......ఇంకా లేట్ అయిటే హాస్టల్ లో ఎలో చెయ్యకపోవచ్చు....అన్న థాట్ రాగానే....మెల్లిగా తన భుజాన్ని కదిపి..."రియా...రియా..."లే అన్నాడు విక్కి ...మగతగా కళ్ళు తెరిచిన రియా....

"ఐ లవ్ యూ సొ మచ్" అని తనకి అత్యంత సమీపంలో వున్న విక్కి పెదవులని అందుకుంది........ముందు షాక్ అయినా ఆ తర్వాత ఆమె ముందు ఓడిపోయిన విక్కి తన ముద్దు అని ఆశ్వాదించసాగాడు......!!!!!
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#39
20.పార్టి(part our ways..)

అలా ఒకర్ని మించి ఒకరు ఆ ముద్దు ని ఆస్వాదిస్తుండగా.....సడన్ గా సెంసెస్ లోకి వచ్చిన రియా విక్కి ని తోసింది......షాక్ అయ్యి అలానే చూస్తుండిపోయింది...విక్కి కూడా జరిగిన దాన్ని నమ్మలేనట్టుగా షాక్ లో వుండిపోగా వెంటనే డోర్ తీసి బయటకి పరుగు తీసింది రియా...వెనక్కి తిరిగి చూడకుండా అచ్చం మొదటి సారి లానే....కాపోతే అప్పుడు రియా ఎప్పటికి తనదే అనే బ్రమ లో బతికేవాడు ఇప్పుడు తను ఎప్పటికి తనది కాలేదనే వాస్తవం లో బతుకుతున్నాడు........

అసలు రియా ఎందుకలా రియాక్ట్ అయ్యింది....నన్ను ఎందుకు ముద్దు పెట్టుకుంది...?కొంపదీసి తను నన్ను విజయ్ అనుకోని పెట్టలేదు కదా....?ఆ ఆలోచనే భయంకరంగా వుంది తనలో ఏదో భాగం వేరవుతున్నంత బాధగా వుంది......లేదు....తను నన్ను విజయ్ అనుకోని వుండదు అని ఒక వైపు అనిపిస్తున్నా.....నాకు నేనెంత సర్ది చెప్పుకున్నా.....వాస్తవం అదేనేమో....దేవుడా నా వల్ల కావట్లేదు ఈ బాధ.......కానీ ఈ నిజాన్ని నేను అంత ఈసి గా వదిలెయ్యగలనా.....తను నన్ను విజయ్ అనుకుంది కాబట్టె ముద్దు పెట్టింది......ఆఖరికి ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవాలి అని నేను నిశ్చయించుకున్నాను.........

2 రోజుల తర్వాత........

"This is the party in regard to our success to the latest project hope you all enjoy it and i expect you to do the same hard work for the upcoming projects tq..."అని చెప్పి కిందకి నడిచాడు విక్కి....తన కళ్ళు రియా కోసం వెతుకుతున్నాయి........తనపై ప్రేమ ఎంత చంపుకుందామన్నా చావదు అదేంటొ....ఇలా ఆలోచిస్తూ వెతుకుతున్న విక్కి కళ్ళకి రియా కనిపించింది.....ఒక మూల ఒంటరి గా కూర్చుని వుంది......తన ముఖం లో బాధ సుస్పష్టంగా కనిపిస్తుంది......".తనెందుకో బాధ పడుతుంది....విజయ్ తనతో లేడని ఒంటరిగా ఫీలవుతుందా లేక మొన్న విజయ్ అనుకుని నాకు ముద్దు పెట్టానని గిల్టి ఫీల్ అవుతుంది...వాటెవర్ నాకెందుకు.....?"అని అనుకున్న మరుక్షణం అంత ఈసీగా తీసుకోలేక......విక్కి తన దగ్గరికి వెళ్ళి....విజయ్ కి ఫోన్ కలిపాడు........"హలో చెప్పరా..."అన్నాడు విజయ్.....కానీ లౌడ్ మ్యూసిక్ లో విక్కి కి ఏమి వినపడక ఫోన్ కట్ చేసి.....రియా ని సమీపించి తన చెయ్యి పట్టుకుని టెర్రస్ పైకి లాక్కొని వెళ్ళాడు...రియా కూడా ఎక్కడికి ఎందుకు అని అడగకుండ అతన్ని అనుసరించింది....ఒకసారి పైకి వెళ్ళకా ఫోన్ తీసి మళ్ళీ విజయ్ కి కాల్ చేశాడు....ఈసారి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వచ్చేసరికి ట్రై చేస్తూ వున్నాడు.......రియా మాత్రం ఒక్క క్షణం కూడా తన దృష్టి మరల్చకుండా విక్కి నే చూస్తుంది....ఆమె చూపులు విక్కి కి ఇబ్బంది కలిగించినా పట్టించుకోకుండా ఫోన్ కలుపుతూనే వున్నాడు.......సడన్ గా చిరు చినుకులు స్టార్ట్ అవ్వడం తో ఇద్దరూ స్లాబ్ కిందకి నడిచారు......

విక్కి ఫోన్ ట్రై చేస్తూనే వున్నాడు.....రియా విక్కి ని చూస్తూనే వుంది......ఇంతలో ఆకాశం లో వురుములు మొదలయ్యాయి...ఈ సారి రియా విక్కి ని చుట్టేసింది....సడన్ గా తను ఎక్స్పెక్ట్ చెయ్యని ఆమె వెచ్చని స్పర్శ కి విక్కి మనసులో ఏదో అలజడి......వురుముల ఇన్ టెంసిటి ఎక్కువయ్యె కొద్ది రియా తనని మరింత గట్టిగా హత్తుకుంటుంది.........ఒక రకంగా ఊపిరి ఆడనివ్వట్లేదు.......అలా తన స్పర్శ ని తట్టుకోలేని విక్కి రియా ముఖాన్ని తన కుడి చేత్తో పట్టుకోని.......తన ముఖాన్ని ఆమె ముఖానికి దగ్గర చేస్తూ వున్నాడు.....అర సెంటి మీటర్ దూరం లో వాళ్ల పెదవులుండగా........ఇంకో చేతులో వున్న సెల్ ఫోన్ జారవిడిచాడు...అది నేలని తాకుతూ పెద్ద శబ్దం చేసి.....విక్కి ని తిరిగి ప్రస్తుతం లోకి తీసుకొచ్చింది...........!!!!

అంతే తన ముఖాన్ని విడిచి తనకి దూరం జరిగాడు విక్కి....వెనువెంటనే....అక్కడ వుండలేక కిందకి పరిగెత్తాడు.....కన్నీళ్ళలో మిగిలిపోయింది రియా

***

"ఈ మెడిసెంస్ ఎవరికి....?"ప్రిస్కిప్షన్ చూసి అనుమానంగా అడిగాడు మందుల షాపతను

"నాకే ..."జవాబిచ్చారు ఎదురుగా వున్న వ్యక్తి

"మిమ్మల్ని చూస్తే మీకొసం కాదేమో అనిపిస్తుంది...ఒకసారి మళ్ళీ చెక్ చేయించుకోండి....."అని అతను చెప్పడంతో...ఆలోచన లో పడ్డారు ఆ వ్యక్తి..........

సరే అని హాస్పిటల్ కి వెళ్ళి చెక్ చేయించుకుని రిసల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి ఎదురు చూపులకి ముగింపు పలుకుతూ నర్స్ "రియా...."అని పిలవడం తో లేచి డాక్టర్ క్యూబికల్ లోకి అడుగుపెట్టింది రియా

"మీరు అసలు ఈ టెస్ట్ ఎందుకు చేయించుకున్నారు...?యూ ఆ ఫర్ ఫెక్ట్లీ ఆల్రైట్....నో నీడ్ టూ వర్రి...."అంది డాక్టర్ ఎస్యూరెంస్ ఇస్తూ

"వాట్...."షాక్ అయ్యి అడిగింది రియా

"హా అవును..."అంది డాక్టర్

"కానీ నాకు ఈ జబ్బు వుందని మా ఊర్లో డాక్టర్ టెస్ట్ చేసి చెప్పారు...ఒక్కసారి చూసి చెప్పండి ప్లీస్...."అంది రియా ఆమె చేతులు పట్టుకుని

"అదేంటండి....జబ్బు లేదంటే...ఆనంద పడాలి కానీ ఆవేశ పడతారేంటి....మీకు ఈ టెస్ట్ మీద నమ్మకం లేపోతే....వేరే దగ్గర టెస్ట్ చేయించుకోండి...."అని చెప్పింది డాక్టర్

షాక్ లో నడుస్తూ బయటకి వచ్చిన రియా అక్కడున్న కుర్చి లో కూలబడిపోయింది....తనకి ఇంతకు ముందు జరిగిన దంతా కలలా తోచింది.....ఎంత సేపని అలా కూర్చుంటుంది...?ఏదోటి తేల్చుకుందామని వేరే హాస్పిటల్ కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంది...అక్కడా అదే రిసల్ట్ వచ్చింది...........అది చూసిన రియా కి ఒక్కసారిగా తను ఈ నెల లో చేసిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి........ఒక్కసారి గా తల పట్టుకుని పెద్దగా అరిచింది రియా.........."అసలు ఏం చేశాను నేను..................!"అని భారంగా నిటూర్పు విడిచింది......
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#40
నైస్ అప్డేట్ రైటర్  గారు..!!!

నేను ఊహించిందే జరిగింది అని అనిపిస్తున్నది. రియా చనిపోతుంది అని అభి కి దూరంగా ఉండటానికి ఇలా ప్రవర్తిస్తుంది అని. కానీ తాను చనిపోదు అని తెలిసి ఎలా రియాక్ట్ అవ్వాలో డైలమాలో వుంది.
ఇప్పుడు తనని విజయ్ & విక్కీ లు ఇద్దరు ఇష్టపడుతున్నారు మరి రియా నిజంగా ఎవరిని ఇష్టపడుతుందో తరువాత అప్డేట్ లలో ఆయన చెప్పండి.

విజయ్ ని ప్రేమిస్తుందా లేదా నటిస్తుందా? నటిస్తే మాత్రం త్వరగా దానికి ఫుల్స్టాప్ పడితే మంచిది అని నా అభిప్రాయం. విచిత్రంగా ఇప్పుడు విక్కీ రివర్స్ అయితే పరిస్థితి ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్న.
 
మీ నెక్స్ట్  అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply




Users browsing this thread: 4 Guest(s)