Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము
#41
[Image: IMG_3335.JPG]
 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
ఈనాటి తెలుగు వచనం

క్రమక్రమంగా ఈ ఉద్యోగాల్లో తెలుగు మీద ఏ విధమైన పట్టు లేనివాళ్లు, అంతో ఇంతో ఇంగ్లీషు మాత్రమే చదువుకున్నవాళ్లు చేరారు. దీని ఫలితంగా తెలుగు పత్రికల్లో భాష ఇటు తెలుగూ కాని, అటు ఇంగ్లీషూ కాని ఒక విలక్షణమైన స్థితికి చేరుకుంది. ఇంగ్లీషుకి సమానమైన ఏ తెలుగు మాటా వెంటనే తోచకపోతే, ఆ ఇంగ్లీషు మాటనే వాడెయ్యడం ఈ కొత్త ఉపసంపాదకులు అలవాటుచేసుకున్న పద్ధతి.

ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో మాకు కనిపించిన, తెలుగు అక్షరాలలో రాసిన, కొన్ని ఇంగ్లీషు మాటల జాబితా ఇది: రూమరేనట, బిగ్ బ్రేకింగ్ న్యూస్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం, బ్యాంకింగేతర లావాదేవీలు, ఫిస్కల్ రోడ్‌మ్యాప్, టెంపర్ టాంట్రం, ట్రెండింగ్ ఫోనులు, ఫ్యాబ్రిక్‌తో ఫోన్ వ్యాలెట్, విమానాలు ల్యాండు చేసి, కన్‌ఫం చేశారు, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, పాక్ ఆర్మీ, రైల్వే జోన్ పరిథిలో సింథటిక్ వినియోగానికి చెక్ చెబుతున్నారు… (ఇది కేవలం ఈ దినపత్రికకే ప్రత్యేకమయిన జాడ్యం కాదు.)

ఇక పోతే కర్త కర్మలను పట్టించుకోకుండా ఏ అన్వయమూ లేకుండా రాసిన వాక్యాలు అన్ని తెలుగు పత్రికల్లో కొల్లలుగా కనిపిస్తాయి. అవి చదివి వార్తలు ఇలాగే వుంటాయి అని సహించి వూరుకుంటున్న తెలుగు పాఠకుల ఔదార్యాన్ని మన్నించాలి.

కవిత్వం, కథలు కాకుండా ఆలోచనాపరమైన విమర్శలతో, వ్యాసాలతో గట్టిగా చదువుకున్నవాళ్లు ప్రాచీన, మధ్యకాలపు, ఆధునిక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆలోచనల్ని పురస్కరించుకుని వ్యాసాలు రాసే మేధావులు కానీ, అవి ప్రచురించే పత్రికలు కానీ మనకి లేవు. తెలుగులో మేధావులకు కావలసిన ప్రోత్సాహం లేదు. అంచేత మేధావి అని చెప్పడానికి అనువైన ప్రమాణాలు లేవు. వాళ్లని గుర్తించే సమాజమూ లేదు.

తెలుగులో పద్యాలు రాసేవాళ్ళకి చాలా నిక్కచ్చి అయిన శిక్షణ వుండాలనే నియమం వుంది. కథలు రాసేవాళ్ళకి కూడా, మంచి కథలు అని గుర్తింపు పొందిన కథలు అనేకం చదవడం మూలంగా వొచ్చిన అనుభవం వుంది. కాని, వచనమంటే నోటికి ఏది వస్తే అదే రాసే వాక్యాలు అనే అభిప్రాయమే మన మనసుల్లో వుంది. వచన రచనకి ప్రత్యేకమైన శిక్షణ కావాలని, వ్యాసనిర్మాణానికి నియమాలు, పద్ధతులు ఉన్నాయని, ఆలోచనలు చెప్పడానికి, అవి స్పష్టమైన భాషలో రాయడానికి ప్రత్యేకమైన తర్ఫీదు అవసరమని, ప్రతి ఆలోచనారంగానికీ అనువైన ఒక తార్కిక విధానం వుందని, ఆలోచనల్లో క్లిష్టత, వాక్యనిర్మాణంలో సరళత, రెండూ కలుపుకున్నదే మంచి వచనమని మనకి చెప్పేవాళ్లు ఎవరూ లేరు. బళ్ళు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల్ని సమాచారం కంఠతా పట్టి అప్పచెప్పేవాళ్ళుగానే తయారుచేస్తున్నాయి కాని విమర్శతో కూడిన ఆలోచన చేయగలవాళ్ళుగా తయారుచేయడం లేదని మనం ఇప్పటికీ గుర్తించడంలేదు. విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలు మరో విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాయి. తెలుగులో పిహెచ్.డి.లు తయారవడం మొదలుపెట్టి దాదాపు 90 ఏళ్లు కావస్తున్నా డజన్ల కొద్దీ పిహెచ్.డి.లు తయారవుతున్నా, ఇంతవరకూ సిద్ధాంత నిరూపణ కోసం ఎలా పరిశోధన చేయాలి, ఏమి చదవాలి, తన పరిశ్రమ చేస్తున్న రంగంలో ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి? అనే విషయంలో ఏ రకమైన ప్రావీణ్యం లేకుండా నానాటికీ చవకబారు పిహెచ్.డి.లు వస్తున్నాయి. పిహెచ్.డి. కోసం రాసిన థీసిస్‌ ఎంత చవకబారుగా వున్నా, డాక్టర్ అనే బిరుదుకి మాత్రం గౌరవం పెరిగిపోయింది. కవిత్వం రాసేవాళ్లు కూడా పేరు ముందు డా. అని పెట్టుకుంటున్నారు.

తెలుగు భాషలో వాక్యనిర్మాణక్రమం కానీ, వాక్యాన్ని వాక్యాన్ని కలిపి ఒక ఊహని సహేతుకంగా ఒక పద్ధతిలో రాయడం కానీ ఎలాగో మనం ఎప్పుడూ నేర్పలేదు. పిల్లలకి తెలుగు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పదస్వరూపంలో తప్పుందా, అరసున్నాలు, బండి-రలు సరిగా ఉన్నాయా లేదా, సంధులు సరిగా చేశారా లేదా, ఇవే పట్టించుకున్నారే కానీ వాక్య నిర్మాణ క్రమాన్ని, ప్రసంగ పాఠపు పొందికని ఎప్పుడూ గమనించలేదు. ఈ రోజుక్కూడా తెలుగు వచనంలో ఆ లక్షణాలు సరిగ్గా లేవు. మంచి వచనం అంటే ఏమిటి అన్నదాని గురించి ఆలోచన లేదు, శిక్షణా లేదు. ఈ సంగతి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం రాస్తున్న తెలుగు వచనాన్ని పరిశీలిస్తే ఎంత మంది పెద్ద పేరున్న తెలుగువాళ్లు అవలీలగా గజిబిజి వాక్యాలు రాస్తారో, గందరగోళంగా ఊహలు చెప్తారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంగ్లీషు నుంచి మనం కామాలు, ఫుల్‌స్టాపులు, ఆశ్చర్యార్థక గుర్తులు, ప్రశ్నార్థకాలు తెచ్చుకున్నాం సరే. ఇవి వచ్చిన తరవాత కూడా పేరాగ్రాఫులు ఎలా కూర్చాలి, పేరాగ్రాఫు ఎక్కడ అయిపోతుంది, మొదటి పేరాగ్రాఫుకి రెండవ పేరాగ్రాఫుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఈ వ్యాసంలో చెప్పిన ఊహ మళ్లామళ్లా చెప్పామా, ఆ చెప్పిన ఊహ స్పష్టంగా చెప్పామా, ఇందులో అక్కర్లేని వాక్యాలు ఎన్ని ఉన్నాయి, నిరాధారమైన విషయాలు అస్పష్టంగా చెప్పినవి, బాధ్యత లేకుండా రాసిన వాక్యాలు ఈ వ్యాసంలో ఉన్నాయా? వంటి ప్రశ్నలు వేసుకుని చూస్తే ఇవాళ అచ్చయిన పుస్తకాలలో వున్న వచనంలో ఎన్ని లోపాలున్నాయో మనకు తెలుస్తుంది.

ఈ లోపాలని ఎలా సవరించుకోవాలి అన్న ప్రశ్న మనకు పుట్టనే పుట్టదు. రాసింది రాసినట్లే అచ్చు కావటం, ఇంతే మనకు కావలిసింది. ఈ రకమైన విశృంఖలమైన స్వేచ్చకి వ్యావహారిక భాషా వాదం బోలెడు సాయం చేసింది. ఒక మాట వ్యాకరణం ప్రకారం సాధువా కాదా అని ఆలోచించవలసిన రోజుల్లో అందమైన వాక్యానికి, నిర్దుష్టమైన వాక్యానికి తేడా చూసుకోవలసిన అవసరం మాత్రమే ఉండేది. వ్యావహారిక భాషా వాదం వచ్చి మనకు నేర్పినది ఏమిటి అంటే, మనకు నోటికి వచ్చిన వాక్యం ఎలాంటి శిక్షణా లేకుండా హాయిగా రాసేయవచ్చు అని.

ఈ రకమైన విశృంఖలమైన స్వేచ్ఛ వల్ల ఇప్పుడు తెలుగు భాషలో రచన ఏ స్థితిలో వుంది? ముందు రచనలని రెండు భాగాలు చేద్దాం. ఒకటి సాహిత్య రచనలు: పద్యాలు, వచన పద్యాలు, పాటలు, కథలు, నవలలు, ఇలాంటివి. వీటిని ఎవరూ ఏ రకంగానూ శాసించకూడదు. కవి, రచయిత, ఆడ, మగ, ఎక్కువ కులాలవారు, తక్కువ కులాలవారు, హిందువులు, ముస్లిములు, ఇంకా అనేక సమూహాలవాళ్లు తమ సృజనాశక్తిని, ఆలోచనని, ఉద్యమాలని, ఊహల్ని, రకరకాల భాషల్లో వాళ్లకి ఇష్టమొచ్చిన పద్ధతిలో రాయనివ్వండి. ఆ రకమైన రచనలకి భాష పరంగా ఏ రకమైనటువంటి నియమాలు అక్కరలేదు.

రెండవది, ఇక మిగిలినది, వచనం. కేవలం ఆలోచనలు స్పష్టంగా చెప్పడానికి మాత్రమే వచనం ఉపయోగపడాలి. ఇది రాసే భాష వ్యావహారిక భాష అనే పేరు పెట్టుకుంటే తప్పులేదు కానీ ఇది ఆధునిక రచనాభాష అని గుర్తించాలి. ఈ భాషకి ఏకత్వం, ప్రామాణికత ఉండి తీరాలి. ఇప్పటికీ దీనికి మంచి పేరు ఏర్పడలేదు. ఏమయినా ఇది కథలు, కావ్యాలు రాసే భాష కాదని, ఆలోచనలు రాసే భాష మాత్రమే అని, ఇది రచనా భాష అని, అక్షరాలా మాట్లాడే భాష కాదని–గుర్తించాలి. భాషా చర్చల్లో పాల్గొన్న కొన్ని వందల మంది–గిడుగు రామమూర్తిగారి దగ్గరినుంచి వీధిని పోయే దానయ్య వరకు–ఎవరూ స్పష్టంగా చెప్పలేదు, ప్రపంచంలో ఏ భాష కూడా అక్షరాలా మాట్లాడినట్టు రాయబడదని, రాసినట్టు మాట్లాడబడదని. అంచేత రాసే భాషకి ఒక రకమైన ప్రామాణికత, కొన్ని నియమాలు ఉండక తప్పదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు, ఎవరు పలికినట్లు వాళ్లు రాయొచ్చు, అదే వ్యావహారిక భాష అనే అభిప్రాయం తెలుగు వచనాన్ని ఏ స్థితికి తీసుకొచ్చిందో ఏ ఒక రోజు పత్రికల్ని చూసినా తెలుస్తుంది.
 horseride  Cheeta    
Like Reply
#43
తెలుగు వచన రచనకి కావలసిన శిక్షణ

వ్యావహారిక భాష అనే పేరుతో చెప్పుకోదగ్గ కట్టుబాట్లు లేని ఒక ఆధునిక రచనాభాష 1940ల నాటికి తయారయింది. ఆ భాషలో చెప్పుకోదగ్గ మంచి వచన రచనలు చేసినవాళ్లు చాలామంది వున్నారు. వీళ్లలో చాలామంది కథలు, నవలలు రాసినవాళ్లయితే కొద్దిమంది మాత్రం వైజ్ఞానిక విషయాల మీద పుస్తకాలు రాసినవాళ్లు. ఇలాంటి వచనం రాసినవాళ్లందరూ ఇంగ్లీషు బాగా వచ్చినవాళ్లే. ఇంగ్లీషులో వచ్చిన వచనాన్ని అనుసరించి దాదాపు అదే తర్కంతో అదే ఆలోచనా విధానంతో తెలుగు వచనాన్ని సమర్థంగా రూపొందించినవాళ్లలో కొడవటిగంటి కుటుంబరావు పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొ.కు. వ్యాసాలుగా వి.ర.సం. ప్రచురించిన సంపుటాలు చూస్తే వ్యాస నిర్మాణంలో కుటుంబరావు ఎంత శ్రద్ధ తీసుకున్నారో తెలుస్తుంది. దానితో పాటు వాక్యనిర్మాణంలో, ఆలోచనా తర్కంలో పైకి ఆడంబరంగా చెప్పకపోయినా, విమర్శకులు ప్రత్యేకంగా గుర్తించకపోయినా ఆయన తెలుగు వచనానికి, తెలుగు వ్యాసానికి యెంత గొప్ప నిర్మాణాన్ని ఇచ్చారో బోధపడుతుంది. కాకపోతే వచనాన్ని గురించిన చర్చలు మనకు లేవు కాబట్టి, మనకు ఎవరు ఏది రాసినా వచనమే ఎలా రాసినా వచనమే అనే అభిప్రాయం యేర్పడబట్టి తెలుగు రచనలో పొల్లు, నెల్లు కలిసిపోయి వుంటాయి. వీటిని విచక్షించి చూపించేవాళ్లు లేకపోవడంతో మనకు తెలుగు వచనం మీద ఆలోచన వృద్ధి పొందలేదు. ఒక పక్క తెలుగు పత్రికలు ఇంగ్లీషు మాటలు విచ్చలవిడిగా వాడేస్తూ, తెలుగులో వందల కొద్ది పుస్తకాలు దారీ తెన్నూ లేకుండా అచ్చు అవుతూ వున్నా కూడా, తెలుగు పుస్తకాల గతి ఏమిటి అని ఆలోచించేవాళ్లు ఇప్పటికీ కనిపించరు.

మల్లాది వెంకటరత్నం రాసిన పూర్తి తెలుగు పుస్తకం ఒకటి పై అట్ట మీద, Development of Telugu Prose – How to write Telugu అనే ఇంగ్లీషు పేరుతోనూ, లోపల తెలుగు వచన కావ్య వృద్ధి – తెలుగు వ్రాయుట ఎట్లు? (మద్రాసు, 1918) అన్న పేరుతోనూ ఉంది. ఈ పుస్తకం ఆ కాలంలో పెద్దగా చర్చించబడినట్టు లేదు. అందుచేత, దీనిలో వున్న ముఖ్య సూచనలని మాత్రం ఈ కింద ఇస్తున్నాం. అవి ఇవి:

1. సులభమయిన మాటలను వాడుట
2. పెద్ద సమాసములను వాడకుండుట
3. కొత్త మాటలను భాషలోనికి రానిచ్చుట
4. సంధులను విడగొట్టి వ్రాయుట
5. ‘య’డాగమమును విసర్జించుట
6. విభక్తుల చివరను ‘ను’గాగమమ్మును వదలివేయుట
7. అరసున్నలను విడిచివేయుట
8. బండి ‘ర’ను మానివేయుట

ఈ విషయాలని ఇంకా వివరంగా చెప్పటం కోసం పుస్తకంలో మిగతా పేజీలన్నీ గ్రంథకర్త ఉపయోగించారు. ముఖ్యభాగాన్ని నాలుగు పేజీల్లో చెప్పి ఉంటే ఈ పుస్తకానికి ఎక్కువ ప్రచారం వచ్చి ఉండేదేమో. దీర్ఘమైన చర్చల్లో పేజీలన్నీ నింపడం చేత కాబోలు ఈ పుస్తకానికి అంత ప్రచారం రాలేదు. ఆ మాటకొస్తే ఈ పుస్తకాన్ని గురించి ఎవరూ చెప్పలేదు, గిడుగు రామమూర్తిగారు ఈ పుస్తకాన్ని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ తరవాత వచ్చిన అనేకమంది వ్యావహరికవాదులు కూడా ఈ పుస్తకాన్ని గుర్తించలేదు.

‘తెలుగు యెప్పుడుగాని ఉత్తమ విద్యాద్వారంగా వుండలేదు’ అని అక్కిరాజు ఉమాకాంతంగారు అన్నారని ఈ వ్యాసం రెండవ భాగంలో చెప్పాం (చూ. ఫుట్‌నోట్ 14). ఒకప్పుడు, అంటే ఇంగ్లీషు మనదేశంలో రాజ్యం యేలక ముందు, మనం శాస్త్ర గ్రంథాలన్నీ సంస్కృతంలోనే రాశాం. ఒక్క దక్షిణాంధ్ర యుగంలో మాత్రం తెలుగు శాస్త్రభాష అయ్యింది అని నిడదవోలు వెంకటరావు అన్నారు అని ఈ వ్యాసం రెండవ భాగంలో చెప్పాం. అయినా మొత్తం మీద సంస్కృతానిదే శాస్త్రాధికారం. జగన్నాథ పండితరాయలు తెలుగువాడు అని మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా ఆయన రసగంగాధరం సంస్కృతంలోనే రాశాడు. ఇవాళ ఆలోచనాశక్తిని పెంపొందించే పుస్తకాలు తెలుగు వాళ్లయినా ఇంగ్లీషులోనే రాయాలి. అంటే పూర్వపు సంస్కృతం స్థానాన్ని ఇంగ్లీషు ఆక్రమించింది. ఇప్పుడు ప్రస్తుత సమస్య తెలుగు వచనానికి శాస్త్రస్థాయి కల్పించగలమా అనేది. అలా కల్పించగలగాలి అంటే తెలుగు రాసే పద్ధతిలో రెండు మార్పులు రావాలి.

1. వాక్యనిర్మాణక్రమం: అచ్చులో వున్న ఆధునిక తెలుగు వచనం పరిష్కృత రూపంలో ఏర్పడడానికి పత్రికలు, ప్రచురణ సంస్థలు ఉమ్మడిగా పూనుకోవాలి. ప్రచురణ సంస్థలకి ప్రత్యేకమైన భాషా పరిష్కర్తలు వుండాలి. వాళ్లు ఆ ప్రచురణ సంస్థ వాడే భాషకి నియమాలు యేర్పరిచి ఆ నియమాలకి లోబడి రాసిన వచనాన్నే తాము ప్రచురిస్తామని నిక్కచ్చిగా చెప్పాలి. ఈ భాషా పరిష్కర్తల్నే ఇంగ్లీషు ప్రచురణ సంస్థలవారు కాపీ ఎడిటర్లు అంటారు. తెలుగులో ఏ ప్రచురణ సంస్థకీ పాఠపరిష్కర్తలు, కాపీ ఎడిటర్లు లేరు. ఈ విషయం మేము గతంలో తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు అన్న వ్యాసంలో చర్చించాం.

2. వచనం: ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే పూర్వం మనకి శాస్త్రగ్రంథాలు రాసేటప్పుడు అనుబంధ చతుష్టయం పాటించాలి అని ఒక నియమం ఉండేది. అనుబంధ చతుష్టయం అంటే ఈ నాలుగు; 1. విషయము, 2. ప్రయోజనము, 3. సంబంధము, 4. అధికారి. ఏ పుస్తకంగానీ రాసేవాళ్ళు ఈ నాలుగు ముందుగా చెప్పాలి. అంటే: 1. ఈ పుస్తకంలో విషయమేమిటి? 2. దీనివల్ల ప్రయోజనమేమిటి? 3. ఈ పుస్తకంలో విషయానికి చుట్టూ వున్న ఇతర విషయాలకి సంబంధం ఏమిటి? అంటే ఈ పుస్తకంలో చెప్పిన విషయం ఏ విధంగా ఈ శాస్త్రానికి సంబంధించిన ఇతర విషయాలతో సంబంధిస్తుంది? ఇందులో ఏది చెప్పబడుతుంది? ఏది చెప్పబడదు? 4. ఈ పుస్తకాన్ని చదవడానికి పాఠకులకి ఎటువంటి అర్హతలు కావాలి? ఈ నాలుగు విషయాల్ని ముందే చెప్పేస్తే చదివేవాళ్ళు ఆ పుస్తకం సరిగ్గా చదవగలుగుతారు. లేదా అందులో వున్న విషయంపై అధికారం లేకపోతే చదవడం మానేస్తారు. అంతేగానీ ఆ పుస్తకం తీసి తమకు తోచిన మాటలు చెప్పరు. తెలుగులో మనం రాసే పుస్తకాల్లో ఈ అనుబంధ చతుష్టయాన్ని పాటించాలని అనుకుంటే తెలుగు వచన సంప్రదాయం పటిష్టంగా, తార్కికంగా వుంటుంది.

ఆంగ్ల నిఘంటువుల సంప్రదాయం తెలుగులో కూడా వుంటే అందులోని పదాలకి వాటి వాడుక గురించిన గుర్తింపులు ఉండేవి: ఉదా. 1. కవిత్వోపయోగి, 2. పాండిత్య ప్రకర్షకం, 3. ప్రాచీనం, 4. కృతకం. తెలుగులో ఇప్పటికీ నిఘంటువులలో ఈ రకమైన గుర్తింపులు మనకు కనపడవు. ఈ గుర్తింపులు లేకపోవడం చేత తెలుగులో ఉత్తరం ముగించేటప్పుడు భవదీయుడు, విధేయుడు, అనే మాటలు గౌరవార్థంలోను, ప్రేమగా, ఆప్యాయంగా అనే మాటలు వ్యక్తిగతమైన ఉత్తరాలలోను ఉండటమే కాకుండా ఉద్యోగసంబంధమైన ఉత్తరాలలో ‘నమస్సుమనుస్సులతో’ లాంటి మాటలు రాస్తే ఎవరూ కాదనడానికి వీల్లేదు. ఏది ఆధునిక తెలుగు భాష, ఏది కాదు అనే విషయంలో మనకు ఒక నిశ్చితమైన అభిప్రాయం రావడానికి మనకు నిఘంటువులు, ప్రచురణకర్తలు తోడ్పడాలి. పైన చెప్పినట్లు పద్యాలు రాయడానికి కవిత్వాలు చెప్పడానికి పాటలు పాడడానికి ఎవరి తోడ్పాటు, పోషణ అక్కర్లేదు. అందులో యే భాష వాడినా దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. అది కవిస్వేచ్ఛ. కాని, వచనం కొన్ని నియమాలకి లోబడి ఉండాలి, ఆ నియమాలు అందరూ అనుసరించాలి. వచనం రాయడం ఎలాగో, వ్యాసం రాయడం ఎలాగో చిన్నప్పటినుంచి తరగతి గదుల్లో నేర్పించాలి. ఈ రకంగా నేర్పకుండానే వచనం రాయడం వచ్చేస్తుందనే భ్రమ మనందరిలో ఇప్పటికీ వుంది. మంచి వచనం లేని జాతికి మంచి ఆలోచన కూడా వుండదు. అందుచేత మనం ఆలోచించవలసింది సాహిత్యాన్ని గురించి కాదు వచనాన్ని గురించి.
 horseride  Cheeta    
Like Reply
#44
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి

https://eemaata.com/em/issues/201609/929...nonepage=1

చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2

https://eemaata.com/em/issues/201901/18526.html

చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3

https://eemaata.com/em/issues/201910/20811.html
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#45
Super information sir
Like Reply
#46
[Image: download-20200829-144814.jpg]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#47
 అరసున్న [ఁ], 

 బండి 'ఱ' లు ఎందుకు? 

 అరసున్న, బండి ‘ఱ‘ లు 
 నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. 
 ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. 
 ద్రావిడ భాషా లక్షణాన్ని నిరూపించేవి. 

 అంతేకాదు కావ్యభాషలోను, లక్షణశాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. వాడకపోతే పరవాలేదు కానీ, వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా! 

 మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! 
 
అరసున్న, ఱ ల వల్ల అర్థభేదం ఏర్పడుతోంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. 

 ఎలాగో చూడండి: 

 ఉదా :-
 అరుఁగు  = వీధి అరుగు 
 అరుగు = వెళ్ళు, పోవు 
అఱుగు  = జీర్ణించు 

 ఏఁడు   = సంవత్సరం 
 ఏడు  = బాధ~7 సంఖ్య 

 కరి  = ఏనుగు 
 కఱి  = నల్లని 

 కాఁపు  = కులము 
కాపు  = కావలి 

 కాఁచు   = వెచ్చచేయు 

 కాచు   = రక్షించు 

 కారు   = ఋతువుకాలము 
 కాఱు  = కారుట (స్రవించు) 
(కారు=వాహనం ఆంగ్ల పదము)

 చీఁకు  = చప్పరించు 
 చీకు  = నిస్సారము, గ్రుడ్డి 

 తఱుఁగు  = తగ్గుట 
తఱుగు  = తరగటం(ఖండించటం) 

 తీరు  = పద్ధతి 
 తీఱు  = నశించు  

 దాఁక  = వరకు 

 దాక  = కుండ, పాత్ర 

 నాఁడు  = కాలము 
 నాడు  = దేశము, ప్రాంతము 

 నెరి  = వక్రత 
 నెఱి  = అందమైన 

 నీరు  = పానీయం 
 నీఱు  = బూడిద 

 పేఁట  = నగరములో భాగము 
 పేట  = హారంలో వరుస 

 పోఁగు  = దారము పోఁగు 
 పోగు  = కుప్ప 

 బోటి  = స్త్రీ 
 బోఁటి  = వంటి [నీబోఁటి] 

 వాఁడి  = వాఁడిగాగల 
వాడి = ఉపయోగించి 
 
వేరు = చెట్టు వేరు 
 వేఱు  = మరొకవిధము 

 మన తల్లిదండ్రులు 
 మన మాతృభాష 
 ఎంతో విలువైనవి 
 గుర్తుంచుకుందాం 
 గౌరవించుకుందాం 

 ఇవి మన సంపద 
 తెలుసుకుని సంతోషపడదాం
 
Namaskar తెలుగువారందరికీ

తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు Namaskar

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#48
వికటకవి గారు అరసున్న , బండి ర ...వలన ఏర్పడే అర్ధభేదం గురించి తెలియజేసారు ..

అలా రాయడం వలన అర్ధభేదం ఏర్పడుతుందా లేక వాటికి స్వర ఉచ్ఛారణవేరేగా ఉండేదా...

తెలుగు గురించి ఈ దారం లో సరిత్ గారు , మీరు బాగా తెలియజేసారు ...సంతోషం
Like Reply
#49
మిత్రమా శృంగార...

అరసున్న సదరు అక్షరాలను ముక్కు సహాయంతో పలకాలని సూచిస్తుంది. ఉదాహరణకు మావఁయ్య అనే పదంలో, వకారం తరువాత పలికే అకారాన్ని ముక్కు సహాయంతో పలుకుతారు. ముక్కు సహాయంతో పలికే అకారాన్ని, ముక్కు సహాయం లేకుండా పలికే అకారాన్ని (ఉదాహరణకు సహాయం పదంలో సకారం తరువాత ఉన్న అకారం) వేరుగా సూచించేందుకు అరసున్నాను వాడుతారు. మిగితా అచ్చుల తరువాత ఉన్న అరసున్నాను కూడా ఇదే తరహాలో ఉచ్చారిస్తారు.


కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
తాలవ్యములు : దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
మూర్థన్యములు : అంగిలి, లోకుత్తుక  (The palate of the mouth) పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.
ఓష్ఠ్యములు : పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.
కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

(వికిపీడియా నించి సేకరించినదీ సమాచారం)

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#50
(29-08-2020, 02:49 PM)sarit11 Wrote: చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి

https://eemaata.com/em/issues/201609/929...nonepage=1

చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2

https://eemaata.com/em/issues/201901/18526.html

చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3

https://eemaata.com/em/issues/201910/20811.html

సరిత్ మహాశయా,

చక్కని భాషా రసమయ గుళికలు అందించినందులకు మిక్కిలి ధన్యవాదములు...  yr): సంభ్రమాన్ని కలిగిస్తున్నారు
(తెలుగులో చిహ్న సంకేతాలు...లేవు కదండీ... అదేనండీ...మనం ఈమోజీలు...అంటామే...అవి...)

పైగా...ఇంకా...చదవాలనుకునే వారికి...తేనెలూరు తెనుగంటే, తనివి తీరనివారికి...అంతర్జాల వలయములు (వెబ్లింక్స్) కూడా, ఇచ్చినందులకు...మరొక్కమారు ధన్యవాదములండీ...

ఇక్కడి మితృలు కొందరు, వ్యక్తీకరించినట్లుగా, ఈ శృంగార చర్చాస్థలం లో (ఫోరం) తెనుగు మాధుర్యాన్ని చొప్పించడం చాలా ముద్దనిపించింది (ఆంగ్లం లో...క్యూట్...అంటాము కదా...అది... :hapy: )

మీకు, ఈ చర్చాస్థలం యొక్క నిర్వాహకులందరికీ...కృతఙ్ఞతలు... Nam:); Nam:); Nam:);
Like Reply
#51
(29-08-2020, 09:37 PM)Vikatakavi02 Wrote: మిత్రమా శృంగార...

అరసున్న సదరు అక్షరాలను ముక్కు సహాయంతో పలకాలని సూచిస్తుంది. ఉదాహరణకు మావఁయ్య అనే పదంలో, వకారం తరువాత పలికే అకారాన్ని ముక్కు సహాయంతో పలుకుతారు. ముక్కు సహాయంతో పలికే అకారాన్ని, ముక్కు సహాయం లేకుండా పలికే అకారాన్ని (ఉదాహరణకు సహాయం పదంలో సకారం తరువాత ఉన్న అకారం) వేరుగా సూచించేందుకు అరసున్నాను వాడుతారు. మిగితా అచ్చుల తరువాత ఉన్న అరసున్నాను కూడా ఇదే తరహాలో ఉచ్చారిస్తారు.


కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.
తాలవ్యములు : దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.
మూర్థన్యములు : అంగిలి, లోకుత్తుక  (The palate of the mouth) పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.
దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, చ, జ, ర, ల, స.
ఓష్ఠ్యములు : పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.
నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.
కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.
కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.
దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

(వికిపీడియా నించి సేకరించినదీ సమాచారం)

తెనుగు పై చర్చలో పాల్గొన్న మితృలందరికీ...మిక్కిలి ధన్యవాదములు... Namaskar

ఆ మాధుర్యమే...వేరప్పా... Tongue
Like Reply
#52
(01-07-2020, 06:57 PM)sarit11 Wrote:
మన తెలుగు గురించి కొంత తెలుసుకుందాము

వేరొక site లో చదివిన ఈ ఆర్టికల్ నాకు చాలా నచ్చింది. అది మీతో పంచుకోవాలని ఇక్కడ పెడుతున్నాను.


చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి


చిన్నయ సూరి, గిడుగు రామమూర్తి ఈ రెండు పేర్లూ ఆధునిక కాలంలో తెలుగు భాష చరిత్రలో చాలా పెద్ద పేర్లు. వీళ్లిద్దరి రచనలూ ఏ సందర్భంలో ప్రచారం లోకి వచ్చాయో పరిశీలించడం, వాటివల్ల ఆధునిక వచన రచనకి లాభం కలిగిందా, నష్టం కలిగిందా? అన్న విషయం చర్చించడం, ఈ వ్యాసంలో ఉద్దేశించిన పని. సూరిగారి అభిప్రాయాలు, రామమూర్తి పంతులుగారి అభిప్రాయాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి.

ఈ వైరుధ్యం ఆధునిక కాలంలో గ్రాంథిక, వ్యావహారిక భాషా వైరుధ్యంగా వ్యక్తమయింది. చిన్నయ సూరిగారు గ్రాంథిక భాషావాదిగా, రామమూర్తిగారు వ్యావహారిక భాషావాదిగా మన మనస్సుల్లో స్థిరపడిపోయారు. ఈ మాటలు ఈ కాలంలో ప్రచారం లోకి వచ్చిన మాటలు. ఈ రెండు రకాల భాషలకీ వైరుధ్యం ఏర్పడిన రోజులలో అమలులో ఉన్న మాటలు ఒకసారి చూద్దాం. చిన్నయ సూరి ఉద్దేశంలో వ్యాకరణ యుక్తమైన భాష లాక్షణిక భాష (భాషకి లక్షణాన్ని చెప్పేది వ్యాకరణం కాబట్టి). లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్యము. గిడుగు రామమూర్తి పంతులుగారి దృష్టిలో ఈ లాక్షణిక భాష పాత పుస్తకాల్లోనే కనిపిస్తుంది. పుస్తకాలకే పరిమితమైన భాష కాబట్టి అది గ్రాంథిక భాష. ఆయన కోరుకున్న భాషకి ఆయన పెట్టిన పేరు వ్యావహారిక భాష.

20వ శతాబ్దిలో భాష విషయంలో తీవ్రమైన వాగ్యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ రెండు జంటల మాటలూ అమలులో వుండేవి.
లాక్షణికభాష X గ్రామ్య భాష

గ్రాంథిక భాష X వ్యావహారిక భాష


ఈ రెండు జంటల పేర్లలో రెండవ జంట పేర్లే ప్రచారంలోకి వచ్చి మొదటి జంట పేర్లు కనుమరుగయి పోయాయి. అంటే లాక్షణిక భాషావాదులు ఓడిపోయారని అర్థం.

ఈ కాలానికి పూర్వం తెలుగుకి వ్యాకరణాలు సంస్కృతంలో ఉండేవి. నన్నయ రాశాడని చెప్పబడుతున్న ఆంధ్రశబ్దచింతామణి (దీనికే నన్నయభట్టీయం అని పేరు), త్రిలింగశబ్దానుశాసనము, అహోబల పండితీయము, ఆంధ్రకౌముది, మొదలైనవి అన్నీ సంస్కృతంలో రాయబడ్డాయి.

తెలుగులో వచ్చిన ఒకే ఒక్క వ్యాకరణం కేతన ఆంధ్రభాషాభూషణం. దీనికి శాస్త్రగౌరవం కలగలేదు. 19వ శతాబ్దిలో కుంఫిణీ ప్రభుత్వం వాళ్ళు తమ ఉద్యోగస్తులకు తెలుగు నేర్పాలి అనుకున్నారు. కాబట్టి, ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు వచ్చాయి. ఉదాహరణకి, విలియం కేరీ (William Carey, 1814), కేంప్‌బెల్ (A.D. Campbell, 1816), విలియం బ్రౌన్ (William Brown, 1820), మారిస్ (J.C. Morris, 1823), సి.పి.బ్రౌన్ (C.P. Brown, 1840) రాసిన వ్యాకరణాలు. వీళ్ళల్లో బ్రౌన్ ముఖ్యమైనవాడు. అప్పటి కచేరీల్లోనూ, కోర్టుల్లోనూ, అర్జీల్లోనూ, ఇతర పరిపాలనా వ్యవహారాల్లోనూ వాడుకలో వున్న తెలుగు భాష బ్రౌన్ వ్యాకరణంలో కనిపిస్తుంది.
వేదం పట్టాభిరామరావు లాంటి తొలినాటి పండితులు తెలుగులో రాసిన తెలుగు వ్యాకరణాలలో ఆ రకమైన భాష కనిపించదు. బ్రౌన్ వ్యాకరణంలో వున్న భాషకి ఒక పేరు లేదు. నిజానికి పండితులు ఆ భాషే మాట్లాడేవారు. కాని, ఇంగ్లీషు ఉద్యోగస్తులు తెలుగు నేర్చుకోవాలని ఈ పండితుల దగ్గరకి వెళ్తే వాళ్లు ఈ తెల్లదొరలకి ఆంధ్రశబ్దచింతామణి చెప్పేవాళ్లు. నిత్య వ్యవహారంలో వున్న భాష పండితుల దృష్టిలో వ్యాకరణం వున్న భాష కాదు. అంటే వాళ్ల దృష్టిలో ఈ భాషకి వ్యాకరణం లేదు. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ పండితులకి తాము మాట్లాడే తెలుగు ఎలా నేర్చుకున్నారో తెలియదు. వాళ్లు నేర్చుకున్న భాషే వాళ్లు నేర్పగలరు. అంటే వ్యాకరణమే నేర్పగలరు. (ఇప్పటికీ తెలుగు పరిస్థితి ఇదే.)

పండితుల పాఠాలతో విసిగిపోయిన బ్రౌన్ లాంటి తెల్లవాళ్ళు తమ అనుభవం లోకి వచ్చిన తెలుగుకి కావలసిన వ్యాకరణాలు. నిఘంటువులు వాళ్లే రాసుకున్నారు. వ్యాకరణాలు, నిఘంటువులు తయారు చేసినందుకు కుంఫిణీ నుంచి వారికి చక్కటి పారితోషికం లభించేది కూడా. తెలుగు సొంతభాషగా మాట్లాడుతున్న తెలుగు వాళ్ళకి ఈ వ్యాకరణాలు అక్కరా లేదు, ఇంగ్లీషులో రాసిన అవి వీళ్ళకి అర్థమూ కాలేదు. ఈ పరిస్థితుల్లో మెకాలే’స్ మినిట్ (Macaulay’s minute) అని మనకందరికీ పరిచయమైన పత్రంలో ఉన్న కొత్త ఆలోచన ఇంగ్లీషు పాలకులకి నచ్చింది. మొత్తం పరిపాలన అంతా ఇంగ్లీషులోనే జరపాలని, తెలుగు వాళ్లకే ఇంగ్లీషు నేర్పి వాళ్ళని ఒక రకమైన ఇంగ్లీషు వాళ్లుగా తయారు చేయాలని ఈ కొత్త అభిప్రాయం సారాంశం. దీని ఫలితంగా ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకోవడం మానేశారు. దానితో పాటు ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు మరుగున పడిపోయాయి.
సార్,

మమ్మల్నందరినీ...
ఆనందులు...గా...
మార్చినందులకు...
మిక్కిలి ధన్యవాదములు... Namaskar
[+] 1 user Likes Roberto's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)