Posts: 2,283
Threads: 149
Likes Received: 7,553 in 1,510 posts
Likes Given: 4,357
Joined: Nov 2018
Reputation:
572
22-12-2018, 06:52 PM
(This post was last modified: 22-12-2018, 07:53 PM by k3vv3.)
మహాభారతం లో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగిన తిథులు :
యుధ్ధ సమయానికి ఎవరి వయసు ఎంత?
వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి అని ఎందుకు అంటారో తెలుస్తుంది.
మహాభారతం గురించి ఎంత చదివినా ఎంత విన్నా కొత్త గానే అద్భుతం గానే వుంటుంది. అందుకే ఈ మధ్య తెలుసుకున్న కొన్ని మహాభారత విశేషాలు మీ కోసం.
నిజామా ? అంటే నేను సేకరించిందే. అలాగే క్రి.పూ. క్రి.శ. అనిఉపయోగించాను కేవలం అర్ధం అవ్వాలని మాత్రమే. సులభం గా టైపు చేయడానికి సంవత్సరాలను సం గాను , నెలలను నె గాను , రోజులను రో గాను చేయడం జరిగింది.
తారీఖు లను రోజులు-నెలలు-సంవత్సరాలు గా dd-mm-yy గా భావించవలెను.
➡ కర్ణుని జననం : మాఘ శుద్ధ పాడ్యమి.
ఇతను ధర్మరాజు కంటే 16 సం పెద్దవాడు.
➡ యుధిష్టరుని జననం :
ప్రజోత్పత్తి నామ సంవత్సర జ్యేష్ఠ నక్షత్ర శుక్ల పంచమి మిట్టమధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం లో Sagittarius (ధనుర్రాశి) లో.
సుమారు క్రీ పూ 15-8-3229.
➡ భీముని జననం :
మఖ నక్షత్ర అంగీరస బహుళ నవమి .
ధర్మరాజు కన్నా 1సం 19రో చిన్నవాడు.
➡?? అర్జునుని జననం:
శ్రీముఖి నామ సం ఫాల్గుణ మాస ఉత్తరా నక్షత్ర శుక్ల పౌర్ణమి.
భీమునికన్నా 1సం 4నె 21రో చిన్నవాడు.
➡?⚔ నకుల & సహదేవుల జననం :
భవ నామ సం ఫాల్గుణ మాస అశ్విని నక్షత్ర పౌర్ణమి మిట్ట మధ్యాహ్నం.
అర్జునుని కన్నా 1సం 15రో చిన్నవాళ్ళు.
➡ శ్రీ కృష్ణ జననం :
శ్రీముఖ నామ సం రోహిణి నక్షత్ర బహుళ అష్టమి .
అర్ధరాత్రి అనంతరం tarus (వృషభ)లగ్నం.
➡ దుర్యోధనుడి జననం :
భీముని మరుసటి దినం.
హిడింబాసురుడు, బకాసురుడు,కీచకుడు వీరుకూడా ఇదే సమయాలో మఘ & స్వాతి నక్షత్రాల మధ్య జన్మిస్తారు.
అక్కడి నుండి రోజుకొకరు చొప్పున మిగిలిన 99 కౌరవులు వారి చెల్లి #దుశ్శల (సైంధవుని భార్య).
➡ పాండురాజు మరణం:
సర్వ ధారి నామ సం ఉత్తర నక్షత్ర శుక్ల ద్వాదశి.
అప్పటికి ధర్మరాజు వయసు 16సం 6నె 7రో.
➡ పాండవుల హస్తినపుర ప్రవేశం:
సర్వధారి సం చైత్ర మాస బహుళ త్రయోదశి.
పాండురాజు మరణాంతర 16 రో కు.
➡ యుధిష్టరుని పట్టాభిషేకం:
శుభకృత్ నామ సం ఆస్వీయుజ శుక్ల దశమి.
అతని వయసు 31సం 5రో.
అక్కడినుండి 5సం 4నె 20రో హస్తినాపురం లో ఉంటారు.
➡ వారణావ్రత ప్రవేశం :
ప్లవ నామ సం ఫాల్గుణ మాస శుక్ల అష్టమి.
➡ లాక్ష గృహ దహనం:
కీలక ఫల్గుణ 13/14 వ రాత్రి 3 వ ఝాము.
➡ ఘటోత్కచ జననం:
సౌమ్య నామ సం అశ్వినీ శుక్ల విదియ.
పాండవులు ఏక చక్రపురం లో సాధారణ నామ సం చైత్ర శుక్ల విదియ నుండి ఆస్వీయూజ శుక్ల విదియ వరకు అనగా 6నెలలు ఉంటారు.
మిగిలిన విషయాలు త్వరలో
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 575
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
ఇలాంటి సత్యాల జాబితాలని మొదట చేసినదెవరో - వ్యాప్తి చేస్తున్నవారు అనేకం.
క్విజ్ లలో పాల్గొంటూ ఉంటేనో లేక పోటీ పరీక్షలకి ప్రిపేరు అవుతుంటే బట్టీ వేయడం
మనకి అలవాటు. అంతకి మించి ఇలాంటి జాబితాలలోని విషయాల పట్ల ఆసక్తి ఉండదు.
తరచి చూస్తే ప్రతి విషయం కనుగొనడం వెనుక తపన కూడిన పరిశోధన ఎంతగానో ఉంటుంది.
•
Posts: 2,283
Threads: 149
Likes Received: 7,553 in 1,510 posts
Likes Given: 4,357
Joined: Nov 2018
Reputation:
572
ఇటువంటి విషయాలు.....జాతక విష్లేషణలు చేసేవారికి......బాగా ఉపయోగపడతాయి
ఇంకా చరిత్రకారులకు కూడా సమయ సంగ్రహణ కలుగుతుంది.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
మంచి విశేషాలు తెలియజేశారు పెదబాబుగారూ...
ధన్యవాదాలు
•
Posts: 2,283
Threads: 149
Likes Received: 7,553 in 1,510 posts
Likes Given: 4,357
Joined: Nov 2018
Reputation:
572
➡ బకాసుర వధ :
సాధారణ నామ సం శుక్ల దశమి.
పాండవులు ఏకచక్రపురం లో సాధారణ మార్గశిర బహుళ పంచమి వరకు అనగా ఇంకనూ 1నె10రో ఉన్న తర్వాత పాంచాల రాజ్యం కు బయలుదేరుతారు.
➡ ద్రౌపది స్వయంవరం:
సాధారణ నామ సం పుష్య మాస శుక్లపక్ష దశమి.
విరోధి నామ సం పుష్య పౌర్ణమి వరకు 1సం 15రో పాటు పాంచాల రాజ్యం లో వుంటారు.
హస్తినాపురం రాజధాని గా 5సం 6నె పాటు అనగా విరోధి కృత నామ సం మాఘ శుక్ల విదియ నుండి పింగల శ్రావణ శుక్ల విదియ వరకు.
ఈ కాలం లొనే ??? ఇంద్రప్రస్థం నిర్మాణం జరుగుతుంది.
అప్పటికి ధర్మజుని వయసు 45సం 9నె 27రో.
➡ ధర్మరాజు పట్టాభిషేకం :
పింగళ ఆశ్వీయుజ శుక్ల దశమి.
యధిష్టురుని వయసు 46 సం.
➡ అర్జునుని తీర్థయాత్రలు:
కాలయుక్తి నుండి ప్రమోదూత వరకు.
➡ సుభద్ర తో పరిణయం:
ప్రమోదూత వైశాఖ శుక్ల దశమి.
➡ ఖాండవవన దహనం : ??
ప్రమోదూత శ్రావణ శుక్ల విదియ.
మయసభ 1సం 2నె లో నిర్మితమవుతుంది.
➡ మయసభ ప్రవేశం :
ప్రజోత్పత్తి ఆస్వీయుజ శుక్ల దశమి
ధర్మజుని వయసు 60 సం 5 రో.
ఇంద్రప్రస్థం రాజధాని గా సర్వజిత్ ఆస్వీయుజ శుక్ల దశమి వరకు అనగా 16 సం పాలిస్తారు.
➡ జరాసంధ వధ :
సర్వజిత్ కార్తీక శుక్ల విదియ నుండి 14 వ రోజు వరకు పోరాడి సాయంత్రం న.
➡ రాజసూయ యాగం :
సర్వధారి చైత్ర పౌర్ణమి.
యధిష్టురుని వయసు 76సం 6నె 15రో.
➡ మాయాజూదం : ???
సర్వధారి శ్రావణ తదియ & సప్తమి నాడు.
ధర్మజుని వయసు 76సం 10నె 2రో.
కనుక మొత్తం 36 సం 6నె 20రో అనగా విరోధి కృతు మాఘ శుక్ల విదియ నుండి సర్వధారి శ్రావణ బహుళ సప్తమి.
➡ అరణ్యవాసం : ???
సర్వధారి శ్రావణ బహుళ అష్టమి నాడు ప్రారంభమౌతుంది.
అప్పటికి యధిష్టురుని వయసు 76సం 10నె 18రో.
12సం అరణ్యవాసం శార్వరి శ్రావణ బహుళ సప్తమి తో పూర్తి అవుతుంది.
1సం అజ్ఞాతవాసం ప్లవ శ్రావణ బహుళ సప్తమి తో పూర్తి అవుతుంది.
➡ కీచక వధ :
ప్లవ ఆషాఢ బహుళ అష్టమి.
అతని సోదరురులు మరుసటి దినం మరణిస్తారు.
ఇవన్నీ చాంద్రమానం ప్రకారం సం. వీటిలో
ప్రతి 5 సం కు 2 అధిక మాసాలు మరియు 13 సం లలో 5 అధిక మాసాలు ,12 రోజులు అధికంగా ఉంటాయి.
వీటి లెక్క తిథులలో సహా ధర్మజునికి & భీష్మునికి తెలుసు కాబట్టే ఉత్తర గోగ్రహణం నందు పాండవులు బయటకు తెలుస్తారు.
కానీ దుర్యోధనుడు సూర్యమానం ప్రకారం ఇంకా అజ్ఞాతవాసం పూర్తి అవలేదని భ్రమ పడతాడు.
అందుకే ఉత్తర గోగ్రహణం నందు బయటపడడానికి ముందు రోజే మొత్తం 13 సం కాలం పూర్తి అగుతుంది.
ఇదంతా అర్జునుడు ఉత్తర కుమారునికి వివరిస్తూ తాను గాండీవం ను 30 సం ధరించానని ఇంకనూ 35 సం దరిస్తానని చెప్తాడు.
బహుళ నవమి రోజు అర్జునుడు అజ్ఞాతవాసం నుండి బయటకు వస్తాడు.
అప్పటికి ధర్మజుని వయసు 89సం 10నె 9రో.
పాండవులు ఉపప్లవ్యం లో 1సం 2నె 17రో ఉంటారు. ఈ కాలం లొనే ఉత్తర&అభిమన్యుల వివాహం శుభకృత్ జ్యేష్ఠ మాసం లో జరుగుతుంది.
ఆస్వీయుజ మాసం లో ఏర్పడిన సూర్య చంద్ర గ్రహణాలు ?? రాబోయే కాలం లో జరగబోయే వినాశానికి హేతువులు గా చెప్తారు.
➡ శ్రీ కృష్ణ రాయబారం :
కృష్ణుడు శుభకృత్ కార్తీక శుక్ల విదియ రేవతి నక్షత్రం నాడు ప్రారంభమై త్రయోదశి నాడు హస్తినపురం కు చేరతాడు.అక్కడి నుండి బహుళ అష్టమి వరకు శాంతి కాముకం గా రాయబారం నడుపుతాడు.
అష్టమి రోజే విశ్వరూప సందర్శనం జరుగుతుంది. రాయబారం విఫలమైన తర్వాత అదే రోజు పుష్యమి నక్షత్రం నాడు తిరుగు ప్రయాణం అవుతూ కర్ణుడి తో ఈ విధం గా అంటాడు. వారం రోజులలో అనగా జ్యేష్ఠ నక్షత్రం పాడ్యమి నాడు కురుక్షేత్ర సంగ్రామం జరగపోతుంది. సిద్ధంగా ఉండండి అని ఉపప్లవ్యం కు బయలు దేరతాడు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 288
Threads: 18
Likes Received: 129 in 27 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
19
Inkaa ilaanti vivaraalu unte share cheyyandi.
•
Posts: 2,283
Threads: 149
Likes Received: 7,553 in 1,510 posts
Likes Given: 4,357
Joined: Nov 2018
Reputation:
572
(25-12-2018, 07:14 PM)kishore Wrote: Inkaa ilaanti vivaraalu unte share cheyyandi.
తప్పకుండా కిషోర్ గారు....
నాకు తెలిసిన, దృష్టిలోకి వచ్చిన విషయాలు ఇక్కడ మిత్రులతో పంచుకుంటాను
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 1,669
Threads: 357
Likes Received: 483 in 277 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
76
Lord Krishna’s son Samba had married Duryodhana’s daughter Lakshmana, so they are related.......
Images/gifs are from internet & any objection, will remove them.
•
Posts: 2,283
Threads: 149
Likes Received: 7,553 in 1,510 posts
Likes Given: 4,357
Joined: Nov 2018
Reputation:
572
మార్గశిర శుక్ల విదియ నుండి ద్వాదశి వరకు సైన్యాల మోహరింపు, యుద్ధ సరంజామా , సామర్ధ్య పరీక్షలు నిర్వహించ బడతాయి.
➡ యుద్ధ ప్రారంభం :
శుభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం శుక్ల త్రయోదశి / చతుర్దశి భరణి నక్షత్రం మంగళవారం నాడు ప్రారంభమౌతుంది.
అప్పటికి ధర్మరాజు వయసు 91సం 2నె 9రో .
దీనికి ముందు రోజే అర్జునునికి భగవద్గీత ను బోధిస్తాడు.
మార్గశిర బహుళ సప్తమి నాడు భీష్ముడు అంపశయ్య పై చేరతాడు.
➡ అభిమన్యుని మరణం :
మార్గశిర బహుళ దశమి తన 17 వ ఏట. అప్పటికి అతని వివాహం జరిగి 6నెలలు మాత్రమే. ఉత్తర 6నెలల గర్భిణీ.
సైంధవ మరణం :
మార్గశిర బహుళ ఏకాదశి.
ద్రోణుడు ద్వాదశి నాడు
కర్ణుడు చతుర్దశి నాడు
శల్యుడు శుక్ల పాడ్యమి సాయంత్రం మరణిస్తారు.
➡ దుర్యోధనుడి మరణం :
పుష్య మాస శుక్ల పాడ్యమ
➡ ఉపపాండవుల మరణం :
పుష్య శుక్ల పాడ్యమి నాటి రాత్రి వేళ.
➡ ధర్మరాజు పట్టాభిషేకం :
శుభకృత్ పుష్య పౌర్ణమి.
అప్పటికి ఆయన వయసు 91సం 3నె 10 రో.
పుష్య బహుళ విదియ నుండి అష్టమి వరకు భీష్ముని చే అనేక విషయాలు పాండవుల కు చెప్పబడతాయి.హస్తిన కు వెళ్లిన 15 రోజుల తర్వాత మళ్ళీ మాఘ శుక్ల అష్టమి నాడు మళ్ళీ కలుసుకుంటారు.
భీష్ముడు మార్గశిర సప్తమి నుండి మాఘ ఏకాదశి వరకు 48 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నట్లు చెప్తారు.
➡ అశ్వమేధ యాగం :
శుభకృత్ మాఘ శుక్ల ద్వాదశి.
15సం అనంతరం ధృతరాష్ట్రుడు వన వాసానికి కార్తీక మాసంలో వెళతాడు.
3సం తర్వాత పాండవులు పెద్ద వారు మరణించారని తెలుసుకుని వారిని చూడడానికి అడవులకు వెళ్తారు.
ఒక నెల తర్వాత గాంధారి , ధృతరాష్ట్రుడు, కుంతి మొదలగు వారు అడవులలో అగ్నికి ఆహుతి అవుతారు.
యుద్ధానంతరం 36 సం కు ద్వారక లో ముసలం పుట్టి యాదవులు వినాశనం జరుగుతుంది.
➡ ధర్మరాజు పాలన : శుభకృత్ పుష్య పౌర్ణమి నుండి బహుదారణ్య పుష్య పౌర్ణమి వరకు ధర్మరాజు 36సం 2నె 15రో పాటు పరిపాలిస్తాడు.
➡ కలియుగ ప్రారంభం :
ప్రమాధి శుక్ల పాడ్యమి నాడు శ్రీ కృష్ణ నిర్యాణం తో కలియుగం ఆరంభం అవుతుంది.
అది క్రీ పూ,...? 20 - 2 - 3102. 2:27:30 AM. ?....
7 రోజుల అనంతరం ద్వారక సముద్రం లో మునిగి పోతుంది.
యుధిష్టర శకం ఆయన పట్టాభిషేకం రోజునుండి మొదలవుతుంది.
➡ పాండవుల రాజ్య నిర్గమన
ద్వారక నిమ్మజ్జన అనంతరం 6నె 11రో అనగా ధర్మజుని వయసు 127సం 6రో ఉన్నపుడు 36 సం పరీక్షిత్తు నికి రాజ్యాభిషేకం చేస్తారు.
స్వర్గారోహణ గురించి పూర్తి వివరణ తెలియదు కాని అది 26 సం తర్వాత జరిగింది గా చెప్తారు.
వ్యాసుడు గణపతి కి స్వర్గారోహణ తర్వాతే మహాభారతం చెప్తాడు అని అంటారు.??
పరీక్షిత్తు 60 సం రాజ్యపాలన అనంతరం మరణిస్తాడు. 25 సం జనమేజయుడు రాజు అవుతాడు.
మహాభారత రచన అనంతరమే వేద వ్యాసుడు కలియుగం ప్రారంభమైన 60 సం కు భాగవత రచన చేశాడని చెపుతారు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,283
Threads: 149
Likes Received: 7,553 in 1,510 posts
Likes Given: 4,357
Joined: Nov 2018
Reputation:
572
స్వర్గదామం వైకుంఠ ముక్కోటి ఏకాదశి
వైకుంఠ ఏకాదశినే మనం ముక్కోటి ఏకాదశిగా పిలుసుకుంటాము. స్వర్గద్వారం అంటే ఈ రోజే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. దక్షిణాయణంలో మరణించిన పుణ్యాత్ములు స్వర్గానికి వెళతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణం చేత ఈ రోజు దేవాలయాలలో ఉత్తర ద్వారం ద్వార శ్రీమహవిష్ణువును దర్షిస్తారు,ఇలా దర్శించడం వలన పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. సనాతన హిందూ ధర్మం అనబడే హిందూమతంలో మహోన్నతమైన రహస్యాలు దాగున్నాయి.మన గుడ్డిగా చేస్తున్న వ్రతాలు-పూజలకూ, ఖగోళ గమనానికీ, జ్యోతిష్యసూత్రాలకూ, యోగసాధనకూ సంబంధాలున్నాయి. హిందూ మతంలోని అతి గొప్పదైన విషయం ఇదే.
పిండాండానికీ-బ్రహ్మాండానికీ, దీనిలో-దానిలో ఉన్న అన్నింటికీ మన మతంలో సమన్వయం కనిపిస్తుంది.విశ్వంతో పోలిస్తే మానవుడు ఒక అణువైనప్పటికీ, ఈ అణువులోనే మళ్లీ ఆ విశ్వం అంతా దాగుంది. ఎలా దాగుంది అన్న రహస్యాన్ని మన గ్రంధాలు విప్పిచెప్పటమేగాక, ఏం చేస్తే ఈ రెంటికీ చక్కని సమన్వయం సాధించవచ్చో వివరించాయి. మానవుడు బాహ్య-అంతరిక స్థాయిలలో సమన్వయాన్ని సాధించగలిగితే అతని జీవిత గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. కాని అందరూ అంతరిక సాధన చెయ్యగలరా? అంటే, ఆ అర్హత అంత త్వరగా అందరికీ రాదు అనే చెప్పాల్సి వస్తుంది.
అంతరిక యోగసాధన చెయ్యలేనివారు నామజపం చెయ్యవచ్చు. లేదా బాహ్యపూజ చెయ్యవచ్చు. సరిగ్గా చేస్తే అన్నీ ఒకే ఫలితానికి దారి తీస్తాయి. కారణమ్? అంతరికం బాహ్యం ఒకే మూలంపైన ఆధారపడిఉన్నాయి అన్నదే ఇక్కడి రహస్యం. బాహ్యం అంతరికాన్ని ప్రభావితం చేస్తుంది. అంతరికం బాహ్యానికి ఆధారాన్ని కల్పిస్తుంది. చివరకు, రెండూ వేరువేరుకావు ఒకటే అన్న సత్యస్ఫూర్తి కలుగుతుంది.ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణుపూజ,స్మరణ చెయ్యాలని మన పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని దానిద్వారా వెళ్ళడం ద్వారా మానవునికి విష్ణు దర్శనం కలిగి తద్వారా మోక్షం కలుగుతుందని చెబుతూ దీనిని మోక్ష- ఏకాదశి అని పిలిచాయి. దీనినే ఉత్తర ద్వార దర్శనం అనికూడా అంటారు.తిరుమల ఏడుకొండలలోని ఏడవకొండమీద శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. మనలోపల ఉన్న సప్త చక్రాలలో ఏడవదైన సహస్రదళపద్మం మీద ఆయన నారాయణునిగా శయనించి ఉన్నాడు. యోగపరిభాషలో మానవుని తలభాగం ఉత్తరం, కాళ్ళవైపు భాగం దక్షిణం. భౌగోళిక ఉత్తరంలో అయస్కాంత దక్షిణ ధృవం ఉంది. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవద్దని అంటారు.
ఈ రోజున ఉత్తరద్వారం తెరుచుకుంటుంది అంటే అర్ధం- సహస్రదళపద్మానికి వెళ్ళేదారి సునాయాసంగా తెరుచుకుంటుంది అని. ఈ రోజున నారాయణుడు ఉత్తరద్వారాన్ని తెరిచి తన ద్వారపాలకులైన జయవిజయులను లోనికి అనుమతించాడని పురాణాలు చెబుతాయి.
జయవిజయులంటే ఇడా పింగళానాడులు. సామాన్యంగా ఈ రెండూ భ్రూమధ్యంలో ఉన్న ద్విదళ ఆజ్ఞాపద్మం వరకే వెళతాయి. ఇవి గుమ్మంవరకూ వెళ్లగలవుగాని సహస్ర దళ పద్మంలోనికి వెళ్ళలేవు.కనుకనే వీటిని ద్వారపాలకులు అని యోగపరిభాషలో అంటారు. ఇడానాడి చంద్రనాడి ఇది చంద్రునికి సూచిక. పింగళానాడి సూర్యనాడి ఇది సూర్యునికి సూచిక. కనుక అగ్నిస్వరూపమైన సుషుమ్నలోనికి ఈ రెండూ లయించిన స్థితినే జయవిజయులను ఉత్తరద్వారంగుండా నారాయణుడు లోనికి రానిచ్చాడని మార్మికభాషలో చెప్పారు.
ఈ ఏకాదశి రోజున అది జరిగింది. అప్పుడు వైకుంఠం అనే స్థితి కలుగుతుంది. కుంఠితము కానిది వైకుంఠం. అంటే నిశ్చలము, స్థిరము, నాశనములేనిది అయిన స్థితి. ఉచ్చ్వాస నిశ్వాసములతో నిత్యం చంచలంగా ఉండే మనస్సు పరబ్రహ్మానుసంధానంద్వారా నిశ్చలత్వాన్ని పొంది అఖండ సచ్చిదానంద స్థితిలో లీనంకావడమే ఇడాపింగళా రూపులైన జయవిజయులు ఉత్తరద్వారం గుండా వైకుంఠప్రవేశం చెయ్యటం అంటే అర్ధం. అంటే ఈ రోజున సాధనకు అనువైన స్పందనలు, ఈ స్థితిని సులభంగా ఇవ్వగల ప్రభావాలు ప్రకృతిలో అధికంగా ఉంటాయి. దైవస్వరూపమైన గ్రహాలు-ప్రకృతీ కూడా ఈ రోజున భగవద్దర్శనానికి బాగా సహాయపడతాయి.ఇది అంతరిక విషయం.
ఇక బాహ్యంగా కనిపించే సూర్యచంద్రుల విషయం గమనిద్ధామా? ఎందుకంటే బాహ్యంగా ఉన్నదే అంతరికంగా ఉన్నదన్న సూత్రం మీదనే యోగమూ-తంత్రమూ నిర్మితమైనాయి మరి.
సూర్యుడు నిరయన ధనురాశిలో సంచరించే సమయంలో ఈ ఏకాదశి వస్తుంది. ఆ సమయంలో సూర్యుడు మూలా నక్షత్రంలో ఉంటాడు. మూలా నక్షత్రం గాలాక్టిక్ సెంటర్ కు దగ్గరగా ఉన్న నక్షత్రమండలం. దీనినే విష్ణునాభి అని పిలుస్తారు. ఈ నాభిలోనుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ జన్మించాడని మన పురాణాలు చెపుతున్నాయి. ఇదంతా మార్మికపరిభాష. దీన్ని కొంచం అర్ధం చేసుకుందాం.నిరవధికశూన్యంలోనుంచి మొదటగా సృష్టి జరిగిన ప్రదేశం మూలా నక్షత్రమండల ప్రాంతంలోనే ఉంది. కనుకనే దీనిని విష్ణునాభి అంటూ, ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్థానంగా అలంకారిక మార్మికభాషలో చెప్పారు.
మహాశక్తికేంద్రం
మన గ్రహమండలానికి సూర్యుడే శక్తిప్రదాత. ఆ సూర్యుడు ఇక్కడినుంచి పుట్టినవాడే. కనుక, సూర్యుడు తనకు శక్తినిస్తున్న మరియు తాను పుట్టిన విష్ణునాభి అనే మహాశక్తికేంద్రం ఉన్నటువంటి మూలానక్షత్రమండల ప్రాంతం మీదుగా ప్రతి ఏడాదీ ఇదే సమయంలో సంచరిస్తాడు. వెలుగును శక్తిని ఇచ్చేటటువంటి సూర్యుడు ఈ సమయంలో మూలశక్తియైనటువంటి మూలానక్షత్రప్రాంతంలో సంచరిస్తూ లోకానికి శుభంకరమైన ధర్మస్వరూపమైన ఆధ్యాత్మిక వెలుగును ఇస్తాడు.
ఈ మాసంలో ఏకాదశినాడు, సూర్య చంద్రులు ఒకరికొకరు పంచమ నవమ స్థానాలలో ఉంటారు. ఇవి కోణస్థానాలు కనుక అత్యంత శుభప్రదమైనవి. ఇక చంద్రుని స్తితి చూద్దాం.
నారాయణ
రాశులలో మొదటిదైన మేషంలో చంద్రుడూ, ధర్మ స్వరూపమైన నవమ స్థానంలో నారాయణ స్వరూపుడైన సూర్యుడూ ఉంటారు. మేషం తలకు సూచిక కనుక తలలో ఉన్న సహస్రదళపద్మం సూచింపబడుతున్నది. తెల్లని పాలవంటి శుక్లపక్ష ఏకాధశినాటి చంద్రునికి సూచికగా పాలసముద్రంమీద శయనించి ఉన్న మహావిష్ణువు ( సర్వవ్యాపకమైన మహాశక్తిస్వరూపం ) సూచింపబడుతున్నాడు. ఈ రోజున సూర్యుడు మూలశక్తిస్థానంలో ఉంటాడు. చంద్రుడు దానికి పంచమ కోణంలో ఉండి కోణదృష్టితో ఆయన్ను చూస్తుంటాడు.
చరాచరసృష్టికర్త
అంటే మనస్సుకు సూచిక అయిన చంద్రుని దృష్టి ఈరోజున మూలానక్షత్రస్థితుడైన ఆత్మసూర్యునిపైన ఉండటం వల్ల, ఏం సూచింపబడుతున్నది? మానవుని యొక్క మనస్సు ఈ రోజున సమస్త చరాచరసృష్టికర్త అయిన దైవంమీద సులభంగా నిమగ్నం కాగలదు అన్న ప్రకృతిమాతయొక్క వరం మనకు దర్శనమిస్తున్నది. అంతేకాదు. సూర్యుని కోణ దృష్టికూడా చంద్రునిపైన ఉండటంవల్ల మూలానక్షత్రప్రాంతపు మహాశక్తి సూర్యుని వేడిమిద్వారా వచ్చి అది చంద్రునిపైబడుతున్నది.
సూర్యనారాయణుడు
అంటే భగవంతుని ప్రసన్నదృష్టి కూడా ఈ రోజున అత్యంత దయాపూరితంగా మానవుల అందరిమీదా ప్రసరిస్తుంది. దీనినే వైకుంఠపు ఉత్తరద్వారం తెరుచుకోవటం, నారాయణుని దర్శనం కలగటం అని మార్మికభాషలో చెప్పారు.ఆత్మకారకుడైన సూర్యనారాయణుడు ధర్మస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. మన: కారకుడైన చంద్రుడు శిరోస్థానమైన మేషంలో ఉండి సూర్యుని చూస్తున్నాడు. ఇది ఈ సమయంలో ప్రకృతిలో జరిగే ఒక అమరిక. అంతరికంగా ఇది ఒక అత్యంతమార్మికసూచన. దీని అంతరార్ధం యోగులకు విదితమే.
వాతావరణం
ఖగోళంలో జరిగే ఈ అమరికవల్ల మానవునిలోపల కూడా ఈ రొజున విష్ణుసాన్నిధ్యాన్ని సులభంగా పొందగలిగే స్పందనలు ఉంటాయి. మానవుని సాధనకు విశ్వంలోని వాతావరణం ఈరోజున చాలా అనుకూలంగా ఉంటుంది. మనస్సు తేలికగా భగవధ్యానంలో నిమగ్నం కాగలుగుతుంది. కనుక యోగులైనవారు ఈ రోజున సాధనను తీవ్రతరం చేస్తే అనుకూలంగా ఉన్న గ్రహ అయస్కాంత ప్రభావంవల్ల ఉత్తరద్వారం అనబడే అజ్ఞా-సహస్రదళపద్మముల మధ్యనున్న రహస్య ద్వారం తెరుచుకొని కుండలిని సహస్ర దళ పద్మం అనబడే వైకుంఠాన్ని చేరగలుగుతుంది.
ఇదే మోక్షం పొందటం
అంటే.
మూలాధారం నుంచి సహస్రదళం వరకూ వ్యాపించి యున్న కుండలినీ శక్తిమీద పవళించి ఉన్న మహాశక్తి స్వరూపాన్నే మన పురాణాలు-- ఆదిశేషుడనబడే మహాసర్పంపైన శయనించి ఉన్న మహావిష్ణువుగా మార్మికభాషలో చెప్పాయి. ఆ సర్వేశ్వరుని కరుణ ఈ రోజున ఇతోధికంగా మానవులకు లభించగలదు. ఇదే ముక్కోటి ఏకాదశి యొక్క రహస్య ప్రాశస్త్యం. మరి ఈ రోజు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మనమీదనే అధారపడి ఉంటుంది జైశ్రీమన్నారాయణ.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,283
Threads: 149
Likes Received: 7,553 in 1,510 posts
Likes Given: 4,357
Joined: Nov 2018
Reputation:
572
దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు ..????
ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం
“ ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం .
పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది… నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం. అని వివరణ చేశారు.?
“పేరు దేవుడిది-పొట్ట మనది”అని హేళనచేసేవారికి సరియైన సమాధానం కదా…
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,005 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
అద్భుతంగా ఉందండి.
శరీరం నిట్ట నిలువుగా ఉంటుంది. ఆ శరీరానికి గుద ద్వారం దక్షిణం. ఉత్తరం శిరస్సు. ఉత్తరం యొక్క ద్వారం సహస్రారం. ద్వారం అనగా ద్వి అరలు. రెండు అరలు కలిగి తెరుచుకొని ఒక ద్వారానే ఉత్తర ద్వారం . జీవుని మూలాధారం నుండి యోగ విద్య ద్వారా......మల ద్వారం ద్వారా కాకుండా సహస్రారం ద్వారా ప్రాణం పోవడం అనగా మోక్షం.
జీవుని విగత జీవుని, అనగా శరీరం లో పరమాత్మ, జ్యోతిగా వెలుగుతూ జీవునిలో ప్రజ్వలన అవుతున్నదో.......,
( ఇక్కడ మోక్షం చాలా గొప్పది కాదు శ్రమ గొప్పది) ఆ ప్రజ్వలన శరీరం లో మెరిసిపోతే...............అంటే ప్ర జ్వలిస్తూ ఉంటే........................ఇక్కడ ప్రజ్వలన పర జ్వలం; పర జాలం ఇక్కడ జాలము అంటే వల కాదు జ్వలిస్తూ ఉండటం అంటే శరీరం ఇక్కడ జ్యోతిగా వెలుగుతూ ఉంటే అది పర అనగా ఏదైతే శరీరం లో జ్యోతి రూపం లో వెలుగుతూ ఉన్నదో ఆ జ్యోతి నీది కాదు ఇక్కడ నీవు అనగా నీవు కాదు అలానే నేను అనగా నేను కాదు ఆ జ్యోతి ఎక్కడ నుండో వచ్చి ఇక్కడకు ఒక శరీరాన్ని ఆపాదించుకుని, నీ శరీరాన్ని క్షేత్రంగా చేసుకుని వెలుగుతూ ఉంది అటువంటి జ్యోతి, ఇక్కడ వ్యక్తం అయ్యేది అనగా జ్యోక్తమయ్యేది జ్యోతి; ఆ జ్యోతి...., పరం జ్యోతి ఇహం కానిది పరమైనటువంటిది అదే నీవు మోక్ష సాధనకై అనగా నీ కర్మలతో మల ద్వారం గుండా ఆ పరమ జ్యోతిని పంపిస్తావా లేక ఉత్తర ద్వారమనే పవిత్రమైన ద్వారం గుండా పంపిస్తావా ? అనేది కపాల మోక్షం.
అందుకే శిరస్సుకి కొరివి పెట్టడం జరుగుతుంది.
•
Posts: 2,283
Threads: 149
Likes Received: 7,553 in 1,510 posts
Likes Given: 4,357
Joined: Nov 2018
Reputation:
572
మనకు విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది! భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు, ధర్మరాజుతో సహా. కాని ఎవరూ రాసుకోలేదు.
మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?
అది 1940వ సంవత్సరం.
శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్ చూసి స్వామి వారు ఆ వ్యక్తినీ అక్కడున్న వారినందిరినీ వుద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది" అని అడిగారు.
ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?"
ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"
స్వామివారు:: "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"
మళ్ళీ నిశబ్దం.
స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, అందరూ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు,
"ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని యుదిష్ఠిరుడు అడిగాడు.
"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.
శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.
"అదేలా" అని అందరూ అడిగారు.
శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత
స్ఫటికం వేసుకున్నాడు. ఈ
స్ఫటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.
శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు.
ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.
జయ జయ శంకర ! హర హర శంకర ! జయ జయ శంకర పాలయమాం!!
శ్రీగురుభ్యో నమ:
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 11,383
Threads: 13
Likes Received: 49,948 in 10,085 posts
Likes Given: 13,070
Joined: Nov 2018
Reputation:
1,004
•
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,005 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
భలే ఉంది .
సూత స్పటికం ఎక్కడో విన్నాను. కానీ దాని గురించి ఏమీ తెలియదు.
విష్ణు సహస్ర నామాల్లో కానీ...
అచమ్య మంత్రాల్లో కానీ శ్రీ రామ శబ్దం ఉండదు. ఎందుకో
విష్ణు సహస్ర నామాలు అన్నీ చెప్పిన తరువాత ఉత్తరపీఠిక లో అంటే ప్రభావం/ఫలితం చెప్పేటప్పుడు మాత్రం
శ్రీ రామ రామేతి రామ్ రామ్ మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అంటూ ఈశ్వర ఉవాచగా తెలియజేస్తారు.
అందులోనే విష్ణు సహస్రనామాలు వెయ్య మార్లు జపిస్తే ఒక్కసారి శివసహస్రనామాలు జపించిన ఫలితం
వెయ్యి శివ సహస్రనామాలు జపించి నట్లయితే ఒక్క సారి లలిత సహస్ర నామాలు జపించిన ఫలితం వస్తుంది. అని చెబుతారు.
శుక్లాంబరధరం
శశివర్ణం
చతుర్భుజం
ప్రసన్న వదనం
ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
తెల్లని వస్తాన్ని ధరించినవాడు
తెల్లని రంగు కలవాడు
4 భుజములు కలవాడు
ప్రసన్నమైన ముఖము
ని ధ్యానం చేయండి అందువల్ల విఘ్నములు ఉపశమిస్తాయి.
లక్ష్మీమ్
క్షీర సముద్రరాజతనయా
శ్రీరంగ ధామేశ్వరి
దాసీభూత సమస్త దేవా వనితాం.
లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష
లభ్దవిభవత్ భ్రమింద్ర గంగాధరాం
త్వామ్ త్రైలోక్య కుటుంబినీం
సరసిజాం వందే ముకుంద ప్రియాం
క్షీర సముద్రం లో పుట్టినది., శ్రీ రంగంలో సదా ఉండేధీ..,
ఆ తల్లికి అందరు దేవీ దేవతలూ సేవ చేస్తూ ఉంటారు.(డబ్బుకు లోకం దాస్యమే కదా)
మనసులో తలుస్తేనే కాటాక్షించే తల్లి లెక్కలేనంత గా వైభవం ఇచ్చే తల్లిని
బ్రహ్మ, ఇంద్ర, గంగను ధరించిన శివుడు ప్రభుతులు, మూడు లోకములకు ఆరాధ్య అయిన ముకుందునికి ఇల్లాలు ఆ తల్లిని కొలవండి మనస్సులో తలుస్తేనే కటాక్షిస్తుంది.
•
Posts: 2,283
Threads: 149
Likes Received: 7,553 in 1,510 posts
Likes Given: 4,357
Joined: Nov 2018
Reputation:
572
సృష్టి రహస్య విశేషాలు..!!
1 సృష్టి ఎలా ఏర్పడ్డది
2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది
3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి
( సృష్ఠి ) ఆవిర్బావము.
1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2 శివం యందు శక్తి
3 శక్తి యందు నాధం
4 నాధం యందు బిందువు
5 బిందువు యందు సదాశివం
6 సదాశివం యందు మహేశ్వరం
7 మహేశ్వరం యందు ఈశ్వరం
8 ఈశ్వరం యందు రుద్రుడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశం
13 దహరాకాశం యందు వాయువు
14 వాయువు యందు అగ్ని
15 ఆగ్ని యందు జలం
16 జలం యందు పృథ్వీ.
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషదుల వలన అన్నం
19. ఈ అన్నము వల్ల...... నర , మృగ , పశు , పక్షి ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.
( సృష్ఠి ) కాల చక్రం.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఎంతో మంది శివులు
ఎంతోమంది విష్ణువులు
ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు
ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.
ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగాలకు 1 మహయుగం.
71 మహ యుగాలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .
1000 యుగాలకు ఒక రాత్రి (ప్రళయం.)
2000 యుగాలకు ఒక దినం.
ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం.
శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.
సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
( పంచ భూతంలు ఆవిర్భావం )
1 ఆత్మ యందు ఆకాశం
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
5 ఙ్ఞానేంద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు
1 ( ఆకాశ పంచికరణంలు )
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి
2( వాయువు పంచీకరణంలు )
వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.
3 ( అగ్ని పంచీకరణములు )
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టెను.
4 ( జలం పంచికరణంలు )
జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )
జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టెను.
5 ( భూమి పంచికరణంలు )
భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )
భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టెను.
( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానేంద్రియంలు
1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.
5 ( పంచ తన్మాత్రలు )
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు
5 ( పంచ ప్రాణంలు )
1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మేంద్రియంలు )
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం
1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం
6 ( అరిషడ్వర్గంలు )
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మాత్సర్యం
3 ( శరీరంలు )
1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం
3 ( అవస్తలు )
1 జాగ్రదావస్త
2 స్వప్నావస్త
3 సుషుప్తి అవస్త
6 ( షడ్బావ వికారంలు )
1 ఉండుట
2 పుట్టుట
3 పెరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట
6 ( షడ్ముర్ములు )
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం
.7 ( కోశములు ) ( సప్త ధాతువులు )
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం
3 ( జీవి త్రయంలు )
1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞుడు
3 ( కర్మత్రయంలు )
1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు
5 ( కర్మలు )
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
3 ( గుణంలు )
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
9 ( చతుష్ఠయములు )
1 సంకల్ప
2 అధ్యాసాయం
3 ఆభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష
10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి
14 మంది ( అవస్థ దేవతలు )
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు
10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ
10 ( వాయువులు )
1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ
7 ( షట్ చక్రంలు )
1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం
( మనిషి ప్రమాణంలు )
96 అంగుళంలు
8 జానల పోడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 ముారల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సేరెడు పైత్యం
అర్దసేరు శ్లేషం
( మానవ దేహంలో 14 లోకాలు ) పైలోకాలు 7
1 భూలోకం - పాదాల్లో
2 భూవర్లలోకం - హృదయంలో
3 సువర్లలోకం - నాభీలో
4 మహర్లలోకం - మర్మాంగంలో
5 జనలోకం - కంఠంలో
6 తపోలోకం - భృమద్యంలో
7 సత్యలోకం - లాలాటంలో
అధోలోకాలు 7
1 ఆతలం - అరికాల్లలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకాల్లలో
6 మహతలం - తోడల్లో
7 పాతాళం - పాయువుల్లో
( మానవ దేహంలో సప్త సముద్రంలు )
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షి సముద్రం - చెమట
3 సూర సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దది సముద్రం - శ్లేషం
6 క్షీర సముద్రం - జోల్లు
7 శుద్దోక సముద్రం - కన్నీరు
( పంచాగ్నులు )
1 కాలాగ్ని - పాదాల్లో
2 క్షుదాగ్ని - నాభిలో
3 శీతాగ్ని - హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో
7 ( మానవ దేహంలో సప్త దీపంలు )
1 జంబుా ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సుపైన
4 శాల్మల ధ్వీపం - చర్మంన
5 పూష్కార ద్వీపం - గోలమందు
6 కూశ ద్వీపం - మాంసంలో
7 కౌంచ ద్వీపం - వెంట్రుకల్లో
10 ( నాధంలు )
1 లాలాది ఘోష - నాధం
2 భేరి - నాధం
3 చణీ - నాధం
4 మృదంగ - నాధం
5 ఘాంట - నాధం
6 కీలకిణీ - నాధం
7 కళ - నాధం
8 వేణు - నాధం
9 బ్రమణ - నాధం
10 ప్రణవ - నాధం
??జైగురుదేవ్????
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 7
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 0
Joined: Dec 2018
Reputation:
0
(25-01-2019, 05:44 PM)k3vv3 Wrote: సృష్టి రహస్య విశేషాలు..!!
1 సృష్టి ఎలా ఏర్పడ్డది
2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది
3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి
( సృష్ఠి ) ఆవిర్బావము.
1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2 శివం యందు శక్తి
3 శక్తి యందు నాధం
4 నాధం యందు బిందువు
5 బిందువు యందు సదాశివం
6 సదాశివం యందు మహేశ్వరం
7 మహేశ్వరం యందు ఈశ్వరం
8 ఈశ్వరం యందు రుద్రుడు
9 రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11 బ్రహ్మ యందు ఆత్మ
12 ఆత్మ యందు దహరాకాశం
13 దహరాకాశం యందు వాయువు
14 వాయువు యందు అగ్ని
15 ఆగ్ని యందు జలం
16 జలం యందు పృథ్వీ.
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషదుల వలన అన్నం
19. ఈ అన్నము వల్ల...... నర , మృగ , పశు , పక్షి ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.
( సృష్ఠి ) కాల చక్రం.
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఎంతో మంది శివులు
ఎంతోమంది విష్ణువులు
ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు
ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.
ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగాలకు 1 మహయుగం.
71 మహ యుగాలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .
1000 యుగాలకు ఒక రాత్రి (ప్రళయం.)
2000 యుగాలకు ఒక దినం.
ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం.
శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.
5 గురు భాగాన కాలంకు 60 సం
1 గురు భాగాన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు 3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం. 2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార. 3 నక్షత్రం. 4 కరణం. 5 యోగం.
సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది.
దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
( పంచ భూతంలు ఆవిర్భావం )
1 ఆత్మ యందు ఆకాశం
2 ఆకాశం నుండి వాయువు
3 వాయువు నుండి అగ్ని
4 అగ్ని నుండి జలం
5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
5 ఙ్ఞానేంద్రియంలు
5 పంచ ప్రాణంలు
5 పంచ తన్మాత్రలు
5 ఆంతర ఇంద్రియంలు
5 కర్మఇంద్రియంలు = 25 తత్వంలు
1 ( ఆకాశ పంచికరణంలు )
ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల ( ఆహంకారం ) పుడుతుతున్నాయి
2( వాయువు పంచీకరణంలు )
వాయువు - వాయువుతో కలవడం వల్ల ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.
3 ( అగ్ని పంచీకరణములు )
అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో ( ఘ్రాణం ) పుట్టెను.
4 ( జలం పంచికరణంలు )
జలం - ఆకాశంలో కలవడంవల్ల ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల ( స్పర్ష )
జలం - అగ్నిలో కలవడంవల్ల ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల ( గంధం )పుట్టెను.
5 ( భూమి పంచికరణంలు )
భూమి - ఆకాశంలో కలవడంవల్ల ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల ( పాని )
భూమి - అగ్నితో కలవడంవల్ల ( పాదం )
భూమి - జలంతో కలవడంతో ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల ( గుదం ) పుట్టెను.
( మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానేంద్రియంలు
1 శబ్ద
2 స్పర్ష
3 రూప
4 రస
5 గంధంలు.
5 ( పంచ తన్మాత్రలు )
1 చెవులు
2 చర్మం
3 కండ్లు
4 నాలుక
5 ముక్కు
5 ( పంచ ప్రాణంలు )
1 అపాన
2 సామనా
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
5 ( అంతఃర ఇంద్రియంలు ) 5 ( కర్మేంద్రియంలు )
1 మనస్సు
3 బుద్ది
3 చిత్తం
4 జ్ఞానం
5 ఆహంకారం
1 వాక్కు
2 పాని
3 పాదం
4 గుహ్యం
5 గుదం
6 ( అరిషడ్వర్గంలు )
1 కామం
3 క్రోదం
3 మోహం
4 లోభం
5 మదం
6 మాత్సర్యం
3 ( శరీరంలు )
1 స్థూల శరీరం
2 సూక్ష్మ శరీరం
3 కారణ శరీరం
3 ( అవస్తలు )
1 జాగ్రదావస్త
2 స్వప్నావస్త
3 సుషుప్తి అవస్త
6 ( షడ్బావ వికారంలు )
1 ఉండుట
2 పుట్టుట
3 పెరుగుట
4 పరినమించుట
5 క్షిణించుట
6 నశించుట
6 ( షడ్ముర్ములు )
1 ఆకలి
2 దప్పిక
3 శోకం
4 మోహం
5 జర
6 మరణం
.7 ( కోశములు ) ( సప్త ధాతువులు )
1 చర్మం
2 రక్తం
3 మాంసం
4 మేదస్సు
5 మజ్జ
6 ఎముకలు
7 శుక్లం
3 ( జీవి త్రయంలు )
1 విశ్వుడు
2 తైజుడు
3 ప్రఙ్ఞుడు
3 ( కర్మత్రయంలు )
1 ప్రారబ్దం కర్మలు
2 అగామి కర్మలు
3 సంచిత కర్మలు
5 ( కర్మలు )
1 వచన
2 ఆదాన
3 గమన
4 విస్తర
5 ఆనంద
3 ( గుణంలు )
1 సత్వ గుణం
2 రజో గుణం
3 తమో గుణం
9 ( చతుష్ఠయములు )
1 సంకల్ప
2 అధ్యాసాయం
3 ఆభిమానం
4 అవధరణ
5 ముదిత
6 కరుణ
7 మైత్రి
8 ఉపేక్ష
9 తితిక్ష
10 ( 5 పంచభూతంలు పంచికరణ చేయనివి )
( 5 పంచభూతంలు పంచికరణం చేసినవి )
1 ఆకాశం
2 వాయువు
3 ఆగ్ని
4 జలం
5 భూమి
14 మంది ( అవస్థ దేవతలు )
1 దిక్కు
2 వాయువు
3 సూర్యుడు
4 వరుణుడు
5 అశ్వీని దేవతలు
6 ఆగ్ని
7 ఇంద్రుడు
8 ఉపేంద్రుడు
9 మృత్యువు
10 చంద్రుడు
11 చతర్వకుడు
12 రుద్రుడు
13 క్షేత్రజ్ఞుడు
14 ఈశానుడు
10 ( నాడులు ) 1 ( బ్రహ్మనాడీ )
1 ఇడా నాడి
2 పింగళ
3 సుషుమ్నా
4 గాందారి
5 పమశ్వని
6 పూష
7 అలంబన
8 హస్తి
9 శంఖిని
10 కూహు
11 బ్రహ్మనాడీ
10 ( వాయువులు )
1 అపాన
2 సమాన
3 ప్రాణ
4 ఉదాన
5 వ్యాన
6 కూర్మ
7 కృకర
8 నాగ
9 దేవదత్త
10 ధనంజమ
7 ( షట్ చక్రంలు )
1 మూలాధార
2 స్వాదిస్థాన
3 మణిపూరక
4 అనాహత
5 విశుద్ది
6 ఆఙ్ఞా
7 సహస్రారం
( మనిషి ప్రమాణంలు )
96 అంగుళంలు
8 జానల పోడవు
4 జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62 కీల్లు
37 ముారల ప్రేగులు
1 సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4 సేర్లు మాంసం
1 సేరెడు పైత్యం
అర్దసేరు శ్లేషం
( మానవ దేహంలో 14 లోకాలు ) పైలోకాలు 7
1 భూలోకం - పాదాల్లో
2 భూవర్లలోకం - హృదయంలో
3 సువర్లలోకం - నాభీలో
4 మహర్లలోకం - మర్మాంగంలో
5 జనలోకం - కంఠంలో
6 తపోలోకం - భృమద్యంలో
7 సత్యలోకం - లాలాటంలో
అధోలోకాలు 7
1 ఆతలం - అరికాల్లలో
2 వితలం - గోర్లలో
3 సుతలం - మడమల్లో
4 తలాతలం - పిక్కల్లో
5 రసాతలం - మొకాల్లలో
6 మహతలం - తోడల్లో
7 పాతాళం - పాయువుల్లో
( మానవ దేహంలో సప్త సముద్రంలు )
1 లవణ సముద్రం - మూత్రం
2 ఇక్షి సముద్రం - చెమట
3 సూర సముద్రం - ఇంద్రియం
4 సర్పి సముద్రం - దోషితం
5 దది సముద్రం - శ్లేషం
6 క్షీర సముద్రం - జోల్లు
7 శుద్దోక సముద్రం - కన్నీరు
( పంచాగ్నులు )
1 కాలాగ్ని - పాదాల్లో
2 క్షుదాగ్ని - నాభిలో
3 శీతాగ్ని - హృదయంలో
4 కోపాగ్ని - నేత్రంలో
5 ఙ్ఞానాగ్ని - ఆత్మలో
7 ( మానవ దేహంలో సప్త దీపంలు )
1 జంబుా ద్వీపం - తలలోన
2 ప్లక్ష ద్వీపం - అస్తిలోన
3 శాక ద్వీపం - శిరస్సుపైన
4 శాల్మల ధ్వీపం - చర్మంన
5 పూష్కార ద్వీపం - గోలమందు
6 కూశ ద్వీపం - మాంసంలో
7 కౌంచ ద్వీపం - వెంట్రుకల్లో
10 ( నాధంలు )
1 లాలాది ఘోష - నాధం
2 భేరి - నాధం
3 చణీ - నాధం
4 మృదంగ - నాధం
5 ఘాంట - నాధం
6 కీలకిణీ - నాధం
7 కళ - నాధం
8 వేణు - నాధం
9 బ్రమణ - నాధం
10 ప్రణవ - నాధం
??జైగురుదేవ్????
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
eppudo chinnapdu maa taata garu chepparu.........veetikosaam...malla meeru chepparu thanks
•
Posts: 1,813
Threads: 10
Likes Received: 3,005 in 785 posts
Likes Given: 693
Joined: Nov 2018
Reputation:
157
షట్ చక్రాలు 6
1 మూలాధారమునకు అధిపతి విఘ్నేశ్వరుడు
2 స్వాదిష్టానమునకు అధిపతి వాణీ వాచస్పతి
3 మణిపూరకమునకు విష్ణువు
4 అనాహత చక్రమునకు అధిపతి రుద్రుడు
5 విశుద్ది చక్రమునకు జీవాత్మ
6 ఆఙ్ఞా చక్రమునకు పరమాత్మ
సహస్రమునకు పరబ్రహ్మ ఆతడే త్రిపుర సుందరుడు
•
|