Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
02-02-2019, 09:46 PM
(This post was last modified: 16-03-2019, 10:01 PM by Rajkumar1. Edited 1 time in total. Edited 1 time in total.)
నా దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలను ఇక్కడ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను...
కింది లింకుల్లో నా దగ్గరున్న పుస్తకాల లిస్ట్ ఉంది .. వాటిల్లో మీకేదైన కావలిస్తే పోస్ట్ చేస్తాను..
1.మల్లాది వారి పుస్తకాల లిస్ట్
2.విశ్వనాథ వారి పుస్తకాల లిస్ట్
3. చలం పుస్తకాల లిస్ట్
4. యద్దనపూడి సులోచనా రాణి పుస్తకాల లిస్ట్
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 575
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
మీ వద్ద ఉన్న పుస్తకాల జాబితా ఇవ్వగలరు.
వాటిలో కావలిసిన పుస్తకాలని మిత్రులు కోరుకునే వీలు ఉంటుంది.
మీ పుస్తకాల ఫోల్డరుని బ్రౌజరు ద్వారా చూడటం ద్వారా లిస్టు పొందే వీలు ఉంటుంది.
లేదా మరేదైనా మెరుగైన పద్ధతికి సెర్చి చేసి చూడగలరు
Quote:https://www.google.com/search?q=files+list+to+excel
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
02-02-2019, 10:18 PM
(This post was last modified: 16-03-2019, 10:02 PM by Rajkumar1. Edited 1 time in total. Edited 1 time in total.)
..............
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
02-02-2019, 10:30 PM
(This post was last modified: 05-02-2019, 07:28 PM by Rajkumar1. Edited 2 times in total. Edited 2 times in total.)
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 575
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
లిస్టుని స్క్రీనుషాట్స్ తీసుకుని ఇమేజిల రూపంలో సేవు చేసి పొందుపరచడం వీలవుతుందనుకుంటాను
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
02-02-2019, 10:50 PM
(This post was last modified: 05-02-2019, 07:19 PM by Rajkumar1. Edited 1 time in total. Edited 1 time in total.)
రవీంద్రుని గీతాంజలి
అనువాదం
చలం
Download
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
(02-02-2019, 10:45 PM)~rp Wrote: లిస్టుని స్క్రీనుషాట్స్ తీసుకుని ఇమేజిల రూపంలో సేవు చేసి పొందుపరచడం వీలవుతుందనుకుంటాను
wil try
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
05-02-2019, 07:32 PM
(This post was last modified: 05-02-2019, 07:51 PM by Rajkumar1. Edited 2 times in total. Edited 2 times in total.)
రవీంద్రుని
"అక్కా - చెల్లెలు"
Download
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
బుచ్చిబాబు రచన..
"చివరికి మిగిలేది"
Download
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
జగదేకసుందరి "క్లియోపాత్ర"
Download
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
05-02-2019, 07:57 PM
(This post was last modified: 20-03-2019, 10:26 AM by Rajkumar1. Edited 1 time in total. Edited 1 time in total.)
విశ్వ విఖ్యాత నవల...
అలెక్స్ హేలీ రచన..
"ఏడు తరాలు"
Review From హరి కుమార్ రెడ్డి
ఏడు తరాలు
---------------------
ఏడు తరాలు... ఇది ఒక బానిసల కథ. అమెరికాకు ఆఫ్రికానుండి బలవంతంగా రప్పించబడిన అమెరికాలోని ఆఫ్రికా బానిసల కథ. అగ్రరాజ్యమైన అమెరికాలో చీకటి కోణం, నల్లవాళ్లపై తెల్లవాళ్ళ ఆకృత్యాలు ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అప్పటిదాకా నా అనే వాళ్ళతో సొంత ఊరి జనం మధ్య సంతోషంగా ఉన్న జీవితాలు ఒక్కసారిగా తలకిందులైతే? వీళ్ళందరికీ దూరంగా, భవిష్యత్తు అంటే ఏంటో తెలీక, దొరలకు కండలు కరిగేలా స్వేదాన్ని చిందించిన దానికి ప్రతిఫలంగా చర్మం ఊడిపోయేలా కొరడా దెబ్బలు తింటూ, గతాన్ని గుర్తు చేసుకోలేక - భవిష్యత్తును ఊహించలేక నాగరిక సమాజంలో ఒక జాతి మరో జాతిపై ముసుగులో చేసిన దమనకాండకు అక్షరరూపం ఈ "ఏడుతరాలు" నవల! ఇదొక వాస్తవిక చరిత్ర!!
స్వేచ్ఛనుండి సంకెళ్లకు, సంకెళ్లనుండి స్వేచ్ఛా వాయువుల్లోకి వెళ్లిన ఆఫ్రికా నిగ్గర్ల (నిగ్గర్లు అంటే బానిసలు) చరిత్ర ఈ ఏడు తరాలు. బానిసలపై జాలి, దయ, కరుణ, మానవత్వం లాంటివేమీ లేకుండా అగ్రరాజ్యం అమెరికా జరిపిన ఆకృత్యాలు చదువుతుంటే నరాల్లోని రక్తం ఉడికి పోతుంది, కన్నీళ్ల సముద్రంలో కనుగుడ్లు తేలియాడుతాయి.
క్రీస్తుశకం 1750 లో ఆఫ్రికా ఖండంలో గాంబియా అనే దేశంలో మొదలవుతుంది ఈ కథ. కల్లా కపటం తెలియని , స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు అడ్డులేని జాఫురు అనే గ్రామంలో ఉమురా-బింటో దంపతులకు కుంటా పుట్టడంతో కథ ప్రారంభం అవుతుంది. అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో, నానమ్మ చెప్పే కథలతో, తోటి పిల్లలతో వాళ్ళ సంప్రదాయాల ప్రకారం పెరుగుతూ ఉంటాడు. పొలం పనులు చేస్తూ, సాయంత్రాలు చదువుకుంటూ ఉంటాడు. కఠినమైన గ్రామ సంప్రదాయ పురుష శిక్షణ తీసుకొని ఇంటికి తిరిగొచ్చి తన వైవాహిక జీవితం గురించి కలలు కంటూ ఉంటాడు.
ఒకానొక దురదృష్ట సమయంలో తెల్లవాళ్ళ కంటబడి వేట కుక్కలతో, మారణాయుధాలతో వేటాడి బందీగా చిక్కుతాడు. చిన్నప్పుడు తన తండ్రి చెప్పిన "తెల్లవాళ్లు మన చుట్టూ ప్రక్కల ఉన్నప్పుడు కోడిమాంసం వాసన వస్తుంది" అన్నవిషయంలో ఏమరపాటుగా ఉన్నందుకు చింతిస్తాడు. అలా తెల్లవాళ్ళకు చిక్కి, స్పృహ కోల్పోయి కళ్ళు తెరిచేప్పటికీ ఓడలో వివస్త్రై బందీగా ఉంటాడు. శరీరమంతా గాయాలై ఎర్రగా పుండ్లు పట్టి ఉంటుంది. కాళ్ళు చేతులు కట్టి పడేసి ఉంటాయి. ఆ ఇరుకు ఓడలో తన తోటి బందీలతో భోజనాలు, మలమూత్రాలు ఒకేచోట చేస్తూ కొన్నివారాల పాటు సముద్రయానం చేసి అమెరికా చేరుతాడు. రచయిత వర్ణించిన ఓడ ప్రయాణం చదువుతుంటే అందులో ప్రయాణించడం కన్నా చావడం అతి ఉత్తమమని అనిపించకమానదు. విసర్జించిన మలమూత్రాలు బందీల చుట్టూ అట్టలు అట్టలుగా పేరుకున్న చోటే నిద్రాహారాలతో ప్రయాణమంటే ఎంత జుగుప్సాకారంగా ఉంటుందో చదువుతున్న మనకే కడుపులోని ప్రేగులు నోట్లోకి వచ్చేస్తాయా అని అనిపిస్తుంది . ఒకవేళ బానిస నోరుతెరిచాడో కొరడాతో చర్మం చెమడాలు చెమడాలు కింద వొలిచేవారు. దారిలోనే గాల్లో కలిసిపోయిన ప్రాణాలను సముద్రంలోకి పడేస్తారు. బ్రతికిన వాళ్ళతో ఎలాగోలా తీరానికి చేరుకున్న కుంటాను సంతలో పశువులను కొన్నట్లు ఒక తెల్లదొర వేలంలో కొంటాడు.
నిగ్గరుగా బ్రతుకుతున్న కుంటా చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. దొంగచాటుగా వాటిని పాటిస్తూ అవకాశం చిక్కినప్పుడల్లా పారిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. దొరికిన ప్రతిసారి చావుదెబ్బలు తిన్నా విశ్వ ప్రయత్నాలను మాత్రం ఆపడు. ఒకసారి ఇలానే పారిపోయి దొరకనప్పుడు శిక్షించదలచిన తెల్లవాడు నీ పురుషాగము, కాలి పాదాల్లో ఏదోటి కోరుకో అని అడిగితే తన వంశం తనతోనే అంతమవడం ఇష్టంలేక తన రెండు చేతుల్ని అడ్డు పెట్టుకోడంతో.. చర్మం నుండి, నరాల నుండి, కండలనుండి, ఎముకలనుండి ఒక్కవేటుతో కుడికాలు పాదం తెగి ఎగిరి అవతల పడుతుంది. ఇక విధిలేని పరిస్థితుల్లో అక్కడే నిగ్గరుగా బానిస బతుకు బతుకుతూ తనతోటి మరో నిగ్గరు స్త్రీ భెల్ ని పెళ్లిచేసుకుంటాడు .
కొన్నాళ్లకే వీరికి పుటిన పాపకి కిజ్జీ అని పేరు పెట్టి ఆఫ్రికా సాంప్రదాయాల ప్రకారం పెంచుతాడు. చిన్నప్పటి నుండి తన కథనంతా కిజ్జీ కి చెప్పి నీ ముందుతరాలకు కూడా ఇలానే చెప్పమని కోరతాడు. తవాత కిజ్జీ తన బాధలు, తన తండ్రి బాధలు తన సంతానానికి చెబుతూ రాబోయే తరాలకు కూడా ఇలానే చెప్పాలని చెబుతుంది. ఇక్కడ కిజ్జి కూడా అమ్మా నాన్నలకు దూరమై వేరే దొరదగ్గరకి బానిసగా బ్రతకడానికి అమ్మబడుతుంది. అలా కుంటా కథ తరతారలకు చెప్పబడుతూ ఏడవ తరం వాడైనా రచయిత అలెక్స్ హైలీ కి చేరుతుంది. ఇక్కడినుంచి రచయిత దేశదేశాలు తిరిగి, ఎన్నో గ్రంధాలు, ప్రభుత్వ రికార్డులు పరిశీలించి కుంటా స్వగ్రామమైన జాఫురుకు చేరుకుంటాడు. కందెన నలుపు శరీరం గల తన పూర్వీకులను చూసి తన శరీర వర్ణాన్ని పోల్చుకొని చుస్తే తన వర్ణ సంకరత్వానికి కుమిలిపోతాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది.
తెల్లవాళ్లు నల్లవాళ్ళ స్వేదంతో పంటలు విరగ పండించి లాభాలు ఆర్జించారు! తమ లైంగిక వాంఛను తీర్చుకోవడం కోసం అనేకమంది నల్లవాళ్ళ మహిళలపై ఘోరమైన హత్యాచారాలు చేశారు!! వాళ్లకు పుట్టిన పిల్లలు తమ వారసులని తెలిసికూడా వాళ్ళతో ఊడిగం చేయించారు!! స్వేచ్ఛ కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న సమయంలో లేనిపోని ఆంక్షలను వారిపై రుద్ది, తెల్లవాళ్ళ అనుకూల చట్టాలను తయారు చేసి ఎక్కడికక్కడ వాటిని అణచివేయసాగారు!!!
నాగరికులమని, అభివృద్ధి చెందిన వారమని చెప్పుకొనే అమెరికన్లలో అత్యంత పాశవికమైన చీకటి కోణాన్ని ఈ నవల మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. బానిసలుగా ఆఫ్రికన్లు బ్రతికిన బ్రతుకు, తెల్లవాళ్లు పెట్టిన చిత్రహింసలు, చేసిన హత్యాచారాలు హృదయవిదారకంగా ఉంటాయి. స్వేచ్చావాయువుల్లోనుండి బలవంతంగా బానిస బతుకులోకి ఈర్చబడిన కుంటా మళ్ళీ స్వేచ్చావాయువుల్లోకి వెళ్ళడానికి పడిన తపనని... చదివేకొద్దీ వచ్చే కన్నీళ్లు చుస్తే ఆకాశానికి చిల్లులు పడ్డాయా అని అనిపించకమానదు! ముఖ్యంగా కుంటా ఆఫ్రికాకు దూరమైనా తన భాషా, సంస్కృతీ సాంప్రాదాయాలను, మతాన్ని విడిచిపెట్టడు. తన వంశ చరిత్ర రాబోయే తరాలకు కూడా తెలియాలని తాపత్రులపడుతుంటాడు.
రూట్స్' పేరుతో 1976 లో ప్రచురితమైన ఈ రచన మూడు దశాబ్దాల క్రితం ఏడు తరాలు పేరుతో సహవాసి గారు తెలుగులోకి అనువదించారు.
Download
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
please post Volga to Ganga
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
06-02-2019, 06:50 AM
(This post was last modified: 07-02-2019, 08:10 AM by Rajkumar1. Edited 2 times in total. Edited 2 times in total.)
వోల్గా నుండి గంగకు.....
రచన : రాహుల్ సాంకృత్యుయాన్
ఓల్గా నుంచి గంగకు…
విస్తృత ప్రాతిపదికమీద రచనల్ని మౌలికంగా రెండు విధాలుగా విభజించి చూడవచ్చు. మొదటి రకం కల్పితాలు. రెండవ రకం వాస్తవాలు. ఈ రెండు కలగలసిన రచనలే ఎక్కువ. చారిత్రక రచనల విషయానికి వస్తే ఖచ్చితత్వం పాటించాల్సిన రచనలు
దురదృష్టవశాత్తూ కల్పితాలుగా, కల్లబొల్లి కథనాలుగా పాలక పక్ష బాకాలుగా లభిస్తున్న సందర్భాలే ఎక్కువ. అయితే అలాంటి దౌర్బాగ్యం నుండి విముక్తి కలిగించి మానవ సమాజ పరిణామ క్రమాన్ని ఖచ్చితంగా మన ముందుకు తెచ్చిన పుస్తకం ‘ఓల్గా నుంచి గంగకు’.
రాతి యుగానికి పూర్వం నుంచి మానవుని జీవితం ఎలా సాగుతూ వస్తోందో.. దొరికిన చారిత్రక సాక్ష్యాధారాలను ఆలంబనగా చేసుకుని సాధారణ పాఠకులకు అర్థమయ్యే రీతిలో ఆసక్తి కలిగించే విధంగా మానవ చరిత్రను చెప్పే మహత్తర ప్రక్రియ ఇది.
రాహుల్ సాంకృత్యాయన్!!! అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయిత. బహుభాషా పండితుడు. గొప్ప చరిత్ర కారుడు. స్వాతంత్య్ర సమరయోధుడిగా సుదీర్ఘకాలం కారాగారంలో గడిపిన త్యాగశీలి. ఆయన స్వయంగా అనేక ప్రదేశాలు తిరిగి పరిశోధించి మానవ సమాజ క్రమాన్ని ఒక అద్భుత చరిత్రగా మలచి మన ముందుకు తెచ్చిన పుస్తకం… ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న ”ఓల్గా నుంచి గంగకు”. ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు.
మనిషి ఎప్పుడూ నిలకడగా లేడు. సమాజం కూడా అందుకు అనుగుణంగా మారుతూనే వచ్చింది. ఆ క్రమంలోనే నాయకత్వం మార్పు జరిగింది. లింగ వివక్ష తెరమీదకు వచ్చింది. గుంపుకు నాయకత్వం వహించిన ఆదిమ మహిళ నుండి నేటి ఆధునిక మహిళవరకు సమాజంలో వచ్చిన మార్పులు ఏమిటి?? మాతృస్వామ్య వ్యవస్థ పితృస్వామ్య భావజాలానికి జారిపోయిన క్రమం ఎలాంటిది? ఈ ప్రశ్నలకు సమాధానమే ”ఓల్గా నుంచి గంగకు”.
క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల కాలం నుంచి క్రీస్తు శకం 1942 వరకు జరిగిన కాలంలో ఇండో యూరోపియన్ జాతి మానవ వికాసాన్ని ఆసక్తికరమైన 20 కథలుగా మలిచారు రాహుల్. ఓల్గా తీరపు మంచు ఎడారి నేపధ్యంగా సాగే తొలి కథ ‘నిశి’తో మొదలుపెట్టి పాట్నాలోని గంగా తీరంలో సాగే ”సుమేరుడి” కథ వరకు సాగే ‘ఓల్గా నుంచి గంగ వరకు’లో అన్ని కథలు ఊపిరి బిగపట్టి చదివించేవే.
తొలి కథలో ఆర్యుల సంస్కృతి కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తారు రాహుల్. స్త్రీ కుటుంబ పెద్దగా ఉండడం, ఆమె సారధ్యంలో కుటుంబం యావత్తూ వేటకు వెళ్ళడం, ఆమె తనకు నచ్చిన పురుషుడితో (సోదరుడు, కుమారుడు లేక చుట్టూ ఉన్నవారు) కూడి సంతానాన్ని వృద్ధి చేయడంతో మొదలు పెట్టి, కుటుంబంలో వచ్చిన చీలికలు, సమూహాలు, వాటి మధ్యన ఆధిపత్యపు పోరు, జీవికను వెతుక్కుంటూ సమూ హాలు చేసే మజిలీలు, నెమ్మది నెమ్మదిగా సంస్కృతిలో మార్పులు వచ్చి పురుషుడు కుటుంబ పెద్ద అవ్వడం, వివాహ వ్యవస్థ, స్త్రీ స్థానం తగ్గుతూ పోవడం… ఇవన్నీ మొదటి ఆరు కథల్లో చిత్రించ బడ్డాయి.
ఆర్యులకి, అనార్యులకి మధ్య యుద్ధం జరిగిన క్రమం… ఆ క్రమంలోనే రాజుని తమ చెప్పుచేతల్లో పెట్టుకునే పురోహిత వర్గం బలపడడం, వేదాలు అందుకు చేసిన దోహదం తరువాతి కథల్లో విశదంగా చెప్పబడుతుంది. సమాజంలో అసమానతలకి మతం ఎలా కారణమయ్యిందో చాలా బలంగా చెప్తారు రాహుల్. రాజు-పురోహితుడు-మతం ఈ మూడూ కలిసి సమాజాన్ని ప్రభావితం చేసిన తీరు ఉదాహరణలతో చూపిస్తారు రచయిత.
బౌద్ధ స్థాపన, విస్తరణ, దేశం మీద జరిగిన దండయాత్రలు, అలాగే ఇస్లాం స్థాపన, విస్తరణ, కంపెనీ పాలనలో భారతదేశం, అప్పటి క్రైస్తవ ప్రభావం… ఇవన్నీ కళ్ళకి కట్టినట్లు వర్ణింపబడతాయి.
ఆ తర్వాతి కథల్లో ఈస్టిండియా కంపెనీల కాలంలో జమీందారీలను ఏర్పరచడం, అందువల్ల రైతులకు ఎదురైన ఇబ్బందులు, సామంత రాజుల బలహీనతల్ని ఆంగ్లేయులు సొమ్ము చేసుకోవడం, సిపాయిల తిరుగుబాటు, గాంథీజీ మొదలుపెట్టిన ఉద్యమం, ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించే వర్గం అభిప్రాయాలు… ఇంతవరకు కథలను తీసుకువచ్చి, చివరకు సామ్యవాదం మాత్రమే సమ సమాజాన్ని తీసుకు రాగలదన్న అభిప్రాయంతో ఈ పుస్తకాన్ని ముగించారు రాహుల్ సాంకృత్యాయన్.
ఒక్కొక్క కథ ఒక్కొక్క యుగం నాటి ఆచార వ్యవహారాలను, అలవాట్లను చిత్రిస్తుంది. సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని కథ నడిపించడం కష్టం కాకపోవచ్చు. కానీ వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పటి జీవనశైలి, మనుషుల భావాలు, భావోద్వేగాలు, అలవాట్లు చిత్రించడం చాలా కష్టమైన పని. కానీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ ఆ పని చాలా గొప్పగా చేశారు. అందుకుగాను ఆయన చేసిన పరిశోధన అంతా ఇంతా కాదు. బౌద్ధ భిక్షువుల జీవనశైలిని అక్షర బద్ధం చేయడానికి ఆయన దారి కూడా సరిగా లేని కొండల్లో నడుస్తూ, టిబెట్, కాశ్మీర్, లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో తిరిగి అక్కడ లభ్యమైన పుస్తకాలను కంచర గాడిదలమీద తరలించుకు వచ్చారట. అవి అధ్యయనం చేయడానికి ఆయన టిబెటిన్ భాషను నేర్చుకున్నారు. ప్రపంచంలో యాత్రలను చేయడానికి మించిన గొప్ప పని లేదంటారాయన. యాత్రలంటూ జరగకపోతే మనిషి నాగరికతలో ఇంత పరిణామం జరిగి ఉండేది కాదనీ, సమాజం పశు స్థాయి నుండి మానవ సమాజంగా ఇలా మారి ఉండేది కాదనీ.. అంటారు రాహుల్ సాంకృత్యాయన్.
(రివ్యూ copied)
Download
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
Posts: 714
Threads: 5
Likes Received: 657 in 188 posts
Likes Given: 21
Joined: Nov 2018
Reputation:
91
(06-02-2019, 06:50 AM)Raju Wrote: వోల్గా నుండి గంగకు.....
రచన : రాహుల్ సాంకృత్యుయాన్
Download
ధన్యవాదాలు రాజు గారూ
•
Posts: 3,774
Threads: 7
Likes Received: 19,353 in 1,799 posts
Likes Given: 0
Joined: Oct 2018
Reputation:
449
(06-02-2019, 06:50 AM)Raju Wrote: వోల్గా నుండి గంగకు.....
రచన : రాహుల్ సాంకృత్యుయాన్
Download
Thanks guruu
•
Posts: 2,223
Threads: 149
Likes Received: 7,401 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
రాజు గారు,
మీ కృషి అమోఘం.
విశ్వనాధ సత్యనారాయణ గారు/ అడవి బాపిరాజు గార్లు వ్రాసిన పుస్తకాలేమైనా ఉన్నాయా?
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
విశ్వనాధ సత్యనారాయణ పుస్తకాలు
DOWNLOAD
అడవి బాపిరాజు పుస్తకాలు
DOWNLOAD
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,323 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
వేయిపడగలు
by విశ్వనాధ సత్యనారాయణ
పంతోమ్మిదీ యిరవయ్యో శతాబ్దాల నాటి సంధి చరిత్ర - అన్నారు కొందరు. భారతీయ విజ్ఞాన సర్వస్వము - అన్నారు మఱికొందరు. తెలుగువారి మహాభారతం - అన్నారు యింకొందఱు. నేటి వాతావరణ కాలుష్యాది అనేక దుష్పరిణామాలను ఆనాడే హెచ్చరించిన వైజ్ఞానిక భవిష్యపురాణం -అంటున్నారు యెందఱో. ఎందరైనా ఎన్నైనా అనవచ్చు కానీ... ప్రధానంగా స్త్రీ పురుషుల సంబంధాన్ని సహస్ర ముఖాలుగా చూపించిన అపూర్వ నవలా కావ్యం వేయిపడగలు.
ఈ నవలను 'కవి సామ్రాట్' విశ్వనాధ సత్యనారాయణ ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారు. 1934లో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద వ్రాశాడు. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పోటీ కోసం వ్రాయబడి బహుమతినందుకుంది. 1937-38లలో ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. స్వర్ణోత్సవ సందర్భంగా తిరిగి 1987-88లో ఆంధ్ర పత్రికలోనే ప్రచురించారు.
ఈ నవల విశ్వనాధ స్వీయానుభవాల సారాంశం అని, అందులోని పాత్రలలో ఆయన కుటుంబం మరియు దగ్గరి సమాజం ఛాయలు గోచరిస్తున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అదే విధమైన అభిప్రాయాలను విశ్వనాధ పావనిరావు కూడా 1987లో ఆంధ్ర పత్రిక సీరియల్‌లో item box లలో వెలిబుచ్చారు. అందులోని పాత్రలు, స్థలాల స్వారూప్యం ఇలా చెబుతారు.
దీనిని మాజీ భారత ప్రధాని పి.వి.నరసింహారావు, "సహస్రఫణ్"గా హిందీ లోకి 1968 కాలంలో అనువదించాడు. ఆ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 1995 తరువాత దూరదర్శన్ ద్వారా హిందీలోను, మరికొన్ని భాషలలోను ధారావాహికగా ప్రసారమైంది. 1976 ప్రాంతాలలో డా. చంద్రకాంత్ మెహతా, ప్రొ.మహేంద్ర ధవె దీనిని గుజరాతీభాషలోకి అనువదించారు. ఆర్.వి.ఎస్.సుందరం ఇదే నవలను కన్నడ భాషలోకి అనువదించాడు. 1998 కాలంలో "నూతన" అనే కన్నడ పత్రికలో ధారావాహికగా వచ్చింది. దీనిని ఆంగ్లంలోకి అనువదించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. డా. శ్యామల కల్లూరి గారి అంగ్లానువాదం 'ఆవకాయ.కామ్'లో Thousand Hoods అన్న పేరుతో సాప్తాహిక ధారావాహికగా 2014లో కొన్నాళ్ళపాటు ప్రచురితమైంది.
Download: వేయి పడగలు
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
బుచ్చిబాబు రచన
"ఆమె నీడ "
Download
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
Posts: 1,074
Threads: 8
Likes Received: 555 in 287 posts
Likes Given: 10
Joined: Nov 2018
Reputation:
19
పలు భాషల్లోకి అనువదించబడిన తెలుగు రచన
"అతడు అడవిని జయించాడు "
రచన : Dr . కేశవరెడ్డి
Download
visit my thread for E-books Click Here
All photos I posted.. are collected from net
•
|