Thread Rating:
  • 15 Vote(s) - 3.07 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కధా పూరణం
#21
సంధ్యాక్కా... స్వాగతం.. సుస్వాగతం...
చాలా సంతోషం నువ్ కూడా వచ్చినందుకు... నీకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు .. ఉదాహరణకి గిరీశం గారు, రమేష్ మల్లు గారు,... వారు నీ కథలకు తప్ప వేరే కథల్లో కామెంట్ రాసినట్టు చూడలేదు.. వారికోసమైనా నువ్ రావాలని కొరుకున్నా నేను.. కొందరు నన్ను అడిగారు నీ గురించి... కానీ నీ కాంటాక్ట్ ఏదీ నా దగ్గర లేకుండే... ఏది ఏమైనా నువ్ వచ్చావ్ .. హ్యాపీ...

ఇక నీ కథాపూరణం ఆలోచన చాలా బాగుంది...
నువ్ ఇలా రాస్తాను అంటే నా కథని మధ్యలోనే వదిలేసే దాన్ని... హాయిగా ఇతరుల కథల్ని చదువుకుంటూ ఉంటే... నీ చేతుల్లో అది మరింత బాగా వచ్చేది....
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
లక్ష్మిగారూ మీ మెసేజీలో 'ప్రత్యేక పాఠకులు' అన్న మాట కాస్త బాధించింది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#23
(20-11-2018, 02:36 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ మీ మెసేజీలో 'ప్రత్యేక పాఠకులు' అన్న మాట కాస్త బాధించింది.

అయ్యో నా కామెంట్ లో దురుద్దేశ్యం లేదండీ... సంధ్యక్క మీద వారికి ప్రేమ ఎక్కువ అని మాత్రమే చెప్పాను... ఎవరైనా హర్ట్ అయితే మన్నించ ప్రార్థన..
Like Reply
#24
(20-11-2018, 03:13 PM)Lakshmi Wrote:

లక్ష్మి గారు.... నాకు బాధకలగ లేదు, పైగా సంతోషమే కలిగింది
కారణం ఇన్ని రోజులు నాకో డౌట్ ఉండేది
ఈ స్త్రీ పేర్లు పెట్టుకొన్నవారు నిజంగా స్త్రీలేనా అని
అది ఈ రోజు క్లియర్ అయ్యింది....వామ్మో....
ఎంత అసూయా......వామ్మో... మీరు నిజంగా స్త్రీలే నిసంశయం.
mm గిరీశం
Like Reply
#25
(20-11-2018, 04:30 PM)Okyes? Wrote:

కామెంట్స్ లో ఎవరికి కావలసిన అర్దాలు వారు వెతుకుంటున్నారు  ;) ;) ;) Smile Smile Smile :D :D :D ......!
Like, Comment and Give Rating.
Like Reply
#26
సంధ్య గారు మీ స్టైల్ లొనే వ్రాయండి అదిరిపోతుంది.
Like Reply
#27
(20-11-2018, 04:30 PM)Okyes? Wrote:
(20-11-2018, 03:13 PM)Lakshmi Wrote:
(20-11-2018, 02:36 PM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ మీ మెసేజీలో 'ప్రత్యేక పాఠకులు' అన్న మాట కాస్త బాధించింది.

అయ్యో నా కామెంట్ లో దురుద్దేశ్యం లేదండీ... సంధ్యక్క మీద వారికి  ప్రేమ ఎక్కువ అని మాత్రమే చెప్పాను... ఎవరైనా హర్ట్ అయితే మన్నించ ప్రార్థన..

లక్ష్మి గారు.... నాకు బాధకలగ లేదు, పైగా సంతోషమే కలిగింది
కారణం ఇన్ని రోజులు నాకో డౌట్ ఉండేది
ఈ స్త్రీ పేర్లు పెట్టుకొన్నవారు నిజంగా స్త్రీలేనా అని
అది ఈ రోజు క్లియర్ అయ్యింది....వామ్మో....
ఎంత అసూయా......వామ్మో... మీరు నిజంగా స్త్రీలే నిసంశయం.

అయ్యో మీకిలా అర్థం అయ్యిందా... నాకు అసూయనా... అదీ సంధ్యక్క మీదా... ఎంత మాట అన్నారండీ...
Like Reply
#28
దయచేసి అప్డేట్ వ్రాయండి
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#29
లక్ష్మి చెల్లీ , వికటకవిగారూ , గిరీశంగారూ, రమేష్ మల్లూ

...మిత్రుల మధ్య క్షమార్పణలేంటీ!?... మీరందరూ విసురుతూన్న చెణుకులు పరస్పరాభిమానాన్ని వెదజల్లుతున్నాయ్!

రాకీ , కృష్ , పాఠకమిత్రులూ,

నెక్స్ట్ అప్డేట్ శనివారం ఇస్తాను. మరో రెండు మూడు అప్డేట్స్ వరకూ కొద్ది సవరణలతో ఒరిజనల్ రచయత ( ’ గెడ కఱ్ఱ ’ అనుకుందాం , ప్రస్తుతానికి! ) కధనమే నడుస్తుంది. ఈలోగా నేను ఆ పై కధని నాకు తోచిన విధంగా రాసుకుంటూంటాను.

గిరీశంగారూ , రమేష్ మల్లూ , రాజూ, ఈశ్వర్
కధాశైలిని మార్చమని మీ సూచన!...కానీ మిత్రులు గెడకఱ్ఱగారి కధని చదివిన మీఅందరికీ నాదొక్క మనవి... వారి శైలి నాకు పరిచయమున్న తెలంగాణా జిల్లాల్లో వాడే మాండలికాలకు దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. అందుచేత ఆ శైలినే కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాను.
ఉర్దూ , తెలుగు సమ్మేళన పదాలను విరివిగా వాడుతున్నాను.నా పదప్రయోగం వికృతంగా ఉంటే సవరణలూ, సూచనలూ అందించండి. ఈవిషయంలో కమల్ కిషన్ గార్నీ, అవగాహన ఉన్న మిత్రులందర్నీ సహకరించమని అర్థిస్తున్నాను.

సంధ్య
Like Reply
#30
సంధ్యకిరణ్ గారూ... మీ జాబుకి సంతోషం
మీరు కథని గురించి శైలిని మార్చనక్కరలేదు... గడకర్రగారు వ్రాసిన పద్ధతిలోనే మీ చెణుకులు తగిలిస్తూ కొనసాగించండి. పాఠకమిత్రులకూ అదే నచ్చుతుంది. 
మాండలికం వాడకం కాస్త తేడాగా అన్పించి అడిగామేగానీ మరో విధంగా కాదు. ఏమైనా తేడా వుంటే గిరీశంగారు బహుచక్కగా, నిర్మొహమాటంగా చెప్పేస్తారు... ఇక కమల్ కిషన్ గారు... ఈ సైటులోకి వచ్చారో లేదో...! కృష్ణ అన్న పేరుతో వున్నది అతనేనా..?? అన్నది చిన్న సందేహం. ఆయన కూడా వస్తే సంతోషం ద్విగుణం అవుతుంది.
మీ తదుపరి అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటాం...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#31
సంధ్యా కిరణ్ మామ్ 
చాలారోజుల తరువాత xossip లేని లోటు తీరడంతో పట్టలేని ఆనడం ప్రోది చేసుకుని ఈ విధంగా రచన గా ఆవిష్కృతమైంది.
కథకీ కథనానికి ప్రాధాన్యత ఇవ్వండి. తెలంగాణాలో యాస...., రాష్ట్రం అంతా ఒకేలా ఉండదు.
హైద్రాబాద్లో నవాబుల ఉర్దూ మిక్స్ ఉంటుంది.
ఆదిలాబాద్లో వేరేగా ఉంటుంది.
ఖమ్మంలో గోదావరి జిల్లాల మాండలికంలో ఉంటుంది.
మిడిల్ క్లాస్ కుటుంబాలలో తెలంగాణ యాస అంతర్లీనంగా ఉంటుంది.
భాగ్యనగరంలో ఉర్ధూ మిక్స్ 
ఉదా:| "దవాఖానాకు పోయొస్తున్నావు కొడుకా?"
"అవ్, కాల్లా షీలా గుచ్చుకుంటే....పోయొస్తిని "
ఇది లోయర్ క్లాస్ వాళ్ళ వ్యవహారికం 

"ఆసుపత్రికి పోయింరా?"
 "గోళీలు ఇఛ్చినరూ...మంచిగనే చూసినరు...."
ఇది మిడిల్ క్లాస్.

డాక్టర్ కాడికా ?
టాబ్లెట్స్ ఇచ్చినరు.,  బాగున్నది 

ఇది అప్పర్ మిడిల్ క్లాస్ 

Rolleyes Rolleyes Rolleyes
Like Reply
#32
అనుకున్నదే నిజమైనది... సంతోషం

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#33
సంధ్యాక్కా... ఈ కథలోని శైలి తెలంగాణా కాదు.. అది mixed గా ఉంది.. ఆకదక్కడా రాయలసీమ యాసలా ఉంది... తెలంగాణా పదాలు కూడా సహజంగా లేవు... చదవడానికి ఇబ్బందిగా ఉంది.. ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంది... ఆలస్యమైనా సరే నీ శైలిలోనే కథను అందించు...
Like Reply
#34
సంధ్యక్కాఆలస్యంగా చూసాను...
మీ శైలి లో ఏ మార్పూ లేదు..
మీ కథల్ని మళ్లీ చదవడం సంతోషాదాయకం...
ధన్యవాదాలు.
@ సంజయ సంతోషం @
Like Reply
#35
ఎందుకండీ ఊరుకోకుండా తెలంగాణాని టచ్ చేస్తారు?

చూడండి; ఎన్ని గొంతుకలు గళం విప్పాయో?!
Like Reply
#36
ఇప్పుడింక చేసేదేముందిలెండి... తుతుంబ్రీ కబుర్లు చెప్పటం తప్ప!!!

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#37
కృష్ణగారూ,

ఉపయుక్తమైన సూచన అందించినందుకు ధన్యవాదాలు. చాలావరకూ నాకు అనుభవంలోకొచ్చినవీ అవే!.. తప్పక అమలు చేస్తాను.

ఈశ్వర్ , లక్ష్మి చెల్లీ , సంజయ్ , వికటకవి గారూ, గిరీశం గారూ, పాఠక మిత్రులూ,

వేర్వేరు సూచనలతో మీరందరూ గళాలు విప్పారంటే ,కొత్తగా ఏర్పడిన సైట్ పట్లా, దాంట్లోని తెలుగు రచయతల పట్ల అభిమానం, సుహృద్భావం లతోనేనని నేను భావిస్తాను. అనవసరంగా శ్రమని నెత్తినెట్టుకుంటున్నాననే ఆవేదనతోనేనని అనుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో శైలికి అవసరమైన మార్పులూ చేర్పులూ చేస్తూ కధని పూర్తి చేస్తాను.

సంధ్య
Like Reply
#38
(22-11-2018, 09:51 PM)sandhyakiran Wrote: కృష్ణగారూ,

ఉపయుక్తమైన  సూచన అందించినందుకు ధన్యవాదాలు. చాలావరకూ నాకు అనుభవంలోకొచ్చినవీ అవే!.. తప్పక అమలు చేస్తాను.

ఈశ్వర్ , లక్ష్మి చెల్లీ ,  సంజయ్ , వికటకవి గారూ, గిరీశం గారూ, పాఠక మిత్రులూ,

వేర్వేరు సూచనలతో మీరందరూ గళాలు విప్పారంటే ,కొత్తగా ఏర్పడిన సైట్ పట్లా, దాంట్లోని తెలుగు రచయతల పట్ల అభిమానం, సుహృద్భావం లతోనేనని నేను భావిస్తాను. అనవసరంగా శ్రమని నెత్తినెట్టుకుంటున్నాననే ఆవేదనతోనేనని అనుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో  శైలికి అవసరమైన మార్పులూ చేర్పులూ చేస్తూ కధని పూర్తి చేస్తాను.

సంధ్య

మీరు చాలా సెన్సిటివ్ అనుకుంటా...

పాత్రల మధ్య సంభాషణని మాత్రం మాండలికంలో వ్రాయండి. 
కథనాన్ని; screenplay ని మాత్రం మామూలుగా వ్రాయండి అప్పుడు సులువవుతుంది.
Like Reply
#39
సంధ్యాకిరణ్ గారూ... మీరెలా వ్రాసినా నేను చదివేస్తాను. నాకు ముందు తెలిసేడిస్తే కదా...
నాకైతే ఏ యాస పెద్దగా తెల్వదు... అందుకే, కోనసీమలో కథ నడిపిస్తున్నా గోదారి యాసని అస్సలు వ్రాయలేకపోతున్నాను. కానీ, తెలంగాణా, రాయలసీమ ఇలాంటి మాండలికాలు వ్రాయటానికి రైటర్స్ పడుతున్న తపన(యాతన) చూస్తే చాలా ముచ్చటేస్తోంది. లక్ష్మిగారు ఇదివరలో చెప్పినట్లు — రాని యాస కోసం ప్రాకులాడి అభాసుపాలవటం కన్నా దాని ఊసెత్తకపోవటమే మేలు. కానీ, ఒక్కసారి దిగాక మాత్రం లోతుపాతులను ఎంచుకుంటు ముందుకు సాగిపోవటం మరీ మంచిది.
(కమల్) కృష్ణుడు చక్కగా అన్నాడు — మాటల్లో మాండలికాలు వాడి నేపధ్యంలో మామూలుగా వ్రాయమని. ఇది చాలావరకు బరువుని తగ్గిస్తుందని నాకూ అన్పిస్తోంది.
మీ తరవాత అప్డేట్ కోసం ఎదురుచూస్తూ....

పాఠకుడు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#40
సంద్యాకిరణ్ దొరసాని........ ఈ యాసల సుద్ది ఇడ్సిపెట్టుండ్రి...‌‌ మీనజర్ కథ రాసుడు మీన పెట్టుండ్రి........‌‌ గీ పోరగాండ్లు మస్త్ దమ్ చేస్తరు .....ఒ అక్క గట్ల రాయ్ ఓ అక్క గిట్ల రాయ్ అంటని.... నివ్వేమ్ పరశాన్ కాకు
నీ సమజ్ ల ఎట్ల వస్తె అట్ల రాసుకుంట పో
సప్పట్లు కొట్టనీకె ఆల్లే ఒస్తరు.....నీ ఇస్టైల్ గసొంటిది .......
mm గిరీశం
Like Reply

Users browsing this thread: 8 Guest(s)