Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 11
చదువుతుంటే భావావేశంతో కనులు చెమరిస్తున్నాయి, ఆ లోకము, ఆ దృశ్యాలను వూహించుకుంటుంటే ఇది, ఇలాంటిది సాద్యమేనా అనిపిస్తుంది, మాక్కూడా ఆ సిద్ధపురుషుడిలాంటి మార్గ దర్శకులు కావాలి. బావుంది..కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(26-06-2024, 01:57 PM)k3vv3 Wrote: అనిరుద్ధుడు మళ్ళీ లేచి నిలబడి అభిజిత్ ఉన్న చోటికి నడుచుకుంటూ వచ్చి అభిజిత్ కళ్ళల్లోకి సూటిగా చూసి నవ్వుతూ, "అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపెనీ ఉయ్యాల
K3vv3 garu! Story is  moving on nicely. Very good update!!!

yourock yourock clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
ఘోర కలి అరాచకాలు  - 3
కపాలిని దేవి సాక్షాత్కారం - ఘోర కలి కామరూపధారిగా మారుట
 
ఘోర కలి కపాలిని దేవి ఆలయంలో అయితే ఉన్నాడు కానీ, తన మనసంతా వేదనకు గురి అయ్యి పసిపిల్లల రోదనలతో నిండి ఉంది. చుట్టూ చూస్తున్నాడు కానీ ఏడుపులు ఎక్కడి నుండి వస్తున్నాయో కనిపించట్లేదు. చిమ్మ చీకటి ఒక పక్క, ఆర్తనాదాలు మరో పక్క ఘోర కలిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
 
అంతలో  సురా కపాలిని దేవి ఆలయంలోకి ప్రవేశించాడు. ఘోర కలి భుజం తట్టాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసాడు. ఎదురుగా  సురా. చీకటి వీడిపోయింది. ఏడుపు ఆగిపోయింది. అంతవరకూ తనకు కనిపించనివి కూడా ఇప్పుడు కళ్ళముందున్నాయి. ఘోర కలి ఆశ్చర్యపోయాడు.
 
సురా,"ఏమైందన్నా? అలా భయపడ్డావు? ఇక్కడికి నేను కాక ఇంకెవరొస్తారు?" అని అడిగాడు.
 
"నువ్వొచ్చే దాకా ఇక్కడ వెలుతురు లేదురా. దారంతా చీకటి. కటిక చీకటి. నేనిక్కడికి ఎలా రాగలిగానో కూడా అర్థం కాలేదు. ఒకటే ఏడుపులు వినిపించాయి. పసిపిల్లల ఏడుపులు. నా జీవితంలో అంత మంది ఏడుపులు ఒకేసారి వినటం ఎప్పుడూ జరగలేదు. కంట నీరు తిరిగింది", అన్నాడు ఘోర కలి.
 
సురా విస్తుపోయాడు.
 
"అన్నా....నాకు అల్లంత దూరం నుండి చూస్తే నువ్వు  కాళీ....కపాలిని...శూలిని...జగజ్జనని అంటున్నట్టు కనిపించింది. ఏదో పెద్ద వెలుగు నీ ముందు ఉండాదంట. దాన్ని చూస్తూ మైమరచిపోయి నువ్వు ఇట్టా అంటున్నావంట. అది కనబడే పరిగెత్తుకుంటూ నీ దగ్గరికొచ్చాను. ఇప్పుడేమో నువ్వు చీకటి అంటున్నావ్. నాకేం అర్థం కావట్లేదు"
 
ఘోర కలికి అక్కడేం జరుగుతోందో అర్థం కావట్లేదు. కపాలిని దేవి పరీక్షిస్తోందని అర్థం అయ్యింది.
 
తన రెండు మోకాళ్ళ మీద నిలబడి నలుదిక్కులా కపాలిని దేవి కోసం వెతికే వేదనాభరితమైన కళ్ళతో ఇలా ప్రార్థించటం మొదలు పెట్టాడు.
" కాళీ.....
 కపాలిని.....
శూలిని.....
జగజ్జనని 
ఎందుకమ్మా నా కళ్ళల్లో చీకట్లు నింపావు? నేనేం పాపం చేసాను?
 
ఎన్ని జన్మలకు నాకీ శిక్ష? మరెన్ని జన్మలు నాకీ నిరీక్షణ?
నేను అంటరాని వాడినా? నరరూప రాక్షసుడినా?
ఎంతో మంది పసిపిల్లలను భూమ్మీదకు రానివ్వకుండా చేసే ఎందరో పుణ్య దంపతులకంటే క్రూరుడను కాను కదా?
నాకు నువ్వు వినిపించిన ఆర్తనాదాలతో నా బాల్యాన్ని గుర్తుకు చేసి ఏడిపించావు తల్లీ.....
 
నేను పుట్టినప్పుడు అక్కడెవరూ లేరంట ! నేనొక్కడినే గ్రామంలో బ్రతికానంట ! నా కోసం ఒక గ్రామం చనిపోయిందంట ! నన్నందరూ భయపడుతూనే చూసేవారు తల్లీ !
 
ప్రేమకు నోచుకోని జన్మలు ఇప్పటికి ఆరు ఇచ్చావు. నాకు ఏడో జన్మ లేదంట. నా బతుకు పాతాళలోకంలోనే సమాధి అంట. అసలు జన్మంటూ లేని నా బ్రతుక్కి ఏడో జన్మనిచ్చింది నా ప్రాణానికి ప్రాణమైన సురా !
సురా....సురా.....సురా
 
ఎంత గొప్ప మిత్రుడైనా మహా అయితే ప్రాణ త్యాగం చేస్తాడేమో...కానీ సురా నన్ను పాతాళలోకం నుండి విముక్తిడిని చెయ్యటానికి తన కర్మ త్యాగం చేసి నాతో భూమి మీదకి వచ్చాడు.
 
అలాంటి సూరాకు నువ్వు కనిపించావంట. నాకు కనపడవేం తల్లీ ?
 
కపాలిని దేవి ఆలయంలో నువ్వున్నావన్న ఆశ కల్పించు.....నీ అఖండ జ్యోతిలోని చిన్న వెలుగు రేఖను ఇటుగా పంపించు......నా ఏడో జన్మను సార్థకం చేసే నీ దర్శనం కలిగించు......ప్రపంచాన్ని పట్టి పీడించే అన్ని జాడ్యాలనూ వదిలించే ఘోర కలిని ఆశీర్వదించు.....
 
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను పూజించిన మాతృమూర్తివి నీవే తల్లీ.....
కాళీ 
కపాలిని 
శూలిని 
 జగజ్జనని
ఘోర కలిగా కాదమ్మా.....ఇక్కడికి నీ బిడ్డగా వచ్చాను
 
నన్నీ ప్రపంచానికి రాజునైనా చెయ్యి......లేదా నా బూడిదెతో పుడమి మీద నిప్పు రాజుకునేలా చెయ్యి
నువ్వేం చేసినా సరే....నీ ఆనకే కట్టుబడి ఉంటా
 
 కాళీ....కపాలిని.....శూలిని....జగజ్జనని 
అంటూ ఘోర కలి అలా అమ్మను పిలుస్తూనే ఉన్నాడు. కన్నీరు మున్నీరవుతూనే ఉన్నాడు.
 
తన మాటలే అమ్మకు మంత్రాలనుకుంటున్నాడు. అలా మాట్లాడుతూనే ఉన్నాడు.
 
తన కన్నీళ్లే అమ్మకు అభిషేకం అనుకుంటున్నాడు. అలా కన్నీరాభిషేకం చేస్తున్నాడు.
 
కాలానికే జాలి కలిగిందేమో అమ్మ జాడ కనిపించింది. అయినా మహాకాలుడు రుద్రుడే కదా. ఆయనే అమ్మను వెళ్ళమన్నాడేమో.
 
ఘోర కలి నిరీక్షణ ఫలించింది. ఆదమరచి పడి ఉన్న ఘోర కలిని చూస్తూ కపాలిని దేవి రాల్చిన ఒక కన్నీటి చుక్క ఘోర కలి చెక్కిలి పై పడింది.
 
కళ్ళు తెరిచిన ఘోర కలి, "అమ్మా నీ అశ్రువు నా చెంపను తాకింది తల్లీ ! చాలమ్మా ఇది చాలు ఏడో జన్మలో నేనెలా చచ్చినా పరవాలేదు. ఒక్క సంఘటన తలుచుకుంటూ బ్రతికేస్తాను"
 
"నువ్వు కోరుకునే ప్రపంచాధిపత్యం మహాప్రళయ సంగ్రామానికి దారి తీస్తుంది. చూస్తూ చూస్తూ నీకు అలాంటి ఆధిపత్యాన్ని కట్టబెట్టమంటావా !
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
నా స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావురా? ఒక అమ్మలా ఆలోచించి చెప్పు", అని బాధపడుతూ అంది కపాలిని దేవి.
 
"బిడ్డ ఏది కోరినా అమ్మ అది తీర్చాలి. అది అమ్మ బాధ్యత. మంచైనా చెడైనా దాని పాపపుణ్యాలతో అమ్మకు సంబంధం లేదు. ఇదే సృష్టి ధర్మం", అని నిర్మొహమాటంగా చెప్పేసాడు ఘోర కలి.
 
"బిడ్డ కోరాడు కదా అని చెప్పి ప్రపంచం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా?" అని అడిగింది కపాలిని దేవి.
 
"ఊరుకోవాలి", అన్నాడు ఘోర కలి.
 
"ఏమిటి దానర్థం?" అని కోపంగా చూస్తూ అడిగింది కపాలిని దేవి.
 
"ఇదంతా నీ సృష్టే తల్లీ! నువ్వు అందరికీ అమ్మవు. నేను అడిగింది నీకు నచ్చలేదు కాబట్టి అదివ్వను అంటున్నావ్. అంటే నీకు నచ్చినవే బిడ్డలు అడగాలా? వారి ఇష్టాయిష్టాలు వారికుండవా? చెప్పు తల్లీ ", అని బాధపడుతూ అడిగాడు ఘోర కలి.
 
"ఇష్టపడిన ప్రతిదీ ఇస్తూ పోతే అది వినాశనానికి దారి తీస్తుంది. కాదంటావా?" అని అడిగింది కపాలిని దేవి.
 
"నీ సృష్టి పట్ల నీకే అంతటి మోహం ఉంటే ఇక అల్ప జీవులం మాకెంత మోహం ఉంటుంది తల్లీ", అని తన సందేహాన్ని బయటపెట్టాడు ఘోర కలి.
 
"నాది మోహం కాదురా", అంటూనే,"సరే నీకు నచ్చినట్టే చెయ్యి. కానీ ఒక షరతు", అంది కపాలిని దేవి.
 
"అదేంటో విన్నవించు తల్లీ", అంటూ రెండు కళ్ళూ పెద్దవి చేసి అమ్మ వైపు ఆశగా చూస్తున్నాడు ఘోర కలి.
 
"ప్రతి రోజూ సాయంసంధ్యా సమయంలో 10 ఘడియలు నిరంతరాయంగా నా నామావళి జపిస్తేనే నీకీ ప్రపంచం పైన ఆధిపత్యం నిరవధికంగా కొనసాగుతూ ఉంటుంది. అలా జరగని మరుసటి రోజే నీ చరమాంకం. ఇదే నా ఆన" అనేసి అంతర్ధానం అయ్యింది.
 
అక్కడి నుండి పది యోజనాల దూరంలో ఉన్న గుహలో కపాలిని దేవి అమ్మవారి నామావళి రాతిగోడలపై వెలుగుతూ కనిపిస్తుంది. ప్రతీ నామం చివర నమః అని మాత్రం ఉండదు. కపాలిని దేవి వినూత్నమైన పేర్లు మాత్రమే కనిపిస్తాయి. వాటినే అక్షర దోషం లేకుండా జపించాలి. ఒక్క సారి నోరారా ప్రతి నామాన్ని పఠిస్తే స్మృతిలో అవే గుర్తుండిపోతాయని అక్కడ రాసి ఉన్నది.
 
అక్కడే యంత్రం ఉన్నది. అందుకు కావలసిన తంత్రాన్ని అందించేందుకు ఒక వృద్ధ యోగి ఘోర కలిని, సురాని చూస్తూ అక్కడే ఉన్న చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు.
 
ఘోర కలి కపాలిని దేవి నామావళి మొత్తం పఠించాడు. ప్రతీ నామం ఇప్పుడు తేనె  కంటే మధురంగా అనిపిస్తోంది. గుహ నుండి బయటకు రాగానే మొహములో తేజస్సు రెట్టింపు అయ్యింది. వృద్ధ యోగి కూడా కన్నార్పకుండా ఘోర కలినే చూస్తూ ఉన్నాడు.
 
తంత్రం ఘోర కలి మననం చేస్తూ ఉంటాడు. యంత్రాన్ని మాత్రం సురా ఇక్కడి నుండి తీసుకెళ్లి ఎదురుచూస్తోన్న వైద్య బృందం వద్దకు తీసుకెళతాడు.
 
ఘోర కలి తంత్రం, సురా యంత్రం, వైద్య బృందం శాస్త్రం మూడూ ఒకేసారి పని చేసి పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది బోర్డు డైరెక్టర్ లనూ ఘోర కలి రూపంలోకి మార్చేస్తాయి. ఘోర కలిని ప్రపంచానికి రారాజును చేస్తాయి. ఇప్పుడు ఘోర కలి  కామరూపధారి కూడా అవుతాడు. అంటే తను కోరుకున్న రూపంలోకి మారగలిగే విద్యను కూడా కలిగినవాడని అర్థం.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
Super excellent update
[+] 1 user Likes sri7869's post
Like Reply
(09-07-2024, 04:08 PM)k3vv3 Wrote: ఇప్పుడు ఘోర కలి  కామరూపధారి కూడా అవుతాడు. అంటే తను కోరుకున్న రూపంలోకి మారగలిగే విద్యను కూడా కలిగినవాడని అర్థం.

Very good update, K3vv3 garu!!! Let us see how Ghorakali will be stopped.!!!

yourock yourock yourock
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
మాటలే మంత్రాలు, ఆశ్రువులే అభిషేక ధారలు..బాగా చెప్పారండి clps ...కానీ అప్డేట్ నిడివి సరిపోలేదు Big Grin ....కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
శంభల రాజ్యం – 3
జటిల
 
రుద్రసముద్భవ ఆధ్వర్యంలో అభిజిత్, అంకిత, సంజయ్ లు శంభల రాజ్యంలోని ప్రాకారాలన్నీ తిరిగి యుద్ధ విద్యా నైపుణ్యాన్ని, వ్యూహాలను, అస్త్ర విద్యలను నేర్చుకునేందుకు పయనమయ్యారు. సిద్ధపురుషుడు మాత్రం శంభల రాజ్యంలో ఇచ్చిన అతిథి గృహంలోనే ఉండిపోయాడు. ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
 
ప్రయాణంలో మొదటిగా వారికి స్వాగతం పలికింది ' జటిల'.
" జటిల శంభల రాజ్యంలోని మహా మహా యోధులకు కూడా అంతుచిక్కని ప్రాకారం. ఇక్కడ క్షణానైనా సింహాలతో తలపడవలసి రావొచ్చు. సింహానికి స్నేహితుడివి అయ్యావంటే మాత్రం అవే దగ్గరుండి మరీ ఎన్నో కఠినమైన విద్యలను నేర్పిస్తాయి. శంభల రాజ్యంలోని ప్రతీ యోధుడూ జటిల పేరు చెబితే చాలు వణికిపోవటానికి కారణం ఇదే. ఇక్కడి సింహాలు భూలోకంలో కనిపించే క్రూర సింహాలు కావు. ఎంతో రాజసం కలిగినవి. ఒక యోధుడిని ఇట్టే కనిపెట్టేస్తాయవి. ఎన్ని విద్యలొచ్చినా సరే జటిలలోని సింహాలు అంగీకారం తెలిపితేనే వ్యక్తి పరిపూర్ణమైన యోధుడి కింద లెక్క", అంటూ చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.
 
"ఏంటి? సింహాలతో ఫైట్ చెయ్యాలా?" అంటూ నీళ్లు నమిలాడు అభిజిత్.
 
"మరి అనిరుద్ధుడి సంస్థానంలో ప్రాణాలకు తెలిగించి అయినా సరే ఘోర కలితో పోరాడతాను అని శపథం చేసొచ్చావు కదా", అని గుర్తుచేశాడు సంజయ్.
 
"మన చేతిలో ఏం లేదు, అభిజిత్. ఫైట్ చెయ్యాల్సిందే", అంటూ భయం నటిస్తూ అంది అంకిత.
 
"తప్పదా?" భయంగా అడిగాడు అభిజిత్.
 
"అసలు ఇక్కడ ప్రొసీజర్ ఏంటి సర్? యోధుడిని సింహాలు బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటాయి ?" అని రుద్రసముద్భవను అడిగాడు అభిజిత్.
 
"యోధుడిని అవే ఎంచుకుంటాయి. అందుకోసం అవి పెట్టుకునే ప్రమాణాలేంటో మాకు కూడా తెలియదు. జటిలలోని అతిపెద్ద రహస్యం అది. ఇక్కడ మొత్తం 8 సింహాలుంటాయి. ఇంతవరకు నేను 5 సింహాలను ఒకేసారి చూసాను. నీ అదృష్టం బావుంటే 8 సింహాలనూ చూస్తావేమో", అంటూ నవ్వుతూ చెప్పాడు రుద్రసముద్భవ.
 
అభిజిత్ షాక్ తిన్నాడు.
 
జటిల చూడటానికి ప్రాకారంలా ఉండదు. ఎండు గడ్డి మొలిచిన నేలపై దూరం నుండి సూర్యుని కాంతితో ఎదురుగా ఎనిమిది పర్వత శ్రేణులతో మధ్యలో మూసి వున్న ఒక సింహ ద్వారంతో కళ్ళకు గంభీరంగా ఉంటుంది.
 
" మధ్యలో ఉన్న పెద్ద డోర్ మూసేసి ఉందేంటి?" అని అభిజిత్ రుద్రసముద్భవను అడిగాడు.
 
"జటిలలో జయించిన పిమ్మట ద్వారం తెరుచుకుంటుంది", అన్నాడు రుద్రసముద్భవ.
 
"లేనిచో?" అని భయపడుతూ అడిగాడు అభిజిత్.
 
"శంభలలో లేనిచో, కానిచో అను పదాలకు చోటు లేదు అభిజిత్. జటిలలో నీ ఆగమనమే నీ విజయానికి సంకేతం", అనేశాడు రుద్రసముద్భవ.
 
"ఇలాంటి సమయంలో సిద్ధపురుషుడు పక్కనే ఉండుంటే ఎంత బావుణ్ణు", అని మనసులో అభిజిత్ అనుకున్నాడో లేదో ప్రత్యక్షం అయ్యాడు ఆయన.
 
"స్వామీ!" అని ఆశ్చర్యపోతూ, "ఇప్పుడు నేనేం చెయ్యాలి?" అని అడిగాడు.
 
"జటిల నీ సాహసానికి, నీ లోని పరాక్రమానికి అంతిమ పరీక్ష. కొన్ని ఘడియల తరువాత ఇక్కడ 5 సార్లు గంటలు మోగుతాయి. 5 గంట మోగిన మరుక్షణమే సింహాలు కదిలి వస్తాయి. నువ్వు నిజమైన యోధుడివైతే 8 సింహాలొస్తాయి. అవి నిన్ను ఆటపట్టిస్తాయి. వాటితో పాటు తీసుకెళతాయి. అవి వచ్చే వరకే నీలోని సంశయాలు, భయాలు. ఒక్కసారి వాటిని చూసాక నీ ధైర్యం వెయ్యి రెట్లు పెరుగుతుంది. నీ మనోబలం నీకు తెలుస్తుంది. అక్కడ  కనిపించే ఎనిమిది పర్వత శ్రేణులలో నీకు సింహాలు పరాక్రమాన్ని పరిచయం చేస్తాయి. ఎంతో  కఠినమైన శిక్షణ లభిస్తుంది. అది పూర్తి చేసిన పిమ్మట ఎదురుగా కనబడే సింహద్వారం తెరుచుకుంటుంది. తలుపులు తెరుచుకున్నాయంటే నువ్వు జటిలను దాటినట్టే. విజయోస్తు", అని చెప్పి సిద్ధపురుషుడు అదృశ్యమైపోయాడు.
 
సూర్యుని మేలిమి కాంతి ఎక్కువయింది. ఎండు గడ్డి మీద బంగారు కిరణాలు పడుతూ ఆకాశం బంగారు వర్ణంలో ఉండగా ఎదురుగా ఉన్న పర్వతాల నుండి గంటలు మోగుతున్నాయి.
 
మొదటి గంట మోగింది.
 
సింహం గర్జన వినబడింది. సింహం పరుగు కళ్ళకు కట్టినట్టుగా అంత దూరం నుండే కనిపిస్తోంది. పరుగులో ఉన్న శక్తికి మనలోని దుర్గుణాలు ఎగిరిపోతాయి. గర్జన చెవిన పడంగానే మనలోని సంశయాలు తొలగిపోతాయి. ధైర్యం హుంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సింహం అంత దూరం నుండే అభిజిత్ ని మాత్రమే చూస్తూ వస్తోంది. అభిజిత్ కూడా సింహాన్నే చూస్తున్నాడు. కళ్ళల్లో ఎక్కడా క్రూరత్వం లేదు. రాజసం అణువణువునా నిండిన దైవీ శక్తి గల పార్వతీ దేవి వాహనంలా అనిపించింది. సింహం అభిజిత్ ని సమీపించగానే సంజయ్, అంకిత కాస్త టెన్షన్ పడ్డారు. రుద్రసముద్భవ సైగ చేసి వాళ్ళను వారించాడు. అభిజిత్ సింహాన్నే చూస్తున్నాడు. సింహం అభిజిత్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తోంది.
 
అభిజిత్ చుట్టూ తిరుగుతూ సింహం చూస్తోంది. అభిజిత్ మాత్రం బెదరలేదు. సింహం కాసేపు ఆగి ఒక్క ఉదుటున అభిజిత్ పైకి ఎగిరింది. అభిజిత్ వెంటనే తనకు బాగా తెలిసినవాడిలా సింహపు గోర్లు తనకు తగలకుండా సింహం మెడను పట్టుకుని తన తలను సింహం నుదుటికి తాకిస్తూ జూలు పట్టుకున్నాడు. వెంటనే సింహం పట్టు విడిపించుకుని ముందుకెళ్లి గట్టిగా హుంకరించింది.
 
అవన్నీ అభిజిత్ ని చుట్టుముట్టగా మొదటి సింహం మాత్రం ముందుకు పరిగెడుతూ అభిజిత్ కు దారి తెలిసేలా పర్వత శ్రేణుల వైపుగా వెళుతోంది. అభిజిత్ దాన్నే అనుసరిస్తూ వెళుతున్నాడు. అభిజిత్ ను అనుసరిస్తూ ఏడు సింహాలు వెళుతున్నాయి. అభిజిత్ పర్వత శ్రేణులను చేరుకోగానే రెండో గంట ఆగిపోయింది.
 
దూరంగా కనబడుతున్న సంజయ్, అంకిత లకు చేత్తో సైగ చేసాడు. వాళ్ళు కూడా తిరిగి చేతులు ఊపుతూ  సైగ చేశారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply
 
" అభిజిత్ ఏంటో మనకు అర్థం కాడు", అన్నాడు సంజయ్
"యా. ఇంతకు ముందు వరకూ భయపడుతూ ఉన్నాడు.
అంతలోనే ఇలా...", ఆశ్చర్యపోతూ,"అస్సలు అర్థం కాడు" అంది అంకిత.
 
"అభిజిత్ ఒక జన్మలో శంభల యోధుడు", అన్నాడు రుద్రసముద్భవ.
 
"అందుకే పరాక్రమం గురించి అనిరుద్ధుడు మాట్లాడగానే అభిజిత్ మాత్రమే తీవ్రంగా స్పందించాడు. అభిజిత్ గురించి అనిరుద్ధుడికి మొత్తం తెలుసు. ఆయన గురించి మీకు ముందు ముందు ఎన్నో విషయాలు తెలుస్తాయి", అంటూ నవ్వుతూ చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
Super excellent update
[+] 1 user Likes sri7869's post
Like Reply
(27-07-2024, 12:51 PM)k3vv3 Wrote:  
" అభిజిత్ ఏంటో మనకు అర్థం కాడు", అన్నాడు సంజయ్
"యా. ఇంతకు ముందు వరకూ భయపడుతూ ఉన్నాడు.
అంతలోనే ఇలా...", ఆశ్చర్యపోతూ,"అస్సలు అర్థం కాడు" అంది అంకిత.
 
"అభిజిత్ ఒక జన్మలో శంభల యోధుడు", అన్నాడు రుద్రసముద్భవ.
 
"అందుకే పరాక్రమం గురించి అనిరుద్ధుడు మాట్లాడగానే అభిజిత్ మాత్రమే తీవ్రంగా స్పందించాడు. అభిజిత్ గురించి అనిరుద్ధుడికి మొత్తం తెలుసు. ఆయన గురించి మీకు ముందు ముందు ఎన్నో విషయాలు తెలుస్తాయి", అంటూ నవ్వుతూ చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.

K3vv3 garu!!! Very good story and update(s).


yourock yourock yourock
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
అప్డేట్ బావుందండి, ఇంకాస్త కూడా వుంటే బావున్ను అనిపించింది
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
super brother update
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
ఘోర కలి అరాచకాలు  - 4
సింహం రక్తం తాగే ఘోర కలి
 
సురా యంత్రాన్ని తీసుకుని చీకటి రాజ్యానికి చేరుకున్నాడు. వైద్య బృందం సురా తెచ్చే యంత్రం కోసం ఎదురు చూస్తోంది. సురా యంత్రాన్ని అందివ్వగానే ఒక 10 ఘడియల తరువాత శస్త్రచికిత్స మొదలు పెట్టారు. పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది జీకే కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ లనూ పూర్తిగా ఘోర కలి రూపంలోకి మార్చేశారు. సురా చీకటి రాజ్యం బయటే ఘోర కలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
 
అంతలో ఘోర కలి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, వికృతమైన నాట్యం చేస్తూ వస్తున్నాడు. ప్రపంచానికి అప్పుడే రారాజునైపోయాననే గర్వం కళ్ళల్లో ఉప్పొంగుతోంది. సురా మిత్రుడు కాబట్టి తేలికగానే పసిగట్టాడు.
 
చీకటి రాజ్యం చేరుకోగానే ఘోర కలి సురాను కౌగిలించుకుంటూ, "సురా నాకిప్పుడు సింహం రక్తం తాగాలని ఉంది రా ", అన్నాడు.
 
సురా, "సింహం రక్తం ఎందుకన్నా?" అన్నాడు ఏమీ పాలుపోక.
 
"సింహం తన వేటకు చిక్కిన జంతువు రక్తం తాగటం వల్లే అంత బలంతో ఉంటుంది సురా. అలాంటి సింహం రక్తమే నేను తాగితే ఎలా ఉంటుందా అన్న అద్భుతమైన ఆలోచన తట్టింది రా. ఏమంటావు సురా?" అడిగాడు ఘోర కలి.
 
"అన్నా అడవికి సింహం రారాజు. ఇందాక మనం కపాలిని దేవి ఆలయంలో సూసినాం కదా. అమ్మోరు సింహం మీదనే ఉండాది. అట్టాంటి సింహంతో మనకు వైరము దేనికి అన్నా? ఆలోచించు", అన్నాడు సురా.
 
"రేయ్ సురా, నేను నేరుగా పోయి సింహాన్ని చంపుతానా ఏంది? భలే ఉండావే! సింహంలా మారి సింహాన్ని చంపి ఘోర కలిగా రక్తాన్ని తాగుతా. ఇప్పుడు నేను కామరూపధారిని కదరా", అన్నాడు ఘోర కలి ఆనందం పట్టలేనివాడిగా.
 
"నీకిచ్చిన శక్తిని పరీక్షించుకుంటాను అంటావ్. అంతేనా?" అడిగాడు సురా.
 
"అది రా సురా. ఇప్పుడర్థం అయ్యిండాది నా మనసు", అన్నాడు ఘోర కలి.
 
"అయినా సింహం రక్తం తాగితే ఏమొస్తుందన్నా?" ఆశ్చర్యపోతూ అడిగాడు ఘోర కలి.
 
"సింహం అంటే నాకు పడదురా. ఒక జన్మలో సింహంతో పోరుకు వెళ్ళా. సింహం చేతిలో చనిపోయా. సింహం దెబ్బ ఇప్పటికీ నన్ను దెబ్బతీస్తూనే ఉందిరా.....దాన్ని నా చేతులతో చంపాలి. దాని రక్తం తాగి దానికంటే గొప్ప రారాజును నేనేనని దాని శవం ముందు చిందెయ్యాలి. కామరూపధారిగా నాకొచ్చిన శక్తితోనే అది సాధ్యంరా సురా. ఏమంటావ్?" అన్నాడు ఘోర కలి సూటిగా సురా కళ్ళల్లోకి చూస్తూ.
 
తన మిత్రుడు తనలా మారిపోయిన పదిహేనుమందినీ చూడటానికి ఉత్సాహపడతాడేమో అనుకున్న సూరాను ఇలాంటి ప్రతిపాదన విస్మయానికి గురి చేసింది. తను ఇప్పుడు కాదన్నాడంటే ఘోర కలికి అది తీరని కోరికగా మిగిలిపోయి మళ్ళీ భవిష్యత్తులో అయినా సింహాన్ని చంపాలని అనిపిస్తుందేమో. అదేదో ఇప్పుడే చంపేస్తే పోతుంది అనుకుని సరే అన్నాడు సురా. ఇదే  సురా చెయ్యబోయే అతి పెద్ద తప్పిదం అని బహుశా అతనికి కూడా తెలియదేమో.
 
సురా నుండి సరే అన్న పదం వినబడగానే సూరాను వెంటబెట్టుకుని చీకటి రాజ్యానికి దగ్గర్లో ఉన్న అడవికి తీసుకెళ్లాడు. అక్కడ అదే సమయంలో ఒక సింహం వేట ముగించుకుని ఆహారాన్ని భుజిస్తోంది.
 
దూరం నుండి ఇదంతా చూస్తున్న ఘోర కలి సురాతో," ఇప్పుడు దాని నోటి కింది కూడు లాక్కుంటాను చూడు", అంటూ వికృతంగా నవ్వాడు.
 
వృద్ధ సాధువు ఇచ్చిన మంత్రం జపించిన కొద్ది నిమిషాల్లోనే సింహంలా మారిపోయాడు ఘోర కలి. పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికెళ్లి తన ఆహారాన్ని లాక్కుని తినటం మొదలు పెట్టాడు. సింహం ఉగ్రరూపం ధరించి పంజా విసిరింది. సింహాన్ని చిత్తుగా ఓడించాడు సింహం రూపంలో ఉన్న ఘోర కలి. రెండే రెండు దెబ్బలకు నేలకొరిగింది.
 
వెంటనే తన స్వంత రూపంలోకి మారిపోయిన ఘోర కలి సింహం బ్రతికున్నదా, చచ్చినదా అని పరీక్షగా చూసాడు. కొనఊపిరితో ఉండటంతో సింహం పంజా చురుకుగా ఘోరకలి మొహాన్ని తాకింది. ఘోరకలి అసలు రూపాన్ని చూస్తూ సింహం తుది శ్వాస విడిచింది. చనిపోయే ముందు కూడా తన గుర్తును వదిలి వెళ్ళింది. ఘోర కలి మొహంపై ఏటవాలుగా పెట్టిన గాటు ఇందుకు తార్కాణం. ఘోర కలి ఆవేశం కట్టలు తెంచుకుంది. తన దగ్గరున్న కత్తి తీసి సింహాన్ని నిలువునా చీల్చేసి మరిగే రక్తాన్ని తాగాడు. తనేం చేస్తున్నాడో తనకే అంతుబట్టని కోపంలో ఊగిపోతున్నాడు ఘోర కలి. సింహం మెడ పై కాలు పెట్టి, "చచ్చిందిది చివరికి....హహ్హాహ్హా", అంటున్నప్పుడు తన మొహం పై పడ్డ సింహం గాటు బలంగా ఉండటంతో రక్తం కారుతూ బొట్లు బొట్లుగా నిర్జీవంగా పడి ఉన్న సింహం పై పడ్డాయి.
 
సరిగ్గా సింహం నాలుక తెరుచుకుని ఉన్న చోట రక్తం బొట్లు పడ్డాయి. అంటే సింహం కూడా ఘోర కలి రక్తాన్ని రుచి చూసిందన్న అర్థం వచ్చేలా ఉందా దృశ్యం. కానీ అప్పటికి సింహంలో ప్రాణం లేదు. దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్న సూరాకు భవిష్యత్తులో జరగబోయే దేనికో ఇది సంకేతంలా అనిపించింది.
 
ఘోర కలి దగ్గరకొచ్చి, "అన్నా ! తృటిలో తప్పించుకున్నావ్ . సింహాన్ని చంపి, రక్తం తాగావు కదా. మన చీకటి రాజ్యానికి పోదాం పద", అన్నాడు సురా.
 
"నాకు సింహం రక్తం బాగా నచ్చిందిరా. దాని కడుపు నిండా పౌరుషమే. పౌరుషం మొత్తం తాగేసానురా.
 
హహహ...ఇలాగే ప్రతీ వారం నాకు సింహం రక్తం కావాలిరా", అంటూ ఆవేశం కట్టలు తెంచుకున్నవాడిలా నడుస్తూ ముందుకెళ్లాడు ఘోర కలి.
 
కనీసం వెనక్కి తిరిగి తన వంక కూడా చూడకుండా  వెళ్తున్న ఘోర కలి వైపే చూస్తూ స్థాణువులా నిలబడిపోయాడు సురా. ఇలాగే కొనసాగితే తన మిత్రుడేమైపోతాడా అన్న భయంతో, బాధతో ఆలోచనలో పడ్డాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
ఘోరకలికి పిచ్చి పీక్స్ లో కెళ్తుందన్నమాట, వినాశకాలే విపరీత బుద్ది అన్నారు కదండి. సురా మాత్రం మిత్ర ధర్మం నెరవేరుస్తున్నాడా లేక తన ప్రాణాలను కాపాడుకుంటున్నాడా...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
(15-08-2024, 09:53 AM)k3vv3 Wrote: ఘోర కలి అరాచకాలు  - 4
సింహం రక్తం తాగే ఘోర కలి
 
ఇలాగే కొనసాగితే తన మిత్రుడేమైపోతాడా అన్న భయంతో, బాధతో ఆలోచనలో పడ్డాడు.

K3vv3 garu!!! Good update. Episode shows the mental status of ghorakali...
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
Nice superb update
[+] 1 user Likes sri7869's post
Like Reply
జోసెఫ్  సెబాస్టియన్ డిస్గైజ్
జోసెఫ్ సెబాస్టియన్ aka ముత్తుస్వామి అయ్యర్
 
బెంగళూరులో క్యాబ్ లో ఉన్న జోసెఫ్ సెబాస్టియన్ డ్రైవర్ కి కృష్ణ స్వామి ఇంటి అడ్రస్ చెప్పాడు. కృష్ణ స్వామి బెంగళూరులోని బసవనగుడిలో ఉన్న ఒక సాదాసీదా అపార్ట్మెంట్ లో ఉంటాడు. అతను అక్కడ ఉంటున్నట్టు చాలా తక్కువ మందికి తెలుసు. జోసెఫ్ సెబాస్టియన్ తన ఇన్వెస్టిగేటివ్ మైండ్సెట్ తో కృష్ణస్వామి ప్రతి మూవ్ మెంట్ నీ ట్రాక్ చేసిన ఏరియాలోని జర్నలిస్ట్ ద్వారా విషయం తెలుసుకున్నాడు. కృష్ణస్వామి దగ్గర 'అదృశ్య మందిరం' ప్రాజెక్ట్ ఫండింగ్ డీటెయిల్స్ ఉన్న ఫోల్డర్ ఒకటుంది. అది లాప్టాప్ లో ఉందో, హార్డ్ కాపీలో ఉందో తెలీదు. జోసెఫ్ సెబాస్టియన్ వెళుతున్న క్యాబ్ ని బ్లాక్ కలర్ చెవరోలెట్ వోల్ట్ కార్ ఫాలో చేస్తోంది. అందుకే జోసెఫ్ టెన్షన్ పడుతున్నాడు.
 
బసవనగుడి లోని వీవీ పురంలో న్యూ మోడరన్ హోటల్ ఉంది. అక్కడే క్యాబ్ దిగాడు జోసెఫ్. హోటల్ లోకి ఎంటర్ అయ్యాడు. లంచ్ టైం కావటంతో బాగా రద్దీగా ఉంది. థాలి ఆర్డర్ చేసాడు. రావటానికి ఐదు నిమిషాల సమయం ఉంది. వెనకాలే తనని ఫాలో చేస్తున్న వ్యక్తి తన టేబుల్ కనబడేలా రెండు టేబుల్స్ అవతల కూర్చున్నాడు. అతను కాఫీ ఆర్డర్ చేసాడు. కాఫీ వెంటనే వచ్చేసింది. ఇంతలో జోసెఫ్ హ్యాండ్ వాష్ కోసం పక్క సెక్షన్ కెళ్ళాడు. హ్యాండ్ వాష్ ఎక్కడా అని అక్కడున్న వెయిటర్ ని అడిగితే వెయిటర్ అదిగో అటే అని చేత్తో చూపించటం స్ట్రేంజర్ కి కనబడింది. జోసెఫ్ తిన్నగా హ్యాండ్ వాష్ సెక్షన్ కెళుతున్నట్టే వెళ్లి రూట్ మార్చి కిచెన్ వైపుగా వెళ్ళాడు. అక్కడున్న వంటతను విచిత్రంగా చూసేసరికి, అతని చేతిలో ఒక 500 /- నోట్ పెట్టేసి అక్కడున్న ఎగ్జిట్ డోర్ గుండా వెళ్ళిపోయాడు. కృష్ణస్వామి ఉంటున్న అపార్ట్మెంట్ కి రెండే రెండు నిమిషాల్లో చేరుకున్నాడు.
 
కృష్ణ స్వామి రెండో ఫ్లోర్ లో ఉంటాడు. అపార్ట్మెంట్ పేరు కూడా సరిగ్గా కనబడదు. కానీ జోసెఫ్ కి అడ్రస్ ఫొటోలతో సహా పక్కాగా తెలియటంతో వెంటనే గుర్తుపట్టేసాడు.
కృష్ణస్వామి ఉండే ఇంటి కీని తను ఎక్కడ దాచుంచాడో రాధాకృష్ణన్ ఇంట్లో దొరికిన టూర్ దే అదృశ్య మందిరం ప్రాజెక్ట్ ఫైల్ లో రాసి ఉంది. ఫైల్ ని స్టడీ చెయ్యటం ఇందుకు పనికొచ్చింది. టైం వేస్ట్ చెయ్యకుండా జోసెఫ్ సెల్లార్ లోని కృష్ణస్వామి పాత కార్ దగ్గరికి వెళ్ళాడు. మారుతి 800 కార్ అది. చాలా ఓల్డ్ మోడల్. తన దగ్గరున్న పిక్చర్ లో మూడో టైర్ రింలో ఎక్కడ దాచాడో క్లియర్ గా మార్క్ చేసాడు. అక్కడి నుండి కీ తీసుకుని సెకండ్ ఫ్లోర్ కెళ్లిన జోసెఫ్ కు నమ్మబుద్ధి కావటం లేదు. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్న కృష్ణస్వామి ఇంటి తాళాన్ని ఇలా మారుతి 800 టైర్ రింలో దాచటం ఏంటా అనుకున్నాడు. కృష్ణస్వామి ఇంటి డోర్ తెరవగానే ఒక అలార్మ్ ఆక్టివేట్ అయినట్టు సౌండ్ వచ్చింది. జోసెఫ్ చుట్టూ చూసాడు. డోర్ వెనకే టైమర్ ఉంది. అందులో 05 :00 మినిట్స్ అన్న టైమర్ చూపిస్తోంది. అంటే జోసెఫ్ దగ్గరున్న టైం 5 నిమిషాలు మాత్రమే. ఐదు నిమిషాల్లో ఫైల్ ఎక్కడుందో కనిపెట్టాలి. లేదా అక్కడేదైనా జరగొచ్చు. అంటే తను ఇంతక్రితం మారుతి 800 టైర్ రింలో నుండి తెచ్చిన కీ తో ఓపెన్ చెయ్యటం వల్లే ఇది ఆక్టివేట్ అయ్యింది. జోసెఫ్ నిర్ఘాంతపోయాడు. ఫ్లాట్ లో మూడే మూడు రూమ్స్ ఉన్నాయి. స్టడీ రూమ్ కెళ్ళాడు చాలా మెటీరియల్ కనబడింది. కానీ ఫండింగ్ డీటెయిల్స్ ఎక్కడుంటాయో తెలియట్లేదు. అందుకే అక్కడున్న లాప్టాప్ ని తీసుకొచ్చాడు. టైం ఎక్కువ లేకపోవటంతో వెంటనే అపార్ట్మెంట్ బయటికొచ్చేసాడు.
 
హీట్ డిటెక్టర్ సర్క్యూట్ మైక్రో కంట్రోలర్ కి సిగ్నల్ పంపటం వల్ల మారుతి 800 సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయి పేలిపోయింది. చూస్తుండగానే రెండో ఫ్లోర్ లో ఉన్న కృష్ణస్వామి ఇంటి నుండి పేలిన శబ్దం వినబడింది. అది చూసిన జోసెఫ్ కు ముచ్చెమటలు పట్టేసాయి. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
 
జోసెఫ్ వెంటనే ఒక్క నిమిషం టైం వేస్ట్ చెయ్యకుండా నెక్స్ట్ ఫ్లైట్ కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. తనని ఎవరైనా ఫాలో చేస్తున్నారేమోనని చుట్టూ చూసాడు.
 
బెంగళూరు ఎయిర్పోర్ట్ బయట బ్లాక్ కలర్ చెవరోలెట్ వోల్ట్ కార్ ఆగింది. స్ట్రేంజర్ వేగంగా అడుగులు వేస్తూ జోసెఫ్ ని వెతుకుతూ వస్తున్నాడు.
 
ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ దగ్గర జోసెఫ్ లగేజ్ మొత్తం స్కాన్ అయిపోయి అక్కడున్న కన్వేయర్ బెల్ట్ మీదుగా వెళ్తోంది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న జోసెఫ్ కు అప్పుడే స్ట్రేంజర్ కనిపించాడు. స్ట్రేంజర్ కూడా అదే ఫ్లైట్ ఎక్కబోతున్నాడని అర్థమైంది. టెన్షన్ స్టార్ట్ అయింది.
 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
 
అప్పుడే సరిగ్గా ఒక విచిత్రం జరిగింది. స్ట్రేంజర్ బుక్ చేసుకుంది ముంబై ఫ్లైట్. జోసెఫ్ బుక్ చేసుకున్న నెక్స్ట్ ఫ్లైట్ డైరెక్ట్ గా చెన్నై కెళ్తుంది. బెంగళూరు - చెన్నై - దుబాయ్  ఇలా జోసెఫ్ ఫ్లైట్ బుక్ చేసాడు. జోసెఫ్ డైరెక్ట్ గా ముంబై కే ఫ్లైట్ బుక్ చేసుకుని ఉంటాడు అనుకుని స్ట్రేంజర్ బెంగళూరు - ముంబై ఫ్లైట్ చేసాడు.
 
జోసెఫ్ చెన్నై చేరుకోగానే అక్కడున్న కొరియర్ సర్వీస్ ద్వారా తాంబరంలోని ప్రియా కృష్ణన్ ఇంటికి కృష్ణ స్వామి లాప్టాప్ ని చేరవేసేలా అరేంజ్ చేసాడు. తను కంగారు పడకుండా ఒక ఉత్తరం కూడా జత చేసాడు. అన్నీ అందులోనే వివరించాడు.
 
చెన్నై డొమెస్టిక్ వింగ్ లో నుండి తన లగేజ్ కలెక్ట్ చేసుకుని ఇంటర్నేషనల్ సర్వీస్ వింగ్ కెళ్ళి దుబాయ్ కి బుక్ చేసిన నెక్స్ట్ ఫ్లైట్ కోసం చెక్ ఇన్ అయ్యాడు.
 
దుబాయ్ లోని జీకే కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ లో డేటా అనలిస్ట్ గా మరుసటి రోజే జాయిన్ అవ్వబోతున్నాడు జోసెఫ్ సెబాస్టియన్. కాదు కాదు. ఇప్పుడు తన పేరు ముత్తుస్వామి అయ్యర్. డిస్గైజ్ తోనే జీకే కార్పొరేషన్ జాయిన్ అయ్యి, అక్కడే ఉంటూ ఘోర కలిని దగ్గర నుండి చూస్తూ అశుతోష్ ఇప్పుడెలా ఉన్నాడో, ఎక్కడున్నాడో తెలుసుకుంటూ ఘోర కలికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నీ సిబిఐకి ఎప్పటికప్పుడు అందించేలా పెద్ద ప్లాన్ తోటే బయలుదేరుతున్నాడు.
 
చెన్నై డొమెస్టిక్ వింగ్ కి సరిగ్గా అదే టైములో స్ట్రేంజర్ రాగలిగాడు. చాలా హై లెవెల్ ఇన్ఫ్లూయెన్స్ వాడి బెంగళూరు నుండి చెన్నై కి చేరుకోగలిగాడు. కానీ ఇప్పుడు చెన్నై డొమెస్టిక్ వింగ్ లో జోసెఫ్ కనబడటం లేదు. స్ట్రేంజర్ కి జోసెఫ్ ప్లాన్ అంతుబట్టడం లేదు. అటు ఇటు చూస్తున్నాడు. అంతలో జోసెఫ్ ఒక ఎయిర్పోర్ట్ బస్సు లో కనిపించాడు. డొమెస్టిక్ వింగ్ నుండి బయటికొచ్చిన స్ట్రేంజర్ అక్కడున్న స్టాఫ్ ని బస్సు ఎక్కడికెళ్తోందని అడిగాడు. దుబాయ్ కెళ్లే బస్సు అని చెప్పాడు. షాక్ లో ఉండిపోయిన స్ట్రేంజర్ అలా చూస్తుండగానే తన కళ్ళముందే దుబాయ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు జోసెఫ్.
 
జోసెఫ్ ప్లాన్ ఏంటో అంతుబట్టక, తన బాస్ కి తన మొహం ఎలా చూపించుకోవాలిరా దేవుడా అని స్ట్రేంజర్ కి తల దిమ్మెక్కిపోయింది. తన బాస్ కి ఇప్పుడేం చెప్పాలో   తెలియక తికమక పడుతున్నాడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)