లేడీస్ చేంజింగ్ రూం
మే నెల ఆరో తారీఖు. సూర్యుడు వీరంగం ఆడే రోజులు. ఏసి లేకుండా ఉండలేని పరిస్థితి. సాయంత్రం ఎనిమిది గంటల సమయం.చల్లటి సాయంత్రాన మొదలయింది రిసెప్షన్. ఒక పెద్ద ఫంక్షన్ హాలులో గార్డెన్ లో వేదిక ఏర్పాటు చేశారు.
వధువరులు ఇద్దరు వేదిక మీద ఉన్నారు. వరుడు సూట్ లో, వధువు అద్దాలు పొదిగిన తెల్ల లెహెంగాలో కళకళలాడుతుంది. వారి తల్లిదండ్రులు వేదికపైకి ఇరువైపులా ఉండి అతిథులని పలకరిస్తూ ఉన్నారు. సౌండ్ సిస్టంలో పాట మోగుతుంది. వచ్చినవాళ్ల పిల్లలు వాల్లకెం పెట్టినట్లు పరుగులు పెడుతూ డెకరేషన్ తాలుకు బెలున్లు, పువ్వులు లాగేస్తున్నారు. కాస్త వయసుకి వచ్చిన యువతీ యువకులు ఫోన్లో ఫోటోలు, స్నాప్ లు తీసే పనిలో ఉన్నారు. ఫంక్షన్కి వచ్చిన అంకుల్స్ లో కొందరు డైనింగ్ ఏరియా వెనుక ఏర్పాటు చేసిన ముందు టేబుల్స్ దగ్గర కుర్చొని ఆఫిస్, రాజకీయాలు, ఇఎంఐలు అని బోరింగ్ కబుర్లలో పడ్డారు. ఇంకొందరు స్టేజి ఎదురుగా ఉన్న సిట్టింగ్ ఏరియాలో కుర్చొని అవె కబుర్లలో ఉన్నారు.
వీటన్నింటికీ దూరంగా, స్టేజ్ వెనుక ఉన్న ఫంక్షన్ తరుపు అకమడేషన్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వరండా గుండ నడిచి చివరకు వెళ్తే తలుపు మూసి లోపల నుంచి గడి పెట్టి ఉన్న గది. ఆ గది తలుపుకి తెల్లని పెయింట్ లో రాసిన అక్షరాలు "లేడీస్ చేంజింగ్ రూం."
ఫంక్షన్ ప్రపంచానికి, మగవాల్ల చూపులకి, మోగుల్ల పిలుపులుకి, పిల్లల అల్లరికి దూరంగా. పట్టు చీరల వేడికి పట్టిన చెమట పెర్ఫ్యూమ్, పౌడర్లతొ కలగలిసిన సువాసనతో నిండిపోయి, గాజులు చప్పుల్లు, సన్నని గుసగుసలు, చిలిపి నవ్వుల సంగీతంలో తరించి పోతుంది ఆ గది.
గదిలోకి సౌండ్ సిస్టం పాటలు లీలగా వినిపిస్తున్నాయి.మంచం మీద హ్యాండ్ బ్యాగ్ లు, సోఫా మీద టవల్స్, ఇన్వర్స్ చిందరవందరగా పడేసి ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు మేకప్ సామాను అంటే తెరిచి పెట్టిన లిప్ స్టిక్స్, మస్కారా పెన్సిల్స్, పౌడర్ పఫ్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎవరో వాడెసారు కాని ఎవరైనా వాడొచ్చు అన్నటుగా.
ఆ గదిలో వయసు, పెద్ద, చిన్న తారతమ్యాలు లేవు. పెళ్లైనవిడ అవ్వని అమ్మాయి అని లేదు. కాలేజీ వయసు పిల్లలు ఉన్న ఆంటీ నుంచి కాలేజీ మోన్నే పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన అమ్మాయి వరకు అందరు మనసు విప్పి కోరికలు, రహస్యాలు, కోపాలు, చికాకులు, మనసు విప్పి పంచుకునే చోటు ఇది. చిలిపిగా అల్లరి చేస్తు ఒకరిని ఒకరు ఆటపట్టించుకునే మందిరం ఇది.
మరి అంత స్వేచ్ఛ, ధైర్యం ఇచ్చే గదిలో ఎన్ని రహస్యాలు బయట పడతాయో. ఎన్ని కాపురాల నిజాలు తెలుస్తాయో. ఎన్ని మంచి సలహాలు, ఎన్ని ముంచే సలహాలు, ఎన్ని నవ్వులు వినిపిస్తాయో చూడాలి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)