Thread Rating:
  • 55 Vote(s) - 3.49 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

(2) వారసుడు - completedCompleted

Showing only the posts of Raagaa: 90 of 865 posts. Show all posts
#1

రావు గారి ఇల్లు. కుటుంబ సభ్యులు అంతా హాల్లో మెట్ల మీదా ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చున్నారు. పెద్ద వాళ్లంతా సోఫాలో కూర్చుని ఉన్నారు. రావు మోటర్స్. ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ. నిన్న సాయంత్రం కొత్త డిజైన్ డేటా లీక్ అయ్యింది. అదీ ఇంట్లో వాళ్ళ వల్లే. అందుకే ఈ సమావేశం.

★ వారసుడు ★
[+] 14 users Like Raagaa's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

ఇంత పెద్ద కుటుంబంలో ఒక్కడు చెడబుట్టాడు. వీడు నా కొడుకని చెప్పుకోవాలంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు పనికిరాని వాడిని సంకన పెట్టుకుంటే ఇలాగే సంక నాకి పోతాం. అసలు వీడు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇక్కడున్నావ్. పో బైటికి. అరిచేసాడు.

జగపతిరావు తన మూడో కొడుకు గోపిని తిడుతుంటే రావు కుటుంబంలో ఉన్న మిగతా నలభై ఐదు మంది చోద్యం చూస్తున్నారు. అందులో పని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్వరికి తనంటే ఇష్టం లేదు. ఒకరినొకరు తోడుగా చేసుకుని అందరూ తన మీద నిజాలు, అబద్దాలు చెపుతుంటే తల్లి తన కోసం నిలబడుతుందేమో, మాట్లాడుతుందేమోనని చూసాడు. ఆమె అసలు కొడుకు వైపు చూడలేదు. గోపి తల దించేసాడు. మెట్ల మీద నిలుచున్న అమృత మాత్రం గోపి వైపే చూస్తుంది. జరిగిన దాంట్లో గోపి తప్పు లేదని ఆమెకి మాత్రమే తెలుసు కానీ నోరు విప్పలేదు. విప్పితే తనకి సమస్య, అందుకే మౌనంగా చూస్తుంది.

గోపి లేచి తల్లి దెగ్గరికి నడిచాడు. జనని అసలు గోపి మొహం చూడలేదు. పది సెకండ్లు తల్లి వైపే చూసి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి వెనుతిరిగాడు. ఈ చోద్యం జరుగుతుండగానే పెద్దాయన రాజారావు లోపలికి వచ్చాడు. తాతా మనవళ్లు ఇద్దరు ఎదురు పడి చూసుకున్నాక గోపి వెళ్ళిపోతుంటే ఎక్కడికి అని అడిగాడు కళ్ళజోడు తీస్తూ. వెళ్లిపొమ్మన్నారు అని బైటికి వెళుతుంటే ఆగమన్నాడు.

ఓసారి అందరినీ చూసి, నా ఇద్దరు కొడుకులు, కూతురు, అల్లుడు, జనని, అమృత తప్పించి మిగతా వాళ్లంతా వెళ్లి పనులు చూసుకోండి అనగానే అందరూ తమ గదుల్లోకి వెళ్లిపోయారు. పెద్దాయన సోఫాలో కూర్చుంటే మిగతావాళ్ళు పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. జనని ఒక పక్కన నిలబడింది. అమృత వాళ్ళ అమ్మ సురభి ఇంకో వైపున నిలుచుంది. అమృత తాతయ్య ఎదురుగా నిలబడింది. గోపి తలుపు దెగ్గరే ఉన్నాడు. అమృతకి భయమేసింది. నిన్న రాత్రి జరిగింది గుర్తుకువచ్చింది.

స్నేహితులతో పార్టీకి వెళుతూ ఎంజాయిమెంట్లో  పడి కాన్ఫిడెన్షియల్ డేటాని కారులోనే వదిలేసింది. దాన్ని ఎవరో కొట్టేసారు. తన దెగ్గర బ్యాకప్ ఉన్నందున వెంటనే అలాంటి పెన్ డ్రైవ్ ఇంకొకటి కొని అందులో కాపీ చేసి గోపిని పిలిచి ఇంట్లో తాతయ్యకి ఇవ్వమని చెప్పింది. తప్పు అమృత దెగ్గర జరిగినా నింద మాత్రం గోపి మీద పడింది. అమృత గోపి ఏమైనా మాట్లాడతాడేమోనని భయంగా చూస్తుంటే గోపి మాత్రం గడప దెగ్గర నుంచి బైట గార్డెన్‌లో కనిపించే చెట్లని చూస్తున్నాడు.

తప్పు అమృత దెగ్గరే జరిగిందని గోపికి నిన్న రాత్రే తెలుసు, తన మొహంలో చెమటలు, మాటలో వణుకు అన్నీ చెపుతూనే ఉన్నాయి. తనకంటే రెండేళ్లు పెద్దది అయినా వరసే అవుతుంది, అందులో అమృత అంటే తనకి ఇష్టం. వీటన్నిటికంటే ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, వాదించడం గోపికి నచ్చదు. చిన్నప్పటి నుంచి అందరూ తనని చులకనగా చూస్తారు అనే కోపం ఉంది వాడిలో, ఇంట్లో జరిగే ఉల్లిపాయ రాజకీయాలు చెయ్యడం గోపీకి చేతకాదు, అసలు పట్టించుకోడు. పెద్దనాన్నకి ఒక కొడుకు, కూతురు రఘు, రమ్య. తనకంటే ముందు పుట్టిన ఇద్దరు అన్నయ్యలు శ్రీధర్, విష్ణు. మేనత్తకి ఇద్దరు పిల్లలు ఒకరు పవన్ ఇంకొకరు అమృత. నలుగురు అన్నదమ్ములకు ఒక్కటే మరదలు. గోపి చిన్న వాడు, చేతకానివాడు గనక రేసులో అసలు గోపి వంక చూడరు. మిగతా ముగ్గురు మాత్రం ఎవరు ఎక్కువ పేరు సంపాదిద్దాం, ఎవరు సీఈఓ అవ్వాలి, ఎవరు అమృతని దక్కించుకోవాలి అనే గోలలో వాళ్లలో వాళ్ళే గోతులు తోవ్వుకుంటున్నారు. ఇక పెద్ద వాళ్ళు నాన్న జగపతి రావు, పెద్దనాన్న రాధరావు మావయ్య మురళి వీళ్లందరికి తాతయ్య సృష్టించిన గద్దె మీద ఒక్కసారి కూర్చోవాలని ఉంది. బైటకి బానే ఉన్నా లోపల ఒకరంటే ఒకరికి విషం. అమ్మ జననికి అత్తయ్య సురభికి పెద్దమ్మ కావ్యకి కూడా అదే కోరిక కానీ వాళ్లకి అవకాశం ఇవ్వరని తెలుసు, మొగుడి గెలుపే తమ గెలుపని వాళ్ళు మౌన యుద్ధం చేస్తున్నారు. అధికారం, డబ్బు వ్యామోహంలో పడి కంపెనీ సమగ్రతతని ఏనాడో తగ్గించేశారు. ఎవ్వరిలోనూ ఐకమత్యం లేదు, అందుకే గోపీకి వీళ్ళు నచ్చరు.  ఆలోచిస్తుంటే వెనక తాతయ్య మాటలు వినిపించాయి.

డేటా చివరిగా ఎవరి దెగ్గరికి వెళ్ళింది అని అడిగాడు రాజారావు. అమృత వాళ్ళ నాన్న మురళి లేచి నిలబడి పెద్ద బావ నాకు ఇచ్చాడు. నేను అమృతకి ఇచ్చాను. అమృత గోపికి ఇచ్చి ఇంట్లో ఉన్న మీకు ఇవ్వమంది. అని అమృత వైపు చూస్తే అమృత అవునని తల ఊపింది. అందరూ గోపీ వైపు చూసారు. గోపి బైట చూస్తున్నాడు.

అంత ఇంపార్టెంట్ మ్యాటర్ని గోపికి ఎందుకు ఇచ్చావ్ అమృతా అని అడిగాడు రాజారావు. నిన్న ఇంపార్టెంట్ పార్టీ అటెండ్ అవ్వాల్సి వచ్చింది అందుకే.. అని ఆపేసింది. రాజారావు అసహనంగా నీకు కంపెనీ కంటే పార్టీ ముఖ్యం అనమాట అన్నాడు. గోపి వాళ్ళ అమ్మ జనని వెంటనే తప్పు చేసింది అమృత కాదుగా మావయ్య గారు అంది. ఆ మాట వినిపించగానే చివుక్కుమంది గోపీ మనసు. ఇవన్నీ తనకి అలవాటే.. తల్లి అలా ఎందుకు మాట్లాడిందో కూడా గోపికి బాగా తెలుసు.

కంపెనీ 100%లో 
30% వాటా రాజారావుది 
23% డైరెక్ట్ ఫ్యామిలీది
12% మిగతా కుటుంబ సభ్యులు అంటే మాది
25% పబ్లిక్ షేర్ హోల్డర్స్ 
10% ఇన్వెస్టర్స్ 

ఈ 23%లో జగపతిరావు, రాధారావు, సురభి ముగ్గురికి 7% చప్పున 21% శాతం ఉండేది. ఏడుగురు పిల్లలకి తలా 2% ఉండేది. ఇక్కడే జనని ఒక అడుగు ముందుకు వేసింది, చిన్న కొడుకుని చులకన చేసి, వాడి మీద కోపం పెంచుకుని మెంటల్‌గా కొడుకుని ఏడిపించి గోపి రెండు శాతం వాటాని తన పేరు మీద రాయించుకుంది. తద్వారా ఆమె కంపెనీ విషయాల్లోకి జోక్యం దొరకడమే కాకుండా మొగుడు జగపతిరావుకి కొంచెం బలం కూడా పెరిగింది, రేపు అమృతని తన ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరికి ఇచ్చి చేసుకుంటే తన బలం మరింత రెట్టింపు అవుతుందని ఆమె ఆలోచన. ఆ విషయం అక్కడున్న అందరికీ తెలుసు. 

ఇంట్లో మనుషులు ఎలా ఆలోచిస్తున్నారో రాజారావుకి బాగా తెలుసు, తన కంపెనీకి వీళ్లెవ్వరు అర్హులు కారని ఆయన నమ్మకం రోజురోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. చివరిగా గోపి వంక చూసాడు. వీళ్లంతా వాడిని తరిమెయ్యాలని చూస్తున్నారు కానీ అదీ నాకు మొలిచిన కొమ్మే కదా అని రాజారావు ఆలోచన. గోపిని ఇంట్లో నుంచి పంపించెయ్యడాన్ని ఎంత మంది ఆమోదిస్తున్నారు అని అడిగితే అందరూ చేతులు లేపారు. జనని కూడా !


రాజారావు రెండు విషయాలకి ఆశ్చర్యపోయాడు. ఒకటి కన్న తల్లి చెయ్యి ఎత్తడం, రెండవది అమృత చెయ్యి ఎత్తకపోవడం. అమృత వైపు చూసాడు. తనకి డేటా లీక్ అయిన విషయం తెలిసిన వెంటనే మొత్తం ఆరా తీసాడు రాజారావు. ఇప్పుడు అమృత చెయ్యి ఎత్తకపోయేసరికి తప్పు ఎక్కడ జరిగిందో ఆయనకి అర్ధమైంది. ఈ విషయం గోపీకి తెలిసే మౌనంగా ఉన్నాడా లేదా తెలీక మౌనంగా ఉన్నాడా అనేది గోపితో మాట్లాడితే మాత్రమే తెలుస్తుందని అనిపించింది. సరే అన్నాడు.

మీరంతా వెళ్లిపోండి అని లేచి నిలబడి తన గదిలోకి వెళుతూ గోపీ.. లోపలికి రా అని వెళ్ళిపోయాడు. గోపి లోపలికి నడుస్తూ అందరినీ చూస్తూ వెళుతుంటే అమృత తల దించుకుంది. జనని మొహం తిప్పుకుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. రాజారావు మంచం మీద కూర్చుని ఉన్నాడు. గోపి తలుపు పెట్టేసి తాతయ్యకి ఎదురు నిలుచున్నాడు.

ఎందుకు తప్పు నీ మీద వేసుకున్నావ్, సూటిగా అడిగాడు మనవడిని చూసి. గోపి చిన్నగా ఆశ్చర్యపోతూ ఓహ్ తెలిసిపోయిందా అని మెల్లగా నవ్వాడు. ఎందుకురా అంటే  ఇంటి నుంచి బయటికి పంపించేస్తారుగా.. అందుకని తాపీగా సమాధానం చెప్పాడు. 

నేను పంపను
అదేంటి అందరూ ఓటింగ్ వేశారుగా, నేను వెళ్ళిపోవాలిగా!
బుల్ షిట్. నేను చెప్పిందే జరుగుతుంది ఆఖరికి 
వదిలేయ్యచ్చుగా నన్ను 
సరే.. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చు
కానీ..
ఏంటి కానీ ?
ఏదో ఫిట్టింగ్ పెడుతున్నారుగా.. కానీ ?
రేపటి నుంచి నువ్వు నాకు డ్రైవరుగా రావాలి 
నేను రాను 
అయితే నువ్వెక్కడికి వెళ్లడం లేదు 
అయితే నన్ను ప్రశ్నించే హక్కు ఇక మీకెవ్వరికి లేదు, మీరు పోయాక నా దారి నాది. నాకు ఈ కుటుంబానికి సంబంధం లేదు. దీనికి ఒప్పుకుంటే నేనూ ఒప్పుకుంటున్నాను.
అగ్రిమెంట్ సైన్ చెయ్యాలా ?
అవసరం లేదు, మాటివ్వండి చాలు 
సరే 
అలాగే అయితే
నువ్వు ఉండడానికి ఏర్పాట్లు చేస్తాను.
అవసరం లేదు, నా జీతం నాకిస్తే చాలు 

మనవడు ఆనందంగా వెళ్లిపోతుంటే ఆశ్చర్యం వేసింది, అంతలోనే బాధా వేసింది. వీడిలా కరకుగా మారడానికి కారణం ఇంట్లో వాళ్ళేగా అనుకున్నాడు. వెళ్లిపోతున్న మనవడిని చూస్తూ ఉన్నాడు.

తాతయ్య గది నుంచి బైటికి వచ్చేసాక నేరుగా బైటికి నడుస్తుంటే అప్పటికే జరిగిన విషయం అంతా తెలుసుకున్న అందరూ కిందకి దిగారు. గోపిని చూడగానే రమ్య దెగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుంది. ప్రేమగా తన చేతి మీద చెయ్యేసి దెగ్గరికి తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టాడు. నీ పక్కన ఎవ్వరు లేనప్పుడు, నీకు భయం వేసినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు.. ఒక్క ఫోన్ చెయ్యి నీకోసం వస్తాను అని చేతిలో చెయ్యేసి నవ్వుతూ చెప్పాడు. బైటికి వెళ్ళిపోతూ అమ్మ వైపు, అమృత వైపు చూసాడు. అమృత మళ్ళీ తల దించుకోవడం చూడగానే నవ్వొచ్చింది గోపికి. లాన్ నుంచి నడుస్తూ తను పెట్టిన చెట్లని తడుముతూ సెక్యూరిటీని దాటి గేటు దాటుకుని బైటికి నడిచాడు. 
Like Reply
#3

రాత్రి అంతా మేలుకునే ఉంది అమృత. ఆలోచనలన్నీ గోపీ చుట్టే తిరుగుతున్నాయి. తన తప్పుని ఇంకొకరి పై మోపడం ఇదే మొదటిసారి. గోపి మీద చెప్పడానికి కారణం లేకపోలేదు, ఇంట్లో అందరూ చేసేదే తనూ చేసింది. గోపి ఇవేవి పట్టించుకోడు, తల వంచుకు వెళ్ళిపోతాడు. ఏదైనా తప్పు తప్పేగా అనుకుంది. తన వల్లే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని లోపల మనసు తినేస్తుంది. 


ఇటు కింద గదిలో రాజారావు కూడా అదే పనిలో ఉన్నాడు. చాలా కాలం తరువాత మందు తాగుతున్నాడు. పక్కనే పర్సనల్ సెక్రటరీ బులుగు డ్రాయర్ అక్కడ నుంచి రెండు మీటర్ల దూరంలో మంచం మీద నగ్న శరీరం దుప్పట్లో నుంచి బైటికి కనిపిస్తున్న పిర్రని చూస్తూ సిప్ వేస్తున్నాడు. ఆమె పడుకుంది. పెద్ద గుద్ద ఉన్న సెక్రటరీని ఏరి కోరి పెట్టుకున్నాడు. రేపటి నుంచి మనవడి గుద్ద చూడాలా అని బాధ పడుతున్నాడు.

@)###(@

రావు మోటర్స్ 
హెడ్ ఆఫీస్ 

వరసగా కార్లు, ఎంప్లాయిస్ బళ్ళు లోపలికి వెళుతున్నాయి. సెక్యూరిటీ అందరినీ చెక్ చేసి పంపిస్తున్నారు. రోజూ లానే పవన్, అమృత ఇద్దరు కారులో వచ్చారు. వాడెలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో అంది అమృత. పీడా పోయింది, నాకైతే ఫుల్ హ్యాపీ అన్నాడు పవన్. ఎందుకు అంత కచ్చి మీకు అని అడిగితే ఏమో నాకైతే వాడి మొహం నచ్చదు అనేశాడు పవన్. చిన్నప్పుడు తాతయ్య రెండు మూడు సార్లు మీ అందరిలో కల్లా గోపీ అందంగా ఉంటాడు అని విన్నప్పటి నుంచి గోపి అంటే పడదు పవన్‌కి. వీడు మారడు అనుకుంటూ అమృత ఫోన్ చూస్తుంది. 


వస్తున్న అమ్మాయిలని చూస్తున్న పవన్ సెక్యూరిటీ దెగ్గర చేతిలో పేపర్ పట్టుకుని నిలబడ్డ గోపిని చూడగానే కారు ఆపాడు. వీడెంటి ఇక్కడా అంటుంటే అమృత ఫోన్ స్క్రీన్ నుంచి తల  ఎత్తి పవన్ చూస్తున్న వైపు చూసి గోపిని చూసింది. ఇద్దరు కారు దిగారు. వేరే సెక్యూరిటీ అతను కారు పార్క్ చెయ్యడానికి వెళ్ళాడు.

ఏరా మళ్ళీ వచ్చావ్. డబ్బులు కావాలా. పొద్దున్నే నీ మొహం చూసాను. ఇవ్వాళ పనులు ఎలా జరుగుతాయో ఏంటో అని నవ్వాడు. అమృత పవన్ వంక కోపంగా చూసింది. అమృత కోప్పడుతుంటే గోపి మాటలు వినిపించి ఆగిపోయింది, కాదు ఆశ్చర్యపోయింది. నీ మొహం నేను చూడట్లేదా, నాకు వాంతులు వస్తున్నాయి. అయినా ఆపుకుంటున్నా అని తాపీగా అన్నాడు గోపి. ఇన్నేళ్లలో ఎప్పుడు గోపి నోటి నుంచి మాట రాలేదు, రాదు కూడా !

అటుగా వెళుతున్న అమ్మాయి ఆ మాటలు విని పుసుక్కున నవ్వింది. అది ఇంకా గట్టిగా గుచ్చుకుంది పవన్‌కి. పళ్ళు కొరుకుతూ సెక్యూరిటీ వీడిని బైటికి లాగేయ్యండి అని అరిచాడు. ఒక్కసారిగా అందరూ తమనే చూస్తున్నారని తెలియగానే అమృత రెండు అడుగులు వెనక్కి వేసింది. గోపి మాత్రం మొహమాటం లేకుండా తన చేతిలో ఉన్న పేపర్ని ఉండ చేసి పవన్ మొహం మీదకి విసిరేసాడు.

ఆ చర్యకి పవన్ మొహం మాడిపోగా కోపంగా పేపర్ తెరిచి చూసాడు. పర్సనల్ సెక్రటరీ & డ్రైవర్ అని ఇంకా ఏదో ఉంది, కింద తాతయ్య సంతకం చూడగానే షాక్ అయ్యాడు. అమృత గోపి ప్రవర్తనకి ఆశ్చర్యపోతుంటే గోపి రెండు చేతులు చాచుతూ ఐ లవ్ దిస్, ఇవి నా రోజులు అనుకుంటూ కళ్ళు మూసుకుని ముందుకు నడుస్తుంటే సెక్యూరిటీ గేటు తెరిచ్చాడు. వెనక ర్యాప్ సాంగ్ ప్లే అవుతుంటే వావ్ వాట్ ఏ టైమింగ్ అని తిరిగి చూస్తే ఎవరిదో రింగ్‌టోన్ అది. గోపి నవ్వుతూ లోపలికి వెళ్లిపోతుంటే ఆశ్చర్యపోయి చూస్తుంది అమృత.

చిన్నప్పటి నుంచి గోపితో ఎక్కువగా చనువు లేదు, అందరూ తన గురించి చెడ్డగా, అసహనంగా మాట్లాడుకోవడం చూసి గోపికి దూరంగా ఉండేది. గోపి కూడా దూరం నుంచి చూసేవాడు తప్ప ఎప్పుడు దెగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు. రెండు సార్లు రాబోతే అమృత తప్పించుకుంది. మళ్ళీ గోపి ఆ ప్రయత్నం చెయ్యలేదు. మొన్న గోపి తనని కాపాడిన రోజు నుంచి గోపి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అంత చెడ్డవాడు అయితే తనని ఎందుకు కాపాడతాడు, కాపాడినా మౌనంగా ఎందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడో తనకి అర్ధం కాలేదు. 

వెళుతున్న గోపి వంక చూసింది. స్టైల్ గా కనిపించాడు. వాడి బిందాస్ నడక తన పెదాల మీద నవ్వుని కురిపించింది. గోపి వెళ్ళిపోయాక తనూ ఆఫీస్ లోపలికి వెళ్ళింది. పవన్ మాత్రం ఎండలో పిడికిలి బిగించి నిలుచుని ఉన్నాడు. 

అటుగా వెళుతున్న పవన్ వాళ్ళ నాన్న మురళి కొడుకుని చూసి ఏరా.. డి విటమిన్ కోసం నిలుచున్నావా ? అదేదో ఇంటి లాన్‌లో నిలుచొవచ్చు కదరా అన్నాడు. పవన్ పిడికిలి ఇంకా బిగుసుకుంది. ఆయన నవ్వులాట మొహం చూసి విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. 

@)###(@

రాజారావు ఆఫీస్ 

ప్రీతీ అని కేకేశాడు రాజారావు. పొద్దున్నే ఎనిమిదింటికే ఆఫీసుకి వచ్చి కూర్చున్నాడు. బైట రిసెప్షనిష్ట్ లోపలికి వచ్చింది. 

సర్ ? అని తొంగి చూసింది ప్రీతీ 
గోపి ఇంకా రాలేదా ?
ఇంకా లేదు సర్. కానీ ఆఫీస్ కైతే వచ్చాడు 
అదేంటి ?
ఎక్కడున్నారో కనుక్కోమంటారా ?
వద్దు. వెయిట్ చేస్తాను అంటే సరే నని ప్రీతీ వెళ్ళిపోయింది.

మధ్యాహ్నం దాటి రెండు అయ్యిన తరువాత వచ్చాడు గోపి. లోపలికి వెళుతుంటే రిసెప్షనిష్ట్ ప్రీతీ కనిపించింది. పింకు రంగు లాంగ్ టాప్ మీద తెల్లని జాకెట్, ఆమె మోకాలి చిప్పలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఆమె నున్నని కాళ్ళని చూస్తుంటే అంతలోనే ప్రీతీ గోపిని చూసి మీ కోసం సర్ పొద్దున నుంచి ఎదురు చూస్తున్నారు సర్ అంది.

సార్ ఏం వద్దు, డ్రైవర్ పని చెయ్యడానికి పిలిపించారు. గోపి అను చాలు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.

రాజారావు పర్సనల్ సెక్రటరీని తీసేస్తున్నారని తెలుసు గానీ గోపిని నియమిస్తారని ప్రీతీ అనుకోలేదు. ఈ పోస్టు తనకి వస్తుందేమోనని చాలా కాలంగా ఎదురు చూసింది. కారణం డబ్బు. వాళ్ళ అమ్మ వ్యాధి నయం కావడానికి తనకి చాలా డబ్బు కావాలి. ఒక పర్సనల్ సెక్రటరీ ఏమేమి చెయ్యాలో అన్ని పనులు నేర్చుకుంది, చివరికి రాజారావుతో పడుకోవడానికి కూడా మానసికంగా సిద్ధపడింది. ఇప్పుడు అనుకోకుండా గోపి వచ్చేసరికి ఆమెకి ఏం చెయ్యాలో తోచడం లేదు. అలా అని ఏదోటి చేసి తప్పు దారి తొక్కడం ఆమెకి ఏ మాత్రం ఇష్టం లేదు. ఏడుపు వచ్చినా బాత్రూంలో అద్దం ముందు తుడిచేసుకుంది పొద్దునే.. ప్రీతి దిగాలుగా కూర్చోవడం గోపి తలుపు వేసేటప్పుడు గమనించాడు.

లోపలికి వెళ్ళగానే కోపంతో అరిచాడు తాతయ్య. ఆయన శాంతపడేవరకు చెవులు మూసుకుని అక్కడే కుర్చీలో కూర్చున్నాడు.

ఎక్కడికి పోయావురా ?

నేనెక్కడికి పోతాను, నా పని చేసుకుని వస్తున్నాను.

ఏం పని ?

ఆఫీస్ అంతా చూసి, మీ కారులో ఫ్యూయల్ కొట్టించి కారుకి కొన్ని మార్పులు చేసి తీసుకొస్తున్నా. అలాగే మీ పాత సెక్రటరీని కలిసి వస్తున్నా, అన్నీ తెలుసుకున్నాను. 

చెప్పి వెళ్ళచ్చు కదా, నీ కోసం ఎదురు చూస్తున్నా నేను. నా లంచ్ మిస్ అయ్యింది. టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు నేను.

అందుకేనా బీపీ.. నేను తినేసా, మీరు తినేయ్యండి 

ఇంత దుర్మార్గుడవని నేను అనుకోలేదురా.. మిగతా వాళ్ళు చాలా మంచి వాళ్ళు నీతో పోలిస్తే, నేనంటే భయపడతారు. 

గట్టిగా నవ్వాడు గోపి 

ఎందుకురా ఆ నవ్వు 

నువ్వంటే నాకు గౌరవమే కానీ నీ ముందు నటించేంత కాదు. నువ్వు ముష్టేసే షేర్ పర్సెంటేజ్ మీద నాకు ఆశలు లేవు, సో వాళ్ళలాగ భయం నటించే అవసరం నాకు లేదు.. బిందాస్.

నీకు డబ్బు వద్దా, అంత నిజాయితీ గాడివా 

ఎందుకు వద్దు. నేను సంపాదించుకుంటాలే అవన్నీ.. నా సంగతి తరువాత ముందు నీ సంగతి చూద్దాం. ఆ ఆకులు అలమలు తింటావంట కదా.. తెప్పిస్తాను అని ఫోన్ తీసాడు.

మర్యాద. నేనిక్కడ రాజారావుని, రావు మోటర్స్ అధినేతని 

ఎవ్వరు లేనప్పుడు నువ్వు నా తాతయ్యవే, అయినా నీకు పర్సనల్ సెక్రటరీ ఒళ్ళో కూర్చుని తినిపిస్తే కానీ తినవట కదా.. కాళ్ళు చాపు, కూర్చుని తినిపిస్తా అని నవ్వాడు.

ఉలిక్కిపడ్డాడు రావు. నీకెలా..! అని ఆశ్చర్యపోతుంటే గోపి నవ్వాడు. అయితే నిజమే అన్నమాట. తాత రసికుడే.. అని నవ్వుతుంటే రాజారావు సిగ్గుపడుతూ తల దించేసాడు. 

నీకెలా తెలిసిందిరా! 

ఇందాక మాట్లాడుతూ మెల్లగా గీరాను లే.. మొత్తం చెప్పింది. ఆమె నీ మీద చాలా కోపంగా ఉంది. రాత్రి కూడా.. అని నవ్వుతూ అంతా అయిపోయాక చెప్పావంట కదా అని కన్ను కొట్టాడు.

గీరడం ఏందిరా.. నీకెందుకు క్లోజ్ అయ్యింది ? ఇవన్నీ నీకెందుకు చెప్పింది ? 

నాలో నీ పోలికలు ఉన్నాయంట, ఏడుస్తూ చెప్పింది.

ఆ లం.. అని మాటలు దిగమింగుకుని. మౌనంగా టేబుల్ మీదున్న బౌల్ తీసుకుని తింటుంటే నవ్వుతూ మంచినీళ్లు పెట్టాడు గోపీ. పక్కన కూర్చున్నాడు. 

నానమ్మ లేని లోటు, ఒంటరిగా ఎలా ఉంటున్నావో అని నీ గురించి ఆలోచించేవాడిని. అవసరం లేదని ఈ రోజే తెలిసింది. 

నా గురించి ఆలోచించావా !

వద్దా..

లేదు.. ఏం లేదు అంటూ మౌనంగా తింటున్నా ఎందుకో రాజారావు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది అవమానంతోనా లేక డబ్బు, అధికారం కోసం మాత్రమే కాకుండా నిజంగా తన గురించి ఆలోచించే మనిషి ఉన్నాడని తెలిసినందుకా అని రావు గారికే తెలియాలి. 

సాయంత్రం ఆఫీస్ అయిపోయాక ఒక్కడే కూర్చున్నాడు రావు. గోపి రాత్రి వరకు తాతయ్యతోనే ఉన్నాడు. చాలా ఫైల్స్ ఉన్నాయి. ఏమైనా సాయం కావాలా అని అడిగితే నీకు తెలీదులే అనేసరికి ఒక్కడే కూర్చున్నాడు. 

పని పూర్తి అయ్యాక కళ్ళజోడు తీసి పక్కన పెట్టాడు రావు. మానవడితో కాసేపు ముచ్చట్లు పెట్టాడు. ఇంట్లో వాళ్ళతో ఇంతసేపు గడపటం, మాట్లాడటం ఇదే మొదలు. తన భార్యతో గడిపినట్టు గుర్తు.. మళ్ళీ గోపితోనే 

ఎక్కడుంటున్నావ్ ?

రెండు ఇల్లులు చూసాను. రేపు ఒక దాంట్లో దిగుతాను. 

ఏర్పాటు చేస్తానంటే వద్దన్నావ్ 

వద్దులే.. 

ఒక్కసారైనా తాతయ్య అని పిలవచ్చు కదరా 

నువ్వు కంపెనీ గురించి మాత్రమే కాకుండా ఇంటి గురించి కూడా ఆలోచించు అప్పుడు పిలుస్తాను.

అంటే..?

నేను వెళ్ళాలి. పోదమా 

పదా..

రాజారావు కారు ఎక్కుతూ అద్దాలు రంగు మారడం గమనించాడు. ఇంజిన్ సౌండ్ కూడా కొంచెం మారినట్టు అనిపించింది. అదే అడిగితే నవ్వాడు గోపి. రాజారావు ఎక్కువ అడగలేదు. తాతయ్యని ఇంట్లో దిగపెట్టి కారు కీస్ హ్యాండోవర్ చేసి బైటికి వస్తూ చెట్లని చూసాడు. ఒక్కరోజుకే ఆకులు వాడిపోయినట్టు కనిపించాయి. ఎవరో కావాలనే వీటికి నీళ్లు పెట్టనివ్వలేదు. వెంటనే పైపు ఆన్ చేసి నీళ్లు పట్టాడు.

పార్టీ నుంచి వస్తూ చూసారు పిల్లలు. ఎవ్వరు గోపి గురించి పట్టించుకోలేదు. అమృత మాత్రం చెట్లకి నీళ్లు పడుతున్న గోపి వైపు చూస్తూ లోపలికి వెళ్ళింది. స్నానం చేసి వాకింగ్ చేద్దామని బైటికి వచ్చిన రాజారావు కూడా గోపి చెట్లకి నీళ్లు పట్టడం చూసాడు.

చెట్లంటే మనవడికి ఎంత ఇష్టమో రావుకి అర్ధమైంది. ఎందుకో మనవడి మీద ఇష్టం పెరిగింది. గోపి వెళ్లిపోయేవరకు అక్కడే నిలబడి చూసాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి తన కోట లాంటి ఇంటిని తల ఎత్తి చూసాడు. 

నా కోటకి వీడే రాజు అవుతాడా అనుకున్నాడు మనసులో 
అంతలోనే మనవరాలు అమృత గుర్తుకువచ్చింది. కోటకి రాణి కూడా ఉంది. చూద్దాం ఎవరు బాధ్యత తీసుకుంటారో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు.


అర్ధరాత్రి ఒక మనిషి చెట్ల దెగ్గరికి వచ్చి ఏదో పౌడర్ చెట్ల మీద చల్లి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఐదు నిమిషాలకే చెట్ల ఆకుల నుంచి చెడు వాసన రావడం మొదలయింది !
Like Reply
#4

(08-03-2026, 05:54 PM)Mahesh12345 Wrote:  మీరు ఒక రేంజ్ లో రాస్తున్నారు. నిజం గా అద్భుతం గా ఉంది కానీ సమస్య ఏంటి అంటే మీరు చాలా లేట్ గా అప్డేట్ ఇస్తున్నారు అదే ప్రాబ్లం కొంచెం త్వరగా అప్డేట్స్ ఇవ్వండి చాలా గొప్ప స్థాయి కి వెళ్ళిపోతుంది మీ కథ త్వరగా మీరు అప్డేట్స్ ఇస్తే

ఇంకొక విషయం మీరు తప్పు గా అనుకోవద్దు ఇది మీరు మీ సొంతం గా రాస్తున్న కథ నా లేకపోతే వేరే ఎక్కడైనా కాపీ చేసిన కథ నా

అంటే నా ఉద్దేశ్యం ఇది మీ సొంత కథ ఐతే మీ అప్డేట్స్ కోసం చాలా అంటే చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్న ఒకవేళ ఇది మీ సొంత కథ కాదు అంటే ఈ కథ ఎక్కడ ఉందో చెప్తే అక్కడికి వెళ్ళి తర్వాత ఏం జరిగింది అనేది చదువుకుంట అంటే ఇక్కడ కొంతమంది కొన్ని కథలు వేరే దగ్గర నుంచి కాపీ చేస్తున్నారు అందుకే  అలా అన్నాను. నన్ను ఈ కథ అంతలా ప్రభావితం చేసింది తప్పు గా అనుకోవద్దు ఇలా అంటున్నందుకు.

ఒకవేళ మీ కథ ఐతే మాత్రం త్వరగా అప్డేట్స్ ఇవ్వండి


ఇది నిజం గా చాలా అంటే చాలా సూపర్ స్టోరీ ఇది

Haha thankyou andi 
ఇది నా సొంత కథ 
కష్టాల్లో ఉన్నాను. త్వరగా రాయలేకున్నాను 
వీలైనంత త్వరగా పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను
[+] 5 users Like Raagaa's post
Like Reply
#5

పొద్దున్నే లేవగానే ఎదురుగా అందమైన మొహం. నవ్వుతూ పలకరించింది. ప్రశాంతంగా లేచాడు గోపి. తల స్నానం చేసి మడి కట్టుకుని ఉంది. నుదిటి మీద చిన్న బొట్టు. లేస్తూనే గుడ్ మార్కింగ్ అక్కా అన్నాడు గోపీ.


స్వర్ణ ప్రేమగా చూస్తూ గుడ్ మార్నింగ్ అని చేయిస్తే లేచి కూర్చున్నాడు. ఇవ్వాళ చాలా మంచి రోజు, తల స్నానం చెయ్యి గుడికి వెళదాం అంటే సరే అన్నాడు. 

స్వర్ణ అనాధ, ఒకప్పుడు చదువుకుంటూ పని చేసేది. గోపి వాళ్ళ ఇంట్లో కొంతకాలం కుక్‌గా పని చేసింది. ఒకసారి ఆకతాయిలు తన వెంట పడుతున్నారని చెపితే ఎవ్వరు పట్టించుకోలేదు. గోపి స్వయంగా తెలుసుకుని దాన్ని పరిష్కరించాడు. అలా మొదలయింది ఇద్దరి స్నేహం. ఎవరి అండా లేకుండా ఒక్కటే పని చేసుకుంటూ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడం అంటే మాములు విషయం కాదు, అందుకే తనని గౌరవిస్తాడు గోపి. తన కోర్సుల గురించి తెలుసుకుని, వద్దన్నా మంచి కాలేజీలో మంచి కోర్సులో జాయిన్ చేసాడు. ఎంతో బతిమిలాడింది. నీ టాలెంట్ నాకు తెలుసు, దాన్ని నేను వృధా పోనివ్వను అని ఒప్పించి సాయం చేసాడు. గోపి వాళ్ళ అమ్మ తన పేరు మీదున్న 2% షేర్లని తన పేరు మీద రాయడానికి బదులుగా ముప్పై లక్షలు డబ్బు అడిగాడు. అవే స్వర్ణ చదువుకి ఉపయోగపడింది, ఫీజుకి హాస్టల్‌కి పోగా మిగతావి బ్యాంకులో డిపాజిట్ చేసి ప్రతీ నెలా వడ్డీ వచ్చేలా సెట్ చేశాడు. అవి తన పాకెట్ మనీలా ఉపయోగ పడ్డాయి. గోపి సాయం చెయ్యకపోతే ఇప్పుడు సొంతిల్లు, కారు, ఏడంకెల జీతం, సంతోషం ఇవేవి ఉండేవి కావు. ప్రాణం ఇస్తుంది గోపీ కోసం. అమృత అంటే గోపికి ఇష్టమని తెలుసు. ఏదైనా జరిగి గోపి తనకి దక్కితే అన్న చిన్న ఆలోచన స్వర్ణని వేరే మగాడి వైపు, పెళ్లి అనే ఆలోచన వైపు పోకుండా చేసాయి. అద్భుతం జరుగుతుందేమోనని ఎదురుచూస్తుంది. 


గోపి రెడీ అయ్యి వచ్చేసరికి కాఫీతో బాల్కనీలో కూర్చుంది స్వర్ణ. ఇద్దరు ఎదురు కూర్చున్నారు. 

ఎలా ఉంది మీ అమృత గారు ?

ఎన్ని సార్లు చెప్పాను నీకు గారెలు బూరెలు అనొద్దని 

స్వర్ణ నవ్వి సరే చెప్పు, అమృత ఎలా ఉంది ?

బాగుంది. 

నీ ప్లాన్స్ ఎంత వరకు వచ్చాయి ?

దేనికి !

అమృతని దక్కించుకోవా ?

అంత లేదు. నాకు తనంటే ఇష్టం, అంతవరకే.. అమృత కోసం యుద్దాలు చెయ్యాలి, ప్లాన్లు వెయ్యాలి, పడెయ్యాలి. అంత ఓపిక నాకు లేదు.

అదేంటి గోపీ !

నువ్వేం అనుకున్నావ్, అదే నా జీవిత గమనం, గమ్యం అనుకున్నావా ? తేలికగా నవ్వాడు 

నీకే గోల్ లేదా ?

ఎందుకు అవన్నీ అనిపిస్తది నాకు. ఈ రోజు బతికున్నాను, చాలు కదా 

గోపీ..

నిజం అక్కా.. నాకే బాధ్యతలు లేవు. నేను ఇది అవ్వాలి, ఇది చెయ్యాలి అనుకోను. నేను సంతోషంగా ఉన్నానా లేదా, ఈ పని చేస్తే బాగుంటుంది, నేను ఆనందంగా ఉంటాను అనుకుంటే చేస్తాను, లేదంటే లేదు. నేను కొంచెం సెల్ఫిష్. కాఫీ సిప్ చేసాడు.

నాతో ఉండు. ఆశగా అడిగింది.

వద్దు అక్కా

ఎందుకు ?

రేపు నువ్వేం చేస్తావ్. రేపు నీ పనులేంటి ?

ఆఫీసుకి వెళతాను. 

జ్వరం వస్తే ?

లీవ్ పెట్టి పడుకుంటాను.

నేను ఎక్కడికైనా వెళదాం అని అడిగితే ?

వెళతాం.

చూసావా.. నీ దెగ్గర సమాధానాలు ఉన్నాయి. కానీ నా దెగ్గర లేవు. నాకేది అనిపిస్తే అదే చేస్తాను. ఉన్నపళంగా హిమాలయాలకి వెళ్లి తపస్సు చేసుకోవాలి అనిపించిందనుకో, రేపు నీకు కనపడను. నా వల్ల నువ్వు ఇబ్బంది పడతావ్. అది నాకు ఇష్టం లేదు. 

సరే ఇంకేమి అడగనులే అంటే నవ్వాడు. 
రెండు ఇల్లులు చూసాను అన్నావ్ ?

గుడికి వెళ్ళాక అటు వెళదాం. అలానే ఓ సారి హాస్పిటల్‌కి వెళ్ళొద్దాం 

దేనికి ?

చెప్తా.. కాఫీ బాగుంది అక్కా 

అక్కా అని పిలవకు. ఇప్పటికే మూడు వందల ము..

మూడు వందల ముప్పై సార్లు చెప్పావు, అంతేనా అని నవ్వితే లేచి చిన్నగా గోపీ తల మీద కొట్టి కాఫి  కప్పులు సింకులో వేయడానకి వెళ్ళింది.


★


నెలకి ఆరు వేలు రెంటు. కావాలంటే పనిమనిషిని కూడా ఏర్పాటు చేస్తాను. ఆమెకి మీరే చెల్లించుకోవాలి అని నవ్వింది హిమజ.

ఎదురిల్లు కూడా ఓ సారి చూసి వస్తామండి అంది స్వర్ణ లేచి నిలబడుతూ 

ఎందుకూ.. ఆ ఇల్లు వాస్తు బాగోదు. పైగా అన్నీ చెట్లు, దోమలు ఎక్కువ. మొన్న పాము కూడా వచ్చింది తెలుసా. పైగా రెంటు ఏడు వేల ఐదు వందలు. ఇవి కాక వాడే నీళ్ళకి వేరేగా అడుగుతుంది ఆ ఇంటి ఓనరు. చిరాకుగా పెట్టింది మొహం. బ్యాచిలర్ అంటే ఇస్తుందో లేదో మరీ అంది ముగిస్తూ 

హిమజ ఇల్లు చూసిన తరువాత రోడ్డు దాటి ఎదురింట్లోకి వెళ్లారు. తన పేరు గీత అని పరిచయం చేసుకుంది.

ఏడు వేల ఐదు వందలు అంటే ఎక్కువ అండి పైగా వాటర్ బిల్ సెపరేట్ అంటే.. అంది స్వర్ణ.

ఎవరు ఆ హిమజ చెప్పిందా.. రోజు రోజుకి దీని నస భరించలేకపోతున్నాను. రెంటు ఏడు వేలు. వాటర్ బిల్లు, ఇంకే బిల్లు లేదు. పరిసరాలు శుభ్రంగా పెట్టుకుని, మేము లేనప్పుడు కింద చెట్లకి కాసిన్ని నీళ్లు పడితే అదే చాలు. ఇల్లు చూడండి నచ్చితేనే ఉండండి. మీకు కొత్తగా పెళ్లయిందా ?

లేదండి. తను ఒక్కడే ఉంటాడు. బ్యాచిలర్ 

అయ్యో.. బ్యాచిలరుకి ఇల్లు ఇవ్వనమ్మా ఏమి అనుకోవద్దు. మొహమాటం లేకుండా చెప్పేసింది.

ఇప్పుడు తెరిచాడు గోపీ నోరు. పదా హిమజ గారి ఇంట్లోనే చూద్దాం.

ఆమె బ్యాచిలర్కి అద్దెకి ఇస్తానందా !

అవునండి అంది స్వర్ణ. తను రావు మోటర్స్ అధినేత రాజారావు గారి పర్సనల్ సెక్రటరీ కం డ్రైవర్ అండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంచివాడు. నాదీ హామీ అని భరోసా ఇచ్చింది స్వర్ణ.

అక్కడ జీతం బాగానే ఉంటుంది కదా ?

వృధా ఖర్చులకి నేను దూరంగా ఉంటాను అని గోపీ అనేసరికి చిన్నగా నవ్వి, నేనొకసారి మావారిని అడిగి చెపుతాను. మీ నెంబరు ఇచ్చి వెళ్ళండి అంది లేస్తూ. స్వర్ణ, గోపీ ఇద్దరు నెంబరు ఇచ్చి అక్కడి నుంచి బైటికి వచ్చేసారు. స్వర్ణ నవ్వుతూ ఈ ఇద్దరికీ పడదేమో అంటే గోపీ కూడా నవ్వాడు.

ఏ ఇంట్లో ఉంటావ్. నాకు తెలిసి గీత ఆంటీ వాళ్ళ ఇంట్లో.. అక్కడ చెట్లున్నాయి. నీకు బాగా కాలక్షేపం అవుతుంది.

గోపీ ఆలోచిస్తున్నాడు.

హిమజ : 
అందమైన మొహం 
పెద్ద గుద్ద
మంచి నడుము 
గజ్జల పట్టీలు 
అడవి గుర్రంలా ఉంది మనిషి 

గీత :
నవ్వు మొహం 
పెద్ద సళ్ళు 
పొడుగు జడ
చీర కట్టు బాగుంది 
మాట తీరు నచ్చింది 
చెట్లు కూడా ఉన్నాయి
పెద్ద వీపు కూడా ఉంది 


గోపీ అని కదిలిస్తే టైం అవుతుంది వెళ్ళాలి పద పదా అని లాక్కుపోయాడు.
Like Reply
#6

ఆలస్యానికి కారణం కష్టాలే 
క్షమించాలి 
[+] 5 users Like Raagaa's post
Like Reply
#7

రెడీ అయ్యి కూర్చున్నాడు రాజారావు. ఇంకాసేపటిలో మనవడు వస్తాడు అనగా గది నుంచి బైటికి వచ్చాడు. కళ్ళ ముందు ఏదో సరిగా లేదనిపించింది. పరికించి చూస్తే చెట్లు మొత్తం చచ్చిపోయి ఉన్నాయి. ఆశ్చర్యం, బాధ, కోపం అన్నీ ఒకేసారి వచ్చాయి. ఆందోళనగా చెట్ల వైపు నడుస్తుంటే ఆఫీసుకి బైలుదేరిన అమృత కూడా తాతయ్య వైపు చూసి దెగ్గరికి వెళ్లి చెట్లు చచ్చిపోవడం చూసింది. 


ఎవరో కావాలనే చేసారు అని కోపంగా పిడికిలి బిగించాడు రాజారావు. అమృత కూడా బాధ పడింది. తాతయ్యా గోపీ వస్తాడు కదూ, ఇది చూస్తే.. అంటుండగానే లోపలికి వచ్చాడు గోపీ. తాతయ్య ఆందోళన మొహాన్ని, అమృత జాలి మొహాన్ని చూసి చెట్ల వైపు చూసాడు. తన మొహంలో భావం మారినా మౌనంగానే ఉన్నాడు. దెగ్గరికి వెళ్లి వంగి మట్టిలో చెయ్యి పెట్టి చూసాడు. ఏం జరిగిందో గోపీకి అర్ధమైంది. మోకాళ్ళు పట్టుకుంటూ లేచి టైం అవుతుంది పదండి వెళదాం అన్నాడు. గోపీ కారు తీస్తుంటే అమృత నేనూ వస్తాను అంది. ముగ్గురు వెళుతు అప్పుడే కిందకి దిగిన పవన్ వంక చూసారు. వాడి కళ్ళలో రాక్షసానందం చూడగానే అర్ధమైంది ఇది వాడి పనే అని. తాతయ్యని డ్రాప్ చేసాక ఆయన లోపలికి వెళుతుంటే అమృత గోపీని ఆపింది.

సారీ గోపీ..

నువ్వు చేసావా ?

లేదు 

మరి సారీ ఎందుకు? అని జేబులో చెయ్యి పెట్టుకుని వెళ్ళిపోయాడు.

అమృత ఆశ్చర్యపోయినా తనని పిలుస్తుండడంతో లోపలికి వెళ్ళిపోయింది. గోపీ ఆఫీసు నుంచి స్వర్ణ చూపించిన ఇల్లుల దెగ్గరికి వెళ్ళాడు. అద్దెకి ఉండటానికి వాళ్ళ ఆయన ఒప్పుకున్నాడని పొద్దున గీత ఫోన్ చేసింది. వెళితే గీత కీస్ ఇచ్చి పైన చూసుకోమంది. అలాగే అన్నాడు.

పెంట్ హౌస్. 
పైన నీళ్ల తొట్లు ఉండటం వల్ల చల్లగానే ఉంటుందిలే అనుకున్నాడు. ఎదురుగా హిమజ ఇంటి వైపు చూసి తాళం తెరిచి లోపలికి వెళ్ళాడు. చెట్లకి సంబంధించిన పనిముట్లు చాలా ఉన్నాయి. మందులు, కోకోపిట్, ఎముకల పౌడర్ అన్నీ ఉన్నాయి. అన్నీ సీల్ చేసి ఉన్నాయి. ఏవి వాడలేదు. చెట్ల మీద ఇంట్రెస్ట్ రాగానే ఏదేదో చేసెయ్యాలని కొనేస్తారు కానీ నడుము వంచి పని చెయ్యడం అంత సులువు కాదుగా.. నవ్వుకుంటుంటే గీత వచ్చింది.

ఇవన్నీ నేను సాయంత్రం తీపించేస్తాను.

కింద చెట్ల సంగతి కూడా నాకు ఇచ్చేయండి

గీత అర్ధం కానట్టు చూసింది.

కింద చెట్లు, ఈ సమాను వీటి సంగతి నాకు వదిలేయ్యండి. నేను చూసుకుంటాను. మీ చెట్ల జోలికి వెళితే ఇబ్బంది లేదు కదా అని నవ్వాడు.

గీత నవ్వి లేదంది. అడ్వాన్స్ పే చేసి తన పని తాను చేసుకుపోతుంటే ఓ రెండు నిముషాలు నిలబడి కిందకి వచ్చేసింది. గీత మెట్లు దిగుతుంటే హిమజ అప్పుడే తన ఇంటి మెట్లు ఎక్కుతుంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. హిమజ మీద గెలిచిన ఆనందం గీత కళ్ళలో కనిపిస్తుంటే హిమజ కళ్ళలో మెరుపులు మెరిసి అవి పిడుగులా మారి గీత వైపు పడగానే గీత కూడా తన కళ్ళని ఉపయోగించి హిమజ మెరుపులని తన కంటి చూపుతో పక్కకి కొట్టేసింది. ఇద్దరు స్లో మోషన్లో మెట్ల మీద నడుస్తుంటే మధ్యలో ఉన్న వీధిలో గాలి వేడిగా మారి మెల్లగా సుడులు తిరుగుతూ దుమ్ముని గాల్లోకి లేపింది. గీత కిందకి వెళ్లిపోవడం, హిమజ పైకి వెళ్లిపోవడం అన్నీ వేగంగా జరిగి వీధిలో ఉన్న వడగాలి, ఆకాశంలో మెరుపులు చల్లబడ్డాయి. 


పనిముట్లు పక్కన పెడుతున్న గోపీకి ఎదురు ఇంటి మీద హిమజ కనిపించగానే పలకరిస్తూ చెయ్యి ఎత్తాడు. ఆమె కోపంగా చూస్తూ కొంగు కిందకి కొట్టి మొహం చిట్లిస్తూ వెళ్ళిపోయింది. ఏంటో అనుకున్నాడు గోపీ.

ఇల్లంతా ఒక్కడే సర్దుకుని బైటికి వెళ్లి కరెంటు కుక్కరు, కరెంటు పొయ్యి, ఓ చాప, దిండు, దుప్పటి కొన్ని కూరగాయలు వాటితో పాటు ఐదు కిలోల బియ్యం తెచ్చుకున్నాడు. సాయంత్రం స్వర్ణ వస్తానంది ఇవన్నీ చూస్తే ముందు కోప్పడి తరువాత నవ్వుతుందని తెలుసు. అదే జరిగింది కూడా..

ఎందుకు ఇవన్నీ.. నేను వండి పెడతానుగా 

నాకు బాగుంది అక్కా.. చెప్పాలంటే సరదాగా ఉంది. పని అయ్యాక ఇక్కడికి వచ్చి అన్నం ఒండుకుని కూర వండుకుని కడుపు నిండా భోజనం చేసి, వరండాలో చాప వేసుకుని పడుకుంటే ఆఁహాఁ టేబుల్ ఫ్యాన్ కూడా తెచ్చుకున్నా, ఇంతకంటే సుఖం ఏముంది చెప్పు. ఇలా బతకడం నా కల. ఆకాశం వైపు చూసాడు.

పిచ్చోడిలా చూసింది స్వర్ణ. గోపీకున్న తెలివితేటలకి ఇంట్లో వాటా దక్కించుక్కవడం, సుఖంగా బ్రతకడం ఒక విషయమే కాదని స్వర్ణకి తెలుసు, అవన్నీ కాదని దీన్ని సుఖం అంటున్నాడు. స్వర్ణ చూపు గోపీకి అర్ధమై నవ్వి వేరే మాటలు కలిపాడు. స్వర్ణ తనే అన్నీ సర్ది అన్నం కూర వండి ఇద్దరు గది బైట గాలికి కూర్చుని తినేశారు. స్వర్ణ వెళుతు గోపీని హత్తుకుంది. ఛాతి మీద స్వర్ణ మెత్తని సళ్ళు నొక్కకునేసరికి ఒక అడుగు వెనక్కి వేసాడు గోపీ

ఇక నుంచి అక్కా అని పిలిచిన ప్రతీసారి ఇలాంటివి జరుగుతుంటాయి, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. గోపీకి ఏం అర్ధంకాక అక్కడే ఉండిపోతే కాసేపటికి ఫోను మొగేసరికి ఎత్తాడు, అది రాజారావు నుంచి.

ఎక్కడున్నావ్ రా, ఎప్పుడో పోయావట ?

వస్తున్నా.. ఇంకా చూస్తూనే ఉన్నాడు. 

★

ముందు పర్సనల్ అన్నా తాతయ్యకి డ్రైవరుగా మాత్రమే ఉండటానికి వీలు అయింది. ప్రీతీనే పర్సనల్ గా పెట్టుకొమ్మని చెప్పి చూసాను. తాతయ్య నా మాట వినలేదు

అప్పుడప్పుడు అమృత కనిపించేది. వీకెండ్స్ లో స్వర్ణతో కాలక్షేపం. రోజూ సాయంత్రం కాసేపు కింద పెరట్లో గడపడం జరిగేవి. ఎప్పుడైనా గీత ఆంటీ వచ్చి మాట్లాడి వెళ్ళేది. ఎదురింటి హిమజ ఆంటీ మాత్రం నాకు దూరంగా ఉండేది. చుట్టుపక్కల కొంతమంది పరిచయం అయ్యారు.

★

రాజారావు పర్సనల్ నెంబరు మొగుతుంటే చేసే పనిలోకం నుంచి బైటికి వచ్చాడు. తన చిన్ననాటి స్నేహితుడు రెహ్మాన్. ఆనందంగా ఫోన్ ఎత్తి ప్రేమగా రెహ్మాన్ అన్నాడు.

                     — అప్పటికి రాజారావు మూతి మీద మీసం కూడా మొలవలేదు. తాగుబోతు తండ్రి పని చేసి డబ్బు తెమ్మని బైటికి తరిమేస్తే మొదటిరోజు పని దొరకలేదు. సైకిల్ ట్యూబులో గోళీలు దూర్చి కొట్టాడు. రెండో రోజే ట్రైన్ ఎక్కేసాడు రాజారావు. దిగిన ఊరు పేరు తెలియకపోయినా ఆదరించిన మనుషులు దొరికారు. ప్రాణ స్నేహితుడు దొరికాడు. తనని ఇంట్లోకి రానించి, అన్నం పెట్టి పని నేర్పించిన మస్తాన్ భాయ్ అంటే అమితమైన అభిమానం. చాలా బాధ్యతగా, నమ్మకంగా ఉండేవాడు రావు. మస్తాన్ భాయ్ కొడుకే రెహ్మాన్. ఇద్దరు కలిసి రిపేర్లు చేసిన ఇంజిన్లు ఎన్నెన్నో..

కలిసి తప్పులు చేసింది, కలిసి తన్నులు తిన్నది. గొడవలు పెట్టుకున్నది. చుసిన సినిమాలు, అంటుకున్న గ్రీజు ఒక్క క్షణంలో మొత్తం గర్రున తిరిగింది గతం.

హలో అన్నాడు రాజారావు 

హలో.. రాజారావేనా మాట్లాడేది ? (పిట్ట కొంచెం కూత ఘనం)

అవును, మీరెవరు ?

నేను రెహ్మాన్ మనవడిని జఫర్‌ని మాట్లాడుతున్నా. నాలుగు రోజుల క్రితం మా దాదా చనిపోయారు, పోయే ముందు మీ నెంబర్ ఇచ్చారు.  నేను ఇప్పుడు హైదరాబాదులో ఉన్నాను. 

ఎక్కడున్నావ్ ? నేను మనిషిని పంపిస్తున్నాను. అక్కడే ఉండు. గోపీ... అని కేకేసాడు.

★

తాతయ్య చెప్పిన అడ్రెసుకి వెళ్లి చూసాడు గోపీ. కాయిన్ బాక్స్ పక్కనే ఫుట్ పాత్ మీద కూర్చున్న పిల్లోడిని చూసి దెగ్గరికి వెళ్ళాడు.

జాఫర్ అంటే నువ్వేనా అని అడిగితే లేచి నిలుచున్నాడు. గోపీ కారు వైపు తిరిగి నడుస్తూ పద వెళదాం అంటే వెనకే నడిచాడు. కారు ఎక్కి కూర్చుని నా పేరు జఫర్ అన్నాడు. ఆశ్చర్యపోయి చూసాడు గోపీ.. వింతగా ఉంది వాడి గొంతు. మూతి మీద మీసం కూడా లేదు. నున్నగా ఉన్నాయి వాడి పెదవులు. సరే జాఫర్ అన్నాడు గోపీ మళ్ళీ 

ఈ సారి వాడు కోపంగా చూసి జఫర్ అన్నాడు.

జఫర్ అన్నాడు గోపీ అనుకరిస్తూ 

జ కాదు స్జ zz zafar

జఫర్.. ఈ సారి గోపీ సరిగ్గా పిలిచేసరికి మొహం తిప్పుకున్నాడు. గోపీ జఫర్‌ని ఆఫీసుకి తీసుకెళ్లి తాతయ్య ముందు నిలబెడితే రాజారావు వాడితో ప్రేమగా మాట్లాడటం చూసాడు.

గోపీ నువ్వు బైట ఉండు అంటే గోపీ బైట నిలుచున్నాడు. జఫర్ తన చేతిలో ఇన్న ఉత్తరం రాజారావుకి ఇస్తే తెరిచి చదివాడు. రాజారావు కళ్ళలో నీళ్లు తిరిగాయి.

             “ఏరా రావు ఎలా ఉన్నావ్. న్యూస్ పేపర్ చదివినప్పుడల్లా నీ పేరు వింటూనే ఉంటాను. చాలా సార్లు కలవాలనిపించేది కానీ నేను వస్తే నువ్వు నీ పనులన్నీ పక్కన పడేస్తావని ఆగిపోయేవాడిని. నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి.......
  
................


చెప్పకుండా వెళ్లిపోతున్నానని నా మీద కోపం తెచ్చుకోకు, వెళ్లిపోయేముందు నిన్ను బాధ పెట్టడం ఇష్టంలేక ఇలా చెయ్యాల్సి వచ్చింది. నువ్వు నీ బాధ్యతలు త్వరగా తీర్చేసి వచ్చేస్తావని ఆశిస్తూ పైన నీకోసం ఎదురు చూస్తుంటాను.

నీ రెహ్మాన్”

రాజారావు కళ్ళు తుడుచుకుంటూనే నవ్వుతూ ఎదురుగా జఫర్‌ని చూసి దెగ్గరికి రమ్మన్నాడు. ఆఫీసు నుంచి బైటికి మెల్లగా బ్లర్ అవుతుంది.

చీకటి పడింది 

గోపీ అని పిలిస్తే కారు రెడీ చేసాడు. తాతయ్యతో పాటు జఫర్ కూడా ఎక్కాడు. గోపీ ఏమి అడగలేదు. తప్పక రాజారావు నోరు తెరవాల్సి వచ్చింది.

జఫర్‌ని నీతో పాటు కొన్ని రోజులు ఉండనివ్వు అన్నాడు రాజారావు. గోపీ ఎదురు అద్దంలో నుంచి తాతయ్యని చూస్తే రిక్వెస్ట్ అని చెయ్యి చూపించాడు. అలాగే అన్నాడు గోపీ. తాతయ్యని దింపేసిన తరువాత జఫర్ వంక చూసాడు. పెద్ద కనుగుడ్లు వాడివి, అమాయకంగా చూస్తున్నాడు. ఆ కళ్ళలో భయం ఉంది. పదా అంటే గోపీ వెనకే నడిచాడు. వాడి నడుము లయబద్ధంగా ఊగుతుంది. అది గోపీకి కనిపించదు. జఫర్ కనపడనివ్వదు. కనపడనివ్వడు.
Like Reply
#8

(10-03-2026, 03:15 PM)Uday Wrote:  ఎలా బ్రో...హౌ..హౌ...ఇన్ని త్రెడ్లు...కథ కొత్త వరవడిలో కొనసాగుతోంది. గోపి క్యారెక్టర్ నచ్చింది, ఎప్పటిగురించో ఆలోచించక ఇప్పటి గురించి ఆలోచించడం. పోతే పోతే పెద్ద గుద్దకా లేక పెద్ద వీపుకా...దేనికి మనోడి వోటు...చూద్దాం..కొనసాగించండి.

(15-03-2026, 06:20 AM)Milkboy76 Wrote:  The way it started and the description..really good..only issue is the delay in update..due to this tempo is missing for readers like us. Hope you'd follow other great writers of this group and give either regular updates or very long update after long gaps. 

As readers we have this expectation banana
Please don't mind Namaskar

(15-03-2026, 07:46 AM)Paty@123 Wrote:  Late updates is a problem, the moment new update comes, once again,we have to start reading from the beginning

Will try my best for faster updates
[+] 2 users Like Raagaa's post
Like Reply
#9

చీకట్లో గేటు తీసి మెట్లు ఎక్కుతుంటే గోపీ వెనకే వెళ్ళాడు జఫర్. లైటు వేస్తే గది మొత్తం చూసాడు. అంతా చూసి చివరికి గోపీ వైపు చూసాడు. మూలన చాప ఉంది, పక్క వేసుకుని పడుకో. ఒకటే ఉంది పెద్దగా వెయ్యి, నేను స్నానం చేసి వస్తా అని గోపీ టవల్ అందుకుని బైటికి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చేసరికి జఫర్ పక్క వేసాడు. నడుము ఆనించిన రెండు నిమిషాలకి గోపీ తన ఒంటి మీద ఏమి లేకుండా టవల్ కట్టుకుని వచ్చేసరికి జఫర్ ఒక్క ఉదుటున అటు వైపుకు తిరిగాడు. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. గోపీ అది చూసి ఏమైంది వీడికి అనుకుంటూనే నోటితో ఈల వేసుకుంటూ షాటు, టీషర్టు వేసుకుని పడుకుందామని జఫర్ దెగ్గరికి వచ్చాడు. జఫర్ అనుమానంగా చూస్తుంటే జరుగు బాస్, రేపు నీ చాప దిండులోనే పడుకుందువులే అంటే జఫర్ మౌనంగా చివరికి జరిగాడు. గోపీ కాసేపు ఫోన్ చూసుకున్నాక పక్కకి పెట్టేసి కళ్ళు మూసుకుంటూ నీ కథ ఏంటి? అని అడిగాడు.


మా దాదా రాజారావు ఫ్రెండ్స్ 
పని కోసం వచ్చావా? 
అవును
ఏం పని చేస్తావ్ ?
మనుషులు చేసేదే 

అబ్బో అనుకున్నాడు గోపీ. అయినా మనకి ఎందుకులే.. ఉన్నది పీల గొంతు కానీ ఎగిరిపడుతున్నాడు. తాతయ్య కొన్ని రోజులు అన్నాడు, తరవాత ఎలాగో నేను ఒప్పుకోను. తనకి తానే చెప్పుకుని మెల్లగా కళ్ళు మూసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

★

పొద్దున్నే మెలుకువ వచ్చి చూస్తే పక్కన జఫర్ కనిపించలేదు. లేచి తలుపు తీసుకుని బైటికి వచ్చి చూస్తే అప్పటికే స్నానం చేసి రెడీ అయ్యి ఎండలో గోడకి కూర్చుని ఆలోచిస్తున్నాడు. పోనీలే పొద్దున్నే లేచే అలవాటు ఉంది వీడికి, సంతోషం అనుకుంటూ ఫ్రెష్ అయ్యి తాతయ్య దెగ్గరికి వెళుతు జఫర్‌ని ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. వెళుతు కింద గీత ఆంటీకి కూడా జఫర్ గురించి చెప్పి వెళ్ళాడు. 

ఆఫీసుకి వెళ్లి జఫర్ సంగతి ఏంటి అని అడిగితే రాజారావు తన స్నేహితుడు రెహ్మాన్ గురించి చెప్పేసరికి గోపీ కరిగిపోయి సరే అన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి గదిలో రెండు మంచాలు, ఫ్రిడ్జ్ ఇంటికి కావాల్సిన కొత్త సామాను మొత్తం ఉంది. అంత సామాను వల్ల గది చిన్నగా కనిపించింది. గోడకి ఓ పెద్ద బొక్క కూడా పెట్టారు, జఫర్ ని ఏంటిది అని అడిగితే ఏసీ వాళ్ళు రేపు ఫిట్ చేస్తాం అని వెళ్లిపోయారు అన్నాడు. రెండు చేతులు నడుము మీద పెట్టుకుని గది అంతా చూస్తూ బైటికి నడిచి తాతయ్యకి ఫోను కొట్టాడు. అటు నుంచి కావాలనే ఫోను ఎత్తలేదని అర్ధమయ్యి చేసేది లేక మెల్లగా కిందకి దిగుతుంటే గీత ఆంటీ పలకరించింది.

చాలా సామాను వెళ్ళింది పైకి
గోపి నవ్వాడు
చెట్ల సంగతి నాకు వదిలెయ్యండి అన్నావ్
అన్నాను, టైం దొరకడం లేదు..

ఎదురింటి మేడ మీద నుంచి గోపిని గీతని చూసింది హిమజ.
ఏంటిది కొత్తగా! ఎవరితో పడితే వాళ్ళతో ఇది మాట్లాడదు కదా, తెగ నవ్వుతుంది. పైగా భుజం మీద కొట్టి మరీ నవ్వుతుంది. వీడేమైనా దీన్ని ట్రాప్ చేస్తున్నాడా ? గీత అంత తెలివి తక్కువది కాదు, దీనికే వాడు నచ్చాడా! మొగుడు మంచోడేగా, నాతో పోటీ పెట్టుకుని మరీ అందగాడిని పెళ్లి చేసుకుంది. ఏదైనా జరిగిందా? లేదంటే ఇది చెప్పినవన్నీ డాగులేనా.. సుఖం లేదా దీనికి?

హిమజ ఆలోచిస్తుంటే గీత చూసేసింది. హిమజ తమనే చూస్తుందని అర్ధమయ్యి వెక్కిరింపుగా నవ్వితే హిమజ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయింది గీత. ఏమైంది దీనికి అనుకుంది మనసులోనే.. గోపీ కూడా జరిగింది చూసాడు.

మీకు హిమజ గారికి పడదా ?

గీత నవ్వింది, అలా ఏం లేదు. మా ఇద్దరికీ పోటీ అంతే. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. బట్టల దెగ్గర నుంచి ర్యాంకుల వరకు అన్నింట్లో మాకు పోటీనే, ఇద్దరం ఒకటే కాలేజీ, ఒకటే క్లాసు. ఆ తరువాత కాలేజీ కూడా అంతే ఇద్దరం ఒకటే గ్రూపు ఒకటే క్లాసు. ఇప్పుడు పెళ్ళైన తరువాత కూడా ఇదిగో పోటీగా నా ఎదురింట్లోనే కాపురం పెట్టింది. అది జీవితాంతం నన్ను సాధిస్తూనే ఉంటుంది.

గోపి వావ్ అనుకున్నాడు. బహుశా మిమ్మల్ని చూడకుండా తను ఉండలేదేమో అన్నాడు.

అవును అంది గీత. ఆలోచిస్తే నిజమేనని తనికీ తెలుసు ఇన్ని సంవత్సరాలుగా పోటీ పడుతున్నా గొడవలు పడుతున్నా ఎప్పుడు దూరంగా ఉన్నది లేదు. ఇద్దరు ఒకేచోట ఉండడానికి తమకి తెలియకుండానే ఇద్దరు జీవితంలో చాలా వాటికి కంప్రమైస్ అయ్యారు. లేదంటే ఇద్దరు పెళ్ళైన తరువాత కూడా ఇలా ఎదురింట్లో ఉండడం అంత సులభం కాదు. గోపి తన మొహం మీద చిటికె వేస్తే ఆలోచనల్లోనుంచి బైటికి వచ్చింది.

ఇంకా అంటే మీరే చెప్పాలి అన్నాడు. అంతటితో ముచ్చట్లు ముగించి పైకి వచ్చేసరికి జఫర్ అన్నం వండుతూ కనిపించాడు. ఫ్రిడ్జ్ తెరిస్తే కూరగాయలు కూడా ఉన్నాయి. నీకు వంట వచ్చా అని అడిగితే వచ్చు అన్నాడు. వీడింతేనేమో అన్నిటికి పొడి సమాధానాలే ఇస్తాడు అనుకుని కాసేపు ఫోన్ చూసుకుని ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి తినేశారు. అర్ధరాత్రి మెలుకువ వచ్చి చూస్తే జఫర్ స్నానం చెయ్యడానికి బాత్రూం లోపలికి వెళుతున్నాడు, అలా బట్టలతో కాకపోతే టవల్ కట్టుకుని పోవచ్చుగా, అయినా మనకెందుకులే.. వీడిదో వింత క్యారెక్టర్ అనుకుని గోపీ పడుకున్నాడు.

పొద్దున్న లేచేసరికి జఫర్ కాఫీ తాగుతుంటే వెళ్లి ఎదురు కూర్చున్నాడు గోపీ. గుడ్ మార్నింగ్ మిస్టరీ పర్సన్ అంటే అనుమానంగా చూసాడు జఫర్. ఊరికే అన్నా కంగారుపడకు అంటే మెల్లగా వాడి మొహంలో కంగారు తగ్గింది. లేచి కాఫీ తెచ్చిస్తే థాంక్స్ చెప్పి తీసుకున్నాడు గోపీ..
Like Reply
#10

వారం రోజులకి గోపీ, జఫర్ ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఒకే రూములో సర్దుకుపోయారు. జఫర్ జోలికి ఎంత తక్కువ వెళితే అంత మంచిదని అర్ధమైంది గోపీకి, ఒకరోజు నీకు మీసాలు రావా అని అడిగితే కొట్టినంత పని చేసాడు. వాడు మంచి మెకానిక్ అని అర్ధమైంది, టాటా మోటార్స్ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ విభాగంలో రాజారావు నియమించాడు. పర్సనల్ గా ఏదో ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాడని తెలిసింది గోపీకి.


మనవడికి బండి కొనిచ్చాడు రావు. జఫర్,గోపి ఇద్దరు కలిసి వచ్చి వెళ్తున్నారు. ఇద్దరు బండి మీద ఇంటి వరకు వచ్చి అక్కడ నుంచి రావు గారి కారులో ఆఫీసుకి వెళతారు. సాయంత్రం మళ్ళీ కారులో ఇంటి వరకు వచ్చి రావు గారిని డ్రాప్ చేసి ఇక్కడనుంచి బండి మీద ఇంటికి వెళతారు. ఈ మధ్య అమృత కూడా తరచూ వీళ్లతోనే ఆఫీసుకి వెళుతుంది. దానికి కారణం కూడా ఉంది, ఇంతవరకు తమ పిల్లల్లో ఎవ్వరు రాజారావుకి దెగ్గర కాలేదు, కాస్తో కూస్తో అమృత పక్కన ఉండేది. ఏదో ఒకరోజు తనని తాను నిరూపించుకుని తాతయ్యకి వారసురాలిగా కంపెనీని, ఇంటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న కోరిక అమృతది. ఇప్పుడు ఎవ్వరు ఊహించనట్టుగా గోపి తాతయ్య పక్కన చేరాడు. గోపీని ఎవ్వరు పట్టించుకోకపోయినా కనీసం వాళ్ళిద్దరి మధ్యా సంబంధం ఎలా ఉంది, ఎంతవరకు ఉంది అన్న అనుమానంతో అమృత కూడా వీళ్ళకి దెగ్గరగా ఉంటుంది.


***


శుక్రవారం తల స్నానం చేసి బైటికి వచ్చాడు గోపి. ఎప్పటిలానే జఫర్ ముందే రెడీ అయ్యి కూర్చున్నాడు. జఫర్ ఎన్ని సార్లు చెప్పినా గోపీ పట్టించుకోడు. బాత్రూంలోనే బట్టలు వేసుకుని రమ్మంటే నవ్వుతాడు. మంచి మూడ్‌లో ఉంటే ఉన్న టవల్ కూడా విప్పి డ్రాయర్ మీదే రెడీ అవుతాడు. ఈ ఘోరాలన్నీ  చూడలేక జఫర్ మొహం కప్పుకుని బైటికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా పొరపాటున మర్చిపోయి వెనక నుంచి వచ్చి వాటేసుకుంటే గోపీని చచ్చేలా కొడతాడు జఫర్. గోపీకి కూడా వాడేం చేసినా నవ్వులాటగానే ఉంటుంది. జఫర్ కోపంతో కూడుకున్న మొహం, వాడి పీల గొంతు, వాడి ప్రవర్తనా.. ముందు వింతగా అనిపించినా తరువాత మొదలైన స్నేహంతో చూస్తే అవన్నీ  పిల్లతనంగా కనిపించి నవ్వుకుంటాడు.

గోపీ రెడీ అవుతుంటే చూస్తున్నాడు జఫర్. ఏంటి ఇవ్వాళ హుషారుగా ఉన్నావ్ అని అడిగితే ఇవ్వాళ నా పుట్టినరోజురా అని పాట పాడుతూనే చెప్పాడు గోపీ. ఓహ్హ్ అంటూనే లేచి చెయ్యి ఇచ్చాడు జఫర్. ఇద్దరి చేతులు కలుసుకున్నాయి. గోపీ ఆపకుండా చేతిని పిసుకుతుంటే ఎడమ చేత్తో కడుపులో ఒక్కటి గుద్దాడు. దేనికిరా గాడిదా అని తిడితే వెనక్కి తిరిగి వాడి ఎర్రని పెదాలతో నవ్వుకుని పక్కకి వచ్చేశాడు. ఇద్దరు కలిసి ఆఫీసుకి బైలుదేరారు. ఒక్కనిమిషం ఆగు అంటే ఆగాడు గోపి.. జఫర్ వచ్చి నోరు తెరువు అంటే తెరిచాడు, జఫర్ తన చేతిలో ఉన్న చెక్కరని గోపీ నోట్లో పోసి హ్యాపీ బర్తడే అని ముందుకు నడుస్తుంటే గోపీకి ఎమోషనల్ అనిపించింది. జఫర్ వెనక నడుస్తూ వాడి భుజాలు రెండు పట్టుకుని నొక్కి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని ఇంకా దెగ్గరికి వస్తుంటే గోపి డొక్కలో గుద్దాడు జఫర్. గాడిదా.. అమ్మా.. అని గోపి వెనక నడుస్తుంటే జఫర్ సిగ్గు పడుతూ వేగంగా కిందకి వెళ్ళిపోయాడు.

తాతయ్య దెగ్గరికి వచ్చాక ఆయన వెళదామా అని అడిగితే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని ఇంట్లోకి వెళ్ళాడు. పైన అమ్మ గది తలుపు మీద కొడితే అది తీసే ఉంది. కమిన్ అంది జనని. ఆమె అద్దం ముందు కూర్చుని రెడీ అవుతుంది, అద్దంలో చిన్న కొడుకుని చూసి వెనక్కి తిరిగి చూసింది. ఓ క్షణం కొడుకు వంక చూసి ఏంటి అని కళ్ళు ఎగరేస్తే ఏమి లేదన్నాడు. జనని మళ్ళీ అద్దం వైపు తిరిగి మేకప్ లో మునిగిపోతుంటే గోపి బైటికి వచ్చేశాడు. జగపతిరావు కూడా అప్పుడే స్నానం చేసి వచ్చాడు. జనని గోపి వచ్చిన సంగతి చెప్పింది. ఏంటటా ? aని అడిగితే ఏమి చెప్పలేదు, డబ్బులు ఏమైనా కావాలేమో అంది. ఇచ్చావా అంటే లేదు వెళ్ళిపోయాడు అంది. ఇద్దరు రెడీ అవ్వడంలో మునిగిపోయారు.

అమ్మ దెగ్గర నుంచి పెద్దనాన్న కూతురు రమ్య అక్క గదికి వెళితే గోపిని చూసి పలకరించింది. మాట్లాడాక వెళ్లిపోతుంటే గోపీ.. అని పిలిచింది, వెనక్కి తిరిగి చూసాడు. నాకు గుర్తులేదనుకున్నావా అని నవ్వుతూ దెగ్గరికి వచ్చి వాటేసుకుంటూ హ్యాపీ బర్తడే అంది. థాంక్స్ అన్నాడు గట్టిగా పట్టుకున్నాడు. నీకో చిన్న గిఫ్ట్ అని టేబుల్ దెగ్గరికి వెళ్లి బాక్స్ తెచ్చి ఇచ్చింది. తెరిచి చూస్తే వాచ్ ఉంది. థాంక్స్ అక్కా అని చేతికి పెట్టుకున్నాడు. బాగుంది అంటే బుగ్గ గిల్లింది. గోపి వాచ్ చూసుకుంటూ నవ్వుతూ బైటికి వస్తుంటే అప్పటికే జఫర్ చెప్పేసినట్టున్నాడు. తాతయ్య, అమృత ఇద్దరూ విషెస్ చెప్పారు. ముగ్గురిని ఆఫీసులో దించేసాక అటు ఇటు తిరుగుతుంటే ప్రీతి కనిపించింది. ఏమైందండీ ప్రీతీ గారు, ఆ రిసెప్షన్ టేబుల్ వదిలి రారు కదా ఏమైంది అని అడిగాడు. ప్రీతీ పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే ఆమె మొహంలో కంగారు చూసి స్వర్ణకి ఓ సారి హాస్పిటల్‌కి వెళ్లి రమ్మని మెసేజ్ పెట్టాడు.

అలా రావుని వదిలాడో లేదో, ఆయన నుంచి ఫోను రాగానే మళ్ళీ లోపలికి వెళ్ళాడు, కూర్చోమంటే కూర్చున్నాడు గోపి. చెప్పరా..  అంటే ఏముంది చెప్పడానికి అన్నాడు.
ఏమిచ్చింది మీ అమ్మ, వాచ్ బాగుంది.
ఇది రమ్యక్క ఇచ్చింది
రావుకి అర్ధమైంది, సరే ఏం కావాలో అడుగు ఇస్తాను
డెబ్భై లక్షలు కావాలి
ఎందుకురా !

విష్ణు అన్న బర్తడేకి మూడు కోట్ల కారు ఇచ్చావ్. అమృతకి కోటిన్నర పెట్టి డైమండ్ నెక్లెస్ కొనిచ్చావ్. పవన్ గాడికి కోటి రూపాయల కారు. రఘు అన్నకు కూడా.. అని లిస్ట్ చదువుతుంటే సరే అన్నాడు రావు. కానీ కాష్ ఎందుకు అంటే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా అన్నాడు. గోపీతో కష్టమని తెలిసి చెక్ రాసి ఇచ్చేసాడు. అలానే రేపటి నుంచి పర్సనల్ సేకరేటరీ బాధ్యతలు కూడా నీవే అంటే చెక్ ఇచ్చిన ఆనందంలో సరే అన్నాడు

జఫర్ ఎలా ఉన్నాడు ?
వాడికేం.. ఎక్కడున్నా బతికేస్తాడు.
వాడి గురించి నీతో మాట్లాడాలి.. తను అబ్బాయి..

సాయంత్రం చెప్పు. చాలా పనులున్నాయి అని లేచాడు గోపి. చెప్పేది వినరా అంటే సాయంత్రం వింటాలే.. అయినా వాడి గురించి భయపడాల్సిన పనిలేదు, నాకు బెస్ట్ ఫ్రెండులా అయిపోయాడులే.. అదీ కాకా మంచి మెకానిక్ అని కూడా విన్నాను. నువ్వేం కంగారుపడకు.. వాడిని నేను చూసుకుంటాలే అని చెక్కు చూసుకుంటూ సంతోషంగా బైటికి పరిగెత్తాడు.

వీడొకడు.. అన్నిటికి తొందర ఎక్కువే.. వాడు అబ్బాయి కాదని చెపుదామనుకుంటే వినిపించుకోకుండా పోయాడు. అయినా ప్రస్తుతానికి ఇద్దరికీ అదే మంచిదిలే.. ఒకే గదిలో ఉంటున్నారు. ఏదైనా తప్పు జరిగితే పైకి పోయాక రెహ్మాన్ గాడు నా తాట తీస్తాడు. తరువాత జఫర్ గురించి నిజం తెలిసిన రోజున మనవడు మొహం ఎర్రిపువ్వులా పెడతాడేమో అనుకుని నవ్వుకుంటూ పొద్దున ప్రీతీ ఇచ్చిన ఫైల్స్ చేతిలోకి తీసుకున్నాడు రాజారావు .
Like Reply
#11

ఫోన్ చేస్తే స్వర్ణ వచ్చింది. తనకి విషయం చెప్పి తాతయ్య ఇచ్చిన చెక్కు తీసి ఇచ్చాడు. నాకేంటి అంది స్వర్ణ, ఏం కావాలో చెప్పు అంటే పుట్టిన రోజు సందర్భంగా ఒక ముద్దివ్వు అంది. ముందు ఆశ్చర్యపోయిన తన గురించి ఎలాగో తెలుసు కాబట్టి నీ ఇంటికి వచ్చినప్పుడు ఇస్తానులే అంటే ప్రామిస్? అంది. గోపీ ప్రామిస్ వేసాడు. అయితే ఓకే అంటూ నవ్వుతూ గోపీని హత్తుకుని హ్యాపీ బర్తడే గోపీ అని తుర్రుమంది. పోయిన సారి స్వర్ణ వాటేసుకున్నదానికి ఈసారి వాటేసుకున్నదానికి తన సళ్ళ సైజు పెరిగింది అనిపించింది. తనకి తెలీకుండానే కింద కడ్డీ వెచ్చబడుతుంటే ఆలోచనని కొట్టేస్తూ మూడ్ నుంచి బైటికి రావాలంటే జఫర్ గాడే కరెక్ట్ అని వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు.

అంతా తిరుగుతూ జఫర్ ఏం చేస్తున్నాడో చూద్దామని వెళితే అప్పటికే వాడు ఫుల్లు పనిలో ఉన్నాడు. కారు ఇంజిన్‌తో కుస్తీ పడుతున్నాడు. గోపిని చూసి చిన్నగా నవ్వాడు. గోపి అంతా కలియజూస్తూ.. సొంత వర్కుషాపు. ఒక్కడివే పని చేస్తావ్. రికమండేషన్ జాబ్ అంటే ఇలా ఉండాలి అన్నాడు. జఫర్  కోపంగా చూస్తుంటే ఊరికే గెలుకుదామాని అని నవ్వాడు. రెంచీ విరిచేస్తా అన్నట్టు చూపించి మళ్ళీ పనిలో పడింది. గోపీని కసిరినప్పుడల్లా తన పెదవుల మీద మెరిసే మెరుపంటే జఫర్ కి బాగా ఇష్టం. ఎప్పటిలానే గోపీకి కనపడకుండా నవ్వుకున్నాడు. గోపిని చూస్తే ఊరికే నిలుచుని తననే చూస్తున్నట్టు అనిపించి అలా కాళీగా తిరక్కపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటే రేపటి నుంచి అన్నాడు గోపి రెంచి పట్టుకుని వేలికి పెట్టుకుని తిప్పుతూ.. మరి ఇవ్వాళ ? అని అడిగితే ఇవ్వాళ ఏం లేదు అన్నాడు. అయితే ఆ 12mm రెంచి తీసుకుని ఇది బిగించు అన్నాడు జఫర్. గోపీ సరేనంటూ రెంచి తీసుకుని వెళ్లి బిగిస్తుంటే జఫర్ ఆశ్చర్యపోయాడు. ఏది బిగించాలి అని అడగలేదు గోపీ.. అక్కడ అన్ని భాగాల్లో జఫర్ ఇప్పుడేం పని చేస్తున్నాడు, తరువాత వాడికి ఏ భాగం అవసరం పడుతుంది అని నిమిషాల్లో పట్టేసాడు గోపి.

ఇంజిన్ మొత్తం విప్పేసి ఉన్నా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నీకు తెలిస్తే చాలు నువ్వు మెకానిక్ అయిపోయినట్టే అన్న తన తాతయ్య రెహ్మాన్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నీకు మెకానిక్ పని తెలుసా! అని అడిగితే నా తాత రావు మోటార్స్ కంపెనీ ఓనర్ అన్నాడు నట్లు బిగిస్తూ.. మీ ఇంట్లో అందరికీ వచ్చా! అని అడిగితే తల తిప్పకుండానే నాకు వచ్చు అన్నాడు. గోపీని మాటల్లో పెట్టి అసలు గోపికి ఎంత తెలుసు అని తెలుసుకోవడం మొదలుపెట్టాడు జఫర్. ఇద్దరి మధ్యా ఇంకో కొత్త కనెక్షన్ ఏర్పడుతుందని దాని వల్ల వాళ్ళ చేతుల్లో ఉన్న ఇంజిన్ రూపు రేఖలు మారిపోతాయని  వాళ్లకి తెలీదు.

***

చీకటి పడింది. అమృత, రావు ఇద్దరు గోపీ కోసం ఎదురు చూస్తున్నారు. ఫోన్ చేస్తే ఎత్తడంలేదు. జఫర్ నుంచి కూడా అదే పరిస్థితి ఎదురయ్యేసరికి ఇద్దరు జఫర్ వర్కుషాపు వైపు వెళ్లారు. లోపల ఇద్దరు గ్రీజు పూసుకుని, మసితో ఉండడం చూసి అమృత ఆశ్చర్యపోయింది. రాజారావుది కూడా అదే పరిస్తిధి. గోపి కారు కింద రిపేర్ చేస్తుంటే జఫర్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అయ్యిందా అని అరిచాడు జఫర్. కారు కింద నుంచి గోపీ నవ్వులు వినిపిస్తే కోపంగా కాలుతో తన్నాడు. గోపీ నవ్వుతూ ఏం గొంతురా నీది.. అయ్యిందా.. అంట. గోపీ మాటలకి పైన కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న జఫర్ సిగ్గు పడ్డాడు.

రెంచితో రెండు సార్లు కొట్టినట్టు శబ్దం వచ్చింది. జఫర్ ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఒక నిమిషం నడిచి మళ్ళీ ఆగిపోయింది. వెనక సైలెన్సర్ నుంచి నల్లని పొగ కమ్మేసింది. గోపి మళ్ళీ కింద రెంచితో రెండు సార్లు కొట్టాడు. జఫర్ ఇంజిన్ ఆపేసాడు. ఐదు నిమిషాల తరువాత రిపేర్ చేసి కారు కింద నుంచి బైటికి వచ్చాడు గోపి. అమృతని తాతయ్యని చూసి వాళ్ళ పక్కన నిలుచున్నాడు. వాళ్ళ ఎదురుగా జఫర్ కారులో కూర్చుని ఉన్నాడు. మొహం అంతా మసి నిండిన గోపిని చూసి చిన్నగా నవ్వాడు జఫర్. గోపీ స్టార్ట్ చెయ్యమని సైగ చేస్తే స్టార్ట్ చేసాడు. ఇదంతా చూస్తున్న రాజారావు, అమృత మాత్రం ఇంకా ఆశ్చర్యపోతూనే ఉన్నారు. జఫర్‌కి గోపీ చేతి సాయం చేస్తున్నాడేమో అనుకుంది అమృత. కానీ ఒక్కడే కారు కింద రిపేర్ చేసి పైకి రావడం తను నమ్మింది నిజం కాదని చెపుతుంది మనసు.

రెండు నిమిషాలు అయినా ఇంజిన్ ఆగిపోలేదు. వెనక సైలెన్సర్ నుంచి నల్లని పొగ మెల్లగా తగ్గింది. ఇంజిన్ సౌండ్ కూడా ఇప్పుడు స్థిరంగా ఉంది. గోపీ నవ్వుతూ చెయ్యి ఎత్తితే జఫర్ కారు దిగి వచ్చి గోపి వైపు చెయ్యి ఎత్తితే గోపి తన చేతిని కొట్టాడు. ఇద్దరు పక్కన నిలుచుని చూస్తుంటే ఏంటిది అని అడిగాడు రాజారావు.

డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్(DCT) అన్నాడు జఫర్. దీని మీద మూడు సంవత్సరాలుగా తాతయ్య పని చేస్తున్నాడు. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం నాకు వచ్చింది అన్నాడు జఫర్.

మిగతా వాటికీ దీనికి ఏంటి తేడా అని అడిగింది అమృత.

ఇప్పుడు ఉన్న పార్షే, ఆడి ఇవన్నీ DCT వాడుతున్నా అవి ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు, ఓవర్ హీట్ సమస్యలు ఉన్నాయి. స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు జెర్కులు ఇవ్వడం, గేర్ టైమింగ్ సరిగ్గా ఉండదు. కానీ మన కారులో ఆ సమస్య ఉండదు. ఫుల్లీ డెవలప్డ్ DCT. చాలా సాఫ్ట్ చాలా రిలైయబుల్. ఎంత దూరం వెళ్లినా కారు ఆగదు, దాని పవర్ కూడా తగ్గదు. గోపి అవునని తల ఊపాడు.

మీరు రేసుల గురించి మాట్లాడుతున్నారా ! ఆశ్చర్యపోతూనే ఉన్నాడు రాజారావు

ఓ విధంగా చెప్పాలంటే అవును అన్నాడు గోపి. వీళ్ళ తాతయ్య మాములోడు కాదు.

రాజారావు మోహంలో ఆనందంతో పాటు కొత్త ఆలోచనలు పుట్టడం గమనించాడు జఫర్, వెంటనే కానీ సమస్యలు ఉన్నాయి తాతయ్య అన్నాడు.

ఏంటవి ?

ఇప్పుడున్న సాఫ్ట్వేర్ దీనికి సపోర్ట్ అవ్వదు. దీనికి కొత్తది డిజైన్ చెయ్యాలి. ప్రస్తుతానికి ఇది చూడటానికి తప్ప ఎందుకూ పనికి రాదు అని నిరాశగా కారుని చూస్తూ తల దించాడు జఫర్. గోపి తన భుజం నొక్కుతూ చూద్దాం అంటుంటే ఓ పక్క ధైర్యంగా ఉన్నా తన భుజం నొక్కుతున్న గోపి వంక కోపంగా చూసింది. గోపి అది చూసి వెంటనే చెయ్యి తీసేస్తూ నాలిక కొరుక్కుంటే జఫర్ నవ్వుకున్నాడు.

అంటే ఇప్పుడు ఇది నడవదా, ఏంటి సమస్య, మీకేం కావాలి అని అడిగాడు రాజారావు.

ప్రెడిక్టివ్ షిఫ్టింగ్ సిస్టం. దీనికి తగ్గ TCU కావాలి. అంటే అంది అమృత. ట్రాన్స్ మిషన్ కంట్రోల్ యూనిట్.. చెప్పాడు గోపి. జఫర్ చెపుతూ కారుకి ECU ఎలానో క్లచ్‌కి TCU అలా. మరి స్టార్ట్ అయ్యిందిగా అంది అమృత సందేహంగా. జఫర్ కారు దెగ్గరికి వెళ్లి బానెట్ మీద చెయ్యి పెట్టి ఇంజిన్ ఫీల్ అవుతూ స్టార్ట్ మాత్రమే అయ్యింది అని ఆగి గోపి వైపు చూసి థాంక్స్ అన్నాడు. అమృత, రాజారావు ఇద్దరు ఆశ్చర్యపోయారు. గోపి నవ్వుతూ నువ్వు ఇంట్లో వంట ఒండినదానికి దీనికి చెల్లుకు చెల్లు అని బైటికి వెళ్ళిపోయాడు. రాజారావు జఫర్ తో గోపి గురించి అడిగాడు.

గోపీ.. మెకానిక్.. ఎలా !

మీ కంపెనీలో ద బెస్ట్ మెకానిక్ కానీ ఇంజనీర్‌ని కానీ తీస్తే గోపి టాప్ త్రీలో ఉంటాడు తాతయ్య. అది నేర్చుకుంటే వచ్చినది కాదు, తను ప్రతీది ఫీల్ అవుతున్నాడు. కారు చేసే చిన్న చిన్న శబ్దాలు కూడా గోపికి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుస్తుంది. మా తాతయ్య తరువాత మళ్ళీ అంతటి నైపుణ్యం చూసింది గోపీలోనే.. ఈ పనికి అలవాటు పడితే గోపీని ఎవ్వరు ఆపలేరు.. అని పొద్దున నుంచి తను గమనించిన విషయాలు చెప్పాడు.

తనెక్కడ నేర్చుకున్నాడు? ఎవరు తన గురువు ? జఫర్ అడుగుతుంటే అప్పుడే వచ్చాడు గోపి. జఫర్  మసి మొహం చూసి ఇంకెంతసేపురా వెళ్లి కడుక్కోపో అంటే జఫర్ వెళ్ళిపోయాడు. రాజారావు మనవడి వైపు తిరిగి నువ్వెప్పుడు నేర్చుకున్నావురా ఇదంతా అని అడిగితే నవ్వాడు గోపి. అమృత చెప్పు అని అడిగితే.. నేను ఎక్కడా నేర్చుకోలేదు, మన గరాజ్‌లో పాడైన కార్లు ఉన్నాయి కదా వాటిని గెలుకుతూ నేర్చుకున్నా.

మాకెప్పుడు కనపడలేదే అని రాజారావు అమృత వైపు చూస్తే అమృత కూడా చూడలేదంటూ తల ఊపింది. ఇద్దరు గోపి వైపు చూసారు. గోపి నవ్వాడు. మీరెప్పుడు నన్ను పట్టించుకున్నారు? నాకు మీరంతా దూరం కదా.. అయితే చెట్ల దెగ్గరా లేదంటే కార్ల దెగ్గరా కూర్చునేవాడిని. ఏదైనా తెలియకపోతే మన పర్సనల్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడిగి తెలుసుకునేవాడిని.

ఎప్పటినుంచి చేస్తున్నావ్ ఇదంతా !

మూడు సంవత్సరాల నుంచి.. నా దెగ్గర మూడు కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి అని సంబరంగా చెప్పాడు గోపి.

అమృత ఆసక్తిగా చూసింది. ఎక్కడున్నాయి, నేను చూడచ్చా అని అడిగితే నవ్వాడు గోపి.

జఫర్ వచ్చేసరికి వెళదాం ఆకలి వేస్తుంది అన్నాడు. అమృతకి తన డిజైన్స్ గురించి చెప్పకుండా దాటవేయడం రాజారావుని మనవడి మీద ప్రత్యేక దృష్టి పడేలా చేసింది. గోపి అంత తేలికగా తీసేసేవాడు కాదని, ఇంట్లో అందరి కన్నా మనవడిలో విషయం రెండు ఆకులు ఎక్కువగానే ఉన్నాయని తెలుసుకున్నాడు. ఒకరకంగా నా అస్త్రం దొరికింది అన్న సంతోషం కనిపించింది రాజారావులో.. గోపీని అమృతని మార్చి మార్చి చూసాడు. మెదడులో పురుగు గట్టిగా తిరిగింది.

అమృత మళ్ళీ డిజైన్స్ గురించి అడుగుతుంటే రాజారావు  దీని గురించి చాలా మాట్లాడాలి, ఇవ్వాళ్టికి చాలు, వెళదాం పదండి అన్నాడు. అమృతని తాతయ్యని ఇంటి దెగ్గర డ్రాప్ చేసాక జఫర్ తోపాటు బండి ఎక్కాడు. రేయి బండి నేర్చుకుంటావా అని అడిగితే ఇప్పుడే కాదులే అని వెనక కూర్చున్నాడు జఫర్. ఇలా ఎన్ని రోజులురా అంటే ప్రస్తుతానికి నువ్వు ఉన్నావు కదా అన్నాడు. జఫర్ గోపి భుజం మీద చెయ్యి వేసాడు, అదీ మొదటిసారి. ఇవ్వాళ గోపీ పుట్టినరోజు కదా అని బైట తిందాం అన్నాడు జఫర్. గోపి కూడా అలాగేనని తీసుకెళితే ఇద్దరు తినేశారు. అక్కడే చిన్న బేకరీ కనిపిస్తే కేక్ కట్ చేయించాడు. గోపీ మళ్ళీ ఎమోషనల్ అవుతూ జఫర్ ముందుకు వెళ్లి గట్టిగా వాటేసుకుంటే రెండో క్షణంలోనే వెనక్కి తోసి గుండె మీద ఒక్కటి తన్నాడు. కింద పడి నొప్పితో గోపి తిడుతుంటే వెనక్కి తిరిగి నవ్వుకున్నాడు. బండి దెగ్గరికి వెళ్ళిపోతూ నన్ను ముట్టుకోకు నాకు నచ్చదు అన్నాడు. కోపంగా చూసాడు గోపీ..

సినిమాకి వెళదామా అంటే ముందు వద్దు అనుకున్నా గోపీ కోసం వెళ్ళాలనిపించింది. సరే అన్నాడు. ఇరవై రూపాయల టికెట్ తీసుకుంటే నవ్వాలో ఏడవాలో తెలీక గోపి వైపు చూస్తుంటే ఆట మొదలయింది పదా అని చెయ్యి పట్టుకుని లాగుతుంటే గోపీ మొహం చూస్తూ వాడి పక్కనే నడిచాడు. అటు పక్కన వేరేవాడు కూర్చుంటే ఇబ్బందిగా చూసాడు జఫర్. ఏమైంది అంటే ఏం లేదు అన్నాడు. పోనీ సీట్ మారుతావా అంటే గోపి పక్కన కూడా ఇంకొకడు ఉండేసరికి వద్దులే అన్నాడు. ఇరవై రూపాయల టికెట్లో ఉన్నవాళ్లు అంతా మాస్ కాండిడేట్లు. ఈలలు వేస్తూ గోల చేస్తుంటే బాగున్నా తన పక్కన కూర్చున్న వాడి చెయ్యి తగలడం జఫర్ కి నచ్చలేదు. గోపికి దెగ్గరగా జరుగుతూ తల ఎత్తి సినిమా చూస్తుంటే మెడ నొప్పి పుట్టింది. పొద్దున నుంచి కష్టపడటం వల్ల అలిసిపోయి కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా తల గోపి భుజం మీద ఆనుకుని నిద్రపోతుంటే గోపి గమనించి భుజం పడుకోవడానికి వీలుగా పెట్టి సినిమా చూస్తున్నాడు.

***

రాత్రికి రాత్రి గోపి, జఫర్  ప్రాజెక్టు విషయం ఇంట్లో అందరికీ తెలిసింది. అమృత ఏ ఉద్దేశంతో చెప్పినా అందరి కళ్ళలో ఆశ పుట్టింది. ముందు అమృత చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి. ఒక వేళ నిజమే అయితే ఆ డిజైన్స్, DCT చేజిక్కించుకొవాలి. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. ఆ రాత్రి రాజారావు కూడా నిద్రపోలేదు.


సినిమా హాల్ ఇంటర్వెల్ మధ్యలో లేస్తే అలిసిపోయిన జఫర్ లేస్తాడని అలానే కూర్చున్నాడు గోపి. ఇవ్వాళ వాడి కష్టం చుసిన తరువాత వాడంటే గౌరవం పెరిగింది. బలం లేని జఫర్ చేతులు, మణికట్టు చూసి బలం గురించి ఆలోచిస్తే నవ్వొచ్చింది. జఫర్  మొహం చూసి తెలీకుండా నిజంగానే నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయేలా ఉన్నావు కదరా అనుకున్నాడు.  ఫోనుకి ఆగకుండా మెసెజెస్, కాల్స్ వస్తుంటే చూసాడు. ఇంటి దెగ్గర నుంచి ఎప్పుడూ లేనిది ఇంట్లో వాళ్ళందరి దెగ్గర నుంచి బర్తడే విషెస్ వస్తున్నాయి. అనవసరంగా నోరు జారాను అనుకున్నాడు గోపి. ఇది అమృత పనే అని తెలుసు. మళ్ళీ సినిమా మొదలైయ్యేసరికి అందులో లీనం అయిపోయాడు.
Like Reply
#12

రాస్తున్నాను..
[+] 2 users Like Raagaa's post
Like Reply
#13

Thanks for your patience
Here is the update..
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#14

తెల్లారి జఫర్ కళ్ళు తెరవగానే కళ్ళెదురుగా తన పక్కనే పడుకున్న గోపి కనిపించాడు. రాత్రి సినిమా హాల్లో గోపి భుజం మీద పడుకోవడం. బండి మీద నిద్ర ఆపుకోలేక గోపీని వాటేసుకుని పడుకోడం అన్నీ గుర్తుకువస్తుంటే వాడి బుగ్గలు ఎరుపెక్కాయి. నిన్న రాజారావుతో ఇద్దరు కలిసి మాట్లాడటం, కలిసి ఇంజిన్ బిగించడం, ఇద్దరు హైఫై కొట్టుకోవడం అన్నీ తలుచుకుంటున్నాడు. అలా తననే చూస్తుంటే గోపీ కదలడం చూసి అటు వైపుకు తిరిగి పడుకున్నాడు. 

రోజూలానే గోపి లేవకముందే లేచి రెడీ అయ్యి కూర్చున్నాడు. బైట సూర్యుడి వెలుగులో కాఫీ కప్ పట్టుకుని ఆలోచిస్తుంటే నిద్ర మొహంతో వచ్చాడు గోపి. బ్రష్ చేసుకుని వస్తే జఫర్ లేచెళ్లి గోపికి కూడా కాఫీ తెచ్చిచ్చాడు. ఇద్దరు ఎదురెదురు కూర్చుని కాఫీ తాగుతుంటే గోపీ తననే చూస్తుండడం గమనించి తల పక్కకి తిప్పేసాడు.

కాఫీ చాలా బాగుంది అన్నాడు గోపి.
షుక్రియూ
ఆ మాట నేను చెప్పాలి అని గోపీ నవ్వుతూ అనేసరికి జఫర్ కూడా నవ్వాడు.
నీ ఏజ్ ఎంతా ?
ఎందుకు ?
అంటే నీకింకా మూతి మీద మీసం కూడా రాలేదు, గడ్డం కూడా మొదలవలేదు. ఇంత చిన్న వయసులో నీకు ఇంత మెకానిక్ పని ఎలా వచ్చింది, నీకు చదువుకోవడం ఇష్టం లేదా ?

మా నానాతో కలిసి కార్లు రిపేర్ చెయ్యడమే నా చదువు. నానానే నా గురువు. 

నానా అంటే?

మా నాన్న వాళ్ళ నాన్న 

అవునా.. మరి మీసం?

లేచి నిలుచున్నాడు జఫర్. గోపి భయపడి లేచి నిలబడుతూ నిన్ను ఇబ్బంది పెట్టేలా ఉంటే ఇంకేమి అడగను అన్నాడు. జాఫర్ చెయ్యి చిన్నదే కానీ దెబ్బ బలంగా తగులుతుంది, అది ఎలా సాధ్యమో మొన్న ఇంజిన్ రిపేర్ చేస్తున్నప్పుడు తెలిసింది గోపికి. 

జఫర్.. నీకేమైనా గోల్స్ ఉన్నాయా అని అడిగాడు మళ్ళీ వెంటనే..

ఉన్నాయి అన్నాడు జఫర్. గోపి చెప్పమంటే నాకంటూ ఓ కంపెనీ.. కొంచెం పేరు ప్రతిష్టలు వీటితో పాటు పక్కనే నన్ను ప్రేమించే మనిషి.. ఇవి చాలు అని చెపుతుంటే గోపి వావ్ అన్నట్టు చూసాడు, ఆ చూపుకి జఫర్ వెనక్కి తిరిగాడు. వెంటనే మళ్ళీ గోపిని చూసి మరి నీకు? అని అడిగితే నాకేం లేవు అని మాములుగా లోపలికి  వెళ్ళిపోయాడు. లక్ష్యం లేని మనుషులు ఉంటారా అనుకున్నాడు జఫర్. గోపి కూడా రెడీ అయ్యాక ఇద్దరు రాజారావు దెగ్గరికి బండి మీద స్టార్ట్ అయ్యారు. 

ఎంట్రో సైలెంటుగా ఉన్నావ్ అన్నాడు గోపి
ఏం లేదు. ఇవ్వాళ పెద్ద చర్చలే జరుగుతాయి మన ఇద్దరి గురించి..
అవునురా.. అనవసరంగా నోరు జారాను
నిన్నటి నుంచి నీ ఫోను మోగుతూనే ఉంది.
అందుకే సైలెంటులో పెట్టేశా.. విషెస్ చెప్పడానికిలే..
మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడవా?

ఉన్నపళంగా ప్రేమ, డబ్బు కురిపిస్తే నాకు నచ్చదు. ఏదైనా నిదానంగా శ్రమతో దక్కించుకోవాలి. సడన్‌గా వచ్చేవి వస్తుంటాయి పోతుంటాయి అవంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. జఫర్  ఏం మాట్లాడకపోయేసరికి గోపీనే అరె.. నువ్వెవరినైనా లవ్ చేసావా ? అని అడిగాడు.

లేదు. మరి నువ్వు ?
నేను ఒకప్పుడు లవ్ చేశాను కానీ ఇప్పుడు అవేమి లేవు.. కానీ క్రష్ ఉందిరా 
ఎవరి మీదా?
అమృత ఉంది కదా..
ఓహ్హ్
ఏంట్రా అంత పెద్ద దీర్ఘం తీసావ్. కొంపతీసి నీకు కూడా నచ్చిందా అంటే వీపు మీద గుద్దాడు జఫర్.

అబ్బాహ్.. వీడితో ఏం మాట్లాడినా తప్పే. 

వెనక జఫర్ నవ్వుకున్నాడు. మొబైల్లో మెసేజ్ చూసి తాతయ్య వాళ్ళు ఆఫీస్ కి వెళ్లిపోయారట, మనల్ని త్వరగా రమ్మంటున్నారు అంటే గోపీ  సరేనని నేరుగా ఆఫీస్ వైపే పోనించాడు.

***

ఆఫీసు లోపలికి వెళ్తుంటేనే అందరూ గోపిని, జఫర్‌ని వింతగా చూడటం చూసి జఫర్ కొంచెం ఇబ్బందిపడి ముందు నడిచాడు. రాజారావు బోర్డు మీటింగ్ పెడుతున్నాడని, ఇద్దరినీ త్వరగా రమ్మంటున్నాడని చెప్పింది ప్రీతీ. ఆమె మొహం సంతోషంగా ఉంది. అదే అడిగాడు..

ఏంటి ప్రీతీ గారు సంతోషంగా ఉన్నారు
ఒక్క రోజులో అద్భుతం జరుగుతుంది అంటే నువ్వు నమ్ముతావా ?
నమ్మను
అయితే నీకు నా సంతోషం చెప్పినా అర్ధం కాదు గోపి..

ఏదైతే ఏంటిలే నువ్వు హ్యాపీ కదా.. సూపరు.. అని లోపలికి నడిచాడు. ఉత్సాహంగా ఉన్న ప్రీతీ మొహం చూసి ఏమైంది అని అడిగాడు జఫర్. గోపీ నవ్వుతూ తరువాత చెప్తాలే అనేసరికి ఇద్దరు లోపలికి వెళ్లారు. అప్పటికే లోపల చాలా మంది ఎదురుచుస్తున్నారు. ఇద్దరు వెళ్లి రాజారావు పక్కన కాళీగా ఉన్న రెండు కుర్చీల్లో సర్దుకుని కూర్చున్నారు. రాజారావు నవ్వుతూ పలకరించాడు. జఫర్  నుంచి పలకరింపు వచ్చింది కానీ గోపీ అసలు చూడలేదు. చెత్త ఎదవ అని తిట్టుకున్నాడు మనసులోనే మనవడిని.

సీన్ ఓపెన్ చేసాడు రాజారావు. బోర్డుని, కంపెనీని, తమని, ఇన్వెస్టర్లని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ జఫర్ గురించి గోపి గురించి, ఇద్దరు కలిసి చేస్తున్న ప్రాజెక్టు గురించి చిన్న ఇంట్రో ఇచ్చి ఇక్కడ నుంచి జఫర్ కంటిన్యూ చేస్తాడని కూర్చున్నాడు. తనకు తెలిసిన అందరూ గోపీని ఆశ్చర్యంగా చూస్తుంటే గోపీ అసలు తల ఎత్తలేదు. వాడి కళ్ళు టేబుల్ కింద స్నేక్ గేమ్ ఆడుతున్న వాడి ఫోన్‌నే చూస్తున్నాయి. నోకియా 1100ని మోజు పడి తీసుకున్నాడు.

రాజారావు ఒక్కసారిగా అందరి ముందు జఫర్ అనేసరికి అయోమయంగా  చూశాయి వాడి కళ్ళు, వెంటనే గోపి వైపు చూసాడు, గోపి కూడా జఫర్ పేరు వినపడగానే ఫోన్ పక్కన పెట్టి తల ఎత్తి చూసాడు. తన వంక చూసి ధైర్యంగా వెళ్ళు అని తల ఊపుతుంటే జఫర్ మెల్లగా లేచి అందరి ముందుకు వెళ్ళాడు. భయమేసింది, అందరూ తననే చూస్తుంటే బెరుకు పుట్టి మళ్ళీ గోపి వైపు చూసాడు. ఏమైందో ఏమో గోపి కళ్ళలో తన కళ్ళు లాక్ అయ్యాయి. జఫర్ మాట్లాడటం మొదలుపెట్టాడు.  ఇక మిగతావాళ్ళ గురించి పట్టించుకోలేదు, తనకి తెలిసినదంతా గోపికి చెపుతుంటే గోపి కూడా శ్రద్ధగా విన్నాడు. అంతా అయిపోయాక గోపి చూపులో చిక్కుకున్న తన కళ్ళని బలవంతంగా దృష్టి మరల్చి పక్కకి చూసాడు. ముందు రాజారావు, ఆ వెంటనే అందరూ చెప్పట్లు కొడుతుంటే జఫర్ కళ్ళు సంతోషంగా మెరిసాయి. ఇంతకముందు డ్యూయల్ ట్రాన్స్‌మిషన్ మీద నమ్మకం లేని వాళ్ళు ఇప్పుడు నమ్మకంగా చూసారు. జఫర్ వెంటనే అక్కడి నుంచి వచ్చేసి గోపి పక్క చైర్లో కూర్చుంటే గోపి తన భుజం మీద చెయ్యి వేసి సూపర్ రా అంటుంటే జఫర్ గోపి చేతిని కొట్టేసాడు. 

ఓరినీ.. మెచ్చుకోవడం కూడా తప్పేనా అన్నాడు గోపి. రాజారావు ఇదంతా చూసి మనసులో ఈ ఎర్రిపూకు గాడు ఇంకా తెలుసుకోలేదు అని తల కొట్టుకుంటూ కుర్చీలో నుంచి లేచి మిగతా స్పీచ్ పూర్తి చేసాడు. చివరికి ప్రాజెక్ట్ అప్రూవల్‌కి వోటింగ్ పెట్టగా ఇంకో ఇద్దరు, పవన్ చేతులు ఎత్తలేదు. రాజారావు కోపంగా చుసిన ఒక్క చూపు పవన్ చెయ్యి ఎత్తేలా చేసింది, వాడి కళ్ళలో భయం అందరికీ నవ్వు తెప్పించింది.

అంతమందిలో ఒక్కరికి మాత్రం ఇది నచ్చలేదు. కానీ అందరికంటే తనే ముందు లేచింది. లేచి దెగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పింది అమృత. రాజారావు గర్వంగా గోపిని చూడటం తనకి నచ్చలేదు. మెల్లగా బైటికి వచ్చేసింది. అమృత బైటికి వచ్చేయడం కూడా ఎవ్వరు పట్టించుకోలేదు, దీనికి ఇంకా బాధేసింది. అమృత పిడికిలి బిగించి ఆలోచిస్తుంటే తన అన్నయ్య పవన్ కోపంగా బైటికి రావడం చూసింది. (వీడితో చేతులు కలపడం కంటే నా రెండు చేతులు పొయ్యిలో పెట్టడం నయ్యం అనుకుని పిడికిలి వదిలింది) 

అలా మీటింగ్ పూర్తయింది.

***

మూడు రోజుల్లో ప్రాజెక్ట్ మొదలవుతుందని ఈ రెండు రోజులు ఎంజాయి చెయ్యమని వదిలేసాడు రాజారావు.

ఇంటి దెగ్గర గోపి కింద మొక్కలతో కుస్తీ పడుతుంటే పై నుంచి నిలబడి చూస్తున్నాడు జఫర్. ఒక్కడే పని చేస్తుంటే చూసి దెగ్గరికి వచ్చింది గీత. పక్కన మనిషి వచ్చినట్టు అనిపిస్తే తల ఎత్తి చూసాడు. చీరలో దాగున్న గుండ్రని బొడ్డు కనిపించింది. వెంటనే తల ఎత్తి చూసాడు, గీత నవ్వుతుంటే హమ్మయ్యా గమనించలేదు అనుకుని పలకరించాడు. గీత కాళ్ళు మడిచి కూర్చుని చెట్ల గురించి అడుగుతూ ముచ్చట్లు పెడుతుంటే అప్పుడే మెట్లు ఎక్కుతున్న హిమజ కూడా ఈ ఇద్దరినీ చుసి ఆగింది. అలాగే పై నుంచి వీళ్ళనే గమనిస్తున్న జఫర్‌ని కూడా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి జఫర్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు.

నీతో పాటు ఉండే అబ్బాయి అసలు మాట్లాడడా.. నేనొక సారి పలకరిస్తే పారిపోయాడు అంది గీత. గోపీ నవ్వుతూ వాడంతే, ఈ మధ్యనే వాళ్ళ తాతయ్య గారు చనిపోయారు. తేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కదా ఆంటీ.. అదీ కాక ఊరి నుంచి వచ్చినవాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో వాడికింకా తెలీదు. మిమ్మల్ని చూడగానే భయపడి ఉంటాడు.

ఆలా ఉంటే కష్టం కదా అంది గీత. అవును అన్నాడు గోపి. ఇంతవరకు జఫర్ ప్రవర్తన గురించి, వాడి ఆలోచనా విధానం గురించి ఒక్క ముక్క కూడా అర్ధంకాలేదు గోపీకి. బాగా మాటల్లో పడితే మాత్రం ప్రశాంతంగా నవ్వుతాడు. తిడతాడు. ముట్టుకుంటే కొడతాడు. తను చెప్పే సొల్లంతా ఓపికగా వింటాడు. అదంతా గుర్తుకు వచ్చి నవ్వుకుంటుంటే గీత అడిగింది, ఏం లేదని మాటలు చెపుతుంటే ఇద్దరు ముచ్చట్లలో పడ్డారు.

ఆ అబ్బాయి సాయిబులు కదా, నమ్మచ్చు అంటావా అంది గీత. ఒక చూపు చూసాడు గోపి. నీ ఇంటి మీద బాంబు వెయ్యడులే కంగారు పడకు అన్నాడు. ఆలా కాదు గోపీ అని గీత ఏదో చెపుతుంటే. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు కానీ జఫర్ క్యారెక్టర్ మాత్రం గోల్డ్. వాడికి మనిషి వెనకాల మాట్లాడటం,  గోతులు తవ్వడం.. ఇవేవి వాడికి చేతకాదు. 24 కాదు 48 కారెట్ గోల్డ్ ఆడు అంటే అలాగేనంది గీత.

సాయంత్రం కిందకి దిగాడు జఫర్. గోపీ ఏదో చెపుతుంటే గీత గోపీ భుజం మీద పడి పడీ నవ్వుతుంది. అది చూడగానే జఫర్ మోహంలో నవ్వు పోయింది. వెంటనే పైకి వెళ్లిపోతుంటే పిలిచాడు గోపి. జఫర్ వెనక్కి తిరిగాడు. జఫర్ చేతిలో బండి తాళాలు కనిపించాయి, మొన్న బండి నేర్పిస్తానని చెప్పింది గుర్తుకువచ్చి, ఉండరా కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను అంటే అలాగే  అన్నాడు జఫర్.

జఫర్‌ని చూసి  హాయ్ అని పలకరించింది గీత, చెయ్యి ఎత్తి హాయ్ అన్నాడు. గీత ఇంకేదో మాట్లాడుతుంటే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ బండి పక్కన నిలబడ్డాడు. జఫర్  నడక చూసి ఒక క్షణం వింతగా చూసి అదే టైములో గోపీ వచ్చి గీత మొహం చూసి ఏమైంది అని అడిగితే ఏం లేదంది. గోపి మొహం తుడుచుకుని బండి తీయ్యి రా అంటే జఫర్ బండిని గేటు బైటిదాకా నడిపించాడు. గోపి వెనక ఎక్కి స్టార్ట్ చెయ్యమని చెపుతుంటే గీత లోపలికి వెళ్ళిపోయింది.

జఫర్  బండి స్టార్ట్ చెయ్యగానే భుజాల మీద రెండు చేతులు వేసి పట్టుకున్నాడు గోపి. చురుగ్గా వెనక్కి ఒక చూపు విసిరాడు జఫర్. బండి ఆగిపోయింది. గోపి కోపంగా చూస్తూ ఏంటీ.. వదిలేస్తే దేనికో దానికి గుద్దుతావ్ అంటే మళ్ళీ అటు వైపు తిరిగి బండి స్టార్ట్ చేసాడు. ఇక పోనీ అంటే క్లచ్ వదలగానే ముందుకు  బండి దూకింది. గోపీ జఫర్ మీద పడ్డాడు. గోపి మెల్లగా జఫర్ చేతి మీద తన చెయ్యి వేసి క్లచ్ ఎలా వదలాలో చెయ్యి నొక్కుతూ క్లచ్ నొక్కిస్తే సరే అన్నాడు. జఫర్ బుగ్గలు ఎరుపెక్కాయి. బండి స్టార్ట్ చేసి మెల్లగా నడుపుతుంటే బానే నడుపుతున్నావ్ కదరా అన్నాడు గోపి. క్లచ్ ఒక్కటే సమస్య, మిగతాదంతా వచ్చు అన్నాడు జఫర్. సరే.. కాసేపు నడుపుకో అని నడుము మీద రెండు చేతులు వేసి పట్టుకొగానే సడన్ బ్రేక్ కొట్టాడు జఫర్. బండి పడుతుందేమో అని భయపడ్డాడు గోపి, ఏమైందని అడిగితే కోపంగా చూసాడు. నడుము మీద చేతులు తీ అన్నాడు కఠినంగా. 

గోపి కోపం నషాళానికి అంటింది. నేనేం చెక్కగాడిని కాదు, ఏదో ఫ్రెండ్షిప్‌లో పట్టుకున్నాను. నువ్వేదో స్వచ్ఛమైన మగాడివి మిగతావాళ్ళు కాదు అన్నట్టు బిల్డప్పు. గట్టిగా మాట్లాడితే మూతి మీద మీసం రాలేదు, గడ్డం కూడా లేదు. నీ కనుబొమ్మలు కూడా చిన్నవే.. లిప్ స్టిక్ పెట్టుకున్నట్టు ఆ పెదాలు చూడు. నీ చేతి మీద కూడా సరిగ్గా వెంట్రుకలు లేవు. ఆ చర్మం చూడు మెత్తగా అని చేతిని గిల్లి..  చెక్కగాడివి నువ్వా నేనా అని కోపంగా తిట్టేసాడు గోపి.

ఇద్దరి మధ్యా పది క్షణాల మౌనానికి జఫర్ తల కిందకి దీంచేసాడు. వాడి కంట్లో నీళ్లు తిరిగాయి. గోపికి భయం వేసింది. రేయ్.. సారీరా నేను కావాలని అనలేదు. ఇద్దరం ఒకటే రూములో ఉంటాం, ఇద్దరం కలిసి పని చేస్తున్నాం. పైగా ఇద్దరం కలిసిపోయాం. నేను ముట్టుకున్నప్పుడల్లా నువ్వు అలా కోపంగా చూస్తుంటే ముందు పట్టించుకోకపోయినా తరువాత నాకు చిరాకు వచ్చేది. నీ మీద నాకేం మోజు కాదురా, నా జీవితంలో ఒక మనిషితో ఇంత దెగ్గరగా, ఇంత స్నేహంగా ఉన్నది నీతోనే.. నువ్వలా కసురుతుంటే బాధగా ఉంది. కోపంలో మాటలు బైటికి వచ్చేసాయి. నిజంగా సారీ.. ఇక నేను ముట్టుకోను. పదా వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు.

జఫర్ బండి స్టార్ట్ చేసి వెనక్కి తిప్పాడు. గోపి మెలకుండా వెనక కూర్చుంటే జఫర్ తన చేతిని వెనక్కి పోనించి గోపి చేతిని పట్టుకుని నడుము మీద వేసుకున్నాడు. గోపీ నవ్వుతూ నాకు తెలుసురా ఎలా మాట్లాడితే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావో.. ఎలా ఉంది నా యాక్టింగ్ అని రెండు చేతులతో జఫర్ నడుము పట్టుకుని పిసికేసాడు. జఫర్  ముందు ఇబ్బంది పడ్డా తరువాత సిగ్గుగా నవ్వి ఏడిసావ్ లే.. పోనీ అని వదిలేస్తున్నా.. ఎక్కువ చేస్తే.. అని మోచేత్తో డొక్కలో పొడిచాడు. అబ్బాహ్.. రేయి.. అని జఫర్ వీపు మీద దెబ్బ వేసి పోనీ పోనీ స్పీడ్ పెంచు ఇవ్వాళ బిర్యానీ తిందాం అని భుజాలు రుద్దాడు. జఫర్  బుగ్గలు మళ్ళీ ఎర్రబడ్డాయి.

బైటికి వెళదాం అంటే జఫర్ నేనే చేస్తాను అన్నాడు. బిర్యానీ వాసన గీతకి, హిమజకి ఇద్దరికీ తగిలింది. గీత పైకి వచ్చి అడిగితే గోపీ చెప్పాడు. జఫర్ ఇబ్బంది గమనించి గీత కిందకి వెళ్ళిపోయింది. అయ్యాక తెచ్చిస్తే ఏమైనా సాయిబులు బిర్యాని చేసినట్టు ఇంకెవ్వరు చెయ్యలేరు అంది మెచ్చుకుంటూ.. గోపీ తనని చూస్తూ మొన్న ఏదో అన్నావ్ అన్నాడు. అది కూడా నిజమే కదా అని తింటుంటే గీత భుజం మీద గిచ్చాడు గోపీ.. 

గీత ముందు ఆశ్చర్యపోయినా గోపీలో ఇంకో చూపు కనిపించకపోయేసరికి స్నేహంగా నవ్వింది. 
Like Reply
#15

ఈ మూడు రోజుల్లో గోపి, జఫర్ ఇద్దరు ఊరంతా తెగ తిరిగేశారు. ఇద్దరి మధ్యా స్నేహం ఇంకా ముదిరింది. జఫర్ ఇంకా ఓపెన్ అయ్యాడు. ఇద్దరు నవ్వుకోవడం, పోట్లాడుకోవడం ఎక్కువైంది. జఫర్‌కి వంటలో సాయం చేస్తున్నాడు గోపి. ఈ ఇద్దరు తెగ తిరగడం కింద ఇంట్లో ఉన్న గీతతో పాటు ఎదురింట్లో ఉన్న హిమజ కూడా గమనిస్తుంది. లేట్ నైట్ వస్తుంటే ఓ రోజు వార్నింగ్ కూడా ఇచ్చింది గీత. శుక్రవారం పొద్దున్నే గోపీ లేచేసరికి తల స్నానం చేసి కూర్చున్నాడు జఫర్. నన్ను కూడా లేపచ్చు కదరా అంటే లేపాను నువ్వు లేవలేదు అన్నాడు.


రేయి నువ్వు మస్జీద్ కి వెళ్ళవా.. శుక్రవారం పక్కా వెళ్తారు కదా.. నువ్వెంటి ఎప్పుడూ ఇంట్లోనే చేస్తావ్!

నాకు అంతమందిలో నచ్చదులే.. అయినా నమాజ్ అక్కడే చెయ్యాలని రూల్ లేదు. నాకు ఒంటరిగా చెయ్యడమే ఇష్టం. ఎక్కువగా దువా చేస్తాను.
అంటే..?

అంటే నేను నా దేవుడితో మాట్లాడుకుంటాను. నాకు కావాల్సినవి అడుక్కుంటాను. కష్టాలు చెప్పుకుంటాను.. అన్నీ..

ఒహ్హ్.. అయితే నేను  కూడా నా దేవుడితో మాట్లాడుకోవాలి, మొక్కుకోవాలి.

ఏమని.. నవ్వాడు జఫర్.

తిరుపతి లడ్డు తినాలని మొక్కుకున్నా.. అన్నవరం ప్రసాదం కోసం మొక్కుకున్నా. ఇప్పుడు శబరీ వెళ్లాలని మొక్కుకుంటా అంటే పగలబడి నవ్వాడు జఫర్. దేవుడిని నమ్మవా అని అడిగితే.. నమ్ముతాను కానీ ఏమి అడగను, ఎలాగో నాకేమి ఇవ్వడు. జఫర్ మాట మార్చుతూ ఇంకేం మాట్లాడతావ్ అంటే.. ఏమో మాటలన్నీ నీతోనే మాట్లాడుతున్నా కదరా ఆయనతో ఇంకేం మాట్లాడాలి అంటే ఒకలా చూసాడు జఫర్. 

కాఫీ పెడతాను.. అని జారుకున్నాడు.

స్వర్ణ నుంచి మెసేజ్ : ఈ వారం చివరి లోపు నన్ను కలవలేదంటే ఇంకెప్పటికీ నన్ను కలవకు

నిజమే.. వీడితో తిరగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్వర్ణని అసలు తలుచుకోలేదు. కలిస్తే ముందు పొట్లాడుతుంది అని నావ్వుకున్నాడు.

*** 

ఇవ్వాళ ప్రాజెక్టు మొదలవుతుంది కదా.. త్వరగా రమ్మని తాతయ్య ఫోన్ చేసాడు అని గోపి అంటే నేనెప్పుడో రెడీ నువ్వే ఇంకా గాడిదలా తొంగున్నావ్ అని జఫర్ నవ్వుతుంటే రేయి అని లేచాడు.. జఫర్ అల్లరిగా బైటికి పరిగెత్తితే గోపి వీడికి ఎక్కువైంది అనుకుంటూ టవల్ అందుకుని స్నానం చేసి వచ్చాడు. ఇద్దరికీ కాఫీ పెట్టి ఎదురు చూస్తున్నాడు జఫర్. తాగేసి చెప్పులు వేసుకుని గది తాళం వేస్తుంటే జఫర్ కడుపు పట్టుకున్నాడు. అనుమానంగా గజ్జల్లో చెయ్యి పెట్టి నొక్కి చూసాడు. ఒంటికి ఏమవుతుందో అర్ధమైంది.

ఏమైందిరా!
నాకు ఒంట్లో బాలేదు, నువ్వెళ్లు
అదేంటి ఇవ్వాళ నీకు ఇంపార్టెంట్ కదా..
నా వల్ల అవ్వదు. అయినా నువ్వు ఉన్నావుగా.. నువ్వెళ్లు అన్నాడు జఫర్.
పోనీ కాసేపు ఆగి వెళదామా.. లేదంటే హాస్పిటల్ కి వెళదామా?

వద్దు. ముందు తాళం తెరువు అంటే గోపీ తాళం తీసాడు. జఫర్ వెంటనే నడుము చుట్టు టవల్ కట్టుకుని బాత్రూంలోకి దూరాడు. పది నిమిషాలు గడిచినా జఫర్ బైటికి రాలేదు. రేయి వస్తున్నావా లేదా అని గోపి అడిగితే నువ్వెళ్లు.. ఇవ్వాళ నేను రాను అనేసరికి గోపి తాతయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సరే నువ్వు వచ్చేయి అన్నాడు రాజారావు. గోపి జఫర్‌కి చెప్పేసి ఒక్కడే వెళ్ళిపోయాడు.

***

ఎండలో ఆటో దిగి ఇంటికి నడుస్తుంది హిమజ. పిల్లాడి కాలేజ్ ఫీజు కట్టి వస్తుంది. ఎండకి, ఒంటికి పట్టిన చెమటకి అసహనంగా నడుస్తుంటే మెడికల్ షాపులో జఫర్ కనిపించి నడక వేగం తగ్గించింది.

అన్నా పేపర్లో కట్టి ఇవ్వరా అని అడిగితే అలాగే ఇచ్చాడు మెడికల్ షాపు వాడు. అది తీసుకుని బ్యాగులో పెట్టుకుని వెళుతుంటే అప్పటికే అదేంటో అర్ధమైన హిమజ నిర్ధారించుకోవడానికి మెడికల్ షాపు లోకి వెళ్ళింది.

చెప్పండి మేడం
ఇప్పుడు ఒకబ్బాయి వచ్చాడు కదా.. అతనేం తీసుకెళ్లాడు ?
వాళ్ళ అక్కగారికి  ప్యాడ్స్ మేడం.. మీరెవరు?
నేను వాళ్ళ ఎదురింట్లోనే ఉంటాను. నాకూ తీసుకురమ్మని చెప్పారు అందుకే..
అయితే తను తీసుకెళ్లాడు మేడం.

హిమజ బైటికి వచ్చింది. అప్పటికే జఫర్ వెళ్ళిపోయాడు. హిమజ వేగంగా ఇంటికి నడిచి వెళ్లేసరికి జఫర్ తన గది తలుపులు వేసుకోవడం చూసి వేగంగా గేటు తీసుకుని గీత ఇంటి తలుపు కొట్టింది. రెండో సారికి తలుపు తీసింది గీత. ఎదురుగా హిమజని చూసి ఏంటీ ? అని అడిగింది. ఏదో విషయం లేకపోతే హిమజ తన ఇంటి తలుపు తట్టదని గీతకి తెలుసు.

పైన ఆ పిల్లోడు మెడికల్ షాపులో వాళ్ళ అక్కకి అని చెప్పి ప్యాడ్స్ కొనడం చూసాను.
ఎహె ఊరుకో..
నిజమే.. పరిగెత్తుకుంటూ వచ్చి పైకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
ఎవరికైనా తీసుకున్నాడేమో !

హిమజ ఒప్పుకోలేదు. చూస్తే తప్పేంటి. నాకేదో తేడా కొడుతుంది వాడి విషయంలో.. పైగా సాయిబుల పిల్లోడు. చుస్తున్నావుగా ఈ మధ్య ఏం జరుగుతుందో.. మొన్న కాశ్మీర్లో అందరిని కాల్చేశాడు ఒకడు. గోపీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అలా ఏం జరగదులేవే అంటే హిమజ కొట్టేస్తూ మళ్ళీ చూస్తే తప్పేంటి అంది. హిమజ వినేలా లేదని సరే పదా అని తన వెనకే వెళ్ళింది. ఇద్దరు పైకి వెళ్లి తలుపు కొడితే ఎవరూ అన్న జఫర్ గొంతు విని నేనే అంది గీత.

ఓ సారి తలుపు తెరువు అంది హిమజ తలుపుని నెడుతూ.. పది నిమిషాలు ఆంటీ అన్నాడు జఫర్. ఇప్పుడే తెరువు అంది హిమజ. అయినా తెరవలేదు. గీత వదిలెయ్యవే అని చెపుతున్నా వినలేదు హిమజ. తలుపు కొడుతూనే ఉంది. నువ్వు తలుపు తెరవకపోతే సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేస్తాను అని బెదిరించేసరికి జఫర్ భయపడి తలుపు తెరిచాడు. ఎదురుగా టవల్లో ఉన్న జఫర్‌ని చూసారు ఇద్దరు. గీత స్పష్టంగా గమనించింది, టవల్ కింద పాదం దెగ్గర ఎర్రగా రక్తం. కాళ్ళ మీద వెంట్రుకలు లేవు. హిమజ అంతే వేగంగా టవల్ లాగేసింది. జఫర్ నిజం బయట పడిపోయింది. తొడల మధ్య రక్తం చూడగానే హిమజకి, గీతకి ఇద్దరికీ అర్ధమైంది జఫర్ మగాడు కాదని. జఫర్ కళ్ళలో భయం, కంగారు, అవమానం జరిగిన బాధని  చూడగానే గీత వెంటనే టవల్ అందుకుని నడుము చుట్టు చుట్టి ప్యాడ్స్ ఎక్కడా అని అడిగితే తల దించుతూ చెయ్యి ఎత్తి చూపించింది. గీత హిమజా.. అంటే హిమజ ప్యాకెట్ చించి గీతకి ఇచ్చింది.

గీత దెగ్గరుండి బాత్రూంకి తీసుకెళ్లి సాయం చేసింది. అంతా అయ్యాక జఫర్ బట్టలు వేసుకున్నాడు. మంచం మీద కూర్చుంటే ఇద్దరు చెరో వైపు తన పక్కన కూర్చున్నారు. గీత తన భుజం మీద చెయ్యేస్తే తల ఎత్తి చూసింది జఫర్.
గోపికి తెలుసా తెలీదా అని అడిగితే తెలీదని తల ఊపింది. హిమజ, గీతా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.

ఎందుకిలా అని అడిగితే చెప్పింది. ఆ సమాధానం హిమజకి, గీతకి ఇద్దరికీ నచ్చింది. నీ నిజం బైటికి రాదులే కంగారుపడకు అంటే జఫర్ కృతజ్ఞతగా చూసింది. హిమజ మంచినీళ్లు తెచ్చి ఇస్తే తాగి థాంక్స్ చెప్పింది. కాసేపు ఊరికే కూర్చున్నారు. హిమజ లేచి బండలు తుడిచింది. 

గీత నవ్వితే జఫర్ కూడా చిన్నగా నవ్వింది. అయితే గోపీని ఎర్రి పప్పని చేస్తున్నావన్నమాట అని హిమజ నవ్వితే ఇద్దరూ నవ్వారు. గీత అనుమానంగా వాడికి మరీ అమ్మాయికి అబ్బాయికి తేడా తెలీదా! అని అడిగితే గోపీ ఇప్పటివరకు ఒంటరిగానే ఉన్నాడని, అమ్మా నాన్న ఉన్నా లేనట్టేనని రాజారావు ద్వారా, గోపీ ద్వారా తను విన్నది చెప్పింది. ఇద్దరు ముందు గోపీ కోసం బాధ పడ్డా మళ్ళీ జఫర్‌ని చూసి నవ్వారు. గోపీకి తెలిసినప్పుడు వాడి మొహం చూడాలి అంది నవ్వుతూ.. జఫర్ కూడా నవ్వేసింది.


జఫర్ అని పిలిస్తే తల ఎత్తి చూసింది.
నీ అసలు పేరేంటి ?
జఫర్ నుంచి వచ్చిన స్పష్టమైన అమ్మాయి గొంతు విన్నారు గీత, హిమజ.

నా పేరు ****
Like Reply
#16

(21-04-2026, 04:52 AM)Rishabh1 Wrote:  chaduvtunnattu ledu choostunnattu undi, excellent!

Thankyou
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#17

ఈ నాలుగు ఐదు రోజులు నా దెగ్గరే ఉందువు పదా అంది గీత. జఫర్ ముందు వద్దన్నా గీత, హిమజ బలవంతం చేసేసరికి కాదనలేకపోయింది జఫర్. రెండు జతల బట్టలు తీసుకుని గీత ఇంటికి వెళ్ళింది. గది చూపిస్తే మంచం మీద కూర్చుంది. కాసేపటికి హిమజ వెళ్ళిపోయాక గీతా, జఫర్ ఇద్దరే మిగిలారు.

ఆంటీ.. మీ ఆయన! అంది జఫర్.

కంగారుపడకు. ఆయన క్యాంపుకి వెళ్లారు.

క్యాంప్ అంటే..

మొదట బిజినెస్ చేసేవారు, తరువాత నష్టం వచ్చిందని ఇప్పుడేదో చేస్తున్నారు. అదేంటో నాకు తెలీదు, నాకు వివరంగా చెప్పలేదు. అందుకే క్యాంప్ అంటాను అని నవ్వింది గీత. మొన్నే వెళ్ళారు. ఇప్పుడల్లా రారులే.. నీకు భయం లేదు అంటే జఫర్ అలాగే అంది. అయినా నువ్వు ఇన్ని రోజులు గోపీతోనే ఉంటున్నావ్, కలిసి తిరుగుతున్నారు, మొన్న నీ నడక చూసినప్పుడే ఒక క్షణం ఆగిపోయాను నేను, వాడికి అసలు అనుమానం రాలేదా అంటే నవ్వింది జఫర్. లేదని నవ్వుతూనే తల అడ్డంగా ఊపింది.

గోపీ తింగరోడు ఆంటీ.. అలా అని ముద్దపప్పేం కాదు. కాకపోతే నన్ను పూర్తిగా నమ్మేశాడు. ఎప్పుడైనా నాకు గడ్డం, మీసం లేదని ఏడిపిస్తుంటాడు. 

అవును అంది గీత. నిన్ను ఇంతగా నమ్మాడు కదా. నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో 

జఫర్ మొహంలో చిన్న బాధ గమనించింది గీత. లేచి తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని వెళ్ళింది.

గోపీకి ఫోన్ చేసింది జఫర్.

ఎలా ఉందిరా ఇప్పుడు ?
బానే ఉంది.

ఆఫీస్‌కి వస్తావా?
లేదు, ఇక్కడ తెలిసిన చుట్టాలున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చా, రెండు రోజుల్లో వస్తా.

ఓహ్.. మరి ఇక్కడా.. సరే నేను చూసుకుంటాలే. ఎంజాయి అంటే హ్మ్ అని ఉ కొట్టి పెట్టేసింది. ఏమంటున్నాడు అంది గీత నవ్వుతూ.. చుట్టాలంటికి వచ్చాను, రెండు రోజుల్లో వస్తానని చెప్పాను అంది జఫర్. అయితే ఈ రెండు రోజులు దాగుడుమూతలు అన్నమాట అని ఇద్దరు నవ్వుకున్నారు.

***

ఒక్కడే షెడ్‌లో జఫర్ పని చూస్తున్నాడు గోపీ. జఫర్ ఎలా పనిచేస్తాడో అర్ధం చేసుకోవడానికే చాలా టైం పట్టింది. సాయంత్రం అయ్యేసరికి తాతయ్యని ఇంట్లో డ్రాప్ చేసాడు. బండి మీద ఇంటికి వచ్చాడు. 

బండి శబ్దం వినగానే కిటకీలో నుంచి తొంగి చూసింది జఫర్. గోపీ పైకి వెళ్ళిపోయాడు. తలుపు తీసి లోపలికి వెళితే అన్నం కూరా వండేసి ఉన్నాయి. హమ్మయ్యా అనుకున్నాడు గోపీ. వెంటనే జఫర్‌కి ఫోన్ చేసాడు.

ఎలా ఉందిరా ఇప్పుడు?
తగ్గింది.

సరే..
హా..

ఉంటా అయితే 
హా..

సరే బై అని పెట్టేసాడు గోపీ. స్నానం చేసి అన్నం తిన్నాడు. ఒక్కడే గది నుంచి బైటికి వచ్చి ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు. రోజూ ఈ టైంకి జఫర్ చెవిలో తూనీగలా చిరాకు తెప్పించేవాడు. ముందు తను గెలకడం ఆ తరువాత వాడితో డొక్కలో గుద్దించుకోవడం.. ఇప్పుడు చాలా రోజుల తరువాత మళ్ళీ ఒంటరితనం ఆవహించింది. స్వర్ణకి ఫోన్ చేసాడు.

గోపీ.. అంది స్వర్ణ 
ఏం డూయింగు?

ఇప్పుడే తినేసి కూర్చున్నా. నువ్వు?
నేను కూడా 

చెప్పడం మర్చిపోయా ఆ ప్రీతీ నీకోసం వెతుకుతుంది.
దేనికి?

డెబ్భై లక్షలు పెట్టి వాళ్ళ అమ్మని బతికిస్తే వెతకదా.. డబ్బు కట్టింది నేనే అని తెలుసుకుని నా ఆఫీస్ దాకా వచ్చింది. మీకెలా తెలుసు, నాకెందుకు సాయం చేశారు అని చాలా అడిగింది. నోటికొచ్చినవి చెప్పి పంపించేసాను. నువ్వే అని చెప్పేద్దామా అనుకున్నా.. మళ్ళీ నీకిష్టం లేదు కదా అని ఆగిపోయా.. 

అదే మంచిదిలే..

హా.. హాస్పిటల్ బిల్స్ టాక్స్‌లో కలిపేస్తా.. అదొక బెనిఫిట్ నీ వల్ల నాకు. ఇక్కడికి రావచ్చు కదా 

వస్తాలే..
ఏంటి డల్‌గా ఉన్నావ్ 

అదేం లేదు. బోర్ కొడుతుంది.
నీ ఫ్రెండ్ లేడా 

వాడు  ఎటో వెళ్ళాడు 
ఇక్కడికి వచ్చేయి మరి 

ఇప్పుడు అంత దూరం రాలేనులే.. గుడ్ నైట్ 
స్వర్ణ హలో.. అంటున్నా పెట్టేసాడు. 

పొద్దున్నే కళ్ళు తెరిచి చూస్తే రోజూ కనిపించే జఫర్ మొహం కనిపించలేదు. బ్రష్ చేసుకుని బైటికి వెళ్ళాడు. కాఫీ చెపితే అది చెండాలంగా ఉంది, అక్కడే పారబోసి ఇంకో టీ కొట్టు దెగ్గరికి వెళ్ళాడు. ఇంకో నాలుగైదు తిరిగినా ఎవరూ జఫర్‌లా కాఫీ పెట్టివ్వలేదు. చేసేది లేక ఇంటికి వచ్చి జఫర్‌కే ఫోన్ చేసాడు.

ఒరేయి ఈ కాఫీ ఎలా పెట్టాలి? పాలు ఎక్కడున్నాయి. కాఫీ పొడి ఎక్కడుంది?
నవ్వాడు జఫర్ 

ముందు స్టవ్ ఆన్ చెయ్యి 
ఆ చేశా.. 

ఫ్రిడ్జ్ లో కింద మూలకి చిన్న గిన్నెలో పాలు ఉంటాయి చూడు. కాఫీ పొడి పాకెట్లు కారం డబ్బా పక్కన ఉంటాయి.

అదెక్కడుంది?
ఉప్పు డబ్బా పక్కన 

ఆ దొరికింది. 
ముందు పాలు కాగపెట్టు 

ఆ పెట్టా 
సింలో పెట్టు 

ఆ పెట్టా 
మరిగాయా 

ఇంకా లేదు.
అయితే ఆగు.

ఏం పని మీద వెళ్ళావ్ 
ఊరికే వచ్చాను. వీళ్ళని కలిసి చాలా రోజులు అవుతుంది.

హా.. పొంగుతున్నాయి 
స్టవ్ ఆపు 

ఆపేసా
కాఫీ పొడి పాకెట్ చించి అందులో పొయ్యి 

హా పోసా 
పంచదార కూడా వెయ్యి 

హా వేసా 
బాగా కలుపు 

హా స్పూన్ ఎక్కడుంది. ఆ.. కలిపా 
గ్లాసులో పోసుకుని తాగేయి 

ఒరినీ ఇంతేనా!
అంతే అని నవ్వాడు.

సిప్ వేసాడు. నువ్వు చేసినట్టు రాలేదురా 
ఒక్క సారికే ఎలా వస్తుంది..

అంతేలే.. సరే త్వరగా వచ్చేయి. నిన్ను తాతయ్య అడిగాడు. ఆయనకి కూడా చెప్పు అంటే సరే అని పెట్టేసింది జఫర్. తాతయ్యకి ముందే చెప్పేసింది. గోపీ అలా అనేసరికి చిన్నగా నవ్వుకుంది. ఫోన్ పక్కన పెట్టి గీత కోసం వంటింట్లోకి వెళ్ళింది.
Like Reply
#18

షెడ్‌లో ఉంటే ప్రీతీ వచ్చి సర్ పిలుస్తున్నారు అని చెప్పింది. తాతయ్య దెగ్గరికి వెళ్ళాడు గోపీ. రాజారావుతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఇంజనీర్స్ అని పరిచయం చేసాడు. నీకు సాయం చేస్తారు అని చెపుతుంటే జఫర్ వచ్చాక వాడికే ఇవ్వు అన్నాడు గోపీ. 

మరి నువ్వేం చేస్తావ్ 
నేను వాడికి సాయం చేస్తున్నా.. అంతవరకే. నువ్వు డ్రైవర్‌గా రమ్మన్నావ్. వస్తున్నా. అంతే అని లేచాడు.


వన్ సెకండ్ గాయ్స్ అంటే బైటికి వెళ్లిపోయారు వాళ్ళు. మనవడి వంక కోపంగా చూసి నిన్నటి దాకా బానే ఉన్నావ్ కదరా.. ఇప్పుడేమైంది మళ్ళీ నీకు. తిన్నగా ఉండలేవా 

అవన్నీ నా వల్ల కాదు తాతా.. ఇంజిన్ ఒక్కటే పూర్తి అయితే సరిపోదు. దానికి తగ్గ బాడీ కావాలి, ట్రాన్స్‌మిషన్‌కి తగ్గ సాఫ్ట్వేర్ కావాలి. ఇదంతా అయ్యాక అప్పుడు బైట దేశాల్లో ప్రచారం చేసుకుని రేసింగులకి తీసుకెళ్లి అక్కడ గెలిచి అందరికి నిరూపిస్తే గానీ రావు మోటర్స్ ఇంటర్నేషనల్ అవ్వాలన్న నీ కల నెరవేరదు. నువ్వు మొన్నటి దాకా బానే ఉన్నావ్. జఫర్ గాడు ఇంజిన్ గురించి చెప్పడం, నేను నా దెగ్గర డిజైన్స్ ఉన్నాయని చెప్పడం వల్లే కద నీకు ఆశ పుట్టింది.

తప్పా అన్నాడు రాజారావు ఆవేశంగా 

కాదు, కానీ ఇదంతా నా వల్ల కాదు. నేనింత ప్రెషర్ తీసుకోలేను. జఫర్ గాడికి ఈ పని అంటే ప్యాషన్, నీకు ఇదే జీవితం, వీళ్లందరికి ఇదే పని. నేనలా కాదు.. ఏదో వాడితో మాటలు కలుపుతూ వాడు చెప్పిన రెండు నట్లు బిగించాను. 

లోపలికి ఎప్పుడు వచ్చిందో కానీ అమృత వచ్చిన సంగతి వీళ్ళు గమనించలేదు.

ఎందుకు తాతయ్యా గోపీని ఇబ్బంది పెడుతున్నావ్ అని అమృత గొంతు వినగానే ఇద్దరు తల తిప్పి చూసారు. అమృత వచ్చి కుర్చీలో కూర్చుంది.

డోర్ నాక్ చెయ్యకుండా రావడమే కాకుండా తనకి సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఎదురు కుర్చీలో కూర్చుంది అమృత. కోపంగా పిడికిలి బిగించి చూసాడు రావు. గోపీ అది గమనించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని లేచి బైటికి వెళ్ళిపోయాడు.

తాతయ్యా ఈ ప్రాజెక్ట్ నాకివ్వు. నీ కోరిక నేను నెరవేరుస్తా.. చిన్న పిల్లలా గోముగా అడిగింది అమృత. రాజారావుకి అమృతకి ఏం కావాలో అర్ధమైంది. అసలు ఈ ప్రాజెక్టు ఎంత కాలం పడుతుందో ఎలా తయారు అవుతుందో తనకి నాలెడ్జ్ కూడా లేదు. 

నేను ఈ ప్రాజెక్టకి హెడ్‌గా ఉంటా తాతయ్యా. నన్ను నమ్మండి. మీరు ఇచ్చే డెడ్ లైన్ కంటే ముందే పూర్తి చేస్తా అంది నమ్మకంగా 

ఆలోచించి చెప్తాను అన్నాడు రాజారావు. అమృత బైటికి వచ్చింది. గోపీ కోసం వెతికితే నడుస్తూ కనిపించాడు. వేగంగా వెళ్లి తన పక్కనే నడిచింది. గోపీ అమృతని చూసి చిన్నగా నవ్వాడు.

తాతయ్య నన్ను ఈ ప్రాజెక్టుకి హెడ్‌గా ఉండమన్నారు 
కంగ్రాట్స్ 

అంతేనా! నీకేం అభ్యంతరం లేదా!
నాకెందుకు అభ్యంతరం 

నీ దెగ్గర డిజైన్ ఉంది కదా 
ఉంది 

నాకు నీ డిజైన్ ఇస్తావా.. ఇన్ని రోజులు వీళ్లందరి మధ్యలో కాంపిటీషన్ అని గొడ్డులా కష్టపడుతున్నాను. అయినా ఫలితం లేదు. నువ్వు సాయం చేస్తే నాకు ఈ కంపెనీలో గుర్తింపు ఉంటుంది. నీకెంత కావాలో చెప్పు అంది చెక్ బుక్ తీసి 

రేపు వాల్యుయేషన్ చేయించి నా లాయర్‌తో కబురు పెడతాను. డిజైన్‌కి పేటెంట్ పేపర్స్ కూడా రెడీ చేయించాలి, అదంతా అయ్యాక చూద్దాం అన్నాడు గోపీ..  బిత్తరపోయింది అమృత. తన మొహం చూసి గట్టిగా నవ్వితే అయోమయంగా చూసింది. కంగారుపడకు రేపు ఫైల్ ఇస్తాను అని నవ్వాడు గోపీ. 

అమృత ముందు నవ్వినా వెంటనే సారీ.. అని తల దించుకుంది.

దేనికి?

నీ మీద అసూయా, కుళ్ళు పుట్టేసాయి. ఒక్కసారి చెడ్డదానిలా ఆలోచించేసాను.


ఏం చేద్దామని అని కన్ను ఎగరేసాడు గోపీ.

నవ్వుతూ గోపీ భుజం మీద కొట్టింది. నాకొక సారి డిజైన్ చూపించవా అంటే పేపర్ మీద గీసి చూపించాడు. పది నిమిషాలు దాని గురించి మాట్లాడితే చాలా విషయాలు తెలిసాయి. వావ్ అనుకుంది అమృత. గోపీ కనక సీరియస్‌గా తమకి కాంపిటీషన్ వస్తే ఆరుగురిలో ఎవ్వరూ సరిపోము అనుకుంది అమృత. గోపీ.. నైట్ డిన్నర్‌కి వెళదామా అని అడిగింది. సరే అన్నాడు గోపీ.

జఫర్ నుంచి ఫోన్ వస్తుంటే వెంటనే ఎత్తాడు.

చెప్పరా.. ఎక్కడున్నావ్?  వస్తున్నావా?
లేదు, ఇంకో రెండు రోజులు..

సరే.. చెప్పు 
ఊరికే చేశా 

రేయి నీకోటి చెప్పాలి. ఇందాక అమృత డిన్నర్‌కి పిలిచింది.
ఓహ్.. వెళుతున్నావా 

హా.. అదేంటో నువ్వెళ్ళాక బాగా కలిసొస్తుంది నాకు. సరే సరే తను పక్కనే ఉంది. నువ్వు కూడా త్వరగా వచ్చేయి.. అని పెట్టేసి అమృత వైపు తిరిగాడు.

ఎవరు అని అడిగింది అమృత 
జఫర్ 

నాకు తన నంబర్ ఇవ్వు అంటే ఇచ్చాడు గోపీ.

***

ఆఫీస్ అయిపోయాక త్వరగా ఇంటికి వచ్చాడు. బండి గేటు దెగ్గరే ఆపేసి ఎలా రెడీ అయ్యి వెళదామా అని వేగంగా గేటు తీస్తుంటే పక్కన కారు కనిపించి ఆగిపోయాడు. గేటు తీస్తూనే గీతతో మాట్లాడుతున్న అమ్మ కనిపించింది. పక్కన ఎవరూ లేరు.. తనొక్కటే వచ్చింది.

మొన్న నా బర్తడే రోజు పని ఉండి రాలేక ఇవ్వాళ వచ్చిందా. నన్ను చూడాలనిపించిందా. లేదంటే నాతో ఏదైనా పని పడిందేమో.. ఎక్కువగా ఊహించుకుంటున్నానని తెలుసు.

గోపీని చూసిన గీత, అదిగో వచ్చేసాడు అని నవ్వింది. జనని కూడా నవ్వింది. గోపీని చూసి ఎలా ఉన్నావ్ అని అడిగింది. గోపీ ముందు ఆశ్చర్యపోయినా, ఆ వెంటనే కళ్ళలో నీళ్లు తిరిగినా.. ఇదంతా అబద్దం అని తెలుసు. పక్కనే గీత ముందు చెడ్డది కాకుండా అమ్మ నటిస్తుందని అర్ధమయ్యి బాగున్నా.. పైకి వెళదాం అని మెట్లు ఎక్కుతుంటే వెనకే నడిచింది జనని.. అప్పటివరకు అందంగా నవ్వుతున్న ఆమె మొహం మెట్లు ఎక్కుతున్నప్పుడు మాములుగా చిరాకుగా మారిపోయింది.

తలుపు తీస్తే లోపలికి వచ్చింది జనని. సూటిగా అడిగాడు గోపీ.. మీకివ్వడానికి నా దెగ్గర ఇంకేం లేవు. ఏంటి నాతో పని అని తల్లి వంక చూసాడు. 

మీ నాన్న పంపించారు. నీ దెగ్గర కార్ డిజైన్ ఉందటగా, నిన్ను అడగమని పంపించారు. 

నేనెందుకు ఇవ్వాలి. నాకేంటి లాభం 

పేరెంట్స్... అని ఏదో చెప్పబోయింది జనని 

నా 2% వాటా ఇచ్చేసాను.

మీ నాన్న అడగమన్నారు, అడిగాను. నువ్వు ఇస్తావో ఇవ్వవో అది నీ ఇష్టం, తీసుకుంటాడో లేదో ఆయన ఇష్టం. ఆయన నిన్ను అడగమన్నాడు అడిగాను అని వెళ్లిపోతుంటే.. ఎందుకు నేనంటే అంత అసహ్యం మీకు. అంత తప్పు ఏం చేశాను. మిగతా వాళ్ళు ఎటు పోయినా నాకు అనవసరం, నాన్న పట్టించుకోకపోయినా కూడా పర్లేదు.. నీకెందుకు నేనంటే అంత అసహ్యం.. నీకే అన్యాయం చేసాను అని అడిగాడు గోపీ. 

జనని సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటే.. నేను అడిగిన వాటికి నిజం చెప్తే డిజైన్ ఇచ్చేస్తాను అన్నాడు గోపీ.. ఆగింది జనని. వెనక్కి తిరిగి చూసింది.

నువ్వు నాకు పుట్టలేదు. నువ్వు నా కొడుకువి కాదు. నువ్వొక అబద్దానివి. ఇరవై ఏళ్లుగా నిన్ను, అబద్దాన్ని ఇష్టం లేకుండా మోస్తున్నాను. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. 


ఓ రోజు..
Like Reply
#19

రాత్రి నా మొబైల్ స్క్రీన్ పగిలింది. అంతకముందే పగిలింది. ఈ సారి డామేజ్ ఇంకా ఎక్కువైంది. టైపింగ్ చేస్తుంటే ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం పడి నరకం కనిపిస్తుంది. వచ్చే నెల పదో తారీకు జీతం పడి ఫోను బాగు చేయించే వరకు నేను అప్డేట్ ఇవ్వలేను. కావున update అని ఎవరు అడగకండి. వచ్చే నెల పదిహేనవ తేదీన తరువాత కథ పోస్టు చేస్తాను.

ధన్యవాదాలు 
Like Reply
#20

ఓ రోజు మీ తాతయ్య ఏడాది నిండని నిన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఆఫీసులో మీ నాన్న తన సెకెరటరీతో చేసిన తప్పు వల్ల నువ్వు పుట్టావ్. నిన్ను మీ అమ్మని ఎలా వదిలించుకోవాలో మీ నాన్నకి అర్ధం కాలేదు, మీ అమ్మని చంపించేసాడు. అది మీ తాతయ్యకి తెలిసింది. మీ నాన్న జైలుకి వెళ్లకుండా కాపాడి అలానే నిన్ను ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. నాకు నిన్ను ముట్టుకోవడం కూడా ఇష్టం లేదు, కానీ నా ఇష్టాయిష్టాలు డబ్బున్న ఇంట్లో ఎవరు పట్టించుకోరని నాకు తెలుసు. నాకిష్టం లేకుండానే నీకు పాలు పట్టాను. నాకిష్టం లేకుండానే నిన్ను సాకాను. నటించాను. నువ్వు బాధ పడ్డా ఇదే నిజం. నేను నిన్నెప్పటికీ కొడుకులా ఒప్పుకోను. మీ నాన్న పైకి మాములుగా ఉన్నా లోపల నువ్వంటే అసహ్యం. నిన్ను చుసిన ప్రతీ సారి చేసిన తప్పు గుర్తుకువచ్చి నీ మీద ఇంకా కోపం పెంచుకునేవాడు. మొదట్లో నిన్ను చంపేద్దామని చాలా సార్లు ప్రయత్నించాడు, కానీ ఆ విషయం మీ తాతయ్యకి తెలిసిన తరువాత ఆయన భయపడి ఆగిపోయాడు. అందుకే నిన్ను ఎవరేమన్నా ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. ఎవరూ నిన్ను సహించేవాళ్ళు కాదు. ఆ ఇంట్లో మీ తాతయ్య తప్ప అందరూ నిన్నొక పనిమనిషిలా చూసేవాళ్ళే. అంతా చెప్పి గోపిని వంక చూసింది జనని.


గోపి మోహంలో కన్నీళ్లు లేవు, బాధా లేదు. ఏమైనా మాట్లాడతాడేమో అని చూసింది జనని. గోపి వెనక్కి తిరిగి షెల్ఫ్ నుంచి ఫైల్ తీసి దెగ్గరికి వచ్చి ఇస్తే జనని ఫైల్ తీసుకుంది. గోపీ ఇంకేం మాట్లాడకపోయేసరికి నేను వెళతాను అంది జనని. ఇంటి నుంచి బైటికి రాగానే గీత కనిపించేసరికి ఆగిపోయి వెంటనే పట్టించుకోనట్టు వెళ్లి కారు ఎక్కి మొగుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కారు వెళ్లిపోతుంటే చూస్తున్న గోపిని చూసి గీత వెంటనే కిందకి వెళ్ళిపోయింది.

అవన్నీ వాడికెందుకు చెప్పావ్ అని అరిచాడు జగపతి.
ఫైల్ నా చేతికి వచ్చింది. దాని కోసం చెప్పాను అంది జనని.

ఏమైనా అన్నాడా నిన్ను, నన్నేమైనా అన్నాడా ?
లేదు.. ఒక్క మాట కూడా అనలేదు.
సరే నువ్వు త్వరగా వచ్చేయి. దాన్ని చెక్ చేయించాలి అంటే సరే అంది జనని. కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

కిందకి వచ్చేసిన గీత తను చూసింది, విన్నది మొత్తం జఫర్‌కి చెప్పేసింది. జఫర్ వెంటనే మంచం దిగి మెట్లు ఎక్కి పైకి వెళ్లి చూస్తే తలుపు పెట్టేసి ఉండటంతో కిందకి వచ్చేసి రాజారావుకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పింది.

***

సిస్టంస్ రన్ అవుతున్నాయి. గోపీ ఇచ్చిన డిజైన్ కంపైలేషన్ జరుగుతుంది.

రాజారావు లోపలికి వచ్చాడు. అమృత తాతయ్య దెగ్గరికి వచ్చి నిలబడింది. ఎక్కడిదాకా వచ్చింది అని అడిగాడు రాజారావు.

CAD చెక్ అయిపోయింది. సిములేషన్ టెస్ట్ జరుగుతుంది. రెసిస్టెన్స్, స్పీడ్ & బాలన్స్ అన్నీ దాదాపు 89 - 96% నొ ఎర్రర్ వస్తుంది. ఎలా తాతయ్యా గోపీ ఇదంతా ఎలా చేయగలిగాడు. ఇది తనదేనా లేదంటే ఎక్కడైనా దొంగలించాడా!

రాజారావు నవ్వాడు. మీరందరు గోపీని తక్కువ అంచనా వేశారు. ఆ రోజు వాడు జఫర్‌తో కలిసి కార్ రిపేర్ చేసినప్పుడే నేను ఎంక్వయిరీ చేశాను. ఈ కోడింగ్ ప్రాసెస్ అంతా చేసింది స్వర్ణ.

స్వర్ణా ! ఎవరు ?

మన ఇంట్లో పని మనిషిగా చాలా ఏళ్ళు పని చేసింది. గోపీ తనని చదివించాడు. తను ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీర్‌గా పని చేస్తుంది. అండ్ షి ఈజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్.

అనుకున్నాను. ఇదంతా గోపీ వల్ల అయ్యే పని కాదు. తనని మనం హైర్ చేసుకుందాం తాతయ్యా. తను ఇప్పుడు ఎంతైతే సంపాదిస్తుందో దానికి డబల్ ఆఫర్ చేద్దాం. తాతయ్యని మెప్పించాను అన్నట్టు చూసింది అమృత.

రాజారావు చిన్నగా నవ్వాడు. నువ్వింకా చాలా నేర్చుకోవాలి అమృతా.. ప్రయత్నించి చూడు అని వెళ్ళిపోతుంటే జఫర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో జఫర్ చెప్పింది వినగానే చేతిలో ఉన్న ఫైలు విసిరికొట్టాడు రాజారావు, అక్కడే ఉన్న అమృత భయపడింది. రాజారావు ఫోను వింటూనే ఆఫీస్ లోకి వెళ్ళాడు. వెనకే వచ్చిన అమృతని బైటికి వెళ్లిపొమ్మని సైగ చేస్తే అమృత బైటికి వెళ్ళిపోయింది. ఫోన్ కట్ చేసి జగపతిని రమ్మని ప్రీతీకి చెప్పాడు. అరగంటలో జగపతి, జనని ఇద్దరు రాజారావు ముందు ఉన్నారు.

వాడి మనసు విరగ్గొట్టి మీరేం సాధిద్దామని. ఇంతవరకు వాడిని వేధించింది చాల్లేదా?

జనని, జగపతి నోట నుంచి మాట పేకలలేదు. రాజారావు జనని వంక అసహ్యంగా చూసి వెళ్ళిపోండి అని అరిచాడు. ఇద్దరు బైటికి వెళ్లిపోయారు.

అమృత డిజైన్ టెస్టింగ్ అయిపోగానే జగపతి తన దెగ్గరున్న ఫైలుని టెస్టింగ్‌కి ఇచ్చాడు. అమృతకి చూడగానే అర్ధమైంది అది గోపీదే అని. జగపతి మావయ్య తనకి పోటీ రావడం అమృతకి నచ్చలేదు. ఆఫీస్ అయిపోయాక స్వర్ణ గురించి వెతుకులాట మొదలుపెట్టింది. గోపీకి ఫోన్ చేస్తే ఎత్తలేదు.

***

చీకటి పడింది. రాజారావు కారు గీత ఇంటి ముందు ఆగింది. గేటు తీసుకుని మెట్లు ఎక్కి గోపీ ఇంటి తలుపు కొట్టాడు. తీయలేదు. గోపీ అని పిలిచినా, తలుపు బాదినా సమాధానం రాలేదు. రాజారావు కిందకి వచ్చేసాడు. జఫర్‌తో గీతతో మాట్లాడి వెళ్ళిపోయాడు. జఫర్ గోపీ ఇంటి తలుపునే చూస్తుంటే గీత ఇంట్లోకి తీసుకెళ్లిపోయింది. కాసేపటికి హిమజ కూడా వచ్చింది. ఇద్దరు జఫర్‌కి ఇరువైపున కూర్చున్నారు. గోపీ గురించి మాట్లాడుతుంటే హిమజ జఫర్‌ని గమనించింది.

నీకు గోపీ అంటే ఇష్టం కదా అని అడిగింది హిమజ. ఆ ప్రశ్నకి జఫర్ కంగారు పడుతుంటే గీత మధ్యలో కల్పించుకుని హిమజని తిట్టింది.

***

ఆఫీస్ అయిపోయాక ఇంటి ముందు ఆగిన కంపెనీ క్యాబ్ నుంచి దిగింది స్వర్ణ. ఇంట్లోకి వెళుతుంటే అమృత కనిపించి ఆగింది. హాయ్ మేడం ఎలా ఉన్నారు అని పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోపెట్టింది.

గోపీ దెగ్గరున్న కార్ డిజైన్స్ నువ్వే చేశావాని తెలిసింది. 

అవును గోపీ చేయించుకున్నాడు అంది స్వర్ణ.

వాట్.. 

ఎస్, ఐడియా గోపీది. నేను పని చేశాను.

ఓకే.. ఐ విల్ కం టు ద పాయింట్. నువ్వు నా కింద పని చెయ్యడానికి నీకెంత కావాలి? అని చెక్ బుక్ తీసింది.

అయోమయంగా చూసింది స్వర్ణ. వెంటనే అమృత గారు, నాకు నా ఆఫీస్‌లో కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి లేకపోయినా నేను మీ కింద పని చెయ్యలేను.

ఎందుకు అని అడిగింది అమృత కోపంగా 

గోపీకి ఇష్టం లేదు.

నువ్వు గోపీ కింద పనిచెయ్యట్లేదు. అయినా గోపీ మాటని మేమే పట్టించుకోము, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావ్. నువ్వెప్పుడూ చూడనంత అమౌంట్ రాసిస్తాను. రేపటి నుంచి పనిలోకి వచ్చేయి.

స్వర్ణ నవ్వింది. అది అమృతకి నచ్చలేదు. 

చూడు అమృతా(ఈసారి గారు గీరు అని వాడలేదు) నీ దెగ్గర డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. కాసింత జ్ఞానం కూడా ఉండాలి. సారీ ఐ రిజెక్ట్ 

అమృత కోపంగా.. నేను తలుచుకుంటే నీ ఉద్యోగం తీయించడమే కాదు, ఇంకెక్కడా రాకుండా కూడా చెయ్యగలను అంది 

ఆల్ ద బెస్ట్ అంది స్వర్ణ. అమృత వెళ్లిపోతుంటే.. నువ్వు తలుచుకున్నట్టు నేను కూడా తలుచుకోగలను. నా దెగ్గరా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను పిలిచినా ఇన్వెస్టర్స్ వస్తారు. అదే గోపిని వాడి మూడు సంవత్సరాలలో నిన్ను నీ కంపెనీని నామరూపాలు లేకుండా చేయగలను. నీకు, మీకెవ్వరికి గోపీ గురించి ఏమి తెలీదు.

అమృత వెళ్ళిపోయాక చాలా సేపు అదే తలుచుకుంది స్వర్ణ. ఏరో డైనమిక్స్ అనే సబ్జెక్టులో గోపీ సర్టిఫికెట్స్ లేని మాస్టర్. వాడెంటో నాకు తెలుసు అనుకుంది. జరిగింది గోపీకి చెపుదామని ఫోన్ చేస్తే గోపీ ఎత్తలేదు. 


***

భూమి చుట్టూ సూర్యుడు రెండు సార్లు తిరిగాడు.

ఆంటీ నేనిక వెళతాను. గోపీ ఎలా ఉన్నాడో అంది జఫర్. ఇంకేమి ఇబ్బంది లేదు గనక గీత కూడా సరేనంది. జఫర్ వేగంగా పైకి పరిగెత్తి తలుపు కొట్టింది. గోపీ తీయలేదు. వెంటనే రెండు సార్లు గోపీ అని పిలిస్తే తలుపు తెరిచాడు. నిద్ర మొహంతో ఉన్న గోపీని చూసి ఆగోపోయింది. లోపలికి దారిచ్చాడు. ఇల్లంతా చిందరవందర. టిఫిన్ తెస్తావా అని అడిగితే బైటికి వెళ్ళాడు గోపీ.

గోపీ వచ్చేంతలో త్వరగా స్నానం చేసి ఇల్లు మొత్తం పైపైన సర్దింది. గోపీ వచ్చాక టిఫిన్ తినేసి ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అయ్యింది. గోపీ మాత్రం పడుకున్నాడు.

రెడీ అవ్వవా అని అడిగితే గోపీ ఏం మాట్లాడలేదు. 

నువ్వు ఇంకెక్కడైనా చూసుకో.. నేను ఒంటరిగా ఉంటాను. కావాలంటే ఎదురు హిమజ ఆంటీ వాళ్ళ పోర్షన్ ఖాళీగా ఉంది. మాట్లాడతాను.

అలాగే అని బైటికి వచ్చేసింది జఫర్.
 
Like Reply




Users browsing this thread: 4 Guest(s)