Thread Rating:
  • 55 Vote(s) - 3.49 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

(2) వారసుడు - completedCompleted

Showing only the posts of Raagaa: 90 of 865 posts. Show all posts
#21

Thankyou very much all
Thanks for the comments
You guys made my day


Update kaavalaa ??
[+] 1 user Likes Raagaa's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22

(06-05-2026, 11:25 PM)Mahesh12345 Wrote:  వెయిటింగ్ అండి బాబు మీరు కావాలా అని అడగకూడదు 

ఇచ్చెయ్యాలి అంతే లడ్డు కావాలా నాయనా అని అడగడానికి ఇదేమీ క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్ కావు క్యాడ్బరీ డైరీ మిల్క్ కంపెనీ లెక్క.

మీ అప్డేట్ మాకు షాట్స్ కాదు కంపెనీ తో సమానం సో ఇచ్చేయండి.

ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి

హహ 
ఇస్తున్నాను
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#23

జఫర్ పని చేస్తుందే కానీ శ్రద్ధ లేదు. అమృత వచ్చి కదిలిస్తే ఆలోచనల్లో నుంచి బైటికి వచ్చింది. అడిగితే బంధువుల ఇంటికి వెళ్లానని చెప్పి మళ్ళీ పనిలో పడింది. అమృత కాసేపు చూసి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం రాజారావు భోజనం చేస్తుంటే జఫర్  లోపలికి వచ్చింది. ఇద్దరు కాసేపు తన గురించి మాట్లాడుకున్నాక టాపిక్ గోపి వైపు మళ్లింది. గీత దగ్గర తనేం విన్నదో అదే మళ్ళీ రాజారావు నోట విన్నది. 


గోపీ చిన్నతనం అంతా ఒంటరిగానే గడిచింది. ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడే అందరూ వాడిని వాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పింది చేస్తే ఏదో ఒకరోజు తమలో కలుపుకుంటారని ఆశతో ఎవరే పని చెప్పినా కాదనకుండా చేసేవాడు. అది అందరికి అలుసు అయ్యి గోపీని నిజంగానే పని వాడిని చేసింది. హాస్టల్లో చదివించాను. అమ్మ మీద బెంగ పెట్టుకునే వాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అందరికీ దూరంగా ఉండేవాడు. జనని గోపీని పట్టించుకునేది కాదు. తన వెంట కుక్క పిల్లలా తిరిగేవాడు. జనని పనులు చేయించేది కానీ ప్రేమ చూపించేది కాదు. హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మతో ఆడుకున్నట్టు, అమ్మ ఎప్పుడూ తన దెగ్గరే ఉన్నట్టు తనలో తానే ఊహించుకునేవాడు. ఎప్పుడూ ఊహల్లోనే ఉండేవాడు. ఎన్ని హాస్పిటళ్ళు తిప్పినా లాభం లేకపోయింది. కానీ జనని గోపీ మీదున్న 2% వాటా కోసం వాడిని హింసపెట్టినప్పుడు వాడి గుండె మొదటిసారి పగిలింది. ఊహా లోకం నుంచి బైటికి వచ్చాడు కానీ మామూలు మనిషి కాలేకపోయాడు. నాలుగేళ్లు ఇంట్లో నుంచి పారిపోయాడు. వాడి కోసం వెతకని చోటు లేదు. చివరికి సౌదీ అరేబియాలో దొరికాడు. పిచ్చివాడిలా రోడ్డు మీద ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ కనిపించాడు. ఇండియా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిలా మార్చడానికి చాలా సమయం పట్టింది. ఆ రోజు నుంచి గోపీ మళ్ళీ ఇంటి నుంచి బైటికి అడుగు పెట్టలేదు. ఆ చెట్లు, పాత బడిన షెడ్‌లో పనికిరాని కార్లు.. అవే వాడి ప్రపంచం. ఆ తరువాత ఇంట్లో నుంచి ఎలా బైటికి వచ్చాడో నీకు తెలుసు అని ముగించాడు రాజారావు.


ఎందుకో ఈ నిమిషం గోపీ పక్కన ఉండాలనిపించి, లేచి నేను ఇంటికి వెళ్తానంది జఫర్. ఎందుకు అని అడిగాడు రావు. జఫర్ సమాధానం చెప్పలేదు, "వెళ్తాను" అంది. సరే అన్నాడు రావు. జఫర్ తన షెడ్‌లో బట్టలు మార్చుకుని వెళ్లిపోతుంటే అమృత వచ్చి నీతో మాట్లాడాలి నా ఆఫీసుకి రా అంది. నేను ఇంటికి వెళుతున్నాను అని చెప్పేసి అమృత వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పక్కనే తన అన్న పవన్ కూడా ఉన్నాడు. చూసి అమృత వంక చులకనగా నవ్వాడు.

ఏంటే ఎవ్వరూ నీ మాట వినరా.. ఎందుకే నీకివన్నీ అని హేళన చేస్తే పవన్ వైపు కోపంగా చూసి జఫర్‌ని తలుచుకుని పిడికిలి బిగించింది. రాజారావు ఆఫీస్ ముందు ఉన్న రిసెప్షన్‌లో ప్రీతీ కాలు మీద కాలు వేసుకుని ఫోన్ మాట్లాడటం చూసి ఒక్కసారి తాతయ్య కుర్చీలో కూర్చొనీ.. మీ అందరి సంగతి తేలుస్తాను అనుకుని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది అమృత. తన వెనకే పవన్ కూడా వెళ్ళిపోయాడు.

రిసెప్షన్‌లో కూర్చున్న ప్రీతీ తన స్నేహితుడు విశాల్‌తో మాట్లాడుతుంది.
ఏమైనా తెలిసిందా ?

మీ అమ్మ పేరు మీద బిల్ కట్టింది స్వర్ణ.
అది నాకు తెలుసు. ఆమె కాదేమోనని నా అనుమానం, అందుకే కదా నిన్ను కనుక్కోమని చెప్పింది. నాకు తెలిసిందే చెప్తావ్ ఎందుకు అని కసురుకుంది ప్రీతీ.

ఎందుకే అంత కోపం, నన్ను మొత్తం చెప్పనీవా ?
ఆ.. సారీ.. చెప్పు

ఈ స్వర్ణ బ్యాక్‌గ్రౌండ్ ఏంటా అని చెక్ చేస్తే తెలిసింది తన వెనక ఎవరున్నారో
ఎవరున్నారు ?

గోపి
ఏ గోపీ !!

మీ రావు మోటార్స్ అధినేత చిన్న మనవడు. గోపి గోవర్ధన్ రావ్. చెక్ మీద అదే సంతకం ఉంది మరి.
వాట్ !! నిజంగానా ?

అవునే.. నాకు పనుంది.
సరే సరే.. థాంక్స్ అని ఫోన్ పెట్టేసి అంతే వేగంగా గోపి నెంబరు డయల్ చేసింది, ఇంకో రెండు సార్లు చేసినా ఎత్తలేదు. ఆఫీస్ అయిపోయాక తన ఇంటికి వెళ్లి మాట్లాడతాను అనుకుంది.

***

జఫర్  కాఫీ పెట్టి ఇస్తే తీసుకున్నాడు గోపీ. నాలికతో రుచి చూసే ముందు వాసన చూసి, దీని కోసం మొన్న పిచ్చోడిలా రోడ్లు పట్టుకుని తిరిగాను అని తనలో తనే నవ్వుతూ కాఫీ తాగాడు.

ఏంటి అప్పుడే వచ్చేసావ్ ?

ఎందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావ్ ? కంగారు మొహం పెట్టింది  జఫర్.

అదా.. నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం. నేను ఒంటరితనానికి అలవాటు పడిపోయాను. నువ్వేదో కొన్ని రోజులు ఉంటావని చెప్పారు తాతయ్య. అయినా ఎల్లకాలం నా దెగ్గరే ఉండవు కదా. అందుకే అన్నాను.

మనం మంచి ఫ్రెండ్స్ అయ్యాముగా.. నేను నీకు నచ్చలేదా? నేనేమైనా తప్పు చేశానా?

జఫర్ కళ్ళలో చిన్న మెరుపు కనిపించగానే కరిగిపోయాడు గోపి. వాడి గురించి ఎంత బెంగ పడ్డాడో అదే బెంగ జఫర్ కళ్ళలో కనిపించేసరికి గోపి మనసులో కొంచెం బరువు తగ్గినట్టు అనిపించింది. అయినా తను చెప్పాలనుకున్నవి అనాలనుకున్నవి అనేశాడు.

వద్దురా బాబు. మొన్న నాలుగు రోజులు ఏటో పోయావ్. నేను కాఫీ కోసం రోడ్లు పట్టుకు తిరిగాను. నీ చేతి రుచి అలవాటు పడ్డాక బైట బిర్యానీ కూడా నాకు నచ్చట్లేదు. నువ్వేదో రోజు సడన్‌గా వెళ్ళిపోతావ్. ఇప్పటివరకు నేనెవ్వరికోసం ఏడ్చింది లేదు. నీకోసం ఏడవాలని అసలు లేదు.

మురిసిపోయింది జఫర్. గోపీ అలకకి, కోపానికి కారణం తనేనని తెలిసాక నవ్వొచ్చింది. వెంటనే లేచి గోపీ వీపు మీద ధభీమని గుద్దింది. కూర్చున్నోడు కూర్చున్నట్టే చతికిల పడ్డాడు గోపి. 

సాయంత్రం హిమజ ఆంటీతో మాట్లాడతా అన్నాడు లేస్తూ.. వెళ్తున్నది ఆ మాట వినగానే వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో నాలుగు గుద్ది పోయింది. ఇద్దరు నవ్వుకుని ఎటైనా తిరుగుదాం అనుకుంటుంటే గోపీ ఫోన్ మోగడం చూసింది జఫర్.  
Like Reply
#24

ప్రీతీ తెగ చేస్తుంది, మాట్లాడవా ?

ఇప్పుడు కాదు.

ఏంటి విషయం ?
నాకేం తెలుసురా గాడిదా.. ఎర్రగా బుర్రగా ఉంటావ్. నీ నెంబర్ కోసం నాకు చేస్తుందేమో !

అంత లేదులే అంది జఫర్. సరిగ్గా అప్పుడే జఫర్ ఫోన్ మోగుతుంటే లేచి చూసాడు గోపి, అమృత ఫోన్ చేస్తుంది. దొరికాడు నా కొడుకు అనుకున్నాడు మనసులో.. ఏంట్రా ఇది. అమృత అసలు ఎవ్వరిని పట్టించుకోదు నీకేమో ఫోన్ చేస్తుంది. పడేసావా దాన్ని అని నవ్వాడు. జఫర్ బుంగ మూతి పెట్టింది. 

మెసేజ్ పెట్టింది. గోపీ బైటికి చదివాడు. హే జఫర్, నైట్ డిన్నర్‌కి వెళదాం వస్తావా ? వామ్మో వామ్మో.. ఎప్పుడు చూసావ్, ఎప్పుడు పడేసావ్ రా దాన్ని.  డైరెక్ట్ డిన్నర్‌కి రమ్మంటుంది. నా వెనకే తిరుగుతూ నాకే దింపుతున్నావ్ కదరా అని గోపి అంటుంటే నవ్వుకుంది జఫర్. 

ఫోన్ చూడటానికి గోపి పక్కన నిలుచుంటే ఇద్దరి భుజాలు తగులుకోవడం గమనించింది. అయినా దూరం జరగలేదు. ఏది చూపించు అని ఇంకొంచెం ముందుకు వంగింది. చూడు అని చూపించాడు గోపి. ఆగు రిప్లై ఇద్దాం అని టైప్ చేస్తుంటే జఫర్  ఫోన్ లాక్కోబోయింది. గోపీ వెంటనే వెనక్కి పడితే వాడి మీద ఎక్కి కూర్చుని ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసింది. ఇద్దరు దొర్లుతూ పొర్లుతూ చివరికి జఫర్  నేల మీద బోర్లా పడుకుంటే గోపి తన నడుము మీద కూర్చుకుని కదలనివ్వకుండా జఫర్  మీద పడుకుని.. ఓకే.. మా ఇంటి దెగ్గర పిక్ చేసుకో అమృతా అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసాడు. జఫర్ గోపిని కిందకి తోసి ఫోన్ లాక్కుని చూసి గోపి వంక కోపంగా చూసింది. డిలీట్ చేసే లోపే అమృత దగ్గర నుంచి ఓకే అని రిప్లై వచ్చేసరికి గోపీ మీద కలబడి కొట్టబోతుంటే జఫర్ రెండు చేతులు పట్టుకున్నాడు గోపీ.

ఒరే.. నీకు ఫేవర్ చేస్తే నన్ను కొడతావ్. కత్తి లాంటి ఫిగర్ డిన్నర్‌కి పిలిస్తే వెళ్ళడానికి ఏంటి నొప్పి ?
నాకిష్టం లేదు అంది కటువుగా

దేనికి.. ఓ.. నేను ట్రై చేశాననా. నాకు తన మీద ఫీలింగ్స్ లేవురా, కావాలంటే చూడు. ఈ రోజు నుంచి అమృత నాకు చెల్లితో సమానం సరేనా.. మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. మంచిగా తనని లవ్ చేసి పెళ్లి చేసుకోరా. నీకో పెద్ద కుటుంబం ఉంటది. అందరూ నిన్ను బాగా చూసుకుంటారు. నాలాగా ఒంటరి బతుకు వేస్ట్ రా.. నువ్వు వెళ్తున్నావ్ అంతే.. జఫర్  ఏదో చెప్పబోతుంటే ఇంకేం మాట్లాడకు అని బైటికి వెళ్ళిపోయాడు గోపి.

సాయంత్రం ఏడింటికి వచ్చాడు. రేయి నీకోసం షర్ట్ ప్యాంటు కొన్నా.. ఇవి వేసుకెళ్ళు. గుంట ఫ్లాట్ అయిపోవాలి నిన్ను చూడగానే. సెంట్ బాటిల్ కూడా తెచ్చా.. ఇది కొట్టుకుంటే అమ్మాయిలు ఎగబడతారు.

ఎవరు చెప్పారు ? నడుము మీద చేతులు వేసుకుని అడిగింది జఫర్
టీవీలో చూసాను అని నవ్వాడు గోపి. తల కొట్టుకుంది జఫర్. షూస్, బెల్ట్ అన్నీ తెచ్చాడు. వీటన్నిటితో పాటు బ్లూ రోజస్ బొకే కూడా తెచ్చాడు. రేయి ఈ పూలంటే అమృతకి చాలా ఇష్టం. ఇవి ఇవ్వు ఇంప్రెస్ అయిపోద్ది.

ఒకప్పుడు గోపి అమృతని ఇష్టపడింది తలుచుకుంది జఫర్. ఇప్పుడు గోపీ మోహంలో అదేమి లేదు. తన కోసం ఇంత చేస్తున్నాడు. గోపీ స్వచ్ఛమైన స్నేహానికి తన మీద గౌరవం పెరిగినా తనసలు అబ్బాయే కాదని తెలిస్తే అన్న ఊహకే జఫర్‌కి చెమటలు పట్టేసాయి. జఫర్ రెడీ అవుతుంటే సిగ్గు పడకురా బాబు, నేను బైటికి పోతున్నాలే అని నవ్వి బైటికి వెళ్ళిపోయాడు. జఫర్ బట్టలు  వేసుకున్నాక దెగ్గరుండి తన చేతి కాఫ్స్ మడిచి, కాలర్ సెట్ చేసి హెయిర్ కూడా చేత్తో దువ్వాడు. ఉమ్మ్ హీరో అని గోపీ నవ్వుతుంటే వాడి అమాయకత్వానికి నవ్వుకుంది జఫర్. ఇంటి ముందు అమృత కార్ ఆగడం చూసి రేయి వచ్చేసింది, పదా అని బొకే చేతికి ఇచ్చి బైటికి తోసాడు.

కారు శబ్దం అయితే బైటికి వచ్చింది గీత. ఖరీదైన కారు శబ్దం బాగా రావడంతో ఎదురింటి హిమజ కూడా బైటికి వచ్చి చూసి గీత దెగ్గరికి వచ్చి నిలబడింది. జఫర్‌ని బలవంతంగా నెడుతున్నాడు గోపి. ఇదంతా చూసిన హిమజ ఏం జరుగుతుందే ఇక్కడా అని అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు అంది గీత. అమృత కారు నుంచి దిగగానే జఫర్‌ని ముందుకు తోసి గీత వాళ్ళ పక్కకి వచ్చి నిలబడ్డాడు గోపి. గీతని, హిమజని చూసి ఆంటీ మనదే ఇదంతా అని గొప్పగా నవ్వాడు.

సెక్సీగా రెడీ అయ్యి వచ్చిన అమృతని చూడగానే కంగారుపడింది జఫర్. డ్రెస్సుని ఎవడో కత్తితో కోసినట్టు అమృత అడుగు ముందుకు వేసినప్పుడల్లా తెల్లని సగం తొడ బైటికి వచ్చి వీధి లైట్ల వెలుగులో మెరుస్తుంది.

ఎవరు అని అడిగింది గీత గోపి వంక చూసి. జఫర్  గాడి గర్ల్ ఫ్రెండ్ ఆంటీ అన్నాడు గోపీ. 

జఫర్‌కి ఏం చెయ్యాలో తెలీక చేతిలో ఉన్న బొకే అమృత చేతికి ఇచ్చింది. ఆ బొకే చూడగానే అమృత కళ్ళు మెరిసాయి. థాంక్యూ అని దెగ్గరికి వచ్చి హగ్ చేసుకుంది అమృత. అమృత సళ్ళు తన సళ్ళకి నొక్కుకుంటే ఎక్కడ నిజం తెలిసిపోతుందేమోనని తెగ కంగారు పడింది. 

నీకు జఫర్ చెప్పాడా అని ఆశ్చర్యంగా అడిగింది హిమజ. దానికి గోపీ నవ్వుతూ వాడెక్కడ చెపుతాడు, సిగ్గు ఎదవకి. నేనే దగ్గరుండి రెడీ చేసి బలవంతంగా పంపిస్తున్నా. నేను పక్కన  లేకపోతే వీడెలా బతుకుతాడో ఏంటో అనుకుంటూ మెట్లు ఎక్కి వెళ్లిపోతుంటే పిచ్చోడిని చూసినట్టు చూసారు హిమజ, గీత. 


ఇద్దరు జఫర్  వైపు చూస్తే జఫర్ బలవంతంగా కారు ఎక్కి చూస్తూ నిస్సహాయంగా చేతులు పైకి ఎత్తింది. హిమజ చేసేది లేక చెయ్యి ఎత్తి టాటా చెపుతుంటే నవ్వింది గీత.

కారు వెళ్ళిపోయింది. హిమజ గీతని చూసి వీడు అసలు మగాడేనా, వాడితో ఉంటుంది అమ్మాయా అబ్బాయా అని కూడా తెలుసుకోలేకపోయాడు. మరీ ఇంత ఉండకూడదే అంటే గీత నవ్వి గోపి నికాస్సైన మగాడే కాకపోతే అతి నమ్మకం. జఫర్‌ని పూర్తిగా నమ్మేసాడు. మరీ ఇంత మంచోడా అని హిమజ అంటే కాదు ఎర్రిపూకోడు అంది గీత. ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. హిమజ గీత భుజం మీద చెయ్యి వేసి ఎప్పుడు తిట్టి కొట్టుకునే మనం వీళ్ళ వల్ల కలిసిపోయామే అంది భుజం మీద తల పెట్టుకుని.

వాడితో పాటు నువ్వు కూడా ఎర్రి పూకు దానివే అని గీత నవ్వితే హిమజ కోపంగా బూతులు తిడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది.
Like Reply
#25

గోపీ ఒక్కడే చాల సేపు ఆలోచిస్తూ చివరికి ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు మొహం పెట్టి లేచి నిలుచున్నాడు. కింద కారు శబ్దం విని వెళ్లి చూస్తే ప్రీతీ కారు దిగి చెయ్యి ఊపుతుంది. గోపీ కిందకి వెళ్ళాడు.


ఏంటి ప్రీతీ గారు ఇటు వచ్చారు ?
నీతో మాట్లాడాలి గోపి

చెప్పండి
ఇక్కడ కాదు. ఎటైనా వెళదాం అంటే సరే అని కారు ఎక్కి కూర్చున్నాడు గోపి. పైన తలుపులు తీసే ఉన్నాయి.

ప్రీతీ నేరుగా రెస్టారెంట్‌కి పోనించింది
ముందు చెప్తే మంచి డ్రెస్ వేసుకుని వచ్చేవాడిని కదా అని గోపి అడిగితే సారీ చెప్పింది ప్రీతీ

ఇద్దరు ఎదురెదురు కూర్చున్నారు. బిల్ నువ్వే కడతావ్ కదా అని అడిగితే ప్రీతీ అయోమయంగా చూస్తూ అవును అంది. గోపి సంతోషంగా వాడికి నచ్చిన మెనూ మొత్తం చదివేశాడు. వెయిటర్ కూడా నవ్వుతూ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం అని మెనూ కార్డు పక్కన పెట్టి అడిగాడు.

మా అమ్మ హాస్పిటల్ బిల్ కట్టింది నువ్వే కదా ?
గోపి నవ్వి అవును, ఎలా తెలిసింది అని అడిగితే తన ఫ్రెండ్ విశాల్ గురించి చెప్పింది.

అసాధ్యురాలివే. ఈ స్వర్ణకి యాక్టింగ్ కూడా రాదు అని తిట్టుకున్నాడు.
ఎందుకు గోపీ..

సాయం పొందినప్పుడు కృతజ్ఞత చెప్పాలి. అంతే కానీ ఎందుకు ఏంటి అని అడక్కూడదు. నా వల్ల నీకు పిఎ పోస్ట్ రాలేదు, దాని వల్ల నీకు లోన్ రాలేదు. అందుకే హెల్ప్ చేశా అనుకో అని గోపి అంటుంటే ప్రీతీ కృతజ్ఞతగా రెండు చేతులు పట్టుకుంది. 

వెయిటర్ వచ్చింది. ఐటమ్స్ టేబుల్ మీద పెట్టి వడ్డిస్తుంటే ప్రీతీ తనని వెళ్ళమని చెప్పి లేచి గోపీ పక్కన కూర్చుని దెగ్గరుండి వడ్డించింది. గోపీ కూడా ఏమి అనకుండానే తినేసాడు. ప్రీతీ తననే తదేకంగా చూస్తుంటే ఏంటి అని సైగ చేసాడు. గోపీకి దగ్గరగా జరిగి ముద్దు పెడదామని పెదవులని దెగ్గరికి తెచ్చింది. గోపీ వెంటనే ప్రీతీ గడ్డం పట్టుకుని మొహం తిప్పేసాడు. నీ ముద్దు కోసం సాయం చెయ్యలేదు ప్రీతీ. ఫీలింగ్స్ లేకుండా పెట్టే తీయని ముద్దు కూడా చేదు కొడుతుంది అని బుగ్గ మీద ముద్దు పెట్టి పదా వెళదాం అన్నాడు. ప్రీతీ బిల్ కట్టేసి ఇంటి దెగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. 

ఇంటి బైట నుంచే తల ఎత్తి చూసాడు. తొందరలో తలుపులు వేయడం మర్చిపోయాడని గుర్తుకు వచ్చింది. పైకి పరిగెత్తి చూస్తే అప్పటికే పిల్లులు స్టవ్ మీద పాలు, అన్నం గిన్నెలో అన్నం గది అంతా చిందరవందరగా చేసేశాయి. 

ఇది గనక జఫర్ గాడు చూస్తే నా వీపు మోత మోగించేస్తాడు  అని భయపడుతూనే ముందు పిల్లులని తరిమి ఇల్లంతా శుభ్రం చెయ్యడం మొదలుపెట్టాడు.

గది మొత్తం శుభ్రం చేసి కూర్చుంటే బైట కారు శబ్దం వినిపించింది. లేచి పై నుంచే తొంగి చూసాడు. జఫర్ కారు దిగిన తరువాత అమృత కూడా కారు దిగి జఫర్‌ని గట్టిగా వాటేసుకుని సిగ్గు పడుతూ బై చెప్పి కారు ఎక్కింది. జఫర్ కూడా చెయ్యి ఊపి టాటా చెప్పాడు. కారు వెళ్ళాక తల కొట్టుకుంటూ పైకి చూస్తే గోపీ కనిపించాడు. గోపీ నవ్వుతూ సూపర్ అని చెయ్యి చూపిస్తే వీడొకడు అనుకుంది. మళ్ళీ వెంటనే అమృత తనతో ఎలా ప్రవర్తించిందో అలా గోపీతో తనెప్పుడు ఉంటుందో అనుకుంటూ గోపీని చూసి మెట్లు ఎక్కింది. ఇంట్లో అంతా శుభ్రంగా ఉండటం చూసి గోపీ వంక అనుమానంగా చూసింది. 
Like Reply
#26

Follow my tele channel : raagasm
t_me_raagasm
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#27

Thanks for all the love & comments you guys showered
Thankyou very much
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#28

కథ మలుపులు తిరుగుతుంది
అందుకే అప్డేట్ ఆలస్యం అవుతుంది
త్వరలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను
[+] 8 users Like Raagaa's post
Like Reply
#29

ఇల్లంతా చూసి ఏదో చేసావ్ అంది జఫర్ అనుమానంగా 


నేనేం చెయ్యలేదురా.. ఏదో నీకు సాయం చేద్దామని ఇల్లు తుడిచాను. ఎలాగో రేపటి నుంచి నువ్వు బిజీ కదా అని నవ్వాడు గోపీ.

నాకు భయంగా ఉంది అంది జఫర్
నేనున్నా కదా డోంట్ వర్రీ.. ధైర్యంగా ఉండు అని గోపీ నవ్వుతుంటే అదే నా భయం కూడా అనుకుంది జఫర్.

తెల్లారి జఫర్‌తో పాటు ఆఫీస్‌కి వచ్చాడు గోపీ. వెళ్లి తాతయ్యతో మాట్లాడి తిరిగి షెడ్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే జఫర్ బట్టలు మార్చుకుని పనిలో పడింది. జఫర్‌ని చూసి డెడికేషన్ అనుకున్నాడు మనసులో. జఫర్ పని చూస్తూ అవసరం వచ్చినప్పుడు టూల్స్ అందిస్తున్నాడు. ఎవరో వస్తున్నట్టు అనిపిస్తే చూసారు. ప్రీతీ లోపలికి వచ్చింది. మెరూన్ రంగు సారీలో మెడలో చిన్న బంగారపు లాకెట్ వేసుకుంది. చెవులకి కూడా చిన్న కమ్మలే. ఇన్ని రోజుల్లో ఎప్పుడు ప్రీతీ చీర కట్టింది లేదు. జుట్టుని వదులుగా వదిలేసింది. గోపీ కళ్ళార్పకుండా ప్రీతినే చూస్తుంటే జఫర్ వీపు మీద గిచ్చింది. గోపీ చూసే చూపుకి సిగ్గు పడింది ప్రీతీ. 

గోపీ నిన్ను సర్ పిలుస్తున్నారు అంది. ఇప్పుడే కదా నేను మాట్లాడింది, సరే వస్తున్నా పదా అని బైటికి నడిచాడు. షెడ్ నుంచి బైటికి రాగానే గోపీ చెయ్యి పట్టుకుని గోదాముల వైపు లాక్కుని వెళ్ళింది ప్రీతీ. గోపీ అయోమయంగా ఏంటి, ఏమైంది అని అడుగుతుంటే గోపీని గోడకి నెట్టి గట్టిగా హత్తుకుంది. గోపీ ముందు వెనక్కి నెట్టేద్దామనుకున్నా ప్రీతీ సళ్ళు మెత్తగా తన ఛాతికి తగులుతుంటే ఏం చెయ్యాలో తెలీక అలానే ఉండిపోయాడు. ప్రీతీ నవ్వింది. 

గోపీ అని పిలిస్తే ప్రీతి కళ్ళలోకి చూసాడు.
ఐ లవ్ యు అంది 
ప్రీతీ రెండు భుజాలా మీద చెయ్యి వేసాడు గోపీ, ఆమె తన నడుముని ఇంకా అదిమింది. ప్రీతీ తన పెదాలు దెగ్గరికి తెస్తున్న కొద్దీ గోపీ మొహంలో కంగారు పెరుగుతుంటే ప్రీతీ ముద్దు పెట్టేసింది.


తన భుజం మీదున్న గోపీ చేతి మీద చెయ్యి వేసి మెల్లగా దించుతూ నడుము మీద వేసుకుంది. గోపీ చెయ్యి పట్టు గట్టిపడగానే చేతిని వదిలేసి ఏకాగ్రత మొత్తం ముద్దు మీద పెట్టింది. చాలా సేపటి తరువాత ఇద్దరూ విడి పడ్డారు. ప్రీతీ, గోపీ పెదాలు విడిపోవడం ఇష్టం లేనట్టు బలవంతంగా విడిపడ్డాయి.  ప్రీతీ సంతోషంగా మళ్ళీ హత్తుకుని గోపీ మొహం అంతా ముద్దులు పెట్టి మెడ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. రెండు నిమిషాల తరువాత గోపీ కూడా వచ్చేసాడు. అటుగా వెళ్తున్న వర్కర్స్ గోపీని చూసి అందరూ ఒకేసారి నవ్వుతూ తల ఊపుతుంటే ఒరేయి ఏం జరగలేదురా అని తల కొట్టుకుని తుర్రుమన్నాడు. 

xxxx

ఒక్కడే కూర్చుని ఆలోచిస్తుంటే బోల్టులు బిగిస్తూ గమనించింది జఫర్. గంటకి పైగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే కూర్చునేసరికి జఫర్ లేచి చేతులు కడుక్కుని వెళ్లి గోపీ పక్కన కూర్చుంది.

ఏమైంది ?
ప్రీతీ ప్రపోజ్ చేసింది.

ఓహ్.. నచ్చితే ఓకే చెప్పు 
నచ్చలేదు 

అయితే అదే చెప్పు 
గోపీ ఏం మాట్లాడలేదు. భుజం మీద చెయ్యి వేసింది.

అసలు ఈ ప్రేమా దోమా ఏమి ఉండదు కదరా?
అలా ఎందుకు అనుకుంటున్నావ్ అని అడిగింది జఫర్ 

ఇక్కడ అవసరం మాత్రమే ఉందిరా.. అందరూ అవసరానికి తగ్గట్టే ప్రవర్తిస్తారు. మా తాతయ్యకి మన పని కావాలి. ఆ అమృత నీలో టాలెంట్ చూసింది కాబట్టి స్టేటస్ పట్టించుకోకుండా ఇంటి ముందుకు వచ్చింది. మా అమ్మ కూడా అంతే.. అందరూ అంతే.. నిజంగా నిజాయితీగా ఎవ్వరు ఉండరు. అసలు నువ్వు మీ వాళ్ళ దెగ్గరికి వెళ్ళాక నేనిక ఒంటరిగా ఉండాలని అనుకున్నాను. నువ్వొక్కడివే నాతో స్నేహంగా, నిజాయితీగా ఉన్నది. నిన్ను దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు రాగానే అన్నీ మర్చిపోయా. ఉన్నన్ని రోజులు మంచి ఫ్రెండ్స్‌లా ఉందాం అంటూ జఫర్ కుడి భుజం మీద చెయ్యేసి ఎడమ భుజం మీద తల పెట్టుకున్నాడు.

మొదటిసారి జఫర్‌కి భయం వేసింది. అంతలో అక్కడికి అమృత వస్తే సరే మీరు మాట్లాడుకోండి అని బైటికి వెళ్ళిపోయాడు గోపీ. 

గోపీ వెళ్లిపోవడం చూసి అమృత వెళ్లి జఫర్ పక్కన కూర్చుంది. బిజీనా అని అడిగితే లేదంది జఫర్. 

ఇవ్వాళ వర్క్ అయిపోయాక సినిమాకి వెళదాం వస్తావా?
అది నేను.. నాకు పని..

ప్లీజ్.. నేనొక్కదాన్నే ఉన్నాను అంది అమృత 
జఫర్ సమాధానం చెప్పే లోపే టికెట్స్ బుక్ చేసి మెసెజ్ చేస్తా అని వెళ్ళిపోయింది.

జఫర్ అసలు అమృత గురించి ఆలోచించలేదు. తన మనసులో గోపీ మాత్రమే ఉన్నాడు. రోజు రోజుకి గోపీ మనోగతం కొంచెం కొంచెం అర్ధమవుతుంది. భరించలేని ఒంటరితనం ఉంది గోపీ దెగ్గర. అంత త్వరగా తనకి దగ్గర అవ్వడం ఈజీ కాదు అని తెలుసు. ఆ ఒంటరితనం వల్లేనేమో ఎవ్వరినీ లెక్క చెయ్యడు. ఎవ్వరి దగ్గరా ఏది ఆశించడు. ఎవ్వరి దగ్గరా మొహమాట పడడు. తనకి ఏది నచ్చితే అదే చేస్తాడు. తాతయ్యతో మాట్లాడాలి. గోపీకి ఎంత త్వరగా నిజం చెపితే అంత మంచిది అనుకుంది.

సాయంత్రం ఇద్దరు కలిసి వెళుతుంటే జఫర్ ముభావంగా ఉండటం చూసి ఏమయిందని అడిగాడు గోపీ.

నీకొకటి చెప్పాలి 
చెప్పు అన్నాడు తాపీగా 

ఇక్కడ కాదు. ఇంటికి వెళదాం.
సరే అన్నాడు మళ్ళీ హుషారుగా 

ఇద్దరు బండి ఎక్కుతుంటే ప్రీతీ ఎదురు వచ్చింది. గోపీ నీతో మాట్లాడాలి అని నవ్వింది. నేను ఫోన్ చేస్తాను అంటే సరే అని వెళ్ళిపోయింది ప్రీతీ. 

ఏంటంటా అని జఫర్ అడిగితే ప్రపోజ్ చేసిన విషయం చెప్పాడు. తనంటే నీకిష్టమా అని అడిగితే లేదు అన్నాడు.

మరి !
ఇందాకే చెప్పింది. మొహం మీద నో చెప్పలేక ఆపుకున్నాను.

ఆ సమాధానం జఫర్‌కి నచ్చింది. వెళ్ళేటప్పుడు గోపీ భుజం మీద చెయ్యేసి కూర్చుంది. ఇంటికి వెళ్లి ఇద్దరు ఫ్రెష్ అయ్యాక కాసేపు కూర్చుని జఫర్ అన్నం వండేసింది. అమృత నుంచి ఫోన్ రాగానే చూసాడు గోపీ. ఏంట్రా మళ్ళీ పిలిచిందా అని అడిగితే అవును అంది జఫర్. గోపీ నవ్వుతుంటే తన భుజం మీద కొట్టి ఇదే లాస్ట్ ఇక రానని చెప్పేస్తాను అంది. చూద్దాం అన్నాడు గోపీ. అవును ఏదో మాట్లాడాలన్నావ్ అంటే జఫర్ ముందు తడబడింది, ఆ తరువాత ఏదైతే అది అయ్యిందని చెప్పబోతుంటే అంతలోనే ఫోన్ మొగుతుంటే ఉలిక్కిపడి చూసాడు గోపీ. అది గోపీ ఫోన్ రింగ్‌టోన్ కాదు. తనది కాదు, మరి ఇంకెవరిది! 

జఫర్ చూస్తుండగానే బట్టల్లో అడుగున చెయ్యి పెట్టి ఫోన్ బైటికి తీసాడు గోపీ. అది బటన్ల ఫోను. గోపీ అనర్గళంగా ఉర్దూ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది జఫర్. దుబాయ్‌లో ఎవరికో సీరియస్‌గా ఉంది, వెంటనే రమ్మని ఫోన్ చేస్తున్నారు. ఎవరో ఏంటో మాత్రం జఫర్‌కి అర్ధం కాలేదు. ఫోన్ పెట్టేసిన గోపీ ముభావంగా కూర్చుంటే జఫర్ అడిగింది, కానీ గోపీ సమాధానం చెప్పలేదు. అమృత వస్తున్నానని ఫోన్ చేసేసరికి జఫర్ చేసేది లేక రెడీ అయ్యి వెళ్ళింది. ఈ సారి గోపీ తన వంక చూడలేదు. ఎలా ఉన్నాను అని అడిగినా గోపీ ఏదో దీర్ఘంగా ఆలోచించడం చూసి అమృతతో వెళ్లాలని లేకపోయినా వెళ్ళింది.

ప్రీతీ నుంచి ఆపకుండా ఫోన్లు వస్తుంటే చిరాగ్గా ఫోన్ ఎత్తాడు. ప్రీతీ నవ్వుతూ నేను కిందే ఉన్నా అంది. లేచి బైటికి వెళ్లి చూస్తే ప్రీతీ కింద నుంచి చెయ్యి ఊపింది. గోపీ కిందకి వెళ్ళాడు.

గోపీ.. బైటికి వెళదామా.. లెట్స్ సెలెబ్రే..

చూడు ప్రీతీ. నేను నిన్ను లవ్ చెయ్యను. నిన్నే కాదు నేనెవ్వరిని లవ్ చెయ్యను. ఇక్కడితో వదిలేయి. అంతే వేగంగా చెప్పేసి వెళ్లిపోతుంటే ప్రీతీ ఏడ్చేసింది. గోపీ పైకి వెళుతుంటే గీత అడ్డుపడింది.

ఏంటిది గోపీ.. ఇది ఇల్లు అనుకున్నావా ఇంకేమైనా అనుకున్నావా?

సారీ.. జఫర్ గాడికి కూడా చెప్తాను 

నేను మాట్లాడుతుంది నీ సంగతి. అంతకముందు స్వర్ణ, ఇప్పుడేమో కొత్తగా ఈ అమ్మాయి. 

స్వర్ణ మా అక్క ఆంటీ 

సరే సరే.. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు 

అయితే వాడిని కూడా తిట్టు. 

జఫర్ ఎలాంటిదొ మాకు బాగా తెలుసు నువ్వే తేడాగా ఉన్నావ్ అంది వెనక నుంచి హిమజ. 

గోపీ ఆవేశంగా వాడి గురించి మీకు తెలీదు. సైలెంట్‌గా ఉంటాడు అంతే.. నేనే మంచోడిని. అయినా ముందు తెలిసిన నాకు కాకుండా వాడికి సపోర్ట్ చేస్తారేంటి ?

అది అంతే.. నువ్వు అమ్మాయిలు గిమ్మాయిలు అని తిరక్కు అంది గీత.

హిమజ వెంటనే.. జఫర్ వైపు కాకుండా ఇంకెవరినైనా చూసావని తెలిసిందో నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తా

ఏంటీ...!! అన్నాడు గోపీ 

హిమజ వెంటనే నాలిక కరుచుకుంటే గీత కవర్ చేస్తూ జఫర్‌లా బుద్దిగా ఉండమని చెప్తున్నాం అంది కళ్ళు ఉరుముతూ 

గోపీ ఇద్దరి వంకా విచిత్రంగా చూస్తూ సరే అని పైకి వచ్చేసాడు. వెనక గీత, హిమజ పొట్లాడుకోవడం వినిపిస్తుంది. కొంపదీసి వీడేమైనా ఆంటీలని గెలికాడా.. ఈ మధ్య కిందకి పైకి బాగా తిరుగుతున్నాడు. గీత ఆంటీ కూడా ఊరికే జఫర్ జఫర్ అంటుంది. సంతింగ్ ఈజ్ ఫిషి. ఏదో జరుగుతుంది. కనిపెట్టాలి. ముందు నిద్రపోవాలి. వీడేలాగో తినేసి వస్తాడు. కర్రీ తెచ్చుకునే ఓపిక లేదు గీత ఆంటీని అడుగుదాం అని కిందకి వెళ్ళాడు. గీత, హిమజ మాట్లాడుకుంటుంటే గోడ చాటున నిలుచున్నాడు.

నీకైతే నోరు ఆగదు. వాడికి తెలిసిపోతే ఏమైనా ఉందా.. ఎంత సీరియస్ మ్యాటర్ ఇది. ఇద్దరు జీవితాలకి సంబంధించింది. గీత కోప్పడుతుంది.

అనుకోకుండా నోరు జారానే సారీ. అయినా వాడో ఎర్రిమాలోకం, వాడికేం డౌట్ రాలేదులే.. గుర్తుపెట్టుకో ఇది నీకు నాకు జఫర్‌కి మధ్యే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో గోపీకి తెలియకూడదు.

హా.. అలాగే 

అమ్మనీ.. అనుకున్నాడు గోపీ. ధైర్యంగా లోపలికి వెళ్ళాడు.

నా కాంతా తెలిసిపోయింది. అన్న గోపీ మాట వినగానే ఉలిక్కిపడ్డారు ఇద్దరు. గీత, హిమజ కంగారుగా చూస్తుంటే గోపీ ఇద్దరి ముందుకు వచ్చాడు. గీత మనసులోనే జఫర్‌కి క్షమాపణలు చెప్పుకుంది.
Like Reply
#30

ఈ రాత్రికి ఇంకో అప్డేట్ ఇస్తాను
[+] 2 users Like Raagaa's post
Like Reply
#31

“నా కంతా తెలిసిపోయింది..”


             గోపీ మాట వినగానే భయపడిపోయారు గీతా హిమజ. ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తే గోపీ ఇంట్లోకి వచ్చాడు. హిమజ ఏదో చెపుతుంటే మొహం మీదే అరచేయి పెట్టి ఆపేసాడు గోపీ. ఇంకా కవర్ చెయ్యద్దు. మీరంతా నన్ను మోసం చేశారు. వాడైతే నమ్మక ద్రోహి 

ఎవరు అని అడిగింది గీత అనుమానంగా!

జఫర్ గాడు.

గీత వెంటనే హిమజ వైపు చూసి వాడికేం తెలీదు, నువ్వు కమిట్ అవ్వద్దు అని సైగ చెయ్యగానే హిమజ కూడా అలానే  అని తల ఊపింది. ఈ ఇద్దరు మళ్ళీ సైగ చేసుకోవడం చూసి చాలు.. ఇక చాలు. నన్ను మోసం చేసింది చాలు. 

అది కాదు గోపీ అని గీత అడ్డం వచ్చినా ఆపేసాడు. ముందు వచ్చిన నాకంటే వెనక వచ్చిన వాడే మీకు ఎక్కువ అయిపోయాడా. నేనేం మీకు అడ్డం రాను. అసలు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నా అడ్డు లేకపోతే మీరింకా సుఖంగా ఉండచ్చు.

అసలేం జరిగిందో చెప్పనీ.. అంది హిమజ 

గోపీ అవేం వినలేదు. ఇంకేముంది చెప్పడానికి. నీకు కొడుకు ఉన్నాడు. గీత ఆంటీకి పిల్లలు లేరు. అంకుల్ వల్ల కావట్లేదు, ఎవరైనా కుర్రాడిని చూసుకొమ్మని నువ్వు గీత ఆంటీకి చెప్పావు. అదే టైములో మీకు హీరోలా మిమ్మల్ని కాపాడే దేవుడిలా నేను అద్దెకి వచ్చాను. గీత ఆంటీ ముందు నా మీద మనసు పడింది. నన్ను ట్రై చేసింది కూడా.. కానీ నాకు లైన్ వేసేలోపే జఫర్ గాడు దిగాడు. ఎర్రగా బుర్రగా ఉంటాడు, లేతగా అమాయకంగా కనిపించాడు. నేనా వాడా అని ఆలోచిస్తే వాడు కొంచెం మెతక. రేపు ఎప్పుడైనా సమస్య వచ్చినా వాడి నోరు నొక్కేయ్యచ్చు అని ప్లాన్ చేశారు. ఏదో సందర్భంలో నువ్వు ఆ జఫర్ గాడు కలిశారు. మొన్న అంకుల్ క్యాంపుకి వెళ్లారు. అదే సమయంలో జఫర్ గాడు చుట్టాలు అని ఊరికి వెళ్ళాడు. అంటే ఆ నాలుగు రోజులు మీ ఇంట్లోనే ఉన్నాడు. ఇందాక గీత ఆంటీ విషయం మీ ముగ్గురి లోనే ఉండాలి అంది. అంటే నువ్వే వాళ్లకి దెగ్గరుండి శోభనం చేయించావ్. వీక్ మూమెంట్స్‌లో నువ్వు కూడా టెంప్ట్ అయ్యావు. మీ ముగ్గురు కలిసిపోయి త్రిసం చేసుకున్నారు. ఇప్పుడు మీ అక్రమ సంబంధం నాకు తెలిసిపోయింది. ఇక నా దెగ్గర దాచడానికి ఏమి లేదు. (కళ్ళు మూసుకుని అల్లిన ధియరీ మొత్తం చెప్పేసి కళ్ళు తెరిచి చూసాడు గోపి) 

హిమజ ఆశ్చర్యంగా కప్పలా నోరు తెరిస్తే గీత మూతికి అడ్డంగా చెయ్యి పెట్టుకుని చూస్తుంది. మీరింత ఆశ్చర్యపోయారంటే ఇదే నిజం అన్నమాట. ఓకే.. ఐ అండర్‌స్టాండ్ అని బైటికి వెళ్ళిపోయాడు. హిమజకి ఏమి అర్ధం కాక సోఫాలో కూలబడింది. హిమజ పరిస్థితి చూసి గీత ఫ్రిడ్జ్‌లో నుంచి వాటర్ బాటిల్ తీసి చేతికి ఇస్తే గటగటా తాగేసి గీత వైపు చూసింది. ఇంకా హిమజ మొహంలో ఆశ్చర్యం పోలేదు. 

వాడెంటే!! అక్రమ సంబంధం అంటాడు! వాడు చెప్పిన దానికి ఒక్క క్షణం ఇదంతా నిజమేనేమో అనిపించింది. వాడిదే నిజం అనుకుంటే! 

గీత హిమజ పక్కన కూర్చుంది. గోపీ అన్న మాటలు మొత్తం మళ్ళీ గుర్తు చేసుకుంది. ఒక్కసారిగా పుసుక్కున నవ్వింది. హిమజ గీత వైపు చూస్తే అప్పటికే గీత హిమజ భుజం మీద తల పెట్టుకుని పిచ్చి పిచ్చిగా నవ్వుతుంటే హిమజ కూడా నవ్వింది. అయినా గీత ఆగలేదు. గీత కళ్ళలో నీళ్లు చూసి ఎక్కువ నవ్వడం మంచిది కాదని వీపు మీద దెబ్బ వేసింది హిమజ. అయినా గీత ఆగలేదు, నవ్వి నవ్వి హిమజ మీదే పడిపోయింది. హిమజ గీత బరువు ఆపలేక సోఫాలో పడుకుంటే గీత తన మీదే పడుకుంది. గీత నవ్వు ఆగిపోయింది. 

హిమజ ఐదో తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పుడు పరిచయం గీత. ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, గిల్లుకోవడం, గిచ్చుకోవడం, పొట్లాడుకోవడం. ఏడిపించుకోవడం ఇవే ఉండేవి. ఆ తరువాత సమస్యల్లో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు సాయం చేసుకున్నా ఎప్పుడూ ఇప్పుడున్నంత దెగ్గరగా అయితే లేరు. గీత తనకంటే అందంగా ఉంటుందని చిన్న ఈర్ష్య. గీతకి పిల్లలు పుట్టరని తెలిసినప్పుడు కూడా అత్యంత బాధ పడింది హిమజే.. ఇప్పుడు ఇంత దగ్గరగా తన మీదే పడుకుని తన మెడ ఒంపులో మొహం దాచుకుని మాట్లాడుతుంది. ఎన్నో సార్లు మనసులో ఒక బెస్ట్ ఫ్రెండ్‌‌లా గీతతో ఉండలనుకుంది, కానీ అహం అడ్డు వచ్చేది. రెండు చేతులు గీత మీద వేసి మెల్లగా హత్తుకుంది. హిమజ అలా ఎందుకు చేసిందో గీతకి అర్ధమయ్యింది. నవ్వుతూనే మనస్ఫూర్తిగా తన బరువుని హిమజ మీద వేసింది గీత. 

గీత ఒంటి సువాసనతో పాటు తన సళ్ళ బరువు, మందం అన్నీ తెలుస్తున్నాయి హిమజకి. విశాలమైన వీపు గీతది. తనకి అనుమానం వస్తుందేమోనని హిమజ ముట్టుకోలేదు.

నేను చదివిన అన్ని లవ్ స్టోరీస్, నవెల్స్ అన్నిటిలో ఇదే బెస్ట్ లవ్ స్టోరీ ఇది. గీత పెదవులు హిమజ చెవిని తాకుతుంటే నవ్వుకుంది. గీతా అంటే హ్మ్.. అంది. నువ్వు ఒకప్పుడు కథలు రాసేదానివి కదా.. ఎందుకు ఈ కథ రాయకూడదు? 

హిమజ మెల్లగా చేతులు గీత నడుము మీదకి పోనించి పట్టుకుంది. హిమజ చేతులు తన ఒంటి మీద, హిమజ శరీరం తనకి అతుక్కుని ఉండటం గీతకీ నచ్చింది. 

పుస్తకం రాయలంటే ఈజీనే.. కానీ పబ్లిష్ చెయ్యడానికి ఖర్చు అవుతుంది. 

ఓస్ అంతే కదా.. నేను పెట్టుకుంటాలే. నువ్వు రాయవే 

ఎవరినైనా నమ్ముతాను గానీ నిన్ను నమ్మను 

గీత పిర్ర మీద గట్టిగా చరిచింది హిమజ. గీత ఆశ్చర్యపోయి తల ఎత్తి చూసింది. లేవబోతుంటే హిమజ గట్టిగా గీత నడుముని పట్టుకుంది. ఇంకాసేపు ఇలానే ఉండు అంది హిమజ. గీత కూడా హిమజ మీద పడుకుంది. ఈసారి గీత సళ్ళు హిమజ సళ్ళు ఒకదాని మీద ఒకటి సరిగ్గా నొక్కుకున్నాయి. హిమజ నోటి నుంచి వచ్చిన ఇస్స్.. శబ్దం గీత చెవులని తాకింది. హిమజ కుడి చెయ్యి గీత ఎడమ పిర్ర మీదా, కుడి చెయ్యి తన నడుము మీదా ఉన్న స్పర్శ తెలుస్తుంది.

కథ రాస్తావా అని హిమజ తన పెదవులని గీత బుగ్గకి తగిలేలా మాట్లాడుతుంటే రాస్తాను అంది చిన్నగా. 

గోపీ గాడికి థాంక్స్ చెప్పాలి అంది హిమజ.
దేనికి ?

దీనికి.. ఇంకా గట్టిగా హత్తుకుంటే గీతకి తెలియకుండానే హిమజ బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ఇద్దరు కదులుతుంటే చీర పైటలు పక్కకి తొలిగి ఇద్దరి పొట్టలు కలుసుకున్నాయి. వెచ్చగా తగిలిసరికి ఉమ్మ్మ్ అని మూలిగింది గీత. హిమజ తనని అల్లుకుపోతుంటే తన సళ్ళతో హిమజ సళ్ళని నొక్కేస్తూ గీత బరువు పెంచుతుంది. ఇద్దరు దొరికిన చోట దొరికినట్టు మొహం అంతా ముద్దులు పెట్టేసుకుంటూ చివరికి ఒకరి పెదాలు ఇంకొకరికి తగిలే సమయానికి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. గీత ఇబ్బందిగా చూస్తే హిమజ తన మెడ మీద చెయ్యి వేసి ముద్దు పెట్టమని సైగ చేసింది. కళ్ళు మూసుకుంది గీత.  

హిమజ చెయ్యి గీత నడుము నుంచి చీరలోకి, అటు నుంచి గీత పిర్రల మధ్యన నుంచి కిందకు వెళుతుంటే గీత కూడా తన చేతిని హిమజ కుచ్చిళ్లలో పోనించి తొడల మధ్యకి పోనించింది. ఇద్దరి పెదవులు కలుసుకున్నాయి.


xxxx

ఇంటర్వెల్లో అందరూ అమృతనే చూడటం గమనించింది. ఇలాంటి ఓ థియేటర్ ఉంటుందని కూడా తెలీదు జఫర్‌కి. పేదవాళ్లు, ధనికులు.. రెండు వర్గాలకి రెండు లోకాలు సృష్టించారు. పేదవాళ్ళ లోకం ధనికులు చూడగలరు కానీ ధనికుల లోకం పేదవాళ్ళు చూసే అవకాశమే లేదు. పాప్కార్న్ పెప్సీ పట్టుకు వచ్చి వెళదామా అంది అమృత. పదిహేను వందల పాప్కార్న్, వెయ్యి రూపాయల పెప్సీ వేటితో తయారు చేస్తారు అని ఆలోచిస్తుంటే అమృత తన సంకలో  చెయ్యేసి లోపలికి లాక్కుపోయింది. లైట్స్ ఆఫ్ చేసిన పది నిమిషాలకి జఫర్ వైపు చూసింది అమృత. జఫర్‌కి తెలుస్తున్నా తల తిప్పితే ఏమవుతుందోనని భయంభయంగా సినిమా చూస్తుంది. అమృత దెగ్గరికి జరుగుతుంటే ఇబ్బంది పడింది. పాప్కార్న్ తినవా అని చెయ్యి చూపిస్తే తింటాను అంది. చెయ్యి దెగ్గరికి తెచ్చింది అమృత. చేసేది లేక జఫర్ నోరు తెరిస్తే అమృత తినిపించింది. ఆఖరిది జఫర్ నోట్లోకి వెళుతుంటే వెంటనే తన పెదాలతో అందుకుంది. ఇద్దరి పెదవులు ఒక క్షణం కలుసుకుని విడిపడ్డాయి. జఫర్ ఆశ్చర్యంగా చూస్తుంటే అమృత సిగ్గు పడింది. పెప్సీ తాగి జఫర్ కిస్తే తాగింది. తన ఎంగిలి తాగుతున్నాడని జఫర్ భుజం మీద తల పెట్టుకుని ముద్దు పెట్టింది అమృత.

నువ్వంటే నాకిష్టం జఫర్ అని చూసింది అమృత. జఫర్ అయోమయంగా చూస్తుంటే సారీ.. నా వల్ల కావట్లేదు అని లిప్ లాక్ చేసేసింది.  ఆ డీప్ ముద్దుకి థియేటర్ తెర కంటే పెద్దగా తెరుచుకున్నాయి జఫర్ కళ్ళు. అమృత జఫర్ ఎంగిలి జుర్రుతుంటే స్థాణువులా ఉండిపోయింది. అమృతే విడిపడి మళ్ళీ బుగ్గ మీద ముద్దు పెట్టి నాకు తినిపించు అంది. జఫర్ పాప్కార్న్ తీసి అన్నం తినిపిస్తున్నట్టు పెడితే నవ్వి అలానా అని జఫర్ చెయ్యి పట్టుకుని తన భుజం మీద నుంచి వేసుకుని ఇంకా దగ్గరికి జరిగింది. పాప్కార్న్ బకెట్ ఒళ్ళో పెట్టుకుని ఇప్పుడు తినిపించు అంటే అలానే తినిపించింది. అమృత ఆనందంగా తింటు మధ్యలో మరోసారి ముద్దు పెట్టింది, జఫర్ నోట్లోకి అమృత ఎంగిలి పెప్సీ రాగానే ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టు అయ్యింది.

xxxx

తలుపు కొడుతున్న శబ్దం వినపడుతున్నట్టు అనిపిస్తుంటే లీలగా కళ్ళు తెరిచింది గీత. గది మొత్తం చీకటి. ఒళ్ళంతా చెమటలు. తన తొడ మీద నగ్నంగా స్పృహ లేనట్టు పడుకుంది హిమజ. కళ్ళు తుడుచుకుని పక్కనే ఉన్న బాటిల్ తీసి నీళ్లు తాగింది. తలుపు చప్పుళ్ళు ఇంకాస్త స్పష్టంగా వినిపిస్తుంటే నిద్ర నుంచి తేరుకుని ఎవరూ అని అరిచింది. బైట నుంచి నేను జఫర్‌ని ఆంటీ అని వినిపిస్తే రెండు నిమిషాలు అని అరుస్తూ లేచి చీర కట్టుకుంది. హిమజని లేపినా లేవలేదు. త్వరగా మొహం కడుక్కుని అదే కొంగుతో తుడుచుకుని హిమజని కష్టంగా ఎత్తుకుని లోపల పడుకోబెట్టింది. బైట గది తలుపు వేసి మెయిన్ డోర్ తీసింది. లోపలికి వచ్చింది జఫర్. గీత జరిగింది మొత్తం చెపుతుంటే వింటూనే సోఫాలో పడి ఉన్న చీరని, జాకెట్‌ని బ్రాని చూసింది జఫర్. చీర హిమజ ఆంటీది అని గుర్తుపట్టింది. జఫర్ అయోమయం చూపులు గమనించింది గీత. మాట్లాడటం ఆపేసి. నీ అనుమానాలు పక్కన పెట్టి నేను చెప్పేది విను అంటే జఫర్ గీత చెప్పింది మొత్తం విని నవ్వుకుంది. 

ఓ కొత్త కథని అల్లాడు. 
జఫర్ ఇంకా నవ్వుతూనే ఉంది.

అమృత గురించి అడిగితే ఇవ్వాళ జరిగింది చెప్పింది. ఇలానే ఉంటే ఇబ్బందుల్లో పడతావని, అయితే జాగ్రత్త పడు లేదంటే ఏదో పరిష్కారం చూసుకోమని చెప్పింది గీత. జఫర్ ఆలోచిస్తాను అని పైకి వచ్చేసింది.

పైన తలుపులు తెరిచే ఉన్నాయి. లైట్లు కూడా వేసి లేవు. లేడా అనుకుంటూ ఇంట్లోకి వెళితే మూలన కూర్చుని వణుకుతున్నాడు గోపీ. లైట్ వేసి దగ్గరికి వెళ్లి చూసింది. ఒంటి నిండా రగ్గు కప్పుకుని ఉన్నాడు. కళ్ళు ముసుకుపోయి ఉన్నాయి. బిగుసుకుపోయి ఉండటం చూసి కంగారు పడింది జఫర్. ఎంత పిలిచినా లేవలేదు. వెంటనే కిందకి పరిగెత్తింది.

xxxx

అందరూ లైన్లో నిలుచొండి ప్రసాదం పెడతాను అని జనని అంటే పిల్లల అందరూ లైన్లో నిలుచున్నారు. మూడో వరసలో ఉన్న ఆరేళ్ళ గోపీని వెనక్కి నెట్టేసారు అంతా కలిసి. గోపీ నిరాశగా నిలుచున్నాడు. మొదట ఆరుగురికి ప్రసాదం పెట్టిన జనని చివరగా నిలుచున్న గోపీని చూడగానే చేతిలో ఉన్న ప్రసాదం పనిమనిషికి ఇచ్చి మిగిలిన అందరికీ పెట్టమని చిన్న కొడుకుని ఎత్తుకుని వెళ్ళిపోయింది. గోపీ వంక జాలిగా చూసింది పనిమనిషి. మిగతా అందరితోనూ బాగుండి తన ఒక్కడినే ఎందుకు వేరు చేసి చూస్తుందో గోపీకి తెలీదు. ఏడుపు వచ్చినా ఆపుకున్నాడు. కానీ జాలిగా చూస్తున్న పనిమనిషిని చూసి ఏడవకుండా ఉండలేకపోయాడు. అక్కడి నుంచి పారిపోయాడు.
Like Reply
#32

నన్ను ఆడిపించుకోండి.. ఏడుస్తూ అడిగాడు గోపీ. ఎవ్వరు పట్టించుకోకపోతే పెద్దన్న పిలిచి సాయంత్రం వరకు గోపీ స్పృహ కోల్పోయేలా పని చేయించుకున్నాడు.


రాత్రి అంతా నానబెట్టిన తీగ కర్రలతో ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు గోపీని. ఒళ్ళంతా చారలు పడుతున్నాయి.  పక్కనే నిలబడి చూస్తున్న జనని ఆపడానికి రాలేదు. నిస్సహాయంగా తల్లి వైపు చూసాడు. ఆ తల్లికి ఇవేమి అర్ధం కావు. దెబ్బలు మాత్రం పడుతూనే ఉన్నాయి. చెప్పు ఇంకోసారి అమృతతో మాట్లాడనని, ఆడుకోనని చెప్పు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమృతతో నేరుగా మాట్లాడటానికి ఎప్పుడు ప్రయత్నించలేదు గోపీ.

ఎప్పుడు గోపీ మీద వాళ్ళ కోపం తీర్చుకోవాలన్నా రాజారావు బిజినెస్ ట్రిప్‌కి వెళ్లే వరకు ఆగి ఆ తరువాత గోపీని గొడ్డుని బాదినట్టు బాది చీకటి గదిలో వేసి తాళం వేసేవాళ్ళు. ముందు నొప్పి తట్టుకోలేక ఆ తరువాత చీకట్లో భయంతో పిచ్చిగా ఏడ్చేవాడు గోపీ. అమ్మని పంపించమని రెండు చేతులతో మొక్కుకునేవాడు. భయంతో చలి జ్వరం వచ్చేది. ఒక్కడే వణుకుతూ నరకం అనుభవించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఏ రోజు జనని రాలేదు. రాదని తరువాత తెలిసింది. 

జనని పుట్టినరోజు తాతయ్యని డబ్బులు అడిగి పని వాళ్ళతో గిఫ్ట్ తెప్పించాడు. జనని ఇద్దరు కొడుకులు విషెస్ చెప్పి వెళ్లిపోతుంటే గోపీ కూడా వెళ్లి ప్రేమగా గిఫ్ట్ ఇచ్చాడు. థాంక్స్ చెప్పి తీసుకున్న జనని అదే సాయంత్రం రెడీ అవుతుంటే తన చెవి కమ్మ మిస్ అయ్యిందని తెలిసింది. ఇంత ఖరీదైన గిఫ్ట్ ఎలా కొన్నావని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. తరువాత జననికి కమ్మ దొరికి నిజం తెలిసినా గోపీకి ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదు. 

గోపీ వాటా 2% లాక్కునే ఆలోచన చేసింది జనని. ఆ రోజు నుంచి గోపీని ఎవ్వరు తిట్టకపోవడం, కొట్టకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటికి తాతయ్య జాగ్రత్తగా ఉండమని, షేర్ కోసం ఏమైనా చేస్తారని పదే పదే చెపుతూనే ఉన్నాడు. ఎవ్వరు లేనప్పుడు గోపీని అడిగేది జనని. చాలా రోజులు తాతయ్య పేరు చెప్పి తప్పించుకుని తిరిగినా.. ఎన్ని అస్త్రాలు వాడినా ఒప్పుకోని గోపీ గిన్నెడు సేమ్యాకి జనని వలలో పడ్డాడు. ప్రేమగా వండిపెట్టిన సేమ్యా, మృదువుగా మాట్లాడిన రెండు మాటలు. రోజూ ఇలానే ఉంటానన్న జనని అబద్ధపు ప్రమాణం. తాతయ్య చెపుతున్నా వినకుండా గోపీ తన వాటాని జనని పేరు మీద రాసాడు. సంతకం పెట్టిన తరువాత క్షణం నుంచి జనని చెప్పింది మొత్తం అబద్ధమేనని, ప్రేమతో మోసపోయానని తెలిసాక గోపీకి బతకాలని అనిపించలేదు. ఎవరి కోసం బతకాలో గోపీకి కారణం కనిపించలేదు. పారిపోయాడు. పరిగెడుతూనే ఉన్నాడు. ఒంట్లో సత్తువ అయిపోయేంత వరకు పరిగెత్తి రాయి తగులుకుని కింద పడి స్పృహ కోల్పోయాడు. 

xxx

మరేం పరవాలేదు. ఈ టాబ్లెట్స్ నీళ్లలో కలిపి తాగించండి. అప్పటికి ఏ మార్పు లేకపోతే రేపు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. గీత తన ఇంట్లో ఉన్న రగ్గులు మొత్తం తెచ్చి గోపీ మీద కప్పింది. జఫర్ కంగారుపడుతుంటే ఏమి కాదని ధైర్యం చెప్పి కాసేపు మాట్లాడి కిందకి వచ్చేసారు. 

మన వల్లే అంటావా అంది హిమజ. కాదు లేవే.. అని హిమజని కూడా పంపించేసింది గీత. మొగుడు ఫోన్ చేస్తే కాసేపు మాట్లాడి పెట్టేసింది. పైకి వెళ్లి చూస్తే తలుపులు పెట్టేసి ఉన్నాయి. గీత కిందకి వచ్చేసింది. నిద్రపోతుంటే గోపీ మాట్లాడిన మాటలే గుర్తుకు వచ్చాయి. అన్నింట్లో ఒక్కటి మాత్రం సరిగ్గా చెప్పాడు, జఫర్ తన ఇంట్లోనే ఉందని. నవ్వుకుంది గీత.

వణుకుతున్న గోపీని చూడలేకపోతుంది జఫర్. ఎప్పుడూ హుషారుగా తన చుట్టూ నవ్వుతూ తిరిగే గోపీ ఇప్పుడిలా లేవలేకుండా వణుకుతుంటే దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుంది. గోపీ మొహంలో భయం, ఏడుపు చూసి పక్కనే పడుకుని వాటేసుకుంది. ఎందుకో ఎప్పుడూ లేనంత ప్రేమ పుట్టింది గోపీ మీద. చిన్నప్పటి నుంచి తనూ తాతయ్య తప్ప ఇంకో లోకం తెలియని జఫర్‌కి ఇప్పుడు గోపీనే తన లోకంలా కనిపిస్తున్నాడు. గోపీని చూడకుండా ఉండలేకపోతుంది. గోపీ ఏం మాట్లాడినా, ఏం పని చేసినా తన పెదవులపై నవ్వుని తెప్పిస్తుంది. కొన్నిసార్లు ప్రేమగా అయితే ఇంకొన్ని సార్లు వేళాకోళంగా ఏదైనా గోపీ పక్కన ఉంటే సంతోషంగా ఉంటుంది. నాలుగు రోజులు గీత ఆంటీ ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్నే లేవగానే గోపీ మొహం కనిపించలేదు. ఆ రోజే తెలిసింది గోపీ పక్కన లేకుండా వాడిని చూడకుండా బతకలేదని. 

గోపీ ఎవరినో తలుచుకుంటున్నాడు, ఎవరి మీదో బెంగ పెట్టుకున్నాడని తెలుస్తుంది కానీ ఏం చెయ్యాలో తెలియట్లేదు. తనని గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కుంటుంటే అంతే ప్రేమగా గోపీని హత్తుకుంది. చలికి వణుకుతుంటే ధైర్యం తెచ్చుకుని బట్టలు విప్పేసింది. గోపీ అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడు. మెల్లగా గోపీ టీషర్ట్ విప్పేసింది. గోపీని దగ్గరికి తీసుకుంటుంటే గుండె వేగం పెరగడం తెలుస్తుంది. తన శరీరం గోపీ శరీరం కలవగానే ఒక్కసారిగా హత్తుకుంది. ఇందాక థియేటర్‌లో అమృత ఏ ముహూర్తాన ముద్దు పెట్టిందో గోపీ పెదవుల రుచి చూడాలని బ్రెయిన్‌లో ఫిక్స్ అయ్యింది. చర్మం వల్ల కలుగుతున్న వెచ్చదనం తను అనుభవిస్తూ గోపీకి పంచుతూ మెల్లగా గోపీకి ముద్దు పెట్టేసింది. ఒకరకంగా జఫర్‌లో ఇంత వేడి పుట్టడానికి కారణం అమృతే..

చీకట్లో గోపీ పెదవుల ఎంగిలి తాగుతుంటే ఇందాక వేసిన టాబ్లెట్ రుచి చేదుగా తెలుస్తుంది. కళ్ళు మూసుకుని గోపీ ఎంగిలి రుచి చూస్తూనే ఎడమ కాలు నడుము వరకు మడిచి గోపీ నడుము మీద షాటు అంచుని తన కాలి బొటన వేలుతో కిందకి తన్నింది. తన బాటం కూడా విప్పేసి గోపీ కాళ్ళ మధ్యలో తన కాలు పోనించి ఇద్దరి తొడలు రాజుకుంటుంటే ప్రాణంగా గోపీని గ్యాప్ లేకుండా వాటేసుకుంది. తన తొడకి గోపీ గూటం తగులుతుంటే ఎలాగో అనిపించింది. జఫర్ ఒళ్ళు పొగలు కక్కుతుంటే ఆ వేడికి గోపీ ఒంట్లో వణుకు తగ్గడం జఫర్ గమనించి ఇదే కావాలంటే చచ్చేవరకు ఇలానే ఉంటాను గోపీ అని పాములా అల్లుకుపోతూ తన వేడి చల్లారేంత వరకు గోపీ ఒంటితో ఆడుకుని అలిసిపోయి చెమటలోనే నిద్రపోయింది. 


తెల్లవారుజామున మూడు కావొస్తుంటే స్పృహ లోకి వచ్చాడు గోపీ. కళ్ళు తెరవలేదు కానీ పక్కన ఎవరో ఉన్నారని స్పర్శ తెలుస్తుంది. కళ్ళు తెరుద్దామంటే ఒంట్లో అణువంత శక్తి కూడా లేనట్టు అనిపించింది. ఎవరో తనని నగ్నంగా హత్తుకున్నారు. తన తొడల మధ్యలో వేడి తెలుస్తుంది. అది ఎవరిదో కాలు. తొడ అని తెలుస్తుంది. తన పొట్టకు ఆనుకున్న చర్మం ద్వారా వేడి తెలుస్తుంటే ఇంకా ఒంట్లో ఎక్కడో చలి ఉన్నట్టు అనిపించింది. తన చెయ్యి ఎవరి నడుము మీద ఉందొ తెలీదు కానీ పట్టు వల్ల అది అమ్మాయేనని స్పష్టం చేసుకున్నాడు. బలం కూడగట్టుకుని కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా తెల్లని చర్మం. కంటికి తెల్లని కండ కనిపిస్తుంది అది తన ముక్కుకి తగులుతుంది. కుడి కంటికి ఆ తెల్లని కండ మీద లేత గోధుమ రంగు మచ్చ.. ఆ మచ్చ మీద చిన్నగా ఎర్రని బొడిపె కనిపించింది. అది తనని హత్తుకుని పడుకున్న అమ్మాయి వక్షమని అని త్వరగానే తెలుసుకున్నాడు. ఎవరో చూడాలని తల ఎత్తుతుంటే ఆమె గడ్డం గోపీ తలకి తగిలి ఎత్తలేకపోతున్నాడు. రెండు సార్లు ప్రయత్నించి వల్ల కాక మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఒంటి సువాసన పీలుస్తూ ఎవరా అని అంచనా వేయడానికి ప్రయత్నస్తున్నాడు. అయినా గోపీకి తెలియలేదు. ఆమె నిద్రలో ఉందని మాత్రం తెలుస్తుంది. నిద్రలో ఆమె పీలుస్తున్న శ్వాస గోపీ తల మీద తెలుస్తుంది. మళ్ళీ కళ్ళు తెరిచి చూసాడు. శ్వాస వల్ల ఆమె సళ్ళ కదలిక తెలుస్తుంది. రెండు సళ్ళ మధ్యలో చిన్న పుట్టుమచ్చ కనిపించింది. పక్షి తన పిల్లని రెక్కలలో దాచినట్టు గోపీని అల్లుకుపోయి రెండు చేతులు తన చుట్టూ వేసి తన సళ్ళలో గోపీ తలని పెట్టుకుని ఎక్కడా చలి తెలియకుండా వెనక వీపు మీద చేతులు వేసి పట్టుకున్న ఆమె విధానానికి ఆమె ఎవరో చూడాలని గోపీ మనసు ఉవ్విళ్ళూరుతుంది. చాలా సేపు పెనుగులాడినా కనీసం గోపీ చెయ్యి కూడా లేవలేదు. ఇందాకటి నుంచి గోపీ ముక్కుకి తగులుతున్న ఆమె ముచ్చిక చూసి పెనుగులాట ఆపేసాడు. మెల్లగా పెదవులు తెరిచి తల కొంచెం ముందుకు అంటే ముచ్చిక తన పెదవుల మధ్యలోకి వెళ్ళింది. గోపీ తన పెదవులని మూసేసాడు. బఠాణి సైజు అంత ముచ్చిక అని పెదవులతోనే కొలిచాడు. నాలికతో ముట్టుకోవాలని ఉంది. కానీ బద్దకంతో పాటు నాలికని లేపి ముచ్చిక మీద వేసేంత ఓపిక లేదు గోపీలో. ముచ్చికని పెదవులతోనే నలిపి రుచి చూస్తూ చివరికి మెల్లగా నాలికతో నాకుతూ అలానే నిద్రలోకి జారుకున్నాడు. 


మొహం మీద ఎండ పడుతుంటే కళ్ళు తెరిచింది జఫర్. ఎదురుగా కిటకి చూసి కళ్ళు కిందకి దించితే తన ఒళ్ళో పిల్లాడిలా ఒదిగిపోయిన గోపీ జుట్టు కనిపించింది. ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంటే తన ముచ్చిక గోపీ నోట్లో ఉందని తెలిసి ఆశ్చర్యపోతూ మెల్లగా వెనక్కి జరిగి కిందకి చూసింది. గోపీకి ఇంకా స్పృహ రాలేదని స్పష్టం చేసుకున్నాక లేచి టైం చూస్తే అప్పటికే తొమ్మిది దాటింది. గోపీ తొడల మధ్య తన కాలుని మెల్లగా తీసి గోపీ మొహం చూసి నవ్వుతూ ముందు నుదిటి మీద ముద్దు పెట్టుకుని ఆ వెంటనే పెదవుల మీద ముద్దు పెట్టి గోపీకి షాటు తొడిగి తన బట్టలు తీసుకుని గోపీ ఒంటి మీద రగ్గు కప్పి నగ్నంగా బాత్రూంలోకి పరిగెత్తింది.






కళ్ళు తెరిచాడు గోపీ. తల తిప్పి చూస్తే స్టవ్ దగ్గర జఫర్ నిలబడి ఉంది. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఎవరో తనని ముట్టుకున్నట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే జఫర్ తనని కూర్చోపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసి మెల్లగా సహకరించాడు. గోడకి కూర్చోపెట్టాడు జఫర్. ఒక్క నిమిషం గోపీ అని వెంటనే వెళ్లి ఇడ్లి తీసుకొచ్చాడు. తన వైపుకు కూర్చోపెట్టుకుని భుజం మీద చెయ్యేసి గోపీని పట్టుకుని ఇంకో చేత్తో పొగలు కక్కుతున్న ఇడ్లి చుంచి ఊదుతూ చిన్నగా తినిపిస్తే ఒక్క ఇడ్లి తిన్నాడు. నీళ్లు తాపించి టాబ్లెట్ నీళ్లలో కలిపి తాగిస్తే జఫర్ భుజం మీద వాలిపోయాడు. చాలా సేపటికి మంచి నీళ్లు అని అడిగాడు గోపీ. పక్కనే ఉన్న గ్లాసుతో నీళ్లు తాగించి, గోపీని కూర్చోపెట్టి ఇందాక కాచిన రాగి జావ తీసుకొచ్చి మెల్లగా తాగిస్తే తాగేసాడు. 

థాంక్స్ రా.. అమ్మా అస్సలు ఓపిక లేదు. 

ఇప్పుడు నువ్వు వెళ్లి చెయ్యాల్సిన పనులేమి లేవు. కాసేపు ఏం మాట్లాడకుండా కూర్చో అన్నాడు జఫర్. సండే పుస్తకంలో కథ చదువుతుంటే పైకి చదువు అన్నాడు గోపీ. జఫర్ కథ వినిపించింది. బాగుందిరా అన్నాడు. ఆకలిగా ఉంది అంటే మిగతా ఇడ్లి తినిపించింది. నేను తింటాలే అంటే పర్లేదు తినమని తినిపించింది జఫర్. తినిపించడం వరకు ఓకే కానీ జఫర్ మూతి కూడా తుడుస్తాడని ఊహించలేదు గోపీ. అదే చూస్తుంటే ఏమైంది అని అడిగాడు జఫర్. ఏం లేదన్నాడు గోపీ. 

రాత్రి ఎవరైనా వచ్చారా ?
లేదే..

ఓహ్..
ఎందుకు ?

ఏం లేదు. 
చెప్పు గోపీ 

రాత్రి ఎవరైనా అమ్మాయి వచ్చిందా.. నా పక్కన పడుకుందా ?
లేదే.. రాత్రి నేను వచ్చేసరికి వణుకుతుంటే డాక్టర్‌ని పిలిపించాను. కింద గీత ఆంటీ రగ్గులు తెచ్చి నీకు కప్పింది. రాత్రి అంతా స్పృహ లేకుండా పడుకున్నావ్.

జఫర్ నోట నుంచి గీతా ఆంటీ అని రాగానే నవ్వాడు గోపి. ఆ నవ్వుకి అర్ధం చాలా సేపు ఆలోచిస్తే కానీ జఫర్‌కి తట్టలేదు. రాత్రి గీత ఆంటీకి తనకి అక్రమ సంబంధం ఉందని గోపీ చేసిన నిర్ధారణ చెప్పింది గుర్తుకు వచ్చి గోపీ వంక కోపంగా చూసింది. 

నేనేమి అనలేదు బాబు అని మళ్ళీ నవ్వుతుంటే కొట్టబోయి ఆగిపోయింది. తాతయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే సరేనన్నాడు. అమృత కూడా ఫోన్ చేసింది. ఎక్కువ పొడిగించకుండా తనకే జ్వరం వచ్చిందని చెప్పింది. అమృత వస్తానంటే గోపీ ఉన్నాడు వద్దంది. సరే అంది అమృత. ఫోను కట్ చేసి గోపీ వైపు చూస్తే ఎందుకో తననే వెటకారంగా చూస్తున్నట్టు అనిపించింది. ఏంటి అంటే ఏం లేదని నవ్వాడు గోపీ. తనున్న పరిస్థితికి తనకే నవ్వొచ్చింది.  గోపీని కొడదామని వస్తుంటే నువ్వు చాలా పెద్ద ఆటగాడివిరా అన్నాడు. అక్కడితో ఆగిపోయింది జఫర్.



మధ్యాహ్నం ఫ్రూట్ జ్యూస్, ఇడ్లీ తిన్నాడు. గీత, హిమజ వచ్చి చూసారు. గోపీ హిమజ వైపు గీత వైపు జఫర్ వైపు దొంగ చూపులు చూస్తుంటే తల కొట్టుకుంది హిమజ. వాళ్ళు వెళ్ళాక గోపీ అడుగుదామనుకున్నా ఎందుకో అడగలేకపోయాడు. జఫర్ తనతో చెప్పలేదంటే తన మీద నమ్మకం లేకే చెప్పలేదు. మళ్ళీ అడగడం వేస్ట్ అని ఆగిపోయాడు గోపీ. సాయంత్రం వరకు కాస్త తేరుకున్నాడు. 

ఆ రాత్రి అంతా గోపీ పడుకోలేదు జఫర్‌ని పడుకోనివ్వలేదు. రాత్రి ఎవ్వరు రాలేదా అని పదే పదే అడుగుతుంటే లేదని గట్టిగా చెప్పాడు జఫర్. ఎందుకు అడుగుతున్నావ్ అని అడిగితే రాత్రి వచ్చిన కల గురించి చెప్పాడు గోపీ.

అది కలే అన్నాడు జఫర్.

అవును. కానీ చాలా రియల్‌గా జరిగినట్టు అనిపించింది. నిజంగా ఆ అమ్మాయి ఉంటే నేను తననే పెళ్లి చేసుకుంటాను. 

జఫర్ నవ్వి ఎందుకలా అని అడిగాడు.

ఆ అమ్మాయి నన్ను పట్టుకున్న విధానం. చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా అది ఎలా చెప్పాలో తెలియట్లేదురా కానీ.. ఆహ్.. ఆ అమ్మాయి.

ఫేస్ చూసావా ?

లేదు. నాకు అసలు ఓపిక లేదు. కలలో కూడా చాలా వీక్‌గా అనిపించింది. నిజంగా ఎవ్వరు రాలేదా అని బెంగగా అడిగాడు ఈ సారి.

లేదు గోపీ.. నేను ఇక్కడే ఉన్నాను. గోపీ ఇంకేం మాట్లాడలేదు. కానీ ఏదో ఆలోచిస్తున్నాడు. 

నువ్వు చెప్పినట్టు అది కలే అయ్యుండచ్చు కానీ నేనేం చూశానో నాకు తెలుసు. నేనేం అనుభవించానో.. నేనే ప్రేమను పొందానో ఆణువణువూ ఆ స్పర్శ నాకు గుర్తుంది. అది ఇంకా నిజంలా అనిపిస్తుంది. తలుచుకుంటేనే అని చేతులు చూసుకున్నాడు. గూస్‌పంప్స్‌తో చేతి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. అది ఎంత కల అని బుర్రకి సర్ది చెప్పుకున్నా మనుసు మాత్రం ఒప్పుకోవట్లేదు.

గోపీ మౌనంగా ఉండేసరికి కదిలిస్తే ఆలోచనల్లో నుంచి బైటికి వచ్చాడు. నిద్ర వస్తుందని ఇంకో వైపుకి తిరిగి పడుకున్నాడు. రాత్రే ఇంకా తన పక్కనే ఉన్నట్టు, తన కౌగిలిలో ఒదిగి నిద్ర పోతున్నట్టు అనిపించింది గోపీకి. ఆమె ముచ్చిక గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు. అసలు నిద్రపోలేదు. ఏవేవో ఊహల్లో గడిపేస్తూ ముచ్చిక నోట్లో పెట్టుకున్న దగ్గర నుంచి కొత్త సీన్ అల్లుతూ ఊహించుకుంటూ తెల్లవారుజామున నిద్రపోయాడు. 

నిద్ర లేచేసరికి పన్నెండు దాటింది. చూస్తే జఫర్ పక్కనే ఉన్నాడు. అన్నం తింటానంటే అప్పటికప్పుడు వండేశాడు జఫర్. ఇద్దరు కలిసి తిన్నాక కాసేపు మాట్లాడుకుని టీవీలో సినిమా చూసారు. సాయంత్రం ఇద్దరు బైటికి వెళుతుంటే గీత చూడటం చూసాడు గోపి. 

రేయి మీ ఆంటీ నీకోసమే చూస్తుంది. వెళ్లి మాట్లాడి రాపో అంటే కోపంగా చూసాడు జఫర్. సరే సరే అని మాట్లాడుకుంటూ కాసేపు బైట తిరిగేసి వచ్చేసారు. మరు తెల్లారికి పూర్తిగా కోలుకున్నాడు గోపి. 
Like Reply
#33

(21-05-2026, 09:03 PM)Kman50459 Wrote:  Update please

(21-05-2026, 10:10 PM)Vizzus009 Wrote:  Nice story.... please continue

(22-05-2026, 09:09 AM)Kman50459 Wrote:  Raagaa bro update pplease

(22-05-2026, 10:30 AM)Paty@123 Wrote:  Plz update

Done dears
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#34

(23-05-2026, 03:50 PM)Ramya nani Wrote:  బ్రో మీ స్టోరీ లో రొమాన్స్ తక్కువ ఉన్న రియాలిటీ ఎక్కువ ఉంది.  నైస్.. చదువుతున్నంత సేపు నేనే అక్కడ ఉన్నట్లు ఉంది.. సూపర్..

Thankyou
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#35

(22-05-2026, 05:04 PM)Hrlucky Wrote:  Wow superb superb నిజం లాంటి కళా కళ లాంటి నిజమో super

Thankyou all
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#36

సరదాగా ఊరు తిరిగి వచ్చాక బండి దిగిన జఫర్ పైకి వెళ్ళింది. వెనకే గోపీ బండి పక్కకి పెట్టేసి పైకి వెళుతుంటే గీత ఇంట్లోకి వెళ్లడం కనిపించింది. ఆగి గీత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. గోపీని చూసి నవ్వింది గీత. రా గోపీ అంది. లోపల కూర్చున్నాడు. ఎదురు కూర్చుంది గీత. ఆంటీ.. అని సాగతీస్తే చెప్పు గోపీ అంది. 


నాకొక్క సారి మీ సళ్ళు చూపిస్తారా ?
ముందు ఆశ్చర్యపోయి వెంటనే కోపంగా చూసింది.

ప్లీజ్ ఆంటీ..

గోపీ ఇలా ఎప్పుడు ప్రవర్తించడని తెలుసు గీతకీ. ఇంకా కోపంగానే చూస్తుంటే నాకు మీ బ్రెస్ట్ కూడా చూపించద్దు జస్ట్ రెండు సళ్ళ మధ్యలో పుట్టుమచ్చ ఉందా లేదా చూపించండి చాలు.

పుట్టుమచ్చా!

అవును ఆంటీ..

నాకు లేదు అంది గీత. అయినా ఎందుకు నీకు అని అడిగితే ప్లీజ్ ఆంటీ ఒక్కసారి చూపించండి. అదొక్కటి చూపించండి నేను మళ్ళీ మీ జోలికి రాను. నీకు జఫర్ గాడి మధ్యలోకి కూడా రాను అన్నాడు.

కానీ..
లైఫ్ మ్యాటర్ ఆంటీ.. ప్లీజ్ అని బతిమిలాడాడు.

నేను అసలు ముట్టుకోను, అదొక్కటి చూసి వెళ్ళిపోతాను అంతే.. 

ఒక వేళ పుట్టుమచ్చ ఉంటే అని అడిగింది గీత. ఒక్కసారి చూపించండి ఆంటీ అని అడిగాడు మళ్ళీ.. నిజానికి ఈ పాటికి తన్ని తరిమి ఇల్లు ఖాళీ చేయించాలి కానీ గీత ఇంకా మౌనంగానే ఉంది. గోపీతో పాటు ఇప్పుడా పిల్ల కూడా ఉంది. ఈ ఇద్దరినీ ఒక్కటి చెయ్యాలని అనుకోవడం, జఫర్‌కి సాయం చెయ్యడం. అంతా ఎందుకు చేస్తున్నాను అని ఆలోచిస్తుంటే ప్లీజ్ ఆంటీ అన్న గోపీ గొంతు వినపడింది.

గీత లేచి లోపలికిరా అని బెడ్‌రూం లోకి వెళితే వెనకే వెళ్ళాడు గోపీ. గీత కర్టెన్ వేసింది. గోపీ ముందు పైట పక్కకి జరిపి జాకెట్ ఉక్సులు తీస్తుంటే గీత చేతులు వణికాయి. గోపీ కళ్ళలోకి చూసింది, వాడి కళ్ళలో ఆతృత తప్ప కామం కనిపించలేదు. మెల్లగా జాకెట్ రెండు అంచులు పట్టుకుని ముచ్చికలు కనిపించకుండా పక్కకి జరిపింది. తల దించి తన సళ్ళ మధ్యలో చూసుకుని గోపీని చూసింది. 

ఆంటీ మీవి పెద్దగా ఉన్నాయి. కొంచెం పక్కకి జరపరా అన్నాడు శ్రద్ధగా చూస్తూ..

గీత తన రెండు రొమ్ములని పక్కకి జరిపితే తేరిపార చూసి చాలు అన్నాడు. గోపీ బైటికి వెళ్లిపోతుంటే జాకెట్ ఉక్సులు పెట్టుకుంటూనే గోపీ ఆగు అని బైటికి వచ్చి పైట వేసుకుంది. గోపీ మొహంలో ఒకలాంటి నిరాశ కనిపించింది. ఏమైంది గోపీ నాకు చెప్పు సమస్య అయితే పరిష్కరిద్దాం అంది నమ్మకంగా.. 

నాకింకో సాయం చేస్తావా అని అడిగాడు గోపీ.

చెప్పు గోపీ 

హిమజ ఆంటీది చూసే మార్గం ఏమైనా ఉందా ?

అది నిన్ను నన్ను ఇద్దరినీ తన్నిద్ది. అసలు ఎందుకు గోపీ..?

కావాలి అని లేచి బైటికి వెళ్ళిపోయాడు. కచ్చితంగా ఏదో ఉంది, ఒకసారి జఫర్‌తో మాట్లాడాలి అనుకుంది.

గోపీ బైటికి వచ్చి ఇంటి ముందు నడుస్తుంటే పైనుంచి చూసింది జఫర్. గోపీ ఫోన్ మాట్లాడుతున్నాడు.

స్వర్ణా ఎక్కడున్నావ్ ?

ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నా గోపీ. అక్కా అనకపోవడం ఆశ్చర్యం కలిగించింది స్వర్ణకి. మనం కలవాలి అంటే ఇంటికి వచ్చేసేయి అంది. సరే అని పెట్టేసి బండి తీసుకుని వెళుతుంటే పైనుంచి చప్పట్లు కొట్టింది జఫర్. గోపీ పైకి చూసాడు. ఎక్కడికి అని సైగ చేస్తే స్వర్ణ అన్నాడు. అన్నం అని సైగ చేస్తే వండు అని నవ్వి వెళ్ళిపోయాడు. జఫర్ కూడా నవ్వుకుంది. స్వర్ణ ఇంటికి వెళ్లి తాళం తీసి లోపల కూర్చున్నాడు. నేరేడు రంగు షిఫాన్ చీర కట్టుకుంది స్వర్ణ. జడని చాలా స్టయిలుగా అల్లింది. పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో ఉన్నా చీరలో ఒక్క మడత పడలేదు. నుదిటి మీద చెమట చుక్క లేదు. చాలా ఫ్రెష్‌గా కనిపించింది. అదే అడిగాడు గోపీ..

స్వర్ణ నవ్వింది. నేనేమైన రాళ్లు కొట్టడానికి వెళ్తున్నానా. ఆఫీసులో ఏసీ కింద కూర్చుని ప్రశాంతంగా పని చేసుకుని వస్తున్నాను. 

టెన్షన్స్ డెడ్ లైన్స్ లాంటివి ఉంటాయి కదా.. మీకు స్ట్రెస్ ఎక్కువ కదా!

ఉంటాయి. కానీ నేను ముందే కాల్క్యూలేట్ చేసి చెప్పేస్తాను. నేను పని జరుగుతుందని హామీ ఇస్తే జరిగినట్టే 

లేదంటే ?

జరగదు. 

వాళ్ళు ఒప్పుకుంటారా ?

ఒప్పుకోక ఏం చేస్తారు గోపీ.. నేను స్ట్రెస్ తీసుకుంటే తప్పులు జరుగుతాయి. సొ నేను స్ట్రెస్ అవ్వను. ఆడుతు పాడుతూ పని చేస్తాను. నా విధానాలు నచ్చకపోతే వెళ్ళిపోమంటారు. ఉద్యోగం పోయినా బైట నన్ను హైర్ చేసుకోవడానికి బొచ్చెడు మంది ఉన్నారు. కళ్ళకి అద్దుకుని తీసుకుంటారు నేనొస్తానంటే.. అంతెందుకు నీ అమృతే తీసుకుంటుంది అని నవ్వింది.

అమృతా!

మొన్న తన దగ్గరికి వచ్చిన విషయం చెప్పింది స్వర్ణ. 

నువ్వేమన్నావ్?

నో అన్నాను.

స్వర్ణా.. (మళ్ళీ అక్కా అని పిలవనందుకు సంతోషంగా హా అంది) నువ్వెప్పుడైనా డిలే చెయ్యడం జరిగిందా?

అప్పుడప్పుడు అవుతుంటాయి. మోస్టలీ కానివ్వను. నాకు ఫ్యామిలీనా పెళ్ళా పిల్లలా.. ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. 

స్వర్ణ చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోపెట్టుకున్నాడు. ఎవ్వరు ప్రపోజ్ చెయ్యలేదా ?

చేశారు. ఇవ్వాళ కూడా చేశారు. 

మరి.. నీకెవ్వరూ నచ్చలేదా?

నచ్చిన వాడు ఎదురుగానే ఉన్నాడు అంది మనసులోనే.. నా సంగతి సరే.. నీ సంగతి ?

నేనా.. గట్టిగా ఊపిరి వదిలి స్వర్ణ ఒళ్ళో పడుకున్నాడు. స్వర్ణ ఒంటి సువాసన ముక్కుకి తగులుతుంది. 

ఇంత దగ్గరగా ఉండడు గోపీ. మొత్తానికి ఏదో జరిగింది అని తెలిసింది. లవ్ లో పడ్డావా అని అడిగితే ఇంకా లేదు అన్నాడు. 

అమృతా?

లేదు.. అమ్మాయిని వెతకాలి. కొంచెం సాయం చెయ్యి.

ఎలాంటి అమ్మాయి కావాలి నీకు ?


తెల్లగా ఉండాలి. గడ్డం షార్ప్‌గా ఉండాలి. నా తల ఉంటే గుచ్చుకునట్టు ఉండాలి. బూబ్స్ నార్మల్‌గా ఉండాలి. రెండు బూబ్స్ మధ్యలో పుట్టుమచ్చ ఉండాలి. గట్టి పొట్ట. మెత్తని నడుము. బలంగా ఉండే చేతులు. సన్న తొడలు. మంచి సువాసన వెదజల్లే ఒళ్ళు.. నీ లాగే.. బలమైన కాళ్ళు అంటే గట్టి పిక్కలు. కౌగిలించుకుంటే వెచ్చగా ఉండాలి. 

గోపీ తల మీద కొట్టింది స్వర్ణ. నా నడుము మెత్తగా ఉందేమో చూడకపోయావా మరి అంటే స్వర్ణ కళ్ళలోకి చూసాడు. చూడరా అంది చెయ్యి పట్టుకుని. స్వర్ణ  పొట్టని చూస్తూ కుడి చేత్తో నడుము మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు. మెత్తగా తగిలింది. గోపీ తల పట్టుకుని పొట్టలోకి నొక్కుకుంది. గట్టిగా ఉందా అని నవ్వుతుంటే ఊపిరి ఆడట్లేదే అని లేచి కూర్చున్నాడు. స్వర్ణ లేచి గోపీ ఒళ్ళో కూర్చుంది. నీ బూబ్స్ మధ్యలో చూపిస్తావా అని అడిగాడు. 

పుట్టుమచ్చ కోసమా.. 

ఉందా.. ఒక్కసారి చూపించు అన్నాడు. స్వర్ణ లేచి గదిలోకి పరిగెత్తింది. స్వర్ణా అని పిలుస్తుంటే నేను చూపించను. ధైర్యం ఉంటే నువ్వే చూసుకో అంది లోపలికి వెళ్తూ.. ఒక్కసారిగా ఆశ పుట్టింది గోపీకి లేచి స్వర్ణ వెనక పరిగెత్తి ఒక్క అంగలో అందుకుని మంచం మీదకి తోశాడు. స్వర్ణ మీద కూర్చుని పొట్లాడుతుంటే చీర పక్కకి తప్పింది. రెండు చేతులు అడ్డం పెట్టుకుంటే మృగంలా చూస్తూ చేతులు పట్టుకుని లాగి కాళ్ళ కింద పెట్టుకుని చెయ్యి వెనక్కి పెట్టి తాడు లాగేసాడు. స్వర్ణ జాకెట్ వదులు అయ్యుంది. గోపీ బలవంతంగా తీస్తుంటే సాయం చేసింది స్వర్ణ. లోపల బ్రా కూడా తీయమని లేచి వీపు చూపించి కూర్చుంటే బ్రా విప్పేసాడు. గోపీ రెండు చేతులు పట్టుకుని తన నడుము మీద వేసుకుంటే మెల్లగా తిప్పాడు. కిందకి చూడకుండా గోపీ గడ్డం పట్టుకుంటే బలవంతంగా కిందకి చూసాడు. సళ్ళ మధ్యలో పుట్టుమచ్చ కనిపించలేదు. 

అది నిజం కాదు కలేనేమో నని భయం వేసింది. గోపీని తన మీద పడుకోబెట్టుకుంటే కళ్ళు మూసుకున్నాడు. గోపీకి మూడ్ రాలేదని తెలిసి నిరాశ పడింది. గోపీ తనకి దక్కడేమో అన్న భయం కలిగింది స్వర్ణకి.

xxxx

గీత, హిమజ, జఫర్ ముగ్గురు కూర్చుని ముచ్చట్లు పెడుతున్నారు. గీత ఇంకా గోపీ గురించే ఆలోచిస్తుంది. ఎందుకు అలా అడిగాడో అర్ధం కాలేదు. హిమజ గురించి కూడా కనుక్కోమని చెప్పాడు. జఫర్‌కి దీని గురించి ఏమైనా తెలుసా అని అనుమానం వచ్చింది.

హిమజా.. నీ పాయల మధ్యలో పుట్టుమచ్చ ఉందా ?

పిచ్చిదానిలా చూసింది హిమజ. ఎందుకే.. లేదు అని హిమజ చెపుతుంటే అంతలోనే జఫర్ ఉలిక్కి పడటం చూసింది గీత. నీకుంది కదా అని  జఫర్‌ని అడిగింది గీత. 

జఫర్ సమాధానం చెప్పలేదు.

గోపీ వెతుకుతున్నాడు అని జరిగింది చెప్పింది. జఫర్ మౌనంగా పైకి వెళ్ళిపోతే హిమజ గీత సళ్ళని గట్టిగా పిండింది.  ఉఫ్..

ఏంటే వాడికి నీ సళ్ళు చూపించావా ? వాడి మీద కన్ను పడిందా.. మొదటి నుంచి చూస్తున్నా వాడితో నీ ప్రవర్తన తేడాగానే ఉంది. వాడి మీద మనసు పడ్డావా ?

గీత సమాధానం చెప్పలేదు. హిమజని తన మీదకి లాక్కుంది. ఇద్దరు అల్లుకుపోతుంటే హిమజ ఇద్దరి పైటలు పక్కకి లాగింది.
Like Reply
#37

అర్ధరాత్రి ఒంటి గంట 

ఫోన్ మొగుతుంటే కళ్ళు తెరిచాడు గోపీ.. తన ఒళ్ళో ప్రశాంతంగా నిద్రపోతున్న స్వర్ణని లేపడం ఇష్టం లేక చెయ్యి చాపి ఫోన్ అందుకుని ఎత్తి హలో అన్నాడు. అంతా విన్నాక ఫోన్ పెట్టేస్తే జఫర్ నుంచి రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మెసెజ్ పెట్టాడు.. నీతో మాట్లాడాలి గోపీ ఫోన్ చెయ్యి అని. ఫోన్ పక్కన పెట్టేసి చూస్తే ఇద్దరి ఒంటి మీదా నూలు పోగు కూడా లేదు. ఎప్పుడు లేనిది స్వర్ణ ఇలాంటి కోరిక కోరింది. కాదనలేక ఒప్పుకున్నాడు. స్వర్ణని పక్కన పడుకోబెట్టి సిలింగ్ ఫ్యాన్ వైపు చూస్తుంటే అనిపించింది. ఎవరున్నా లేకపోయినా తన పక్కన స్వర్ణ ఉంటుంది. జీవితాంతం ఉంటుంది. అందులో సందేహమే లేదు. అలా తనకి ఇంకెవరున్నారా అని ఆలోచిస్తే ఎవ్వరూ కనిపించలేదు. జఫర్ దగ్గర ఆలోచన ఆగిపోయింది. కాసేపు తనకి నమ్మకంగా ఉంటాడు అనిపించింది, అంతలోనే జఫర్‌ని నమ్మలేం అని కూడా అనిపించింది. 

ఎప్పుడు ఏదో దాస్తున్నట్టు, ఎవరి దగ్గర నుంచో దాక్కుంటుంన్నట్టు ఉంటుంది వాడి ప్రవర్తన. ఏది సరిగ్గా చెప్పడు. పనిలో కూడా ఎవ్వరికి సరిగ్గా కమిట్మెంట్ ఇవ్వలేడు. ఒంటరిగా పని చెయ్యడానికి ఇష్టపడతాడు. ఆడవాళ్ళని చూస్తే భయపడి దూరంగా వెళ్ళిపోతాడు. కానీ అమృతతో , గీతా హిమజ ఆంటీలతో బానే ఉంటాడు మళ్ళీ..  చెప్పుకోలేని గతం ఏమైనా ఉందా వాడికి ?

ఒక్క మాట మీద నిలబడలేని వాడు. నలుగురులో దొంగ చాటుగా ఉండేవాడు నమ్మకంగా ఉంటాడని ఎలా అనుకోవాలి ?

స్వర్ణ చెయ్యి తన ఛాతి మీద పడి కౌగిలించుకుంటుంటే తిరిగి వాటేసుకుని పడుకున్నాడు. జఫర్‌ని దుబాయ్ తీసుకెళ్లలేను. ముందు వాడు రాడు వచ్చినా ఒకరిని ఒకరం నమ్మకుండా పని చెయ్యలేను. ఇక స్వర్ణ కూడా ఒక్కదాన్నే తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం వద్దు అని ఆలోచిస్తూ పడుకున్నాడు.

xxxx

తెల్లారి జఫర్ లేచి ఆఫీసుకి రెడీ అయినా గోపీ జాడ లేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. సరే అనుకుని ఆఫీసుకి వెళ్ళిపోయింది. రాజారావు పిలిస్తే వెళ్ళింది. ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారు.

తాతయ్య ఇక ఈ వేషం తీసేస్తాను. 

రాజారావు నవ్వాడు. మరి గోపీ అని నవ్వితే జఫర్ సిగ్గు పడటం చూసి ఆశ్చర్యపోయినా మళ్ళీ నవ్వేసాడు. 

తాతయ్యా నేను ఇంటికి వెళతాను. గోపీకి నిజం చెప్పాలి అని లేస్తుంటే సరే అని కారులో డ్రాప్ చెయ్యమని డ్రైవర్‌కి చెప్పాడు. 

పర్లేదు తాతయ్యా నేను వెళతాను.

నువ్వు నా మనవడివి అయితే అలానే చేసేవాడిని. కాదుగా అని దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళమంటే వాటేసుకుని ఇంటికి బైలుదేరింది.

 ఇంట్లో గోపీ కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. టేబుల్ మీద కాగితం  చూసి తెరిచింది. పని మీద దుబాయ్ వెళ్తున్నాను. త్వరలో నీకు ఫోన్ చేస్తాను. థాంక్స్ ఫర్ ఎవరీథింగ్ మై ఫ్రెండ్ అని రాసి ఉంది. 

జఫర్ కంగారుగా రాజారావుకి ఫోన్ చేసి విషయం చెప్పింది. నేను చూస్తానన్నాడు తాతయ్య. ఎందుకో గోపీ మీద విపరీతమైన కోపంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. రాజారావు, జఫర్ ఇద్దరు స్వర్ణ దగ్గరికి వెళితే స్వర్ణ రాత్రి ఫోన్ రావడం, తెల్లారే వెళ్లాలని గోపీ హడావిడిగా  వెళ్లాడని చెప్పింది స్వర్ణ. చేసేది లేక ఇద్దరు తిరిగి ఆఫీసుకి వచ్చేసారు. జఫర్ కంగారుగా ఏడుపు మొహం పెట్టడం చూసి ఏం కాదులే అని చెయ్యి పట్టుకున్నాడు. 

నాకొక్క ఫోన్ చెయ్యచ్చుగా అంది ఏడుపు గొంతుతో వెంటనే కళ్ళు తుడుచుకుని తాతయ్యా.. గోపీ వచ్చేసరికి ప్రాజెక్టు రెడీ చేద్దాం. 

EC సాఫ్ట్వేర్ చేయించడానికి మూడు నెలలు పడుతుంది, నేను మాట్లాడతాను అన్నాడు రాజారావు. 

వద్దు తాతయ్యా.. నాకు కావాల్సిన వాళ్ళని నేనే ఎంచుకుంటాను. జఫర్ మనసులో స్వర్ణ మొహమే తిరుగుతుంది. షాపింగ్‌కి వెళ్ళాలి అని నవ్వితే నేనూ వస్తాను అన్నాడు రాజారావు. జఫర్ కంగారుపడినా తాతయ్య మొహంలో నవ్వు చూసి అలాగే అంది. 

ఇప్పటి వరకు సొంత మనవళ్ళకి మనవరాళ్ళకి కూడా ఎప్పుడు పక్కన నిలుచుంది లేదు. గోపీ.. జఫర్.. ఈ ఇద్దరు తనలో చాలా మార్పులు తీసుకొచ్చారని నవ్వుకున్నాడు. 

ఇంటికి వచ్చి ఒక్కటే పడుకుంది. గోపీతో నగ్నంగా పడుకున్న సంఘటన పదే పదే గుర్తు చేసుకుంది. అలానే ఊహల్లో విహారిస్తూ తినకుండానే పడుకుంది. 

పొద్దున్నే తాతయ్య ఫోన్ చేసాడు. కింద ఆంటీ వాళ్ళు కూడా పలకరించారు. అమృత కూడా ఫోన్ చేసింది. అందరూ జఫర్ జఫర్ అని పిలుస్తుంటే నవ్వుకుంది. 

నిన్న చేసిన షాపింగ్ లోనుంచి బట్టలు తీసింది. లైట్ పింకు రంగు గౌను మీద కాషాయం రంగుతో ఉన్న పూలు. దాని కిందే పచ్చని ఆకులు. అన్ని రంగులు ఆ గౌనులోనే ఉన్నాయా అనిపించింది. ఇన్నాళ్లు వేసిన టైట్ బ్రా కాకుండా మాములుది వేసుకుని బట్టలు వేసుకుని కిందకి వచ్చింది. గీతా హిమజ అసలు నమ్మలేకపోయారు. హిమజ అయితే నువ్వు ఇంత అందంగా ఉంటావనుకోలేదు జఫర్, నువ్వు వేషం వెయ్యడంలో తప్పే లేదు అనేసింది. గీత లోపలికి వెళ్లి పళ్లెం పట్టుకొచ్చి దిష్టి తీసింది. చెయ్యి తిప్పి మెటికలు విరిస్తే ప్రేమగా వాటేసుకుంది గీతని. ఇంటి ముందు కారు ఆగితే చూసారు. ఎవరు అని అడిగింది గీత. 

రావు సర్ మేడం కోసం పంపించారు మేడం. ఈ కారు తన కోసమే అన్నాడు డ్రైవర్. వావ్ అంది హిమజ. జఫర్ మమ్మల్ని కూడా ఎప్పుడైనా తిప్పు అంటే అందరూ నవ్వారు. పైకి వెళ్లి రెడీ అయ్యి కారులో కూర్చుంది. డ్రైవర్ పోనించాడు. ఆయనకి యాభై పైనే ఉంటాయి. తెల్ల గడ్డం ఉంది. 

మీ పేరు ?

నా పేరు బషీర్ మేడం. పాతికెళ్ళుగా రావు సార్ దగ్గర పని చేస్తున్నాను. ఆరోగ్యం బాలేక ఇన్ని రోజులు రాలేదు. పోయిన వారం నవాసి షాది ఉంటే అది చూసుకుని తిరిగి వచ్చేసాను. ఇన్నేళ్లలో రావు సార్‌కి కాకుండా మొదటిసారి మీకే నేను బండి నడపడం అని ఆశ్చర్యంగా చెప్పడు బషీర్. ఆయన మాటలు వింటూ స్వర్ణ ఇల్లు చేరుకుంది. 


ఆఫీస్‌కి వెళ్ళడానికి ఇంటి తాళం వేసి వెనక్కి తిరిగింది స్వర్ణ. ఎదురుగా నల్లని బ్రాండెడ్ కారులో అమ్మాయి కాలు దిగుతున్నట్టు కనిపించి తల ఎత్తి చూసింది. నేరేడు రంగు శాండిల్స్ చాలా అందంగా చూపిస్తున్నాయి తెల్లని కాళ్ళని. తల ఎత్తి చూసి ముందు గుర్తు పట్టక పోయినా దగ్గరికి రాగానే చూసి ఆశ్చర్యపోయి నువ్వు.. నువ్వు.. జఫర్ కదా అంది స్వర్ణ. 



ముగ్గురికి కాఫీ పెట్టింది. బషీర్ కాఫీ తాగేసి బైట ఉంటానని వెళ్ళిపోయాడు. చాలా మాట్లాడింది జఫర్. చాలా విషయాలు చెప్పింది.

ఇదంతా గోపీకి తెలిస్తే !

నవ్వింది జఫర్.

గోపీ గురించి నీకు తెలీదు జఫర్. చాలా బాధ పడతాడు అంది స్వర్ణ.

ఒక్క నిమిషం ఉంటుంది. తరువాత ఉండదు అని మళ్ళీ నవ్వింది. 

స్వర్ణకి ఏమి అర్ధం కాలేదు. 

నీకు పుట్టుమచ్చ ఉందని అడిగాడా అంది జఫర్ 

స్వర్ణ అవును అంది లేచి నిలబడి.

జఫర్ నవ్వుతూ గౌను కిందకి దించి బ్రా తప్పించి తన సళ్ళ మధ్యనున్న పుట్టుమచ్చని చూపించింది.

అంటే గోపీ వెతుకుతుంది నిన్నేనా అంటే అవునని నవ్వింది మళ్ళీ 

స్వర్ణ దగ్గరికి వచ్చి జఫర్ నడుము మీద చెయ్యి వేసింది. శ్రద్ధగా చూసింది. తెల్లని చర్మం. గుచ్చుకునేంత గడ్డం. బూబ్స్ నార్మల్‌గా. పొట్ట మీద చెయ్యి పెట్టి చూస్తే గట్టిగా తగిలింది. మెత్తని నడుము. చేతులు పట్టుకుంది. బలంగా ఉన్నాయి. సన్నని కాళ్ళు. ఇంకా దగ్గరికి వెళ్లి కళ్ళు మూసుకుని వాసన పీల్చింది. 

మంచి సువాసన వెదజల్లే ఒళ్ళు.. నువ్వే.. అది నువ్వే జఫర్ అని కౌగిలించుకుంది ఆఖరిగా. గోపీ చెప్పినట్టే వెచ్చగా అనిపించింది. అదొక మంచి కౌగిలి. గోపీ తనకి సొంతం అన్న ఆలోచన వచ్చేసరికి చిన్నబోయినా ఈమె నా గోపీ ప్రేమించిన అమ్మాయి అని సంతోష పడింది.  తన వంక ఆరాధనగా చూస్తుంటే గోపీకి స్వర్ణకి మధ్య ఉన్న సంబంధం ఎలా చూడాలో తనకి అర్ధం కాలేదు. ఒక్కటి మాత్రం తెలిసింది. స్వర్ణది స్వచ్ఛమైన మనసు.

నీ అసలు పేరేంటి ?
నవ్వింది జఫర్. మొత్తానికి ఒకరు నా అసలు పేరు అడిగారు అని సంతోషపడింది.

జోయా.. 

Like Reply
#38

Hi all

Ai  realistic photos tho motion picture concept tho 
Proper sfx petti dubbing artists tho kadhalu cheppiddaamani plan

Like.. Kadhalo oka scene vachinappudu gaali effect urumula sound effects latho kadha chepthe ela untundha ani thought. Naku thelisina dubbing artist kontha mandhi unnaru.

Youtube lo hit avuthundhi nammakam 
Instagram reels dwara push chesina reach tho views vasthayi ani aalochana 



Collaborate avudham. Naku editing, sfx veyyadam kuda vachu. Minimum investment unte chalu. 
Evaraina investor intrest untey please message dm me 
[+] 6 users Like Raagaa's post
Like Reply
#39

(28-05-2026, 12:36 PM)manju19744 Wrote:  Update please


June 5th
[+] 1 user Likes Raagaa's post
Like Reply
#40

చెప్పు ఇప్పుడు నేనేం చెయ్యాలి అంది స్వర్ణ. జోయా తన డిజైన్ చూపించింది. ఒకే.. అని దీర్ఘం తీసింది స్వర్ణ. అంతా చూసిన తరువాత చెయ్యి ఇచ్చి నీకోసం చేస్తాను అంది. దానికి జోయా నవ్వుతూ చెయ్యి కలిపి నువ్వు ఎవరి కోసం చేస్తావో నాకు బాగా తెలుసు, అందుకే ముందు నీ దగ్గరికే వచ్చాను అని నవ్వితే తిరిగి నవ్వింది స్వర్ణ. 



ఆరు నెలలు గడిచాయి.
ఐదు నెలలు దాటింది గీత ఆంటీ వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి.
నాలుగు నెలలు దాటింది, టీం ఏర్పాటు చేసుకుని పని మొదలుపెట్టి 
మూడు నెలల కిందట స్వర్ణ తన పని పూర్తి చేసి ఇప్పుడు కార్ డిజైన్ చేస్తుంది. తన ఏరోడైనమిక్స్ అనుభవం అంతా చూపిస్తుంది స్వర్ణ.
రెండు నెలలుగా స్వర్ణతోనే ఉంటుంది జోయా. గోపీ జాడ లేదు, తన మీద బెంగ మొదలయింది. స్వర్ణ అది గమనిస్తుంది.
గత నెల రోజులుగా రోజూ రాత్రి ఒక్కటే మేడ మీద కూర్చుని గోపీని తలుచుకుంటూ బాధ పడుతుంది. 

ఆరు నెలల్లో చాలా మార్పులు జరిగాయి. జోయా జుట్టు పూర్తిగా ఒత్తుగా పెరిగింది. మొన్నటి వరకు అమృత కోసం ఎగబడి చూసిన కళ్ళు ఇప్పుడు జోయా కోసం ఎదురు చూస్తున్నాయి. రాజారావ్ కూడా జోయాకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఇంట్లో ఎవ్వరికి నచ్చలేదు. జోయా గురించి నిజం తెలిసాక అందులోనూ ఇప్పుడు జోయా అందం తెలిసాక అమృత తనంతట తానే వెనక్కి తగ్గింది. తన మనసు మెల్లగా అంధకారంలోకి వెళ్ళడం ఎవ్వరు గమనించకపోయినా అమృతకే తెలుస్తుంది. ఆ నెగటివిటీ ఆలోచనలు అమృతకి నచ్చాయి. 

నిండు వెన్నెల ముందు నిలుచుంటే గోపీ మాటలే వినపడుతున్నాయి. తల స్నానం చేసి తుడిచిన కురులు గాలికి ఎగురుతుంటే మాటి మాటికి చెవి వెనక సర్దుతుంది. రాజారావు ఎంత ప్రయత్నించినా గోపీ ఆచూకి తెలీలేదు. గోపీకి ఇష్టమైనవన్నీ ఇప్పుడు స్వర్ణకి వండి పెడుతుంది జోయా. అసలు నాకు మళ్ళీ కనపడతావా అని కంగారుగా అనుకుంటూ వెన్నెలని చూస్తూ కూర్చుంది. 

రేపు ఎవరో వస్తున్నారని చెప్పాడు తాతయ్య. ఇష్టం లేకపోయినా బలవంతంగా కిందకి వచ్చి పడుకుంది. బెడ్ లైట్ వెలిగితే కళ్ళు తెరిచి చూసింది. పడుకున్నావా అని అడిగింది స్వర్ణ. జోయా లేచి కూర్చుంటే వచ్చి మంచం మీద కూర్చుంది. ఇద్దరు గోపీ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు.

గోపీ మొహంలో ఎమోషన్స్ అంత త్వరగా కనిపించనివ్వడు. కానీ అందంగా నవ్వుతాడు అంది స్వర్ణ.

అవును.. మీ స్నేహం చాలా బాగుంటుంది అంది జోయా. ఆ మాటకి స్వర్ణ మౌనంగా తల దీంచేసింది. కాసేపటి మౌనం తరువాత. నేనూ గోపీ ఒకరాత్రి అని ఆపేసింది.

ఓహ్హ్..!

ఏమి జరగలేదు. నిద్ర పోయాం అంతే.. అదీ నేను చాలా ఏళ్ళుగా వాడిని బలవంతం చేస్తున్నాను అని జోయా వంక చూసింది.

గోపీ గతం గురించి తెలియకపోయినా గోపీ ఏంటో బాగా తెలుసు జోయాకి. కనిపించిన ప్రతీ అమ్మాయిని చూస్తాడు. చాలాసార్లు ఇద్దరు ఊరు తిరగడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది. ఆ అమ్మాయివి చూడు ఎంత ఉన్నాయో అని విసిగించేవాడు. నీకేం నచ్చింది చెప్పమని పదే పదే అడిగి తెగ ఇబ్బంది పెట్టేసేవాడు. కాకపోతే అందరితో అలా ఉండేవాడు కాదు గోపీ, తన ఒక్కదానితోనే అంత ఫ్రీగా మొహమాటం లేకుండా ఉన్నాడని అందరితో కలిసి మాట్లాడటం వల్ల తెలిసింది. అమృత అన్న పవన్, గోపీ వాళ్ళ అన్నలు తనతో మాట్లాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసారో ఈ ఆరు నెలల్లో వాళ్ళని తప్పించుకోవడానికి అంతే కష్ట పడింది.

రేపు ఎవరు వస్తున్నారు అని అడిగింది స్వర్ణ. నాకూ తెలీదు అంది జోయా.  స్వర్ణ వెళ్ళిపోయాక గోపీని తలుచుకుంటే ఒళ్ళు వెచ్చగా అనిపించింది. ఒకసారి నిద్రలో గోపీ మొడ్డ మీద చెయ్యి వేసి అదేంటో తెలీక గట్టిగా నొక్కేసింది. ఎలుక ఏమో అని భయపడింది ఆరోజు.. కానీ అది ఎలుక కాదని గోపీ ఉలిక్కిపడి రెండు చేతులు తొడల మధ్య పెట్టుకుని నొప్పితో బాధ పడుతుంటే అర్ధమైంది. గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది, పాపం గోపీకి ఏం జరిగిందో తెలీక చాలా సేపు తరువాత పడుకున్నాడు. అదంతా గుర్తొచ్చి గట్టిగా నవ్వేసింది. ఒంటి మీద బట్టలు మెల్లగా తప్పించి తన చేతులతో తన ఒంటినే తాకుతుంటే ఆ రోజు గోపీతో నగ్నంగా పడుకున్న భావన కలిగింది. తన చేతులే తన మెడని, భుజాలని, నడుముని తాకుతూ గోపీ తనని తాకుతున్నట్టుగా ఊహల్లో పడి సిగ్గుగా చేతిని మెల్లగా నడుము కిందకి తీసుకెళ్ళింది.

xxxx

రావు మోటర్స్ 
ఆఫీస్ మొత్తం డెకరేషన్‌తో నిండిపోయింది. వెల్కమ్ విష్ణు అని ఫ్లెక్స్ బోర్డు చూసి స్వర్ణని అడిగింది. గోపీ వాళ్ళ అన్నయ్య నడిపోడు అంది స్వర్ణ. కింద కంగ్రాట్యులేషన్స్ అన్న విషెస్ చూసింది జోయా. లోపల అంతా హడావిడి జరుగుతుంది. హడావిడి మొత్తం జననిదే.. ఆమెని చూడగానే మొహం చిరాకుగా పెట్టింది స్వర్ణ. పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. తన వెనకే జోయా కూడా వెళ్ళింది. 

పన్నెండు ఆ టైములో విష్ణు రావడం, అందరూ బొకేలు ఇస్తుంటే దూరం నుంచి చూసింది జోయా. స్వర్ణ అసలు బైటికి రాలేదు. మొత్తానికి విష్ణు రేసర్ అని తెలిసింది. ఈ మధ్య జరిగిన eprix రేసులో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ వాతావరణం అంతా అందుకే అని తెలిసి అందరితో పాటు తనూ చప్పట్లు కొట్టింది. ఎంతైనా గోపీ అన్నయ్య కదా అని విషెస్ చెప్పడానికి దగ్గరికి వెళ్ళింది జోయా.

అందరి వెనకా నిలుచున్న జోయాని చూడగానే విష్ణు చూపులు ఆగిపోయాయి. అందరినీ ఆపేసి జోయా వైపు ఒక అడుగు వేసాడు. జోయా చెయ్యి అందుకుని థాంక్స్ చెప్పాడు. జోయా వెళ్లిపోవడం చూసి అందరినీ త్వరగా పలకరించి అక్కడి నుంచి లోపలికి వచ్చేసాడు. లోపల రావు & ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. రావు జోయాని లోపలికి పిలిపించడం ఎవ్వరికి నచ్చలేదు. అప్పటికే అమృత విష్ణు పక్కన చేరింది. జోయా లోపలికి నడుస్తుంటే తనెవరు అని అమృతనే అడిగాడు విష్ణు. అమృత తన వంక కోపంగా, అసూయగా చూడటం గమనించి విష్ణు ఇంకేం మాట్లాడలేదు. జోయా అసలు అమృత వంక చూడలేదు, తను మగాడు కాదు అన్న విషయం తెలియగానే ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయింది అమృత. ఆ రోజు నుంచి జోయాని శత్రువులా చూస్తుంది అమృత. అమృతని తలుచుకుని పాపం అనుకుంటూ వెళ్లి రాజారావుని చూస్తే కూర్చోమని నవ్వాడు. జోయా కూర్చుంది. విష్ణు అందరినీ చూసి గోపీ గాడేడి అని అడిగాడు.

వాడా.. ఇంట్లో నుంచి తరిమేసారుగా అని నవ్వాడు పవన్. అందరూ పవన్ వంక చూస్తే పవన్ నోరు మూసేసాడు. జనని విష్ణుకి ఇంకో వైపు కూర్చుంది. విష్ణు అమ్మ వంక చూస్తే జనని మాట దాటేసింది. ఈ పర్సనల్ మీటింగ్‌కి తనని ఎందుకు పిలిచారో జోయాకి అర్ధం కాలేదు. ఓపికగా కూర్చుని గోపీ కుటుంబ సభ్యులని గమనించింది. అందరిలో విష్ణు కొంచెం మంచిగా అనిపించాడు. 

మీటింగ్ అయిపోయాక జోయా ఎవరు ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాడు విష్ణు. అందరూ వెళ్ళిపోగా పిల్లల బ్యాచ్ మిగిలారు. అందరూ పార్టీ అని గోల చేస్తుంటే సరే అన్నాడు విష్ణు. మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఆఫీస్ ప్రొడక్షన్ మరియు ఇంజనీర్స్ అందరినీ కలిసాడు. స్వర్ణని చూసి ఆశ్చర్యపోయాడు విష్ణు. ఎలా అని అడిగితే స్వర్ణ పొడిపొడిగా సమాధానం చెప్పింది. కారు ఎలా ఉండాలి ఏంటి అని కొన్ని టిప్స్ ఇచ్చాడు విష్ణు. 

ముఖ్యంగా ఒక్క విషయం అర్ధమైంది. గోపీ డిజైన్, తన మెకానిజం, స్వర్ణ పని అన్నీ కలిపి తయారు చేసిన కారుని విష్ణుతో ముందుకు తీసుకెళ్లాలని పెద్దాయన రాజారావు ప్లాన్. గ్లోబల్‌గా వెళ్ళడానికి ఇంత సిద్ధం చేసుకున్నాడా అనిపించింది. మాములుగా అయితే గోపీ వాళ్ళ పెద్దన్న మేనేజంగ్, చిన్న అన్న రేసర్, అమృత డిజైన్ డిపార్ట్మెంట్, గోపీ అక్క రమ్య ఎంజనీరింగ్ డిపార్ట్మెంట్.. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో చదువు చదువుకుని కంపెనీని ముందుకు తీసుకెళ్లాలని పెద్దాయన వేసిన ప్లాన్ తెలియగానే జోయా ఆశ్చర్యపోయింది. ఆలోచిస్తే ఊరికే ఈ స్థాయిలో ఉండరు కదా అనిపించింది. ఎక్కడున్నావ్ గోపీ అని ఆలోచిస్తుంటే విష్ణు లోపలికి రావడం చూసి లేచి నిలబడింది జోయా.


ప్లీస్ సిట్ డౌన్ అన్నాడు ఎదురు కూర్చుని. నేను నడపాల్సిన కార్ మీరే తయారు చేస్తున్నారని ఇందాకే తెలిసింది. ఇక నుంచి మనం కలిసి పని చేద్దాం అన్నాడు విష్ణు. జోయా సరేనంది.

సాయంత్రం పార్టీ ఉంది వస్తారా ?
లేదండి.. నాకు..
ప్లీజ్.. తాతయ్య మిమ్మల్ని చాలా గౌరవిస్తారని అర్ధమైంది. మా ఫ్యామిలీలో భాగంగా మిమ్మల్ని చూసారు. మీరు తప్పకుండా రావాలి. 
జోయా ఇబ్బందిగా సరే అంది.
విష్ణు వెళ్ళిపోయాడు.


రాత్రి పార్టీకి వెళదాం రమ్మంటే స్వర్ణ ససేమిరా రానంది. చేసేది లేక ఒక్కటే వెళ్ళింది. వెళ్తూ తాతయ్యకి మెసేజ్ పెట్టింది.

లైట్ బీట్స్ ప్లే అవుతుంటే కలర్ లైట్స్ ఆన్ చేశారు. పవన్ మరియు గోపీ పెద్దన్న డాన్స్ చేస్తుంటే విష్ణు ఒక పక్కన కూర్చుని జోయా గురించి ఆలోచిస్తున్నాడు. అమృత గొంతు వినిపిస్తే తల తిప్పి చూసాడు. పక్కనే కూర్చుంది. ఏమైంది అలా ఉన్నావ్. సెకండ్ వచ్చావనా ?

అందరూ విష్ణు వంక చూస్తుంటే నవ్వాడు విష్ణు. 

కాదు. ఐయామ్ హ్యాపీ 

అలా ఎలా అని అడిగింది అమృత. అందరూ విష్ణు చుట్టు చేరారు.

ఫస్ట్ రావడం ఇంపాసిబుల్ గనక 

వై! అని అడిగింది రమ్య 

బికాస్.. రేసులో జిజి ఉన్నాడు గనక 

హు.. అని అడిగింది అమృత. సరిగ్గా అప్పుడే జోయా లోపలికి రావడం చూసి అందరూ తల తిప్పి చూసారు. ఎప్పటిలానే గౌను వేసుకొచ్చింది. అక్కడున్న వాళ్ళతో పోల్చితే జోయా బట్టలు నిండుగా ఉన్నా అందం మాత్రం జోయా దగ్గరే ఉంది. జోయా నడుస్తున్నప్పుడు కదిలే సన్నని నడుము తనలో ప్రత్యేకత. ఆ నడకకి తగ్గట్టే ఆమె జుట్టు కదులుతుంది. అందరూ నోరేళ్ళబెట్టి చూడటం అమృతకి నచ్చలేదు. దీనికి తోడు విష్ణు లేచి ఎదురు వెళ్లి చెయ్యి ఇచ్చి రీసివ్ చేసుకోవడం అమృతకి కోపం తెప్పించింది. అందరూ కూర్చున్నాక ఇందాకటి విషయం కంటిన్యూ చెయ్యమంది అమృత.

అతని పూర్తి పేరు తెలియదు. అందరూ అతన్ని  GG అని పిలుస్తారు. అతన్ని చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువమంది. అతని టీమ్ కూడా చాలా కాంఫిడెన్షియల్‌గా ఉంచుతారు. రేస్ ట్రాక్ మీద హెల్మెట్‌తో తప్ప ఇంకెక్కడా అతని పేరు వినిపించదు, అతను కనిపించడు.. కానీ..

అందరూ కానీ.. అని చూసారు 

ఇప్పటి వరకు ఒక్క రేసులో కూడా అతను ఓడిపోలేదు. ఐదేళ్ళ క్రితం నెంబర్ వన్ గా ఉన్నవాడు సడన్‌గా మాయం అయ్యాడు. ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ వచ్చినా అతన్ని ఎవరూ ఓడించలేకపోయారు. 

కానీ ఈ సారి అలా కాదు అంది అమృత. అందరూ అమృత వైపు చూసారు. ఈ సారి మనం తయారు చేసే కారు స్పీడ్, టైమింగ్, ఎయిర్ ఫ్లో అన్నీ బాలన్స్ అవుతున్నాయి. అతన్ని మన స్టేబిలిటీతో కొడదాం బావా అంది కాంఫిడెంటుగా.. 

విష్ణు నవ్వుతూ ఎస్ జోయా ఎలాగైనా నువ్వు నన్ను గెలిపించాలి అన్నాడు చీర్స్ చెపుతూ.. అందరూ అవును అంటుంటే అమృత మాత్రం కోపంగా చూసింది.

పార్టీ అయిపోయాక అందరూ వెళ్లిపోయారు. విష్ణు దగ్గరికి వచ్చింది అమృత.

నువ్వు జోయాని పొగడటం నాకు నచ్చలేదు బావా. ఆఫ్ట్రాల్ ఒక ఎంప్లాయి తను. అది కూడా తాతయ్య తెచ్చి పెట్టాడు. అలాంటి వాళ్ళు బొచ్చెడు మంది దొరుకుతారు అంది అసహనంగా 

విష్ణుకి అమృత గురించి బాగా తెలుసు. మౌనంగా నవ్వి టాపిక్ డైవర్ట్ చేసేసాడు. 

కారులో ఇంటికి వెళ్తున్న జోయా డ్రైవర్ బషీర్ మాట్లాడుతుంటే వింటూనే GG అనే వాడి గురించి గూగుల్లో వెతికింది. ఇందాక విష్ణు మాట్లాడినప్పుడే చిన్న అనుమానం మొదలయింది జోయాలో  యూట్యూబ్‌లో గూగుల్లో ఎక్కువ సమాచారం లేదు. అతని డ్రైవింగ్ వీడియోలు మాత్రం ఉన్నాయి. ప్లే చేసింది. ఏ వీడియోలోనూ మొహం కనిపించలేదు. హెల్మట్ ఉంది. అతని ఒక్క ప్రాక్టీస్ వీడియో కూడా లేదు. అతనికి సంబంధించిన ఒక్క ఆడ్ కూడా లేదు. ఒక వీడియోలో మాత్రం నడుచుకుంటూ వెళ్లి కార్ ఎక్కడం ఉంది. ఆ నడక, కారులో ఎక్కి కూర్చునే విధానం చూడగానే జోయా కళ్ళలో చిన్న మెరుపు మెరిసింది.

విష్ణు బాబుకి మొదట డ్రైవింగ్ నేర్పించింది నేనే జోయా బేటీ అని గర్వంగా చెప్పుకుంటూ పోతున్నాడు బషీర్. 

చాచా.. గోపీ కార్ బాగా నడుపుతాడా ?

హా.. గోపీ బాబుకి కూడా నేనే నేర్పాను. చిన్నప్పుడు గోపీ బాబు బాగా నడిపేవాడు. అసలు రావు సర్ ముందుగా గోపీనే రేసింగ్ కోర్సుకి పంపిద్దామని అనుకున్నారు. 

మరి !

జనని మేడం ఒప్పుకోలేదు. చిన్నగా చెప్పడు బషీర్. ఆమె వల్లే గోపీ బాబు బదులు విష్ణు బాబు రెసింగ్ నేర్చుకున్నాడు. లేకుంటే గోపీ బాబు ఎంతో గొప్ప వాడు అయ్యుండేవాడు.

అంత బాగా నడుపుతాడా !

ట్రేల్ బ్రేకింగ్‌లో గోపీ బాబుని ఎవరు కొట్టలేరు. గోపీ బాబు టెక్నీక్ అది.

అంటే..

కారు మలుపులో తిరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా బ్రేక్ వేస్తారు. దాని వల్ల కారు ముందు భాగానికి ఎక్కువ గ్రిప్ దొరుకుతుంది. ఇది అందరూ చేసేదే కానీ గోపీ బాబు టెక్నిక్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అలాగే గోపీ బాబు డ్రాఫ్టింగ్ బాగా చెయ్యగలడు. 

వివరంగా చెప్పు చాచా అని జోయా అంటే బషీర్ నవ్వి ముందు కారుకి నడిపే కారుకి గ్యాప్ లేకుండా దగ్గరగా పోనిస్తారు. దాని వల్ల గాలి ప్రెసర్ తగ్గుతుంది. చాలా వేగంగా వెళ్ళచ్చు అవకాశం రాగానే వితిన్ సెక్సండ్స్‌లో ఓవర్ టేక్ చేస్తారు. గోపీకి ఇవన్నీ ఆటలు అని గుర్తుచేసుకున్నాడు బషీర్.

ఇంటికి వెళ్ళాక జోయా యూట్యూబ్‌లో GG వీడియోలు చూసింది. చాలా మంది GG ఎలా నడుపుతాడు అతని టెక్నీక్స్ గురించి మాట్లాడిన వీడియోలు తెల్లారే దాకా చూస్తూనే ఉంది. అసలు రేసింగ్ అంటే ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంది జోయా.. 


పొద్దున్నే తన దగ్గర ఉన్న అట్ట పెట్టే కిందకి దించి అంతా వెతికితే గోపీ ఐడి కనిపించింది. నవ్వుకుంది జోయా... దొరికావ్ దొంగ.. 

గోపీ గోవర్ధన్ 
xxxxxxxx
xxxxxxxx
Like Reply




Users browsing this thread: 2 Guest(s)