Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముక్కంటి క్షేత్రం... మొగిలీశ్వరాలయం
#1
మహప్రాణ దీపం శివం’ అంటూ కీర్తించినా... ‘శివశివ శంకర భక్తవశంకర’ అంటూ స్తుతించినా శివ భక్తుల హృదయాలు ఆనంద పారవశ్యంలో మునిగిపోతాయి. ఈశ్వర తత్వంలోని ఔన్నత్యం అలాంటిది. నమ్మి కొలవాలే కానీ దేవతలూ రాక్షసులూ అన్న భేదం లేకుండా అందరికీ వరాలిచ్చేసే శివయ్యకు తన భక్తులంటే మరింత ప్రేమ. దానికి నిదర్శనమే చిత్తూరులోని మొగిలీశ్వరాలయం. తనను సేవించిన భక్తుడి పేరుమీదుగానే ఈ క్షేత్రంలోని శివయ్య పూజలందుకోవడం విశేషం. 
హాశివుడు, పరమేశ్వరుడు, నీలకంఠుడు, గంగాధరుడు, పార్వతీవల్లభుడు, త్రినేత్రుడు... ఇలా ఆ సర్వేశ్వరుడికి పేర్లు అనేకం. మహిమలు అనంతం. మంజునాథుడు అనేక ప్రాంతాల్లో, విభిన్న నామాలతో పూజలందుకుంటున్నాడు. వాటిలో చిత్తూరులోని మొగిలీశ్వర ఆలయం ఒకటి. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఇక్కడ స్వామిని ఆరాధిస్తారు.




ఇదీ కథ 
పూర్వం ఈ ప్రాంతంలో మొగలి పొదలు ఎక్కువగా ఉండేవట. వీటి సమీపంలో ఉన్న మొగిలివారిపల్లెలో బోయ దంపతులు నివసించేవారు. అతడి భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు వంట చెరకు కోసం అడవికి వెళ్లింది. అకస్మాత్తుగా నొప్పులు రావడంతో అడవిలోనే మగ శిశువును ప్రసవించింది. మొగలిపొదల దగ్గర పుట్టాడు కాబట్టి ఆ బిడ్డను మొగిలప్ప అని పిలవడం ప్రారంభించారు. మొగిలప్ప పెద్దవాడయ్యాక ఓ రైతు దగ్గర పశువులకాపరిగా చేరాడు. పశువులను అడవికి తోలుకెళ్లి మేపుతూ మధ్యలో వంట చెరకు నరికేవాడు. అలా ఒక రోజు చెరువు ఒడ్డున ఉన్న మొగలి పొదలను గొడ్డలితో నరుకుతుంటే అకస్మాత్తుగా రాయి తగిలిన శబ్దం వచ్చింది. భయభ్రాంతులకు గురైన మొగిలప్ప గ్రామస్థుల సాయంతో అక్కడ వెతకగా శివలింగం కనిపించింది. అప్పటి నుంచీ ఆ శివలింగానికి రోజూ పూజలు చేయడం ప్రారంభించాడు మొగిలప్ప. దీంతో అతడి పేరు మీదుగా ఈ క్షేత్రం మొగిలీశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.




త్రిశూల తీర్థం 
భక్తులు మొగిలి క్షేత్రంలోని త్రిశూల తీర్థాన్ని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపాలురతో కలసి గోవుల్ని మేపుతూ ఈ ప్రాంతంలోనే సంచరించేవాడని ప్రతీతి. ఓసారి కరవు వచ్చి నదులూ, సరస్సులూ ఎండిపోయాయి. దీంతో శ్రీకృష్ణుడు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా... శివుడు కరుణించి తన త్రిశూలాన్ని భూమిమీద గుచ్చి, పాతాళ గంగను పైకి రప్పించాడట. దీంతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మారింది. ఆ కారణంగా దీన్ని త్రిశూల తీర్థంగా వ్యవహరిస్తారు.



ప్రత్యేకతలు 
మొగిలీశ్వరాలయానికి పశ్చిమాన మూడు కిలోమీటర్ల దూరంలో విభూతి కొండ ఉంది. ఈ క్షేత్రంలో స్వయంభూ లింగంతోపాటు సహజంగా ఏర్పడిన విభూతి కొండ ఉండటం మరో ప్రత్యేకత. తరతరాలుగా స్వామిని ఈ విభూతితోనే అభిషేకించడం విశేషం. ఈ కొండకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం అగస్త్య మహాముని సూచన మేరకు లోక కల్యాణం కోసం జమదగ్ని మహర్షి పౌండరీకం అనే యాగాన్ని ఇక్కడే నిర్వహించాడట. దానికి సంబంధించిన యాగ సమిధల భస్మాన్ని పెద్ద రాశిగా పోయడం వల్ల ఈ కొండ ఏర్పడిందని చెబుతారు. ఆలయంలోని మరో ప్రత్యేకత పైకప్పుమీద దర్శనమిచ్చే బంగారు బల్లి. ఇలాంటిది కంచి, శ్రీకాళహస్తిలలో మాత్రమే కనిపిస్తుంది. బంగారు బల్లితోపాటు చంద్రుణ్ణి మింగడానికి వస్తున్న రాహువుని కూడా చూడొచ్చు. వీటిని తాకితే సర్పదోషాలతోపాటు అన్ని దోషాలూ నశిస్తాయని భక్తుల నమ్మకం.




ఇలా చేరుకోవచ్చు 
చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. తిరుపతి నుంచి కుప్పం, బెంగళూరుకు వెళ్లే బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. కాణిపాకానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Good..
Like Reply
#3
good to move
Like Reply
#4
Sri Kalahasti temple lo Bangaru balli undadhu

Only vendi tho untundhi

Only few days they will provide to touch it though ladders
Like Reply
#5
Enti Krish meedhi mogili village aa
Like Reply
#6
^ స్వగ్రామం ఏదైనా అవనీయండి
ఈ సైటులో సెక్సు సంబంధిత విషయాలే కాకుండా ఇతరత్రా ఉపయోగపడే సమాచారాన్ని పొందుపరచాలని చేస్తున్న ప్రయత్నం ఇది.
ఏవైనా పొరపాట్లు ఉంటే కామెంట్ల ద్వారా సరిదిద్దగలరు. అన్ని రకాల విషయాలకి మిత్రుల ఆదరణ లభించగలదని ఆశ.
Like Reply
#7
కంచిలో వుంటాయి... బంగారు, వెండి బల్లులు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#8
ఈ సమాచారం గురించి సరేగానీ... మరీ వంటకాల గురించి ఇక్కడ కాకుండా మరో సెక్షన్ లో పోస్టు చేస్తే బావుంటుంది. కావాలంటే వంటల కోసం ప్రత్యేక దారం తెరిచినా ఓకే...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#9
మూల వ్యాసం :
ఈనాడు ఆదివారం Wrote:ముక్కంటి క్షేత్రం... మొగిలీశ్వరాలయం
Like Reply
#10
నమస్కారం ~rp బ్రో....
ఏదైనా ఆర్టికల్ పోస్టు చేస్తే... అది ఎక్కడనుంచి తెచ్చారో ఆ Source కూడా ఈ విధంగా తెలియజేస్తే బావుంటుంది క్రిష్

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#11
చాలా బాగుంది క్రిష్ గారూ.
Like Reply




Users browsing this thread: