Yesterday, 04:56 PM
సంపూర్ణ తీర్థయాత్ర సమాప్తం
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
[font=var(--ricos-font-family,unset)] [/font]
“అబ్బాయ్! మనకు తెలిసిన టూర్ ఆపరేటర్స్ సంపూర్ణ తీర్థ యాత్రకి 16 రోజులు తీసుకొని వెళ్తారుట. ఒక్కొక్కరికి యాభై వేలు అవుతుంది. మామయ్య వాళ్ళు వెళ్తున్నారు, నేను అమ్మా కూడా వెళ్తాము” కొడుకు శివరాం తో అన్నాడు మోహనరావు.
“16 రోజుల యాత్ర ఏమిటి నాన్నా, మీవల్ల కాదు అన్నిరోజులు తిరగడం” అన్నాడు కొడుకు.
“అదికాదు రా, ఆయోధ్య లో మూడు రోజులు, కాశీ లో తొమ్మిది రోజులు, యింకా ఏవో చూపిస్తారు, వంటవాళ్ళు కూడా వస్తున్నారు, మన యింట్లో వంటలా చేస్తారుట” అన్నాడు ఫోన్లో కొడుకుతో.
“అమ్మకి ఆ గుళ్ళు చూడాలి అని ఉంటుంది, మీకు మాత్రం వాళ్ళు వండే వంటలు మీద ఆసక్తి” అన్నాడు కొడుకు.
“అయినా అమ్మతో మాట్లాడి నేను చెప్పే అంతవరకు వాళ్ళకి వస్తాము అని చెప్పకండి. ఉన్నవాళ్ళు ఉండక ఏదోకటి ప్రాణం మీదకి తెస్తారు” అంటూ ఫోన్ పెట్టేసాడు కొడుకు.
భార్య రమణి వంక చూసి, “చూసావా.. వాడు నీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాడుట, మనం యాత్రకి వెళ్లాలా లేదా అని. మనం ఎక్కడికి వెళ్ళాలో వాడు చెప్పాలా?” అన్నాడు మోహనరావు.
“అవును. చిన్నప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని మనం చెప్పాము. యిప్పుడు మనం వృద్ధాప్యం లోకి వచ్చాము, పిల్లలు చెప్పింది మనం వినాలి” అంది భార్య రమణి.
ఆశ్చర్యం గా భార్య వంక చూసి, “అసలు నువ్వేగా మీ తమ్ముడు వాళ్ళు యాత్రకి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామా అని, యిప్పుడు యిలా అంటావేమిటి” అన్నాడు.
“పిల్లలకి భయం, ఈ వయసులో మనం మూలపడితే, సెలవు పెట్టుకుని హాస్పిటల్ చుట్టూ మనల్ని తిప్పటం కష్టం అని. అయినా వాడు ఆఫీసుకి వెళ్లే టైం లో ఇటువంటివి చెప్పద్దు అంటే వినరు మీరు” అంది.
“..చూడు వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం యాత్రకి వెళ్దాం. మొన్న భక్తి టీవీలో చెప్పారుగా, ఒక్కసారి చక్రతీర్థం లో స్నానం చేస్తే వున్న పాపాలు పోతాయి, కాశీలో తొమ్మిది నిద్రలు చేస్తే మరు జన్మ వుండదు అని. తెలిసో తెలియకో చేసిన పాపాలు పోగుట్టుకుందాం” అన్నాడు.
తండ్రి మొండి పట్టు కొడుక్కి చెప్పి, ‘మామయ్య వాళ్ళు కూడా వుంటారుగా, జాగ్రత్తగా వెళ్ళి వస్తాము’ అని చెప్పి ఒప్పించింది రమణి.
నాలుగు రోజులు తరువాత తండ్రి అకౌంట్ కి లక్ష రూపాయలు పంపి, “టూర్ వాళ్ళకి కట్టండి, ఆహారం విషయం లో జాగ్రత్తగా వుండండి, తినేసి హోటల్ లో పడుకోకుండా, గుళ్ళు అన్ని చూడండి” అన్నాడు శివరాం.
“సరే జాగ్రత్తగా ఉంటాము లే, ఈ యాత్ర అయిన తరువాత వైష్ణవి దేవి యాత్ర కి నువ్వు తీసుకుని వెళ్ళు” అన్నాడు కొడుకుతో.
“ముందు ఈ యాత్ర జాగ్రత్తగా చేసుకుని రండి” అన్నాడు.
కొడుకు పర్మిషన్, డబ్బులు రావడంతో టూర్ అతనికి అడ్వాన్స్ యిచ్చి బట్టలు సద్దుకుని రెడీ అయ్యారు దంపతులు.
రేపు ప్రయాణం అనగా కూతురు అడిగింది “ట్రైన్ లో ముప్పై ఆరు గంటలు కూర్చొని వెళ్లే బదులు ఫ్లైట్ లో వెళ్ళండి. ఈ మాట అయినా వినండి నాన్న” అంది.
మోహనరావు కి కూడా ట్రైన్ లో అంతసేపు ప్రయాణం కష్టం అనిపించడం తో “సరే ఫ్లైట్ టికెట్స్ పంపు, టూర్ అతనికి మేము డైరెక్టుగా అయోధ్య వస్తాము ఫ్లైట్ లో అని చెప్పేస్తాను” అన్నాడు.
“అదేమిటి మీరు మాతో ట్రైన్ లో రావడం లేదా, అవును లెండి బావగారు డబ్బు వున్నవాళ్లు, ఫ్లైట్ లో వస్తారు. మేము ట్రైన్ లో వస్తాము. సరదాగా అందరితో గడపవచ్చు. యాత్ర అంటే ఒంటరిగా వెళ్ళి రావడం లో మజా వుండదు” అన్నాడు మోహనరావు బావమరిది కృష్ణ.
“మీ దంపతులు కూడా ఫ్లైట్ లో రావచ్చుగా, ట్రైన్ లో ఎందుకు యిబ్బంది” అన్నాడు బావమరిది తో.
“మాకు ట్రైన్ లో దూరం ప్రయాణాలు అలవాటే అండి” అని అనడం తో మోహనరావు దంపతులు ఒక రోజు లేట్ గా బయలుదేరి అయోధ్య లో టూర్ ఆపరేటర్ బుక్ చేసిన హోటల్ కి చేరుకున్నారు.
“ఏసీ వేసారా” అంటున్న రమణి తో “ఫ్యాన్ కూడా వెయ్యలేదు, ఫ్రీజ్ లో ఉన్నట్టు వుంది ఈ ఊరు” అన్నాడు మోహనరావు.
బావమరిది వాళ్ళు ఎక్కిన రైలు లో రిజర్వేషన్ వున్నా కొంతదూరం ప్రయాణం జరిగిన తరువాత ఎక్కడ నుంచి వచ్చారో అయ్యప్పలు, స్టూడెంట్స్ ఎక్కి బావమరిది కాలు పక్కకి జరిపి ఒక్కడు, ఆలా అందరి బెర్త్ లలో సెటిల్ అయిపోయారు. చచ్చి చెడి ట్రైన్ ఎనిమిది గంటల ఆలస్యం గా అయోధ్య చేరుకుందిట.
“బావగారుm మీరే కరెక్ట్, చచ్చినా రైలు ఎక్కకూడదు” అంటూ ములుగుతున్న బావమరిది ని చూసి, “అది సరే, టూర్ స్వామి అంటున్నాడు.. తెల్లారి నాలుగు గంటలకు బయలుదేరి సరయు నది స్నానం కి వెళ్ళాలిట. మేము రాలేము, నువ్వు వెళ్తే ఒక సీసాలో నీళ్లు తీసుకుని రా. నెత్తిన జల్లుకుంటా”మన్నాడు.
అదేమిటి.. యింత దూరం వచ్చి, నదిలో స్నానం చెయ్యకపోతే ఎలా, సరయు నది స్నానం మహా పుణ్యం. నేను దగ్గర వుంటాను భయపడకుండా రండి” అని బలవంతం చేసాడు. నా బదులు కూడా నువ్వు ములుగు, నేను రాలేను” అని వెళ్ళలేదు.
ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు, మెలుకువ వచ్చేసరికి ఎనిమిది గంటలు అయ్యింది.
“మీ తమ్ముడు వాళ్ళు వెళ్లుంటారా స్నానానికి?” అని అడిగాడు భార్యని.
“వాళ్ళు వెళ్తారు, మీ మొండితనం వల్ల నేను కూడా వెళ్ళలేదు. యాత్రలకు వచ్చినప్పుడు అందుట్లో కార్తీకమాసం నది స్నానం ఎంతో పుణ్యం” అంది రమణి.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ