Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మిథాలీకి వ్యక్తిగత రికార్డులే ముఖ్యం, జట్టును పట్టించుకోదు: రమేశ్ పొవార్
#1
మిథాలీకి వ్యక్తిగత రికార్డులే ముఖ్యం, జట్టును పట్టించుకోదు: రమేశ్ పొవార్

[Image: x480-RDX.jpg]

న్యూ ఢిల్లీ : మిథాలిని తప్పించడం పూర్తిగా క్రికెట్ వ్యూహాల్లో భాగంగానే జరిగిందని పొవార్ తెలిపాడు. కోచ్ తనను వేధించాడని మిథాలీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సబా కరీంతో సమావేశంలో పాల్గొన్నాడు. బుధవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో పొవార్ వీరితో భేటీ అయ్యాడు.
ఈ సందర్భంగా.. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మిథాలీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో పొవార్ బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో మిథాలీని తప్పించడంతో పాటు జట్టు గెలుపొటములకు సంబంధించిన నివేదికను కోచ్ పవార్ బీసీసీఐకి సమర్పించాడు. బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీ, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సబా కరీంతో బుధవారం ముంబైలో సమావేశమైన రమేశ్.. 10 పేజీల నివేదికను అందజేశాడు.
సంప్రదించిన తర్వాతే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు
ఇందులో సీనియర్ క్రికెటర్ మిథాలీరాజ్ వ్యవహారంపై 5 పేజీలకు పైగా పొందుపరిచినట్లు తెలిసింది. ఇందులో ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో మిథాలీ వ్యవహారశైలిపై రమేశ్ ప్రముఖంగా ప్రస్తావించాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపకుంటే రిటైర్మెంట్ ప్రకటిస్తానంటూ మిథాలీ బెదిరింపులకు దిగింది. ఆమెను సంప్రదించిన తర్వాతే బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనకకు పంపాం. కానీ తిరిగి ఆమె బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేందుకు ప్రయత్నించింది.
కిట్ సర్దుకుని రిటైర్మెంట్‌కు సిద్ధమైందని
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు వీడియో అనలిస్టు పుష్కర్ సావంత్ నా దగ్గరకు వచ్చి బ్యాటింగ్ ఆర్డర్‌పై మిథాలీ అసంతృప్తితో ఉందని, కిట్ బ్యాగ్ సర్దుకుని ఉదయం రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమైందని చెప్పాడు. ఆమె ప్రవర్తనతో నేను చాలా బాధపడ్డాను. మిథాలీ ఎప్పుడూ దూరంగా ఉండేది. ఆమెను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఈ కారణంగానే మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ దెబ్బతింది' అని బీసీసీఐకి ఆయన చెప్పినట్టు సమాచారం.

[Image: mithali-raj-3-1543465050.jpg]

మిథాలీపై ఎలాంటి పగ లేదని
క్రికెట్ వ్యూహంలో భాగంగానే సెమీఫైనల్లో మిథాలీని పక్కనబెట్టామని, ఆమెపై ఎలాంటి పగ లేదని పొవార్ తెలిపాడు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటం, విన్నింగ్ కాంబినేషన్ ఉండాలని మేనేజ్‌మెంట్ చెప్పడంతోనే.. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆమెను తప్పించామన్నాడు. సెమీస్‌లో మిథాలీపై వేటు వేయగా.. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. దీంతో టీ20 వరల్డ్ కప్ గెలిచే సువర్ణాకాశం భారత్ చేజారింది.

[Image: mithali-raj-1-1543465042.jpg]

ఐర్లాండ్, పాకిస్థాన్‌లతో మ్యాచ్‌ల విషయంలో
ఐర్లాండ్, పాకిస్థాన్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో మిథాలీ స్ట్రైక్ రేట్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నకు పొవార్ వద్ద సమాధానం లేకపోయింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ మిథాలీ హాఫ్ సెంచరీలు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. మిథాలీని పక్కనబెట్టాలని ఎవరైనా బయటి నుంచి ఒత్తిడి తెచ్చారా? అని కూడా పొవార్‌ను బీసీసీఐ ప్రశ్నించింది. తాత్కాలిక కోచ్‌గా ఉన్న పొవార్ పదవీ కాలం శుక్రవారంతో ముగియనుంది. కానీ ఆయన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
అవునా
Like Reply
#3
Mithaali legend of women cricket

Ganguly also supporting her

Waste politics entered now becoz women cricket also getting craze
Like Reply




Users browsing this thread: 1 Guest(s)