10-07-2024, 12:40 PM
అమ్మమ్మగారిల్లు
రచన: పిట్ట గోపి
నవమాసాలు మోస్తూ ఎంతో వేదన, ఒత్తిడి, బాధలు, చివరకు పురిటి నొప్పులు నడుమ మనల్ని కన్నది అమ్మ. అమ్మ పిల్లల కోసం చేయని త్యాగం ఈ జగంలో ఏదీ లేదని అందరికీ తెలిసిందే. అమ్మ ఒక ధైర్యం, ఒక బలం, ఒక ప్రేమ, ఒక నమ్మకం ఇలా చెప్పుకుంటు పోతే అమ్మకు సాటి ఏదీ రాదు. అలాంటి అమ్మకే అమ్మ ఉంటే ఇంక ఆ అమ్మ ఎంత ధైర్యంగా ఉంటుంది.. అమ్మ ఉందని ఆ అమ్మ ధైర్యం ఎంతో.. ఆ అమ్మ ఉందని ఆ పిల్లల ధైర్యం అంతే. అలాంటప్పుడు అమ్మమ్మ ఉందని ఆ పిల్లల ధైర్యం ఇంకెంత ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
పిల్లలకు ఏ ఆపద వచ్చినా ప్రాణం కూడా పణంగా పెట్టేంత ధైర్యం అమ్మకు ఉంటే ఆ ధైర్యం కూడా అమ్మమ్మ నుండే పుట్టాలి. అంతటి శక్తి అమ్మమ్మకు ఉంది. ఈ జగములో ఏమీ ఆశించకుండా తమ కూతురు, లేదా కొడుకు పిల్లలపై అమితమైన ప్రేమను కనబరిచే వ్యక్తులు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలే. అందులోనూ కూతురు పిల్లలంటే అమ్మమ్మకి ఉండే ప్రేమ మాటల్లో చెప్పలేనిది.
రాజు దాదాపు పదేళ్ళ తర్వాత తాళ్ళవలసలో అడుగు పెట్టాడు. బస్సు దిగగానే అతడిలో ఉరకలెత్తే ఉత్సాహం, చిన్ననాటి జ్ణాపకాలు, అమ్మమ్మ, తాతయ్యల ప్రేమలు, మామయ్య, మేనత్తల మందలింపులు, పిన్నమ్మ, బాబాయ్ ల ఓదార్పులు, బావమరుదులు, మేనకోడల్లు, తమ్ముళ్లు, చెల్లెళ్ళ తో చేసే సరదా చేష్టలు, ఊరి పిల్లలతో కలసి కొబ్బరి తోటల్లో ఆటలు, తర్వాత పంట పొలాల్లో వ్యవసాయ బోరు వద్ద స్నానాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ అతడిలో కదలాడుతున్నాయి. ఈపాటికే అర్థం అయి ఉంటుంది రాజు అమ్మమ్మగారి ఇంటికి వచ్చాడని.
బస్సు దిగినప్పుడు ఎంత ఉత్సాహం చూపాడో ఊరి లోపలికి వెళ్ళేందుకు కూడా అంతే ఉత్సాహం చూపాడు. ఊరు పొలిమేర దాటగానే అతడిలో ఉత్సాహం క్రమేణా సన్నగిల్లిపోతోంది. కారణం తాను ఎప్పుడో చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగిన ఊరులా లేదు.
ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఇళ్లు, ఇళ్ల ముందు సిమెంటు రోడ్లు, ఎటు చూసినా కొత్త ముఖాలు, ఆ ఊరికి వచ్చిన కోడళ్ళు, వాళ్ళ పిల్లలు బహుశా.. అని ఊహించుకున్నాడు. మునుపటి ఉత్సాహం ఇప్పుడు లేదు రాజులో. దారిలో కనపడిన వారెవరూ అతడిని పట్టించుకోలేదు.
కేవలం పెద్దలు, ముసలివాళ్ళు మాత్రమే పలకరించారు.
చిన్నప్పుడు తనతో తిరిగి చిందులేసిన తన పెద్ద మామ పెద్ద కొడుకు తిరుపతి ఎదురుపడి తలెత్తి పలకరించి
"ఇంటికి వెళ్ళు బావా, పిల్లలను కాలేజ్లో డ్రాప్ చేసి వస్తా " అని వెళ్ళాడు.
ఇంటికి వెళ్ళిన రాజుకి దెబ్బమీద దెబ్బపడినట్లు అయింది. పిన్నమ్మలు, వాళ్ళ పిల్లలు, మేనమామలు, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. అమ్మ కూడా అక్కడే ఉంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారనే ఆనందం ఉన్నా.. ఇల్లు ముక్కలు అయి మూడు ఇళ్లుగా రూపాంతరం అయింది. ఇది చాలక అడ్డుగోడలు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు అంత పెద్ద ఇటుకల ఇల్లు, దానికి ఆనుకుని ముందు భాగం, చొప్పదండుతో నిర్మించిన చిన్న పాక.. అందరూ కలిసి ఉండే ఆ ఇల్లు ఇలా అయిపోయింది.
ఇక్కడకి మేనమామలు అర్జెంట్ గా రమ్మని పిలవటం, గతంలో ఎప్పుడు తాను వెళ్ళినా ముందు పలకరించే అమ్మమ్మ ఇప్పుడు కనపడకపోవటంతో రాజులో కలవరం మొదలయ్యింది. ఒక మేనమామ వచ్చి రాజు భుజం పై చెయ్యి వేసి సముదాయించే ప్రయత్నం చేస్తుండగా అమ్మ, పిన్నమ్మలు ఏడుపందుకున్నారు. అప్పటికి కానీ రాజుకి అర్థం కాలేదు, అమ్మమ్మ ఛనిపోయిందని. రాజు కన్నీరుమున్నీరుగా విలపించాడు. అమ్మమ్మ జ్ఞాపకాలను తలుచుకున్నాడు.
ఈరోజుల్లో ఎవరైనా పుడితే ఆసుపత్రిలో పుడుతున్నారు కానీ పాతికేళ్ళ వెనుక మాత్రం అమ్మమ్మగారింటి వద్దే పుట్టేవాళ్ళు. అమ్మమ్మకు ఆరుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. పెద్ద కూతురు పెద్ద కొడుకు రాజు, మరియు మరో ఇద్దరు తమ్ముళ్లు. పెద్ద కొడుకు యొక్క పెద్ద కొడుకు తిరుపతి. తిరుపతికి ఇద్దరు తమ్ముళ్లు.
చిన్న కూతురు, చిన్న కొడుక్కి తప్ప అందరికీ పెళ్ళై పిల్లలు ఉన్నారు.
అందరిని ఒకే ఇంట్లో ఎటువంటి మనస్పర్థలు లేకుండా చూసిన ఆ అమ్మకు అమ్మే అమ్మమ్మ.
అసలు ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటేనే వారి అల్లరి భరించలేని తల్లిదండ్రులును చూశాం. కానీ.. ! అంతమంది పిల్లలు ఉన్నా.. ఎంత అల్లరి చేసినా.. ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. ఏం తెచ్చినా అందరికీ సమానంగా పంచిపెట్టి, ఇంటిని ప్రశాంతంగా, ఆనందంగా నడపటం అంటే మాటలు కాదుకదా. అమ్మమ్మ ఊరిలో అమ్మమ్మకు తాతయ్యకు ఉండే గౌరవమే వేరు.
అలాంటిది వారి మనమలుగా అమ్మమ్మ విలువ వాళ్ళకి చిన్నప్పుడు తెలియకపోయినా.. ఒక వయసు వచ్చాక తెలియదా... ? అమ్మ తిడుతుంది, నాన్న కొడతాడు, మేనమామలు తిడతారు, తాతయ్య కోప్పడతాడు.
ఎవరు ఎలాంటి భావోద్వేగాలు చూపించినా అమ్మమ్మ మాత్రం ప్రేమ అనే ఒకే ఒక్క ఆయుధం మనమలపై ఉపయోగిస్తుంది.
అలాంటి అమ్మమ్మకు, ఆ ఊరికి.. వయస్సు వచ్చాక దూరం అవ్వల్సి వచ్చింది రాజుకి. కుటుంబం, పిల్లల కారణంగా దుబాయ్ లో పన్నిండేళ్ళగా పని చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో సొంత ఊరిలో బిజినెస్ చేసుకుందామని అమ్మమ్మను పదే పదే చూడ్డానికి కూడా వెళ్ళొచ్ఛని, చిన్నప్పుడు తమకు ఏది కావాలంటే అది కొనిపెట్టే అమ్మమ్మకు ఏది కావాలంటే అది కొనవచ్చని అనుకున్నాడు.
ఎప్పుడో శుభకార్యం జరిగితే తప్ప అమ్మమ్మ ఊరు ఎరుగని వ్యక్తిలా మారాడు రాజు. ఏడాది కాలంగా అతడి ఫోన్ కూడా పని చేయని పరిస్థితి. అదృష్టం కొద్దీ అమ్మమ్మ పోయిన నాలుగు రోజుల తర్వాత ఫోన్ పని చేయటంతో హుటాహుటిన రమ్మన్న మేనమామ పిలుపుమేరకు వచ్చాడు.
ఎప్పుడూ మేటర్ చెప్పకుండా పిలిచి ఆనందంలో ముంచ్ఛెత్తే మేనమామ ఇప్పుడు కూడా ఏదో శుభకార్యం కోసం పిలిచాడని ఉత్సాహంతో వచ్చిన రాజుకి తమను ప్రాణం కన్న ఎక్కువగా చూసే అమ్మమ్మ లేకపోవడంతో రోదించాడు. అది కూడా బతికుండగా ఒక్కసారి కూడా ఆమెతో మనస్ఫూర్తిగా మాట్లాడింది లేదు.
అమ్మమ్మ దగ్గర ఉంటే సున్నపుకాయలో చిల్లర పైసలు తీసుకుని కొనుక్కునే తాము ఈరోజు డబ్బులు సంపాదించే స్థానంలో ఉండి కూడా ఏనాడూ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అమ్మమ్మ లేని ఊరు రాజుకు ఎందుకో ఎడారిలా కనిపిస్తుంది. మిగతా మనుమలంతా తనవితీర ఏడ్చి అమ్మమ్మకు కన్నీటి వీడ్కోలు పలికి ఉంటారు. రాజు మాత్రం అమ్మమ్మ చివరి చూపునకు కూడా నోచుకోలేదు.
మనుషులు దూరమయితే తప్ప కొందరు దగ్గరకు రాలేరు. వాళ్ళ పరిస్థితులు కూడా కారణం కావొచ్చు. అమ్మమ్మ, అమ్మమ్మ ఊరంటే అందరికీ మక్కువే. ఆ అమ్మమ్మే లేకపోతే ఆ ఊరుకి విలువే ఉండదు ఆ మనుమల మనసులో.
**** **** **** **** **** ****

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ