Posts: 2,223
Threads: 149
Likes Received: 7,397 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
తండ్రుల అంతర్జాతీయ దినం సందర్భంగా ఈ కథ
నాన్నారు
రచన: బివిడి ప్రసాదరావు
నా వాట్సాప్ లోని ఆ మెసేజ్ చదివేక నేను ఏడుపు ఆపుకోలేకపోయాను.
తల్లడిల్లిపోతున్నాను.
తేరుకోలేక పోతున్నాను.
తల వేలాడేసుకుని నిస్సత్తువయ్యాను.
నాకు ఎరిక అలవాటు ఐంది లగాయితు.. నాన్నారు అంటే ధైర్యం అని.. అనుకుంటూ వస్తున్నాను. నేను నాన్న ను తొలుత నుండి నాన్నారు అని పిలుస్తుంటాను.
అట్టిది.. ఆ మెసేజ్ చదివేక..
అయ్యో.. నాన్నారు..
మళ్లీ ఏడ్చేస్తున్నాను.
బిక్కు బిక్కు ఐపోతున్నాను.
ఎప్పుడు వచ్చిందో.. లక్ష్మి నా భుజాలు పట్టి కుదుపుతుంటుంటే తెములుకో గలిగాను.
నా వాలం కు లక్ష్మి కంగారయ్యిపోతోంది.
"ఏమైంది.. ఏమైంది.." గబగబా అడుగుతోంది.
తల విదిలించుకున్నాను.
లక్ష్మి ని తేఱిపాఱ చూడగలిగేక..
నేను కుదురవ్వగలుగుతున్నాను.
లక్ష్మి నా భార్య.
లేచి.. ఆమెను గమ్మున వాటేసుకున్నాను.
నా ఆలింగనంలో ఉంటూనే.. అనురాగంగా నన్ను తడిమేస్తోంది లక్ష్మి.. నా లక్ష్మి.
ఆమె ప్రతిస్పందనలు.. నా స్పందనలను తేలిక పరుస్తున్నాయి.
లక్ష్మి సపర మూలంగా నేను నిముషాల్లోనే స్వేద పొందాను.
ఇద్దరం తేలికయ్యేక..
నేను చెప్పబోయాను.
"లేదు. కాఫీ చేసి తెస్తాను. తాగేక మాట్లాడుకుందాం." చెప్పింది లక్ష్మి. అక్కడి నుండి కదిలింది.
నేను ఆమెతోనే నడిచాను.
ఇద్దరం మా గది నుండి హాలులోకి వచ్చాం.
లక్ష్మి కిచెన్ లోకి వెళ్తూ.. "మీరు హాలులో కూర్చొండి." చెప్పింది అనునయంగా.
నేను ఆగి.. వెను తిరిగాను. హాలులోని సోఫాలో కూర్చున్నాను.
పది నిముషాల్లోపే రెండు కాఫీ కప్పులతో లక్ష్మి వచ్చింది.
నాకో కప్పు ఇచ్చి.. తనో కప్పుతో నా పక్కనే కూర్చుంది.
"ముందు కాఫీ తాగుదాం." అంది.
ఇద్దరం కాఫీ తాగేక.. నా కప్పుతో పాటు తన కప్పుని టీపాయ్ మీద పెట్టేక.. నన్ను చూస్తూ..
"చెప్పండి. ఎందుకలా హైరానా అయ్యారు." అడుగుతోంది లక్ష్మి.
నేను మాట్లాడబోతుండగా.. నా గొంతు బొంగురవుతోంది.
"ప్లీజ్. కంట్రోల్. డోన్ట్ పేనిక్." మృదువుగా నా అర చేతుల్ని నిమురుతోంది లక్ష్మి.
"నాన్నారు నుండి మెసేజ్ వచ్చింది.." చెప్పగలుగుతున్నాను.
లక్ష్మి నన్నే చూస్తోంది.
"నాన్నారు ను అమ్మ ధిక్కరిస్తోందట. వాళ్లు పార్టనర్స్ గా పొసగలేరేమో.."
అడ్డై.. "వాట్? అత్తమ్మా! నో. కాస్తా వివరంగా చెప్పగలరా." అడుగుతోంది లక్ష్మి.
నేను చెప్పడం ఆపాను. లక్ష్మి ని చూస్తున్నాను.
అమ్మ, నాన్నారు ల ఎంపికన.. లక్ష్మితో నాకు పెళ్లై రెండేళ్లు దాటాయి. అమ్మ.. నాన్నారు లను లక్ష్మి అనతి లోనే బాగా ఆకలింపు చేసుకుంది. నాకు తెలుసు.
"అత్తమ్మ, మామయ్యలు అన్యోన్యంకి ఉదాహరణలు. అట్టిది వాళ్ల మధ్య అవగాహన లోపమా. నో. మీరు ఆ మెసేజ్ చూపగలరా." అడుగుతోంది లక్ష్మి.
మా గది లోని ఫోన్ తేవడం కై లేచాను.
లక్ష్మి వారించి.. తనే వెళ్లి.. నా ఫోన్ తెస్తోంది. వస్తూనే.. "మెసేజ్ ల్లో మామయ్య మెసేజ్ లేదే." అంది. నా పక్కన కూర్చుంది.
నా ఫోన్ పాస్ వర్డ్ తనకు తెలుసు.
"వాట్సాప్ లో." పొడిగా చెప్పాను.
తను అటు ప్రవేశించి.. ఆ మెసేజ్ బయటికే చదువుతోంది.
'కన్నా..'
నన్ను నాన్నారు.. 'కన్నా' అని పిలుస్తారు. నా పేరు ప్రమోద్.
'అమ్మ నన్ను ఇబ్బంది పరుస్తోంది. నా మాట లెక్క పెట్టడం లేదు. బిజినెస్ పార్టనర్స్ గా మేము కొనసాగలేమనిపిస్తోంది..'
చదవడం ఆపి.. నన్ను చూస్తూ..
"విషయం గంభీరమైనదే ఐనా.. మీ గగ్గోలు సరి కాదు." అంది లక్ష్మి.
ఆ వెంబడే..
"ఇది వాళ్ల మధ్య బిజినెస్ వ్యవహారం. వాళ్ల వ్యక్తిగత లేదా సంసార సంగతి కాదు. మీరు ముందు అది అవగతం చేసుకోండి." చెప్పింది.
నేను గట్టిగానే నిట్టూర్చాను.
తిరిగి లక్ష్మి మెసేజ్ చదువుతోంది.
'బోర్డ్ మీటింగ్ లో మెంబర్స్ ముందే లేచి నన్ను నిలదీసింది. నన్ను నిస్సహాయుడును చేసేసింది. ప్లీజ్ సేవ్ మి.'
మెసేజ్ అంతే.
నా ఫోన్ ని టీపాయ్ మీద పెట్టేసింది లక్ష్మి.
నన్ను చూస్తూ.. "స్లో డెలివరీ సర్. ఇఫ్ యు ఆర్ నెర్వస్, ది ప్రొబ్లం విల్ నాట్ బి కాంప్లికేడెడ్." అంది.
నేనేం మాట్లాడ లేక పోతున్నాను.
"ఇంతటి గంభీరమైన స్థితి వెనుక జరిగింది తెలియదు. అవునా." ఆగింది లక్ష్మి.
తల ఆడించాను.
"మాట్లాడండి." చెప్పింది లక్ష్మి.
"తెలియదు." చెప్పాను.
"కదా. సో. అవగతం లేని దానిపై ఆందోళన అనవసరం. మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది." నొచ్చుకుంటుంది లక్ష్మి.
నేను తల దించుకున్నాను.
"రేపు సండే. ఎల్లుండికి ఆఫీస్ వర్క్ కి లీవ్ పెట్టండి. ఈ రోజు ఊరు బయలు దేరండి. అత్తమ్మ, మామయ్యలతో సామరస్యంగా మాట్లాడి రండి." చెప్పింది లక్ష్మి.
ఆ వెంబడే..
"అక్కడ మీ చిందరవందర తనాన్ని అణచుకోండి. ప్లీజ్." చెప్పుతోంది.
అడ్డై.. "లక్ష్మీ. నువ్వూ రావా." నంగిగా అడిగేసాను.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,615
Threads: 2
Likes Received: 2,283 in 1,153 posts
Likes Given: 3,015
Joined: Nov 2018
Reputation:
45
అవును మనకు అన్నింటిలోనూ ఆడ తోడు కావాలి, వాళ్ళు లేకపోతే మన మనుగడే లేదు.
: :ఉదయ్
Posts: 2,223
Threads: 149
Likes Received: 7,397 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
లక్ష్మి నన్ను చూస్తోంది. నా ముఖంలో ఆమెకు ఏం కనిపించిందో..
"అయ్యో రామా. ఇలా ఐతే ఎలా అండీ. మీరు మరీ పితపిత. సరే. పదండి. వాళ్ళని నేనూ చూసినట్టు అవుతోంది." నాతో బయలుదేరుటకు ఒప్పుకుంటోంది.
నేను తేలిక పడ్డాను.
"ఇక టిఫిన్ వద్దు. లంచ్ ప్రిఫేర్ చేసేస్తా. త్వరగా లంచ్ చేసి బయలుదేరొచ్చు." చెప్పుతోంది లక్ష్మి.
"ఇప్పటికిప్పుడు టికెట్లు కష్టం.. కారులో వెళ్దాం." చెప్పాను.
"వై నాట్. ఇద్దరికి డ్రయివింగ్ వచ్చు. సో. నో ప్రొబ్లం." అంటూనే కిచెన్ వైపు కదిలింది లక్ష్మి.
నేను సోఫాలోనే ఉండిపోయాను.
అమ్మ.. నాన్నారు లది లవ్ మేరేజ్.
నేను టెన్త్ క్లాస్ లో చేరిన రోజుల్లో.. నాన్నారు.. నన్ను కూర్చుండ పెట్టుకొని.. వాళ్ల సంగతుల్ని వరసగా వెల్లడించారు.
తమ ఇరు వైపు పెద్దల సహకారం లేకుండా సంసారం స్వశక్తితో అంచలంచలగా సమకూర్చుకున్నామని చెప్పారు.
ఆ నాటి తమ ఆటు పోటుల్ని కూడా విశదంగా చెప్పారు.
చివరాఖరున..
'కన్నా.. వయస్సు వస్తున్న వాడివి. యోచనతో కదులుతుండు. యవ్వనం పోరు మెడ్డడం అసాధ్యం. ఆడ పిల్ల ఆకర్షణ అసమానం.' నాన్నారు చెప్పుతున్నారు.
నేనాయన్నే చూస్తున్నాను.
'మా రోజుల్లో మాకు ఇలా చెప్పే ఊతంలు అందక.. అమ్మ.. నేను.. ఇంటర్ లో చేరక ముందే యవ్వన వలపులకు లొంగిపోయాం. లవ్ లో పడ్డాం. డిగ్రీ మధ్యలో కాలేజీ వాళ్ళ కామెంటులును.. మా ఇరు వైపు పెద్దల ఆంక్షలును తాళలేక.. ఊరుకు దూరంగా వెళ్లపోయాం. పెళ్లి చేసుకున్నాం.' నాన్నారు చెప్పుతున్నారు.
నాకు ఇంకా వినాలనిపిస్తోంది.
'తొలి రోజుల్లో అమ్మ.. నేను.. చాలా అవస్తలు పడ్డాం. మా వాళ్లు మాకై వాకబులు చేసే దాఖలాలే కాన రాలేదు.' నాన్నారు చెప్పడం ఆపారు.
నేను ప్రేక్షకుడులా ఉన్నాను.
'వెంబడి తెచ్చుకున్న నా డబ్బు తరిగి పోయింది. నీ అమ్మ ఒంటి మీది కొద్ది నగలు అమ్మకం కాబడ్డాయి.' నాన్నారు మళ్లీ చెప్పడం ఆపారు.
అమ్మ అప్పుడే అటు వచ్చింది. మా చెంత కూర్చుంది.
'మేము తొందర పడ్డామనుకున్నాం కూడా. ఐనా.. పంతం పట్టాం. నేను ఓ అద్దె ఆటో డ్రయివర్ నయ్యాను..' నాన్నారు చెప్పుతున్నారు.
అమ్మ మౌనంగా ఉంది.
'అమ్మ.. కిండర్ గార్టెన్ లగాయితు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వరకు పాఠాలు నేర్పే ప్రయివేట్ కార్యక్రమం ఇంటి ఇంటికి తిరిగి చేపట్టింది..' నాన్నరు అమ్మ ను చూస్తున్నారు.
'ఇట్టి కష్టాలు నీకు వద్దు. మా అనుభవాలతో చెప్పుతున్నాను. నువ్వు ప్రేమలు వైపు పోకు. చదువు వైపే ఉండు.' నాన్నారు చెప్పడం ఆపేసారు.
నిజానికి నాన్నారు నన్ను సదా మోనిటరింగ్ చేస్తుండడం నాకు తెలుసు. మొదట్లో చికాకు పడేవాణ్ణి. నాన్నారు ఎప్పుడైతే.. నన్ను కూర్చుండ పెట్టి.. వివరంగా వివరణ ఇచ్చారో.. అది మొదలు నాన్నారు భయాలు నాకు ఎఱికవుతున్నాయి.
నేను కూడా నాన్నారు ప్రయత్నాల్ని వమ్ము పర్చనీయడం లేదు.
"ఏమండీ రండి. లంచ్ చేసేద్దాం." లక్ష్మి గొంతుతో ఆలోచనల్లోంచి బయటికి వచ్చేసాను.
"మీరు తెమలక ఇంకా ఇక్కడే ఉండి పోయారా. స్నానం చేసి రడీ అవుతున్నా రనుకున్నాను." అంది లక్ష్మి.
"లేదు. లంచ్ కానిచ్చేసి.. స్నానం చేసి తయారయ్యిపోతా." చెప్పాను.
ఇద్దరం లంచ్ చేస్తున్నాం.
"నాన్నారు ఆలోచనల్లో పడిపోయాను." చెప్పాను.
లక్ష్మి ఏమీ అన లేదు.
"బెత్తం పట్టకనే నాకు క్రమశిక్షణ నేర్పారు నాన్నారు. తమ అనుభవ పాఠాలు బోధించారు. అంచేతనే నేను ఏ క్షణం కష్టం, నష్టం ఎరగ లేదు." ఆగాను. లక్ష్మి ని చూసాను.
తను అన్నంలో చారు పోసుకుంటుంది.
"వింటున్నావా." అడిగాను.
"ఆఁ. వింటున్నాను. ఇప్పటికి ఎన్నో మార్లు మీచే విన్నాను." చిన్నగా నవ్వింది లక్ష్మి. తలెత్తి నన్ను చూసింది.
నేను ముఖం ముడుచుకున్నాను.
"ఐనా నాకు ప్రతి మారు ఇన్స్పెరింగ్ గానే అనిపిస్తుంటుంది." చెప్పింది లక్ష్మి.
"లేదు. నువ్వు.. నేనేమనుకుంటానో అని అలా అంటున్నావు. కదూ." వెంటనే అనేసాను.
"అరె. అది మీ తొట్రుబాటు. అదేం లేదు. నేను నిజం గానే అంటున్నాను." చెప్పింది లక్ష్మి.
నేనప్పటికి ఏమీ అన లేదు. ఆమెనే చూస్తున్నాను.
తనూ నన్నే చూస్తోంది.
"నిజం. నిజానికి నా అదృష్టం. ఎందుకంటే.. ఈ రోజుల్లో బ్రేకప్స్, లవ్ ఫెల్యూర్స్, కానిరాని హెబిట్స్ లేని ఆంగ అచ్ఛమైన మగాడు మొగుడుగా లభ్యం కావడం సాధ్యమా." నిండుగా అంది.
నేను పొంగాను.
తర్వాత.. ఇద్దరి లంచ్ సాఫీగా ముగిసింది.
రెండు గంటల లోపే..
మేము ఊరు బయలుదేరేసాం.
అటు నాన్నారుకు నా ప్రయాణ విషయం తెలిప పర్చలేదు.
"మీరు తొలుత డ్రయివ్ చేయండి. నేను కొంత సేపు నిద్ర పోవాలి." చెప్పింది లక్ష్మి.. కారు ను చేరేక.
నేను సమ్మతించాను.
అర గంట లోపే మా కారు హైవే చేరిపోయింది.
వెనుక సీట్లలో లక్ష్మి నిద్ర పోతోంది.
లంచ్ తర్వాత.. లక్ష్మి కి కొద్ది సేపు కునుకు తీయడం అలవాటు.
నేను కారును సాఫీగా డ్రయివ్ చేస్తున్నాను.
కోరి.. తిరిగి.. నాన్నారు ఆలోచనల వైపుకు వెళ్లాను.
ఆటో తిప్పుతూ నాన్నారు.. ట్యూషన్స్ చెప్పుతూ అమ్మ.. తమ తమ డిగ్రీ చదువు ను పునరుద్ధరించు కున్నారు. ప్రయివేట్ గా డిగ్రీ చదువులు పూర్తి చేసుకున్నారు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,223
Threads: 149
Likes Received: 7,397 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
లైబ్రరీ సదుపాయాల ద్వారా అర్హత అనిపించిన జాబ్స్ అన్నింటికీ ఇద్దరూ దరఖాస్తులు పంపుకున్నారు.
లక్కో.. అపర్ట్యూనిటో.. ఇద్దరికి వారాల తేడాల్లో జాబులు లభ్యమయ్యాయి. ఇద్దరూ వేరు వేరు ప్రయివేట్ సెక్టార్స్ లో చేరారు.
అది మొదలు అంచెలంచెలగా స్టామినతో ఎదిగారు.
పొదుపులతో పొందికయ్యారు.
కొద్దేళ్లకే.. జాబులు విడిచి.. అప్పటికి కూడదీసుకున్న తమ తమ పొదుపు మొత్తాల్లోంచి చెరో కొంతపాటిని వెచ్చించి.. ఇద్దరూ ఇంటిన ఆన్లైన్ సర్వీసింగ్ తో కూడిన మెస్ ని ఏర్పర్చుకున్నారు. ఇద్దరికి ఉద్యోగం ఇచ్చారు.
నాన్నారు చొరవతోనే.. తొలినాళ్ల లగాయితు.. ఇద్దరి సంపాదనల్లోంచి చెరో సగం వాటాల్లా ఖర్చులకు తీసి పెట్టుకొని.. మిగిలిన ఎవరి మొత్తాలను వాళ్లు పొదుపు ఖాతాల్లో అమ్మ.. నాన్నారు ఇండ్విడ్యువెల్ గా జమ చేసుకుంటున్నారు.
టోల్ గేట్ కానరావడంతో ఆలోచనల్లోంచి బయటికి వచ్చేసాను. కారు ను సడన్ గా స్లో చేస్తూ దానిని అక్కడ ఆపాను.
ఆ కుదుపులకు లక్ష్మి నిద్ర లేచింది.
"టీ షాప్ దగ్గర ఆపండి. నేను రిప్రెషవుతాను. ఇక నేను కారు డ్రయివ్ చేస్తాను." చెప్పింది లక్ష్మి.
ఆ తర్వాత.. నేను కారు ను దార్లో కనిపించిన ఓ టీ షాప్ ముందు ఆపాను.
లక్ష్మి వాటర్ బాటిల్ లోని నీళ్ళతో ముఖం కడుక్కుంది.
ఇద్దరం టీ తాగాం.
లక్ష్మి డ్రయివింగ్ సీటు ను చేరింది.
నేను పక్క సీటున కూర్చున్నాను.
"లంచ్ తర్వాత.. ఓ అరగంటైనా పడుకోవాలి. లేదంటే గజిబిజి ఐపోతాను." చెప్పింది లక్ష్మి.
"ఐ నో." అన్నాను. ఐనా లక్ష్మి అదెందుకు చెప్పిందో.
కారు సాఫీగా పోతోంది.
"వెదర్ బాగుంది." చెప్పింది లక్ష్మి.
"య." అన్నాను.
"ఏంటీ.. ప్రతి దానికి పొడి పొడి ఆన్షర్స్. బడలికగా ఉంటే.. వెనుక్కు పోయి కొద్ది సేపు పడుకోండి." చెప్పింది లక్ష్మి.
"లేదు లేదు. నాకు పగలు నిద్ర పట్టదుగా." చెప్పాను.
"ఐ నో. ఐనా సరే.. వెళ్లి నడుము వాల్చండి. రిఫ్రెష్మెంట్ అందుతోంది." కారు ను స్లో చేస్తోంది లక్ష్మి.
అంతలోనే.. "సరే. కారాపు." అనేసాను.
లక్ష్మి కారు పక్కగా ఆపింది.
నేను వెళ్లి వెనుక సీట్లలో నడుము వాల్చాను.
కారు కదిలి.. పోతోంది.
కళ్లు మూసుకున్నాను.
ఆ తడవున.. నాన్నారు ఆలోచనల వైపుకు మొగ్గేసాను.
ఇద్దరి సమ్మతితో మొదలెట్టిన వాళ్ల బిజినెస్ సరళి.. కొద్ది యేడాదుల తర్వాత.. యేడాది యేడాది వరుసన.. పదుల ఉద్యోగుల నిర్వాహణలతో ఎదుగుతూ.. ఇప్పుడు ఓ ఫైవ్ స్టార్ హోటల్ ని నిర్వహిస్తున్నారు.. అమ్మతో కూడి నాన్నారు.
ఒకరికొకరుగా.. అన్యోన్యంగా.. ఆలంబనగా.. ఆదర్శంగా.. సరళమైన కొనసాగింపు లతో నిటారుగా నిలుస్తున్న.. అమ్మ, నాన్నారుల స్థితి.. ఇలా.. ఇప్పుడు.. ఓ కుదుపుగా కలవరం రేపడం ఏమిటి..
ఉక్కిరిబిక్కిరిలో పడ్డాను. గమ్మున కూర్చున్నాను.
"ఏంటా గగుర్పాటు." అంటోంది లక్ష్మి. కారు ను స్లో చేస్తోంది.
నేను అటు చూసే సరికి.. రెర్వ్యూ మిర్రర్ నుండి లక్ష్మి నన్ను చూస్తోంది.
కారు ఆపేసింది.
నేను ఫ్రంట్ సీట్ లోకి మారిపోయాను.
కారు ముందుకు కదిలింది.
కొంత దూరం వెళ్లేక.. "ఏం జరిగి ఉంటుందో." అన్నాను.
"ఓ. మీరు ఇంకా అత్తమ్మ, మామయ్యల తలంపులో ఉన్నారా." అంది లక్ష్మి.
నేనేం అనలేదు.
"ఏమీ కాదు. మీరు నిశ్చింతుడు కండి. ప్లీజ్." చెప్పింది లక్ష్మి.
నిముషం పిమ్మట.. మాట్లాడగలిగాను.
"భలే మెచ్యూరిటీ.. భళా కన్వెన్సింగ్.. నాన్నారులో నేను చూసాను. అట్టిది ఇప్పుడు ఇట్టిది ఏంటి. ఆ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఎలా ఎగిసాయి." తల పట్టుకున్నాను.
"ఏమండీ.. కూల్. ప్లీజ్." వెంటనే అంది లక్ష్మి.
ఆ వెంబడే..
"యు డోన్ట్ నీడ్ టు వర్రీ. డోన్ట్ వర్రీ మి. ప్లీజ్." అంది. తన ఎడమ అర చేతితో నా అర చేతుల్ని నా తల మీంచి తీసింది. తిరిగి తన చేతిని స్టీరింగ్ వైపుకు మార్చుకుంది.
నేను కదిలి సరిగ్గా కూర్చున్నాను. లక్ష్మినే చూస్తున్నాను.
లక్ష్మి రోడ్ ను చూస్తోంది.
కారు సాఫీగా పోతోంది.
దార్లో కారాపింది లక్ష్మి.
"దిగండి. స్నాక్స్.. టీ తీసుకుందాం. సాయంకాలం ముగుస్తోంది." చెప్పింది.
నేను కారు దిగాను.
ఇద్దరం ఆ కేంటిన్ లో ఎదురెదురుగా కూర్చున్నాం.
ఇచ్చిన ఆర్డర్ రావడంకై వేచి ఉన్నాం.
"ట్వల్వ్ లోపు ఇంటికి చేరగలమా." అడిగింది లక్ష్మి.
"మే గో. బట్ స్లోగా వెళ్దాం." అన్నాను.
ఆ వెంబడే..
"నేను డ్రయివ్ చేస్తా ఇక." చెప్పాను.
"లైక్ యు.. లైక్ దట్.." నవ్వుతోంది లక్ష్మి.
అప్పుడే ఇచ్చిన ఆర్డర్ తేబడింది.
అర గంట లోపునే తిరిగి కారును చేరాం.
"నువ్వు పడుకుంటావా." అడిగాను లక్ష్మిని.
"లేదు. కూర్చుంటా." చెప్పింది లక్ష్మి. ఫ్రంట్ సీటులోకి ఎక్కింది.
నేను డ్రయివింగ్ సీటన చేరి.. కారు స్టార్ట్ చేసాను.
అప్పుడే అమ్మ నుండి ఫోన్ కాల్ వస్తోంది.
నేను కారు ను పక్క కు తీసి ఆపేసాను.
"అమ్మ కాల్." లక్ష్మితో చెప్పుతూనే.. ఆ కాల్ కు కనెక్ట్ అయ్యాను.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,223
Threads: 149
Likes Received: 7,397 in 1,456 posts
Likes Given: 4,226
Joined: Nov 2018
Reputation:
554
"అమ్మ చెప్పు." అనగలిగాను. నాలో ఆత్రం చిక్కబడుతోంది.
"ఎలా ఉన్నావు మోద్." అమ్మ అడిగింది. అమ్మ నన్ను తొలుత నుండి 'మోద్' అంటోంది.
నా ఒళ్లు నాకే బరువు అనిపించింది.
లక్ష్మి ని చూసాను.
తను 'కూల్ అన్నట్టు' సైగలు చేస్తోంది.
నేను పట్టుతో తగ్గుతూ.. "బాగున్నాను." అటు అమ్మకు చెప్పాను.
"లక్ష్మి ఎలా ఉంది." అమ్మ అడుగుతోంది.
"బాగుంది." చెప్పగలిగాను.
"ఇప్పుడు బయట ఉన్నారా." అమ్మ సడన్ గా అంది.
ఆ వెంబడే..
"వెయికల్స్ సౌండ్స్ వినిపిస్తున్నాయి." అంది.
నేను రోడ్డు ను చూసాను. టు అండ్ ప్రో వెయికల్స్ జరజరా సాగిపోతున్నాయి.
"వీక్ ఎండ్స్ గా.. బయటికి వచ్చారా." అమ్మే అంది.
నేనేం మాట్లాడలేక పోతున్నాను.
నా నుండి ఫోన్ తీసుకుంది లక్ష్మి.
"అత్తమ్మా.. మీ వద్దకు మేం బయలుదేరి వస్తున్నాం. మిడ్ నైట్ లోపు చేరగలం." చెప్పుతోంది లక్ష్మి.
అప్పటికి లక్ష్మి.. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెట్టింది.
"అలానా. వెల్కమ్." అంది అమ్మ.
అమ్మ మాటలు నిదానంగానే ఉన్నాయి.
"ఐనా ఇంత సడన్ ఏంటమ్మా. పైగా చెప్పకనే ఈ రాక ఏంటమ్మా." అడుగుతోంది అమ్మ.
నన్ను చూసేక.. "ఇతనికి వరస సెలవులు వచ్చాయి. మిమ్మల్ని చూద్దామని బయలు దేరేసాం." చెప్పింది లక్ష్మి.
అర నిముషం లోపే..
"అబద్ధం." అటు అమ్మ నవ్వుతోంది.
లక్ష్మి నన్నే చూస్తోంది.
నేను ఇబ్బడిముబ్బడవుతున్నాను.
"మోద్.. వాడి నాన్న ట్రాప్ లో పడిపోయాడు." అమ్మ మళ్లీ నవ్వింది.
లక్ష్మి ఇంకా నన్నే చూస్తోంది.
"ఆయన నాతో ఛాలెంజ్ చేసారు." అటు అమ్మ చెప్పుతోంది.
ఇటు మేము కంగారవుతున్నాం.
ఒకరిని ఒకరం చూసుకుంటున్నాం.
"మోద్ 'నిబ్బరంగా వ్యవహరించే స్టేమినా ను కూడబెట్టుకున్నాడు' అనుకున్నాను. వాడు నా అంచనా కు చేరేది ఎప్పుడో." అమ్మ అంటోంది.
లక్ష్మే అడ్డయ్యింది.
"అత్తమ్మా.. ఏంటిదంతా." అంది.
"వస్తున్నారుగా. రండి." అనేసింది అమ్మ.
లక్ష్మి నా వాటం కు జంకింది.
"లేదు లేదు. మీ మోద్ ఉదయం నుండి కలవరమయ్యిపోతున్నారు. చెప్పేది ఇప్పుడే చెప్పేయండి. లేదంటే ఇతని హైరానా తట్టుకో లేను." అంది బెంబేలుగా.
ఆ వెంబడే..
"దయచేసి సస్పెన్స్ లొద్దు.. ఫోన్ స్పీకర్ ఆన్ లో ఉంది. మీ మోద్ వింటారు.. మాట్లాడండి." చెప్పింది.
ఆ వెంబడే.. నాన్నారు నాకు పంపిన మెసేజ్ సంగతంతా అటు అమ్మకు క్లుప్తంగా చెప్పింది.
"హే. మోద్. కూల్.. మీ నాన్నారు నీకు జర్క్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.." అటు అమ్మ చెప్పుతోంది.
నేను.. లక్ష్మి నుండి ఫోన్ తీసుకున్నాను.
"అమ్మ.. ప్లీజ్.. ఏంటిదంతా." గందికవుతున్నాను.
"అరె. మోద్.. ప్లీజ్ రా. తొలుత కూల్ అవ్వు. నీ మాట తీరు నన్ను కలవర పెడుతోంది." అటు అమ్మ బెంబేలు తెలుస్తోంది.
లక్ష్మి కూడా నన్ను సముదాయించేలా తన కుడి అర చేతితో నన్ను నిమురుతోంది.
నేను దీర్ఘంగా గుండె నిండా గాలి పీల్చుకున్నాను.
"మోద్.. మా ఇద్దరి మధ్య స్ట్రగుల్ వస్తే.. నువ్వు తప్పక తట్టకొనే స్థితి ని చేరావని నేను అన్నాను. ఆయన ససేమిరా అన్నారు. అందుకే నాన్న అలా అబద్ధం మెసేజ్ పంపారు. ఐ నో. నాకు అర్ధం అవుతోంది. నువ్వు ఎప్పటికీ నాన్న చాటు వాడివే." అటు అమ్మ అంటోంది.
ఆ వెంబడే..
"ఇక్కడే నాన్న ఉన్నారు. మాట్లాడు." చెప్పింది.
అటు నాన్నారు.. ఆ ఫోన్ కాల్ కు కలిసారు.
"కన్నా.." అన్నారు.
నేను వెంటనే మాట్లాడలేక పోయాను.
తిరిగి నాన్నారు ఏదో అంటుండగా..
"నాన్నారు.. ఇది మరీ టు మచ్." ఇటు నేను గింజుకుంటున్నాను.
"కన్నా.. ఐ వాంట్ ఇన్డిపెన్డెంట్ ఇన్ యు." అటు నాన్నారు కంగారు నాకు తెలుస్తోంది.
ఆ వెంబడే..
"నువ్వు ఇలా చెప్పాపెట్టక ఎకాఎకీన బయలుదేరి వచ్చేయడం నన్ను కలవర పరుస్తోంది. నువ్వు మారాలి. నువ్వు కొడుకు నుండి భర్త వయ్యావు. ఇక మీదట.. యు విల్ బి ఏన్ ఇన్డిపెన్డెంట్ ఫాదర్. ఇక మీదట.. రాబోవు నీ బిడ్డకు నువ్వు రిమోటర్ విగా వ్యవహరించాలి. సో.. నీలో మార్పు నేను తప్పక కోరు కోవాలి." చెప్పారు.
నేను అయోమయమవుతున్నాను.
"ఎలానూ వస్తున్నావుగా. రా. ప్రయాణంలో ఫోన్ సంభాషణ వద్దు." నాన్నారు ఆ ఫోన్ కాల్ కట్ చేసేసారు.
నా తల దిమ్మెక్కేసింది.
లక్ష్మిని చూస్తున్నాను.
"మామయ్య.. గురెరిగిన ఓ తండ్రి..లవ్ హిమ్." లక్ష్మి చెప్పింది.
"ఏంటో.. నాన్నారు.." యథాలాపంగా అన్నాను.
"ముమ్మాటికి.. ఆయనది మందలింపు కాదు.. మమకారం." లక్ష్మి నన్నే చూస్తోంది.
ఆ వెంబడే..
"మీరు తండ్రి అయ్యేక అది బాగా మీకు తెలుస్తోంది." చెప్పింది. చిన్నగా నవ్వింది. "కదలండి." అంది.
తల విదిలించుకున్నాను. కారు స్టార్ట్ చేసాను.
***
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ