Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
భవిష్యత్తు చోరీ – కథ
#1
భవిష్యత్తు చోరీకథ
రచన:తెలియదు


కాలం ఆగిపోయింది, ఒకే ఒక్క నిమిషం. అంతా నిశ్శబ్ధం.
అందరూ  స్తబ్ధుగా, చలనం లేకుండా ఆగిపోయారు. ఏక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి ఉన్నాయి.
క్రిస్టోఫర్ కళ్ల ఎదురుగుండా మెర్సీ ఫ్లైట్ ఎక్కుతూ ఆగిపోయి ఉందిఆమె చేయి యశోధర్ చేతిలో ఉంది.
ఇది ఎలా సాధ్యం మెర్సీ”  అని, “ఒరేయ్ యశోధర్ నేను నీ భవిష్యత్తుని  చోరీ చేస్తే నువ్వు నా వర్తమానాన్ని చోరీ చేస్తావా? రాస్కెల్అంటూ క్రిష్ నేల మీద కూలి పోయాడు.
* * * * *
ఉదయం 9.00 గంటలు:
ఒరేయ్ క్రిష్ లేవరా, ఆఫీసు 10 గంటలకు, 10 కి.మీప్రయాణం, ట్రాఫిక్కు. మొద్దు నిద్ర ఏమిటి? లేఅంటూ అతడి తల్లి నిద్ర లేపుతోంది.
ఎలాగో లేచి రెడీ అయ్యి, 10.30 కు ఆఫీసుకి చేరుకున్నాడు క్రిష్. 10 నిమిషాలు రోజు వారి మీటింగ్ కి ఆలస్యం అవ్వటం తో మీటింగ్లో కూర్చోగానే మండి పడ్డాడు మేనేజరు. రాత్రి ఒంటి గంట వరకు కూర్చోని చేసిన పవర్ పాయింట్ ప్రసంటేషన్ వాళ్ళ ముందు పెట్టి వివరించాడు క్రిష్.
కొన్ని మహా బేషుగ్గా ఉన్నాయి, కొన్ని అసలు నీవేనా అన్నట్లు ఉన్నాయిఅంటూ పెదవి విరిచి మొత్తానికిఏరియా మేనేజరు అయ్యావుఅంటూ ప్రమోషన్ ప్రకటించారు అధికారులు.
అతడు పైకి నవ్వి, “ ప్రైవేట్ సెక్టార్ లో  ఎంత చాకిరీ చేసినా ఇంకా ఏదో లోపాలు చూపిస్తారు. మీ జడ్జ్మెంట్ నాకు ఏం నచ్చలేదుఅనుకుంటూ మీటింగ్ నించి బయటకు వచ్చి తన సీట్ లో కూర్చున్నాడు.
తన వెనక సీట్లో ఉన్న యశోధర్ ను చూసి జాలి పడి, ” పాపం యశో, ఎంతో కష్ట పడతాడు. నాకన్నా సత్తా ఎక్కువే, కానీ వీడికి అనుభవం లేదనే వంకతో వాడి ప్రాజెక్ట్ ఒక్కటి కూడా మీటింగ్ కి తీసుకోలేదు. కంపనీ లాభాలు రాలేదంటే ఎలా వస్తాయి? ఇలా చేసి జీతాలు పెంచే పరిస్ధితిలో లేము అంటారు.
మంచి స్ట్రాటజిక్ ప్లాన్ కి అనుభవం ఎందుకు, ప్లాన్ వాడిస్తే ఆచరణలో పెట్టటానికి నా లాంటి అనుభవజ్ఞ్యులు ఉన్నారు కదా.. తాజా ఆలోచనలు వద్దంటే   రోజుల్లో కస్టమేఅనుకోని తను కూడా పెదవి విరిచేశాడు వారి మీద.
తాను వచ్చి ఇంత సేపు అయిన యశో తల తిప్పకుండా ఏదో కొత్త ప్రోడక్ట్ డిజైన్  చేసేస్తున్నాడు.
చూస్తుంటే అద్భుతంగా ఉందే అనుకుంటూ దొంగతనంగా చూశాడు అతడి కంప్యూటర్  కేసి.
పాత సైకల్ కు ముందు, ఒక బేబీ కూర్చో గలిగె అంత సైజులో ఒక చిన్న టబ్బు అదనంగా జోడించాడు, అంతే మిగితా అంతా కొత్తగా తల్లులు అయిన ఆడవారి మానసిక పరిస్ధితికి, అనుగుణంగా తాయారు చేసిన అడ్వర్టయిజింగ్ మెటీరీయల్.
బేబీకి షికారు- మీ బరువు మాయం ఖరారుఅంటూ ఒక కాప్షను తో..
అంటే కొత్త గా తల్లులు అయిన కాలం అమ్మాయిలు బరువు తగ్గటానికి, తిరిగి తమ శరీరం షేప్ ఔట్ అవ్వకుండా ఉండటానికి సైక్లింగ్ చేస్తూ, అదే సమయంలో బిడ్డను విడవకుండా, ముందు ఉన్న టబ్ లో కూర్చోబెట్టుకొని రోజు ఉదయం, సాయంత్రం బరువు తగ్గించుకోవచ్చు అన్న మాట.
క్రిష్ కి కాన్సెప్ట్ బాగా నచ్చి యశోకి తెలీకుండా దానిని ఈమేల్ లో పంపాడు, తన మానేజరుకి.
“Enhance your new mom’s beauty with our cycle అంటూ .”
“Enhancing beauty along with your child” అంటూ పబ్లిసిటీ ఇచ్చాడు.
5 నెలల గర్భిణులు హాస్పిటల్ నుంచి ప్రూఫ్ తెచ్చుకుంటే, ఒక నడుం బెల్టు ఉచితం గా కూడా ప్రకటించాడు.
అంతే శ్రీమంతాలకు గర్భిణులకు  బహుమతులుగా, సైకులు ఇవ్వటం మొదలెట్టారు భర్తలు , మార్కెట్ లో జోరుగా అమ్మకాలు అయినాయి.
వారు మెచ్చుకొని వెంటనే 6 నెలల బోనస్ ప్రకటించారు క్రిష్ కి
మెడకాయ మీద తలకాయ లేని వాళ్ళకా నేను సలాం కొట్టాలి, అని బోనస్ తీసుకొని అతడు రాజీనామా చేసి సొంతంగా ఆటోమొబైల్స్ డిసైనింగ్ కంపనీ పెట్టుకున్నాడు. విషయాలను తన ఫియాంసీ మెర్సీకి మెస్సెజ్ పెట్టాడు.
6 నెలలు తనను తాను ఒక గదిలో బంధించుకొని ఒక టైమ్ మషిన్ చేశాడు. దానిలో కూర్చోని ఎవరిదైనా భవిష్యత్తుకి వెళ్ళి, వాళ్ళ మొత్తం జీవితాన్ని ముందుగానే అక్కడ నించి చూడొచ్చుకానీ దానికి ప్రభుత్వ అనుమతి దొరకలేదు. ఉన్న పెట్టుబడి అంతా దీని మీదే పెట్టి చివరికి సున్నా గా కూర్చున్నాని నీరసించిపోయాడు.
అంతలో యశో భవిష్యత్తుకు వెళ్ళి చూద్దాం, నా భావిషత్తు శూన్యంలా వుంది అనుకోని టైమ్ మషీన్లో వెళ్ళాడు.
యశో కోట్లకు పడగలు ఎత్తి , భార్యతో కులాసాగా ఉన్నాడు. ఆమెను పూర్తిగా చూసే వరకు కూడా అసూయ నిలవనీక తిరిగి వర్తమానానికి వచ్చేశాడు.
మరలా తన భవిష్యత్తుకి వెళ్ళాడు. కానీ  అతడు బికారిలా ఒంటరిగా ఉన్నాడు.
తట్టుకోలేని కోపం తో అతడు వెనక్కి వచ్చి, “నా భవిష్యత్తుని నేను తిరగ వ్రాస్తానుఅని , దేశంలో ఉన్న అందరి తెలివి గల వారి జాబితాలను తయారు చేసి, టైమ్ మషీన్లో వారి భవిష్యత్తుకు చేరుకొని వారు భవిష్యత్తులో ఏం కనిపెడతారో, ఎలా కనిపెడతారో  అన్నీ రెకార్ద్ చేసుకొని వచ్చి, వారి కన్నా ముందుగా తానే ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు తాను కనిపెట్టినట్లుగా.
రకంగా ప్రతి మనిషి జీవిత భవిష్యత్తుని పూర్తిగా  చూడటానికి అతడి తెలివి తేటలను బట్టి కనీసం పది రోజులు  టైమ్ మషీన్లో ఉండాలి, ఒక అడవిలో. మెర్సీ కి, క్రిష్ తల్లికి అతడి వాలకం చూసి అనుమానమ్ వచ్చి నిలదీశారు. “కొన్ని రీసెర్చుల కోసం వెళుతున్నానుఅని నమ్మ పలికాడు.
రెండు సంవత్సరాలలో  కోట్లు గడించాడు. మెర్సీ కి అనుమానం తీరక మరలా ప్రశ్నించింది. “అన్నేసి రోజులు ఎక్కడికి వెళ్లిపోతావు, ఫోన్ కూడా అందలేని ప్రదేశమేన్టీ, నిన్ను నమ్ముకోవచ్చా అసలు? ” అంటూ గట్టిగా నిలదీసింది.

Intermission

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Good starting sir clps
Like Reply
#3
 
నీకు అన్నీ చెప్పటానికి నువ్వు నన్ను పోషించటంలేదు, నువ్వు సంపాదిస్తే నేను అలాగే నీ మెస్సెజులు చదువుకుంటూ కూర్చుంటాను. అయినా నీది కామం, ప్రేమ కాదు. ఇది వరికిటి రోజుల్లో రాజులు యుద్ధాలకు వెళితే రాణులు యుగాలయినా నిరీక్షించే వారు. మెసేజులు లేవు అప్పట్లోఅని దురుసుగా మాట్లాడి ఆమె నోరు మూయించాడు.
అతడికి తెల్సు అతను కావాలనే ఆమె మీద కామం అనే ముద్రా వేస్తున్నాడని, కానీ మళ్ళీ భవిష్యత్తులో ఆమె అతడికి అడ్డుపడ కూడదని అలా మాట్లాడాడు.
ఏడుస్తూ వెళ్లిపోతున్న ఆమెను చూస్తూ కోపంగానేను అంత తెలివి కల వాడిని కాదు, అందరి భవిష్యత్తుని చోరీ చేస్తున్నా, చెప్పలేను కదాఅని గొణుక్కున్నాడు.
మెర్సీక్రిస్ తన ప్రేమను కామo అని ఉఛ్ఛరించినందుకు కుమిలి కుమిలి ఏడుస్తూ కురున్నది. ఇన్నేళ్ల నా ప్రేమను అవమానించావు, ఘడి ఘడికి తాకాల అంటావా? అని గుర్తు చేసకోని మరీ ఎడ్చింది. “నీకు బుద్ధులు ముందే ఉన్నాయా లేక నాకు, ఇప్పుడు తెలిసాయ”? అని వాపోయింది.
* * * * *
యశో కు తను ఎన్ని కంపనీలు మారినా సరి అయిన గుర్తింపు రాక, జీతాలు చాలక ఇక్కట్లు పడుతున్నాడు.
ఒక వేళ క్రిష్ సాయం చేస్తాడేమో అని అతడి ఇంటికి బయలుదేరాడు. యశో, క్రిష్ ఇంటికి చేరే సమయానికే, క్రిష్ టైమ్ మషిన్లో నుంచి  దిగుతూ కనబడ్డాడు, యశోకీ.
విచిత్ర వాహనం లా ఉన్న ఒక పెద్ద యంత్రాన్ని అతడు అర చేతిలో పట్టేన్త బంతి లా మార్చి తన ఇంట్లోకి వెళ్ళటం చూసిన యశో కి, ఆశర్యంగా తోచి క్రిష్ కి  తెలీకుండా అతడినే అనుసరించాడు.
ఒక వ్యక్తి భవిష్యత్తుకి వెళ్ళి రికార్డ్ చేసిన జీవితాన్ని సిస్టమ్ లో పెట్టి , ఆమె  బంధాలు, ప్రేమ, కస్టాలు అన్నీ ఎడిట్ చేసి కేవలం ఆమె  ప్రయోగాలు, వాటి తాలూకు ఆలోచనలను ఒక ఫైలు లో  ట్రాన్స్ఫరు చేస్తున్నాడు క్రిష్.
దిమ్మ తిరిగి పోయి నోట మాట రాక అక్కడే నీలుక్కు పోయాడు యశో. ఈలోగా సూపర్ మార్కెట్ బ్యాగు తీసుకొని క్రిష్ బయటకు వెళ్ళటం తో, నిదానంగా  సేవ్ అయిన ఫైలును తెరిచి చూశాడు.
ఒక 18 యేళ్ళ అమ్మాయి, ఫ్త్లెయింగ్ హోమ్ కనిపెట్టింది, 3000 సంవత్సరంలో.
రోజుల్లో సమయ పాలన అతి ప్రాముఖ్యతను సంతరించుకుటుంది. పెరిగిన జనాభా వల్ల కొనటానికి స్థలం దొరకదు. ఎవరు శాశ్వత చోటు ను ఆక్రమించుకోలేరు. శాశ్వత ఉద్యోగాలు లేవు. అందుకే ఎవరు ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్లిపోవచ్చు. తద్వారా ఇల్లు మార్పిడి ఖర్చు చాలా పెరిగి పోయింది. అందుకు ఒక అమ్మాయి ఆకాశం గుండా  ఇంటి తో సహ  ప్రయాణం చేసి సురక్షితంగా తమ గమ్యాలను చేరుకునే లాగా ప్లయింగ్ హోమ్ కనిపెట్టింది.
ఇది చదివిన యశో అక్కడ ఉన్న అన్నీ పెన్ డ్రైవ్ లను చూశాడు. అందులో తన డిసైన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు అర్థం అయింది అతడి విజయ రహస్యపు దొడ్డీ దారి.
కోపం తో రగిలిపోయి అక్కడ బంతిలా ఉన్న టైమ్ మషిన్ ను, క్రిష్ స్నానపు టబ్ లో వేసితునా తునకలు చేసీ వెళ్ళిపోయాడు యశో.
* * * * *
పగిలి పోయిన టైమ్ మషిన్ ముక్కల్లో తన భవిష్యత్తుని చూసుకొని క్రిష్ విల విల లాడి పోయాడు. దీనిని నమ్మి అందరి దగ్గర అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో తెలీక తన వెంట పడే క్లైంట్ల ఫోన్లను కూడా రిసీవ్ చేసుకోవటం మానేశాడు అతడు.
ఉన్న బాకీలు తీర్చలేక ఒక్కో ఆస్తిని అమ్మ వలసి వచ్చింది. తిరిగి మామూలు పరిస్డితికి చేరుకున్నాడు. మెర్సీకి కాల్స్ చేశాడు. కానీ ఆమె కూడా ఎత్తక పోతే ఇంటికి నేరుగా వెళ్ళాడు, కానీ ఆమె అక్కడ కూడా లేకపోవటంతో వెను తిరిగాడు.తన సొంతంగా ప్రయోగాలు చేసి ఓడిపోయాడు.
అదే సమయంలో యశో సొంతంగా ఆటో మొబియల్స్ కార్ డిజైనింగ్ యూనిట్ ఒకటి స్థాపించి ముందడుగు వేశాడు. యాధృచ్చికంగా మెర్సీ అతడి కంపనీలో చేరటం, క్రిష్ గురించి తెలియటం జరిగింది యశోకీ. ” వీడు ఎవరినీ బాధ పెట్టకుండా ఉండడు  కదా”  అనుకోని నిట్టూర్చాడు యశో.
మెర్సీ కూడా ఇంజనీరు అవ్వటం తో ఆమెకు కూడా కార్ల డిజైనింగ్లో తర్ఫీదు ఇచ్చాడు. మరో రెండు సంవత్సరాలకు వారి కంపనీ ఉన్నత స్థాయికి చేరుకున్నది.
* * * * *
పూర్తిగా అన్నీ పోగొట్టుకొని చివరికి మెర్సీ కోసం ఆమె ఇంటికి వెళ్ళాడు మరో సారి క్రిష్.
ఆమె ఏర్ పోర్ట్  కి వెళ్ళిందని తెలిసి రోడ్ల మీద నడిచే సామాన్యురాలు విమానం ఎక్కుతోందా అని అసూయతో ఏర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అక్కడ మెర్సీ విమానంలో అడుగు పెడుతోంది. ఆమె చేయి యశో చేతిలో ఉంది. బంధువులు “Happy married life ” అని వీడ్కోలు ఇస్తున్నారు.
అతనికి ఒక్క క్షణం జీవితం ఆగి పోయినట్లుగా అనిపించింది. ఒక్క క్షణం కాలం స్థాభించి పోయినట్లుగా, జనాలు అంతా స్తబ్ధుగా ఉన్నట్లు అనిపించింది.
ఇది ఎలా సాధ్యం మెర్సీ”  అని, “ఒరేయ్ యశోధర్ నేను నీ భవిష్యత్తుని  చోరీ చేస్తే, నువ్వు నా వర్తమానాన్ని చోరీ చేస్తావా? రాస్కెల్అంటూ క్రిష్ నేల మీద కూలి పోయాడు.
***

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#4
Nice Good update  thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)