Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కోచ్‌పై మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు
#1
కోచ్‌పై మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు
[Image: 636789386255205786.jpg]
న్యూఢిల్లీ: మహిళా టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తప్పించడంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్‌పై విమర్శల జడివాన ఇంకా కురుస్తూనే ఉంది. కీలకమైన మ్యాచ్‌లో మిథాలీని జట్టులోకి తీసుకోకపోవడంపై టీం యాజమన్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ వివాదంపై మిథాలీ రాజ్ తొలిసారిగా స్పందించారు. జట్టు కోచ్ రమేశ్ పవార్ తనను అవమానించారంటూ.. మిథాలీ ఓ లేఖ ద్వారా తన సందేశాన్ని బీసీసీఐకి పంపించారు. తనను జట్టు నుంచి తప్పించారని తెలిసి ఎంతో బాధపడ్డానని లేఖలో పేర్కొన్నారు. ‘‘టీ-20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై నాకు ఎలాంటి ద్వేషం లేదు. టీం నుంచి నన్ను తప్పించాలని కోచ్ ఇచ్చిన ఆదేశాలను మాత్రమే తను పాటించింది. నేను దేశం కోసం ప్రపంచకప్ సాధించాలని అనుకున్నా.. కానీ ఆ బంగారం లాంటి అవకాశాన్ని నాకు లేకుండా చేశారు’’ అని తాను బీసీసీఐకి రాసిన లేఖలో మిథాలీ తెలిపారు.

తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు వ్యక్తులు ఈ కుట్ర పన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనని జట్టు నుంచి తప్పించడాన్ని సమర్థించిన సీఓఏ సభ్యురాలు డయానా ఎడ్లుజీపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. ‘‘ఈ లేఖ రావడం వల్ల నాకు హాని జరిగే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న కొందరు నన్ను నాశనం చేయాలనే ఈ కుట్ర చేశారు. వాళ్లు తలుచుకుంటే.. నన్ను నా కెరీర్‌ నాశనం అవుతుంది. అయినా సరే జరిగిన విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆమె సీఓఏ సభ్యురాలు.. నేను ఓ సాధారణ ప్లేయర్‌ని. నేను సెమీఫైనల్ మ్యాచ్‌కి ముందు వరుసగా రెండు అర్థశతకాలు చేశాను. అంతేకాక.. నాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా వచ్చాయి. అయినా నన్ను పక్కన పెట్టి కేవలం ముగ్గురు మంచి బ్యాట్స్‌వుమెన్లతో సెమీఫైనల్ మ్యాచ్‌కి వెళ్లడం నన్ను ఎంతో బాధించింది’’ అని తన లేఖలో మిథాలీ పేర్కొంది.

ఇక కోచ్ రమేశ్ పవార్ తనను ఎంతో అవమానించారని మిథాలీ తెలిపింది. ‘‘ఇతరులు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడే నిలబడి చూసే కోచ్‌ పవార్‌.. నేను బ్యాట్‌ పట్టుకోగానే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఆయనతో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా ముఖం చాటేసేవాడు. అది నాకు చాలా అవమానకరంగా ఉండేది’’ అని మిథాలీ ఆవేదన వ్యక్తం చేసింది. 

బీసీసీఐకి మిథాలీ రాసిన పూర్తి లేఖ కోసం 
ఇక్కడ క్లిక్ చేయండి : https://mobile.twitter.com/yashbhati0017...7091799043

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
క్రికెట్ లో జరిగేది ఇది .....కారియర్ చరమాంకం లో ...వాళ్ళకి ఈ అవమానాలు తప్పవు...నేను చుసిన వారికి ద్రావిడ్ కి..laxman కి...బెంగాల్ టైగర్ ..గంగూలీ కి....ఇంకా steave waugh ...పొమ్మనక పొగ బెట్టి పంపేశారు ...ఇప్పుడు పాపం మిథాలీ ...నేను నా చిన్నపాటి నుంచి చూస్తున్న మహిళా క్రికెట్ అంటే ఇండియా కి మిథాలీ రాజ్ నే .......వాళ్ళకి పురుషుల క్రికెట్ కి ఉండేంత ఫండ్స్ లేవు .....వసతులు లేవు ..ప్రైజ్ మనీ లు లేవు ఈనో అవమానాలు ...ఆటంకాలు ఎదుర్కొని భారత క్రికెట్ కి చాల సేవ చేసిన ఆమె ని ఇలా చేయటం చాల నీచమైన వ్యవహారం
Like Reply
#3
Mithaali raj is great like Sachin
Like Reply




Users browsing this thread: 1 Guest(s)