Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నాన్నమ్మ
#1
నాన్నమ్మ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

[Image: image-2024-03-27-140744133.png]

[b]రాజశేఖరం కి కొడుకు కృష్ణకాంత్, కూతురు సుమ. రాజశేఖరం అతని భార్య రమా కొడుకు ని, కూతురు ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
[/b]
డబ్బుకి కొదవ లేకపోవడం తో పిల్లలిద్దరిని ఉన్నత చదువులు చదివించారు.

 

పిల్లల చదువులు, వాళ్ళకి కావలిసినవి కొనడం దగ్గరనుండి యిల్లు నడపడం వరకు రమ చూసుకునేది. రాజశేఖరం ఉదయం ఆఫీస్ కి వెళ్తే రాత్రికి గాని వచ్చేవాడు కాదు అతను ఆఫీస్ పనితో అంత బిజీగా వుండేవాడు.

 

పిల్లల చదువు అయిపొయింది, ఉద్యోగాలు కూడా వచ్చాయి. అమ్మాయి బెంగళూరు లోను, అబ్బాయి మద్రాస్ లోను వున్నారు.

 

ఏమండీ ముందు అమ్మాయి పెళ్లి చేసేద్దాం అండీ, ఆడపిల్ల పరాయి ఊరిలో ఉద్యోగం, ఆ పెళ్లి కాస్తా చేసేస్తే అల్లుడు కూతురు కలిసి ఎక్కడున్నా భయం లేదు ఏమంటారు అంది భోజనం చేస్తున్న భర్త రాజశేఖరం తో రమ.

ఏదైనా బెంగళూరు లో పని చేస్తున్న అబ్బాయి అయితే మంచిది, చూద్దాం బెంగళూరు లో మా స్నేహితులకి చెప్పివుంచాను. కుదిరితే ఈ ఏడాది చేసేద్దాం అన్నాడు రాజశేఖరం. అమ్మాయి గురించి పెద్దగా బెంగలేదే నాకు మన అబ్బాయి గురించే బెంగ, మనం పెళ్లి చేసేదాకా వుంటాడా లేకపోతే ఎవ్వరైనా తెచ్చి, యిదిగో మీ కోడలు అని అంటాడా అని భయం గా వుంది అన్నాడు మళ్ళీ రాజశేఖరం.


ఛీ పాడు, బంగారం లాంటి కొడుకు గురించి ఏమిటండి ఈ మాటలు, వాడికి అన్నీ మీ బుద్ధులే, రాముడిలాంటి వాడు అంది రమ భర్త బుగ్గ గిల్లుతో. అవుననుకో రోజులు మారిపోయాయి మన బంగారం మంచిది అయినా బయట ఆకర్షణ గురించి చెప్పలేము అంటూ లేచాడు.


 

విచిత్రం కూతురుకి, కొడుక్కి యిద్దరి ఉద్యోగాలు హైదరాబాద్ కి ట్రాన్సఫర్ అయ్యాయి.

 

రాజశేఖరం దంపతుల ఆనందంకి అంతులేదు. అమ్మయ్య పిల్లలిద్దరు తమదగ్గరికి వచ్చేసారు తను రిటైర్ అవుతున్న సమయం కి అనుకున్నాడు రాజశేఖరం.

 

రిటైర్మెంట్ పార్టీలో తండ్రిని పొగుడుతూ ఆయన ఆఫీస్ వాళ్ళు మాట్లాడటం విని పిల్లలిద్దరు తండ్రితో నాన్నా మీకు మంచి ఫాలోయింగ్ వుందే అన్నారు. మరి ఏమనుకున్నారు మనం ఉద్యోగం నిజాయతీతో చేస్తే మంచి పేరు అదే వస్తుంది, మీరు కూడా మీ ఉద్యోగాలలో నిజాయితీ తో వుండండి, అదే మనకి శ్రీరామరక్ష అన్నాడు.







రిటైర్ అయిన రెండు నెలలోనే కూతురు సుమ కి పెళ్లి ఘనంగా చేసాడు. అల్లుడు ఉద్యోగం విశాఖపట్నం అవడం తో పెళ్ళానికి కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. యిహ మిగిలింది మన ముగ్గురం రా అన్నాడు కొడుకుతో.

 

యిహ వీడికి కూడా ఒక సంబంధం చూసి హైదరాబాద్ లో ఉండేడట్లుగా చూడండి అంది రాజశేఖరం భార్య.

 

నాన్నా, మా ఆఫీసులో నాతోపాటే పని చేసే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడటానికి వస్తాము అంటున్నారు మీరు ఎప్పుడు రమ్మంటారు అన్నాడు కొడుకు కృష్ణకాంత్.

 

ఈ మాట విని తల్లిదండ్రులు ఇద్దరూ తెల్లబోయారు. అంటే నీ సంబంధం నువ్వే వేతకున్నావా? యింతకీ వాళ్ళు మన వాళ్లేనా లేకపోతే అని ఆగిపోయాడు రాజశేఖరం.

 

మనవాళ్లే డాడీ, మనకంటే నిష్టగా వుంటారు, వాళ్ళని చూసి మీరు కూడా కొన్ని నేర్చుకోవాలి అన్నాడు కృష్ణకాంత్.

 

ఏమంటావు అన్నాడు భార్య వంక చూస్తో. నేను అనేది ఏముంది, మనవాళ్లే అంటున్నాడుగా రానియండి, మాట్లాడి వీడి పెళ్లికూడా చేసి మనం తీర్ధయాత్రాలకు వెళ్దాం అంది రమ.

 

తల్లినుంచి క్లియరెన్స్ రాగానే వాళ్ళతో మాట్లాడి ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి రమ్మని కబురుపెట్టేసాడు కృష్ణకాంత్.

 

శుక్రవారం నుంచి మొదలెట్టాడు రేపు రాబోయే మామగారు వాళ్ళకి ఏ టిఫిన్ చేద్దాం అని తల్లితో కృష్ణకాంత్.

 

మీ నాన్నా ఉప్మా చేస్తాను అంటున్నారు అంది నవ్వుతో, చచ్చాము, నాన్నా ఉప్మా తింటే సంబంధం చెడిపోతుంది, వద్దు హోటల్ నుంచి నేను తీసుకుని వస్తానులే అన్నాడు.


ఆదివారం రానే వచ్చింది. రాబోయే అతిధులకోసం నాలుగు రకాల టిఫిన్స్ తీసుకునివచ్చి వంటగదిలో పెట్టాడు కృష్ణకాంత్. ఎందుకైనా మంచిది అని రాజశేఖరం తన బావమరిది ని కూడా పిలిచాడు మధ్యవ్యక్తి గా వుండటానికి.


 

తొమ్మిది గంటలకు రెండు గవర్నమెంట్ కార్లులో అతిధులు ఇంటిముందుకి వచ్చారు. వాళ్ళకి ఎదురువెళ్లి లోపలికి తీసుకొని వచ్చి కుర్చోపెట్టాడు. పెళ్లికూతురు బాగానే వుంది అయితే నుదుటిన కనీకనిపించని బొట్టుతో. చాదస్తం రమ లోపల దేముడి గదినుంచి కుంకం తెచ్చి పెళ్లికూతురుకి,మిగిలిన ఆడవాళ్ళకి బొట్టు పెట్టింది. వేసవికాలం ఏసీ ఆపేస్తే ఫీల్ అయినట్టుగా మొహం పెట్టి కృష్ణకాంత్ వైపు చూసింది పెళ్లికూతురు రమ్యా.

[b]ఈ కాలం పిల్లలు నీలాగా పెద్ద బొట్టులు పెట్టుకోరు రమా, చిన్నబోట్టులో కూడా బాగానే వుంది అమ్మాయి అని సర్ది చెప్పాడు రాజశేఖరం.
[/b]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
నా పేరు సుబ్బారావు, నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ ని, మా అమ్మాయి, మీ అబ్బాయి ఒకటే ఆఫీసులో వర్క్ చేస్తున్నారుట, ఇద్దరూ యిష్టపడ్డారు, మరి మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే మాకు ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అన్నాడు నవ్వుతు పెళ్లికూతురు తండ్రి.
 
ముందు టిఫిన్ కానివ్వండి, మిగతా విషయాలు పెద్దగా ఏమీలేవు అన్నాడు రాజశేఖరం. హోటల్ నుంచి తెప్పించినట్టున్నారు, నేను హోటల్ ఫుడ్డు తినను, మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అంటూ బయటకు వెళ్లి ఇద్దరు డ్రైవర్స్ ని టిఫిన్ తినడానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు.

ఆయన తో పాటే బయటకు వచ్చిన రాజశేఖరం, మీకు డ్రైవింగ్ రాదా అన్నాడు. నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముంది అండీ, గవర్నమెంట్ కారుతోపాటు డ్రైవర్ ని యిచ్చింది అన్నాడు కొద్దిగా గర్వాంగా సుబ్బారావు.


మరి రేపు రిటైర్ అయితే ఈ కారు వుండదు, డ్రైవర్ ఉండడు కదా, అప్పుడు ఆటోనే గతి, అందుకే నేను సర్వీస్ లో వుండగానే అదిగో ఆ మామిడిచెట్టు కింద వున్న ఇన్నోవా కొనుక్కుని డ్రైవింగ్ నేర్చుకున్నాను అన్నాడు రాజశేఖరం.


దెబ్బ కొట్టడం ఈయనకి వచ్చు అనుకుని సుబ్బారావు లోపలికి వచ్చి కూర్చొని, కట్నకానుకులు ఏమి లేవని తెలుసుకుని, తాంబులాలు పుచ్చుకుని త్వరలో ముహూర్తం పెట్టి తెలియచేస్తాను అని వెళ్లిపోయారు సుబ్బారావు, అతని సమూహం.

 
పెళ్లికూతురు కాపురం చేస్తుందా సవ్యంగా అన్నాడు రాత్రి భార్య తో రాజశేఖరం. మనం అడ్డంతగలకుండా వుంటే వాళ్లే సవ్యంగా వుంటారు. ఒకరికి ఒకరు కావాలి అని చేసుకుంటున్నారుగా అంది రమ.
 
పెళ్లి జరగడం, ఏడాది దాటిన తరువాత కొడుకు కి కొడుకు పుట్టడం జరిగిపోయింది. కోడలు ఎక్కువ మాట్లాడకుండా అత్తగారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఆఫీస్ కి వెళ్లినతరువాత మనవడిని చూసుకునే పని రాజశేఖరంది, రమ ది. యిట్టే అయిదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు కృష్ణకాంత్ తనకి, రమ్య కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది అని, కొద్దిరోజులలో అక్కడకి వెళ్ళాలి అని చెప్పాడు.

తల్లిదండ్రులు ఉన్నచోటు నుంచి కదలం అనడంతో, కృష్ణకాంత్, రమ్య, కొడుకు వేణు ని తీసుకొని ఢిల్లీ వెళ్లిపోయారు. ఒక్కసారిగా యిల్లు బోసిపోవడం, అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్లిపోవడం తో లోలోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లారినా లేవలేదు. రమ గొల్లు మని, కొడుకు, కూతురు కి ఫోన్ చేసింది.


సాయంత్రం కి చుట్టాలు అందరూ చేరుకుని పని కానిచ్చారు. అద్దెకు ఇవ్వబడును బోర్డు గేటుకి తగిలించి, తల్లిని తనతోపాటు ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణకాంత్.

 
ఏమిటమ్మా ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా ఆ భక్తి టీవీ అంత పెద్దగా సౌండ్ పెడతావు, కొద్దిగా మెల్లగా పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్. నేను ఈ మూల గదిలో కూర్చుని వింటున్నా నీకు వినిపిస్తోందా, నాకు సరిగ్గా వినిపించడం లేదు అంది తల్లి.

నెలలు గడుస్తున్నాయి, రోజూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమనడం అలవాటు అయిపొయింది.




ఏమిటే ఆ సౌండ్, ఎవ్వరైనా ఫోన్ చేసినప్పుడైనా మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించారా అంటూ అమ్మ ఫోన్లో అడుగుతూవుంటే, రమ్య యింతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేసావో చెప్పలేదు అంది తల్లితో. ఎక్కడే, ఆ టీవీ సౌండ్ తో ఫోన్లో నాకే పిచ్చ ఎక్కుతోంది నువ్వు ఎలా భరిస్తున్నావే తల్లి, మన ఇంటా వంటా లేవు ఈ పూజలు, ఏమిటో మీ అత్తగారి పిచ్చ అంటూ తల్లి మాట్లాడటం చూసి ఫోన్ కట్ చేసింది రమ్య, అత్తగారు ఎక్కడ వింటారో అని.

రాత్రి భర్తకి చెప్పింది అత్తయ్య గారి టీవీ వల్ల పిల్లాడి చదువుకి కూడా యిబ్బంది, కాబట్టి ఆవిడ ని వృద్ధాఆశ్రమం లో వుంచితే ఆవిడకి కూడా ఫ్రీగా వుంటుంది ఆలోచించండి అంది.

 
బాగుండదు, అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు కృష్ణకాంత్.
 
రాత్రి కృష్ణకాంత్ కి ఆలోచనలతో నిద్రపట్టక తలనొప్పి తో తెల్లవారిజామున నిద్రపోయాడు. ఆఫీస్ కి వెళ్ళక తప్పదు కాబట్టి లేచి హాల్లోకి వచ్చాడు. అమ్మ ఎప్పుడు లేచిందో అప్పుడే చాగంటి గారి స్పీచ్ వింటోంది టీవీ పెద్దగా పెట్టుకుని.
 
అమ్మా టీవీ ఆపు, నేను ఆఫీస్ కి వెళ్లిన తరువాత పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్.
 
లేచావరా అబ్బాయి, యిటురా ఒక్కసారి అంది రమ. తల్లికి ఏమైనా కోపం వచ్చేదేమో అనుకుని, ఏమిటమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. యిలా కూర్చో అని కొడుకు ని కూర్చోమని, అబ్బాయి నేను ఒక్కమాట చెప్పాలి శాంతంగా విను. ఉదయం ఆఫీస్ కి వెళ్లి రాత్రి వస్తావు. రాగానే టీవీ ముందు కూర్చొని ఏదో సినిమా పెట్టుకుంటారు. యిహ నాతో మాట్లాడే టైం వుండటం లేదు.

అందుకే నేను టీవీ పెట్టుకుని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకుని కాలం గడుపుతున్నాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏదైనా మంచి వృద్ధాఆశ్రమంలో చేరాలి అని. నువ్వు ఆ ప్రయత్నం లో వుండు అంది కొడుకుతో.


నీ కోడలు ఏమైనా అందా అన్నాడు కృష్ణకాంత్.. పాపం తను నా విషయం లో జోక్యం చేసుకోదు, నాకే ఈ ప్రశాంతత భరించలేక వృద్ధాఆశ్రమంలో అయితే నా వయసువాళ్ళు వుంటారు, వాళ్ళతో మాట్లాడుతూ గడపవచ్చు అని అంది. నువ్వు వేరుగా అనుకోకు నేను చెప్పినట్టుగా వృద్ధాఆశ్రమంకి నన్ను పంపించు అంది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#3
అమ్మా నాకు ఏ స్వంతంత్రం లేదు, అక్కయ్య ని అడిగి కానీ ఏమి నిర్ణయం తీసుకోలేను, చూద్దాం అని లేచి వెళ్ళిపోయాడు.

ఆఫీసులో కొంత సమయం దొరికినప్పుడు అక్కగారికి ఫోన్ చేసి తల్లి తో ప్రాబ్లెమ్, ఆవిడ నిర్ణయం చెప్పాడు. పోనీ నీ దగ్గరికి పంపనా అని ఆడిగాడు.

 
నాకు అదే ప్రాబ్లెమ్, నేను ఎప్పుడు ఫోన్ చేసినా టీవీ చూస్తో వుంటుంది. తరువాత ఫోన్ చేయమంటుంది. యిక్కడ మా అమ్మాయి కూడా పెద్ద క్లాస్ కి వచ్చింది, మమ్మల్ని కూడా టీవీ పెట్టనివ్వదు, అటువంటిది అమ్మని ఇక్కడకి తీసుకుని వచ్చి బాధ పెట్టేబదులు, అమ్మ కోరినట్టుగా చెయ్యటం మంచిది అంది అక్కగారు. సరే చూస్తాను అని చెప్పాడు కృష్ణకాంత్.

ఒక మంచి రోజున సత్యసాయి వృద్ధాఆశ్రమంలో తల్లిని చేర్పించాడు. అమ్మా ఇప్పుడు మమ్మల్ని వదిలి యిక్కడ వుండటం అవసరమా అన్నాడు విచారంతో కొన్నాళ్ళు ఈ భాగవతం కూడా చూడని, నచ్చకపోతే మన యిల్లు ఎలాగో వుంది అని సర్ది చెప్పింది కొడుకు కి.

 
కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి షూస్ విప్పుకుంటూ, నానమ్మ పడుకుందా, సౌండ్ లేదు అన్న కొడుకు హర్ష తో, నానమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది అంది రమ్య.
 
అదేమిటి సడన్ గా, నాకు చెప్పనే లేదు అన్నాడు హర్ష.

ఆరునెలలు గడిచిపోయాయి. ఒకరోజు కాలేజ్ నుంచి వస్తోనే పుస్తకాల సంచి మంచం మీదకు విసిరి, తన రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష.


ఏమైంది రా, ఆ కోపం, మార్క్స్ యిచ్చారా అంది రమ్య కొడుకు గదిలోకి వెళ్లి. ముందు నాన్నమ్మ ఎక్కడకి వెళ్లిందో చెప్పు అన్నాడు మొహం అంతా ఎర్రగా చేసుకుని. ఎన్నిసార్లు చెప్పాలి, అత్తా వాళ్ళ ఊరు వెళ్ళింది అని అంది.

 
అబద్దం చెప్పకు అమ్మా, ఈ రోజు మా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఒక వృద్ధాఆశ్రమం చూపించడానికి తీసుకుని వెళ్లారు. అక్కడ నాన్నమ్మ మంచం మీద పడుకుని వుంది. నాకు కళ్ళు తిరిగిపోయాయి నాన్నమ్మ ని అక్కడ చూడటం తో. అంతకు ముందే మా ప్రిన్సిపాల్ చెప్పారు, ఎటువంటి పరిస్థితిలో మీ తల్లిదండ్రుల ని ఆశ్రమం కి పంపకండి, మిమ్మల్ని చదివించి పెద్దచేస్తే మీరు చేసే పని యిలా వుండకూడదు, వాళ్ళు వున్నంతవరకు మీరు చిన్న పిల్లలే అంది. తీరా చూస్తే మన నాన్నమ్మే అక్కడ వుంది అన్నాడు.
 
చూడు నువ్వు పెద్దవాడివి అవుతున్నావు, నానమ్మ రోజు టీవీ లో ఏదో ఒకటి చూస్తోవుంటుంది. నీ చదువు సాగదు. నాన్నమ్మ కి కూడా యిక్కడ ఫ్రీగా ఉండలేకపోతూన్నారు అంది రమ్య.
 
మరి నేను కూడా కాలేజ్ లేనప్పుడు అల్లరి చేస్తున్నాను మరి నన్నుకూడా ఆశ్రమం కి పంపించు, నానమ్మ దగ్గర వుంటాను అన్నాడు హర్ష.
 
నోరు మూసుకుని అన్నానికి రా, వూరుకుంటూ వుంటే పెద్ద మాటలు ఎక్కువ అయ్యాయి అంది రమ్య. నేను రాను, నాన్నమ్మ వస్తేనే అన్నం తింటాను, కాలేజ్ లో అందరికి చెప్పేస్తాను మా నాన్న, అమ్మా మా నానమ్మ ని వృద్ధాఆశ్రమంలో పెట్టేసారు అని అన్నాడు. ఆకలి వేస్తే నువ్వే తింటావు అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది.

సాయంత్రం భర్త కృష్ణకాంత్ రాగానే జరిగింది చెప్పి వాడు యింత వరకు అన్నం తినలేదు అంది. కృష్ణకాంత్ కొడుకు గదిలోకి వెళ్లి ఏమిటి నీ మొండితనం, నేను కావాలి అని నాన్నమ్మ ని పంపలేదు, రోజు ఆ టీవీ సౌండ్ పెట్టి నీ చదువు కి, నాకు మీ అమ్మకి మనసు కి శాంతి లేకుండా చేస్తోంది, ఆలా అని విసుక్కుంటే బాధ పడుతుంది అన్నాడు.

 
మరి చిన్నప్పుడు నువ్వు నానా అల్లరి చేసేవాడివి అన్నావు కదా, మరి నాన్నమ్మ నిన్ను ఎందుకు యింట్లో వుంచింది. నువ్వు చెప్పినట్టు నేను వినాలి, కానీ నాన్నమ్మ చెప్పినట్టు నువ్వు వినవు అన్నాడు. నాన్నా ఈ యింట్లో నాతో మాట్లాడటం అంటే హోమ్ వర్క్ చేసుకో, మార్కులు చెప్పారా లాంటి మాటలే గాని, నాతో ఒక్క గంట కూడా ప్రేమగా మాట్లాడారు, నాన్నమే నేను కాలేజ్ నుంచి రాగానే అన్నం పెట్టి, రాత్రి కబుర్లు చెప్పి పడుకోబెట్టేది అన్నాడు.
 
కొడుకుకి మా మీద వున్న అభిప్రాయం, వాళ్ళ నాన్నమ్మ దగ్గర పొందుతున్న ప్రేమ అర్ధం చేసుకున్న కృష్ణకాంత్ కి అవును అమ్మ యింట్లో వుంటే ఎలా వున్నావురా అని అడిగేది, టిఫిన్ తింటున్నప్పుడు పలకమారితే టీవీ వదిలేసి వచ్చి తలమీద తడుతో చిరంజీవ, చిరంజీవ అని దీవించిది, యిప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం, తప్పు చేసాను అనుకుని, కంచం లో అన్నం కూర కలుపుకుని కొడుకు దగ్గరికి వచ్చి, రేపు ఉదయం మీ నాన్నమ్మ ని తీసుకుని వచ్చేద్దాం, యిహ ఎక్కడకి వెళ్ళదు, అన్నం తిను అన్నాడు.
 
ఎలాగో ఆదివారమే కాబట్టి కొడుకుని తీసుకుని వృద్ధాఆశ్రమంకి బయలుదేరుతో వుండగా, వుండండి నేను వస్తున్నాను, అత్తయ్య గారిని తీసుకుని రావడం కి అంది
 
ఎందుకు రా నేను యిక్కడ బాగానే వున్నాను అంది రమ కొడుకు కృష్ణకాంత్ తో. నువ్వు బాగున్నా, మేము మీరు లేకపోతే బాగా లేము, ఇల్లంతా నిశ్శబ్దం, ఎవ్వరి దారి వాళ్ళది అత్తయ్యా అంది కోడలు రమ్య.
 
నానమ్మ నువ్వు రాకపోతే నేను కూడా యిక్కడే ఉండిపోతా అంటున్న మనవడితో, యిక్కడ వుండటానికి నీకేమి ఖర్మరా తండ్రి అంది మనవడిని దగ్గరికి తీసుకుంటూ. మరి నాన్న వుండగా యిక్కడ వుండటానికి నీకు మాత్రం ఏమి ఖర్మ నానమ్మ పదా వెళ్ళిపోదాం, దారిలో హోటల్ లో భోజనం చేద్దాం అని అంటున్న కొడుకు ని చూసి ఆనందం వేసింది కృష్ణకాంత్ కి.
 
మీ తల్లిదండ్రులు కు మీరెప్పుడు చిన్నపిల్లలే, వాళ్ళని కాపాడుకునే బాధ్యత పిల్లలదే.
 
 శుభం
 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#4
Nice story  thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)