Thread Rating:
  • 41 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery ఇదీ... నా కథ

Showing only the posts of Lakshmi: 108 of 407 posts. Show all posts
#41

నా కథ...25




తరువాతి రోజు రాజు కాస్త ముభావంగా కనిపించాడు.. నేనే కల్పించుకొని మాట్లాడా.. గతరాత్రి సంగతి ఏమీ ఎత్తలేదు.. మాములుగా రోజులాగే మాట్లాడా... ముందు రాజు నా దగ్గర ఫ్రీ గా ఉండేలా, మాట్లాడేలా చేసుకుంటే తర్వాత అతన్ని పెళ్లికి ఒప్పించ వచ్చు అనేది నా ఆలోచన..
అందుకని నేను వీలైనంత ఎక్కువగా రాజుతో మాట్లాడే ప్రయత్నం చేయసాగాను.. ఏదయినా షాపింగ్ చేయాల్సి ఉంటే రాజునే తోడుగా తీసుకెళ్లడం , కొనేటప్పుడు రాజుని సలహాలు అడగడం, వాటిమీద డిస్కస్ చేయడం లాంటివి చేస్తూ , ఇంట్లో రాజు కి కావలసినవి అన్నీ దగ్గరుండి చూసుకోవడం, రాజు ఖాళీగా ఉన్నపుడు బోర్ కొడుతుందని చెప్పి అతని దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడం ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేసాను...
క్రమంగా రాజు నాతో ఫ్రీగా మాట్లాడుతున్నాడు.. కానీ ఇంకా తన మనసులోని మాటలని పంచుకొనే అంత క్లోస్ అవ్వలేదు...
ఒక సారి మాటల మధ్యలో రాజుకి చెస్ అంటే బాగా ఇష్టమని తెలిసింది.. చెస్ ఆడే వాళ్ళు ఉంటే ఎన్ని గంటలైనా రాజు వాళ్ళతో ఆడుతూనే ఉంటాడట.. నాకూ చెస్ ఆడటం కొద్దిగా వచ్చు...
ఒకరోజు ఖాళీ టైంలో .. నీకు చెస్ బాగా వస్తుందటగా నాకు నేర్పవా అని అడిగా.. నాకు బేసిక్స్ తెలుసు కానీ బాగా రాదు అని చెప్పా..

రాజు సరే అని ఒక కబోర్డ్ తెరిచాడు అందులో రకరకాల చెస్ బోర్డ్స్, పావులు ఉన్నాయి... చెక్కవి గాజువి ,పింగానివీ, రకరకాల ఆకారాలు, రకరకాల సైజ్ లు..

"ఇన్ని ఎందుకు"

"నాకు ఎక్కడ ఏ బోర్డ్ బాగనిపిస్తే అది తీసేసుకుంటా.. ఇది నా బలహీనత" అంటూ ఒక బోర్డ్ తీసుకొని వచ్చాడు..
ముందు నీ లెవెల్ ఎంతో తెలుసుకోడానికి ఒక గేమ్ ఆడుదాం అన్నాడు.. నేను సరే అన్నా.. ఇద్దరం ఆడిన మొదటి గేమ్ లో నేను కావాలని కొన్ని తప్పులు చేసా.. గేమ్ అయ్యాక రాజు నాతో అన్నాడు.. నువ్ బాగా ఆడుతున్నావు.. కొన్ని కొన్ని తప్పులు సరి చేసుకుంటే ఇంకా బాగా ఆడుతావు అన్నాడు..
నువ్ నా తప్పులు చెప్తే నేర్చుకుంటా.. అన్నా నేను..
తరువాత మేమిద్దరమూ రోజూ చెస్ ఆడే వాళ్ళం..
మొదట్లో రాజు నేను ఆడుతున్నప్పుడే తప్పుడు ఎత్తు వేస్తుంటే అలా కాదు అని ఆ ఎత్తు తర్వాత వచ్చే ఎత్తులన్నీ చెప్పి..సరైన ఎత్తు ఏదో చెప్తూ ఆడేవాడు.. గెలుపు ఓటముల గురించి కాకుండా ఎలా ఆడాలో చెప్పడం వరకే సాగింది ..
చెస్ కి సంబంధించి కొన్ని పుస్తకాలు కూడా తెచ్చి ఇచ్చాడు.. "ఆరుద్ర" రాసిన "చదరంగం" బుక్ నాకు మొదట్లో బేసిక్స్ ఇంకాస్త మెరుగు పరుచుకునేందుకు సహాయపడింది... కొన్నాళ్ల తర్వాత ఇంకాస్త పై లెవెల్ పుస్తకాలు చదివాను..
రాజు ట్రైనింగ్, ఇంకా పుస్తకాలు చదవడం వల్ల నేను చెస్ ఆడడం బాగా నేర్చుకున్నా.. ఆరు నెలలు తిరిగే సరికి రాజు కి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వచ్చా...

ఈ కాలంలో రాజు నాతో పూర్తిగా ఫ్రీ అయిపోయాడు.. చెస్ ఆడడం మాత్రమే కాకుండా అన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నాడు..
తను వేసుకునే డ్రెస్ సెలక్షన్ కి కూడా నన్ను తీసుకెళ్తున్నాడు..
బిసినెస్ విషయాల్లో కూడా కొన్ని సార్లు అత్తయ్య, రవిలతో పాటు నాతోను చర్చిస్తున్నాడు...

ఇంక ఏదో ఒకరోజు టైం చూసుకొని పెళ్లి విషయంలో రాజుకి నచ్చజెప్పాలి అనుకుంటూ సరైన సమయం కోసం చూస్తున్నాను...
*********************
. 

ఇంతలో ఒకరోజు  అకస్మాత్తుగా అత్తయ్యకు పక్షవాతం వచ్చింది... ఒక కాలు ఒక చెయ్యి పడిపోయాయి.. మాటకూడా పడి  పోయింది.. హాస్పిటల్ లో జాయిన్ చేసాం ... రవి, నేను, రాజు అందరమూ ఎంతో కంగారు పడ్డాం.. నెల రోజుల ట్రీట్మెంట్ తర్వాత అత్తయ్యకు మాట తిరిగి వచ్చింది ... కానీ కాలు చెయ్యి ఇంకా అలాగే ఉన్నాయి.. 

హాస్పిటల్ లో ఉండనవసరం లేదని డిశ్చార్జ్ చేసారు .. ఇంటి వద్ద మందులు వాడితే క్రమంగా తగ్గొచ్చని చెప్పారు.. 

అత్తయ్య పరిస్థితి చూసి రవి కన్నా రాజు ఎక్కువ ఆందోళన చెందాడు.. ఎప్పుడూ అత్తయ్యని కనిపెట్టుకుని ఉండే వాడు.. డిశ్చార్జ్ చేసాక కూడా ఆఫీస్ కి వెళ్లడం మానేసాడు .. నేనే నచ్చజెప్పి ఆఫీసుకి వెళ్లేందుకు ఒప్పించాను..

 అత్తయ్యను నేను జాగ్రత్త గా చూసుకుంటానని పదే పదే  చెప్తే తప్పని సరిగా వెళ్ళేవాడు... ఆఫీస్ నుండి రాగానే అత్తయ్య దగ్గరే కూర్చుని ఆమె కి సేవలు చెసేవాడు.. కబుర్లు చెప్తూ అత్తయ్యకి బోర్ కొట్టకుండా చూసుకునే వాడు ...


 అత్తయ్యను నేను బాగా చూసుకుంటున్నాని నాకు చాల సార్లు థాంక్స్ చెప్పేవాడు.. 


'అదేంటి రాజూ .. నాకు థాంక్స్ చెప్తావ్.. అత్తయ్యకి సేవ చేయడం నా బాధ్యత కాదా ..." అంటే..


' అందరు కోడళ్ళు నీలా  చూసుకోరుగా అక్షరా.. అందుకే నీకు థాంక్స్ చెప్తున్నాను" అనేవాడు..

మళ్ళీ తానే.." నీకు తెలీదు అక్షరా .. అమ్మ అంటే నాకెంత ఇష్టమో... అమ్మను ఈ రోజు ఇలా చూస్తుంటే నా  గుండె తరుక్కు పోతుంది.. అమ్మే లేకపోతె ఈరోజు  నేనెక్కడుండే వాడిని ... ఏం  చేసి నేను అమ్మ ఋణం తీర్చుకోగలను.... అమ్మకు నేనెంత చేసినా  తక్కువే ..." ఇలా చెప్పుకుంటూ పోయేవాడు ..


చిన్నప్పట్నుండీ అత్తయ్యతో తన అనుబంధాన్ని గురించి వివరంగా చెప్పేవాడు.. రాజు చెప్తూ  ఉంటె నేను శ్రద్దగా వినేదాన్ని ...  అత్తయ్య గురించి మాట్లాడుతుంటే రాజుకి టైం తెలిసేది కాదు.. మా అమ్మా నాన్నల్తో కూడా నేను ఆలా లేనేమో అనిపించేది నాకు రాజు చెప్తుంటే...

కొన్నాళ్ళకి అత్తయ్య పరిస్థితి కొంచెం మెరుగయ్యింది.. ఆవిడ  కోరిక మేరకు తనని  ముంబైలోని  ఇంటికి షిఫ్ట్ చేసాము.. తనకి అక్కడుంటే సంతోషంగా ఉంటుంది.. అందుకని అక్కడికి తీసుకెళ్లమంది.. నేనూ తనతో ఉంటాను అంటే అత్తయ్య వారించింది ... రాజుని ఒక్కణ్ణే తనతో ఉంచుకొని మమ్మల్ని  వెళ్ళిపోమంది.. తన ఇష్టప్రకారమే రాజుని మాత్రం ఉంచి మేము వచ్చేసాం... వారానికి ఒక సరి వెళ్లి చూసి వచ్చేవాళ్ళం.. రాజు పూర్తిగా ముంబైలోనే ఉండిపోయాడు..


కొన్నాళ్ళు అత్తయ్యకి   బాగానే ఉంది.. పూర్తిగా బాగవుతుంది అని అనుకుంటున్న సమయంలో..  మరోసారి స్ట్రోక్ వచ్చింది.. ఈ సారి సివియర్  స్ట్రోక్ రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లినా అత్తయ్యని మేము దక్కించుకోలేక పోయాము... 

అది మాకందరికీ పెద్ద షాక్.. ఎవ్వరమూ ఆలా అనుకోలేదు.. ఒకరోజు తేడాతో అత్తయ్య మమ్మల్ని వదిలి  వెళ్ళిపోయింది.. తట్టుకోవడం చాలా  కష్టమైంది.. రవిని రాజుని ఓదార్చడం నాకు చేతకాలేదు.. ఎలాగో ఒకలా రవి కాస్త తేరుకున్నా రాజు మాత్రం తేరుకోలేకపోయాడు...

ఒంటరి వాడిలా ఫీల్ అయ్యేవాడు.... తనకి ఇక ఎవరూ లేరు అని ఏడ్చేవాడు.. 

అదేంటి రాజు మేమంతా లేమా అంటే ఏమీ మాట్లాడేవాడు కాదు..  ఆఫీసుకి వెళ్లడం పూర్తిగా మానేసాడు... అసలు తన గదిలోనుండి బయటకు రావడమే తగ్గించాడు..

భోజనానికి పిలిస్తే కొన్ని సార్లు వచ్చేవాడు.. కొన్నిసార్లు వచ్చేవాడు కాదు.. నేనే తన గదికి భోజనం తీసుకెళ్ళేదాన్ని.. 



రాజు పరిస్థితి గురించి రవి దగ్గర ప్రస్తావిస్తే..." వాడు అమ్మ మీద విపరీతమైన ప్రేమని పెంచుకున్నాడు అక్షరా.. ఒక రకంగా వాడు అమ్మ మీద ఢిపెండెంట్ పర్సన్. .. ఇప్పుడు అమ్మ లేకపోయే సరికి తట్టుకోలేకపోతున్నాడు.. మనకి కూడా  బాధ ఉన్నా మనం ఇద్దరం ఒకరికి ఒకరం ఉన్నాం అన్న ఫీలింగ్ మన బాధని తగ్గిస్తుంది.. వాడికి ఆ అవకాశం లేదు కదా.. వాడికీ పెళ్లయి ఉంటె ఇంత బాధ పడేవాడు కాదేమో.. అసలు ఆ లావణ్య లంజ అలా మోసం చేయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది.. ..

  అది, ఆ ప్రకాష్ గాడు వాడి జీవితాన్ని నాశనం చేసినా వాడు ఇన్నాళ్లు అమ్మ ఇచ్చే ఓదార్పుతో బతుకుతూ వస్తున్నాడు... ఇప్పుడు అమ్మ దూరం అయ్యేసరికి వాడు బాధ భరించలేకపోతున్నాడు .. కాలం అన్ని గాయాల్నీ మాన్పుతుంది అంటారుగా.. అలాగే వాడూ కొన్నాళ్ళకు కోలుకుంటాడు.. అంతవరకూ మనం ఏమీ చేయలేము .." అన్నాడు రవి...



రవి చెప్పినట్టు రాజుని కాలానికి వదిలేయడం నాకు ఇష్టం లేకపోయింది..

తనని ఇంతకు ముందులా మామూలుగా మార్చేందుకు నా ప్రయత్నం నేను చేయాలి అనుకున్నాను..

పనేం లేకపోయినా తన దగ్గర కూర్చొని ఏదో  ఒకటి మాట్లాడేదాన్ని.. రవి దగ్గర రోజు వారీ  బిజినెస్ విషయాలు తెలుసుకొని వాటిని రాజు వద్ద ప్రస్తావించి, వాటిల్లో డౌట్స్ అన్నీ రాజు దగ్గర అడిగేదాన్ని ...

ఇంటర్నేషనల్ చెస్ గేమ్స్ కి సంబంధించిన ఎత్తులని తీసుకెళ్లి ఫలానా ఎత్తు ఆ ఆటగాళ్లు ఎందుకు వేసి ఉంటారు అంటూ చర్చ చేసేదాన్ని..

బయటకు వెళ్తుంటే నాకు తోడుగా రాజునే రమ్మని తీసుకెళ్ళేదాన్ని.. రాజు రాను అంటే.. రవికూడా రానంటున్నాడు నువ్వు కూడా రాకపోతే ఎలా .. అంటూ బలవంతం చేసైనా రాజుని తీసుకెళ్ళేదాన్ని.. ఒక సారి బయటకు వచ్చాక వీలైనంత ఆలస్యంగా ఇంటికి వెళ్లేలా చేసేదాన్ని..

ఏదో ఒకటి చేసి రాజుని మామూలుగా మార్చాలనే నా ప్రయత్నం అత్తయ్య పోయిన నాలుగయిదు  నెలలకి ఫలించింది..

అత్తయ్య పోయిన బాధ నుండి రాజు  కోలుకున్నాడు 

 తిరిగి ఆఫీసుకి వెళ్లడం మొదలు పెట్టాడు.. 

నాతో చెస్ ఆడుతున్నాడు..

సరదాగా మాట్లాడుతున్నాడు..

ఇప్పుడు రాజు తన  జీవితంలో అత్తయ్య స్థానాన్ని నాకు ఇచ్చాడు...

ఒకరోజు..

"అమ్మ నాతో  అమ్మలా కాకుండా ఓ ఫ్రెండ్ లా ఉండేది అక్షరా..  ఇప్పుడు ఆ ఫ్రెండ్ నాకు  నీలో కనబడుతుంది ..: అన్నాడు...

నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు..

"నాక్కూడా నువ్వే బెస్ట్ ఫ్రెండ్ వి రాజూ .." అంటూ బదులిచ్చా నేను.. 

ఏడాది కిందట నాతో మాట్లాడడానికే  ఇబ్బంది పడ్డ రాజు ఈ రోజు నన్ను అత్తయ్య లాంటి ఫ్రెండ్ వి నువ్వు అనడం నాకు నిజంగా సంతోషంగా ఉంది..


రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి.. అయితే అన్ని రోజులూ అలాగే ఆనందంగా గడిస్తే అది జీవితం ఎందుకవుతుంది... 

నా జీవితం ఎప్పుడూ సరళ లేఖలా సాఫీగా సాగలేదు... ఇప్పుడు కూడా అదే జరిగింది... ఒక పెద్ద కుదుపు నా జీవితంలో చోటు చేసుకుంది...

ఇక సాఫీగా సాగిపోతుంది అని నేను అనుకున్నటున్న సమయంలో నా జీవిత ప్రయాణం ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంది..

[+] 2 users Like Lakshmi's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42





నా కథ...26





ప్రకాష్ తో కలిసి ప్రారంభించిన వ్యాపారాన్ని మధ్యలోనే ప్రకాష్ కి అమ్మేశాక రవి, రాజులు మళ్లీ అదే వ్యాపారం సొంతంగా ప్రారంభించారు...

ఆల్రెడీ ఆ ఫీల్డ్ మీద చేసిన శ్రమ, రీసెర్చ్  అంతా వృధా కావద్దని వాళ్ళ ఉద్దేశ్యం... రవి పాత బిసినెస్ చూసుకుంటే రాజు ఈ కొత్త బిసినెస్ చూసే వాడు..

తక్కువ కాలం లొనే ప్రకాష్ కి పోటీ ఇచ్చే స్థాయికి పెరిగేలా చేసాడు రాజు ... అయితే ఎప్పుడూ ప్రకాష్ కి పోటీగా అనుకునే వాడు కాదు.. ఎవరి బిసినెస్ వారిది అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు...


అత్తయ్య సిక్ అయినప్పట్నుండీ అంటే ఇంచు మించు ఏడాదిగా రాజు సరిగా ఆఫీస్ కి వెల్లకపోవడం వల్ల  ఆ బిసినెస్ కూడా రవే చూసుకుంటున్నాడు... రవికి తన బిసినెస్ పెంచుకోవడమే కాకుండా ప్రకాష్ ని ఆ బిసినెస్ లో లేకుండా చేయాలని మొదట్నుంచీ కసిగా ఉంది... కానీ రాజు వారించడంతో ఊరుకునే వాడు...

ఇప్పుడు రాజు రాకపోవడంతో తానే ఆ బిసినెస్ చూడడం మొదలు పెట్టినప్పట్నుండీ ప్రకాష్ ని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నాడు...

అత్తయ్య పోయాక రాజు ఒంటరి వాణ్ణి అని ఫీల్ అవడానికి లావణ్యతో పాటు ప్రకాష్ కూడా కారణం అని రవి ప్రకాష్ మీద ఇంకా కోపం పెంచుకున్నాడు.. రాజు ఎలాగూ ఆఫీసుకు వెల్లకపోవడం వల్ల రవి ప్రకాష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు...


కార్పొరేట్ సెక్టార్ లో తనకు ఉన్న పలుకుబడిని అంతా ఉపయోగించాడు... ప్రకాష్ కి ముడి సరుకు సరిగా దొరకకుండా చేసాడు.. దొరికినా ఎక్కువ రేట్ పెట్టి కొనవల్సి వచ్చేది ప్రకాష్ కి..

కష్టపడి ఏదోలా  ప్రొడక్ట్ తయారు చేసినా  మార్కెటింగ్ లో కూడా ప్రకాష్ కి చిక్కులు తెచ్చి పెట్టాడు రవి...

ఆ విధంగా కొద్ది రోజులకే ప్రకాష్ తన బిసినెస్ ని నడపలేక అమ్ముకునే స్థితికి తీసుకొచ్చాడు... ప్రకాష్ అమ్మకానికి పెట్టాక కూడా ఎవరూ దాన్ని కొనేందుకు ముందుకు రాలేదు.. చివరికి రవే తక్కువ రేట్ కే ప్రకాష్ బిసినెస్ మొత్తం కొనేశాడు... రాజు తిరిగి ఆఫీస్ కి వెళ్లే సమయానికి ప్రకాష్ బిసినెస్ కూడా రాజు చేతికి వచ్చింది..


అయితే తన బిసినెస్ నష్టాలకు కారణం రవే అనే విషయం ప్రకాష్ కి తర్వాత తెలిసింది... అప్పటికే అంతా అయిపోయింది.. తనని నష్టపరిచిన వాడని తెలిసీ రవికే తన బిసినెస్ అమ్మాల్సి రావడం ప్రకాష్ కి చాలా అవమానంగా తోచింది...

దెబ్బకు దెబ్బ తీయాలని అనుకున్నాడు ప్రకాష్..

కానీ రవిని బిసినెస్ లో దెబ్బ తీయడం తన వల్ల కాదని ప్రకాష్ కి బాగా తెలుసు... రాజు, రవి ల సామర్థ్యం ఏంటో ప్రకాష్ దగ్గరనుండి చూసాడు..

కాబట్టి బిసినెస్ లో వాళ్ళను దెబ్బ కొట్టడం అతనికి అసాధ్యం...

అందుకని ప్రకాష్ ఇంకో మార్గాన్ని ఎంచుకున్నాడు... 


ఒకరోజు రవి ఏదో పని మీద తాండూర్ వెళ్ళాడు..... పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల వద్ద.. ప్రకాష్ పంపిన రౌడీలు రవి కార్ ని ఆపారు... డ్రైవర్ ని, రవిని పక్కనున్న అడవిలోకి తీసుకెళ్లారు..  బలవంతంగా ఏదో ఇంజక్షన్ ఇవ్వడం వల్ల డ్రైవర్ స్పృహ కోల్పోయాడు...

తర్వాత వాళ్లు  తమతో తెచ్చుకున్న కర్రలతో రవిని ఇష్టారీతిగా కొట్టడం మొదలు పెట్టారు... అప్పటికే చీకటి పడడంతో ఆ అడవిలో రవి కేకలు ఎవరికీ వినబడలేదు... ప్రకాష్ ఆ రౌడీలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నాడు.. వాళ్ళు ఎక్కువగా కాళ్ళ మీదా, చేతుల మీద, నడుము మీద కొట్టారు.. తలకి దెబ్బలు తగలకుండా చూసుకున్నారు.. ప్రకాష్ ఉద్దేశ్యం రవి చనిపోకూడదు కానీ తిరిగి లేవకూడదు అని...

ఒక అరగంట పాటు దెబ్బల్ని తట్టుకున్న రవి స్పృహ కోల్పోయాడు... తర్వాత కూడా వాళ్ళు కొట్టారా లేదా అనేది ఎవరికీ తెలియదు...

ఇంజక్షన్ ప్రభావం తగ్గాక డ్రైవర్ మేల్కొనే సరికి రవి రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉన్నాడు... వెంటనే డ్రైవర్ రాజుకి కాల్ చేసి విషయం చెప్పి రవిని వికారాబాద్ లోని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లాడు... అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లమని డాక్టర్స్ చెప్పారు... ఈ లోపు రాజు వికారాబాద్ చేరుకొని రవిని  హైదరాబాద్ కి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ లో చేర్చాడు..

ఇంటికి వచ్చి నన్ను కార్ లో తీసుకెళ్లాడు...
ఎక్కడికి అంటే చెప్తాను ముందు పద అంటూ ఏమీ చెప్పకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లాడు...
ఏమైంది రాజు హాస్పిటల్ కి ఎందుకు తీసుకొచ్చావ్ అని అడిగా...
చెప్తా రా అంటూ లోపలికి తీసుకెళ్లాక అప్పుడు చెప్పాడు...
"రవిని ఎవరో కొట్టారు అక్షరా... బాగా దెబ్బలు తగిలాయి.." అని...

నాకు గుండె ఆగినంత పనయింది... రాజు చెప్పగానే గాభరాగా కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యింది... ఐసీయులో రవి ని చూడగానే భోరున ఏడ్చేశాను...

"నువేం భయపడకు అక్షరా... డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు... మరేం ఫరావాలేదు అన్నారు.." అన్నాడు రాజు నన్ను ఓదారుస్తూ..


దెబ్బలు విపరీతంగా తగలడంతో రవి కొలుకోడానికి రెండు నెలల పైగా పట్టింది..
కాళ్ళకి చేతులకి సర్జరీ చేశారు..
డిశ్చార్జ్ చేసే సమయానికి కూడా రవి లేచి నడిచే పరిస్థితి లేదు...

బిసినెస్ తో పాటు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు రవిని కూడా చూసుకోవడం రాజుకి కష్టంగా ఉండేది... మొదటి వారం రోజులు నన్ను కూడా రాజే చేసుకోవలసి వచ్చింది... రెండు మూడు రోజులు నేనేమీ తినలేదు... రాజే బతిమాలి తినిపిస్తే ఏవో నాలుగు మెతుకులు తిని లేచేదాన్ని... రాజు ఎప్పుడూ నన్నే కనిపెట్టుకొని ఉండేవాడు.. దగ్గర కూర్చుని ఏమీకాదు అక్షరా..రవి తొందరగానే కొలుకుంటాడు అంటూ ధైర్యం చెప్పేవాడు... అమ్మా, నాన్న లు వచ్చినా రాజు ఇచ్చిన ధైర్యంతోనే నేను త్వరగా కొలుకున్నాను.. కొన్నాళ్ళకి రవిని నేను చూసుకుంటాను అన్నా కూడా రాజు రోజు హాస్పిటల్ కి వచ్చి వీలైనంత ఎక్కువ సేపు ఉండి వెళ్లేవాడు..



డిశ్చార్జి చేసేముందు డాక్టర్ నన్ను, రాజుని పిలిచి మాట్లాడాడు..
"రవికి తగిలిన దెబ్బలు చాలా తీవ్రమైనవి ...
లేచి నడవడానికి, తన పనులు తాను చేసుకోడానికి ఇంకో నెల రోజులైనా పట్టొచ్చు...
అయితే ఇంకా హాస్పిటల్ లో ఉంచవలసిన అవసరం లేదు.. ఇంటికి తీసుకెళ్లి  మెడిసిన్ వాడితే సరిపోతుంది..." అన్నాడు...

సరే డాక్టర్ థాంక్యూ అంటూ మేం లెవబోతుంటే .." ఆగండి మీతో ఇంకో ముఖ్య విషయం చెప్పాలి.." అంటూ ఆపాడు..

మేం మళ్లీ కూర్చున్నాం...
" రవికి తగిలిన దెబ్బలు తీవ్రమైనవని ఇందాకే మీకు చెప్పాను... కాళ్ళు, చేతులకైతే సర్జరీ చేయగలిగాం... కానీ నడుము దగ్గర తగిలిన దెబ్బల వల్ల నరాలు బాగా దెబ్బతిన్నాయి.. ఇంకొంచెం ఎక్కువగా తాకి ఉంటే నడుము కింది భాగానికి మిగతా శరీరంతో కనెక్షన్ కట్ అయ్యేది... అంతవరకు మనం అదృష్టవంతులం..." అని చెప్పి కాసేపు ఆగి .. "దురదృష్టం ఏంటంటే కొన్ని సున్నిత ప్రాంతాల్లో తగిలిన దెబ్బల కారణంగా రవి ఇక  సంసారానికి పనికి రాకపోవచ్చు... "  

నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.. ఈ విషయం తెలిస్తే రవి ఎలా రియాక్ట్ అవుతాడా అని ఆలోచిస్తున్నాను నేను...

"ట్రీట్మెంట్ ఏమీ లేదా డాక్టర్" అని అడిగాడు రాజు...

"చాలా కష్టం ... మందులు వాడితే ఫ్యూచర్ లో ఏమైనా మార్పు రావచ్చు... కానీ గ్యారెంటీ గా చెప్పలేం... తొంభై శాతం అవకాశం లేదనే చెప్పాలి... ఆ పది శాతం మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది..."...

"ఈ విషయం ఆయనకి చెప్పారా డాక్టర్..." అడిగా నేను...

"లేదమ్మా..."

"సర్ ఒక హెల్ప్ చేస్తారా... దయచేసి ఆయనకి ఈ విషయం చెప్పకండి... "

"కానీ కొన్నాళ్లయితే రవికి తెలిసిపోతుంది కదమ్మా..."

"తెలిసే సరికి కొంచెం టైం పడ్తుంది గా డాక్టర్... అప్పటికి ఆయన కొలుకుంటాడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో  ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు గా... మెల్లిగా నేను టైం చూసుకుని చెప్తాను... కొన్నాళ్ళు నాకు దూరంగా ఉండాలని మాత్రం  చెప్పండి చాలు... ప్లీస్"..

సరేనంటూ డాక్టర్ ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు... రాజు కూడా డాక్టర్ వెంబడే వెళ్ళాడు... నేను ఆ గదిలోనే కాసేపు మౌనంగా కూర్చున్నా... రవి ఎలా రియాక్ట్ అవుతాడా అనేదే నా మనసుని తొలుస్తున్న ప్రశ్న... సమాధానం నా ఊహకు అందడం లేదు...
[+] 2 users Like Lakshmi's post
Like Reply
#43

ఇక్కడితో నేను xossip లో పోస్ట్ చేసిన పాత భాగాలు పూర్తయ్యాయి...
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#44

(09-11-2018, 03:46 PM)vickymaster Wrote:  ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు లక్ష్మి గారు..!!!


ఇక్కడి వరకు మాత్రమే నేను కథని చదివా, నెక్స్ట్ అప్డే కోసం చాల ఆతృతగా వెయిట్ చేస్తున్న. 
అక్షర చెప్పినట్టు ఎలాంటి కుదుపు వచ్చిందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
రాజు-అక్షర కి శారీరకంగా కలవటానికి ఎలాంటి పరిస్థితిలు దారి తీశాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=


విక్కీ గారు.. మీరు 26 వ భాగం చదవనట్టున్నారు..
నేను ఆ భాగం పోస్ట్ చేసిన రోజే xossip క్లోస్ అయ్యింది..
Like Reply
#45

(09-11-2018, 03:54 PM)Dpdpxx77 Wrote:  అక్షర అబోర్షన్ చేయించుకుంది అని చెప్పినప్పుడు ఎందుకో అనిపించింది...రవి కి ఆక్సిడెంట్ అయ్యి పిల్లల్ని కనే సామర్ధ్యం కోల్పోతాడు అని...
ఇప్పుడు కొంచెం అటు ఇటు అలానే అయ్యింది ...
రవీకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి...
రాజు అక్షర మధ్య బంధం ఈ పరిస్థితులలో ఇంకా బలపడుతుందనిపిస్తుంది...
నెక్స్ట్ అప్డేట్ కోసం ఇంక ఆగలేం లక్ష్మీ గారు.....వీలు చూసుకొని అది కూడా ఇవ్వండి...

అప్డేట్ దాదాపు పూర్తయ్యింది dpdpxx77 గారూ.. రేపట్లోగా ఇచ్చేస్తాను...

మీ ఊహా శక్తి కి అభినందనలు..
అయితే కథలో ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి
.
Like Reply
#46

ధన్యవాదాలు కూల్.సత్తి గారూ ..ఈశ్వర్ గారు.. tvs కుమార్ గారు .. వేనాజీ గారు. అన్నెపూ గారూ.. రాజ్555 గారు .. ఇంకా జీవన్ గారూ.. నా కథ మీకు నచ్చినందుకు అందరికి వేలవేల వందనాలు...
రాజు గారూ.. మీరు మళ్లీ ఫోటోలు పెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు...

తరువాతి భాగం కాసేపట్లో పోస్ట్ చేస్తా..


Like Reply
#47

(09-11-2018, 07:13 PM)bhavana Wrote:  కథ చాలా బాగుంది లక్ష్మి గారూ. మీరు అనుభవాన్ని రంగరించి రాశారు.
అద్భుతం

మిమ్మల్ని మర్చిపోయా
మీక్కూడా .

ధన్యవాదాలు భావన గారూ.
Like Reply
#48

(09-11-2018, 03:57 PM)vickymaster Wrote:  నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!


రవి విషయంలో  కొంచెం బాధ అనిపించింది. కానీ రవి మల్లి తప్పకుండ లేచి అక్షర తో శృంగారంలో పాలొగావాలని నేను ఆశపడుతున్న. రవి కి పిల్లలు పుట్టకపోయిన శృంగారం చేసేలా ఆయన రవి క్యారెక్టర్ ని మలుస్తారని ఆశిస్తున్నాను.

అక్షర తన ప్రేమని, శరీరాన్ని రవి,రాజు లకు సమంగా పంచాలని నేను కోరుకుంటున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=


ధన్యవాదాలు విక్కీ గారు...

మీ ఆశ నెరవేరుతుందో లేదో కాలమే చెప్పాలి...

కాసేపట్లో తరువాతి భాగం పోస్ట్ చేస్తున్నా
Like Reply
#49

నా కథ...27




రవిని హాస్పిటల్ లో జాయిన్ చేసాక రాజు చేసిన మొదటి పని సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం... కేవలం కంప్లైంట్ ఇచ్చి వదిలేయకుండా పైలెవెల్లో సెక్యూరిటీ ఆఫీసర్ల మీద వత్తిడి తేవడంతో రవిని కొట్టినవాళ్ళని మా డ్రైవర్ సహాయంతో తొందరలోనే పట్టుకున్నారు ... వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు ప్రకాష్ పేరు చెప్పారు... వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రకాష్ ని అరెస్ట్ చేశారు... అయితే ప్రకాష్ బెయిల్ మీద విడుదలయ్యాడు... కేస్ కోర్టుకు వెళ్ళింది... ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాష్ కి శిక్ష పడేలా చేయాలని రాజు ఒక ప్రముఖ లాయర్ ని మాట్లాడి ఉంచాడు... ఈ లోపు రవిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకొచ్చాం....

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసాక రవి పూర్తిగా కొలుకోవడానికి మరో రెండు నెలలు పట్టింది...
ఎప్పుడూ బెడ్ మీద పడుకొని ఉండడం రవికి బోర్ గా ఉండేది... వీలయినంత వరకు నేను దగ్గరే ఉండి రవి తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని...
రాజు కూడా రోజు వచ్చి బిసినెస్ విషయాలు రవితో చర్చించి వెళ్ళేవాడు... ప్రకాష్ మీద పెట్టిన కేస్ కి సంబంధించి కూడా చర్చించే వాళ్ళు...
నేను రవికి సమయానికి మందులు, ఆహారం ఇస్తూ ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉండేదాన్ని...
నెమ్మదిగా రవిని లేపి కూర్చోబెట్టడం అదీ చేసేదాన్ని...
కొన్నాళ్లయ్యాక పట్టుకొని నడవడం ప్రాక్టీస్ చేయించాను... మొదట్లో ఇబ్బంది పడ్డా కూడా తర్వాత తర్వాత బాగానే నడవగలిగాడు... మొదట్లో నేను సపోర్ట్ గా పట్టుకునే దాన్ని.. కొన్నాళ్లయ్యాక వాకర్ సహాయంతో తనంత తానే నడిచాడు... మరి కొన్నాళ్ళకి స్టిక్ సరిపోయింది... ఇంటికి వచ్చిన రెండు నెలలకి పూర్తిగా తనంత తానే నడవడం వచ్చేసింది...
కాళ్ళకి ,చేతులకి తగిలిన గాయలన్నీ మాని పోయాయి... అయినా డాక్టర్ ఇంకో నెలా, రెండు నెళ్లు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకొమ్మని చెప్పడంతో రవి ఇంట్లోనే ఉండే వాడు...

ఇక్కడే నాకు సమస్య మొదలయ్యింది...
బెడ్ మీద ఉన్నన్నాళ్లు రవికి వేరే ఆలోచనలు రాలేదు..  కానీ ఇప్పుడు ఊరికే ఇంట్లో ఉండడంతో తన ఆలోచనలు నా మీదికి రాసాగాయి...

రవిని ఇంటికి తీసుకు వచ్చినప్పటి నుండి కూడా నేను జాగ్రత్తగానే ఉంటున్నాను...
రవి ఉన్న రూమ్ లొనే వేరే బెడ్ వేసుకుని పడుకునేదాన్ని...  
డ్రెస్సింగ్ పూర్తిగా మార్చేసుకున్నా...
పూర్తిగా చీరలే కట్టుకుంటున్నా... బ్లౌస్ లన్నీ మార్చేసా... ఏ విధంగానూ రవికి ఇంకో రకమైన ఆలోచన నా డ్రెస్సింగ్ వల్ల గానీ, నా బిహేవియర్ ద్వారాగానీ కలగకూడదని నా ఆలోచన...

కానీ రవి అప్పుడప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేవాడు...
మందులివ్వడం కోసం నేను దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా నన్ను తన మీదికి లాక్కునే వాడు...
కష్టం మీద విడిపించుకొని డాక్టర్ దూరంగా ఉండమన్న విషయం గుర్తు చేసే దాన్ని నేను...
రవి శరీరం సంగతి ఏమో గానీ మనసు మాత్రం నన్ను కోరుకుంటుందని అర్థం అయ్యింది నాకు...
రవి కూడా పూర్తిగా నేను కావాలని కాకుండా నన్ను ఆట పట్టించేలా ప్రవర్తించేవాడు... ఏదోలా రవికి అసలు విషయం చెప్పాల్సిన సమయం తొందరగా రాకూడదని కోరుకునే దాన్ని నేను...

ఫ్రీ గా నడవగలిగి గాయలన్నీ మానిన కొన్నాళ్లకే మా గదిలో నేను పడుకుంటున్న సెపరేట్ బెడ్ తీసేయించాడు రవి... నేను డాక్టర్ చెప్పిన విషయాన్ని మళ్లీ గుర్తు చేయగా "దూరంగా ఉండడం అంటే దూరంగా పడుకొమ్మని అర్థం కాదు... ఒకే బెడ్ పై పడుకొని కూడా దూరంగా ఉండవచ్చు.." అన్నాడు...
నాకు ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాను...
ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల అప్పుడప్పుడు నా మీద కాళ్ళు, చేతులు వేసినా అంతకు మించి ఇంకే ప్రయత్నమూ చేయకపోవడంతో నేను కొంచెం రిలాక్స్ అయ్యాను...

కొన్నాళ్లయ్యాక ఒక రోజు నేను స్నానం చేద్దామని బట్టలు తీసుకొని బాత్ రూమ్ కి వెళ్లబోతుంటే రవి ఆపాడు...
నా చేతిలో ఉన్న బట్టల్ని టవల్ తో సహా తీసుకొని...
"వెళ్లి స్నానం చేసి రా.. " అన్నాడు..

"ఇదేంటి కొత్తగా " అన్నాను...

"నాకు నిన్ను బట్టలు లేకుండా చూడాలని ఉంది..."

"ఇంతకు ముందెప్పుడు చూడనట్టు ఏంటిది కొత్త కోరిక..."

"ప్లీస్ అక్షరా... ఎలాగూ అసలు పనికి దూరంగా ఉండమన్నావ్ కదా... కనీసం నిన్ను అలా చూసైనా సంతోషిస్తా... కాదనకు ప్లీస్..."

వద్దని ఎంతగా బతిమాలినా రవి వినట్లేదు..
చాలా సేపు నచ్చజెప్పే ప్రయత్నం చేసి రవి వినకపోయే సరికి...

"సరే .. ఆ టవల్ అయినా ఇవ్వండి.." అన్నా..

"ఏదీ వద్దు... నువ్ స్నానం చేసి ఒంటి మీద ఒక్క నీటి చుక్క కూడా తుడవకుండా... అలాగే బయటకు రావాలి..."

"సరే గానీ వచ్చాక నా దగ్గరికి రావద్దు, నన్ను తాకొద్దు మరి... "

"ఓకే నువ్ చెప్పినట్టే చేస్తా " అన్నాడు రవి..

"ఒట్టేయ్యండి" అంటూ చెయ్యి చాపా...

ఒట్టు అంటూ చేతి మీద చేయి వేసాడు రవి

రవి చేతిని అలాగే పట్టుకుని... "ఇప్పుడే కాదు డాక్టర్ చెప్పే వరకు నన్ను మీరేమీ చేయవద్దు" అన్నాను...
"అది చూద్దాం.. గానీ ఇప్పుడైతే స్నానం చేసి రా.. వేళ్ళు.." అంటూ నా చేతిలోంచి తన చేయి విడిపించుకున్నాను...

నేను ఇంకేమీ మాట్లాడకుండా బాత్రూం లోకి వెళ్ళా...

స్నానం చేస్తున్నంత సేపు ఒకటే ఆలోచన...
రవి ఎలా రియాక్ట్ అవుతాడా అని... తన పరిస్థితి ఏంటో తనకు తెలిసిపోతే ఎలా అని...
కానీ ఇప్పుడు చేసేదేమీ లేకపోవడంతో స్నానం పూర్తి చేసి అలాగే బయటకు వచ్చాను... నేను ఎప్పుడు బయటకు వస్తానా అని రవి బాత్రూం డోర్ వైపే చూస్తూ కూర్చున్నాడు... నేను బయటకు వచ్చి సరాసరి బట్టలు ఉన్న వైపు వెళ్తుంటే రవి తన వైపు రమ్మని పిలిచాడు...
నెమ్మదిగా తన వైపు వెళ్ళాను... రవి కాసేపు  పైనుండి కింది వరకు నా నగ్న దేహాన్ని చూసి టవల్ తో తుడవబోయాడు.... నన్ను ముట్టుకొనని చెప్పారు.. అంటూ నేను అనడంతో తన ప్రయత్నం మానుకొని టవల్ నాకు అందించాడు...
నేను తుడుచుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ వైపు వెళ్లి బట్టలు వేసుకున్నాను....
ఆ రోజు నుండీ ప్రతి రోజు రాత్రి స్నానం చేసాక నన్ను ఇలాగే రమ్మంటున్నాడు రవి... నేనూ అలాగే వస్తున్నాను... కానీ రవి ఏమీ చేయకుండా బుద్దిగా ఉండడం నాకు ఆశ్చర్యం వేసేది... ఒట్టేసాననే ఊరుకుంటున్నాడా... లేక తనకు కోరికలేమీ కలగడం లేదా అనేది తెలిసేది కాదు...

కొన్నాళ్లయ్యాక మళ్లీ డాక్టర్ ని కలిసాం... డాక్టర్ రవిని ఆఫీస్ కి వెళ్లి తన పనులు చూసుకోవచ్చు అని చెప్పాడు... నేను సైగ చేస్తే.. నాకు మాత్రం ఇంకొన్నాళ్లు దూరంగా ఉండమని చెప్పాడు...
కొన్నాళ్ళు రవి బుద్దిగానే ఉన్నాడు...
కానీ ఇంకో నెల రోజుల తర్వాత పదే పదే నా వెనుకపడడం మొదలు పెట్టాడు... రాత్రి పడుకున్నప్పుడు నన్ను ముద్దు పెట్టుకునేందుకు, నా ముందరెత్తుల్ని వత్తేందుకు, బ్లౌస్ హుక్స్ విప్పేందుకు ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు...
డాక్టర్ పేరు చెప్పి రవిని దూరంగా ఉంచడం నాకు చాలా కష్టంగా మారింది... ఒక రోజైతే చాలా బలవంతం చేసాడు... నేను ఎంతకీ ఒప్పుకోకపోయే సరికి ఒక నాలుగు రోజులు అలిగి మాట్లాడడం మానేశాడు.. అయినా నేను పట్టు వీడలేదు... రవికి కోరికలు బలంగా ఉన్నాయి... కానీ తన శరీరం అందుకు సహకరించదనే విషయం  రవికి తెలియదు... నేను ఏమాత్రం ఎంకరేజ్ చేసినా రవికి అసలు విషయం తెలిసిపోతుంది... అప్పుడు రవి ఏ విధంగా స్పందిస్తాడో అని నా భయం...
అందుకని మెల్లిగా రవికి నచ్చ జెప్పాను.. డాక్టర్ వద్దు అన్నప్పుడు మనం తొందరపడటం కరెక్ట్ కాదని... హెల్త్ అన్నింటికన్నా ముఖ్యమనీ.. కొన్నాళ్ళు ఆగుదామని బతిమాలుతూ నచ్చ జెప్పాను...
రవి ఏమనుకున్నాడో గానీ అలక మాని మాములుగా ఉంటున్నాడు... రాత్రి పూట నన్ను వేరే గదిలో పడుకోమన్నాడు... నేను సరే అని వేరే గదికి మారిపొయా .... ఇంకొన్నాళ్లు అలాగే కామ్ గా గడిచి పోయింది... కానీ అది తుఫాను ముందటి ప్రశాంతత అని నాకు అప్పుడు తెలియలేదు...


కొన్నాళ్ల తర్వాత రవి కొంచెం మూడీగా ఉండసాగాడు... ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు... భోజనం సరిగా చేయట్లేదు... ఆఫీస్ కి కూడా సరిగా వెళ్లట్లేదు.... బయటకి వెళ్తే ఇంటికి తొందరగా రావట్లేదు...
రవిలో ఈ ఆకస్మిక మార్పుకి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు... ఏమైంది అని అడిగితే రవి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయేవాడు... ఒక వారం పది రోజుల పాటు ఇదే తంతు..
నేను చాలా సార్లు అడిగి చూసా.. కానీ సమాధానం రాలేదు... ఇంక లాభం లేదని ఒక రోజు చెప్పేవరకు కుదరదని పట్టుబట్టాను...

"ఎందుకు రవీ... ఇలా ప్రవర్తిస్తున్నావ్ ... ఏమైందో చెప్పు... ఇవాళ చెప్పే వరకు నిన్ను వదలను...

"ఏమీ లేదు... "

"ఏమీ లేకపోతే ఇలా ఎందుకు ఉంటున్నావ్...  ఏదో ఉంది.. నువ్ నాకు చెప్పకుండా దాస్తున్నావ్... నాకు చెప్పకూడని విషయమా....
అయినా భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉంటాయా.."

"ఏం.. నువ్వు దాయలేదా అక్షరా...."

"నేనేం దాచాను..."

"డాక్టర్ నా ఆరోగ్యం గురించి మీకు చెప్పిన సంగతి చెప్పావా..."

ఈ ప్రశ్న విని నా గుండెల్లో రాయి పడ్డట్టయింది...
ఏ టాపిక్ అయితే రవి దగ్గర మాట్లాడకూడదు అనుకుంటున్నానో.... అదే టాపిక్ రవి తీసుకొచ్చాడు... రవి మూడీగా ఉంటున్న మొదటి రోజు నుంచీ విషయం తెలిసిపోయిందా అని నాకు అనుమానంగానే ఉంది... ఇప్పుడు రవి అడుగుతుంటే నా అనుమానం బలపడింది ... అయినా నా అంతట నేను బయట పెట్టకూడదు అని మనసులో బలంగా అనుకోని...

"డాక్టర్ మీ ముందే అన్నీ చెప్పాడుగా... ఇంకా నేను దాచిందేమిటి... " అన్నాను...

"నేను ఉన్నపుడు చెప్పింది కాదు..  నేను లేనప్పుడు చెప్పిన దాని గురించి ..."

"వేరే ఇంకే మాటా డాక్టర్ చెప్పలేదు.." అన్నాన్నేను వణుకుతున్న స్వరంతో...

"ఇంకా దాయాలని చూడకు అక్షరా... నాకంతా తెలిసిపోయింది..."

"ఏం తెలిసింది..."

"నేను ఇంక జన్మలో సెక్స్ కి పనికి రాను అని".....

"ఎ.. .ఎ.. ఎవరు చెప్పారు..."

" ఎవరు చెప్తే ఏం... అది నిజమా కాదా... మీరు నా దగ్గర దాచారా లేదా..."

" కాదు.. అది నిజం కాదు... కొన్ని రోజులు మందులు వాడితే ....."

"నేను  డాక్టర్ ని కలిశాను అక్షరా.... ఇంకా నా దగ్గర దాచాలని ప్రయత్నం చెయ్యకు... ఆయనే అంతా చెప్పేసాడు.. "

"లేదండీ డాక్టర్ మందులు వాడితే నయమవుతుంది అన్నాడు...."

" 10 శాతం మాత్రమే అవకాశం ఉందన్నాడు అవునా..."

నేను అవును అన్నట్టు తలూపాను..

"నేను మన డాక్టర్ కాకుండా ఇంకో ఇద్దరు డాక్టర్లకు నా రిపోర్ట్స్ చూపించా అక్షరా...  వాళ్ళు ఆ పది శాతం కూడా కష్టమే అన్నారు..."

నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు...ఎం మౌనంగా తల దించుకొని నిలబడ్డా...

ఇంతలో రవికి ఫోన్ వస్తే మాట్లాడి ... వెంటనే వచ్చేస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు...

నేను అక్కడే ఆలోచిస్తూ నిలబడిపోయాను..
[+] 2 users Like Lakshmi's post
Like Reply
#50

(10-11-2018, 10:50 PM)Mandolin Wrote:  చాలా బాగుంది అప్డేట్

(10-11-2018, 11:28 PM)raaki86 Wrote:  nice story

(10-11-2018, 11:53 PM)Mahesh61283 Wrote:  Lakshmi garu na favorite  story ni meru ekkada prarambinchinanduku krutagnatalu

ధన్యవాదాలు మాండొలిన్ గారు, రాకీ గారు, మాహేష్ గారూ...
ఇక ముందు కూడా మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని నా కోరిక
Like Reply
#51

(10-11-2018, 11:27 PM)Dpdpxx77 Wrote:  హార్ట్ టచింగ్ అప్డేట్ లక్ష్మీ గారు...
రవీ పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే చాలా భాదగా ఉంది...
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని ఇంక శారీరకంగా సుఖపెట్టలేను అని తెలియడం వర్ణించరానిది.....నో వర్డ్స్ టు సే...
పిల్లలు పుట్టే సామర్ధయం లేకపోయినా కొంచెం పరవాలేదు.....అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది...
కానీ అసలు శృంగరానికే పనికిరాకపోవడం అనేది ఊహకే అందనిది.....
ఇంక అక్షర ఎలా రవీని కన్విన్స్ చేస్తుందో చూడాలి...
చివరకి రవినే అక్షరని ఒప్పించి రాజుతో సుకపడమని చెప్తాడేమో...???
వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్ లక్ష్మీ గారు...

మీరన్నమాట అక్షరాలా నిజం dpdpxx77 గారు.. ఆ బాధ భరింపలేనిది.. రవి, అక్షర పరిస్థితిని ఎలా ఎదుర్కుంటారో చూడాలి...
మీ అభిమానానికి ధన్యవాదాలు..
Like Reply
#52

(11-11-2018, 12:13 AM)vickymaster Wrote:  నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!

చాల బాధాకరమైన అప్డేట్ అండి. సంతానానికి పనికి రాకుండా చేసిన బాగుండేది కానీ ఏకంగా మగతనం లేకుండా రవి ఉండటం అంతగా రుచించటం లేదు.

అక్షరకి శారీరకంగా ,మానసికంగా అలాగే ప్రేమ అన్నీకూడా దొరుకుతాయి రాజు నుండి. కానీ రవి నుంచి ప్రేమ మాత్రమే.
అఫ్ కోర్స్, రవి అక్షరకి ఎలాంటి లోటు లేకుండా అన్ని సుఖాలు ఉండేలా చూసుకుంటాడు రాజు ద్వారా అయినా.
శరీరకంగా కలవటం అనేది కేవలం కోరికలు తీర్చడానికి మాత్రమే కాదు అది ఒక వర్ణించలేని అనుభూతి, ఆ అనుభూతి మన(రవి) ద్వారా నచ్చిన వాళ్ళకి(అక్షర) ఇవ్వటం అనేది ఒక గొప్ప ఫీలింగ్. రవి విషయం లో  ఏదయినా అద్భుతం జరుగుతుంది అని ఆశిస్తున్నాను.

మగవాడి సైకాలజీ ప్రకారం నాకు అర్ధం అయ్యింది చెబుతున్న. నాది,నా సొంతం, నేను పేమించిన వ్యక్తి అది ఎవరు ఆయన కావొచ్చు(భార్య,చెల్లెలు,అమ్మ,అక్క) మగాడి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి వేరే వ్యక్తి దగ్గర శారీరకంగా సుకం పొందటం ఆ మగడు తట్టుకోలేని ఒక అంశం. వర్ణించలేని భాద తో కూడుకున్నది, కేవలం తన ప్రేమించే వాళ్ళ కోసం ఇష్టం లేకపోయినా భరిస్తారు అంతే కానీ మనస్ఫూర్తిగా అంగీకరించలేరు అని నా అభిప్రాయం.
మరి మీ కథ ఎలా నడిపిస్తారో కొంచెం టెన్షన్ తో కూడిన ఆతృత తో వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=


నిజమే విక్కీ గారూ.. భార్యను సుఖపెట్టలేని భర్త బ్రతుకు దుర్భరమే... అయితే అక్షరా,రవి ఇద్దరూ ఒకర్ని ఒకరు బాగా ఇష్టపడతారు.. పడక సుఖం ఇవ్వలేదని అక్షర రవిని తక్కువ చేసి చూసే అవకాశం లేదు.. అంత వరకు రవి అదృష్టవంతుండే... అయినా రవి బాగయ్యేందుకు ఇంకో పదిశాతం అవకాశం ఉందని డాక్టర్ చెప్పాడుగా చూద్దాం ఏమవుతుందో...


మీ విశ్లేషణాత్మక రిప్లై కి ఆనంతకోటి ధన్యవాదాలు
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#53

(11-11-2018, 06:44 AM)Eswar P Wrote:  లక్ష్మి గారు అందరిని చాలా భాద పెట్టేశారు. చూడ్ధామ్ ఏమి చేస్తాం మరి.

మన చేతుల్లో ఏముంటుంది ఈశ్వర్ గారూ.. అంతా విధి రాత...


మీ కామెంట్ కి ధన్యవాదాలు
Like Reply
#54

(11-11-2018, 07:50 AM)annepu Wrote:  పాపం......ఇద్దరి పరిస్థితి అలా అవుతుంది అనుకోలేదు....... ఇద్దరూ....బాగా ఆనందించేవారు...... దీని కోసం పిల్లలను కూడా వాయిదా వేశారు........ ఇప్పుడు పరిస్థితి చాలా బాధాకరం...

అన్నెపూ గారూ జీవితంలో ఏదీ మనం అనుకున్నట్టు జరగదు.. ప్రస్తుత పరిస్థితుల్లో రవి కి కష్టమే.. పిల్లలు వాయిదా పడేందుకు కూడా రవే కదా కారణం.. చూడాలి మరి రవి , అక్షరా ఏం చేస్తారో...


మీ కామెంట్ కి ధన్యవాదాలు..

మీరు నా మాట మన్నించి తెలుగులో రాసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
Like Reply
#55

(11-11-2018, 08:16 AM)coolsatti Wrote:  అప్డేట్ చాలా బాగుంది లక్ష్మీ గారు...పాపం రవి కి నిజం తెలిసిపోయింది...ఇంకా నెక్స్ట్ ఏమి జరుగుతుందో చూడాలి

అవును సత్తి గారు.. రవికి నిజం తెలిసిపోయింది.. ఏం జరుగుద్దో చూద్దాం..
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదాలు
Like Reply
#56

(11-11-2018, 08:26 AM)mahesh477 Wrote:  ఉహించిన్నట్లు జరిగేతే అది జీవితం ఎలాగవుతుంది. అక్షర కూడ  
ఉహించి వుండదు

అవును మహేష్ గారూ..
ఊహించినట్టు జరిగితే జీవితం ఎలా అవుతుంది... ఒకఆ వేల జరిగినా బాగోదు కూడా..

మీ ప్రత్యుత్తరానికి ధన్యవాదాలు
Like Reply
#57

(11-11-2018, 08:47 AM)Kannaiya Wrote:  లక్ష్మీ గారు అప్డేట్ చాలా బాగుంది
రవి తర్వాత ఎం చేస్తాడో అన్ని చూస్తున్నాను

కన్నయ్య గారూ మిమ్మల్ని మళ్లీ ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది..

అప్డేట్ నచ్చినందుకు ధన్యవాదాలు
Like Reply
#58

(11-11-2018, 09:23 AM)tvskumar99 Wrote:  లక్ష్మీ గారు అప్డేట్ చాలా బాగుంది. హృదయానికి హత్తుకునే అప్డేట్.
తరువాత రవి ఏమి చేస్తాడో చూడాలి.

చాలా చాలా థాంక్స్ టీవీస్ కుమార్ గారూ.. మీకు నా కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది..
Like Reply
#59

(11-11-2018, 06:56 PM)Eswar P Wrote:  లక్ష్మి గారు థాంక్స్.సంధ్య గారు ఇంకా ఇంకా ఇక్కడకు రాలేదు.

అవునండీ ఎందుకో మరి తను రాలేదు..

కొత్త కథతో ఈ సైట్ కి వస్తాను అని xossip లో చెప్పింది..
నేను కూడా ఎదురుచూస్తున్నా..
నా దగ్గర తన మెయిల్ కూడా లేదు.. సరిత్ గారిని అడిగి చూడాలి
Like Reply
#60

(12-11-2018, 11:21 AM)annepu Wrote:  
(11-11-2018, 05:58 PM)Lakshmi Wrote:  
(11-11-2018, 07:50 AM)annepu Wrote:  పాపం......ఇద్దరి పరిస్థితి అలా అవుతుంది అనుకోలేదు....... ఇద్దరూ....బాగా ఆనందించేవారు...... దీని కోసం పిల్లలను కూడా వాయిదా వేశారు........ ఇప్పుడు పరిస్థితి చాలా బాధాకరం...

అన్నెపూ గారూ జీవితంలో ఏదీ మనం అనుకున్నట్టు జరగదు..  ప్రస్తుత పరిస్థితుల్లో రవి కి కష్టమే.. పిల్లలు వాయిదా పడేందుకు కూడా రవే కదా కారణం.. చూడాలి మరి రవి , అక్షరా ఏం చేస్తారో...


మీ కామెంట్ కి ధన్యవాదాలు..

మీరు నా మాట మన్నించి  తెలుగులో రాసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
నిజంగా ఏవన్నా ప్లాన్స్ ఉంటె ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ వచ్చాక ఆలా తీయించుకోకూడదు ......తర్వాత పరిణామాలు యిలానే ఉంటాయి .....నా జీవితం లో కూడా యిలానే ఎదురయ్యింది ....మా ఓన్ సిస్టర్ కె అయ్యింది స్టార్టింగ్  లో మా బావ గారు అలానేచేశారు  యిప్పుడువాళ్లకి పెళ్లై  ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది....పిల్లలు లేరు......పుట్టేఛాన్స్ కూడా  లేదు.......ఇపుడు అడాప్షన్ కి చూస్తున్నారు......మా  అక్క మాత్రమే .కాదు  ....మా  బంధువులు సస్నేహితులుchala మంది యిలానే తీయించేసారు ముందు.....ఇప్పుడుపిల్లలు లేక  మందులు తింటున్నారు........నాకు  ఆ ఆబోర్తిన్ అప్డేట్ చదివాకా యిదే గుర్తొచ్చింది ......కథలు ఆలా అవ్వడు అనుకున్న...ఇక్కడ  అదే రిపీట్ అయ్యింది.....బాధగా ఉంది చాలా........


సో sad
Like Reply




Users browsing this thread: 2 Guest(s)