18-07-2023, 05:23 PM
అర్ధరాత్రి ఆక్రందన
- Vasu Vemula
అర్ధరాత్రి లో ఆక్రందన హర్రర్ కధ
మిత్రులారా హర్రర్ కధలు ఇష్టమైన వారు చదవండి.మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
బస్సు సడెన్ బ్రేక్ పడింది రవ్వల గూడెం రవ్వల గూడెం అంటూ కండెక్టర్ అరుస్తున్నాడు,బస్సులో నుండి భుజం పై బ్యాగ్ తో దిగాడు రవి.సమయం సాయంత్రం 6 గం; అయ్యింది,నెమ్మదిగా నడుస్తూ ఈ ఊరిలో కాల్ సెంటర్ లో పని చేసే శ్రీకాంత్ గారు ఇల్లు ఎక్కడ అని ఎదురుగా వస్తున్న వ్యక్తి ని అడగ్గా తెలియదని చెప్పాడు. మరొక వ్యక్తిని అడిగినా అదే సమాదానం,అన్నయ్య ఏంటి ఇంత మారుమూల పల్లెలో ఇళ్లు తీసుకున్నాడు అనుకుంటూ పోన్ చేసాడు,అప్పుడు రింగ్ అయ్యంది పోన్,అమ్మయ్య అనుకుని తాను రవ్వల గూడెం వచ్చానని బస్సు దిగి నడుస్తూ ఊర్లోకి వస్తున్నానని ,ఎవరు అడిగినా నీ అడ్రస్ చెప్పటం లేదు అనగా ఇక్కడ వారికి నేను పెద్దగా తెలియదు లే నేను బైక్ పై వస్తున్నా ఆగు అంటూ ఒక 10 నిమిషాల్లో రవి దగ్గరకి వచ్చి బైక్ ఎక్కించుకుని తన రూం కి బయలు దేరారు,దారిలో రవి అన్ని పరిశీలించసాగాడు,చాలా చిన్న గ్రామం అన్ని పొలాలు,గుబురు చెట్లు ఇంటికి ఇంటి మధ్య బాగా దూరం ఉంది. మధ్యలో కొన్ని చోట్ల మూడు నాలుగు,ఇల్లు పక్కనే ఉన్నాయి.దారిలో అక్కడక్కడ రెండో అంతస్తు భవనాలు అతి కొద్ది సంఖ్యలో ఉన్నాయి,ఆ ఇంటి వారు పెద్ద కుటుంబాలు,మరియు కొంత సంపన్నులు అయి ఉంటారని భావించాడు రవి.రోడ్డు అక్కడ అక్కడ గతుకులు ఉన్న కొంత పర్వాలేదు అనిపించింది,ఇద్దరు రూం చేరుకున్నారు, గ్రామానికి దాదాపు చివర ప్రాంతం లో ఉన్నది ఆ రూం.వీరి ఇంటి తర్వాత ఇక ఇళ్లు లేవు. వీరు ఉండే గది 2 వ అంతస్తు,కింద పోర్షన్ ఖాళీ గానే ఉంది,ఎవరు లేరు . ఈ రూం కి కొద్ది దగ్గర్లో ఇటు వైపు నాలుగు,అయిదు ఇళ్లు ఉన్నాయి. అన్నయ్యా,ఇంత చివర తీసుకున్నారేమిటి ఇళ్లు అనగా ఇక్కడ అద్దె తక్కువ2500 రూపాయిలు,విశాలం గా ఉంటుంది,అదే ఈ పాటి ఇళ్లు పట్టణంలో 15000 ఉంటుంది,అందుకే 15 కి.మీ అయినా ఇక్కడ తీసుకున్నాం అని బదులిచ్చాడు,అంతలో బయట నుండి రమేష్ అన్నయ్య వచ్చాడు,రమేష్ మరియు శ్రీకాంత్ అన్నయ్య ఇద్దరుకలసి చదువుకున్నారు,ఇద్దరికి కాల్ సెంటర్ ఓ ఉద్యోగం రావటంతో పట్టణంలో అద్దె లు భరించలేక ఇక్కడ తీసుకున్నారు,వారి జీతం 20000 మాత్రమే పట్టణంలో ఈ డబ్బు అద్దె కే కావాలి కనుక ఇక్కడ గ్రామంలో తీసుకున్నారు అని రవి అర్దం చేసుకున్నాడు,రవి వాళ్లది సాధారణ మధ్య తరగతి కుటుంబం ,రవి ది కూడా బి.టెక్ అయిపోవటం వలన ఇక్కడ అన్నయ్య దగ్గరనుండి ఉద్యోగ ప్రయత్నంచేయవచ్చని వచ్చాడు.రమేష్ ది రవి వాళ్ల ఊరే వారిది మధ్యతరగతి కుటుంబం కనుక అన్నయ్య,రమేష్ లు కలసి దొరిగిన ఉద్యోగం తొ కాలం గడుపుతూ దీని కన్నా మంచి జాబ్ కోసం చూస్తున్నారు. కింద పోర్షన్ లో ఎవరు లేరు ఏంటి అన్నయ్యా అని రవి అడగ్గా అంతకు ముందు ఇంటి ఓనరే ఉండే వాడట,ప్రస్తుతం వాళ్ల కొడుక్కి పట్టణంలో బ్యాంక్ లో ఉద్యోగం వచ్చిందని అందరు అక్కడికే వెళ్లారు. మీము వచ్చే నాటికే ఇది ఖాళీ వారి సామానులు కొన్ని ఉన్నాయని మాకు పై పోర్షన్ ఇచ్చారు అని బదులిచ్చాడు,ఇలా మాట్లాడుకుంటు ఉండగానే రమేష్ వంట రెడీ చేసాడు. ముగ్గురు కలసి భోజనం చేసారు,సమయం రాత్రి 9 గం;లు కావస్తుంది,ఇద్దరు రవి తో జాగ్రత్త గా పడుకోమని చెప్పి బైక్ పై పట్టణానికి బయలు దేరారు,కాల్ సెంటర్ లో వారికి రాత్రి 10 నుండి ఉదయం 6 గం; వరకు డ్యూటీ ఉంటుంది .ఉదయాన్నే గ్రామానికి చేరుకుని మరలా సాయంత్రం వెళ్తుంటారు,రవి ఒక్కడే కొత్త ప్రదేశం అయినా డాబా పై నుండి చూస్తుంటే చుట్టు బాగా దట్టమైన చెట్లు, దగ్గరలో కొండ ప్రాంతం అయినా ఇంత దూరంలో ఇళ్లు తీసుకున్నారేంటి అనుకున్న రవి ఎటు వారు రాత్రి వేళల్లో ఉండరు కదా అని తీసుకున్నారు,మరియు పట్టణంలో ఉండాలంటే వారు.చెప్పినట్లు వారి జీతం అద్దెలకే సరిపోదు అనుకుని ప్రయాణ బడలిక తో నిద్ర వస్తుండటం తో నిద్ర పోదామని రూం లోకి పోయి పడుకున్నాడు. రవి బాగా నిద్ర లోకి జారుకున్నాడు.
సమయం రాత్రి 1.30అయ్యింది,దాహాంగా ఉండటం వలన లేచి చూడగా కరెంట్ పోయిఉంది,గ్రామం కావటాం చేత కరెంట్ కోత ఎక్కువని ముందే అన్నయ్య చెప్పి క్యాండిల్స్ మంచంపక్కనే ఉంటాయని చెప్పటంతో క్యాండిల్ వెలిగించి దగ్గరలో ఉన్న బిందె లో నీరు తాగాడు,మరలా పడుకుందామనగా నిద్ర పట్టలేదు,బయటకు వచ్చాడు,కరెంట్ లేకపోవటం వల్ల బాగా చీకటి. వర్షాకాలం అవటం వలన బాగా మబ్బు పట్టి ఉంది,అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపులు వస్తున్నాయి,వాతావరణం వర్షం వచ్చేలా ఉందిడాబా చివరకు పిట్ట గోడ దాకా వచ్చి పరిశీలిస్తున్నాడు,కుడి వైపు ఒక్క ఇళ్లు లేదు అన్ని చెట్లు,కొండలు ,ఎదురుగా దూరంలో ఒక్క ఇళ్లు,ఎడమ వైపున కొద్ది దూరంలో 5 ఇళ్లులు ఉన్నాయి, మెరుపుల వెలుతురులో అవి కనిపిస్తున్నాయి.కరెంట్ వచ్చేలా లేదు లే అనుకుని ఇక గది లోకి పోదామని అనుకుని అనుకుంటుండగా కింద పోర్షన్ లో ఏదో శబ్దం వినిపించింది. కింద ఇంట్లో ఎవరు లేరు కదా మరి ఆ శబ్దం ఏమిటి అనుకుని పిట్ట గోడ పై నుండి ఒంగి చూసాడు,ఏమి కనిపించట్లేదు,కాసే పు శబ్దం ఆగింది మరలా ఒక్క 2 నిమిషాలలో శబ్దం వినిపిస్తుంది,ఎవరో నడుస్తున్నట్లు వినిపించి రవి ఎవరబ్బా ఈ సమయంలో అనుకుంటూ నెమ్మదిగా మెట్లు దిగసాగాడు,మెట్లు దిగి అటు,ఇటు చూస్తున్నాడు,గేట్ వేసే వుంది చుట్టూ ప్రహరో గోడ మరి ఎవరు వస్తా రు ?అనుకుంటూ చుట్టూ చూడసాగాడు, కింద ఇంటివి తలుపులు వేసే ఉన్నవి,కింద పోర్షన్ చుట్టూ కాంపౌండ్ వాల్ బాగా ఎత్తుగానే ఉంది,కాంపౌండ్ వాల్ చుట్టు అక్కడక్కడ మొక్కలు పెంచారు,వాల్ చుట్టు తిరిగి మరలా మెయిన్ గేట్ కి రావచ్చు, ఆ చుట్టూ అక్కడక్కడ రకరకాల మొక్కలు పెంచారు,చీకటి గా ఉండటం తో గేట్ దగ్గరే నిల్చొని చూస్తున్నాడు రవి,మరలా ఎవరో నడిచినట్లు శబ్దం వినిపించగా కుడి వైపు ఉండే వాల్ వైపు శబ్దంవచ్చినట్లు గ్రహించి అటు పక్కకు వచ్చాడు రవి,నెమ్మది గా ఆ వాల్ వెంబడి కింద పోర్షన్ వెనుక వైపు వెళ్ల సాగాడు,అంతలో ఆకాశం నుండి మెరుపు ఆ మెరుపు వెలుగులో అక్కడ ఉన్న ఒక చెట్టు వెనుకఆకారం చూసి గుండె జల్లుమన్నది రవికి,ముందుకు వెళదామా?వెనుక్కి పరిగెత్తుదామా ?మనసులో అముకుంటూ అంతే ఆ ఆకారం కెళ్ళి చూడసాగాడు,కేకలు వేసినా ఎవరికి వినిపించనిప్రదేశం కాబట్టి రవి అంతే నిస్సహాయంగా చూడసాగాడు,
• PART-2. ఏదో తెల్లని ఆకారం ఆ చెట్టు దగ్గర కనపడుతూ ఉంది,రవికి గుండెలు అదురుతున్నాయి అసలు ఈ సమయంలో ఎవరు ?అని ఆ చెట్టు దగ్గరకు వెళ్లసాగాడు,బాగా చీకటి చెట్టు దగ్గరకి వెళ్ళి చూడగా అక్కడఎవరు కనపడటలేదు,ఆశ్చర్యం మెరుపు వెలుతురులో కనిపించిన ఆకారం ఇప్పుడు కనిపించటం లేదు ఏమిటి అనుకుని బాగా పరిశీలిస్తూ ఆ ఇంటి వెనుక వైపు వెళ్లాడు,అప్పుడప్పుడు వచ్చె మెరుపు కాంతిలోఅతి భయంకరంగా ఉంది ఆ ప్రదేశం కింద ఇంట్లో చాలా రోజుల నుండి ఎవరు లేరు కాబట్టి అక్కడ ఊడ్చేవాళ్ళు లేరు కాబట్టి దుమ్ముధూళి తో నిండి పోయి ఉంది,నెమ్మదిగా నడుస్తూఆ ప్రాంతం అంతా పరిశీలించసాగాడు,ఇంతకు ముందు కనిపించిన ఆకారం ఎక్కడికి వెళ్లిఉంటుంది అనుకుంటూ చూడసాగాడు,అలా నడుస్తూ ఒక్క క్షణం ఆగాడు,కారణం వెనుక ఉన్న గదిలో నుండి ఏదో శబ్దంఅదేంటి ఈ ఇంట్లో ఎవరు లేరు కదా?మరి ఆ శబ్దం ఏమిటి?అంటూ చెవి రిక్కించి వినసాగాడు,ఖచ్చితంగా ఆ గది నుండే శబ్దం అన్ని తాళాలు వేసి ఉన్నాయి,మరి ఎలా వస్తుంది శబ్దం,అనుకుంటూ ఆలోచిస్తున్నాడుఅంతలో వర్షం ప్రారంభమయ్యింది ,రవి గబ గబ మెట్లు ఎక్కి తన గదిని వెళ్లాడు,అప్పటికి కరెంట్ రాలేదు అసలు ఏంటి ఈ శబ్దాలు,ఎందుకు ఇంటి ఓనర్ వాళ్ళు ఈ ఇళ్లు ఖాళీ చేసి మరొకరికి కూడా అద్దె కుఇవ్వకుండా ఇలా ఉంచారు,ఈ అనుభవాలు అన్నయ్యలు రాత్రి వేళ అసలు ఉండరు కావున వారికి తెలిసి ఉండదు,ఎప్పుడయినా సెలవు వచ్చినా తమ గ్రామానికి వస్తారు కాబట్టి రాత్రి వేళవారుండరు,ఇంత చివర ఇలాంటి ఇంటిలో రాత్రి వేళ ఒక్కరే ఉండటం కష్టమే అనుకుంటూ రకరకాలు గా ఆలోచిస్తూ ఉన్నాడు,ఆ రూంలో కొవ్వొత్తి వెలుగు అప్పుడప్పుడు బయటనుండి వచ్చే మెరుపు ల వెలుతురు తప్ప చుట్టూ కటిక చీకటి గా ఉంది,రవి స్వతహాగా దైర్యస్తుడే కాని ఇలా ఒంటరి గా వేరే ఊరిలో ఇలా ఊరి చివర ఇంటిలో ఇలా ఉండవలసి రావటం కొంత ఆందోళన గానే ఉంది,రవి వయస్సు కూడా 23సం;లు మాత్రమే,ఆ వయసులో తెగింపు ఉంటుంది కాబట్టి ఒక్కడే కింద శబ్దం ఏమిటి అంటూ పరిశీలించగలిగాడు.
రవి ఆలోచిస్తూ ఉన్నాడు,అంతలో హఠాత్తుగా ఫ్యాన్ తిరగటం వలన క్యాండిల్ ఆరిపోయింది, కరెంట్ రావటం వలన రవి ఆలోచనలు పక్కన పెట్టి నిద్రపోసాగాడు,ఇంతలో తలుపు దబ దబ కొడుతున్నట్లు శబ్దంఉలిక్కి పడి లేచాడు,సమయం ఉదయం 7.30 గం;లు అయ్యింది,అన్నయ్యలు ఇద్దరు తలుపు తీయగాఎదురుగా ఉన్నారు,బాగా నిద్రపోయావా అని అడిగిన అన్నయ్య ప్రశ్నకు తలూపాడు కాని మనసులో ఉన్న ప్రశ్నలకు అతనికి సమాదానం లేదు. ముగ్గురు ఫ్రెష్ అయ్యారు,తనకు రాత్రి జరిగిన అనుభవం అన్నయ్య లు చెపుదామనుకుని వద్దులే,వచ్చిన రోజే ఇలా వారికి చెప్పి వారి మనసులో పిరికి వాడి లా ముద్ర ఎందుకు ఈ రోజు అలాగేజరిగితే అప్పుడు చెపుదాం లే అంటూ మౌనంగా ఉన్నాడు,ఇంతలో రమేష్ అన్నయ్య టిఫిన్ రెడీ చేసాడు,ముగ్గురు కలసి తింటుండగా శ్రీకాంత్ అన్నయ్య అరేయి రవి రేపు నీ రెజ్యూం మా కంపెనీ మరియు ఇంకోకంపెనీలో ఇద్దాం ఈ రోజు వద్దులే ఈ రోజు అమవాస్య కదా అందుకే రేపు ఇద్దాం లే అన్నాడు,దానికి సరే అని సమాధానం పలికిన రవి ఇంకా ఏదో ఆలోచిస్తునే ఉన్నాడు,దానికి రమేష్ అన్నయ్య్యా ఏంటిరాఆలోచిస్తున్నావు ఎలాగోలా మా పరపతి తో,పరిచయాలతో నీకు ఉద్యోగంఇప్పిస్తాం లే ఆలోచించకు అనగా సరే అని తలూపాడు రవి నిజానికి అతను ఆలోచించేది రాత్రి జరిగిన సంఘటనలు గురించి, ఈ విషయం తెలియని అన్నయ్య లు రవి మాకు నిద్ర వస్తుంది పడుకుంటాం నువ్వు సరదాగా ఏదైనా బుక్ చదువుకో అని బుక్ ఇవ్వబోగా వద్దులే అన్నయ్యా బైక్ తాళం ఇవ్వు ఒక సారి ఊరు చూసివస్తాను అనగా ఇస్తూ శ్రీకాంత్ జాగ్రత్త రా అసలే ఇది బాగా ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ అలవాట్లు ,పద్దతులు వింతగా ఉంటాయి,త్వరగా వచ్చెయి అని చెప్పాడు,అలాగే అంటూ బయటకు వచ్చాడు, డాబా చివరికి వెళ్లి రాత్రి శబ్దం వచ్చిన గది ని పరిశీలించగా అది వంట గది అని అర్ధమయింది,కారణం పొక పైకి వెళ్ళటానికి డాబా పై ఏర్పాటు ఉంది,దానిపై ఒక రాయి పెట్టి ఉంది,రవి ఆ రాయి తొలగించిచూసాడు,వెలుతురు లేదు బాగా చీకటి గా ఉంది,నెమ్మదిగా మెట్లు దిగి రాత్రి ఆ ఆకారం కనిపించిన చెట్టు దగ్గర పరిశీలించసాగాడు,అక్కడ ఏమి అనుమానస్పద వస్తువులు కూడా లేవునెమ్మదిగా శబ్దం వచ్చిన గది వైపు కు వెనుక్కి వెళ్లి పరిశీలించసాగాడు,అక్కడ కింద అంతా దుమ్ము దూళి అక్కడే పగిలిన కొన్ని ఎర్ర రంగు గాజు ముక్కలు, అలాగే ఒక పసుపు రంగు చిరిగిన వస్త్రంఉన్నాయి,చాలా రోజుల నుండి ఊడ్చక పోవటం వలన గాలికి వచ్చి ఉంటాయి అనుకుని బయటకు వచ్చి గేట్ వేసి బైక్ పై ఊర్లోకి బయలు దేరాడు,చాలా చిన్న గ్రామంచదువుకున్నవారు కూడా ఎవరు కనపడటం లేదు,నెమ్మదిగా చూస్తూ బైక్ నడుపుతున్నాడు,ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక్కటే గుడిసె ఉంది,అక్కడ కొంత మంది గుంపు గా స్త్రీలు,పురుషులు చుట్టి మూగి ఉన్నారుఏమిటా ఆ గుంపు అని రవి వెళ్లి అక్కడ చూడగా,నేల పై ఒక స్త్రీ దొర్లుతూ,వింత వింత శబ్దాలు చేస్తూ, విచిత్రంగా ప్రవర్తిసుంది,అంతలో ఆ గుడిసె లో నుండి ఒక సాధువు లా దుస్తులు ధరించిగడ్డంత్తో ఉన్నాడు,వయస్సు 50పైన ఉంటాయి,ఆమె ను లోపలికి తీసుకు రండి అంటూ అక్కడ వారిని హెచ్చరించగా కొందరు ఆమె ను పట్టుకుని గదిలోకి తీసుకెళ్లారు,రవి ఏంటి ఇది అనుకుంటూ చూడసాగాడు,ఇంతలో భయట నిలబడిన వ్యక్తి ఏం దొరా ఎక్కడి నుండి వచ్చినావు?ఏమిటి సమస్య అని రవి ని అడగ్గా ఏం లేదు ఇక్కడ గుంపు గా ఉండటాం చూసి వచ్చాను అనగా ఈ రోజు అమావాస్య చుట్టు పక్కల గ్రామాల వారు గాలి,ధూళి పట్టిన వారికి అయ్యగారు తాయత్తు కట్టి పూజ చేసి వదలగొడతారు,అందుకే ఈ జనం,చూడటానికి పట్నం వాడిలా ఉన్నావు ఇక్కడ అడవుల్లో,ఊరికి చివర గా ఉండే ప్రాంతాల్లో ఆత్మలు ప్రభావం ఎక్కువ,మీ పట్టణం వారికి ఇవన్నీ తెలియదులే అనగా ఒక వేళ రాత్రి నాకు కనిపించింది ఆత్మనేనా అని మనసులో అనుకుని ఈ స్వామి అంత్రం,మంత్రం వలన ఆత్మలు పోతాయా? అని అతన్ని అడగ్గా ఈయన చాలా మహిమ కల్లవాడు,ఇతను ఉండతం వల్ల ఈ గ్రామంలో ఉండగలుగుతున్నాం అని చెప్తుండగా లోపలికి వెళ్లిన స్త్రీ పెద్దగా కేకలు వేస్తూ వింతగా అరుస్తుంది,ఆ సాధువు ఏదో మంత్రాలు బిగ్గరగా చదువుతున్నాడు,ఆశ్చర్యంగా చూస్తున్న రవిని ఇవన్నీ మీకు తెలియదు లే ఎందుకు వచ్చావు ఈ గ్రామం అనగా మా అన్నయ్య లు ఇదే ఊరిలో ఉండి పట్టణంలో ఉద్యోగం చేస్తారని తాను ఉద్యోగ ప్రయత్నం చెయ్యటానికి ఇక్కడ కి వచ్చానని అనగా ఎక్కడ ఉంటున్నారు అనగా దూరం గా ఊరి బయట కొండ దగ్గర చివరి ఇళ్లు గంగారాం వాళ్ళ ఇంటిలో అనగా ఆ ఇంట్లోనా ?అంటూ కళ్ళు పెద్దగా తెరిచాడు అతను,అవును ఆఇంట్లోనే అని రవి బదులివ్వగా సరే జాగ్రత్త అంటూ రవి భుజం మీద చెయ్యు వేస్తూ అతని కళ్లలోకి చూస్తూ, గుడిసెలోకి వెళ్తూ,సరే నువ్వు ఈ ప్రాంతంలో ఎక్కువ సేపు ఉండ కూడదు అసలే యువకుడి వి ఇక వెళ్లు అని ఆ వ్యక్తి లోపలికి వెళ్లాడు,యువకుడి ని కావటానికి,ఇక్కడ ఉండటానికి ఉంటే ప్రమాదానికి సంబందం ఏమిటో అర్ధం కాక వెనుక్కి బయలు దేరాడు రవి,కొంత దూరంలో ఒక చిన్న హోటలు ఉంది అక్కడ ఆగి టీ తాగాడు ,ఊరికి కొత్తగా ఉన్న రవి ని చూసి హోటల్ యజమాని ఎవరు మీరు కొత్తగా కనిపిస్తున్నారు ,ఏ పని మీద వచ్చారు అనగా అంతకు ముందు ఆ గుడిసె దగ్గర చెప్పిన సమాధానం చెప్పగా విన్న అతను ఆ ఇంట్లోనా?అదే రాత్రి వేళలొ పట్నంలో ఉద్యోగం చేసే ఇద్దరు యువకులు ఉంటారు ఆ ఇంట్లోనా? అనగా అవును గంగారాం వారి ఇంట్ళో అని సమాదానం ఇచ్చిన రవి వైపు విచిత్రం గా చూసి జాగ్రత్త అని పలికాడు.
ఎందుకు జాగ్రత్త అనగా ఏం లేదు ఊరి చివర ఇళ్లు,నువ్వే మో ఊరి కి కొత్త అందుకే చెప్తున్నాను అన్నాడు,కాని అతను గంగారాం ఇళ్ళు అనగానే హోటల్ అతని ముఖంలో మార్పు రావటం రవి గమనించాడు రవి. అక్కడ నుండి బయలు దేరి అన్నయ్య లు ఉండే ఇంటికి బయలు దేరాడు,రవి బైక్ స్టార్ట్ చేసి వెళుతుంటే హోటల్ అతను పక్క అతనికి తనకేసి చూపిస్తూ మాట్లాడు కోవటం అర్ధమయిన రవి బైక్ నెమ్మదిగా నడుపుతూ ఇంటికి చేరుకున్నాడు,గేట్ ముందు బైక్ ఆపి ఒకసారి దగ్గర్లో కనిపించే కొండ ప్రాంతాన్ని చూసాడు,పచ్చని దట్టమైన చెట్లు కనిపిస్తున్నాయి,ఒక సారి అటు వెళ్ళి చూద్దామని కాలి నడకన బయలు దేరాడు ,చిన్న కాలి బాట తప్ప చుట్టు పెద్ద పెద్ద చెట్లు ,మధ్యలో అక్కడక్కడ పొలాలు ఆపొలాల్లో పని చేసే కొద్ది మంది కనిపిస్తున్నారు,కొంత దూరం వెళ్లగా నడక దారిలో పెద్ద వాగు ప్రవహిస్తుం ది,దానితో ఆగి దారి ఏమన్నా ఉందా అని చూడసాగాడు,అంతలో అక్కడకి దగ్గర్లో పొలంలో పని చేస్తున్న వ్యక్తి అబ్బాయి,అబ్బాయి అని పిలవగా అతని దగ్గరికి వెళ్లాడు ,ఆ పెద్దాయన రవితో ఇది పెద్ద వా గు,రాత్రి వర్షం పడింది కదా కనుక 4రోజుల దాకా ఈ వాగు దాటలేం ,అవతల పొలాలకు వెళ్లాలన్నా వాగు తగ్గాల్సిందే,మరో దారిలేదు అని చెప్తూ,ఈ ప్రాంతనికి కొత్తలా ఉన్నావు ఏం పని ఇటు వైపు అనగా,తాను గంగారాం వాళ్ల ఇంటి కి నిన్ననే అన్నయ్య ల దగ్గరకు వచ్చానని,ఊరికే అటవీ ప్రాంతం బాగుందని చూడటానికి వచ్చాను అని బదులివ్వగా ఆ పెద్దాయన ఒక రకంగా చూస్తూ అసలే అమావాస్య జాగ్రత్త బిడ్డా అని చెప్పి తన పొలంలోకి వెళ్లాడు,రవి వెనుక్కి తిరిగి అందరు జాగ్రత్త అంటారేమిటి ఊరి చివర ఉండటం వల్లనేమో అనుకుంటూ నడుస్తున్నాడు,అప్పుడు సమయం మిట్ట మధ్యహ్నం 1.30 కావస్తుంది,నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు,అప్పటికే నిద్రలేచిన అన్నయ్య లు రవి కోసం చూస్తున్నారు,ముగ్గురు భోజనం చేసాక,అన్నయ్యా ఈ ఊరిలో అందరు గంగారాం ఇళ్లు అనగా జాగ్రత్త అంటున్నారు ఎందుకు అనగా ఇద్దరు నవ్వి పల్లెటూరు కదా ఊరి బయట కొండలకు దగ్గ రగా ఉండటం వలన మొదట్లో మమ్మల్ని అనేవారు అవన్నీ పట్టించుకోకు పల్లెటూళ్లలో మూడనమ్మకాలు అధికం మనం ఇవన్నీ పట్టించుకోకూడదు అని బదులిచ్చారు,ఈ క్రమంలో రాత్రి 8.30 అయ్యింది,శ్రీకాంత్,రమేష్ అన్నయ్య లు డ్యూటీ కి బయలు దేరారు.
రవి తలుపు వేసి వచ్చి పడుకున్నాడు,బాగానిద్ర పట్టింది,మధ్యలో నిద్రలేచి మగత కళ్లతో ఎదురుగా ఉన్న కిటికివైపు చూసాడు,ఏదో అక్కడ కనిపిస్తుంది,ఎవరు అనుకుని ఉలిక్కి పడి లేచాడు. సమయం చూసుకున్నాడు,రాత్రి 11 గంటలు అవుతుంది,బయటకు వెళ్లి చూద్దామా?వద్దా? అనుకుని ఆలోచిస్తూ చూడ్డానికే నిర్ణయించుకుని తలుపు తీసాడు,బయట వరండాలో లైట్ వేసాడు. కిటికి దగ్గర ఎవరు లేరు,ఇదేంటి మొన్న అంతే ఎవరో కనిపిస్తున్నట్లు ఉంది మరలా మాయం ఏంటి ఈ సంఘటనలు అనుకుంటూ లోపలికి వెళ్లబోయాడు.అంతలో కింద నుంచి గేట్ విరీతంగా కొడుతున్నట్లు శబ్దం ఈ సమయంలో ఎవరు అనుకుంటూ అనుమానంగానే మెట్లు దిగి నెమ్మదిగా నడుస్తున్నాడు,కటిక చీకటి గేట్ కి అతి సమీపానికి వచ్చాడు. గేట్ అవతల ఉన్న ఆకారం చూసి రవి కి రోమాలు నిక్కబొడుచుకుని గుండెకొట్టుకోవటం ఆగిపోయింది.
PART-3తెల్లని చీరె లో జుట్టు విరబోసుకున్నట్లు ఒక స్త్రీ తలుపు గేట్ భయంకరంగా కొడుతుంది,నెమ్మదిగా దైర్యం తెచ్చుకుని ఎవరు నువ్వు అని గట్టిగా అరిచాడు,తల పైకి లేపి రవి కెళ్లి తీక్షణం గా చూసింది ఆ ఆకారం,రవి 4 మెట్లు పై నే ఉండటం వలన ఆమె రూపం సరిగాకనపడటలేదు,దూరం నుంది కుక్కల అరుపులు,ఆ ఆకారం నెమ్మదిగా గేట్ వదిలి కొండ వైపు నడవసాగింది,రవి కి దైర్యం చాలక పైకిపరిగెత్తాడు,విపరీతమైన ఆయాసం,చెమటలు పట్టాయి రూం లోకి వెళ్ళి తలుపులు వేసుకుని మంచి నీళ్లు తాగాడు,తరువాత అసలు ముందు ఆమె ఎవరు మనిషా?దయ్యమా?ఏమయినా సరే కనుక్కోవాలి అనుకుని చెప్పులువేసుకుని సెల్ పోన్ తీసుకుని బయలు మెట్లు దిగి గేట్ తాళం తీసి బయటకు వచ్చాడు,కొండ దారంతా ఇరుకు దారి ఒకేదారి లో వెళ్లాలి కాబట్టి ఇటే వెళ్ళి ఉంటుందని అదే దారిలో సెల్ టార్చ్ తో పరిగెత్తాడు,దూరంగాతెల్లగా ఒక ఆకారం అదే దారిలో వెళ్తూ కనిపిస్తుంది,వడి వడిగా నడుస్తున్నాడు మనసులో ఒక్కటే కోరిక అసలు ఎవరు ఆమె?ఒక వేళ నిజంగా ఆత్మ అయితే అనుకుంటూ ఆ ఆకారం వెళ్లిన కెళ్ళె నడవసాగాగాడు,ఆ ఆకారం ఇప్పుడు కనపడటం లేదు,అలా నడుస్తూ దాదాపు అంతకు ముందు చూసిన వాగు దాకా వచ్చాడు,వాగు ఉధృతంగా పారుతుంది.ఇక అటు దారి లేదు మరి ఎటు వెళ్లింది?అనుకుంటూ పొలాల లోకిఏమన్నా పోయిందా అనుకుంటూ దారికి ఇరువైపులా సెల్ కాంతి వేస్తూ నడవసాగాడు,కొద్ది దూరంలొ దారిలో ఒక చెట్టు కింద తెల్లగా ఏదో కదులుతుంది,రవికి అంత చలిలో చెమట పడుతుంది ,ఆ ఆకారం అక్కడి నుండి కద కదలటంలేదు,నెమ్మదిగా నడుస్తూ దగ్గరకు చేరుకున్నాడు,రవి దగ్గరకురాగానే సెల్ పోన్ కాంతిలో దాన్ని చూసి అమ్మయ్య అనుకున్నాడు అది ఒక తెల్లని బియ్యపు తగరపు గోతం,గాలికి పొలాలలో నుండి కొత్తుకు వచ్చి రోడ్డు పక్కన ఒక చెట్టు ముళ్ల కు చుట్టుకుని తెల్లగా చీకట్లో కదులుతుంది,ఊపిరి పీల్చుకుని రవి ముందుకు నడుస్తున్నాడు,కొద్ది దూరం రాగానే వెనుక నుంచి భుజం పై చెయ్యిపడింది.
రవి కంగారు గా పెద్దగా కేక పెట్టి వెనుక్కి తిరిగి చూసాడు,గొంగళి కప్పుకుని తలపాగా ధరించి ఉన్న ఒక వ్యక్తి ఎవరు బాబు నువ్వు ఈ సమయంలో తిరుగుతున్నావు అని అడిగాడు. సెల్ వెలుగులో అతని ముఖం చూసిన రవి ముందు నువ్వు ఎవరు ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావు చెప్పు అని గట్టిగా అడగ్గా,ఊరికి కొత్తలా ఉన్నావు ఉన్న ఊరి వాడినే బెదిరిస్తున్నావే అనుకుంటూ అయిపోయిందా రా రంగా అంటూపెద్దగా కేక వేయగా,అయిపోయింధి వస్తున్నా అయ్యా అంటూ రగ్గు కప్పుకుని ఒక యువకుడు చెట్లలో నుంచి బయటకు వచ్చాడు,వారిద్దరి ని చూసి కంగారు పడిరవి అసలు ఎవరు మీరు ఈ సమయంలో ఏం చేస్తున్నారు అని అడగ్గా ,ఆపెద్దాయన బిడ్డా ఇది నా పొలమే నిన్న అత్యవసరంగా ఊరు వెళ్లాల్సి వచ్చి పొలంలో ఉన్న మిరప పై పట్టలు కప్పలేదు,రాత్రి వర్షం వచ్చితడిచాయి,ఊరి నుండి 9 గంటలకే వచ్చాము,ఈ రోజు వర్షం పడేలా ఉంటే వాటి పై పట్టలు కప్పుదామని నా బిడ్ద రంగా,నేను వచ్చాము ఆ పని ఇప్పటి దాకా పట్టింది,సాదారణం గా రాత్రి వేళలో ఈ ప్రాంతానికి ఈ మధ్యఎవరు రావటం లేదు అనగా ఎందుకు అని ప్రశ్నించిన రవితో ముందు నువ్వు ఎవరో చెప్పు అంటూ రంగా గట్టిగా అడిగాడు,రవి తను ఊరు ఎందుకు వచ్చింది అలాగే ఒక ఆకారాన్ని తరుముతూ ఈ ప్రాంతానికి వచ్చాను అనగాతండ్రి కొడుకులు ఇద్దరు ముఖాలు చూసుకుని సరే పదా వెళ్తూ మాట్లాడు కుందాం అని ముగ్గురు నడవసాగిరి,తాతా అసలు ఆ ఆకారం ఎవరు ఎందుకు మా గేట్ కదిలించి మాయమయింది అని అడగ్గాబిడ్దా అవన్నీ నాకు తెలీదు మీరు అర్జెంట్ గా మీ అన్నయ్య లతో మాట్లాడి ఆ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపొండి అనగా ఎందుకు తాతా అనగా దానికి తాత కొడుకు రంగా ఇప్పుడు అవన్నీ ఎంధుకురేపు మధ్యహ్నం మా పొలం దగ్గరకి రా మాట్లాడుకుందాం అసలే ఈ రోజు అమావాస్య అర్ధరాత్రి అయ్యింది,ఇప్పుడు అవన్నీ ఎందుకులే అనగా సరే అని పలికాడు రవి అంతలో రవి ఉండే ఇళ్లు సమీపించింది, రంగా ఇక నువ్వు వెళ్లు అన్నాడు,మీరు అటే కదా ఊర్లోకి పోయేది అనగా రాత్రి వేళ 9 దాటితే ఆ ఇంటి వైపు రావటం ఊర్లో అందరు మానుకున్నారు అదిగో ఎదురుగా కనిపించే ఆ దారి గుండా వెళ్తాం ఆ దారిదూరమయినా అటే చుట్టు తిరిగి వెళ్తాం అని జాగ్రత్త బిడ్డా అని పెద్దాయన అంటూ ఎదురుగా కనిపించే మరో మార్గం గుండా కొడుకుతో కలసి నడుస్తూ వెళ్లాడు,సమయం దాదాపు రాత్రి 1.30 అవుతుంది. నెమ్మదిగా ఇంటికి చేరుకున్నాడు,ఆలోచిస్తూ పడుకున్నాడు ఎందుకు అందరుఈ ఇళ్లు పేరు చెప్పగానే భయపడుతున్నారు,ఈ విషయం అన్నయ్య లకు ఎవరు చెప్పలేదా? చెప్పినా రాత్రి వేళ ఉండరని పెద్దగాపట్టించుకోలేదా?నాకు కనిపించిన ఆకారం ఎవరు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు,అసలు నిద్రపట్టటం లేదు.ఈ క్రమంలో తెల్లారింది అన్నయ్య లు వచ్చారు ,ముగ్గురు ఫ్రెష్ అయ్యి బైక్ పై పట్టణానికివెళ్లి రవి రెజ్యూం అన్నయ్య ఆఫీసు లో ఒకటి ఇచ్చి వాళ్ల మేనేజర్ కి పరిచయం చేసారు ఆయన చూద్దాం లే ఇంటర్యూ వచ్చినప్పుడు కలవమను అని ఆన్నాడు.పట్టణంలోనే మరో కంపెనీ లో రెజ్యూం ఇచ్చిముగ్గురు రూం కి చేరుకుని భోజనం ముగించారు,అన్నయ్య లకు రాత్రి డ్యూటీ ఉండటం వల్ల ఇద్దరు కాసేపు నిద్ర కు ఉపక్రమిస్తుండగా వారితో రవి అన్నయ్య ఊరిలోకి వెళ్లి వస్తాను అని చెప్పి బయలు దేరాడు, వడి వడి గా నడుస్తూ రంగా పొలం వైపు నడవసాగాడు,అతనికి ఆ ఇంటి రహస్యం ఏమిటోఆందోళన గా ఉంది,రంగా పొలానికి చేరుకున్న రవి రంగా దూరంలో పని చేస్తు కనిపించాడు,రవి ని చూసి నవ్వుతూ వచ్చి అక్కడ చెట్టు కింద కూర్చోమని చెప్పి చేతులు కాళ్లు కడుక్కుని వచ్చి తను రవిపక్కన కూర్చున్నాడు, మీ నాన్న రాలేదా అని అడగ్గా ఆయన ఈ రోజు పట్టణానికి ఎరువులు కొంటానికి వెళ్లాడని రంగా తెలిపాడు,అసలు నేను ఉండే ఇంట్లో ఏముంది?నాకు కనిపించిన ఆమె ఎవరు? దయచేసిచెప్పు రంగా అని రవి అడగ్గా ఖచ్చితంగా చెపుతాను,నిన్ను మీ అన్నయ్య లను రక్షించటానికి అయినా చెప్తాను అంటూ చెప్పసాగాడు,మీరు ఉన్న ఇంట్లో గంగారం ఉండే వాడు,ఆయనకు ఈ ఊర్లో 20 ఎకరాలదాకా భూమి ఉంది,పరమ పిసినారి పిల్లికి కూడా బిక్షం పెట్టడు అతనికి ఒక కూతురు, ఒక కొడుకు కూతురు పెద్దది పదవతరగతి చదివించి పెళ్లి చేసాడు,ఒక్కడే కొడుకు కావటం తో కొడుకుని బాగానే చదివించాడు,అతనికి బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది,అంతా ఆస్తి ఉన్నా అప్పటి దాకా చిన్న ఇంట్లో నే ఉండేవాడు,కొడుక్కి ఉద్యోగం వచ్చిందని ఇక్కడ కి దగ్గర గా ఉండే ముత్యాల గడ్డ గ్రామంలో బాగా ధనవంతుల సంబందం తన కొడుక్కి చూసి లక్షల కట్నం తీసుకుని ఆ కట్నంతో మంచి మంచి ఇళ్లు కట్టి వచ్చే కోడలి పేరునే అది పెడతానని 20 లక్షలదాకా కట్నం తీసుకుని ఊరికి చివర అప్పట్లో తాత లు ఇచ్చిన కొంత భూమి ఉండటం వలన ఇప్పుడు మీరు ఉన్న ఇళ్లు కట్టించాడు చిన్న పల్లెటూరు అయినా పట్నంలో లాగా ఇళ్లు బాగా కట్టించాడు,మరలా ఇంటికి డబ్బు సరిపోదని వాళ్ల వియ్యంకుడి దగ్గర మరలా కొంత సొమ్ము తీసుకుని ఇప్పుడు మీరు ఉండే పై పోర్షన్ కట్టించాడు, వారి కోడలు పెద్దగా చదువుకోకున్నా చాలా మంచి అమ్మాయి,మెదట్లో నెల బాగానే చూసారు,తరువాత మరలా తమకు కొంత సొమ్ము అవసరమని ఆమెను గంగారాం అతని భార్య వేదించేవారు,కోడలి పేరున పెడతామన్న ఇళ్లు గంగారాం తన పేరు మీద రిజిష్టర్ చేయించుకున్నాడు,తన పేరు పై పెడతామని కట్టించిన ఆ ఇళ్లు అంటే ఆయన కోడలు రాధిక కు ఎంతో ఇష్టం,ఆ ఇంటిని ఎప్పుడు అద్దంగా తుడిచి శుబ్రంగా ఉంచుకొనేది,ఆమె పేర ఇంటిని పెట్టకున్నా ఆమె పెద్దగా భాధపడాలేదు,తన మామయ్య కదా అని సర్దుకు పోయింది,రాధిక భర్త జయరాం బ్యాంక్ కి ఈ గ్రామం నుండే వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవాడు,అత్త,మామలు పెట్టె భాదలు అటు కన్న తల్లి తండ్రులకు లేదా భర్తకు చెప్పుకోలేక నలిగిపోయేది, ఇలా ఉండగా రాధిక వాళ్ల పుట్టింటి నుండి మరి కొంత సొమ్ము తెస్తే ఊర్లో ఒక 10 ఎకరాలు కొనాలని ఆమెను రోజు గంగారాం ఇబ్బంది పెట్టసాగాడు

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ