11-07-2023, 09:56 AM
నాగ సాధువులు
- Krishna
“ జీవితంలో కొన్ని సంఘటనలు, పరిచయాలు అనుకోకుండా జరుగుతాయ్ కొందరు విచిత్రమైన వ్యక్తులు తారస పడతారు. వాళ్ళగురించి తెలుసుకోవాలని నాకు అనిపించిన ఆసక్తి, ఆదారిలో జరిగిన వాస్తవసంఘటనల సమాహారం ఈ నాగసాధువులు ”
రాళ్ళలోను రాతిశిల్పాలలోను నేను దైవాన్నివెతకను ఆ గొప్పశక్తి నాలోనే ఉంది అని అనుకుంటాను కేవలం మంత్ర,యంత్రాల వల్ల విగ్రహాలకి లేదా రాళ్ళకి శక్తిని కలిగించవచ్చు అలా చేసే మనిషే గొప్పవాడు అతనిలో ఉండేదే దైవం -అభిప్రాయం
నీలోని ఇష్టాన్ని వెతుకు దేనిమీదో నీకు తరగనిప్రేమ ఉంటుంది దాన్ని లక్ష్యంగా పెట్టుకో అదే నీ జీవితం, అందులో జయాపజయాలకు తావులేదు అందులో పరిపూర్ణత సాధించు - గురువుగారి వాక్యం
దేవదూతలని, శివప్రమథ గణాలలో ఒకరని, కాశీలో సగం కాలినశవాలని లేదా శవాలని ఆహారంగా తింటారని చెప్తుంటారు. కానీ నేను వారిదేదో ప్రత్యేకమైన జీవన విధానమని పరిశోధించాను Googleలో వీళ్ళకు సంబంధించిన ఆర్టికల్స్, డాక్యుమెంటరీస్ చూశాను, చదివాను. వాటన్నింటికన్నా నాకు ఎక్కువ సమాచారం లభించింది అధర్వవేదంలోనే, అందులో వీళ్ళ ప్రస్తావన జీవన విధానం ఉంది నాపరిశోధనలో తెలిసిన కొన్ని నిజాలు నాగ సాధువుల గురించి
. శివ ప్రమథగణాల్లో ఒకరు
. అఘోరాలకన్నా ప్రమాదకరమైన వాళ్ళు మనుషులను చంపి తింటారు లేదా బలిస్తారు
. ఎన్నో రకాల తా౦త్రిక విద్యలు వీళ్ళకు జన్మతః వస్తాయి
. వజ్రోలి సిద్ధిని పొందడం వీళ్ళు ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుంటారు
. ఎన్నో వైద్య ప్రక్రియలు,చికిత్సల జ్ఞానం ఇప్పటికి వీళ్ళకి ఉంది ఒక తరం తరవాత ఇంకో తరం ఎలా వస్తుందనే విషయం స్పష్టంగా లేదు
. వాళ్ళకి వాళ్ళు నాగరికత లేని వాళ్ళుగా చెప్పుకుంటారు
జూలై 31
వాళ్ళని మొదటిసారి మా college లో చూసినప్పుడు పసుపు రంగు పంచె కండువా, మూడునామాల విభూది తైలసంస్కారం లేని మఱ్ఱిచెట్టు ఊడల్లగా ఉన్న జుట్టుతో నల్లగా సన్నగా ఉన్నారు. మొదట ఇలాంటి వాళ్ళని దక్షిణ భారతదేశం లో వివిధ ఆలయాల బయట, రోడ్ల మీద చూశాను కానీ డబ్బుకోసం బాబాజిలమని నామమాత్రంగా చెప్పుకునేందుకు మాత్రమే ఆ వేషం అని తెలిసింది.
రెండవసారి చూసింది
మా campusలో boys’hostel కి వెళ్ళాలంటే ముందు girls’ hostel దాటాలి సరిగ్గా అక్కడ ఎవరో అమ్మాయితొ మాట్లాడుతుంటే చూశాను వాళ్ళకి ఈ అమ్మాయితొ ఏం పని? అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడరు పెద్ద అవసరం వస్తే తప్ప పైగా ఆ అమ్మాయి కొంచం ఏడుస్తున్నట్లు కనబడింది.
మూడవ సారి చూసింది
August-14 మరుసటి రోజు స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి అంతా చాలా సందడిగా ఉంది నేను స్నేహితులతో కలిసి తేనీటి విందుకు బయటకోచ్చాను అప్పుడు చూశాను ఎక్కడికో వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఇక అక్కడినుంచి వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత...............
ఎవరైన కొత్త లేదా విచిత్రమైన వ్యక్తులు కనబడితే వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళతో పరిచయం పెంచుకోవాలన్న ఆసక్తి నన్ను వాళ్ళగురించి గురించి తెలసుకోనేలా చేసింది మాతో పాటే చదువుతున్నా వాళ్ళు మాతో hostel లో ఉండటం లేదు. ఒకరోజు నేనే వెళ్లి వాళ్ళని పరిచయం చేసుకున్నాను చాల సేపు మాట్లాడినా కూడా వాళ్ళు కొద్దిగానే మాట్లాడటం నాకు కొంచం వింతగా అనిపించింది ఆరోజు వాళ్ళు మాట్లాడిన అమ్మాయిని పరిచయం చేసుకున్నాను.....
ఆమె పేరు లతిక ఆమె కి నేను తెలుసు
నేను మీకు ముందే తెలుసా ?
లతిక: temple Archaeology departmentలో చూశాను మీరు sirతొ మాట్లాడుతున్నారు అప్పుడు నేను పక్కనే ఉన్నాను. అంతకు ముందే ***** paper లో పురాతన ఆలయాల మీద మీరు రాసిన వ్యాసం చదివాను మీ photo కూడా వేసారు కదా
నేను: అలాగా ఇంతకీ మిరే department .....................
లతిక: నేను same department కొత్తగా వచ్చాను
నేను: ఇక్కడే ఉంటున్నారా...........?
లతిక: లేదండి బయట ఉంటున్నా
నేను: ఇంతకుముందు ఎక్కడ చదివారు
ఇంతలోగా
స్వాతి: ఏరా మాకు పరిచయం చేయవా?
నేను: o sorry లతిక గారు వీళ్ళు నా స్నేహితులు తను స్వాతి and.................
స్వాతి: ఆగరా బాబు మేము పరిచయం చేసుకుంటాం
ల..తి..క... కొత్త గా join అయ్యావ్ కదా మా College గురించి తెలుసా ?
లతిక: చాల ఏళ్ల క్రితం నుంచి ఉందని తెలుసు కాని ఇది university కదా
స్వాతి: అదేలే కాకపోతే మేము college అని కూడా అంటామనుకో ఇంతకీ వీడి గురిచి తెలుసా ?
లతిక: తెలుసండి నిన్న India today లో చూశాను
స్వాతి: ముందు అండి అనడం ఆపు మనం ఇపుడు స్నేహితులయ్యాం కదా
లతిక : సరే స్వాతీ
స్వాతి: అది ... మా కాంపస్ కి హీరో, అందగాడు, టాలెంటెడ్, Handsome, వీడు కాదు
నేను: గాలి తీసేసింది సరే ఆపిక class కి time అయ్యింది పద ......
దసరా సంబరాలు
ఎక్కడికో నడచుకుంటూ వెళ్తున్నాను అడవిలాఉంది దూరంనుంచి మంటలువస్తున్న వైపు చూశాను అక్కడ మట్టిదీపాలు పెట్టి ఉన్నాయి ఎవరో ఇద్దరు దిగంబరంగా ఉన్నారు మరోవైపు శవం, మధ్యలో హోమగుండం ఉంది గాలిలో చేతులు తిప్పుతూ వింత హావభావాలతో ఎదో చేస్తున్నారు శవాన్ని ముక్కలు గా నరికి తలని అక్కడున్న బల్లేనికిగుచ్చి హోమంలో కాల్చి తింటున్నారు వారిమొహాలు కూడా ఎక్కడో చూసినట్టు ఉన్నాయి......
వెంటనే మెలకువచ్చింది సమయం 3 గంటలు
ఉదయం నుండి దసర ఉత్సవాలకి సంబంధించిన చాలా పనులతో అలిసిపోయి పడుకున్నాను మంచి నిద్రే పట్టింది కాని చాలా విచిత్రమైన కల అందుకే ఇలా dairy లో రాసుకుంటున్నాను.....................
మరుసటిరోజు సాయంత్రం లతికని కలుసుకున్నాను
నేను: లతిక రోజు నువ్వు మీ స్నేహితులను కలవడానికి వస్తావ్ కదా మరి ఆమధ్య పదిరోజులు రాలేదు ఎందుకని?
తను ఏ కంగారు లేకుండానే relatives ఇంటికి వెళ్ళానని చెప్పింది. తను నిజం చెప్పడంలేదని తన కళ్ళనిబట్టి గ్రహించాను తను నాగసాధువులతో మాట్లాడటం తరవాత నేను పరిచయమవ్వడం తరవాత ఎందుకో తెలియకుండా తను పది రోజులు కనబడక పోవడం జరిగింది నాకప్పటికి తెలియలేదు గాని తను హఠాత్తుగా ఊరు వెళ్ళడానికి కారణం ఏదో ఉంది
ఆరోజు సాయంత్రం నేను నా స్నేహితుడితొ గ్రంథాలయంలో
నాని: అరె బావ ఇది చూడు ఎవరో hostel warden ని ముక్కలుగా నరికి చంపారట కొన్ని భాగాలు మాత్రమే దొరికాయట అని వాడి దగ్గరున్న దిన పత్రిక అందించాడు దినపత్రిక జిల్లా విభాగంలో ఉంది ఆవార్త చిన్నగా రాసారు కాని చాలా పెద్ద హత్య ..................
ఇది జరిగి వారం పైన అవుతోంది
ఒక రోజు సాయంత్రం లతిక నేను కలుసుకున్నాం
లతిక: నీకో విషయంచెప్పాలి కృష్ణ.............. నాకు చాలాకంగారుగా ఉంది నీకు చెప్తేగాని తగ్గదు
నేను: దేని గురించి ..... పరవాలేదు చెప్పు
లతిక: ముందు ఎవరికీ చెప్పనని మాటివ్వు............. అప్పుడే చెప్తా
నేను: సరే ఎవరికీ చెప్పను లే చెప్పు
లతిక: నావల్ల ఓహత్య జరిగిందని నా అనుమానం
నామొహం లో ఏ భావమూ లేకపోయేసరికి తనకి ఆశ్చర్యమేసింది ఐనా తన ధోరణి లో చెప్పుకుంటూ వెళ్తోంది
నన్ను మా చుట్టాలు ఇక్కడ చదివిస్తున్నారు కారణం మా అమ్మ నాన్న చనిపోవడం ....................
మా కుటుంబంలో మేమిద్దరం ఆడపిల్లలం ఒక తమ్ముడు ఉన్నాడు అమ్మ నాన్న ఇద్దరు marine engineers ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు అంతా బానేఉండేది కాని అమ్మకి ఓ విచిత్రమైన జ్వరం వచ్చింది చాలా చిన్నది అనుకున్నాం ఎన్ని నెలలైనా ఎన్ని మందులు వాడిన ఎంత మంది డాక్టర్స్ నీ మార్చిన తగ్గలేదు ఎవరివల్లా కాలేదు దాదాపు సంవత్సరం తరవాత
“ ఆరోజు శుక్రవారం ”
అమ్మ ఆ రోజే కొంచం కుదుటపడింది
నాన్న: అలా తగ్గిన వెంటనే నడవకూడదు పద్మ......
అమ్మ : ఎన్ని రోజులు అదే చీకటి గది లో పడుకోవాలి నావల్ల కాదు.......
నాన్న : సరే అయతే స్నానం చేసి రా గుడికి వెళ్ళోద్దాం
ఎందుకో తెలియదు మేము మాత్రం ఆరోజు అమ్మానాన్నలతో వెళ్ళలేదు మాకు వెళ్ళాలనిపించలేదు అందుకే చెల్లి నేను ఇంట్లోనే ఉంటాం అన్నాను.తమ్ముడినితీసుకెళ్ళారు.
“ వచ్చేటప్పుడు పెద్ద accident అయ్యింది ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు ”
ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కాలేదు..........
మేమెవరకీ చెడు చేయలేదు ..... నాన్న కూడా ఎవరికోకరికి సాయం చేస్తూ ఉండేవారు కానీ...........
పదవరోజు మా వాళ్ళందరూ మమ్మల్ని ఎవరి దగ్గర ఉంచుకోవాలో అని చాలసేపు గొడవ పడుతుంటే వాళ్ళందరికి సర్దిచెప్పి ఇక్కడ hostelలో ఉండి చదువుకుంటామని చెప్పి చెల్లి నేను వచ్చేసాము , నెల నెలా వాళ్ళే డబ్బు పంపుతున్నారు .
అంతటితొ అయిపోయిందనుకున్నాను కానీ కొన్నిరోజులుగా చెల్లికి కళ్ళు కనబడటం మానేసాయి,మాటకూడా పడిపోయింది.నూటికో కోటికో ఒక్కరికి ఇలాంటి వింత జబ్బులోస్తాయని ఎదో కొత్తరోగం పేరు చెప్పి దానికి చికిత్స లేదని వదిలేసారు .
తప్పక వికలాంగుల ఆశ్రమంలో చేర్పించాల్సి వచ్చింది. నేను వెళ్ళిన ప్రతీసారి ఎప్పుడూ తను ఏడుస్తూ ఉండేది ఏదో చెప్పాలని ప్రయత్నించేది నాకు అర్ధం కాక అక్కడ ఆయానడిగాను ఎందుకేడుస్తోందని అప్పుడు ఆమెచెప్పిన సమాధానం నన్ను చాల బాధపెట్టింది అక్కడి warden వాళ్ళందరిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడట అక్కడున్న ఆడపిల్లల అందరిమీద చాలాసార్లు లైంగిక దాడి చేసాడట
అమ్మ,నాన్న చనిపోయినప్పుడు నాకు బాధ్యత తెలిసింది కానీమొదటిసారి ఇది విన్నాక బాధ అంటే ఏంటో తెలిసింది
నీకు తెలుసు కదా రోజు స్వాతిని కలవడానికి వస్తానని ఆరోజు కూడా స్వాతిని కలవడానికే వచ్చాను దారంతా ఎడుస్తూనే ఉన్నాను ఇక నడవలేక ఇక్కడే కిందకూర్చొని కుడా .................ఏడుస్తూనే ఉన్నాను
ఎవరితొ నైనా బాధ చెప్పుకోవాలనిపించింది ఆసమయంలో ..........................
సరిగ్గా అపుడే ఎవరో పిలిచినట్టు అనిపించింది తలెత్తి చూస్తే మెడలో రుద్రక్షల్తో ఎవరో విచిత్రమైన వ్యక్తులు, చూడటానికి క్షుద్ర పూజలు చేసేవాళ్ళల్లాగా ఉన్నారు వాళ్ళు నా సమస్య ఏంటి అనడిగారు నేరుగా,
వెంటనే జరిగిందంతా చెప్పేసాను వాళ్ళు వెళ్తూ నీవ్యధను విడిచిపెట్టు నేటి నుండి నీసోదరికి ఆమె స్నేహితులకు విముక్తి కల్పిస్తున్నాం అన్నారు అప్పటికి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు తరవాత ఆ hostel warden మీద complaint ఇవ్వడానికి వెళ్తే ....
ఎవరో అతనిని ముక్కలుగా నరికి dumping yard లో పడేసారట కొన్ని శరీర భాగాలు దొరకలేదట ...................... నాకెందుకో వాళ్ళే చేసుంటారని అనుమానం చాలా భయంగా ఉంది
నేను: వాళ్ళే చేశారని ఖచ్చితంగా చెప్పలేం అయినా నువ్వు దీనిగురించి ఆలోచించకు ......నేను చూసుకుంటాను ....... నువ్వు పేపర్ చదవవు కదా
లతిక: లేదు ఏ?
నేను: ఏంలేదు ......... చదవకు మంచిఅలవాటు
ఆదివారం
(శని,ఆదివారాల్లో మా స్నేహితులంతా camp-fire ఏర్పాటు చేసుకుంటాం )
మోహన్: ఏరా ఎప్పుడూ ఏదోటి ఆలోచిస్తూంటావా? కనీసం ఇపుడైన ఇక్కడుండ రా
నేను: నేనిక్కడే ఉన్నారా..................... ఎక్కడికీ వెళ్ళలేదు
స్వాతి: ఈ మధ్య లతికతో ఎక్కువగా కబడుతున్నావేంట్రా నిన్న నరేష్ గాడు కూడా నాతో అన్నాడు
నేను: అదేంలేదు మామూలుగానే కలిశాను ఏదో ఒక్కసారికలిసినప్పుడు వాడు చూసుంటాడు అప్పుడే నువ్వుకూడా చూసుంటావ్
స్వాతి: పరవాలేదు ఏదైనా ఉంటె మాతో చెప్పచ్చు
నేను: ఏంటి చెప్పేది అయినా నాలక్ష్యం ఏంటో తెలుసు కదా
స్వాతి: తెలుసు రా నాయన కానీ ఒక వేళ మనసు మార్చుకుంటే ..............
నేను: మారదు అసలు జీవితం లో లక్ష్యం అంటే........
తేజ: నాయన స్వామి ఆపు ఇంక............. సరదాగా మాట్లాడుకోడానికి వచ్చాం
మీ ప్రవచనానికికాదు ..............................
అందరూ వాళ్ళ సంభాషణల్లో మునిగిపోయారు కానీ నేనుమాత్రం దాని గురించి మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను
feb 14
మా కాలేజీ లో ఈరోజు ప్రేమ పావురాలు వదులుతాం ప్రేమ అనేది కేవలం ఇద్దరికే పరిమితం కాకూడదు విశ్వమంతటి ప్రేమ...................... ప్రతిఒక్కరికి ప్రతిఒక్కరి మీద ఉండాలని ప్రేమించాలని సమావేశాలు నిర్వహిస్తాం విచిత్రం అక్కడికి నాగ సాధువులుకూడా వచ్చారు.........
తరవాతి రోజు వార్షికోత్సవం జరగాల్సిఉంది
ఉదయం 8 గంటలు girls-hostel ముందు 108 ఆగుంది ఏం జరిగిందా కిందకి వెళ్లాను అప్పుడే ఒకమ్మాయి శవాన్ని లోపలకెక్కిస్తున్నారు ఎవరా అని చూస్తే చిత్ర........
warden - madam security officer లతో మాట్లాడుతున్నారు........
నేను: స్వాతి ఇంట్లో వాళ్ళకు inform చేశారా? స్వాతి: లేదురా ఇంకా చెప్పలేదు తన roommates కి చెప్పాను వాళ్ళక్కడ ఏడుస్తూ నుంచున్నారు........
నేను: మధు ఇలారా చిత్ర వాళ్ళ ఇంటి phone-number చెప్పు.............. అనడిగి నేనే చేయాల్సివచ్చింది
అన్నికార్యక్రమాలు పూర్తైనతరవాత సాయంత్రం అందరం కాంటీన్ లో కూర్చున్నాం
స్వాతి: చాలాబాధగా ఉందిరా..... మంచి అమ్మాయి ఎవరోతోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు
నేను : ఇంతకీ ఎలా చనిపోయింది ?
స్వాతి : ఏమోరా ....... autopsy చేయనివ్వలేదు report మాత్రం ఆత్మహత్య అని రాసుకున్నారు
నేను : ఎందుకని? అనే ప్రశ్నతొ రాయడం ఆపేసాను
తరవాతి రోజు
వార్షికోత్సవం రద్దుచేసారు నేను నా roomలో కూర్చొని ఆమె గురించే ఆలోచిస్తున్నాను ఒకే ఒక్కసారి కలిసింది తను
తను కలిసిన రోజు జరిగిందంతా రాసుకుంటున్నాను
లతిక: ఎప్పుడూ ఎదోక subject గురించి మాట్లాడకపొతే కొంచం కొత్తగా వేరెఏదైనా మాట్లాడచ్చు కదా
నేను: కొత్తగా అంటే నువ్వే ఏదైనా ఉంటే చెప్పు నేను వింటాను మరీ ఉపన్యాసం ఇస్తున్నట్లు మాట్లాడుతున్నానా?
లతిక: అబ్బ...... చాలా తొందరగా తెలుసుకున్నారు స్వామి తమరు .. టైం చూసుకొని
సరే నాకు నా class కి time అయింది వెళ్ళొస్తా .. నేను: సరే
అప్పుడోచ్చింది తను ఎవరో తెల్సున్న వాళ్ళలాగా పక్కనే కూర్చుంది
చిత్ర: అమ్మాయిలు ఏది నేరుగా చెప్పరబ్బాయి……
మీరే తెలుసుకోవాలి “తను నిన్ను ప్రేమిస్తోంది”
నేను: అవునా ....... అంత సరిగ్గా ఎలా చెప్పగలవ్?
చిత్ర: నీతో మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళలో ఓ వెలుగు కనబడిందిఒకప్పుడు యుద్ధాలు స్వయంవరాలు జరిగేవి స్త్రీని గెలుచుకోవాలంటేకానీ ఈ కాలంలో మాటలతోనే సరిపోతుంది నచ్చేవిధంగా మాట్లాడి నమ్మకంగా ఉంటే ఎవ్వరైనా పడిపోతారు నిన్ను చాలారోజుల నుండి గమనిస్తున్నాను ఎప్పడూ నువ్వు అలాగే మాట్లాడతావ్ ఎదో ఉపన్యాసం ఇస్తున్నట్టు
నేను: అలాగా.... ఇంతకీ నీ పేరేంటి
చిత్ర: sorry నాకు ఈ పరిచయాలు అంతగా నచ్చవ్ అయినా నీకెందుకో చెప్పాలనిపిస్తోంది సుచిత్రవందన నా పేరు
నేను: సుచిత్ర వందన ..... చాల విచిత్రంగా ఉంది నీపేరు కానీ నువ్వు చాలా బాగున్నావ్
చిత్ర: thanks ఇదేమాట తనకి రోజు కాకపోయిన అప్పుడప్పుడైనా చెప్పు తకు మించి నువ్వేం చేయక్కర్లేదు
నేను :ఆరోజు వెనక్కి తిరిగి నవ్వుతూ చూసింది తను నేను కలిసింది అదే మొదటిసారి చివరిసారి కూడా చాలా ధైర్యంగా మాట్లాడింది అలాంటిది తను ఆత్మహత్య చేసుకుందంటే..........
“ రోజులన్నీ మామూలుగానే గడిచిపోతున్నాయ్ .నేనేప్పటిలాగే నాపనుల్లో మునిగి పోయాను ”
ఒకరోజు
మనోజ్ phoneలో నాకు అవసరమైన సమాచారాన్ని తీసుకుంటున్నాను సమయం నాలుగు గంటల పదిహేను నిమిషాలు బయట వాతావరణం చల్లగా ఉంది వర్షానికి సూచనగా ఆకాశం మేఘాలతో నిండి ఉంది కేవలం సినిమాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతయనుకుంటా కానీ నాకు నిజ జీవితంలో జరిగింది . మనోజ్ phoneలో photosచూస్తున్నా అందులో ....... చిత్ర శవాన్ని photo తీసి ఉంది శవాన్ని ఫోటో ఎందుకు తీసావ్ రా అని కోప్పడుతూ దాన్ని delete చేయబోయి ఎదో గుర్తుకోచ్చి photo zoom చేశాను చిత్ర నడుము కింద భాగంలో రక్తపు మరక కనబడింది. సరిగ్గా అదేసమయంలో బయట ఉరుములతో వర్షం ప్రారంభం అయ్యింది చాలా సేపు దాన్ని గమనించాను.నా phone లోకి తీసుకుని దాన్ని స్వాతికి చూపించాను. దాన్ని చూసి
స్వాతి : ఏమై ఉంటుంది రా?
నేను : ఏమో తెలియదు కానీ నేను వెంటనే చిత్ర ఉన్న చోటుని సోదా చేయాలి
వెంటనే warden అనుమతి తీసుకున్నాను మొదట ఒప్పుకోలేదు అందుకే ఆ photo ని ఆమె కి కూడా చూపించక తప్పలేదు. అంతకు మించి ఆమె ఏమి అడగలేదు కారణం నా గురించి బాగా తెలియడం వల్ల
నేను: స్వాతి నువ్వు చిత్రతొ పాటు ఉన్నవాళ్ళని తీసుకురా వాళ్లతో మాట్లాడాలి
స్వాతి :సరే
warden madam నావెంటే ఉన్నారు తన గది మొత్తం వెతికాను తన bed, table, తను వాడిన అలమర అన్నీ ఏమీదొరకలేదు తనకి సంబంధించినవన్నీ వాళ్ళ వాళ్లు తీసుకెళ్ళి పోయారు ఏమీ దొరకలేదని వెనుదిరుగుతుంటే తన అలమర పైన ఖాళీస్థలం ఉంది అప్రయత్నంగా దాని వైపు చూశాను అక్కడ ఏమైనా ఉండచ్చేమోనని పక్కనే ఉన్న చిపురుతో తుడిచాను కాస్త దుమ్ముతో పాటు నలిపి పడేసిన కాగితం దొరికింది అదొక medicine bill వెంటనే దాని మీదున్న phone numberకి చేసాను ఎవరూ ఎత్తలేదు దాని మీదున్న చిరునామా పట్టుకుని వెళ్ళాను మూసేసి ఉంది కానీ అక్కడ 24గంటలు అత్యవసర సేవ అని వేరే phone number ఉంది దానికిచేస్తే shop అతను ఊర్లో లేడని తెలిసింది తరవాతి రోజు వెళ్ళాను
నేను:ఈ bill మీ shopదే కదా అతను:
అవును sir చెప్పండి
నేను: ఈ medicine ఎవరు తీసుకున్నారో కొంచం chek చేస్తారా
అతను : ఒక్కనిమిషం sir .............. bill చిత్ర అనే అమ్మాయి పేరుమీద ఉంది కానీ వివరాలు ఏమి లేవు ఇంతకీ మీరు........................
నేను: చెప్తాగాని కొంచం మందులు దేనికి సంబంధించినవో చెప్తారా
వెంటనే నాకు సమాధానం రాలేదు................................ నేనెవరినో ఎందుకోచ్చానో చెప్పేదాకా
అతను: ఈ medicine సంబంధించిన వివరాలు పూర్తిగా లేవుకాని........ ఇవి చాల costly and rare medicineమనదేశంలో తయారవ్వవు నాకు తెలిసినదాన్ని బట్టి ఇవి జీర్ణాశయానికి లేదా పేగులకి సంబంధిచిన cancer వస్తే వాడేవి అని ఖచ్చితంగా చెప్పగలను
నేను : thank you ....
స్వాతి: అంటే చిత్ర cancer వల్లే bleeding అయిచనిపోయిందంటావా
నేను: అలా అని ఖచ్చితంగా చెప్పలేను ..... bleeding అయిఉంటే మొత్తం అంతా రక్తపు మరకలుండాలి కానీ చాల చిన్నది ఉంది అదికూడా జగ్రత్తగా గమనిస్తేనే తెలుస్తుంది స్వాతి:ఐతే ఎంజరిగుంటుంది?
నేను: దాని గురించే చిత్ర roommatesని తీసుకురమ్మన్నాను.
స్వాతి: తీసుకురమ్మన్నావ్ తీరా తీసుకోచ్చేసరికి వెళ్లిపోయావ్
నేను: దీనిగురించే వెళ్ళాను ఇప్పుడు రమ్మను వాళ్ళని కాసేపటికి స్వాతి వాళ్ళని తీసుకోచ్చింది వాళ్ళు చిత్రగురించి ఏదిసరిగ్గా చెప్పలేదు ఏదో చెప్పి తప్పించుకున్నారు వాళ్ళు దేనీకో భయపడుతున్నారు అనిపించింది అందుకే స్వాతికి ఈ విషయం చెప్పి వాళ్ళకి కొంచం counselling ఇవ్వమన్నాను...................

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ