Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆత్మఘోష
#1
ఆత్మఘోష
                   -  Yasaswi Rachana
 
"అగ్ని...ఒక సందర్భంలో నూరేళ్ళ కాపురం కి సాక్ష్యం అవుతుంది...మరొక సందర్భంలో నూరేళ్ళ జీవితం కి ముగింపు అవుతుంది...అగ్ని వల్ల ఒక బంధం ఏర్పడినా లేక ఒక బంధం వేరు పడినా ఆ మార్పు ఈ జన్మకి శాశ్వతం...మనం ఆ మార్పుకి సాక్ష్యం మాత్రమే"
 
ఒక భవనం నిండా మంటలు వ్యాపిస్తున్నాయి.
 
పట్ట పగలే ఆ మంటలు వల్ల వచ్చిన దట్టమైన పొగ ఆకాశంలో సూర్యుడి కాంతిని కప్పేసి...చీకటిని తలపిస్తుంది ఆ భవనం పరిసరాల్లో...జనం లో ప్రాణభయం తప్ప మరో భావం కనపడటం లేదు...అందరూ పొగ పెట్టిన రంధ్రం నుండి ఎలుకలు బయటకు ప్రాణభయం తో ఎలా వస్తాయో అలా బయటకు పరుగులు తీస్తున్నారు...భయానికి తనా మనా తారతమ్యం లేదు...అడ్డు వచ్చిన మనిషిని తోసుకుంటూ, ఎదురు వస్తున్న ఆపద నుండి తమను తాము కాపాడుకోవడం కోసం పెద్ద పెద్ద కేకలు వేస్తూ అటూ ఇటూ వేగంగా పరుగులు తీస్తున్నారు...
అప్పుడు వచ్చింది ఫైర్ ఇంజన్ గంటలు కొట్టుకుంటూ...
అరుపులు అరుస్తూ...చక చక కదిలిన ఫైర్ మెన్ చేతుల మధ్య వాటర్ గన్స్ మెల్లగా అగ్నిని అదుపు చెయ్యడం మొదలు పెట్టాయి....
కానీ అప్పటికే అగ్ని దేవుడు తన ఆకలి తీర్చుకున్నాడు...
మంటలు అదుపు లోకి రావడం వల్ల జనం యొక్క మతులు కూడా అదుపు లోకి వచ్చి తనా మనా అనే భావం మెదిలి రక్త సంబంధాల కోసం శోధన మొదలు పెట్టారు...
అప్పుడే ఫైర్ రెస్క్యూ టీమ్, ప్రొటెక్టివ్ సూట్ వేసుకుని భవనం లోకి వెళ్తున్నారు..
కానీ అందం కోసం సుకుమారమైన ప్లై వుడ్ అధికం గా వాడటం వల్ల లోపల బాగా కాలిపోయి, ఆ శిథిలాలు మీద పడే విధంగా వున్నాయి"
"అప్పుడు ఫైర్ రెస్క్యూ టీమ్ తమ చర్య ను ఆపి వెనుకకి వస్తున్నారు...
కానీ అప్పుడే లోపల నుండి కాపాడండీ కాపాడండీ అని అరుపులు వినిపిస్తున్నాయి...
ఫైర్ రెస్క్యూ టీమ్ కి లోపలకి వెళ్ళటం చాలా ప్రమాదం అని తెలుసు, సో ఎవరూ ముందుకి అడుగు వెయ్యడం లేదు...అప్పుడు ఒక ఫైర్ మెన్ కర్తవ్య నిర్వహణ కోసం ప్రమాదం అని తెలిసినా లోపలకి వెళ్లి ఆమెను బయటకు తీసుకు వస్తున్నాడు....
అప్పుడే సడన్ గా పై నుండి ఒక పెద్ద చెక్క వచ్చి ఆ ఫైర్ మెన్ తలకి తగిలింది...
వెంటనే తను, తాను బయటకు తీసుకు వస్తున్న వ్యక్తి ఇద్దరూ కింద స్పృహ తప్పి పడ్డారు"
"సంఘటన జరిగిన సమయం నుండి సుమారు ఒక ఏడాది తర్వాత హైదరాబాద్ మహా నగరం లో...ఒక బాయిస్ హాస్టల్ లో,
బాలు :- అరేయ్ శ్రీ., మనం ఎంత చక్కగా రూంని సర్ధినా ఒక రోజు లో చూడు ఎలా అయిందో!!
శ్రీ :- అవునురోయ్, ఇప్పుడు మన రూం చూడడానికి నిజంగా బాయ్స్ హాస్టల్ లా వుంది..
బాలు:- అదేంట్రా అలా అంటావు, నీట్ గా వుంటే బాయ్స్ హాస్టల్ కాకుండా గాల్స్ హాస్టల్ అవుతుందా ఎంటి?
శ్రీ:- అవును రా బాబు...మనం ఏమైనా అమ్మాయిలమా అమ్మలమా ఎప్పుడు సర్దుకుంటూ కూర్చోడానికి ...బాయ్స్ హాస్టల్ అంటే ఇలానే వుంటుంది..
బాలు:- అదేం కాదులేరా....మనం కావాలి అనుకుంటే చాలా నీట్ గా రూంని సర్దుకుని రోజు ఇలాగే మైంటేయిన్ చేయచ్చు, అంతే కాని నీట్ గా ఉంచుకోవడం కేవలం అమ్మాయిలకు అండ్ అమ్మ లకి మాత్రమే తెలుసు అనకు..
శ్రీ:- అరేయ్ బాలూ, నేను రోజు చూస్తాను కదా రా, ఇంటి దగ్గర.. అందుకే అనుభవం తో చెప్తున్నా విను...ఇల్లు సర్దాలి అంటే అది కేవలం ఆడవాళ్ళ కి మాత్రమే తెలిసిన ఒక నైపుణ్యం రా అది మనకి ఎంత ప్రయత్నం చేసినా రాదు..
బాలు:- అవునా...!శ్రీ:- హా నీకు ఇంకా నమ్మకం లేకపోతే పక్కనే వున్న గాల్స్ హాస్టల్ కి పోయి చూడు... వాళ్ళ రూమ్స్ అన్నీ ఇంద్ర ధనుస్సు లోని రంగుల్ని నింపుకుని చూడ ముచ్చటగా వుంటాయి.,మరి మనయి మాత్రం ఇంద్ర ధనుస్సు లో లేని నలుపు రంగులో మసి పూసినట్టు వుంటాయి...
బాలు:- సర్లే నా ఉద్దేశం లో మాత్రం మనం అనుకుని నీట్ గా వుంచుకోవాలి గాని,.కేవలం ఆడ మగ అనే తేడా వుండదు..... రా,...శ్రీ..
శ్రీ:- పద పదా టైమ్ అయింది మనం ఆఫీస్ కి వెళ్ళాలి..ఎలాగో ఆఫీస్ లో పని చెయ్యము కదా! అక్కడ మాట్లాడుకుందాం తీరిగ్గా..
"శ్రీ అండ్ బాలు ఆఫీస్ కి వెళ్ళిపోయారు....మెల్లగా సమయం గడిచింది...అనేక కబుర్ల మద్య రూం కి వెళ్ళే టైమ్ అయింది....సరిగ్గా అదే టైమ్ కి శ్రీని బాస్ పిలిచి అర్జెంట్ పని ఒకటి చెప్పి ఈ రోజు కంప్లీట్ చెయ్యాలి అన్నాడు...బాలు చేసేదేం లేక తాను ఒక్కడే మెల్లగా నడుస్తూ బయటకు వచ్చి బస్ ఎక్కాడు... ఎప్పుడూ వర్షం కురవని హైదరబాద్ లో ఆ రోజు జోరు వాన...ట్రాఫిక్ జామ్ తో పాటు ఓ మాదిరిగా పచ్చడి కూడా అయింది...సమయం పదకొండు అయింది హాస్టల్ దగ్గరకు వచ్చేటప్పటికి బాలు కి...బాలు లోపలకి వెళ్తూ పక్కనే వున్న గాల్స్ హాస్టల్ చూసి ఉదయం తాను శ్రీ మాట్లాడుకున్న విషయం గుర్తు వచ్చి..తాను చెప్పిందే కరెక్ట్ అనుకుంటూ ముందుకు నడుస్తున్నాడు"
"ఎంత కరెక్ట్ అయినా ఎదుటి వాళ్ళను ఒప్పించాలి అంటే ఆధారాలు కావాలి కదా...సో హాస్టల్ లోపల రూమ్స్ ఎలా వున్నాయో మనకి ఫోటోస్ కావాలి అనుకున్నాడు...అప్పుడు తన మదిలో ఒక ఆలోచన వచ్చింది...నేనే వెళ్లి ఏ రూం అయితే ఛండాలం గా వుందో ఆ రూం ఫోటో తీసి శ్రీ ని ఒప్పించాలి అనుకున్నాడు బాలు... అనుకున్నదే తడవుగా మెల్లగా హాస్టల్ గోడను వెనుక నుండి దూకి లోపలకి వెళ్ళాడు...ఏదైనా ఒక రూం లోపలకి వెళ్ళాలి అని మెల్లగా ముందుకు వెళ్తున్నాడు...అంతలోకి ఎవరో ఒక అమ్మాయి హాస్టల్ భవనం మీద నుండి ఏడుస్తూ కిందకు దూకాలి అనుకుంటూ వుంది...అది చూసిన బాలు ఒక్కసారిగా వేగంగా మూడో ఫ్లోర్ కి వెళ్ళాడు....ఆమెను కాపాడాలి అని"
బాలు :- హెల్లొ మీరు ఎలాగో చావాలి అనుకుంటున్నారు కదా..! మీరు ఎందుకు చావాలి అనుకుంటున్నారో నాకు చెప్పి చచ్చిపొండి...ఒకవేళ అవసరం అయితే నేనే మీరు కారణం చెప్పిన తర్వాత మిమ్మల్ని కిందకి తోసేస్తాను...
అమ్మాయి :- ఒకరి చావు మీకు ఆటలు గా వుంది అంటేనే అర్దం అవుతుంది...మీరు ఎలాంటి వారు అనేది
బాలు :- అవునా ఇంకా ఏం అర్దం అయింది...నాకు మాత్రం ఒకటే అర్దం అయింది...మీరు
అమ్మాయి:- హా నేను
బాలు :- పిరికి వాళ్ళు అని...ధైర్యం లేని వాళ్ళు అని..హత్య కంటే ఇంకా దారుణం ఆత్మహత్య ....అది మీకు తెలుసా, సమస్య ఏదైనా దానికి ఒక పరిష్కారం వుంటుంది...మీరు దాన్ని కనిపెట్టడం లో ఓడిపోయారు అని తెలుస్తుంది...
అమ్మాయి :- అవును నేను ఓడిపోయాను...దానికి కారణం నేనే...నేను ఒక అమ్మాయిని, ఏం చెయ్యగలను...సహాయం అడిగితే చెయ్యి అందించే నా అనేవాళ్లు లేని ఒక మామూలు అమ్మాయిని..
బాలు:- నేను మీకు ఆ చెయ్యి అందిస్తాను...కానీ మీరు నాకు మీ పూర్తి గతం...అలాగే భవిష్యత్ లో నేను మీకు చెయ్యవలసిన సహాయం చెప్పండి...అప్పుడే నేను మీకు వంద శాతం హెల్ప్ చెయ్యగలను...
అమ్మాయి:- గతం కోసం వెనక్కి వెళితే...ముందు వున్న నా భవిష్యత్ చీకటి అవుతుంది...అలా అని భవిష్యత్ కోసం పరుగు తీస్తే గతం కాలంలో కలసి పోతుంది.
బాలు:- చూడండి, మీరు చెప్పే ఈ మాటలు వినడానికి బావుంటాయి...కానీ నిజ జీవితంలో ఈ మాటల ప్రభావం చాలా తక్కువ కాబట్టి...మీరు నాకు జరిగిన విషయం అన్నా చెప్పండి...లేదా నేను మీకు ఏం సహాయం చెయ్యాలో చెప్పండి...నావల్ల అయితే నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను..
అమ్మాయి:- నా పేరు మౌనిక, ఒక వ్యక్తి దగ్గర నా ఆస్తి పేపర్స్ వున్నాయి...అవి నాకు చాలా అవసరం...నేను వాటి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించాను...కానీ ఒక్కసారి కూడా అనుకున్న విషయం సాధించలేకపొయాను...ఆ పేపర్స్ వుంటేనే నా ఆశయం నెరవేరుతుంది...కానీ అది ఈ జన్మ లో కుదరదు అని అర్దం అయింది...సో తర్వాత జన్మలో అయినా సాధించాలి అని ఈ జన్మలో నేను చనిపోతున్నా...
బాలు:- అయ్యో!! ఇంతేనా మౌనిక గారూ, దీనికి చనిపోతారా...నేను మీకు ఆ పేపర్స్ తీసుకువచ్చి ఇస్తాను...మీరు మీ నిర్ణయం మార్చుకుని మీ రూం లోకి వెళ్లి హాయిగా పడుకోండి.
మౌనిక:- అది కాదు బాలూగారూ, అతను పేరు యశస్వి , చాలా దుర్మార్గుడు...అతని వల్ల మీకు ఏమైనా అయితే...
బాలు:- అవన్నీ నేను చూసుకుంటాను గాని, మీరు అతని అడ్రస్ చెప్పి, లోపలకి వెళ్లి పడుకోండి...అమె అడ్రస్ చెప్పి అక్కడ నుండి తన రూంలోకి వెళ్లిపోయింది.....
బాలు బయటకు వచ్చి హాస్టల్ నుండి, ఒక పని కోసం వెళితే మరో పని తగిలింది...ఇలాంటి విషయాలకు చనిపోవడం ఎందుకు, పోరాడి సాధించుకోవాలి గాని, చచ్చి ఏం సాధిస్తారు అనుకుంటూ తన రూంకి వెళ్ళిపోయాడు...
తర్వాత రోజు ఉదయం,
శ్రీ:- ఏరా బాలూ! ఆఫీస్ కి రావడం లేదా రెడీ అవడం లేదు...
బాలు:- ఈ రోజు ఒక.చిన్న పని వుంది రా, నేను రావడం లేదు లీవ్ కూడా అప్లై చేశానులే... నువ్వు వెళ్లు..
"శ్రీ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు..బాలు మౌనిక ఇచ్చిన అడ్రెస్స్ కోసం వెతుకుతూ వెళ్ళాడు...ఆ ఇల్లు ఒక ఇంద్ర భవనం లాగా వుంది...ఆ ఇంటిని చాలా సేపు పరీక్ష చూడసాగాడు బాలు...అప్పుడు ఆ ఇంటి వెనుక నుండి బయటకు రావడానికి దారి వుంది , అది కూడా స్క్రాప్ బయటకు పంపే దారి, ఇది ఒక్కటే తాను లోపలకి వెళ్ళడానికి ఒక మంచి దారి అనుకున్నాడు..మధ్యాహ్నం అయింది..భవనం నుండి వంట వాడు బయటకు వచ్చి, లంచ్ తర్వాత వచ్చిన వేస్ట్ ను బయట ట్రాష్ బిన్ లో వేస్తున్నాడు...సో ఇదే దారిలో బాలు లోపలకి వెళ్ళాలి అనుకున్నాడు...సాయంత్రం డిన్నర్ టైమ్ వరకు వెయిట్ చేశాడు...వంట వాడు మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి చెత్త పాడేయటానికి ట్రాష్ బిన్ దగ్గరకు వెళ్ళాడు...ఇదే అదును అనుకుని బాలు లోపలకి వెళ్ళిపోయాడు ఆ వంట వాడికి కనిపించకుండా"
"భవనంలో ఎక్కడ చూసినా బాగా ఖరీదు అయిన శిల్పాలు, ఇంకా పెయింటింగ్స్ వున్నాయి...ఇప్పుడు బాలు ఆ ఆస్తి పేపర్స్ ఎక్కడ ఉన్నాయో అని వెతకడం మొదలు పెట్టాడు... అతనికి ఎటు చూసినా ఇల్లు మొత్తం ఒకేలాగా వుంది...ఎన్నో రూం లు తిరిగి వెతికాడు...కానీ అతనికి ఆ పేపర్స్ దొరకలేదు...చివరగా ఒక బెడ్ రూమ్ మిగిలి ఉంది...మెల్లగా ఆ రూం లోకి వెళ్ళాడు..ఆ రూం లోపల పేపర్స్ కోసం వెతుకుతూ తన తల పైకి ఎత్తి గోడ వైపు చూసాడు...అంతే అక్కడ నుండి బాలు బయటకు వచ్చేసాడు...అలా వస్తూ వుంటే పని వాళ్ళు అందరూ అప్పటి వరకు రిలాక్స్ వున్నవాళ్ళు, 'అయ్యగారు వస్తున్నారు! వస్తున్నారు!' అంటూ కంగారు పడటం గమనించాడు బాలు...ఇక్కడి దాకా వచ్చాము కదా ఎలాగో... ఆ యశస్వి మొహం చూసి పోదాము అనుకున్నాడు బాలు"
"మెల్లగా యశస్వి రూమ్ దగ్గరకు వస్తున్నాడు...బాలు ఆ రూం కి ఎదురుగా వున్న, ఒక డోర్ కర్టెన్ వెనుక వుండి చూస్తున్నాడు...యశస్వి తన ముందు నుండి వెళ్తున్నాడు...అంతే!! ఒక్కసారిగా బాలు గుండె ఆగినంత పనయ్యింది...అక్కడ నుండి భయంభయం గా ఆ భవనం నుండి బయటకు వచ్చాడు"
"ఒక్కసారిగా బాలు కి ఎప్పుడు లేనంత భయం తో కూడిన ఆశ్చర్యం...ఎందుకంటే యశస్వి చూడడానికి బాలు లాగానే వున్నాడు...ఇద్దరినీ పక్కపక్కన పెట్టి చూస్తే ఎవరూ కూడా ఎవరు బాలు నో...ఎవరు యశస్వి నో చెప్పలేరు...అంతలా పోలికలతో వున్నారు వాళ్ళు ఇద్దరూ"
"బాలు అక్కడ నుండి హాస్టల్ దగ్గరకు వచ్చాడు...అప్పటికే మౌనిక బాలు కోసం బయట వెయిట్ చేస్తూ వుంది...
మౌనిక:- ఏమైంది బాలూ!! అలా కంగారుగా వున్నావు...ఏదైనా సమస్యా!! హా..
బాలు:- హా అవును...ఆ సమస్య ఏంటో, నీకే బాగా తెలుసు నాకన్నా.
మౌనిక:- అంటే నాకు అర్దం కాలేదు, ఇంతకీ ఆ పేపర్స్ దొరికాయా?
బాలు:- ముందు సమస్య!!...ఆ తర్వాతే పేపర్స్!!.....#
మౌనిక:- ఏంటి బాలూ, ఏమైంది??..... ఏంటా సమస్యా??
బాలు:- నువ్వు చెప్పిన యశస్వీ, నేను అచ్చు గుద్దినట్టు ఒకేలాగా వున్నాము..
మౌనిక:- అవునా!
బాలు:- మౌనికా!! నువ్వు నటించకు, నీకు తెలిసే నన్ను పంపావా అక్కడకి నిజం చెప్పు.....
మౌనిక:- చూడు బాలూ!!...అతను ఒక కోటీశ్వరుడు,, ఎప్పుడూ కూడా అతను డైరెక్ట్ గా కోర్ట్ కి రాలేదు, అలాగే నన్ను కలవలేదు...కేవలం అతని మేనేజర్ మాత్రమే కలిసే వాడు...సో నన్ను నమ్ము , ఇప్పుడు వరకు అతన్ని నేను చూడలేదు...చూడాలి అనికూడా అనుకోవడం లేదు...ఒకవేళ నువ్వే ఏదో కంగారులో అతని మొహం చూసి భ్రమ పడి వుంటావు....ఇంతకీ పేపర్స్ సంగతి ఏంటి బాలూ ?
బాలు:- అంతేనా మౌనికా...నేనే భ్రమ పడ్డాను అంటావా??
మౌనిక:- హాబాలు:- ఈ రోజు పేపర్స్ తీసుకురావడం కుదరలేదు...నేను రెండు రోజుల తర్వాత తీసుకువస్తాను.. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి, అమ్మ నుండి ఫోన్..
మౌనిక:- ఓహ్ పర్లేదు బాలూ!! ...చచ్చి పోవాలి అనుకున్న దాన్ని, నీ మాటల వల్ల ఆగాను....ఇప్పుడు మీ అమ్మ కోసం ఇంకో రెండు రోజులు వరకు వెయిట్ చేస్తాను...సరే నువ్వు వెళ్లు.. బై
బాలు:- ఓకే మౌనికా!!..నేను నిన్ను మళ్లీ ఇదే ప్లేస్ లో ఒక రెండు రోజులు తర్వాత ఇదే టైమ్ కి కలుస్తాను... బై
బాలు అక్కడ నుండి తన రూం కీ వెళ్లిపోయాడు..మౌనిక హాస్టల్ రూం కి వెళ్లి పోయింది...రెండు రోజులు గడిచాయి..మౌనిక బాలు కోసం హాస్టల్ బయట వెయిట్ చేస్తూ వుంది , అతను చెప్పిన టైమ్ కి.. దూరం నుండి ఎవరో పరుగున వస్తున్నారు.. మౌనిక, ఎవరా! అని చూస్తూ వుంటే, బాలూ!!..
మౌనిక:- బాలూ!! ఎందుకు అలా పరిగెడుతూ వస్తున్నావు.. నిన్ను యశస్వి ఏమైనా చూసాడా?
బాలు:- అదేం లేదు మౌనికా!!...నీకు నేను ఈ పేపర్స్ ఇవ్వాలి అనే తొందరలో వేగంగా వస్తున్నా అంతే..
మౌనిక:- ఓహ్ అంతేనా!!
బాలు:- మౌనికా!! నాకు ఒక అనుమానం...నువ్వు ఇన్నిసార్లు 'కోర్టు లో కేస్ వేసాను, అలాగే చాలా రకాలుగా నువ్వు యశస్వి వాళ్ళను అడిగాను' అన్నావు కదా! ఆ పేపర్స్ కోసం.. వాళ్లు ఒకవేళ నిన్ను చంపేస్తే నువ్వు ఏం చేసేదానివి....అలాగే ఎందుకని అంత డబ్బు వుండి కూడా నిన్ను వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు.??
మౌనిక:- ఏమో బాలూ!!..నాకు అవన్నీ ఏం తెలీదు..
బాలు:- నేను చెప్పనా ఎందుకో..!!
మౌనిక:- హా తప్పకుండా బాలూ.. చెప్పు!!
బాలు:- వాళ్ళకి నిన్ను మళ్లీ చంపడం కుదరడం లేదు మౌనికా!!
మౌనిక:- అంటే!!
బాలు :- వాళ్ళు నిన్ను ఎప్పుడో చంపేశారు...నువ్వు ఒక ఆత్మవి.!!! సరిగ్గా, ఒక ఆరు నెలల క్రితం వాళ్ళు నిన్ను చంపేశారు...నువ్వు ఆత్మ గా మళ్ళీ వచ్చి యశస్విని చంపడానికి ట్రై చేస్తే, అతను ఇంటి చుట్టూ రక్షా ముగ్గు వేసుకున్నాడు..అందువల్ల నువ్వు ఇంటికి కూడా వెళ్ళలేక, నన్ను హెల్ప్ కోసం అడగాలి అని ఇంత నాటకం ఆడావు..ఇంకోటి యశస్వి ఎవరో కాదు నీ బావే!!...నీ మెడలో మూడు ముళ్లు వేసి నిన్ను అగ్ని సాక్షి గా పెళ్లి చేసుకున్న నీ బావే ఈ యశస్వి!!... ఇవన్నీ నాకు తెలిసిపోయాయి.. మౌనికా!! నువ్వు నీ అసలు రూపం లో కి రావచ్చు.
మౌనిక :- అవును బాలూ!!..వాళ్ళు నన్ను చంపేశారు ( అంటూ తాను తన నిజమైన ఆత్మ రూపం లోకి మారింది)@ వెంటనే బాలు తన పాకెట్ లో వున్న ఒక మంత్రించిన జాడిని బయటకు తీసి వేగంగా దానిని మౌనిక వైపు తిప్పి మూత ఓపెన్ చేసాడు..అంతే మౌనిక ఆత్మ ఆ జాడీలో బందీగా అయింది..నిజానికి , నిజమైన బాలు ఇంకా ఇంటి నుండి రాలేదు..ఇప్పుడు బాలు లాగా వచ్చింది యశస్వి!! ...బాలు ఆ రోజు అక్కడ నుండి బయటకు వస్తున్నప్పుడు బయట వున్న సి సి టీవీ లో దొరికాడు...అది చూసిన యశస్వి, 'వీడు ఎవడు అచ్చం నాలాగే వున్నాడు' అని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు...అక్కడ బాలు మౌనిక ఆత్మ తో మాట్లాడం చూసి భయపడి, ఎలా అయినా ఆత్మని పట్టుకోవాలి అని అనుకున్నాడు..అందుకే అతను ఒక పక్కగా వాళ్ళకి కనిపించకుండా దాక్కుని వాళ్ల మాటలు విన్నాడు...అందుకే ప్లాన్ చేసి ఈ నాటకం ఆడి మౌనిక ఆత్మ ని పట్టుకున్నాడు..ఒకవేళ అదే రోజు బాలు వస్తే, అతన్ని చంపమని కొంతమందిని రెడీ చేసి వుంచాడు..యశస్వి ఆ జాడి తీసుకుని తన ఇంటికి వెళ్లి ఈ మౌనిక ఆత్మని గాలిలో కలపాలి, అనుకుని ఒక పూజ కి సిద్దం అయ్యాడు
"ఆ తర్వాత రోజు బాలు ఇంటి నుండి చాలా బాధ తో రూం కి వచ్చాడు...కొంచెం టైమ్ రెస్ట్ తీసుకుని హాస్టల్ దగ్గరకు వెళ్ళాడు మౌనిక కోసం...కానీ మౌనిక అక్కడ లేదు...సర్లే అని తన కోసం బయట వెయిట్ చేస్తూ వున్నాడు ఒక పక్క కూర్చుని..మెల్లగా బాలు ఆలోచనలు అన్ని రెండు రోజులు వెనక్కి వెళ్ళాయి.."బాలు ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మౌనిక దగ్గర నుండి వచ్చేసాడు...రూం లో పడుకుని ఆలోచిస్తున్నాడు...ఎందుకంటే బాలు, యశస్వి రూమ్ లోపలకి వెళ్ళిన సమయం అక్కడ తాను తల పైకి ఎత్తి చూసినప్పుడు అక్కడ గోడమీద ఒక పెద్ద ఫ్యామిలీ ఫోటో వుంది...దానిలో యశస్వి కి మౌనిక కి పెళ్లి అయినట్టు వుంది..ఇంకా మౌనిక మరో ఫోటో కి పూలమాల వేసి జననం-మరణం అని రాసి వున్నాయి....అప్పుడే బాలు కి మౌనిక, ఆత్మ!! అని తెలిసింది...కానీ ఒక ఆత్మ ఇలా హెల్ప్ కోరడం కి ఏదో బలమైన కారణం వుండి వుంటుంది అని నమ్మి...ఆ ఫోటోని తన ఫోన్ లో పిక్ తీసుకుని దాని జూమ్ చేసి చూస్తుంటే ఆ ఫోటో కి రియ్ కార్నర్ లో ఒక ఫోటో స్టూడియో నంబర్ వుంది...దానికి కాల్ చేసి అడ్రస్ కనుక్కుని అక్కడకి వెళ్ళాడు బాలు...అసలు విషయం ఏంటో తెలుసు కోవడానికి"
"హైదరాబాద్ కి కొన్ని కిలోమీటర్ల దూరం లో ఒక విలేజ్ లో వుంది ఆ స్టూడియో... బాలు తన మొహం కనపడకుండా స్కార్ఫ్ కట్టుకుని ఆ ఓనర్ తో మాట్లాడుతున్నాడు, తన ఫోన్ లో వున్న మౌనిక వాళ్ల ఫ్యామిలీ ఫోటో చూపించి ఆ స్టూడియో ఓనర్ ని అడిగాడు...మీకు వీళ్ళు ఎక్కడ వుంటారో తెలుసా అని...అప్పుడు అతను ఇదే వూరిలో పలానా అడ్రస్ అని చెప్పాడు..బాలు అక్కడ నుండి ఆ అడ్రస్ కి వెళ్ళాడు...ఇక్కడ కూడా బాలు తన మొహం కనపడకుండా స్కార్ఫ్ కట్టుకుని వున్నాడు ఎందుకంటే ఒకవేళ ఎవరైనా తనను చూసి యశస్వి అనుకుంటే అసలుకే మోసం వస్తుంది అని..... అక్కడ వున్న ఇంటికి దాదాపు గా ఒక రెండు మూడు నెలల నుండి ఎవరూ లేన్నట్టుగా వుంది..కేవలం వాచ్ మెన్ తప్ప మరెవరూ లేరు"
బాలు:- హెల్లొ వాచ్మెన్..ఇంట్లో ఎవరూ లేరు ఎంటీ?
వాచ్మెన్:- మీరు ఎవరు సార్...అయినా ఈ ఇంట్లో ఎవరూ వుండటం లేదు.
బాలు:- అవునా ఎందుకు..మరి ఇప్పుడు ఈ ఇంట్లో వున్న వాళ్ళను కలవాలి అంటే ఏ అడ్రస్ కి వెళ్ళాలి...అయినా ఈ ఇల్లు ఎందుకని ఖాళీ చేశారు?
వాచ్మెన్:- మీరు ఎవరో ముందు చెప్పండి సార్..
బాలు:- నేను మౌనిక ఫ్రెండ్ ను ఆమెను కలవడం కి ఇక్కడకు వచ్చాను..వాచ్మెన్:- మౌనిక అమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒక పెద్ద అగ్ని ప్రమాదంలో చనిపోయారు...సార్
బాలు:- కాస్త వివరంగా చెప్పు...
వాచ్మెన్:- సార్!! మౌనిక అమ్మ గారిది ఒక పెద్ద కుటుంబం, ఒకసారి మౌనిక వాళ్ల అత్తయ్యా మావయ్య వాళ్ళు అనుకోని విధంగా ఒక రోడ్ ప్రమాదంలో చనిపోయారు...అప్పుడు మౌనికని వాళ్ల అబ్బాయి యశస్వి కి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని మాట తీసుకుని చనిపోయారు."మౌనిక వాళ్ల అమ్మ గారు యశస్వి ని సొంత కొడుకు లాగా పెంచుకున్నారు..ఇంకా చెప్పాలి అంటే అంతకు మించి పెంచారు...మౌనిక తన అమ్మగారితో 'నేను డాక్టర్ చదివిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటాను' అని చెప్పడం వల్ల కొన్ని రోజులు పెళ్లి వాయిదా పడింది, తర్వాత కొన్ని రోజులకు ఆమె చదువు అయ్యి వూరు కి తిరిగి వచ్చింది...వెంటనే పెళ్లి ముహూర్తాలు చూసి రెడీ అయ్యారు...పెళ్లి అయిన మరు క్షణం ఆ ఫంక్షన్ హాల్ లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగి అందరూ చనిపోయారు..ఒక్క యశస్వి తప్ప""ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ వుండటం లేదు...నెల నెలా నాకు జీతం వేస్తారు, అప్పుడప్పుడు వచ్చి ఇంటిని చూసి పోతూ వుంటాడు..చాలా మంచి మనిషి యశస్వి అయ్యగారు"
బాలు:- ఇంతకీ అసలు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది...నీకు తెలుసా?
వాచ్మెన్:- తెలీదు సార్...ఎంతో మందిని ప్రేమగా చూసే కుటుంబం సార్...పాపం.
బాలు:- సరే ఐతే మరి నేను వెళ్తాను..
వాచ్మెన్:- సరే సార్..ఒక వేళ యశస్వి అయ్య గారు వస్తే ఏమైనా చెప్పమంటారా?
బాలు:- నువ్వు వద్దు..నేను కలసి చెప్తాను..అని అక్కడ నుండి బాలు తిరిగి తన ఊరి కి వచ్చేయాలని మెల్లగా ముందుకు నడుస్తున్నాడు...ఎవరో తన వెనుక ఫాలో అవుతున్న ఒకరకమైన ఫీలింగ్ బాలు కి మొదలు అయింది.బాలు తన నడక లో వేగం పెంచి బస్ స్టాండ్ కి వచ్చాడు..అక్కడ హైదరాబాద్ బస్ కోసం ఎదురు చూస్తూ వున్నాడు...తన మనసులో ఎన్నో ఆలోచనలు...ఒక ఆత్మ మామూలు మనిషితో పోలిస్తే ఎంతో శక్తి కలిగి వుంటుంది...కానీ ఎందుకు అని నా హెల్ప్ కోరింది... అది కూడా తనను ఆగ్ని సాక్షి గా పెళ్లి చేసుకున్న తన సొంత బావ దగ్గర నుండి తన ఆస్తి పేపర్స్ కోసం ఎందుకు అంత కంగారు పడుతుంది..ఇలా ఎన్నో ప్రశ్నలు బాలు మదిలో వున్నాయి..అంతలోకి ఒక వ్యక్తి బాలు ముందుకు వచ్చి కూర్చున్నాడు... అతను బాగా వంట్లో శక్తి లేకుండా..చూపు మందగించి వున్నాడు....కానీ అతని కదలికలు వేగం గా వున్నాయి.,.
వ్యక్తి :- బాబు నువ్వు ఎందుకు మహాలక్ష్మి గారి కోసం వచ్చావు..?
బాలు:- మహాలక్ష్మి నా ఆమె ఎవరూ?
వ్యక్తి :- మహాలక్ష్మి గారు ఎవరో తెలియకుండానే, వాళ్ల ఇంటికి వెళ్లి ఆమె కూతురు ఫ్రెండ్ అని చెప్పావా?
బాలు:- మహాలక్ష్మి అంటే మౌనికా వాళ్ల అమ్మ గారా?
వ్యక్తి:- అవును...ఎందుకు వచ్చారు మీరు ఈ వూరు అసలు...మీకు మౌనిక కి ఏం సంబంధం చెప్పండి?
బాలు:- ఆమె ఫ్రెండ్ ని,, నేను ఆమె కలసి చదువుకున్నాం... సడన్ గా ఆమె నెంబర్ పని చెయ్యడం లేదు...నేను ఆమెకి ఏమైనా అయిందేమో,.... ఇంతకు ముందు చెప్పిన అడ్రస్ నాకు గుర్తు వుంటే వచ్చాను అంతే ( అని బాలు ఒక అబద్ధం చెప్పాడు)
వ్యక్తి:-ఇప్పటి వరకు ఎవరూ కూడా ఆమెను చూడడానికి రాలేదు..మీరు ఇప్పుడు వచ్చారు...పైగా మీరు ఆమెకు ఫ్రెండ్ అంటున్నారు...ఆమెకు జరిగిన అన్యాయం కి మీరు ఏమైనా న్యాయం చెయ్యగలరా....?
బాలు:- అన్యాయామా....? అసలు ఏమైంది వివరంగా చెప్పండి....?
వ్యక్తి:- యశస్వి...తన పేరు లో వున్న తేజస్సు తన మనసులో లేదు..."చిన్న వయసు నుండి తల్లి తండ్రుల ప్రేమ కి దూరం అయ్యాడు అని...మహాలక్ష్మి గారు తన సొంత కూతురు కంటే ఎక్కువ ప్రేమతో పెంచారు, కానీ పాముకి పాలు పోసి పెంచినా విషం కక్కినట్టు యశస్వి చిన్నతనం నుండి తన మనసులో ప్రేమ కి బదులు అమ్మగారి ఆస్తి మీద ఆశ పెంచుకున్నాడు.. అది తెలియక ఆమ్మ గారు అతడికి తన కూతురు మౌనిక ని ఇచ్చి పెళ్లి చేసారు..కానీ అదే రోజు ముందు గా యశస్వి ని అలాగే మౌనికని తన దగ్గర కూర్చోబెట్టుకుని అమ్మగారు ఇలా అన్నారు.."చూడండి!! ఈ ఆస్తి మొత్తం నేను మీ పెళ్లి తర్వాత నా ట్రస్ట్ కి రాస్తున్నా!! దానికి గార్డియన్ గా యశస్వి నువ్వే వుండాలి...అలాగే నువ్వు మాత్రమే ఈ ట్రస్ట్ బాధ్యతలు చూడాలి, వేరే ఎవర్ని కూడా నేను నమ్మను...అది చిన్నపిల్ల నా తర్వాత నువ్వు ఈ రెండింటి బాధ్యతలను మొయ్యాలి..అప్పుడే నా మనస్సుకు శాంతి గా వుంటుంది""ఆ మాట విన్న యశస్వి కి ఆస్తి మొత్తం ట్రస్ట్ కి వెళ్లి పోతుంది అని భయం పట్టుకుంది...అంతే అప్పుడు అతని మెదడు అదుపు తప్పింది..పెళ్లి రోజు ఒక అగ్ని ప్రమాదం అయ్యే విధంగా ఏర్పాటు చేసి అందరినీ వాడు పొట్టన పెట్టుకున్నాడు"
బాలు :- (ఇదా సంగతి అని మనస్సు లో అనుకున్నాడు) కానీ మీరు ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికి ఎందుకు చెప్పలేదు...అసలు మీకు ఈ విషయం ఎలా తెలుసు?
వ్యక్తి :- నేను అమ్మ గారి దగ్గర పని చేసేవాడిని..చిన్న వయసు నుండి యశస్వి నీ అలాగే మౌనికానీ నా చేతులతో ఎత్తుకుని పెంచాను...అగ్ని ప్రమాదం కి కొన్ని నిమిషాల ముందు మౌనిక, యశస్వి నీ ఎదో పని కోసం పిలుస్తుంటే ఎందుకో కంగారుగా బయటకు వెళ్ళాడు...నేను యశస్వి ని పిలవడానికి ఆయన వెనకాల వెళ్ళాను.. అంతే నేను గేట్ దాటిన మరు క్షణం ఒక పెద్ద శబ్దం తో అగ్ని ప్రమాదం జరిగింది... నా కళ్ళ ముందే అందరూ చనిపోయారు... అప్పుడు యశస్వి బాబు మొహంలో బాధ కాకుండా ఒక రకమైన ఆనందం నేను చూసాను... నాకు చిన్న వయస్సు నుండి యశస్వి బాబు మీద వుండే అనుమానం గురించి అమ్మగారికి చెప్పితే "చిన్న పిల్లాడు గంగయ్య ఇంకా నా కొడుకు" అనేది.... పిచ్చి తల్లి... కానీ ఇదే పని ఆ యశస్వి చేశాడు అని ఆమెకు తెలిస్తే నిజంగా గుండె పగిలి చనిపోయేది... ఇదే విషయం ఎవరికి చెప్పినా నమ్మరు అంతలా అందరూ యశస్వి ని నమ్మారు...ఎన్నో సార్లు అమ్మగారి, అమ్మాయి గారి సమాధుల దగ్గరకు వెళ్ళి... మీరు బ్రతికి వున్నప్పుడు యశస్వి నిజ స్వరూపం గురించి మీకు తెలియలేదు... కనీసం మీ చావు తర్వాత అయినా ఆ నీచుడు గురించి మీకు తెలియాలి.. జరిగిన విషయం మొత్తం కొన్ని వందల సార్లు చెప్పాను...కానీ ఏం ప్రయోజనం??."మీరు ఇంకా యశస్వి మాయ లో పడలేదు....అందుకే నేను మీ సహాయం కోసం వచ్చాను..మీరు ఏదైనా సహాయం చెయ్యండి బాబు అని కన్నీరు పెట్టుకున్నాడు)
బాలు:- తప్పకుండా చేస్తాను...(బాలు అక్కడ నుండి సిటీ కి వచ్చేస్తాడు)
రోడ్ మీద స్పీడ్ గా ఒక లారీ వెళ్ళింది... అంతే బాలు కి ఒక్కసారిగా మెలకువ వచ్చింది నిద్ర నుండి...ఎంత సమయం అయినా మౌనికా రావడం లేదు...బాలు మనసులో కొంచెం టెన్షన్ మొదలు అయింది...ఒక్కసారిగా తన మనస్సులో ఒక ఆలోచన వచ్చింది...ఒకవేళ మౌనికా ఆ పేపర్స్ కోసం యశస్వి ఇంటికి వెళ్లిందా అనే అనుమానం...అంతే అక్కడ నుండి మళ్లీ యశస్వి ఇంటికి వేగం గా చేరుకున్నాడు..."ఇంట్లోకి మెల్లగా వెళ్ళాడు వెనుక డోర్ లాక్ ఓపెన్ చేసి..కింద ఎదో మంత్రోచ్చారణ జరుగుతుంది...బాలు మనసులో ఏదో కీడు సంభవిస్తుందని అనిపించింది...మెల్లగా హాల్ వైపు వెళ్ళాడు..కింద ఒక మాంత్రికుడు ఏవో మంత్రాలు చదువుతున్నాడు...యశస్వి ఆయన ముందు కూర్చుని వున్నాడు...బాలు కొంచెం దగ్గరకు వెళ్లి చూసాడు....ముందుగా వున్న గాజు జాడీలో మౌనిక ఆత్మను చూసాడు... ఏదో విధంగా ఆ జాడీని పగలకొట్టి ఆమెను బయటకు తీసుకు రావాలి అని అనుకున్నాడు...అంతలోకి మంత్రోచ్చారణ ఆగింది."
"ఇప్పుడు ఈ అత్మని గాలిలో కలపడానికి ఇంకా ఒక్క ఘట్టం మాత్రమే మిగిలి ఉంది... యశస్వి నువ్వు ఆ గాజుజాడీని అగ్ని లో వేసి నేను చెప్పిన మంత్రాన్ని మూడు సార్లు మనసు లో పలికితే.... అగ్ని వేడికి ఆ జాడి మూత పగిలి..దానిలోని ఆత్మ ఆ అగ్ని కి ఆహుతి అవుతుంది.... ఎందుకంటే నువ్వు ఆమెను ఒక అగ్ని ప్రమాదంలో చంపావు కాబట్టి ఆమె ఆత్మను నాశనం చేసే శక్తి కూడా అగ్నికే వుంటుంది... అందుకే ఆ జాడి తీసుకుని నువ్వు ఇలా హోమగుండం దగ్గరకు రా" అని మాంత్రికుడు చెప్పాడు"
"యశస్వి ఆ గాజుజాడి తీసుకుని గుండం దగ్గరకు వచ్చాడు... ఆ గాజు జాడీని అగ్ని లో వేశాడు..., వెంటనే బాలు వేగంగా వెళ్లి మంటలో పడుతున్న ఆ జాడీని దూకి పట్టుకున్నాడు... అతని భుజాలకి మంట అంటుకుంది.... ఒక్కసారిగా యశస్వి కి మాంత్రికుడికి ఏం జరుగుతుందో అర్దం కాలేదు... బాలు కాలుతున్న తన భుజాన్ని మర్చిపోయి... తన చేతిలో వున్న ఆ జాడీని బలంగా నేలకు వేసి కొట్టాడు...అంతే ఒక్కసారిగా ఆత్మ బయటకు వచ్చింది.... ఒక వికృత రూపం లోకి మారింది... బాలు వైపు చూసి ఒక్కసారిగా వూపిరి గట్టిగా వదిలింది దెబ్బకి మంటలు ఆరిపోయాయి"
"మాంత్రికుడు మంత్రం పలికే లోపు తాను తెచ్చుకున్న అన్నీ వస్తువులను భూమిలో కలిపేసింది... మాంత్రికుడు చేసేదేం లేక ఆత్మతో నేరుగా ఢీ కొన్నాడు...కానీ బలహీన మానవ శరీరం కదా!! ఆత్మ ముందు ఎక్కువ సేపు నిలువలేకపోయాడు... మౌనిక మాంత్రికుడిని చంపి తల వేరు చేసింది""అంతలోకి యశస్వి తన దగ్గర ఉన్న మరో గాజు జాడీలో ఆమెను బంధించడానికి తీసుకు వచ్చాడు.. అది చూసిన బాలు యశస్వి ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు... బాలు, యశస్వి ఇద్దరూ తీవ్రంగా పోరాడుతున్నారు... కానీ మౌనికా మాత్రం యశస్వి ని ఏం చేయడం లేదు...బాలుకి ఏం అర్దం కావడం లేదు, మౌనిక ఎందుకని ఇంకా యశస్వి ని చంపకుండా అలా నిశబ్దంగా వుంది అని""యశస్వి, బాలూని కింద పడేసి ఒక కత్తి తో పొడవడానికి ట్రై చేస్తున్నాడు...అప్పుడు బాలు కావాలని యశస్వి ని నిలువరించడానికి ప్రయత్నం చెయ్యకుండా కత్తి కొద్ది మేర తన శరీరం లోకి దిగే వరకు ఆగాడు... అది చూసిన మౌనిక యశస్వి ని బాలు మీద నుండి పక్కకి తోసింది...అంతే యశస్వి!!.... బాలు పగలకొట్టిన జాడి యొక్క సీసా పెంకులపై పడడం వలన అవి అతని మెడ దగ్గర దిగి చనిపోయాడు"
"బాలు పైకి లేచి, యశస్వి రూం నుండి ఆ పేపర్స్ బయటకు తీసుకు వచ్చాడు"
బాలు :- ఇవిగో మౌనికా!! నువ్వు అడిగిన పేపర్స్...నేను నిన్ను కలసిన తొలిరోజునే, నా పేరు చెప్పకుండానే నువ్వు నన్ను 'బాలు' అని పిలిచావు...అప్పుడు నేను నీ బాధ గురించి ఆలోచించాను..అందువల్ల నేను అది పట్టించుకోలేదు..
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మౌనిక:- (నార్మల్ రూపం) బాలు!!... శక్తి వుండి కూడా ఆశక్తురాలను అయ్యాను... యశస్వి ఇంటి చుట్టూ ఒక రక్షా యంత్రం వున్నది... అందువల్ల నేను ఆ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నా ... ఇప్పుడు నేను ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళలేను... ఇంటి లోపలకి నేను రాలేను...ఒకవేళ వస్తే తిరిగి మళ్లీ బయటకు వెళ్ళలేను...అందుకే నాకు నీ సహాయం అవసరం అయింది... బాలూ!!.
బాలు:- కానీ నేనే ఎందుకు??...నీ పని కోసం నన్నే ఎందుకు వెతికావు??
మౌనిక:- బాలూ!! నీకు గతం గుర్తు లేదు.. సరిగ్గా ఒక ఏడాది క్రితం నువ్వు ఒక అగ్ని ప్రమాదంలో ఒక అమ్మాయిని రక్షించటం కోసం ఎగసి పడుతున్న మంటల మధ్యకి వెళ్లి మరీ ఆమెను కాపాడాలని ట్రై చేశావు.... కానీ విధి ఇలా రాసి వుంటే మనం మాత్రం ఏం చేయగలం... అప్పటికే ఆ అమ్మాయి కాలిపోయి చావుకి దగ్గరలో వుంది.. అతను ఆమెను బయటకు తీసుకు వస్తూ వుంటే ఒక దూలం పడి...నువ్వు కింద మంటలో పడిపోయావు... నీ మొహం మొత్తం కాలిపోయింది.. నిన్ను ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు... ఆ అమ్మాయి చనిపోయింది... నువ్వు కాలిపోయిన మొహంతో అలా వున్నావు.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే బాలూ!!...(తన కంటి నుండి తన ప్రమేయం లేకుండా కన్నీరు బయటకు వస్తుంది)
మౌనిక :- అప్పుడే సమాధిలో వున్న నాకు మా పనివాడు,, కాదు కాదు నన్ను పెంచిన నా తండ్రి మాటలు వల్ల జరిగిన విషయం తెలుసుకున్నా... అంతే నాలో అప్పటి వరకు వున్న యశస్వి మీద ప్రేమ పోయి అసహ్యం వేసింది... అమ్మ కోరిక ఎలాగైనా తీర్చాలి అని అనుకున్నా... ఎందుకంటే అమ్మకి నా కంటే యశస్వి అంటేనే ప్రాణం.
బాలు :- కానీ ఆ యశస్వి మీ అమ్మ ప్రాణం తీశాడు అని తెలిసి కూడా ఎందుకని నువ్వు అతని మీద పగ తీర్చుకోవడం లేదు...
మౌనిక :- అమ్మ, నా చిన్నతనంలో, ఏ కారణం చేత కూడా నువ్వు గాని యశస్వి గాని గొడవ పడకూడదు..... నేను బ్రతికి వున్నంత వరకు అంది.... అమ్మ కి ఇచ్చిన మాట వల్ల యశస్వికి ఎటువంటి హానీ తల పెట్టలేదు... అంతే
బాలు:- కానీ, మీ అమ్మగారు నీతో పాటు, ఆ మంటల్లో చనిపోయారు కదా..?
మౌనికా:- లేదు బాలు!! ఆవిడ ఇంకా బ్రతికే వున్నారు... ఆ ట్రస్ట్ వాళ్ళు చావు బ్రతుకుల మధ్య వున్న కొంతమందిని తీసుకు వెళ్లి వైద్యం చేస్తున్నారు... అప్పుడు అమ్మ వున్న గది పూర్తిగా దగ్ధం అవ్వడం వల్ల అమ్మ చనిపోయింది అనుకున్నారు... కానీ ఆమె అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేదు... వేరే చోట వుంది. అమ్మ మొహం కాలిపోవడం, అలాగే అమ్మ ఒక్కసారిగా అంత పెద్ద అగ్ని ప్రమాదం, అందులో మేము అందరం మరణించటం చూసి షాక్ కి గురి అయ్యి ఒక స్టేట్ లోకి వెళ్లి పోయింది... అందువల్ల అమ్మని ఎవరూ అక్కడ గుర్తు పట్టలేక పోయారు... కానీ ఆ ట్రస్ట్ లో వున్న రాధిక అనే ఒక అమ్మాయి ఆమెను గుర్తు పట్టి చాలా చక్కగా వైద్యం చేస్తూ వుంది"
"నేను నీకు ఎలా కనిపించి సహాయం అడిగానో అలాగే ఆమెకు కనపడి అమ్మ విషయం బయట ఎవరికీ చెప్పవద్దు అన్నాను... అలాగే అమ్మ ఎప్పుడూ కూడా "యశస్వీ!! యశస్వీ!! అని ఆ దుష్ట దుర్మార్గపు చక్రవర్తి ని తలుస్తుంది... కాబట్టి నాకు ఈ ఆస్తి తో పాటు యశస్వి మొహం కూడా నాకు అవసరం అయింది అమ్మ ఆరోగ్యం కోసం""అందుకే నీకు ఆపరేషన్ చేసే డాక్టర్ శరీరంలో ప్రవేశించి నేను నీకు యశస్వి మొహం వచ్చే విధంగా ఆపరేషన్ చేశాను... అందుకే నువ్వు చూడడానికి యశస్వి లా వుంటావు"
"బాలూ!! నువ్వు నాకు దేవుడు పంపిన ఏంజెల్,,, అగ్ని ప్రమాదంలో నాకు సహాయం చేయడంలో విఫలం అయ్యి, ఇప్పుడు ఇక్కడ ఇలా హెల్ప్ చేశావు,. ఇదంతా విధి!!.... దైవ నిర్ణయం అందుకే నువ్వు నా గతం చెప్పకపోయినా.... నేను మాట్లాడిన మొదటి క్షణాలలోనే నువ్వు ఆ పని చెయ్యడం కోసం ఒప్పుకున్నావు.""ఇక నేను నిన్ను అమ్మతో చూస్తే..చాలు నా ఆత్మ కి శాంతి కలుగుతుంది...బాలూ!! ""
బాలు, మౌనిక చెప్పిన మాటలకు తన హృదయం నుండి ఉబికి వస్తున్న కన్నీటి ఆపుకుని.... అక్కడ నుండి మరో సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు"
@ కొన్ని రోజుల తర్వాత బాలు, ఆ ట్రస్ట్ కి చైర్మెన్ అయ్యాడు... బాలు తో పాటు మౌనిక వాళ్ల అమ్మ కూడా ఆ ట్రస్ట్ లోనే వుంటున్నారు... తాను అనుకున్న పనులలో ఒక పని జరిగింది... నా దగ్గర నా కూతురు లేకపోతేనేం నా కొడుకు వున్నాడు అని ధైర్యం గా బ్రతకటానికి మహాలక్ష్మి గారికి ఒక ఆసరా దొరికింది... రోజులు వేగంగా పరుగులు తీశాయి,మెల్లగా బాలు తన పేరు మర్చిపోయాడు.... అలాగే మౌనిక ఆత్మ కూడా ఇంక బాలు కి, రాధిక కి కనిపించటం మానేసింది"
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#3
Good story   clps
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)