Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిన్నటిదాకా శిలనైనా!
#1
నిన్నటిదాకా శిలనైనా!"(కథ)
 
-  Udaya Babu Kottapalli
 
(ఈకథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 18.07. 2003 సంచికలో ప్రచురితం)
 
 
రైల్వే గేటు పడటంతో బస్సు ఆగిపోయింది.
 
బస్సులోంచి బయటకు చూసాడు గిరీశం.
 
సరిగ్గా రెండు ఫర్లాంగుల దూరంలో రైల్వేస్టేషన్ కనిపిస్తోంది మసగ్గా.
 
సాయంత్రం ఆరు గంటలు దాటిన శీతాకాలం సాయం సంధ్య.
 
బయట వీస్తున్న చలిగాలికి మనసులో కోరికలు జివ్వున రాజుకుంటూ, నులివెచ్చని కలయిక కోసం రెక్కలు చాస్తున్నాయి.
 
నిన్న సాయంత్రం వసుంధర పిల్లలతో పుట్టింటికి వెళ్ళింది. మరో రెండు రోజుల తర్వాత గాని రాదు.
 
బయట చలి చంపేస్తోంది.పేడపురుగుల్లా ఆలోచనలు మెదడులో సుడులు తిరుగుతుంటే గిరీశానికి అపుడు తట్టింది.
 
మొన్న అదేదో కొత్త సినిమాలో చూసినట్టు 'తప్పు చేసేద్దాం'అని.ఆ ఆలోచన రావడమే తడవుగా వెంటనే బస్సు దిగిపోయాడు.
 
ఎక్కడో తుఫాను పట్టిన సూచనగా బయట మళ్ళీ చలిగా ఉంది.తనకు తానే కొండ చుట్టు కు పోయే అంత చలి.
 
ఆలోచిస్తూ నిలబడ్డ అతను చూస్తుండగానే రైలు వెళ్లి పోవడం, గేటు తెరుచుకున్నాక తాను వచ్చిన బస్సు వెళ్లిపోవడం జరిగిపోయాయి.
 
ఈ వేళ ఉదయం క్యాంపు పాలకొల్లు వెళ్లాడు తాను. అసలు ఇక్కడ దిగే ఆలోచన లేదు. తాను వెళ్లాల్సింది పెద్ద వంతెన అవతలకి. అక్కడ కాలనీలో తన ఇల్లు. టిక్కెట్ అక్కడికే తీసుకున్నాడు. కానీ చలి ఇక్కడ దిగి పోయేలా చేసింది. ఇక ప్రయత్నం మొదలు పెట్టాలి అనుకుంటూ రైల్వే ట్రాక్ కు సమాంతరంగా ఉన్న దారిలో రైల్వే స్టేషన్ వైపు నడవడం మొదలు పెట్టాడు గిరీశం.
 
అక్కడ రైల్వే గూడ్స్ ఆగి ఉంది ఒక లైన్ మీద . బొగ్గు గనుల్లో పనిచేసే రాక్షస కార్మికుల్లా పట్టాలపై నిలబడి ఉన్నాయి రంగుల మాసిన రైలు పెట్టెలు . వాటి పక్కగా క్రీనీడలో ఇద్దరో, ముగ్గురో నిలబడి మాట్లాడుకుంటున్నారు.
 
సుమారు పర్లాంగు దూరం నడిచి విశాలంగా వ్యాపించి ఉన్న రావిచెట్టు మొదట్లో నిలబడ్డాడు గిరీశం.
 
పక్కన చీకట్లో ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి.
 
"ఎంత ?"
 
"100"
 
"పాతిక చేసుకో"
 
" కుదరదు"
 
" అసలు నన్ను ఎలుగులో సూత్తే ఊరికే వత్తావు... తెలుసా!"
 
"ఈ ఊరికి కొత్తా?"
 
" అవును ఏం?"
 
"ఎలుగు లో సూసినా సేసే చీకటి పనికి 100కు అయిదు పైసలు తగ్గదు. రేపు నీ వల్ల నాకు రోగాలు అంటుకుంటే డబ్బులు ఎవరిత్తారు?"
 
"ఛ. ఎల్లెహ. ఇప్పటికీ నీకేవీ లేనట్టు"
 
" సేతకాని వోడివి అని సెప్పు .అచ్చమైన మగాడు మాటలతో సమయం ఏస్టు సెయ్యడు'
 
" అయితే సరే! 50!"
 
" పోవెహ. ఆడంగి నా కొడకా!"
 
" మాటలు జాగ్రత్తగా రానీ లం..."
 
" పోరా గొట్టం నా కొడకా!"
 
అంతలో మూడో కంఠం.
 
" ఎవర్నేటే ఓలప్పా తిడతన్నావ్?"
 
" దొరికిందిలే సన్నాసి బేరం"
 
" కుదిరిందా ?"
 
""కొజ్జాఓళ్ళు బేరం కుదుర్సుకుంటారేంటి?"
సరేగానీ నీ పని అయినదా?"
 
" ఆ ! వందిచ్చి ఒల్లు హూనం సేసి వదిలిపెట్టాడు ఎదవ సచ్చినోడు.ఈమద్దెన ఆడగాలి సోకనట్టుంది ఎదవ నా కొడుక్కి.'
 
"ఓ టీ తాగొద్దామా?"
 
" సరే పద!"
 
"ఆ సెట్టుకాడ ఎవడో నిలబడి ఉన్నాడే. బాగున్నాడు.ఉద్యోగం సేసేవోడిలాగా సేతిలో బేగ్ కూడా ఉంది.''
 
"అబ్బా,! ఆడు కాకపోతే ఆడి తాత లాంటి వోడొత్తాడు. ముందు టీ తాగుదాం పదెహ. 'అందు'కోసమే వత్తే యాడికి పోతాడు. ఈడనే ఉంటాడు. నువ్వు రా" ఏదో ఓ బూతు జోకు వేసుకుని ఫక్కున వికటాట్టహాసంగా నవ్వుతూ దూరంగా వెళ్లిపోయాయి ఆ ఆకారాలు.
 
అంత చలిలోనూ చిరు చెమటలు పట్టాయి గిరీశానికి. పెళ్ళికి ముందు అనుభవం గుర్తుకు వచ్చింది అతనికి. మొదటి రాత్రి సక్సెస్ కావాలంటే పెళ్లికి ముందు 'ఆ' అనుభవం చాలా అవసరం అని స్నేహితులు బలవంతం చేసిన మీదట, అతను తీసుకువెళ్లిన చోట కి వెళ్ళాడు తాను.
 
అదే మొదటిసారి తాను ఒక పరిచయం లేని స్త్రీతో ఒంటరిగా గదిలో ఉండటం.
 
ఆమె ముందే జేబులు తడిమి డబ్బులు తీసుకుని లెక్క చూసుకుని జాకెట్ లో ఓ పక్కకు దోపుకుంది.
 
 
ఆమె పల్చని జాకెట్టు లోంచి డబ్బు మడతలు గర్వంగా తొంగిచూస్తున్నాయి.
 
ఆమె వీణను సుతారంగా మీటినట్టు తనను షేర్ చేసిన రంగు వేసిన గోళ్ళతో ముఖము దగ్గర్నుంచి స్పృశించ సాగింది. తన చేత్తో చొక్కా విప్పేసి రోమాంచిత మైన తన శరీరాన్ని మీటలు తెలిసినట్టుగా నొక్కుతూ తనలో తమకం తాలూకు స్కేలును క్రమేపి పెంచుతూ ఉంటే తను ఎప్పుడెప్పుడు కట్ట తెగిన చెరువును అవుదామా అని చూస్తున్న అంతలో సెక్యూరిటీ ఆఫీసర్ ఈల వినిపించడం, ఈసురోమంటూ మరో దారిన పారిపోయి రావడము జరిగాయి.
 
కానీ వసుంధర సహకారం పుణ్యమా అని మొదటి రాత్రి జీవితంలో మధురమైన రాత్రి లాగే మిగిలిపోయింది. ఆ తర్వాత తనకు బయటకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఉహు... కాదు... వసుంధర తనకు ఆ అవకాశం ఇవ్వలేదు.
 
 
ఇన్నాళ్లకు తన చెల్లెలి తొలి కాన్పుకు, అదీ మొదటి సారి ఇక వదలలేక వదలలేక తప్పదు అనుకుంటూ వెళ్తూ వందల జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది .అందులో చెడు తిరుగుళ్ళు తిరిగ వద్దని కూడా చెప్పింది. అయినా తాను ఇలా వెళ్ళినట్లు ఆమెకు తను చెబితే కదా తెలిసేది.
 
"బాబు గారు 10 నిమిషాల నుంచి ఈడనే నిలబడ్డారు. ఎవరికోసమైనా ఈ సీకట్లో ఎదురుసూస్తున్నారా?''తన పక్కనే నిలబడి ఉన్న సన్నని ఆకారం అడిగినమాటలకు ఈ లోకంలోకి వచ్చాడు గిరీశం.
 
''ఊరికేనే . ఎవరికోసమూ చూడటం లేదు,. ఏం? ఎందుకు అలా అడిగావ్?''
 
''నేను ఊరికే అడిగా బాబు. సలి బాగా యాత్తంది బాబు. ''
 
''అవును''
 
''ఈ టయిములో ఓ సిగరెట్టు, ఓ మందు బాటిలు, సక్కని చిన్నది....పక్కన ఉంటే బలే ఉంటది బాబు ''
 
గిరీశం చిన్నగా నవ్వాడు.
 
''నిన్ను చూస్తూ ఉంటే ఈ చలి గాలికి ముడుచుకు పోయె మూడంకెలా ఉన్నావు. ఈ వయసులో నీ కీకోరిక ఏంటి?''
 
''నేనన్నది నా గురించి కాదు బాబు... మీ గురించే...''
 
ఉలిక్కిపడ్డాడు గిరీశం.
 
''ఏదైనా.... మంచి బేరం ఉందా?'' అటు ఇటు పరికించి చిన్నగా అడిగాడు.
 
''ఉంది బాబు... కాబట్టే మిమ్మల్ని అడిగాను . అయితే వత్తారా?''
 
''ఎంత?''
 
''ఆడకెళ్ళాక ఆ అమ్మసెప్పుద్ది రండి.''
 
''అబ్బా!చెత్త సరుకు నాకొద్దు. నాణ్యమైనది కావాలి.'' చిరాకు పడ్డాడు గిరీశం .
 
''అట్టాగే బాబు. పక్కా ఫ్యామిలీ టైప్.అమ్మాయిమొగుడు షుగర్ ఫ్యాక్టరీ లో పని చేసేవోడు. తాగుబోతు నాయాలు.తాగుడు ఎక్కువై సచ్చిపోయాడు.ఆయమ్మ చిన్నా చితకా పనూలు సేసుకు బతుకుతావుంది. డబ్బు మరి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఇలా!''
 
''అలాగా ...అయితే ఎంత ఇవ్వచ్చు అంటావు?''
 
''మీరేమీ అనుకోకపోతే 500 ఆ యమ్మకి. మీకు నచ్చితే,వచ్చాక నాకు తమరు తోసింది ఇద్దురు గాని'' అన్నాడు అతను.
 
''అలాగే.ఎక్కడకి వెళ్ళాలి?''అడిగాడు గిరీశం.
 
''నాతో రండి''అనబోయిన రిక్షావాడు '' ఉండండి. నేనే రిక్షా తీసుకొస్తా'' అంటూ పుష్పకవిమానంలా అలంకరించి ఉన్నరిక్షాతో వచ్చాడు.
 
కొత్త రిక్షా కాబోలు... దానికి మూడు పక్కల పరదాలు ఉన్నాయి.
 
''ఎక్కండిబాబు. ఆ ఇంటికి వెళ్దాం''
 
అటు ఇటు చూసి ఒక్కసారిగా గిరీశం రిక్షా ఎక్కి కూర్చున్నాడు.
 
రిక్షాకదిలింది.
 
**********  
 
ఐదు నిమిషాల అనంతరం ఒకే ఒక గేటు కలిగినవిశాలమైన ప్రాంగణంలో కుదుమట్టంగాఅందమైన తోట మధ్యలో ముత్తయిదువులానిలబడిన ఇంటిముందు రిక్షా ఆగింది. తోటలోని పూల పరిమళం తో ఆ వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది.
 
రిక్షా అతను గేటు తీసి లోపలికి వెళ్ళాడు.తలుపుమీద కొట్టాడు. సన్నగా తలుపు తెరుచుకుంది.
 
'కలువ బాల' లాంటి స్త్రీ మూర్తి లైట్ వెలుగులో తళుక్కున తారకలామెరిసింది. అతనితో మాట్లాడింది. తలుపును పట్టుకుని అభిసారిక అలాగే నిలబడింది.
 
రిక్షాఅతను వచ్చి పరదా తొలగించ బోయాడు.
 
''ముందు ఏమైందో చెప్పు ''
 
''పండే బాబు గారు. దిగండి!''
 
''అటు ఇటు చూడు ఎవరు లేరు గా?''
 
''లేరు బాబు.'' గిరీశం చప్పుడు చేయకుండా పిల్లిలా కిందకు దూకి వడివడిగా లోపలికి వెళ్ళిపోయాడు.
 
ఆమె అతన్ని వెయిట్ చేయమన్నట్టుగా సైగ చేసి తలుపులు మూసేసింది. లైట్ తీసేసింది.
 
సుమారు గంట తర్వాత లైట్ వెలిగింది. తలుపు తెరుచుకుంది. చూస్తేనే ఎలర్ట్ అయ్యాడు రిక్షావాడు.
 
ఎవరూ లేరని సైగ చేశాడు. గిరీశం గబగబా వచ్చి రిక్షా లో కూర్చున్నాడు.
 
పరదాలు సరిచేసి రిక్షావాడు లోపలికి వెళ్ళాడు .
 
''అమ్మ...ఎంత ఇచ్చాడు?''
 
''నువ్వు చెప్పినంత ఇచ్చాడు . అయితే నన్ను ముట్టుకోలేదు.''
 
''అదేంటమ్మా? మీరు చెప్పేది నిజమా!''
 
''నిజమే నాంచారయ్య. నేను ముందుగానే డబ్బులు తీసుకున్నాను. లైట్ తీసేసాను. తనకు లైట్ అవసరమట. సరేనన్నాను . నేను అతని ఎదురుగా నిలబడ్డాను. అతను నన్ను పైనుంచి కిందకి పరిశీలనగా చూశాడు. నేను పమిట వదిలేశాను. అతని చేయి నా భుజం మీద వేసుకున్నాను. అతను సున్నితంగా తీసేసాడు.' అదేమిటి 'అని అడిగాను. నన్ను అనుభవించాలని ఆనిపించలేదట. ఆడదాని చూస్తూనే కసి తోకోరిక పుట్టాలట. అలాంటి ఆడదానికి కావలసినన్ని బేరాలు వస్తాయి... కానీ ' విరిసిన కలువపూవులాఉన్ననిన్ను ఈ రకంగా ఊహించలేను' అని బాధపడ్డాడు.
 
''మరి ఇంత సేపు ఏం చేసాడు?''
 
''నా అందాన్ని తనివితీరా చూస్తూ ఎన్నో విషయాలు అడిగాడు. నిర్భయంగా చెప్పాను. నేను డబ్బు తిరిగి ఇవ్వ బోయాను. తాను సంతోషంగా ఇచ్చింది కాబట్టి తిరిగి తీసుకోను అని అన్నాడు సరేనన్నాను.''
 
''పిచ్చోడు'' అన్నాడు నవ్వుతూ నాంచారయ్య.
 
''లేదు నాంచారయ్య. అతను అమాయకుడైనసంస్కారవంతుడు. సరేలే. మళ్లీ ఇదే రోజు ఇదే టైం కి కలుద్దాం'' అందామె.
 
''అలాగేనమ్మా . ఎల్లోత్తాను''నాంచారయ్య బయటికి వచ్చాడు.రిక్షా తో బస్టాండ్ వైపు కదిలాడు.
 
***************
 
''బాబు గారు ! తమరుఎంత వరకువెళ్ళాలి?'' రిక్షా తొక్కుతూ దారిలో అడిగాడు నాంచారయ్య.
 
''పెద్ద వంతెన డౌన్లో శ్రీ రామ్ నగర్ కాలనీ...''
 
''అయితే తమది ఈఊరేనా బాబు?''
 
''అవును. ఏమి?''
 
''అమ్మ గారు ఊర్లో లేరెంటిబాబు?''
 
''నీకెలా తెలుసు?''
 
''నేను మిమ్మల్ని చెట్టుకాడ మొదటిసారి చూశాను.గత రెండేళ్ల నుంచి పగలు బేరాలు అన్ని చూసుకుని,రాతిరేల ఇట్లాంటి బేరాలు సూస్తుంటాను. ''
 
''ఎందుకలా?''
 
''ఇట్టాంటి బేరాలకు పైసలు ఎక్కువ వత్తాయి... అందుకని.''
 
''నెలకు ఎంత సంపాదిస్తావేంటీ?''
 
''రోజుకు 300 దాకా సంపాదిత్తా అబ్బాయిగారు. ''
 
''ఎంత కాలం నుంచి రిక్షా తొక్కుతున్నావ్?''
 
''సుమారు ఇరాయి యేళ్ళ నుంచి సారు.''
 
''అంటే నీ వయసు?''
 
''నాకు 45 సంవత్సరాలు ఉంటాయి బాబు.ఐదవ తరగతి చదువుకుంటుమానేసిన. మా అయ్య హటాత్తుగా పోవడంతో నేను రిచ్చా పట్టుకోవాల్సి వచ్చింది.''
 
''మరిఇంత కాలం నుంచి కష్ట పడుతున్నావు కదా... ఏ మాత్రం వెనకేసావేమిటి?''
 
''ఏమీ ఎనకేయనేదు బాబు. నాకు పెల్లామ్ ... ఇద్దరు బిడ్డలు.పెద్దది అమ్మాయి. చిన్నోడు అబ్బాయి. అమ్మాయికి పెళ్లి చేసిన. అబ్బాయి డిగ్రీ సదువుతున్నాడు. సాయంకాలం టూషన్లు సెప్పుకుంటూ ఓ వెయ్యి పైనే సంపాదిత్తన్నాడు . ''
 
''మరి అంత డబ్బ వస్తుంటే సుఖంగా దర్జాగా బ్రతక్క, ఇలా రిక్షా తొక్క వలసిన అవసరం ఏముంది నీకు ?'' అడిగాడు గిరీశం .
 
''బాబు గారు మా పెళ్లి అయ్యే సరికి మా ఆవిడకి పన్నెండేళ్లు - నాకు 17 ఏళ్లు. సంవత్సరం తేడాతో పిల్లలు పుట్టారు. ఇప్పుడు అమ్మగారు ఇంటిదగ్గర లేనప్పుడు మీరు ఇట్టా వచ్చినట్టుగానే. మా యాడది పురిటికి ఎళ్ళినప్పుడు నేను ఇట్టాంటి ఎదవ పనే సేసిన .ఆ ఇసయం మా యావిడకి తెలిసిపోయింది.
 
'పెళ్ళాం ఊరెళితే మీ మగాళ్ళకి మెదడ్లో పురుగు తొలుత్తాదా? అక్కడ ఊరు ఎళ్లిన ఆడదానికి పురుగు తొల్వదా? అయినా ఏ ఆడదానికైనా మొగున్ని ఇడిసి పెట్టి పుట్టింటికి ఎల్లాలని సరదానా? నీకు బిడ్డ నిచ్చి నిన్ని నాన్నాను సేయాలనే కదా పుట్టింటికి ఎల్తాది? ఆ పురుడు ఏదో ఇక్కడే పోసుకుంటే, కళ్ళముందు మొగుడు పడే బాధ సూడలేక, తాను పనిలో సాయం సేసే అవకాశం లేక ఆడది ఏడవకుండా పుట్టింటికి ఎళ్తాది అంతేగాని మీకు ఇలాంటి తప్పు పని సేసే అవకాశం ఇవ్వడం కోసం కాదు. అయినా నువ్వు ఎవత్తి కాడ కో ఎల్లావంటే నిన్ను నేను సుఖ పెట్టనేక పోయా అన్నమాట. నీలాగా నేను కూడా తప్పు చేస్తే ఓర్సుకుని నన్నేలు కొంటావా? నీకు నాకు సెల్లు ఎళ్ళిపో'' అని తిట్టి తిట్టి కళ్ళు తిరిగి పడిపోనాది బాబు.
 
అప్పుడు అర్థమైంది బాబు నేను ఏంత తప్పు సేసినానో... అప్పటినుండి నా భార్య పిల్లలు సుఖ సంతోషాలతో బతకాలి.... నేను కట్టబడి సంపాదించాలి . మడిషికి కావలసినవి కడుపునిండా తిండి. , కట్టుకోవడానికి బట్ట, ఉన్నంతలో మంచి గూడు. మా ఆడదానికి మాంసం కూర అంటే చాలా ఇష్టం బాబు . రోజు దానికి నీసు కావాలి అంటది. ఉన్నంతలో మంచి చీరలు కడతాది. నాకు మంచి బట్టలు కుట్టిస్తాది. పిల్లలకు ఏం కావాలన్నా అడిగిందే తడవుగా కొనిపెడతాది . అయితే అన్నీ మాకు అందుబాటులో ఉన్నయ్యేకొంటది. వారానికోపాలుసినిమా కి ఎళ్తాం.
 
ఇట్లాంటి పాడు ఆలోచనలు రాకుండాఉండడం కోసం ఏదో పని కల్పించుకుంటా ఉంటాను. ఇది బాబు నాఇషయం.''
 
గిరీశం తప్పు చేసినవాడిలా మౌనంగా ఉండిపోయాడు.
 
అతను చెప్పిన ప్రకారం తమ ఇంటి ముందు నాంచారయ్య రిక్షా ఆపాక, దిగి 200 రూపాయలు నాంచారయ్య చేతిలో వుంచాడు గిరీశం.
 
''బాబుగారు... ఏంటి ? ఇంత డబ్బా వద్దండి " అన్నాడు తిరిగి గిరీశం చేతిలో పెట్టేస్తూ.
 
''చూడు నాంచారయ్యా. ఒక బోయవాడు వాల్మీకి ఎలా అయ్యాడో నాకు నిన్ను చూస్తే అర్థం అవుతోంది. నువ్వు జీవితాన్ని మధించి జీవన సారం గ్రహించిన వాడివి. అది గ్రహించనివాళ్ళకోసం, గ్రహించినా నిర్లక్ష్యం చేసి ఆరోగ్యాలు పాడుచేసుకునే నాలాంటి వాళ్లను మార్చడం కోసం కాబోలు భగవంతుడు నీలాంటి వాళ్ల రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని చూస్తుంటే నేను ఎంత తప్పు చేయడానికి సాహసించానో నాకు అర్థమైంది. ఆ అమ్మాయి వల్ల సగం కళ్ళు తెరుచుకున్న నేను, నీవల్ల పూర్తిగా కళ్ళు తెరిచాను. ఉంచుకో. ఎప్పుడైనా వస్తూ ఉండు''అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలికి నడిచాడు గిరీశం.
 
నాంచారయ్య అతనికి నమస్కరించి రెండు నిముషాల తర్వాత రిక్షా తన ఇంటివైపు పోనిచ్చాడు.
 
**************
 
ఆ రోజు ఉదయం వసంత ఊరు నుంచి చేసిన వేళ వరండాలో పడక్కుర్చీలో పేపర్ చదువుకుంటున్న గిరీష్ ఎంతో వంటింట్లోనుంచే పురమాయించింది వసుంధర.
 
 
"ఏవండోయ్ వీధిలోకి కూరలు బండి వచ్చినట్లుంది .వెళ్ళి రెండు కూరలు తీసుకోండి.'
 
పేపర్ పక్కనపడేసి తువ్వాలు భుజం చుట్టూ కప్పుకుని గేటు తెరిచి రోడ్డు మీదికి వచ్చాడు గిరీశం.
 
" బాబు !కూరలు! ఇటురా!" దగ్గరగా వస్తున్న ఆ ఆకారాన్ని ఆశ్చర్యపోయాడు.
 
అతను నాంచారయ్య.
 
" ఇదేమిటి నువ్వు కూరగాయలు కూడా అమ్ముతావా ?"
 
నాంచారయ్య నవ్వాడు.
 
"అపుడు చెప్పాను కదా బాబు. ఖాళీ ఎక్కువైతే తలలో పురుగులు దొలుత్తాయి అని. నాకు ఎన్ని రకాలుగా సంపాదించడం వచ్చొ,అన్ని రకాలుగానూ సంపాదిత్తా. పగలు 10 గంటల కల్లా రిచ్చా బేరాలు తగ్గుతాయి బాబు. అప్పటి నుంచి నాలుగింటి వరకు కాలనీలలో పళ్ళు, కూరలు అమ్ముతా.నాలుగింటినుంచి మళ్ళీ రిచ్చా బేరాలు చూసుకుంటా. రేపటి నుంచి నేను ఇంకో కాలనీ కి వెళ్తా. అమ్మాయికి ఈ కాలనీ అయితే దగ్గరగా ఉంటుందని అలవాటు సేత్తన్నా."అంటూ వెనక్కి తిరిగి ఎవరికోసమో చూస్తూ అన్నాడు.
 
"అమ్మాయి ఎవరు?"గిరీశం మాట పూర్తికాకుండానే ఆ 'కలువ బాల' బండికి దగ్గరికి వచ్చింది.గిరీశాన్ని చూస్తూనే చేతులెత్తి నమస్కరించింది.
 
" ఇదిగో అయ్యా డబ్బులు!" అంటూ నాంచారయ్య కిచ్చింది.
 
గిరీశం ఆశ్చర్యం నుంచి తేరుకునే లోగానే మళ్లీ నాంచారయ్య అన్నాడు
 
"బాబుగారు! ఈ మడుసులు ఎప్పుడు ఎక్కడ ఎట్ట కలుత్తారో సెప్పలేం. ఆడది డబ్బు సంపాదించాలంటే తాను చెడిపోయి, ఆరోగ్యం సెడకొట్టుకుని మరో పది మంది ఆరోగ్యాలు సెడగొట్టడం కన్నా, అందరి ఆరోగ్యాలు బాగుండేలా సేసే కూరగాయలు,పళ్ళు అమ్ము కుంటానని అమ్మాయి నాతో అంది బాబు.
తన కాడికి వచ్చి పశువుల్లా ప్రవర్తించిన వాళ్ళ కన్నా కామదేనువులా మంచి మార్గం సూపించిన మీ మంచితనానికి అమ్మాయి మనిషి అయింది బాబు. ఇదంతా బాబు మీ పున్నెమే బాబు." అన్నాడు వణుకుతున్న కంఠంతో.
 
"లేదయ్యా. ఇందులో నీ పాత్ర కూడా ఉంది. నీరే అయినా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. నువ్వు శంఖానివి .నేను ఆ తీర్థాన్ని. ఆమె ఆ శంకు తీర్థం తాగింది అంతే ."అన్నాడు గిరీశం తల దించుకున్న ఆమెను మెరిసే కళ్ళతో చూస్తూ.
 
" అబ్బా. రెండు కూరలు తీసుకోమంటే ఎక్కడికక్కడ బంకమన్ను లా అతుక్కుపోతారు కదా. ఎంతసేపు? నేను కత్తిపేట ముందు కూర్చుని అరగంట అయింది." వసుంధర అరుపులు హాల్లోంచి వినబడడం తో నాంచారయ్య వెళ్లడానికి విద్యుక్తుడవుతూ అన్నాడు.
 
" రోజు కూరలు తనకాడే తీసుకోండి బాబు.ఎల్లోత్తాం బాబు
 
ఆమె మౌనం శిఖరంలా గిరీశానికి నమస్కరించి ముందుకు నడుస్తూ ఉంటే కూరలతో లోపలికి అడుగు పెడుతున్న అతనికి అత్యంత ఇష్టమైన పాట యాదృచ్ఛికంగా టీవీ లో వస్తోంది.
 
"నిన్నటిదాకా శిలనైనా...
నీ పదము సోకి నే గౌతమినైనా...!"
 
సమాప్తం

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Story chala chala bagundi
Like Reply
#3
very happy for your comments my friend, please read earlier stories too

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#4
Wow superb Andi..Baga rasaru...
Deepika 
[+] 1 user Likes Deepika's post
Like Reply
#5
It is not written by me, just posted after reading for readers here

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#6
Nice superb story  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)