17-06-2023, 06:46 PM
"ఆవు చర్మం తొడుక్కున్న పెద్దపులి !""
- Raghavendra Rao Nallabati
మాధవరావుగారు నిలువెత్తుమనిషి. ఒకలా చెప్పాలంటే... 65 కేజీల మాధవరావు గారు ఇంట్లో.. ఆయనంత బరువైన బంగారపు వస్తువులూఉన్నాయి. కోడళ్లకు...కూతుళ్ళకు పంచగా.. ఇంకా సగం పైన మిగిలిఉంటుంది. ఇంకా.....పొలాలు..తోటలు...! శివాలయం ఎదురుగా ఉన్నసందులో పార్కు ని ఆనుకొని అతిపెద్ద పాలరాతి భవనం...అధిపతి మాధవ రావుగారు! దాని విలువ రెండు కోట్ల పైమాటే! అంతేకాదు ఆ టౌన్ లో...లీడింగ్ లాయర్....
ఒకప్పుడు. అమెరికాలో ఉన్న కొడుకు ఆనంద్ తన దగ్గరకు తీసుకెళ్లి పోదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదు. హైదరా బాదులో ఉన్న కొడుకు కూడా వచ్చేయమని చాలాసార్లు అడిగి చూశాడు. ఒప్పుకోలేదు మాధవరావు గారు. 'వచ్చే టైంలో వస్తానులే".. అనేవాడు. అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్య మాధవరావుగారు బక్కచిక్కిబల్లిలా అయి పోయాడు.అతను బల్లి లా చిక్కినా బంతిలా బలిసినా గుర్తించే వాళ్లే లేరు. అదే టౌన్ లో ఉన్న తన అన్న గారు..వాళ్ళ ఇద్దరుకొడుకులు, తన మేనమామ అతని కొడుకులు ... వాళ్లు మొత్తం అందరితో సంబంధాలు బాగానే ఉన్నాయి.... కానీ.. ఈస్పీడు ప్రపంచంలో.... ' బిందె బిందే..'.' మూతమూతే ..' ! అన్నట్టు బ్రతికేస్తున్నారు అందరూ!!!!
ఉపోద్ఘాతం నుండి తిరిగి అసలు కథలోకి వచ్చేస్తే..అడుగో వస్తున్నాడు అతడి పేరే సుబ్రామయ్య.అతని చంకలో బిందె..ఏమిటి అనుకుంటున్నారా..అదిగో అక్కడే అసలు కథ మొదలైంది. అతడే ఈ కథకి హీరో. నిరుపేద అనలేము.. మధ్య తరగతి అనలేం..దానికి దీనికి మధ్యరకం గాడు. 'గాడు' అంటే..పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే సీనియర్సిటిజన్... అతను. ఈ మధ్యనే తనకు ఉన్న అతిబుల్లి బంగాళా పెంకుటిల్లు పడగొట్టి.. అతి చిన్న డాబా వేసుకుంటున్నాడు. అలా వేసు కున్నంత మాత్రాన ఏమిపర్వాలేదు..అతను ఉంటున్నది లాయర్ మాధవరావుగారి ఇంటి ఎదురుగా. అదిగదిగో అదే పెద్దతప్పు అయింది. ఇద్దరిదీ ఒకే కులం అయినా.. మాధవరావు గారికి సుబ్బరామయ్య ని చూస్తే.. తన కళ్ళల్లో ఎవరో గునపాలతో పొడుస్తున్నట్లు ఉంటుంది.
" సార్.. సార్ మా నీటిపైపు రిపేర్ వచ్చింది ఒక బిందెడునీళ్ళు.....మీ గేటులోపల పక్కనే ఉన్న పైపు కొట్టి ..పట్టుకువెళ్తాను. మేస్త్రీలు పని చేయకుండా ఆగిపోయారు" భయపడుతూ అడిగాడు.
" ఆగాగు.. నీళ్ళు కావలసి ఉంటే గేటు బయటనుంచి అడగాలి కానీ అలా గేటు తీసు కుని సరాసరి లోపలికి వచ్చేయడమే. నీకు నీళ్ళు కొట్టి ఇవ్వడానికి మాపనిమనిషి రాలేదు. ఇంకెవరినైనా అడుగు " మేడపైనుండి అరిచి నట్టు అన్నాడు మాధవరావుగారు.
"అదేమిటి సార్ ఎదురింటి వాడిని. పైపు నేను తోడు కుంటాను.... ఒక బిందెడు..నీళ్లే కదా!"
" నీకు అలాగే ఉంటుంది..నా కుళాయి రిపేర్ వస్తే.. నువ్వుబాగు చేస్తావా....నేనా బయటికి వెళ్ల లేను.. మాపిల్లలు ..ఎక్కడో దూరంగా ఉన్నారు. వెళ్ళుబాబు వెళ్ళు" మళ్లీ అరిచాడు మాధవ రావుగారు...
ఖాళీబిందెతో వెనుతిరిగాడు సుబ్రా మయ్య.
"ఆమధ్యకోర్టువ్యవహారాలు కేసులో జనం గొడవకు వస్తే నేను సర్దిచెప్పి పంపించేశాను.. అది కూడామరచిపోయాడు..మొన్నీమధ్య నైట్ బ్లడ్టెస్టింగ్ కోసం....డాక్టరు రాకపోతే ..మా తమ్ముడు గారి అబ్బాయి ఆర్ఎంపీ డాక్టర్ని ,
తీసుకొచ్చి చేయించాను ....అతను పడు కున్నప్పుడు.... ఇంకా చాలా సహ కారాలు చేశాను.. మొత్తం అన్ని మరచిపోయాడు...ఏం మనిషో"..
సుబ్రామయ్య పైకేకాదు..మనసులోనుకూడా
ఈ విషయాలు తలుచుకోలేకపోయినంత అర్భకుడు!
**** ***** *******
మాధవరావుగారు నీరసంగా కూర్చున్నాడు తన ఇంటి పక్కనే ఉన్న పార్కు లో.. సిమెంట్ బల్ల మీద.
"వేడి...వేడి .....మసాలాగారి......వేడివేడి మసాలా గారే... " ఓ రెండు మసాలా గారెలు కొనుక్కొని తింటున్నాడు.
" సార్ మీరు ఇలాంటి చిరుతిళ్ళకు కొంచెం దూరంగా ఉండాలి".
" ఎవరు? ".. కసక్కన వెనుకకు తిరిగి చూశాడు.. .. ఇంకెవరు... అప్పుడే వచ్చిన సుబ్రామయ్య.
"అవునుసార్ మొన్న నేను బిందెడునీళ్లకు వచ్చినప్పుడే మీరు ఆయాసపడుతూ కని పించారు. మీ ఇంటి ఎదురుగానే ఉంటున్నాను మీరు బాగా ఉండా లని నాకోరిక..మీరు ఆరోగ్య సూత్రాలు పాటిం చాలి సార్".
. " మాధవరావుగారు వింటున్నాడు ... మసాలా గారెలు తింటున్నాడు. కానీ తాను కూర్చున్న బల్లమొత్తం ఖాళీగా ఉన్నప్పటికీ సుబ్రామయ్య ను.. పక్కగా వచ్చి కూర్చో మన లేదు. సుబ్రామయ్య నిలబడే ఇంకా చెప్పుకు పోతున్నాడు.
"అవునుసార్..మెడిసన్ కన్నా ఆహార నియమాలు కొంచెం మార్చుకుంటే.. ఆరోగ్యం చాలా బాగుంటుంది సార్." మాధవరావుగారు ముక్కు చీదుకుంటూ ఇంకా మసాలా గారెలు చప్పరిస్తూనే ఉన్నాడు.
" ఉదయం ఆరు గంట లకే వేడినీళ్లలో ఉప్పువేసి పుక్కిలి పట్టాలి. అలాచేస్తున్నారా? " తలకాయ తలతిక్కగా తిప్పాడు మాధవ రావుగారు
"ఆ తర్వాత వేడి నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి తాగాలి...చేస్తున్నారా? " "ఇప్పుడు రాత్రి నానపెట్టిన..నాలుగు బాదం రెండుఎండుద్రాక్ష తినాలి అలాచేస్తున్నారా?" లేదు.. అన్నట్టు కింది పెదవి కిరుక్కున్న మెలి తిప్పాడు. ఎనిమిది గంటలకు చోడిపిండి జొన్నపిండి సజ్జపిండిలతో ఏదో రకమైన టిఫిన్.. ఒక కప్పు మిరియాల టీ. 9 గంటలకు జామకాయ కానీ బత్తాయికాయ గాని.. 10 గంటలకు ఏదో ఒక కషాయం..11 గంటలకు కొద్దిగా జ్యూస్..ఒంటి గంటకు భోజనం... భోజనంలో పప్పుకూర, ఆకుకూర, కొద్దిగా నెయ్యి, ముఖ్యంగా బ్రౌన్రైస్, కరివేపాకు పొడి ,అవిసెపొడి, నువ్వులపొడి... సాంబారు, పలుచనిమజ్జిగ.. చివర ఒక అరటి పండు....... అర్థ గంటకు ఫ్రూట్ సలాడ్.. మల్టీ విటమిన్ టాబ్లెట్.... నాలుగుగంటల వరకు నిద్ర. ఆ తర్వాత మళ్లీ కొద్దిగా కషాయం.. 6:30 కురెండు మూడు పళ్ళు... కొద్దిగా కొబ్బరి బొండంనీరు, పడుకునేటప్పుడు మళ్ళీ కొద్దిగా వేడి మిరి యాల పాలు.. సాల్టువద్దు ...సైంధవ లవణం మాత్రమే!... 70 గ్రాములు నెలకు... ఆయిల్ మాత్రం సన్ఫ్లవర్, రైస్బ్రాన్, గ్రౌండ్నట్.. నెలకు ఏడువందలగ్రాములు. రాత్రి త్వరగా పడు కోవడం. ఈరకంగా పాటించండి సార్... ఒక నెలచాలు... ఆ తర్వాత బీపీ ,షుగర్, కీళ్ల నొప్పులకు టాబ్లెట్ వేసుకోనవసరం లేదు. ఇదంతా నేను "ఆరోగ్యానికి డాక్టర్గారి సలహాలు" అనే టీవీ కార్యక్రమంలో విని మీకు చెబుదామని నోట్ చేసుకున్నాను సార్.."చెప్పడం ఆపాడు సుబ్రామయ్య... చదివి వినిపించిన కాగితాన్ని జేబులో పెట్టుకుచదివి
మాధవరావుగారు పేలవంగా ఉండే నవ్వు ఒకటి నవ్వి... " ఇవన్నీ తెచ్చి నా ఇంటి దగ్గర పెట్టు..నేను తినిపెడతాను.. "..అన్నట్టుచూస్తూ వెళ్ళిపోయాడు.
***** ******* ****** .
"తందాన తాన అక్కడ దొంగ ఇక్కడ దొర అంతా కలిపి దోమల గుట్ట"..... పిచ్చివాడి పిచ్చి పాటకాదండి ఇది బాబు... అడుగో ఐదు అడు గులకి గుప్పుడు తక్కువ మనిషి ఒకడు వస్తు న్నాడు చూడండి...బానపొట్ట..బట్టతలగుండు
... అతని పేరే......కెంపురావు... సుబ్బారావు కాదండోయ్.. సుబ్రావు అంతకన్నా కాదు.. అలా గని....' కంపురావు' అసలే కాదండోయ్ బాబు. ఖచ్చితంగా ' కెంపురావే' అతని పేరు. ఏంటి ఇతని స్పెషాలిటీ..అనుకుంటున్నారా.. ఇప్పుడు స్పెషల్ అంతా ఇతనే.... ఇలా ఏదో ఏదో పాడు కుంటూనే నడుస్తూఉంటాడు. పాట లేక పోతే నడక మరిచిపోతాడు...వెరసి ఇతను సంక్రాంతి దాసు లాంటి వాడు...'హరిలో రంగ హరి హరి హరి శ్రీమద్రమారమణ గోవిందో హరి..'.
ఇతగాడు...అరువదిఐదు సంవత్సరాల మన నిలువెత్తుమనిషి మాధవరావుగారు ఇంటికి 40 అడుగుల వెనుక ఉండే రెండం తస్తుల బిల్డింగ్ యజమాని.
ఐదేళ్ల క్రితం మాధవరావుగారు భార్యామణి కరుణమ్మ ఖాళీ బాల్చీ తన్నేసి గడప మీద పడి పోయి మళ్లీ పైకి లెగలేక పోయింది. ఆవిడ శవం గడప దాటడానికి ఆలస్యం అవు తుంటే.. ఆ కంపు భరించలేక మన కెంపురావు కొంచెం ప్రయత్నం చేసి శవాన్ని.. గడప కాదు.. ఊరు కూడా దాటించాడు. అదిగో అప్పటినుండి మాధవరావుగారు ఆరో ప్రాణం కెంపురావే..! మూన్నాళ్ళు తిరక్కుండా మాధవరావుగారి ఇంటి, వంటి, వంటింటి, బయటింటి...పూర్తి విషయాలన్నీ మన కెంపు రావు... అధీనంలోకి వచ్చేసాయి అంటే కెంపు రావు పట్ల మాధవ రావుగారి సదభిప్రాయం ..ఆహ్..ఓహో..అనక తప్పదు!!
ఒకసారి మణిమాణిక్యాలు కెంపులు ఉన్న బీరువా లాక్ మాధవరావుగారు కి కన పడక పోతే దుప్పటి మడతల్లో నుంచి కెంపురావే తీసిచ్చాడు. ఇంకొక సారి బంగారు బిస్కెట్లు ఉన్న బీరువా బీగం బిగుతుగా బిగుసుకుపోతే కెంపురావు చాలా ఈజీగా తీసేసాడు. ఎందుకు ఇంత గోల..పెద్దగోల ... మాధవరావుగారు ఏ నిమి షానికి ఏటాబ్లెట్ వేసుకోవాలో.. ఏ ఇంజ క్షన్ చేయించు కోవాలో కెంపురావు కంటిచూపు లోనే విడుదలవు తాయి. మాధవరావుగారు వేసే ప్రతి అడుగు కెంపురావు కెంపులు పొదిగి ఒదిగితేనే పడతాయి.
ఇప్పుడు చెప్పండి.....ఆఫ్ట్రాల్ ఆ బిందెడు నీళ్ళుసుబ్రామయ్య.....ఈకథకి..హీరోఅంటే...
ఎలా.. ?
మనకెంపురావు ..మాధవ రావుగారు పాలిటి అపూర్వమైన హితుడు కాదా?? అపురూపమైన హితుడుకాదా.?? "అత్యద్భుతమైన..........."!!!! అమ్మో ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఎందుకంట?అసలు...కథ లో ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండకూడదా ఏంటి??. అదీ కెంపు రావు కథ... మరచి పోదామన్న మరిచిపోలేని రూపం అతనిది.
****** ********* ********
పదిహేను రోజుల తర్వాత "గడిబిడి గడిబిడి గంగాలమ్మ.. గోలపెట్టకె.. గుడి గుడి గుణ రాజమ్మ...."...ఈ సరికే అర్థం అయిపోయి ఉంటుంది... ఆ వచ్చేది కెంపురావు అని ...... అతను వస్తూ సుబ్రామయ్య ఐస్క్రీం బండి దగ్గర ఆగాడు.
"హలో హాయ్... బాగున్నావ్రా సుబ్రామయ్య మొన్న చేగోడీలు.. అంతకుముందు పల్లీలు.. అంతకుముందు ఇడ్లీలు.. దానంతకుముందు మిరపకాయ బజ్జీలు.. ఈ వేళ ఐస్ క్రీమ్.. గంట కో వేషం బలే వేస్తావ్ రా"
" నీకే బాబు జనాన్ని బుట్టలో తట్టలో బెట్టి నాలుగిళ్లు సంపాదించావు."
" నువ్వు సంపాదించుకో రా వద్దన్నానా?.. సరే మంచి ఐస్ క్రీమ్ ఇవ్వరా ."
"30రూపాయలుది ఇస్తానురా. బాగుం టుంది"
" ఎంతైనా పర్వాలేదు... మాధవరావుగారు డబ్బులు లేనోడా ఏంటి? ఆయనే తెమ్మన్నారు."
"ఆయనకా ఐస్క్రీమ్...ముందే ఈమాట ఎందుకు చెప్పలేదు ....మాధవరావగారికి అయితే అసలు ఇవ్వను...నా దగ్గర ఐస్క్రీములు ఐపోయాయి రా..లేవు. ఐస్క్రీమ్ తింటే ఆయన ఆరోగ్యం దెబ్బ తింటుంది ... ఇవ్వను. ఇవ్వను గాక ఇవ్వను."
" నోరు ముయ్యిరా నీకెందుకు ఆయన గొడవ?"
"నువ్వు ఆయన ఇంటి వెనుక ఉంటున్నావు నేను ఆయన ఇంటి ఎదురు ఉంటున్నాను. నా కూ బాధ్యత ఉంటుందోయ్."
" బోడి బాధ్యత. ఇస్తావా లేదా?.. ఒరేయ్.. ఐస్ క్రీం తింటే మనుషులు చచ్చిపోతారా?"
" చావరు. ఆయన మొన్న డెంటల్ హాస్పిటల్ దగ్గర కనపడ్డారు. ఆయనకు పళ్ళు సమస్య ఉంది. ఐస్క్రీమ్ తింటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. పళ్ళు తీసేస్తే ఎలానములు తారు.. అప్పుడు ఆరోగ్యం చెడి పోతుంది.... అందుకని ఐస్క్రీమ్ ఇవ్వను."
" ఓర్నీ.. ఆయన ఏదో నీ సొంత పెదనాన్న అయినట్టు మాట్లాడుతున్నావు..నువ్వు ఇలా అన్నావ్ అని ఆయనకు చెప్తా.. దగ్గరలో ఐస్ క్రీమ్పార్లర్ లు లేవు... నువ్వు ఇవ్వలేదని చెబితే నీ పని ఆయనే చూసుకుంటాడు."
****** ******** *******
పార్కులో కాళీబల్లమీద వచ్చికూర్చున్నాడు మాధవరావు గారు.. అడుగో వస్తున్నాడు.. జీడి పిక్కల జగన్నాథం.. అవునండి.. ఖచ్చి తంగా జీడిపిక్కల జగన్నాథమే అతని పేరు. కోర్టులో మాధవరావుగార్కి కొలీగ్... ఈయన కూడా పెద్ద హీరో గారే ఈ కథకి.. మూడో హీరోగారు అన్న మాట!!!
సరే ఎంత మంది హీరోలు ఉంటే అంత మంచిది!! వచ్చి కూర్చున్నాడు మాధవరావు గారి పక్కనే.
" బాగున్నారా.. మాధవరావుగారు.. మీరు అమెరికా వెళ్తున్నట్లు తెలిసింది... ఓ విషయం అడుగుదామని పనిగట్టుకు వచ్చాను మాధవ రావుగారు.. మీ దగ్గర ఉన్న లా బుక్స్ కొన్ని నాకు ఇచ్చి వెళ్లండి మీరు వచ్చాక పువ్వుల్లో పెట్టి ఇంటికి పట్టుకు వచ్చి మరి ఇస్తా... ఒకవేళ మీరు.... ఇవ్వలేదు అనుకోండి.. ఏం చేస్తాను.. స్నేహితుడికి ఆమాత్రం కూడా ఉపయోగించ లేదని బాధ పడను.కోర్ట్ లో పది మందికి కూడా చెప్ప నండోయ్.. మీకుతెలుసుగా ఈ జీడిపిక్కల జగన్నాథం జీడి లా పట్టుకోవడము తెలుసు.. పాదరసంలా.... వది లేయడమూ తెలుసు." అంటూ పుసుక్కున పైకి లేచిపోయాడు.
" కూర్చో కూర్చో..ముందు కూర్చోవయ్యా.. కోర్టులోనూ నీతో ఇదే పెద్దచిక్కొచ్చిపడిందయ్యా ప్లస్..మైనస్ నువ్వే అనేస్తావ్. ఎదుటి వారికి కాస్త మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం నీకు ఈ జన్మకి అలవాటు కాదనుకుంటాను. నేను అమెరికా వెళు తున్నాను వచ్చేవారం..చివర్లో. అక్కడున్న మా అబ్బాయి అన్ని ఏర్పాట్లుతో రెండు రోజుల్లో వస్తున్నాడు. నేను తిరిగి రావడం మూడేళ్లు పట్టొచ్చు. అక్కడ ఏదో కొత్త బిజినెస్ మొదలు పెట్టాడట....అది నన్ను చూసుకోమంటున్నాడు. సరే అంతవరకూ నీకు కావాల్సిన పుస్తకాలు ఈ రోజే వచ్చి పట్టుకొని వెళ్ళు." అంటూ అందక పోయినా గడ్డం పట్టు కున్నట్టు చెయ్యి కదిలిస్తూ అన్నాడు మాధవ రావుగారు.
" హమ్మయ్య ఇప్పుడు కదా నా మనసు ప్రశాంతత పడింది.. ఇప్పుడు కదా నా శరీరం చల్లబడింది.. ఇప్పుడు కదా..."
" ఆపవయ్యా.. నీనాటకాల పిచ్చి ఇంకా తగ్గలేదన్నమాట."
" అది సరే.. వచ్చే వరకూ ఇల్లు పాడవ కుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు....
మాధవరావు గారు?" అడిగాడు జీడిపిక్కలు జగన్నాథం.
" నీకు తెలుసు కదా. "కెంపురావు" ఆ దేవుడు నాకు ఇచ్చిన కోరని వరం!.. మా ఇంటి తాళాలు అతనికి ఇచ్చివెళ్తే నాకు చాలా హాయిగా నిద్రపడుతుంది. నేను మూడేళ్లకు తిరిగి వచ్చేసరికి పూచిక పుల్ల తోసహా నాకు అప్ప చెబుతాడుఅన్న...సంపూర్తిధైర్యం, నమ్మకం..నాకు ఉన్నాయి. అలాంటి నిఖా ర్సయిన మనిషి మన ఊర్లో ఇంకె వరూ లేరు అన్నది నా ఉద్దేశం. ఐదేళ్లు నుండి అతను నా నమ్మిన బంటు.. తప్పు.. తప్పు.. హితుడు..!అతను అత్యద్భుతమైన మనిషయ్యా బాబు!" ఆనందంగా చెప్తూ కొద్దిగా గాలివాన మొదల వడంతో పైకి లేచాడు మాధవరావు గారు.
"అవునా..నిజమా చాలా విచిత్రంగా ఉందండి మాధవరావుగారు మీరు చెప్పే విషయం. ఆ బానపొట్ట, బట్టతలగుండు...
..అదేనండి మీఇంటి వెనుక ఉన్న కంపురావు గురించేనా మీరు చెప్పేది."
"అందరూ అక్కడే పొరబడుతున్నారు. అతని పేరు కంపురావు కాదు కెంపురావు!" గాలివాన పెద్దగా అందుకుంది. జీడిపిక్కల జగన్నాథం కూడా పైకి లేచి.. మాధవరావుగారి కూడా నడక మొదలుపెట్టాడు..
"కంపురావు..అంటున్నారే..సారీ ....కెంపు రావు.. అంటున్నారే. అతను మీకు... అయిదేళ్ల నుంచి తెలుసు. నాకేమో ఇరవై ఏళ్ల నుంచి తెలుసు.... కెంపురావు అప్పటినుండి నా క్లయింటు..."
ఉదృతంగా గాలి వాన వస్తుంది. ఇద్దరూ పరుగు లాంటి నడకతో నడుస్తున్నారు. జీడి పిక్కల జగన్నాథం మాధవరావు గారికి ఏదో చెప్తున్నాడు. అది ఆయన ఒక్కడికే వినబడు తుంది.! మిగిలిన ఊరందరికీ వినబడక పోతే వచ్చే నష్టం ఏమీ లేదు కనుక అక్కడితో సీన్ కట్ చేద్దాం.
****** ******* *******
రెండు వారాలు గడిచింది. అమెరికాలో ఉన్న కొడుకు ఆనంద్ రావడం..... తండ్రిని అమెరికా తీసుకువెళ్లడాని కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిపోయాయి. ఈ రోజే వాళ్ల ప్రయాణం. మరో గంటలో...
"డాడీ కావాల్సినవన్నీ బ్యాగుల్లో పెట్టేసాను. ఓగంటలో మనంబయలుదేరుతున్నాం ..వెళ్లి మీఅత్యద్భుతమైనహితుడు ... అదే మీ ఆరో ప్రాణం కెంపురావుగారిని తీసుకు వస్తాను. జాగ్రత్త విషయాలన్నీ చెప్పి మన ఇంటి ముఖ్య మైన మెయిన్తాళాలు అతనికి ఇచ్చేస్తే మనం వెళ్ళి పోవచ్చు." అన్నాడు కొడుకు ఆనంద్.
" వద్దురా.. కంగారుపడకు.. నామనసు మార్చుకున్నాను. కెంపురావు గురించి కొన్ని నిజాలు తెలుసాయి. నా కొలీగ్ జీడిపిక్కల జగన్నాథం తెలుసుగా.. అతను చెప్పినదే కాకుండా.. ఆ బాధితులను అడిగి కూడా తెలుసుకున్నాను. కెంపురావు ఎక్కువవడ్డీకి ఇంటి దస్తావేజుల మీద తనఖా అని చెప్పి డబ్బులు ఇచ్చి నిరుపేదలను మోసంచేసి వాళ్లను కోర్టుల చుట్టూ తిప్పి ..భయపెట్టి ... నాలుగుఇళ్లు సంపాదించటం..నిజంరా..
సరే. ..అది అతని వ్యాపారం అనుకుందాం... కెంపురావు మన ఇంటి బీరువా తాళాలు విషయం లో పడిన జాగ్రత్త.... మనరహస్యాలు లోటుపాట్లు మీద.. పెంచుకొన్నంత అవగాహన లక్షపాళ్లు అయితే అందులో ఒకవంతు కూడా నా ఆరోగ్యం పట్ల పెంచుకోలేకపోయాడు రా"
" అదేంటి డాడీ... కెంపురావు గురించి ప్రతి రోజు నాకు ఫోన్లో అంత గొప్పగా చెప్పేవారు. అత్యద్భుతమైన హితుడు అనేవారు."
" అత్యద్భుతమైన హితుడేరా ...అది మన ఆస్తిపాస్తుల పట్ల.....మనం... ఆదమరచి ఉంటే రెండుకోట్లు విలువైన మనబిల్డింగ్ కూడా అతని పరం కావచ్చు అన్న భయం పట్టుకుంది రా. ఇప్పుడు నా కంటికి వాడొక 'గోముఖవ్యాఘ్రం' లా కనిపిస్తున్నాడు రా..." అన్నాడు మాధవ రావు గారు.
" ' గోముఖవ్యాఘ్రమా..? ' అంటే ఏమిటి డాడీ?..".. ఆశ్చర్యంగా అడిగాడు కొడుకు ఆనంద్.
" అంటే..ఆవు ముఖం పెట్టుకున్న పెద్దపులి రా"."
" మరిప్పుడెలా ఎవరికి ఇద్దాం తాళాలు ఇక్కడ ఉన్న మన బంధువులు ఎవరినైనా పిలుద్దామా."
" వద్దురా..అందుకోసం ఒకడున్నాడు రా. నా ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించిన వాడు నేను....ఐస్క్రీమ్ తింటే...చచ్చిపోతానేమో... అన్నంతభయపడినవాడు....నాకు....నిజమైన "అత్యద్భుతమైన హితుడు!" ఒకడున్నాడు రా."
"మరింకే అతని పేరు చెప్పండి లేకుంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను వెళ్ళి తీసుకు వస్తాను"
ఆతృతగా అడిగాడు కొడుకు ఆనంద్.
" వద్దురా ఆనంద్...ఎదురు ఇల్లే కదా మనమే వెళ్లి అతన్నిక్కడకు తీసుకువద్దాం. పద ."
" డాడీ... మనమే అక్కడకు వెళ్లడమా? అదేమిటి..?మనం??!!"
" అవున్రా మనమే అక్కడకు వెళదాం... తప్పేముంది. ఇది నా మనసు తీసుకున్న నిర్ణయం. అంతేకాదురా ఆనంద్...మన ఇంటి ముఖ్యమైన తాళాలు మాత్రమే కాదు మన బీరువాల రహస్య తాళాలు అన్నీ కూడా అతనికి ఇచ్చేయొచ్చు.!!!"
మాధవరావుగారి వెనుకగా ఆయన కొడుకు ఆనంద్ నడుస్తున్నాడు.. మాట్లాడకుండా....
ఎదురింటి వైపు.
------

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ