Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic చిన్న కథలు
#1
చిన్న కథ 
రచన: కర్లపాలెం హనుమంతరావు 


టీవీ సీరియల్ కమర్శియల్ బ్రేక్ లో రాంబాయమ్మగారికి గుండెపోటొచ్చింది. ఎపిసోడయిందాకా కదలనని మొండికేయడం వల్ల గుండెకొచ్చిన ప్రమాదం మరింత హెచ్చింది. 
ఐదు నక్షత్రాల ఆసుపత్రి, అనుభవజ్ఞులైన వైద్యులు.. సంగతెలా ఉన్నా టీవీ సోపుల మీదున్న  అకుంఠిత అభిమానం ఆమె ప్రాణాలని నిలబెట్టింది. 
ఆపరేషన్ టేబుల్ మీదున్నప్పుడు  రాంబాయమ్మగారికి దేవుడితో చిన్న భేటీ అయింది. దైవ దర్శనం కాగానే ఆమె దేవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్న' నాకింకా ఎంతకాలం భూమ్మీద నూకులున్నాయ్ ? ' 
'నలభై మూడేళ్ల రెండునెల్ల మూడురోజులమీద నాలుగ్గంటలా ఐదు నిమిషాల ఐదు సెకన్లు' అన్నాదు దేవుడు. 
దేవుడిమాటమీద గురితోనే రాంబాయమ్మగారు ఆపరేషను సక్సెసయిందనిపించి ప్రాణాలతో లేచికూర్చున్నారు. 
'ఎలాగూ  మరో అర్థశతాబ్దం బతకబోతున్నాం గదా! ఇంకా ఈ ముడతలుబడ్డ ముఖం, బాన కడుపు, ముగ్గుబుట్ట జుట్టు, బోసి నోరు, వంగిన నడుంతో ముసిల్దానిలాగా ఎందుకు బతుకు నిస్సారంగా గడపాలి? మానవజన్మ మళ్ళీ మళ్లీ రాబోతుందా? అందులోనూ ఆడజన్మే దొరుకుతుందన్న గ్యారంటీ ఉందా? అన్నీ ఉండి అనుభవించేందుకు కట్టుకుపోయినంత ఆస్తి తనకుమాదిరిగా ఎంతమందికి ఉంది? అడ్డుచెప్పే కట్టుకున్నవాడూ భూమ్మీదలేని అదృష్టం  తనది.' అన్నివిధాలా అచ్చొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దృఢనిశ్చయానికొచ్చింది రాంబాయమ్మగారు.
గుండాపరేషనైన ఆసుపత్రిలోనే ఫేస్ లిఫ్టింగ్, ఫ్యాట్ సక్కింగ్, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్ రికవరింగ్, హెయిర్ ట్రాన్స్ ప్లాంటింగ్.. వగైరా వగైరా ఓ పది లక్షలు పారేసి  టోటల్లీ బాడీ రీమోడలింగు చేయించేసుకుంది రాంబాయమ్మగారు. 
పది లక్షలు పోతే పోయాయిగాని.. రాంబాయమ్మగారిప్పుడు  రంభను తలదన్నే మోడల్ గా మెరిసిపోతోంది.
ఆ ఉత్సాహంలో ఆఖరి ఆపరేషన్ కూడా  విజయవంతంగా ముగించుకుని ఆసుపత్రి బైటకొచ్చి రోడ్డు  దాటుతుండగా లారీ ఒకటి దూసుకొచ్చి రాంబాయమ్మగారిని లేపేసింది.
మళ్ళీ దేవుదిగారితో భేటీ తప్పింది కాదు. భగవంతుణ్ణి చూడంగానే భగభగ మండింది రాంబాయమ్మగారికి. 
కడుపులోని కోపాన్నంతా వెళ్లగక్కుతూ 'నలభైముడేళ్లకు పైగా ఆయుర్దాయం ఉదంటివే?మీ  దేవుళ్ళూ మా లోకంలోని రాజకీయ నాయకులకు మల్లే మాటమీద నిలబడకపోతే ఎల్లాగయ్యా? ముల్లోకాలకింకేం గతి?' అని ఎడపెడా వాయించడం మొదలుపెట్టింది దేవుడు కంటపడీ పడకముందే రాంబాయమ్మగారు.
'సారీ!రాంబాయమ్మగారూ! లారీ గుద్దింది ఎవరో రంభననుకున్నాను.. రాంబాయమ్మగారిననుకోలేదు' అని నాలిక్కరుచుకున్నారు దేవుడు గారు!
***
[+] 4 users Like అన్నెపు's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
దాత
అనసూయ కన్నెగంటి

రాఘవాపురం అనే ఊర్లో  రామయ్య అనే ఒక రైతు  ఉండేవాడు.  ఆ రైతుకి ఒక అలవాటు ఉండేది. అదేమిటి అంటే  తన పొలంలో ఏ రకమైన పంట పండినా అందులో పదవ వంతు పంటను పేదలకు పంచిపెట్తటం. అలా పంచిన తర్వాతే  మిగతా పంటను తన కుటుంబ అవసరాలకు వాడుకునే వాడు.అతనికి ఉన్న ఈ అలవాటుని భార్యాపిల్లలూ కూడా ఇష్టపడేవారు.  
అయితే ఒకసారి పంట కోతకు వచ్చే సమయానికి బాగా వర్షాలు పడి పంటంతా నీట మునిగి నాశనమై పోయింది.   దాంతో చాల బాధపడిపోయాడు రామయ్య.
తన కుటుంబం గురించి అతనికి చింత లేదు. మంచినీళ్ళు త్రాగి అయినా బ్రతికెయ్యవచ్చు అనుకునేవాడు. అతని బాధ అంతా తను పేదలకు పంచే పంట గురించే.  
 “ అంతగా బాధపడకండి. పంట మునిగిపోయింది కాబట్టి పంచలేకపోయారు. మునిగి ఉండకపోతే పంచేవాళ్లమే కదా! “ అంది రామయ్య భార్య.  
 “ మనకు పండలేదని వాళ్లకు ఆకలి లేకుండా పోదు కదా. ఆకలి ఆకలే. అయినా పండితేనే ఇస్తాము అనేది అంత సమంజసం కాదేమో అనిపిస్తుంది.”
 “ మీరు చెప్పింది నిజమే. కానీ” తనదు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము “ అన్నారు పెద్దలు. మనకే లేనప్పుడు మనమెలా దానధర్మాలు చేయగలము . ముందు మన ఆకలి తీరే మార్గం ఆలోచించండి. మన కంటే లేని వాళ్లకు మనం మన పంటలో కొంత ఇస్తున్నాము.  మన కంటే ఉన్న వాళ్ళు ఇప్పుడు మన ఆకలి గురించి ఆలోచించాలి. కానీ ఎవరు ఆలోచిస్తున్నారు మన గురించి..? కాబట్టి ఉన్నప్పుడు, సరిపడా పండినప్పుడు..మనకున్న దానిలో కొంత పేదలకు అనుకున్నాము. మనకే లేనప్పుడు మీరిలా బాధ పడటం అర్ధం లేనిది. ఇప్పుడు మనం పేదల కింద లెక్క.” అంది భార్య.
 “ అవునమ్మా!  నువ్వన్నది నిజం “ అన్నాడు రామయ్య కొడుకు తల్లి మాటలను బలపరుస్తూ..
 భార్యా పిల్లల మాటలు విన్న రామయ్య..
 “ మనకు ఉన్న ధైర్యం మన పొలం. ఇప్పుడు కాకపోతే తర్వాత పండుతుంది అనే నిశ్చింత మనకు ఉంటుంది. కానీ ఆ పేదవారికి మనమే ధైర్యం. మనకు పంట పండనీ, పండక పోనీ.  వాళ్ల ఆకలికి మనమే భరోసా. మనం వాళ్ల భవిష్యత్తు. “ అన్నాడు ప్రశాంతంగా.
 “ అవును నాన్నా..! మీరన్నదీ నిజమే! అయితే ఇప్పుడు ఎక్కడి నుండి తెచ్చి ఇద్దాం వాళ్లకు? “ అన్నాడు కొడుకు.
“ అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది రా..చూద్దాం” అన్నాడు రామయ్య.
ఇంతలో ఎవరో తలుపు కొట్తారు.
భార్య వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి  ఎదురుగా నిలబడి ఉన్నారు..ఏ పేదలకైతే తన పంటలో భాగాన్ని ఇచ్చేవారో వాళ్ళు.
వాళ్ల భుజం మీద ధాన్యంతో నిండిన బుట్తలు. వాళ్లని చూస్తూనే తెల్లబోయారు అంతా.
అయితే ఇదేమీ పట్టించుకోకుండా  గబ గబా అంతా లోపలికి వచ్చి  ఏడాదికి సరిపడా ధాన్యాన్ని రామయ్య ఇంటిలో కుమ్మరించి  వెళ్ళిపోతూ..
“ అయ్యా..! ఇన్నేళ్ళూ మీకు పండిన పంటలో కొంత మాకు పంచుతూ వచ్చారు. మీలా ఇచ్చిన వాళ్లందరివీ ఒకచోట చేర్చి మా అవసరాలకు  సరిపడా కావాల్సినవి ఉంచుకుని  మిగతావి అమ్మగా వచ్చిన సొమ్ముతో కొంత పొలం కొని సాగు చేస్తూ వస్తున్నాము.  అలా సాగు చెయ్యగా వచ్చిన పంటను ఇలా నష్టపోయిన రైతులను ఆదుకోవటానికి వినియోగిస్తున్నాము.
ఈ ఏడాది  మీరు వర్షం వల్ల నష్టపోయారని విని మీ కోసం వీటిని తీసుకు వచ్చాము.
దానం చెయ్యటమే కాదు..తీసుకోవటమూ గొప్ప విషయమే. మీరు తీసుకున్నార్రు. మాకు సంతోషం ” అంటూ వెళ్ళిపోయారు.   అది విన్న  రామయ్య కుటుంబం సంతోషంతో చప్పట్లు చరుస్తూ..
“ అవును. మీరన్నట్టు.. దానం తీసుకోవటమే కాదు..ఇవ్వటమూ చాలా గొప్ప విషయము “ అంటూ సంతృప్తి నిండిన హృదయంతో వాళ్ల ముందు చూపుకి చేతులెత్తి నమస్కరించారు.
[+] 5 users Like అన్నెపు's post
Like Reply
#3
పెంచిన ప్రేమ
-అనసూయ కన్నెగంటి

తల్లికోడి పెరడు అంతా తిరుగుతూ  ఆహారాన్ని చూడగానే “క్కొ..క్కొ..క్కొ..” అంటూ పిల్లల్ని పిలుస్తూంది.  అప్పటిదాకా కబుర్లు చెప్పుకుంటున్న కోడిపిల్లలు తల్లి పిలుపు విన్న వెంటనే ..” అమ్మ పిలుస్తూంది..అమ్మ పిలుస్తూంది “ అని అరుస్తూ గోల గోలగా ఒకరితో ఒకరు పోటీలు పడి మరీ పరిగెత్తుకుంటూ వాళ్లమ్మ దగ్గరకు వెళుతున్నాయి.  
ఆ పిల్లల్లో నాలుగు బాతు పిల్లలు కూడా ఉన్నాయి. అవి కోడిపిల్లల అంత చురుకు కాదు. కొద్దిగా మందకొడిగా ఉన్నాయి.  అందుకని అవి కోడి పిల్లల వెనుక కాస్త మెల్లగా పరిగెత్తుకుంటూ వెళుతున్నాయి.
ఈ విషయం గమనించింది ఒక గ్రద్ద. దానికి చాల సంతోషం వేసింది వాటిని చూసి. దాంతో..
ఒకరోజు దగ్గరలో ఉన్న చెట్టు మీద ఆకుల చాటున మాటుగాసి కూర్చుంది  బాతు పిల్లల్ని ఎత్తుకుపోదామని.
అది గమనించని తల్లికోడి ఎప్పటిలాగే  ఆహారం చూడగానే పిల్లల్ని పిలిచింది.
ఇదే సమయమని చెట్టు మీదున్న గ్రద్ద  బాతు పిల్లను కాళ్లతో  తన్నుకుపోదామని  విసురుగా వచ్చేసింది.
అప్పటికే అది పసిగట్టిన తల్లికోడి గ్రద్ద మీద విరుచుకుపడి..పిల్లల్ని రక్షించుకుంది.
అలా గ్రద్ద ఎన్నిసార్లు  ప్రయత్నించినా  ఒక్క బాతుపిల్లను కూడా ఎత్తుకుపోలేకపోయింది.  దాంతో గ్రద్దలో పట్టుదల పెరిగిపోయింది.  ఎలాగైనా బాతుపిల్లను తినే తీరాలని  చెట్టు మీదే కూర్చుని ఉంది.
ఈ పెనుగులాటలో  గ్రద్దకూ, తల్లి కోడికి కొన్ని గాయాలు కూడా అయ్యాయి. అయినా తినాలనే కోరిక గ్రద్దలోనూ, పిల్లల్ని కాపాడుకోవాలనే పట్టుదల కోడిలోనూ ఏమాత్రం తగ్గలేదు.గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్యా జరుగుతున్న  పెనుగులాటను  గమనిస్తూనే ఉంది అక్కడే తిరుగాడే కోడి పుంజు ఒకటి.
అది ఒకనాడు తల్లి కోడి దగ్గరకు వెళ్ళి ..
 ”  నిన్ను చూస్తుంటే  అమాయకురాలవు అనిపిస్తూంది. “ అంది .
“ ఎందుకు అలా అనిపించింది నీకు ?” అని ఎదురు ప్రశ్నించింది  తల్లి కోడి.
 “ ఏముంది?  గ్రద్ద బలం నీకు తెలియనిదా? అది పట్టు పట్టిందంటే వదలదు. నువ్వు గమనించావో  లేదో…కానీ  అది బాతు పిల్లల్ని మాత్రమే తన్నుకుపోవాలని ప్రయత్నిస్తూంది. అవి నీ పిల్లలు కావు కదా. కాకి కూడా నీలాగే కోకిల గుడ్లను పొదిగి గుర్తుపట్టగానే గూట్లో నుండి తరిమేస్తుందంట. దానికున్నపాటి జ్ఞానం కూడా నీకు లేదు. ఎంతకాలం నువ్వు పెంచితే బాతు కోడి అవుతుంది? కాబట్టి చూసీ చూడనట్టు వదిలెయ్. నీకెందుకు అంత పట్టుదల. “ అని చెప్పింది.
 కోడిపుంజు మాటలు విన్న తల్లి కోడికి చాల బాధేసింది. దూరంగా ఉన్న పిల్లలందర్నీ ఒకసారి కళ్లారా చూసింది. ఎలాంటి కల్మషం లేకుండా ఆడుకుంటున్న  వాటిని చూసి దానికి కళ్లల్లో నీళ్ళు తిరిగాయి.
ఒక్కసారి తల విదిలించి పుంజు వైపు చూస్తూ..
“ నా పిల్లల కంటే ఎక్కువ రోజులు పొదిగి వాటికి జన్మనిచ్చాను. నేను పెట్టిన గుడ్లు కాకపోవచ్చు. కానీ నేను పొదిగితేనే   కదా అవి పిల్లలయ్యాయి. కాబట్టి  అవీ నా బిడ్దలే. నా పిల్లలు కాదని చూస్తూ చూస్తూ వాటిని అలా ఎలా గ్రద్దకు అప్పగిస్తాను? కన్న ప్రేమకంటే పెంచిన ప్రేమ మరింత గొప్పదని   నీకు మాత్రం  తెలియదా? అయినా తల్లిప్రేమ గురించి నీకేమి తెలుస్తుందిలే! తెలిస్తే ఇలా చెప్పే దానివే కాదు?” అని పుంజుతో అని వెంటనే   “క్కొ.క్కో..క్కో” అని పిల్లల్ని పిలిచేసింది. అది విని  పొలో మంటూ పరిగెత్తుకొచ్చేసి తల్లి చుట్టూ చేరాయి  పిల్లలన్నీ.
పుంజువైపు గర్వంగా ఒకసారి చూసి “రండి “ అంటూ ముందుకు సాగిపోయింది తల్లికోడి.
ఉత్సాహంగా తల్లిని అనుసరించాయి పిల్లలన్నీ.
వాటినలా చూస్తూ “  నిజమే. తల్లికి అందరూ సమానమే. నేనే తప్పు మాట్లాడాను. నా తప్పును సరి దిద్దుకోవాలంటే ఆ గ్రద్ద నుండి  ఈ పిల్లలందర్నీ రక్షించటం ఒక్కటే  సరైన పని   “ అని మనసులో అనుకుంటూ  
గ్రద్ద వైపు చూసింది కోపంగా “ నీ సంగతి నేను చూస్తా..” అన్నట్టుగా .
[+] 5 users Like అన్నెపు's post
Like Reply
#4
ఎవరు ఎవరికి ఋణపడ్డారు?

అబ్బబ్బా ఈ కొబ్బరి ముక్కలు కాపలా కాయలేక ఛస్తున్నా! కన్ను మూసి తెరిచేలోగా తన్నుకుపోతున్నాయ్ వెధవ కాకులు. అయినా మీ ఛాదస్తానికి వేగలేక ఛస్తున్నాననుకోండి. ఈకాలంలోకూడా ఏమిటీ నూనె ఆడించుకోవడాలు, నాఖర్మకాకపోతే? పెచ్చులు తీయడం, ముక్కలు కోయడం, ఎండబెట్టడం.. నావల్లకాదుబాబూ. గుళ్ళోకొట్టినవన్నీ తెచ్చి నా నెత్తినపాడేస్తారు. ఇకనుంచి నా వల్లకాదు.
తెల్లవారుఝామున నాలుగింటికి గుడికెళ్ళిన పూజారిగారు పదకొండుగంటలకి ఇంటికొచ్చారు. ఆచమనంతప్ప పచ్చిమంచినీళ్ళుకూడా తాగలేదు. ఈవిడ దండకంలో కొత్తేముంది? ఏదైనా మాట మాట్లాడితే దానికి ఉత్తరపీఠిక, స్తోత్రం, పూర్వపీఠిక, ఫలస్రుతి చెప్తేగాని ఆపదు.
నాక్కాస్త ఫలహారం పెడితే తిని కాసేపు నడుం వాలుస్తాను అన్నారు ఆవూరి ఆలయం పూజారి రావుగారు
తిన్న తరువాత కాసేపు పేపర్ తిరగేసి గదిలోకెళ్ళి మంచమ్మీద వాలారో లేదో... గుప్పున కొట్టింది చేపల వాసన. లలితా! ఏమిటీవాసన? గదిలోంచే అరిచారు పూజారిగారు. ఆకిటికీ తలుపు తెరచుకోవచ్చుగా స్వచ్ఛమైన గాలి లోపలికొస్తుంది అని అరిచారు లలితమ్మ పెరట్లోంచే, సమాధానంగా.
కిటికీ తలుపు తెరచిన రావుగారు ఒక్కనిముషం కూడా అక్కడ ఉండలేకపోయారు. అరగంట క్రితం తిన్నదంతా గొంతులోకొచ్చేసింది. గబగబా బయటికి వచ్చేసి, ఏంటోచూడు అరుగుమీద ఏముందో.... దుంపతెగ ప్రేగులు కూడా బయటికి వచ్చేసేటట్టున్నాయ్!" అనగానే....
ఇంద ఈ ముక్కల దగ్గర నుంచోండి చూసొస్తాను అని వీధితలుపు తెరచి మళ్ళీ ఏదో దండకం మొదలెట్టారు లలితమ్మ.* *ఈసారి ఎవరిమీదనో భద్రకాళిలా విరుచుకు పడిపోతోంది. విసురుగా పెరట్లోకొచ్చి పూజారిగారికి చెప్పింది ఎవరో ముసలమ్మ.... చేపలగంప పెట్టుక్కూర్చుంది అరుగుమీద. ఇంకే అరుగు దొరకనట్టుంది. ఓ బకెట్టు నీళ్ళు పట్టుకెళ్ళి జల్లండి ఆవేశంగా చెప్పి వెళ్ళి మరల కొబ్బరి ముక్కలదగ్గర స్టూలుమీద కూర్చున్నారు లలితమ్మ.*
వీధి అరుగు మీదికి నీళ్ళు పట్టుకెళ్ళేసరికి ఆ ముసలమ్మ అక్కడే ఉంది, లేచి నిలబడటానికి కూడా సత్తువలేనట్టుంది. గంప ఎత్తుకోబోయి తూలిపడి, ఎలాగో తమాయించుకుని లేచింది. ఏమ్మా, ఒంట్లో బాలేదా? ఏమయ్యింది? అడిగారు పూజారిగారు
అవును బాబయ్యా, జొరమొచ్చేసింది. గొంతెండిపోతుంది చాల నీరసంగా చెప్పింది ముసలమ్మ.
సరే ఆ గంప అలా సందులో పెట్టుకుని వచ్చి కుర్చో! ఈలోగ మంచినీళ్ళు తెస్తాను అని లోపలికెళ్ళి, నీళ్ళు, గోరువెచ్చని పాలు చెరో గాజు గ్లాసులోనూ పట్టుకొచ్చారు పూజారిగారు.* *సందులో ఆడుకుంటున్న ఓ పిల్లాణ్ణి పిలిచి పదిరూపాయలిచ్చి కిరాణా కొట్టుకెళ్ళి ఒక రొట్టె తీసుకురమ్మన్నారు.
ఇంద ఈ రొట్టెతిని పాలుతాగు. తరవాత ఈ బిళ్ళవేసుకుని అలా కాసేపు ఒరుగు. అదే సర్దుకుంటుంది అని ఒక క్రోసిన్ టేబ్లెట్ కూడా ఇచ్చారు.
గంటతరవాత వచ్చిచూస్తే అమె అక్కడ లేదు. గంపతీసుకుని వెళ్ళిపోయింది.
విషయం తెలుసుకున్న లలితమ్మ మళ్ళీ దండకం మొదలెట్టారు. పళ్ళెంలో పడే రూపాయి దక్షిణకోసం పాకులాడే బ్రతుకులు మనవి. సంఘసేవొకటి. సాయంత్రం ప్రసాదంకోసం ఉంచిన పాలు అవి ఇప్పుడెక్కడి నుంచి తెస్తారు? కొబ్బరిముక్కలు ఎండబెట్టుకోవడానికి వల నేయించమని ఏళ్ళుగా మొత్తుకుంటున్నా. నన్ను ఎండలో కాపలా పెడతారు గాని ఓ వంద రూపాయలిచ్చి వల మాత్రం అల్లించరు. పదిరూపాయలిచ్చి రొట్టెకూడా కొనిచ్చేరంట. ఏంత ఉదారమో? వ్యంగ్యంగా అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పారు.
పోన్లేవే జ్వరంతో ఉంది. పాలదేముంది.. ప్రెసిడెంటుగారికి కబురెట్టి ఒక లీటరు పాలు పంపించమంటే సరి. ప్రసాదానికే కదా. సర్దిచెప్పడానికి చెపుదామనుకున్నారు గాని, తనలో తానే అనుకోగలిగారు.
నెలరోజులు గడిచాయి. సాయంత్రం అయిదింటికి పంచె కట్టుకుని పళ్ళెం పట్టుకుని బయలుదేరారు రావుగారు గుడితలుపులు తెరవడానికి.*  *వీధి తలుపు తెరవగానే, గుమ్మంలో నుంచుని ఉంది ముసలమ్మ. అరుగుమీద గంప పెట్టి ఉంది. కానీ వాసన రావట్లేదు. చక్కగా వుతికి ఆరేసిన చీర కట్టుకుని పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని చేతులు జోడించి దణ్ణంపెట్టింది, పూజారి గారిని చూసి.
ఏమ్మా ఇప్పుడెలాఉన్నావ్ అని అడిగారు రావుగారు.
బాగున్నాను బాబయ్య. ఆపదలో కాపాడేరు. మీరుణం తీర్చుకోలేను.
ఏంపర్లేదమ్మా నేనేంచేసాను. ఒక బిళ్ళ, కాసిని పాలు ఇచ్చాను అంతేకదా! వెళ్ళిరా అని ముందుకి కదలబోయారు పూజారిగారు.
లేదుబాబయ్యా. ఇది మీకోసమే తెచ్చాను అంది గంపచూపిస్తూ.
ఏముంది అందులో అడిగారు పూజారిగారు.
మాయింటికాడ కొబ్బిరి సెట్టుందండి. పదికాయలు దింపించి ఒలిపించాను.
మా ఆయన మోకుతాళ్లు అల్లుతాడండి పదిగజాల తాడు అల్లించాను. గిలకబావి సేద క్కట్టుకోవచ్చండి. మరేమోనండి సిక్కం కూడా అల్లించేనండి.
సిక్కమా, అదేంటి? అర్థంకాక అడిగారు రావుగారు.
వలండీ వల. ఏవన్నా ఎండలో ఎండబెట్టుకుంటే సిక్కమేసేత్తే ఇంక కాకుల గొడవుండదండి. ఇంకా చింతచిగురు, సీమసింతకాయలు కూడా వున్నాయండి. కొత్త గంపండి. సేపలు గట్రా దీనికి అంటుకోలేదండి. గంపను ఉన్న పళంగా లోపలకట్టుకుపోండి. మీరు పంతులుగోరు కదండి బాబయ్యా. మడీ ఆశారం ఉంటాదని నేనే తానం సేసి కట్టేనండి అన్నీని. ఆయ్!
గుక్కతిప్పుకోకుండా చేప్పేస్తుంటే.. నిశ్చేష్టులై వింటున్నారు రావుగారు. పువ్వుల పొట్లం మర్చిపోయారండీ అంటూ ఉంటే... రావుగారి వెనకాలే వచ్చి అన్నీ విన్న లలితమ్మకు నోటమాటలు రాలేదు.
ఎల్లోత్తానండి పంతులుగోరు... దండాలండి అమ్మగోరు అని ఇద్దరికి దణ్ణాలు పెట్టేసి వెళ్ళిపోబోతుంటే ఆపి మొల సంచిలోంచి యాభై రూపాయలు తీసి ఇవ్వబోయారు రావుగారు.
వద్దు బాబయ్య. తమలాంటి దర్మ పెబువుల దగ్గర మేం పుచ్చుకోగూడదు. వత్తానండయ్యా అని మళ్ళీ దణ్ణం పెట్టి వెళ్ళిపోయింది.
ఉన్నంతలో సహాయం  ఆశించకుండా చేస్తే, ఫలం యొక్క ఫలితం ఏదో ఒక రూపంలో మనలని రక్షిస్తుంది. ఆశించిన క్షణం ఆ సహాయం వ్యర్థం అయిపోతుంది. అత్యంత జాగురుకతతో ఈ సూక్ష్మ విషయం మన మనసులో ఉంచుకుని ఉన్నంతలో సహాయం చేయాలి.
[+] 4 users Like అన్నెపు's post
Like Reply
#5
దేవుడికి విసుగెత్తింది

దేవుడికి బాగా విసుగెత్తింది. ఎప్పుడు చూసినా నాకది కావాలి ఇది కావాలి అని కోరికలతో వేధించి వెంటాడే మనుషుల కోర్కెలతాకిడికి ఆయన అలసిపోయాడు. వీళ్ళకి కనిపించకుండా అతి రహస్యస్థావరాని కి వెళ్ళిపోవాలని ధృఢంగా నిర్ణయించుకున్నా డు. తనకి బాగా సన్నిహితుడైన ఆంతరంగికు లని సంప్రదించాడు..
ఒకరు చంద్రమండలానికి వెళ్ళమన్నాడు.. మరొకడు ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోమన్నాడు.. మరొకడు ఎవరూ రాలేనంత దూరంగా భూమిని తొలుస్తూ వెళ్ళి దాక్కోమన్నాడు...
"లాభం లేదయ్యా ఏదో నాటికి మనిషి వీటన్నిటిని దాటి అక్కడికి కూడా దాపురించి అక్కడ కూడా నా ప్రాణం తీస్తాడు" అన్నాడు నిస్పృహగా...
అప్పుడు అత్యంత సన్నిహితుడైన ఆంతరంగికుడు ఒక అద్భుతమైన సలహాయిచ్చాడు...
"స్వామి నిన్ను మనిషన్నవాడు చూడలేని ప్రాంతం ఒకేఒక్కటుంది..అక్కడికి వెళ్ళు" అన్నాడు...
"ఔనా..ఎక్కడుంది" అని కుతూహలంగా అడిగాడు స్వామి..
"మనిషిలోనే స్వామి" అని ఓ చిరునవ్వు నవ్వి" అదే అతని మనసు" అన్న ఆ ఆంతరంగిక  సలహాదారు  వంక ఆశ్చర్యంగా చూసాడు..
"మనిషి అన్నీ చూడగలడు గాని తన మనసు లోపలికి తాను చూసుకోడు..అందువల్ల అంతకన్నా పదిలమైన చోటు నీకు ఎక్కడా దొరకదు స్వామి" అన్నాడు...
అంతే మరుక్షణం స్వామి అదృశ్యం..
ఇంకా మనుషులు దేవుడి కోసం బయటే వెదుకుతున్నారు...
ఆంతర్యంలో వున్న సర్వంతర్యామి చిద్విలాసంగా  చిరునవ్వు నవ్వుతూ ఈ మనిషిని గమనిస్తూనే వున్నాడు.
దేవుడిని కలవాలంటే అంతః శుద్ధి కావాలి.
దేవాలయంలోకి వెళ్ళాలంటే బాహ్య శుద్ధి కావాలి.
[+] 3 users Like అన్నెపు's post
Like Reply
#6
చదువుతున్నపుడు వింతగా ఉన్నా ఇవన్నీ నిజాలే 

ఎలుక రాతిది అయితే పూజిస్తాం.
ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం.
పాము రాతిది అయితే పాలు పోస్తాం.
ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం.
తల్లి,తండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం.
ప్రాణాలతో ఉంటే  వుద్దాశ్రమంలో వదిలేస్తాం.
చనిపోయినవాడికి భూజాన్ని అందిస్తాం.
బతికి ఉన్న వాడికి చేయూత నివ్వం.
రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం.
మనషి లో మానవత్వాన్ని గుర్తించలేక పోతున్నాం.
జీవం లేని వాటిపై ప్రేమ ఎందుకు?
ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు?
[+] 4 users Like అన్నెపు's post
Like Reply
#7
 రండి... మళ్ళీ పుడదాం
రచయిత - జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి

చుట్టూ ఆకాశాన్నందుకోవడానికి చేతులు చాస్తున్న పచ్చని చెట్లు. అయినా అందనంటున్న ఆకాశం... అప్పటికీ ఆగకుండా ప్రయత్నం కొనసాగిస్తున్న ఆకుల కుంచెలు... గాలికి గలగలలాడుతున్న ఆ కుంచెల కొసల నించీ నేల మీదకి జారడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో వైన వైనాలుగా రంగులు మార్చుకుంటున్న రశ్మి.
కింద, నేల కనపడితేగా...
నేలంతా మెత్తని తివాచీ పరిచినట్టుగా రాలిపడిన ఆకులు.
ఆ ఆకుల్లోంచీ పరిగెత్తుకుంటూ పోయి చెట్టెక్కిందో తొండ.  ఒక కొమ్మ రక్షణలో నిలబడి నిటారుగా నిగిడి గర్వంగా తలెగరేసింది. ఎంత తలెత్తుకు తిరిగే మొనగాడయినా తొండంత రాజసంగా తల తిప్పలేడని నరసింహానికి తెలియదు. అందుకే దానితో పోటీ పడ్డాడు.
అది తలవంచింది.
తనూ దానిలాగే తల వంచాడు.
అది వంచిన తలని వంచినట్టే వుంచి, " ఏదీ ఇప్పుడు నాలా తలెగరెయ్యి చూద్దాం " అని సవాలు చేస్తున్నట్టుగా ఒక్క సారిగా తల విదిల్చింది.తనూ దానిలాగే తల విదిల్చాలనే ప్రయత్నంలో నడుం పైభాగాన్ని నిటారుగా నిలబెట్టి.., వంచిన తలని వంచినట్లే వుంచి.., సరిగ్గా దానిలాగే తల విదల్చబోయాడు. అలవాటులేని ప్రయత్నాన్ని సహించలేని  బొంగరపు కీలు కలుక్కుమనడంతో మెడ పట్టుకుని ముందుకి తూలాడు. ఉన్నట్టుండి అలా తూలడంతో ఏటవాలుగా వున్న ఆ ఉపరితలం మీద కాలు పట్టు తప్పి ఆరడుగులు కిందకి జారాడు. అదృష్టం బాగుండి చేతికందిన చెట్టుకొమ్మని పట్టుకుని నిలదొక్కుకోగలిగాడు.
అలా నిలదొక్కుకోగానే అతను చేసిన మొట్టమొదటి పని చుట్టూ అనుమానంగా చూడటం. ఆ అనుమానానికి కారణం, అతను పెరిగిన వాతావరణంలోని నాగరీకపు జంకు. అయినా తను జారిపడిన సంగతి చూడ్డానికీ, చూసి వెక్కిరించడానికీ, అక్కడ ఎవరున్నారు గనకా అనుకుంటూ ధైర్యంగా జుట్టు సవరించుకున్నాడు.    
నేనున్నానుగా అన్నట్టు మళ్ళీ తలెగరేసింది తొండ.    
నరసింహానికి నసాళానికి అంటింది. దాంతో కోపంగా చేతికందిన రాయి తీసుకుని దానిమీదకి విసిరాడు. అది ఒక్కసారిగా పరుగందుకుంది.   
అలా పరిగెడుతున్న దాని మేని రంగులు మారుతుంటే ఆ రంగులు దానివో లేక దానిమీద పడుతున్న కిరణాలవో అర్ధం కాక గందరగోళం పాలయ్యాడు.
ఇంతకీ అది తొండా ఊసరవెల్లా అని శంకిస్తూ అతి జాగ్రత్తగా అడుగులేస్తూ లోయలోకి దిగడం మొదలు పెట్టాడు.
ఆరు ఋతువులూ ఆమని కోయిలా ఆలమందలూ అన్నీ పుస్తకాల్లో చదివి ఆనందించడమే తప్ప, తనకి ఏనాడూ ప్రత్యక్షంగా చూసే అవకాశం రాలేదు. ఆ అవకాశం కోసమే ఎవరికీ కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా తనొక్కడే ఒంటరిగా బయలుదేరి వచ్చాడు. అయితే అలా ఒంటరిగా రావడంలో ఇంతటి ఆనందం వుంటుందని అతను ఊహించ లేదు.
నరసింహం జిల్లా విద్యా శాఖాధికారి.
ఈ మధ్యనే ఆ జిల్లాకి బదిలీ అయి వచ్చాడు.    
ఆ బదిలీకి ఓ బలమైన కారణం వుంది.   
అతను గతంలో పని చేసిన చోట ఉపాధ్యాయుల్లో బోధనా సామర్ధ్యాన్ని పెంపొందించడం కోసం ప్రతి యేటా పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణులు కావడాన్ని తప్పనిసరి అర్హతగా పరిగణించాలని ప్రతిపాదించాడు...     
అంతే..,
ఏదో జన్మానికి ఓ శివరాత్రిగా ఉద్యోగార్హతా పరీక్షలు రాయమంటే రాయగలరేమోగానీ.., ఏటా పరీక్షలు రాసి సామర్ధ్యాన్ని నిరూపించుకోవడం అంటే అంత సులభం కాదు. ఒకవేళ ఆయా పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనవారికి జీతాలు పెంచి పదోన్నతులిస్తామంటే ఒప్పుకునేవారేమోగానీ కేవలం బోధనా ప్రమాణాల్ని పెంపొందించుకోవడానికి క్రమం తప్పకుండా ఏటా కష్టపడమంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మాత్రం ఒప్పుకుంటారు గనక ? అందుకే.., దాన్ని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకగ్రీవంగా వ్యతిరేకించాయి... అయినా అతను పట్టు వదల లేదు... దాంతో రాజకీయ వత్తిళ్ళు నానాటికీ పెరిగిపోయాయి... చివరికి అన్నీకలిసి అతని బదిలీకి దారితీశాయి...అయినప్పటికీ అతని వృత్తి పరమైన నిబద్ధతలో పెద్ద మార్పులేమీ రాలేదు.
ఆ స్థాయి అధికారి మందీ మార్బలం లేకుండా అంత దూరం ఒంటరిగా రావడానికి మూల కారణం ఓ హాజరు పట్టీ. అది హంసల కోన ఏకోపాధ్యాయ పాఠశాలలో పని చేసే అయ్యవారిది. ఆరోజు అనుకోకుండా నరసింహం కంట పడింది. దాన్ని యధాలాపంగా తిప్పి చూశాడు. అందులో ఏడో పుటలో గతేడాది రెండో నెల నాలుగోతారీకు శనివారం అని రాసుంది. కానీ ఆ రోజు శుక్రవారమని తనకి బాగా తెలుసు. ఎందుకంటే, ఆనాడు తన కూతురి పుట్టిన రోజు.  
అయినా సరే, అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం తన సంచారవాణిలోఆనాటి తేదీని సరిచూసుకున్నాడు. తన అనుమానమే నిజమని తేలింది.        
దాంతో హాజరు పట్టీలో పుటలన్నిటీనీ పరీక్షగా చూశాడు. అందులో శుక్రవారాలన్నీ శనివారాలుగా నమోదై వున్నాయి. అంటే ఆ అయ్యవారు, ప్రతీనెలా జీతాల ముందు రోజు హాయిగా ఇంట్లోనే కూర్చుని ఆ నెలంతటికీ దర్జాగా సంతకాలు పెట్టేసేవాడన్నమాట. లేకపోతే, ఒకనాడు కాకపోతే మరోనాడైనా జరిగిన తప్పు అతని దృష్టికి వచ్చి వుండేది. అలా జరగలేదూ అంటే..,
అది అలవాట్లో పొరపాటు కాదు..! పొరపాటైన అలవాటు..!!
మరి పై అధికారులంతా ఏమైనట్టు ?పై అధికారులెప్పుడూ పై అధికారులే..! కాబట్టీ వారికి పై పై చూపులే తప్ప తరచి చూసే అలవాటు వుండదు. అందుకే, " చూడు, ఏదో నీమీద నమ్మకం కొద్దీ సంతకం పెడుతున్నాను. ఏమాత్రం తేడా వచ్చినా అంతా నీ మెడకే చుట్టుకుంటుంది జాగ్రత్త " అంటూ ఉత్తుత్తి బెదిరింపు చూపులతో సంతకాలు కానిచ్చేస్తూ వుంటారు. అందుకే సామాన్యంగా ఇలాంటివి బైట పడవు. ఒకవేళ ఇలా కాలం చెల్లిపోయాక బయట పడ్డా పెద్ద నష్టం వుండదు. ఎందుకంటే అధికారులంత నిక్షేపరాయుళ్ళు కేవలం అధికారులు మాత్రమే. కాబట్టీ   ఇలా ప్రతి చిన్న విషయాన్నీ పట్టించుకునేంత చాదస్తం వుండదు. ఈ విషయం నరసింహానికి తెలియందేం కాదు.
         
   ఇలా వారానికో పదిరోజులకో చుట్టం చూపుగా బడికి వెళ్ళొచ్చే అయ్యవార్లు అక్కడక్కడా తారసపడుతూనే వుంటారు. కానీ, అలాంటివాళ్ళని శిక్షించడం అంత సులభం కాదు. ఎందుకంటే, వారి బలం వారికుంటుంది. ఎలాంటి అండదండలు లేనివాడికైతే ఇంతటి ధైర్యం వుండదు. అయినా సరే, ఆ అయ్యవారిని ఓసారి చూసి రావాలనే కోరిక కలగడానికి కారణం... ఆ అయ్యవారు పనిచేసే ఊరి పేరు...   
   హంసల కోన    
   ఎంత అందమైన పేరు... 
   ఆ పేరు వెనక వున్న కథ కూడా అంతే ఆసక్తికరమైనది.   
   ఒకానొకప్పుడు విద్యాధిదేవత అయిన సరస్వతీమాత భూలోక సందర్శనార్ధం తన హంస వాహనంమీద బయలుదేరింది.   
   ఆ ప్రాంతానికి రాగానే ఆ ప్రకృతి సౌందర్యానికి పరవశురాలై అక్కడే విడిది చేసింది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పన్నెండామడల దూరంలో ఒక పిట్టని కూల్చిన బోయవాడు పుట్టెడు దుఃఖంతో బాధ పడుతూండగా ఆ  శోక గీతం అమ్మవారి చెవిన పడింది. వెంటనే ఆ బోయని ఓదార్చడానికి తనే స్వయంగా వెళ్ళింది. ఆ నిషాదుని ఊరడించి రామాయణ కథా రచన చేయవలసిందిగా ప్రబోధించి మాయమైపోయింది.    
   ఆ బోయవాడే వాల్మీకి.
   ఆయనకి అమ్మవారు ప్రత్యక్షమై ప్రేరణనిచ్చిన ప్రదేశమే వాల్మీకి పురం.   
   అమ్మవారు తనమాట మరచి అటునించటే బ్రహ్మ లోకం చేరిన విషయం తెలియని హంస ఇంకా అక్కడే తిరుగుతూ వుందనీ అందుకే దానికి హంసల కోన అనే పేరు వచ్చిందనీ అంటారు. అంతే కాదు, అక్కడి ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతమనీ ఎంత చూసినా కూడా తనివి తీరదనీ చెప్పుకుంటారు. తనకి జనారణ్యాలే తప్ప నిజారణ్యాలని చూసిన అనుభవం లేదు. కానీ చూడాలనే కోరిక మాత్రం కొండంత. ఒకవేళ బంధు మిత్రులతో విహారయాత్రగా వస్తేగనక ప్రకృతి ఒడిలో ఏకాంతంగా గడపడంలోని ఆనందానుభూతులు అనుభవంలోకి రావు. అందుకే ఒంటరిగా బయలుదేరాడు.   
   చిత్తూరు నించీ బయలుదేరి మదన పల్లె, వాల్మీకి పురం మీదుగా ముష్టూరు వెళ్ళాడు. అక్కడినించీ హంసల కోనకి బండి బాట వుందిగానీ చుట్టు తిరిగి వెళ్ళడానికి కనీసం అయిదు గంటలు పడుతుంది. అదే బండాకొండమీంచీ లోయలోకి దిగితే రెండు గంటల నడక, అంతే..! 
   అందుకే బండా కొండమీంచీ లోయలోకి దిగడం మొదలు పెట్టాడు.     
   అలా నడుస్తూ పోతూ వుంటే ప్రకృతి మాత ఒడిలోకి తప్పటడుగులు వేస్తున్నట్టనిపిస్తోంది.  
   ఎంత అందమైన అనుభవం...    
   అంతటి అద్భుతమైన అనుభవానికి కారణమైన ఆ హాజరు పట్టీ అయ్యవారికి మనసులోనే కృతజ్ణతలు తెలియజేసుకుంటూ అడుగులో అడుగులేసుకుంటూ జాగ్రత్తగా దిగుతున్నాడు. అలా తనలో తాను ఆలోచించుకుంటూ దిగుతున్నవాడల్లా అప్రయత్నంగా ఓసారి కిందకి చూశాడు. పైనించి చూసినప్పుడు, బొమ్మరిళ్ళ కొలువులా అద్భుతంగా కనపడ్డ ఊరు ఉన్నట్టుండి మాయమైపోయింది.  
   కంగారుగా చేతి గడియారం చూసుకున్నాడు.
   తను బయలుదేరి అప్పుడే రెండు గంటలు దాటింది.   
   అంటే తను దారి తప్పాడన్నమాట. 
   ఒక్కసారిగా గుండెల్లో మొదలైంది గుబులు.
   వెంటనే వెనక్కి వెళ్ళిపోదామనిపించింది. కానీ.., వెనక్కి తిరిగి చూస్తే వచ్చిన దారి కనిపిస్తేగా... 
   నేలంతా పచ్చపచ్చగా పరుచుకున్న ఆకులు...పైనంతా పచ్చి పచ్చిగా విచ్చుకున్న చెట్లు... ఏది ముందో ఏది వెనకో తెలియని ఆ వాలులో తనకి మిగిలింది రెండే దారులు...ఎక్కితే పైకి..! దిగితే కిందికి..! పైకి వెళితే మళ్ళీ బండా కొండ రావచ్చు...లేదా కొండా బండ రావచ్చు...అదే కిందికి దిగితే..? హంసల కోన తప్ప మరో జనావాసం లేదు... అందుకే కిందికి దిగడానికే నిశ్చయించుకున్నాడు.   
   అలా నాలుగడుగులు వేశాడో లేదో
   ఎదురుగా...  నాలుగు మూరల నల్ల నాగు.   
   పచ్చటి ఆకుల మధ్య నల్లగా నిగ నిగలాడుతూ రెండు దోసిళ్ళ పడగ విప్పి నాలుకలు చాస్తూ బుసలు కొడుతోంది.
   అంతే... ఎక్కడివాడక్కడే కొయ్యబారి పోయాడు.    
   నల్లనాగు ఎదురుపడితే.., అదైనా మిగలాలి లేదా ఎదురు పడ్డవారైనా మిగలాలి.    
   ఈ మాట గుర్తు రాగానే కనీసం వణకడానిక్కూడా ధైర్యం చాల్లేదు.    
   అది మాటి మాటికీ పడగని అటూ ఇటూ తిప్పుతూ తననే గమనిస్తోంది.    
   తనిప్పుడు ఏమాత్రం బెసిగినా కాటు వెయ్యకుండా వదిలిపెట్టదు.   
   ఒకవేళ వదిలినా తరవాత పగపట్టకుండా వదిలిపెట్టదు.    
   నల్లనాగు పగనించీ నారాయణుడు కూడా తప్పించుకోలేడంటారు.  
   నరసింహానికి ఎంత భయం వేసిందంటే ఆ భయంతో కనీసం దాన్నించి తప్పించుకు పారిపోదామనే ఆలోచన కూడా రాలేదు.     
   ఆ ఆలోచన రాకపోవడమే అతని ప్రాణాలని కాపాడింది.   
   ఒకవేళ ఆ సమయంలో ఏమాత్రం కదిలినా.., అతను తన మీద దాడి చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడని భావించేది. దాంతో, అతనికా అవకాశం ఇవ్వకుండా తనే అతని మీద ఎదురుదాడికి దిగుండేది. కానీ ఎంతసేపటికీ అతని వైపునించీ ఎలాంటి అపాయకర ప్రతిచర్యా కనపడకపోవడంతో మెల్లగా పడగ దించి తనదారిన తను వెళ్ళిపోయింది. 
   అది కనుమరుగయ్యేంతవరకూ ఊపిరిబిగబట్టి అలా చూస్తూనే ఉండిపోయాడు.
   దానివల్ల తనకేప్రమాదమూ లేదనే ధైర్యం చిక్కగానే తన చుట్టూ కరడు కట్టిన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బలంగా వదిలాడు ఊపిరి. అంతవరకూ కొట్టుకోవడం మర్చిపోయిన గుండె ఒక్కసారిగా ఉలిక్కి పడిలేచి దడదడా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
   అంతలోనే గుండె లోతుల్లోంచీ "మళ్ళీ పుట్టిన మొనగాడా ముందడుగెయ్యి." అంటూ గుసగుసలు. ఆ  గుసగుసల వెనకే, " నువ్వు శానా గొప్పోనివి పెద్దాయనా" అనే పొగడ్త.
   నిజంగా తనా ప్రశంసకి అర్హుడేనా ?
   అంతలోనే మరో పొగడ్త, "దైర్నం అంటే అట్టుండాల" 
   అదేం ధైర్యం..? ఉత్త పిరికితనం..! 
   "ఆగు పెద్దాయనా"
   ఇందాకటి గొంతే...
   గుండెల్లోంచీ కాదు..!
   ప్రకృతిలోంచీ..!!
   పలకరించిందెవరా అని చుట్టూ చూశాడు.  
   ఎవరూ కనపడలేదు.
   "ఆడ కాదు పెద్దాయనా ఈడ"
   తల పైకెత్తి చూస్తే బొమ్మకొయ్య మాను కొమ్మ మీద నిలబడి ఉలింజకాయలు కోసుకుంటున్న ఓ పన్నెండేళ్ళ అమ్మాయి కనిపించింది.  
   చెట్టు దిగి నరసింహం దగ్గరకి వచ్చింది.  
   "నల్ల నాగు వచ్చి పడగెత్తి వరమిచ్చినాదంటే నువ్వు సుమారుపాటి  పెద్దాయన కాదు పెద్దాయనా" 
   "దాన్ని నువ్వు చూశావా ?"  
   "నీకు ముందే చూసినా"
   "మరి నాకెందుకు చెప్పలేదు ?
   "నేనుగానీ ఎచ్చరిస్తే, నువ్వు నాకెల్లా చూసేటోనివి. నువ్వు కిముక్కుమన్నా అది ఆపాట్నే అంటుకునుండేది. నల్ల నాగు గానీ ముట్టినాదంటే, నాలుగు నిమిసాలే  ?"
   ఆ అమ్మాయి సమయ స్ఫూర్తికి ఆశ్చర్యపోయాడు నరసింహం.
   "నాగుపాము ఎదురు పడితే కదలకూడదని నీకెలా తెలుసమ్మా ?"
   "ఐవేరు జెప్పినాడులే "
   "బావుంది.., అంటే నువ్వు రోజూ బడికెళ్తావన్నమాట."
   "లేదు బడే మా ఇంటి కాడికొస్తాది."
   "ఏమిటీ బడే మీ ఇంటికొస్తుందా ? గుడ్ జోక్"
   "ఇట్స్ నాటె జోక్ . అయాం సీరియెస్"
   ఒక్కసారిగా నరసింహానికి గుండాగినంత పనైంది.
   ఈ చీమిడి ముక్కు చింపిరి జుత్తుల పిల్ల నించీ ఇంత చక్కటి  ఇంగ్లీషా ? అనే ప్రశ్న వెనకే మరో ప్రశ్న పొడుచుకొచ్చింది. ఇలా ఇంగ్లీషులో వాగితే తప్ప మీ విద్యాధికుల గొప్పదనం జన సామాన్యానికి అర్ధం కాదనే పిచ్చి భ్రమలనించీ మీరెప్పుడు బయట పడతార్రా వెర్రి మేధావుల్లారా ?
   వెంటనే అతని నోరు ఠప్పున మూత పడిపోయింది.
   "ఏం పెద్దాయనా గొమ్మునైపోయినావు ?"
   "ఏం లేదమ్మా బడి మీ ఇంటికెలా వస్తుందా అని అలోచిస్తున్నాను."
   "బడొస్తాదంటే ఆపాట్నే బడే వచ్చేస్తాదనుకుంటే ఎట్టా ? మేం యాడుంటే ఆడికే వచ్చి బడి చెవుతాడు మా అయ్యవారు."
   "అంటే ట్యూషనా ?"
   "ట్యూషనా.. అంటే ?"
   "అదే, ఇంటికొచ్చి ప్రైవేట్లు చెప్పడం."
   "ప్రైవేట్లా ?"
   "అదేనమ్మా ఇంటికొచ్చి చదువు చెప్పి జీతం తీసుకోవడం."
   "ఏందీ సదూచెప్పిందానికి దుడ్లియ్యాల్నా ?"
   ఆ అమ్మాయలా ఎదురు ప్రశ్నించవచ్చని ఊహించని నరసింహం ఆశ్చర్యంగా అన్నాడు. "అంటే చదువు చెప్పినందుకు ఆయనకీ ఎంతో కొంత లాభం వుండాలి కదా..."
   అంతకంటె ఆశ్చర్యంగా అడిగిందా పిల్ల ,"ఏందీ సదూ చెప్పిందానికి లాభమా ? లాభం అనేది యాపారం చేస్తేగానీ రాదని చెప్పినాడే మా అయ్యవారు ? మా ఐవేరికాడ సదూ చెప్పిందానికి దుడ్లు తీసుకునే అలవాటు లేదు. నాకేంది మా అన్నకూ మా అమ్మకూ మా నాయనకూ ఎవురికి ఎంత సదూ చెప్పినా దుడ్లనే మాటే లేదు."
   ఈసారి నరసింహానికి ఆశ్చర్యం కలగలేదు. ఆనందం కూడా కలగలేదు. అయ్యవారి పట్ల అపారమైన గౌరవం కలిగింది. ఎవరీ అయ్యవారు ? ఎక్కడిదీ అద్భుత సేవాభావం ? ఏనాడూ వినలేదు ! ఎక్కడా కనలేదు ! నిజమే... వృత్తినే దైవంలా భావించే అంకిత భావం కలిగిన అయ్యవార్లకి చదువుకునే పిల్లలు మాత్రమే విద్యార్ధులు కారు. చదువుకోవాలనుకునే ప్రతి వ్యక్తీ విద్యార్ధే. అలాంటి అయ్యవార్లకి హాజరు పట్టీలూ సంతకాలూ పెద్ద విషయాలేం కావు. అలాంటి కర్తవ్య దీక్షా తత్పరులైన వారికి ప్రభుత్వం ఇచ్చే జీతం అనేది కేవలం జీవిక కోసం మాత్రమే.
   చూస్తూంటే తానొక అద్భుత వ్యక్తిని కలవబోతున్నాననిపించింది.
   అంతే కాదు.., ఆనాడు సరస్వతీ మాత మరచిపోయి వెళ్ళిన హంసే ఈ అయ్యవారి రూపంలో తిరుగుతోదేమో అనికూడా అనిపించింది. అలా అనిపించగానే ఆయన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆతృత కలగసాగింది.
   "ఏం పెద్దాయనా, దుడ్లిస్తేనే సదువా?"
   "అలాంటిదేం లేదు.  మీ ఇంట్లో మాత్రమేనా లేక మీ ఊళ్ళో పెద్దలందరూ కూడా చదువుకుంటారా?"
   "అంతా సదూతారు."
   "మరి మీ అయ్యవారు?" నవ్వుతూ అడిగాడు నరసింహం.
   "వాయన సదవకుండా మాకెట్లా సెప్తాడు?" అంటూ ఎదురు ప్రశ్నించిందా పిల్ల.
   మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు నరసింహం. నిజమే...అయ్యవార్లు నేర్చుకోవడం మానేసిన మరుక్షణంలోనే ఎదుగుదల ఆగి పోతుంది. ఆ మరుక్షణమే వికాసానికీ దారులు మూసుకుపోతాయి. దురదృష్టవశాత్తూ విద్యని వ్యవస్థీకరించే క్రమంలో బోధన అనేది కేవలం ఉద్యోగం స్థాయికి దిగజారిపోయింది. లేకపోతే తనకిలా బదిలీ అయ్యే పరిస్థితి వచ్చేదే కాదు.
   ఇద్దరూ హంసల కోనలోకి దిగుతున్నారు.
   దగ్గరలో జల జలమనే జలపాతం హోరు వినిపించింది. మరికొంత దూరంలో కనిపించింది జలపాతం. కొండమీంచీ బండలని సానపడుతూ జారి పడుతున్న నీళ్ళు చిన్న మడుగు కట్టాయి.
   ఇద్దరూ ఆ మడుగులోకి దిగి ముఖాలు కడుక్కున్నారు. దోసిట్లోకి నీళ్ళుతీసుకుని తాగబోతూ అడిగాడు నరసింహం , "నీ పేరేంటమ్మా?"
   "హంస"
   "మీ అయ్యవారు పెట్టిందేనా ఈ పేరు?"
   "అవునే, నీకెట్టా తెల్సు పెద్దాయనా?"
   "తెలీదు. ఊహించానంతే..."
   "మా అయ్యవారు కూడా అంతే... తెలుసుకునేదానికి ముందు ఊహించుకోమని చెప్తావుంటాడు."
   "అవునమ్మా... లేనిదాన్ని ఉందని ఊహించుకుంటేగానీ ఉన్నదాని గురించి తెలుసుకోలేం."
   "ఏం పెద్దాయనా సరింగా మా అయ్యవారి మాదిర్తోనే మాట్లాడతాండావు... నువ్వుకూడా అయ్యవారేనా ఏంది?"
   నరసింహం జవాబివ్వలేదు. చిరునవ్వు నవ్వాడు.
   ఊరు దగ్గర పడింది. పేరుకి తగ్గట్టుగానే అందంగా... అపురూపంగా... కదిలివచ్చిన కలగా... కనుల పండువగా... హంసల కోన..!
   ఊరి మొగదల ఎడం పక్కన కనపడిందో బావి. బావి గడ్డన ఒకాయన కాడెడ్లతో కపిల తోలుతున్నాడు. హంసనడిగి కపిల గురించిన వివరాలను తెలుసుకున్నాడు. కాడి కిందికి దిగ్గానే కపిల బాన పైకి రావడం, నీళ్ళని కాలువలోకి వదలడాన్ని ఆసక్తికరంగా చూస్తూ.., ఆమె ఆరిందాలా చెప్తూంటే తను బుద్ధిమంతుడిలా విన్నాడు.
   ఊరిలోకి ప్రవేశించగానే "మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, హంసల కోన, ముష్టూరు పంచాయితీ, కలకడ మండలం. చిత్తూరు జిల్లా " అనే మట్టి కొట్టుకుపోయిన చెక్క పేరు పలక కనిపించింది. ఒకవైపు కొక్కెం ఊడిపోయి రెండో కొక్కానికి వేళ్ళాడుతూ.., ఆ పాడుపడిన బండల మిద్దే ఆ వూరి పాఠశాల అనే విషయాన్ని దీనంగా చాటుతోంది. ఆ బడికి ఓ తుప్పట్టిపోయిన తాళం వేళ్ళాడుతోంది. కిటికీ లోంచీ లోపలికి చూస్తే అదో పాత సామాన్ల గదిలా వుంది.
   ఇక్కడి బడి అవతారానికీ అయ్యవారి గురించి హంస చెబుతున్నదానికీ ఎంతమాత్రం పొసగడం లేదు. అందుకే అనుమానంగా అడిగాడు, "మీ అయ్యవారీ బడికి రారా ?"
   "రాడు పెద్దాయనా..."
   "ఎందుకు?"
   "అది నన్నడిగితే ఎట్లా?"
   ఆ ప్రశ్నకి నరసింహం దగ్గర జవాబు లేదు. అందుకే మౌనంగా ఆమెని అనుసరించాడు.
   ఆ బండలు పరిచిన వీధులూ.., వారగా నిలబెట్టిన ఎడ్ల బళ్ళూ.., గోడలకి చేరేసిన కాడిమాన్లూ.., ఇంటికి ముందు గదిలా పశువుల కొట్టాలూ.., కుటుంబ సభ్యుల్లా కలిసిపోయిన పసరాలూ చూస్తూంటే నరసింహానికి మొదటి సారిగా ప్రాణముబికే పరిసరాల్లోకి అడుగు పెట్టినట్టనిపించింది.
   అంతలోనే, ఇల్లు రావడంతో లోపలికి పరిగెత్తింది హంస.
   అబ్బురంగా చుట్టూ చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు. ఎడం వైపు చంద్రికలూ వాటినిండా పట్టు పురుగులూ ఆపక్కనే వాటికి ఆహారంగా కోసుకొచ్చిన రేష్మి ఆకులూ ఉన్నాయి. నడవ దాటి లోపలికి వెళితే ఓపక్క వడ్ల మూటలూ వాటి పక్కనే శనగ విత్తనాల మూటలూ మరో పక్క వరసగా పేర్చిన పుస్తకాలూ కనిపించాయి. అతనలా కలియజూస్తూండగానే రాగుల దిండూ దుప్పటీ తెచ్చింది హంస. గోడవారగా వున్న బల్లమీద దుప్పటి పరిచి గోడకి రాగుల దిండు ఆన్చి నరసింహాన్ని కూర్చోమనిచెప్పి మళ్ళీ లోపలికి పరిగెత్తింది.
   తనలోని సహజమైన ఆసక్తితో పుస్తకాల దగ్గరకి వెళ్ళి చూశాడు నరసింహం. అన్నీ సేద్యానికీ బుద్ధి వికాసానికీ  శాస్త్ర విజ్ణానానికీ జీవన మౌల్యాలకీ సంబంధించిన పుస్తకాలే తప్ప వాటిలో పాఠ్య పుస్తకాలు లేక పోవడం గమనించాడు. అయినా పాఠాలన్నీ కూడా ఆ పుస్తకాలనించీ ఎంపిక చేసినవేగా అనుకున్నాడు. అంతలోనే, చల్ల కడవ నీళ్ళలో నిమ్మకాయ పిండి యాలక పొడి వేసి బెల్లం పానకం కలుపుకుని వచ్చింది హంస తల్లి. ఆవిడ పేరు వాణి.
   నరసింహం అయ్యవారిని కలవడానికి వచ్చినట్లు తెలుసుకొని చాలా సంతోషించింది.
   మీ అమ్మాయేం చదువుతోందంటే ఆవిడ నవ్వేస్తూ ఆ పల్లెలో చదువేగానీ దానికి తరగతుల్లేవంది. 
   నరసింహానికి ఎందుకోగానీ వాణి కూడా హంస లాగే నర్మగర్భంగా మాట్లాడుతోందనిపించింది. 
   అందుకే నెమ్మదిగా వివరాలడగడం ప్రారంభించాడు. ఆవిడ చెబుతున్న మాటలు వింటున్న కొద్దీ నరసింహానికి అయ్యవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే కోరిక క్షణ క్షణానికీ పెరిగిపోసాగింది.
   ఎందుకంటే,  విద్యాబోధనలో ఆయన అనుసరించే విధానాల గురించి ఆవిడ చెబుతున్న విషయాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో అంతే ఆసక్తి దాయకంగానూ ఆలోచనలు రేకెత్తించేవిగానూ ఉన్నాయి. అంతేకాదు.., ఆచరణాత్మకంగా అవి సాధించిన విజయాలు కూడా అతని కళ్ళముందే కనపడుతున్నాయి.
   అయ్యవారు చేసినవాటిలో అన్నిటి కంటే కష్ట సాధ్యమైనది పిల్లలకి చదువు చెప్పడం కాదు. పిల్లలు చదువుకోవలసిన అవసరం గురించి వారి తల్లిదండ్రులకి అర్ధమయ్యేలా తెలియజెయ్యడం కూడా కాదు. తమ పిల్లలు ఏం చదవాలని వారు భావిస్తున్నారో దాన్ని వారి పెద్దలు కూడా చదివేలా చెయ్యడం. అలా చదవడం ద్వారా తమకి ఎదురయ్యే సమస్యలని గుర్తించడం, ఆయా సమస్యల గురించి చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరూ సమష్టిగా ఆలోచించడం, ఆయా సమస్యల్ని అధిగమించే ప్రయత్నంలో తమవే అయిన పరిష్కారాల్ని కనుక్కోవడం, తద్వారా తమ స్వంత విధానాలని తామే రూపొందించుకోవడం...ఇవన్నీ అంత సామాన్యమైన విషయాలు కావు.  
   అవన్నీ అక్కడి సామాజికుల సామూహిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనాలు.
   ప్రతి సమస్యకీ ఒక పరిష్కారం వున్నట్టుగానే ప్రతి పరిష్కారమూ మరిన్ని సమస్యలని సృష్టిస్తుందనే విషయాన్ని ఊరు ఊరందరికీ అర్ధం అయ్యేలా చెయ్యడం, ఆ సమస్యా పరిష్కారాన్వేషణల నిరంతర మహా యజ్ణంలో అందరూ పాలు పంచుకునేలా ప్రోత్సహించడం అద్భుతం. అందరికీ ఎవరి పరిధిలో వారు విద్యావంతులయ్యే వాతావరణాన్ని కల్పించడం అపూర్వం. ఆ చైతన్య స్ఫూర్తిని వాడనివ్వకుండా కాపాడుకుంటూ రావడం అనితర సాధ్యం. కేవలం అయిదేళ్ళ కాలంలో ఊరు ఊరంతా విద్యావంతులుగా రూపొందడం అనూహ్యం.
   అక్కడ...
   అందరూ విద్యార్ధులే..! అందరూ అయ్యవార్లే..!
   అక్కడ...
   నేర్పడం నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ.
   అక్కడ...     
   బడంటే కేవలం బడి మాత్రమే...
   నాగరీకుల చదువుల బళ్ళలోలా అది భవిష్యత్తుకి పెట్టు "బడి" కాదు.., నవ చైతన్యానికి కట్టు "బడి" అందుకే అక్కడ వైవిధ్యాలున్నాయిగానీ వైరుధ్యాల్లేవు... అదే నిజమైన వివేక వాణి.     
   అంతటి అద్భుత విజయాన్ని సాధించిన అయ్యవారికి ప్రభుత్వం ఎంతగా ఋణపడిందంటే దాన్ని తీర్చుకోవడానికి దేశాద్యంతం ఆయన బోధనా విధానాలని అమలు పరిచేలా చర్యలు తీసుకున్నా ఋణం  తీరదు. అలాంటిది హాజరు పట్టీలో ఎక్కడో దొర్లిన చిన్న పొరపాటు కారణంగా తనో పెద్ద దొంగని పట్టుకునే మొనగాడిలా బయలుదేరి రావడం తలుచుకుంటే నరసింహానికి నవ్వొచ్చింది. అదే సమయంలో తనావిధంగా బయలుదేరి రావడం వల్లే ఇంతటి అద్భుతమైన సామాజిక ప్రయోగ శాలని చూసే అదృష్టం కలిగిందని కూడా అనిపించింది.    
   తనని వెంటనే అయ్యవారి దగ్గరకి తీసుకువెళ్ళవలసిందిగా ఆవిడని కోరాడు. దాంతో అతన్ని వెంటబెట్టుకుని బయలుదేరింది వాణి.
   దారిలో ఆవూరికి బడిని రప్పించడం కోసం ఆవూరి పెద్దయన పడ్డ పాట్ల గురించి చెప్పడం మొదలు పెట్టింది, " మడిసి బతికేదానికి గాలీ నీల్లూ తిండీ తీర్తం గుడ్డా గుడుసూ ఎంత ముఖ్యమో సదువు కూడా అంతే ముఖ్యమనే మాట మా పల్లె పెద్దాయనకి బాగా తెల్సు. కానీ ఈ పల్లె కొంపలో సదూకునేదానికి వల్ల పడదనే మాట కూడా ఆయనకు బాగా తెల్సు. అంతే కాదు, మనకి లేనిది మన పిల్లకాయలకైనా చిక్కితే బాగుంటాదని అందరి మాదిరే ఆయప్ప కూడా అనుకునె. అంతలోకే, అమర నాతరెడ్డప్ప కలికిరికి అమ్మను పిలవనంపినాడనే మాట తెలిసె.      
   ఆపాట్నే మా అంచల కోనకి బడి కావాల అంటా అర్జీ రాపిచ్చుకొని పాయె. అమ్మ చేత బెట్టె. 
   అమ్మ పాయె..! అర్జీనూ పాయె..!! 
   మల్లా పదైదేండ్లకు అన్న కలకడకు వస్తాండాడని తెలిసె. ఆపాట్నే అర్జీ రాపిచ్చుకొని పాయె. అన్న చేత బెట్టె.    
   అన్న పాయె..! అర్జీనూ పాయె..!!    
   మల్లా పదైదేండ్లకు అల్లుడు గుర్రం కొండకు వస్తాండాడని తెలిసె. ఆపాట్నే అర్జీ రాపిచ్చుకొని పాయె. అల్లుని చేతబెట్టె.    
   అల్లుడు పాయె..! అర్జీనూ పాయె..!!
   మల్లా పదేండ్లకు అప్ప ముష్టూరికి వస్తాండాడని తెలిసె. ఆపాట్నే అర్జీ రాపిచ్చుకొని పాయె  
   అప్ప పాయె..! అర్జీనూ పాయె..!!  
   పాయె పాయె పాయె అనుకుంటా వుండంగానే ఎట్టొచ్చినాదో ఎప్పుడొచ్చినాదో తెలవదుగానీ మా పల్లెకు బడొచ్చె... "     
   అంతలోనే ఎప్పుడొచ్చిందో గానీ హంస, " అమ్మ పోయి అన్న వచ్చె ఢాం ఢాం ఢాం ఢాం... అన్న పోయి అల్లుడొచ్చెఢాం ఢాం ఢాం ఢాం...  అల్లుడుపోయి అయ్య వచ్చెఢాం ఢాం ఢాం ఢాం... అయ్య పోయి అయ్యోరొచ్చె  ఢాం ఢాం ఢాం ఢాం... " అని పాడ్డం మొదలు పెట్టింది.  
   ఆ పిల్లని అల్లరి చెయ్యద్దని గదిరింది వాణి.   
   అంతలోనే అయ్యవారిల్లు వచ్చింది.     
   ముగ్గురూ లోపలికి అడుగు పెట్టారు.     
   అక్కడ దాదాపు తొంభై సంవత్సరాల పెద్దాయన నలుగురు పిల్లల్నేసుకుని గోలీలాడుతున్నారు. సోడా గోలీతో కొట్టగానే...ఎర్రగోలీ వేగంగా ముందుకి వెళ్ళింది. సోడా గోలీ మళ్ళీ వెనక్కి  తిరిగి వచ్చింది. స్థిరంగా ఉన్న ఎర్ర గోలీ ముందుకెళ్ళడం, సోడా గోలీ తిరిగి వెనక్కి రావడాలని కేంద్రంగా చేసుకుని చలన సూత్రాల్ని వివరించి చెబుతున్నాడు. ఆ చెప్పడంలో వాళ్ళని మరిన్ని ప్రశ్నలడగడం ఆప్రశ్నల, ద్వారా పిల్లలే జవాబుల గురించి ఆలోచించించేలా చెయ్యడం చూస్తూంటే, నరసింహానికి తను చూస్తున్నది కలో నిజమో అర్ధం కాలేదు. 
   ఆ పెద్దాయనలోనే అంతటి ఉత్సాహాన్ని వెలిగించాడంటే, ఆ అయ్యవారు సామాన్యుడు కాదు. అలాంటి ఒక అయ్యవారు తన పరిధిలోనే ఉపాధ్యాయుడిగా పని చేస్తూండటం నిజంగా గర్వకారణం అనుకున్నాడు. తను చిత్తూరు వెళ్ళగానే ముందు, ఆ అయ్యవారిని జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి సిఫార్సు చెయ్యాలనుకున్నాడు.   
   వాణి చెబుతూనే వుంది, "వాండ్లాడతా వుండేది తోకా తొంబై. మా పల్లెలో ఇంతే. ఆడినా సదువే. పాడినా సదువే. పనికి పోయినా సదువే. సేద్యం చేసినా సదువే." 
   ఆమె చెబుతున్న మాటల్లో ఏమాత్రం అతిశయోక్తులు లేనని నరసింహానికి అర్ధం అవుతూనే వుంది.      
   "అది సరేగానీ మీ అయ్యవారెక్కడమ్మా "  
   "సంకన సట్టి పెట్టుకొని నేతి సుక్క కోసం ఊరంతా తారాడినట్టుండాది. వేరే ఐవేరు ఏడుండాడు..?ఆయనే మా పల్లె అయ్యవారు."     
   "మరి పెద్దాయన ?"   
   "అదీ ఆయనే"  
   "మరిందాకా ఆయనకి చదువు రాదన్నారు..?"     
   "రాదు... కానీ నేర్చినాడు... అర్జీలు పెట్టీ పెట్టీ అల్సిపోయినంక, మా పల్లెకి మీ బడితోగానీ మీ అయ్యవార్లతోగానీ, మీ పనికి మాలిన రాజకీయాల్తోగానీ పనిలేదనుకున్నాడు. మన మడక మనం కడతావుండాం... మన గింజలు మనమే పండించుకుంటా వుండాం... మన బిడ్డల్ని మనమే సాక్కుంటా వుండాం...  అట్లాంటిది మన బిడ్డల సదువుకోసం కన్నోళ్ళ కాళ్ళు పట్టేది దేనికనుకున్నాడు. మన దావ మనమే తారాడుకునేది మేలనుకున్నాడు. దానికే మా పెద్దాయన సదువు నేర్చినాడు... మా కోసం  సదువు నేర్చినాడు... మా పిల్లకాయల కోసం సదువు నేర్చినాడు... మా పల్లె కోసం సదువు నేర్చినాడు...ఆయనే మాకు అయ్యవారైనాడు. ఈ పొద్దు మా పల్లెలో సదువు లేని మనిసే లేడు తెల్సా?" 
   వ్యక్తిలో ప్రారంభమైన చైతన్యం వ్యవస్థనే అబ్బుర పరచేంతగా విస్తరించిన వైనం నరసింహాన్ని చకితుణ్ణి చేస్తోంది. ఇక్కడ హంసల కోనలో వాలిన అమ్మవారి హంస గురించి ఇంతకాలంగా బయటి ప్రపంచానికి ఎందుకు తెలియలేదన్నది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే అడిగాడు నరసింహం, "అయిదేళ్ళుగా ఇంత మంది ఇన్ని అద్భుత విజయాలు సాధిస్తున్నా బయటి ప్రపంచానికి ఏమాత్రం తెలియలేదంటే..."    
   "తెలిసేదానికేముంది? మా అయ్యవారు ఒక్కమాట అంటే చాలు పేపరోల్లూ టీవీలోల్లూ వచ్చి పడతారు. కానీ అయ్యవారే ఇప్పుటి దంకా ఎవుర్నీ దగ్గరకి రానియ్యలా. అయ్యవారికి కావలసింది సదువు రావటం. అంతేగానీ పేరు రావటం కాదు."   
   "పోనీ నన్ను మీ బడిలో చేర్చుకుంటారా?"      
   "మీయట్లా సదూకున్నోల్లు మా బడిలో చేరే దానికి వల్ల పడదు."        
   "ఎందుకో?" చిరునవ్వుతో అన్నాడు.      
   "దేనికంటే, మీరు పట్టాలకోసం సదూతారు. పట్టాలు కొలువులిస్తాయి. కొలువులు జీతాలిస్తాయి. మనుసులను జీతగాల్లను చేస్తాయి. జీతగాల్లకి జీతాలు ఎగేసుకునేదెట్లా అనేదే గానీ మందికి మంచి చేసేది ఎట్లా అనేది సచ్చినా మతికిరాదు." వాణి మాటలు వింటుంటే నరసింహానికి తనీ జిల్లాకి బదిలీ అయి రావడానికి గల కారణం గుర్తొచ్చింది.    
   అతనేం మాట్లాడకుండా వుండటంతో తన మాటలు వింటున్నాడో లేదో పరీక్షించాడానికా అన్నట్టు, "ఏం సామీ గొమ్మునైపోయినావు. ఈయమ్మేంది అన్నీ తెలిసిందాని మాదిరి పెద్ద పెద్ద మాటలు చెప్తావుందనా?"     
   "కాదు. మీరు మాలా బళ్ళలో చదువుకోక పోవడం వల్లే మీకు నిజమైన చదువంటే ఏమిటో ఇంత స్పష్టంగా తెలిసిందేమో అనుకుంటున్నాను."      
   "దానికే మా అయ్యవారు ఏమంటాడో తెలుసునా మీయట్లా సదివినోల్లంతా మల్లా పుడితే కానీ సదువంటే ఏంటనేది తెలవదు అంటాడు."    
   అదీ నిజమే అనిపించింది నరసింహానికి.   
   అంతలోనే అయ్యవారు అతిధుల్ని గమనించి.., ఆటలాపి నరసింహం వైపు చూశారు.     
   ఆ చూపులు అద్భుత చైనన్యదీప్తులై అతన్ని ఆప్యాయంగా తడుముతూ కర్తవ్య బోధచేస్తున్నట్టనిపించింది.    
   ఎవరైనా సరే... అనుకున్న పనిని సాధించే ఏకైక మార్గం...  ఆ పనిని చెయ్యడం మాత్రమే అనే  దివ్యమైన సందేశాన్నిస్తున్నట్టనిపించింది.   
   అందుకే..,    
   అయ్యవారు చదువనే మాటకి నిలువెత్తు భాష్యంలా లేచి నిలబడగానే...    
   వినమ్రంగా చేతులు జోడించాడు నరసింహం.

[+] 3 users Like అన్నెపు's post
Like Reply
#8
???????????
*వేమన పేరు, పద్యాలకు మకుటము :*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
వేమన అనే పేరుకు ఇప్పుడు సరిగా అర్థంచేప్పేవాళ్ళు కనబడటం. లేదు. అర్థం లేని పేరు పెట్టి ఉండరు గదా! పిచ్చిపుల్లయకు గూడ ఒక అర్థం ఉన్నది గదా ! ఇది తెలుగుపదమే అయిఉండాల. సంస్కృతంలో వేము అంటే *నేతమగ్గపు పలక* …… అదేమీ మొర్రో ! అన్ని పాత పేర్ల వలెనే ఇది ఇప్పుడు మోజును పోగొట్టుకొన్నది. తిక్కతిక్కనలు దప్ప కవితిక్కనలు ఏరీ నేడు ? బెంగాలీ తొడుగు తొడుక్కుంటున్నవి గదా ఇప్పుడు ఆంధ్రుల పేర్లు. వేమారెడ్డి అనే ఇంటిపేర్లు అక్కడక్కడా పౌరుష నామధేయంగా మాజిల్లాలో చెవికి తగులుచున్నవి. వేమయ్యలు గూడా ఉన్నారు.

ఇక మకుటం సంగతి: వేమన ఉపాసించిన ఆపరబ్రహ్మంవలెనే అవా జ్మానసగోచరంగా నిర్గుణంగా నిరాకారంగానే ఉన్నది. యీ మకుటం గూడ ఒక్కొక్కరి మేధాతరంగాన్ని బట్టి (Brain Wave) అర్థాలు బయలుదేరి ఉన్నవి. విశ్వదాభిరామ విశ్వతోభిరామ అన్నవి పాఠాంతరాలు, నూటికి తొంబై పాళ్ళు 'విశ్వదాభిరామ వినుర వేమ' అన్నదే అంగీకరింప బడిఉన్నది.

*ఇక అర్థాలు వినండి:*
అభిరామయ్య వేమయ్యకు బంగారంచేయడం నేర్పించిన కంసాలి బత్తుడట ఆయనకు నెనరు చూపను ఆయన పేరు పద్యాలలో బిగించినాడట.

విశ్వమును, ద - ఇచ్చువాడు, ఆయనకు అభిరాముడు - ఒప్పినవాడు, అని ఇంకొకదొర.

విశ్వము - సమస్తమును ఇచ్చుటచే ఒప్పినవాడు అని ఒక వ్యాఖ్యాతృ చక్రవర్తి.

మరికొందరు మహానుభావులు వేమన ముండను రచ్చ కీడ్చి, ఆమె పేరు విశ్వద అని నిర్ణయం చేసి, యీ కవిత్వం ఆపెకు అభిరామమైనందని - "నిజంతలలో కల్ల మేకు గొట్టినట్లు" చెప్పినారు.

విశ్వమును, ద - కుద్దలించువాడు, శివుడు; ఆయనకు నచ్చినవాడు అని, భూధరమునకు - భూదరము (పంది) నకు భేదం తెలిసినట్లు ప్రకటించుకొనే ఇంకొక పండితుని వ్యాఖ్యానం.

విశ్వదుడు సర్వము నిచ్చువాడు, అని మఱియొక భాష్యకారుడు.

ఇట్లా పుర్రె కొకతీరుగా, వ్యాఖ్యానాలు వెలిగించినారు. పాటకు ఊత పదమువలె ఇట్లా ఇది ఉండవచ్చునని అర్థం చెప్పక మనలను అవస్థ పెట్టక వదలి వేసినవారే ఇందు పెద్దమనుషులు. ఏ పేరున బిలిచినా, ఎట్లా వండినా వంకాయ కూర కమ్మగానే ఉంటుంది. వేమన కవిత్వం కమ్మగానే ఉంటుంది..
???????????
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#9
(04-06-2023, 08:09 AM)అన్నెపు Wrote: సేకరించిన కథ  
కథ
రండి... మళ్ళీ పుడదాం
రచయిత - జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి
( అన్ని హక్కులు రచయిత గారివి మాత్రమే )
నాకు బాగా నచ్చిందీ కథ. ఇటువంటివారు ఊరికొకరుంటే, మన దేశం ఎపుడో అభివృద్ధి చెంది ఉండేది. banana banana banana

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#10
❤? మనసు కథలు ?❤

??? బంధం ???

" సరితా, ఆ ముదనష్టపుది మన ఊరికే వచ్చి తగలడిందిట, నన్ను ఇలా కూడా బతకనీయదనుకుంటా ఆ పాపిష్టిది.. కొందరు ఎందుకిలా పుట్టి సాధించుకు తింటారో " అని,..

' ప్రేమపెళ్ళి చేసుకుందని , కుటుంబం నుంచీ వెలివేసిన కూతురు స్వప్న గురించి తిడుతున్నాడు నారాయణ, తన భార్య సరిత దగ్గర ...

" ఇక చాలు తిట్టింది, పక్కింటి వాణికి ఏం జరిగిందో మర్చిపోయారా, పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధమే, మూటల్లో కట్నం ఇచ్చి పెళ్ళి చేసి పంపించినా, డబ్బూ డబ్బూ అని పిల్లకి నరకం చూపిస్తున్నాడు దాని మొగుడు,

మన అల్లుడు శరత్ ఒక్క రూపాయి అయినా ఆశించాడా మన నుంచీ, పైగా స్వప్నని అపురూపంగా చూసుకుంటున్నాడు,

' మన పిల్ల మన మాట వినటం మాత్రమే ముఖ్యమా, మన అమ్మాయి సంతోషంగా బతకటం ముఖ్యమా, ' అది ఆలోచించుకోండి ముందు " అంది సరిత...

" ఊ కూతుర్ని బాగానే వెనకేసుకొస్తున్నావే " అన్నాడు నారాయణ కోపంగా...

" చివరి రోజుల్లో ఉన్న నాకు, మన ఒక్కగానొక్క కూతుర్ని చూసుకోవాలని, నా తల్లి ప్రాణానికి పీకదా " అంది చాలా అనారోగ్యంతో ఉన్న సరిత దిగులుగా....

" ఏవిటోనే, నీ గురించే నాకూ బాధగా ఉంది. నీకు ఏదయినా అయితే నేనూ బతకనే, నీ వెనకాలే నేనూనూ.. " అన్నాడు నారాయణ దిగులుగా...

" నా కళ్ళు మూతపడేలోపు, స్వప్న ని ఒకసారి చూడాలనిపిస్తోందండీ మరి.. " అంది సరిత అభ్యర్ధనగా...

నారాయణ బాధగానూ, కోపంగానూ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళల్లోంచీ ఓ రెండు కన్నీటిచుక్కలు జారాయి..
భార్య కోసం బాధ్యత తోనూ, కూతురి దగ్గర తగ్గాల్సి వస్తుందన్న ఆవేదనతోనూ...

భార్య కోసం తగ్గాలి అని అనుకున్నాడు.

బ్యాంక్ ఉద్యోగం వచ్చినా కూడా, తన తండ్రి నారాయణ లాగా ఒక మంచి టీచర్ గా మిగలాలని స్వప్న స్కూల్ టీచర్ ఉద్యోగాన్నే ఎంచుకుంది..

స్కూల్ కి ఎప్పుడు నారాయణ వెళ్ళినా తగు మర్యాదలు జరుగుతాయి నారాయణకు. నారాయణ నెమ్మదిగా ఒక్కొక్క క్లాసు ముందునుంచీ చేతికర్ర సాయంతో నడుస్తూ వెళుతున్నాడు..

ఒక క్లాసు దగ్గరకు వెళుతుండగా, పాఠం చెబుతున్న గొంతు స్వప్నది అని అర్థం అయింది నారాయణకి.. అడుగులు ముందుకు పడమూ అని మొరాయిస్తున్నాయి, కానీ కూతురిని చూడాలని కళ్ళు తొందరపెడుతున్నాయి...

ఈ అయోమయంలో అడుగులు ముందుకు పడ్డాయి... ఆ క్లాసు ముందు అడుగు ఆగింది.. గుమ్మం దగ్గర ఎవరో ఉన్నారనిపించి తల తిప్పి చూసింది టీచర్ స్వప్న...

గబగబా క్లాసు బయటకి వచ్చేసింది స్వప్న " నాన్నా " అంది స్పష్టాస్పష్టామైన గొంతుతో...

కళ్ళు నీళ్ళతో నిండిపోయి తండ్రి రూపం మసకగా కనిపిస్తుంటే, చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని
" నాన్నా "అని అంటూ తండ్రిని మళ్ళీ పిలిచి,
తండ్రి కళ్ళల్లోకి చూస్తోంది...

నారాయణకు కళ్ళల్లో ఎంత కోపం తెచ్చుకుందామని ప్రయత్నిస్తున్నా, కన్నీరే కమ్ముకుంటోంది.. అపురూపంగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు మరి స్వప్న, ఇన్నేళ్ళకు మళ్ళీ చూస్తున్నాడు కన్నకూతురిని...

" బావున్నావా నాన్నా, అమ్మ ఎలా ఉంది " అడిగింది స్వప్న..

" అమ్మ చావుబతుకుల్లో ఉన్నట్లుగా తయారయ్యింది, నిన్నే కలవరిస్తోంది " అన్నాడు నారాయణ...

" ఏవయింది నాన్నా, అమ్మకీ.. " అంది కంగారుగా స్వప్న..

" మా గురించి పట్టించుకోకుండా పోయావుగా ఆ రోజున నువ్వు, నీ మీద దిగులుతోనే మనసు, తరువాత ఆరోగ్యం పాడుచేసుకుంది మీ అమ్మ " అన్నాడు నారాయణ, స్వప్నతో నిందాస్తుతిగా....

" అమ్మని నేను ఒకసారి చూడొచ్చా నాన్నా, ప్లీజ్.. " అంది స్వప్న బతిమలాడుతున్నట్లుగా....

సరే అన్నట్లుగా తల ఊపాడు నారాయణ, మనసులో అదే కదా నా సరితకు కావల్సినది అని అనుకుంటూ....

అంతే, పరుగు పరుగున ఒకటో తరగతి క్లాసుకి వెళ్ళింది స్వప్న, " కృష్ణప్రియా " అని పిలిచింది... ఆరేళ్ళ పాప బయటకు వచ్చింది...

" నాన్నా నీ మనవరాలు " అని పాపను చూపించింది స్వప్న, తండ్రికి...

నారాయణకు అచ్చం చిన్నప్పటి స్వప్ననే చూసినట్లుగా ఉంది..

గుండ్రని, నున్నని బుగ్గలు ఉన్నాయి కృష్ణప్రియకు, అచ్చు స్వప్నకు చిన్నప్పుడు ఉన్నట్టుగానే

" ... వెంటనే నారాయణ కిందకు వంగి కృష్ణప్రియ బుగ్గలను ప్రేమగా తాకాడు, తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరాడు...

స్వప్న చాలాసార్లు ఫొటోల్లో చూపించింది,
కృష్ణప్రియకు, నారాయణను సరితనూ,
తాత అమ్మమ్మ, అని తెలియచేస్తూ,

ఇప్పుడు కృష్ణప్రియ నారాయణ ను చూడగానే, గుర్తుపట్టేసింది....

" తాత కదా అమ్మా " అంది ఆ గడుగ్గాయి, తాత చేతికర్ర పట్టుకున్న చేయి మీద, తన చిట్టిచేతిని వేసి పట్టుకుని... ఆ లేతచేయి స్పర్శ , ఇన్నేళ్ళూ ఆవేదనతో, కోపంతో మండిన తాత మనసుకు చల్లని వానజల్లు లాంటి సాంత్వనని ( ఊరటను ) అందించింది..

నారాయణ కూతురిని, మనవరాలిని తీసుకుని భార్య దగ్గరకు బయలుదేరాడు..

రంగి చేత, మర్రోజు రాబోయే జన్మాష్టమికి , ఈ సాయంత్రమే, ఇంటి ముందు కృష్ణ పాదాలు వేయించింది సరిత..

అరగంట తరువాత ఆ పాదాల గుర్తుల పక్కనే మురిపెంగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చేసింది కృష్ణ ప్రియ, అమ్మ స్వప్నతో సహా...

బక్కచిక్కిపోయి,మంచం మీద నీరసంగా, కలవరపాటుగా కనులు మూసుకుని నిద్రావస్ధలో ఉన్న సరిత తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరింది స్వప్న, " అమ్మా " అని ప్రేమగా, ఆర్తిగా పిలుస్తూ...

ఆ పిలుపుకి ఆశగా కళ్ళు తెరిచి స్వప్న ను చూసిన సరిత " స్వప్నా " అని నీరసమైన గొంతుతో పిలుస్తూ ,

ఓపిక లేకపోయినా లేచికూర్చుని, స్వప్న చెంపలను ఆప్యాయంగా నిమురుతూ, స్వప్న చెంపల మీద ముద్దులు పెడుతూ " అమ్మా స్వప్నా, నా బంగారుతల్లీ " అంటూ మధ్యమధ్యలో స్వప్నను దగ్గరకు హత్తుకుంటోంది...

స్వప్న ని , సరిత, చిన్నపిల్లని ముద్దు చేసినట్లు చేస్తూ ఉంటే , అది చూసి, కృష్ణ ప్రియకు కిలకిల మని నవ్వు వచ్చేసింది, గలగలమని నవ్వింది...

" ఎవరూ " అన్నట్లుగా చూసింది సరిత కృష్ణ ప్రియను,

వెంటనే కొట్టొచ్చినట్టుగా కనపడుతున్న స్వప్న పోలికలు తెలిసి, " అబ్బో నా మనవరాలా, నా వరాలమూటా , " అని అపురూపంగా అంటూ, తన బక్కచేతులతోనే లేని బలం తెచ్చుకుంటూ కృష్ణ ప్రియను ఎత్తుకుని గుండెలకు దగ్గరగా హత్తుకుని ముద్దులాడింది...

అదంతా చూస్తున్న నారాయణ,

" ఇన్నేళ్ళూ కోపంతో రగిలిపోయాను కానీ, ఈ రోజు, అమ్మమ్మా కూతురు మనవరాలిని ఇలా చూస్తుంటే, పొందుతున్న ఈ ప్రశాంతతను అనుభవిస్తుంటే తెలుస్తోంది, కోపాలు ఎంత పనికిమాలినవో అని, ఎంత అనవసరమైనవో అని... " అని అనుకుంటూ, అల్లుడిని కూడా పిలవాలి కదా అని బాధ్యతను గుర్తు చేసుకుంటున్నాడు,

ఇన్నాళ్ళూ తను నమ్ముకున్న కృష్ణుడే , సరితకు ఈ రోజున ఇంతటి ఆనందాన్ని అందించాడు అని అనిపించి, ఎదురుగా ఉన్న తెల్లని నిలువెత్తు కృష్ణుని ప్రతిమకు మనసారా నమస్కరించుకున్నాడు నారాయణ..

తులసిభాను
మంగళవారం
11 8 2020
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#11
కథ
ప్రేమకు పరీక్షా!
- కర్లపాలెం హనుమంతరావు
( రచన - మాసపత్రిక - కథాపీఠం పురస్కారం )
( పాత పోస్ట్ కొత్తవారి కోసం )

అప్పుడే తెలతెలవారుతున్నది. ఆటో ఓ గుడి ముందు ఆగింది. 'ఇదేనా రామాలయం?'అనడిగాను ఆటోవాడిని బాడుగ ఇస్తూ.

ఇంటిముందుండాల్సిన పెంకుటింటి కోసం పరికించి చూసాను.
సగం కూలిన మట్టిగోడల ప్రహరీ. లోపల దుబ్బులా పెరిగిన పిచ్చి చెట్లు. కుంగిపోయిన వసారా. అవధాని చెప్పిన ఇల్లిదే!

ఇంటినెంబరు ఇంకోసారి సరిచూసుకుని తలుపు తట్టాను. రెండోసారికి సగం తెరుచుకుంది తలుపు. తలుపు వెనకాల ఆమే! ఫొటోలో చూసిన సావిత్రి.

'కృష్ణమూర్తి' అన్నాను నన్ను నేను పరిచయం చేసుకుంటూ. 'రండి!' అది తను కొద్దిగా పక్కకు తప్పుకుని.

చెప్పులు ఓ వారగా విడిచి లోపలికి వచ్చాను. ఆమె చూపించిన సోఫాలో కూర్చున్నాను. చాలా పాతకాలంనాటి సోఫా అది. తను లోపలికి వెళ్ళింది. అటువైపునుంచి ఏవో చిన్నగా మాటలు.

హాలుని పరికించి చూసాను. పెచ్చులూడిపోయిన గోడలు. వెల్ల వేయించి చాలా కాలమైంది. ఒక రకమైన పాతవాసన ఇల్లంతా. గోడలమీద రకరకాలఫొటోలు. కొన్ని దేవుళ్ళవి. బూజు కూడా దులుపుతున్నట్లు లేదు. ఒక మూల మాత్రం ఏదో ఫ్యామిలీ ఫొటో. కుర్చీలో ఉన్న పెద్దావిడకు వెనకున్న ఇద్దరిలో ఒకరు ఈ సావిత్రిలాగే ఉంది. కింద ఇద్దరు పిల్లలు కూర్చోనున్నారు.

'మొహం కడుక్కుంటారా? కాఫీ ఇవ్వనా?' అన్న ప్రశ్నలకు ఈ లోకంలోకొచ్చి పడ్డాను. 'మొహం కడుక్కుంటాను ముందు' అంటూ వెంటతెచ్చుకున్న బ్రీఫ్ కేసులోనుంచి బ్రష్షు, పేస్టు, షేవింగ్ సెట్టూ బైటికి తీసాను. వెనకవైపు ఆమె చూపించిన రేకుల బాత్ రూంలోకి దూరాను.

షేవింగు చేసుకుంటున్నానన్న మాటేకానీ.. మనసు మనసులో లేదు. అంతర్మథన. 'నేను చేస్తున్న పని సరైందేనా? నిజానికి ఈపాటికి నేను ఎప్పటిలాగా హైదరాబాదులో.. ఇందిరాపార్కు వినాయకుడి గుడిలో ఉండాలి. శారదకు ఆ గుడంటే చాలా ఇష్టం. ఏటా పెళ్ళిరోజు ఉదయాన్నే తనతో కలసి ఆమె చేసే మొదటి పని ఆ వినాయకుడి గుళ్ళో అర్చన చేయించడం. మధ్యాహ్నం తనకిష్టమైన వంటకాలతో సుష్టుగా విందు. సాయంత్రం ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళి పిల్లలతో సరదాగా గడపడం. కేక్ కటింగు రాత్రి తొమ్మిదీ ఇరవైకి. నాలుగేళ్ళ కిందట జరిగిన మా పెళ్ళికి అప్పటి ముహూర్తం అది. తను కేండిల్ ఊదేస్తే, నేను కేక్ కట్ చేసి ఒక ముక్క ముందుగా తనకు తినిపించాలి. అసలైన వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్సు మొదలయ్యేది అప్పట్నుంచే. రాత్రంతా ఆ సంబరాలు సాగుతూనే ఉండేవి. రెండేళ్ళ కిందట బస్సు యాక్సిడెంటులో తను పోయేముందుదాకా క్రమం తప్పకుండా సాగిన కార్యక్రమం అది.

తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఉయ్యూరు వెళ్ళిన శారద పెళ్ళిరోజు నాతో గడిపి తీరాలన్న పంతంతో తుఫాన్ను కూడా లెక్కచేయకుండా ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ తిరిగివస్తోంది. విజయవాడ హైవేలో నకిరేకల్ దగ్గర బస్సు చీకట్లో చెట్టుకు గుద్దుకున్న దుర్ఘటనలో ప్రాణాలు పోయిన ముగ్గురిలో శారద ఒకతి. నా ఇంటిదీపాన్ని ఆర్పేసిన భయంకర సంఘటన అది.

శారదలేని జీవితం వెన్నెలలేని ఆకాశంలాగయింది. 'ఏమంత వయసు మీరిపోయింది. మళ్ళీ పెళ్ళి చేసుకో’మని అమ్మ శతపోరింది

శారదస్థానంలో మరొకరిని ఊహించుకోవడం కూడా నా వల్ల కాని పని. మరో ఆడపిల్ల బతుకు ఛిద్రం చేయదలుచుకోలేదు. అమ్మ ఆ దిగులుతోనే పోయినేడాది పోయింది.

ఎంత వంటరిజీవితానికి అలవాటు పడుతున్నా ఇలాంటి స్పెషల్ అకేషన్సప్పుడు మాత్రం మనసు ముళ్ళపొదల్లో పొర్లించినట్లుంటుంది ఇప్పటికీ.

ఏదో బాధ కొద్దీ అప్పుడప్పుడూ ఇంత మందు కొట్టడమేగానీ అంతకు మించి ముందుకు పోవాలన్న పాడాలోచన నాకేనాడూ రాలేదు. 'అన్నీ చేసిపెట్టే అర్థాంగి ఇంట్లో ఉన్నా పరాయి రుచులకు పాకులాడే మన అవధానిలాంటి వాళ్లే దండిగా ఉన్న ఈ రోజుల్లో కూడా నువ్విలా ప్రవరాఖ్యుడికి మల్లే మడి కట్టుకున్నావు చూడూ,. అందుకు నీకు హ్యాట్ సాఫ్ రా.. సోదరా!’ అన్నాడు ఈ మధ్య బార్ లో వెంకటరమణ మందుకొట్టే మధ్యలో.

అవధానిగాడు ఎగతాళికి దిగాడు. 'వీడసలు మగాడేనా అని నా డౌటురా రమణా!రుచి తెలీకగాని ఈ రుషి వేషం.. సావిత్రిలాంటి ఓ దేవకి తగులుకుంటే చాలదూ.. ఈ మునిముచ్చు.. విప్రనారాయణుణ్ని మించి రెచ్చిపోవడానికి!' అంటూ పనిగట్టుకుని మరీ నన్ను రెచ్చగొట్టేసాడు.

మందుదెబ్బలో ఉన్నానేమో ఎన్నడూ లేనిది రోషం ముంచుకొచ్చేసింది. పక్కనున్న వెధవలా మంటను మరింత ఎగదోసారు. చివరికి అవధానిగాడి వ్యూహంలో చిక్కుకుని ఈ పూట ఇక్కడ ఇలా తేలాను.

అవధానిగాడు అన్నాడని కాదుగానీ నిజంగా నాది పరాయి ఆడదాని వళ్ళు తగిలితేనే సడలిపోయేటంత బలహీనమైన ప్రేమా? కొన్ని పచ్చనోట్లకోసం ముక్కూ మొగం తెలీని పరాయి మగాడికి వళ్లప్పగించే సావిత్రిలాంటి ఆడది.. శారదవంటి అనురాగ దేవతనుంచి ఇంచికూడా నా మనసును మళ్ళించలేదని నా దృఢమైన అభిప్రాయం.

నిజం చెప్పాలంటే నన్ను నేను పరీక్షించుకోవడానికే నేనీ పాడు పందేనికి ఒప్పుకున్నది. పందెం ప్రకారం నేనొక రోజంతా ఈ సావిత్రి సన్నిధానంలో ఒంటరిగా గడపాలి. 'కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ..భోజ్యేషు మాతా.. శయనేషు రంబా' అనేదో అంటారే! అందులో ఆ 'కరణేషు' పనికి తప్ప మిగతా వాటన్నింటికీ సావిత్రి తరుఫున నాదీ పూచీ! అనుభవంతో చెబుతున్నా' అని కూసాడా అవధానిగాడు.

ఆఫీసుపనిమీద క్యాంపులకెళుతున్నప్పుడు రకరకాల రుచులకు వెంపర్లాడే వెధవీ అవధానని అందరికీ తెలుసు. ఎక్కడో తగిలుంటుందీ సావిత్రిపాప అవధానిగాడి వలకు.

బైట తలుపు తట్టిన చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. గబగబా స్నానం చేసి ఇస్త్రీ బట్టల్లోకి మారింతరువాతగానీ మనసులోని అలజడి కాస్తంత సద్దుమణగలేదు.

వేడి వేడి ఇడ్లీ కారప్పొడి.. కొబ్బరి చట్నీలో నంజుకుని తింటుంటే శారదే గుర్తుకొచ్చింది. శారదా ఇదే టిఫిను తయారు చేసేది పెళ్ళిరోజు ఉదయాన.

కాకతాళీయమా? అవధానిగాడు ముందే ఓ పథకం ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాలా? మా ఫ్యామ్లీ ఫ్రెండు వాడు. నా ఇష్టాఇష్టాలన్నీ ముందే తెలుసు వాడికి. నన్నెట్లాగైనా బుట్టలో దింపాలని పెద్ద ప్రణాళికే రచించాడన్నమాట దుర్మార్గుడు!

సావిత్రి కలిపిచ్చిన ఫిల్టర్ కాఫీ తాగి పేపరు చూస్తూ కూర్చోనున్నాను.'భోజనంలోకి ఏమి చెయ్యమంటారు?' అని అడిగింది ఓ అరగంత తరువాత వచ్చి. అదీ అవధానిగాడు చెప్పుండాలే! మా పెళ్ళిరోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చే ముఖ్యమైన అతిథుల్లో వాడూ ఒకడాయ! మంచివాడుగా శారద దగ్గర మంచిమార్కులే కొట్టేశాడు రాస్కెల్. నా అంచనా కరెక్టయితే ఇంకో గంటలో చిలకాకుపచ్చరంగు అంచున్న పాలనురుగు వర్క్ శారీలో ఈ సావిత్రీదేవి ప్రత్యక్షమవడం ఖాయం. పెళ్ళిరోజు శారద కంపల్సరీగా కట్టుకునే శారీ అది.

మెదలకుండా కూర్చున్న నన్ను చూసి 'మొహమాట పడుతున్నట్లున్నారు. అవధానిగారంటే ముందునుంచీ తెలుసు.మొదటిసారి వచ్చారు మీరు. చెబితేనే గదా నాకు ఏమైనా తెలిసేది మీ అభిరుచులు?' అంది సావిత్రి.

పెళ్ళిరోజు విందులో శారద తప్పకుండా చేసే వంటకం పొట్టు తీయకుండా నేతిలో వేయించే మినప్పప్పు గారెలు. అల్లం చట్నీలో వాటిని అద్దుకుని తింటుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో సంచరిస్తున్నట్లండేది. ఇల్లు చూస్తే ఈ తీరుగా ఉంది! ఈ ఇష్టాలన్నీబైటపెట్టి ఆమెను రొష్టు పెట్టడం భావ్యం కాదనిపించింది. 'ఏదో ఒకటి చేసేయండి! కడుపులోకూడా బాగా లేదు' అని బొంకేసాను.

'ఓ గంట ఆ గదిలో విశ్రాంతి తీసుకోండి. ఒంటిగంటకల్లా భోజనం వడ్డించేస్తాను' అంటూ పడకగది చూపించింది తను వంటగదిలోకి వెళ్ళిపోతూ.

పేరుకే అది పడక గది. పందిరిమంచం మూడొంతులు ఆక్రమించేసింది. పాతకాలం నాటిది లాగుంది. ఆ చెక్క నగిషీ పనితనం ఇప్పుడెక్కడ కనబడుతుంది? బాగా బతికిన కుంటుంబాల్లో తప్ప ఇలాంటి భారీ సామాను కనిపించవు. గదిని అప్పుడే శుభ్రం చేసినట్లుంది.. తేమ తేమగా ఉంది. ఫినైల్ వాసన ప్లస్ ఓ మూల వెలిగించి పెట్టున్న అగరొత్తుల వాసన.. కలగలసి పోయి ఓ విచిత్రమైన వాతావరణం గదంతాపరుచుకుని ఉంది.

పాతకాలంనాటి స్లీపింగు రికార్డుప్లేయరునుంచి మల్లీశ్వరి సినిమా పాట చిన్నగా వినిపిస్తున్నది. 'ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు! దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు!..' భానుమతి గొంతులోనుంచి అలలు అలలుగా సాగివచ్చే ఆ సుస్వర మధుర వాయుతరంగాలు అలసిపోయిన మనసుకి జోలపాటలా హాయి గొలుపుతున్నాయి.

శారదకూ ఈ పాటంటే ఎంతో ఇష్టం. పాత చింతకాయపచ్చడని నేను తెగ ఆటపట్టించే వాణ్ణి..పాపం. ఇప్పుడా ఆ పాత మధురిమే ఆపాత మధురంగా ఉంది! కళ్ళు నాకు తెలియకుండానే మూతలు పడిపోయాయి చల్లగా.

'కావుఁ.. కావుఁ.. కావుఁ'

కాకి అరుపులకు మెలుకువ వచ్చేసింది. బైట ఎక్కడో దగ్గర్లోనే ఆ అరుపులు. ఎవరో ఆడమనిషి అదే పనిగా పిలుస్తుందో.. అరుస్తుందో అర్థం కాకుండా ఉంది.

టైము చూస్తే ఒంటిగంట దాటి పావుగంట అయింది. కడుపులో పేగులు ఆవురావురుమంటున్నాయు. భోజనానికి పిలుపు రావడంతో ప్రాణం లేచివచ్చినట్లయింది.

ఆలుగడ్డ కూర, దోసకాయ పప్పు, మునక్కాయ సాంబారు, ఆవపెట్టిన దబ్బకాయ చట్నీ, గడ్డపెరుగు.. మధ్య మధ్య నంజుకునేందుకు వూరుమిరపకాయలు.. పొట్టుతీయని మినప్పప్పుతో చేసిన నేతి గారెలు! నా అంచనా తప్పలేదు. అన్నీ నాకిష్టమైన పదార్థాలే!

ఏమాట కామాటే. అవధానిగాడి ప్లానింగు మొదట్నుంచీ అద్భుతమే! సావిత్రి చేతివంట శారద చేతివంటకు ఏమాత్రం తీసిపోదు. కష్టం కలిగించిందల్లా వడ్డించేటప్పుడు ఆమె కట్టుకున్న ముతక చీరే! వయసు మళ్ళిన ఆడవాళ్లు కట్టుకునే మడిబట్టలాగా ఉందా కట్టుకునే తీరు కూడా! నుదుటన బొట్టు దిద్దుకునేటంత తీరికకూడా లేనంతగా ఉందా ఇంటిపని!

అలవాటుకన్నా ఎక్కువగా లాగించేయడం వల్లనేమో భుక్తాయాసంగా ఉంది. ఎప్పుడు కట్టించి పెట్టుంచిందో.. మిఠాయికిళ్ళీ చేతికందించి 'కాస్సేపలా నడుం వాల్చండి. వంటిల్లు సర్దుకుని వచ్చేస్తే ఇంకీ పూటకు ఇంటిపని ఐపోయినట్లే' అని వెళ్ళిపోయింది సావిత్రి.మంచమెక్కీ ఎక్కగానే కళ్ళు మూతలు పడిపోయాయి.

ఎక్కడో పిడుగు పడిన చప్పుడు.గభాలున మెలుకువ వచ్చేసింది. గదంతా మసక చీకటి. ఒక మూల బీరువాముందు నిలబడి ఉంది సావిత్రి అటు తిరిగి. పైన వంటిమీద అడ్డుగా తువ్వాలు. కింద లోపలి లంగా. బీరువాలో దేనికోసమో వెదుకుతున్నట్లుంది. నేను మంచం దిగిన అలికిడికి ఇటు తిరిగింది. ఆ కంగారులో తుండు కిందికి జారిన మాట వాస్తవం. నా చూపుల్ని మరల్చుకోవడం చాలా కష్టమైంది.

'సారీ! డిస్టర్బ్ చేసినట్లున్నాను. నా బట్టలు బీరువాలో ఉండిపోయాయి.' అంటూ చేతికందిన చీరె తీసుకుని బైటికి వెళ్ళిపోయింది సావిత్రి. మూడు నాలుగు నిమిషాల వరకూ నా గుండె చప్పుళ్ళు నాకే వినిపించాయి. మనసుని మళ్ళించుకోవడానికి చూసిన పేపర్నే మళ్ళా మళ్ళా చూస్తూ గదిలోనే ఉండిపోయాను.

అరగంట తరువాత ఆమె తలుపు నెట్టుకుని గదిలోకి వచ్చింది. మల్లెపూల వాసన గుప్పుమంది. చేతిలో టీ కప్పు.

గంటకిందట చూసిన సావిత్రేనా ఈమె! చిలకాకుపచ్చరంగు అంచున్న పాలనురుగు వర్క్ శారీలో గంధర్వలోకంనుంచీ దొగొచ్చిన అప్సరసలాగుంది! నుదుటిమీది తిలకం ఆమె సొందర్యాన్ని రెట్టింపు చేస్తోంది. వదులుగా అల్లుకునీ అల్లుకోనట్లు వదిలేసిన ఆ వాలుజడలో తురిమిన మల్లెల మత్తువాసనలే ఇందాకట్నుంచీ నా మతిని పోగొడుతున్నవి.

అవధానిగాడి ప్రణాళిక అర్థమవుతూనే ఉంది. అప్పుడైతే ఏదో రెట్టించాడు కానీ.. వాస్తవానికి విషయవాసనాలౌల్యంనుంచీ బైట పడటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోంది.

అపార్థం చేసుకున్నట్లుంది సావిత్రి 'మీకు నచ్చినట్లు లేదు' అంది అదో రకంగా. 'లేదు. చాలా బాగుంది ఈ శారీ మీ వంటిమీద. చాలా బాగున్నారు మీరు. ఎప్పుడూ ఇలాగే చలాకీగా ఉండొచ్చుగా!' అన్నాను తడబడుతూ. ఆ ఉద్వేగంలో నేనేం మాట్లాడుతున్నానో నాకే అంతుబట్టడం లేదు.

' థేక్సండీ! మీ ఫ్రెండు అవధానిగారిలాగా కాదు మీరు. తగని మొహమాటం. ఇదంతా ఆయన ఐడియానే. నిజానికి నాకూ ఇదంతా ఏదోలా ఉంది' అంది. ఆమె మాటల్లో ఎక్కడో ఓ చిన్న గిల్టీనెస్!

'నేను అనుకుంటున్నంత ‘ఇది’కాదేమో ఈమె!'అనిపించింది.
'బలవంతంగా ఒప్పించాడా మా వాడు?' అనడిగాను ఆమె వాలకం చూసి.

'అలాగని కాదూ! మీ గురించి చెప్పింతరువాత నాకే ఇలా చేయడంలో పెద్ద తప్పేం లేదనిపించింది. ఆ టాపిక్ వదిలేయండి! బైట ఇప్పుడే వర్షం కాస్త వెలిసింది. కట్ చేయడానికి కేక్ ఉండాలిటకదా మీకు? వానలకు బేకరీలు తొందరగా మూసేస్తారేమో! ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకోరాదూ .. ఈ వీధి చివర్నే ఉంది మస్తాన్ బేకరీ!' అని టీ కప్పు తీసుకుని వెళ్ళిపోయిందామె.

రాత్రికి కేక్ కట్ చేయడం.. వెడ్డింగ్ యానివర్సిరీ సెలబ్రేషన్సు అన్నీ చెప్పేసినట్లున్నాడు అవధానిగాడు. ఈమె వ్యవహారం చూస్తే అన్నింటికీ తెగించినట్లే ఉంది.

'డబ్బెంత చెడ్డది! మంచివాళ్ళనుకూడా చెడగొటేస్తుంది కాబోలు! చెడటానికి ఈమెగారు సిద్ధంగా ఉన్నా నేనెంత సిద్ధంగా ఉన్నానో తెలీని అయోమయం. బయలుదేరినప్పుడున్న బింకం ఇప్పుడు లేదు. మరి ఇప్పుడున్న ఈ కాస్త బింకమన్నా రాత్రిదాకా మిగిలుంటుందా?

రెండేళ్ళబట్టీ సుఖానికి దూరమైన శరీరం. ఒంటరిగా ఈ సావిత్రిలాంటి అందమైన ఆడది .. అందుకునేటంత దూరంలో! పకృతికూడా పగబట్టినట్లంది. రెచ్చగొడుతోంది. వర్షం .. మంటబెట్టే చలి వాతావరణం. ఇన్నాళ్ళబట్టీ నేను గొప్పగా ఊహించుకుంటున్న శారదమీది నా ప్రేమకు నిజంగా ఇది పెను పరీక్షే!

నన్ను నేను పరీక్షించుకోవాలనే కదా ఈ పందేనికి వప్పుకుని ఇంతదూరం వచ్చింది? మధ్యలో పారిపోతే ఆ అవధానిగాడింక బతకనిస్తాడా? నా శారదను నేనే అవమానించినట్లవదా? ఏదేమైనా తెల్లారిన తరువాతే తిరుగు ప్రయాణం. గెలిస్తే శారదప్రేమకు విజయం. ఖర్మగాలి ఓడితే నేను నా భ్రమలనుంచి దూరం.

కేకుకోసం బట్టలు మార్చుకుని సావిత్రి చెప్పిన మస్తాన్ బేకరీ వెతుక్కుంటూ బైలుదేరాను. వీధి చివర్న కనబడిందది.

ఇలా కేక్ కావాలంటే పదినిమిషాల్లో ప్యాక్ చేసి ఇచ్చాడు. 'అప్పుడే రెడీ ఐపోయిందా?!' అని అడిగితే 'పొద్దునే ఆర్డరిచ్చారుగా! ఎంతసేపు సాబ్!' అని సమాధానం. అవధానిగాడు అన్నీ రడీ చేసే ఉంచాడన్న మాట! నా మడిని భగ్నం చేయాలని వాడికెందుకో అంత పట్టుదల!

సగం దారిలో ఉండగానే మళ్ళా వర్షం మొదలయింది. కుండపోతగా కురుస్తోందీ సారి ఆగకుండా! వీధిదీపాలుకూడా లేకపోవడంతో ఇల్లు గుర్తుపట్టడం కష్టంగా ఉంది. దారంతా రొచ్చు.వళ్ళంతా తడిసి ముద్దయిపోయింది ఒక్క నిమిషంలో. కేకు తడిస్తే పనికిరాకుండా పోతుంది. కాస్త తెరిపిచ్చిందాకా ఎక్కడైనా ఆగడం మంచిదనిపించింది. ఎదురుగా కనిపించిన గుడిమండపంలోకి పరిగెత్తాను.

నాకులాగానే ఇంకో ఇద్దరు పిల్లలు గుడిమండపంలో స్థంబాల చాటున మునగదీసుకుని కూర్చోనున్నారు. చలిగాలికి కాబోలు చిన్నపిల్లాడు వజవజా వణుకుతున్నాడు. పెద్దబ్బాయి వాడిమీద వానజల్లు పడకుండా అడ్డంగా నిలబడున్నాడు. ఏడుస్తున్న తమ్ముణ్ణి వాడు పెద్దరికంగా ఓదారుస్తున్న తీరు చూస్తుంటే 'పాపం' అనిపించింది. ఎవరి పిల్లలో ఏంటో? చీకట్లో వానజల్లులో చిక్కడిపోయినట్లున్నారు.

'ఎక్కడిదాకా వెళ్ళాలి బాబూ?' అనడిగాను పెద్దబ్బాయిని. సమాధానం లేదు. 'తడిస్తే తడిసారు. ఇంటికెళ్ళి పోవచ్చుగా?ఇంట్లో మీ అమ్మానాన్నావాళ్ళు ఎంత కంగారు పడుతుంటారో కదా!’ అన్నాను మళ్లీ ఉండబట్టలేక.

'అమ్మే మమ్మిల్నిక్కడ దింపి పోయిందంకుల్! మళ్ళా తనొచ్చిందాకా ఎక్కడికీ కదలవద్దంది' అన్నాడు పెద్దబ్బాయి. వాడికి పదేళ్ళు ఉంటాయేమో!

'పొద్దున్నుంచీ ఇక్కడే ఉన్నామంకుల్! చాలా భయమేస్తుంది.'అంటూ ఏడుపు పెద్దది చేసాడు చిన్నపిల్లాడు.

'ఇల్లెక్కడో చెప్పండి! నేనొచ్చి దించి పోతా! ఇంట్లో వాళ్ళెవరూ ఏమీ అనరులే!'అని ధైర్యం చెప్పబోతే 'వద్దులే అంకుల్! మాకిది అలవాటే! ఇంట్లోనుంచి అంకుల్ వెళ్ళిపోయింతరువాత అమ్మే వచ్చి తీసుకుపోతుంది!' అన్నాడు పెద్దబ్బాయి.

ఇదేదో వింతగా ఉందే!ఇంత వానలో పిల్ల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆ తల్లి ఇంట్లో చేసే నిర్వాకమేంటి?! పిల్లలు కూడా చూడకుండా ఆ అంకుల్ చేసే వ్యవహారమేంటి?! నాకెందుకో సావిత్రి గుర్తుకొచ్చించి. కొంపదీసి ఆ అంకుల్ని నేనైతే కాదు గదా?!

సెల్ ఫోన్ టార్చి లైట్ పిల్లలమీదకు ఫోకస్ చేసాను. పొద్దున సావిత్రి నట్టింట్లో చూసిన ఫ్యామిలీ ఫొటోలోని పిల్లలాగా అనిపించారు.

అనుమాన నివృత్తికోసం అడిగాను 'మీ అమ్మ పేరేంటి బాబూ?' చిన్నబ్బాయి చెప్పాడు ఠక్కుమని 'సావిత్రీ దేవి'

నా గుండె ఒక్కసారి ఆగిపోయినట్లయింది. తేరుకోవడానికి చాలా టైం పట్టింది. ఉదయాన నేనా ఇంట్లో ప్రవేశించినప్పుడు వెనకగదిలోనుంచి చిన్నగా వినిపించిన మాటలు ఈ పిల్లలవేనన్నమాట!

నేనొచ్చానని తెలియంగానే ఈ పసివాళ్లను నిద్రమధ్యలోనే లేపి గుడిమండపంలో దింపి వచ్చిందన్న మాట ఆ తల్లి! ఉదయంనుండి ఎడాపెడా కొడుతున్న గాలివానలో ఈ ముక్కుపచ్చలారని పిల్లలు గుడిమండపంలో కాలక్షేపం చేస్తున్నారా!

ఇల్లుండీ.. తల్లుండీ దిక్కులేని వాళ్లకుమల్లే ఇలా ఇక్కడ పడుండటానికి కారణం నేనా?! ఇన్ని చెప్పిన అవధానిగాడు సావిత్రికి ఇద్దరు ఎదిగిన బిడ్డలునారని మాత్రం చెప్పలేదు. పిల్లలుంటే నేనీ పందేనికి ఒప్పుకోనని వాడికి తెలుసు. నా సంగతి సరే.. మరి సావిత్రి ఎందుకు తలొగ్గినట్లు?!

అమెనే అడిగి తేల్చుకోవాల్సిన విషయం. పిల్లలిద్దర్నీ బలవంతంగా లేపి చెరో చెయ్యి పట్టుకుని సావిత్రి ఇంటిముందుకొచ్చి తలుపు దబాదబా బాదాను. అప్పటికి వాన తెరిపిచ్చింది కొద్దిగా.

నిదానంగా తలుపు తెరిచి తొంగిచూసిన సావిత్రి నాకు ఒక వైపున్న బేకరీ కేకు, రెండో వైపున్న పిల్లలిద్దర్నీ చూసి అవాక్కయింది. పిల్లలిద్దరూ తల్లివైపు భయభయంగా చూస్తూ నిలబడి ఉంటే నేనే చొరవగా వాళ్ళతో సహా లోపలికి అడుగు పెట్టాను.
...
చాలాకాలం తరువాత మళ్ళీ నేను మనసారా నా వెడ్డింగు యానివర్శిరీ జరుపుకున్నాను సావిత్రి నట్టింట్లో. సరిగ్గా తొమ్మిదీ ఇరవైకి క్యేండిల్సు సావిత్రి చిన్నకొడుకుతో కల్సి ఊదేస్తే.. పెదకొడుకుతో కల్సి కేకు కట్ చేసాను తరువాత. పిల్లలిద్దర్తో కల్సి సావిత్రీ నా నోటికి కేకు ముక్క అందిస్తున్నప్పుడు ఆమె కళ్లల్లో తళుక్కుమన్న కన్నీటి తడిని గమనించక పోలేదు.

ఇద్దరు పిల్లలమధ్య పెళ్లిరోజు సంబరంగా జరుపుకోవాలని శారద కోరిక. పిల్లలిద్దర్నీ చెరోవైపు పడుకోబెట్టుకుని కథలు చెబుతూ వాళ్ళని నిద్రబుచ్చాలని నా కోరిక. ఈ రోజుతో ఆ రెండూ తీరిపోయాయి సావిత్రీదేవి పుణ్యమా అని.

పిల్లలు గాఢనిద్రలోకి జారుకున్నతరువాత బలవంత పెట్టిన మీదట సావిత్రి చెప్పుకొచ్చింది వాళ్లాయన ప్రసాదశర్మని గురించి. 'ప్రేమించి చేసుకున్న కులాంతర వివాహం మాది. అటువైపునుంచి, ఇటువైపునుంచి ఆదరణల్లేవు మొదట్నుంచీ. ఆయన ఓ ప్రయివేట్ బస్సు ఆపరేటరు కింద పనిచేసే డ్రైవరు. రెండేళ్ల కిందట బెజవాడనుంచి హైదరాబాదుకు వెళ్తూ బస్సును నకిరేకల్లు దగ్గర చెట్టుకు గుద్దేసారు. ఆ ప్రమాదంలో పోయిన ముగ్గుర్లో ఆయనా ఒకరు. తాగి డ్రైవ్ చేస్తున్నట్లు తేలడంవల్ల నష్టపరిహారం ఏమీ రాదన్నారు. అవధానిగారి మధ్యవర్తిత్వం వల్ల చివరికో లక్ష ముట్టింది.అప్పట్నుంచీ ఈయనే ఈ ఇంటికి మగదిక్కు. అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. తను ఇక్కడున్నంత సేపూ పిల్లలు కంటబడకూడదని షరతు పెట్టారు. ఇవాళ జరిగిందంతా ఆయన డైరెక్షన్లోనే. ఆయన చెప్పారనే ఇలా ఒప్ప్పుకోవాల్సొచ్చింది. అదీగాక మా వారి తప్పిందంవల్లే మీరు మీ శ్రీమతిగారిని పోగొట్టుకుంటిరి…' కన్నీరు మున్నీరయిపోయింది సావిత్రి.

నాకు శారద ఎంతో సావిత్రికి ప్రసాద శర్మ అంత. ఇద్దరూ పోయింది ఒకే రోజు. ఒకే సందర్భంలో. శారదమీది ప్రేమను పరీక్షకు పెట్టి తప్పు చేయబోయాను నేను. శర్మమీది ప్రేమతో చేయని తప్పుకు పరిహారం చెల్లించబోయింది సావిత్రి!

ఆడదాని దుస్థితిని అవకాశంగా మలుచుకునే అవధానిలాంటి వాళ్లు.. ఆ మాటకొస్తే నాలాంటి చపలచిత్తులూ ఉన్నంత కాలం ఇలాంటి చిత్రమైన కథలకు కొదవుండదేమో!

సావిత్రి చేతిలో ఓ పదివేలు పెట్టి 'ఇది మీ అవధానిగారి దగ్గర్నుంచీ నేను గెలుచుకున్న పందెం సొమ్ము. నీతులు చెప్పే అర్హత నాకెంతవరకుందో తెలీదు. నా దగ్గరా రాసులు పోసుకోనున్న నిధులేమీ లేవుకానీ.. మా పిల్లలకోసమని నేనూ శారదా కలసి చేసిన ఫిక్సుడ్ డిపాజిట్లున్నాయి. పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను. నాకు చెల్లెలు లేని లోటు నువ్వు తీరిస్తే చాలు' అని ఆశీర్వదించి తెల్లారి లేచి వచ్చేసాను.

'మంచి పని చేసారు!' అని శారద మెచ్చుకున్నట్లు కల వచ్చిందా రాత్రి.

-కర్లపాలెం హనుమంతరావు
(రచన- సంచిక - కథాపీఠంలో ప్రచురితం)
[+] 3 users Like అన్నెపు's post
Like Reply
#12
ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు

వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేసారు.అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు .

రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు
అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే ఇవ్వడం మొదలు పెట్టాడు

ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిదుర పోతాడు అని చెప్పాడు .

అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి.
అదేందుకు అని అడిగాడు రాజు
బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది పక్షులేవైనా వస్తే ఈ కట్టె కు కట్టిన నల్లగుడ్డ ఊపితే అవి వెళ్లిపోతాయి అని బదులిచ్చాడు ఆ వ్యక్తి .

ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి
ఇంట్లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు

ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి.
వాళ్ళు ఎవరు అని అడిగారు ??

పని చేస్తున్నది నా చేతులే కదండి నా నోరు ఏ పని చేయట్లేదు అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్లకు నేర్పిస్తాను వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు .
రాజు మళ్ళీ సందేహంగా ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా అని అడిగారు అందుకు ఆ వ్యక్తి

నేర్చుకుంటున్నది నోటితోనే... కాళ్ళు ఊరకనే ఉంటాయి కదండి! పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు .

రాజుకి చాల ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని !!

అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో ఓ పది పదాలు రాసిపెట్టి వెళ్తుంది. అన్ని అయ్యాక అవి నేర్చుకుంటుంటాను అని బదులిచ్చాడు .

రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని .

సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావటానికి.

నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే.
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#13
"కురుక్షేత్రం"
15-03-2023

కృతయుగారంభంలో "ఋక్షుడు" అనే చంద్రవంశానికి చెందిన రాజు ఉండేవాడు. అతని కుమారుడు "సంవరణుడు". చిన్నప్పటినుండి సంవరుణుడికి ధర్మకార్యాలు అంటే మక్కువ. గురువు వద్ద వేద విద్యలు నేర్చుకుని తిరిగి పెద్దవాడయ్యాక రాజ్య భారం స్వీకరించి ప్రజానురంజకంగా పాలించేవాడు. సంవరుణుడు రాజ్యభారాన్ని కొంతకాలం వశిష్టుడికి అప్పగించి వనానికి వెళ్ళాడు. అద్భుతంగా ఉన్న ఆ వనం చూసి రాజు పరవశుడై వనమంతా తిరిగి ఒక కొలను వద్దకు చేరాడు. ఆ కొలనులో చాలా రంగుల తామర పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వుల్లో పువ్వుల్లా కలిసిపోయిన "తపతి" అనే సౌందర్యవతి ఆ సమయంలో ఆ కొలనులో తన చెలికత్తెలతో జలక్రీడలాడుతోంది. తపతి సూర్య భగవానుని కుమార్తె. తపతి-సంవరుణులకు ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలిగింది. రాజ్యానికి తిరిగి వచ్చినా అన్యమనస్కంగా ఉన్న రాజును చూసి వశిష్ఠుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు. వశిష్ఠుడు తన యోగ విద్యతో సూర్య మండలానికి చేరాడు. వశిష్ఠుడు సూర్యుణ్ణి కలిశాడు. "సూర్యదేవా! చంద్రవంశానికి చెందిన సంవరుణుడి కులగురువు వశిష్టుడను నేను. మీ పుత్రిక తపతి వివాహాన్ని మారాజుతో జరిపించండి"అన్నాడు.అప్పుడు సూర్యుడు"దుర్నరీక్షమైన నా తేజస్సును తట్టుకుని నా దగ్గరకు రాగలిగావు.నీవే ఇంత గొప్పవాడవైతే,మీరాజు ఇంకా గొప్పవాడై ఉండాలి! అతడు నా అల్లుడు కాదగినవాడు.నా కుమార్తెను నీతో పంపిస్తాను.వివాహం జరిపించు"అని చెప్పాడు. వశిష్ఠుడు అప్పుడు తపతిని తీసుకుని భూలోకానికి వచ్చి సంవరుణుడితో వివాహం జరిపించాడు. వారికి "కురు" అనే కుమారుడు కలిగాడు.కురు ఆ పైన సౌధమిని అనే సౌందర్యవతిని పరిణయమాడి తండ్రి తర్వాత రాజయ్యాడు.కురురాజుకు తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలనీ, తన వల్ల మానవజాతికి మేలు జరగాలని కోరిక. అందుకు అతడు భూలోకమంతా తిరిగి తిరిగి ద్వైత వనానికి చేరాడు. అక్కడ సరస్వతీ నదిలో స్నానం చేసి శమంతకమనే క్షేత్రం చేరి ఇలా అనుకున్నాడు. "అష్టాంగధర్మాలు- తపస్సు, సత్యం, క్షమ,దయ, శౌచం,దానం,యోగం, బ్రహ్మచర్యం వీటిని మొలిపిస్తాను. దానివల్ల మానవునికి స్వర్గ ప్రాప్తి సులభం అవుతుంది". కురు బంగారు నాగలి చేయించి,ఈశ్వరుణ్ణీ,యముణ్ణీ ప్రార్థించి వారి వాహనాలైన ఎద్దునీ, దున్నపోతునీ రప్పించి ఆ నాగలికి కట్టి తానే స్వయంగా భూమి దున్నసాగాడు. అది చూసి ఇంద్రుడు పరిహాసంగా "ఇది అర్థం లేని పని. అష్టాంగ యోగాలను మొలకెత్తించడం నీవల్ల కాదు"అన్నాడు. తరువాత విష్ణుమూర్తి అక్కడకు వచ్చాడు. "రాజా!బీజాలు లేకుండా అష్టాంగధర్మాలను ఎలా మొలికిచ్చిస్తావు". నా శరీరంలో అష్టాంగ ధర్మాలు ఉన్నాయి. ఈ భూమిని దున్నుతూ, నా శరీరం క్రమంగా క్షీణించి భూమిలో కలిసిపోతుంది. అప్పుడు ఆ ధర్మాలు మొలకెత్తుతాయి"అన్నాడు సంవరుణుడు. "దానికి చాలా సమయం పడుతుంది. నీ శరీర భాగాలను నరికి నాకివ్వు. ఈ భూమిని నేను దున్నుతాను" అన్నాడు విష్ణుమూర్తి. వెంటనే కురు తన కాళ్ళను, ఒక చేతిని నరికి "స్వామీ! పొలాన్ని దున్ని నా ఆశయాన్ని నెరవేరేలా ఆశీర్వదించండి" అన్నాడు సంవరుణుడు.కురురాజు అఖండ దీక్షకు మెచ్చి విష్ణుమూర్తి ఆయన ఆశీర్వదించాడు. అప్పుడు కురురాజు కోల్పోయిన కాళ్లు, చేతులు తిరిగివచ్చాయి. "ఓ రాజా! ఈ క్షేత్రం నీ పేరు మీద కురుక్షేత్రంగా ప్రసిద్ధి కెక్కుతుంది. ఇక నుంచి నేను, చంద్రుడు, వాసుకి, శంకుకర్ణుడు, సుకేశి, అజావనుడు ఈ క్షేత్రాన్ని రక్షిస్తాం. నువ్వు దివ్య శరీరంతో స్వర్గంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటావు. ఇక్కడ యుద్ధంలో మరణించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది"అన్నాడు విష్ణుమూర్తి.కురురాజు మరణించిన తరువాత స్వర్గానికి చేరాడు.కురుక్షేత్రంలో మరణిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది.కనుకనే కౌరవ, పాండవులు ఇక్కడ యుద్ధం చేశారు. చరిత్రలో కురుక్షేత్రం పేరు "ధర్మక్షేత్రం"గా నిలిచిపోయింది.
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#14
మనలో చాలామంది కి తెలియని ఒక మంచి పురాణ గాధ ..మీకోసం..
చాలా మంచి పోస్టు . అందరూ చదవండి .
ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం
రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.
'14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.
ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.
నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు. కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు,' అని అడిగారు.
''మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,'' అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ ఓసారి లెక్కపెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. ''లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!'' అని పరిహాసంగా అడిగారట రాములవారు.
''అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,'' అని బదులిచ్చాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనసు కరిగిపోయిందని వేరే చెప్పాలా. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీసురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.
రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటుకంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.
''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#15
తేడా

ఈ రోజు ఆఫీసులో బాగా ఆలస్యం అయిపోయింది. బయటకు వచ్చేసరికి చీకటి ఎంతగా అలుముకుందో తీక్షణంగా వెలుగుతున్న వీధి దీపాలు చెబుతున్నాయి.
కురుస్తున్న మంచు తెరలను చెదరగొట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి.
కారు ముందున్న అద్దం తుడిచి స్టార్ట్ చేయబోతుంటే కాలేదు. బహుశా బ్యాటరీ వీక్ అయ్యిందేమో. నిన్న కూడా ఆఫీసుకు బయల్దేరుతుంటే స్టార్ట్ చేయడం కొంచం కష్టమైంది. ఆఫీసుకి వెళ్ళాక లంచ్ అవర్లో వర్క్షాప్కి తీసుకెళ్దామనుకున్నా కానీ పని తీవ్రతలో ఆ మాటే మరిచాను. ఇప్పుడు ఎంతకీ స్టార్టు కాకపోవడంతో ఓలా బుక్ చేయక తప్పదని మొబైల్ తీసాను. టైము పదిన్నర కావస్తోంది.
అదృష్టం. ఓలా ట్యాక్సీ వెంటనే దొరికింది. అయిదు నిమిషాల్లో నన్ను పిక్ అప్ చేసేందుకు వచ్చేసాడు. డోర్ తీసి ఓటీపీ చెప్పి కూర్చున్నానో లేదో డ్రైవర్ ఫోన్ మోగింది. బహుశా కారు స్టీరియోకి తన ఫోను కనెక్ట్  చేసాడనుకుంటాను. చిన్న పిల్ల గొంతు "నాన్నా!" అంటూ వినిపించింది. ఈలోగా డ్రైవర్ "సారీ సార్" అని స్టీరియో కనెక్షన్ కట్ చేసి ఫోనులో మాట్లాడుతున్నాడు. నిశ్శబ్దంగా ఉండడంతో పిల్ల మాటలు వినిపిస్తున్నాయి. బహుశా మాట్లాడే అమ్మాయి డ్రైవర్ కూతురేమో కాస్త దెబ్బలాడుతున్నట్లు మాట్లాడుతోంది. డ్రైవర్ ప్రేమగా "ఈ సారి మరిచిపోనమ్మా. ఎస్సెమ్మెస్ చేస్తానులే! ఒట్టమ్మా! అయినా లాస్ట్ ట్రిప్ దొరికింది మెంటి వైపుగానే అరగంటలో వచ్చేస్తాను" అని కాల్ కట్ చేసాడు.
"మీ అమ్మాయా?" ఉండబట్టలేక అడిగాను.
డ్రైవర్ నవ్వుతూ "అవున్సార్! రాత్రి ఎనిమిది దాటితే నేను ఆఫ్ లైన్ అయి ఇంటికి  చేరేంత వరకూ అరగంటకోసారి కాల్ చేయమనో లేదా ఎస్సెమ్మెస్ చేయమనో కండీషన్ పెట్టింది. ఈరోజు ఒకరి వెంట మరో ప్యాసెంజర్లు దొరికేసరికి ఆ పని చేయలేదని నా మీద కోప్పడుతోంది సార్!" అన్నాడు.
"ఏ క్లాసు? అమ్మాయి" అని అడిగాను. డ్రైవర్ "అవును సార్! ఆరో క్లాసు" అని ఆగకుండా " అసలు మా అమ్మాయికి పొద్దున్నే లేచి చదువుకోవడం ఇష్టం సార్! కానీ నేను రాత్రులు ట్యాక్సీ నడుపుతానని ఇప్పుడు రాత్రి భోజనం చేసాక నేను ఆఫ్ లైన్ అయి ఇంటికొచ్చేదాకా చదువుకుంటూ ఉంటాది సార్." అన్నాడు కాసేపు మా మధ్య మౌనం రాజ్యం చేసింది.
కారు మా హౌసింగ్ కాలనీ చేరుకోగానే దిగి మా ఫ్లేట్ వైపు చూసాను. హాలులో లైటు వెలుగుతున్నట్లు కిటికీ నుంచి తెలుస్తోంది. లిఫ్ట్లో పైకెళ్ళి ఫ్లేట్ దగ్గరకొచ్చి కాలింగ్ బెల్ నొక్కాను.
 "డోర్ లాక్ చెయ్యలేదు. కొంచం తోసేసి వచ్చేయండి" సోఫా మీద నుంచే నా శ్రీమతి కంఠం మోగింది. డోర్ తీసుకుని లోపలికి వచ్చేసరికి శ్రీమతి టీవీలో, కాస్త దూరంలో నా కూతురు మొబైల్లో బహుశా ఏదో కార్టూన్ చూస్తూ నిమగ్నమై ఉన్నారు. కనీసం ఒక్కరైనా ఫోన్ కాదు "లేటు అవుతుందా" అని ఎస్సెమ్మెస్ అయినా చేయలేదు. "తేడా" అనుకుంటూ ఫ్రెష్ అయ్యేందుకు బయలుదేరాను.
[+] 3 users Like అన్నెపు's post
Like Reply
#16
Thankyou అన్నెపు garu
[+] 1 user Likes Takulsajal's post
Like Reply
#17
శ్రీ రామాయణ మహా కావ్యంలో ఒక మహోత్తరమైన సన్నివేశం
అది ఒక వసంత ఋతువు.
సెలయేటి గట్టు పైనా తల్లి సీతమ్మ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తి   లక్ష్మణ స్వామి వారు కూర్చొని ఉన్నారు.
సాయం సంధ్యా సమయం  చంద్రుడు దాగి దాగిన ముఖంతో దాగుడుమూతలు ఆడుతున్నాడు.
వీచి వీయని చల్లని గాలి తేమర్లు.
కమ్మని హాయిని ఇచ్చే వసంత ఋతువు.
సెలయేరు నుంచి ప్రభు శ్రీ రాముల వారిని చూడటానికి అన్నట్టు రాళ్ళు,రప్పలును సైతం దాటుకుంటూ మెల్ల మెల్లగా నీరు ప్రవహిస్తుంది.
ఊహాకు అందనంత, కవితలకు సైతం అందనంత వర్ణన తో కూడి ఉన్నట్టువంటి ఆ సెలయేరు నుంచి ప్రవహించే నీటి తుంపర్లు శిశిరాన్ని మరిపించే వసంత రాగం.కోకిల లా కుకూరాగం, పక్షుల కిలకిల రావాలు.
సెలయేరు కీ ఆనుకోని చిన్న అడవి పచ్చని ఆకులతో చెట్లు. అబ్బబ్బా ఏమీ ఆ దృశ్యం.   
ఇంతలో ఆ చిరు గాలిలో ఒక ఆకు సీతమ్మవారిని గిచ్చుకొని పోతుంది.
అప్పుడు సీతమ్మ తల్లీ చిన్నగా విలవిలలాడినట్టు చిత్కారిస్తుంది.
ప్రక్కన ఉన్న ప్రభువు శ్రీ రాములు వారు చిన్న చిరుకోపం నటిస్తూ"సీతా మీరు సుకుమారమైనటువంటివారు. కోమలమైనటువంటివారు.
మీరు ఈ అడవికి రావద్దని చెప్పాను కదా, అడవిలో రాళ్ళు,రప్పలు,ముళ్ళు అన్నీ ఉంటాయి.ఇవన్నీ మీరు తట్టుకోలేరని చెప్పాను.అయిన మీరు వెంటపడి వచ్చారు"అంటారు
ఇదీ విని లక్ష్మణస్వామి "ఎప్పుడు లేనిది అన్నగారు ఇలా కోప్పడ్డం నేను  చూడలేదు. ఒక వేళ అన్నగారికి ఆకలి అయిన వేస్తుండాలి లేదా దాహం అయిన వేస్తుండాలి అనీ అనుకొని అన్నగారి ఆజ్ఞతో తినడానికి ఏమైనా ఫలాలు తీసుకురావడానికి వెళ్తారు.
అడవిలో తిరిగి తిరిగి కొన్ని మామిడి ఫలాలు మరియు కొన్ని చెరకు ముక్కలు పట్టుకొని అన్నగారి దగ్గరకు వస్తారు.
వచ్చిన తర్వాత ఆ మామిడి ఫలాలు,
చెరకు ముక్కలు అందిస్తారు.
అది చూసి సంతోషించి తల్లీ సీతమ్మకీ ఒకటి,తానొకటి తీసుకొని లక్ష్మణస్వామికి ఒకటి ఇస్తారు.
అవి తిన్న తర్వాత శ్రీ రాములువారూ   ఇలా.పలుకుతారు
*"బలం బలం భాతృ బలం*
*ఫలం ఫలం చూత ఫలం*
*రసం రసం యిక్యు రసం*
*దీపం దీపం చంద్ర దీపం"* "
దీని అర్థం *బలం బలం భాతృ బలం* అంటే శ్రీ రాములువారు ఎంత హృదియంగా చెప్పారండి.
ఆకలి అయిన దాహం అయిన తల్లీదండ్రులకు తెలుస్తుంది అంటారు అలగే  అన్నదమ్ములకు తెలుస్తుంది  .
అలా తమ్ముడు   లక్ష్మణుడు నా ఆకలి ఎరిగి నా కోసం తినడానికి తెచ్చాడు.
అందుకే లక్ష్మణ స్వామీ అంతా ఆదర్శ తమ్ముడు అయ్యాడు. *ఫలం ఫలం చూత ఫలం* అంటే ఫలాలన్నింటీలో మామిడి ఫలం రారాజు.
*రసం రసం యిక్యూ రసం* అంటే చెరకు రసం మనందరికీ తెలిసిందే.ఒక్కసారిగా చెరకు ముక్కలు నమిలి తినేసరికి నా ఆకలి,దాహం పోయాయి.
*దీపం దీపం చంద్ర దీపం* అంటే చీకట్లో కూడా మనకి వెలుగుని చూపిస్తుంది.
చంద్రుడిలో వెలుగు ఉండబట్టే   తమ్ముడు లక్ష్మణుడు వెళ్ళి తినడానికి తీసుకువచ్చాడు.
అన్న మాట విని లక్ష్మణస్వామి చిన్నగా నవ్వుతారు.
అప్పుడు శ్రీ రాములువారు "ఏమీ లక్ష్మణ నవ్వుతావు..?" అనీ అంటారు.
లక్ష్మణుడు   అంటారు "అన్నగారు మీకు నేను చెప్పినంతవాడినికాదు. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం.."అంటూ

*"బలం బలం బాహు బలం*
*ఫలం ఫలం ధాన్య ఫలం*
*రసం రసం గో రసం*
*దీపం దీపం చఖ్యు దీపం"*

దీని అర్థం ఏంటంటే *బలం బలం బాహు బలం* అంటే అన్నదమ్ములు ఎంత దగ్గరగా ఉన్న బాహు(భుజం)లో బలం లేకపోతే ఎంత అన్నదమ్ములు అయిన ఏమీ చేయగలరు.
*ఫలం ఫలం ధాన్య ఫలం* అంటే సంవత్సరం మొత్తం అందరి ఆకలి, దప్పికలు తీరుస్తాయి.
కానీ మామిడి ఫలాలు మూడు నెలలే ఉంటాయి ఫలాలన్నింటిలో ధాన్యం ఉండాలి.
*రసం రసం గో రసం* అంటే ఆవు యొక్క పాలు అవి తాగితే ఒంటికి ఆరోగ్యం కానీ చెరకు రసంలో ఏమీ వస్తాది.
అందుకే రసం రసం గో రసం అన్నారు.
*దీపం దీపం చఖ్యు దీపం* అంటే కళ్ళు ఉంటేనే కదా అన్నీ చూడగల్గుతున్నాం కళ్ళు లేకపోతే చంద్రుడిని,చంద్ర కాంతిని గానీ చూడలేం కదా

ఇంతటిలోగా సీతమ్మ తల్లీ చిన్నగా నవ్వుతారు
 శ్రీ రాములువారు అడుగుతారు "ఏమైంది జానకి అలా నవ్వవలసిన విషయం ఏముందీ  ఇక్కడ.
సీతమ్మ తల్లీ ఇట్లా అంటారు
మీరిద్దరూ అన్నదమ్ములు సంభాషణ విని నవ్వొచ్చింది స్వామి క్షమించండి.
 శ్రీ రాములువారు అంటారు అలా కాదు మీరు కూడా ఏదో ఆలోచిస్తున్నారు అందుకే నవ్వుతున్నారు.
 సీతమ్మతల్లీ అవును స్వామి మీరిరువురు చెప్పినటువంటి విషయం నాకెందుకో నచ్చలేదు.అందుకే నవ్వాను.
 శ్రీ రాములువారు అడుగుతారు.
అయితే మీ ఉద్దేశం ఏంటి జానకీ.  సీతమ్మతల్లీ ఇట్లా పలుకుతారు

*"బలం బలం దైవ బలం*
*ఫలం ఫలం కర్మ ఫలం*
*రసం రసం రామ రసం*
*దీపం దీపం జ్ఞాన దీపం"*

దీని అర్థం ఏంటంటే *బలం బలం దైవ బలం* అంటే దైవ బలం కంటే పెద్ద బలం ఇంకొకటి లేదు.
కారణం ఇప్పుడు మీ వద్ద భాతృ బలం ఉంది,బాహు బలం కూడా ఉంది.
కానీ దైవ బలం యొక్క విధి వల్ల సూర్యవంశస్తుడు అయినటువంటి చక్రవర్తి దశరథమహారాజుకి తనయలై ఉండి ఈ అడవిలో మునులు ఋషులు వలే వేశధారణతో ఇక్కడ తిరుగుతున్నారు ఇదీ దైవ బలం.
*ఫలం ఫలం కర్మ ఫలం* అంటే ఫలాలన్నింటిలో కర్మ ఫలం శ్రేష్ఠమైనది తెల్లవారితే అయోధ్య సింహాసనం అధిరోహించవలసినటువంటివారు
కానీ   జరిగింది ఏమిటి ఇదే కర్మ ఫలం.
కర్మలో లేకపోతే మామిడి ఫలం కానివ్వండి ధాన్య ఫలం కానివ్వండి ఏ ఫలం కూడా దొరకదు.
*రసం రసం రామ రసం* అంటే రామ నామానికి మించిన నామం(రసం) ఇంకొకటి లేదు లోకాలన్నింటిలో అందరూ కూడ ఈ రామ నామ రసాన్ని తాగుతూ( పలుకుతూ) తరిస్తున్నారు.
*దీపం దీపం జ్ఞాన దీపం* అంటే జ్ఞానం అన్నది లేకపోతే పిచ్చివాడు వలె మూర్ఖుడి వలె ఉందురు అదే ఈ జ్ఞానం లేకపోతే అజ్ఞాని వలె తిరుగుచుందూరు.
ఇదీ దీని యొక్క సారాంశం అందుకే నవ్వాను స్వామి. నేను ఏమైనా తప్పుగా చెప్పివుంటే మన్నించండి.
అందుకే నాకు నవ్వు వచ్చింది స్వామీ. అనీ సీతమ్మ పలుకుతారు.

ఈ కథ నేను ఏ రామాయణ మహాకావ్యంలో కూడా చూడలేదు.

కానీ ఈ సన్నివేశం మా నాన్నగారు ఇరవైరెండు సంవత్సరాల క్రితం చెప్పారు
అప్పుడే మా నాన్నగారిని నేను అడగడం జరిగింది ఇదీ ఏ రామాయణం లో అనీ. ఆయన చెప్పారు కానీ నాకు ఏ రామాయణమో జ్ఞాపకం రావడం లేదు.
గత సంవత్సరకాలంగా ఈ కధ రాద్దాం అనుకుంటున్నాను.కానీ రామనుగ్రహం లేకపోవడం వలన రాయలేకపోయాను.

 *ప్రభు శ్రీరామచంద్రునిగా అవతరించావు. భరత లక్ష్మణ శతృఘ్నులకు అన్నగా జన్మించావు. భూలోకంలో పరమ పవిత్రుడుగా, పాపాలనే కలుపు లతలను కోసివేసే కొడవలి వంటి వాడుగా ప్రసిద్ధికెక్కావు. హే సీత సమేత శ్రీరామచంద్ర మూర్తి మరియు లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమా స్వామీ వారి పాద పద్మలాకు అనంత కోటి ప్రణామలాతో...*
[+] 3 users Like అన్నెపు's post
Like Reply
#18
భార్యా భర్తలమధ్య అభిప్రాయ బేధాలు,పోట్లాటలుపొరపొచ్చాలు ఎందుకు వస్తాయి ? వస్తే  పరిష్కార మార్గాలేమిటి?గొప్ప గొప్ప  రచయితలను అడిగి  వారి సంసారాలలోవచ్చే బేధాభిప్రాయాలను  ఎలా పరిష్కరించుకున్నారోతెలుసు కుందామనే ప్రయత్నం……

ఇంద్రగంటి హనుమశ్ఛాస్త్రి.  …..
మీ సంసారంలో భేదాభిప్రాయాలు వస్తే ఏంచేస్తారు ?అన్నాను .“నా  అభిప్రాయం చస్తే  చెప్పను.” అన్నాడు.

ముళ్ళపూడి …
“మీరూ మీ ఆవిడా మాటామాటా అనుకుంటారుట కదా?
“ “నేను అనుకుంటాను.. ఆవిడ అంటుందండి!”

కాటూరి………“ లేవు  పోట్లాడుకోం .“ అన్నాడు.అంటే
“మీరు  చెప్పినట్లు  ఆవిడ వింటుందా ?“  అన్నాను.
“నేను  చెప్పినట్లు  ఆవిడ వింటుందని చెప్పానా ?”
కోపంతో  అరిచినంత  పని చేశాడు .

మునిమాణిక్యం——
“అమ్మో.. ఆమె అశ్రుధారాస్త్రాలను చూడలేను ఎన్ని
తిట్లు తిన్నా.. నవ్వుతూ ఉండడమే ." అన్నాడు.

వేదుల—” వున్నాయి కానీ నా బాధ ఎవరికీ చెప్పను.
కనుల  రానీయను  బాధను . “  అన్నాడు.

మొక్కపాటి….“నేను మద్రాసులో, ఆవిడ  వైజాగ్ లో
ఫోనులో  దెబ్బలాడుకోవటం కుదరదు. పైగా డబ్బు  
ఖర్చు  దండుగ  కూడానూ !” అన్నాడు.

గిడుగు— “ఆవిడ అరిచి చచ్చినా నాకు వినపడదు.
నేను  మాట్లాడటమే  లేదు  మాట్లాడినా …..
సవర భాష లో  మాట్లాడతాను.”అన్నాడు.
( సవర " దక్షిణ  ముండా భాష .  మనదేశంలో
మొట్టమొదట  ముండా భాషను  శాస్త్రీయంగా
పరిశీలించి  ఇంగ్లీషులో  సవరభాషా వ్యాకరణాన్ని,
సవర-  ఇంగ్లీషు కోశాన్ని   నిర్మించాడు
గిడుగు రామమూర్తి.” )

వేలూరి ….. “వినపడనంత దూరంగా వెడతాను.”

బుచ్చిబాబు…”ఆవిడ  విజ్ఞానఖని ,విజ్ఞాన సర్వస్వం,
విజ్ఞాన భాండాగారం , అని తెలిసి  నోరు మూసుకున్నా
ఎందుకంటే … .ఎప్పుడు  నేను నోరు  విప్పబోతున్నా  
ఆవిడ  “ మీకేమీ   తెలియదు  వూరుకోండి !!!!
మీకీ  మాత్రం కూడా  తెలియదేమిటండీ  ?“అంటూ వుంటుంది లెండి.

నారాయణబాబు…… ” పెళ్ళికూతురిని  చూడండి.
చేసుకున్న  తరువాత  ఎలా  వుంటుందో   చూసి
చెబుతాను ” అన్నాడు.
( ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా జీవితం గడిపాడు)

పండితరాజు ……. కావ్యానికే   కాదు  ధ్వని  .
అసలు ధ్వని తత్వం  మా  ఆవిడకి   తెలిసినట్లు
ఆనందవర్ధనుడికి  కూడా  తెలియదేమో అన్నాడు.

మధునాపంతుల……ఎన్ని అభిప్రాయ  బేధాలొచ్చినా
“ఆలి  కుడిచేతి  వేలి కొసలు  రాజుకొనువేళ  రసఝరి  వుప్పొంగు “ అన్నాడు.

దేవులపల్లి—“పోట్లాట భరించలేను ఏడుపొస్తుంది.”
అన్నాడు.

గరికపాటి—భార్యాభర్తలు  రోజూ మనసు విప్పి కనీసం అరగంట  అయినా మాట్లాడు కోవాలి. అర్ధ గంట
దాటితే మాత్రం మాట్లాడటం ఆపెయ్యాలి .లేకపోతే అనవసర  విషయాలు  ప్రస్తావనకు   వస్తాయి.    
అరగంట  దాటితే  పని  వుందని  చెప్పి లేచి  వెళ్ళి
పోవాలి. కావాలంటే  మరల రెండో  sitting  వెయ్యాలి
వీలైనంత  వరకు  శ్రోతగా  వుండటమే .

అభ్యుదయ కవి…”అభ్యుదయ మార్గాన నడిచి చాలా ముందు  కొచ్చేశాను .  ఇప్పుడు మా మధ్య  దూరం  
బాగా  ఎక్కువైంది  “ అన్నాడు.

స్వామీజీ—-పోట్లాటలు ఎందుకు  వస్తాయి  స్వామీ తప్పించుకునే  మార్గం ఏది ? అని అడిగాను.

“ఇది అనాది నుంచీ వస్తున్న సదాచారం నాయనా!!  అనుకూలవతి   అంటే   ఏమీ   మాట్లాడకుండా
వుండటం  కాదు  .  తప్పించుకోవాలంటే  నువ్వు  
రెండు మార్గాలు అనుసరించాలి…
1— విధేయత
2–సన్యాస స్వీకరణ.

చివరగా ఓ మంచి ముక్క….
“కొంపలో నీమాట చెల్లాలని  ఎట్టి  పరిస్థితుల్లోనూ
అస్సలు  అనుకోకు. తలపు లోకి   కూడా   రానీకు.. ”
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#19
గ్రేట్ ఫిలాసఫీ

చచ్చిపోయేమనుకో... అప్పుడు ఏమవుతుందంటావ్.?'
'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది.'
'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?'
'ఏమీ అవ్వదు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.!. మంచి బేరం పోయిందే.!. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు.'
'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసాను కదా.!. స్వర్గానికి పోతానంటావా.?'
'స్వర్గం అంటే ఏమిటో.?'
'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, ఊర్వశి, మేనకా డాన్సాడుతూంటారూ.!.'
'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు.?'
'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, ఊర్వశి, మేనకా, అప్సరా వెయిటింగన్నారు.?'
'రంభా, ఊర్వశి, మేనకా, అప్సరా ఏవైనా కామపిశాచులేవిటీ.? పైకొచ్చే మగ వెధవలందరి కోసం కాసుక్కూచోడానికి.? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం, ఎవరో తెలీని ఆడదానితో సరసాలాడటానికా.?'
'మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని.?'
'సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా.? '
'ఛఛ... మా ఆవిడ పతివ్రత.!.'
'అంటే.. నువ్వు వెధవ్వన్నమాట.?'
'సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు.. స్వర్గం సంగతి పక్కనెడదాం.. పోనీ పాపం చేసి పోయేననుకో.. యమధర్మరాజు నన్ను నూన్లో వేయిస్తాడా.?'
'నువ్వేమైనా పకోడీవా బజ్జీవా నూన్లో వేయించడానికి.? పోనీ.. వేయించేడే అనుకో.. వేయించి ఏం చేస్తాడూ.? ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు కదా..'
'అంటే వేయించడంటావా.?'
'ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా.? చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి.? అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా.?'
'అంటే.. స్వర్గం, నరకం లేవంటావు.?'
'ఎందుకు లేవూ.?. స్వర్గం, నరకం చస్తే ఉండవు. బతికుండగానే ఉంటాయి.
ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నీ పని నువ్వు చేసుకున్నావనుకో.. ఆ రాత్రి హాయిగా నిద్దరడుతుంది.. అది స్వర్గం..
అలాక్కాకుండా ఎవర్నో ఏదో ఇబ్బందెట్టాలనే ఎదవాలోచన చేసేవనుకో.!. అదే ఆలోచన నిన్ను నిద్దర్లో కూడా తినేస్తుంది.. అది నరకం.
[+] 2 users Like అన్నెపు's post
Like Reply
#20
గోడకు కొట్టిన బంతి

నా పేరు భావన ,
నాకు తెలిసీ  ఊహ వచ్చినప్పటి నుండి  నేను గమనిస్తున్నాను .  నానమ్మను ఏదో ఒక వంకతో ఏదో ఒకటి అంటూనే ఉండేది అమ్మ  .  పాపం నానమ్మ  తప్పేమీ లేకపోయినా మౌనంగా తల దించుకుని అలాగే ఉండిపోయేది,.   అమ్మ నాన్నమ్మని తిట్టడం విన్న నాన్న  అమ్మని కోప్పడిథే అమ్మ  ఆగకపోవడం సరికదా నాన్నని కూడా నోరు మూయించేసేది  అలాగే ఎఫ్పుడూ జరుగుతుండడంతో రాను రాను నాన్న కూడా నాన్నమ్మ విషయంలో నోరెత్తడం మానేసారు . ఎందుకమ్మా నాన్నమ్మ తప్పేమి లేకపోయినా ఊరికనే అలా ఆడిపోసుకుంటావు అని నేనంటే బయలు దేరిందండీ పెద్ద ఆరిందా అంటూ నీకేమీ తెలియదు నువ్వు కూడా నోరు మూసుకుని కుర్చో మీ నాన్నే నన్ను అడగడానికీ సరిపోడు నువ్వెంత అంటూ నన్ను కూడా తిట్టిపోసేది.  అది విన్న నానమ్మ నా కోసం నువ్వెందుకమ్మా మాటలు పడడం ఇదంతా నా ఖర్మ  వదిలెయ్యమ్మా అంటూ బాధపడేది అలాగే రోజులు గడిచి పోయాయి అన్నయ్య నేను పెద్దవాళ్ళం అయిపోయాము  . మా ఇద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి.  కొన్ని రోజుల తరువాత పుట్టింటికి  పచ్చిన నాతో అమ్మ ఏడుస్తూ అమ్మా భావన మీ వదిన ఈ ఇంటికి కోడలు కాదే కొరివి దెయ్యం ప్రతీ రోజూ నన్ను తిట్టడమే దానికి పని నన్ను  తిట్టని రోజంటూ లేదు మీ అన్నయ్య  ఒక చేతకాని చవట  పెళ్ళం చేతిలో కీలుబొమ్మ అయ్యిపోయాడు ఇంక మీ నాన్న మూగవాడి నైజం నీకు తెలిసిందే కదా అంది  అమ్మ కన్నీళ్ళు తుడుచుకుంటూ .చూడు అమ్మా గోడకు కొట్టిన బంతి మరలా వెనక్కే గా వస్తుంది నీ అత్తగారికి నువ్వేమి చేసావో నీ కోడలు నీకూ అదే చేస్తుంది ఇందులో ఆశ్చర్యం ఏముంది అన్నాన నేను. ఆ మాటకీ అమ్మ ఏమీ మాట్లాడలేక సిగ్గుతో తల దించేసుకుంది
[+] 2 users Like అన్నెపు's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)