Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఆ అర్ధరాత్రి
#1
ఆ అర్ధరాత్రి 
-  shyam
నేను నమక్కల్ లోని ఒక ప్రభుత్వ  ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న  కాలంలో జరిగిన సంఘటన ఇది. ఒక రోజు సాయంత్రం 5 గంటల సమయంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులోని సమాచారం ఏమిటంటే
 “ ఇంజంకుప్పం” అనే ప్రాంతంలో ఉంటున్న మా బాబాయ్ చనిపోయాడని అతని దహన క్రియలకి నేను హాజరు అవ్వాలని. విల్లిపురం పట్టణానికి
30 కి.మీ. దూరంలో మా బాబాయ్ ఉంటున్న “ ఇంజంకుప్పం” గ్రామం ఉన్నది. ఆ రోజుల్లో ఆ గ్రామాన్ని వెళ్ళటానికి సరైన రవాణా సౌకర్యాలు
ఉండేవికావు. ఏది ఏమైనా నేను అక్కడికి వెళ్ళి తీరాలి కనుక ఆఫీసుకి రెండు రోజులు సెలవు పెట్టి ఆ తరువాత ఇంటికివచ్చి కొద్దిగా లగేజ్ తీసుకుని
ప్రయాణం అయ్యాను. సాయంత్రం సమయంలో నమ్మక్కల్ లో బయలుదేరిన నేను రాత్రి 12 గంటల ప్రాంతంలో విల్లిపురం చేరుకున్నాను.
అది ఎండాకాలం. పున్నమి రాత్రి ఆకాశం నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉన్నది. ఆ అర్ధరాత్రి సమయంలో నేను, విల్లిపురం బస్ స్టాండ్ లో కాసేపు అటు ఇటు తిరిగి ఆ తరువాత అక్కడ నుంచుని ఉన్న ఒకవ్యక్తిని ఇలా ప్రశ్నించాను.
 “ ఇంజంకుప్పం” వెళ్ళే బస్సు ఎప్పుడు ఉన్నది ?. ఆ వ్యక్తి చిన్నగా నవ్వుతూ నాతో ఇలా అన్నాడు. " ఇంజంకుప్పం గ్రామానికి వెళ్ళే లాస్ట్ బస్సు రాత్రి
11 గంటలకు వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ రేపు ఉదయమే అక్కడకు వెళ్ళే బస్సులు ఉంటాయి ”. అరె! తెల్లవారేసరికి నేను ఇంజంకుప్పంకి చేరుకోకపోతే మా బాబాయ్ అంత్యక్రియలకి అందుకోలేను. ఇక్కడ చూస్తే బస్సులేదు ఎలా? అని తెగ ఆలోచించాను. ఆ తరువాత బస్ స్టాండ్ లో ఒక మూలగా నుంచుని మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తుల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో ఇలా అన్నాను.“ ఇజంకుప్పం వెళ్ళే బస్సులు ఇప్పుడు లేవని చెబుతున్నారు.
నేను ఎలాగైనా తెల్లవారేలోగా అక్కడకు చేరుకోవాలి. నాకు ఏదైనా మార్గం ఉన్నదా? ”. వాళ్ళు తెల్లముఖం వేసుకుని ఆ గ్రామం గురించి, ఆ గ్రామానికి వెళ్ళే వాహనాల గురించి తమకు ఏమాత్రం తెలియదు అన్నారు.ఇక చేసేదిలేక బస్ స్టాండ్ లో నుండి బయటకువచ్చి రోడ్డుమీద నుంచున్నాను. ఏదైనా లారీ ఎక్కి ఆ గ్రామానికి చేరుకోవచ్చు ఏమో అని అనుకున్న నేను రోడ్డుమీద ఉన్న ఇద్దరిని ఎటువైపు వెళ్ళే లారీ ఎక్కితే ఇంజంకుప్పం చేరగలనో చెప్పమని అడిగాను. వాళ్ళు బుర్ర గోక్కుని మాకేం తెలియదు అని అక్కడనుండి వెళ్ళిపోయారు. ఏం చెయ్యాలో అర్ధంకాక అక్కడికి 100 గజాల దూరంలో ఉన్న ఒక టీ బంకు దగ్గరకు వెళ్ళి వేడి వేడిగా ఒక కప్పు టీ తాగి ఆ తరువాత అక్కడే ఒక సిగరెట్ కొనుక్కుని వెలిగించుకున్నాను. కాస్త హాయిగా అనిపించింది. టీ త్రాగి, సిగరెట్ తాగుతుంటే నా మెదడు మహాచురుగ్గా పనిచేస్తుంది. టీ బంకు వాడిని ఇలా ప్రశ్నించాను.“ ఇంజంకుప్పం గ్రామానికి వెళ్ళే లారీలు ఎక్కడ ఆగుతాయో చెప్పగలరా? ”. ఆ టీ బంకు ఓనరు తమాషాగా నవ్వుతూ నాతో ఇలా అన్నాడు.
సార్! ఇంజంకుప్పం ఇక్కడికి చాలా దగ్గరలోనె వుంది.. మీరు అడ్డదోవలో వెళ్ళినట్లయితే చాలా  తేలిగ్గా అక్కడకు చేరుకుంటారు. దగ్గర
అంటే బహుశా ఇంజంకుప్పం అక్కడికి రెండు, మూడు కిలోమీటర లోపే ఉంటుందని  భావించిన నేను నడిచి ఆ గ్రామానికి చేరాలని నిర్ణయించుకుని ఆ గ్రామాణికవేళ్ళే రూట్ చెప్పమని టీ బంకు వాడిని అడిగాను.మెయిన్  రోడ్ మీదగా కొంతదూరం వెళ్ళి ఆ తరువాత మెయిన్ రోడ్ మీద నుండి  ప్రక్కకు వెళ్లే   ఇంకొక చిన్న రోడ్డుద్వారా ఇంజంకుప్పం చేరుకోవచ్చని  టీ బంకువాడు చెప్పాడు.సరే!కొద్ది దూరమే కనుక నడుచుకుంటూ  ఇంజంకుప్పం చేరుకోవాలని నిర్ణయించుకున్న  నేను బాగ్ భుజాన తగిలించుకొని టీ బంకువాడు చెప్పిన ప్రకారమే మెయిన్ రోడ్డుమీద నడక ప్రారంభించాను.
ఎటుచూసినా  విశాలమైన పొలాలు అప్పుడప్పుడూ వినిపిస్తున్న కీచురాళ్ల రొద నాలో ఏదో తెలియని అలజడిని రికేత్తిస్తున్నది. అయినా నేను నడక మానలేదు. అలా ఒక గంటసేపు ఆ రోడ్డు మీద నడిచాను. కనుచూపుమేరలో ఎక్కడా గ్రామం అనేది ఉన్నట్టుగా కనపడలేదు. అప్పుడప్పుడూ ఏదో ఒక లారీ ఆ రోడ్డుమీద బయ్ మని శబ్దం చేస్తూ వెళుతూ ఉన్నది. ఎవడైనా లారీవాడు నన్ను ఎక్కించుకోకపోతాడా అన్న ఆశతో ఏదైనా లారీ వచ్చినప్పుడల్లా చెయ్యి ఊపుతూ స్టాప్! స్టాప్! అని అరిచాను, కానీ ఆ లారీ డ్రైవర్లు నా దగ్గర లారీలు ఆపకుండా నా ప్రక్కనుండి వేగంగా దూసుకుపోయారు. అలా ఎన్నో లారీలు నా ప్రక్కనుండి వెళ్ళిపోయాయి.“ ఇక నాకు కాలినడకే శరణ్యం ” అని నిర్ణయించుకున్న నేను ఆ పున్నమి అర్ధరాత్రిలో విచిత్రంగా మెరుస్తున్న ఆ తారురోడ్డుమీద పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకి నడుస్తున్నాను. రోడ్డుకి స రెండువైపులా ఎత్తుగా పెరిగిన  వరి పొలాలు కనిపిస్తున్నాయి. సుమారు ఒక గంటన్నర నడిచిన తరువాత బాగా అలసటగా అనిపించింది. దాహంగా కూడా అనిపించింది. కాసిని మంచినీళ్ళు తాగకపోతే ముందుకి నడవటం సాధ్యం కాదు అనిపించింది.
సాధారణంగా రోడ్డు ప్రక్కన ఉండే పొలాల్లో ఎక్కడో ఒకచోట ఆ పొలాలకు కాపలాకాసేవాళ్ళు ఒక గుడిసె వేసుకుని రాత్రి సమయాల్లో ఆ గుడిసెలోనే ఉంటారు. ఇక్కడ పొలాలు చాలా ఉన్నాయి కనుక ఏదో ఒక పొలంలో ఎవరో ఒకరు ఉండకపోరు అని అనుకుని రోడ్డుకి రెండు వైపులా ఉన్న పొలాలను పరిశీలనగా చూసాను. కానీ నాకు అలాంటి గుడిసెకాని కనీసం మనిషికాని కనిపించలేదు. ఆ నిశిరాత్రిలో దయ్యంలాగా నేను ఒక్కడినే ఆ నిర్జన ప్రదేశంలో ఉన్నానని నాకు అర్ధమయ్యింది. ఒక్కసారిగా నాలో ఏదో తెలియని భయం పడగలు విప్పింది.నేను ఇప్పుడు ఒంటరివాడిని. పిలిస్తే పలికే దిక్కుకూడా లేదు. ఏం చెయ్యాలి ?.
ఏది ఏమైనా అక్కడ నుంచుని నేను చేసేది ఏమీ లేదు కనుక ఎలాగో దైర్యం  తెచ్చుకుని మెల్లిగా ముందుకు నడవటం ప్రారంభించాను. ఒక ప్రక్క
అలసట, ఇంకొక ప్రక్క దాహం క్రమక్రమంగా నా నడక బాగా నిదానం అయిపోయింది.
 
టైం ఎంతో చూద్దామని నా రేడియంటైల్ రిస్ట్ వాచ్  కేసి చూసుకున్నాను. అప్పుడు సమయం తెల్లవారుఝామున రెండు దాటింది అని అర్ధమయ్యింది. అలా నిదానంగా నడుస్తున్న నాకు రోడ్డుకి కుడి ప్రక్కగా ఉన్న ఒక పొలం మధ్యలో ఒక గుడిసె మరియు ఆ గుడిసెలో వెలుగుతున్న
ఒక దీపం కనిపించాయి. “ అమ్మయ్య! ఆ గుడిసెలో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వాళ్ళని అడిగి కాసిని మంచినీళ్ళు తీసుకుని తాగుతాను. ఆ తరువాత తెల్లవారేదాకా ఆ గుడిసెలోనే కాలక్షేపం చేస్తాను” అని అనుకున్న నేను రోడ్డుదిగి పొలంలోకి నడిచాను. బహుశా కొద్ది రోజుల క్రితమే ఆ పొలంలో ఉన్న వరి పంటను కోసి ఉంటారని నాకు అనిపించింది.
పంట కోసివెయ్యటంవల్ల పొలం అంతా ఖాళీగా ఉన్నది. మెల్లిగా నడుస్తూ ఆ పొలం మధ్యలో ఉన్న గుడిసె దగ్గరకు వెళ్ళాను. ఆ గుడిసెకు తలుపులు లేవు. గుడిసెముందు నుంచుని లోపలకి తొంగిచూసాను. లోపల నేలమీద ఒక చాపమీద ఒక వృద్ధదంపతులు గాఢనిద్రలో ఉన్నారు. వాళ్ళ ప్రక్కన ఒక బోర్లించిన కుండమీద ఒక వెలుగుతున్న దీపంబుడ్డి ఉన్నది. బహుశా  నా అడుగుల చప్పుడువల్ల ఆ గుడిసెలో నిద్రపోతున్న వృద్ధుడికి మెలుకువ వచ్చి లేచికూర్చుని నావైపు చూసాడు. అతని వయస్సు దాదాపుగా  90 సంవత్సరాలు ఉండి ఉంటుందని నాకు అనిపించింది. అయితే అతడు  చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా కనిపించాడు. ఆ వృద్ధుడు నిద్రలేవటంతో  అప్పటివరకు గాఢనిద్రలో ఉన్న అతని భార్యకూడా గబుక్కున నిద్రలేచి చాపమీద కూర్చున్నది. ఎవరు  నువ్వు?" అని ప్రశ్నిస్తున్నట్టుగా నావైపు చూసాడు ఆ వృద్ధుడు. నేను బలహీనంగా  నవ్వుతూ అతనితో " అయ్యా!
నేను విల్లిపురం నుండి వస్తున్నాను. నాకు బాగా దాహం గ మరియు అలసటగా  కూడా ఉన్నది.  దయచేసి నాకు కాసిని మంచినీళ్ళు ఇచ్చినట్లయితే నేను దాహం తీర్చుకొని వెలుతురువచ్చేవరుకు మీ గుడిసెలోనే ఆ మూలగా కాసేపు కూర్చుంటాను "అన్నాను.
 
 ఆ వృద్ధ దంపతులు ఏమీ మాట్లాడకుండా నాకేసి పరిశీలనగా చూస్తున్నారు.వాళ్ళకి నా గురించి పూర్తిగా తెలియజేయాలి అనుకొని  వాళ్ళతో  " అయ్యా!నేను ఇంజంకుప్పం . గ్రామానిక వెళ్ళాలి.రాత్రి 12 గంటలకి విల్లిపురంలో బస్సుదిగాను. ఇంజంకుప్పం వెళ్లే బస్సులు తెల్లవారేదాకా లేవని తెలియటంతో నడుచుకుంటూ ఇంజంకుప్పం చేరుకోవాలని బయలుదేరాను” అన్నాడు. నా మాటలు పూర్తి అయ్యాయో
లేవో ఆ వృద్ధుడు పెద్దగా నవ్వి ఆ తరువాత విచిత్రమైన స్వరంతో నాతో ఇలా అన్నాడు. “ నా సహాయం లేకుండా నువ్వు ఆ గ్రామానికి చేరు కోగలవా? ఏదైనా వాహనం ఎక్కి అక్కడికి వెళ్ళు, నడిచి వెళ్ళాలని ప్రయత్నించకు.చిక్కులో పడతావు!". ఆ వృద్ధుడి స్వరం చాలా కఠినంగా ఇంకొక రకంగా చెప్పాలంటే బెదిరిస్తున్నట్టుగా నాకు అనిపించింది. నేనే వాళ్ళ
ప్రక్కన ఉన్న కుండలోని నీళ్ళను ఒక గ్లాసుతో తీసుకుని ఆత్రంగా నోట్లో పోసుకున్నాను. వాళ్ళు నావైపు విచిత్రంగా చూస్తున్నారు. నేను వాళ్ళవైపు
కొద్ది సెకన్లపాటు తీక్షణంగా చూసి ఆ తరువాత రెండు క్షణాలపాటు  కళ్ళుమూసుకుని  గట్టిగా ఊపిరి తీసుకుని  కళ్ళు తెరచి చూసాను లేరు.. ఆశ్చర్యం ||
అప్పటివరకు నాకళ్ళముందు ఉన్న ఆ వృద్ధజంట అక్కడ లేరు. అప్పటివరకు ఆ వృద్ద జంట పడుకుని ఉన్న చాపలేదు. అంతేకాదు అప్పటివరకు అక్కడ ఇద్దరు  మనుషులు  ఉన్న దాఖలాకూడా కనపడటం లేదు. నేను కల  కంటున్నానా  అనిపించింది. నేను  ఇప్పుడు నిద్రపోవటం లేదు. మెళుకువగానే ఉన్నాను. కనుక నాకు కనపడింది కలలోని దృశ్యంకాదు. నిజమైన దృశ్యమే అనిఅర్ధమయ్యింది. కొద్ది సెకన్ల క్రితమే ఆ వృద్ధుడి ప్రక్కన ఉన్న కుండలో నీరు నేను త్రాగినందుకు ఋజువుగా నా చొక్కామీద నీటితడి ఉన్నది. మరి వాళ్ళు హఠాత్తుగా ఎలా అదృశ్యం అయ్యారు?
 
ఒక్కసారిగా నాలో ఏదో తెలియని భయం విజృంభించింది. దాంతో ఒక్కక్షణం కూడా  ఆ గుడిసెలో నుంచోబుద్ధికాలేదు. కన్నుమూసి తెరిచే
లోగ ఒక్క గేంతుతో ఆ గుడిసెలో నుండి బయటకి వచ్చి చాలా వేగంగా కనిపించన దిక్కుకి పరుగు ప్రారంభించాను. దాదాపు 15 ఒక నిమిషాల తరువాత చెరుకు గడల లోడుతో నా వెనకాలగా వస్తున్న ట్రాక్టర్ కనపడింది. నేను పరుగు ఆపి ట్రాక్టర్ ముందు నిలబడ్డాను. ఎగుడు దిగుడు పొలాలలో ఊగుతూ వస్తున్న ఆ ట్రాక్టర్ ప్రంట్లైట్ వెలుగులో కనపడ్డ  నన్నుచూసిన ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఆపాడు. నేను గబగబా ట్రాక్టర్ డ్రైవర్ వద్దకు వెళ్లి  గ్రామానికి  తంబీ!దయచేసి నన్ను ని ట్రాక్టర్ మీద ఇంజంకుప్పం గ్రామానికి తీసుకు వెళ్ళు అన్నాను.ఆ ట్రాక్టరు ట్రాలీ మీద  ఎత్తుగా పేర్చిన చెరుకుగడలమీద నలుగురు, ఐదుగురు కూలీలు కూర్చొని కునికి పాట్లు పడుతున్నారు.ట్రాక్టర్ డ్రైవర్ ఏమనుకున్నాడో ఏమో కాని నన్ను ట్రాక్టర్ ఎక్కించుకోవటానికి అంగీకరించాడు కూర్చున్నాను.నేను డ్రైవర్ పక్కన ఉన్న కొద్దిపాటి ప్రదేశంలో ఇరుక్కొని కూర్చున్నాను. డ్రైవర్ మల్లి ట్రాక్టర్ ని దడదడలాడిస్తూ ముందుకు నడపటం ప్రారంభించాడు. “ ఇంతకీ ఎవరు
నువ్వు? ఇలాంటి సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావు?" అని ట్రాక్టర్ డ్రైవర్ నన్ను  అడిగాడు. చ. నేను ఇంజంకుప్పం వెళ్ళాలని  నడుస్తూ  విల్లిపురం నుంచి వస్తున్నానని చెప్పటమే కాకుండ కొద్దిసేపటి క్రితం ఒక వరి పొలంలో ఒక గుడిసెలో ఒక వృద్ధజంట కనిపించటం ఆ తరువాత మాయం అవటం
వరకు జరిగిన సంఘటనలన్నీ ట్రాక్టర్ డ్రైవర్ కి వివరించాను. ట్రాక్టర్ డ్రైవర్ కొద్ది నిమిషాలపాటు ఏమీ మాట్లాడలేదు.
 
గుంటలు పడ్డ మట్టిరోడ్డుమీద ఆ ట్రాక్టర్ నడుస్తూ ఉంటే ట్రాక్టర్ మీద కూర్చుని ఉన్న నేను ఎగిరెగిరిపడుతున్నాను. అప్పటివరకు నేను ట్రాక్టర్
ఎక్కి ప్రయాణించిన చరిత్రే లేదుమరి. చల్లటి గాలి నా శరీరాన్ని తాకుతూ ఉంటే ఎంతో హాయిగా అనిపించింది. ట్రాక్టర్ డ్రైవర్ ఏమీ మాట్లాడకుండా
ఏకాగ్రతగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. నేను ట్రాక్టర్ డ్రైవర్ కేసి చూస్తూ కూర్చున్నాను. ఆ నిశ్శబ్దాన్ని భంగంచేస్తూ ట్రాక్టర్ డ్రైవర్ నాతో ఇలా
అన్నాడు. “ విల్లిపురం నుంచి ఇంజంకుప్పం 34 కి.మీ. దూరంలో ఉన్నది. సాధారణంగా రాత్రి సమయంలో ఎవరూ విల్లిపురం నుండి
వాహనాల్లో కూడా రోడ్డు మార్గంలో ఇంజంకుప్పంవైపు రారు. ఇందాక నీకు
ఒక వృద్ధ జంట కనిపించారని చెప్పిన ప్రదేశాన్ని కుప్పం” అని పిలుస్తారు. అ ప్రదేశంలో గతంలో చాలామందికి దయ్యాలు కనిపించాయని
చెప్పుకుంటూ ఉంటారు. నీకు కనిపించిన వృద్ధజంట కూడా ఖచ్చితంగా దయ్యాలే. నీ అదృష్టం బాగుంది అందుకే అవి నీకు ఏమీ హాని చెయ్యలేదు ”.
డ్రైవర్ చెప్పిన మాటవిన్న నాకు ఒక్కసారి వళ్ళు జలదరించినట్టు అనిపించింది. భయంతో నా మెడమీద వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి.
ఆ గుడిసెలో నాకు కనిపించింది దయ్యాలా? అవి దయ్యాలయితే మనుషులులాగా ఎలా ప్రవర్తించాయి? నాకు మంచినీళ్ళు ఎలా ఇచ్చాయి?
అన్న ప్రశ్నలు నా మెదడుని మెలి పెట్టేశాయ్. తెల్లవారుతుండగా నేను ఎక్కిన ట్రాక్టరు ఇంజంకుప్పం గ్రామంలోకి ప్రవేశించింది.
 
డ్రైవర్ ట్రాక్టర్ ఆపాడు. నేను ఒక్క గెంతుతో ట్రాక్టర్ మీదను కిందకు దూకి ఆ డ్రైవర్ కి కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి మా బాబాయి వాళ్ళ
ఇంటివైపు  అడుగులు వెయ్యటం ప్రారంభించాను. “ దయ్యాలు ఉన్నాయి అని చెప్పుకోవటమే కాని వాటిని నిజంగా చూస్తే ఎలా ఉంటుందో అన్న విషయం ఆ రోజు  అర్ధమయ్యింది. నా యెడల దైవం అనుకూలంగా  ఉన్నాడు కనుక నేను ఆ రోజు ఏ ప్రమాదం లేకుండా బయట పడ్డాను
కాదంటారా?".
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)