18-04-2023, 02:48 PM
(This post was last modified: 18-04-2023, 02:49 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
నవ వసంతం
- NBS Srinivasa Polisetti
మే ఐ కమిన్ సార్.. వినయంగా అడిగాడు నవీన్.. ఆ మాట వినబడే సరికి తలవంచుకుని వర్క్ చేస్తున్న రామారావు మాస్టారు తల పైకెత్తి కళ్ళజోడు సవరించుకుంటూ నవీన్ వంక చూసారు
ఎస్.. కమిన్ అనగానే రామారావు మాస్టర్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు నవీన్.. ఎవరు నువ్వు..? నీకు ఎవరు కావాలి..!? అడిగారు రామారావు మాస్టర్ మాస్టారు.. నేను మీ స్టూడెంట్ ని అన్నాడు నవీన్ అవునా..! గొంతు వినడమే గాని చూసి ఎన్నాళ్ళయింది రా నిన్ను..ఎందుకు వచ్చావు కళ్ళజోడు పై నుండి చూస్తూ అడిగారు రామారావు మాస్టర్
నేను మీ ఇంటర్ కాలేజీలో చదివాను సార్ అన్నాడు నవీన్.. అది పదేళ్ల కిందటి మాట.. అయినా ఇప్పుడు ఆ కాలేజీ లేదు.. మూతపడిపోయింది అంత బాధగా అన్నారు రామారావు మాస్టర్
నాకు తెలుసు సార్.. కానీ నాకు మీ ఇంటర్ కాలేజ్ బిల్డింగ్ తాళంచెవి కావాలి.. అందుకే మీ దగ్గరకు వచ్చాను అన్నాడు నవీన్.. తాళంచెవి ఇస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా! కొంత గంభీరంగా అడిగారు మాస్టర్
తెలుసు మాస్టర్.. అయినా నాకేం కాదు మీరు తాళంచెవి ఇస్తే నేను వెళ్తాను అన్నాడు నవీన్.. ఇన్నాళ్ల తర్వాత నీకు రిస్కు చేయడం అవసరమా? మళ్లీ ప్రశ్నించారు రామారావు మాస్టర్.. అది కాదు సార్.. నాకు ఇష్టమైనది ఒకటి లోపల ఉంది.. దానిని తీసుకుందామని రిక్వెస్ట్ గా అడిగాడు నవీన్
నిజమే కావచ్చు.. కానీ ఆ తలుపులు మూసి పదేళ్లయ్యింది.. పైగా ఇప్పుడిప్పుడే ఆ జ్ఞాపకాలు చెరిగిపోతున్నాయి.. త్వరలో ఆ బిల్డింగ్ సేల్ చేయాలని ఆలోచనలో ఉన్నాను.. ఇప్పుడు నువ్వు దాన్ని తెరిస్తే కథ మళ్ళీ మొదటికి వస్తుంది.. అందుకే వచ్చిన దారిన వెళ్ళిపో! అన్నారు మాస్టర్
లేదు మాస్టర్ మీకు నేను మేలు చేయాలని వచ్చాను.. నాకు ఇష్టమైన దాన్ని నేను తీసుకెళ్ళి పోతే మీరు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు.. పైగా సేల్ చేస్తానని కూడా అంటున్నారు.. ఆ బిల్డింగ్ ని కొనుక్కునేవారు హాయిగా ఉంటారు.. ప్లీజ్ మాస్టర్ ఒకసారి తాళంచెవి ఇవ్వండి అభ్యర్థనగా అడిగాడు
ఏంటో నీ మొండి ధైర్యం..పట్టుదల చూస్తుంటే తాళంచెవి ఇవ్వాలని అనిపిస్తుందంటూ లోపలకి వెళ్లి ఎక్కడో దాచిపెట్టిన తాళంచెవిని తీసుకువచ్చి నవీన్ చేతిలో ఉంచారు మాస్టర్
థాంక్యూ మాస్టర్.. మీరు మారలేదు అప్పుడు ఇప్పుడు నాపై అదే ప్రేమ చూపించారు.. దానికి బహుమతిగా మీ బిల్డింగ్ మీకు క్షేమంగా అప్పగిస్తాను అన్నాడు నవీన్.. నా క్షేమం కంటే నీ క్షేమం ముఖ్యం జాగ్రత్త సుమా! ఓ పాఠంలా చెప్పారు మాస్టర్.. అలాగే సార్ అంటూ అక్కడి నుండి బయలుదేరాడు నవీన్
బిల్డింగ్ ముందు ఆగి ఒక్కసారి ఆ ప్రదేశాలన్ని పరికించి చూసాడు నవీన్.. మెయిన్ గేట్ ఓపెన్ చేసి ముందుకు తోసాడు.. బిల్డింగ్ దుమ్ము పట్టి వెలవెలబోతూ కనిపించింది.. తెరుచుకున్న మెయిన్ గేట్ తో పాటు నవీన్ మనసు గేట్ కూడా తెరుచుకుని గతం ఓపెన్ అయింది
ప్రసన్న లక్ష్మి జూనియర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్.. మెయిన్ గేట్ పై పెద్ద బోర్డు అలంకరించబడి ఉంది
మామ.. ఈరోజు నుంచి ఇదే మన అడ్డా చేతిలో బుక్స్ ఊపుతూ అన్నాడు నవీన్ ఫ్రెండ్ లంబు.. నిజమేరా! రెండేళ్ల పాటు హాయిగా ఎంజాయ్ చేద్దాం సపోర్ట్ గా పలికాడు నవీన్.. ఇద్దరూ కాలేజీలోకి ప్రవేశించారు.. మంచి రెపుటేషన్ ఉన్న కాలేజీ కావడంతో చాలా మంది స్టూడెంట్స్ పోటీపడి మరి జాయిన్ అవుతుంటారు
క్లాస్ రూమ్ కొత్త విద్యార్థులతో కళకళలాడిపోతోంది.. లెక్చరర్ బోర్డుపై లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.. నిశ్శబ్దంగా ఉన్న క్లాస్ రూమ్ కి ఆలస్యంగా వచ్చింది వసంత.. మే ఐ కమిన్ సార్..! అనగానే క్లాస్ రూమ్ లో విద్యార్థుల తలలన్నీ ఆమె వైపు తిరిగాయి
వావ్..! సూపర్.. వాట్ ఏ బ్యూటీ అంటూ లంబు చేతిని గట్టిగా నొక్కుతూ పలికాడు నవీన్.. అవును మామ.. నిజమే అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ లంబు.. ఏంటి నిజం మీ చెల్లెలు సూపర్ రా! అన్నాడు నవీన్.. అవును బావా అయినా అప్పుడే ఎందుకు తొందర.. రెండేళ్లకు తొలిరోజు ఇదే కదా! నవ్వుతూ అన్నాడు లంబు
ఎస్..కమిన్ అన్న లెక్చరర్ పిలుపుతో క్లాస్ రూమ్ లోకి ఎంటరయ్యింది వసంత.. కాలేజీ రోజులు గడుస్తున్నాయి.. ఏయ్.. వసంత ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేశాడు సుప్రీత్.. ఆ ప్రపోజ్ కి షాకయ్యింది వసంత.. మీ మగాళ్లంతా ఇలాగే ప్రవర్తిస్తారు.. మా మనసుతో మీకు పని లేదా?! అంటూ ఘాటుగా క్లాస్ పీకింది సుప్రీత్ కి
హే.. వసంత ఎందుకంత కోపం..?! ఇప్పుడు ఏమైంది? నా మనసులో మాట చెప్పానంతే.. నువ్వు కూడా అలాగే చెప్పొచ్చు అన్నాడు సుప్రీత్..ఓ అలాగా! ఐతే సరే నువ్వంటే నాకు చచ్చినా ఇష్టం లేదు.. ఇలాంటి ప్రపోజల్స్ ఇంకొకసారి నా ముందు ఉంచితే ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇస్తాను అంది స్ట్రాంగ్ గా
సారీ సారీ.. ఏదో ఆవేశంలో అనేసా.. అంటూ రెండు చెవులను వ్రేళ్ళతో పట్టుకుని గుంజి తీసుకున్నట్టుగా నటించి వెళ్ళిపోయాడు సుప్రీత్.. వెనువెంటనే అక్కడికి వచ్చాడు నవీన్.. ఏంటి వసంత ఎనీథింగ్ రాంగ్.. అంటూ ప్రశ్నించాడు.. ఎప్పుడూ ఉండేదేగా ఆ గోల.. బై ది బై మూడ్ ఆఫ్ చేశాడు.. పద అలా క్యాంటీన్ కి వెళ్లి వేడిగా టీ తాగుతూ మాట్లాడుకుందాం అంది వసంత
వసంత ఇంట్లో…
చూడు వసంత.. కాలేజీలో నీ ప్రవర్తన ఏమి బాలేదని మీ బావ సుప్రీత్ చెబుతున్నాడు.. వాడెవడో నవీన్ నీవెంట పడుతున్నా నువ్వు నాకు చెప్పకుండా దాచి పెట్టడం నచ్చలేదు గంభీరంగా పలికాడు వసంత తండ్రి
తప్పే డాడీ.. కానీ నాకు నవీన్ అంటే చాలా ఇష్టం.. ఆ విషయం మీకు చెప్పి పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నాను.. కానీ ఈలోపే మీకే తెలిసిపోయింది కూల్ గా వసంత చెప్పేసరికి
షటప్.. ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకోవడానికి నేను ఒప్పుకోను పైగా చిన్నప్పుడే నా చెల్లెలు కొడుకు సుప్రీత్ ని నా అల్లుడుగా చేసుకుంటానని మాటిచ్చాను.. నువ్విప్పుడు ప్రేమ గీమ అంటే చూస్తూ ఊరుకోను ఎగిసిపడుతున్న కోపంతో పలికాడు వసంత తండ్రి.. ఇదంతా గమనిస్తున్న సుప్రీత్ మనసులోనే నవ్వుకున్నాడు
వారం రోజులు వసంత కాలేజీకి వెళ్లలేదు.. వసంత కాలేజీకి రాకపోవడంతో నవీన్ కి పిచ్చి పట్టినంత పనయ్యింది.. విషయం కూడా తెలుసుకున్నాడు.. కొన్నాళ్ల తర్వాత తండ్రిమాట అంగీకరించడంతో నమ్మకం కుదిరి వసంత కాలేజీకి వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తండ్రి.. సుప్రీత్ కు మాత్రం అది నచ్చలేదు..
మామ.. నువ్వు తొందర పడుతున్నావేమో! కాస్త ఆలోచించు అన్నాడు లంబు.. లేదురా మామ.. ఈరోజు ఇలా జరగాల్సిందే! దానికి వసంత కూడా ఓకే చెప్పింది..జేబులో పెట్టుకున్న తాళిబొట్టును చేతితో గట్టిగా పట్టుకుంటూ పలికాడు నవీన్.. కానీ క్లాస్ రూమ్ లో తాళి కట్టడం అంటే కాస్త రిస్కేమో అన్నాడు లంబు.. రిస్క్ చేయకపోతే జీవితంలో కొన్ని కొన్ని పొందలేము.. పైగా ఆ సుప్రీత్ గాడు కళ్ళముందే వసంతను సొంతం చేసుకుని చూపిస్తా అన్నాడు ఛాలెంజ్ గా నవీన్
లీజర్ అవర్ కావడంతో క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అందరూ హడావిడిగా ఉన్నారు.. బ్లాక్ బోర్డ్ దగ్గర నిలబడి మై డియర్ ఫ్రెండ్స్..నేనూ వసంత ప్రేమించుకుంటున్నాం అన్న సంగతి మీ అందరికీ తెలుసు.. కానీ వసంత ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఈరోజు నేను ఇక్కడే వసంతను పెళ్లి చేసుకోబోతున్నా అంటూ డిక్లేర్ చేశాడు నవీన్
ఆ మాటకు తన కూర్చున్న సీట్ నుండి లేచి బోర్డు దగ్గరకు వెళ్ళింది వసంత.. నవీన్ మాటలు విన్న వెంటనే సుప్రీత్ కళ్ళు అగ్నిగుండాలయ్యాయి.. జేబులో ఉన్న తాళిబొట్టును బయటకు తీసి వసంత మెడలో మూడుముళ్ళు వేస్తున్నాడు నవీన్.. హఠాత్తుగా పైకి లేచిన సుప్రీత్ తన జేబులో ఉన్న బటన్ నైఫ్ ఓపెన్ చేసి నవీన్ ని పొడవబోయాడు.. అది గమనించిన వసంత నవీన్ ని తన వైపు తిప్పుకునే సరికి పదునంటి కత్తి వసంత కడుపులో దిగిపోయింది.. గట్టిగా కేకలు పెడుతూ ఒక్కసారిగా రక్తపుమడుగులో నేలకొరిగింది వసంత.. స్టూడెంట్స్ అందరూ హడలిపోయారు.. సుప్రీత్ తన కసి తీరినందుకు మనసులో సంతోషిస్తూ అక్కడే నిలబడ్డాడు
నవీన్ వసంతని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రాణాలు విడిచింది.. క్షణాల్లో కాలేజీ మేనేజ్మెంట్ అక్కడికి వచ్చింది.. సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ప్రత్యక్షమయ్యారు.. కేస్ ఫైల్ చేసి నవీన్.. సుప్రీత్ లను అరెస్టు చేశారు.. ఎందుకురా వసంతను చంపేసావ్ అంటూ సుప్రీత్ కాలర్ పట్టుకుని ఊగిపోయాడు నవీన్.. కాలేజీలో హత్య జరగడంతో అడ్మిషన్లు కూడా తగ్గిపోయాయి.. క్రమేపీ మూతపడింది
కాలేజీలో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసినందుకు స్వల్పంగా శిక్ష పడింది నవీన్ కి.. నవీన్ మెరిట్ స్టూడెంట్ కావడంతో అతని కెరీర్ దెబ్బతినకూడదని మానసిక బలాన్ని ఇవ్వడానికి అప్పుడప్పుడు రామారావు మాస్టర్ జైలుకు వెళ్లి కలుస్తూ ఉండేవారు.. మానసికంగా కుమిలిపోయే నవీన్ మెల్లగా కోలుకున్నాడు.. తర్వాత హయ్యర్ స్టడీస్ చేసి ఫారిన్ వెళ్ళిపోయాడు.. చాన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చాడు
గతం కరిగి పోయేసరికి...
నవీన్ కాలేజీ గది తాళం ఓపెన్ చేసాడు.. సూర్య కిరణాలు మెల్లగా లోపలికి ప్రవేశించే సరికి గోడపై ఉన్న కాలేజ్ బ్యాచ్ ఫోటోలు కనిపించాయి.. వాళ్ళ బ్యాచ్ ఫోటో కనిపించలేదు.. ఎలా ఉన్నావు నవీన్..?! రీ సౌండ్ తో ఓ మాట వినిపించేసరికి గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు.. ఎదురుగా వసంత కనిపించింది.. బాగానే ఉన్నాను నీళ్ళు నిండిన కళ్ళతో ఆమెను చూస్తూ జవాబిచ్చాడు నవీన్.. మరి నువ్వు..?! తిరిగి ప్రశ్నించాడు.. ఇదిగో ఇలా ఒంటరిగా.. అంది వసంత
అందుకే నేనొచ్చాను.. ఈరోజు నాతో నిన్ను తీసుకు వెళ్దామని అన్నాడు నవీన్.. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను.. ఇన్నాళ్లుగా నీకోసమే ఇక్కడ మగ్గుతూ బ్రతికాను నీతో తీసుకుపో నవీన్ అంది ఆర్ద్ర హృదయంతో.. తప్పకుండా వసంత అందుకే రామారావు మాస్టర్ దగ్గరకు వెళ్లి తాళంచెవి తీసుకు వచ్చాను.. ఇక మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు అంటూ ఆమె చేతిని అందుకుని బయటకు నడిచాడు నవీన్
మర్నాడు కాలేజీ తలుపులు తెరిచి ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. వసంత బయటకు వెళ్ళిపోయిందని ఊరంతా అనుకున్నారు.. విషయం రామారావు మాస్టర్ చెవికి చేరేసరికి ఆయనకు ఆశ్చర్యం కలిగింది.. తాళంచెవి పట్టుకెళ్ళి నవీన్ తిరిగి రాలేదేంటి అనుకున్నారు..వెంటనే ఎక్కడో దాచిపెట్టిన ఫోన్ నెంబర్ తీసి ఫోన్ చేశారు
హలో.. నవీన్ ?! అంటూ అవతలి వ్యక్తిని ప్రశ్నించారు మాస్టారు.. లేరండి అన్నాడు అవతలి వ్యక్తి.. లేరా ఎక్కడికి వెళ్లారు? మీరెవరు?! మళ్లీ ప్రశ్నించారు.. సారీ మాస్టారు నేను లంబును అనేసరికి
లంబునా? అన్నారు ఆశ్చర్యంగా.. అవును మాస్టారు ఇన్నాళ్ళు నేనే నవీన్ లా మీతో మాట్లాడను అన్నాడు లంబు.. మరి నవీన్ ఏమైనట్టు?! వాడు మానసికంగా కోలుకున్నట్టు కనిపించాడే తప్ప నిజంగా కోలుకోలేదు మాస్టారు.. కొన్నాళ్లు ఉద్యోగం చేసి చాలా సంపాదించాడు.. ఆ సంపాదనతో వసంత పేరు మీద యిక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు..ఎందరికో సాయం చేసాడు.. కానీ వసంతను మర్చిపోలేక పోయాడు.. అందుకే ఒకరోజు నా వసంతను చేరుకుంటున్నానని నోట్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు..ఆ ట్రస్టీ బాధ్యతలు నాకు అప్పగించడంతో వాడు బ్రతికి ఉన్నట్టుగానే మీ దగ్గర నటించాల్సి వచ్చింది.. మీరంటే వాడికి చాలా ఇష్టం.. అందుకే మీకు ఈ విషయం చెప్పొద్దని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు.. నన్ను క్షమించండి మాస్టరు.. ఇలాంటి రోజు వచ్చినప్పుడు చెప్పక తప్పదని నాకు తెలుసు.. అందుకే ఇప్పుడు చెబుతున్నాను అన్నాడు లంబు
వాడు గొప్పోడురా.. ప్రేమలో గెలిచి పెళ్లిలో ఓడిపోయినా వసంతను చరిత్రలో నిలబెట్టడానికి ట్రస్ట్ పెట్టాడు.. ఈరోజు వాడి ఆత్మ సంతోషంగా వసంతను చేరుకుంది.. కాలేజీకి మళ్ళీ నవ వసంతం తెచ్చిపెట్టాడు..
చాన్నాళ్లుగా మూతపడిన కాలేజ్ కొత్త యాజమాన్య నిర్వహణలో నవవసంత కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గా రీ ఓపెన్ అయ్యింది..

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ