Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Drama ప్రేమ బంధం
#1
ప్రేమ బంధం
 
- SUKRUSHI
వారం రోజుల నుంచి ఆ ఇంట్లో నిశబ్దం రాజ్యమేలుతుంది ... ఈ రోజు లేట్ గా లేవడంతో హడావిడిగా  ఆఫీస్ కి రెడీ అవుతున్నాడు శ్రీకర్ .. భర్త కోసం టీ తీసుకుని వచ్చింది ఉమా .. శ్రీకర్ ఆమె రాక గమనించిన కూడా గమనించనట్టే తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు .. ఉమా మెల్లిగా ... శ్రీకర్ టీ తీసుకోండి ..! అని అంది లోగొంతుకతో  .. శ్రీకర్ ఆమెని పట్టించుకోకుండా ఆమె మొహం కూడా చూడడానికి ఇష్టం లేదు అన్నట్టు చకా చకా వెళ్లి పోయాడు ... ఒక వారం నుంచి అదే తంతు శ్రీకర్ ది .. అసలు ఇంట్లో ఒక మనిషి ఉంది అనే ఆలోచన లేకుండా ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్ళడం అర్థ రాత్రి ఎప్పుడో రావడం ఒక్కోసారి అది కూడా ఉండదు కనీసం తనకి తను రాను అని కూడా చెప్పడం లేదు ... అసలు తన మొహం చూడడానికి కూడా ఇష్ట పడడం లేదు ... తన చేతి వంట అంటే ఎంతో ఇష్టంగా తినే తన శ్రీకర్ తన చేతితో చేసినది ముట్టను కూడా ముట్టడం లేదు .. ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు తను ఎదురు వస్తే వెళ్లనివాడు ఆసలు తన మొహం చూడడమే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంటే తన ప్రాణాన్ని ఎవరో లాగేస్తున్నట్టు ఉంది ఉమకి .. ఉమా శ్రీకర్ ఇద్దరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం .. ఇద్దరు ఒకే ఆఫీస్ లో పని చేసేవారు అలా ఇద్దరి పరిచయం వారి పరిణయానికి  దారి తీసింది .. ఇద్దరి ఇంట్లో మొదట్లో ఒప్పుకోకపోయినా ఇద్దరి పేరెంట్స్ ఒకరి గురించి ఒకరు అన్ని తెలుసుకుని ఇరు కుటుంబాలు దూరపు బంధువులు అవ్వడంతో వాళ్ళ పెళ్లి పెద్దల అంగీకారంతో ఎటువంటి అంటకాలు లేకుండా సజావుగా సాగింది .. ఉమా అత్తింటివారు కూడా ఉమని బాగానే చూసుకొనే వారు ... ఉమ పెళ్లి అయ్యాక జాబ్ రిజైన్ చేసి సంపూర్ణమైన భారతీయ వనితగా భర్తకి అన్ని దగ్గర ఉండి అమర్చేది .. పెళ్లి అయినాక  ఉమానీ ఎంత ప్రేమగా చూసుకునే వాడో  పెళ్లి అయి ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు దాటిన ఇప్పుడు దానికన్నా వెయ్యి రెట్లు ప్రేమగా చూసుకుంటున్నాడు శ్రీకర్ .. తన అదృష్టానికి తనే మురిసిపోయేది ఉమా.. అప్పుడే మొదలయ్యాయి ఉమకి కష్టాలు పెళ్లి అయి రెండు సంవత్సరాలు అయిన పిల్లలు కలగక పోవడంతో తమని చూడడానికి వచ్చినపుడల్లా అత్తగారి సూటి పోటి మాటలు  , ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళిన రాబందువులు లాంటి బంధువుల మాటలకి ఉమకి దుఃఖం ఆగేది కాదు .. కానీ ఇవ్వన్నీ ఏవి శ్రీకర్ కి తెలియనిచ్చేది కాదు .. ఎందుకంటే శ్రీకర్ తను బాధ తెలిస్తే ఎక్కడ తాను కూడా బాధ పడతాడో అని అన్ని తనలో దాచేసి మౌనంగా రోధించేది ... తర్వాత అత్త గారి సాధింపులు మరి ఎక్కువయి పోయాయి .. ఒక రోజు అత్త గారు ఉన్నపళంగా ఊడిపడి .. ఉమా ..! నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ దగ్గర అపాయింట్ తీసుకున్నా ఒకసారి వెళ్లి వద్దాం అని దురుసుగా ఉమాతో అని .. ఆ మాటకి ఉమా మనసు ఒక్కసారిగా కలవరపడింది ... అన్నటుగానే డాక్టర్ పరీక్షించి ఉమకి పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు ... ఉమకి ఒక్కసారిగా లోకం మొత్తం శూన్యం అయిపోయినట్టు అనిపించింది .. అత్తగారు ఇంటికి రాగానే ఉమా మీద విరుచుకు పడి .. ఛీ ..! నేను చెప్పినట్టు అప్పుడే నా అన్న కూతురిని చేసుకుని ఉండి ఉంటే ఇప్పటికీ ఇల్లు పిల్లాపాపలతో కలకలాడుతూ ఉండేది .. నా కొడుకు  ప్రేమ , గీమ అని నీలాంటి గొడ్రాలిని చేసుకుని వంశానికి వారసత్వము  లేకుండా చేశాడు అని పెడబొబ్బలు పెడుతూ ఉమా నీ ఇంకా సూటి పోటి మాటలు అంటూ ఉంది అత్తగారు .. ఉమ కన్నీళ్ళతో అక్కడి నుండి వెళ్లి పోయి బెడ్ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది ... అత్త గారు లోపలికి వచ్చి ఎవరో పోయిన్నట్టు ఎందుకు ఆ ఏడ్పులు అని చీధరించుకుని ... నేను ఊరు వెళ్లుతున్న ఈ విషయం నా కొడుకు చెప్పి వాడిని బాధపెట్టకు ... నేను మళ్ళీ ఒక కొన్ని రోజుల్లో వస్తా అప్పుడు ఏమి చెయ్యాలో చెప్తా అప్పటివరకు ఇలా ఏడ్పులు పెట్టీ వాడికి మనః శాంతి లేకుండా చెయ్యకు అని కాస్త కటువుగా పలికి .. పెట్టే బేడా సర్దుకుని ఊరికి పయనం అయింది అత్త గారు .. ఉమా కన్నీళ్లు తుడుచుకుని .. అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా ..! నేను ఇలా ఉంటే నా శ్రీకర్ తట్టుకోలేడు ...మళ్ళీ శ్రీకర్ మాటలు గుర్తుకు వచ్చి .. " మనకి పిల్లలు పుట్టిన సరే నీ ఫస్ట్ ప్రయారిటీ నేనే ఆవ్వాలి .. వాళ్ళు పుట్టిన తర్వాత నా మీద ప్రేమ తగ్గితే మాత్రం నేను ఊరుకోను .. మన పిల్లలని మా అమ్మకి ఒక్కరినీ , మీ అమ్మకి ఒక్కరినీ ఇచ్చేసి మనిద్దరం ఇలా హ్యాపిగా ఉందాం అని పిల్లలు పుడితే వాళ్ళకి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి " అని తాము కన్న కలలు పేక మేడలా కూలిపోయాయి అని అప్పటివరకు ఆపుకున్న కన్నీళ్లు వరదలా పారాయి .. శ్రీకర్ వచ్చే టైం అయ్యింది ఇలా వుంటే తనకి డౌట్ వస్తుంది అని ఫేస్ వాష్ చేసుకుని భర్త వచ్చేసరికి నవ్వుతూ ఎదురొచ్చి ... కానీ ఉమా మాత్రం ఇదివరికటిలా ఉండలేకపోయేది .. శ్రీకర్ ముందు ముఖానికి నవ్వు పులుముకునీ ఉన్న నిర్జివమైన తన నవ్వు .. ఆ నవ్వులో ఇదివరకటిలా సంతోషం , ఆనందం , లేదు ఆ తేడా శ్రీకర్ గమనించకపోలేదు ... ఒకరోజు మనసు ఉండపట్టలేక ఉమతో .. ఉమా..! ఏమైంది నీకు రోజు డల్గా ఉంటున్నావు ... అమ్మా వచ్చి వెళ్లినప్పుడు నుంచి ఇలానే ఉంటున్నావ్ అమ్మ ఏమైనా అందా..! ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ నన్ను ఆట పట్టిస్తూ ఉండే నా ఉమ ఇప్పుడు ఇలా ఉంటే నా గుండె ఆగిపోయేలా ఉంది అని ఉమా నీ హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ... కళ్ళ చివరన దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నిళ్లని అతి కష్టం మీద ఆపుకుని .. అయ్యో.. ! శ్రీకర్ అంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు నువ్వు లేకుండా ఎలా ఉండగలను అనుకుంటున్నావు ..! అత్తయ్య నన్ను ఏమి అంటారు ..! నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది నమ్మకంగా ... శ్రీకర్ సరే ..! అని .. ఉమా శ్రీకర్ కోసం నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తుంది  మళ్ళీ రోజులు యాధావిధిగా గడుస్తున్నాయి .. ఒక రోజు హెచ్చరిక లేని సునామీల ఉండి పడింది అత్తగారు .. ఆవిడ రాకతో ఉమలో భయం చేలరేగింది ... అత్త గారికి టీ అందిస్తూ .. మావయ్య గారు ఎలా ఉన్నారు ఆయన రాలేదా ..! అత్తయ్య అని మర్యాద పూర్వకంగా.. హా..! ఇంకా బ్రతికే ఉన్నారు లేమా ..! ఇంకా పోలేదు .. నా కొడుక్కి పిల్లలు కలగరు అని తెలిస్తే ఇంకా ఆయన ఉన్న లేన్నట్టే అంటూ ముసలి కన్నీళ్లు పెట్టుకుంది అత్త గారు .. అత్తయ్య ..! అలా అనకండి ..! ఇలా కాక ఇంకా ఎలా అన్నమంటావు ..! ఉన్న ఒక్కగానొక్క కొడుకుతోనే వంశం ఆగిపోతుంది అని తెలిస్తే ఆయన ఏమై పోతారో ఏంటో ..! నా కొడుక్కి ఈ విషయం తెలిస్తే వాడు గుండె ఆగిపోతుంది .. వాడికి ఈ జన్మకి నాన్న అనే పిలుపుచుకునే యోగ్యం లేదు అని ఉమని నానా మాటలు అంటూ లోపలికి వెళ్ళి డోర్ తడాలున వేసుకుంటుంది .. అలా ఈవెనింగ్ టైమ్ కి ఉమా డోర్ కొడితే .. ఏంటి ..! విసిగిస్తున్నావు అని విసురుగా డోర్ తీసి అంది చిరుకుగ మొహం పెట్టుకుని  .. స్నాక్స్ ,  టీ ప్లేట్ చూసి ... సరే..! అవ్వి అక్కడ పెట్టీ తగలడు అని మొహం చీధరింపుగా పెట్టీ అంది అత్త గారు .. ఉమా మొహం చిన్న బుచ్చుకొని సరే ..! అని అక్కడ పెట్టీ వెళ్లి పోయింది .. సాయంత్రం ఆఫీస్ కి నుండి వచ్చిన శ్రీకర్ అమ్మ నీ సడెన్గా చూసి ముందు ఆశ్చర్యపోయిన ... అమ్మా..! ఎప్పుడూ వచ్చావు ..! నాన్న గారు రాలేదా ..! అని ప్రేమగా అడుగుతాడు తల్లిని .. ఆవిడ సీరియస్ గా ... ఏమి మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్లి కొన్ని పేపర్స్ తీసుకుని వచ్చి శ్రీకర్ ముందు విసురుతోంది .. శ్రీకర్ ఆ పేపర్స్ చూసి ముందు షాక్ అయ్యి తర్వాత కోపంతో కళ్ళు ఎరుపెక్కి తల్లి వంక బాధ , కోపం కలిసి చూస్తూ ఉంటాడు ... శ్రీకర్ ఎందుకు అలా తల్లి వంక కోపంగా చూస్తున్నాడో అని ఉమా శ్రీకర్ చేతుల్లోని పేపర్స్ చూసి స్థాణువులా అయి కింద కూలపడిపోతుంది .. శ్రీకర్ కంగారుగా ఉమని తన చేతులతో పట్టుకుని ... తల్లి వంక కోపంగా  చూస్తూ .. అమ్మా..! ఏంటి ఇది అని ఉమా చేతుల్లోని పేపర్స్ తీసుకుని విసిరెస్తూ .. చూస్తే తెలియడం లేదా ..! అవి డైవర్స్ పేపర్స్ అని ముక్కు పుటాలు అదిరేలా చెప్తూ .. అవి డైవర్స్ పేపర్స్ తెలుస్తుంది .. కానీ ఏంటి సడెన్గా ఇది .. ఇప్పుడు ఏమైంది అని నువ్వు డైవర్స్ పేపర్స్ తెచ్చావు ..! సడెన్గా ఏమి లేదు ..! నేను అన్ని ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నా .. ! నాన్నకి ఈ విషయం తెలుసా ..! తెలుసు ..! అని అంది దురుసుగా .. కానీ మాకు డైవర్స్ ఏంటి ..! అది మా పరిమిషన్ లేకుండా అయిన మేమేమీ గొడవలు పడుతున్నామా ..! లేదు మరి ఎందుకు ..! ఎందుకంటే నీ పెళ్ళానికి నిన్ను జీవితంలో తండ్రిని చేసే యోగ్యం లేదు కాబట్టి .. నీతోనే మన వంశం ఆగిపోకుడదు కాబట్టి .. నీకు ఇంకో పెళ్లి చేయ్యాడానికి లీగల్ గా నువ్వు తనతో విడిపోవాలని ... నేను నమ్మను ..! అసలు ఇది అంతా నిజం కాదు అబద్దం ఆవేశంగా అన్నాడు శ్రీకర్  .. అత్త గారు ఉమ టెస్ట్ రిపోర్ట్స్ శ్రీకర్ మీదకి విసిరేస్తూ .. నేను అబద్ధం చెప్పినా ఈ రిపోర్ట్స్ అబద్ధం చెప్పవు కదా ..! అవి చూసి శ్రీకర్ షాక్ అయి ఏంటి ..! ఇది అంతా అన్నట్టు తల్లి వంక బాధ గా చూస్తాడు .. తల్లి జరిగింది అంతా చెప్పినా తర్వాత నిర్ఘాంతపోతూ .. భారంగా అడుగులు వేసుకుంటూ రూమ్ కి వెళ్ళి పోతాడు ... ఎవరికి వారు వెళ్లి పోయారు కానీ ఉమ పరిస్థితి పట్టించుకోలేదు .. రాత్రి అంతా ఉమ అలాగే ఉండి స్పృహ కోల్పోయింది .. శ్రీకర్ హాల్లో ఉన్న ఉమని చూసి కంగారుగా ఉమా..! అంటూ కదిపిన లేగకపోయేసరికి .. తమ రూంకి తీసుకుని వెళ్లి జాగ్రతగా పడుకోబెట్టి , శ్రీకర్ తెలిసిన డాక్టర్ కి కాల్ చేసి .. డాక్టర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల  స్పృహ కోల్పోయింది అని చెప్పి వెళ్ళిపోతారు .. శ్రీకర్ అమ్మ కోడలిని చూసి కూడా చూడనట్టు ఉంటే .. శ్రీకర్ భార్య కోసం వంట చేసి తనని చంటి పిల్లల చూసుకుని .. ఆఫీస్ నుండి కాల్ వస్తుంది అర్జెంట్ గా రమ్మని ఇంకా తప్పక వదలేక వదిలి తాను వచ్చేదాకా తల్లిని భార్యని కనిపెట్టుకుని ఉండమని రిక్వెస్ట్ చేసి వెళ్తాడు .. ఉమకి మెలుకువ వచ్చి మెల్లిగా లేచి హాల్లొకి వస్తుంది .. అత్త గారు వస్తున్న ఉమని చూసి మూతి వంకర్లు తిప్పుకుంటూ .. అమ్మాయి ..! నీతో కొంచెం మాట్లాడాలి అని ఉమని కూర్చోబెట్టుకుని .. చూడు ఉమా ..! నేను చెప్పేది జాగ్రతగా విను .. నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ తేల్చేశారు అవునా ..! నీకు మాత్రమే పిల్లలు పుట్టరు .. నీ భర్తకి ఆ అవకాశం ఉంది కదా అని చెప్తూ .. అత్తయ్య ..! ఆయన లేకుండా నేను ఉండలేను.. ఆయన నుంచి నన్ను దూరం చెయ్యకండి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది .. అత్త గారికి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ .. చూడు ఉమా..! నేను ఒక్కటి అడుగుతాను చెప్పు .. నువ్వు తల్లివి కాలేవు అని తెలిసినప్పుడు ఏమి అనిపించింది .. ఉమ సమాధానం మౌనమే .. నేను చెప్పనా ..! బాధ , ఆ దేవుడిపై కోపం జీవితాంతం పిల్లలు లేరని కుంగిపోయి ఉంటావు ..! నీలాగే నీ భర్త కూడ తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్న కూడా నీ వల్ల తండ్రి అనే పిలుపుకి వాడిని దూరం చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు .. పెద్దదాన్ని అయిన కూడా చేతులు ఎత్తి మొక్కుతున్నా నా కొడుకుతోనే ఈ వంశం అంతమయ్యేలాగ చెయ్యకు ..వాడి భవిష్యత్ నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది నిజంగా వాడిని ప్రేమించింది నిజమే అయితే వాడి సంతోషం కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యలేవా ..! ప్రేమ ఎదుటి వారి సంతోషాన్ని కోరుకుంటుంది అనేది నిజం అయితే దయచేసి వాడి జీవితం నుంచి తప్పుకో ..! ఇంతకన్న వివరంగా చెప్పలేను ఇంకా నిర్ణయం నీదే .. చెప్పవలిసింది అంతా అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోతారు అత్త గారు .. ఉమా కళ్ళల్లో నీళ్ళు కూడా ఎండిపోయాయి .. శ్రీకర్ రాగానే ఉమా ..! ఎలా ఉంది అని ప్రేమగా చెయ్యి పట్టుకుంటే నెమ్మదిగా విడిపించుకుని .. అత్త గారు శ్రీకర్ రావడంతో మళ్ళీ మెదలు పెడుతుంది రచ్చ .. శ్రికర్ ..! ఏమి ఆలోచించవు .. అమ్మా..! ఈవెనింగ్ ఊరికి బస్ ఉంది నీకు టిక్కెట్ బుక్ చేశాను .. రెడీ అవ్వు డ్రాప్ చేస్తాను మళ్ళీ ఒక్కదానివే అంటే ఇబ్బంది .. శ్రీకర్ ..! మాట మార్చాలని చూడకు .. ఈ విషయం తేలనిదే ఇక్కడి నుంచి అడుగు బయటకు వేసే ప్రసక్తే లేదు .. మళ్ళీ పేపర్స్ తన ముందు పెడుతూ .. అమ్మా..! నువ్వు బాధ పడతావు అని గట్టిగ చెప్పలేకపోతున్న .. కానీ నువ్వు వినేలా లేవు .. సరే ఇప్పుడు చెప్తున్న విను నేను సైన్ చెయ్యను ఉమకి పిల్లలు పుట్టిన పుట్టకపోయిన పరవాలేదు .. నాకు నా భార్య చాలు పెళ్ళిలో ప్రమాణం చేశాను ఎన్ని కష్టాలు ఎదురైనా తన చేతిని ఎప్పటికీ వదలను అని .. అన్నాడు శ్రీకర్ కోపంగా , ఆవేశంగా .. శ్రీకర్ ..! నీతో ఆర్గ్యూ అనవసరం నోరు మూసుకుని దీని మీద సైన్ చేయి .. నేను చెయ్యను .. ! నేను చేస్తాను అత్తయ్య అని ఉమా ఫ్రాక్చన్ ఆఫ్ సెకండ్స్ లో సైన్ చేస్తుంది .. శ్రీకర్ కోపంగా .. ఉమా ..! నీకు ఏమైనా పిచ్చా ..! అవును ..! నాకు పిచ్చే ..! అని అంతకన్నా కోపంగా మీరు ఎందుకు సైన్ చెయ్యడం లేధు .. ఏయ్..! ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా ..! సైన్ చెయ్యను అలాగే నేను నీకు డైవర్స్ ఇవ్వను .. అదే ..! ఎందుకు అని నిలదీస్తుంది .. ఎందుకంటే ..! నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి .. నా కడవరకు నీతోనే ఉంటానని పెళ్ళిలో చేసిన ప్రమాణాలు .. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్న .. పిల్లలా నువ్వా అంటే నువ్వే కావాలి అంటాను ..  చాలా ఇంకా ఏమైనా చెప్పాలా ..! కానీ నాకు మీ సానుభూతి , దయ అవసరం లేదు ఏదో పెద్ద సంఘసంస్కర్తలా నన్ను ఉద్ధరించ అవసరం లేదు .. రేపటి రోజున పిల్లలు లేరని అనిపించి నా మీద మీరు చూపించే జాలి చూపులు నేను భరించలేను అందుకే నాకు విడాకులు కావాలి అని పైకి కోపంగా పలికిన లోలోపల బాధ పడుతూ .. అత్తయ్య ..! ఆయనతో సైన్ నేను చేయిస్తాను .. మీరు నిక్షింతగా వెళ్లి రండి అని అత్త గారికి హామీ ఇచ్చి .. ఆ మాటకి ఆవిడ ఉబ్బి తబ్బైపోతూ సరే ..! ఉమా నిన్ను నమ్మి వెళ్ళుతున్న అని లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది .. శ్రీకర్ ఉమా వంక కోపంగా చూస్తూ తల్లి వెళ్ళిపోయాక అర్థరాత్రి అనగా వస్తాడు ఇంటికి.. మరుసటి రోజు నుండి ఉమా బ్రతిమలడడం సైన్ చెయ్యమని శ్రీకర్ నిరాకరించడం మామూలే అయింది .. మధ్య మధ్యలో అత్త గారి తిట్లు , చివాట్లు ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు .. ఉమ ఇదివరికిటిలా ఉండడం లేదు శ్రీకర్ తో తను కదిలించినా కూడా నో రెస్పాన్స్ .. డైవర్స్ మ్యాటర్ తప్ప ఏది మాట్లాడడం లేదు .. ప్రేమగా తనతో ఉండడం లేదు .. ఒక రోజు ఉమ నైఫ్ తీసుకుని సైన్ చేయకపోతే చస్తాను అని బెదిరించింది .. శ్రీకర్ బెదరక ..! నువ్వు డైవర్స్ ఇస్తే నేను ప్రాణాలతో ఉంటాను అనుకున్నావా ..!  మరు క్షణమే నా ప్రాణం గాలిలో కలిస్పోతుంది .. నీకు దూరం అవ్వడం అంటే నా ఊపిరి ఆగిపోయిన్నట్టే నువ్వు కాదు నేను లేకపోతే నీకు ఈ బాధ ఉండదు అని బాధగా చూస్తాడు ఉమ వంక .. ఉమతో కోపంగా నాకు దూరం అయి బ్రతుకుద్ధాం అనుకుంటున్నావు కదా ..! ఈ రోజు నుంచి ఒకే ఇంట్లో ఉన్న నువ్వు ఎవరో ..! నేను ఎవరో ..! కనీసం నీ పేరు కూడా కలవరించను అప్పుడు తెలుస్తుంది ప్రేమించిన మనిషి కళ్ళ ముందు ఉన్న కూడా దూరం అవుతుంటే ఆ బాధ అని .. ఆ సంఘటనతో  ఉమా మీద కోపం అన్ని వెరిసి శ్రీకర్ ఉమని పూర్తిగా అవాయిడ్ చెయ్యడం మొదలు అయింది .. అలా ఆలోచనలు నుంచి బయటకు వచ్చిన ఉమా శ్రీకర్ రాక కోసం వెయిట్ చేస్తోంది .. తాగి తులుతూ వచ్చిన శ్రీకర్ నీ బాధగా చూస్తూ బెడ్ పై పడుకోబెట్టింది .. ఉమా ..! నా బంగారం నువ్వు లేకుండా నేను ఉండలేను .. నా ప్రేమను అర్థం చేసుకోవచ్చు కదా ..! ఇలా టార్చర్ పెడుతున్నావు .. నన్ను వదలను అని మాట ఇచ్చి మధ్యలోనే ఇలా వదిలేసి వెళ్ళాలని చూస్తున్నావా ..? మత్తుగా కలవరిస్తునే నిద్ర లోకి జారుకున్నాడు .. ఉమ ఏడుస్తూ శ్రీకర్ చేయి పట్టుకుని కిందే కూర్చుని ఎప్పటికో నిద్రలోకి జారుకుంది .. ఉదయం ఫోన్ రింగ్ సౌండ్ తో నిద్ర లేచిన శ్రీకర్ కాల్ చేసినా మేటర్ విని .. సరే..! నేను వస్తున్న అమ్మ జాగ్రత్త అని ఏడుస్తూ కంగారుగా కాల్ కట్ చేసి .. శ్రీకర్ ..! ఏమైంది అత్తయ్యకు అని కంగారుగా అడుగుతుంది .. అమ్మకి ఆక్సిడెంట్ అయింది అంట ..! ఇక్కడికే తీసుకుని వస్తున్నారు ఉమా నీ హత్తుకుని ఏడుస్తాడు శ్రీకర్ .. ఉమా కూడా షాక్ నుండి తేరుకుని ఏడుస్తూ .. అత్తయ్యకు ఏమి కాదు శ్రీకర్ అని తను బాధ పడుతున్నా భర్తని ఓదారుస్తుంది .. ఇద్దరు హడావిడిగా హాస్పటల్ కి వెళ్ళేసరికి అక్కడ శ్రీకర్ తండ్రి ఓ.పి బయట కంగారుగా తిరుగుతూ ఉంటారు .. శ్రీకర్ ఏడుస్తూ .. నాన్న ఏమైంది ..! అమ్మకి .. ఏదో ఫంక్షన్ ఉంది అని వెళ్లి తిరిగి మీ దగ్గరికి వద్ధాం అని బయలుదేరాం దారిలో మీ అమ్మ వినకుండా రోడ్ క్రాస్ చేస్తుంటే లారీ సడెన్గా గుద్దేసింది .. డాక్టర్ అర్జెంట్ గా ఆపరేషన్ చెయ్యాలని తీసుకుని వెళ్లారు ఓ.పి కి .. ఉమ కూడా మావగారిని ఓదారుస్తూ.. డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ ఆవిడ కాలుకి ఐరెన్ రాడ్ వేశాం ఆవిడ బహుశా నడవడానికి చాన్నాళ్ళు పట్టొచ్చు .. ఉమా అత్త గారిని హాస్పటల్ లో ఉన్నన్ని రోజులు పసిపాపల చూసుకునేది .. అత్త గారు , మావ గారు కూడా ఉమ ఉన్నత మనసుకి , ఔదార్యంకి ...తాము ఉమ విషయంలో చేసినదానికి ఉమ అవేమీ మనసులో పెట్టుకోకుండా తల్లికి సేవలు చేస్తున్నట్టు చేస్తుంటే తల కొట్టేసినట్టు అయింది .. కొన్నాళ్లకి అత్త గారిని డిశ్చార్జ్ చేశారు .. శ్రీకర్ తండ్రి తమ ఊరికి వెళ్ళిపోతాం అంటే ఉమా వద్దు మావయ్య మేము లేమా..,! మేము పరాయి వాళ్ళమా..! అని వాదించి వల్ల ఇంటికి తీసుకుని వచ్చింది .. అత్త గారిని కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకునేది .. అత్త గారు కూడా కొడుకు కన్న ఉమతోనే ఎక్కువగా మాట్లాడేది .. ఆవిడ మాటల్లో పైకి చెప్పలేక పోయిన తప్పు చేశాను అనే భావన , ఒక విధమైన పశ్చాతాపం ఆవిడలో ఉమకి , శ్రీకర్ కి తెలుస్తూనే ఉండేది .. కొన్నాలకి ఆవిడ పూర్తిగా కోలుకుంది కానీ స్టిక్ లేకుండా నడవలేరు కాకపోతే .. ఒక రోజు  ఉమతో ... అమ్మ ..! ఉమా నన్ను క్షమించు తల్లీ ..! పిల్లలు పుట్టరు అనే ఒకే ఒక కారణంతో నిన్ను మానసికంగా చాలా బాధ పెట్టాను నా మాటల్తో కానీ నువ్వు అవి ఏమి మనసులో పెట్టుకోకుండా నన్ను ఒక పసిపాపల కంటికి రెప్పలా చూసుకున్నావు .. అని కళ్ళు నీళ్ళ పర్యంతం అవుతూ .. నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ..! నా ఇంటి మహా లక్ష్మినీ నా చేతుల్తో నేను దూరం చేసుకోవాలని చూసాను .. అందుకే దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేసి నా కళ్ళు తెరిపించాడు .. అలా అనకండి అత్తయ్య ..! మీరు నాకు తల్లితో సమానం .. మిమ్మలిని కంటికి రెప్పలా చూసుకోవడం నా బాధ్యత .. లేదు అమ్మ ..! పిల్లలని కన్న కనక పోయిన ప్రతి స్త్రీకి తల్లి మనసు ఉంటుంది అనే విషయం ఒక ఆడదానిగా తెలుసుకోలేక పోయా ఉమ.. హత్తుకుని అత్త కోడళ్ళు ఇద్దరు తేలిక పడ్డాక విడివడుతారు .. వెనక నుంచి హమ్మయ్య ..! అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి పోయారు ఇంకా మనల్ని పట్టించుకొరు నాన్న అని ఆట పట్టిస్తాడు .. శ్రీకర్ తల్లితండ్రులు మీరు మాట్లాడుకొండి అని పక్కకి వెళ్ళిపోతారు .. శ్రీకర్ ఉమని చూస్తూ .. ఇప్పుడు చెప్పండి శ్రీమతి గారు ఇప్పటికీ మీకు డైవర్స్ కావాలంటే అనే మాట పూర్తి కాక ముందే .. ఉమా శ్రీకర్ నీ హత్తుకుని .. వద్దు ..! మీ ప్రేమ తప్ప ఇంకేమీ వద్దు .. నన్ను క్షమించండి మిమ్మలిని చాలా ఇబ్బంది పెట్టాను .. ఇంకెప్పుడు మిమ్మలిని వదిలి వెళ్ళాలి అనే ఆలోచనే రానివ్వను ... శ్రీకర్ ఉమా నుదుటిన ముద్దు పెట్టుకుంటూ .. మన మధ్య ఉన్నది పవిత్రమైన వివాహ బంధం మాత్రమే కాదు అంతకుమించిన ఇరువురి మనసుల కలయికతో ముడి పడిన ప్రేమ బంధం .. తర్వాత శ్రీకర్ అమ్మ నాన్నలనే కమ్మని పిలుపుకి దూరం కాకుండా ఒక పాపని దత్తత తీసుకుని సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తూన్నారు అలా వివాహ బంధాన్ని మరింత ప్రేమతో ప్రేమ బంధంగా మార్చుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుకున్నారు  
_ _ _ _ _ _ _ _ _ 
సమాప్తం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Superb ji keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#3
కథ చాల అద్భుతంగా ఉంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
#4
గుండె పిండేసారు
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)