Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇల్లు
#1
Brick 
ఇల్లు
 Sarath Chandra
చిన్నా,
వారం రోజుల నుండి నాకు మీ నాన్నకు నిద్ర పట్టడం లేదు. ఈ ఇల్లు సిమెంట్ ఇటుక రాళ్ళతో మాత్రమే నిర్మించలేదు. మా రక్త మాంసాలతో నిర్మించామని భావిస్తుంటాం. అన్నం తినకుండా మారం చేస్తూ అల్లరి గా పరిగెత్తిన నీ బుల్లి పాదాలు నడియాడిన నేల ఇది. నీ చెల్లెలు బడికి వెళ్ళను అని మొండికేసి వంట గదిలో ఆటకెక్కి దాక్కుంటే నువ్వు చెల్లి కనిపించడం లేదని ఏడుస్తూ కూచున్న చోటది. మీ అన్నయ్య నువ్వు దాగుడు మూతలాడుతూ పరిగెటిన ప్రాంతం ఇది. మీ అక్కయ్య ఆరిందలా మీ అందరికి పండ్లు ఇవ్వాలని జమాచెట్టు ఎక్కి కాళ్ళు విరగొట్టుకున్న చెట్టు ఇది. మీ నలుగురు ఎక్కితే మీ నాన్న గుర్రమై ఆడించిన చోటు ఇది. మీరందరు ఉప్పు బస్తాలైతే వగరస్తూ మీ నాన్న ఆడుతూ పరుగులెత్తిన ప్రదేశం ఇది. అనుక్షణం మీ జ్ఞాపకాలు పరిమలంతో బ్రతుకునీడుస్తూ శేష జీవితం గడిపేయాలి అనుకుంటున్న మాకు ఇప్పుడు తగిలింది శరాఘాతమే. ఇప్పుడు ఈ ఇల్లు జప్తుకు కోర్ట్ నోటీస్ లు ఇచ్చింది. మీకోసం మేం చేసిన అప్పులు పెద్దయ్యాక తీరుస్తారని ఆశగా ఎదురు చూస్తున్న క్షణాల్లో ఈ నోటీసు "యమపత్రం" లాగే కనిపిస్తుంది. పెళ్ళయి వెళ్లిపోయిన నీ అక్క చెల్లెలు ఇంటిని కాపాడుకోలేక పోయినా మీరు కాపడుకుంటారు అని ఆశ ఇప్పటి వరకు మమ్మల్ని బ్రతికించింది. ఈ ఉత్తరంలో రాసుకుంటున్న బాధ అంతా మీ పెద్దన్నయ్యకు టెలీఫోన్ లో చెప్పాను. వాడినుండి స్పందన రాలేదు పైగా ఇపుడు స్విచ్ ఆపుకున్నాడు. నువ్వూ నేను మాట్లాడాకా మా నెంబర్ కాల్ రిజెక్ట్ లో పెట్టుకుంటావేమో అని భయం తో ఇమెయిల్ పంపుతున్నాను. నాయన ఈ ఇళ్లు కాపాడుకోండి. మా చివరి ఘడియలు ఇక్కడే కడతేరిపోవాలని ఆశపడుతున్నాం.
మీరు నలుగురు తలా కాస్త వేసుకుంటే ఇల్లు కాపాడడం కష్టం ఏం కాదు ఎటొచ్చి మీరందరు ఒక తాటి పైకి రావడామే తరువాయి. ఇదంతా చెప్పాలని మీ నాన్న కూడా అనుకుంటున్నాడు. ఏదో అభిమానం ఆయనకు అడ్డొస్తుంది. నా పిల్లలను నేను బ్రతిమాలాల అన్న బేషజంతో ఆయన ఉన్నారు. నా బిడ్డల దగ్గర నాకు బేషజం ఏంటి అని తెగింపు తో నేను ఈ ఉత్తరం రాస్తున్నాను కన్నా... ఈ ఇల్లు పోతుందేమో అన్న బెంగ తో మీ నాన్న ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇల్లు పోతే బాడుగ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. పైగా మాకు వచ్చే పెన్షన్ తో రెంట్ కట్టడము కష్టమే. ఈ ఆఖరి రోజుల్లో ప్రతి నెల మిమ్మల్ని యాచించడం మాకు చిన్నతనంగా ఉంటుంది. మీ నాన్న గురించి తేలుసు కదా అభిమానస్తుడు. నా పేగు తెంచుకు పుట్టిన నా బిడ్డలను అడుక్కుంటే బంధాలు తెంచుకోకుండా అండగా నిలుస్తారన్న ఆశతో ఈ లేఖ రాస్తున్నాను. నాన్న వెంటనే స్పందిన్చు ముఖ్యంగా నీకో విషయం చెప్పాలి. ఎదురింటి శంకర్ రావు ఇల్లు పోయి మనం రోడ్డున పడే రోజు కోసం గోతికాడ నక్కలగా ఎదురు చూస్తున్నాడు. అతడికి ఆ అవకాశం ఇవ్వకూడదని మేం కోరుకుంటున్నాం. మీ శక్తి కి మించి ఖరీదైన కాలేజ్ లో చదివిస్తున్నారేందుకు ?? ఇలాగైతే ఆఖరికి మీకు అప్పులు తప్పవని అతడు మీ నాన్నతో ఎన్నోసార్లు చేసిన ఎద్దేవ ఎప్పుడు మాకు గుర్తొకొస్తూనే ఉంటుంది. మా బిడ్డలు మా రక్తం... వారికోసం కాక మేం ఎవరికోసం త్యాగాలు చేయాలి.? అన్న తెగింపుతోనే ఇవన్నీ మీకు చేసాం. మా ప్రేమకు ప్రతిరూపాలు మీరు. ప్రతిఫలం ఆపేక్షించకుండా పెంచుకున్న దేహాలు మీవి. మా వృద్దాప్యం దుఃఖ భాజకం కాకుండా చూస్తారన్న నమ్మకం తోనే ఈ లేక రాస్తున్నాను. సత్వరం స్పందిస్తారని ఆశిస్తూ....
మీ అమ్మ జానకి.
ఇమెయిల్ పెట్టిన వారం రోజులవుతుంది. కన్టెంట్ కాస్త అటు ఇటు మార్చి నలుగురికి పంపింది జానకి. రెస్పొన్స్ లేదు.... రఘురామయ్యా భార్య తాపాత్రయాన్ని జాలిగా చూశాడు వాళ్లకు ఏ సమస్యలు ఉన్నాయో జానకి అన్నాడు అనాయాసంగా. ఇన్హేలర్ ఇచ్చి మీరు ఆందోళన చెందకండి ఆయాసం ఎక్కువవుతుంది భర్త ను అనునయించింది జానకి. ఏ సమస్యలున్నా కాపాడుకోమన్నది వాళ్ల ఇల్లే కదండీ. మన తదనంతరం వాళ్లకే చెందుతుంది కదా... అంది బాధగా. తదనంతరం కదా ఇప్పుడంతలో మనం పోము అని వాళ్లకున్న బలమైన నమ్మకం కావొచ్చు అన్నాడు. జానకి కోపంగా చూస్తూ మీరు మరీనండి పిల్లలు మనం పోయే సమయం కోసం చూస్తారా? వాళ్ళు మన రక్తమండి... అంది సర్లే నీ నమ్మకాన్ని నేను ఎందుకు కాదనాలి. ఆ కవర్ తీసుకొని బయటకు నడిచాడు రఘురామయ్యా.... షాపింగ్మాల్ లో శంకర్ రావు తగిలాడు.
ఏం రఘురామయ్యా గారు మీ వాళ్ళు ఏమంటున్నారు ? అడిగాడు. ఏమంటారు వాళ్ళకి డబ్బులు దొరకాలి కదా అన్నాడు నిట్టూరుస్తూ రఘురామయ్యా నేను ఇప్పించిన వాళ్లే ఇద్దరూ ముగ్గురు ఉన్నారు నా వెంటపడి పడి అలిసిపోయారు. నేనే కోర్టుకి వెళ్ళండి అని సలహా ఇచ్చా అన్నాడు నవ్వుతూ... కోపంగా చూసాడు రఘురామయ్యా ఇదంతా నీ పనేనా కుట్రదారుడా అన్నాడు కోపంగా.... మరేం చేయను నన్ను కట్టమంటున్నారు... మరీ బావుంది... మీ చావు మీరు చావండి అని సలహా ఇచ్చా అన్నాడు శంకర్ రావు. శంకరం వాళ్ళని కొద్దీ రోజులు ఆగమని చెప్పగలవ ? .. అభ్యర్దించి ధోరణి లో అన్నాడు రఘురామయ్యా కోర్టు దాకా వెళ్ళాకా ఎవరైన చేసేదేముంది. కోర్టు ద్వారా వచ్చిన సొమ్మును తలా కాస్తా పంచుకుంటారు అప్పటికి అప్పులు మిగిలే ఉంటాయేమో అన్నాడు శంకరం. నిస్పృహ గా చూసి సర్లే ఏది జరగాలో అదే జరుగుతుంది అని ఇంటి దారి పట్టాడు రఘురామయ్య. ఇంటికి వచ్చేసరికి ఏదో కబురు చెప్పేందుకు జానకి ఎదురు చూస్తుంది. సెల్ ఇక్కడే మర్చిపోయారా ? ఎవరో బాంక్ వాళ్ళు ఫొన్ చేసారండి తక్కువ వడ్డితో లోన్ మంజూరు చేస్తారట అంది ఆశగా. భార్య వైపు జాలిగా చూస్తూ పిచ్చి అది మనలా దివాళా తీసిన వారికి కాదు అన్నాడూ నాకు అర్థం కావట్లేదు అండి అంది అయోమయంగా. మనకిప్పుడు పరపతి ఏం లేదు. ఇల్లు ఆల్రెడీ కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. పింఛన్ తనకా పెట్టి కొన్ని అప్పులు చేసాం. పీకల మీద కత్తి పెట్టి కూర్చున్న వాళ్ళకి ఆల్రెడీ వడ్డీలు కడుతున్నాం చెప్పాడు రఘురామయ్య. బాదగాను.. జాలిగాను... చూసింది జానకి. అయినా చిన్నదాని పెళ్ళికి, పెద్దదాని పెళ్ళికి అంత అప్పు చేసి ఉండాల్సింది కాదు... అంది జానకి. కొన్ని అప్పులు నీ బిడ్దలు తీరుస్తారు అనుకున్నాను ఇలా మొత్తం నా మీద వదులుతారు అనుకోలేదు అన్నాడు రఘురామయ్య. ఆ శంకరం తరచు చెప్పినట్టు అంతంత ఖరీదైన కాలేజ్ ల లో వీళ్ళని చదివించకున్నా బాగుండేది అంది బాధగా. నువ్వే కదా డొనేషన్ కాస్త ఎక్కువైన పర్లేదు మంచి కాలేజ్ లో వేయమని పోరాడావు. ఇప్పుడు ప్లేట్ పిరాయిస్తున్నావేం అన్నాడు రఘురామయ్య నవ్వుతూ జానకి భర్త వైపు అదోలా చూసింది. భార్య మోకాన్ని చేతుల్లోకి తీసుకొని పిచ్చి జానకి మనమే కాదు యే తల్లిదండ్రులైన పిల్లలని మంచి బడిలో వేయాలనే అలోచిస్తారు.
ఎందుకంటే అక్కడ చదివితే ప్రయోజకులు అవుతారని వాళ్ల ఆశ ఆన్నాడు ఓదర్పుగా. జానకి అంతటి తో ఆగకుండా మా నాన్న పసుపు కుంకుమ ల కింద ఇచ్చిన రెండు ఎకరాలు అమ్మి పెద్దాడి ఇంజనీరింగ్ సీట్ ఇప్పించారు అవి ఉంటే ఇప్పుడు కాస్తయినా ఆదుకునేవి అంది జానకి. నిన్ను న్యూరాలజిస్ట్ కు చూపించాలి. మెదడు లోని నరాలు కాస్త దెబ్బ తిని జ్ఞాపక శక్తి పోయినట్టుంది. పిచ్చి మొద్దు... నువ్వే కదా పలానా కాలేజ్ అయితే బాగుండు క్యాంపస్ సెలక్షన్ బాగుంటాయి అని చెప్పావు అన్నాడు మళ్ళీ నవ్వుతూ. జానకి చిరుకోపంగా చూస్తూ అన్నీ నా మీదకు నెట్టండి మీకేమి ఇంట్రెస్ట్ లేనట్టు? అంది ఉడుక్కుంటు.. . రఘురామయ్య నవ్వి భార్యని దగ్గరకు తీసుకుని మై డియర్ భార్యామని పైకి నువ్వు చెప్పినా ఆచరణ నాదే కదా.. ఎదో నమ్మకం. ఎదిగాక చేతికి అంది వస్తారని అనుకున్నాం. ప్రతి తల్లి పక్షి బిడ్డ పక్షి గురించి అనుకుంటుంది. పాపం ఈ పసి గొడ్డుకు నేను తప్ప ఎవరున్నారు అని ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తెచ్చి నోటికి అందిస్తుంది. రెక్కలొచ్చిన తరువాత తల్లి కి కూడ చెప్పకుండా తుర్రుమని ఎగిరిపొతాయి. అడ్రస్ కూడా చెప్పకుండా.... మన వాల్లింకా నయం.... అడ్రస్ అన్నా వున్నారు అన్నాడు రఘురామయ్య హస్యంగా.
మీరు మరీనండి... వాళ్ళు నా బిడ్డలు చూస్తూ ఉండండి. ఈ ఇంటిని కోర్టు నుండి జప్తు నుండి విడిపిస్తారు అంది భరోసాగా..... "సర్లే నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ట్యుషన్లు చెప్పి సంపాదించిన చిన్న చిన్న మొత్తాలని కూడా చీట్లు వేసి పిల్లలకు కర్చు పెట్టలేదు...? అవన్నా ఉంటే కాస్తా ఆదరువుగా ఉండేది" అన్నడు రఘురామయ్య. సర్లేండి మీలాగే కదా నేను ఆలోచించాను. మన పిల్లలు మన ప్రపంచం... చిన్న దానికి ఫ్రిడ్జ్ టీ.వీ పెద్దదానికి పది కాసుల బంగారం పెట్టామంటే ఆ చీట్స్ తాలుకు డబ్బే కదా అంది నవ్వును కొనసాగిస్తు. నేను కూడా అదే అంటున్నా మన ఇద్దరి లక్ష్యం ఒకటే కదా మన బిడ్డలు వారి బంగారు భవిష్యత్ అన్నాడు. సర్లేండి ఆ వ్యంగ్యాలు ఆపి నా ఈమైల్ చెక్ చెయండి. నేను ఈ వంకాయ కు బాగా మసాలా కూర్చి రసం పెడతా అంది వంట గదిలొకి వెళ్తూ. రసం వద్దు జాను పల్చగా కందిచారు పెట్టు... అన్నాడు కంప్యుటర్ ఓపెన్ చెస్తూ. భార్య రాసిన లెటర్ చూసుకున్నాడు. అతడికి ఒకసారి మనసు ద్రవించింది. నువ్వు తెలుగు బాగా రాస్తావొయి కథలకు ట్రై చెయకూడదు కాసిన్ని డబ్బులు కూడా వస్తాయి అనాడు.
ఇప్పుడు అదొక్కటే తక్కువైంది అని వంకాయలు కోయడం లొ నిమగ్నమైంది. వావ్ అన్నాడు రఘురామయ్య.... రిప్లై ఇచ్చాడా అంది ఆత్రుతగా. ఇచ్చాడు చదువుతా ఉండు.... మామ్ నీ సోది ఉత్తరం తల తిన్నది తెలుగు ను ఇంగ్లీష్ లో టైప్ చేసి నువ్వు రాసిన ఉత్తరాన్ని గుణించుకుంటు చదవడానికి గంటన్నర పట్టింది. సమయాన్ని కిల్ చేశావు. ఇక తాత్పర్యం అర్థమైంది. ఆ పాత ఇంటికోసం పాత సినిమాల్లో కన్నాంబ లా అంత బాధపడటం ఎందుకు వదిలేయండి. మీ పెన్షన్ తో సింగల్ ప్లాట్ రెంట్ కి తీస్కొని బ్రతికేయొచ్చు. నిరంజన్ అన్నది కూడా అదే అభిప్రాయం.... నన్నే చెప్పమ్మన్నాడు. శిరీష, వైదేహి ఒపీనియన్ కూడా ఇదే. జామాచెట్టు చింతచెట్టు అని సెంటిమెంట్స్ పెట్టుకొని కూనరీళ్లకండి. ఎప్పటిలా కాదు ఎల్.కే.జి కి కూడా లక్షల డొనేషన్ అడుగుతున్నారు మీరు వేలలోను వందల్లోనూ ఖర్చు పెడితే మేం మా పిల్లలకి లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అర్థం చేసుకోండి..
బై యూర్స్ లవ్లీ
చిన్నా
కోపంగా లెటర్ ని డిలీట్ చేసాడు.
పి.ఎస్ : అని మరో నాలుగు వాఖ్యాలతో మరో లెటర్ ఉంది.
శంకర్ రావు అంకుల్ గురించి అప్పరావ్ గురించి తెగ ఇదైపోకండి వాళ్ళకి పని పాట లేవనుకుంటారా మీకు లాగా.. అయినా తెలుగు చెత్త సీరియల్స్ చూడటం ఆపండి మమ్మి..
బై మీ చిన్నా
జానకి మనకి ఉపయోగపడే మసాలా ఏదీ లేదు డిలీట్ చేసాను అన్నాడు రఘురామయ్య అయ్యో నన్ను చదవనీయండి అంది తనకి ఆందోళన గా నువ్వు చదివి తరించాల్సినంత సినిమా ఇక్కడ లేదు గుత్తి వంకాయ కు మసాలా బాగా కూర్చు.. అన్నాడు రఘురామయ్య ఇక నా ఇమెయిల్ బ.డి పాస్వర్డ్ మీకు చెప్పను... మార్చేస్తాను.. నా బిడ్డలను నాకు దూరం చేస్తున్నారు అంది కాస్త కోపంగా. చిన్న కరెక్షన్ బిడ్డల్ని కాదు... వాళ్ళు రాసిన చెత్త లెటర్స్ ని సవరించాడు రఘురామయ్య.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Superb story ji keka
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#3
Thankyou k3vv3 గారు
Like Reply
#4
Nice story
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#5
Good story   clps
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)