Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సమాహారం [కన్నవి, విన్నవి, కనుగొన్నవి]
#1
Eenadu Dt:2018 Nov 23 Wrote:ఏడో తరగతి పిల్లాడు...ఇంజినీర్లకు మాస్టారు!  

ఉదయం బడికి వెళ్లే విద్యార్థి...
సాయంత్రం కాగానే టీచర్‌ అయిపోతాడు...
తన కన్నా పెద్దవాళ్లకు పాఠాలు చెప్పేస్తాడు...
ఎవరా పిల్లాడు? ఏంటా సంగతులు?

మహ్మద్‌ హసన్‌ అలీ Wrote:
హాయ్‌ ఫ్రెండ్స్‌! నా పేరు మహ్మద్‌ హసన్‌ అలీ.
నా వయసు పదకొండేళ్లు.
ఉండేది హైదరాబాద్‌లోని మలక్‌పేటలో.
ఇంటిగ్రల్‌ ఫౌండేషన్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా.

[Image: atm5r9v.jpg]

మీకులానే నాకూ ఫోన్‌తో గడపడమంటే చాలా ఇష్టం. ఏడాది క్రితం ఓసారి వీడియోలు చూస్తున్నా. అనుకోకుండా ఓ వీడియో కనిపించింది.
అందులో పెద్దపెద్ద చదువులు చదువుకొని కూడా విదేశాల్లో చిన్న పనులు చేసుకుంటున్న మన దేశస్థుల గురించి ఉంది. చూస్తే చాలా బాధేసింది.

‘ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మన ఇంజినీర్లలో ఉన్న లోపం ఏంటి?’ అని ఆలోచించా. టెక్నికల్‌, కమ్యూనికేషన్‌
నైపుణ్యాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే పెద్ద చదువులు చదివినా మంచి ఉద్యోగాలు రావడం లేదేమో అనే సందేహం వచ్చింది.

వెంటనే ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అవసరమయ్యే డిజైనింగ్‌, సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్ని ఇంటర్నెట్‌ ద్వారానే నేర్చుకోవడం మొదలుపెట్టా.
వాటిని ఇంజినీరింగ్‌ విద్యార్థులకు చెప్పాలనుకున్నా. ఇదే విషయం మా నాన్నతో చెప్పా. అది విని ఆయన మాకు తెలిసిన
ఇంజినీరింగు విద్యార్థుల్ని పిలిచి వాళ్ల ముందు నాతో పాఠాలు చెప్పించారు. ఆ అన్నయ్యలూ మెచ్చు కోవడంతో వేరే వాళ్లకి
పాఠాలు చెప్పడానికి మా నాన్న కూడా సరే అన్నారు.

నాన్న సాయంతో మా ఇంటికి దగ్గర్లోనే ‘స్కిల్‌ ఇండియా లర్న్‌ క్రియేట్‌ అండ్‌ ఎడ్యుకేట్‌’ పేరుతో ఇన్‌స్టిట్యూట్‌ పెట్టా.
ఉచితంగానే శిక్షణ ఇద్దామనుకున్నా. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల నైపుణ్యాలు పెంచే కోర్సుల
అంశాలతో చిన్న ప్రకటన ఇచ్చా. అది చూసి కొంతమంది వచ్చారు. నెమ్మదిగా వారి సంఖ్య 30కి పెరిగింది.
అప్పట్నించి పాఠాలు చెప్పడం ప్రారంభించా. నేర్చుకున్న కోర్సుల గురించి ప్రత్యేకంగా నోట్స్‌ తయారు చేసుకుంటా.
ఎలాంటి సందేహం వచ్చినా ఇంటర్నెట్‌లో వెతికి తెలుసుకుంటా. వాటినే విద్యార్థులకు చెబుతుంటా.


[Image: NgauHus.jpg]

ఇదంతా బాగానే ఉంది కానీ ‘మరి స్కూలో?’ అంటారా?
రోజూ పొద్దున్నే 8.30 నుంచి మధ్యాహ్నం 3 వరకు స్కూలు.
ఇంటికొచ్చాక సాయంత్రం 5 గంటల వరకు హోంవర్క్‌ చేసేసుకుంటా.
ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తా. రాత్రి 8.30 గంటల వరకు పాఠాలు చెబుతా.

సెలవులొచ్చినప్పుడు, సమయం దొరికినప్పుడు ఆడుకుంటా.

ఈ ఏడాదిలో ఇంచుమించు వెయ్యి మందికి పాఠాలు చెప్పా.
2020 కల్లా లక్షమందికి పాఠాలు చెప్పాలనేది నా కోరిక.
గొప్ప ఇంజినీర్‌ అవ్వాలనేది నా లక్ష్యం.


[Eenadu Dt:2018 Nov 23]

మనం చాలా కాలంగా ఇంటర్నెటులో స్వేచ్చా విహారం చేస్తున్నాం కదూ.

ఇంతకీ ఈ ఇంటర్నెటుతో మనం చేస్తున్నదేమిటి !?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మనం బానిసలమేనా !?
Eenaadu Dt:2018 Nov 24 Wrote:తెరవకురా!

[Image: 6aFBwQD.jpg]

చూడాలనే చాపల్యం... తాకాలనే తహతహ
ఎంత అదుపు చేసినా వేళ్లు  ముందుకే పోతున్నాయ్‌!
మెదడు వద్దంటోంది... మనసు కావాలంటోంది!
అర క్షణం ముందు చూసిన ఫోన్‌నే మళ్లీ ఆతృత. యువతది రోజంతా ఇదే తీరు.. సమయమంతా ఫోన్‌కే అంకితం.
అదుపు తప్పుతున్న ఈ స్క్రీన్‌టైంకి ఓ పరిమితంటూ ఉండాలని యాపిల్‌ అధినేత టిమ్‌కుక్‌తో పాటు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థలు పిలుపునిస్తున్నాయి.

వచ్చే ఆదివారం ఎన్నో తారీఖు? ఉండు ఫోన్‌లో చూస్తా!
పనీర్‌ మంచూరియాని ఎలా వండాలోయ్‌? ఒక్క నిమిషం యూట్యూబ్‌లోకి వెళ్తా!
ధీరజ్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడో? ఫోన్‌ ఎందుకు.. ఫేస్‌బుక్‌లో స్టేటస్‌ చూస్తే పోలా!
మంచి బట్టలు కొనాలి. ఎక్కడ బాగుంటాయి? ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చేదానికి అంత ఆలోచన ఎందుకు!
సినిమాకి వెళ్దామా? ఫోన్‌థియేటర్‌ ఉందిగా... టిక్కెట్‌ ఖర్చు లేకుండా!

సవాలక్ష అడగండి.. అన్నింటికి ఒక్కటే సమాధానం.. స్మార్ట్‌ ఫోన్‌. ఏదైనా తెరపైనే సాధించవచ్చనే ధీమా!
అంటే మన సమయాన్ని తెరముందు... తెర వెనుక అని రెండుగా విభజించుకోవాలేమో! అలా అయినా ఫర్వాలేదు.
అసలు మేలుకుని ఉన్న సమయమంతా తెరముందు గడిపేస్తున్నారనేగా బాధంతా!

స్క్రీన్‌టైంని మనం అదుపులో ఉంచుకోకపోతే మున్ముందు మనిషిని సంఘజీవి అని కాదు తెరజీవి అయ్యే ప్రమాదం లేకపోలేదు.
అలాంటి అనర్థాన్ని నివారించేందుకు ఆన్‌లైన్‌ సంస్థలు నడుం బిగించాయి. దానికి మన ప్రయత్నం కూడా తోడవ్వాలిగా మరి.

నేను ఆ సమయాన్ని తగ్గించుకుంటున్నా: టిమ్‌కుక్‌
[Image: szNZEM4.jpg]
‘ఉదయాన్నే నాలుగింటికి లేస్తాను. యాపిల్‌ ఫోన్ల గురించిన ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకునే సమయం అది. గతంలో మాటలను పక్కన పెడితే
నేనిప్పుడు ఫోన్‌ చూసే సమయాన్ని తగ్గించాలనుకుంటున్నా. బదులుగా ఒత్తిడిని తగ్గించే వ్యాయామానికి ఆ సమయాన్ని కేటాయిస్తా.
నా నుంచే ఆరోగ్యకరమైన ఫోన్‌ అలవాట్లు మొదలవ్వాలనేది నా కోరిక. నేనే కాదు... యాపిల్‌ ఫోన్‌ వాడేవారంతా ఇదే బాట‌ పట్టాలని
అనుకుంటున్నా. అందుకే ఫోన్‌ వినియోగంపై అప్రమత్తం చేసేవిధంగా స్క్రీన్‌టైం ఆప్షన్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాం. అయినా ఇంతగొప్ప
సాంకేతిక అద్భుతం నుంచి ఎలాంటి ఫలితాలు పొందాలనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా!

గూగుల్‌ సైతం...
ఇంతవరకూ మనకు వెల్‌బీయింగ్‌ అనే పదం శారీరక, మానసిక ఆరోగ్యాలకు సంబంధించిన పదంగానే తెలుసు. ఆ రెండూ బాగుండాలంటే
ఇక నుంచి మనకు డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ కూడా అవసరం అని భావిస్తోంది గూగుల్‌ సంస్థ. అంతూదరీ లేకుండా సాగే డిజిటల్‌ వెతుకులాటలో
పడి సమయాన్ని వృథా చేసేవారికి మీరు అతిగా వాడుతున్నారు అనే విషయాన్ని పదేపదే చెప్పడం వల్ల కొన్ని రోజుల తర్వాత అయినా వారికి
స్క్రీన్‌టైంపై ఒక అదుపు వస్తోందని భావిస్తోంది గూగుల్‌. అందుకు తగ్గట్టుగా ఫోన్‌ వినియోగంపై నియంత్రణ ఉండేందుకు వీలుగా ‘డిజిటల్‌ వెల్‌బీయింగ్‌’
అనే సరికొత్త యాప్‌ని ఆవిష్కరిస్తోంది. ఆండ్రాయిడ్‌లో జెన్‌స్క్రీన్‌ వంటి థర్డ్‌పార్టీ యాప్‌లు సైతం ఆన్‌లైన్‌ వెతుకులాటలో మీరు పక్కదారి పట్టిన సమయం
ఎంత అనే విషయాన్ని గుర్తించి అప్రమత్తం చేస్తుంటాయి. నిరంతరం ఫొటోలను ఇచ్చిపుచ్చుకునే ఇన్‌స్టాగ్రామ్‌ సైతం స్క్రీన్‌టైంని నియంత్రణలో ఉంచే ఆప్షన్‌ని
పరిచయం చేసింది. ఇక మనవంతుగా స్క్రీన్‌టైంని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం.

ఐడెంటీ క్రైసిస్‌
చాలామంది సోషల్‌మీడియాకి అతుక్కుపోవడానికి కారణం ఇదే. వ్యక్తిగత గుర్తింపు కోసం.
అదెలా అంటే.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల హవా మొదలై దాదాపుగా పదేళ్లు అవుతోంది.
ఎంత లేదన్నా ఈ వేదికల్లో ఒక్కొక్కరికి కనీసం వందమందైనా ఫాలోవర్లు ఉంటారు.

మీ పుట్టినరోజులకి, మీరు సాధించిన చిన్నపాటి విజయాలకు... మీరు తీసిన ఫొటోలకు లైకులతో కంగ్రాట్స్‌తో పొగుడుతూ ఉంటే
అదొక మత్తులా.. కిక్‌లా అనిపిస్తుంది. క్రమంగా అదే ఒకరకమైన వ్యసనంగా మారుతోంది. కానీ ఇందులో అందరూ మీకు
హృదయపూర్వకంగానే స్పందిస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీరైనా అంతేకదా? ఓ లైక్‌ పడేస్తే పోలా అన్నట్టుగా
యాంత్రికంగా ఓ లైక్‌ కొడతారు కదా! అవతలివాళ్లూ అంతే. క్వాన్‌టిటీ కన్నా క్వాలిటీకి ఓటేస్తే మీకు సోషల్‌ మీడియా అవసరమే
ఉండదు. కంప్యూటర్‌ సోషలైజింగ్‌ కన్నా వాస్తవ ప్రపంచం చాలా గొప్పది.

టెక్‌ నిరక్ష్యరాస్యులమా?
ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో, వాట్సాప్‌లో చురుగ్గా లేకపోతే మనల్నంతా టెక్‌ నిరక్షరాస్యులు అనుకుంటున్నారనే ఓ చిన్న అనుమానం ఉండొచ్చు.
కానీ అది నిజం కాదు. డిజిటల్‌ ప్రపంచంలో నేర్చుకోవడానికి చాలా అంశాలున్నాయి. సమయాన్ని వృథా చేసే ఈ పోస్టుల కన్నా ఇతరత్రా
విషయాల మీద దృష్టిపెట్టి చూడండి
.

ఏవి మన సమయం తింటున్నాయి
రాజకీయాలు, సినిమాలు.... ఇవే మన సమయాన్ని అతిగా తినేవి. రాజకీయ పార్టీల తరఫున కామెంట్లు, కొత్త సినిమాల విశేషాలు.
మనం స్పందించడంతోపాటు ఎదుటివారి స్పందన కోసం ఎదురుచూడ్డం వల్ల సమయం అంతా తెలియకుండానే ఖర్చైపోతోంది. అందుకే
మీ ఫోన్‌లోని సోషల్‌మీడియా యాప్స్‌ని సిస్టం(డెస్క్‌టాప్‌)కి పరిమితం చేయండి. దీంతో సమయం ఆదా అవుతుంది.

గ్రూపులకు దూరం
వాట్సాప్‌ నిజానికి సోషల్‌ మీడియా వేదిక కాదు.
అయినా కూడా అందులో మనం గ్రూపులు కట్టి దాన్నో సోషల్‌మీడియా వేదికగా మార్చాం.
వీలైనంతవరకూ గ్రూపులకు దూరంగా ఉంటే మేలు. లేనిపోని చర్చలతో సమయం వృథా కాకుండా ఉంటుంది.


[Image: oZ3ZN8K.jpg]

[Eenaadu Dt:2018 Nov 24]
Like Reply
#3
స్వీట్ కార్న్ + లయాత్మక సంగీతం
AndhraJyothy Dt: 2018 Nov 24 Wrote:స్వీట్ కార్న్ కోసం ఇక్కడ క్యూ కడుతున్నారు.. స్పెషల్ ఏంటంటే..!

కోయంబత్తూర్: కొంచెం ఉప్పు, కారం, నిమ్మరసం కలిపి తయారుచేసే స్వీట్‌కార్న్ అంటే మనదేశంలో యమా క్రేజ్...
ఇప్పుడు దీనికి అదనంగా మరో రుచిని కలిపి పసందైన అనుభూతిని ఇస్తున్నాడో తమిళనాడు యువకుడు.
స్వీట్‌కార్న్‌కు మ్యూజిక్ జతచేసి జనాలకు తెగ ‘తినిపించేస్తున్నాడు’. కోయంబత్తూర్‌లో బ్రూక్‌ఫీల్డ్స్ మాల్‌లో ఉన్నాడీ క్రేజీ కళాకారుడు..
మ్యూజిక్ వినిపించడానికి అతడి దగ్గర ప్రత్యేకంగా డ్రమ్స్‌ అంటూ ఏమీ ఉండవు. తాను చేస్తున్న పనిలోనే ఆనందాన్ని వెదుక్కుంటూ..
దాన్ని పదిమందికీ పంచుతాడితను. అతడి చేతిలోని గరిటెలు, స్వీట్ కార్న్ ఉడికిస్తున్న గిన్నెలే మ్యూజిక్ సాధనాలుగా వాడతాడు.
కొన్నేళ్లుగా అతడి మ్యూజిక్ వింత చూసేందుకే జనాలు క్యూ కడతారంటే ఆశ్చర్యం కలగమానదు.



నాలుగేళ్ల నుంచి ఇతడి వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి.


[Image: bGtzdp7.jpg]

తాజాగా డిజిటల్ మార్కెటర్ కార్తీక్ శ్రీనివాసన్ ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఇటీవలే ట్విటర్లో పోస్టు చేశారు. దీనిపై ట్విటర్ యూజర్లతో పాటు
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా కాలంగా మేము అతడి మ్యూజిక్ వినేందుకే ఆ షాపింగ్ మాల్‌కి
వెళతామనీ.. ఎన్ని సార్లు విన్నా పిల్లలు మళ్లీ మళ్లీ వెళ్లాలని అడుగుతున్నారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. అతడి టాలెంట్ చూస్తే స్వీట్
కార్న్ కొనకుండా ఎవరూ అక్కడి నుంచి వెళ్లలేరనీ.. అందుకే అక్కడ నిత్యం కస్టమర్లు గుమిగూడతారని మరికొందరు కామెంట్లు రాశారు.


లేటెస్ట్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి [twitter video link]
Like Reply
#4
బిట్‌కాయిన్‌
ఈనాడు Dt:2018 Nov 24 Wrote:రూపాయి పెడితే పావలా మిగిలింది
బిట్‌కాయిన్‌కు పదేళ్లు
ఏడాదిలో 75 శాతం క్షీణించిన బిట్‌ కాయిన్‌
ఈనాడు వాణిజ్య విభాగం  2018 Nov 24


బిట్‌కాయిన్‌ పదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
అయితే ఈ ఏడాది మార్కెట్లో పెట్టి నష్టపోయిన వాళ్లు.. బిట్‌కాయిన్‌లో పెట్టనందుకు సంతోషించాల్సిన తరుణం.
ఎందుకంటే గత డిసెంబరు గరిష్ఠాలతో పోలిస్తే ఇప్పటికి ఏకంగా 75 శాతానికి పైగా కోల్పోయింది క్రిప్టోకరెన్సీ.
మరి భవిష్యత్‌లో మరింత తగ్గుతుందా లేదా.. అంతక్రితంలా ఉవ్వెత్తున ఎగుస్తుందా అన్నది తేలాల్సి ఉంది.

2017లో బిట్‌కాయిన్‌ చేసిన హంగామా ఇంతా అంతా కాదు. ఎక్కడ చూసిన దాని గురించిన చర్చలే కనిపించేవి.
ఇపుడు తాజాగా పదో ఏట అడుగుపెట్టిందన్నమాటే కానీ.. సంబరాలు మాత్రం లేవు. ఎందుకంటే  బిట్‌ కాయిన్‌
విలువ 4000 డాలర్ల దిశగా పయనిస్తోంది. నెల రోజుల్లో 40%, ఆరు నెలల్లో 50%, డిసెంబరుతో పోలిస్తే 75
శాతానికి పైగా నష్టపోయింది.


[please see more details in below image]

[Image: uv4znWy.jpg]

[above image link]
Like Reply
#5
చైల్డ్‌ పోర్నోగ్రఫీ
AndhraJyothy Dt: 2018 Nov 25 Wrote:చైల్డ్‌ పోర్నోగ్రఫీకి ఐదేళ్లు ఖైదు
బాలలతో శృంగారానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు కలిగి ఉన్నా..
వాటిని ఇతరులకు చేరవేసినా.. వాణిజ్యపరంగా వినియోగించినా.. ఇకపై కఠిన చర్యలు తప్పవు.
ఈ మేరకు బాలలపై లైంగిక నేరాల నియంత్రణ చట్టం (పోక్సో)లోని సెక్షన్‌ 15లో మార్పులకు కేంద్రం సిద్ధమైంది.

ఈ ప్రతిపాదనలకు కేంద్ర న్యాయశాఖ.. మహిళా, శిశు అభివృద్ధి శాఖలు అనుమతి ఇవ్వాల్సి ఉంది. మరోవారంలో ఆ ప్రక్రియ పూర్తవుతుందని,
వచ్చేవారం కేబినెట్‌ భేటీ అయ్యి, దాన్ని ఆమోదిస్తుందని అధికారులు తెలిపారు. తాజా సవరణల ప్రకారం.. చైల్డ్‌ పోర్నోగ్రఫీ కలిగి ఉన్నవారికి
మూడు నుంచి ఐదేళ్లు జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు. అదే నేరాన్ని మరోమారు చేస్తే.. జైలు శిక్ష ఐదు నుంచి ఏడేళ్ల వరకు ఉంటుంది.
Like Reply
#6
Thanks for sharing trending news in this thread, so we can share trending news here.
Like Reply
#7
Porn and Movie piracy sites came back with new spellings --- Saakshi
సాక్షి Dt:2018 Nov 26 Wrote:నిషేధించినా నెట్టింట ... విచ్చలవిడిగా అశ్లీల సైట్లు

స్పెల్లింగ్‌ మార్చి కొత్తవాటిగా చలామణీ |  సినిమా పైరసీ సైట్లదీ అదే దారి

సాక్షి, హైదరాబాద్‌: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’ అన్నారు పెద్దలు.
అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అశ్లీల(పోర్న్‌), సినిమా పైరసీ సైట్ల నిర్వాహకులు ప్రస్తుతం ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు.
దేశంలో జరుగుతున్న పలు అత్యాచారాలకు కారణంగా నిలుస్తోన్న ఈ వెబ్‌సైట్లను నిషేధించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌ (డీవోటీ)కు
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినా తిమ్మిని బమ్మి చేసే ఆయా సైట్ల నిర్వాహకులు సైట్ల
పేరులోని స్పెల్లింగ్‌లో కొద్దిపాటి మార్పు చేసి వీటిని చలామణిలోకి తీసుకొచ్చారు. తిరిగి ఎప్పట్లాగే ఇవి అందరికీ అందుబాటులోకి రావడంతో
కథ మళ్లీ మొదటికొచ్చింది.

ఎందుకు నిషేధించారు..  
ఉత్తరాఖండ్‌ హైకోర్టులో ఇటీవల ఓ రేప్‌ కేసు విచారణకు వచ్చింది. స్కూలు విద్యార్థినిపై తోటి బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసు అది.
తాను ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు పోర్న్‌ సైట్లు చూశానని ఆ బాలుడు కోర్టుకు చెప్పాడు. దీనిపై స్పందించిన కోర్టు అత్యాచారాలకు
కారణమవుతోన్న ఇలాంటి అశ్లీల వెబ్‌సైట్లను వెంటనే నిషేధించాలని సెప్టెంబర్‌ 27న కేంద్రానికి ఆదేశాలిచ్చింది. నవంబర్‌ 15లోగా ఈ పనిని
పూర్తి చేయాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు మంత్రిత్వ శాఖకు అక్టోబర్‌ 8న అందాయి. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌
(డీవోటీ)కు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దేశంలో 827 పోర్న్‌ వెబ్‌సైట్లను గుర్తించి బ్లాక్‌
చేశారు. అంతేకాకుండా ఈ జాబితాలోని సైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రన్‌ చేయవద్దని ఇంటర్నెట్‌ సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది.
వీటితోపాటు టెలికామ్‌ సంస్థలు కూడా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి.

నియంత్రణ కష్టమే..
‘మాకు ఆదేశాలు వచ్చిన వెంటనే మేం నిషేధాన్ని అమల్లో పెట్టాం. జాబితాలోని 827 అశ్లీల సైట్లను నిషేధించాం.
కానీ, వారు తెలివైనవారు. ప్రపంచంలో ఏదో మూల నుంచి ఆపరేట్‌ చేస్తారు. తమ వెబ్‌సైట్‌కు వీక్షకులు తగ్గిన విషయం
వీరికి తెలిసిన వెంటనే, ఐపీ అడ్రస్, వెబ్‌సైట్‌ చిరునామాలో స్వల్ప మార్పులు చేసి నెట్‌లో సులువుగా దొరికేలా చేస్తారు’
అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ప్రైవేటు టెలికామ్‌ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు.

మనమే ఎందుకు లక్ష్యం..!
భారత్‌లో జనాభా అధికం. ప్రపంచంలో రెండో స్థానం. జనాభాలో యువత దాదాపు 40 శాతం పైమాటే. దీనికితోడు భారత్‌లో పెరిగిపోతున్న
ఇంటర్‌నెట్‌ యూజర్లు, మొబైల్‌ వినియోగదారులను ఈ వెబ్‌సైట్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఏడాది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికామ్‌ (డీవోటీ)
ఇచ్చిన నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రస్తుతం 46.36 కోట్లకుపైగా బ్రాడ్‌బాండ్‌ వినియోగదారులు ఉన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే ..
0.74 శాతం అధికం. ఇక జూన్‌ 2018 నాటికి స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు 50 కోట్ల మంది వరకు ఉన్నారు. ఓ సంస్థ అందించిన
రిపోర్టు ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పోర్న్‌ వీడియోలు చూసే దేశంలో 2015లో ఇండియా 4వ స్థానంలో ఉండగా, 2016లో
3వ స్థానానికి ఎగబాకింది. తొలి రెండు స్థానాల్లో బ్రెజిల్, ఫిలిప్పీన్స్‌ ఉన్నాయి.  

పేరు మార్చి మళ్లీ ప్రత్యక్షం..
పోర్న్‌ వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తారని ఆయా వెబ్‌సైట్ల నిర్వాహకులకు ముందే తెలుసు. అలాగే 2 వారాలుగా ఆన్‌లైన్లో వీటిని శోధించినా ఎవరికీ
దొరకలేదు. దీంతో వీక్షకులు తగ్గిపోయిన విషయాన్ని ఆయా సైట్‌ నిర్వాహకులు గుర్తించారు. అందుకే వాటి ఐపీ అడ్రెస్‌లు, యూఆర్‌ఎల్‌ లింకులు,
వెబ్‌సైట్‌ చిరునామా( డొమైన్‌ నేమ్‌) స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులు చేసి తిరిగి రన్‌ చేస్తున్నారు. ఆ పాత సైట్లన్నీ స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులతో
తిరిగి నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. రాష్ట్రంలో అయితే దాదాపు 1,350 పోర్న్‌తోపాటు పైరసీ సినిమా వెబ్‌సైట్లను సెక్యూరిటీ ఆఫీసర్లు గుర్తించి వాటిని
నిషేధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వారు పేర్లు మార్చుకుని తిరిగి వస్తుండటంతో సెక్యూరిటీ ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు.
Like Reply
#8
పిల్లల పెంపకం : అంతర్జాల మర్యాదలు నేర్పిస్తున్నామా?

ఈనాడు Dt. 2018 Dec 22 Wrote:‘ఏదైనా కావాలంటే దయచేసి కాస్త ఇస్తారా అని అడగాలి’
‘ఎవరైనా సహాయం చేస్తే కృతజ్ఞతలు చెప్పాలి
‘ఎదుటివాళ్లు మాట్లాడుతుంటే అడ్డుపడొద్దు. పూర్తిగా విన్నాక మాట్లాడాలి
...
... ...
రోజువారీ వ్యవహారాల్లో పిల్లలు ఇబ్బందుల్లో పడకుండా ఇలా ఎన్నో నేర్పించడం సహజమే.  

మరి ‘అంతర్జాల మర్యాదలు ???’... అవేంటని ఆశ్చర్యపోకండి. ఇంటర్నెట్‌లో నడచుకోవాల్సిన తీరుతెన్నులే అవి. ఇందుగలదందులేదని
ఇంటర్నెట్‌ సర్వత్రా విస్తరిస్తున్న నేపథ్యంలో వేధింపులకు గురికాకుండా, వేధింపులకు పాల్పడకుండా, మోసగాళ్ల వలలో చిక్కుకోకుండా
తీసుకోవాల్సిన జాగ్రత్తలను చిన్నప్పట్నుంచే పిల్లలకు నేర్పించడం నేటి అవసరం.

ఇది డిజిటల్‌ యుగం. ఇంట్లో డెస్క్‌టాప్‌, చేతిలో ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్‌. ఇలా ఎక్కడ చూసినా పిల్లల మనసులను ఆకర్షించే డిజిటల్‌
పరికరాలే కనిపిస్తున్నాయి. వీటికి ఇంటర్నెట్‌ కూడా అనుసంధానమైతే చెప్పాల్సిన పనిలేదు. నిజానికిప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వాడకంలో
పెద్దవాళ్ల కన్నా పిల్లలే ముందుంటున్నారు. ఆ మధ్యన మెకాఫీ సంస్థ నిర్వహించిన ‘ట్వీన్స్‌, టీన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ అధ్యయనం కూడా
ఇదే చెబుతోంది.



ట్వీన్స్‌.. అంటే 8-12 సంవత్సరాల వయసు పిల్లలు రోజుకు సగటున 1.5 గంటలు ఆన్‌లైన్‌లోనే గడుపుతుండటం.. వీరిలో కొందరు
ఇంటర్నెట్‌ సదుపాయం గల 3-4 పరికరాలు వాడుతుండటం గమనార్హం. పిల్లలకు 13 ఏళ్లు వచ్చేంతవరకు సామాజిక మాధ్యమాల్లో
ప్రవేశించటానికి అనుమతి లేనప్పటికీ 67% మంది ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వంటి వాటిల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట.
అందువల్ల అంతర్జాల వాడకంలో మర్యాదలకు రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది.

* మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి
ఎవరైనా అవతలి వాళ్లు మనల్ని గౌరవించాలనే కోరుకుంటారు. ఇది ఇంటర్నెట్‌ ప్రపంచానికీ వర్తిస్తుందనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా
చెప్పాలి. అవతలివాళ్లు మనల్ని ఎలా గౌరవించాలని కోరుకుంటున్నామో మనం కూడా వారితో అలాగే ప్రవర్తించటం అవసరం. అప్పుడే సమస్యలు
తలెత్తకుండా చూసుకోవచ్చు. ఎవరితోనైనా ఏదైనా విషయాన్ని పంచుకునేటప్పుడు, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఉచితం కాదేమోననే
సందేహం వస్తే కాసేపు ఆగడం మంచిది. బయటి ప్రపంచంలో మాట జారితే తీసుకోలేనట్టుగానే నెట్‌ ప్రపంచంలోనూ రాతను వెనక్కి తీసుకోలేం.
ఒకవేళ పోస్ట్‌లను, కామెంట్లను తరువాత డిలీట్‌ చేసినా అంతకుముందే ఎవరైనా వాటిని స్క్రీన్‌షాట్‌ తీసుకొని ఉండొచ్చు. ఇలాంటి విషయాలను
పిల్లలకు విడమరచి చెప్పాలి. అలాగే కోపంతో ఉన్నప్పుడు, చిరాకు పడుతున్నప్పుడు ఆన్‌లైన్‌ సంభాషణ కొనసాగించడం మంచిది కాదనీ
తెలియజేయాలి. భావోద్వేగంలో ముందూ వెనకా చూసుకోకుండా ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు. తరువాత పశ్చాత్తాపం చెందినా జరగాల్సిన
నష్టం జరిగిపోతుంది. కాబట్టి వాదోపవాదాల విషయంలో గానీ వివాదాస్పద అంశాల విషయంలో గానీ మనసు ప్రశాంత స్థితికి చేరుకునేంతవరకు
ఆగడం ఉత్తమమని వివరించాలి.

* వేధింపులకు దూరం
ప్రస్తుతం సైబర్‌ వేధింపు సమస్యగా మారిపోయింది. ఇది పిల్లలకూ మినహాయింపు కాదు. చిన్నారులు వేధింపులకు గురికావొచ్చు. వాళ్లే
వేధింపులకు పాల్పొడొచ్చు. లేదూ తోటివాళ్లు వేధిపులకు గురవుతుండటం చూడొచ్చు. ఇలాంటి పిల్లలు 70 శాతానికి పైగానే ఉంటున్నారని
గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్‌లో తామెవరో అవతలివాళ్లకు తెలియదని.. ఏదైనా చెప్పొచ్చని పిల్లలు
అనుకుంటారు. ఈ భావనే వేధింపులను ప్రోత్సహిస్తోంది. ఇది మంచి పద్ధతి కాదని పిల్లలకు విడమరచి చెప్పాలి. తమకు అలాంటి పరిస్థితి
ఎదురైనప్పుడు బాధపడినట్టుగానే అవతలివాళ్లు కూడా కుంగిపోతారనే విషయాన్ని అవగతం చేయించాలి. తమ గురించి బయటపడదని
అనుకోవడం తప్పని, ఎక్కడ్నుంచి ఆయా వ్యాఖ్యలు పోస్ట్‌ చేశారనే విషయాన్ని తెలుసుకునే వీలుంటుందని తెలియజేయాలి.

* ఆ చిత్రాలతో చిక్కులు
తెలిసో తెలియకో యుక్తవయసు పిల్లలు అశ్లీలతను సూచించే సందేశాలు.. నగ్న, అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడం తరచుగా
చూస్తున్నదే. అయితే ఇది కూడా ‘ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ’తో సమానమేననే విషయం చాలామందికి తెలియదు. ఇలాంటి చిత్రాలను పోస్ట్‌ చేసినవారికే
కాదు, అందుకున్నవారికీ న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వొచ్చు. పైగా అవి జీవితాంతమూ వెంటాడొచ్చు. ఫొటోలను ఒకసారి పోస్ట్‌ చేస్తే వెనక్కి
తీసుకోవటం అసాధ్యం. అందుకున్నవారు దాన్ని సేవ్‌ చేసి పెట్టుకోవచ్చు. వాళ్లు దాన్ని తిరిగి పోస్ట్‌ చేయొచ్చు. కాబట్టి వీటి చిక్కులను పిల్లలు
తెలుసుకునేలా చూడాలి.

* వ్యక్తిగత వివరాలు రహస్యం
ఇంటర్నెట్‌లో మోసగాళ్లకు కొదవలేదు. ఎప్పుడు ఎవరిని బుట్టలో వేసుకుందామా అని ప్రయత్నించేవారు ఎంతోమంది ఉంటారు. వీరి వలలో
చిక్కితే అనర్థాలు తప్పవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్‌లో ఎవరికీ.. చివరికి తెలిసినవారికి కూడా తమ వ్యక్తిగత సమాచారాన్ని
చెప్పకూడదనే సంగతిని పిల్లల మనసుకు హత్తుకునేలా వివరించాలి. తమ పూర్తి పేరు, చిరునామా, వయసు, ఆర్థిక వివరాల వంటివి  
బయటపెడితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టేనని అర్థం చేయించాలి.

* గోప్యత కాపాడుకోవాలి
ఇంటర్నెట్‌ వినియోగానికి సంబంధించి గోప్యత కాపాడుకోవడం ఎలా అనేది పిల్లలు తెలుసుకునేలా చేయాలి. ప్రైవసీ సెట్టింగ్స్‌ను ఎలా
మార్చుకోవాలో నేర్పించాలి. కొందరు స్నేహితులే కదా అని సామాజిక మాధ్యమాల పాస్‌వర్డ్‌లు చెప్పేస్తుంటారు. ఇది మంచిది కాదు.
అలాగే ఇతరుల గోప్యతను గౌరవించడం కూడా ముఖ్యమేనని పిల్లలకు తెలియజేయాలి. ఒకవేళ స్నేహితులెవరైనా వారి రహస్యాలను
పంచుకుంటే వాటిని కాపాడటమూ కూడా తమ విధేనని వివరించాలి. వాటిని ఇతరులకు వెల్లడించినా, పుకార్లను సృష్టించినా స్నేహితుల
దృష్టిలో నమ్మకాన్ని కోల్పోతామని చెప్పాలి.

* డౌన్‌లోడ్లపై జాగ్రత్త
ఆన్‌లైన్‌లో అక్రమంగా కంటెంట్‌ను అందించే సైట్లు లెక్కలేనన్ని. ఇలాంటివి ఉచితంగా సినిమాలు, పాటలు, ఫొటోల వంటి వాటిని
డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంటాయి. పిల్లలు వాటినుంచి వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే
అవి కాపీ హక్కులకు లోబడి ఉండొచ్చు. వాటిని అక్రమంగా డౌన్‌లోడ్‌ చేసుకోవడం కాపీ హక్కులను ఉల్లంఘించటమే. పట్టుబడితే
న్యాయపరమైన చిక్కులు తప్పవు. ఇలాంటివీ పిల్లలకు చెప్పాలి.

* ఆచితూచి ఎమోజీల ఎంపిక
సామాజిక మాధ్యమాల్లో స్మైలీలు, ఎమోజీలు ఎంత ఆదరణ పొందాయో చెప్పాల్సిన పనిలేదు. మన భావోద్వేగాలను అవతలివాళ్లు
బాగా అర్థం చేసుకోవడానికివి తోడ్పడతాయి. ఎమోజీలను జత చేయటం తేలికే. అందుకే పిల్లలూ ఎంతగానో ఇష్టపడుతుంటారు.
అయితే ఆయా సందర్భాలకు అనుగుణంగా సరైన ఎమోజీలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. లేకపోతే అవతలి వాళ్లు తప్పుగా
అర్థం చేసుకునే అవకాశముంది.

* అవతలివాళ్ల సమయాన్ని గౌరవించటం:
సందేశాలను చదవటానికైనా, రాయటానికైనా సమయం పడుతుంది. మనం పంపిన సందేశాలను అవతలి వాళ్లు చదవటానికి వీలు
కాకపోవచ్చు. ఒకవేళ చదివినా జవాబు ఇవ్వటానికి కుదరకపోవచ్చు. అంతమాత్రాన అవతలివాళ్లను చెడ్డవాళ్లని అనుకోవటం సరికాదు.
అలాగే తమకు అందిన సందేశాలను వీలైనంత త్వరగా చదివి, స్పందించటమూ ముఖ్యమే. కాబట్టి అవతలి వ్యక్తుల సమయాన్ని
గౌరవించటం అవసరమనే విషయాన్ని నేర్పించాలి. అనుచిత సందేశాలను, ప్రకటనల వంటి వాటిని వ్యాపింపజేయటమూ మంచిది
కాదని వివరించాలి.                                   [రచయిత్రి : భాగ్య]


పిల్లలకి నేర్పించడం అవసరమే.
అయితే ఇలాంటి జాగ్రత్తలు మనకు సరిగ్గా తెలుసా ?

మనం పాటిస్తున్నామా !?
[+] 1 user Likes ~rp's post
Like Reply
#9
[Image: 18119.o.jpg]

lord all will be good in new year.happy new year Heart
Like Reply
#10
మంచి ప్రయత్నం బాగున్నాయి అన్ని శిరిశకలు
[Image: 20246392-2327419394150894-1987275767431890327-n.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-84.html
సెక్స్ మీద అవగాహన కోసం 
https://xossipy.com/thread-49634-post-55...pid5520012
Like Reply
#11
PLEASE SUPPORT

Hi People

We all know that this site's primary motive is to provide entertainment not profit making. Here, we are finding our hearts content and enjoy being here. 

The Admin and the Team running this site with good intent and with their own funds. They're trying to provide quality service by not allowing any erratic advertisements.

Yet, with the limited funds it is not possble for the Team to run this site for long time. And for purchasing good server capacity, they are in need of huge funds.

In this respect, your support in the form of monetary donations to this site will make our journey lively and lovely.

Last time, we had one such platform (xossip.com) where we used to have lots of fun. We've made good friends and great memories there. But, due to some unforeseen reasons we've lost many of them.

Now, we are fortunate enough to have this site where we can have entertainment we desire and be connected to each other.

We don't want this site to go the same way as the old one, do we?

So, I request you all to come forward to and contribute a minimum sum of ₹100/- per month via Amazon Pay Gift Card option.

Maximum amount contribution is your wish.

The Admin & Team will keep a record of the amount received and how much amount is used. This will be a transparent process.

Please support us.

For instructions, Check Here

Regards

Vikatakavi02

PS: Go to the details in the Signature. welcome

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#12
(22-12-2018, 08:47 AM)~rp Wrote: పిల్లల పెంపకం : అంతర్జాల మర్యాదలు నేర్పిస్తున్నామా?



పిల్లలకి నేర్పించడం అవసరమే.
అయితే ఇలాంటి జాగ్రత్తలు మనకు సరిగ్గా తెలుసా ?

మనం పాటిస్తున్నామా !?

Wow Baga cheparu andi...chalane  nerpinchali pillalaku ilaa
Madhurilatha Heart
Like Reply




Users browsing this thread: 1 Guest(s)