Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Love మళ్ళీ చూడాలని..!!
#1
మళ్ళీ చూడాలని..!!

Induchandran

“సుభద్రా...ఆ టీ కొట్టు దగ్గర ఆపు అంది వెనక కూర్చున్న సత్య
"ఎందుకు బయట ? ఇంటికెళ్ళాక తాగొచ్చులేవే అంది సుభద్ర
"పర్లేదు ఈ రోజు బయట తాగుదాంలే రోజు ఇంట్లోనే కదా తాగుతావ్ అంది సత్య
"సరే పద అంది సుభద్ర బండి ఆపుతూ చల్లటి వాతావరణంలో రాలుతున్న చినుకులు కొత్త పులకింతలా ఉంది హ్యాండ్ బ్యాగ్ ని ఒక చేత్తో అడ్డుగా పెట్టుకుని వడి వడిగా అడుగులు వేయ సాగింది సత్య. సత్య ని అనుసరిస్తూ వెళ్ళింది సుభద్ర
"అన్నా రెండు అల్లం టీ అంది సత్య ఇద్దరూ పక్కన ఉన్న బల్ల మీద కూర్చున్నారు
"ఇంటికెళ్ళి తాగొచ్చు కదే ?మరి బయట ఇలా ఎందుకు అంది సుభద్ర నొచ్చుకుంటూ
 "బయట తాగితే కేస్ అయితే పెట్టరు కదా అంది సత్య సుభద్ర వైపు చూస్తూ
"నువ్వేం మారలేదే అసలు ఇప్పటికీ...సడెన్ గా ఎందుకు ఇటు వైపు గాలి మళ్ళింది అంది సుభద్ర ప్రశ్నిస్తూ
"పరిస్థితుల వల్ల పారిపోయానే తప్ప , నా జ్ఞాపకాలన్నీ ఇక్కడే కదా , అంతా బావుంది అనుకునే లోపే ఏదో గుర్తొచ్చిన దానిలా ఇలా వచ్చేస్తుంటా అంది సత్య నిస్సత్తువగా నవ్వుతూ
"ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావ్ ? నీకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా అంది సుభద్ర
"లేదు సుబ్బు...ఎంత ఎదిగినా మంచి స్థాయిలో ఉన్నా ఆ సంతోషాన్ని ఆస్వాదించలేకపోతున్నా లోపల ఏదో అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది అంది సత్య బాధగా ‘ఎప్పుడో అయిపోయిన క్షణాల్లో ఉన్న బాధని తల్చుకుని ఇలా బాధ పడటం కరెక్ట్ కాదు సత్యా , అందరి లైఫ్ లోని ఇలాంటి ఆటుపోట్లు ఉంటాయి , గతాన్ని మోస్తూ భవిష్యత్తుని వదిలేస్తున్నావనిపిస్తుంది అంది సుభద్ర మెల్లగా సత్య ని అనునయిస్తున్నట్టు ఇద్దరి మధ్య మౌనం కాసేపు ఊగిసలాడసాగింది ఇంతలో టీ కప్పులు బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు ఆ కొట్టులో ఉన్న మరో అబ్బాయి ఆ గాజు గ్లాసు చేతిలోకి తీసుకుని ఆ వెచ్చదన్నాన్ని చెంపలకి స్పృశిస్తూ....పెద్ద పెద్ద కాఫీ షాపులు అది అంటామే కాని ఎంతైనా కానీ ఈ మజా రాదే సుబ్బు అంది టీ ని ఆస్వాదిస్తూ అసలు నేను ఇలా టీ కొట్టు వైపు చూసి ఎన్నేళ్ళవుతుందో తెలుసా? మనం కాలేజ్ లో ఉన్నప్పుడు ఇలా కలిసి వెళ్ళేవాళ్ళం కదా సుందరయ్య కొట్టుకి అంతే అదే లాస్ట్ మళ్ళీ ఇప్పుడే , ఆదివారాల్లో బయటకి వెళ్ళినా పిజ్జా అని కె ఎఫ్ సి అని జిహ్య చాపల్యాన్ని చల్లార్చడమే కాని ఇవన్నీ అసలు నా లిస్ట్ నుండి ఎప్పుడో తప్పిపోయాయి అంది సుభద్ర నవ్వుతూ "నా పరిస్థితి అంతే , ఏదో టైమ్ కి దొరికింది తినేస్తా అంది సత్య నవ్వుతూ "మొత్తం మారిపోయిందే, పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అని రెండు పార్ట్ లా చూసుకోవాల్సి వస్తుంది అంది సుభద్ర "అంతే కదే మరి బాధ్యలు పెరిగే కొద్ది మనం మన చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్టు అలవాటు పడిపోతాం అంది సత్య ఇద్దరూ బయటకి వచ్చారు ,అప్పటి వరకు నెమ్మదిగా నేల పై రాలిన చినుకులు కాస్త వేగంగా నేలని తాకుతున్నాయి సత్య మనస్సులో భయం మొదలయ్యింది. అంత చల్లటి వాతావరణంలో చెమటలు పట్టసాగాయి ఒళ్ళు నీరసించిపోసాగింది పక్క నున్న గోడ ని పట్టుకుని బల్ల మీద కూర్చుంది
"ఏమైంది సత్యా అంది సుభద్ర కంగారు గా
"సత్య కళ్ళు మూసుకుని వర్షం తగ్గాకా వెళ్దామా అంది
"సరే సరే , నీళ్ళు తాగుతావా అంది వద్దు అన్నట్టు సైగ చేసింది సత్య హోరున వర్షం కురవసాగింది ఆ చప్పుడు సత్య కి మరింత భయాన్ని కలిగించసాగింది. ఒడిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ని అదిమి పట్టుకుని కూర్చుంది. నెమ్మదిగా వర్షం తగ్గుతూ వచ్చింది సత్య కాస్త కుదుటపడింది
"వెళ్దాం పద అంది సుభద్ర ని చూసి ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. సత్య ఇళ్ళంతా తిరిగి చూస్తూ
" సుబ్బు నువ్వే డిజైన్ చేసుకున్నావా? బావుందే అంది.
 "మా ఆయన ఆఫీస్ వర్క్ లో బిజీ ఇక నేనే దగ్గరుండి చేయించుకున్నా అంది సుభద్ర నవ్వుతూ ఇద్దరూ మాట్లాడుకుంటూ బాల్కనీలో నిలబడ్డారు చినుకులు రాలడం చూసి సత్య లోపలికి వెళ్ళబోయింది
"ఏమైందే అంది సుభద్ర సత్య ని చూస్తూ
"నాకు వర్షం హోరున కురిస్తే భయమేస్తుంది అంది మెల్లగా
"ఒకప్పుడు నువ్వే వర్షం పడితే చాలు పిల్లకాలువల్లో దిగి ఆడేదానివి , అందరూ ఇళ్ళలో ఉన్నా నువ్వు బయట గంతులేసేదానివి ఇప్పుడు ఎందుకే ఇలా భయపడుతున్నావ్ వర్షానికి అంది సుభద్ర "వర్షం పడిన ప్రతిసారి నాకు
" ఆ రోజు గోపాల్ ని రక్త గాయాలతో రోడ్డు మీద చూసా , అతని అరుపులు ఆ ఉరుములు వర్షం శబ్దంకన్నా ఇంకా గట్టిగా నా మనస్సుని తాకింది. ఆ రోజు మొదలయ్యింది ఈ భయం ఇంకా వెంటాడుతూనే ఉంది అంది బాధగా కళ్ళలో కమ్ముకొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ
"పదేళ్ళయ్యింది సత్యా నువ్వు ఊరొదిలి వెళ్ళిపోయి , ఇంకా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా? అంది సుభద్ర "వెళ్ళిపోడానికి కారణం అదే అయినప్పుడు ఆలోచించకుండా ఎలా ఉంటాను సుబ్బు ?అప్పుడు ఉండలేక వెళ్ళిపోయాను , ఇప్పుడు ఆ తప్పు నన్ను ఇంకా వేధిస్తూ ఉంది , ఒక పూట సంతోషంగా ఉంటే వెంటనే ఆ రోజు జరిగిన ఘటన నన్ను తొలిచేస్తుంది. ఉండలేకపోతున్నా , రక్త గాయాలతో నడిరోడ్డు మీద చూసి కూడా వెళ్ళాల్సి వచ్చింది అంది ఏడుస్తూ
"సత్యా....ఏడవకే అంటూ హత్తుకుంది సుభద్ర ఓదారుస్తూ మనస్సులో నుండి తన్నుకొస్తున్న బాధ కట్టలు తెంచుకున్న ప్రవాహంలా కళ్ళ నుండి ప్రవహించసాగింది సుభద్ర సత్య ని ఓదార్చి కూర్చో బెట్టింద.
"ఎలా ఉన్నాడు గోపాల్ అంది సత్య మెల్లగా తేరుకుంటూ "బావున్నాడే అంటూ అలమారలో నుండి ఆల్బమ్ తీసి చేతికిస్తూ
"మొన్న అద్వైత్ ఫస్ట్ బర్త్ డే కి తీసిన ఫోటోస్ అంటూ చేతికి ఇచ్చింది సుభద్ర సత్య ఫోటోస్ చూస్తూ అందర్ని గుర్తు చేసుకుంటూ సుభద్ర ని అడుగుతూ మాట్లాడుతూ ఉంది. ఒక పేజి దగ్గర ఆగిపోయింది. చేతి వేళ్ళు అచ్చాధనంగా తడుముతూ ఉన్నాయి ఫోటో లో ఉన్న అతని మొహం మీద సుభద్ర గమనిస్తూ
" అప్పటికి ఇప్పటికి పోలిక లేనంత మారిపోయాడే అంది మెల్లగా
"అవును సుబ్బు...అప్పుడు ఆ నునుగు మీసాలతో , బూట్ కట్ ఫ్యాంట్ వేసుకుని తెగ షో చేసేవాడు కదా అంది సత్య నవ్వుతూ
"అవునే ఇప్పుడు చూడు పెళ్ళైపోయి కంప్లీట్ ఫ్యామిలీ మెన్ అయిపోయాడు అంది సుభద్ర అతని పక్కన ఉన్న ఆమె ని చూసి ఆగిపోతూ సుభద్ర వైపు చూసింది
"తను రాధ , గోపాల్ భార్య ఈ బాబు వాళ్ళ కొడుకు అంటూ చూపించసాగింది సత్య నిస్సత్తువ గా నవ్వడం చూసి
"ఏంటే నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావ్ అంది సుభద్ర
"ఆ గోపాలుడికి సత్య భామ భార్య అయితే రాధ ప్రియురాలు అయ్యింది , ఇక్కడ ఈ గోపాలుడికి రాధ భార్య అయితే సత్య ప్రియురాలుగానే మిగిలిపోయింది కదా అదే తల్చుకుంటే నవ్వొస్తుంది అంది సత్య
"అసలు నువ్వే ఇంత బాధ పడిపోతున్నావు కాని అక్కడ గోపాల్ హ్యాపిగా ఉన్నాడు తెలుసా...పెళ్ళైపోయింది సత్యా ఇంకా నువ్వే ఆలోచిస్తున్నావు అంది సుభద్ర
"నీ వల్ల ఒక తప్పు జరిగినా , లేక ఆ తప్పుకి కారణం అయినా సరే ఎన్ని సముద్రాలు దాటి పారిపోయినా సరే ఆబాధ నిన్ను వెంటాడుతుంది సుబ్బు అంది బాధగా సత్య
"కాని ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు సత్య నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలా బాధ పడితే నేను ఊరుకోను అంది సుభద్ర కోపంతో
"సరే సరే ,  బాబు ఎక్కడే అంది సత్య
"మా పిన్ని తీసుకెళ్ళింది , ఈ రోజు నువ్వు నేను మాత్రమే పెళ్ళి మొగుడు పిల్ల పీచు అంత పక్కన పెట్టేసా అంది సుభద్ర నవ్వుతూ
"అవునా అయితే మా సుబ్బు ఇవాళ్ళ ఫుల్ రిలాక్స్ డ్ అన్నమాట అంది సత్య
"చాలా రోజుల తర్వాత ఒక రోజు నా కోసం అంది సుభద్ర నవ్వేస్తూ
"నీకు గుర్తుందా సుబ్బు కాలేజ్ లో నువ్వు నేను ఫస్ట్ టైం లంచ్ టైం లో కలిసాం , నువ్వు తెచ్చిన పప్పు ఆవకాయ అప్పడం లో నేనే సగం తినేసి నీకు నా డబ్బా ఇచ్చా అంది నవ్వుతూ
"అవునే అదే కద మనం ఫస్ట్ మీటయ్యాము అంది సుభద్ర "ఆ రోజులు మళ్ళీ రావు అంది సత్య నవ్వుతూ
"అవును , అయినా ఇన్నేళ్ళలో నీకు దగ్గరైన వ్యక్తి ఒకరు కూడా లేకపోవడవేమిటే అంది సుభద్ర
"దగ్గరైన వ్యక్తి అంటే ఉన్నాడు. అర్థం చేసుకుంటాడు , పక్కనే ఉంటాడు. ఒక సెక్యూర్డ్ ఫీల్ ఉంటుంది ప్రేమ అని చెప్పలేను కాని ,ఆ వయస్సు దాటి చాలా రోజులయ్యింది కదే , ఒక శ్రేయాభిలాషి అనుకో సురేంద్ర మా ఆఫీస్ లోనే వర్క్ చేస్తాడు అంది సత్య మెల్లగా
"అయినా ఏం వయస్సైపోయిందే అంది సుభద్ర "నువ్వింకా పాతికేళ్ళే అనుకుంటున్నావా సుబ్బు ? పాతికేళ్ళు దాటి పదేళ్ళు అవుతుంది అంది సత్య నవ్వుతూ
"మరి ఇంకేం ? నచ్చితే పెళ్ళి చేసుకోవే , మీ అమ్మ నాన్న కి ఇంకెన్నాళ్ళు ఈ శిక్ష అంది సుభద్ర "రియలైజ్ అవుతున్నారు సుబ్బు వాళ్ళిప్పుడిప్పుడే కూతురి మనసు అర్థం చేసుకోడానికి అంది నిస్సత్తువగా నవ్వుతూ "ఒక స్టేజ్ లో తప్పులు చేస్తాం , ఇంకో స్టేజ్ లో రియలైజ్ అవుతాం అందరూ అంతే అంది సుభద్ర
"నీకు తెలీదు సుబ్బు....నేను ఆ రోజు ఎంత చెప్పినా వినలేదు. నా వల్ల అతన్ని ఏం చేస్తారో అని వాళ్ళు చెప్పినట్టే వెళ్ళిపోయా అంది బాధగా "అదేదో అయిపోయింది కదే వదిలేయ్ అంది సుభద్ర
"లేదు సుబ్బు అలా వదిలేయలేను , మా అమ్మ నాన్న నా మంచి కోసం నన్ను కొట్టి ఉంటే ఒప్పుకుంటాను కాని , నా వల్ల తనని అలా కొట్టడాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోతున్నా అంది బాధగా నీ బాధ నాకు అర్థం అవుతుంది , మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావే ? అంది సుభద్ర
"నా మనస్సులో ఉన్న భారం తగ్గితే కాని ఆ ఆలోచన రాదేమో సుబ్బు , నాలో భయం పెరిగిన ప్రతిసారి ఇలా పరిగెడుతూరావాల్సి వచ్చింది. ఇలా ఉన్నప్పుడు ఇంకో వ్యక్తిని ఎలా ? ఆ ఆలోచన ఏదోలా ఉందే అంది సత్య "అయితే నీ భారం , భయం తగ్గితే చేసుకుంటావా? అంది సుభద్ర "ఆలోచిస్తా అంది సత్య "ఎదుటి వారు ప్రేమిస్తున్నారని తెలిసి కూడా ఇలా వాళ్ళ ని ఎదురు చూసేలా చేయడం కూడా కరెక్ట్ కాదు సత్యా....అంది సుభద్ర నా మనస్సంతా గందర గోళంగా ఉందే అంది సత్య బాధ గా కాని ఇంతకీ చెప్పలేదు ఎందుకొచ్చావో అంది సుభద్ర నవ్వుతూ "మళ్ళీ చూడాలని అంది సత్య "ఎవర్ని నన్నా? అంది సుభద్ర "అందర్ని అంది సత్య
"నువ్వు ఫ్రెష్ అవు సత్యా నేనేళ్ళి టిఫిన్ చేస్తా అంది సుభద్ర సత్య మనసంతా
"మొదటి సారి అతన్ని కలిసిన క్షణాలని గుర్తు చేసుకోసాగింది.
గోపాల్ : "అలా గుడ్లేసుకుని చూస్తే ఆ రెండు జడలు కత్తిరిస్తా ...
సత్య : "నీకు అంత సీన్ లేదు లే , నువ్వు నీ పిడత మొహం ....
గోపాల్ : "నాది పిడత మొహమా? నీదే కప్ప మొహం ఆ కళ్ళు చూడు రాత్రిల్లో వచ్చే గుడ్లగూబ లా....
సత్య : "నా కళ్ళు కాదు నీ ముక్కు చూసావా? ఎవడో లాగి పెట్టి మరీ గుద్దినట్టు…
గోపాల్ : "అయ్యో ఈవిడగారి ముక్కు మరీ మునక్కాడల ఉంది మరి
సత్య : "ఇదిగో ఎక్కువ మాట్లాడితే మడత కాజాలా మడపెట్టేస్తా
గోపాల్ : "ఎళ్ళెహె....నువ్వు నీ బర్రె కళ్ళు కొన్ని నెలలు గడిచాక అదే గొడవ ప్రేమ గా మారి అప్పుడు తిట్టుకున్న తిట్లే మరింత అందంగా మారింది
గోపాల్ : "అలా చూడకు సత్యా ఆ కళ్ళకే పడిపోతున్నా
సత్య : మరి నువ్వలా నవ్వితే నీ నవ్వుకి నేను పడిపోతున్నా
గోపాల్ : మరి పిడత మొహం అన్నావు అప్పుడు...
సత్య : మరి నువ్వూ నన్ను గుడ్ల గూబ కళ్ళు అన్నావు మరి.... ఏడాది గడిచిపోయింది.... మనస్సులు మార్చుకున్నారు, అందరి లాగా ప్రేమ గీతాన్ని పాడుకుంటూ హాయిగా గడిపేసారు. ఇంట్లో విషయం తెలిసి పెద్ద గొడవలు జరిగాయి  "గోపాల్ ని తప్ప నేను ఎవర్ని చేసుకోలేను నాన్న నన్ను అర్థం చేసుకోండి అంటూ ఏడుస్తున్న సత్య
"వాడు ఉంటేనే కదా వాడిని చేసుకుంటుంది , వాడు లేకపోతే మన ఇంటి బిడ్డ ఎప్పటిలాగా మన మాటే వింటుంది వెంకటరమణా వెళ్ళి వాడిని తీసుకొచ్చి మన కొబ్బరి తోటలో ఉంచండి నేను వస్తా అన్నాడు వాళ్ళ పెద్ద నాన్న కుండపోతలా కురుస్తున్న వర్షం ఆకాశాన్ని చీల్చుకుని వస్తున్న మెరుపులు పరిగెడుతున్నా వెంటాడుతున్న ఉరుములు అతని నెత్తి మీద నుండి కారుతున్న రక్తం వర్షంలో కలిసిపోతూ ఉంది , మూసుకుపోతున్న కళ్ళు.....ప్లీజ్ పెద్దనాన్న అతన్ని వదిలేయండి మీరు చెప్పినట్టే వింటాను అంటున్న మాటలు…..
"ఏంటే అలానే కూర్చుని ఉన్నావు ? ఫ్రెష అవలేదా? అంది సుభద్ర
"కూర్చో సుబ్బు అంటూ పక్కన కూర్చో బెడుతూ.....పాత విషయాలు తల్చుకుంటుంటే వయస్సు తగ్గిపోతున్నట్టే ఉంది అంది సత్య నవ్వుతూ
"నువ్వు చీటికి మాటికి వయస్సు అనకే , మనకి ముప్పై అయిదేళ్ళు అయితే ఏంటి ? కాలం కరిగిపోతుంది దానికేం చేద్దాం ? నా మాట విని అతన్ని పెళ్ళి చేసుకో నీకంటూ ఒక జీవితం ఉండాలి సత్య అంది సుభద్ర "చూద్దాం అంది సత్య మాట తప్పిస్తూ
"సరే ఈ రోజు తిని రెస్ట్ తీసుకో రేపు నిన్నొక చోటుకి తీసుకెళ్తా అంది సుభద్ర ఇద్దరూ తిని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మరుసటి రోజు ఉదయం లేవగానే "సత్యా నువ్వెళ్ళి స్నానం చేసి రా అంది సుభద్ర ఎక్కడికే ఇంత పొద్దున్న అంది సత్య
"నువ్వు వెళ్ళవే అంది సుభద్ర
"ఏంటే కాలేజ్ పిల్లలా? ఈ టైమ్ కి ఎక్కడికే అంది సత్య సత్య బయలు దేరి సుభద్రతో వచ్చింది వర్షం మొదలవుతూ ఉంది. ప్రైమరీ కాలేజ్ ముంది ఆపింది సుభద్ర
"ఎక్కడికి ? అంది సత్య ప్రశ్నిస్తూ
"చెప్తా అంది సుభద్ర పిల్లల్ని గొడుగులో దాచుకుని వాళ్ళ తల్లిదండ్రులు స్కూలో దిగబెడుతున్నారు. ముద్దు ముద్దు గా ఉన్న పిల్లల్ని చూసి నవ్వుతూ ఉంది సత్య ఇంతలో గేట్ ముందు ఆగిన బైక్ రెయిన్ కవర్ డ్రెస్ లో చిన్న బాబు దిగాడు. బైక్ ఆపి హెల్మెట్ తీసి గొడుగు తీసుకుని బాబుని ఎత్తుకున్నాడు
"అక్కడక్కడా నెరిసిన జుట్టు , గ్రే కలర్ చొక్కా కింద తెల్ల పంచె పైకి మడిచి కట్టి ఉన్నాడు , కాస్త ముందుకు వచ్చిన పొట్ట సాధారణ ఫ్యామిలి మెన్ లా ఉన్నాడు. నవ్వుతూ మాట్లాడుతున్న అతన్ని చూడగానే సత్య ఆగిపోయింది. తేరుకుని సుభద్ర వైపు చూసి
"సుబ్బు గోపాల్ కదూ అంది ఆశ్చర్యంగా
"అవును చూడు చాలా సంతోషంగా అనలేను కాని సంతోషంగా ఉన్నాడు అంది సత్య భుజం పై చేయి వేస్తూ గోపాల్ బాబు ని క్లాస్ ముందు దింపి, ముద్దు గా అచ్చం అతనిలానే ఉన్న ఆ బాబు కి ముద్దు పెట్టి బై చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నాడు "వెళ్ళి మాట్లాడు అంది సుభద్ర సత్య ని నెడుతూ
"వద్దు సుబ్బు....నాకు మళ్ళీ చూడాలని అనిపించింది కాని కలవాలని కాదు, అంది వెనక్కి వస్తూ ఇంతలో వర్షం ఎక్కువైంది వర్షంలో తడుస్తూ వేగంగా అడుగులు వేస్తూ వెళ్తున్న గోపాల్ వైపు చూస్తూన్న సత్య కళ్ళలో కన్నీళ్ళు అమాంతంగా చెంపలని స్పృసించసాగాయి. "ఏంటే నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావు అంది సుభద్ర "ఇది పశ్చాతాపంతో కాదు సుబ్బు , నా మనసుకి ఈ రోజు కలిగిన ఈ ఊరటతో వస్తున్న కన్నీళ్ళు అంది ఊపిరి పీలుస్తూ "ఇప్పుడైనా నమ్ముతావా? గోపాల్ సంతోషంగా ఉన్నాడని అంది సుభద్ర "ఎక్కడున్నా బావున్నాడు అదే చాలు , ఇన్ని రోజులు ఏదో ఒక మూల ఈ భయం నన్ను వెంటాడేది .ఇక మీదట నాకు కొంచెం ప్రశాంతత ఉంటుందే అంది హోరున కురుస్తున్న వర్షంలోకి చేతిలోని గొడుగును పక్కకి వదిలేసి వెళ్తూ..... కొన్ని ప్రేమలు జీవితంలో...ఎప్పటికి జీవిస్తూ మిగిలిపోతాయి... 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కథ చాల అద్భుతంగా ఉంది
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)