Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పెళ్ళయిన కొత్తలో - Sujana Namani
#1
పెళ్ళయిన కొత్తలో
- Sujana Namani
పెళ్లిమండపమంతా సందడిగా ఉంది. అవసరమున్నా లేకున్నా హడావుడిగా అందరిముందు తిరగేస్తూ తాము చేసుకున్న ముస్తాబు , అలంకరణలతో అందరినీ ఆహ్లాదపరుస్తూ పెళ్ళికి కొత్తందాల్ని తెచ్చే పడుచులతో, వారి కంటపడటానికి ప్రయాసపడుతూ వచ్చి పోయే పడుచులపై చలోక్తులు విసురుతూ రంజింపజేసే కుర్రకారుతో, చదువుల బడిలో బంధిఖానా అయిన చిన్నపిల్లలు పంజరం వదిలిన చిలకల్లా స్వేచ్ఛగా ఎగిరిగంతులేస్తూ ఆడే ఆటలతో , వారిని అలా స్వేచ్ఛగా వదిలేయకుండా వారిస్తూ జాగ్రత్తలు చెబుతున్న తల్లులతో , ఇంటిగోల వదిలి హాయిగా ఎంజాయ్ చేస్తూ చతుర్ముఖ పారాయణం లో తన్మయంగా మునిగిన మగధీరులతో , పెద్దవాళ్ళ పట్టుచీరల రెపరెపలతో పెళ్లి మండపమంతా కోలాహలంగా ఉంది.
తలపై తలపాగాతో , సంప్రదాయసిద్ధమైన పట్టుబట్టలతో, నుదుట కళ్యాణ తిలకం తో మెరిసిపోతున్న కొడుకు సాయిచైతన్య ను చూసి నిజంగా నా కొడుకెంత అందగాడు అనుకోకుండా ఉండలేక పోయింది సరోజ. కనుదిష్టికి రాలుగాయినుగ్గవుతుందంటారు. అందులో కన్నతల్లి దిష్టి ఇంకా ఎక్కువంట అనుకుంటూ చూపు మరల్చుకుంది. ఇద్దరి పేర్లు చెక్కి ఉన్న కొబ్బరి బొండం తో , పూలజడ పైని మెలిముసుగు సవరించుకుంటూ, పెళ్లిపట్టుచీరలో, నుదుట కళ్యాణతిలకం మెరుస్తుంటే అల్లనల్లన రాజహంసలా నడిచివస్తున్న వధువు శ్రీవల్లిని చూసింది సరోజ. నిజంగానే తన కొడుకుకి సరిజోడు కుందనపు బొమ్మలా ఉంది అనుకుంది మురిపెంగా . ఇప్పటివరకూ తాను రెండు పెళ్లిళ్లు చేసినా, అవి కూతుర్లవి కావడంతో ఇప్పటి హోదా ఒక రకంగా కొత్తగానే ఉంది. పంతులుగారు మధ్య అడ్డుతెరపెట్టి పై నుండి జీలకర బెల్లం పెట్టిస్తున్నాడు. అయినా అలా పెళ్లి పీటలపైనే పల్చగా ఉన్న తెర గుండా ఒకరినొకరు చూసి ముసి ముసిగా నవ్వుకుంటున్నారు వధూవరులు. శ్రీవల్లిని చూస్తున్న సరోజ బృకుటి ముడివడింది. ఆమె బ్లౌజుకి చాలా పొట్టి చేతులు , భుజం నుండి కేవలం రెండుయించుల పొడుగు మాత్రమే ఉన్నాయి. జీలకర బెల్లం పెట్టేటప్పుడు ఆ అమ్మాయి చేయి ఎత్తితే తనకే సిగ్గనిపించింది. మరీ చేతులు చంకల్లోకి ఉన్నాయనిపించింది. పోనీ , ఇవ్వాళ రేపు ఫాషన్ ...ఇప్పటి పిల్లలు అలాగే ఉంటారనుకున్నా రోజూ వేసుకునే బట్టలు, ఏవో లేటెస్ట్ ఫంక్షన్ కి వేసుకునే బట్టలు అలా ఉంటే ఫర్వాలేదు కానీ ఇవి పెళ్లి బట్టలు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రతిఫలించే పెళ్లి ఇది. ఎంతందంగా ఉన్నా ఆ చేతుల వల్ల నిండుదనం పోయినట్లనిపించింది. ముహూర్త సమయం అయిపోతోందంటూ హడావుడిగా జీలకర బెల్లం పెట్టించారు పంతులుగారు. ఆపై మాంగల్యధారణ, తలంబ్రాలు, అగ్నిసాక్షిగా ఏడడుగులు (సప్తపది) ,ఉంగరాలు బిందెల్లో వేసి తీయించడము లాంటి సరదాలు, అరుంధతీ నక్షత్రం చూపించడాలు వరసగా అయిపోయాయి. అందరూ అక్షింతలేసి ఆశీర్వదిస్తారంటూ రెండు మహారాజా కుర్చీలలో వారిని కూర్చోబెట్టారు.
వధూవరులిద్దరిలో పెళ్లికళ ఉట్టిపడుతోంది. ఎవరేమనుకుంటారోనని లేకుండా స్వేచ్ఛగా నవ్వేసుకుంటున్నారు, మాట్లాడేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళని సాయి పరిచయం చేస్తుంటే ,తలపంకిస్తూ నవ్వుతూ నమస్కారం చేస్తోందమ్మాయి. చిన్నప్పటి నుండి మాటలు రాక పెద్దగయ్యాక ఒకేసారి మాటలు వస్తే చిన్నప్పటినుండి మాట్లాడాల్సిన మాటలన్నీ వరుసబెట్టి ఒకేసారి మాట్లాడేసినట్లు గల గల ఒకటే మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తున్న సరోజ మనస్సు లో ఏమూలో...ఏదో వెలితి...ఏదో డిస్ కంఫర్ట్ .. ఇదమిద్ధంగా ఇది అని తెలియని ఏదో అసందిగ్దత ...ఏదో భాధ... నిజంగానే అమ్మాయిల పెళ్లిళ్లు చేస్తున్నపుడు ఇలా ఉందంటే అందులో అర్ధం ఉంది. ఇన్ని సంవత్సరాలు కని,పెంచి కనుపాపగా చూసిన అమ్మాయిలు అత్తగారింటికి వెళ్లిపోతుంటే. వారు ఇక ఇంటిపేరు మార్చీకుని తమకు దూరమవుతున్నారనే బాధ సహజం. కానీ ఇప్పుడు చిత్రంగా అబ్బాయి పెళ్ళవుతుంటే సంతోషానికి బదులు తన మనస్సెందు కిలా కలవరానికి లోనవుతుంది.... అన్యమనస్కంగానే వచ్చి పోయే బంధువులందరినీ పలకరిస్తూ,భోజనాలు చేయమని పురమాయిస్తూ ఉండిపోయింది. భోజనం చేసి బంధువులంతా వెళ్ళి పోగా, దగ్గర బంధువుల నడుమ అప్పగింతల కార్యక్రమం మొదలయ్యింది. అమ్మాయి చేయిని ఎండుకొబ్బరి చిప్పతో పాటు అబ్బాయి తరపున పెద్దలందరి చేతుల్లో పెట్టి అప్పగిస్తూ అమ్మాయి తల్లితండ్రులు కంట నీరు పెడుతున్నారు.సరోజ కూతుర్లు,అల్లుళ్ళ, పెద్దవాళ్లందరి చేతుల్లో పెడుతూ సరోజ దగ్గర కొచ్చారు. ఎందుకో సరోజకి అప్పటివరకూ ఉగ్గబట్టిన ధుఃఖం పెల్లుబికింది. అమ్మాయి తల్లితండ్రులతో పాటు తానూ బిగ్గరగా ఏడ్చేసింది. వాళ్ళు బిత్తర పోయారు. నిజానికి వాళ్ళు ఏడిస్తే ,ఊర్కొండి ... మీ అమ్మాయికేం బాధ లేదు. నా కూతురిలా చూసుకుంటాను’ అంటూ వాళ్ళను ఓదారుస్తూ స్వాంతన వచనాలు పలకాల్సిన సరోజ తానే ఏడ్చేసరికి అంతా తెల్లబోయారు. కూతుర్లు వచ్చి ‘మా అమ్మ మనస్సు చాలా సున్నితం....’ అంటూ తల్లి భాధను సర్ది చెప్పారు. అప్పటికి సర్దుకున్నా ఎందుకో సరోజ మనస్సు మాత్రం స్థిమిత పడలేదు. అమ్మాయి తరపు బంధువులంతా కొత్త జంట చుట్టూ చెరీ ఇద్దరికీ పెరుగన్నం చలోక్తులతో తినిపించడం ఆ తర్వాత సహపంకి భోజన్నాల్లో కూడా వారిద్దరూ ఒకరికొకరు తినిపించుకోవడం..ఎందుకో తన కొడుకుని తననుండి వాళ్ళు లాక్కున్నట్లుగా ఫీలయ్యింది. నిజానికి తల్లితో సాయికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. చిన్నప్పటినుండి తల్లిది సాయిది ఒకేమాట.. నాన్న మాట నంతగా పట్టించుకునేవాడు కాదుగానీ తల్లంటే పంచ ప్రాణాలు.పెళ్ళికి ముందే ఆమ్మాయి వాళ్ళతో ,‘మీకు నేనెంత ముఖ్యమో నాకు మా అమ్మ, నాన్న, అక్కలు, బావలు అంతే ముఖ్యం. వాళ్ళనెప్పుడైనా ఏవిధంగానైనా నొప్పిస్తే మాత్రం నేను క్షమించను అంటూ వార్నింగ్ ఇవ్వడం తో వారు కూడా అందరినీ చాలా గౌరవంగా చూస్తున్నారు. ఇంతకు ముందు ఏ మాత్రం అలసటగా ఉన్నా చాలా సార్లు,‘అమ్మా ... అన్నం పెట్టావా...’ అంటూ తాను కలిపి నోట్లో పెడుతుంటే తినేవాడు తన వొల్లో పడుకునేవాడు. తన కొంగుతో మూతి తుడుచుకునేవాడు. అలాంటిది ఒకేసారి తనకి కొడుకుకి మధ్య ఎన్నో యోజనాల దూరం పెరిగినట్లనిపించింది.
ఇంట్లో ఒకవేళ బెడ్ రూమ్ లో కొడుకుండగా కోడలు వెళ్ళినా , కొడలుండగా కొదుకెళ్లినా తన ఇంట్లో తన రూమే అయినా తన కొడుకే పరాయిగా అనిపించి, అందులోకి వెళ్లడానిగ్గాని, కొడుకుని పిలవడానిగ్గాని చాలా ఇబ్బంది పడింది..
అలాగే ఎంత కొత్తగా పెళ్ళయిన దంపతులైనా ఇంట్లో ఎక్కడైనా ఇద్దరు అంటుకునే కూర్చోవడం, ఇద్దరూ చేతిలో చేయి వేసుకునే తిరగడం ఎందుకో ఎబ్బెట్టుగా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఎంత కొత్తగా పెళ్లయితే మాత్రం కనీసం ఇంట్లో తమ కన్నా పెద్దవాళ్లయిన తమ ముందు కూతురు, అల్లుడి ముందు అలా చెట్టాపట్టాలేసుకుని తిరగడం సహించలేక పోతోంది. సరే కొడుకుకు తెలీదనుకున్నా కోడలు ఆడపిల్ల, ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ,పెద్దవాళ్లపై గౌరవం లేకుండా అలా తిరగడం ఏమిటి.....
‘ఆరే... అలా పదిమంది ముందు ఎలా తిరగడం మంచిది కాదు.. టీనేజ్ అమ్మాయిలుంటారు....పెద్దవాళ్లపై ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండవద్దా అని చెబుదామనుకుంటుంది. కానీ కొడుకు,‘ మరో పది , పదిహేను రోజుల్లో నేను అమెరికా వెళ్లిపోతాను ఈ మాత్రం రోజులైనా ఫ్రీగా ఉండనివ్వరా.. అవన్నీ పాత పద్దతులు ఇప్పుడంతా ఇలాగే ఉంటారు అయినా మేము పెళ్ళయిన వాళ్ళమే కదా ..’ అంటే తన దగ్గర సమాధానం లేదు. ఇప్పటి వరకు వాడి 100 శాతం ప్రేమ మొత్తం పూర్తిగా తల్లీతండ్రీ,అక్కలు బావలపై ప్రేమ తోనే నిండి పోయింది. కానీ ఇప్పుడు నూరు శాతం లో కేవలం,20 శాతం మాత్రమే తామంతా కల్సీ ఉన్నారు. మిగతా 80 శాతం ఆ అమ్మాయి నిండి ఉంది. ఇంకా ఆలోచిస్తే అసలు 100 శాతం ఆమె నిండి ఉందనే ఆలోచన వస్తోంది... ఆ అమ్మాయితో అలా అందరి ముందు అలా ఉండవద్దు అని చెప్పడానికి కూడా భయపడుతోంది. అందరినీ అజమాయిషీ చేస్తూ అధికారం చెలాయించే తన గళమెందుకిలా మూగబోయింది. ఏదో భయం తన గొంతు నోక్కేస్తుంది అలా అందామంటే,‘చూసారా... మీ అమ్మావాళ్లు ఇలా అన్నారు ‘ అని కొడుకు తో అంటే , కోడలు మనస్సులో మొట్టమొదటి అభిప్రాయమే చెడుగా పడటమే కాక , ఆమె చెప్పే విధానంతో కొడుక్కి,‘ఇందేంటి..మేము మంచిగా ఉంటే అమ్మా వాళ్ళు భరించలేక పోతున్నారని’ ఏమాత్రం అనుకున్నా తను భరించలేదు.
విజయవాడ మొక్కు తీర్చుకోవడానికి వెళుతుంటే కోడలే మొత్తం కొడుకు బట్టలు సర్దడం దగ్గర్నుండి చూసుకుంది. ఎప్పుడైనా సరోజే సర్దేది, ఒక్కోసారి ‘నీవి ఈ మాత్రం కూడా చూసుకోవు...’ అంటూ విసుక్కున్నది నిజమే . అయినా ఈ సారి కోడలు,‘అత్తయ్యా.. ఆయనకి ఇదిగో ఇది పెట్టాను... ఇది పెట్టమన్నారు...’ అంటుంటే మనస్సు చివుక్కుమంది..
కార్లో వెనక కొడుకు , కోడలు మరీ చేతులు పెనవేసుకుని కూర్చోవడం, కొడుకు భుజం పై కోడలు తల ఆన్చుకు కూర్చోవడం .... కొడుకు ఆమె లోకమైనట్లు ఎన్ని జన్మల నుందో మాటలు బాకీ ఉన్నట్లు ముచ్చట్లు పెడుతుంటే కూడా , చాలా చిరాకు అన్పించింది.విజయవాడ లోకి ప్రవేశిస్తూనే వొళ్ళు అమ్మావారి స్మరణ లో పులకించింది.
కృష్ణ లో స్నానానికి వెళుతూ ,‘స్వీటి ఇదో ఇది తీసుకో’ అంటూ వాలేట్ , వాచ్, సెల్ అన్నీ పట్టుకోవడానికి ఆమె కె ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఎక్కడైనా కొబ్బరికాయలకో, పంతులుకో డబ్బు కావాల్సి వచ్చినా ఆమెకే డబ్బు తీసివ్వమని చెప్పాడు. సరోజ పరాయిదానిలా, ప్రేక్షకురాలే అయ్యింది. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడల్లా తన చేతికే అన్నీ ఇచ్చేవాడు. అలా ఆ ట్రిప్ లో అలాంటి బావాన్ని చాలా సార్లు చవి చూడాల్సి వచ్చింది. ఇంటికొచ్చినా, ఎప్పుడైనా అమ్మా ..ఆకలవుతుంది అంటూ తన చేతి గోరుముద్దలు తింటూ , నువ్వు తిను , నువ్వు తిననిదే నేను తినను అంటూ మారాం చేసే కొడుకు ఇప్పుడు,‘స్వీటి, అన్నం పెట్టూ’ అంటున్నాడు.
ఆ మర్నాడు కొడుకు కొదలితో కాలనీ గుళ్ళో వెంకన్న స్వామి కి కళ్యాణం చేయించే మొక్కుండటంతో అమ్మగార్ల కి, అయ్యవారికి చీరలు, పట్టుపంచలు తేవాల్సి ఉండడంతో బజారుకెళ్లి అన్నీతీసుకుని రోడ్డు దాటుతూ పరధ్యానంతో స్థిమితం లేక స్పీడుగా ఎదురుగా వచ్చే ఆటోను చూసుకోలేదు. అది వచ్చి ఆమెను తాకటం , ఆమె రోడ్డుపై పడిపోవటం తలకు గాయమై రక్తం కారుతూ స్పృహ తప్పిపడిపోవడం ఒకేసారి జరిగాయి. సరోజకి మెలకువ వచ్చేసరికి ఆమె హాస్పిటల్ లో ఒక బెడ్ పై పడుకుని ఉంది. చుట్టూ ఆదుర్ధాగా చూస్తున్న భర్త , కొడుకు, కోడలు, కూతుళ్ళు అంతా కనబడ్డారు.
‘అమ్మా...ఎలా ఉంద మ్మా...నువ్వేందుకో చాలా నేర్వస్ గా కన్పిస్తున్నావు. ఒకటే కలవరింతలు ... కన్నా ...నువ్వు నన్నొదిలి ఎక్కడకూ వెళ్లకు అంటున్నావు. నేను నిన్నొదిలి ఎక్కడికి వెళతానమ్మా...’ అన్నాడు సాయి చైతన్య తల్లి నుదిటిపై ముంగురులు సర్దుతూ , తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
‘సరూ.... ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు. నీకు బ్లడ్ చాలా పోయిందంటే, నాది, వాడిది కలవలేదని కోడలు పిల్లే ఇచ్చింది. నీకీలా అయిన దగ్గర్నుండి ఇద్దరూ తెగ కంగారుపడుతున్నారు....’ భర్త అన్నాడు. సరోజ మనస్సు తెలికైంది. తానెంత స్వార్ధంగా ఆలోచించింది. పెళ్ళయిన కొత్తలో తాము మాత్రం వీళ్ళలా లేరు...మరీ అందరి ముందు కాదేమో గాని... అప్పుడు తన అత్తగారు ఇలాగే బాధపదిందేమో....ఆమె పడిందో లేదో కానీ తనను మాత్రం విశాలహృదయంతో ఆహ్వానించింది, కొడుకుతో సమానమైన ప్రేమను పంచింది. ఇప్పుడు తన మనస్సు అంతా విశాలంగా లేదా తాను సంకుచితంగా ఆలోచిస్తుందేమో.... ‘అమ్మా....నువ్వు కలవరించిన దాన్ని బట్టి చాలా మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నావనిపిస్తోంది. నేనెక్కడికెళ్లినా ఎప్పటికీ నీకోడుకునేనమ్మా...నా ప్రయాణమేమైనా పోస్ట్ పోన్ చేసుకోవాలా…..’అన్నాడు సాయి.
‘లేదు ....నాన్నా...నేను బాగానే ఉన్నాను....’మనస్ఫూర్తిగా నవ్వుతూ అంది,‘కాలంతో పాటూ మనమూ మారాలి..నెమ్మదిగాఅమ్మాయికి చెప్పుకోవాలి కూతురిలా ‘ అన్న భర్త మాటలు మననం చేసుకుంటూ .

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 11 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
బాగుంది
Like Reply
#3
Nice start
Like Reply
#4
All the best...

ఎవరి గురించి ఆలోచించడం అనవసరం.. just write in ur style..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 1 user Likes Jani fucker's post
Like Reply
#5
Very nice.. Looks like a promising story.
Like Reply
#6
Nice super
Like Reply
#7
పాఠక మితృలకు,

ఈ కథని నాన్ ఎరోటిక్ త్రెడ్లో పోస్టు చేయాలి గానీ చిన్న తప్పిదం వల్ల ఇక్కడకు వచ్చింది.

చదివిన వారికి, వ్యాఖ్యానించిన వారికి కృతజ్ఞతలు

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#8
EXECELLENT UPDATE
Like Reply
#9
Good story  clps
Like Reply
#10
అందమైన కథ...అద్భుతమైన కథ
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)