28-11-2022, 06:50 PM
ఆత్మ ఘోష -
Lakshmi Ayyagari
రైలు గేటు ఇక మూసుకోబోతున్నాది !! సబ్ వేని చేసుకుని మరీ , మీరే మూసేస్తున్నారు శాశ్వతం గా !!
కొన్ని దశాబ్దాల మన అనుబంధాన్ని నీతో కాసేపు పంచుకోవాలి అనిపించింది అందుకే నేను పడుతున్న బాధ నీకు నేను నామాటలు ద్వారా మాత్రమే వినిపించాలని ఇంత అర్ధరాత్రి వచ్చాను అని నన్ను ఎవరో తట్టి లేపుతుంటే ఉలిక్కి పడి లేచాను .
"అస్తమిస్తున్న సూర్యుడిలా " వెలవెలబోతూ కనిపించింది మా ఊరి " రైలు గేటు" !!! ఒక్కసారి ఆశ్చర్యపోవడం నా వంతు అయ్యింది . "రైలు గేటు" కదలిరావడం ఏంటీ ??మాట్లాడ్డం ఏంటి ?? నాలో నేనే అనుకున్న మాటలని బయటకే అనేసాను . అంతే నేను ఊహించని సమాధానానం !! "విఠలాచారి "గారి సినిమాలలో "బల్లలూ , కుర్చీలు " మాట్లాడితే చప్పట్లు చేరుస్తూ చూసే మీకు నేను మాట్లాడడం ఎందుకు విచిత్రం అవుతోంది అంది !! అంతే ఉలిక్కి పడడం నావంతు అయ్యింది . ఇది తెలివైన "రైలు గేటు" అన్ని తెలుసుకుని మరీ మాట్లాడడానికి సిద్దపడే వచ్చినట్లు ఉంది . ఎదో కొంత దీని వ్యధ వినేలా లేకపోతే నన్ను వదిలేలా లేదు అని నిశ్చయించుకుని , మంచానికి దిండుని ఆసరా చేసుకుని, కాళ్ళు జాపుకుని మరీ ఓపికగా వినాలని నిశ్చయించు కున్నాను ...
"అందమైన ఆడపిల్ల లంగా వోణి వేసుకుని పెద్ద సింధూరం బొట్టుతో వినయం గా చేతులు జోడిస్తూనట్లుగా ఎప్పుడూ కనపడే మా గేటు ఈ రోజు ఎందుకో తెలియని వేదనని అనుభవిస్తూ ఏదో బాధని చెప్పుకోవాలి అన్నట్లు గుటకలు మింగుతూ నా ముందుకి జరిగింది ..
"మన గోడుని మన అనుకున్నవాళ్ళతో చెప్పుకుంటే కాసింత తస్సాన్తీ ఉంటుందని అనుభవ పూర్వకంగా తెలుసుకున్న దానినీ కాబట్టి ఒక చెవిని దానివైపు పడేసాను "....
నీతో నా అనుబంధం నీ చిన్నతనం నుండి మొదలయ్యింది అంతే కదా అంటూ... ఒకసారి ఇటుచూడు అని తన చేతి వేళ్ళని గోడవైపు తిప్పింది!! ఎదో పాత సినిమా....ఆ ఆ ఆ ..... గుర్తొచ్చింది బాలనాగమ్మ !! ఆ సినిమాలో మాంత్రికుడి మంత్రదండంతో ఒకచోట తాకిస్తే అందులోనుంచి బాలనాగమ్మ కనిపించినట్లు నాకు నాచిన్నతనం ,చేతిలో బ్యాగుతో గేటు దాటుతూ కాలేజ్ కి వెళ్లడం, చిన్ననాటి సంఘటనలు అన్నీ అక్కడ గోడమీదే కనిపించాయి .. ఒక్కసారి ఆనందం హద్దులు దాటింది కళ్ళముందు ఒకొక్కటీ చిత్రంగా కదులుతున్నాయి . నేను నానమ్మ చెయ్యి పట్టుకుని గేటు దాటడం , దాటుతూ గెంతడం లో క్రింద పాడిపోయి కాళ్ళకి దెబ్బ తగిలితే అమ్మో అమ్మడు పట్టాల మీద పడిపోయింది ఇంటికి వెళ్ళి దిష్టి తీసి , తాయత్తు కట్టించాలని అరుస్తూ రైలు పట్టాలకీ , రైలు గేటు కీ మెటికలు విరుస్తూ శాపనార్థాలు పెట్టుకుంటూ నా చేయి పట్టుకుని లాక్కుని వెళ్లడం అన్నీ అందులోని కనిపించాయి.. గేటు నా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది. నేనూ తనతో శృతి కలిపాను...
మాది పల్లెకీ , నగరానికి మధ్యస్తంగా వున్న ఊరు . "మధ్యస్తం" అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే పల్లే నగరాల మధ్య అనుబంధాలకి అనుసంధానంగా నిలిచేది(ఒక్క చూడడానికి మాత్రమే)
సమాంతరంగా ఉన్న పట్టాల మాదిరిగా అవి కలిసిఉన్నట్లు కనిపించినా ఆచార వ్యవహారాలు , ఆప్యాయతలు అన్నింటిలోనూ భిన్నధ్రువాలుగ నిలిచాయి అన్నదిమాత్రం అక్షర సత్యం . అటువారు ఇటు రావాలన్నా ఇటువాళ్ళు అటు వెళ్లాలన్నా గొప్పా , బీదా అన్న తారతమ్యం లేకుండా గేటు దాట వలసినదే .!!
ఆనందం తో పట్టాలు దాటేవాళ్ల దగ్గరనుండి ,ఎప్పుడో వచ్చే రైళ్లు కోసం మూసిన గేటు ని తెరవమనీ తిట్టుకున్నవాళ్లని ఒకరేంటి అన్ని రకాల వాళ్ళనీ సహనంతో భరిస్తూ వచ్చింది.
గేటు పడిందంటే అక్కడ ఒక పేద్ద చేర్చావేదిక మొదలయిందన్నట్లే, ఊరుని ఉద్దరించేది శున్యమేగాని, ఉద్ధరించినట్లు నటించే నాయకులు అంతా మహానటులే అయ్యిపోయేవారు రైళ్లు వచ్చి వెళ్ళేలోపునే.. ఇవే కాదండోయ్ ఎన్నో ప్రేమ కధలకి కూడా గట్టి పునాదులు మా రైలు గేటు పుణ్యమే!! అమ్మాయిలూ అబ్బాయిల కొసరి కొసరి చూపులూ, క్రీగంట నవ్వులూ అబ్బో చాలా తమాషాలే జరిగేవి.... శుభం కార్డులు వరకూ వెళ్ళేవి కొన్ని ప్రేమకథలు మాత్రమే ఐతే , సమాంతరంగా కనిపిస్తూ కలవని పట్టాలు మాదిరిగా మిగిలిపోయినవి మరి కొన్ని !!
నేను ఆనాటి జ్ఞాపకాలలో పడి ఊ --కొట్టడం ఆపేసాను నిద్దరపోతున్నాను తట్టి లేపాలి అనుకున్నట్లుగా ఉంది ఏమో !! వింటున్నావా అన్నపిలుపుకి !! చాపుకున్న కాళ్ళని దగ్గరకి ముడుచుకుంటూ బాసింపట్టు వేసుకుని మరీ కూర్చున్నాను, వస్తున్న ఆవలింతలనికూడా ఆపుకుంటూ ..
మాతో తనకున్న జ్ఞాపకాలు కన్నా తనతో ముడిపడిన గుర్తులే మాకు ఎక్కువేమో !!
ఈ సారి నేనూమాట్లాడాలని నిశ్చయించుకున్నాను ..అప్పుడైతేనే పూర్తిగా నిమగ్నం అయ్యి తనమాటలని వింటున్నానని అర్ధంచేసుకుంటుందని ..
నీవలన మాకు జరిగిన ఉపకారాలేకాదు అపకారాలు ఉన్నాయి రెండింటినీ ఒక్కసారి విశ్లేషిస్తా ఉండు అన్నంతలో చీకటిలో అన్నింటికీ సిద్దపడి వచ్చానుగా !!కానీ !! అన్నమాటలు వినిపించాయి ..
పిల్లలు ఆటలాడుతూ పట్టాలమీద పదిపైసలబిళ్ళలని సాగదీయడానికి ప్రయత్నించినపుడు, బాధలతో బంధాలు విడిచి తనువు చాలించాలని పట్టాలపై పవళించి కుత్తుకలు నెత్తురోడినపుడు ఎన్ని కుటుంబాలు తల్లడిల్లాయో అక్కడ ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డావు గానీ , నోరు మెదిపి తప్పనిచెప్పావా !! ఈ రోజు ప్రశ్నించుతున్న నోరు ఆనాడు ఏమయ్యింది ??మామూలుగానే మాట్లాడాను అనుకున్నా కానీ నా మాటల స్థాయి తీవ్రంగా వినిపించినట్లున్నాయి
చీకట్లో కన్నీళ్ళ శబ్దం వినిపించింది.
నా మేనకోడలు కాళ్లపారాణి ఆరని నిండు గర్భిణీ పురుటి నొప్పులకి తాళలేక , గేటుఎత్తే లోపే పసిబిడ్డని ప్రసవించి తనువు చాలించింది. ఎందుకో అది గుర్తుచేసుకుంటే కడుపులోని దేవినట్లు అయ్యింది.... ఈ చేతులతోనే దానిని పెంచి చెయ్య పట్టుకుని ఇదే గేటుని దాటిస్తూ బడికి తీసుని వెళ్లిన నేను దాని చావుని కూడా ఇక్కడే చూస్తానని ఏ నాడు అనుకోలేదు... భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని మిన్నుకున్నాము అంతకన్నాఎంచేయలేక . ఏ నాడైన ఒక్కసారైనా నిన్ను తిట్టుకున్నానా!!
" ఆనందానికీ , విచారానికీ " దూరం ఎంతో లేదు నేను పట్టాలదగ్గర చెవిని పెట్టి వింటున్నప్పుడు అక్కడి నిశబ్దతరంగాల శబ్దాలు వినిపించేవి అది "ఆత్మల ఘోషో " , లేకా నా" అంతరాత్మా ఘోషో" తెలుసుకోడానికి చాలా సమయమే పట్టింది.. ఇలా అడిగేసరికి అక్కడ "శ్మశాన నిశబ్ధం" ఆవహించింది.ఒక్క సారి నన్నునేను సంభాళించుకున్నాను..
"బాధతో ఉన్నవాళ్ళని మరింత బాధ పెట్టడం భావ్యం కాదని అనిపించింది... "ఎన్నో చిన్న చిన్న సరదాలు గేటుమూసి ఉన్నప్పుడు కొసరి కొసరి తీర్చుకున్నవే అని గుర్తుచేసిమరీ ఈసారి మరీ తనని నవ్వించడానికి ప్రయత్నించాను..
జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మనమధ్యనే ఉండిపోవాలని "తను" నా దగ్గర మాట తీసుకుంది.. నేను మాటలలో నీ ముందు ఓడినా , ప్రేమతో మీ మనసులని కొన్నిసార్లు గెలిచాననీ కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇక బయలుదేరడానికి నిశ్చయించుకుని .....
"తూర్పు" తెల్లారకముందే అందరూ లేవకుండానే "నేను " నిష్క్రమిస్తాను అంటూ , "పడమటి దిక్కుకి" తిరిగింది. ఇన్నిరోజులుగా మాకు "ఏకైక దిక్కయిన " తనని నా మాటలతో ఇంక బాధపెట్టాలని అనిపించలేదు ...
మేము రహదారిలో మా నడకని మాత్రమే మార్చుకుంటున్నాము మా నడతని కాదు, దూరాలని దగ్గర చేసుకోడానికి మాత్రమే వేరే దారిని వెతుకున్నాము అంతే కానీ నిన్ను దూరం చేసుకోవాలనే ఉద్దేశం మాకు ఏ నాడూ లేదు....క్రొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లుగా నిన్ను ఏ నాడు తీసి పారేయ్యాము....
మా పిల్లలని , నీ దగ్గరకి తీసుకుని వచ్చి రైళ్లు చూపిస్తూ టాటా చెప్పిస్తూ నీ కనుచూపు మేరలోనే తిరుగుతూ ఉంటాము కదా !! మాకు నీ ఆశీస్సులు ఉన్నట్లే మా పిల్లలకీ నీ ఆశీస్సులుని ఇవ్వాలి అర్ధం అయ్యింది కదా అన్నాను...!!.... ఆనందంగా నా వైపు చూసినట్లు అనిపించింది.....
చివరగా--- ఒక్కమాట
అన్నిచోట్లా మంచీ చెడ్డా ఉంటుంది. మన మనస్సు అద్దం లాంటిది దానివైపు మనం ఎలాచూస్తామో మనకూ అలాగే కనిపిస్తుంది..
విజేతగా నిలబడాలి అంటే ఎవరినో ఓడించడం కాదు ,నిన్ను నువ్వు గెలవడం !!నీ ఆత్మఘోషతో మమ్మల్ని , మా మనసుల్ని కూడా గెలుచుకున్నావు.
నీతో పంచుకున్న అనుభవాలని , ఆనందాలని ఒక కథగా రాసీ, మా పిల్లలు, వాళ్ళ పిల్లలుకీ కూడా నీ గురించి తెలుసునేలా చేయాలని ఉంది అన్నాను" రైలు గేటు" రైట్ రైట్ అంటూ ఆనందపడి అందంగా ఒకసారి నవ్వుతూ చేతిని ఊయింది....
ఎంత ఆదివారం అయితే మాత్రం బారేడు పొద్దెక్కే వరకూ పడుకుంటారా????? ఎప్పుడూ లేనిది ఈరోజు పలవరింతలు కూడా మా "రాధీకి"!!! మన ఆఫీసులకి సెలవు గానీ ఆకలికి కాదు కదా అని శ్రీకర్ ముద్దుగా విసుకుంటున్నపుడు నేను పవలరించడం ఏంటి???? ఎప్పుడూ లేనిది అని ఆలోచిస్తుంటే
అ --ప్పుడు గుర్తు వచ్చింది , నిన్నరాత్రి పడుకునే ముందు పుస్తకంలో కధల పోటీ ల గురించి ఇద్దరం మాట్లాడుతూ "రైలు గేట్ "మీద నేను రాసిన కథని "తనకీ " వినిపించడం బాగుందని కితాబు ఇవ్వడం కథకి పెట్టే పేరుమాత్రమే మిగిలిందనీ అదీ పెట్టేసి పోటీ కధలకి పంపించాలనీ అన్నాను !! బహుశా అవే గుర్తుండి పోయి ఉంటాయిలే అన్నాను. ఎక్కువ ఆలోచిస్తుంటే అంతే మరీ!!
మొగుడి కబుర్లు కన్నా నీకు కథలే ఎక్కువ ఐపోయాయి అని "తను" అంటూంటే !! మహాప్రభో ఆలోచించేది నా కథకి తగ్గ పేరు కోసం అని సుతారంగా తన బుగ్గని గిల్లుతూ.......
హమ్మయ్య!!!! కధకి పేరు గుర్తొచ్చింది .. ముందు కథకి పేరు పెట్టేసి మిగతా "కబుర్లూ" తరవాత అంటూ.. పక్క రూము లోకి పరుగుతీసాను....
పుస్తకం అందుకుని పేజీ తిప్పీ చూద్దునుకదా నేను ఏ పేరైతే పెట్టాలి అనుకున్నానో అదే పేరు
"""ఎర్రటి పెద్దపెద్ద అక్షరాలతో " ఆత్మ ఘోష " అని రాసివుంది ""...
అంతే భయంతో బిగుసుకుని !!!!శ్రీకర్!!!!! అని అరుస్తూ స్థాణువు లా నిలుచుండి పోయాను....
{ముగింపుని పాఠకుల అభిరుచి మేరకు వదిలేద్దాం అని నిర్ణయించుకున్నాను ..}

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ