Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Love మది మెచ్చిన సఖుడు
#1
మది మెచ్చిన సఖుడు
-    మృదుల

అది ఒక అందమైన చిన్న ఇల్లు చుట్టూ పచ్చని చిన్న చిన్న మొక్కలు...
 
అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని లేలేతకిరణలు.... ఆ ఇంటిలోని ఒక గదిలోకి చొరబడి అక్కడ ఉన్న మంచం పై ముద్దుగా పడుకున్న ఒక అమ్మాయి నగుమోము మీద పడి ..... తన నిద్రకు భంగం కలిగిస్తుంటే... కాస్త కదిలి మళ్ళీ దుప్పటి ముఖం మీదకు లాక్కుని పడుకుంటుంది....
 
అలా పడుకున్న తన మీదకి రెండు చిన్న చిన్న పీచుకలు వచ్చి ముక్కుతో చిన్నగా పొడుస్తుంటాయి నిద్రలేపడనికి అనడానికి సంకేతంగా.... ఆ అమ్మాయి మెల్లిగా కళ్ళు తెరిచి పైకి లేస్తుంది నవ్వుతూ.....
నాన్న అంటుంది...
 
లేచావ చిట్టి తల్లి అంటారు వాళ్ళ నాన్న తన నుదిటిపై ముద్దు పెట్టుకుంటు...
 
హా లేచాను డార్లింగ్ అంటుంది....
 
ఇంతలో వాళ్ల అమ్మ మొదలెట్టారు తండ్రి కూతుర్లు కబుర్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మీరు ఆఫీసుకి అది కాలేజ్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది.. అంటుంది...
 
 
నీకు కుళ్ళు అమ్మ మమ్మల్ని ఇలా చూసి...అంటుంది ఉడికిస్తూ.....
 
ఆ మీ ఇద్దరినీ చూసే కుళ్లు కోవాలి నేను అంటూ మూతి తిప్పుకుంటు వెళ్ళిపోతుంది ......
 
ఆమె వెళ్ళిపోయాక వీళ్లిద్దరూ ఆవిడ చెప్పిన విధానానికి ఒకర్ని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు...
 
 
 
సరే బంగారు... లేచి త్వరగా రెడి అవ్వు రా కాలేజ్కి టైం అవుతుంది... ... కదా అంటారు...
 
హ అవును డార్లింగ్ అంటుంది...
 
తర్వాత ఆయన వెళ్ళిపోతారు...
 
తను వాష్ రూంలోకి వెళ్లి ఫేస్ ఒక్కసారి అద్దంలో చూసుకుని ఫేస్ వాష్ చేసుకుంటుంది....
 
తర్వాత రెడి అయ్యి బైటకి వస్తుంది....
 
అక్కడ ఒక వైట్ చుడిదార్ వేసుకుని... రెడి అవుతుంది...
 
కిందకి వచ్చిన తనని చూసిన ఆనంద్ గారు తన దగ్గరకొచ్చి ఆమె నుదిటి మీద ముద్దుపెట్టుకుని నా బంగారు తల్లి ఈరోజు బాపు బొమ్మల ఉంది అంటారు...
 
మీ అమ్మాయి మీకు రోజు బాపు బొమ్మలనే ఉంటుంది..... అంటారు రేఖ... టిఫిన్ టేబుల్లో మీద సర్దుతూ....
ఇద్దరు నవ్వుకుని అక్కడికి వెళ్లి ఏంటి డార్లింగ్ నాకిక్కడ ఎదో కాలుతున్నట్టు స్మెల్ వస్తోంది ఎవరో బాగా జలస్ ఫీల్ అవుతున్నట్టు అంటుంది... ఏటో... చూస్తూ...
 
రేఖ గారు ఆ అమ్మాయి తలా మీద ఒకటి వేసి వీటికెమీ తక్కువలేదు... తిను అంటూ పూరి ముక్క చేసి నోట్లో పెడుతుంటారు...
 
అలా నవ్వుతూ టిఫిన్ పూర్తి చేసుకుని.... కూర్చుంటారు...
 
అప్పుడే బైటనుంచి ఒక అమ్మాయి నిత్యా ... నిత్యా అంటూ పిలుస్తుంది...
 
డార్లింగ్ శ్వేతా వచ్చినట్టు ఉంది నేను వెళ్తున్న బై... అంటూ బుగ్గ మీద ముద్దిచి బైటకి వచ్చి శ్వేతా బండి ఎక్కుతుంది...
 
శ్వేతతో వెళ్తూ అలా ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్ పడడం వల్ల స్కూటీ ఆపుతుంది...
 
నిత్యా చుట్టూ చూస్తుంది....
 
ఒసేయ్ ఏంటే నువ్వు మనం బీ.టెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నపుడు ఇక్కడ కనిపించిన అబ్బాయికోసం 4 ఇయర్స్గా వెతుకుతున్నావు... ఇప్పుడు మనం బీ.టెక్ ఫైనల్ ఇయర్ తనని మళ్ళీ మళ్ళీ చూడాలని ఆరాటపడుతున్నావు.... తన మీద కవితలు రాస్తున్నావు ... ప్రేమిస్తున్నవా అని అడిగితే ఏమో కాదు తను జస్ట్ కేవలం నాకు క్రష్ మాత్రమే అంటున్నావు అసలు నీ మనసులో అతనిపై ఉన్న ఫీలింగ్ ఎంతో అర్ధం కావట్లేదు అంటుంది శ్వేతా నిత్యని స్కూటీ మిర్రర్లో నుంచి చూస్తు....
 
నిత్యా 4ఇయర్స్ బాక్ కరెక్ట్గా ఈ టైంలో ఎం జరిగిందో గుర్తుతెచ్చుకుంటుంది...
 
అప్పుడే బీ.టెక్ ఫస్ట్ ఇయర్ కావడంతో కాస్త బయంగానే... కాలేజ్ దగ్గరకి వెళ్తుంటారు..... సరిగ్గా అప్పుడే బైక్ హ్యాండ్లింగ్ తప్పి ఒక బైక్ వాళ్ళకి డాష్ ఇస్తారు...
 
ఇద్దరు కిందపడిపోతారు... వీళ్ళు లేచి వాళ్లెం అంటారా అని భయపడి నిత్యా వాళ్ళదగ్గరకి వెళ్లి ... వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలాయేమో అని చూసి... నన్ను క్షమించండి ఎదో కంగారులో డాష్ ఇచ్చాను సారి అంటుంది...
 
ఆ బైక్ అతను హెల్మెట్ పెట్టుకుని ఉండడం వల్ల తనని చూడదు.....
నిత్యా చిన్నపిల్లల ఐస్ క్రీమ్ తింటూ అమ్మకి దొరికిపోతే ఎలా ఎక్స్ప్రెషన్ పెడతారో అలా ఉంటుంది..ఆ వ్యక్తి నిత్యాని అలా చూస్తూ ఉంటాడు..అందమైన కన్నులు ఆ కన్నులకి ఇంకా అందాన్ని పెంచడానికి అన్నట్టు కాటుకతో అలంకరించి ఉన్నాయి.. కొటేరులాంటి ముక్కు .. వాలు జాడ.. పాలుకారే బుగ్గలు... మాట్లాడేటప్పుడు తన మాటకి లయబద్దంగా ఉగే తన చెవికి ఉన్న జుంకాలు... రోజు వెన్న రాస్తుందేమో ఆనడానికి సూచికగా లేలేత గులాబీ రంగులో ఉన్న పెదాలు.. చూడటానికి చాలా అందంగా చిన్నపిల్లల కనిపించే తన హావభవాలు.... తనని అలా చూసి ఆ వ్యక్తి.. పర్లేదు అండి దెబ్బలెం తగలేదు ... మీరూ కాలేజ్కి వెళ్తున్నట్టు ఉన్నారు టైం అవుతుంది వెళ్ళండి.. అంటాడు... అప్పుడు నిత్య రియల్లీ సారి అంటూ అక్కడ ఆ అబ్బాయికి చిన్నగా గీరుకుంటే తన కార్చిఫ్ తీసి తనకి చుట్టి దెబ్బ తగిలితే లేదన్నారెంటండి నిజంగా చూసుకోలేదు సారి అంటుంది ....
 
పర్లేదు మీరు వెళ్ళండి అంటాడు... సరే అని నిత్య కంగారుగా అక్కడనుంచి కాలేజ్కి వెళ్ళిపోతుంది....
 
అక్కడ నిత్యా బుక్స్ ఉండడం చూసి అది ఇచ్చేయాలి ... అని లేచి అక్కడికి దగ్గర్లోనే నిత్యా వెళ్లిన కాలేజ్ ఉండడంతో వెళ్తాడు... అతనికి ఎలా తెల్సు అనుకోకండి అక్కడ దగ్గర్లో ఉన్న కాలేజ్ అదొక్కటే ... నిత్య స్కూటీ పార్క్ చేసి వచ్చేసరికి అతను అక్కడే ఉంటాడు.... మీ బుక్ నిత్య అని ఇచ్చి చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు... నిత్యా వెళ్లిన అతనివైపే చూస్తూ ఉంటుంది...
 
ఇంతలో శ్వేత వచ్చి ఏంటే ఇంత లేట్ అని అడుగుతుంది... నిత్యా జరిగింది అంత చెప్తుంది... చాలా మంచి వాడు లాగా ఉన్నాడు అంది .... సరే అని వాళ్లిద్దరూ క్లాస్కి వెళ్ళిపోతారు...
 
 
కానీ నిత్యకి క్లాస్ లో కూడా అతని నీలి కళ్ళు గుర్తొస్తాయి .... క్లాస్ అయిపోయాక కూర్చుని ఎదో రాస్తున్న నిత్యా దగ్గరకి వచ్చి ఎం రాస్తున్నావె అంత సేపు క్లాస్ అయిపోయాక అంటుంది...
 
 
ఎం లేదు అంటూ లోపలికి పెట్టబోతున్న నిత్యా చేతిలోని పేపర్ తీసుకుని... ఇలా చదువుతుంది...
 
 నీ నీలి కలువల్లాంటి కళ్ళు 
 నా మదిలో అనుక్షణం మెదుళ్తున్నాయి
నన్ను ఎంత మాయ చేసాయి అంటే చెప్పలేనంత 
నిన్ను కలిసిన క్షణం నుంచి నా మనసు నిన్ను చూడటానికి పరితపించేలా ....
నీ ఆ పెద్ద పెద్ద కళ్ళు చూస్తూ ఎన్ని రోజులైనా బతికేయచ్చేమో... 
నా మది నీ ఆలోచనలను వీడను అంటూ మొండి పట్టు పడితే... మెదడు అవి వీడమని మొరపెడుతోంది...
 
 
 చూసింది ఒక్క క్షణమే అయిన నీ రూపు నా మదిలో నిలిచిపోయింది...
 
అది చదివిన శ్వేతా ఎవరికోసం రాసావే అంటుంది అనుమానంగా...
 
ఎవరికోసం కాదే ఎదో అలా రాయాలి అనిపించింది రాసేసాను...
 
హో అవునా నాకెందుకు ఆ అబ్బాయి గురించి రాసావు అనిపిస్తుంది... అంటుంది.... నిజాం చెప్పవే అంటుంది...
 
హా ఆ అబ్బాయి గురించే రాసాను అంటుంది...
 
హ్మ్మ్ లవ్ ఆ అంటే....
 
కాదు జస్ట్ క్రష్ అంటుంది ..
 
అలా వాళ్ళు కాలేజ్కి వెళ్లడం నిత్య ఆ వ్యక్తి గురించి ఆలోచించడంలో రోజులన్నీ గడిపేస్తుంటారు...
 
నిత్య ఆలోచనలన్నీ చేరిపేస్తూ... కాలేజ్ వచ్చింది...
 
నిత్య కాలేజిలో చివరి రోజు అవ్వడంతో... అందరితో బాగా ఎంజాయ్ చేస్తుంది మధ్యలో ఒక చోట కూర్చుని ఎదో రాసి అది బాగ్లో పెట్టేసుకుంది...
 
తర్వాత శ్వేతా వచ్చి ఒసేయ్ నీ క్రష్ గోల పక్కన పెట్టవే లాస్ట్డేడా ఎంజాయ్ చేద్దాం అంటుంది...
 
నిత్య కూడా వాళ్ళతో కలిసి ఫుల్ అల్లరి చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది...
 
తర్వాత వాళ్ళు నిత్యా ఇంటికి వచ్చేస్తుంది ఆనంద్గారు సోఫాలో కూర్చుని ఉంటారు... నిత్యా ఇంట్లోకి వస్తు వస్తూనే ఆనంద్గారి పక్కన కూర్చుంటుంది...
 
హై బంగారు... ఈరోజు అయిన కనిపించాడ నీ క్రష్ అంటారు నిత్యా చెవిలో చిన్నగా లేదు నాన్న అంటుంది...
 
హ్మ్మ్ సర్లేయ్ తను కనిపించాక తనకి సారి చెప్పు అంటారు...
 
అలాగే నాన్న అంటుంది తర్వాత నిత్యా ఎం.టెక్ జాయిన్ అవుతుంది శ్వేతా కూడా నిత్యా జాయిన్ అయిన కాలేజ్లొనే జాయిన్ అవుతుంది...
 
వాళ్లిద్దరూ మొదటి రోజు క్లాస్కి వెళ్లి కూర్చుంటారు... అప్పుడే అటెండర్ వచ్చి ప్రిన్సిపల్ సర్ వస్తున్నారు అని చెప్పి వెళ్లిపోతాడు.. అందరూ ప్రిన్సిపాల్ వస్తున్నారు అని సైలెంట్గా ఉంటారు... అంతలో ప్రిన్సిపాల్ రూంలోకి వస్తారు ... నిత్యకి ఎదో అలజడిగా అనిపించి చుట్టూ చూస్తుంది అప్పుడే తన పక్కన అమ్మాయిలు ... అబ్బా ఎమున్నారే మన ప్రిన్సిపాల్ సర్ చూడటానికి నవమన్మధుడులగా ఈయన కోసమైనా నేను రోజు కాలేజ్కి వస్తాను అంటుంది...

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
2

అది విన్న నిత్య నవ్వుకుని... ప్రిన్సిపాల్ వైపు చూస్తుంది..... వాళ్ళు చెప్పింది నిజమే ప్రిన్సిపాల్ చాలా బావున్నారు... కానీ నిత్యా ఫస్ట్ షాక్ అయ్యింది ఎందుకంటే అక్కడుంది ఎవరో కాదు రోడ్ మీద నిత్యా డాష్ ఇచ్చిన అబ్బాయి...

 

 

నిత్యా నోరు తెరుచుకుని చూస్తూ ఉంది...

 

పక్కన శ్వేతా కదిలిస్తే అప్పుడు మాములుగా కూర్చుని వింటోంది ఆయన చెప్పేది... ఆ అబ్బాయి ఇలా చెప్తున్నాడు...

 

హై స్టూడెంట్స్ థిస్ ఐస్ యువర్ ప్రిన్సిపాల్ లికిద్ కృష్ణ మీకు ఎలాంటి ప్రోబ్లేమ్స్ వచ్చిన ఎవరైనా మిమ్మల్ని రాగ్గింగ్ అనే పేరుతో ఇబ్బందిపెట్టిన నాకు కంప్లైంట్ చెయ్యండి రాగింగ్ చెయ్యండి పర్లేదు కానీ అది అందర్నీ నవ్వించేలా ఉండాలి కానీ ఒకళ్ళని నవ్వుల పాలు చేసి మనం నవ్వుకునేల ఉండకుండదు... అల్ ద బెస్ట్ .... వి విల్ గివ్ యు ఔర్ బెస్ట్ అని ముగించి వెళ్ళిపోతారు .....

 

నిత్యా లికిద్ చెప్తున్నంతసేపు తననే చూస్తూ ఉంది...

 

అతని మేము పై ఆ చెరగని చిరునవ్వు చూస్తూ కూర్చుంది....

 

ఆయన వెళ్లిపోగానే శ్వేతా నిత్యా వైపు చూసింది కానీ నిత్యా మాత్రం ఆయన వెళ్లినవైపు చూస్తూ ఉండిపోయింది.... శ్వేతా నిత్యాని కదిపి ఏమైంది అంటే... మన ప్రిన్సిపాల్ సర్కేనే నేను డాష్ ఇచ్చింది అంటూ కళ్ళలో లైట్స్ వేసుకుని...

 

అది చూసిన శ్వేత ఎందుకే అంత ఎక్సైట్ అవుతున్నావు అంటుంది...

 

చెప్పానుగా ఆయన నా క్రష్ అని అంటుంది... ఈలోపు పక్కన ఇందాక మాట్లాడుకున్న అమ్మాయిలు... అబ్బా సర్ అంటే ఎవరైనా నమ్ముతారా అసలు ఆయన్ని చూస్తే నాకు అసలు సార్లానే అనిపించలేదు... ఎం.టెక్ ఫైనల్ ఇయర్ అబ్బాయిల వున్నారు అంటూ... మాట్లాడుకుంటారు...

 

నిత్యా అవి వినలేకబైటికి వస్తుంది అలా వస్తూ చూసుకోకుండా లికిద్కి డాష్ ఇస్తుంది... వెంటనే వెనక్కి వచ్చి సొరి సర్ అంటుంది...

 

పర్లేదు నిత్య అంటాడు...

 

ఇప్పటికి తన పేరు గుర్తున్నందుకు చాలా సంతోషపడుతుంది...

 

సరే నిత్యా నేను వెళ్ళాలి అని ఆయన వెళ్ళిపోతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి... నిత్యా రోజుకి ఒకసారి అయిన కృష్ణని చూడకుండా వుండలేకపోతుంది... అందుకే సండే రోజు లికిద్ ఉన్న ఫొట చూసుకుంటుంది...

 

అలా అలా ఎం.టెక్ ఎండింగ్కి వచ్చేసారు...

 

ఎం.టెక్ అయిపోయింది నిత్యది ఇప్పుడు తను లికిద్ని చూడలేను అని చాలా బాధపడుతుండేది... అలా రోజులు గడుస్తున్నాయి...

 

 

ఒకరోజు నిత్యవాళ్ళ నాన్న వచ్చి ఆమ్మ నిత్య మీ అత్తయ్య వాళ్ళు నిన్ను తన ఇంటికి కోడలిగా చేసుకోవాలని ఆశపడుతున్నారమ్మ....నీకు కూడా చిన్నప్పటినుంచి మీ బావ అంటే ఇష్టం అని నిన్ను అడగాకుండా మేము పెళ్లి ఏర్పట్లు చేసాము అంటారు....

 

నిత్యా గుండెల్లో పిడుగు పడ్డట్టు అయింది... తన తండ్రి ఆనందాన్ని చూసి ఇంకేం మాట్లాడలేపోకయింది..... కానీ తను పెళ్లి కొడుకుని మాత్రం చూడలేదు... ఒకరోజు నిత్యా వాళ్ళ అత్తగారు వచ్చారు రావడం రావడంతోనే అత్త ఇన్ని రోజుల తర్వాత వచ్చేది అంటూ బుంగమూతి పెట్టుకుంటుంది... నిత్యా

 

సారి అమ్ము అందుకే నిన్ను ఇంకెప్పుడు వైట్ చేయించనీకుండా మా ఇంటికి తీసుకెళ్తున్న కోడలిగా అంటుంది...

 

 

నిత్యకి పెళ్లి ఆనంగానే మళ్ళీ లికిద్ గుర్తొస్తాడు ..

అలా రోజులు గడుస్తున్నాయి .. నిత్యా పెళ్లి రోజు దగ్గరకి వచ్చింది పనులన్నీ వేగం పుంజుకున్నాయి .... టైం ఎక్కువ లేదు అని డైరెక్ట్ ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్లి చేస్తున్నారు..

అలా ఆ బాధతోనే నిత్యా పెళ్లి అయిపోతుంది... అప్పటికి కూడా పెళ్లి కొడుకుని చూడదు ..

 

తర్వాత అన్ని కార్యక్రమాలు ఒక మరబొమ్మల చేస్తూ ఉంటుంది...

ఆ రోజు రాత్రికె కార్యం అవ్వడం వల్ల నిత్యాని ఆ అబ్బాయిని వేరు వేరు గదుల్లోకి పంపించారు...

 

నిత్యా తన గదిలోకి వెళ్లి చాలా సేపు ఏడుస్తూ అలానే నిద్రలోకి జారుకుంది తర్వాత సాయంత్రానికి ఎవరో వచ్చి తలుపు తట్టడంతో మొఖం కడుకొచ్చి తలుపు తెరిచింది...

 

వాళ్ళు వచ్చి కార్యం కోసం నిత్యాని రెడి చేస్తున్నారు నిత్యకి చాలా బాధగా ఉంటుంది కానీ తల పైకెత్తదు... అందరూ అమ్మాయి సిగ్గుపడుతుందేమో అనుకుంటారు.. తర్వాత వాళ్లిద్దరి చేత ఉంగరాలట పులబంతి ఆట ఆడిపిస్తారు...

 

తర్వాత నిత్యాని గదిలోకి పంపించి అందరూ వెళ్ళిపోతారు.. నిత్యకి ఏడుపు తన్నుకొస్తుంది...ఏవండి శ్రీమతి గారు ఇప్పటికైనా మీ దర్శన భాగ్యం మాకు కలిగిస్తారా అంటాడు ఆ వ్యక్తి...

 

 

ఆ వాయిస్ బట్టి వెంటనే తన ఎట్టి ఎదురుగా ఉన్న లికిధ్ ని చూడగానే నిజమా కాదా అని కళ్ళు నులుపుకుంటుంది... నులుపుకున్నది చాలు నువు చూసింది నిజమేలే అంటాడు...అమాంతం వెళ్లి కౌగిలించుకుని ముద్దులతో ముంచేస్తుంది... వెంటనే వెనక్కి జరిగి...అసలు అసలు మీకు ఈ పెళ్లి ఇష్టమేనా... అయిన మా బావతో అక్కడ నా పెళ్లి జరిగింది మరి మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటుంది అమాయకంగా...

 

ఆ సంతలో కూరగాయలు అమ్ముకోడానికి అంటాడు వెటకారంగా....

 

జోక్ కాదు సర్ సీరియస్ అంటుంది... నిత్యాని తన మీదకు లాక్కుంది కూర్చోపెట్టుకుంటు ఒసేయ్ మొద్దు నీకు ఇంకా అర్ధం కాలేదా నేనే నీ బావనే... నిన్నుఆ రోజు డాష్ ఇచ్చిన రోజు చూసిప్పుడే నీ కళ్ళు నన్ను కట్టిపడేసాయి...

 

తర్వాత అదే రోజున అనుకోకుండా మీ క్లాస్ వైపు వచ్చిన నాకు...

నువ్వు శ్వేతతో మాట్లాడింది విన్నాను ఆ కవిత నాకోసం రాసాను అన్నావు అప్పుడే నీ మెడలో ముడుముల్లు వేసి నా దాన్ని చేసుకోవాలి అనిపించింది... నా మదిలో ఎలాంటి భావాలు ఉన్నాయో నీకు అలాంటి భావాలే కలిగాయి...

 

తర్వాత నువ్వు నాకోసం రోజు ఆ ట్రాఫిక్ సిగ్నల్ పడే ఆరాటం చూసి ... నన్ను ఎంత ప్రేమిస్తున్నవు అనేది అర్ధం అయింది...

 

తర్వాత నిన్ను మా కాలేజ్లో చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను...నువేమో అన్ని మర్చిపోయినన్ను చూస్తూ కూర్చునావు నేను అలా చూస్తూ ఉంటే ఇంకేమైనా ఉందా బాబోయి నువ్వు నా చేత ఏడూ చెరువుల నీళ్లు తాగించెయ్యవు... పైగా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్న అందుకే మమయ్యకి కూడా చెప్పద్దు అని చెప్పి.... ఇలా చేసాను అంటాడు తన మెడ మీద ముద్దు పెడుతూ.. నిత్యకి కళ్లలోంచి నీళ్లొచ్చేస్తాయి... తను ప్రేమించినవాడే తన జీవిత భాగస్వామి అవ్వడం ఇంకా అసలు తను కోరుకున్నది దొరకదు అనుకున్నది దొరికినందుకు తనపై తన బావకి ఉన్న ప్రేమ ... ఓయ్ పిచ్చి ఇప్పుడు ఏడుస్తూ ఎనర్జీ మొత్తం వాడేస్తే .... మా అమ్మవాళ్ళకి మనవడిని మనవరాళ్ళని ఎవరిస్తారు.. అంటూ తనని అల్లుకుపోతాడు...

 

అలా ఆరాత్రి ప్రకృతి వడిలో విశ్రాంతి తీస్కున్నట్టు హాయిగా ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరతారు...

 
శుభం

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#3
కథ చాల బాగుంది clps
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)