06-11-2022, 06:23 PM
సన్(డే) స్ట్రోక్
కె.కె.భాగ్యశ్రీ
“ఆదివారం వస్తోందంటే ఒంట్లో ఏదో అయిపోతోంది నాన్నా…’’ వానకి తడిసిన కుక్కపిల్లలా సోఫాలో దగ్గరగా ముడుచుక్కూర్చున్న మహిమ అంది ఏడుపుగొంతుతో.
“అవున్నాన్నా… నాకూ అదోలా ఉంది. గుండె గుభిల్లుమంటోంది.’’ బావురుమనడం ఒక్కటే మిగిలింది మనోజ్ కి.
“ నిండా ఇరవైఏళ్లు లేకుండా మీరే ఇలా అయిపోతున్నారంటే పాతికేళ్లుగా ఈ ఆదివారాన్ని ‘వరం’ గా పొంది నేనెన్ని ఇక్కట్లు పడుతున్నానో మీరే అలోచించండి.’’ కొడుకు, కూతురు చూపించిన భావాలన్నింటినీ ఏకకాలంలో మూకుమ్మడిగా తన ముఖ కవళికల్లోనూ, దీనంగా ధ్వనిస్తున్న స్వరంలోనూ ప్రకటిస్తూ అన్నాడు సౌమిత్రి.
“ నాకు అంత ప్రాబ్లం లేదు డాడీ… కంబైండ్ స్టడీస్ అని చెప్పి ఏఫ్రెండ్ దగ్గరకో చెక్కేస్తా… పాపం మీ ఇద్దరి సంగతి తలచుకుంటేనే…’’ జాలి తన ముఖంలో ప్రస్ఫుటింపజేశాడు మనోజ్.
“ హలో… అంతలేదు బాబూ! మధ్యాహ్నంవేళకి నువ్వు ఎస్కేప్ అయినా రాత్రికి మాత్రం దొరికిపోవడం ఖాయం. అంతకన్నా వేడివేడిగా మధ్యాహ్నమే నయం కదూ!’’ మహిమ అంది అంత బాధలోనూ హేళనగా నవ్వుతూ.
“మీరు పిల్లలు కాబట్టి జంప్ అయిపోయినా ఎస్క్యూజ్ ఉంటుంది. నాకలాకాదే!’’ లబోదిబోమన్నాడు సౌమిత్రి.
“మందుల కంపెనీలు వాళ్లు తయారుచేసిన డ్రగ్స్ ని ఎలకలమీద, కుందేళ్ల మీద ప్రయోగిస్తే అవెలా తట్టుకుంటాయో అనుకునేవాడిని. కాని, ఇప్పుడు వాటికన్నా అన్యాయం అయిపోయింది కదా మనబతుకూ!’’ ఆక్రోశించాడు మనోజ్.
“సర్లెండి… ప్రతిఆదివారం వచ్చేముందు మనింట్లో ఈ చర్చ సాగడం పరిపాటే కాని, తప్పించుకునే మార్గం ఆలోచించండి నాన్నా…’’ దిగులుగా అంది మహిమ.
“ అదే సాధ్యమైతే… ఇన్నాళ్లపాటు ఎదురుచూడ్డం దేనికి? మీదాకా రానివ్వకుండా ఎప్పుడో క్యాన్సిల్ చేసి ఉండేవాడిని…’’ తన నిస్సహాయతని వ్యక్తపరిచాడు సౌమిత్రి.
తండ్రీ పిల్లలూ ఎంతగా బద్దలు కొట్టుకున్న ఆదివారం రాబోయే ఉపద్రవాన్ని ఎలా అడ్డుకోవాలో తట్టలేదు. వాళ్లు ఇంతగా అల్లాడిపోతున్నారంటే… అందుకు కారణం… ఆదివారంనాడు తన చండప్రచండ ప్రతాపంతో విజృంభించే సూర్యభగవానుడు వీరిని తాపానికి గురిచేశాడనుకునేరు. ఎంతమాత్రం కాదు… తినబోతూ రుచెందుకు! మీరే అవలోకించండి.
“భగవాన్… ఎలాగైనా ఈ గండంనుంచి మమ్మల్ని గట్టెక్కించు తండ్రీ…’’ ఆకాశం పక్క చూస్తూ మొరపెట్టుకున్నారు ముగ్గురూ ముక్తకంఠంతో.
“ఏమిటీ… ఏదో ప్రార్ధనలు చేస్తున్నట్లున్నారు?’’ అప్పుడే రైతు బజార్ నుంచి తాజా కూరగాయలను మోసుకుని ఇంట్లోకి ప్రవేశించిన శ్యామల అంది అనుమానంగా వీళ్ళనే చూస్తూ.
“హబ్బే! ఏంలేదు శ్యామూ… మొన్న సెమిస్టర్ లో మనూగాడిది ఓ సబ్జెక్ట్ ఉండిపోయింది కదా! అది కాస్తా ప్యాసైపోతే నడిచి ఏడుకొండలూ ఎక్కుతానని మొక్కుకుంటున్నా…’’ గభాలున కవర్ చేశాడు సౌమిత్రి.
“అంతేనా! నాకు వ్యతిరేకంగా ఏదన్నా కుట్ర పన్నుతున్నారేమోననీ…’’ ఫాన్ దగ్గర కూలబడి నుదుటపట్టిన చమటలను చీరకొంగుతో తుడుచుకుంది శ్యామల.
“ఎంతమాటన్నావు శ్యామూ… నువ్విలా సందేహించాక నేను బతికిఉండడం వేస్ట్…’’ ఆవేదనగా తల పట్టుకున్నాడు సౌమిత్రి నాటకీయంగా.
“ చేసిన ఓవర్ యాక్షన్ చాలుగాని, మీరు పిల్లలు కలిసి తెచ్చిన కూరగాయలను శుభ్రంగా కడిగి ఫ్రిజ్ లో పెట్టండి. అలాగే ఆసరుకులు కూడా సర్దేయండి…’’ పురమాయించేసి బాత్ రూమ్ లోకి వెళ్లింది శ్యామల.
సౌమిత్రి , సంతానం ఆ సంచీలకేసి బితుగ్గా చూశారు. మరునాడు జరగబోయే యుధ్ధానికి తమమీదకు సన్నధ్ధమై వస్తున్న శత్రుసైన్యంలా కనిపించాయి ఆ చేతిసంచీలు. నవనవలాడుతున్న ఆకూరగాయలు తమమీదకి ఎక్కుపెట్టిన అస్త్రశస్త్రాల్లాగా అనిపించాయి. సంచీనిండా కిటకిటలాడుతున్న ఆ వంటసరుకులు పేలడానికి సిధ్ధంగా ఉన్న అణుబాంబుల్లా దర్శనమిచ్చాయి.
శ్యామల బయటకొస్తే ‘’ ఇంకా సర్దడం పూర్తికాలేదా?’’ అంటూ తమమీద విర్చుకుపడుతుందన్న భయంతో తండ్రీపిల్లలూ కలిసి గబగబ వాటిని సర్దేశారు.
వారందరూ ఆదివారమంటే అంతగా భీతిల్లుతున్నారంటే దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. బీభత్సమైన ఆగతంలోకి గుండ్రాలు తిప్పుకుంటూ వెళ్తే యుధ్ధంలో తనను రక్షించిన ముద్దుల భార్య కైకేయికి దశరధుడిచ్చిన వరంలాంటి వరం ఒకటి మనకు తారసపడుతుంది.
-------------------- ------------------------------ -----------------
“మీశ్యామల నాకు బాగా నచ్చేసిందండీ… కట్నకానుకల మీద నాకు మోజులేదు. మావాళ్లకి నేనెంతచెప్తే అంత! మంచిరోజు చూసి ముహూర్తాలు పెట్టించండి.’’ నాజూగ్గా తీగలాఉన్న శ్యామల మీదనుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాడు సౌమిత్రి.
శ్యామల తండ్రి ముఖం చింకిచాటంతైంది. ఇన్నేళ్లూ చెప్పులరిగేలా తిరిగిన తన శ్రమకి తగిన ఫలితం సౌమిత్రి రూపంలో తనను వెతుక్కుంటూ వచ్చిందన్నసంబరం అతడిఅంగాంగాలా వెల్లివిరుస్తోంది.
“కాని, బాబూ!’’ శ్యామల తల్లి సంశయంగా ఏదో చెప్పబోయింది.
శ్యామలతండ్రి ఆమెమాటలకి అడ్డుతగులుతూ…”అబ్బబ్బ…ఇంకా కానీలు, అర్ధణాలూ ఏమిటే? శుభస్యశీఘ్రం. ఆలస్యం అమృతంవిషం…’’ అంటూ ఏవేవో చెబుతూ ఆమెను మాట్లాడకుండా చేసిన సంగతి శ్యామల నచ్చిన మైకంలో ఉన్న సౌమిత్రి గమనించనేలేదు.
అలా గమనించకపోవడం వలన జీవితంలో తానెంత పెద్దప్రమాదంలో పడనున్నాడో పసిగట్టే అవకాశం మిస్సైన మిస్సైల్లా తప్పిపోయింది.
ఆనాటి అత్తగారి “కానీ, బాబూ’ అన్న అర్ధోక్తికి అర్ధం పెళ్లైన తరువాత కాని బోధపడలేదుఅతగాడికి.
శ్యామలకి వంటల్లో ప్రయోగాలు చేయడమన్నా, కొత్తవంటలు కనిపెట్టి, వాటిని అందరిచేతా తినిపించడమన్నా మహా మోజు అన్న సంగతి తెలిసింది సౌమిత్రికి.
“పోనీలే… చాలామంది పెళ్లాలు వంటచేయకుండా మొగుడిని ఏడిపించుకు తింటారు. శ్యామలలా వంటపట్ల ఆసక్తి ఉన్న వాళ్లెవరు ఉన్నారీరోజుల్లో! ఎంచక్కా హోటల్ కెళ్లి డబ్బు తగలేసే అగత్యం లేకుండా అన్ని రకాల వంటలను ఇంట్లోనే రుచిచూడచ్చు…’’ స్వతహాగా భోజన ప్రియుడైన సౌమిత్రి ఆత్రంగా లొట్టలేశాడు.
కాని, అదెంత కష్టమో, అనుభవం మీద కాని తెలిసిరాలేదతడికి. శ్యామల చేసే సరికొత్తవంటలను తినలేకా, ఆమె పాకశాస్త్రంలో చేసే కొంగ్రొత్త ప్రయోగాలను భరించలేకా అల్లడిపోయింది సౌమిత్రి బక్కప్రాణం. శ్యామలలో పొంగిపొరలే ఉత్సాహానికి ఆనకట్ట వేయలేక అల్లాడాడు సౌమిత్రి బల్లినోటికి చిక్కిన పురుగులా.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ