Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Inspiration రామాపురం రహస్యం
#1
"రామాపురం రహస్యం"
( అమోఘమైన కథ)
- నల్లబాటి రాఘవేంద్రరావు
 
అది రామాపురం గ్రామీణ వాతావరణం. అదే శంకరయ్యగారి ఇల్లు.
లావుపాటి ఏనుగు స్తంభాలు... ఆ స్తంభాలు చుట్టూరా అందమైన నగిషీ పని... దానిమీద పంచరంగుల మెరుపులు. అతిపెద్ద నగిషీ టేకు కలప సింహద్వారం... దానికి ఇరుపక్కల పెద్ద కిటికీలు. పైన వాడపల్లి పెంకుల ఇంటి కప్పు... ఆ పెంకుల మీద అందంగా తెల్లసున్నం తో దిష్టి చారలు.
 
ఇంటికి అటు ఇటు ఎదుట... కాపుకొచ్చిన కొబ్బరిచెట్లు.... ఆ పల్లె వాతావరణం చాలా కాలం బ్రతికి ఆనందంగా ఉండాలి అని మన సుకు అనిపిస్తుంది.
అయితే ఆ ఇంటి పెద్దావిడ... సూర్యకాంతమ్మ గారు మాత్రం ఆనందంగాలేదు. సంవత్సరం నుండి ఆమె కోమా స్థితిలో కొట్టు మిట్టాడు తుంది . ఆమె కొడుకు శంకరయ్య సిటీలో పెద్ద డాక్టర్ గారికి చూపించిన తర్వాత ఆమెను ఇంటి దగ్గర ఉంచి వైద్యం చేయిస్తున్నాడ
సంక్రాంతి పండుగ వచ్చింది.
సూర్యకాంతమ్మ గారి మనవళ్ళు, మనవరాళ్లు పండుగకు వచ్చారు. ముఖ్యంగా అమెరికా నుండి మూడవ మనవడు..రాంపండు నాలు గేళ్ల తర్వాత మొదటగా ఇప్పుడే వచ్చాడు అందరితో పండుగ ఆనందంగా గడపడానికి అని కాకుండా కోమాలో కొట్టు మిట్టాడుతున్న తన నానమ్మను చూడాలి అన్న ప్రేమతో.....
ముఖ్యంగ వచ్చాడు.
సంక్రాంతి పండుగ రోజు తెల్లవారి నుండి వీధిలో కోలాహలం మొదలైపోయింది .
" శ్రీమద్రమారమణ గోవిందో హరి.. రావమ్మా మహాలక్ష్మీ రావమ్మ రావమ్మా మహాలక్ష్మి రావమ్మా..."అంటూ హరిదాసు వీధిలో నుండి పాట పాడుకుంటూ వెళ్తున్నాడు.
"నానమ్మ చూడవే.. అడిగోనే హరిదాసు ఎంతో అందంగా తయారై మెడలో దండ , చేతిలో చిడ తలు, నెత్తి మీద రంగురంగుల కుచ్చు టోపీ... ప్రతి గుమ్మం దగ్గర కూర్చుంటూ.... బియ్యం వేయించుకుంటున్నాడు. కలశపాత్రతో గుమ్మం దగ్గర కూర్చుంటూ డబ్బులు కూడా వేయించు కుంటున్నాడు..అబ్బా చూడవేనానమ్మ".....
అంటూ ఆమెకు హరిదాసు ని చూపించే ప్రయ త్నం చేశాడు అమెరికా నుండి వచ్చిన మూడవ మనవడు రాంపండు.
" అమ్మ.. తల్లి .. లక్ష్మక్క.. సుబ్బాయమ్మక్క.. పడిపోతున్నానమ్మోయ్ పప్పుదాక లో పడిపోతున్నానమ్మో.."...కొమ్మదాసరి వీధిలో హడావుడి చేస్తూ వెళ్తున్నాడు.
" అబ్బా..చూడవే అడుగోనే మన కొమ్మదాసరి. వచ్చేసాడు వచ్చేసాడు వచ్చేసాడు...నెత్తిన కుచ్చు టోపితో చేతిలో చిన్న జూకతో వచ్చే సాడు... మన వీధి పిల్లలంతా అతను చుట్టూనే తిరుగుతున్నారు చూడవే..! నానమ్మ.. కళ్ళు తెరిచే ఉన్నాయి... అయినానవ్వవు... మాట్లా డవు..గిల్లిన కదలవు.. చీమ కుట్టిన నీకు తెలి యదు..ఏమిటే నానమ్మ నీకు ఈ పరిస్థితి
డాక్టర్ ఇది.. "కోమా స్థితి" అన్నాడు.. అయితే మాత్రం ఈ మనవడి కోసం ఒక్క మాట మాట్లా డలేవా..?సరే..ఎన్నాళ్ళు ఇలా పడి ఉంటా వు??"...తన నానమ్మ సూర్యకాంతమ్మ గారిని కదిలించి ఆ విశేషాలు చూపించాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు..రాంపండు.
"హరహర మహాదేవ శంభోశంకర.. హరహర మహాదేవ శంభోశంకర...." జంగందేవర పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ శంఖం ఊదు కుంటూ వీధిలో వెళ్తున్నాడు.
" ఇలా చూడవే.. అడుగో జంగందేవర!! మన ఊరి వాడే.. సుబ్బయ్యదేవర! భలే భలే మేకప్! చేతిలో పెద్దగంట మోతతో సూపర్గా ఉన్నాడు. ఈ కిటికీ దగ్గర నీకు ఈ ప్రత్యేక మంచం వేసి ఈ పండగ పూట వచ్చే వీళ్ళందర్నీ... నువ్వు కళ్ళారా గతంలో లాగే.. చూసి ఆనందించేలా
.....తెగ సంతోషపడేలా.. నీ మనసు ఆనం దంతో గతంలోలాగే...ఊగిపోయేలా ఏర్పాటు చేశాను కదా! చూడవే చూడవే నానమ్మ అందరూ వచ్చేశారు.. కొంచెం నవ్వవే.. ఒక్క మాట మాట్లాడవే..."
రాంపండు శతవిధాల ప్రయత్ని స్తున్నాడు.. తన నానమ్మను కోమాలోంచి లేపి మంచం మీద కూర్చోబెట్టి ఆ సంక్రాంతి విశేషా లన్నీ చూపించా లని.. తెగ ఆరాటపడుతూ ప్రయత్నిస్తున్నాడు.
...అయినా కొంచెం ఫలితం కూడా కనిపించటం లేదు.
" అంబ పలుకు జగదాంబ పలుకు.. అమ్మ పలుకుగూట్లో చిలకమ్మ పలుకు .. గోదాట్లో చేపమ్మ పలుకు.... అంబ పలుకు జగదాంబ పలుకు" బుడబుక్కల వేషధారి రంగురంగుల బట్టలు ధరించి తన చేతి డమరుకం తో పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ వీధి గుండా.
" హమ్మయ్య.. మన బుడబుక్కల నరసయ్య..
ఇతను కూడా వచ్చేసాడు. పెద్ద తలపాగా, భయంకరమైన మూతి మీసాలు, డమరుకం, అమ్మో... చొక్కా మీద చొక్కా... దానిమీద ఇంకో చొక్కా... దాని మీద మరో చొక్కా... ఎన్ని బట్టలు వేసేసుకున్నాడో...!!! నీ పాత చీర ఇచ్చేస్తాను. మొలకు చుట్టుకొంటాడు. ఊరంతా సందడి.. నానమ్మ కొంచెం చూసి నవ్వవే....
నానమ్మ .....ఊరంతా సంక్రాంతి సందడి. ఆనందం... పిల్లల సరదా ఆటలు.. పెద్దల కొత్తబట్టలు.. అమలక్కల ముగ్గులు హడావుడి లు... అబ్బా అబ్బా.. నీకు ఇవి అన్ని చాలా ఇష్టం కదా... పోని.. మాట్లాడక పోయినా పర్వాలేదు ఒక్క చిన్ని బుల్లి నవ్వు నవ్వు!!! చూడవే... అటు చూసి నవ్వు"...
అబ్బే అబ్బే... రాంపండు శతవిధాల కాదు సహస్ర శతవిధాల ప్రయత్నించిన... గెలవ లేకపోతున్నాడు.
" అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు తల్లి.. సౌభాగ్యలహరి... నీకు 12 మంది పిల్లలు పుడతారు అమ్మ.. ఒకడు కలకటేరు, రెండో వాడు సినీ యాక్టర్,
మూడోవాడుపెధాన మంత్రి....... మిగిలిన అందరూ రాజులు.. రారాజులు తారా జువ్వలు .....అమ్మ...అమ్మాయి మా గోవిం దమ్మ నీ కొడుక్కి బెంగుళూరులో ఉద్యోగం వస్తది అమ్మ... నేను వచ్చినప్పుడు... వచ్చే ఏడు... బంగారపు గొలుసు పెట్టాలమ్మ... సరేనా..."...అది గంగిరెద్దుల వాని హడావుడి.
" చూడవే గంగిరెద్దుల వాడు నానమ్మ... ఎంతో ముచ్చటగా బోరా ఊదుతూ... తన ఎద్దు ని ఆడిస్తున్నాడు... అది కూర్చుని దండంపెడుతూ చుట్టూ తిరుగుతూ డాన్సు కడుతుంది..... నానమ్మ నువ్వు లేగకపోతే... నేనిక్కడ ఉండను
.. మళ్లీ అమెరికా వెళ్ళిపోతాను. నీ గురించే పని గట్టుకు వచ్చాను కదా... చూస్తావు కానీ నవ్వురాదు.. మాట్లాడవు అరిగో.... నక్కల వాళ్ళు కూడా వచ్చేసారు.. ఇదిగో కోతిని ఆడిం చుకుంటూ మన ఊరు రాములమ్మ... ఇంకా మన ఊరి రామాలయం దగ్గర... చెక్కభజన కూడా మొదలైపోయింది నానమ్మ... నీకు ఈ పెద్ద కిటికీలోనుంచి చూస్తే అన్నీ బాగా కని పిస్తాయి .అందరూ బాగా కనపడతారు.... నువ్వు అసలు తలతిప్పవు,చిన్న నవ్వు నవ్వి...చూడవు, బుల్లి మాట మాట్లాడవు
. .నాకు ఏడుపు వచ్చేస్తుందే నానమ్మ..?''''
''ఆ.. అదన్నమాట విషయం నాకు అర్థమైం దిలే ...నువ్వు నవ్వేసిన, మాట్లాడేసిన... నీకు ఆరోగ్యం కుదుటపడి..... బాగానే ఉన్నావ్ అని.. నేను నీ దగ్గర ఉండకుండా ఈ రోజే అమెరికా వెళ్ళిపోతానని... నువ్వు నవ్వ కుండా... నాటకం ఆడుతున్నావు కదా... అర్థ మైంది నానమ్మ ..నిజమే కదా. ఛీ...నేను ఎంత గింజుకున్నా.. కొంచెం కూడా నీకు నా మీద అభిమానం లేదా..?''
రాంపండు చాలా బాధపడుతూ నాన్నమ్మ కాళ్ళు నొక్కుతూ... తలకు మందురాస్తూ.. అక్కడే కూర్చుండిపోయాడు...నీరసంగా నిస్సత్తువగా తర్వాత ఏం చేయాలో అర్థం కాక.
********. ********
కాసేపటికి...
వీధిలో నుండి అప్పుడే రాంపండు తండ్రి శంక రయ్య వచ్చాడు
" ఒరేయ్ రాంపండు.. ఎందుకురా మీ నానమ్మ ను అలా బాధ పెడతావు.?? కోమాలో ఏడాది నుండి అది కొట్టుకుంటుంది.. మన మురళి డాక్టర్ గారు.. ఇన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తు న్నారు.... కాకినాడ లో పెద్ద డాక్టర్ గారు.... ఇక ఇంటి దగ్గరే ఉంచండి అన్నాడు కదా.... అందు కనే మురళి డాక్టర్ గారు చేతిలో పెట్టి రోజు జాగ్రత్తగా చూస్తున్నాము.... ఆయన ఈ రోజు ఏమన్నాడు.. నీకు తెలుసు కదా ఈ రాత్రికి కానీ రేపు రాత్రికి కానీ... అది బాల్చి తన్నే యడం ఖాయమని చెప్పారు కదా...!నువ్వు విన్నావు కదా.. మా అమ్మ ఈ పండుగ రోజుల్లో చచ్చిపోతే చాలా మంచిదని నేను చూస్తున్నాను రా...... స్వర్గం హాయిగా చేరి పోతుంది... 90 ఏళ్ళు బ్రతికింది... చాలా పుణ్యాత్మురాలు రా.. బ్రతకడం ఇక చాలా కష్టమని నాకు అని పిస్తుంది రా... అయినా అన్ని ఏళ్ళు మనం బ్రతకలేము అదే ఆవిడ చేసుకున్న పుణ్యం.
అదృష్టవంతురాలు... ఇక ఆశలేదు రా... నీ పని చూసుకో..."
అంటూ రాంపండు తండ్రి శంకరయ్య తన నానమ్మ ను చూసి బాధ పడుతున్న తన కొడు కుని సముదాయిస్తూ ఓదారుస్తున్నట్టు మాట్లా డాడు.
" అదేంటి నాన్నా... నా ప్రయత్నం నన్ను చెయ్యి నియ్యి.... ఎంత డాక్టర్ అయితే మాత్రం ప్రాణం పొయ్యగలడు కానీ..... ప్రాణం పోయే సమయం ఖచ్చితంగా చెప్పలేడు.. కోమాలో పదిహేనేళ్లు ఉన్నవాళ్లు బ్రతికి బట్ట కట్టారని చాలా కథలు విన్నాం కదా... చదివాం కదా... నువ్వు ఆశ ఎందుకు వదులుకున్నావు.... నాకైతే నానమ్మ కచ్చితంగా బ్రతికి బట్ట కడుతుందన్న ఆశ ఉంది నాన్నా."...అన్నాడు రాంపండు తన తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
" నీ ముఖం... ఈ సంక్రాంతి సంబరాలన్ని దానికి చూపిస్తే .... బ్రతికేస్తుంది అంటావా??? అలా ప్రాణం పోసేయగలవా??? ఇలాగైతే ఈ డాక్టర్లు
ఎందుకురా...? ఇప్పుడు ఈ వీధుల్లో తిరుగు తున్న వేషగాళ్ళు అందరూ వీళ్లంతా...చాలా సంవత్సరాల నుండి వాళ్ల పండుగ వేషాల్లో ఆదరణ కోల్పోయి.... వేరు వృత్తుల్లో పడిపో యేరు...
రాంపండు... పాపం నాలుగేళ్లుగా వీళ్ళు ఎవరూ మన ఊర్లో కనపడలేదు... సరే..ఈ ప్రాచీన సాంప్రదాయాలు అన్నీ " హుష్ కాకి".... అయి పోతున్నాయని.... మీ నానమ్మ తెగ బాధపడి పోతూ ఉండేది నాలుగేళ్ల నుండి. ఊరంద రిని పిలిచి కూర్చో బెట్టి వాళ్లందరికీ చెప్పి చెప్పి బెంగపడి పోతున్నట్టు అయిపోతుండేది.... మేమంతా సర్ది చెప్పేవాళ్ళం....వచ్చే సంవత్సరం అందరూ వస్తారు లే నువ్వు లేచి భోజనం చేయి అంటూ ఉండేవాళ్ళం.... ఇంకో సంవ త్సరం అలాగే ఆశగా రోజు రోజు లెక్కపెట్టు కుంటూ.. గడిపేది. మళ్లీ సంవత్సరం ఊరంతా ఏ సరదా లేకుండా నిరాశగా నిస్పృహగా ఉండేది...అప్పుడు కూడా... వస్తారులే.. అని ఆశ పెట్టి మభ్యపెట్టి అలాగే చెప్పేవాళ్ళం మేము చెప్పే దంతా అబద్ధం అని ఇక ఇక... ఆ సంక్రాంతి సంబరాలు మాయం... అయి పోయాయని....ఆ ఆనందాలు ఇక ఉండవని... బతుకంతా..ఇలా ఏ సరదా సంతోషం లేకుండా గడపాలి... అని మనసులో ఊహించేసుకొని.... అలా అలా మా ఎవరితో మాట్లాడకుండా ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంటూ మూగ దానిలా ఉండిపోయేది.అలా అలా బెంగ పెట్టుకుని తిండి మానేసి ఇలా అయిపోయింది రా....
రోజులు మారుతున్నాయి.. చాలా సాంప్రదా యాలు పోయాయి. చాలా సరదాలు, సంబ రాలు.. సంతోషాలు.. ఇక మనం మర్చిపోవాలి అని... ధైర్యంగా ఉండమని చెబుతుండేవాళ్ళం
అయినా వినలేదు. వినేది కాదు... చీకటి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉండేది. దాంతో ఇలా తయారయింది రా
సరే.. ఈ సంవత్సరం నువ్వు మమ్మల్ని అందర్నీ ముఖ్యంగా నానమ్మ ని చూడడానికి.... కుదరక పోయినా... అమెరికా నుండి వచ్చేశావు.
నాన్న... నాన్నమ్మను బతికిస్తాను అని.... నాతో పందెం కట్టి... చుట్టుపక్కల ఊరులు అన్ని తిరిగి ఈ వేషగాళ్ళు అందరిని కూడగట్టి పోగేసి...వాళ్లకు ఎక్కువ డబ్బులు ఆశ చూపి.... వాళ్ల చేత మరిచి పోయిన వేషాలన్నీ మళ్లీ కట్టించి...50 వేలు ఖర్చు పెట్టి..... వాళ్లందరికీ సంవత్సరానికి సరిపడా జీతాలు కూడా ఇచ్చేసి
... వాళ్లలో ఉత్సాహం నింపి... మన ఊరిని ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం సంక్రాంతి కళతో శోభతో... సంతోషాలతో ఆనందా లతో నింపేశావు....సరే ఇదంతా చూసి మీ నాన్న... ఈ సుందరరామ్మూర్తి చాలా ఆనందించాడు. ఇదంతా బాగానే ఉంది. దీంతోనే మీ నానమ్మ బతికేస్తుంది అనుకో వడం..... ఇదంతా చూసి ప్రాణం వచ్చేసి ఎగిరి గంతులేస్తుంది అనుకో వడం...నీ పిచ్చి... నీ వెర్రి... నీ అనవసరపు వృధా ప్రయాస ప్రయత్నం!!! నాలుగేళ్ల నుంచి మానేసిన భోగి మంటలు కూడా పెద్ద ఖర్చు పెట్టివేయించావు ఘటికుడు వె..... సరే నీ పిచ్చి నీది.... నేను ఎందుకు వద్దు అనాలి అని... ఊరుకున్నాను. మా అమ్మ బ్రతికితే నాకు సంతోషమే... మహాసంతోషం.... కానీ బ్రతకదు రా.నేను బయటకు వెళ్తున్నాను.... ఆవిడ ప్రాణం పోతే చేయవలసిన ఏర్పాట్ల గురించి... ముందుగానే కొంత మందికి చెప్పి... వాళ్లను పిలిచిన వెంటనే రమ్మని సిద్ధం చేసి ఉంచాలి గా.... అసలే పండగ రోజులు.
నీకు పూర్తిగా అర్థం అయింది అనుకుంటాను... సరే ఇక నేను వెళుతున్నాను... నువ్వు ఇంటి దగ్గరే ఉండు మీ నానమ్మ కు ఏమి జరిగినా
...నాకు మన రమణ చేత కబురు పెట్టు.. నేను మోసే వాళ్లను తీసుకు రావాలిగా.... వచ్చేట ప్పుడు వాళ్లను వెంట పెట్టుకుని వస్తాను.. చెప్పాను కదా....పండుగరోజులు... బ్రతిమాలా
తే గానీ రారు."...
అంటూ..... బయటకు వెళ్ళబోయాడు.... రాంపండు తండ్రి శంకరయ్య.
అంతే... ఒక చెయ్యి తన చెయ్యిని గట్టిగా పట్టు కున్నట్లు అనిపించింది. ఆశ్చర్యపోయాడు శంక రయ్య.
" ఒరేయ్ అడ్డ గాడిద ఆగరా ఎక్కడికి వెళుతు న్నావు...నా శవాన్ని మోయడానికి మనుషు లను తీసుకురావడానికా... నేనింకా చావను రా????" ...........ఆ కంఠం తన తల్లి దే సూర్యకాంతమ్మ..!!!
ఆగిపోయాడు శంకరయ్య.
"నాన్నా.... నాన్నోయ్.. నాన్నోయ్ ..నానమ్మ లేచి కూర్చుంది."...మహదానందంతో ఎగిరి గంతేసినట్లు తండ్రికి చెప్పాడు రాంపండు.
అంతేకాదు... ఆనందంగా తన్మయత్వం లో గట్టిగా అరిచాడు రాంపండు.
"మాట్లాడేస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది నాన్నా చూడు నాన్నా..." మళ్లీ గట్టిగా కేకలు పెట్టినట్టు అరిచేశాడు రాంపండు. ఎగిరి గంతు లు వేశాడు.
" రోడ్డు మీదకు తర్వాత వెల్ది గానీ... ఇలా రా బండ మొహం వెధవా.."...అది మంచం మీద తనంత తానే లేచి కూర్చున్న సూర్యకాంతమ్మ గారి కంఠం.
తల్లి పిలుపుకు.... ఆశ్చర్యపోయాడు శంకరయ్య.
గభాలున వెను తిరిగి తల్లి దగ్గరకు వెళ్లి..." అమ్మ నువ్వేనా... బకెట్టు తంతావు అను కున్నానే..ఇదేంటి విచిత్రంగా.. లేచి కూర్చున్నావ్ ఏంటి?? ఇది మాయ మంత్రమా??" అంటూ ఆశ్చర్య పోయాడు శంకరయ్య.
" ఛీ నోరు ముయ్యి రా.. చింతపిక్కల కళ్ళు వెధవ.. కావాలంటే గిల్లీ చూసుకో ....నువ్వు మందుల వైద్యం చేయించావు.బస్తాలు బస్తాలు టాబ్లెట్లు మింగిచావు... సూది మీద సూదులు పొడిపించావు ఒకరా ఇద్దరా... 14 మంది డాక్టర్లకు చూపించావు...లక్షలు ఖర్చు పెట్టావు.
ఎంత కోమాలో ఉన్నా నాకు అన్నీ తెలుస్తు న్నాయిరా
కానీ.. నేను బ్రతకాలంటే ఏం కావాలో ఒక్కసా రైనా మనసుపెట్టి ఆలోచించావా .... బొడ్డు వెధవ..నా అమెరికా మనవడు రాంపండు ఏం చేశాడు... నాకు కావలసిన మానసిక వైద్యం చేయించి... ఇంకాతను చేయవలసింది కూడా అంతా చేసి నాకు ప్రాణం పోసాడురా.
ఉండరా ఉండు... ఆ రంగు రంగుల ముగ్గులు... గొబ్బెమ్మల సందళ్ళు.. అమ్మలక్కల పేరం టాలు.. అబ్బో....ఓ పక్క కర్రసాములు... ఈ పక్క గారడీ వాళ్ళు అమ్మో నా ఊరికి మళ్ళీ ప్రాణం వచ్చేసింది... కళకళ లాడిపోతోంది... ఇదన్న మాట రామాపురం అంటే! ఈ కర్ర సాయంతో..నా మనవడి సాయంతో..ఒక్కసారి భోగిమంటల దగ్గరకు వెళ్లి ... అట్లాగే ఊరంతా తిరిగి తిరిగి సంబరమంతా చూస్తాను రా... అన్నీ చూసి వస్తాను.నీ పని చూసుకో రా చిల్లర వెధవ..." అనుకుంటూ.... మనవడితో సరదాగా బయటకు వెళ్ళిపోయింది సంవత్సరం పాటు మంచం మీద "కోమా" లో ఉండి ఇప్పుడే లేచిన తొంభయ్యేళ్ల సూర్యకాంతమ్మగారు.
అంతే.. అంతే...!!!
ఆమె కొడుకు శంకరయ్య కు ఈ పరిస్థితి అర్థం కాక అదే మంచం మీద వెల్లకిలా పడిపోయి తను కోమా స్థితిలోకి వెళ్లిపోయినట్టు అయ పోయాడు.!!!
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 7 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
haha
nice one
chala baga rasaru
atu mana samskruthulu gurthu chesthuu
itu bamma manavadi emotion
loved it...
[+] 3 users Like Pallaki's post
Like Reply
#3
(05-11-2022, 05:51 PM)Takulsajal Wrote: haha
nice one
chala baga rasaru
atu mana samskruthulu gurthu chesthuu
itu bamma manavadi emotion
loved it...

మీ అభినందనలు అసలు రచయితకు చెందుతాయి.

నేను కేవలం చదివి, నచ్చితే ఇక్కడ పోస్టు చేశాను  Takulsajalగారు
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#4
కథ చాల అద్భుతంగా ఉంది   clps yourock thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)