26-08-2022, 07:18 PM
అమ్మ రాజీనామా
ఒక ఊరులో, ఒక అందమైన కుటుంబం .బయటి వ్యక్తులకు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఆ కుటుంబంలో కృష్ణ మూర్తి, సుధ ఉండేవాళ్ళు. వాళ్ళ పెళ్ళయి 30 సంవత్సరాలు దాటింది. వాళ్లకి కొడుకు రవి,కూతురు రాధ ఇద్దరికీ కూడా పెళ్లిళ్లకు అయి వేరే వెళ్లారు.సుధ చాలా మంచి ఇల్లాలు. ఓర్పు ,సహనంలో భూదేవి. కృష్ణ మూర్తి తాగడo,పేకాట ఆడడం ,భార్యను హింసించడం ఆయనకి అలవాటు.
అందరి పరిచయం చేశాను కదా ఇక కథ చెప్తాను వినండి.
ఒకరోజు కృష్ణమూర్తి ఉదయాన్నే ఇంటికి వచ్చి అప్పటికీ పడుకోనే ఉన్న సుధని చూసి .....
కృష్ణమూర్తి:ఏంటి ఇంకా తెల్లవార లేదా .....మా ఫ్రెండ్స్ వస్తున్నారు లేచి పార్టీకి సిద్దం చేయి.
సుధకి జ్వరము మత్తుగా కళ్ళు మూసుకుని పడుకోని ఉంది.
కృష్ణమూర్తి కోపంతో ఆమెని కాలితో తనూతాడు.
ఉలిక్కిపడి లేచింది . నిద్రలోంచి హఠాత్తుగా లేచేసరికి అయోమయంగా అనిపించింది.నాకు చాలా నీరసంగా ఉంది అండి....
ఛీ.... ఇల్లు అంటే రావాలి ,రావాలి అనిపించేలా ఉండాలి అని ఎన్ని సార్లు చెప్పాను .ఎప్పుడూ నీ మొండితనం కానీ నా మాట లెక్క చేయవా అంటూ రంకెలు వేస్తున్నాడు.
ఛీ .......ఎప్పుడు చక్కగున్నావులే, అంటూ చిరాకుతో ముందున్న పిండిని కాలితో తన్ని వెళ్ళిపోయాడు. ఇల్లంతా ఎగజిమ్మినట్లు పిండి అంతా పరుచుకు పోయింది. బాగు చేసే ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది సుధా.
అలా వెళ్లిన వాడు పేకాడుతూ క్లబ్బులో రాత్రంతా ఉండిపోయాడు. అక్కడే నిద్రపోయాడు. తెల్లవారు పొద్దెక్కిన తర్వాత ఇంటికి బయలుదేరాడు.
ఇల్లు తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్ళ అమ్మాయి వచ్చి అంకుల్ ఆంటీ తాళం ఇచ్చి వెళ్ళింది. అంటూ తాళం ఇచ్చింది .ఏదైనా పని ఉండి బయటకు వెళితే పక్కింట్లో తాళం ఇచ్చివెళుతుంది .అలాగే అనుకొని కృష్ణమూర్తి తాళం తీసుకున్నాడు. రాత్రి హ్యాంగఓవర్ దిగడానికి స్నానం చేసి తల తుడుచుకుంటూ హాల్లోకి రాగానే కాలికి ఏదో అతికినట్టు అనిపిస్తుంది . టవల్ తీసి చూడగానే ఇల్లంతా పిండి పిండి గా ఉంది. కొంచెం ఆశ్చర్యపోయాడు కృష్ణమూర్తి 30 సంవత్సరాల తన జీవితంలో ఎప్పుడూ ఇల్లు ఇలా పెట్టలేదు సుధా. ఏమైంది తనకి చిరాకు పడతారు. షుగర్ ఉండటంతో ఆకలితో ఇంకా కోపం పెరిగిపోతుంది. ఎక్కడికి వెళ్ళింది ,ఎంతసేపైనా రాలేదు, ఫోన్ అయినా చేయలేదే. తానే ఫోన్ చేసి చూశాడు స్విచ్ ఆఫ్ అని చెప్పింది .కాస్త కంగారు పడసాగాడు. టీవీ నైన్ చూద్దామని సోఫా లో కూర్చున్నాడు. టీవీ రిమోట్ వెతుకుతున్నాడు. రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు, అది బరువుగా పెట్టిన ఒక పేపర్ ఫ్యాన్ గాలికి కిందపడింది. అది తీస్తూ ఆశ్చర్యపోయాడు అది ఉత్తరం.
అతని కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీస్తున్నాయి.
"నేను చాలా విసిగిపోయాను ,అలిసిపోయాను. ఇక నా మనసుతో, మీతో ఘర్షణ పడే ఓపిక నాకు లేదు. పెళ్లి అయిన దగ్గర్నుంచి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా, ఎలాంటి భావోద్వేగాలు లేని మరమనిషిల అనుకున్నారు. అందమైన మీ రూపం వెనుక అందమైన మనసు ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత వికృతరూపం ఉంటుంది అనుకోలేదు. నీకు అన్ని సుఖాలు ,సౌకర్యాలు సమకూర్చే రోబోలా మాత్రమే ఉన్నాను.నాకు ఒక మనసు ఉంటుంది అని,దానికి ఏనో ఆశలు ఉంటాయని మీరు అర్థం చేసుకోలేదు. పెళ్లయి 30 వసంతాలు దాటినా మీరు మారలేదు నన్ను అర్థం చేసుకోలేదు కనీసం మన పిల్లలు కూడా అర్థం చేసుకోలేదు. అందుకే ఇకనైనా నాకు నచ్చినట్టుగా గడపడానికి గడపదాటుతున్న. ఆత్మహత్య చేసుకునేంత పిరికి దాని కాదు. ఎన్నో జన్మల తరువాత ఇంతటి ఉత్తమమైన మానవజన్మ వస్తుందని అంటారు.
ఈ జన్మ సార్థకత తెలుసుకునేలా నాకు నేనుగా బతుకుతాను. మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు నాకు అవసరనికి ఉపయోగ పడుతుంది. పిల్లలకు నా ఆశీస్సులు. నన్ను వెతికే ప్రయత్నం చేయొద్దు .అయినా నా పిచ్చి గానీ ,ఒక పని మనిషిని పెట్టుకుంటారు.
ఇక సెలవు
సుధా
ఉత్తరం చదివి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాలం నాకు ,నా మాటకు ఎదురు కూడా చెప్పని సుధా . ఇప్పుడు ఇలా ఎగిరిపోయింది. చేతులు వణుకుతున్నాయి. ఉత్తరం తన చేతిలో నుంచి ఎగిరి కృష్ణుడి పాదాలు చెంత చేరింది.
కాసేపటికి తేరుకుని కర్తవ్యం గుర్తొచ్చినట్లు తన కొడుక్కి ఫోన్ చేస్తారు. అమ్మ అక్కడికి వచ్చిందా అని అడిగాడు. లేదు రాలేదు ఇంట్లో లేదా అని కొడుకు ప్రశ్నించారు. సమాధానం ఇవ్వకుండా ఫోన్ కట్ చేస్తారు. కూతురు కి ఫోన్ చేసి అడుగుతానరు, అమ్మ వచ్చింద రాధ లేదు రాలేదు నాన్న.సమాధానం లేకుండా ఫోన్ కట్ చేస్తారు. ఇంతలో రవి మళ్లీ ఫోన్ చేసి ఏమైంది నాన్న అని తరచి తరచి ఆడగా ఉత్తరం విషయం చెప్తాడు .
మృదుమధురంగా రవళించు కాలి పట్టీలతో ఇంట్లో నడయాడే ఇల్లాలు లేక ,స్మశాన నిశ్శబ్దం తాండవం ఆడుతుంది. ఇంటి ముందు శుద్ధిచేసి ముగిసిన ఆనవాళ్లు లేవు. పూజ గదిలో అగరవత్తులు సువాసనలు లేవు .భయం భయంగా బ్రష్ అందించే ఆప్యాయత లేదు. నాకిష్టమైన అని తనకి కష్టమైనా చేసిపెట్టే ఆ ప్రేమమూర్తి లేదు. అలా ఆలోచిస్తే సృహ కోల్పోయడు.
కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ పైన ఉన్నారు. రూమ్ బయట బెంచి మీద కూర్చొని కూతురు ,కొడుకు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విని మళ్ళీ భారంగా కళ్ళు మూసుకున్నాడు .
ఏమో అన్నయ్య... అసలు అమ్మ ఎందుకు ఇలా చేసింది. అసలేం తక్కువయిందని. నాన్న గురించి తెలిసిందే కదా. తాగడం, కోప్పడటం అన్నీ మామూలే కదా. ఏదో మనసు ఆపుకోలేక వచ్చేసాను. మీ బావగారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, త్వరగా వచ్చేస్తాను అని చెప్పి వచ్చాను. అంది రాధ.
నువ్ వెళ్తే ఎలా? మీ వదిన ఈ చాకిరి చేయలేదు .తనకి చిన్న పిల్ల కూడా ఉంది . అర్థం చేసుకో.మా ఇంటికి తీసుకెళ్లాలన ఇబ్బంది. నాన్నకి ముక్కు మీద కోపం .నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. ఈయనతో ఏ టైం కి ఏమవుతుందో ఈ టెన్షన్ నేను భరించలేను.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ