Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇండస్ట్రీలో కథల్లేవ్.. యువతకు ఇదే గోల్డెన్ ఛాన్స్!
#1
ఇండస్ట్రీలో కథల్లేవ్.. యువతకు ఇదే గోల్డెన్ ఛాన్స్!

[Image: writers_710x400xt.jpg]

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రచయితల కొరత చాలానే ఉంది. కొరత అంటే మంచి కంటెంట్ అందించే వారు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. విజయేంద్ర ప్రసాద్ - పరుచూరి బ్రదర్స్ - కోన వెంకట్ - వక్కంతం వంశీ ఇలా కొంత మంది రైటర్స్ కి మంచి డిమాండ్ ఉంది. 

కథ, మాటలు , స్క్రీన్ ప్లే రైటర్స్ గా ఒక్కసారి క్లిక్ అయితే టాప్ డైరెక్టర్స్ వెతికి మరి పట్టుకుంటారు. ప్రస్తుతం మాటల రచయితగా సాయి మాధవ్ బుర్ర టాప్ లో కొనసాగుతున్నారని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో రచయితలను ఎక్కువగా వివి.వినాయక్ - శ్రీను వైట్ల వంటి వారు ఉపయోగించుకుంటారు. ఇక రాజమౌళికి తోడుగా తండ్రి పెన్ను ఎప్పుడూ ఉంటుంది. 

అసలు మ్యాటర్ లోకి వస్తే..ఇప్పుడు ఇండస్ట్రీలో కథలు దొరకడం లేదు. స్టార్ డైరెక్టర్స్ ఎక్కువగా మంచి రచయితల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అవ్వాలంటే రైటర్ గా ముందు ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటే ఈజీగా డైరెక్షన్ ఛాన్స్ కొట్టేయవచ్చు. అందుకు ఉదాహరణగా త్రివిక్రమ్ ను చెప్పుకోవచ్చు.    

ఒక రచయితగా రెండు సినిమాలతో హిట్ అందుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. స్క్రిప్ట్ డిస్కర్షన్స్ లో అవకాశం ఈజీగా వస్తుంది. కథా చర్చల్లో కొన్ని సలహాలు ఇచ్చి కాస్త సమయాన్ని కేటాయిస్తే సిట్టింగ్ కు 25 వేల నుంచి 30 వేల న వరకు పేమెంట్స్ ను అందుకోవచ్చు. రైటర్స్ రేంజ్ బట్టి లక్షల్లో కూడా పేమెంట్స్ ఉంటాయి. 

ఇక కథలో భాగమైతే రెట్టింపు పేమెంట్ అందుతుంది. దిల్ రాజు నిర్మించే చాలా సినిమాలకు స్క్రిప్ట్ డిస్కర్షన్ తప్పకుండా ఉంటుందనేది ఇండస్ట్రీలో టాక్. బడా సినిమాలు చేసే దర్శకులు కూడా అనుభవం ఉన్న రచయితల ప్రమేయం లేనిది సినిమాను పట్టాలెక్కించరు. 

వినాయక్ - రాజమౌళి - శ్రీను వైట్ల వంటి దర్శకులు చాలా వరకు కథా చర్చలు జరపనిదే సినిమా మొదలు పెట్టరు. త్రివిక్రమ్ - పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మాత్రం రచనలో పెద్ద బలశిక్ష చదివారు కావున సొంత నిర్ణయాలతోనే సినిమాను తెరకెక్కిస్తారు. 

ఇప్పుడున్న ఒక ముగ్గురు నలుగురి రచనలకు మాత్రమే మంచి డిమాండ్ ఉంది. వారి పెన్ను విలువ కోట్లల్లో ఉంటుంది. కానీ రచయితల్లో ప్రస్తుతం వక్కంతం వంశీ లాంటి వారు దర్శకులుగా మారి వారి కథలను వారే తెరకెక్కించుకోవాలని డిసైడ్ అయ్యారు. 

కొరటాల శివ - అనిల్ రావిపూడి  వంటి వారు కూడా ముందుగా రచయితగా గుర్తింపు తెచ్చుకున్నవారే. ప్రస్తుతం ఇండస్ట్రీలో కథలు లేవనేది నిజమే. కొత్త కథలకు మంచి డిమాండ్ ఉంది, సో యువత మంచి కాన్సెప్ట్ తో ఈ టైమ్ లో పరిశ్రమలోకి వెళితే ఈజీగా అవకాశం కొట్టేయవచ్చు. 

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
డియర్ రైటర్స్... త్వరపడండి మరి!!!

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#3
నిజమేనండి.
కథలకి ఎప్పుడూ కొరతే...సమయానుకూలంగా ప్రేక్షకులని తమవైపుకు తిప్పుకునే కథలు సమకాలీన కథలు అన్వచ్చేమో దొరకడం లేదు.
చిరంజీవి 'ఠాగూరు' మూవీ కథ వి.వి.వినాయక్ ది కాదు తమిళ్ లో విజయకాంత్ సినిమా.
రామోజీ తెర కెక్కించే కథలన్నీ తమిళ్ లో హిట్ అయినవే........
హిట్ ఫార్ములాని తీసుకుని తెలుగులో తీస్తూ ఉంటారు.

ఎక్కడో కానీ ప్రయోగాలు 'అర్జున్ రెడ్డి' లాంటి మూవీస్ హిట్ కావు.
ఇంకో ప్రయోగం 'రంగస్థలం'  
వంపు సొంపులు లేవు వీర ప్రతాపాలు లేవు. చెవులు వినపడని వాడు హీరో....
అయినా ఎంత అందంగా పండించారు.
మీలో ఉన్న టాలెంట్ బయట పెట్టండి.
Like Reply
#4
అవునవును... ప్రయోగాత్మకత పేరు చెప్పి చాలా సినిమాలు వచ్చాయి.
మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు... ఠాగూర్ ఏమిటి... ఈమధ్యనే వచ్చిన ఖైదీ నెం. 150 కూడ తమిళ సినిమా ఆధారంగా తీసినదే...
రామోజి హిట్ మూవీ రీమేక్స్ చేస్తున్నారో లేదో తెలీదుగానీ, అతని 'మయూరి' సినిమా వల్ల చాలామందికి జైపూర్ లెగ్ గురించి తెలిసింది. అలాగే, అశ్వినీ నాచప్ప... కూడా ఒక ఇన్సపిరేషనల్ మూవీ. తర్వాత మీరు చెప్పిన సినిమాలు వచ్చుండొచ్చు. వాటిలో 'నువ్వే కావాలి' వుందో లేదో మరి!
అలాగే అర్జున్ రెడ్డి అన్నారు... నాకు ఆ సినిమా చూస్తే కాస్త మలయాళ, కన్నడ ఛాయలు కన్పించాయి. ఒరిజినల్ అయినప్పటికీ... చాలాకాలం క్రితం (ఆరేడేళ్ళు) 'రుషి' అనే మెడికో ఓరియెంటెడ్ మూవీ వచ్చింది. అప్పట్లో సరైన గుర్తింపు రాలేదుగానీ, లేకపోతే ఈ అర్జున్ రెడ్డి కన్నా చాలా పాపులర్ అయ్యుండేది!!!
అలాగే... 'అప్పట్లో ఒకడుండేవాడు!' సినిమా... రెండు పెద్ద (తలకాయల) సినిమాల వల్ల ఎక్కువ కాలం ఆడలేకపోయింది.
మంచి కథలు వస్తున్నా... ఇలా పిట్టల్లా రాలిపోతున్నాయి. పెద్ద తలకాయలు తీస్తేనే ఎక్కువ గుర్తుంచుకుంటే... ఒక్క 'రంగస్థలం' మాత్రం గుర్తుంటుంది.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#5
నేటి కాలపు దుస్థితి

"ఇది నా కధ. కొంత మార్చి వేరే రచయిత పేరు పెట్టుకున్నారు"

"వేరు వేరు కధలని కలిపి కొత్తదిగా చూపుతున్నారు"

"నేను రైటర్ని. ఎన్నో రచనలు చేస్తున్నాను. నా పేరు ఎక్కడా ఉండదు"

"కొత్త కధలకి ఆహ్వానం అన్నారు. ఎంతో ఆశతో వెళ్లాను.
నాలాగ ఎందరో ఉన్నారు అక్కడ. ఇంటర్యూలు అయ్యాయి.
ఆలోచించుకుని తెలుపుతాము అన్నారు. కబురేమీ లేదు.
... కొత్త సినిమాలో నేను చెప్పిన సన్నివేశాలూ ఉన్నాయి
"

ఇలా ఎన్నిటినో ఉటంకించవచ్చు banana

పేరు పొందిన రచయిత(త్రి) ల కధలూ చౌర్యానికి గురి అవుతూనే ఉన్నాయి ...
Like Reply
#6
అందుకు లేటెస్టు ఉదాహరణ —
అరవింద సమేత వీరరాఘవ సినిమాలో వాడిన 'మొండి కత్తి'... కాంట్రవర్సీ

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: 1 Guest(s)