Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

"మడి"

Showing only the posts of earthman: 12 of 71 posts. Show all posts
#1

ఇంకో కధ. మూడు, నాలుగు భాగాలుగా ఇస్తాను. ఇది మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
[+] 4 users Like earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

"ఏమ్మా పురోహితుడొచ్చాడా?" బయట నించి పెద్దగా అడిగాడు పరంధామయ్య.

"ఇంకా రాలేదు మావయ్యా" వంటింట్లో వంట చేస్తూ చెప్పింది కోడలు వసుధ.

"ఇంకోసారి ఫోన్ చెయ్యమ్మా. ఏడవుతోంది కదా, ఎప్పుడొస్తాడో"

"ఇప్పుడే చేసాను మావయ్యా, దారిలో ఉన్నానన్నారు"

ఇంతలోనే వీధి గుమ్మం తెరుచుకుని లోపలికి వచ్చాడు పురోహితుడు శేఖరం.

లోపలికి వస్తునే "ఈ వెధవ ట్రాఫిక్ వల్ల చిరాకేస్తోందండి, సాయంత్రం అయిందంటే చాలు బండ్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. అందుకే ఇలా ఆలస్యం అవుతోంది" అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.

"పరవాలేదులేండి" అన్నాడు పరంధామయ్య.

"మీ అబ్బాయి ఎక్కడ? చూసి చాలా రోజులవుతోంది"

"వాడికి బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయింది. ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇల్లు దొరికాక భార్యని తీసుకెళతాడు"

"మంచిదండి. ఎప్పుడన్నారు తద్దినం"

"రేపే"

"రేపంటే..." అంటూ పంచాగం తీసి, చదువుతూ, వేళ్ళ మీద ఏవో లెక్కలు వేయసాగాడు.

"ఇంతకీ తద్దినం మీ నాన్నగారిదా, అమ్మగారిదా?"

"మా తల్లిగారిది. తొంభై ఏళ్ళు బతికి, నాలుగేళ్ళ క్రితం కనుమూసింది. పోయిన ఏడాది ఒంట్లో బాలేకపోవడం వల్ల తద్దినం పెట్టలేదు. అందుకే ఈసారి తద్దినం బాగా పెట్టాలని అనుకుంటున్నాను. అలానే నాకు కూడా వయసయిపోతోంది. నా భార్య లాగా నేనూ రేపో, ఎల్లుండో కాలం చేస్తానేమో, ఎవరు చెప్పగలరు. అందుకే అబ్బాయి లేకపోయినా చేస్తున్నాను"

"ఎంత మాట. మీ తల్లిగారిలా, మీరు కూడా తొంభై ఉంటారు"

నవ్వాడు పరంధామయ్య.

మళ్ళీ లెక్కలు వేసాడు శేఖరం.

లెక్కలు అవ్వగానే లేచి నిలబడి, "పొద్దున్నే ఏడింటికల్లా వస్తానండి. మా పిన్నిగారి అబ్బాయి చేత సామానుల లిస్ట్ పంపిస్తాను, తెప్పించండి. ఇక సెలవు" అని నమస్కారం చేసి వెళ్ళాడు.

"అమ్మాయ్ వసుధా, ఆ లిస్ట్ ఏదో తీసుకోమ్మా, నేను కాసేపు పడుకుంటాను. లిస్ట్ రాగానే లేపు, వస్తువులు తెస్తాను" అని లోపలికి వెళ్ళి పడుకున్నాడు పరంధామయ్య.

గుమ్మం తలుపుకి గడియ పెట్టి, వంటింట్లోకి వచ్చి, మళ్ళీ తన వంట పనిలో నిమగ్నమయింది వసుధ.

అరగంట గడిచింది. వంట పూర్తయింది. కాసేపు కూర్చుందాం అనుకుని బయట గదిలోకి వచ్చి, ఫ్యాన్ వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుంది వసుధ.

ప్రశాంతతని భగ్నం చేస్తూ మొబైల్ మోగసాగింది. ఫోన్ తీసుకుంది వసుధ. అవతల నించి భర్త. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, అన్నీ చూసుకుంటామని చెప్పింది.

ఇంతలో వీధి గుమ్మం చప్పుడు.

ఫోన్ పెట్టేసి, ఉసూరుమంటూ లేచి తలుపు తీసింది వసుధ.

ఎదురుగా ఒక కుర్రాడు. చేతిలో ఏదో కాగితం.

"శేఖరం గారు పంపించారు. రేపటికి కావల్సినవి రాసిచ్చారు" అన్నాడు కుర్రాడు.

"లోపలికి రా" అంది వసుధ.

కుర్రాడు లోపలికి వచ్చాడు.

"ఏదీ లిస్ట్ ఇవ్వు" అని లిస్ట్ తీసుకుంది.

ఎప్పుడూ రాని ఇల్లు కావడంతో చుట్టూ చూస్తున్నాడు కుర్రాడు. పక్కగదిలో పరంధామయ్య పడుకుని ఉండటం కనిపించింది.

లిస్ట్ తీసుకున్న వసుధ, ఏమేం రాసారో చూస్తూ, ఏదో అనుమానం వచ్చినట్టుగా కుర్రాడి వైపు వచ్చింది.

"16 కొబ్బరికాయలు అని రాసారు, 16 ఎందుకు?"

"ఏమో నాకు తెలిదండి"

శేఖరానికి ఫోన్ చేసింది వసుధ.

"16 కొబ్బరికాయలు అని రాసారు, అన్నెందుకండి?"

"16 కాదమ్మా 6, పెన్ను సరిగా పడకపోవటం వల్ల వచ్చిన చిక్కు ఇది. ఒక పని చెయ్యమ్మా, ఇంకెన్ని తప్పులున్నాయో ఏంటో! ఆ లిస్ట్, డబ్బులు మా వాడికివ్వు, వాడే అన్నీ తెచ్చి ఇస్తాడు. మాకు తెలిసిన షాపులో తెస్తాడు, ఒకవేళ ఏవైనా ఎక్కువతక్కువ అయితే, తెలిసిన షాపే కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు"

"సరే" అని మొబైల్ ఆఫ్ చేసి, డబ్బుల కోసం లోపలికెళ్ళి, డబ్బులు తెచ్చి, లిస్ట్, డబ్బులు కుర్రాడి చేతికిచ్చింది.

"రేపే తద్దినం, ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా తీసుకురా. కాని ఏదీ మర్చిపోకు" అంది.

తల ఊపి వెళ్ళాడు కుర్రాడు.

వంట దగ్గర చెమట పట్టి చిరాగ్గా ఉండటంతో, కాసిని నీళ్ళు పోసుకుందాం అనుకుని, మళ్ళీ స్నానానికి వెళ్ళింది వసుధ.

నాలుగు చెంబులు పోసుకుని వచ్చి, వేరే చీర కట్టుకుంది.

ఒక గంట గడిచింది. టైం ఎనిమిదయింది.

పరంధామయ్య లేచాడు.

"అమ్మాయ్ వసుధా, అన్నం పెట్టమ్మా, ఆకలేస్తోంది" అన్నాడు.

"శేఖరం లిస్ట్ పంపిచాడా" అని అడిగాడు.

జరిగింది చెప్పింది వసుధ.

తినసాగాడు పరంధామయ్య.

వీధి గుమ్మం చప్పుడు.

"వస్తువులు తెచ్చినట్టున్నాడు మావయ్యా. మీరు తింటూ ఉండండి" అని తలుపు తీయడానికి వెళ్ళింది.

తలుపు తీసింది, ఎదురుగా కుర్రాడు పెద్ద మూట భుజం మీద పెట్టుకుని.

"ఏంటి బాబు, రిక్షాలో రావచ్చు కదా, ఇంత బరువు మోస్తూ వచ్చావా" అని మూట దించి, లోపలికి తీసుకెళ్ళింది.

మూట బరువుగా ఉండటంతో అప్పటిదాకా ఏ ఆలోచనా కలగని కుర్రాడు, బరువు దిగేసరికి, ఊపిరి పీల్చుకుని చుట్టూ చూడసాగాడు.

ఎదురుగా నీళ్ళగ్లాసుతో ఎర్ర చీరలో వస్తున్న వసుధని చూసి, పొద్దున వేరే చీరలో చూసినట్టు అనిపించి, ఈ చీరలో నిండుగా కనిపిస్తూ ఉండేసరికి, ఆమె రూపాన్ని రెప్ప వేయకుండా చూడసాగాడు.

"ఇంద, నీళ్ళు తాగు" గ్లాసు చేతికిచ్చింది.

గటగట తాగేసాడు.

"నీ పేరేంటి" మూట విప్పుతూ అడిగింది.

"రాజు"

"అన్నీ తెచ్చావు కదా?", ఒంగి మూటలో వస్తువులు చూస్తూ, తలెత్తకుండానే అడిగింది.

ఎర్రచీరలో, అంతకన్నా ఎర్రనైన నడుము, ఒంగి ఉండటంతో ఆమె వెనక ఎత్తులు నిండుగా కనిపిస్తూ ఉండగా, జీన్స్ ప్యాంట్ వేసుకున్నా కూడా, అంత గట్టి జీన్స్ క్లాత్ నించి పొడుచుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది అతని కుర్ర మగతనం.

"అన్నీ ఉన్నాయండి. మా బాబాయికి తెలిసిన షాపులోనే తెచ్చాను", ఆమె మీద నించి చూపు మరల్చుకోలేకుండా, లేస్తున్న తన అంగాన్ని దించుకునే ప్రయత్నం చేస్తూ, కొంచెం తడబడుతూ చెప్పాడు.

"అయితే సరే" అంటూ లేచింది.

"నువ్వు కూడా వస్తావా రేపు"

"వస్తానండి, ఆదివారం కదా"

"ఏం చదువుతున్నావు?"

"డిగ్రీ" అంటూ, గ్లాస్ పక్కన పెట్టేసి, "వస్తానండి" అని బయటకి వచ్చేసాడు.

తలుపు గడియ వేసి లోపలికి వచ్చిన వసుధకి, పరంధామయ్య తిన్నట్టుగా కడిగిన కంచం కనిపించింది, అప్పుడే నిద్రపోతున్నట్టుగా సన్నగా గురక వినిపించింది.

తొందరగా తినేసి, వస్తువులు అన్నీ సర్దుకుని పడుకోవాలి, పొద్దున్నే ఎన్నో చెయ్యాలి అనుకుంటూ పనుల్లో పడింది.

పనులు చేసుకుని, అలారం పెట్టుకుని పడుకుంది.

చీకటి చిక్కబడింది. సూర్యుని రాకతో మళ్ళీ తెల్లారింది.
Like Reply
#3

స్పందనకి ధన్యవాదాలు. తరువాతి భాగం ఇంకా రాయలేదు, రాసి ఇస్తాను.

నేను రాస్తున్న కధల్లో బాగా వచ్చినట్టు అనిపించిన వాటిల్లో ఇదీ ఒకటి. కాబట్టి ఇంకో భాగం తప్పకుండా ఉంటుంది.
[+] 1 user Likes earthman's post
Like Reply
#4

(31-03-2022, 06:49 PM)yekalavyass Wrote:  Vudhalakudu chandika story gurtu vachindi. Abdeekam mundu roju, abdeekam roju, abdeekam pette vallu bhojanam cheya kudadu.

ఈ కధ కల్పితం. కధకి నేపధ్యంగా తద్దినాన్ని తీసుకున్నాను, అంతే.

అలానే తద్దినం పెట్టే పాత్ర వయసు పెద్దది. 70 ఏళ్ళు ఉంటాయి. మరి పెద్దవయసున్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటుంటాయి కదా. ఏ బీపీనో, షుగరో ఉంటే నాలుగు ముద్దలు తినాలి కదా.

అలానే, శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం, ఈ మాట బ్రాహ్మణుడి రూపంలో ఉన్న రావణుడు, రాముడితో అంటాడుట. శ్రద్ధ లేకుండా ఎంత ఘనంగా చేసినా అది నిరర్ధకం.
[+] 3 users Like earthman's post
Like Reply
#5

(01-04-2022, 10:01 PM)Uday Wrote:  బావుంది, కథతో బాటు కాస్త లోకజ్ఞానం కూడా అంటే తంతులు తద్దినాల గురించి, విధి విధానాల గురించి అక్కడక్కడా ఉంటే బావుంటుందేమో...

అవి చెప్పడానికి బోలెడు పుసకాలు, టీవీ ఛానెల్స్, ఇంటర్నెట్, మనుషులు ఉన్నారు. ఇక్కడ అలాంటి వాటికి స్థానం లేదు, కధని ముందుకు తీసుకుపోవటానికి మాత్రమే అవి.

పడుకునే ముందు పొగాకు తాగడానికీ, పొగాకు తోటలో పడుకోవటానికీ తేడా ఉంది.
[+] 3 users Like earthman's post
Like Reply
#6

రెండో భాగం రాసాను, ఇస్తున్నాను.

ఈ కధ, విపులంగా వస్తోంది. అంటే ఉత్త దెంగుకోవడం కాకుండా, ఆ పని జరగడానికే సెటప్ తయారవుతున్నట్టు వస్తోంది. నాకైతే బానే ఉంది, మీలో కొంతమందికి బోర్ కొట్టచ్చు.

అన్ని కధలు పెట్టు, దెంగు, నాకు, చీకు, దూర్చు, కార్చు, ఇలానే ఉండవు కదా. అవీ రాస్తాను నేను.

ఈ కధ ఒక నేపధ్యం, సెటప్ మధ్య జరిగే కధ. ఇంకా చెప్పాలంటే మీరు భౌగోళిక ఊహ చెయ్యాల్సిన కధ. కధలో చాలా గదులు ఉన్నాయి, ఆ గదులు ఎలా ఉన్నాయి అనేది మీరు కాస్త ఊహించుకోవాలి. కాబట్టి ఇది ఇలా రానిద్దాం.

పెట్టు, దెంగు, కార్చు, వేరే కధల్లో చూసుకుందాం.

కధ మూడో భాగంలో అసలు విషయం వస్తుందో, నాలుగో భాగంలో వస్తుందో చూద్దాం.
[+] 3 users Like earthman's post
Like Reply
#7

తెల్లారింది.

వసుధ స్నానాదులు పూర్తి చేసుకుని, తద్దినానికి కావల్సినవన్ని సర్దసాగింది.

సర్దటం అయ్యేసరికి ఆరయింది.

పరంధామయ్య ఇంకా లేవలేదు. లేస్తే చకచకా తయారవుతాడు కాబట్టి వసుధ కూడా లేపలేదు.

ఇంతలో తలుపు చప్పుడు.

తలుపు తీసింది వసుధ. ఎదురుగా కుర్రాడు.

మాట్లాడకుండా లోపలికి రమ్మన్నట్టుగా తల ఊపింది. కుర్రాడు బయటకి వెళ్ళి బండికి తగిలించి ఉన్న రెండు సంచులు తీసుకుని లోపలికి వచ్చాడు.

ఇద్దరూ లోపలికి వెళ్ళారు.

కుర్రాడిని తద్దినం జరిగే గదిలోకి తీసుకెళ్ళింది వసుధ.

"అన్నీ ఇక్కడ సర్దుకో" అంది వసుధ.

తల ఊపి, కార్యక్రమం జరిగే చోట, తను తెచ్చినవన్నీ సర్దుకోసాగాడు కుర్రాడు.

పక్కనే ఉన్న వంటింట్లోకి వెళ్ళింది వసుధ. గిన్నెలో ఏదో కలపసాగింది.

సర్దుకుంటూ వసుధనే చూడసాగాడు. మళ్ళీ అదే ఎర్ర చీరలో ఉన్న వసుధ కుర్రాడికి తెగ నచ్చసాగింది.

"మంచినీళ్ళు కావాలా" వంటింట్లో నించే వెనక్కి తిరిగి చూడకుండా అడిగింది వసుధ.

"వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను" అన్నాడు కుర్రాడు.

అన్నీ సర్దుకున్నాడు.

చల్లగాలి కోసం దొడ్లో మొక్కల దగ్గరికి వచ్చాడు. మొబైల్ చూస్తూ చుట్టూ ఏమున్నాయో చూడసాగాడు.

ఎదురుగా ఉన్న కిటికి నించి వంటింట్లో వంట చేస్తున్న వసుధ కనిపించింది. గిన్నెలో ఏదో కలపసాగింది.

ఆ ఎర్రచీరలో వసుధని అలా చూస్తున్న కుర్రాడు స్థిమితం కోల్పోసాగాడు. అతను వేసుకున్నది ప్యాంట్ కాబట్టి, లేస్తున్న అతని అంగాన్ని ప్యాంట్ కొంత కిందికి దించుతోంది.

వసుధ ఒక్కసారిగా పక్కకి తిరిగింది. కుర్రాడిని చూసింది. కుర్రాడు కంగారుపడి లోపలికొచ్చాడు. వసుధ కూడా వంటింట్లో నించి బయటకి వచ్చింది.

తద్దినం చేసే గదిలోకి వచ్చి, అన్నీ సర్ది ఉండటం చూసింది.

"అన్నీ రెడీగా పెట్టుకుని, మొబైల్ చూస్తున్నావా" అని నవ్వుతూ అంది.

అవునన్నట్టుగా తల ఊపాడు కుర్రాడు.

ఇంతలో పరంధామయ్య లేచాడు. బయటకొచ్చి టైం చూసాడు, ఆరున్నర అయింది.

ఆలస్యం అయింది అనుకొని... "లేపచ్చు కదమ్మా నన్ను. లేపకపోతే అలానే పడుకుంటాను, నీకు తెలుసు కదా" అన్నాడు వసుధతో.

"మీరు వెంటనే తయారవుతారు కదా మావయ్యా, అందుకే ఆరున్నరకి లేపుదామనుకున్నాను, మీరే లేచారు" అంది.

తయారవ్వసాగాడు పరంధామయ్య.

ఇంతలో ఫోన్ వచ్చింది కుర్రాడికి. అవతల నించి పురోహితుడైన అతని అన్న శేఖరం.

"ఏరా అన్నీ మర్చిపోకుండా తెచ్చావా, ఒకసారి చూసి చెప్పు నాకు. ఏదన్నా మర్చిపోయింటే నేను వస్తూ తెస్తాను"

"అన్నీ తెచ్చాను, ఒక్కటి కూడా మర్చిపోలేదు. వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. నువ్వొస్తే మొదలుపెట్టడమే"

"సరేరా, అరగంటలో ఉంటానని చెప్పు"

విషయం చెప్పడానికి వంటింట్లోకెళ్ళాడు కుర్రాడు.

వసుధ అక్కడ లేకపోవడంతో, పక్కగదిలో ఉందేమో అని ఆ గదిలోకి వెళ్ళాడు కుర్రాడు.

వసుధ ఆ గదిలో కూడా లేకపోవడంతో, వెనక్కి తిరుగుతుండగా, అప్పుడే గదిలోకి వచ్చింది వసుధ.

అప్పుడే మళ్ళీ స్నానం చేసి, చీరని సరిగా కట్టుకోకుండా, ఒంటి మీద తడి ఇంకా ఆరకుండా, తుడుచుకోవడానికి గదిలోకి వచ్చింది. కుర్రాడు అక్కడ ఉంటాడని ఊహించని వసుధ, లోపలికి వస్తూనే, తలుపు వేసి, తుడుచుకోబోతు కుర్రాడిని చూసింది.

వసుధ అలా ఒక్క క్షణంలో ఇదంతా చెయ్యటం చూసిన కుర్రాడు అలాగే ఉండిపోయాడు.

ఒక్కసారిగా అలా ఒకరినొకరు చూసుకోవడంతో, ఇద్దరికీ నోటి వెంట మాట రాలేదు.

ఒక్కసారిగా బయటకి పరుగుతీసాడు కుర్రాడు.

అతను లోపలికెందుకొచ్చాడో అనుకుంటూ, ఒళ్ళు తుడుచుకుని, చీర మళ్ళీ కట్టుకుని, బయటికెళ్ళింది వసుధ.

లోపలి నించి వచ్చిన వసుధని చూడగానే చప్పున తల దించుకున్నాడు కుర్రాడు.

"మీ అన్నయ్యెక్కడ"

"అరగంటలో ఉంటానన్నారు, ఈ మాట చెప్పడానికే లోపలికొచ్చాను"

"రాగానే మొదలుపెట్టడమే కదా, నీదే ఆలస్యం లేదు కదా"

"ఆలస్యం లేదండి. అన్నీ పెట్టే ఉంచాను"

"సరే" అని వెనక్కి తిరిగి, ఎదురుగా ఉన్న అల్మరాలో ఏవో తీసుకోసాగింది వసుధ.

తలెత్తి చూసాడు కుర్రాడు.

అల్మరాలో పైన ఉన్నవి అందక, కాళ్ళు ఎత్తి తీసుకుంటూ, సాగిన ఆమె శరీరం కుర్రాడిని లోబరుచుకోసాగింది.

వసుధ నున్నటి వీపు మీదుగా కిందికి జారిన ఆమె పొడవాటి తడి కేశాలు, ఎర్రటి నడుము, తడి పూర్తిగా ఆరని పచ్చటి చీర, ఆమె పిరుదులకి అతుక్కుని ఉండి, వెనక ఎత్తులు గుండ్రంగా, నిండుగా కనిపిస్తూ, ఆ ఎత్తుల మధ్యలో చీలిక కూడా స్పష్టంగా తెలుస్తూ ఉండటంతో, కుర్రాడు ఉక్కిరిబిక్కిరి అవ్వసాగాడు.

కుర్రాడి బుద్ధిని, అతని ఇరవైఏళ్ళ ప్రాయం జయించింది. అప్పుడు కూడా అతని అంగం అప్పటికప్పుడు ఊపికి పోసుకుని, బయటకి రావడానికి విశ్వప్రయత్నం చేయసాగింది.

వసుధ కావల్సినవి తీసుకుని, లోపలికెళ్ళింది.

కుర్రాడికి అనుమానం కలిగి, తల దించి కిందికి చూసాడు. అతని అనుమానం నిజమే అన్నట్టుగా, ప్యాంట్ పైన ఒక చిన్న మరక ఏర్పడింది.

ఇలా జరిగితే ఎలా, తప్పు, ఛీ ఛీ, అని తనని తను తిట్టుకోసాగాడు కుర్రాడు.

ఇంతలోనే వసుధ మళ్ళీ వచ్చి అల్మరా తీసి ఏవో పెడుతూ, ఇంకేవో తీసుకోసాగింది.

కుర్రాడి బుద్దిని, అతని వయసు మళ్ళీ జయించి, అతని అంగాన్ని లేపసాగింది. క్షణం క్రితం తనని తను తిట్టుకున్న కుర్రాడు, ఆ విషయం మర్చిపోయి, తన ఎదురుగా కనిపిస్తున్న తడి చీరలో వసుధ తల వెంట్రుకల నించి, పాదాలకి ఉన్న పట్టీల దాకా రెప్ప వేయకుండా చూడసాగాడు కుర్రాడు. యధావిధిగా అతని అంగం చివర కొంచెం కొంచెం తడి అవ్వసాగింది.
Like Reply
#8

స్పందనకి ధన్యవాదాలు.
Like Reply
#9

(07-04-2022, 06:44 PM)Uday Wrote:  హహహ....బాగా చెప్పారు, అవన్నీ ఉన్నాయి తెలియచెప్పడానికి, కథలో సందర్బానుసారం వస్తే ఇంకా బావుంటుందని ఓ చచ్చు సలహా పడేశాను...తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం...పొతే మీ కథనం కొత్తగా ఆహ్లాదకరంగా ఉంది మరీ జుగుప్సుగా లేకుండా....

ఇంకా మీ సామెత మొదటిసారి వింటున్నా..."పడుకునే ముందు పొగాకు తాగటానికి, పొగాకు తోటలో పడుకోవటానికి గల తేడా" ధన్యవాదాలు 

కధ నేపధ్యాన్ని, పాత్రలని బట్టి ఉంటుంది ఆహ్లాదమైనా, జుగుప్స అయినా. ఏక్కడ రొమాన్సో అక్కడ రొమాన్స్, ఎక్కడ పోర్నో అక్కడ పోర్న్.

పడుకునే ముందు పొగాకు తాగడానికీ, పొగాకు తోటలో పడుకోవటానికీ తేడా ఉంది. ఇది సామెత కాదు, నా సొంత లైన్. Big Grin

అతి సర్వత్ర వర్జయేత్. ఏదీ ఎక్కువ కాకూడదు అని.
[+] 2 users Like earthman's post
Like Reply
#10

తరువాతి భాగం ఇస్తున్నాను, చదివి ఎలా ఉందో చెప్పండి.
[+] 2 users Like earthman's post
Like Reply
#11

అల్మరా నించి కావల్సినవి తీసుకున్న వసుధ ఒక్కసారిగా వెనక్కి తిరిగింది.

అదే క్షణంలో తల దించుకుని తన అంగాన్ని చూసుకుంటూ తల ఎత్తాడు కుర్రాడు.

వసుధ చూపు దించి కిందకి చూసింది. అక్కడ తడి ఎక్కువై మరక లాగా అవ్వడంతో నోరు తెరుస్తూ ఆశ్చర్యపోయింది.

ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.

కుర్రాడు కంగారులో తన చేతిని తన అంగానికి అడ్డుగా పెట్టుకున్నాడు.

వసుధ తేరుకుని వెంటనే లోపలి గదిలోకి వెళ్ళింది.

కుర్రాడికి ఏం చెయ్యాలో తోచలేదు. ఎవరికన్నా చెప్తే తన పరిస్థితి ఏమవుతుందో అనుకున్నాడు, శేఖరం కొట్టినా కొడతాడు అనుకున్నాడు.

వసుధకి కూడా ఊహించనిది జరగడంతో ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది. తనని చూస్తే లేచింది ఒక పద్ధతి, కానీ మరీ అలా కారిందేంటి అనుకుంది. వెంటనే పంపించెయ్యాలి అనుకుంది. కానీ ఏ కారణం చెప్పి పంపించెయ్యలో తెలియలేదు. వేరే కారణం చెప్పటానికి మనసు రావట్లేదు, అలా అని ఇదీ కారణం అని జరిగింది కూడా చెప్పలేనని అనుకుంది. ఆలోచిస్తూ ఉండిపోయింది.

ఒక పది నిముషాలు గడిచాయి.

ఇంతలో బయట తలుపు చప్పుడైంది. శేఖరం లోపలికి వచ్చాడు.

బయటే ఉన్న పరంధామయ్యతో మాట్లాడసాగాడు.

వీళ్ళ మాటలకి లోపలి నించి బయటకి వచ్చింది వసుధ.

"అయిపోయిందమ్మా వచ్చేస్తున్నా" అన్నాడు శేఖరం.

తలూపింది వసుధ.

లోపలికి వెళ్ళింది.

కుర్రాడు లేచాడు. తల దించుకున్నాడు.

ఏం మాట్లాడాలో ఇద్దరికీ తెలీలేదు.

పద్ధతి గల కుర్రాడైనా, వయసులో ఉన్నాడు, ఏదో అయింది, ఆపులేకపోయినట్టుగా ఉన్నాడు, క్షమించేద్దాం అనుకుంది.

"ఇలా వద్దు, వెళ్ళి స్నానం చేసిరా. వేరేవి కట్టుకో. ఇక ఏ ఆలోచనా లేకుండా శుభ్రంగా, శ్రద్ధగా, కార్యక్రమం చెయ్యి" గదిమినట్టుగా చెప్పింది.

తల దించుకునే మాట్లాడకుండా తల ఊపాడు కుర్రాడు.

"వెళ్ళు" చిన్నగా అరిచింది.

దొడ్లోకి పరుగెత్తాడు కుర్రాడు.

నవ్వొచింది వసుధకి.

లోపలికొచ్చాడు శేఖరం.

అన్నీ సర్దబడి, అంతా తయారుగా ఉండటంతో కార్యక్రమం మొదలుపెట్టచ్చు అనుకున్నాడు.

"మావాడెక్కడ" వసుధని అడిగాడు.

"స్నానానికి వెళ్ళాడు" బదులిచ్చింది వసుధ.

"బాగుంది, ఎప్పుడూ లేనిది, ఈ రోజెందుకో మరి" అంటుండగా లోపలికి వచ్చాడు కుర్రాడు.

"ఏరా ఏంటిది కొత్తగా, నీ అంతట నువ్వే ఇలా మళ్ళీ కాసిని నీళ్ళు పోసుకురావాలని అనుకున్నావు. నీకు పుట్టిన బుద్ధేనా ఇది, నాకు ఆశ్చర్యంగా ఉందిరా" అన్నాడు

బదులివ్వలేదు కుర్రాడు.

"అన్నీ చక్కగా సర్దావురా అబ్బాయి, ఎలా చేసుంటావో అనుకున్నాను, బాగుందిరా" అన్నాడు

"అమ్మా అన్నీ ఉన్నాయి, ఇక మొదలుపెడదామా" అన్నాడు.

ఇంతలో లోపలికి వచ్చాడు పరంధామయ్య.

"అయ్యా కూర్చోండి, మొదలుపెడతాను" అంటూ మొదలుపెట్టాడు శేఖరం.

తనకక్కడ పని లేదని తెలిసిన వసుధ, వంటింట్లోకి వెళ్ళింది.

కుర్రాడు కూడా కూర్చుని శేఖరానికి కావల్సినవి ఇవ్వడం మొదలుపెట్టాడు.

నెమ్మదిగా తలెత్తి చూసాడు, ఎదురుగా వంట చేస్తూ వసుధ.

వసుధకి విషయం తెలిసినా, తనని గెంటేయకుండా, ఎవరికీ చెప్పకుండా, క్షమించిందని అర్ధం అయినా, వసుధని చూడకుండా ఉండలేకపోయాడు.

ఎదురుగా పచ్చటి తడిచీరలో, ఎర్రటి శరీరంతో, నిండుగా కనిపిస్తున్న వసుధని చూడగానే మళ్ళీ అతనికి లేవడం మొదలయింది. ఈ సారి కట్టుకున్నది పంచె కావడంతో, డ్రాయర్ ఉన్నా కుడా సర్రున లేచింది.
Like Reply
#12

స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా.

తరువాతి భాగం రాయలేదు, రాసి ఇస్తాను.

కథ ముగింపు తట్టింది, ఒకటి, లేదా రెండు భాగాలలో పూర్తి అవుతుంది. వెంటనే ఇస్తాను.
[+] 7 users Like earthman's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)