25-01-2019, 03:48 PM
(This post was last modified: 25-01-2019, 03:49 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇక ప్రీపెయిడ్ మీటర్లు..! బ్యాలన్స్ ఉంటేనే వెలుగు..! లేకపోతే చీకటే..!!
తొలిదశలో 500 యూనిట్లు దాటిన వారికి కేటాయింపు..! వినూత్న ప్రయోగం అంటున్న అదికారులు..!!
సెల్‌ఫోన్ ప్రీపెయిడ్ నంబరు తీసుకుని ఎప్పటికప్పుడు రీఛార్జి చేయిస్తున్నారు కదా.. అలాగే మీ ఇంట్లో వాడుకునే కరెంటుకు ముందే డబ్బు కట్టి (ప్రీ పెయిడ్) మీటర్ రీఛార్జి చేయించుకుంటేనే కరెంటు సరఫరా అవుతుంది. లేదంటే సరఫరా నిలిచిపోయి అంధకారంలో ఉండాల్సిందే. ఈ పరిస్థితి దేశమంతటా 2022 చివరికల్లా తీసుకురావాలని కేంద్రం తాజాగా గడువు నిర్ణయించింది. ఈ అంశంపై దేశంలోని అన్ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఉన్నతాధికారులతో తాజాగా దిల్లీలో కేంద్ర విద్యుత్‌శాఖ సమావేశం ఏర్పాటుచేసి చేపట్టాల్సిన పనులపై చర్చించింది. తెలంగాణ దక్షిణ డిస్కం అధికారులు దీనికి హాజరై రాష్ట్రం తరఫున సూచనలిచ్చారు. ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేయాలని ప్రాథమికంగా రాష్ట్రాలు అంగీకరించాయి.
రాష్ట్రమంతటా అన్ని ఇళ్లు, పరిశ్రమలకూ తప్పదు ..! విడతల వారీగా అమలు..!!
ప్రతి కరెంటు కనెక్షన్‌కు ప్రస్తుతం సాధారణ మీటర్లు ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగి మీటరు రీడింగ్ తీసుకుని బిల్లు ఇస్తున్నారు. కానీ పలు రాష్ట్రాల్లో బిల్లుల వసూలు 100 శాతం జరగడం లేదు. ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటు వల్ల డిస్కం పరిస్థితి మెరుగవుతుందని అంచనా. ఒకేసారి దేశమంతా ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటు అసాధ్యమని తేలింది. ప్రస్తుతం సాధారణ మీటర్ల ధర సింగిల్ ఫేజ్ దైతే 750 త్రీఫేజ్‌ది 1500 దాకా అవుతోంది. వాటిని తొలగించి ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలంటే సింగిల్ ఫేజ్‌కు 3 వేలు, త్రీఫేజ్‌కు 6 వేలు చెల్లించాలి. మొత్తంగా కోటి మీటర్లు కొంటామంటే తక్కువ ధరకు తయారుచేయడానికి కంపెనీలు అంగీకరిస్తాయని డిస్కంలు అంచనా వేస్తున్నాయి.
- By Harikrishna
- Published:January 25 2019, 15:31 [IST]

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK