24-01-2019, 04:20 PM
స్మృతి సెంచరీ: కివీస్‌పై భారత మహిళల జట్టు గెలుపు!
భారత ఓపెనర్ స్మృతి మంధాన (105) శతకం సాధించడంతో న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బౌలర్లు, బ్యాట్స్‌ఉమన్ సమష్టిగా రాణించడంతో తొమ్మిది వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 33 ఓవర్లలోనే ఛేదించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు.
న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సుజీ బేట్స్(36), సోఫీ డివైన్(28)లు తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ తర్వాత వచ్చిన వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. సాటర్‌వైట్(31), అమీలా కెర్(28), రోవ్(25) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఏక్తాబిస్త్, పూనమ్ యాదవ్ చెరో మూడు వికెట్లు దక్కించుకుని న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు దక్కించుకుంది. దీంతో న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. భారత్ ముందు 193 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంచగలిగింది. ఛేదనలో భారత్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. స్మృతి, జమీమా రోడ్రిగ్స్ (81 నాటౌట్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసిన స్మృతి విజయానికి మూడు పరుగుల దూరంలో అవుటైంది. రోడ్రిగ్స్ విన్నింగ్ షాట్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించింది.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK